థియేటర్‌లో అన్ని జానర్ల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. అయితే ఓటీటీలో మాత్రం సస్పెన్స్, థ్రిల్లర్ కంటెంట్‌కే ఎక్కువగా ఓటేస్తున్నారు. ఓటీటీ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కూడా సరికొత్త సినిమాలు, సిరీస్‌లతో సినీప్రియులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
స్టార్ హీరో జయం రవి, నయనతార జంటగా నటించిన చిత్రం ఇరైవన్. అహ్మద్.. కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించగా సుధన్ సుందరం, జయరామ్.జి కలిసి నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ మూవీ సెప్టెంబర్ 28న విడుదలైంది. ఈ తమిళ చిత్రం తెలుగులో గాడ్ పేరిట విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ తేదీ ఖరారైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. గాడ్ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, చార్లీ, అశ్విన్ కుమార్, రాహుల్ బోస్, విజయలక్ష్మి, వినోద్ కిషన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
సినిమా కథేంటంటే..
సినిమా కథ విషయానికి వస్తే.. నగంలో వరుసగా అమ్మాయిలు హత్యకు గువుతుంటారు. అమ్మాయిలను కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా చంపేస్తున్న సైకో కిల్లర్‌ను ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ పట్టుకుంటాడు. కానీ కిల్లర్‌ను పట్టుకున్న తర్వాత కూడా హత్యలు జరుగుతూనే ఉంటాయి. మరి వాళ్లను ఎవరు చంపుతున్నారు? ఈ మర్డర్ మిస్టరీలను ఎలా ఛేదించారు? అనేది తెలియాలంటే గాడ్ సినిమాను ఓటీటీలో చూసేయాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment