God
-
గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!
అందరూ మహిళలే జరుపుకొనే వేడుక ఇది. అత్యధిక సంఖ్యలో మహిళలు ఒకేచోట చేరి జరుపుకొనే కార్యక్రమంగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన అరుదైన వేడుక ఇది. ఈ వేడుకలో పాల్గొనడానికి పురుషులకు అనుమతి ఉండదు. తరతరాలుగా సాగుతున్న ఈ వేడుక కేరళ రాజధాని తిరువనంతపురం చేరువలోని అట్టుకల్ గ్రామంలో వెలసిన భగవతి అమ్మవారి ఆలయంలో జరుగుతుంది. ఏటా పదకొండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో లక్షలాది మంది మహిళలు పాల్గొంటారు.తిరువనంతపురం జిల్లా అట్టుకల్ గ్రామంలోని భగవతి అమ్మవారి ఆలయం చాలా పురాతనమైనది. అట్టుకల్ గ్రామంలో వెలసినందున ఈ అమ్మవారు ‘అట్టుకల్ భగవతి’గా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు ఈ ఆలయంలో అట్టుకల్ భగవతి అమ్మవారి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల తొమ్మిదో రోజున లక్షలాది మంది మహిళలు ఇక్కడకు చేరుకుని, అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ‘అట్టుకల్ పొంగల్’ వేడుకగా పిలుస్తారు. తొమ్మిదో రోజున తిరువనంతపురం నగరంలోని అన్ని రహదారులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లే మహిళలతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి కేరళ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన మలయాళీ మహిళలు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు.ఇక్కడకు వచ్చే మహిళలు ఆలయ ప్రాంగణంలోను, ఆలయ పరిసరాల్లోని వీథుల్లోను ఇటుకలతో కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుని, వాటి మీద పొంగలి, చక్కెరపొంగలి వండుతారు. ఆలయ ప్రధాన అర్చకుడు నిర్ణయించిన ముహూర్తానికి అందరూ ఒకేసారి పొయ్యిలు వెలిగించి వంట మొదలుపెడతారు. ముహూర్త సమయం ఆసన్నం కాగానే, అర్చకుడు గంట మోగిస్తాడు. అయితే, మహిళలు పొంగలి వండుతున్న ప్రదేశంలోకి ఆలయ అర్చకులు కూడా అడుగు పెట్టరు. ఈ వేడుకలో భాగంగా మహిళలందరూ తిరువనంతపురంలోని మనకాడు ప్రాంతంలో ఉండే శ్రీధర్మ శాస్త ఆలయం వరకు భారీ ఊరేగింపు జరుపుతారు. మొదటి రోజున ‘కప్పుకెట్టు’ కార్యక్రమంతో ఈ వేడుక మొదలవుతుంది. ఇందులో భాగంగా ‘కణ్ణగి చరిత’ను గానం చేస్తారు. ‘కణ్ణగి చరిత’గానం వరుసగా తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున ‘కురుత్తి తర్పణం’ పేరుతో తర్పణాలు విడిచిపెట్టడంతో ఈ వేడుకలు ముగుస్తాయి. వేడుక కొనసాగినన్ని రోజులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి చేరుకునే వీథులన్నీ రంగురంగుల అలంకరణలతో కనువిందు చేస్తాయి. ఈ వేడుకల సందర్భంగా వీథుల్లో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంప్రదాయ నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అట్టుకల్ పొంగల్ వేడుకలలో 1997 సంవత్సరంలో 15 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొనడంతో తొలిసారి గిన్నిస్‌బుక్ రికార్డుల్లో నమోదైంది. ఆ తర్వాత 2009లో 25 లక్షలకు పైగా మహిళలు పాల్గొనడంతో మరోసారి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది. ఈ వేడుక ప్రశాంతంగా జరగడానికి వీలుగా కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తుంది.(చదవండి: అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!) -
దేవుడే దిగి వచ్చినా.. డీకేఎస్ వ్యాఖ్యలపై దుమారం
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. భగవంతుడే స్వయంగా వచ్చినా బెంగళూరు నగరం బాగుచేయలేడంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో ఇటు నగరవాసులు.. అటు రాజకీయ వర్గాలు ఆయనపై మండిపడుతున్నాయి. ‘బెంగళూరు నగరాన్ని రాత్రికి రాత్రే మార్చేయలేం. ఈ మహా నగరం ఏ రెండేళ్లకో, మూడేళ్లకో మారదు. ఒకవేళ దేవుడే తల్చుకున్నా(Even God) అది సాధ్యపడదు. నగరాన్ని బాగు చేయాలంటే.. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో అది జరగాల్సిందే తప్ప మరో మార్గం లేదు’’ అని శివకుమార్ ఓ వర్క్‌షాప్‌లో వ్యాఖ్యానించారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా బెంగళూరులో ట్రాఫిక్‌జామ్(Bengaluru Traffic Troubles) వాహనదారులకు నిత్యం నరకం చూపిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో అది మరీ పెరిగిపోవడంతో.. పలువురు మేధావులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్వయానా డిప్యూటీ సీఎం నెగెటివ్ కామెంట్లు చేయడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రాజెక్టులను ప్రకటించారే తప్ప.. వాటిని ఆచరణలోకి తీసుకురావడంలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రముఖ ఆర్థిక వేత్త, ఆరిన్ కాపిటల్ చైర్మన్ మోహన్‌దాస్ పై(Mohan Das Pai) డీకేఎస్ స్టేట్మెంట్పై ఫైర్ అయ్యారు. ‘‘శివకుమార్గారూ.. మీరు మంత్రి అయ్యి రెండేళ్లు కావొస్తోంది. ఒక బలమైన నేతగా మీకు ఆహ్వానం పలికాం. కానీ, మా బతుకులు మరింత హీనంగా తయారవుతున్నాయి’ అంటూ ఎక్స్ ఖాతాలో ఆయనొక సందేశం ఉంచారు. అలాగే.. బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించే ప్రాజెక్టులెన్నో నిలిచిపోయాయని అంటున్నారాయన. ఫుట్‌పాత్‌ల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజా రవాణా వ్యవస్థ కూడా సరిపడా లేదని తెలిపారు. యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని, నగరానికి సుమారు 5,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అవసరమని, మెట్రో రైలును విస్తరించాల్సిన అవసరం ఉందని మోహన్‌దాస్ అభిప్రాయపడ్డారు.Minister @DKShivakumar it has been 2 years since you became our Minister! We applauded and welcomed you as a strong Minister.But our lives have become much worse!Big projects announced!Will take very long and delayed as govt has not completed any project in city on time! Why… https://t.co/32Kqkzrviv— Mohandas Pai (@TVMohandasPai) February 20, 2025ఇక రాజకీయంగానూ డీకే శివకుమార్ వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ‘‘బ్రాండ్ బెంగళూరు’’ అంటూ నినాదం ఇచ్చిన వ్యక్తి.. ఇవాళ దేవుడు కూడా సరి చేయలేడంటూ వ్యాఖ్యానించడం దురదృష్టకరమని బీజేపీ అంటోంది. ప్రజలకు సేవ చేసే అవకాశం దేవుడు ఇసతే.. ఈ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని బీజేపీ నేత మోహన్ కృష్ణ విమర్శించారు. అయితే విమర్శల నేపథ్యంలో డీకే శివకుమార్ స్పందించారు. బెంగళూరు సమస్యలను పరిష్కరించే బాధ్యతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే నగరంలో కొత్త రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ సమస్యను తప్పించే ప్రణాళికతో కూడిన హ్యాండ్‌బుక్‌ను రిలీజ్ చేశామని అంటున్నారు. -
Bhagavad Gita: అసలైన ఆస్తికులు
కొండలు, కోనలు, అడవులు, పక్షులు, పశువులు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు-ఇవన్నీ మనల్ని ప్రేరేపిస్తాయి. ఏకాగ్రచిత్తంతో ప్రకృతిని పరిశీలిస్తూ పోగా, పోగా అది అద్భుతం అనిపిస్తుంది! ఎంతో విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ప్రకృతి పరిశీలకులుగా ఆరంభించి ఆ ప్రకృతి ప్రేమికులుగా, ఆరాధకులుగా మారిపోతాం. దత్తా త్రేయుని లాగా, ఆంగ్లకవి విలియం వర్డ్స్‌వర్త్ లాగా ప్రకృతిని మన గురువుగా, దైవంగా పరిగణిస్తాం. అయితే అక్కడే ఆగిపోతే కేవలం హేతువాదులుగా, భౌతిక వాదులుగా మిగిలిపోతాం. లేదా నాస్తికులుగా మిగిలిపోయే అపాయం కూడాఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ‘‘భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం అని నా ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉది. ఈ ప్రకృతిని ‘అపరా’ లేక ‘జడ ప్రకృతి’ అని అంటారు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరొకప్రకృతి ఉంది. అదే నా జీవ రూప పరాప్రకృతి’ లేక ‘చేతన ప్రకృతి’ అని తెలుసుకో’’ (భగవద్గీత 7–అ 4, 5 శ్లోకాలు).అంటే... జడప్రకృతి, చేతనా ప్రకృతి అనేవి దైవం అనే నాణేనికి రెండు వైపులన్నమాట (బొమ్మ, బొరుసు)! జడప్రకృతిని పరిశీలించి,ప్రేమించి, ఆరాధిస్తున్నవారు అంతటితో తృప్తి పడక చేతనా ప్రకృతిని కూడా పరిశీలించి, పరిశోధించటానికి పరిశ్రమిస్తే– అంటే రెండో వైపును కూడా చూడటానికి ప్రయత్నించి చూస్తే వారే దార్శనికులు, ద్రష్టలు, ఋషులు అవుతారు; పరిపూర్ణ ఆస్తికులవుతారు. అయితే తమాషా ఏంటంటే కొంతమంది కనపడే ప్రకృతిని మాత్రమే నమ్మి నాస్తికులవుతారు. మరి కొందరు కనపడని దైవాన్ని గుడ్డిగా నమ్మి ప్రత్యక్షంగా కనబడే దైవ ప్రతిరూపాలే అయిన మనుషులను దూషిస్తారు, ద్వేషిస్తారు. దైవానికి ఉన్న రెండు వైపులను చూసినవారు పరా ప్రకృతిని, అపరా ప్రకృతిని ప్రేమిస్తారు, పూజిస్తారు. దేన్నీ నిరాకరించరు. వారే నిజమైన ఆధ్యాత్మికత్వం కలవారు, స్వచ్ఛమైన ఆస్తికులు.– రాచమడుగు శ్రీనివాసులు అసలైన ఆస్తికులు -
ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!
సాక్షి, పెద్దపల్లి: గుడి ఉంటే దేవుడు ఉండాలి. దర్శనం చేసుకునేందుకు భక్తులు రావాలి. ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాలి. కానీ, ఈ గుడిలో దేవుడిని దర్శించుకునేందుకు భక్తులు రారు. వెడ్డింగ్ ఫొటోషూట్, షార్ట్ ఫిల్మ్ షూటింగ్‌లు, పిక్నిక్ల కోసం వచ్చే సందర్శకులు, పర్యాటకులతోనే గుడి కళకళలాడుతోంది. ఆ గుడి ఏంటి? విశేషాలు, చరిత్ర తెలుసుకోవాలంటే పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామ పరిధిలోని ధర్మాబాద్ ప్రాంతానికి వెళ్లాల్సిందే. ఆండాలమ్మ గుడి కోసం.. 13వ శతాబ్దంలో జైనుల కాలంలో పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామ పరిధిలోని ధర్మాబాద్.. రాఘవాపూర్ సంస్థానా«దీశుల ఆదీనంలో ఉండేది. ఆయా సంస్థానాధీశులైన ఎరబాటి లక్ష్మీనరసింహారావు, ఆయన కుమారుడు లక్ష్మీకాంతరావు గుడికి అంకుర్పారణ చేసినట్లు చరిత్రకారులు, గ్రామస్తులు చెబుతున్నారు. తొలుత రంగనాయకస్వామి ఆలయాన్ని నిర్మించారు. దీనికి అనుబంధంగా 500 అడుగుల దూరంలో ఆండాలమ్మ దేవాలయం నిర్మించారు. ఈ రెండింటి మధ్య రోప్ వే నిర్మించి, దీనిద్వారా అమ్మవారిని రంగనాయకస్వామి ఆలయానికి తీసుకొచ్చి.. కల్యాణవేడుక జరిపించాలన్న ఆలోచనతో గుడి నిర్మించారు. దాని నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి హఠాత్తుగా మృతి చెందటంతో.. ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు. అనంతరం వారి వారసులు సైతం అమ్మవారి విగ్రహం ఏర్పాటపై అంతగా ఆసక్తి చూపకపోవడంతో.. విగ్రహం లేకుండానే గుడి మిగిలిపోయింది. ఎత్తయిన కొండల మధ్య.. అద్భుత శిల్ప కళాసౌందర్యంతో.. దట్టమైన అడవి, చుట్టూ ఎత్తయిన పచ్చని కొండల నడుమ గుడి దర్శనమిస్తోంది. ప్రధాన గోపురంలో అమ్మవారు, గర్భగుడికి ఇరువైపులా దేవతామూర్తుల కోసం ప్రత్యేక గదులు, అందమైన మండపం నిర్మించారు. గోపురంపై జీవకళ ఉట్టిపడేలా చెక్కిన శిల్పాలు ఆకట్టుకుంటాయి. మండపానికి కొద్దిదూరంలో ఆలయానికి మరింత శోభను తీసుకొచ్చేలా విశాలమైన స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. అయితే, దేవత విగ్రహం లేకపోవడం, రంగనాయకుల స్వామి గుడి పరిధిలోని 439 ఎకరాల దేవాదాయ భూములు కాలక్రమంలో అన్యాక్రాంతమవడంతో.. ఈ గుడిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఇటీవల పల్లె ప్రకృతివనం కార్యక్రమంలో ఆండాలమ్మ గుడిచుట్టూ ఉన్న మూడెకరాల్లో మొక్కలు నాటి పార్క్ ఏర్పాటు చేశారు. దీంతో పురాతన ఆలయాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్రదేశం వెడ్డింగ్, షార్ట్ ఫిల్మ్ షూటింగ్‌ల చిరునామాగా మారింది.అభివృద్ధి చేయాలిమా తాతల కాలంలో రాఘవపూర్ సంస్థానాదీశులైన ఎరబాటి లక్ష్మీనరసింహారావు ఆండాలమ్మ గుడి నిర్మించాడు. విగ్రహ ప్రతిష్ఠ సమయంలో.. ఎవరో చనిపోవడంతో అలాగే ఉండిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం గుడిని అభివృద్ధి చేస్తే బావుంటుంది.– అందె పోచమల్లు, గ్రామస్తుడుఅరకొర సౌకర్యాలు ప్రాచీన సంస్కృతి, శిల్పకళ ఉట్టిపడేలా గుడి నిర్మించారు. అనివార్య కారణాలతో ఆండాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు. ప్రస్తుతం అరకొర సౌకర్యాలు ఉన్నాయి. అయినా, వెడ్డింగ్, షార్ట్ ఫిల్మ్‌ల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు, దర్శకులు వస్తున్నారు. ఈ గుడితోపాటు పక్కనే ఉన్న రంగనాయకులస్వామి ఆల యం, సబ్బితం జలపాతం, రామగిరి ఖిలాతో టూరిజం సర్క్యూట్ నిర్మించి, అభివృద్ధి చేస్తే బాగుంటుంది. – నల్లగొండ కుమార్, స్థానికుడు -
స్వార్థం- దైవ చింతన
మానవుడు ప్రధానంగా స్వప్రయోజనా దృష్టి గల జీవి. అది అతన్ని జీవితాంతం వెన్నంటే ఉంటుంది. దీనికి తోడు ఇతర ప్రాణులకు లేని బుద్ధి బలం కూడా మనిషికి ఉంది. మనిషి లోని సహజ లక్షణమైన ఈ స్వార్థ గుణాన్ని గురించి ఉపనిషత్తులు కూడా వివరించాయి. యాజ్ఞ వల్క్య మహర్షి తన భార్య మైత్రేయితో... ‘భార్య భర్తను ప్రేమిస్తున్న దంటే అది తన ఆనందం కోసమే. భర్త భార్యను ప్రేమిస్తున్నాడన్నా అతని ఆనందం కోసమే. ఇంకా పుత్రుల మీద, దేశం మీద, మానవులకున్న ప్రేమ వారి ఆనందం కోసం కాదు తన ఆనందం కోసమే’ అని చెపుతాడు. తన స్వార్థం కోసం ఉపయోగ పడేంతవరకు మానవుడు సమాజంతో సంబంధం పెట్టుకుంటాడు. మనిషిలో సహజంగా ఉండే ఈ స్వార్థాన్ని నియంత్రణ లేకుండా వదిలిపెడితే భూమిపై సుఖ శాంతులు పూర్తిగా కరువైపోతాయి. తన స్వార్థ ప్రయోజనాలకు బలహీనులను పట్టి పీడిస్తాడు. పెద్ద చేప చిన్న చేపను మింగినట్లు ప్రవర్తిస్తాడు. కొన్నాళ్ళకు తనూ తన కంటె బలవంతుని చేతిలో బలవుతాడు. లోక నాశనానికి దారి తీసే ఈ స్వార్థ గుణాన్ని అణిచి వేసి, మనిషి మనసులో గొప్ప మార్పు దైవ చింతన తీసుకు రాగలదు. మానవులకు శాంతి మయ జీవితాన్ని ఇవ్వటానికి భగవంతుడు వివిధ రూపాలలో అవత రిస్తుంటాడు.ఇహ లోకంలో ప్రశాంత జీవితం గడపటానికి, పరంలో శాశ్వతా నందాన్ని పొందటానికి తగిన ఉపదేశాన్ని మానవాళికి అందజేసిన గ్రంథ రాజం భగవద్గీత. రోజుకొక శ్లోకం చదివినా, నేర్చుకున్నా ఆలోచనలు భగవంతునిపై నిలుస్తాయంటారు పెద్దలు. ‘భక్తుడు ఏ దేవతా రూపాన్ని శ్రద్ధగా పూజిస్తాడో అతనికి ఆ రూపంపై శ్రద్ధ నిలిచేటట్లు చేస్తాను’ అంటాడు భగవంతుడు. అలా పూజించినందుకు తగిన ఫలాన్ని అందజేస్తాడు. భగవంతుని చింతనలో మనసు పునీతమై, మనిషి నిస్వార్థ జీవిగా మారి, విశాల దృక్పథాన్ని అలవరచుకుంటాడు. – డా. చెంగల్వ రామలక్ష్మి -
అహం బ్రహ్మాస్మి
దైవం ఒక నమ్మకం కాదు. సత్యమే, దైవం. నమ్మకాలన్నీ మనస్సుకు సంబంధించినవి. మనస్సు సత్యం కానే కాదు. నమ్మకాలేవీ నిజాలు కాదు. నమ్మకాలకు, విషయజ్ఞానానికి అతీతమైనదే సత్యం. దైవాన్ని అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలవు. సత్యాన్ని నీలోపల అన్వేషించాలి. భౌతికమైన ఆచారాలు, క్రతువులు ఏవీ కూడా నీకు దైవాన్ని తెలియజేయలేవు. అహం అనే అడ్డును తొలగించుకోనంత వరకు దైవాన్ని తెలుసుకోలేవు. నిన్ను దైవం నుండి వేరు చేసేది అహమే. అహం అనే భ్రమ వీడితే మిగిలేది దైవమే... దివ్యచైతన్యమే... అదే అసలైన నీవు... అదే నీ సహజస్థితి.. అదే దైవం. ప్రతిక్షణం చైతన్యంతో ఉండాలి. ఏపని చేస్తున్నా దానితో కలిసిపోకుండా ఒక సాక్షీ చైతన్యంగా ఉండాలి. చేసేవాడివి నీవు కాదు. అనుభవించేవాడివి కూడా నీవు కాదు. వీటిని చూస్తున్న ద్రష్టవే నీవు. అదే ఆత్మ, అదే దైవం, ఆ అద్వైతస్థితే దైవం. మనస్సు ‘నేను’ కాదు. మనస్సు వెనుక దాన్ని సాక్షిగా చూస్తున్న చైతన్యమే ‘నేను’. ఈ ‘నేను’ కి పుట్టుక లేదు చావు కూడా లేదు ద్వంద్వాలకు అతీతం. దాన్ని ఏదీ కలుషితం చేయలేదు. ఆ ఆత్మస్థితే నీ సహజస్థితి. విషయాలకు అంటని ఆ సాక్షివి కావాలి. అప్పుడే భ్రమలతో పుట్టిన ‘నేను’ అంతమై అసలైన ‘నేను’ (ఆత్మ) ప్రజ్వలిస్తుంది. ఆలోచనలన్నీ అంతమై ఆత్మ ప్రకాశిస్తుంది. ఏమి జరుగుతున్నా సరే నీవు ఈ అత్మస్థితిలోనే ఉండాలి. నడుస్తున్నా, మాట్లాడుతున్నా, తింటున్నా, వింటున్నా, నిద్ర΄ోతున్నా... నీవు సాక్షిగా ఉండిపోవాలి. మనం ఇప్పుడు అనుకుంటున్నది మెలకువ కానే కాదు. కళ్ళు తెరిచినా నిద్రలోనే ఉంటున్నాం. మన నిజతత్వం పట్ల ఎరుకలేకుండా శరీరమే నేను, మనస్సే నేను అనే భ్రమలో ఉంటూ ఉన్నాం. నేను సాక్షీ చైతన్యాన్ని అనే సత్యాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాం. అది తెలిసిన క్షణం ఆలోచనలు అగిపోతాయి. నీ నిజతత్వాన్ని ప్రతిబింబిస్తావు, నీవే ఆత్మగా ఉండి΄ోతావు. ఆ స్థితిలో సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం జరుగుతుంది. నమ్మవలసిన అవసరమే లేదు. నీవే సత్యం, నీవే దైవం. సత్యం అంటే ఆలోచనలు, నమ్మకాలు, సూత్రాలు, వర్ణనలు, విషయజ్ఞానం మొదలైనవేవీ కావు. సత్యం నీలోనే ఉంది. నీ నిజతత్వమే సత్యం. దైవం గురించిన వర్ణనలు, సిద్ధాంతాలు, పుస్తక జ్ఞానం మొదలైనవేవీ దైవాన్ని అనుభవంలోకి వచ్చేలా చేయలేవు. పైగా ఇంకా అడ్డుపడతాయి. అహాన్ని పెంచుతాయి. మనస్సును బలపరుస్తాయి. ఈ మనస్సు ఖాళీ ఐనపుడే సత్యం అనుభవమౌతుంది. ఈ సమాజమంతా మనస్సుతో నిర్మితమైదే. నీవు చూడాలనుకున్నదే కనబడుతుంది. మనస్సు భ్రమలతోనే నిర్మితం. దైవాన్ని కూడా వివిధ రూ΄ాల్లో ఊహించుకుంటుంది. అసలు మనస్సు, పదార్థం అనేవి కూడా లేవు. స్వచ్ఛమైన చైతన్యమే నీవు. అదే సత్యం... అదే దైవం.– స్వామి మైత్రేయ -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
కళ్లారా చూస్తూ సమన్యాయం
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలసపాలన నాటి కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడిన ప్రస్తుత తరుణంలో న్యాయదేవతకు సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త రూపునిచ్చింది. ఖడ్గధారి అయిన న్యాయదేవత ఎడమ చేతిలో ఇకపై భారత రాజ్యాంగ ప్రతికి స్థానం కల్పించారు. చట్టానికి కళ్లు లేవు అనే పాత సిద్ధాంతాన్ని పక్కనబెట్టి న్యాయదేవతకు ఉన్న గంతలనూ తీసేశారు. కళ్లారా చూస్తూ సమన్యాయం అందించే న్యాయదేవతను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గ్రంథాలయంలో కొలువుతీర్చారు. సీజేఏ డీవై చంద్రచూడ్ ఆదేశానుసారం న్యాయదేవత శిల్పంలో మార్పులు తీసుకొచ్చారు. చట్టం కళ్లులేని కబోదికాదని, బ్రిటిష్ వలస వాసనలను వదిలించుకుని భారత న్యాయవ్యవస్థ ఆధునికతను సంతరించుకోవాలని.. రాజులకాలంనాటి ఖడ్గంతో తీర్పు చెప్పడానికి బదులు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ తీర్పు చెప్పినట్లు విగ్రహం ఉండాలని సీజేఐ చేసిన సూచనల మేరకు ఈ మార్పులు జరిగాయి. విదేశీవనిత వేషధారణలోకాకుండా గాజులు, నగలు, నిండైన చీరకట్టుతో అచ్చమైన భారతీయ వనితలా స్వచ్ఛతను స్ఫురణకు తెస్తూ శ్వేతవర్ణ న్యాయదేవతకు తుదిరూపునిచ్చారు. -
నిస్సహాయతలోనూ.. దేవుని వైపే
పూర్వం ఊజు దేశంలో యోబు అనే యథార్థవంతుడున్నాడు. ఆయనకు భార్య, కుమారులు, కుమార్తెలు ఉన్నారు. పాడిపంటలు, సిరిసంపద గలవాడు. ఒకరోజు దేవదూతలు దేవుని సన్నిధికి వచ్చారు. ఆ సమయంలో అపవాది/సైతాను కూడా ప్రత్యక్షపరచుకున్నాడు. దేవదూతలు మొదట వెళ్ళి΄ోగా సైతానుతో భగవంతుడు– నీవు ఎక్కడినుండి వచ్చావు? భూలోకంలో దోషరహితుడు, ధర్మాత్ముడైన నా సేవకుడైన యోబు అనే భక్తుణ్ణి చూశావా? అని అడగ్గా, ‘నీ సేవకుడైన యోబును భూసంచారంలో చూశాను. అతడు నిస్వార్థంగా మిమ్మల్ని సేవిస్తున్నాడా? మీరనుగ్రహించిన సకల సంపద, సంతానం, ఆస్తిపాస్తులపై కంచె వేశారు కాబట్టే, మీయందు భయభక్తులు కలిగి వున్నాడు’ అన్నాడు సైతాను. అందుకు దేవుడు నీవు మాత్రం అతనిపై చేయివేయొద్దు. అతని సంపదకు కారణమైన భూమి, సంతోషభరితులైన సంతానం నీ స్వాధీనంలో ఉంచాను కనుక అతని సహనాన్ని పరీక్షించు కోవచ్చునని సెలవిచ్చాడు దేవుడు.అప్పుడు సైతాను, యోబు ఆస్తిపాస్తులను చూసే నాగలిని, ఎద్దులను, పొలము దున్నువాటినన్నిటినీ షబాయీయులు తోలుకొని΄ోయారని, వారు నీ సేవకులను కత్తితో పొడిచి చంపారని దూత వచ్చి చెప్పాడు. అతడి మాటలు పూర్తి కాకముందే వేరొకడు వచ్చి– ’అయ్యా! కుమార్‌లు, కుమార్తెలు, పెనుగాలికి ఇళ్లు కూలిపోయి చనిపోయారని చెప్పాడు. అప్పుడు యోబు పైకి లేచి నేలపై బోర్లాపడి దేవునికి దండం పెట్టి నేను దిగంబరిగానే నా తల్లిగర్భం నుండి వచ్చాను. ఆ విధంగానే వెళ్ళిపోతానన్నాడు. ఇంత సంభవించినా యోబు దేవుని దూషించలేదు... నేరం మోపలేదు.మరలా దేవదూతలు, సైతాను దేవుణ్ణి దర్శించడానికి వచ్చారు. మొదట దేవదూతలు వెళ్ళి΄ోయాక సైతానుతో ‘‘నీవు నాతో అనవసరంగా యోబును నాశనం చేయించినా అతనిప్పటికీ నైతికత విడవలేదని అనగా, సైతాను దేహం కా΄ాడు చర్మం, ్ర΄ాణం కాపాడు ఆత్మ వున్నదన్నాడు. అందుకు ప్రభువు అతనిప్రాణం జోలికి వెళ్ళవద్దన్నాడు.అంతట సైతాను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. యోబుకు నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు వ్రణములతో నింపగా యోబు కురుపులను చిల్లపెంకుతో గోకుతున్నాడు. అంతట అతని భార్య – ‘‘నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్ము’’ అనెను. అందుకు యోబు – ‘‘మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?’’ అంటూ... యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. తర్వాత మరొక రోజు తన ముగ్గురు మిత్రులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి దూషించారు. యోబు సమయోచితమైన ప్రత్యుత్తరమిచ్చాడు. కానీ దేవుణ్ణి పల్లెత్తు మాట దూషించలేదు.ఒకానొకరోజు దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమై భక్త యోబుకు నష్టపోయిన దానికంటే అధికంగా సిరిసంపదలు, సంతానం, సంతోషం అనుగ్రహించాడు.దేవుడు సర్వశక్తిమంతుడు, న్యాయవంతుడు, దేవుని దృష్టిలో ఏ మనుష్యుడు నీతిమంతుడు కాడు. శ్రమ అనేది పాప ఫలితమేకాక ప్రాయశ్చిత్తం కూడాను. కష్టాలలో, నిస్సహాయతలో దేవుని వైపు తిరగడం మానవ విజ్ఞతకు సంకేతం.– కోట బిపిన్ చంద్రపాల్ -
దేవుడే నన్ను రక్షించాడు: డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: తనను హత్య చేసేందుకు జరిగే ప్రయత్నాలను దేవుడు అడ్డుకొని రక్షించాడని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లిక్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తనపై జరిగిన దాడులను విఫలం చేసిమరీ దేవుడు కాపాడాడని పేర్కొన్నారు. ట్రంప్ న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.‘నాపై జరిగిన హత్యా ప్రయత్నాలను దేవుడే విఫలం చేసి నన్ను బతికించాడు. అందుకే మళ్లీ మన దేశంలోకి మతాన్ని తిరిగి తీసుకురాబోతున్నాం. సుమారు 40 ఏళ్లలో న్యూయార్క్ స్టేట్‌ను గెలుచుకున్న మొదటి రిపబ్లికన్ అభ్యర్థి తానే అవుతాను. ఈ దాడులు నా సంకల్పాన్ని మరింత దృఢపరిచాయి. హత్యచేసే ప్రయత్నాలు నా సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేవు. నేను ఇక్కడకు రావడానికి కారణం.. ఈసారి ఎన్నికల్లో మనం న్యూయార్క్‌ను గెలవబోతున్నాం. చాలా ఏళ్ల తర్వాత రిపబ్లికన్లు నిజాయితీగా చెప్పడం ఇదే తొలిసారి. మనం గెలిచి చూపించబోతున్నాం. న్యూయార్క్ ప్రజలకు నేను ఒక్కటే చెబుతున్నా.. ఇక్కడ రికార్డు స్థాయిలో నేరాలు జరుగుతున్నాయి. తీవ్రవాదులు, నేరస్థులు పెరుగుతున్నారు. ద్రవ్యోల్బణం ప్రజలన ఇబ్బందులకు గురిచేస్తుంది.వాటి నుంచి బారినుంచి బయటపడాలంటే డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేయండి’ అని అన్నారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ దేవుడు, మతంపై వంటి అంశాల మీద చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇక.. ఇటీవల ట్రంప్ ఫ్లోరిడా గోల్ఫ్ కోర్స్‌లోని గోల్ఫ్ ఆడుతుండగా.. ఓ దుండగుడు కాల్పులు జరపడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సర్వీసెస్ అప్రమత్తమైన ఆయన్ను రక్షించిన విషయం తెలిసిందే.JUST IN - Trump: "God has now spared my life…. We’re going to bring back religion into our country"pic.twitter.com/yJcTAJx1ts— Insider Paper (@TheInsiderPaper) September 18, 2024 -
దేవుణ్ణి చూసిన వాడు
‘వానలో కలిసిన చీకటి ఆకాశం నుంచి నల్లటి విషంలా కారుతోంది’ అని మొదలవుతుంది తిలక్ ‘దేవుణ్ణి చూసిన వాడు’ కథ. ఆ రాత్రి వానలో ఉలిక్కిపడి లేచిన గవరయ్యకు పెరటి వసారాలో ఏదో మూలుగు. ఏమిటది? లాంతరు తీసుకుని బయటకి వచ్చాడు. హోరుగాలి... భీకర వర్షం... మూలుగుతూ పడి ఉన్న ప్రాణి. లాంతరు ఎత్తి చూసి దిమ్మెరపోయాడు. భార్య. తనను వదిలిపెట్టి వెళ్లిన భార్య. ‘గవరయ్య భార్య లేచిపోయిందట’ అని ఊరంతా గేలి చేయడానికి కారణమైన స్త్రీ. మోసపోయి, నిండు గర్భంతో, నొప్పులు పడుతూ, మొహం చెల్లక వసారాలో పడి ఉంది. దూరంగా మెరుపు మెరిసింది. చెవులు చిల్లులుపడేలా పిడుగు. కాన్పు జరిగిపోయింది. కేర్‌మని– చేతుల్లోకి తీసుకోగానే సముదాయింపు పొందిన ఆ పసికూన గవరయ్యతో బంధమేసింది. క్షణం ఆలోచించలేదు అతడు. ఆమెను, ఆమె కన్న తనది కాని బిడ్డను లోపలికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఊరిపెద్దలు ‘లేచిపోయిందాన్ని ఏలుకుంటావా’ అని వస్తే గవరయ్య ఏం చేశాడు? కత్తి పట్టుకు వచ్చి ‘అడ్డు పడినవాళ్లను అడ్డంగా నరుకుతాను’ అన్నాడు. అతడు మనిషి. దేవుడు. మానవత్వంలో దేవుడిని చూసినవాడు.మధురాంతకం రాజారాం ‘కొండారెడ్డి కూతురు’ అనే కథ రాశారు. ఫ్యాక్షనిస్టు కొండారెడ్డి కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. పారిపోయి బతుకుతోంది. చాన్నాళ్ల తర్వాత ఊరి మనుషులు చూడటానికి వచ్చారు. తన మనుషులు. తన తండ్రి దగ్గర పని చేసే మనుషులు. కొండారెడ్డి కూతురు ఎంతో సంతోషపడింది. మర్యాదలు చేసింది. వారి చేసంచుల్లో చాటుగా ఉన్న ఆయుధాలు చూసి అంతలోనే నిశ్చేష్టురాలైంది. తనను, భర్తను చంపుతారన్నమాట. తండ్రి పంపించాడన్న మాట. కాని ఇంటికి వచ్చిన అతిథులను అవమానించవచ్చా? వారి కోసం ఏమిటేమిటో వండింది. కొసరి కొసరి వడ్డించింది. ఊరి ముచ్చట్లు అడిగి చెప్పించుకుంది. ఆ రాత్రి తనకు ఆఖరు రాత్రి. హాలులో కుర్చీ వేసుకుని భర్త గదికి కాపలా కూర్చుంది. వాళ్లు వస్తారు. తనని చంపుతారు. కొండారెడ్డికి పుట్టినందుకు తాను చస్తుంది. కాని భర్తను చంపడానికి వీల్లేదంటుంది. వాళ్లు వచ్చారు. నీడల్లా నిలబడ్డారు. చంపుతారనుకుంటే కాళ్ల మీద పడ్డారు. ‘అమ్మా మేమెందుకొచ్చామో తెలిసీ అన్నం పెట్టావు. చెడ్డ పనులు చేసే రోజు మీ అమ్మ ముఖం చూడకుండా తప్పుకునేవాళ్లం. చూస్తే చేయలేమని. ఇవాళ నీ ముఖం చూస్తూ నిన్నెలా చంపుతా మమ్మా’... ఏడుస్తూ కాళ్లు కడుగుతున్నారు. ఆమె మనిషే. దేవత కాకపోవచ్చు. కాని మానవీయత ఉన్న మనిషి వదనంలో దైవత్వం ఉంటుంది.‘మనందరం దేవుళ్లమే’ అంటాడు ‘సత్యమే శివం’లో కమలహాసన్. ‘సృష్టీ విలయం రెండూ మన చేతుల్లోనే’ అంటాడు ‘సెపియెన్స్’ పుస్తక రచయిత హరారి. ‘నేటి మనిషి రెండు విషయాల వల్ల మనిషి గుణాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. ఒకటి ప్రకృతి విధ్వంసం– రెండు సాంకేతికతను పెంచి తాను మరుగుజ్జుగా మారడం’ అంటాడు హరారి. ప్రకృతికి ఎడంగా జరిగే కొద్ది, పరిసరాల్లో సిమెంటు పెరిగే కొద్ది, నాలుగు గోడల నుంచి నాలుగు గోడలకు అతని దినచర్య మారేకొద్ది సహజమైన మానవ స్పందనలు మొద్దుబారక తప్పదు. పెట్ డాగ్స్ సమక్షంలో అతడు పొందగలుగుతున్నది కొద్దిగా ఓదార్పే. పల్లెలో ప్రకృతిలో ఉన్నప్పుడు గొడ్డూ గోదా, మేకా ఉడుతా, కాకీ పిచుకా అన్నీ అతని స్పందనలను సజీవంగా ఉంచేవి. ‘ఎలా ఉన్నావు?’ నుంచి ‘ఎంత సంపాదిస్తున్నావు?’ను దాటి ‘ఏం కొన్నావు?’కు వచ్చేసరికి అతనిలో మొదలైంది పతనం.‘లాభం’ అనే మాట కనిపించని దారాలతో ఆడించే మాయావి. మనిషిని ఎంత ఓడిస్తే లాభం అంత గెలుస్తుంది. అంతేకాదు ‘మనిషి మీద నమ్మకం పోయింది’ అనే మాటను పుట్టించడం లాభాపేక్ష గల పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రాథమిక అవసరం. మనిషి మీద నమ్మకం పోయేలా... వాణ్ణి అది వస్తుగత, స్వార్థపరమైన, సంపద లాలసలో కూరుకుపోయేలా చేస్తుంది. లాభపడాలంటే, సుఖపడాలంటే చేయవలసింది మానవత్వాన్ని త్యాగం చేయడమే. అది పోగానే వాడు కుటుంబంతో, స్నేహితులతో, సమాజంతో, ప్రకృతితో, మానవాళితో ఎంత దారుణంగా అయినా వ్యవహరించవచ్చు. ‘మనిషి మీద నమ్మకం పోయేలా’ చేస్తే పెట్టుబడిదారీ వ్యవస్థకు మరో లాభం ఏమిటంటే... ఏ మనిషీ మరో మనిషితో కలవడు. సమూహంగా మారడు. తిరుగుబాటు చేయడు. నలుగురు బాగుపడి కోట్ల మంది మలమలమాడే వ్యవస్థకు ఢోకా రానివ్వడు. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థ ‘యుద్ధం’ అనే ముద్దుబిడ్డను పదేపదే కంటూ ఉంటుంది. యుద్ధం మానవత్వానికి అతి పెద్ద విరుగుడు. అయితే మనిషి ఇలాగే ఉంటాడా? ఏ రచయితో అన్నట్టు ‘రగిలిస్తే రాజుకునే మహాఅగ్ని మానవత్వం’. కోల్‌కతా నిరసనల్లో ఇవాళ అదే చూస్తున్నాం. యుగాలుగా... చితి పెట్టిన ప్రతిసారీ బూడిద నుంచి మానవత్వం తిరిగి జనిస్తూనే ఉంది. కాకుంటే అందుకు కావల్సిన రెక్కలు సాహిత్యమే ఇస్తుందని గ్రహించాలి. తల్లిదండ్రులూ..! మీ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు తప్పకుండా చేయండి. కాని నాలుగు మంచి పుస్తకాలు చదివించి మొదట మనిషిని చేయండి. ఏ విటమిన్ లేమికి ఏం తినాలి సరే... మానవత్వ లేమి ఉందేమో కనిపెట్టి విరుగుడుగా ఒక పుస్తకం చేతిలో పెట్టండి. ఎక్కడ పుస్తకాలు ఉంటాయో అక్కడ మానవత్వపు ఆవరణం ఏర్పడుతుంది. అదే దేవుడు తిరుగాడే తావు. ప్రపంచ మానవత్వ దినోత్సవ శుభాకాంక్షలు. -
భిన్నత్వంలో.. ఏకత్వం!
ఓ మానవుడా! భగవంతుని బ్రహ్మాండ రచనను మెచ్చుకొని దానికి శిరసు వంచి వినమ్రునిగా ఉండు. కొంచెం ఆలోచించు. ఎక్కడ నీడ ఉంటుందో అక్కడ ఒక చెట్టు; ఎక్కడ చెట్టు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. అదే మాదిరిగా ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ దుఃఖం, అది ఉన్న చోట సంతోషం ఉంటుంది. భిన్నత్వం, ఏకత్వాల కలబోతే ప్రకృతిమాత.ఎక్కడ భగవంతుడు ఉంటాడో, అక్కడ భక్తుడూ; ఎక్కడ భక్తుడు ఉంటాడో, అక్కడనే భగవంతుడూ ఉంటాడు. ఈ ఇరువురి మధ్య భిన్నత్వం లేదు. అదే మాదిరిగా ఎచ్చట శిష్యుడు ఉంటాడో, అచ్చటనే అతని గురువు ఉంటాడు; గురువు ఉన్న చోటే అతని శిష్యుడూ ఉండవలసినదే. ఈ ద్వంద్వాలను చూచి మోసపోకూడదు. ఈ బ్రహ్మాండ మంతయూ బ్రహ్మ పదార్థమే వ్యాపించియున్నది. ఈ సత్యాన్ని గ్రహించాలి.దేనివల్ల భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వములో భిన్నత్వం కలిగెనో అటువంటి మూలాన్ని స్తుతిస్తూ సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. మౌనమే ధ్యానం. సాధకుడికి మౌనావలంబనం ఎంతైనా ముఖ్యం. మౌనం మానవుణ్ణి ప్రశాంతపరచి, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లడానికి సహాయపడుతుంది. ఏ ఒక్కరూ అనవసరంగా, అధికంగా మాట్లాడకూడదు. అత్యవసరమైనదే మాట్లాడాలి. నిర్ణీత వేళల్లో మౌనంతో ఉండడమే తపస్సు. కేవలం నాలుకను కదల్చకుండా ఉంచుట మౌనం కాదు. మనసుకు కూడా పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. ఈ విధంగా చేసినపుడు మనిషి ఎక్కువ శక్తినీ, ఎక్కువ నిర్మలత్వాన్నీ పొందుతాడు.ఇందువలన మనసు అలసట తీర్చుకొంటుంది. ఏకాగ్రతా పెరుగుతుంది. నీ మనసు ఎంత ఖాళీగా ఉంటుందో, అంత ఏకాగ్రత పెరుగుతుంది. మనసును ఖాళీ చేయటానికి మౌనం చాలా ప్రభావశాలి. మహాత్ములు, జ్ఞానులు దీర్ఘకాలం మౌనం పాటిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ‘గీత’లో తెలిపిన విషయం:‘గోప్యమైన వానిలో, నేనే మౌనమును’. అందువలన మనము కూడా మౌనాభ్యాసం చేద్దాం.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
దృష్టిని బట్టి.. సృష్టి!
ఉత్తర భారత దేశానికి చెందిన ఒక ప్రొఫెసర్ స్వామివారి దర్శనార్థం తిరుపతి వెళ్ళాడు. తనతో పాటు సహాయకుడిగా పరిశోధక విద్యార్థిని కూడా వెంట తీసుకు వచ్చాడు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి గుండా తిరుమలకు కాలినడకన వెళ్ళాలనేది ప్రొఫెసర్ గారి ఆలోచన. అలిపిరికి వెళ్ళి ఎత్తైన శేషాచల శిఖరాన్ని చూశారు. సముద్రమట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉన్న ఏడుకొండల్ని చూసి భక్తి భావంతో దణ్ణం పెట్టుకున్నారు. పాదాల మండపం వద్ద శ్రీవారి లోహ పాదాలను నెత్తిన పెట్టుకుని ప్రదక్షిణ చేస్తూ ఉండగా పరిశోధక విద్యార్థి చిన్నగా ప్రొఫెసర్ని ఇలా అడిగాడు.‘‘దేవుడు నిజంగా ఉన్నాడంటారా?’’ అని. ప్రొఫెసర్ నవ్వి ‘‘దారిలో కనిపిస్తాడు పద!’’ అని చెప్పి కాలినడకకు పురమాయించాడు.అలిపిరినుంచి ఆనంద నిలయుని సన్నిధికి దారి తీసే ఆ పడికట్ల దోవలో ప్రకృతి అందాలను వీక్షిస్తూ నడక ప్రారంభించారు. తలయేరు గుండు, గాలి గోపురం, ఏడవ మైలు ప్రసన్నాంజనేయ స్వామి, అక్కగార్ల గుడి, అవ్వాచారి కోన... దాటి మోకాలి మెట్టు చేరారు. తిరుమల కొండ ‘ఆదిశేషుని అంశ’ అని భక్త జన విశ్వాసం. అందుకే చెప్పులు లేకుండా కొండ ఎక్కుతారు భక్తులు. ఈ కొండను పాదాలతో నడిచి అపవిత్రం చేయకూడదని శ్రీరామానుజులు, హథీరాంజీ బావాజీ మోకాళ్ళ మీద నడిచారని చెబుతారు. అప్పటినుంచి అది మోకాలి మెట్టు అయ్యిందని కూడా తెలుసుకున్నారు. అక్కడ మెట్లు నిలువుగా మోకాలి ఎత్తు ఉండటం వల్ల మోకాళ్ళు పట్టుకు΄ోసాగాయి పరిశోధక విద్యార్థికి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైన ఆ విద్యార్ధి గట్టిగా ‘‘దేవుడు కనిపిస్తున్నాడు!’’ అని చె΄్పాడు.చిన్న నవ్వు నవ్విన ప్రొఫెసర్, ‘‘అనుకున్నది అనుకున్నట్లు ఎవరికీ జరగదు. అలా జరిగితే ఎవ్వరూ చెప్పిన మాట వినరు. తలచినట్లే అన్నీ జరిగితే... మనిషి దేవుడి ఉనికినే ప్రశ్నిస్తాడు. కష్టాలు, కన్నీళ్లు లేకుంటే తనంత గొప్పవాడు లేడని విర్రవీగుతాడు. అహాన్ని తలకి ఎక్కించుకున్నవాడు తనే దేవుడని చెప్పి ఊరేగుతాడు. జీవితం కష్టసుఖాల మయం కాబట్టే, మనిషి ఆ అతీత శక్తిని ఆరాధిస్తున్నాడు! అందుకే అలిపిరి వద్ద నేల మీద నడిచేటప్పుడు నీకు దేవుడి ఉనికి ప్రశ్నార్థకమయ్యింది. మోకాలిమెట్టు దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఉన్నాడని అనిపించింది’’ అని చెప్పి గబగబా మెట్లు ఎక్కసాగాడు.‘దృష్టిని బట్టి సృష్టి’ అని తెలుసుకున్న విద్యార్థి గోవింద నామస్మరణ చేస్తూ ప్రొఫెసర్ వెనుకనే నడవసాగాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
దేవుడైతే గుడి కడతాం... ప్రధానిపై ‘దీదీ’ సెటైర్లు
కోల్‌కతా: చివరి దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత, వెస్ట్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైర్లు వేశారు. తనను దేవుడు పంపాడని ప్రధాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై చురకలంటించారు. ‘ఒకరేమో దేవుళ్లకే దేవుడినని అంటారు. మరో నేతేమో పూరి జగన్నాథుడే ఆయన భక్తుడంటారు.దేవుడయితే మేం ఆయనకు గుడి కడతాం. పూలు,పండ్లు, స్వీట్లు, ప్రసాదం పెడతాం. ఆయన కావాలనుంటే గుజరాతీ వంటకం ఢోక్లా కూడా పెడతాం’అని మమత ఎద్దేవా చేశారు. దేవుడైతే రాజకీయాల్లో ఉండకూడదని, అల్లర్లు రెచ్చగొట్టొద్దని సూచించారు. కాగా, ప్రధాని మోదీ ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా అమ్మ బతికున్నంతవరకు నేను అందరిలాగే పుట్టాననుకున్నాను. కానీ ఆమె చనిపోయిన తర్వాత నన్ను దేవుడు పంపించాడేమో అనిపిస్తోంది. ఈ శక్తి నాకు శరీరం నుంచి రావడం లేదు. దేవుడిస్తున్నాడు. నేననేది ఏమీ లేదు. నేను దేవుని సాధానాన్ని మాత్రమే’అని ప్రధాని ఇంటర్వ్యూలో చెప్పడంపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
మాఘ పౌర్ణమి వేళ.. వారణాసికి మోదీ
ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమి.. ఆరోజున ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. అలాగే గోవర్ధన్‌లో సంత్ రివిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు ఆలయ అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ.50 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆలయ నిర్వాహకులు ప్రధాని మోదీకి ఆహ్వానం పంపారు. మోదీ పర్యటన ఇంకా ఖరారు కానప్పటికీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి కాశీకి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ పంచగంగా ఘాట్ వద్దనున్న బిందుమాధవ్ ఆలయాన్ని దర్శించే అవకాశాలున్నాయి. శైవ-వైష్ణవ ఐక్యతకు పునాదిగా నిలిచే ఈ ఆలయం విస్తరణ, అభివృద్ధి దిశగా ప్రధాని యోచిస్తున్నారని సమాచారం. -
దేవుడు మనిషికి ఇచ్చిన శక్తి ఎంతో తెలుసా?
మానవుడు శక్తి హీనుడనని డీలా పడిపోతాడు. ధనం,అధికారం లేదు కాబట్టి తాను పనిరానివాడిగా భావిస్తాడు. ఇక ఇంతే జీవితమని నిరాశ నిస్ప్రుహలకు స్థానం ఇచ్చి జీవితాన్ని చీకటి మయం చేసుకుంటాడు. ఏదో ఒకరోజు ఇక్కడ నుంచి వెళ్లాల్సిందే కదా అని తన ఆఖరి ఘడియ కోసం నిర్లిప్తంగా ఎదురు చూస్తాడు. నిజానికి ప్రతి వ్యక్తికి దేవుడు చాలా శక్తిని ఇచ్చాడు. ధనం, అధికారం, ప్రతిష్టా, మంచి వంశం అనేవి పక్కన పెట్టండి. ప్రతి మనిషికి స్వతహగా ఎంతో శక్తిని ఇచ్చాడు. దాన్ని గుర్తించం, తెలుసుకుని ప్రయోజనం పొందే యోచన చెయ్యం. నిజానికి సైన్సు పరంగా మనిషిక ఎంత శక్తి ఉందో తెలిస్తే షాకవ్వడం ఖాయం!. అదేంటో సవివరంగా తెలుసుకుందాం!. మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణాలు ఉన్నాయి. మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నాయి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలి. ఇక హార్మోన్స్‌లో 45కేలరీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి. శరీరం వద్దకు వస్తే ప్రతి మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళాలు ఉన్నాయి. ప్రతి క్షణమునకు 20 లక్షల కణాలు తయారవుతాయి. గుండె దగ్గరకు వస్తే. మానవుని హృదయము నిముషానికి 72 సార్లు చొప్పున రోజుకు ఇంచు మించు 1,00,000 (ఒక లక్ష) సార్లు, సంవత్సరానికి 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొట్టుంది. మానవుని జీవిత కాలములో హృదయములోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేస్తాయి. మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వస్తాయి. మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోప్పడటానికి 43 కండరములు పనిచేస్తాయి. మనిషి చర్మంలో 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి. మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉంటుంది. మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును. మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి. మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి. మానవుని పంటి దవడ 276 కేజీల కంటే ఎక్కువ బరువు ఆపగలదు. మానవుని శరీరములో 206 ఎముకలు కలవు. మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 కిలోగ్రాముల ఫుడ్‌ని తింటాడు. మనిషి నోటిలో రోజుకు 2 నుంచి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది . మనిషి జీవిత కాలములో గుండె 100 ఈత కోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది. మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము. మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి. మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది. మానవుని మెదడుకు నొప్పి తెలియదు. మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది. మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది. మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది. ఒక్క తుమ్ము ఏకంగా.. తుమ్ము గంటకు వంద మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది. చేతి వేలి గోళ్ళు కాలి వేళ్ల గొళ్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగుతాయి. స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది. స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు ఆర్పుతారు. రక్తం, నీరు కుడా వారికి 6 రెట్లు చిక్కగా ఉంటుంది. మానవుని మూత్రపిండములు నిముషానికి 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల మూత్రమును విసర్జిస్తాం. స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి. మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది. మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన. ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది. రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది. మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి. మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు. మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది. మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేస్తుంది. మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును. మనిషి ముఖములో 14 ఎముకలు ఉంటాయి. మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకుంటుంది. ప్రతి ఏడు రోజులకొకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడతాయి. కంటితో 2.4 మిలియన్ల.. మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేస్తుంది. ఆహారము నోటిలో నుంచి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది. మనిషి శరీరములో దాదాపు 75% నీరు ఉంటుంది. మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడగలడు. అది సుమారుగా 528 మెగా పిక్సల్ లెన్స్‌కి సమానం. ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండటమే గాక మన శరీరీ అవయవాల ప్రాముఖ్యతను గుర్తించి ఆరోగ్యంగా ఉండేందుక ప్రయత్నించాలి. ఇదంతా విన్నారు కదా ఇప్పుడు చెప్పండి మనకు ఏమి తక్కువగా ఉంది? . కాబట్టి అస్సలు నిరాశ , నిస్పృహను దరిచేరనీయొద్దు. గమ్యం చేరే వరకు ప్రయాణించండి. ఇక్కడకి కేవలం వచ్చి పోవడానికి రాలేదు. వెళ్లేలోపు ఏదోఒకటి ఇచ్చి పోవడానికే వచ్చాము. బీ స్ట్రాంగ్.. ఏదైనా సాధించాలని పట్టుదలను పెంపొందించుకోండి. విజయం తథ్యం. (చదవండి: నమస్కారం అంటే..ఏదో యాంత్రికంగా చేసేది కాదు! ఎక్కడ? ఎలా? చేయాలో తెలుసుండాలి!) -
భారత్ విజయం కోరుతూ ట్రాన్స్జెండర్ల ప్రత్యేక పూజలు
భారత్.. ప్రపంచకప్ గెలవాలని ప్రతి భారతీయుడు అభిలషిస్తున్నాడు. ఇందుకోసం దేశంలోని పలు ప్రాంతాల్లో తమ నమ్మకాలకు అనుగుణంగా పలువురు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ట్రాన్స్జెండర్ల సంఘం సభ్యులు ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా విజయం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లు తమ చేతులతో టీమ్ ఇండియా సభ్యుల ఫోటోలను పట్టుకుని పూజల్లో పాల్గొన్నారు. టీమ్ ఇండియాకు శుభం జరగాలని అభిలషిస్తూ శంఖం ఊదారు. భగవంతునికి హారతులిచ్చారు. డప్పులు వాయిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్ల ప్రార్థనలను భగవంతుడు స్వీకరిస్తాడని, వారి పూజలు ఫలవంతమవుతాయిని స్థానికులు చెబుతున్నారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు వరుసగా 10 విజయాలతో ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే ఆస్ట్రేలియా తన మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయినా, తరువాత జరిగిన అన్ని మ్యాచ్‌లను గెలుచుకుంది. ప్రపంచకప్‌లో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చూపాయి. అటువంటి స్థితిలో ఈరోజు ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: సూర్యునికి అర్ఘ్యమిస్తూ మ్యాచ్ చూసే మహత్తర అవకాశం! -
‘గాడ్ డిపార్ట్మెంట్’ అంటే ఏమిటి? యూదుల లేఖల్లో ఏముంటుంది?
ఇజ్రాయెల్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అక్కడి యూదుల జీవితాల్లో మతం, ఆధ్యాత్మికత అనేవి లోతుగా నాటుకుపోయాయి. దీనికి ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ‘దేవుని ప్రత్యేక విభాగం’ ఉదాహరణగా నిలుస్తుంది. దీనినే ‘గాడ్ డిపార్ట్మెంట్’ అని అంటారు. ‘గాడ్ డిపార్ట్మెంట్’కి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ఉత్తరాలు వస్తుంటాయి. ఇజ్రాయెట్ 21సీ. ఓఆర్జీ తెలిపిన వివరాల ప్రకారం ఈ దేవుని విభాగానికి ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా ఉత్తరాలు వస్తుంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉంటున్న యూదులు తమ ప్రార్థనలు, కోరికలు, బాధలు, సంతోషాలను ప్రస్తావిస్తూ దేవునికి లేఖలు పంపుతారు. వీటన్నింటికీ ఒకే చిరునామా ఉంటుంది. అదే.. కోటెల్ లేదా వెస్ట్రన్ వాల్. ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్మెంట్లోని ‘గాడ్ డిపార్ట్మెంట్’కు వచ్చే ఉత్తరాలన్నీ జెరూసలేంలొని ‘వెస్ట్రన్ వాల్’ రంధ్రాలలో ఉంచుతారు. ఇక్కడ పశ్చిమ గోడను కోటెల్ అని కూడా అంటారు. ఇది ‘వాల్ ఆఫ్ ది మౌంట్’లో ఒక భాగం. ఒకప్పుడు ఈ ప్రదేశంలోనే తమ పవిత్ర దేవాలయం ఉండేదని యూదులు గాఢంగా నమ్ముతారు. దీన్నే ‘హోలీ ఆఫ్ ది హోలీస్’ అని అంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది యూదులు తమ వారసత్వాన్ని గుర్తు చేసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఇది కూడా చదవండి: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం! -
ఓటీటీలో సైకో థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే?
థియేటర్లో అన్ని జానర్ల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. అయితే ఓటీటీలో మాత్రం సస్పెన్స్, థ్రిల్లర్ కంటెంట్‌కే ఎక్కువగా ఓటేస్తున్నారు. ఓటీటీ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కూడా సరికొత్త సినిమాలు, సిరీస్‌లతో సినీప్రియులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్టార్ హీరో జయం రవి, నయనతార జంటగా నటించిన చిత్రం ఇరైవన్. అహ్మద్.. కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించగా సుధన్ సుందరం, జయరామ్.జి కలిసి నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ మూవీ సెప్టెంబర్ 28న విడుదలైంది. ఈ తమిళ చిత్రం తెలుగులో గాడ్ పేరిట విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ తేదీ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. గాడ్ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, చార్లీ, అశ్విన్ కుమార్, రాహుల్ బోస్, విజయలక్ష్మి, వినోద్ కిషన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా కథేంటంటే.. సినిమా కథ విషయానికి వస్తే.. నగంలో వరుసగా అమ్మాయిలు హత్యకు గువుతుంటారు. అమ్మాయిలను కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా చంపేస్తున్న సైకో కిల్లర్‌ను ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ పట్టుకుంటాడు. కానీ కిల్లర్‌ను పట్టుకున్న తర్వాత కూడా హత్యలు జరుగుతూనే ఉంటాయి. మరి వాళ్లను ఎవరు చంపుతున్నారు? ఈ మర్డర్ మిస్టరీలను ఎలా ఛేదించారు? అనేది తెలియాలంటే గాడ్ సినిమాను ఓటీటీలో చూసేయాల్సిందే! View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: పదేళ్లయినా నాకోసం ఎదురుచూస్తున్నారు: కియాఆ -
భక్తుడికి ఆహారం భక్తే
యోగరతోవా భోగ రతోవా/ సంగ రతోవా సంగ విహీనః/ యస్య బ్రహ్మణి రమతే చిత్తం/ నందతి నందతి నందత్యేవ... చెరుకు గడను తీసుకొచ్చి కత్తితో నరికినా, మరలోవేసి తిప్పినా, నోటితో కొరికినా... ఎంత హింసించినా తియ్యటి రసాన్ని ఒలికించడం తప్ప అది మరో విధంగా స్పందించదు. కారణం – త్యాగం దాని లక్షణం. ఏ వాగ్గేయకారుడి జీవితం చూసినా ప్రతివారి జీవితంలో ఈ ప్రశాంతత, ఈ కారుణ్యం, ఈ ద్వంద్వాతీత స్థితి, అందరినీ ప్రేమించగల, అనుగ్రహించగల శక్తి కనపడుతుంటాయి. వాళ్ళు కూడా అంత గొప్పగా ఆ సంగీతంతోనే ఎదిగారు. ఆ సంగీతంతోనే మనల్ని ఉద్ధరించారు. త్యాగరాజ స్వామి జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు. మహారాజుగారు అన్ని కానుకలు పంపితే ‘నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగబల్కు మనసా..’’ అంటూ వాటిని తీసుకెళ్ళి చెత్తదిబ్బలో పారేస్తాడా ... అని తోడబుట్టిన అన్నగారికే నచ్చలేదు తమ్ముడి పద్ధతి. ‘ఎప్పుడూ ఆ విగ్రహాలు పట్టుకుని కూర్చుంటాడు. తమ్ముడు కనుక రాజుగారి కొలువులో పాడితే ఎంత హాయిగా జీవించవచ్చు...’ అనే భావన అన్నగారిది. కాదు... సంగీతం మోక్ష సామ్రాజ్యాన్ని ఇవ్వగలదు. ఇది ఇవ్వగలిగిన ఆనందం వేరొకటి ఇవ్వలేదు. వాగ్గేయకారులకు ఉన్నది సంగీతసాహిత్యాలు మాత్రమే కాదు. నేను పాట రాస్తాను, బాణీ కడతాను, అంటే ఎవడూ వాగ్గేయకారుడై పోడు. సంగీతసాహిత్యాల్లో అంతర్లీనంగా భక్తి ప్రవహించాలి. అది ఎటువంటి భక్తి ...అంటే నువ్వు ఏమయిపోతున్నా... నమ్ముకున్న వాడి చరణాలు వదలలేనిది అది.. అచంచలమైనది... అదే భర్తృహరి మాటల్లో చెప్పాలంటే... నిను సేవింపగ ఆపదల్ పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,/జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు పై/కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ/చ్చిన రానీ... అంటాడు. ఏది ఏమయిపోయినా ఆ భక్తిలో పరమానందాన్ని పొంది ఎప్పటికప్పుడు లోపల ఈశ్వర గుణానుభవాలు పెరిగి అవి కీర్తనలుగా వెలువడుతుంటే ఆయన వాగ్గేయకారుడు. అంటే భక్తి ప్రధానం. భక్తుడికి భక్తి అమ్మలాంటిది. పసిబిడ్డకు పాలు ఎలాగో, భక్తుడికి భక్తి అలా ఆహారం. భగవంతుడి పాటలు వింటూ, తాను పాడుకుంటూ, రచన చేస్తూ, స్వరపరుస్తూ, శిష్యులకు చెబుతూ, ఏదీ ఆశించకుండా, ఏది లభిస్తే అది తింటూ, పరమ పవిత్రమైన జీవనాన్ని గడుపుతూ ఆఖరికి తన అవసరం లేదనుకున్నప్పుడు గహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకారం చేసి... భగవంతుడిలో ఐక్యమవుతాడు. భక్తుడిని వేరొకరు రక్షింపనక్కర లేదు..‘‘వాడిని నా కొరకు రక్షింపవలయు..’’ అంటాడు శ్రీమన్నారాయణుడు భాగవతంలో. వాడిని నేను రక్షించేది వాడి కోసం కాదు, నా కోసం..అంటున్నాడు. నన్ను నమ్ముకున్న వాడినే రక్షించకపోతే ఇక నేను ఉన్నానని లోకం ఎందుకు నమ్ముతుంది? అందుకని నేనున్నానని జనులు నమ్మడం కోసం.. నాకోసం వాడిని రక్షిస్తున్నా... అంటున్నాడు. భక్తుని స్థితి అలా ఉంటుంది. వాగ్గేయకారుల అనుభవాలు కూడా ఇవే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
క్షమయే దైవము
క్షమా శస్త్రం కరే యస్య దుర్జనః కిం కరిష్యతి? అతృణో పతితో వహ్నిః స్వయమేవోపశమ్యతి! గడ్డి పరక లేని నేలమీద పడిన మంట తనంత తానే ఆరి పోతుంది. ఎవరి దగ్గరైతే క్షమ అనే శస్త్రం ఉంటుందో వారిని దుర్జనులు కూడా ఏమీ చేయలేరని శ్లోకం భావం. మంట తనని కాలుస్తున్నా తిరిగి ప్రతీకారం తీర్చుకోకుండా నేలతల్లి సహనం వహించడం వల్ల మంటలో ఉన్న కాలే గుణం తగ్గి పోతుందట. రావణుడితో మొదటిసారి యుద్ధంలో తలపడినప్పుడు ‘సీతను అప్పగించి శరణు కోరితే క్షమించి వదిలేస్తాను’ అని పలికాడు రాముడు. ఎంతటి శత్రువునైనా క్షమించగల దయా గుణ సంపన్నుడు రాముడు. తన భార్యని అపహరించిన శత్రువుని కూడా క్షమాగుణంతోనే పలకరించాడు. రావణుడు చనిపోయాక శ్రాద్ధ కర్మల అవసరం లేదని విభీషుణుడు చెప్పగా ‘ఎంతటి శత్రువైనా మరణంతో పగలన్నీ మరచిపోవాలి. అతడు మీకెలా సోదరుడో నాకూ అంతే. అతడికి సద్గతులు కలగాలంటే శ్రాద్ధ కర్మలు జరిపించాలని’ పలికాడు. అంతటి క్షమాగుణం సీతాపతిది. కార్త వీర్యార్జునుడిని, పదిహేడు అక్షౌహిణుల సైన్యాన్ని హతమార్చిన పరశురాముడితో తండ్రి జమదగ్ని ‘క్షమయే మన ధర్మం. ధర్మతత్వానికి క్షమయే మూలం. క్షమ కలిగి ఉండడం చేతనే సర్వేశ్వరుడు బ్రహ్మ పదాన్నీ, సకల జీవరాశినీ పరి పాలిస్తున్నాడు. క్షమ కలిగి ఉంటే సిరి కలుగుతుంది. విద్య అబ్బుతుంది. సౌఖ్యాలు కలుగుతాయి. శ్రీహరి మెప్పు పొందగలరని’ హితబోధ చేశాడు. ఫలితంగా ఏడాది పాటు తీర్ధయాత్రలు చేశాడు పరశురాముడు. ఈ కాలం వారికి వింతగా కనబడవచ్చు కానీ క్షమా గుణానికి ఉన్న బలం అంచనా కట్టలేనిది. ఎవరైనా ఒక్క మాటంటే భరించలేకపోవడం, దూషిస్తూ తిరిగి ఎదురు దాడి చేయడం నేటి కాలంలో చూస్తుంటాం. ఒక్క క్షణం ఓపికతో అవతలి వారి కోణంలో ఆలోచిస్తే వారి మీద కోపం రావడం బదులు సానుభూతి కలుగుతుంది. క్షమాగుణాన్ని చూప డమంటే చేతకానితనం కాదు. ఆత్మబల మున్న బలవంతులకే అది సాధ్యం. – అమ్మాజీ ఉమామహేశ్వర్ -
దేవుడికి రాజోపచారాలు అందుకే..!
‘‘గీతం వాద్యం తథా నృత్యం త్రయ సంగీతముచ్యతే...’’... అన్నట్లు గీతం, వాద్యం, నృత్యం .. ఈ మూడూ సంగీతంలో అంతర్భాగాలే. అది త్రివేణీ సంగమం. అది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండగలిగిన స్థితిని ఇస్తుంది. మొట్టమొదట సంగీతాన్ని ఎవరు పట్టుకున్నారు... అంటే భగవంతుడే. పరమశివుడికన్నా బాగా నృత్యం చేసేవారెవరు! శ్రీకృష్ణ పరమాత్మకన్నా వేణువు వాయించగల విద్వాంసుడెవరు! శంకరుడికన్నా దక్షిణామూర్తిగా వీణ వాయించేదెవరు! వైదికమైన రూపాలు వేరయినా సరస్వతీ దేవి కూడా ఎప్పుడూ వీణతోనే కన్పిస్తుంటుంది. అయితే మనసుకు ఒక లక్షణం ఉంటుంది. దానికున్న శక్తి – వేగం, యాంత్రీకరణ. ఇక్కడున్నట్టుంటుంది... క్షణాల్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది. పూజలో కూర్చుంటాం.. శివాయనమః అంటూ చేతితో పువ్వును శివలింగం మీద ఉంచుతాం. తరువాత.. మంత్రాలు నోరు చెబుతుంటుంది, చెయ్యి పూలు వేస్తుంటుంది... కానీ మనసు మాత్రం మెల్లగా జారుకుని ఎక్కడికో వెళ్ళిపోతుంది. దేముడికి ఇది కాదు కావలసింది. ఆయన వీటితో సంతోషించడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యాప్రయచ్ఛతి/తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః... భక్తితో ఆకులు, పండ్లు, పూలు, నీళ్ళిస్తే నేను తీసుకుంటా... అవి చాలు నాకు... అంటాడు. కానీ చంచలమైన మనసును ఒకేచోట నిలబెట్టడం అంత తేలికయిన పనేమీ కాదు. అందుకే ఏకాగ్రత లేనప్పుడు గంటలకొద్దీ పూజలొద్దు... సమయం ఉంటే 16 రకాలుగా సేవించు... లేదా ‘పంచసంఖ్యోపచారిణీ’... అన్నారు.. గంధ, పుష్ప, ధూపం, దీపం, నైవేద్యాలతో చేయి.. దానికీ మనసు మొండికేస్తుందా... రాజోపచారాలు చెయ్యి. ... చామరం వెయ్యి, పాట విను, నృత్యం చెయ్యి... ఇవి మనసును బాగా పట్టుకుంటాయి. కంజదళాయతాక్షీ కామాక్షీ... అని కీర్తన అందుకున్నాడు శ్యామ శాస్త్రి.... కుంజరగమనే.. అని పాడాడు వాసుదేవాచార్యులవారు. శుక్రవారం మంటపంలో కామాక్షీ పరదేవత నడచివస్తుంటే ఏనుగు నడిస్తే ఎంత గంభీరంగా ఉంటుందో అంత నయానానందకరంగా ఉంటుందన్నాడు... అంటే ఆ కీర్తన వింటూంటే మనం అమ్మవారి నడకనే చూస్తున్నాం.. మనసుకు కళ్ళెం పడింది. ఆ తత్త్వం మనసును అలరించి శాంతినిస్తుంది. అందుకే గీతం, వాద్యం, నృత్యం మనసుకి ప్రశాంతతను ఇస్తాయి. అందుకే వాటిని రాజోపచారాల్లో చేర్చారు. అసలు మనకంటే ప్రశాంతంగా ఉండాల్సింది .. భగవంతుడు. ఉద్వేగాలు ఎవరికి ఉండాలి? అదీ ఆయనకే. అందరి మనసుల్లో భగవంతుడున్నప్పుడు మన ఉద్వేగాలు, అశాంతి అన్నింటి సెగ ఆయనకే కదా తగులుతుంటుంది. ఆ వేడిని తట్టుకోవడానికే ఆయన అభిషేకం స్వీకరిస్తున్నాడట. నెత్తిన చల్లటి చంద్రుడిని కూడా ఉంచుకున్నాడని చమత్కారంగా చెప్పారు. అమ్మవారు శక్తి స్వరూపం. శక్తి అంటే కదలిక. మరి అన్ని కదలికలతో అమ్మవారు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతారు... దానికి కాళిదాసంటారు కదా... సరిగమపదనిరతాం తాం... వీణా సంక్రాంత హస్తాంతాం... ఆ తల్లి చేతిలో వీణ పట్టుకుని సప్త స్వరాల్లో రమిస్తూ ఉంటుంది. అందుకే ఆమె ప్రశాంతంగా ఉంటుంది... అంటే సంగీతం మనసుకు ఏకాగ్రతను, శాంతిని ఇస్తుంది... చివరిదయిన మోక్ష సాధనకు వాగ్గేయకారులు కూడా సంగీతాన్నే సాధనంగా చేసుకుని తరించారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు (చదవండి: పంపాతీరంలో హనుమంతునిచే త్రిశూలరోముడి హతం.. మునులకు ప్రశాంతత) -
భగవంతుడుకి పూజలు, వ్రతాలు కంటే అదే అత్యంత ముఖ్యం!
బ్రహ్మచారులు, సాధువుల కన్నా సంసార జీవితాన్ని గడిపే వారికే కొన్ని దాన ధర్మాలు నిర్వర్తించే అవకాశ ముంది. వాళ్లను సాయం అడిగే వారుంటారు. అలాంటి వారికి సాయం చేసి పుణ్యం గడించే వీలు వీరికే ఎక్కువ. సంసారి తన దగ్గర ఉన్నవాటిని ఎవరెవరికి ఏది అవసరమో వాటిని నిండు మనసుతో ఇవ్వాలి. ఏ మేరకు ఇవ్వగలరో ఆ మేరకు ఇస్తే చాలు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వాటిలో ముఖ్యమైనది. కడుపునిండా అన్నం పెట్టిన మనిషి ముఖాన్ని చూడండి. అతని ముఖంలో ఓ తృప్తీ, ఓ ఆనందం కనిపిస్తాయి. కానీ మిగిలిన దానాల విషయంలో ఈ తృప్తి అంతగా కనిపించదు. ఎవరైనా తినడానికి వస్తున్నారేమోనని చూసిన తర్వాత తినాలనేది భారతీయ సంప్రదాయం. తన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పెట్టక తానే తినడం, ఇతరు లకు తెలీకుండా దాచిపెట్టి తినడాన్ని పాపమనే భావనా ఉంది. అందుకే అంటారు, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా దానం చేయడం ముఖ్యం. అందులోనూ ‘అన్నదానా’న్ని మించింది మరొకటి లేదు. ఓ ధనవంతుడు ఎన్నో పూజలు చేసి, భగవంతుడిని ఆరాధించి ఇక తానెవరికీ ఏదీ చెయ్యవలసిన అవసరం లేదని నిర్ణయించుకుని తన దగ్గరున్నది ఎవరికీ ఇవ్వక, ఎవరికీ పిడికెడు అన్నం కూడా పెట్టక ‘తానూ, తన కుటుంబం’ అనుకొని బతికాడు. తీరా ఆయన మరణిం చాక రాక్షసుడిగా మారి నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చే శవాలను పీక్కుతింటూ తన తప్పు తాను తెలుసుకుని తనను క్షమించమని దేవుడిని వేడుకున్నాడు. దీంతో రాక్షస రూపం పోయి సద్గతి పొందినట్లు ఓ కథ ఉంది. ఇటువంటి కథల నుంచి గ్రహించాల్సిన నీతి ఒక్కటే: తాను తినడమే కాదు ఇతరులకూ పెట్టాలి. – యామిజాల జగదీశ్ (చదవండి: గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం?) -
దయచేసి పిల్లలతో కలిసి సినిమా చూడకండి:స్టార్ హీరో
లేడీ సూపర్ స్టార్ నయనతార, జయం రవి జంటగా నటించిన చిత్రం ఇరైవన్. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని గాడ్ పేరుతో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ లాంఛ్‌లో పాల్గొన్న జయం రవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చారు. (ఇది చదవండి: కలర్స్ స్వాతితో పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన నవీన్ చంద్ర!) జయం రవి మాట్లాడుతూ..' అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదం అందించే లక్ష్యంతో సినిమాలు చేస్తున్నాం. అయితే ఇరైవన్ (గాడ్) చిత్రాన్ని మాత్రం పిల్లలతో కలిసి చూడొద్దు. ఎందుకంటే సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసి చిన్న పిల్లలు భయపడే అవకాశం ఉంది. మా సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్లోనే చూపించాం. కొంతమంది ప్రేక్షకులు ఇలాంటి క్రైమ్ అండ్ సస్పెన్స్ చిత్రాలను ఇష్టపడతారు. వాళ్లు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నా.' అని అన్నారు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గతంలో నాకు ఓ కథ చెప్పారు. అది అనివార్య కారణాలతో చేయలేకపోయాను. అతనికి మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా. ఇకపోతే నాకు డైరెక్షన్ చేయాలనే ఉంది.. భవిష్యత్తులో అవకాశం వస్తే విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని తెలిపారు. (ఇది చదవండి: 800 మూవీ విజయ్ సేతుపతి చేయాల్సింది, కుటుంబాన్ని బెదిరించడంతో..) -
ప్రకృత్యైనమః
గుర్తించాలే కానీ దేవుడు అనేక రూపాల్లో ఉంటాడు. వాటిలో కనిపించనివే కాదు, కనిపించేవీ ఉంటాయి. ఎక్కడో ఉన్నాడనుకునే దేవుడు... మన చేతికందే దూరంలో ఒక మొక్కలోనూ, కొమ్మలోనూ, ఆ కొమ్మకు పూసిన పువ్వులోనూ కూడా ఉన్నాడని గ్రహించడమే లౌకిక, పారలౌకిక సమన్వయంతో కూడిన ఆధ్యాత్మిక ప్రస్థానంలో తొలి ఎరుక. దైవం మానుషరూపేణ అంటారు. అలాగే, దైవం ప్రకృతి రూపేణ కూడా! రామకృష్ణ పరమహంస ఓసారి ఆకాశంలో రెక్కలు విప్పుకుంటూ ఎగిరే పక్షిని చూసి సమాధిలోకి వెళ్లిపోయారట. చెట్టును, పిట్టను, పువ్వును, పసిపాప నవ్వును, పారే ఏటినీ, ఎగిరే తేటినీ చూసి తన్మయులైతే చాలు; ఆ రోజుకి మీ పూజ అయిపోయిందని ఒక మహనీయుడు సెలవిస్తాడు. షడ్రసోపేతంగా వండిన తన వంటకాలను తృప్తిగా ఆరగిస్తే ఇల్లాలు ఎంత ఆనందిస్తుందో, తన వ్యక్తరూపమైన ప్రకృతిని చూసి పరవశిస్తే దేవుడు అంతే ఆనందిస్తాడని ఆయన అంటాడు. నది ఒడ్డున నిలబడి దాని పుట్టుకను, గమనాన్ని, పోను పోను అది చెందే వైశాల్యాన్ని, అది ప్రవహించిన పొడవునా దానితో అల్లుకున్న మన జీవనబంధాన్ని స్మరించుకున్నా అది పుణ్య స్నానంతో సమానమేనని ఒక కథకుడు రాస్తాడు. కృష్ణశాస్త్రి గారు పల్లవించినట్టు అడుగడుగునా, అందరిలోనే కాదు; ప్రకృతిలో అన్నింటిలోనూ గుడి ఉంది. అనాది నుంచీ నేటివరకూ మనిషి ఊహలో, భావనలో మనిషీ, దేవుడూ, ప్రకృతీ పడుగూ పేకల్లా అల్లుకునే వ్యక్తమయ్యారు. ఋగ్వేద కవి చూపులో ప్రకృతి పట్ల వలపు, మెరుపు ఎంతో ముగ్ధంగా, సరళంగా, సహజసుందరంగా జాలువారుతాయి. ‘‘వెలుగులు విరజిమ్మే ఓ ఆకాశపుత్రీ, సకల సంపదలకూ నెలవైన ఉషాదేవీ! వస్తూ వస్తూ మాకు ధనరూపంలోని ఉషస్సును వెంట బెట్టుకుని రా’’ అని ఒక ఋక్కు అంటుంది. ఋగ్వేద కవి చింతనలో అగ్ని ధూమధ్వజుడు; సూర్యకాంతితో తళతళా మెరుస్తూ ధ్వనిచేసే సముద్రపు అలల్లా వ్యాపిస్తాడు. ‘‘తమసానదీ జలాలు మంచివాడి మనసులా స్వచ్ఛంగా ఉన్నా’’యని వాల్మీకి వర్ణిస్తాడు. సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా స్నేహం చేసిన రాముడు, ‘‘వర్షాకాలంలో మంచి పొలంలో వేసిన పంట ఫలించినట్టు నీకార్యాన్ని సఫలం చేస్తా’’నంటాడు. ఆ మాటలకు సుగ్రీవుడు, ‘‘నదీవేగంలా హఠాత్తుగా ఉరవడించిన కన్నీటివేగాన్ని ధైర్యంతో నిలవరించుకున్నా’’డని రామాయణ కవి అంటాడు. ఏ కాలంలోనూ మనిషీ, ఋషీ, కవీ ప్రకృతి పొత్తిళ్లలో పసివాడిగానే ఉన్నాడు తప్ప ప్రకృతికి దూరం కాలేదు. ఇతిహాస కావ్య ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు తప్పనిసరి భాగాలు. శారద రాత్రుల్లో ఉజ్వల తారకలు, కొత్త కలువ గంధాన్ని మోసుకొచ్చే సమీరాలూ, కర్పూరపు పొడిలా చంద్రుడు వెదజల్లే వెన్నెల వెలుగులూ, చెంగలువ కేదారాలూ, మావులూ క్రోవులూ పెనవేసుకున్న అడవులూ, పక్షులు బారులు కట్టి ఇంటిముఖం పట్టే సూర్యాస్తమయ దృశ్యాలూ, తలను రెక్కల్లో పొదవుకుని పంటకాలువల దగ్గర నిద్రించే బాతువుల సన్నివేశాలూ... ఇలా కవి ఊహల రస్తాకెక్కని ప్రకృతి విశేషం ఏదీ ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం రూపంలో ప్రకృతి భాగం కాని పూజా ఉండదు. వినాయకుని పూజలో ఉపయోగించే మాచీ,బృహతి, బిల్వం, ధత్తూరం, బదరి, తులసి, మామిడి, కరవీరం, దేవదారు, మరువకం లాంటి ఇరవయ్యొక్క పత్రాల పేర్లే చెవులకు హాయిగొలిపి ఆకుపచ్చని చలవపందిరి వేసి మనసును సేదదీర్చుతాయి. అమ్మవారి స్తుతుల నిండా పూవులూ, వనాలూ పరచుకుంటాయి. చంపకాలు, సౌగంధికాలు, అశోకాలు, పున్నాగాలతో అమ్మ ప్రకాశించిపోతుంది. కదంబ పూలగుత్తిని చెవికి అలంకరించుకుంటుంది. చాంపేయ, పాటలీ కుసుమాలు తనకు మరింత ప్రియమైనవి. శిరసున చంద్రకళను ధరిస్తుంది. ప్రకృతి వెంటే పర్యావరణమూ గుర్తురావలసిందే. పర్యావరణ స్పృహ ఇప్పుడే మేలుకొంద నుకుంటాం కానీ, ప్రకృతిలో భాగంగా మనిషి పుడుతూనే పెంచుకున్న స్పృహ అది. రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకు వెడుతూ, వానరులు ఎక్కడుంటే అక్కడ చెట్లు సమృద్ధిగా ఉండాలనీ; అవి అన్ని కాలాల్లోనూ విరగ కాయాలనీ; నదుల్లో నీరు నిత్యం ప్రవహిస్తూ ఉండాలనీ ఇంద్రుని వరం కోరాడు. పాండవులు ద్వైతవనంలో ఉన్నప్పుడు ఆ అడవిలోని చిన్న జంతువులు ధర్మరాజుకు కలలో కనిపించి, ‘‘మీరు రోజూ మమ్మల్ని వేటాడి చంపడంవల్ల మా సంఖ్య తగ్గిపోయింది, బీజప్రాయంగా మిగిలాం, మేము పూర్తిగా నశించేలోగా దయచేసి మరో చోటికి వెళ్లం’’డని ప్రార్థించాయి. విశ్వనాథవారు తన ‘వేయిపడగలు’ నవలలో పర్యావరణానికి ప్రతీకగా పసరిక అనే పాత్రనే సృష్టించారు. ఆధునిక వేషభాషల వ్యామోహంలో పడీ, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసే వ్యవసాయ పద్ధతుల వల్ల పర్యావరణ విధ్వంసం ఏ స్థాయిన జరుగుతోందో ఆ పాత్ర ద్వారా గంట కొట్టి చెప్పారు. పూర్వకాలపు రాజులు అడవిని, అటవీ జనాన్ని, సంపదను పర్యావరణ భద్రతకు తోడ్పడే స్వతంత్ర అస్తిత్వాలుగా చూశారు తప్ప, తమ రాజ్యంలో భాగం అనుకోలేదు. ఇప్పుడా వివేచన అంతరించి అడవులు రాజ్యానికి పొడిగింపుగా మారి బహుముఖ ధ్వంసరచనకు లక్ష్యాలయ్యాయి. ప్రకృతికి పండుగకు ఉన్న ముడి తెగిపోయి ప్రతి పండుగా పర్యావరణంపై పిడికిటిపోటుగా మారడం చూస్తున్నాం. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుందన్న సంగతిని గుర్తు చేసుకోడానికి నేటి వినాయకచవితి కన్నా గొప్ప సందర్భం ఏముంటుంది! -
శివ కేశవులిరువురికి ప్రీతికరమైన మాసం శ్రావణం! ఎందుకంటే..
శ్రావణమాసం అంతా ఉదయం, సాయంత్రం భగవన్నామ స్మరణతో హిందూ గృహాలు మారు మోగుతాయి. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ‘శ్రవణా’ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది పవిత్రత కలిగినదీ శ్రావణ మాసం. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా పవిత్రత ఉందంటున్నారు విజ్ఞులు. అంతటి పవిత్ర మాసం అధిక శ్రావణం అనంతరం, నిజ శ్రావణం నేటి (17వ తేదీ గురువారం) నుంచి మొదలయ్యింది. ఈ మాసం శివ కేశవులకు ప్రీతికరం. ఈ మాసంతో అసలు వర్ష రుతువు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా భగవదా రాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ మాసం. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాల్లో శివుని ప్రీత్యర్థం ఉపవాస దీక్ష చేస్తే, అనేక శుభ ఫలితాలు కలుగుతాయంటారు. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలనీ వేదాలు చెబుతున్నాయి. త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు, ఆయన దేవేరి మహాలక్ష్మికి కూడా అత్యంత ప్రీతి కరమైనది శ్రావణమాసం అంటారు. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం. శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతం ‘మంగళగౌరీ’ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళ గౌరీ నోము అని పిలుస్తుంటారు. ఇదే మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ‘వరలక్ష్మి’ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరి స్తారు. ముత్తయిదువులకు వాయినాలిచ్చి ఆశ్వీరాదాలు తీసుకుంటారు. శుక్లపక్ష ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహా విష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందంటారు. శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకొనే శుక్ల పక్ష పౌర్ణమి రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షా బంధనం జరుపుకొంటున్నాం. అంతే కాక కొందరు ఈ రోజున నూతన యజ్ఞోపవీతం ధరించి, వేదభ్యాసాన్ని ప్రారంభిస్తారు. కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటివి సైతం ఈ నెలలోనే రావడం విశేషం. కృష్ణాష్టమి, పోలాల అమావాస్య వంటివి కూడా ఈ నెలలోనే వస్తాయి. – నందిరాజు రాధాకృష్ణ (చదవండి: శ్రావణం.. పర్యావరణహితం) -
వింత ఆచారం.. ఊరంతా కొండపైకి.. రాయిపై పాయసం చేసి.. తర్వాత..
సాక్షి, మన్యం: సాలరు మండలం కర్మరాజుపేట గ్రామంలో వరదపాయసం ముగియగానే ఆదివారం వర్షం కురిసింది. గడిచిన నెల రోజులుగా వర్షాలు కురవక పంటలు ఎండిపోతుండడంతో వారి ఆచారం ప్రకారం స్థానిక ఆరిలోవ కొండ వద్ద కొండజాకరమ్మ వారికి వరదపాశం గ్రామస్తులు చేశారు. గ్రామంలో ఊరి జన్నతను జోగిదండి, సామాన్లు సేకరిం ఉదయం పది గంటలకు గ్రామస్తులంతా కొండ వద్దకు చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. గ్రామస్తులంతా తలా పిడికెడు బియ్యం వేయగా, జన్నతను పాయసం తయారు చేశారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం కొండపై చాపరాయి మీద పాయసం వేసి మోకాళ్లపై కూర్చొని అమ్మవారికి మొక్కుతూ ఆచారం ప్రకారం నాలుకతో పాయసాన్ని స్వీకరించారు. గ్రామస్తులు ఎవరింటికి వారు వెళ్లిన తరువాత వర్షం పడింది. అమ్మవారు అనుగ్రహించి వర్షం కురిపించిందని వారంతా సంబరపడ్డారు. -
గ్రామదేవతలే భరత సంస్కృతికి ఆధారం!
నిజామాబాద్: భారతీయ సంస్కృతికి ఆధారం గ్రామ దేవతలేనని, ఆ గ్రామ దేవతలే గ్రామాలను, దేశాన్ని రక్షిస్తున్నాయని విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ గంగల్ లక్ష్మీపతి వ్యాఖ్యానించారు. శనివారం ఇందూరు ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో స్థానిక హరిచరన్ మార్వాడీ విద్యాలయంలో శ్రీగ్రామ దేవతలు – ఆరాధనా సంస్కృతిశ్రీ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనిషి తాను చేసే ప్రతి పనిలో భగవంతుని దర్శించడమే సంస్కృతి అని పేర్కొన్నారు. శ్రీరాముడు, పాండవులు సైతం అయోధ్య గ్రామ దేవతను, రాజ్యలక్ష్మీ దేవతను ఆరాధించినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 145 రూపాల్లో గ్రామ దేవతల్ని ఆరాధిస్తున్నారని వెల్లడించారు. ఇతిహాస సంకలన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్ మాట్లాడుతూ చరిత్ర అధ్యయనం కోసమే ఇతిహాస సంకలన సమితి అంకితమైన సంస్థ అన్నారు. ఈ కార్యక్రమంలో భోగరాజు వేణుగోపాల్, ఆకాశవాణి అధికారి మోహన్ దాస్, బొడ్డు సురేందర్, డా వారె దస్తగిరి, బలగం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అందం.. అంటే!!!
ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్లకవి జాన్ కీట్స్ ఒక మాటన్నారు...‘‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫరెవర్’’– అని. ఒక అందమైన వస్తువు ఎప్పటికీ సంతోషకారకమే. అందమైన వస్తువు అంటే ... నాకు ఏది అందంగా కనపడుతుందో, మీకు అది అందంగా కనపడకపోవచ్చు. నాకు అందంగా కనిపించింది దేశకాలాలతో సంబంధం లేకుండా అది నాకు శాంతి కారణమయి ఉంటుంది. అసలు లోకంలో ఏ పనిచేసినా దేనికోసం చేస్తాం? శాంతి కోసమే. ఏది శాంతిని ఇవ్వగలదో అదే అందం. ఏది మనసుకు అశాంతి ఇవ్వడం ప్రారంభించిందో అది అందవిహీనం. భగవద్గీతలో గీతాచార్యుడు ఒకమాటంటాడు – ‘‘తత్తదేవా గచ్ఛత్వమ్ మమ తేజోంశ సంభవమ్’’.. అని. అటువంటి గొప్ప అందం ఎక్కడయినా ఉంటే .. అది భగవంతుని తేజస్సు అవుతుంది. నేను ఒకప్పడు నైమిశారణ్యానికి వెళ్ళాను. అక్కడ గోమతీ నదీతీరంలో ఒక పెద్ద వటవృక్షాన్ని చూసాను. ఎంత పెద్దదంటే.. దాని కొమ్మలు, ఆకులు, ఊడలు తగలకుండా దాని చుట్టూ తిరగడానికి 15–20 నిమిషాలు పడుతుంది. ఎన్ని కొమ్మలు, ఎన్ని ఊడలు, పైన పక్షులు, పక్షి గూళ్ళు.. అలా చూస్తుండి పోయాను. ఇప్పటికి పదేళ్ళు పైగానే అయిపోయి ఉంటుంది. అయినా ఇప్పటికీ అది జ్ఞాపకానికి వస్తే.. దాని సౌందర్యం, దాని పరిమాణం వెంటనే మనసులో మెదిలి అప్పటివరకు నాలో ఉన్న ఉద్వేగం కానీ ఇతరత్రా చికాకులు, విసుగు, అశాంతి అన్నీ మటుమాయమై పోతాయి. ఒకసారి ఒక కోనేరులో సహస్రదళ కమలాన్ని చూసాను. వెయ్యిరేకుల పద్మం. అక్కడున్నవాళ్ళు దాన్ని కోసి తెస్తే ... నా రెండు చేతులా నిండుగా అది తాజాగా కనిపించడమే కాదు... దగ్గరనుంచి చూస్తే.. ఎన్ని రెక్కల దొంతర్లు, ఎన్నెన్ని రంగులు, ఎంత చక్కటి అమరిక, మధ్యలో ఉన్న దుద్దు, ముఖానికి దగ్గరగా తీసుకుంటే ఎంత చల్లదనం.. అలా దానిని ఆస్వాదిస్తూ ఉండిపోయాను. కొంతసమయం తరువాత అది వాడిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది... కానీ నా జ్ఞాపకాల్లో అది వాడలేదు, నశించలేదు, నా స్మృతిపథంలో దానికి బురద లేదు, మొగ్గలేదు, వందలాది రేకులతో, చిత్రవిచిత్ర వర్ణాలతో నా చేతిలో బాగా విప్పారి, నాకు చల్లదనాన్నిచ్చి... అలా నా మనసులో ముద్రితమైన ఆ పూవు మాత్రం నా చివరి శ్వాసవరకు, నేనెప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా మొదటిసారి చూసినప్పుడు ఎంత అనుభూతి చెందానో, అంతే అనుభూతిని పొందుతూనే ఉంటాను. అలా గుర్తుకొచ్చినప్పుడు ఆ అందం నాకు సంతోషాన్నిస్తుంది, శాంతినిస్తుంది. అంటే దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ‘బీజస్వాంతరివాంకురోజగదివం ప్రాంగే నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకకలగా వైచిత్రచితైకృతం’ అంటారు శంకరులు. అలా అది ఎప్పటికీ నాలోనే ఉండిపోతుంది. ఒకవేళ మళ్ళీ వెళ్ళినా అక్కడ అది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ మొదటిసారి చూసి అనుభూతి చెందిన అందం నా స్వంతం. అదెప్పటికీ నాతోనే ఉండి... నాకు సంతోషాన్ని, శాంతిని, ఉపశమనాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అంటే ఏది నీకు శాంతికారకమో, సంతోషకారకమో అదే నిజమైన అందం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నేను దేవుడిని.. గుడి కట్టించండి! రోడ్డు వెంట దిమ్మె కింద వెలిశాను
ఖమ్మం: నేను దేవుడిని... నాకు గుడి కట్టించండి... రోడ్డు వెంట దిమ్మె కింద వెలిశాను అంటూ ఓ బాలుడు పూనకంతో చెప్పడం, ఆయన ఓ పార్టీకి చెందిన దిమ్మెను అర్ధరాత్రి పగలగొట్టేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకోవడంతో నేలకొండపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... మండల కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన బాలుడు బుధవారం అర్ధరాత్రి పూనకంతో ఊగిపోతూ ఓ పార్టీ నిర్మించిన దిమ్మె కింద వెలిసినందున గుడి కట్టాలని చెప్పాడు. దీంతో కుటుంబీకులు దిమ్మె పగలగొట్టి పసుపు, కుంకుమ చల్లుతుండగా స్థానికులు అడ్డగించారు. ఇలా గొడవ పెరగడంతో బాలుడి కుటుంబం ఇంట్లోకి వెళ్లిపోయింది. ఈమేరకు గురువారం ఉదయం గ్రామపెద్దలు, స్థానికులు కలిసి వారిని నిలదీయగా వివాదం ముదురుతుండడంతో పోలీసులు చేరుకుని ఇరువర్గాలకు చెదరగొట్టారు. -
అక్కడ దేవుడికి నైవేద్యంగా రాళ్లే పెడతారు! ఎందుకంటే.
మన హిందూ దేవాలయాల్లో ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చాలామంది భక్తులు కూడా ఆ దేవాలయ ప్రసాదాలంటే చాలా ఇష్టపడతారు కూడా. అందుకోసం గుడికి వచ్చేవాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధం. ఈ దేవాలయంలో దేవుడికి రాళ్లనే నైవేద్యంగా పెడతారట. పైగా అలా చేస్తే అనుకున్న పని ఎలాంటి ఆటంకం లేకుండా అయిపోతుందని అక్కడ వారి నమ్మకం. వివరాల్లోకెళ్తే..శ్రీకాకుళం జిల్లా షేర్ మహ్మద్‌పురం గ్రామంలో ఈ వింత ఆచారం నెలకొంది. అక్కడ గ్రామస్తులు దేవుడికి నైవేద్యంగా ఏదోఒక రాయిని సమర్పిస్తారు. ఇది కొన్నేళ్లుగా వస్తున్న ఆచారం అని చెబుతున్నారు స్థానికులు. వాళ్లు ఆ దేవుడిని 'వీరుడి తాతగా' కొలుస్తారు. నిజానికి అక్కడ దేవాలయం గానీ దేవుని విగ్రహం కానీ ఉండదు. అక్కడ గుట్టగా.. భక్తులు నైవేద్యంగా సమర్పించిన రాళ్లు మాత్రమే కనిపిస్తాయి. అక్కడే సమీపంలో ఉండే వేపచెట్టునే దేవుడిగా పూజిస్తారు. ఈ దేవుడిని వీరుడి తాతగా పిలుస్తుంటారు. ఆ ప్రాంతంలో కుమ్మరి వాళ్లు ఉండేవారని, ఈ గ్రామంలో జరిగే పెళ్లిళ్లకు కుండలు తయారు చేసి పెద్ద ఊరేగింపుగా వచ్చి ఈ ప్రాంతంలో ఉండేవారని చెబుతున్నారు. ఆ తర్వాత క్రమేణ ఆ ప్రాంతాన్ని వీరుడి తాతగా కొలవడం ప్రారంభించారు. ఆ దారి వెంబడి వెళ్తూ ఆ స్వామికి ఏదో ఒక రాయిని సమర్పించి వెళ్తే తక్షణమే పని అవుతుందని వారి ప్రగాఢ నమ్మకం. అది కేవలం ఆ ఊరికి మాత్రమే పరిమితం కాలేదు. చుట్టు పక్కడ గ్రామస్తులు సైతం ఇక్కడకు వచ్చి రాళ్లను సమర్పిస్తుంటారు. ఈ ప్రదేశం సరిగ్గా ప్రధాన రహదారికి పక్కనే ఉంది. అత్యంత విలువైన ఈ ప్రదేశం పక్కన ఉన్న కొంత జాగా(నాలుగుసెంట్లు భూమిని) ఆ దేవుడి కోసం గ్రామస్తులు వదిలేశారు. ఈ ప్రదేశంలోనే పెళ్లిళ్లు కూడా చేసుకుంటారని చెబుతున్నారు అక్కడి గ్రామస్తులు. వినడానికి నమ్మశక్యం కాని విధంగా వింతగా ఉంది కదూ ఈ ఆచారం. ఏదీఏమైన మనిషి నమ్మకమే దేవుడు అని మరోసారి ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది. (చదవండి: యావత్తు సృష్టిని ఒక్క గంటలో సృష్టించి..'స్త్రీ మూర్తి'ని మాత్రం ఏకంగా అన్ని రోజులా?) -
యావత్తు సృష్టిని ఒక్క గంటలో సృష్టించి..'స్త్రీ మూర్తి'ని మాత్రం ఏకంగా..
యావత్తు సృష్టిని ఒక్క గంటలో తయారుచేయగలిగిన దేవుడు "స్త్రీ మూర్తిని" తయారుచేయడానికి మాత్రం వారం రోజులు కష్ట పడ్డడట ఎందుకో తెలుసా!.. మగాడితో సహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక "స్త్రీ"ని సృష్టించడం మొదలు పెట్టాడు. ఒక రోజూ రెండు రోజులూ కాదు. ఏకంగా వారం రోజులు తీసుకున్నాడు. "స్త్రీ" సృష్టి కోసం మిగిలిన పనులన్నీ మానుకుని తన నాథుడు ఇంతగా తలమునకలై పోవడం చూసిన దేవత అడిగింది. "స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?". అప్పుడు దేవుడు "ఏం చెయ్యను మరి ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా అంటూ 'ఆమె శక్తి' గురించి చెప్పుకొచ్చాడు ఇలా.. శారీరీకంగా కోమలమైంది మానసికంగా.. ఇష్టాయీష్టాలకు అతీతంగా ఉండాలి. సృష్టి వివక్ష తగదు. మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసుల వరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈజీవి ఎదుర్కోవాలో తెలుసా. ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా. ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు. రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే" అన్నాడు. "ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది. "ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది. ఆప్పుడు దేవుడు"ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు. ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు. ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమ, అనురాగాలను." అన్నాడు. "ఓహో ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది. అప్పుడు దేవుడు"ఎందుకాలోచించదు అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు." అన్నాడు. దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా ఏంటిది? " అని అడిగింది. ఆమె కన్నీటికి ఉన్న శక్తి అనంతం.. అప్పుడు దేవుడు "అదా కన్నీరది. ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. ఆ కన్నీటికున్న శక్తి అనంతం. పైగా మరో జీవీకి ప్రాణం పోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు. దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే." అని చెప్పింది. అయితే దేవుడు "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటి వరకూ తెలియనట్టే ఉంటుంది." అవసరమైనప్పుడు ఆ శక్తి ముందూ ఎవరూ నిలబడలేరు అని చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని. అందుకనే ఏమో} స్త్రీని పుడమితల్లితో పోల్చారు. (చదవండి: 'రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా'.. ఊపిరి సలపని పనుల్లో మహిళా శాస్త్రవేత్తలు) -
ఆత్మ అంతిమంగా ఎక్కడకు చేరుకుంటుందో తెలుసా!
ఓ సూఫీ జ్ఞాని చెప్తున్నారు...మనిషి ఆత్మ భగవంతుడి నుంచి వచ్చింది. అది చివరకు భగవంతుడినే చేరుతుంది. అది అంతిమంగా భగవంతుడిని ఎప్పుడు చేరుతుందో అప్పుడే దాని ప్రయాణం ముగుస్తుంది. అప్పటి వరకూ అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అంటే అదొక వలయం. అనేక పుట్టుకలు, అనేక మార్గాలు ఇలా ఎలాగైనా అనుకోవచ్చు. చెప్పాలంటే జీవితంలో ఏదో ఒక అన్వేషణ అంటూ ఉంటూనే ఉంటుంది. మనసు ఏదో ఒకటి కోరుతూ ఆ దిశలో పయనిస్తుంది. కానీ అది ఏది కోరుకుంటుందోఎక్కడ తృప్తి చెందుతుందో స్పష్టత ఉండదు. దీనినే ఆ జ్ఞాని ఆత్మాన్వేషణ ప్రయాణం అని చెప్పారు. ఇదంతా వింటున్న ఓ శిష్యుడికి ఓ సందేహం కలిగింది. ‘‘గురువుగారూ, ఆత్మ అంతిమంగా భగవంతుడిని చేరుకోవడంతో దాని ప్రయాణం ముగుస్తుందన్నారు కదా... అంటే ప్రతి ఒక్కరూ భగవంతుడిని చేరుకోవడమే అవుతుందిగా’’ అని అడిగాడు. ‘‘అవును... అందులో సందేహమేముంది? కాస్తంత ముందు వెనుకలు అంతే..అంతకన్నా మరొకటి కాదు... అందరూ చివరికి భగవంతుడిని చేరుకోవలసిందే’’ అన్నారు జ్ఞాని. ‘‘మరి మత పెద్దలు కొందరు మాత్రమే భగవంతుడిని చేరుకుంటున్నారని చెప్పారుగా?’’ అన్నాడు శిష్యుడు. అప్పుడు జ్ఞాని ‘‘నువ్వో పని చెయ్యి. ఊళ్ళోకి వెళ్ళి, వీలున్నంతమందిని కలిసి వారి కోరికేమిటో తెలుసుకుని రా’’ అని సూచించారు. సరేనని శిష్యుడు కొన్ని కాగితాలు, కలం తీసుకుని ఊళ్ళోకి బయలుదేరాడు.అనేకమందిని కలిశాడు. వారు ఏం కావాలనుకుంటున్నారో, వారి లక్ష్యమేమిటో అడిగాడు. వారి మనసు ఏది పొందితే తృప్తి పడుతుందో చెప్పమన్నాడు. వారు చెప్పినవన్నీ రాసుకున్నాడు. జ్ఞాని వద్దకు వచ్చాడు. ‘‘అయ్యా, ఊళ్ళో రాజు మొదలుకుని కూలీవరకూ ఎందరినో కలిసాను. వారు చెప్పినదంతా చదువుతాను వినండి’’ అంటూ మొదలుపెట్టాడు... ‘‘రాజేమో మరిన్ని దేశాలను గెలవాలనుకున్నాడు. యువరాజేమో తెలివైన యువరాణిని పెళ్ళాడాలనుకున్నాడు... ధనవంతుడేమో మరింత డబ్బు గడించాలనుకుంటున్నాడు... ఇలా ఒక్కొక్కరూ ఆశ పడుతున్నారు...’’ చెప్తుండగానే జ్ఞాని చదవడం ఆపమన్నారు. ‘‘అదంతా పోనివ్వు... వారిలో ఎంతమంది భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నారో వారి పేర్లు మొదట చదువు’’ అన్నారు జ్ఞాని. ఒక్కరు కూడా లేరన్నాడు శిష్యుడు. ‘‘అంటే నువ్వు కూడా లేవా ఆ జాబితాలో?’’ అని అతనివంక నవ్వుతూ చూశారు జ్ఞాని. శిష్యుడు తల దించుకున్నాడు. – జగద్రేణు (చదవండి: మంగళకరం) -
Patenting: ప్రకృతికి పేటెంట్ తీసుకోవచ్చా!!!
భగవంతుడు మనకు మాట ఇచ్చాడు, బుద్ది ఇచ్చాడు, ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడు... అన్న విశ్వాసం మనకు ఉండాలి. నేను ఏదో సాధించాలన్న ఉద్దేశంతోనే నాకు ఇవి బహూకరించాడు... ఎన్ని ప్రతిబంధకాలు ఎదురయినా సరే... నేను అనుకున్నది సాధించితీరతాను... అన్న పట్టుదల ఉంటే ఎంతటి నిరాశానిస్పృహలు ఎదురయినా సరే... సునాయాసంగా వాటిని దాటి... లక్ష్యాలను సాధించవచ్చు... అనడానికి – ఆత్మహత్య ఆలోచనలను వెనక్కి తీసుకుని, కష్టాలతోనే కడుపు నింపుకుని, ఒకటి కాదు, రెండు నోబెల్ బహుమతులు గెలుచుకున్న ధీర వనిత మేరీ క్యూరీ గొప్ప ఉదాహరణ. మేరీ అసలు పేరు మరియా. 1867 నవంబరు 7న జన్మించారు. పోలండ్ దేశస్థురాలు. తల్లిదండ్రులు టీచర్లు. 11వ ఏట తల్లి మరణించింది. పోలండ్ లోని రాజకీయ అనిశ్చితి వాతావరణంలో తండ్రి ఉద్యోగం పోయింది. అక్కడినుంచి కష్టాలను ఈదుకుంటూ పారిస్ చేరుకుంది. ఆ రోజుల్లో సై¯Œ ్స చదవడానికి స్త్రీలు ముందుకు రాకుండా సంప్రదాయవాదులనుండి అనేక అవరోధాలుండేవి. ఆమెకు సైన్సంటే మక్కువ, పరిశోధనలంటే ప్రాణం. ఇంటిపట్టునే ఉన్నవనరులతోనే ప్రయోగశాల పెట్టుకుంది. ప్రొఫెసర్ హెన్నీ బెకెరెల్ సాయంతో పరిశోధనలు చేసేది. ఇంచుమించు తనలాగే అనేక కష్టాలను ఓర్చుకుంటూ పరిశోధనలు సాగిస్తున్న పీరే క్యూరీతో పరిచయం, సాహచర్యం తరువాత పెళ్ళికి దారితీసాయి. అయినా కష్టాలు తీరకపోగా కలిసి అనుభవించడం అలవాటు చేసుకున్నారు. భయంకరమైన కాన్సర్ వ్యాథి చికిత్సకు తోడ్పడగల కారకాల కోసం పరిశోధనలు ముమ్మరంగా సాగుతుండేవి. రేడియోయాక్టివిటీ సిద్ధాంత అభివృద్ధికి, దాని తాలూకు పరిశోధనలకు ఆమె గురువుకి, భర్తకి, ఆమెకు కలిపి నోబెల్ బహుమతి లభించింది. ఆ తరువాత ఒక చిన్న రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త మరణించారు. తరువాత కాలంలో పొలోనియం, రేడియం మూల పదార్థాల అన్వేషణకు ఈసారి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఆమెను వరించింది. ఒక స్త్రీకి రెండుసార్లు, అదీ రెండు వేర్వేరు సబ్జెక్ట్ లలో నోబెల్ రావడం విశేషం, అపూర్వం. ఆమె సాధించిన ఫలితాలకు ఆమె కానీ, ఆమె భర్త కానీ పేటెంట్ తీసుకుని ఉంటే.... వారి వారసులు ఇప్పటి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఉండేవారు. కానీ ఆమె నిజ జీవిత సిద్ధాంతం ఏమిటో తెలుసా... ‘‘అవి (ఖనిజాలు) ప్రకృతి ఇచ్చిన వరం. అది ప్రజలది. వాటి మీద నాకేం హక్కు ఉందని పేటెంట్ తీసుకోవాలి. అందరి మేలుకోసం వాటిని నేను ఉపయోగించగలగడం నాకు జీవితంలో దక్కిన అదృష్టం... అందుకే వాటికోసం తాపత్రయపడలేదు. నిజానికి దంపతులిద్దరికీ అవార్డులు, రివార్డుల మీద ధ్యాస ఉండేది కాదు... నిరంతరం పరిశోధనలే... అవికూడా ఇంటిపట్టున ఏర్పాటు చేసుకున్న అరాకొరా సౌకర్యాలతో... సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ... ధార్మిక ప్రభావానికి ఆమె శరీరం గురయింది... చివరకు ఆమెకు కూడా కాన్సర్ సోకి, మరణానికి దారితీసింది... ఆమె పారిస్(ఫ్రా¯Œ ్స దేశం)లో స్థిరపడినా, మాతృదేశం పట్ల ఆమెకు ఎంత గాఢమైన ప్రేమంటే... తాను కనుగొన్న పదార్థాలలో ఒకదానికి తన దేశం పేరు ధ్వనించేలా పొలోనియం అని పేరుపెట్టింది. చివరకు తన మరణానంతరం ఖననానికి ముందు.. శవపేటిక తెరచి.. జన్మభూమి పోలండ్ నుంచి తెచ్చిన మట్టి చల్లాలని కోరింది. మానవాళి శ్రేయస్సుకు తపించడం తప్ప ఆమె సర్వసుఖాలను, సంపదలను దూరంగా పెట్టింది.. చివరకు కీర్తికాంక్షను కూడా. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కొందరు నేతలు ఆ వ్యాధితో బాధపడుతున్నారు.. మోదీ కూడా!: రాహుల్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాహుల్ మంగళవారం శాన్ఫ్రాన్సిస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని, అధికార బీజేపీని లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. భారత్‌లో దేవుడి కంటే ఎక్కువ తెలుసని భావించే వ్యక్తులు ఉన్నారని, ప్రధాని మోదీ కూడా ఆ కోవ కిందకే వస్తారని వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తుల సముహం తమకు ప్రతిదీ తెలుసునని భావిస్తారు. వారు చరిత్రకారులకు చరిత్రను, శాస్త్రవేత్తలకు సైన్స్, సైన్యానికి యుద్ధం వంటివి సమస్తం వివరించేయగల సమర్థులుగా భావిస్తుంటారని విమర్శించారు. అవసరమైతే దేవుడికి కూడా విశ్వంలో ఏ జరుగుతుందో వివరించేయగలరన్నారు. ఐతే ప్రపంచం చాలా పెద్దది. ఏ వ్యక్తికి సమస్తం తెలియదు. కానీ ఆయా వ్యక్తులు మాత్రం తమకే అన్ని తెలుసునన్న భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ నుంచి స్పందన రావడమే గాక తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడతూ.. రాహుల్ విదేశీ పర్యటనల్లో భారత్‌ని అవమానిస్తున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు. ప్రధాని మోదీని అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచం పెరుగుతున్న మన స్థాయిని అంగీకరిస్తున్న తరుణంలో భారత్‌ని కించపరిచే యత్నం చేస్తున్నారు. మోదీ తన విదేశీ పర్యటనలో దాదాపు 24 మంది ప్రధానులను, ప్రపంచ అధ్యక్షులను కలుసుకున్నారు. 50 కి పైగా సమావేశాలు నిర్వహించారు. మోదీ అత్యంత ప్రజాదారణ కలిగిన నాయకుడు అని పలువురు ప్రపంచ నేతలు చెబుతున్నారు. సాక్షాత్తు ఆస్ట్రేలియా ప్రధాని మోదీని బాస్ అని సంభోదించారు. ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక ఇలా వ్యాఖ్యానిస్తున్నారని కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు. (చదవండి: భారత్ జోడో యాత్ర అడ్డుకునేందుకు ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నించింది) -
మొక్కుబడి
ఇద్దరు గ్రామస్తుల మధ్యన తమలో ఎవరు గొప్ప భక్తుడనే వాదన మొదలయ్యింది. వందలాది పుణ్య క్షేత్రాలు తిరిగి వచ్చిన తను గొప్ప భక్తుడినని ఒక గ్రామస్తుడు వాదించాడు. ఎన్నో ఉపవాసాలు, వ్రతాలు, దీక్షలు చేసిన తానే నిజమైన భక్తుడని మరో గ్రామస్తుడు వాదించసాగాడు. వాదనలు తీవ్ర రూపం దాల్చడంతో గ్రామం గుండా పోతున్న ఓ గురువును వారు ఆశ్రయించారు. ‘‘మా భక్తి నిరూపించుకోడానికి ఏమైనా చేస్తాం, ఎన్ని సాహసకార్యాలైనా చేయగలం’’ అని గట్టిగట్టిగా అరిచి చెప్పారు. వారిద్దరి వాదనలూ ఓపికగా విన్నాడు గురువు. చిన్న నవ్వు నవ్వి ‘‘మీలో ఎవరు నిజమైన భక్తుడో సులభంగా తెలుసుకోవచ్చు. మీరు నాతోపాటు రండి, ఎన్నో మహిమలను చూపే దేవుడు మా ఆశ్రమంలో ఉన్నాడు. ఆ దేవుడికి మీలో ఎవరు తలనీలాలు సమర్పిస్తారో వారే నిజమైన భక్తులు’’ అని సెలవిచ్చాడు. ‘‘అదెంత పని?’’ అని వారిద్దరూ ముందుకు వచ్చారు. ‘‘అయితే మా దేవుడికి తలనీలాలు ఎవరైతే సమర్పిస్తారో వారికి ఆ తదనంతరం తల పైన ఒక్క వెంట్రుక కూడా మొలకెత్తదు. దానికి సంసిద్ధులైనవారు మాత్రమే నాతో రాగలరు’’ అని గురువు చెప్పాడు. అంతే... అప్పటిదాకా గొప్ప భక్తులమని చెప్పుకున్న ఇద్దరూ, చల్లగా అక్కడినుంచి జారుకోబోయారు. వారిని ఆపిన గురువు ‘‘భవిష్యత్తులో వెంట్రుకలు రావని చెప్పేసరికి మీరు తలనీలాలు ఇవ్వడానికే సుముఖత చూపడం లేదు. బాహ్య సౌందర్యంలో చిన్న మార్పుకు సైతం అంగీకరించని మీరు అంతః సౌందర్యంలో మార్పులకు అంగీకరిస్తారా..? నిజమైన భక్తుడు ఎప్పుడూ లాభనష్టాలు బేరీజు వేయడు. సంపూర్ణంగా తనను నమ్మి సర్వస్వ శరణాగతి కోరే వారి వెంటే దేవుడు సర్వకాల సర్వావస్థలలోనూ ఉంటాడు’’ అని వివరించాడు. తప్పు తెలుసుకున్న ఆ ఇద్దరు గ్రామస్తులు గురువును క్షమాపణ కోరారు. అమృత బిందువులు ♦ ఎవరికీ తల వంచనిది ఆత్మగౌరవం. ఎవరి ముందూ చేయి చాచనిది ఆత్మాభిమానం. ఎవరినీ కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడు ఆత్మలు కూడిన మనిషి జీవితం సఫలం. ♦ వేడినీరు ఒకటే... కాని కోడిగుడ్డును ఉడికిస్తే గట్టిపడుతుంది. ఆలుగడ్డను ఉడికిస్తే మెత్తబడుతుంది. రాగద్వేషాలు ఒక్కటే కాని ... ఆనందం కలిగినప్పుడు ఆనంద బాష్పాలు అవే. దుఃఖం కలిగినప్పుడు కన్నీటి ఓదార్పులు అవే. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
ఓ చెంచాడు అయినా లేకపోతే...
కష్టం వచ్చినప్పుడు భగవంతుడు మన పక్షాన లేడు.. అనుకుంటాం. దేముడు చల్లగా చూసాడు–అని సుఖం కలిగినప్పుడు అనుకుంటుంటాం. కానీ భగవంతుడికి ఏ పక్షపాతమూ లేదు, ఆయన ఎవరిపక్షాన ఉండడు. ‘‘దృషద్విచిత్రతల్పయో ర్భుజంగమౌక్తికస్రజో/ ర్గరిష్ఠరత్న లోష్టయోః సహృద్విపక్ష పక్షయో:/ తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః / సమప్రవత్తికః కదా సదాశివం భజామ్యహమ్.’’ కటిక నేలనుంచీ, హంసతూలికా తల్పం వరకూ, మహారాజు నుండి సామాన్యుడి వరకు, మిత్రపక్షం అనీ, శత్రుపక్షం అనీ తేడా లేకుండా అన్నిటినీ సమాన దృష్టితో చూసే ఆ సదాశివుడికి నమస్కారం.. అంటాం. వివేకానందుడు చెప్పినట్టు – ఈ ప్రపంచమంతా నీ పూజా మందిరంగా చూసే శక్తి రావాలి. భగవంతుడిని ఏమార్చి ఆయనను మన పక్షానికి తీసుకురావడం ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. ఆయన ప్రీతి పొందేది మన నడవడికనుబట్టే. మన నడవడి ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి. మనం సముద్రమంత ప్రయత్నం చేయవచ్చుగాక, కానీ ఓ చెంచాడంత భగవదనుగ్రహం ఉండకపోతే కార్యాలు సఫలీకృతం కావు. ‘ఆచార్య ప్రభవో ధర్మః. ధర్మం అనేది కేవలం పుస్తకాలలో చదువుకుంటేనో, అన్నీ నాకు తెలుసనుకుంటేనో అన్వయం కాదు. నీవు ఎంత అనుష్ఠించావో అదే ధర్మం. ధర్మాత్ముడు.. అనిపించుకోవాలంటే నీ నడవడిక మొత్తం ధర్మబద్ధంగా ఉండాలి. ఆచరించినది ధర్మం. ఆచరించనిది ఎప్పటికీ ధర్మం కాదు. అమెరికాకు అధ్యక్షులుగా చేసినవారిలో చిరస్మరణీయుడైన అబ్రహాం లింకన్ ఒక మాటన్నారు...‘‘దేముడు నీ పక్షాన ఉన్నాడా అని ఆలోచించడం కాదు, దేముడి మార్గంలో నీవు ఉన్నావా !’’ అని చూసుకొమ్మన్నారు. ఆయన బాల్యంనుంచీ అలానే బతికారు. నిరుపేద. చిన్నతనంలో ఒక దుకాణంలో పనిచేస్తుండేవాడు.. ఒక వినియోగదారుడి దగ్గర తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ సొమ్ము తీసుకున్నారు. ఆ తరువాత లెక్కలు చూసుకుంటుంటే తెలిసింది. దుకాణం మూసేసి అర్థరాత్రి వినియోగదారుడి ఇల్లు వెతుక్కుంటూ పోయి తాను ఎక్కువగా తీసుకొన్న మొత్తాన్ని ఇచ్చేసి మరీ వచ్చాడు. అదీ అనుష్ఠానం లో ధర్మం అంటే... ఈ పరిణతి ఆయన ఎంతసేపు పూజ చేసాడు, ఎంత సేపు ప్రార్థన చేసాడు.. అన్న దానినిబట్టి రాలేదు... చిన్నతనం నుంచి అదే నిబద్ధతతో బతకబట్టి వచ్చింది. మీకు ధర్మంపట్ల అనురక్తి ఉండి ఆచరించినదేదో అదే ధర్మం. అదే సదాచారం. ధర్మంపట్ల అనురక్తి లేకుండా స్వప్రయోజనం చూసుకుంటే అది దురాచారం. ఎక్కడ సదాచారం ఉన్నదో అక్కడ భగవదనుగ్రహం ఉండి తీరుతుంది. ఎక్కడ సదాచారం లేదో అక్కడ దేముని కృప ఎలా సాధ్యం! నీకు ఆకలేస్తే నువ్వే తినాలి. నీకు నిద్రవస్తే నీవే నిద్రపోవాలి. అలాగే నీ నడవడికలో దోషాలను నీవే దిద్దుకోవాలి. సదాచారం పెరుగుతూ ఉండాలి, దురాచారం తగ్గుతూ పోవాలి. ధర్మం చెప్పేది కూడా... నీవు నన్ను కాపాడు.. నేను నీ పక్షాన ఉండి నిన్ను కాపాడతా...అనే. -
పరలోక సాఫల్యం దిశగా...
సృష్టిలోని ప్రతి జీవికీ మరణం తప్పదు. ఇది సృష్టిధర్మం, ఎవరూ తిరస్కరించలేని సత్యం. నాస్తికులూ, ఆస్తికులూ అందరూ మరణాన్ని నమ్ముతారు. దేవుడున్నాడా అనే విషయంలో భేదాభి్రపాయాలున్నాయి గాని, మరణం ఉందా.. లేదా..? అనే విషయంలో ఎటువంటి భిన్నాభిప్రాయమూ లేదు. కాని,‘మరణం తథ్యం’ అని తెలిసినా మనం దాన్ని పట్టించుకోం. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు,స్నేహితులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతోమంది ప్రతిరోజు ఎక్కడో ఒకచోట పోతూనే ఉన్నారు. మనం వారి అంత్యక్రియల్లో పాల్గొని, స్వయానా మన భుజాలపై మోసి, సమాధిలో దించి, స్వహస్తాలతో వారిపై మట్టికప్పి వస్తున్నాం. వారు సంపాదించిన ఆస్తిపాస్తులు, ఆభరణాలు, హోదా, అధికారం ఏదీ వారు తమవెంట తీసుకు వెళ్ళడం లేదు. రిక్తహస్తాలతో వచ్చారు. అలానే వెళ్ళిపోతున్నారు. పవిత్ర ఖురాన్ ఇలా అంటోంది: ‘ఈ ్రపాపంచిక జీవితం ఒక ఆట, వినోదం తప్ప మరేమీ కాదు. అసలు జీవితం పరలోక జీవితమే. ఈ యథార్థాన్ని వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండు’ (29–64) అందుకని ప్రపంచమే సర్వస్వంగా బతక్కూడదు. ధర్మాధర్మాల విచక్షణ పాటించాలి. మంచి పనులు చేయాలి. రేపు మనల్ని కాపాడేవి ఇవే. ఎందుకంటే, మనం సంపాదించిన డబ్బూదస్కం, ఆభరణాలు, ఆస్తిపాస్తులు సమస్తం ఊపిరి ఆగిన మరుక్షణమే మనతో సంబంధాన్ని తెంచుకుంటాయి. భార్యాబిడ్డలు, బంధుగణం, మిత్రబృందం... వీరంతా మనల్ని సమాధి వరకు మాత్రమే సాగనంపుతారు. సమాధిలో దించి, మట్టిలో కలిపేసి వెళ్ళిపోతారు. మన వెంట వచ్చేది, కాపాడేది కేవలం మనం చేసుకున్న మంచి పనులు మాత్రమే. అడ్డదారులు తొక్కి, వారినీ వీరినీ వంచించి సంపాదించేదంతా సుఖమయ జీవితం కోసమేగదా.. రేపటి మన సంతోషం, మన పిల్లల భవిష్యత్తు కోసమేగదా? అక్రమ సంపాదనలో నిజమైన సంతోషం ఉండకపోగా, అది ఎప్పుడూ మనసులో కెలుకుతూనే ఉంటుంది. అయినా అంతరాత్మను అణగదొక్కి అడ్డదారికే ్రపాధాన్యతనిస్తాం. కేవలం కొన్ని సంవత్సరాల ్రపాపంచిక జీవితం కోసమే ఇంతగా ఆలోచించే మనం, మరి శాశ్వతమైన రేపటి (పరలోకం) కోసం ఏం సంపాదిస్తున్నామన్నది కూడా ఆలోచించాలి. ఈ ‘రేపు’ మూన్నాళ్ళ ముచ్చట. కాని ఆ ‘రేపు ‘శాశ్వతం. దానికోసం ఏం చేస్తున్నాం.. ఏం దాస్తున్నాం? ఇదికదా అసలు ప్రశ్న. ఇహలోక జీవితం ఎలా గడిచినా పరలోక సాఫల్యం లభిస్తే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. దానికోసం ఆలోచించాలి. దానికోసం శ్రమించాలి. మంచీ చెడుల విచక్షణతో, ధర్మబద్ధంగా ముందుకు సాగితే, ఆ క్రమంలో ఎంత లభిస్తే అంతతో సంతృప్తి చెందితే అదే అసలు విజయం, అసలు సాఫల్యం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
భయం నుండి విడుదల
కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును (సామె 1:33). మానవుని పట్టి పీడుస్తున్న అనేక భయాల్లో ఒకటి ‘భవిష్యత్తును గూర్చిన భయం’. తనకు వచ్చే రోగాల్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, గత జీవితాన్ని గురించి భయపడేది కేవలం పది శాతమైతే మిగతా తొంభైశాతం భయం భవిష్యత్తులో ఏం జరగబోతుంది... అనే దానిపై ఆధారపడి ఉంటుందని మానసిక శాస్త్రవేత్తల వివరణ. భవిష్యత్తును గూర్చి తెలీదు గనుక దాని గురించి భయపడడం సహజం. అయితే కొందరు ప్రతి చిన్నదానికి భయపడి తమ చుట్టూ ఉన్నవారిని భయపెడుతుంటారు. దినదినం మానవుడు భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నాడన్నది వాస్తవ దూరం కాదు. భయంతో మనిషి తన జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాడు. ఆనందమయం చేసుకోలేకపోతున్నాడు. భయం మనిషిలో ఉన్న స్వాభావిక ధైర్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. భయం వలన మానవుడు తాను చేయాలనుకున్న పనులు చేయలేడు. అనేక మంచికార్యాలను నిలువరించే శక్తి భయానికి మాత్రమే ఉంది. భవిష్యత్తు చాలా అందమైనది. సర్వశక్తుడైన క్రీస్తులో అది సురక్షితమైనది. భవిష్యత్తు మీద ఉన్న ఆశలను నిర్వీర్యం చేసేది నీలో ఉన్న భయమే. జీవితంలో కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని నిర్దిష్ట పరిధుల్లో భయం ఉండడం సహజమే కానీ కొంతమంది భయకారణం లేని చోట కూడా విపరీతంగా భయపడుతూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణాల్లో ఒకటి మనిషిలో ఉన్న భయాన్ని పోగొట్టుట. రాత్రివేళ తమ మందను కాచుకొంటున్న గొర్రెల కాపరులకు ఇయ్యబడిన వాగ్దానం భయపడకుడి. వారికున్న భయం బహుశా ఇంకెంత కాలం ఈ గొర్రెలను మేపుతూ ఉండాలి? వాటిని ప్రజల పా పపరిహారార్థమై దేవాలయానికి తరలించాలి? దూత చెప్పిన వర్తమానం వారి కోసం రక్షకుడు వచ్చాడు. ఆయన సర్వలోక పా పా న్ని మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని వాక్యమైన బైబిల్లో అనేకచోట్ల భయపడకుడి అనే వాగ్దానం స్పష్టంగా కనిపిస్తుంది. మనిషి గుండెల్లో గూడు కట్టుకుపోయిన భయాన్ని రూపుమాపడానికే దేవుడు ఈ లోకానికి అరుదెంచాడు. ఆయన ధైర్యవంతుడు గనుకనే ఆయనలో ఉన్న ధైర్యాన్ని ఉచితంగా మనకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే ‘దేవుడు నాకు వెలుగును రక్షణయునై యున్నాడు నేను ఎవరికి భయపడుదును’ అని దావీదు వలే నువ్వు కూడా చెప్పగలవు (కీర్తన 27:1). శత్రువులతో తరుమబడినప్పుడు తల దాచుకోవడానికి కూడా అవకాశం లేని సందర్భాల్లో దేవునియందు విశ్వాసముంచి తనలో ఉన్న ప్రతి భయాన్ని జయించిన దావీదు ధన్యజీవిగా మారాడు. నీవు దేవునియందు నమ్మికయుంచి ధైర్యంతో ముందుకు సాగిపో మిత్రమా! – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు.. తొలిసారి స్పందించిన పాకిస్తాన్ మాజీ ప్రధాని
లాహోర్: పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ గురువారం పార్టీ ర్యాలీలో తనపై జరిగిన హత్యాయత్నం అనంతరం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి స్పందించారు. తనకు దేవుడు మరో జీవితాన్ని(పునర్జన్మ) ఇచ్చాడని వ్యాఖ్యానించారు. అల్లా మరో అవకాశం ఇచ్చారని, తన పోరాటాన్ని తిరిగి కొనసాగిస్తానని పేర్కొన్నారు. అంతేగాక తనపై జరిగిన దాడికి ఎవరినీ నిందించడం లేదని అన్నారు. కాగా ఇమ్రాన్ ఖాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో కంటైనర్ ట్రక్కుపై నిల్చొని మాట్లాడుతుండగా గుర్తు తెలియని యువకుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇమ్రాన్ రెండు కాళ్లకు బుల్లెట్ తగిలి గాయం కాగా.. పీటీఐ పార్టీకి చెందిన పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వీరిని లాహోర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: సుదీర్ఘకాలంగా కరోనాతో పోరాటం.. 411 రోజుల తర్వాత విముక్తి Footage of the firing. Assassination attempt on Imran Khan. pic.twitter.com/fmSgI2E8jc — Ihtisham Ul Haq (@iihtishamm) November 3, 2022 ఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకే ఇమ్రాన్ ఖాన్‌ను చంపేందుకు వచ్చానని నిందితుడు తెలిపాడు. ఇమ్రాన్‌ను మాత్రమే చంపాలని ప్రయత్నించానని.. ఇంకెవరిని కాదని అన్నాడు. తాను ఏ పార్టీకి, ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడిని కాదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ కుడి కాలుకి గాయంతో పట్టి వేసుకొని ఆసుపత్రి బెడ్‌పై పడుకొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో అతను కళ్లు తెరిచి ఎవరితోనే చిన్నగా మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. చదవండి: Imran Khan Rally: ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో ఫైరింగ్.. నలుగురికి గాయాలు -
‘నిజం తెలుసుకున్నా, ఆ కంపెనీ నాకొద్దు’.. ఊహించని షాకిచ్చిన బిలియనీర్!
వ్యాపారస్తులు ఉన్నత శిఖరాలకు చేరి బిలియనీర్లుగా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఇక్కడి వరకు వారి పయనం ధనార్జన, పేరు ప్రఖ్యాతలంటూ ఒకేలా ఉన్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర సంపాదన మాత్రమే జీవితం కాదని కొందరు తెలుసుకుంటున్నారు. అందుకే చాలా మంది ధనవంతులు ఛారిటీలకు, సామాజిక అభివృద్ధి వంటి కార్యక్రమాలకు వారి సంపదను ఖర్చు పెడుతుంటారు. ఇంకొందరు మరో అడుగు ముందేసి తమ ఆస్తిలో సగం భాగం లేదా మొత్తం కూడా ఇచ్చేస్తుంటారు. తాజాగా ఒక సంపన్నుడు తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం! యూఎస్ లోని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చైన్ హాబీ లాబీ (Hobby Lobby) వ్యవస్థాపకుడు డేవిడ్ గ్రీన్ తాను ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సంపదను శాపంగా పేర్కొన్నారు. అందుకే తన కంపెనీని వదులుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కి గురిచేశారు. తన కంపెనీని విడిచి పెట్టడంపై స్పందిస్తూ తాను కేవలం నిర్వాహకుడినేనని.. తన వ్యాపారానికి దేవుడే నిజమైన యజమానని నిజం తెలుసుకున్నాని, దాని ఫలితమే ఈ నిర్ణయమని చెప్పారు. తన విజయానికి తన విశ్వాసమే "నిజమైన మూలం" అని వివరించాడు. యజమానిగా, కంపెనీని విక్రయించే హక్కుతో సహా కొన్ని హక్కులు, బాధ్యతలు కూడా ఉన్నాయన్నారు. అయితే తన కంపెనీ విస్తరించే కొద్దీ, ఆ ఆలోచన తనని మరింత బాధపెట్టడం ప్రారంభించిందని తెలిపాడు. ఇంకా చెప్పాలంటే సంపద ఓ రకంగా శాపంలాంటిదని అభిప్రాయపడ్డాడు. అయితే గ్రీన్ తన కంపెనీని ఎలా వదులుకుంటున్నాడు అనే వివరాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. అయితే గత వారం ఫాక్స్ & ఫ్రెండ్స్ వీకెండ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంపెనీ ఓటింగ్ స్టాక్‌లో 100% ట్రస్ట్‌కు తరలించబడిందని ఆయన చెప్పారు. చదవండి: ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా -
తలనరుక్కుని.. చేతిలో పట్టుకుని..
సాక్షి, హైదరాబాద్: దేవుడిని చేరేందుకు ఆత్మార్పణ చేసుకునే వీరభక్తిని తెలిపే ఆత్మార్పణ శిల్పాలు రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూశాయి. ఆత్మార్పణ శిలలు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బయటపడినా.. ఇవి తల నరుక్కుని చేతిలో పట్టుకున్నట్టుగా ఉన్న అరుదైన శిల్పాలు కావటం విశేషం. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు యాదేశ్వర్ దండేకర్ వీటిని రాచకొండ గుట్టల్లో గుర్తించారని ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. జిల్లాలోని మంచాల మండలం లోయపల్లి సోమన్నగుట్ట వద్ద ఐదు ఆత్మాహుతి శిల్పాలు వెలుగు చూశాయని తెలిపారు. వీటిలో వీరులు అంజలిఘటిస్తూ కూర్చుని ఉండగా, వారి కీర్తి ఆచంద్రతారార్కం అని చెప్పేందుకు గుర్తుగా తలపై సూర్య, చంద్రుల చిత్రాలున్న రెండు శిల్పాలున్నాయన్నారు. ఇక తలలు నరుక్కుని చేతిలో పట్టుకున్నట్టు మరో రెండు శిల్పాలున్నాయని, అందులో ఒకటి ధ్వంసమైందని చెప్పారు. ఇవి చాళుక్యుల శైలిలో ఉన్నాయని, 14–15 శతాబ్దాలకు చెందినవై ఉంటాయని వివరించారు. -
భరతమాత కొలువైన గుడి
గౌరిబిదనూరు: దేశంలో ముక్కోటి దేవీ దేవతలకు ఆలయాలు, ప్రఖ్యాత దేవస్థానాలు ఉన్నాయి, కానీ భరతమాత పేరుతో ఉన్న మందిరాలు ఎక్కడా కనిపించవు. దేశమాత విగ్రహ రూపంలో కొలువై పూజలందుకుంటున్న మందిరాన్ని చూడాలంటే గౌరిబిదనూరుకు వెళ్లాల్సిందే. దక్షిణ భారతదేశపు జలియన్ వాలాబాగ్‌గా ప్రసిద్ధి చెందిన విదురాశ్వత్థానికి సమీపంలో ఉన్న నాగసంద్ర గ్రామంలో 2008లో భారతమాత దేవాలయం వెలిసింది. కృష్ణశిలలో హిందూపురానికి చెందిన శిల్పి నాగరాజు 6 అడుగుల భరతమాత విగ్రహాన్ని చెక్కారు. జాతీయ జెండాను పట్టుకుని జెండా దర్శనమిస్తుంది. జనవరి 26, ఆగస్టు 15కు ప్రత్యేక పూజలు దేవాలయం పై కప్పున దేశ నాయకుల చిత్రాలు, బొమ్మలు స్ఫూర్తిని నింపుతాయి. కిత్తూరు రాణి చన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాస్ చంద్రబోస్ తదితరుల బొమ్మలను చెక్కారు. ఏటా ఆగస్టు 14 అర్ధరాత్రి దేశభక్తియుత ప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీ. స్థానిక నాయకుడు రవి నారాయణరెడ్డి భరతమాత ట్రస్ట్ ఏర్పరచి ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయంలో భరతమాతకు నిత్య పూజలు నిర్వహిస్తూ, గణతంత్ర దినోత్సవం, ఆగస్టు 15న విశేష పూజలు జరుపుతారు. (చదవండి: చిన్నవాణ్ణని వదిలేశారు) -
బీజేపీ ఎమ్మెల్యేకి బురద స్నానం చేయించిన మహిళలు
Women soak BJP MLA in mud: తెలుగు రాష్ట్రాలు కుండపోత వర్షాలతో ఇబ్బంది పడుతుంటే ఉత్తరప్రదేశ్‌లో వర్షం కురవాలంటూ వింతవింత పూజలు చేస్తున్నారు. వాన దేవడుని ప్రసన్నం చేసుకోవడం కోసం యూపీలోని మహారాజ్‌గంజ్ నివాసితుల బురద స్నానం చేస్తారట. ఇది వారి పురాతన ఆచారం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. వర్షం రాక కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే యూపీలోని పిప్రదేయోరా మహిళలు బీజేపీ ఎమ్మెల్యే జై మంగళ్ కనోజియాకు, మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌లకు బురద స్నానం చేయించారు. ఇలా చేస్తే వాన దేవుడు ఇంద్రుడు సంతోషించి పట్టణాన్ని వర్షంతో ఆశీర్వదిస్తాడని వారి నమ్మకం. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే జై మంగళ్ కనోజా మాట్లాడుతూ...ఎండల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ పూజలో పాల్గొన్నానని చెప్పారు. ఈ వాతావరణంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది పాత నమ్మకం పైన ఆధారపడిన ఆచారం కాబట్టి ఇందులో భాగం కావాలని నిర్ణయించుకున్నాం అని చెప్పుకొచ్చారు. (చదవండి: పాక్ జర్నలిస్ట్ ఆరోపణలు.. స్పందించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి) -
అమ్మవారి హుండీల్లో ఫారిన్ కరెన్సీ
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ఆదాయాన్ని బుధవారం స్థానిక శివాలయం వీధిలో ఉన్న పైడితల్లి అమ్మవారి కల్యాణ మంటపంలో లెక్కించారు. 90రోజులకు సంబంధించి చదురుగుడి, వనంగుడి హుండీల్లో సమకూరిన ఆదాయాన్ని లెక్కించగా వాటిలో ఫారిన్ కరెన్సీని అమ్మవారికి భక్తులు కానుకలుగా అందజేశారు. 18 డాలర్స్ యుఎస్ఏ కరెన్సీ, పది సింగపూర్ డాలర్స్, కువైట్‌కు ఒక దినార్, యుఏఈకి చెందిన 10 దిర్హమ్స్, నేపాల్‌కు 10 రూపీస్ విదేశీ కరెన్సీని ఆదాయం లెక్కింపు సందర్భంగా హుండీల్లో గుర్తించినట్లు ఆలయ ఈఓ బీహెచ్‌వీఎస్‌ఎన్ కిశోర్ కుమార్ వెల్లడించారు. చదురుగుడి హుండీల నుంచి రూ.35 లక్షల 18వేల 290 నగదు, 50 గ్రాములు 100 మిల్లీగ్రాముల బంగారం, 601 గ్రాముల వెండి లభించాయన్నారు. అలాగే వనంగుడి హుండీల నుంచి రూ.7 లక్షల 13వేల 082 నగదు, ఒక గ్రా ము 40 మిల్లీగ్రాముల బంగారం, 45 గ్రాముల వెండి లభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పైడితల్లి భక్తబృందం సేవా సమితి సభ్యులు, పాలకమండలి సభ్యులు, కెనరా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది) -
మంచి మాట: ఆధ్యాత్మికత అంటే..?
‘దేవుణ్ణి మీరు చూశారా..?’ అని ప్రశ్నించాడో యువకుడు ఒక సాధకుణ్ణి. చురుకైన కళ్ళు.. తీక్షణమైన చూపులు. గిరజాల జుట్టు.. దానిలో కొన్ని వంకీలు అతని విశాల ఫాలభాగాన నర్తిస్తుండగా. ‘ఆ“చూసాను’. అన్నాడాయన చిరునవ్వుతో. ‘చూశారా..!?’ అన్నాడా యువకుడు తన అనుమానానికి అపనమ్మకాన్ని జోడిస్తూ. ‘చూశాను. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా’ అన్నాడాయన మరింత ప్రశాంతంగా నవ్వుతూ. ఆ మాటలకు ఆ యువకుడు విభ్రాంతుడే అయ్యాడు. ఆ సాధకుడి గొంతులో ధ్వనించిన విశ్వాసం.. నమ్మకం.. సూటిదనం.. అతణ్ణి ఒక నిమిషంపాటు ఆపాదమస్తకాన్ని కంపింప చేసింది. ఇంతకుముందు తను కలసిన సాధకుకులు.. యోగులు.. గురువులు... అందరూ కూడా దేవుణ్ణి చూడలేదనే చెప్పారు. ఆ దేవదేవుని సాక్షాత్కారానికి తపస్సు చేస్తూనే ఉన్నామన్నారు. ఒకవేళ ఒకరిద్దరు చూశామని చెప్పినా ఇంత గట్టిగా.. విశ్వాసంతో చెప్పలేదు. ఇందుకే ఆ వంగ దేశీయుడికి ఆ పరమహంస మీద గురి.. ఏర్పడింది. అందుకే ఆయనను గురువుగా అంగీకరించాడు. ఆ పై ఆ గురుశిష్యులిరువురూ ఎంత విశ్వవిఖ్యాతులయ్యారో లోకవిదితమే. దేవుణ్ణి చూశామన్న వారెవరైనా ఆయన భావనను, తత్వాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారని అర్థం. దేవుడి సర్వాంతర్యామిత్వ భావనను గ్రంథాలనుండి గ్రహించటమే కాదు, దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ సకల చరాచరసృష్టిలో ప్రతి జీవిలో చూడగలగటం. ప్రత్యక్షంగా చూసి అనుభవంగా చేసుకోవటమే కదా! ఆ పరమహంస.. నిన్ను చూసినంత బాగా చూశాను’ అని చెప్పటంలో అదే అర్థం. ‘ఇందు గలడందు లేడని సందేహం వలదు..’ అన్న పద్య సారాంశ మదే కదా. తన ఎదురుగా తను ఆరాధిస్తున్న విగ్రహమే దేముడు.. అయన ఉనికి ఇక్కడే.. ఈ నాలుగు గోడల మధ్యే అన్న ఆలోచనా పరిధి.. పరిమితులనుండి నుండి మనిషి బయటకు రానంతకాలం.. రాకూడదనుకున్నంత కాలం ఆ సర్వాంతర్యామిత్వాన్ని బుద్ధికే పరిమితం చేసుకున్నాడు. అంతే కానీ మనస్సులో ఆ భావనను ప్రతిష్టించుకోలేకపోయాడు. నిజమైన ఆధ్యాత్మికమార్గానికిది పెద్ద అవరోధం. భావన.. అనుభూతి.. దృష్టి ఈ మూడింటిని ఆధ్యాత్మికపథంలో పయనించాలనుకున్న వారు తప్పనిసరిగా అలవరచుకోవలసిన లక్షణాలు. అనేక శాస్త్రాలు.. కావ్యాలు.. వేదాంత గ్రంథాలు చదివిన ఓ పండితుడు గంగానదిలో స్నానమాచరించి తన పాప ప్రక్షాళన చేసుకోవాలన్న తన జీవితేచ్ఛను జీవిత చరమాంకంలో కాని తీర్చుకోలేకపోయాడు. ‘ఈ గంగానదికి పాపాలను పరిహరించే మహత్తు నిజంగా వుందా..? అన్న అనుమానం మదిలో మొలకె త్తింది. తత్ఫలితంగా సద్గతులు కొంచెం ఆలస్యంగా ప్రాప్తించాయి. కారణం..!? భావన, అనుభూతి. అయితే ఈ పండితుడి పలుకుల మీద విశ్వాసముంచి మామూలు నదిలో స్నానం చేసిన సాధారణ వ్యక్తి ఆ పండితుడికన్నా ముందుగా సద్గతులు పొందాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకునేవారికి ఉండవలసిన ప్రథమ లక్షణం భావన.. అనుభూతి.. విశ్వాసం. మన భౌతికావసరాలు, బాధ్యతలు నెరవేర్చటం కోసం ఏదో ఒక వృత్తినో .. ఉద్యోగాన్నో.. పొంది డబ్బు సంపాదించాలి. భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని పోషించాలి. ఇది ప్రధాన బాధ్యత. ఇది కాని జీవితం ఇంకేమైనా ఉందా? ఇదే జీవిత పరమార్థమా? మనిషి ఈ చింతన చేయటానికి తన అంతరంగంలోకి చూడగలగాలి. తన మనస్సును న్యాయాధీశుని చేసుకుని తను చేసే పనుల మంచి చెడులను ప్రశ్నించుకోవాలి. ఆలోచనలను, ప్రవర్తనను సింహావలోకనం చేసుకోవాలి. తను ఎంతవరకు నిజాయితీగా.. న్యాయబద్ధతతో.. ప్రవర్తిస్తున్నాడు? నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాడా..? ఎదుటివారికి చేయగలిగిన మేలు చేస్తున్నానని కీడు చేయటంలేదు కదా..! ఇటువంటి ప్రశ్నలు తానే తన మీద సంధించుకోవాలి. వీటికి సంతృప్తికరమైన సమాధానాలు ఎవరు పొందగలరో వారు నిస్సందేహంగా చక్కని, ఆదర్శవంతమైన జీవితాన్నే గడుపుతున్నట్టే. ఈ పరిశీలన.. శోధనకే అంతర్ముఖత్వమని పేరు. ఆధ్యాత్మికతకు ఇదొక ముఖ్యమైన లక్షణమే కాదు కాదు, ఖచ్చితంగా ఉండవలసినది. ఇది ఆస్తికులకైనా, నాస్తికులకైనా.. ఆ మాట కొస్తే మనిషన్న వాడికెవడికైనా వర్తిస్తుంది. ఏ మత విశ్వాసానికైనా అన్వయించుకోతగ్గది, అందరికీ అభిలషణీయమైనదీ మార్గం. ఈ అంతరంగ యానం.. లోచూపు ఎవరైతే అలవరచుకుంటారో వారు జీవితాన్ని సరిగా అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. సరైన రీతిలో మలచుకుంటున్నారని అర్థం. ధనం వల్ల ఇహంలో మనం పొందే భౌతికమైన, ఉన్నతస్థితి కాక.. ఇంకా ఎంతో ఉన్నతమైన స్థితికి చేరినట్టు. కొందరు భౌతికపరమైన విషయాలను పక్కకు పెట్టి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండి అంతర్ముఖులు కాబోతున్నామని ప్రకటనలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నం చేయనే చేయరు. మన మనస్సు తీరు.. గతి.. ఆలోచనా పద్ధతి.. మన వ్యక్తిత్వాన్ని ఒక అంచనా వేసుకుని మన జీవితాన్ని, మన ఆలోచనా ప్రవాహన్ని క్రమబద్దీ కరించుకునేందుకు మన మనస్సు చెప్పే సంగతులు తెలుసుకోవాలి. సరిగా లేకుంటే దిద్దుకోవాలి. ఇందుకు అంతర్ముఖత్వం ప్రతి ఒక్కరికీ అవసరం. మానవ మేధ, శక్తియుక్తులకు పరిధులు, పరిమితులున్నాయని, ఆ మానవాతీత శక్తి భగవంతుడని సర్వశక్తిమంతుడని. సర్వవ్యాపకుడని, అతడివల్లే ఇంతటి సృష్టి జరిగిందని భావించే వారున్నారు. వారు అతడినే కేంద్ర బిందువు చేసుకుని తమ అంతర్ముఖ ప్రయాణపు తొలి.. ఆఖరి అడుగు అతడితోనే ముగిస్తారు. కొందరు ప్రకృతి పరిణామక్రమంలో ఏర్పడ్డదీ సృష్టి అంటూ ఒక మానవాతీత శక్తి వుందని అంటారు. కానీ దాన్ని భగవంతుడుగా భావన చేయరు. వీరిరువురూ కూడ అంతర్ముఖత్వానికి పెద్దపీట వేస్తారు. మనిషి మహాత్ముడు కాకపోయినా మనిషి గా నిలబడటానికి ఇది అవసరమని ఇద్దరూ ఏకీభవిస్తారు. జీవితం అర్థవంతమైనదవ్వాలంటే ఇది అత్యంత అవసరమైనదని ఇద్దరూ అంగీకరిస్తారు. ఈ ఆధ్యాత్మిక చింతన లేదా అంతర్ముఖత్వం ఒక సత్యాన్వేషణ. ఒక సత్యశోధన. మనలోని చైతన్యాన్ని తెలుసుకోవటం. జీవితాన్ని అర్థం చేసుకుని, దాని పట్ల ఉన్న భయాందోళనలు తొలగి నిర్భయులమై స్వేచ్ఛానందాలను పొందాలంటే ప్రతి ఒక్కరూ అంతర్ముఖులు కావాలి. ఆధ్యాత్మిక చింతనంటే కేవలం భక్తి ఒక్కటే కాదు. దానికి భావన..అనుభూతి.. విశ్వాసం.. వీటిని చేర్చాలి. ఆధ్యాత్మికత అంటే పెదవులతో దేవుడి నామాన్ని పలకటమే కాదు. భగవంతుడి రూపాన్ని అన్నిచోట్లా.. అందరిలోనూ చూడగలగటం. మన ఆణువణువునా ఆ భావనను పొందుపరచుకోవటం. అపుడే మనం ఆయన సర్వాంతర్యామిత్వాన్ని విశ్వసించినట్టు! ఆధ్యాత్మికత అంటే మనం నమ్మిన దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ దశకు చేరు కోవటమంటే నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టే. ఆధ్యాత్మికత తొలి మెట్టు ఇదే కావాలి. భగవంతుని తత్వాన్ని మనసులో నిలుపుకుని తోటివారితో ఎవరైతే చక్కగా సంభాషిస్తారో... అభాగ్యుల.. అనాథల మీద కరుణ, ప్రేమ చూపిస్తారో.. కష్టాలలో ఉన్నవారిని ఆదుకుంటున్నారన్న విషయాలకు ఎవరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారో వారు నిజమైన ఆధ్యాత్మికపరులు. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
బిడ్డ పుట్టిన రోజే అమ్మకు కూడా పుట్టినరోజు
అమ్మ సృష్టికర్త. అమ్మ తన కడుపును గర్భాలయం చేసి మరణ సదృశమైన వేదనను పొంది బిడ్డకు జన్మనిస్తుంది, అందుకే ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మకు కూడా పుట్టిన రోజే. బిడ్డ అమ్మ శరీరంలో అంతర్భాగం. ఈవేళ మనకున్న శరీరం అమ్మ కడుపులో పుట్టి పెరిగిందే కదా! పుట్టినది మొదలు మల మూత్రాదులను శుభ్రం చేసి, పెంచి పెద్దచేసి, ఆఖరి ఊపిరిలో కూడా పిల్లలు కష్టపడకూడదని, తాను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పైకి చెప్పకుండా పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ తన ఆయుర్దాయం కూడా పిల్లలకు ఇవ్వమని ప్రార్థించే అమ్మ లాంటి వ్యక్తి ఈ లోకంలో మరొకరు ఉండరు. అమ్మే ఈ శరీరాన్ని ఇవ్వకపోతే మనకు ఈ శరీరం ఎక్కడిది ? మన సుఖ సంతోషాలకు మన కీర్తిప్రతిష్ఠలకు మూలమయిన ఈ శరీరం అమ్మ ప్రసాదించిందే. అమ్మను మించిన దైవం ఎక్కడుంది? అందుకే వేదం మొదటి నమస్కారం అమ్మకు చేయించింది– మాతృదేవోభవ–అని. మిగిలిన అందరికీ పుట్టిన రోజు ఒక్కటే కానీ అమ్మకు మాత్రం తాను స్వయంగా జన్మించిన రోజున ఒక పుట్టిన రోజుతోపాటూ, ఎంతమంది బిడ్డల్ని కంటుందో ఆమెకు అన్ని పుట్టినరోజులుంటాయి. అంటే అమ్మకు ఇద్దరు బిడ్డలుంటే మూడు పుట్టినరోజులుంటాయి. స్త్రీగా తన పుట్టినరోజును భర్త వేడుకగా చేస్తే, మిగిలిన పుట్టిన రోజులను బిడ్డలు తమకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞతగా మొదట ఆమెకు కొత్త బట్టలు పెట్టి తరువాత తాము వేసుకుని వేడుక చేసుకోవాలి. స్త్రీగా కూడా ఆమె పుట్టిల్లు, అత్తవారిల్లు... రెండింటి క్షేమాన్నీ ఆకాంక్షిస్తుంది. తల్లిగా రెండు వంశాలను తరింప చేస్తుంది. ధర్మపత్నిగా పురుషుడికి యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణకు అర్హుడిని చేస్తుంది. భగవంతుడు ఎక్కడో ఉండడు, అమ్మరూపంలోనే మనకు అందుబాటులో ఉంటాడు. అందుకే బద్దెనగారు ‘‘నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడువులకెల్లన్/నారియె నరులకు రత్నము/ చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ!’’ అన్నారు. మనుషులలో రత్నం అంత గొప్పది స్త్రీ అంటున్నారు. అలాగే ‘చీరయె శృంగారమండ్రు...’ అన్నారు. చీర అంటే స్త్రీలు ధరించేదని కాదు. రాముడు నార చీరెలు కట్టుకున్నాడు అంటారు. చీర– అంటే వస్త్రం. శృంగారం అంటే పరమ పవిత్రమయిన అలంకరణ, శుద్ధమయినది... అని! కట్టుకున్న బట్టను బట్టి మనిషి జీవన విధానం తెలుస్తుంటుంది. వేల ఖరీదు చేసే వస్త్రాలే కట్టుకోవాలనే నియమం ఏదీ ఉండదు. ఏది కట్టుకున్నా బట్ట పరిశుభ్రంగా, ప్రకాశవంతంగా ఉండాలి. నిజంగా కష్టంలో ఉండి నిస్సహాయ పరిస్థితుల్లో తప్ప మనిషి ఎప్పుడూ పరిశుభ్రమైన వస్త్రాలనే ధరించాలి. పిల్లలు మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి బట్టలు వారు శుభ్రం చేసుకోవడం చిన్నప్పటినుండే అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మీకు పరిశుభ్రత మీద ఆసక్తి పెరగడమే కాక, అమ్మ కష్టాన్ని కూడా తగ్గించిన వారవుతారు. మన సంప్రదాయం ప్రకారం బయట ఎక్కడికి వెళ్లి వచ్చినా ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి, బయట తిరిగొచ్చిన బట్టలు మార్చుకోవాలి. విడిచిన బట్టలు, తడి బట్టలు ఇంట్లో ఎక్కడంటే అక్కడ కుప్పలుగా వేయకుండా వాటి స్థానాల్లో వాటిని ఆరేయడమో, తగిలించడమో చేయాలి. అది మన శరీరానికి, పరిసరాలకే కాదు, మన ప్రవర్తనకు, మన శీలానికి, మన వ్యక్తిత్వానికి అలంకారం. అది మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. బద్దెన గారు చెప్పినవి చిన్నచిన్న మాటలే అయినా మన జీవితాలను చక్కటి మార్గంలో పెట్టే సూత్రాలు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బయపరెడ్డీ అని కేక వేస్తే.. ఒకరు కాదు.. పది మంది వస్తారు.. ఎందుకంటే?
ప్యాపిలి(కర్నూలు జిల్లా): ఆ గ్రామంలోకి వెళ్లి బయపరెడ్డీ అని కేక వేస్తే పది మంది వస్తారు. ఎందుకంటే ఆ ఊరిలో ఆ పేరుతో ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది ఉన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి సైతం అదే పేర్లు ఉన్నాయి. ప్యాపిలి మండలం నల్లమేకలపల్లి గ్రామ విశేషం ఇది. గ్రామంలో వివిధ కులాలకు చెందిన 1,500 మంది నివాసం ఉంటున్నారు. వీరిలో రెడ్డి కులస్తులు 380 మంది ఉన్నారు. బోరుబావుల కింద అరటి, జామ, టమాట తదితర పంటలు సాగు చేస్తున్నారు. చదవండి: ఆరేసుకోబోయి పారేసుకున్న బీజేపీ నేతలు.. వీడియో వైరల్ వైఎస్సార్ జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లి గ్రామంలో వెలసిన భైరవేశ్వర స్వామిని వీరు ఇంటి దేవుడిగా కొలుస్తారు. స్వామిపై భక్తితో బయపరెడ్డి అనే పేరు పెట్టుకోవడం పూర్వం నుంచి ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలోని రెడ్డి కులస్తుల ఇంట్లో ఈ పేరు పెట్టుకోవడం విశేషం. ఇబ్బందులు ఎదురుకాకుండా పేరుకు ముందు పెద్ద, నడిపి, చిన్న, రాం, స్వామి, శివ, వెంకట, చాణక్య, సాయి అని పిలుస్తున్నారు. మహిళలు సైతం బయమ్మ పేరు పెట్టుకుంటున్నారు. చదవండి: తెనాలి కుర్రోడు.. తగ్గేదే లే.. చదివింది 8.. నెలకు రూ.3లక్షలకుపైనే.. ఒకరు తప్పు చేస్తే మరొకరికి దండన మా ఇంటి దేవుడు భైరవేశ్వరుడు. మా పెద్దల కాలం నుంచే బయపరెడ్డి అనే పేరు పెడుతున్నారు. మా ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా భైరవేశ్వర స్వామిని దర్శించుకుంటాం. బయపరెడ్డి పేర్లు ఎక్కువగా ఉండడంతో స్కూల్లో ఒకరు తప్పు చేస్తే మరొకరు చీవాట్లు, దెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి. – పేరం బయపరెడ్డి పొరబాటు పడేవారు ఇప్పుడైతే సెల్ఫోన్లు ఉన్నాయి కాబట్టి నంబర్ ద్వారా ఎవరి అడ్రస్‌కు వారి బంధువులు వెళ్లి పోతున్నారు. ఫోన్లు లేని సమయంలో పొరబడి ఒకరి ఇంటికి వెళ్లబోయి మరొకరి ఇంటికి వెళ్లి మాటలు కలిపేవారు. అసలు విషయం తెలుసుకున్నాక అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఈ సంఘటనలు నవ్వు తెప్పించేవి. – పెద్ద బయపరెడ్డి పేరు మంచిదని నమ్ముతాం మా కుటుంబాల్లో చాలా మంది బయపరెడ్డి పేరు పెట్టుకుంటారు. సులభంగా గుర్తు పట్టుకునేందుకు వీలుగా పేరుకు ముందు సాయి, శివ అని పెట్టుకుంటున్నారు. ఇంటి దేవుడి పేరు మంచిదని మా నమ్మకం. – బయపరెడ్డి -
అక్కడ దేవుడికే దిక్కులేదు.. పట్టించుకునే వాళ్లు లేరా!
చూడటానికి ఆ ఆలయాలు చక్కగా కనబడతాయి. వర్షం వస్తే భక్తులపైనే కాదు గర్భాలయంలోని దేవతామూర్తుల విగ్రహాలపై కూడా వర్షం పడుతుంది. అయినా పట్టించుకునే నాథుడు లేడు. దీంతో ఆ ఆలయాలకు వచ్చే భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దివ్య క్షేత్రంలోని పలు ఉపాలయాల దుస్థితి ఇది. సాక్షి,ద్వారకాతిరుమల(పశ్చిమ గోదావరి): రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి పలు ఉప, దత్తత ఆలయాలు ఉన్నాయి. రోజూ క్షేత్రానికి వేలాదిగా వచ్చే భక్తులు చినవెంకన్న దర్శనానంతరం ఆ ఆలయాలనూ సందర్శిస్తారు. ముఖ్యంగా క్షేత్రదేవత కుంకుళ్లమ్మ, క్షేత్రపాలకుడు భ్రమరాంబ మల్లీశ్వరస్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. చెరువు వీధిలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని, పసరు కోనేరు వద్ద ఉన్న అభయాంజనేయ స్వామిని స్వల్ప సంఖ్యలో భక్తులు దర్శిస్తారు. ఆయా ఆలయాల్లో జరగాల్సిన ఉత్సవాలను చినవెంకన్న దేవస్థానం నేత్రపర్వంగా నిర్వహిస్తోంది. అధికారుల అలసత్వం కారణంగా ఆలయాల అభివృద్ధిలో మాత్రం డొల్లతనం బయటపడుతోంది. మేడిపండులా.. మేడిపండులా కనిపించే కుంకుళ్లమ్మ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, క్షేత్రపాలకుని ఆలయాల ఆవరణల్లో ఉన్న నవగ్రహ మండపాల శ్లాబ్‌లు దెబ్బతిన్నాయి. దీంతో వర్షం కురిసిన ప్రతిసారీ కుంకుళ్లమ్మ ఆలయ ముఖ మండపం మడుగుగా మారుతోంది. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలో స్వామివారిపైనే వర్షం పడుతోంది. ఆ ఆలయ ప్రహరీ బాగా బీటలు వారింది. క్షేత్రపాలకుని ఆలయ ఆవరణలోని నవగ్రహ మండపం శ్లాబ్ పూర్తిగా దెబ్బతినడంతో అధికారులు దాన్ని బోట్లు పెట్టి నిలబెట్టారు. భక్తులు ఆ మండపంలోనే పూజలు చేస్తున్నారు. ఆదాయం రూ.కోట్లలో ఉన్నా.. శ్రీవారి ప్రధాన ఆలయానికి ప్రతి నెలా కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. అయినా ఉపాలయాలను పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.త్వరలో మరమ్మతులు చేయిస్తాం సుబ్రహ్మణ్యేశ్వరుడు, కుంకుళ్లమ్మ ఆలయ శ్లాబ్‌లు దెబ్బతిన్న విషయం నా దృష్టికి రాలేదని దేవస్థానం ఈఓ జీవీ సుబ్బారెడ్డి అన్నారు. దీనిపై ఈఈ శ్రీనివాసరాజు వివరణ ఇస్తూ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం శ్లాబ్ దెబ్బతిన్న విషయాన్ని సిబ్బంది తమకు తెలపలేదన్నారు. ఈ ఆలయంతో పాటు కుంకుళ్లమ్మ ఆలయం, నవగ్రహ మండపం శ్లాబ్‌లకు త్వరగా మరమ్మతులు చేయిస్తామన్నారు. చదవండి: నమ్మకం మాటున మోసం.. శ్రీశైలం వెళ్తున్నామంటూ.. -
ఇంత పారవశ్యమా, ఇలాంటి వీడియో మీరెపుడూ చూసి ఉండరు
దసరా పండుగ వేళ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియో వైరల్‌గా మారింది. ఒక కోతి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఏకంగా ఒక సాధువు ఒడిలో కూర్చున్న వానరం లయబద్ధంగా కర్తల్ ప్లే చేసి అక్కడున్న వారినందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా స్వయంగా ఆ రాముడి కోసం దిగి వచ్చిన హనుమాన్ అంటూ ముగ్ధులవుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఒక కోతి భజన చేస్తున్న సాధువుల చెంతకు చేరింది. వారితో పాటు భక్తి కీర్తనల్లో మునిగియంది. తాళానికి కనుగుణంగా భజనలో ఒక వాయిద్యాన్ని వాయిస్తూ ఆనందంలో మునిగిపోయింది. దీంతో సోషల్ మీడియా యూజర్లు ఫిదా అయితున్నారు. ఇది హనుమంతుడి రూపమే అంటూ మురిసి పోతున్నారు. ఇంత పారవశ్యామా ఇలాంటి కోతిని తాను ఎన్నడూ చూడలేదు అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. చాలా ఆనందంగా ఉందంటూ మరో యూజర్ వ్యాఖ్యానించడం విశేషం. పంకజ్ పరాశర్ తన ఫేస్బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను లక్షలాది మందికి వీక్షించగా, 30 వేల మంది షేర్ చేశారు. -
'దేవుని చేయి' చిత్రాన్ని పోస్ట్ చేసిన నాసా
ఈ అంతరిక్షం ఎన్నో అద్భుతాలతో నిండి ఉంది. దీని అందం అసమానమైనది. కొన్నిసార్లు అంతరిక్షంలో జరిగే సంఘటనలతో మనం ఆశ్చర్యపోతుంటాం. తాజాగా అలాంటి సంఘటన మరోసారి అంతరిక్షంలో చోటు చేసుకుంది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఇటీవల ఒక చిత్రాన్ని షేర్ చేసింది. దాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా షేర్ చేసిన ఈ చిత్రానికి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ అని పేరు పెట్టింది. ఈ చిత్రాన్ని వేలాది మంది లైక్ చేస్తున్నారు. ఈ ఫోటో ఒక చేతిని పోలి ఉంది. చేతి వేళ్ళ మధ్యలో ఎలాగైతే కొంచెం ఖాళీ స్థలం ఉంటుందో అలాగే ఈ ఫోటోలో నలుపుగా ఉండి మిగతా మొత్తం బంగారు వర్ణంలో కనిపిస్తుంది. ఇది నిజంగానే 'దేవుని చేయి' లేదా మరేదైనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నక్షత్రంలోంచి పుట్టుకొచ్చినట్టున్న ఈ చేయి ఆకారానికి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’గా పిలుస్తున్నారు. ఒక అత్యున్నత శక్తి ఆశీర్వాదాలను ఇస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. బాహ్య అంతరిక్ష సౌందర్యాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు. ఈ బంగారు నిర్మాణం అయస్కాంతీకరణ శక్తి వల్ల విడుదలయ్యే శక్తి కణాలతో కూడిన నిహారిక అని నాసా తెలిపింది. ఒక నక్షత్రం పేలిన తర్వాత ఇలాంటి పల్సర్లు మిగిలిపోతాయి.(చదవండి: ఎస్బీఐ కార్డ్ యూజర్లకు బంపర్ ఆఫర్!) View this post on Instagram A post shared by NASA Chandra X-ray Observatory (@nasachandraxray) ఈ పల్సర్‌ను పిఎస్ఆర్ బి1509-58 అని పిలుస్తారు. ఇది 19 కిలోమీటర్ల పరిది వరకు విస్తరించి ఉంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇది సెకనుకు 7 సార్లు తన చుట్టూ తిరుగుతోంది. ఇది భూమికి 17,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. నెటిజన్లు ఈ చిత్రాలను చూసి ఆశ్చర్యపడుతున్నారు. "దీనిని "మిడాస్ చేయి" అని పిలవాలి!" అని ఒక వినియోగదారుడు కామెంట్ చేస్తే, మరొకరు "నాకు ఇది శివుడి మూడవ కంటి నుండి అగ్నిలా కనిపిస్తుంది, అతని చెవిరింగు అతని కేశాలంకరణలో ఉన్న గంగా లాగా" కనిపిస్తున్నట్లు పేర్కొన్నాడు. మీరు ఏమని భావిస్తున్నారో క్రింద కామెంట్ చేయండి. -
లింగంపల్లిలో అరుదైన ఆత్మార్పణ శిల వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: దేవుడికి తనను తాను నైవేద్యంగా సమర్పించుకుంటే ఆ భక్తిని ఏమనాలి?.. గతంలో ఈ తరహా వీరభక్తి ఉండేదన్న గాథలు అడపాదడపా వింటూనే ఉన్నాం. భక్తితో దేవుడికి తనను తాను ఆత్మార్పణ ద్వారా సమర్పించుకున్న వారి శిల్పాలు అప్పట్లో వేయించారు. అలాంటి ఓ అరుదైన ఆత్మార్పణ శిల తాజాగా వెలుగుచూసింది. అది మహిళది కావడం మరో విశేషం. జనగామ జిల్లా చిల్పూరు మండలం లింగంపల్లిలో కొత్త తెలంగాణ బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ ఈ ‘ఆత్మార్పణ’శిల్పాన్ని గుర్తించినట్లు ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. కర్ణాటక ప్రాంతంలో వీటిని సిడితల వీరగల్లుగా పేర్కొంటారని తెలిపారు. ఈ శిల్పంలోని దృశ్యం రెండంతస్తులుగా ఉంది. దిగువ భాగంలో.. ఓ మహిళ కూర్చుని ఆత్మత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంది. చేతిలో శివలింగం పట్టుకుని ఉంది. తల భాగాన్ని ఎదురు కర్రకు కట్టినట్టు ఉంది. ఓ వెదురుకర్రను వంచి చివరి భాగాన్ని తలకు జుట్టుకు కడతారు. ఆ తర్వాత కత్తితో మెడ నరుక్కోగానే, వెదురు కర్ర తలను వేరు చేస్తూ పైకి లేస్తుంది. ఈ మహిళ ఆ పద్ధతిలో ఆత్మత్యాగం చేసినట్టు శిల్ప దృశ్యం చెబుతోంది. పైఅంతస్తులో చనిపోయిన మహిళ ఆత్మను తోడుకుని ఇద్దరు చామరధారిణులైన అమరాంగనలు దేవలోకానికి వెళ్తున్న దృశ్యం చిత్రించి ఉంది. శిల్పశైలినిబట్టి కాకతీయుల కాలానంతరం చెక్కినట్లుగా ఉందని హరగోపాల్ పేర్కొన్నారు. వీరశైవ భక్తులెక్కువగా ఇలా ఆత్మార్పణ చేసుకునేవారని పేర్కొన్నారు. ఈ శిల్పం ఓ పొలం వద్ద వెలుగుచూసినట్టు వెల్లడించారు. -
విశ్వక్ సేన్ కోసం దేవుడిగా మారనున్న బన్నీ?
‘రుద్రమదేవి’లో అతిథి పాత్రలో ఆకట్టుకున్న హీరో అల్లు అర్జున్ మరోసారి అతిథిగా కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించిన ‘ఓ మై కడవులే’ తెలుగు రీమేక్‌లోనే అల్లు అర్జున్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్. విశ్వక్ సేన్ హీరోగా తెలుగు రీమేక్‌ను పీవీపీ సినిమా–శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించనున్నాయి. తమిళ చిత్రంలో విజయ్ సేతుపతి దేవుడి పాత్ర చేశారు. తెలుగులో ఆ పాత్రను అల్లు అర్జున్ చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే... ‘రేసు గుర్రం’లో అల్లు అర్జున్ ‘దేవుడా’ అంటూ అదో రకమైన స్టయిల్లో చెప్పడం అందర్నీ ఆకట్టుకుంది. మరి.. ఇప్పుడు ఈ రీమేక్‌లో అల్లు అర్జున్ దేవుడేనా? లేక వేరే నటుడు కనిపిస్తారా? అనేది చూడాలి. -
దేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం
కొణిజర్ల: కొణిజర్ల మండలం సాలెబంజర పంచాయతీ పరిధిలోని జంపాలనగర్ తండాలోని గిరిజన దేవత మంగ్తూసాథ్ దేవాలయంలోనికి శనివారం ఉదయం ఓ పాము వచ్చి దేవత విగ్రహం పై అమర్చిన ఇత్తడి తొడుగుల పైకి చేరింది. అక్కడ పూజలు చేసేందుకు వచ్చిన స్థానికులను చూసి పడగ విప్పి ఆడింది. పూజారి సుమారు గంట పాటుపూజలు చేసి హారతి ఇచ్చినా పాము అక్కడి నుంచి కదలలేదు. దీంతో దేవునిపాము అంటూ స్థానికులు పెద్ద ఎత్తున గుడికి చేరుకుని పసుపు కుంకుమ వేసి హారతులు ఇచ్చి పూజలు చేశారు. -
పూజారిపై మండిపడ్డ తహశీల్దార్.. ఎందుకంటే..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): బెళగావి జిల్లా కాగవాడ తాలూకా ఐనాపురలో అమ్మవారు కన్ను తెరిచారని ప్రచారం జరగడంతో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. కొన్ని స్థానిక టీవీ చానెళ్లలో కూడా ప్రచారం సాగడంతో జిల్లా అంతటా చర్చనీయాంశమైంది. ఆశ్చర్యపోయిన కాగవాడ తహశీల్దార్ ప్రమీళా దేశ్‌పాండే ఈ కాలంలో దేవి కన్ను తెరవడం ఏమిటని ఐనాపురకు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. పూజారి విగ్రహంపై అంటించిన కన్ను రూపాన్ని తహసీల్దార్ తీసేయించారు. దేవుని పేరుతో ప్రజలను మభ్యపెట్టవద్దని పూజారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: వామ్మో.. మాయ మాటలు చెప్పి ఎంత పనిచేశాడు.. -
దేవుడు చాలా కఠినాత్ముడు: మేఘనా రాజ్ ఎమోషన్
సాక్షి,బెంగళూరు: కన్నడ నటుడు సంచారి విజయ్ అకాల మరణంపై టి మేఘనా రాజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియా ద్వారా విజయ్ మృతిపై మేఘనా భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ అందమైన ఫోటోను షేర్ చేసిన మేఘనా ఒక ఎమోషనల్ నోట్ రాశారు. ‘మనిషిగా, నటుడిగా మీరెంతో అద్భుతమైన వారు. మీరు ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు.. నిజంగా దేవుడు కఠినాత్ముడు. ఆర్ఐపీ ఫ్రెండ్’ అని పేర్కొన్నారు. అంతేకాదు గత ఏడాది జూన్‌లో తన భర్త చిరంజీవి సర్జా మృతిపైవిచారం వ్యక్తం చేసిన సంచార్ విజయ్ పోస్ట్‌ను షేర్ చేశారు. మేఘనా రాజ్ భర్త , హీరో చిరంజీవి సర్జా తీవ్ర గుండెపోటు కారణంగా (202, జూన్ 7న) ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా స్నేహితుడితో కలిసి వెళుతుండగా విజయ్ ప్రమాదానికి గురయ్యారు.తలకు తీవ్రమైన గాయాలు కావడంతో విజయ్ను రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఆయన చని పోయినట్టుగా ప్రకటించారు. మరోవైపు విజయ్ ఆకస్మిక మరణంపై పరిశ్రమకు చెందిన పెద్దలు పలువురుఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నటుడి ఆకస్మిక మరణంపై విచారం వ్యక్తం చేశారు. అలాగే ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. చనిపోయిన తరువాత కూడా విజయ్ పలువురికి ప్రాణదానం చేశారని సీఎం కొనియాడారు. మరోవైపు బంధువులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ అధికార లాంఛనాలతో విజయ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
అగ్నిదేవుడి అనుగ్రహాన్ని పొందడం ఎలా?
వేదకాలం నుండి సర్వదేవతారాధనలో అగ్నికి అత్యంత ప్రాముఖ్యం ఏర్పడింది. అనాది కాలం నుండి మానవ జీవితంలో కూడా అగ్ని ప్రముఖ స్థానం ఆక్రమించింది. వైదిక ఋషులు అగ్నిని భగవంతుడుగా పూజించారు. అగ్నిదేవుడని పేరు. ఈ అగ్ని దేవుడు అష్టదిక్పాలకులలో ఒకడుగా గుర్తింప బడ్డాడు. అగ్నికి మత పరంగా కూడా శ్రేష్ఠత్వం ఉంది. అగ్ని మిగిలిన దేవతలందరికి హవ్యాన్ని మోసుకుపోతాడని, దేవతలు అగ్ని ముఖులని వైదిక వాజ్ఞ్మయం చెబుతుంది. ఆద్యంత రహితుడు, అఖండుడు అని పరమాత్ముని సేవించడంలో అగ్నికి మించిన సాధనం వేరొకటి లేదు. అగ్నిమీళే పురోహితమ్మని వేదం. నక్షత్ర గ్రహతారకలు, నదీనదాలు, సాగరాలు, సూర్య చంద్రాది గోళాలు ఒకటేమిటి సృష్టిలోని ప్రత్యణువు అగ్నిచేత వివిధ రూపాలలో చైతన్యం కలిగి ఉన్నాయి. సంస్కృతభాషలో అగ్ని శబ్దానికి ఎన్నో పర్యాయ పదాలున్నాయి. విశ్వానరుడనే ఋషి పుత్రుడైనందున వైశ్వానరుడని, అశ్వమేధ యాగంలో గుర్రాలు హవిస్సుగా కలవాడైనందున వీతిహోత్రుడని, నీటి ఉత్పత్తి స్థానం కావటం వల్ల కృపేట యోని అని, వేదాలు పుట్టుకకు కారణభూతుడైన నందువల్ల జాతవేదుడని, ప్రతి వస్తువును పవిత్రం చేసినందున పావకుడని, శుచిత్వం కలిగివున్నందున శుచి అని అగ్నికి నామాం తరాలనేకం ఉన్నాయి. "దక్షిణాగ్నిర్గార్హ సత్యాహవనీయౌ త్రయోగ్నయః వేదికి దక్షిణమైన అగ్ని దక్షిణాగ్ని, యజమానుని చేత ఇతరాగ్నుల కంటే పూర్వం సంస్కరించబడిన అగ్ని గార్హపత్యం. క్రియా పరిసమాప్తి పర్యంతం హోమం చేయదగినది. అహవనీయం. ఇలా అగ్ని మూడు విధాలుగా వేదభూమిలో ప్రసిద్ది కెక్కింది. అన్ని శుభాలను అగ్ని ప్రజల్వనంతోనే. నూతన గృహ నిర్మాణ సమయంలో పాత ఇంటిలో ప్రజ్వలింపబడిన అగ్నిలో నుండి కొంత భాగాన్ని తీసుకొచ్చి కొత్త ఇంటిలోనికి ప్రవేశించాలని వేదాల్లో చెప్పబడింది. ఈ ఆచారం కొన్ని చోట్ల నేటికీ కనబడుతోంది. పురాణేతిహాసాలలో అగ్నికి వజ్రాయుధానికి భేదం లేదని చెప్పబడింది. అగ్ని ఇంద్రుడు ఒక్కరేనని పురాణాలలో ఉటంకించ బడింది. జలాంతర్హితమైన అగ్నిని బడబాగ్ని అంటారు. పరమోత్క్రుష్ట దశలో వెలిగే అగ్నిని బ్రహ్మాగ్ని అని చెప్పారు. సృష్టి సంబంధమైన పంచాగ్ని విద్యను గురించి ముండకోపనిషత్తు వివరించింది. హిందూ సమాజంలో జన్మించింది మొదలు మృత్యువు పర్యంతం అగ్ని యొక్క అవసరం ఉంది. పురిటిలో దీపం వెలిగించి నట్లే మృతదేహం దగ్గర కూడా ఆత్మజ్యోతిగా దీపం వెలిగిస్తారు. దీపారాధనతో ప్రారంభం కాని శుభాశుభ కర్మ అంటూ ఏది లేదు. మనిషి మనుగడకు అత్యంతోపకారి. తానే అగ్నిహోత్రుడై జఠరాగ్నిని దీపింపజేస్తున్నానని, అహం వైశ్వానరో భుత్వా ప్రాణీనాం దేహం మాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్" నేను జఠరాగ్ని రూపంన ప్రాణాల దేహము నందుండి ప్రాణాపాన వాయువులతో కూడిన వాడనై భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములను నాలుగు విధముల పదార్ధములను జీర్ణము చేయుచున్నాను" అని శ్రీ కృష్ణ పరమాత్మ గీతలో అంటాడు. అగ్ని, జ్యోతి, పగలు,శుక్ల పక్షము, ఆరు నెలలు గల ఉత్తరాయణము అను అభిమాన దేవతలుగల దేవయాన మార్గమైన ప్రయాణమే చేసిన సగుణ బ్రహ్మో పాసకులు బ్రహ్మమును పొందుతున్నారు అని గీతలో చెప్పబడింది. మృత్యువు అనంతరం స్వర్గాది శుభలోకాలకు వెళ్ళేందుకు అగ్ని దోహదం చేస్తుంది. అగ్నిహోత్రం గృహక్షేత్రే గర్భిణీం వృద్ధ బాలకా। రిక్తహస్తే. నా నోపయాత్ రాజానం గురుమ్ ॥ అగ్నిహోత్రమునకు ఆహుతులిచ్చునప్పుడు, గృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీస్త్రీలు, వృద్ధులు,బాలురు, రాజు, దేవుడు, గురువు వీరి వద్దకు వట్టి చేతులతో వెళ్ళకూడదు అనగా ఫలపుష్పాదులు తీసుకు వెళ్ళాలి. ఇక్కడ కూడా అగ్నికి ప్రాధాన్యతనిచ్చారు. మన పూర్వీకులు. ఆదిమానవుని జీవితంలోనూ జంతువుల జీవితంలోను సృష్టి ప్రారంభంలో ఎలాంటి వ్యత్యాసం ఉండేది కాదు. సర్వజీవుల్లా మానవుడు దిగంబరంగా సంచరించే వాడు, జంతువులను చంపి పచ్చి మాసం తినేవాడు. నీరు,నిప్పు అతని దిశను దశను మార్చివేసాయి. అరణ్యాలలో గాలికి చెట్టు కొమ్మల రాపిడితో అగ్ని పుట్టడం గమనించాడు. "కాష్ఠాదగ్నిర్జాయతే ", రెండు కట్టెలు రాపిడి చేస్తే అగ్ని జనిస్తుంది అని తెలుసుకున్నాడు. అగ్నిదేవుడు సంతసిస్తే మానవాళికి ఉపకారం చేస్తాడు, కోపగించుకుంటే అపకారమూ చేస్తాడు. అతణ్ణి పూజించినంత కాలం మన అభీష్టాలను నెరవేరుస్తాడు. కాని అతనికి ద్రోహం తలపెడితే సహించడు. త్రినేత్రుడు మూడో కన్ను తెరిచినట్లు తన నాలుకను సాగదీస్తాడు. ఒక గ్రామంలో శుద్ధ శోత్రియ బ్రాహ్మణుడు సకల జనాల క్షేమం కాక్షించి యజ్ఞం చేసాడు. యజ్ఞం పూర్తి అయినా యజ్ఞకుండం ఇంకా రాజుకునే ఉంది.ఒక బుద్ధిలేని మహిళ ఉచ్ఛీష్టం తెచ్చి యజ్ఞకుండంలో వేయడమే కాక పరిసరాలన్ని శుభ్రంగా ఉండడం చూసి ఎక్కడ ఉమ్మి వేయాలో తోచక యజ్ఞకుండంలో ఉమ్మి వేసింది. అయితే ఆమె ఉమ్మిన చోట ఆమే కొక బంగారు వరహా కనిపించింది. సంతోషంగా ఆ వరహాను తీసుకుని కొంగు కట్టుకొని ఇంటికి వెళ్ళింది. ఆడవారి నోట్లో నువ్వుగింజ నానదంటారు. దావాగ్నిలా ఆ మాట ఊరంతా పాకిరింది. మంట చల్లారకూడదని ప్రతి ఒక్కరు ఒక కర్ర వేస్తూ కుండంలో ఎంగిలి అన్నం, ఉమ్మి వేస్తు ఒకొక్క నాణెము తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన బ్రహ్మణుడు బాధ పడి ఇలా చేయడం అపచారం అని బోధ పరిచినా బంగారం మీద ఆశతో ఎవరు అతని మాటను లెక్క చేయ లేదు. ఇంత అనాచారము, అపరాధము జరుగుతున్న ఊరిలో ఉండనిష్ట పడక మూటాముల్లె సర్దుకుని భార్యాబిడ్డలతో ఊరు విడిచి పెట్టాడు. అతనావూరి పొలిమేర దాటగానే ఆ ఊరు మొత్తం అగ్నికి ఆహుతై, భస్మమైంది. ఆ బ్రాహ్మణుడు ఉన్నంత వరకు అగ్నిదేవుడు శాంతం వహించేడు. మనం మన ఇళ్ళల్లో ఈ నాడు మృష్ఠాన్న భోజనాలు వండుకుని తింటున్నామంటే అందుకు అగ్ని దేవుడి దయయే. ఒక కథ పెద్దలు చెప్తారు. పరమశివుడు అగ్నికి ఆజ్ఞాపించాడట. ప్రతి ఇంటిలో నువ్వు ఉండాలి. పొయ్యిలో నిత్యాగ్నిహోత్రం వెలుగుతూఉండాలని. శివుడాజ్ఞను అగ్ని దేవుడు ధిక్కరించివుంటే మనం ఆది మానవుల్లా ఉడకని పదార్ధాలు తినేవారం. అగ్ని దేవుడు ఆగ్రహయిస్తే ప్రతి అడవికి, ఊరుకు ఖాండవవనం గతే పడుతుంది. మనం మన నిత్య ధర్మమాలను పాఠిస్తూ అగ్నిదేవత అనుగ్రహాన్ని పొందుదాం. - గుమ్మా ప్రసాదరావు -
దేవుణ్ని చూపిస్తానని.. 70 అడుగుల బావిలో..
-
దేవుణ్ని చూపిస్తానని.. 70 అడుగుల బావిలో..
సాక్షి, కడప: తాగిన మైకంలో అసలు దేవుడు ఉన్నాడా? లేడా? అని ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ కారణంగా ఓ వ్యక్తి బావిలో పడ్డాడు. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. చింతకొమ్మ దిన్నె సమీపంలోని మద్దిమడుగుకి చెందిన కిశోర్ నాయక్, సుగాలి బిడికికి చెందిన రామాంజనేయులు బావి గట్టున కూర్చోని మద్యంగా సేవించారు. తాగిన మైకంలో వీరిద్దరూ దేవుడి గురించి చర్చించుకున్నారు. కిషోర్ నాయక్ దేవుడు ఉన్నాడని వాదించడంతో రామాంజనేయులు లేడని వాదించాడు. వీరి వాదనలు తారస్థాయికి చేరాయి. ఇక కిషోర్ నాయక్ తాగిన మైకంలో పక్కనే ఉన్న బావిలో గంగమ్మ తల్లి ఉంటుందని ఆమెను చూపిస్తాని బావిలోకి దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బావిలో ఉన్న ఓ రాయిపై కిషోర్ నాయక్ కాలు వేయటంతో ఆ రాయి విరిగి సుమారు 70 అడుగుల లోతున పడిపోయాడు. దీంతో ఆందోళన చెందిన రెండో వ్యక్తి స్థానికులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బావిలో పడ్డ వ్యక్తిని రక్షించారు. అనంతరం కిషోర్ నాయక్‌ను ఆస్పత్రికి తరలించారు. -
మఠం భూములపై టీడీపీ కన్ను..
టెక్కలి: స్థానిక చిన్నబ్రాహ్మణవీధిలోని రాధామాధవస్వామి మఠం భూములపై అక్రమార్కుల కన్ను పడింది. మఠం నిర్వహణ కోసం టెక్కలి మండలం గూగెం, డమర సరిహద్దు ప్రాంతాలతోపాటు నందిగాం మండలం గురువూరు తదితర చోట్ల వందల ఎకరాల భూములను పూరీ జగన్నాథ సంస్థాన్ నుంచి అప్పగించారు. గతంలో టెక్కలిని పాలించిన పర్లాఖిమిడి గజపతి రాజుల నుంచి కేటాయించిన ఈ భూముల బాధ్యతను 1885లో గోవింద్ చరణ్‌దాస్ గోస్వామికి అప్పగించారు. డమర, గూగెం సరిహద్దు ప్రాంతాల్లో సర్వే నంబరు 261లో సుమారు 58 ఎకరాలు, సర్వే నంబరు 228, 229, 259 నంబర్లలో సుమారు 40 ఎకరాలతోపాటు నందిగాం మండలం గురువూరు ప్రాంతాల్లో వందల ఎకరాల భూముల నుంచి వచ్చే ఆదాయంతో స్వామికి నిత్య కైంకర్యాలు జరుగుతుండేవి. వీటితో పాటు పూర్వం పూరీ జగన్నాథస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అవసరమైన సదుపాయాలను ఈ భూముల నుంచి వచ్చే ఆదాయంతో సమకూర్చేవారు. కాల క్రమేణా గోవింద్ చరణ్ దాస్ గోస్వామి పూరీ జగన్నాథస్వామి సంస్థాన్‌కు వెళ్లిపోవడంతో ఈ భూములపై పర్యవేక్షణ కొరవడింది. భక్తుల అవతారం ఎత్తిన టీడీపీ కార్యకర్తలు గత ప్రభుత్వ హయాంలో నరసింగపల్లి, కిట్టాలపాడు గ్రామానికి చెందిన కొంత మంది టీడీపీ కార్యకర్తలు ముందుగా భక్తుల అవతారం ఎత్తారు. ఆ తర్వాత మెల్లగా భూములపై కన్నేశారు. దీంతో కొంత మంది రెవెన్యూ అధికారులను తమకు అనుకూలంగా మార్చుకుని వెబ్‌ల్యాండ్‌లో రికార్డులను తారుమారు చేసే పనిలో పడ్డారు. వీరి ప్రయత్నాలకు కొంత మంది రెవెన్యూ అధికారులు అండగా నిలవడంతో ఒక్కో ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎకరం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు విక్రయించినట్లు సమాచారం. ఈ విధంగా రూ.కోట్లు దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి. వెబ్‌ల్యాండ్‌లో కొన్ని చోట్ల గోవింద్ చరణ్ దాస్ గోస్వామి పేరును చూపే విధంగా రికార్డులు తారుమారు చేసేశారు. సర్వే నంబర్లను సబ్ డివిజన్లుగా మార్చేసి కొనుగోలుదారుల పేర్లను వారసత్వంగా నమోదు చేసినట్లు భోగట్టా. ఈ విధంగా సుమారు 110 మందికి విక్రయించినట్లు తెలుస్తోంది. మఠం భూములను కొంత మంది టీడీపీ కార్యకర్తలు గుట్టుచప్పుడు కాకుండా విక్రయించారంటూ తెలియడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. మఠానికి కేటాయించిన భూముల వివరాలు మొత్తం బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాధామాధవ మఠం భూములు చేతులు మారడంలో మఠం నిర్వాహకుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మఠానికి చెందిన భూముల క్రయవిక్రయాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇన్ని వందల ఎకరాల అమ్మకాలు మఠం నిర్వాహకుల ప్రమేయం లేకుండా జరిగే అవకాశం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. మఠం నిర్వాహకుల వివరణ కోసం ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు. గతంలో మా దృష్టికి వచ్చాయి.. టెక్కలిలో ఉన్న రాధామాధవ మఠానికి చెందిన భూములను విక్రయిస్తున్నట్లు గతంలో మా దృష్టికి వచ్చింది. అప్పట్లో మఠం నిర్వాహకుల వద్ద విషయం తెలుసుకున్నాం. ఎలాంటి విక్రయాలు జరగలేదని, మఠం భూముల పత్రాలు తమ వద్ద అందుబాటులో లేవంటూ దాట వేసే ప్రయత్నాలు చేశారు. రెవెన్యూ అధికారులను సంప్రదించగా తమ వద్ద పూర్తి స్థాయిలో పత్రాలు లేవంటూ చెప్పారు. మఠం భూములను దేవదాయ శాఖ ఆదీనంలోకి తీసుకునేలా 43 రిజి్రస్టేషన్ ప్రక్రియ చేపడతాం. మఠం భూముల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. – జి.ప్రసాద్‌బాబు, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్, సోంపేట -
ఆయన శరణార్థులకు 'దేవుడు': మాజీ సీఎం
జైపూర్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ర్యాలీలతో దేశం అట్టుడుకుతుంటే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొని భారత్‌కు తరలివచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించే చట్టంతో.. ప్రధాని మోదీ శరణార్థులకు దేవుడిలా మారారని అభివర్ణించారు. 'భగవంతుడు జీవితాన్ని ప్రసాదించాడు. తల్లి జన్మనిస్తే.. నరేంద్ర మోదీ మాత్రం పునర్జన్మను ఇచ్చారని' జైపూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. Shivraj Singh Chouhan, BJP in Jaipur on #CitizenshipAmendmentAct: Narendra Modi inke liye bhagwan ban ke aaye hain jo pratadit the aur nark ki zindagi jee rahe the. Bhagwan ne jeewan diya, maa ne janam diya, lekin Narendra Modi ji ne fir se zindagi di hai. pic.twitter.com/mKnTryu6zb — ANI (@ANI) December 23, 2019 పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించి, భయాందోళనలకు గురిచేస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఇక పౌరసత్వ సవరణ చట్టంపై సోనియా గాంధీ వైఖరిని తప్పుబట్టారు. పౌరసత్వ సవరణ బిల్లు చట్టం అవ్వడానికి ముందే లోక్‌సభలో ప్రశ్నించి ఉంటే బావుండేదన్నారు. చట్టమైన తర్వాత వీడియో తీసి ప్రచారం చేయడం బాగాలేదన్నారు. తాజాగా జార్ఖండ్‌లో మారుతున్న రాజకీయ పరిణామాలు, దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను గురించి ప్రశ్నించగా.. రాష్ట్రంలోని సమస్యలపై ఎన్నికలు జరుగుతాయని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. -
స్త్రీని ఉపాసించే సంస్కృతి మనది
మానవుడిని మాధవుడిగా మార్చే సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని సామాన్యుల చెంతకు తీసుకువెళ్లాలి ... తద్వారా సమాజంలో శాంతిని నెలకొల్పాలి అనే లక్ష్యంతో ఆధ్యాత్మిక ప్రవచన జ్ఞానయజ్ఞాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు సామవేదం షణ్ముఖశర్మ. గుంటూరులో యోగవాశిష్టం పై ప్రవచనం చేస్తున్న సందర్భంగా ‘మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు నడవాలి’, ‘పురాణాలలో స్త్రీమూర్తికి ఇచ్చిన స్థానం ఏంటి’ తదితర సందేహాలకు వారు ఇచ్చిన సమాధానాలు సాక్షికి ప్రత్యేకం. ఆధ్యాత్మికం అంటే ? శరీరం, ప్రాణం, మనస్సే కాకుండా ఆత్మ అనే వస్తువు ఉంది అనే జ్ఞానానికే ఆధ్యాత్మికం అని పేరు. ఆత్మ అనేది ఎప్పుడూ నశించనిది, సత్యమైనది. దాని గురించి తెలుసుకున్నవాడు భౌతిక జీవితంలో ఆనందంగా, శాంతంగా జీవించగలుగుతాడు. సైన్సు భౌతికవిజ్ఞానాన్నే చెబుతుంది. పరా విద్య ఆధ్యాత్మికం, పరమాత్మ గురించి చెబుతుంది. మనిషిలో వివేకాన్ని రగిల్చి అశాశ్వతమైన భౌతిక సుఖాల కోసం అవినీతికి, అధర్మానికి పాల్పడకుండా కాపాడే శక్తి ఆధ్యాత్మిక విజ్ఞానానికే ఉంది. ఆధ్యాత్మిక మార్గం అంటే ? భౌతికప్రపంచంలో ధర్మపరమైన అనుబంధం ఉండాలి. అంతరంగంలో ఆత్మస్వరూపుడైన భగవంతుడున్నాడనే స్పృహ ఉండాలి. ఆ స్పృహæతో భౌతిక జీవిత ధర్మాన్ని పాటించినట్లయితే అది వ్యక్తికి, సమాజానికి క్షేమం. సైన్సు సాధించలేనిది ఆధ్యాత్మికత సాధించగలదు. శరీరం పోయినా నువ్వు ఉంటావు అనే భరోసా సైన్సు ఇవ్వలేదు. ఆధ్యాత్మిక శాస్త్రం ఇస్తుంది. తప్పు, ఒప్పు గమనించే పరమాత్మ ఒకరు ఉన్నారని తెలిసాక తప్పు చేయడానికి వెనుకాడతాము. మంచి చేయడానికే ప్రయత్నిస్తాము. ఆధ్యాత్మిక మార్గం అధర్మాన్ని చేయనివ్వదు. ఒక ఓర్పును,ౖ ధైర్యాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికం జీవితానికి అతీతమైనది కాదు. సరైన జీవితం ఆధ్యాత్మికం. భగవంతుడు అన్నిటికీ ఆతీతుడని ఋషిప్రోక్తం పురాణ కథలలో దేవతలు మానవుల్లా కోపతాపాలకు, రాగద్వేషాలకు గురయినట్లు కనబడుతుంది. దీనిని అర్థం చేసుకోవడం ఎలా ? పురాణాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యేక అధ్యయనం అవసరం. మామూలు కథలలాంటివి కాదు. వాటిలో అనేక సంకేతాలు, సందేశాలు ఉంటాయి. యోగశాస్త్రం మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం, తత్వశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం కథల రూపంలో ఇమిడి ఉంటాయి. శివుడు, విష్ణువు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. వారి భావాలు మనలా ఉండటాన్ని లీల అంటారు. మనలా ప్రవర్తించారనడం సరికాదు. మనకు అర్థమయ్యేలా ఋషులు బోధించారు. మానవుడి స్థాయిలో జరిగితే కర్మ అంటారు. భగవంతుడి స్థాయిలో జరిగితే లీల అని చెప్పుకుంటాం. పురాణాలలో భగవంతుని లీలలు చెప్పబడ్డాయి. లీలల్లో సందేశాలు ఉంటాయి. జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఋషులు మనకు కథల రూపంలో అందించారు. కోపాలు, తాపాలు, భావాలు అన్ని లోకాల్లో ఉంటాయి. పశువులు, మానవులు, దేవతలు వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఆ భావాలు, స్పందనలు వ్యక్తమవుతాయి. దేవతలకు కలిగే భావాలు, స్పందనలు లోకక్షేమానికి దారితీస్తాయి. అంతుపట్టని భగవత్ తత్వం కూడా ఇలాంటి కథల వలన సామాన్య మానవుడికి చేరువ అవుతుంది. పురాణాలలో స్త్రీకి తక్కువ స్థానం ఇచ్చారని కొందరు విమర్శిస్తారు మీలాంటి ప్రవచకులు గొప్పస్థానాన్ని ఇచ్చారని చెబుతారు ఏది సత్యం ? భారతీయ సంస్కృతిలో స్త్రీకి ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఇంచుమించు అన్ని పురాణాల్లో స్త్రీ పాత్రలు గొప్పగా చూపబడ్డాయి. వేదాలలో ఋషులు ఎలా ఉన్నారో, ఋషికలు అలాగే ఉన్నారు. బ్రహ్మ వాదులు ఎలా ఉన్నారో బ్రహ్మవాదినిలు ఉన్నారు. తత్వశాస్త్రంలోనూ గొప్ప స్త్రీ మూర్తులు ఉన్నారు. రాజ్యాలను నడిపేవారు, గృహసామ్రాజ్యం నడిపే పాత్రలు కోకొల్లలు కనపడతాయి. దత్త చరిత్రలో–మదాలస, త్రిపురరహస్యంలో–హేమలేఖ, యోగవాశిష్టంలో – పద్మలీల, మార్కండేయ పురాణంలో– రాజ్యాలేలిన రాణుల చరిత్ర కనపడతాయి. ప్రపంచాన్ని నడిపే శక్తిగా స్త్రీ రూపాన్ని ఉపాసన చేస్తున్నాము. స్వామి వివేకానంద స్త్రీని మాతృమూర్తిగా గౌరవించడం మన సాంప్రదాయమని బోధించారు. పురాణాలలో, వేదాలలో, ధర్మశాస్త్రంలో స్త్రీకి ఒక గౌరవస్థానం రక్షణస్థానం ఇవ్వబడ్డట్లుగా స్పష్టంగా కనపడుతుంది. ప్రశ్న భక్తులకు మీ సందేశం ? మనకున్న సంస్కృతి యుగాలనాటిది. మనిషికి కావలసిన ఇహపరమైన అన్ని విషయాలు మన గ్రంథాలలో చెప్పబడ్డాయి. అనేక శాస్త్రాల విజ్ఞాన సమన్వయం హిందూ ధర్మశాస్త్రాలలో కనపడుతుంది. వాటి ఎడల ముందుగా గౌరవభావం ఏర్పడితే తరువాత తెలుసుకోవడం జరుగుతుంది. మనిషి బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావాల్సిన పూర్ణజ్ఞానం మహర్షులు మనకు ఇచ్చారు. దీనిని మతదృష్టితో కాకుండా విజ్ఞానదృష్టితో గ్రహిస్తూ దానిని ఆచరించే ప్రయత్నం చేయాలి. భారతీయులందరికీ తమ ధర్మంపై, విజ్ఞానంపై భక్తి, గౌరవ భావం ఏర్పడాలి. ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఇతరుల ధర్మాన్ని గౌరవించాలి. ఇంకొకరి ధర్మాన్ని నిందించడం వ్యక్తిత్వ లోపమని తెలుసుకోవాలి’’ అంటూ అనుగ్రహ భాషణ చేశారు సామవేదం షణ్ముఖ శర్మ. – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ -
సీమ సిరీస్..
శ్రీనగర్‌కాలనీ: సినిమా, టీవీ రంగాలకు ఎంత ప్రాధాన్యత ఉందో నేడు డిజిటల్ రంగానికి అంతే డిమాండ్ పెరిగింది. రాబోయే కాలంలో డిజిటల్ రంగం మరింత కొత్త పుంతలు తొక్కుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. డిజిటల్లో వెబ్‌సిరీస్‌లకు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. అలా ఇటీవల విడుదలై నెటిజన్లకు విపరీతంగా ఆకట్టుకుంటున్న వెబ్ సిరీస్ గాడ్ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి). ఆవకాయ బిర్యానీ, కో అంటే కోటి చిత్రాల దర్శకుడు, రచయిత అనీష్ కురివిళ్ళ దర్శకత్వంలో మహిళా నిర్మాత రాధిక లావు, జీ5 యాప్ సంయుక్తంగా గాడ్ వెబ్ సిరిస్‌ను నిర్మించాయి. రాయలసీమ రాజకీయ నేపథ్యంలో బోల్డ్, రా కంటెంట్‌తో సాగే ఈ వెబ్‌సిరీస్ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. వెబ్‌సిరీస్‌ల గురించి, గాడ్ సిరీస్ గురించి దర్శకుడు అనీష్ కురివిళ్ళ సాక్షితో మాట్లాడారు. ఆయన మాటల్లో... వెబ్‌సిరీస్‌లకు ప్రత్యేక డిమాండ్.. నేడు వెబ్‌సిరీస్‌లకు ప్రత్యేక డిమాండ్‌తో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. కో అంటే కోటి చిత్రం తర్వాత పలు చిత్రాల్లో నటించాను. దర్శకత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల పట్టాటెక్కలేదు. ఈ సంవత్సరం ప్రథమంలో ఓ స్టోరీ ఐడియాతో మహిళా నిర్మాత రాధిక లావు, జీ5 యాప్ నన్ను సంప్రదించారు. సోరీకి నా స్టైల్‌కు తగ్గట్టు కొత్తరీతిలో ప్రేక్షకులకు అందించాలంటే నాకు కొంత సమయం కావాలని చెప్పాను. అలా ఈ స్టోరీ ఐడియాను మా టీం కో స్క్రిప్ట్ రైటర్ హంజా అలీ, డైలాగ్ రైటర్ భరత్ కార్తీక్, స్క్రిప్ట్ అసిస్టెంట్ నీలగిరితో కలిసి రెండు నెలలు కష్టపడి కొత్తతరహా స్క్రిప్ట్‌ను 10 ఎపిసోడ్స్‌గా మూడు సినిమాలు కలిపితే ఎలా ఉంటుందో అలా 6 గంటల వెబ్‌సిరీస్‌ను ప్రారంభించాం. డైలాగ్ రైటర్ భరత్ కార్తీక్ కడపకు చెందిన వ్యక్తి. తను కడప, రాయలసీమ స్లాంగ్‌ను, డైలాగ్స్ రూపంలో చాలా బాగా రాశాడు. వెబ్‌సిరీస్‌ను చూస్తే ఎక్కడా నెటిజన్లకు బోర్ కొట్టకుండా సినిమాలా తీయాలని గట్టిగా అనుకున్నాం. అలా గాడ్ పట్టాలెక్కింది. గ్యాంగ్‌స్టర్– సీమ రాజకీయాలు... వెబ్‌సిరీస్‌ను కూల్‌గా ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని అందించేలా స్క్రిప్ట్‌ను తయారుచేశాం. 1970 ప్రాంతంలో ఓ కుటుంబం బతుకుదెరువు కోసం ఓ కొత్త ప్రదేశానికి వెళుతుంది. అక్కడ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించిన కుటుంబంలోని పెద్ద ఎలా గ్యాంగ్‌స్టర్‌గా రాజకీయ నాయకుడిగా ఎదిగాడో చెబుతుంది. ప్రతి ఎపిసోడ్‌కు సినిమా తరహాలో బిగినింగ్, మిడిల్, ఎండింగ్ ఉండేలా ప్లాన్‌చేశాం. బోల్డ్ డైలాగ్స్, రా కంటెంట్‌తో రాజకీయ పార్టీలు , సీమ రాజకీయాలు, కుటుంబంలోని పాత్రలతో వెబ్‌సిరీస్ ఉంటుంది. అప్పుడు కోపంలో, సంతోషంలో, విషాదంలో ఎలా మాట్లాడతారో..అలాబోల్డ్ డైలాగ్స్ ఉంటాయి. చిత్రంలో నటుడు ఎల్బీ శ్రీరాం డీఎన్ రెడ్డి పాత్రలో జీవించారు. ఈ వెబ్‌సిరీస్‌కు సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ అద్బుతంగా ఇచ్చాడు. సుద్దాల అశోక్‌తేజ రచనలో రాకాసి పాట నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. కొత్త ప్రదేశంలో చిత్రీకరణ.. 1970 ప్రాంతంలో పరిస్థితులు, అప్పటి స్థితిగతులు ఎలా ఉంటాయో చెప్పాలంటే ప్రత్యేకమైన ప్రదేశం కావాలి. అలా కర్ణాటక ప్రాంతంలో సీమకు దగ్గరగా ఓ ప్రదేశాన్ని చూశాం. ఈ ప్రదేశమే యునెస్కో హెరిటేజ్‌గా పేరొందిన అనెగుండి. అక్కడ కొత్తగా నిర్మాణాలు చేపట్టడానికి ఉండదు. రెండంతస్తుల భవనం కూడా ఉండదు. ఇక్కడ ఇళ్ళు, నిర్మాణాలు చాలా పురాతనమైనవి. అక్కడ రాళ్ళు మాట్లాడేలా కట్టడాలు, కొండలు ఉంటాయి. ఇక్కడే షూటింగ్ చేశాం. చాలా మంచి అనుభూతితో పాటు చాలా హెల్ప్ అయింది ఈ ప్రదేశం. మైనింగ్ సన్నివేశాలను బళ్ళారిలో చిత్రీకరించాం. టీం వర్క్‌తోనే విజయం.. ఏదైనా టీం వర్క్‌తోనే విజయం సాధిస్తాం. రైటింగ్ టీంతో పాటు యాక్టర్స్, చిత్ర యూనిట్ వెబ్‌సిరీస్ కోసం చాలా కష్టపడ్డారు. తెలుగు వెబ్‌సిరీస్‌లో గాడ్స్ ఆఫ్ దర్మపురి కొత్త తరహాను చూపించిందని చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. నాకు తెలిసి భవిష్యత్‌లో వెబ్‌సిరీస్‌కు, యాప్స్‌కు సినిమాకు మించిన డిమాండ్ ఉంటుందని నా అభిప్రాయం. సినిమా దర్శకుడిగా వెబ్‌సిరీస్‌లకు మరింత ఆదరణ రావాలని కోరుకుంటాను. ఎందుకంటే సినిమా, టీవీలాగా వెబ్‌సిరీస్ ద్వారా మరికొంత మందికి ఉపాధి కలుగుతుంది. -
అన్ని స్థితులూ ఆ దైవం కల్పించినవే
జీవితం విభిన్న స్థితుల సంగమం. సుఖ దుఃఖ సమ్మేళనం. సంతోషం– బాధ, ఆనందం– విచారం, తీపీ– చేదూ; శీతలం– ఉష్ణం; సంతృప్తీ– అసంతృప్తీ; శాంతి–అశాంతీ ఉన్నాయి. ఇదంతా దైవాభీష్టం. అందుకని ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నిరాశానిస్పృహలకు లోను కాకూడదు. ఇవన్నీ దేవుని తరఫునే అని భావిస్తూ, ఆ కరుణామయుడే వీటినుండి విముక్తి కలిగిస్తాడని నమ్మాలి. ఇదేవిధంగా కష్టాలు దూరమై, పరిస్థితులు మెరుగు పడి, అంతా సజావుగా జరిగిపోతూ, సుఖసంతోషాలు ప్రాప్తమైతే అది తమ గొప్పదనమేనని, తమ రెక్కల కష్టార్జిత ఫలితమేనని భావించి విర్రవీగకూడదు. ఇదంతా అల్లాహ్ అనుగ్రహమని, ఆ కరుణామయుని ప్రసాదితమన్న విశ్వాసంతో ఉండాలి. ఆయన ఎప్పుడు కోరితే అప్పుడు తాను ప్రసాదించిన అనుగ్రహాలను తిరిగి లాక్కోగలడు. కాబట్టి ప్రతి అనుగ్రహానికీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. అల్లాహ్ ఇలా అంటున్నాడు:‘మానవులారా! నా ప్రసన్నత కోసం, నేను ప్రసాదించే పుణ్యాన్ని పొందే సంకల్పంతో, దుఃఖ సమయం ఆసన్నమైనప్పుడు సహనం వహించినట్లయితే, నేను స్వర్గం కన్నా తక్కువైన దాన్ని, స్వర్గం తప్ప మరిదేన్నీ మీకు ప్రసాదించడానికి ఇష్టపడను.’ప్రతి వ్యవహారంలో, ప్రతిస్థితిలోనూ వారికి శుభాలే శుభాలు. వారికి శాంతి, సుఖ సంతోషాలు ప్రాప్తమైతే దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇది వారి పాలిట శుభాలపంట. ఒకవేళ వారికి దుఃఖ విచారాలు కలిగితే, ఇదీ దైవ నిర్ణయమేనని భావిస్తూ సహనం వహిస్తారు. ఈ సహనం వహించడం కూడా వారి పాలిట శుభాల పంటే అవుతుంది. ప్రాపంచిక జీవితంలో కష్టనష్టాలు, సుఖ సంతోషాలు చాలా సహజ విషయాలు. వీటి ద్వారా దైవప్రసన్నత, ఆయన సామీప్యం పొందడానికి శక్తివంచనలేని ప్రయత్నం చేయాలి. సుఖ సంతోషాలు, శాంతి సంతృప్తులు ప్రాప్తమైనప్పుడు దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. కష్టాలు కడగండ్లు ఎదురైతే, జరగరాని సంఘటనలు ఏమైనా జరిగి కష్టనష్టాలు, బాధలు సంభవిస్తే సహనం వహించాలి. అంటే, అన్ని స్థితులనూ సమానంగా ఆస్వాదించగలగాలి. ఇలాంటి వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. తన కారుణ్య ఛాయలో చోటు కల్పిస్తాడు. -
దేవుని ప్రేమను చర్చి ప్రత్యక్షంగా కనపర్చాలి
కాకులా? అరవడానికి తప్ప అవెందుకు పనికొస్తాయి? అంటుంది లోకం. కరువులో చిక్కుకున్న నా సేవకుడు ఏలియాను పోషించేందుకు కాకులు నాకు చాలా ఉపయోగకరమైనవి అంటాడు దేవుడు. మనిషి ఆలోచనలకు, దేవుని ఆలోచనలకూ మధ్య ఇంత తేడా ఉంటుంది. కరువులో, కారడవిలోని కెరీతు వాగు దగ్గరి ఒక గుహలో ప్రార్థనాదీక్షలో అజ్ఞాతంగా ఉన్న ఏలియాకు మరి ఆహారమెలా? అని ఆలోచించిన ప్రేమామయుడు దేవుడు. అందువల్ల ప్రవక్తకు దేవుడు ప్రతిరోజూ కాకులతోనే ఆహారం పంపి పోషించాడు ( 1 రాజులు 17:4–6). ఇలా పేదలు. ధనికులు, పండితులు, పామరులన్న వివక్షకు తావులేని సమదృష్టి, సమ న్యాయమున్న దేవుని అనంతమైన ప్రేమను అపొస్తలులు సరిగ్గా ఒడిసిపట్టుకున్నారు కాబట్టే వాళ్ళు స్థాపించిన ఆదిమ చర్చి పేదరికంలో కూడా అత్యంత ప్రభావంతో విస్తరించి దేవునికి మహిమ తెచ్చింది. ఆదిమ కాలంలో చర్చిలన్నీ పేదలు, శరణార్థులైన విశ్వాసుల ఇళ్లలోనే స్థాపించబడ్డాయి, అందువల్ల చర్చి అనేది ఒక అనువైన స్థలమే తప్ప, అందమైన మహా కట్టడం కాదు. అయితే దేవుని సహజ స్వభావమైన సార్వత్రిక ప్రేమ, సమన్యాయం, సమదృష్టికి దూరంగా, విరుద్ధంగా నడిచే ఏ చర్చి, పరిచర్య, విశ్వాస జీవితమైనా అది దైవవ్యతిరేకమైనదే. యేసు పరలోకారోహణ తర్వాత ఆనాడు మేడగదిలో వినూత్న విశ్వాసుల సమక్షంలో, వాళ్ళే సభ్యులుగా ఆవిర్భవించిన ‘చర్చి’ దేవుని అద్భుతమైన ప్రేమకు మరో సాదృశ్యం, సాధనం కూడా. అందుకే యేసుప్రభువు ప్రేమను భూదిగంతాలకు వెళ్లి ప్రకటించాలన్న దేవుని మహాభీష్టాన్ని నెరవేర్చే విశ్వాససమూహమైన చర్చికి యేసు ప్రభువే శిరస్సని పౌలు తన పత్రికల్లో వర్ణించాడు. చర్చికి దేవుడిచ్చిన విశిష్టమైన స్థానమిది. అయితే రాను రానూ బాహ్యసౌందర్యానికి, సంఖ్యాబలానికే ప్రాముఖ్యతనిచ్చిన కారణంగా కాపరులకు, చర్చి సభ్యులకు మధ్య అసలు సంబంధమే లేని మెగా చర్చిలు ఆవిర్భవించాయి. చర్చి కాపరి, చర్చిలో విశ్వాసులతోనే నివసిస్తూ ఒక తండ్రిగా, దేవుని ప్రేమ మూర్తీభవించిన ఒక నిస్వార్థ నాయకుడుగా, వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకునే ఆప్తుడని అర్థం. ఆదిమ అపొస్తలులు అలాగే ఉన్నారు అందుకే చర్చి ద్వారా దేవుని ప్రేమ భూదిగంతాలకు పాకింది. అయితే చర్చి భవనాలు గొప్పగా నిర్మించి తాము కూడా చాలా గొప్పవాళ్లమనిపించుకోవాలన్న పరిచారకుల దురాశయం కారణంగా, మెగా చర్చిలు ఏర్పడ్డాయి.కానీ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, నిరాశ్రయులను, నిరుపేదలను ఆదరించడమే నిజమైన క్రైస్తవమనే సత్యం మాత్రం పూర్తిగా మరుగున పడింది (మత్తయి 25: 35,36). ధనార్జనే ధ్యేయం గా, చివరికి బైబిల్లోని దశమభాగం సూత్రాన్ని వక్రీకరించి, నిరుపేదల నుండి కూడా ముక్కుపిండి డబ్బు వసూలు చేసే సుంకరుల్లాంటి కాపరుల తరంలో చర్చి వ్యాపార కేంద్రంగా మారింది. ఒక్క చర్చి కోసం పడే శ్రమతోనే, వంద చర్చిల కానుకల్ని రాబట్టాలన్న వ్యాపారపు కాసుల గోలే తప్ప, విశ్వాసుల సంక్షేమమే పట్టని ఇలాంటి ‘చర్చి’కి యేసు శిరస్సు ఎలా అవుతాడు? దేవుడే విశ్వాసులతో పాటు ఉండాలనుకొని తనను తాను ‘ఇమ్మానుయేలు’ అంటే ‘దేవుడు మనకు తోడు’ అని పిలిపించుకోగా, విశ్వాసులకు దూరంగా ఉండాలనుకునే బోధకుడు ఆ దేవుని ప్రతినిధి ఎలా అవుతాడు? మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రా ణం పెడతాడని యేసుప్రభువన్నాడు (యోహాను 10:11). అలాంటి ప్రభువు దృష్టి్టలో ఈ కాపరులు ఏమవుతారు? కాకులు కూడా నాకు కావాలనుకున్న దేవుని ప్రేమ ఎక్కడ? ఎంతటి విశ్వాసులైనా నాకు వాళ్ళఖ్ఖర్లేదు. వాళ్ళిచ్చే కాసులు, నాకొచ్చే పేరే నాకు ముఖ్యం అనుకునే ఈ చర్చిలు, కాపరులెక్కడ? –రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకులు, ఆకాశధాన్యం -
పరలోకాన్ని దూరం చేసిన ‘అనుమానం’!!
ఇంత అందమైన తోటలోని మధురాతిమధురమైన ఫలాల్లో కొన్నింటిని దేవుడు తినొద్దన్నాడా? దేవుడు నిజంగా అలా అన్నాడా?’ అన్న సాతాను ప్రశ్న, తొలి మానవులైన ఆదాం, హవ్వలను సందిగ్ధంలో, ఆ తర్వాత ఆత్మీయమైన అగాథంలో పడేసింది. యుక్తిపరులు అబద్ధాల ప్రచారం కోసం ఇలాంటి తెలివైన ప్రశ్నలు వేస్తుంటారు. అప్పుడప్పుడే తొలి మానవులతో ఆరంభమైన ఈ లోక సందడి, చరిత్ర, సంస్కృతిలో, సాతాను ఇక నుండీ తాను నాటబోయే అబద్దాలకోసం ’ఇది నిజమా?’ అన్న తన ప్రశ్నతో మనిషి హృదయంలోనే ఒక వేదికను నిర్మించుకున్నాడు. దేవుడు తన నివాస స్థానమైన పరలోకానికి, తన సొంతమైన శాశ్వతత్వానికి ముంగుర్తుగా తానే స్వయంగా తొలి మానవుల కోసం నిర్మించిన ఏదెను తోటను ధ్వంసం చేసేందుకు పన్నిన కుట్రలో భాగంగా సాతాను ముందుగా మనిషి హృదయంలో ఇలా పాగా వేశాడు. సత్యాన్ని దేవుడు తన మాటలు, చేతలతో ప్రతిష్ఠిస్తే, దానికి పోటీగా అనుమానాలే పునాదిగా సాతాను అబద్ధాలను నిర్మిస్తాడు. తాను ప్రకటించిన ‘సత్యాన్ని’ మనిషి సంపూర్ణ విధేయతతో జీవితంలో ఆచరించాలన్నదే దేవుని అభీష్టం కాగా, ‘మీకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి’ అన్న పద్ధతిలో సాతానేమో తొలిమానవులకు ‘జ్ఞానాన్ని’ నూరిపోసేందుకు ప్రయత్నించడంతో అసలు సమస్యంతా ఆరంభమయ్యింది. దేవుడు ప్రతిష్టించిన ‘సత్యం’ కన్నా సాతాను నూరిపోసిన జ్ఞానమే ఆదాము, హవ్వలను ఆకట్టుకోవడంతో, అంత కాలం వాళ్లు చూసేందుకు కూడా భయపడిన ‘నిషిద్ధ వృక్షఫ లం’ ఇపుడు సాతాను తెరిచిన లోకజ్ఞానమనే నేత్రాలతో చూస్తుంటే ‘ఆహారానికి మంచిదిగా, చూసేందుకు అందమైనదిగా, వివేకాన్నిచ్చే రమ్యమైనదిగా’ ఆ ఇద్దరికీ కనిపిస్తోంది (ఆది 3:6). మానవాళి సంక్షేమం కోసం దేవుడు సరిహద్దులనేర్పరచి వారిని విశ్వాసులను చేయాలనుకుంటే, సరిహద్దుల్ని తామే చెరిపేసుకొని భ్రష్టత్వాన్ని సంపాదించుకొనే జ్ఞానబోధతో నింపబడి, ఆదాము, హవ్వలు అపరమేధావులయ్యారు. దేవుని సత్యాన్ని ఆచరించడం కన్నా, ‘కొత్త విషయాలు తెలుసుకోవడం’ అనే మేధావితనమే, మానవాళికి అప్పటి నుండి ప్రధానమయ్యింది. దేవుని ఆజ్ఞ కన్నా, తాము పొందిన కొత్త బోధనే నమ్ముకొని వాళ్ళు నిషిద్ధఫలాన్ని తిని, పరలోకాన్ని, ఏదెను తోటను, దేవుని నిత్యసహవాసాన్ని కూడా పోగొట్టుకొని నిజంగానే దిగంబరులయ్యారు. అందువల్ల దేవుడు మానవాళికివ్వాలనుకునే పరలోకం పూర్తిగా విశ్వాసి విధేయతకు సంబంధించిన అంశమే అని తెలుసుకోవాలి. సూక్తులు, బోధలు, సలహాలు, జ్ఞానాంశాలున్న పుస్తకం కాదు బైబిల్!! విశ్వాసులంతా తూచా తప్పకుండా ఆచరించి జీవనసాఫల్యాన్ని పొందేందుకు గాను దేవుడు నిర్దేశించిన ఖచ్చితమైన ఆజ్ఞలు అందులో ఉన్నాయి. అందువల్ల వాటిపై చర్చలకు, వాటిలో మార్పులు చేర్పులకు ఏ మాత్రం తావు లేదు. ‘నిన్నువలె నీ పొరుగు వాణ్ని ప్రేమించు’ అన్నది ఆజ్ఞే, ‘నీ శత్రువును ప్రేమించు’ అన్నది కూడా ఆజ్ఞే!! అవి పాటించక పోతే దేవుణ్ణి ధిక్కరించినట్టే...ఈ విధేయతలోని రహస్యం తెలిసిన వాళ్ళే నిజమైన విశ్వాసులు, ఈ లోకాన్ని దేవుని రాజ్యంగా మార్చగల దేవుని పిల్లలు, దైవిక సాధనాలు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకులు – ఆకాశధాన్యం -
విశ్వానికి ఆదిశిల్పి పుట్టిన రోజు
ఎవరిచే ఈ విశ్వమంతా సృష్టించబడిందో అతడే విశ్వకర్మ. ఆయన ఈ చరాచర సృష్టి నిర్మాత. ఆదిశిల్పి. తొలి యజ్ఞకర్త. ఈ భూమినీ.. ఆ స్వర్గాన్నీ నిర్మించినవాడు. విశ్వకర్మ అనే పదం ముందుగా మనకు వినబడేది రుగ్వేదంలోనే. విశ్వకర్మ విశేష ప్రజ్ఞ కలవాడు. పుట్టిన ప్రతి ప్రాణికీ కావాల్సిన వాటిని అందించేది ఈయనే. అతడికి అన్నివైపులా చూసే కళ్లున్నాయి. అన్నివైపులా ముఖాలున్నాయి. అంతటా ప్రసరించే చేతులు, కాళ్లున్నాయి. ఈ భూమినీ.. ఆ ఆకాశాన్ని సృష్టించింది ఈయనే. అందరికీ శుభాన్ని కలుగజేసేవాడు ఇతడేనని రుగ్వేదం పదోమండలంలో రెండు సూక్తాలలో విశ్వకర్మ విశిష్టత తెలుస్తుంది. తొలి హోత యజుర్వేదంలో సముద్రస్వరూపుడిగా, ప్రవహించే నదులకు అధిపతిగా వసిష్ఠాది పంచ ఋషులలో ఒకడిగా, 33 మంది దేవతల్లో ప్రజాపతిగా, విశ్వానికి శుభం కలిగించే శంభువుగా, త్వష్టగా, దేవతలకు పురోహితుడిగా యజుర్వేదంలో కనిపిస్తే, సామవేదం విశ్వకర్మను వరుణుడితో, ఇంద్రుడితో సమానంగా చెబుతూ.. తన శక్తి, మహిమలతో భూమి ఆకాశాలను విస్తరించాడనీ, సూర్యుణ్ణి ప్రకాశవంతుడిగా చేసిన దేవుడనీ, సర్వకార్య సమర్ధుడని, విశ్వరూపి యజ్ఞంలో తనను తాను సమర్పించుకున్నాడని, వెలుగు చీకటిని పటాపంచలు చేసినట్లు.. ఇతడు సకల శత్రువులనూ నాశనం చేస్తాడని చెబుతుంది. సకల ప్రాణదేవుడు ఉత్తరదిక్కు నుంచి వచ్చే ఆపదలను కాపాడే దేవుడనీ, ప్రజాపాలకుడనీ, సకలప్రాణులలో ఉండే ప్రాణదేవుడనీ, లోకంలో సత్యాన్ని పాలించే ఋతధర్మ ప్రవర్తకుడని అధర్వవేదంలోని కొన్ని సూక్తాలు వివరించాయి. అందరి అంతరాత్మ విశ్వకర్మను ఉపాసిస్తే ఆత్మబుద్ధి ప్రకాశిస్తుందనీ, ఇతడు సకల జీవుల హృదయాల్లో నివసిస్తాడనీ, ఇతడిని మనస్సుతో తెలుసుకుంటే అమృతత్త్వాన్ని పొందవచ్చని శ్వేతాశ్వతరోపనిషత్తు చెబుతుంది. ఈ విశ్వమయుడికి ఆకాశమే శిరస్సు. సూర్యచంద్రులే కళ్లు. దిక్కులే చెవులు. వేదమే వాక్కు. వాయువే ప్రాణం. విశ్వమే హృదయం. భూమియే పాదం. ఈ విశ్వకర్మే అందరి అంతరాత్మ అని ముండకోపనిషత్తు, వాస్తుసూత్రోపనిషత్ తెలిపాయి. దేవశిల్పి దివిలో, భువిలో, అంతరిక్షంలో, పాతాళంలో, అంతటా ఏ చిన్న శిల్పం కనిపించినా అది విశ్వకర్మ నిర్మితమేనని వాయుపురాణం చెప్తుంది. వేదకాలం నాటి విశ్వకర్మ సకల జగన్నిర్మాతగా కనిపిస్తే పురాణాలలో దేవతలకు కావాల్సిన నగరాలను నిర్మించినట్టు కనిపిస్తుంది. ఇంద్రుడికి అమరావతిని, ఇంద్రప్రస్థపురాన్ని నిర్మించి ఇస్తే, కుబేరుడి కోసం లంకానగరం, పుష్పక విమానం, కృష్ణుడికోసం సముద్రం మధ్యలో ద్వారకానగరం, త్రిపురాసురసంహారంలో శివుడి కోసం దివ్య రథాన్ని, కురుచక్రవర్తులకు హస్తినాపురాన్నీ, సూర్యుడిని తరిణెపట్టి ఆ రజును(పొడి)తో విష్ణువుకు సుదర్శనచక్రాన్ని, శివుడికి త్రిశూలాన్ని ఇచ్చిన విషయాలు సుప్రసిద్ధం. రూపం – పంచముఖుడు వేదాలలో నిర్గుణ పరబ్రహ్మగా కీర్తించబడిన ఈయన పురాణాల్లో సాకారంగా దర్శనమిస్తాడు. ఐదు తలలు, పది చేతులు, ప్రతి ముఖానికి మూడు కళ్లు, తలపై జటామకుటంతో, శరీరమంతా బంగారపు కాంతితో వెలిగిపోయే విశ్వకర్మ స్వరూపాన్ని స్కాందపురాణం నాగరఖండం వివరించింది. పద్మపురాణం కూడా ఇదే రూపాన్ని వర్ణిస్తూ విశ్వకర్మ చుట్టూ పంచబ్రహ్మలు, పంచశిల్పర్షులు, సకల దేవతలు, సప్తర్షులు నిలిచి ఆయనను సేవిస్తుంటారనీ, పద్మపురాణం స్కందోత్పత్తిప్రకరణం తెలుపుతుంది. విశ్వకర్మ రూపం పొడవైన తెల్లటి గడ్డం, వృద్ధరూపంతో మనకు చాలా చోట్ల దర్శనమిస్తుంది. నిజానికి దేవతలు నిత్యయవ్వనులు కనుక వారికి వార్థక్యం ఉండదు. హేమాద్రి దానఖండం, దేవతామూర్తి ప్రకరణం, రూపమండనం గ్రంథాల్లో ఒకే ముఖంతో రెండు లేక నాలుగు చేతులతో, శ్రీతత్త్వనిధి గ్రంథంలో నాలుగు ముఖాలతో, నాలుగు చేతులతో విశ్వకర్మ దర్శనమిస్తాడు. సర్వదేవతాత్మకుడు తన అత్యద్భుత శిల్పకళా చాతుర్యంతో సకలలోకాలను సృష్టించిన విశ్వకర్మ తానే అన్నింటిలో వ్యాపించి ఉన్నాడు. సకలలోకాలకూ అధిపతి కనుక ఇతడు ఇంద్రుడనే పేరు పొందాడు. కర్మఫలం అనుభవించే మనల్ని మంచి మార్గంలోనడిపిస్తాడు కనుక ఇతడే అగ్ని అనీ, స్వయంగా ప్రకాశిస్తూ ఇతరలోకాలను ప్రకాశింపజేయడం వలన ఇతడే ఆదిత్యుడనీ, అంతటా వ్యాపించి ఉండటం వలన విష్ణువనీ, పరమపదాన్ని అనుగ్రహించే రుద్రుడనీ ఇలా పలుచోట్ల పలుపేర్లతో విశ్వకర్మ సర్వదేవతాత్మకుడిగా దర్శనమిస్తాడు. సకలదేవతార్చితుడు పద్మపురాణం భూఖండంలో పార్వతీపరమేశ్వరులకు విశ్వకర్మ ఒక భవనం నిర్మించి ఇచ్చినట్లు ఉంది. విష్ణువు వింటినారిపై తలపెట్టి పడుకున్నప్పుడు కుమ్మరి పురుగు తొలిచి తల తెగిపడటంతో గంధర్వుడి శిరస్సు ఖండించి విష్ణువు మొండానికి అతికించి అతడిని హయగ్రీవుడిని చేసింది విశ్వకర్మే. బ్రహ్మహత్యాపాతకంతో బాధపడుతున్న ఇంద్రుడు విశ్వకర్మ యజ్ఞం ఆచరించి తన పాతకాన్ని పోగొట్టుకొన్న విషయం భాగవతంలో కనబడుతుంది. రాముడు లంకానగరానికి సేతువు నిర్మించే సమయంలో విశ్వకర్మను పూజించి నలనీలాదిగా గల వానరుల సహాయంతో సేతునిర్మాణం చేపట్టాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తనకు కర్ణకుండలాలు, జందెం, వస్త్రం మొదలైనవి కావాలని, అవి లేకుండా తాను బయటకు రానని చెప్పిన వాయునందనుడి కోరికను గర్భంలోనే తీర్చాడు విశ్వకర్మ. తన కుమార్తెను సూర్యుడికిచ్చివివాహం చేసిన విశ్వకర్మ, సూర్యుని వేడికి తాళలేని తన కుమార్తె కోసం సూర్యుడిని తరిణె బట్టి అతడి వేడిని తగ్గించాడని ప్రతీతి. విశ్వకర్మ పూజ వలన ఏం ఫలితం? ఇంతటి విశిష్టుడైన విశ్వకర్మను మనమంతా అర్చించడం మన విధి. భూమిపై నివసించే ప్రతి ఒక్కరూ తాము నివసిస్తున్న చోటు(వాస్తు)కు అధిపతి అయిన వాస్తోష్పతి ని పూజించాలని అన్ని సూత్రగ్రంథాలు తెలిపాయి. ఆ వాస్తోష్పతే విశ్వకర్మ. విశ్వకర్మ పూజ వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయని, లక్ష్మీప్రాప్తి కలుగుతుందని, మేధస్సు పెరుగుతుందనీ, విద్యాబుద్ధులు లభిస్తాయనీ, సాంకేతిక జ్ఞానం పెంపొందుతుందనీ పద్మపురాణం చెబుతోంది. విశ్వకర్మ జయంతి ఎలా చేయాలి? కన్యాసంక్రమణాన్ని పురస్కరించుకుని విశ్వకర్మ జయంతిని జరుపుకోవడం మనకు సంప్రదాయంగా వస్తోంది. ప్రభావసు, యోగాసక్తల కుమారుడైన విశ్వకర్మ వసువు కన్యాసంక్రమణం నాడు జన్మించిన కారణంగా ఆరోజు జయంతి జరుపుతారనీ, సూర్యుడు ఆ రోజు విశ్వకర్మ రూపంలో దర్శనమిస్తాడు కనుక ఆరోజు జయంతి జరుపుతారనీ అంటారు. అయితే సకలదేవతలు, దైత్యులతోపాటు పితృదేవతలను సృష్టించింది విశ్వకర్మయే కనుక పెద్దలను స్మరించుకునే పితృపక్షాలైన ఈ సమయంలో తమ పెద్దల ఆశీస్సులకోసం, వంశవృద్ధి కోసం తండ్రుల కన్న తండ్రిని పూజించుకోవడం మనవిధి. అందరూ ఆ రోజు నిత్యకృత్యాలు నెరవేర్చుకుని ఐదు ముఖాలతో ఉన్న విశ్వకర్మ ప్రతిమను లేక కలశాన్ని స్థాపించి షోడశోపచారాలతో పూజించి, ‘ఓం నమో విశ్వకర్మణే‘అనే అష్టాక్షరీ మహామంత్ర జపం చేసి, ఐదుగురు సంప్రదాయ శిల్పాచార్యులను విశ్వకర్మ స్వరూపంగా పూజించి, అన్న వస్త్ర తాంబూలాలతో వారిని సంతోషపెట్టాలి. ఈనాడు యజ్ఞం ఆచరించడం ద్వారా విశ్వకర్మను పూజించే సంప్రదాయం దేశమంతా ప్రబలంగా ఉంది. ఈ ఆచరణతో సమస్త మానవాళి సుఖసంతోషాలతో తులతూగుతారు. లోకకళ్యాణం, విశ్వశాంతి కలుగుతుంది. – కందుకూరి వేంకట గోవిందేశ్వరశర్మ, విశ్వకర్మాగమ పండితులు -
దేవుని దయ ఉంటే... కొండ భూమి కూడా సాగు భూమే!
జీవితంలో సవాళ్లు, భయాలు లేని వారెవరు? కాకపోతే వాటికి లోబడి జీవించడం మానేసి బతుకు వెళ్లదీస్తున్నవారు చాలామందైతే, వాటిని అధిగమించి నిర్దిష్ట లక్ష్యాలను చేరుతూ సాఫల్యంతో జీవించేవాళ్ళు మాత్రం చాలా కొద్దిమంది. యూదా గోత్రపు వాడైన కాలేబు ఆ రెండో కోవకు చెందినవాడు. ‘నాకు కొండప్రాంతాన్ని ఇవ్వు, ఎంతో బలాఢ్యలైన అనాకీయులుండే ప్రాకారాల పట్టణాలక్కడ ఉన్నా, యెహోవా సాయంతో నేను అదంతా స్వాధీనం చేసుకుంటాను’ అని కాలేబు వాగ్దాన దేశంలో స్వాస్త్యాలను పంచుతున్న యెహోషువాను అడిగాడు .అప్పుడాయనకు 85 ఏళ్ళు! సారవంతమైన నేల, సులభంగా స్వాధీనం చేసుకోవడానికి వీలుగా బలహీనులుండే పట్టణాలివ్వమని అడగడం సాధారణంగా ‘తెలివైనవారు’ చేసేపని. ఈ లోకం దష్టిలో ‘తెలివి’ అంటే దేన్నైనా సులభంగా, సునాయాసంగా వశం చేసుకోవడమే కదా? కానీ 85 ఏళ్ళ కాలేబు హృదయంలో అసాధారణమైన విశ్వాసానికే తప్ప అలాంటి చౌకబారు ఆలోచనలకు తావులేదు. ఇశ్రాయేలు దేశాన్ని వేగు చూడమని మోషే పంపిన 12 మందిలో కాలేబు, యెహోషువ అనే ఇద్దరు తప్ప మిగిలిన 10 మంది అక్కడి ప్రజలు, పట్టణాలను చూసి బెదిరిపోయి వెనక్కి తిరిగి ఐగుప్తుకెళ్లి బానిసలుగా బతకడమే మేలని వాపోయారు. కానీ దేవుడే మనతో ఉన్నాడు కాబట్టి ఆ దేశాన్ని చిటికెలో స్వాధీనం చేసుకోవచ్చునన్నారు కాలేబు, యెహోషువ.. ఇపుడు అదే కొండంత విశ్వాసం, చెట్టంత గుండెతో తనకు కొండ ప్రాంతాన్నివ్వాలంటున్నాడు. కాలేబు. పిరికితనం పుట్టుకతోనే వస్తుంది, ధైర్యం, తెగింపు మాత్రం దేవుని ఎరిగిన జ్ఞానంతో, దేవుడు నాతో ఉన్నాడన్న విశ్వాసంతో సమకూరుతుంది. సవాళ్లు, సమస్యలు లేని సాఫీ జీవితాన్ని కోరుకోవడం మంచిదే. కాకపోతే పుట్టడానికి గిట్టడానికి తప్ప మరెందుకూ పనికిరాని పుట్టలోని చెదలకు మనకు అపుడు తేడా ఉండదు. సామాజిక బాధ్యతల నెరవేర్పు కోసం అత్యంత ఉదాత్తమైన ఆశయాలతో నిర్మించబడిన మనిషి ‘నేను, నా కుటుంబం’ అనే గిరి దాటకుండా బతకాలనుకుంటే, దేవుడు కాదనడు. కానీ మనిషి తనను తాను అలా నియంత్రించుకోవడం చూసి దేవుడు తప్పకుండా నొచ్చుకుంటాడు. మరయంత్రాన్ని, ఎలక్ట్రిసిటీని, టెలిఫోన్ ను, రేడియోను, విమానాలను, కంప్యూటర్లను ఇలా ఎన్నింటినో కనుగొని మన సామాజిక జీవనాన్ని సులభతరం చేసిన వారంతా అనేక సవాళ్లనెదుర్కొని, అడుగడుగునా కష్టాలపాలై జీవించినవాళ్ళే. అయితే తమ కృషి, పట్టుదల ద్వారా తమ ప్రత్యేకతను చాటుకొని వాళ్ళు సమాజానికి దిశా నిర్దేశం చేశారు. ఆయుష్షును నిస్పృహతో అరవై, డెబ్భై అంటూ నంబర్లతో నిర్వచించే వాళ్లకు జీవితం విలువ, జీవితాన్ని నడిపే దేవుని విలువ తెలియదు. తన 85 ఏళ్ళ జీవితంలో 45 ఏళ్ళు కాలేబు ఐగుప్తులో ఫరో బానిసగా దుర్భరంగా బతికాడు, ఆ తర్వాత 40 ఏళ్ళు అరణ్యంలో ఒక లక్ష్యం అంటూ లేకుండా అందరితో కలిసి బతకాల్సి వచ్చింది. ఇపుడు వాగ్దానదేశంలో. సమాధికి సిద్ధంగా ఉన్నామని అంతా భావించే 85 ఏళ్ళ వయసులో, కొండప్రాంతాన్ని తనకిస్తే కొట్లాడి దాన్ని స్వాధీనం చేసుకొంటానని ప్రకటిస్తున్నాడు. అదే చేశాడు కూడా. దేవుణ్ణి ప్రసన్నుని చెయ్యడమే కాదు, ఆయన్ను ఆశ్చర్యపరిచే విశ్వాసం ఇది. దేవుడు తమతో ఉన్నాడని నమ్మేవాళ్ళెపుడూ ఆయన ఆశీర్వాదాలకు నిలయంగానే ఉంటారు. వాళ్ళెక్కడ కాలు పెడితే అక్కడికి ఆశీర్వాదాలు కూడా వెళ్తాయి. ‘వారు బాకాలోయలో వెళ్తూ దాన్ని జలమయం చేస్తారన్నది దేవుని వాగ్దానం (కీర్తన 84:6). కొందరు కాలు పెడితే పచ్చని స్థలాలు కూడా ఎడారులవుతాయి, మరికొందరు నడిస్తే అది ఎడారైనా నీటి వూటలతో నిండి సస్యశ్యామలమవుతుంది. విశ్వాసుల బాటను దేవుడే అలా మార్చుతాడు – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ prabhukirant@gmail.com -
దేవుని ఉద్యమ సారథులు వీళ్ళు...
దేవుడు ఉద్యమిస్తే ఎలాంటి దెయ్యమైనా జడిసి తోకముడవాల్సిందే!! మరి దేవుడు ఎప్పుడు ఉద్యమిస్తాడు? ఆ అవసరం ఎందుకొస్తుంది? పాలకుల చేతుల్లో తన ప్రజలు దుర్భరమైన అణిచివేతననుభవిస్తూ, క్రుంగి కృశించి, దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు దేవుడు వారి పక్షంగా ఉద్యమిస్తాడు. ఐగుప్తులో 430 ఏళ్ళ పాటు దుర్భర బానిసత్వంలో మగ్గిన ఇశ్రాయేలీయుల మొర విని దేవుడు మోషే ద్వారా ఉద్యమించి వారి కష్టాలు తీర్చాడు. మిద్యానీయులనే అతిక్రూరమైన శత్రువుల చేతిలో విలవిలలాడుతున్న తన ప్రజల హాహాకారాలు, ప్రార్థనలు విని దేవుడు గిద్యోను అనే మరో విశ్వాసిని ప్రేరేపించి తన ఉద్యమాన్ని సాగించి శత్రువులను మట్టి కరిపించి తన ప్రజలనాదుకున్నాడు. ఒకటి మాత్రం సత్యం. అత్యంత బలవంతుడైన దేవుడు, తన ప్రజల నిస్సహాయ స్థితిని భరించలేడు, వారినలా చూస్తూ ఉరుకోలేడు. కాకపోతే దేవుని సంకల్పానికి తలవంచే ఒక మోషే, ఒక గిద్యోను వంటి అసమాన విశ్వాసులు ఆయనకు కావాలి. గిద్యోను ఎంతో రోషమున్న వాడు, దేవుడంటే గొప్ప విశ్వాసమున్నవాడు. దేవుని మహిమను, ప్రభావాన్ని ప్రత్యక్షంగా చవి చూసిన గిద్యోను తన పదివేలమంది సైన్యంతో యుద్ధానికి పోబోతే, ‘నేను నీతో ఉన్నానని తెలిసింది కదా? పదివేలమందితో కాదు, కేవలం మూడువందల మందితో అంత అసంఖ్యాకమైన శత్రువులనెదుర్కో’మన్నాడు. కావాలంటే శత్రు శిబిరంలోకి రాత్రివేళ మారువేషంలో వెళ్లి శత్రువులు నీ గురించి వాళ్ళేం మాట్లాడుకొంటున్నారో వినమని దేవుడు చెబితే గిద్యోను ఆదే చేశాడు. గిద్యోను దేవుడు చాలా బలవంతుడు, అందువల్ల గిద్యోను ఖడ్గానికి ఎదురు లేదు, అతన్ని ఎదుర్కొనేవారు ఇన్ని లక్షలమందిలో ఒక్కరూ లేరని వాళ్ళు నిస్పృహతో మాట్లాడుకోవడం విన్న గిద్యోను విశ్వాసంలో మరింత బలపడి కేవలం మూడువందలమందితోనే ఎంతో వ్యూహాత్మకంగా యుద్ధం చేసి శత్రువులను మట్టి కరిపించి ఘన విజయం సాధించాడు. శత్రువులు తమ ధనబలం, జనబలం, కండబలాన్ని చూసి అతిశయిస్తే, దేవుడెన్నుకున్న విశ్వాసులు తమ దేవుని బట్టి మాత్రమే అతిశయిస్తారు. ఆ యుద్ధంలో గిద్యోను సాధించిన ఘన విజయంతో ఇశ్రాయేలీయులు ఎన్నో ఏళ్ళు శాంతి సౌఖ్యాలు, ఆనందంతో జీవించారు. దేవుని ఉద్యమాల పర్యవసానమెప్పుడూ సర్వజన కల్యాణం, అసహాయులు, నిరుపేదల ఆనందమే!! బలహీనులు, అసహాయులైన తన ప్రజలనాదుకోవడానికి దేవుడెప్పుడూ సంసిద్ధుడే. అందుకాయన తన కోసం కొందరిని ప్రత్యేకించుకొని వారికి శ్రమల ద్వారా శిక్షణనిచ్చి తన ప్రజల సంరక్షణార్థం, వారి సంక్షేమం కోసం వాడుకొంటాడు. దేవుని పక్షంగా దీనప్రజల సంక్షేమం కోసం దేన్నైనా చెయ్యడానికి సదా సంసిద్ధులైన నిస్వార్థపరులను దేవుడు పురికొల్పి ఉద్యమ నాయకత్వాన్ని వారికిచ్చి నడిపిస్తాడు. దేవుడు అలాంటి వ్యక్తుల ద్వారానే తన గొప్ప కార్యాలు చేసి ప్రజలకు ఉరటనిస్తాడు. ‘స్పందించే సున్నిత హృదయం, ఆశ్రితులను ఆదుకునే బలమైన చేతులు’ దేవుడు తానెన్నుకున్న వాళ్ళకిచ్చే బహుమానాలు. దేవుడు ఉద్యమిస్తే ఆశీర్వాదాల ప్రవాహమే!!..కోట్లాదిమందిలో దేవుడు తన ఉద్యమం కోసం ఎవరో ఒకరినే ఎన్నుకుంటాడు, తన పనిని అతని ద్వారా సంపూర్ణంగా నెరవేరుస్తాడు. అప్పటి మోషే, గిద్యోను, దావీదు.. నిన్నటి ఒక మార్టిన్ లూథర్, డి.ఎల్. మూడీ, లివింగ్స్టన్, జార్జి ముల్లర్... వీళ్లంతా ప్రజల కష్టాలు, కన్నీళ్లకు దేవుడు కనుగొన్న పరిష్కార ద్వారాలు, దేవుని అభిషేక సాధనాలు, గుండెల్లో ప్రజల పట్ల ప్రేమ ఊటలున్న అత్యంత సాత్వికులు... ప్రజల సంకటాలను, దేవుని కళ్ళతో చూసి, దేవుని మనసుతో అర్ధం చేసుకొని, దైవాదేశాలతో, దైవిక శక్తితో ఎన్నో కష్టాలకోర్చి ప్రజలనాదుకున్న దైవాశీర్వాదాల ప్రవాహం వాళ్ళు... ప్రజలంతా వారికోసం ఎంతగా ప్రార్ధిస్తే వారి ప్రయత్నాలు అంతగా ఫలిస్తాయి. దేవుడు వాడుకునే ఆ సేవకులకు,సేవకుల కుటుంబాలకు కూడా భద్రతకు, ఆరోగ్యానికి, ఆశీర్వాదాలకు కొరత ఉండదు. యుగ యుగాలూ దేవునికే మహిమా, ఘనత, ప్రభావాలు... – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ Email: prabhukirant@gmail.com -
పురుషాహంకారంపై శూలం
అమ్మతల్లులు ఊరినే కాదు స్త్రీలను కూడా కాపాడతారు.అమ్మ తల్లులు స్త్రీని శక్తిమంతం చేసేందుకు గ్రామాలలో వెలుస్తారు.అమ్మతల్లుల్లో అంతులేని దయ ఉంటుంది.కాని – దుష్టశక్తులపై అంతే తిరుగుబాటు ఉంటుంది.స్త్రీ తిరగబడితే మగవాడి పెత్తనం..అంతరిస్తుందని చెప్పే అంతరార్థమూ గంగజాతరలో ఉంది. తిరుపతి కొండంత కొండ, శ్రీ వేంకటేశ్వరుడంత దేవుడు, పేరూరు బండంత బండ, అవిలాల చెరువంత చెరువు, గంగమ్మ జాతరంత జాతర ఉండవని తిరుపతి చుట్టుపక్కల జనశృతి. కొండ మీద బృహ్మోత్సవాలు వేంకటేశ్వరుడి వేడుకైతే కొండ కింది గంగ జాతర గంగమ్మ ఉత్సవం. భక్తులకు అది ఎంత ఆనందకరమో ఇదీ అంత భక్తి తుల్యం. గ్రామదేవతల పట్ల ప్రజలకు ఉండే మక్కువకు, అనాది భక్తికి సంకేతం గంగ జాతర. మనిషే దేవత దేవతే మనిషి గ్రామాల పొలిమేరలను అమ్మతల్లులు కాపు కాచి ఉండటం భారతీయ సంప్రదాయంలో ఆచారం. వందల వేలాది గ్రామదేవతలు భారతదేశంలో గ్రామ పొలిమేరల్లో, గ్రామాల్లో కొలువై తమను చల్లగా చూస్తుంటారని ప్రజల విశ్వాసం. తిరుపతిలో అనాదిగా ఎందరో గ్రామదేవతలు కొలువై ఉన్నారు. వీరిలో గంగమ్మది ప్రథమ స్థానం. ఈమె తిరుపతికి మూడు కిలోమీటర్ల దూరంలో అవిలాలలో పుట్టిందని ప్రజల విశ్వాసం. ఆమె గుడి తిరుపతి ఆర్టీసి బస్టాండ్ సమీపంలో ఉంది. ఒకప్పుడు ఆ ప్రాంతం చెరువుగా ఉండేది. తాళ్లపాక అన్నమాచార్యులు తిరుపతి వచ్చి శ్రీవేంకటేశ్వరుడిని సేవించాక ఆయనకు ఇనాముగా ఈ చెరువు, భూమి దక్కాయి. అందువల్ల అప్పటికే అక్కడ వెలిసి ఉన్న గంగమ్మ చెరువు గట్టు గంగమ్మగా కాలక్రమంలో తాళ్లపాక గంగమ్మగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఈ గంగమ్మ సోదరి అయిన చిన్న గంగమ్మ గుడి నేటి తిరుపతి తుడా కార్యాలయం దగ్గర ఉంది. ఒకప్పుడు ఆ ప్రాంతంలో తాతయ్య గుంట అనే నీటి గుంట ఉండటం వల్ల ఈమెకు తాతయ్య గుంట గంగమ్మ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం గంగ జాతర అవిలాల గ్రామంతో మొదలయ్యి ఈ తాతయ్య గుంట గంగమ్మ గుడి కేంద్రంగానే సాగుతోంది. ఎండల్లో పండగ గంగ జాతర ఎప్పుడూ మే ఎండల్లో ఉంటుంది. దీనికి కారణం గంగమ్మ జన్మదినమైన చైత్ర మాసం (చిత్ర నెల) చివరి వారంలో ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీ కావడమే. ఈ జాతర జరిగే రెండు వారాలకు ముందే అవిలాల గ్రామంలో గంగమ్మ గద్దె మీద సద్ది మొదలవుతుంది. తిరుపతిలో జాతర మొదలయ్యే ముందురోజు రాత్రి అవిలాల గ్రామస్తులు, పెద్దలు గంగమ్మ సారె తీసుకొచ్చి ఊరి పొలిమేరలో చిన గంగమ్మ గుడి నుంచి ఎదురొచ్చిన పెద్దలకు ఆ సారె అప్పగించి జాతర బాధ్యత అప్పజెబుతారు. అక్కడి నుంచి చిన గంగమ్మ ఆలయ నిర్వాహకులు జాతర మొదలుపెడతారు. ‘గంగమ్మ జాతర మొదలయ్యిందహో’ అని ఊరి నాలుగు దిక్కులా చాటింపు వేయడంతో జాతర మొదలవుతుంది. జాతర జరిగినన్నాళ్లు ఇక ఊరివాళ్లు పొలిమేరలు దాటరు. వేషాలు నిండిన ఊరు చిత్తూరు జిల్లా అంతటా గంగ జాతర రెండు, లేదా మూడు రోజులు జరిగితే తిరుపతిలో మాత్రం వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. గంగమ్మ గుడి తరపున వంశ పారంపర్యంగా కైకాల కులస్తులు, (కైకాల రెడ్లు), చాకలి కులస్తులు మిరాశీదారులుగా నిలిచి వేషాలు ధరించి ఉత్సవాలలో భాగస్వాములవుతారు. వారితో పాటు భక్తులు కూడా అమ్మవారు వేసిన వేషాలు వేసుకొని తిరుగుతారు. పురుషులు స్త్రీ వేషం కడతారు. అమ్మవారి వేషం వేస్తానని మొక్కుకోవడం వేషం వేసి ఆ మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీ. మంగళవారం అర్థరాత్రి చాటింపుతో ఆరంభమయ్యే గంగజాతర మరుసటి మంగళవారం అర్థరాత్రి అమ్మవారి విశ్వరూపంలోని చెంప నరకడంతో ముగుస్తుంది. అమ్మవారి చెంప మన్ను కోసం భక్తులు పోటీలు పడతారు. ఆ మన్ను మహిమాన్వితమైన కొన్ని రేణువులైనా నీటిలో కలుపుకొని తాగితే సర్వరోగాలు నివారణ అవుతాయని నమ్మిక. తెలుగువారు తీర్థయాత్రలు, పుణ్యయాత్రలు చాలా చేస్తుంటారు. కాని తెలుగునాట జరిగే ఈ గంగజాతర ఒకసారైన దర్శించదగ్గది. ఆధ్యాత్మికత కోసమే కాదు, సాంస్కృతిక భిన్నత్వం తెలియడానికి కూడా ఈ ఘనమైన వేడుకను దర్శించాలి. గంగ జాతర రేపటితో ముగుస్తోంది. పాటూరు సుబ్రమణ్యం, సాక్షి, తిరుపతి కల్చరల్ -
మనిషిలోని దైవత్వాన్ని లోకం చూడాలి
‘నేను చేసే క్రియలకన్నా గొప్ప క్రియలు మీరు చేస్తారు’ అన్నాడు ఒకసారి యేసుప్రభువు (యోహాను 14:12). ‘నీవు పాపివి’ అంటూ వేలెత్తి చూపించిన యేసుప్రభువే మనిషిని ఇంతగా హెచ్చించడం ఒకింత ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో సృష్టించాడని బైబిల్ చెబుతోంది. అంటే మనిషి స్వరూపం, స్వభావం, సౌందర్యం, అతనిలోని స్వతంత్ర భావన, సాధికారత, సదాశయాలు, సద్భావనాలన్నీ దేవుని లక్షణాలే. అందువల్ల గొప్పపనులు చెయ్యగలిగిన శక్తిసామర్థ్యాలను దేవుడు మనిషిలో ముందే నిక్షిప్తం చేశాడు. కాకపోతే మనిషిలోని స్వతంత్ర భావనలతోనే చిక్కు ఏర్పడింది. మనిషిని తన చెప్పుచేతల్లో నడిచే ఒక మరయంత్రంగా కాకుండా స్వతంత్ర చలనం, జీవనమున్న ఒక ‘సామాజిక శక్తి’ గా దేవుడు ప్రేమతో, కనికరంతో తయారు చేశాడు. లోకాన్ని పగలంతా వెలుగుతో నింపే సూర్యుణ్ణి దేవుడు సృష్టిస్తే, రాత్రిళ్ళు కూడా ఎంతో వెలుగు నిచ్చే విద్యుచ్ఛక్తిని దానితో వెలిగే బల్బును థామస్ అల్వా ఎడిసన్ అనే మానవుడే కనుగొన్నాడు. అదే విద్యుచ్ఛక్తితో మరెన్నో పనులను మనిషి సునాయాసంగా చేసుకోగలుగుతున్నాడు. నడిస్తే గంటకు మహా అయితే నాల్గు కిలోమీటర్లు మాత్రమే నడిచే మనిషి అదే గంటకు 120 కిలోమీటర్లు నడవగల్గిన వాహనాలను, రైళ్లను, గంటకు 800 కిలోమీటర్లు దూరం ఎగిరి ప్రయాణించగల్గిన విమానాలను ఆవిష్కరించి వాటితో తన జీవితాన్ని సులభ సాధ్యం చేసుకున్నాడు. ఏ విధంగా చూసినా ఇవన్నీ గొప్ప క్రియలే, సంతోషించదగిన విజయాలే. అయితే మనిషి తన సామాజిక బాధ్యతలు నెరవేర్చే విషయంలో కూడా అంతే సమున్నతంగా వ్యవహరించి గొప్ప క్రియలు చేయాలన్నది దేవుని ఆకాంక్ష. అయితే బైబిల్ గ్రంథం మూడవ అధ్యాయంలోనే మానవ చరిత్రను, ఆధ్యాత్మికతను సమూలంగా మరో మలుపు తిప్పిన పరిణామం ఏర్పడింది. తొలిమానవులైన ఆదాము, హవ్వ దైవాజ్ఞను ఉల్లంఘించి పాపం చేశారు. నాల్గవ అధ్యాయంలో రెండవతరం వాడైన కయీను అసూయతో, పట్టరాని కోపంతో తన తమ్ముడైన హేబెలును హత్యచేసి మానవజాతిని మరింత పతనం వైపునకు మళ్ళించాడు.. అప్పటికి ప్రపంచ జనాభా నలుగురే!! పైగా వారికి శత్రువులంటూ ఎవరూ లేరు. అయినా దుర్మార్గం అంతగా ప్రబలింది. సమస్య ఎక్కడుంది? దేవుడు తనకు సహవాసంగా ఉండేందుకుగాను ఏర్పర్చుకున్న మనిషి ఇంతగా దేవునికి ఎందుకు దూరమయ్యాడు? అతని స్వతంత్ర భావనలే దానిక్కారణం. ఆ స్వతంత్ర భావనలే స్వార్థానికి, గర్వానికి, దౌర్జన్యానికి ఇలాంటి మరెన్నో దైవవ్యతిరేక దుర్లక్షణాలకు బీజాలు వేశాయి. ఆ కారణంగానే మనిషి ఒక అడుగు పురోగమనం వైపునకు మరో అడుగు తిరోగమనం వైపునకు అన్నవిధంగా ఈనాటి తన జీవనశైలిని నిర్మించుకున్నాడు. సామాజిక బాధ్యతలు నెరవేర్చడంలో పూర్తిగా వెనకబడ్డాడు. ఇప్పటి టర్కీ దేశంలో ఉన్న లుస్త్ర అనే ప్రాచీన పట్టణంలో పౌలు, బర్నబా పరిచర్య చేస్తున్నపుడు, అవిటివాడైన ఒక వ్యక్తిని పౌలు బాగుచేశాడు. వాళ్లిద్దరూ చెప్పిన సువార్తకన్నా ఈ అద్భుతకార్యం అక్కడి ప్రజలను గొప్పగా ఆకర్షించింది. అక్కడి వాళ్లంతా తమ మధ్యకు దేవుళ్ళు దిగి వచ్చారంటూ సంబరపడి వాళ్ళిద్దరికీ తమ దేవుళ్ళ పేర్లు కూడా పెట్టారు. వాళ్లకు సన్మానం చేసి జంతువులను వారికి బలివ్వడానికి కూడా ప్రయత్నిస్తే పౌలు, బర్నబా వారిని తీవ్రంగా మందలించారు. ‘మేము దేవుళ్ళం కానే కాదు, జీవము గల్గిన దేవుని వైపునకు మిమ్మల్ని తిప్పడానికి గాను యేసు సువార్త చెప్పడానికి వచ్చామంతే!!’ అంటూ వారిని శాంతింప జేశారు. ఈ రోజుల్లో కూడా సువార్తకన్నా, అద్భుతాలకే ప్రజల ప్రాధాన్యం. సువార్తికులకన్నా, అద్భుతాలు చేసే వారికే ఎక్కువ ఫాలోయింగ్!! ఇలా మనిషిలో దేవుళ్లను చూసేందుకు లోకం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ మనిషిలోని ప్రేమ, క్షమాపణ, నమ్రతతో కూడిన తన దైవికస్వరూపాన్నే లోకం చూడాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మరో దేవాలయం
నిజానికి ఇది మరో దేవాలయం. ఇది దొంగ శీర్షిక. అది తెలిసే ఎందుకు పెట్టాను? ఈ దేవాలయా నికి Focus ఇదొక్కటే కనుక. మీ కాలమ్ రుచి రహస్యమేమిటని కొందరు అడుగుతూంటారు. వారికి ఇవీ సూత్రాలు. మొదటి సూత్రం– అబద్ధం. అబద్ధానికి ఓ ‘రుచి’ ఉంది సరిగ్గా వండగలిగితే. అబద్ధం ఆశ్చర్యం, తీరా ముడి విప్పాక చిన్న కితకిత, ఎక్కువ సరదా, మీకు ముందే తెలిసిన విషయానికి ముక్తాయింపు– ఇన్ని కలగాలి. చాలా ముఖ్యంగా హర్ట్ చేయకూడదు, కోపం తెప్పిం చకూడదు. చిన్న మెలికకు నవ్వాలి. అందరితో చెప్పి నవ్వుకోవాలి. సరే. ఇంకో దేవాలయం ఏదీ? తొలుత మొదటి దేవాలయం గురించి. చాలా సంవత్సరాల కిందట పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయిబాబా తమ్ముడు జానకి రామయ్యగారు నా గదికి వచ్చి నన్ను స్వామి దర్శనానికి తీసుకెళ్లారు. స్వామి మాకు ఇంటర్వూ్య ఇచ్చారు. అదొక గొప్ప జ్ఞాపకం. అటు తర్వాత జానకి రామయ్యగారు నన్ను పుట్టపర్తి దేవాలయానికి తీసుకెళ్లారు. అక్కడ మా పాదరక్షలు విడవబోతూ ఉంటే ఒకాయన పరుగున వచ్చారు. వాటిని భక్తితో అందుకున్నారు. నేను చేస్తా నంటే ఒప్పుకోలేదు. సగం వొంగి భక్తితో ప్రసా దంలాగా అందుకున్నారు. అతనక్కడ ఊడిగం చేసే పనివాడు కాదు, స్వామి సేవకి 15 రోజులు శెలవు పెట్టి వచ్చిన ఓ గెజిటెడ్ ఆఫీసర్. ఒళ్లు పులక రించింది. ఇప్పుడు ఆసుపత్రిలోకి అడుగుపెడుతూనే రికార్డు టైములో నిర్మించిన ఈ కట్టడాన్ని చూపి మాట్లాడుతూంటే జానకి రామయ్యగారికి కళ్లనీళ్లు ధారాపాతంగా వర్షించాయి. నిజానికి అది సిమెంట్, ఇసుకతో కట్టిన భవనం కాదు. ప్రేమ, డెడికేషన్ దాని మూలస్తంభాలు. అక్కడ నాకు తెలిసిన పాత ముఖాలు కని పిస్తున్నాయి. విశాఖ మునిసిపల్ కమిషనర్ ఆఫీసు సూపర్నెంటు, నా మిత్రుని భార్య, పంజాబు మిలట్రీ కల్నల్ భార్య ఎందరో ఆఫీసర్లు అక్కడ సేవకులు. వంగి నిలుచున్నారు. సేవకులు కూడా అంత ఒద్దికగా ఉండరు. అంతటా భక్తీ– ఏ ప్రతిఫలా పేక్ష లేని సేవా తత్పరత– వీటన్నిటికీ మూల ధాతువు– స్వామి! అద్భుతం. బయటికి వస్తూ నేనూ ఏడ్చాను. ఇప్పుడు మరో దేవాలయం. అపోలో ఆసు పత్రి. దీని వెనుక స్వాములు లేరు. పరమార్థం లేదు. పాపపుణ్యాల ప్రసక్తి లేదు. మరేం ఉంది? ఇక్కడ నాలుగు గోడల మధ్య వందలాది వర్కర్లున్నారు. డాక్టర్లున్నారు. పువ్వులాంటి దేవతలున్నారు (నర్సులు). ప్రపంచంలో అన్ని మూలల నుంచీ వచ్చిన అనూహ్యమైన యంత్రాలున్నాయి. వాటిని అలవోకగా నడిపే నిపుణులున్నారు. వీటన్నిటి సామూహిక దృక్పథం. ఆరోగ్యంమీద నమ్మకం, బతుకుతామన్న ధైర్యం, బతకడానికి చేయూత, వెరసి– ప్రాణ ధాతువు. లోపలికి రాగానే ఓ నర్సు నీ జాతకాన్ని ఇస్తుంది– క్షణాల్లో. నీ జ్వరం దగ్గర్నుంచి– నీ రుచుల దాకా– నీ ఊపిరి వివరాల దాకా కాగితం మీదకి వచ్చేసింది. వెంటనే రెండో విడత. సమస్య, ప్రారంభం, కష్టం, ఇక్కడికి రావడానికి కారణం. ఈలోగా రక్తనాళంలోకి సూది దిగుతూంటుంది. మరో రెండు నిమిషాల్లో మొదటి విడత చికిత్స ప్రారంభం. నువ్వు వచ్చి ఇంకా 5 నిమిషాలే అయింది. ఆ టీమ్ నీ హితుడో, నీ కోసం నియ మించిన ప్రాణ స్నేహితుడో అయి ఉండాలి. ఎందు కంటే సరిగ్గా 10 నిమిషాల్లో నువ్వు అక్కడికి వచ్చిన మొదటి ఫలితం దక్కిపోతుంది. ఇటు తర్వాత డాక్టర్లు, వర్కర్లు, నిపుణులు– కేవలం నీ కోసం పుట్టినట్టు కృషి చేస్తారు. నీ నమ్మకం దేదీప్యమానమవుతుంది, విశ్వాసం వీర విహారం చేస్తుంది. ఇది శక్తి, నైపుణ్యం, ఏ కల్మషమూ లేని ‘సేవ’ నీకిచ్చే వరం. ఒకపక్క ఈ కృషి ప్రతీ క్షణం పుస్తకంలోకి ఎక్కుతుంది. అది త్వరలో ఫైలుగా మారి రేపటికి గ్రంథమవుతుంది. ప్రజల దేవుళ్లకి నాలుగు స్థానాలు– నీ మనస్సు, గుడి, నీ తాదాత్మ్యం– అన్నింటికీ మించి నీ నమ్మకం. ఇది సీతా సాధ్వా? అవును. ఇది తాదాత్మ్యం. అబ్బే రాయి.. అంతే ఓ గొప్పillusion is dead. Faith dies when the logic starts.. ఈ తెరని ఈ దేవాలయం నీకు తెలియకుండానే చెరిపేస్తుంది. ఈ నిజాన్ని ప్రపంచంలో 120 దేశాలు నమ్ముతున్నాయి. ఒక తీర్థయాత్రగా వస్తున్నారు. నీ విశ్వాసాన్ని ఉద్భుద్ధం చేసేది తీర్థం. కేవలం అవసరానికి పిలిచి, తీర్చి, నీకు తెలియకుండానే మరొక ప్లేస్‌కి నిన్ను బదిలీ చేసే విచిత్రమైన దేవా లయం పేరు– అపోలో. నేను కొండంత అనారోగ్యంతో– క్రిటికల్ కేర్‌లో మూడు రోజులుగా ఉంటూ డాక్టర్ల అనుమతితో ఈ ‘వ్యక్తిగత’ స్పందనని మీకు పంచుతున్నాను. ఇది ప్రకటన కాదు. కితాబు కాదు. వాటికి నేను ఆమళ్ల దూరం. మొదటి దేవాలయానికి– మహాస్వామి మూల హేతువు. రెండో దేవాలయానికి ‘విశ్వాసం’ మూల ధాతువు. గొల్లపూడి మారుతీరావు -
అందరి కోసం
రాజు ఓ జ్ఞానిని కలిశాడు.‘‘స్వామీ.. నాకోసం మీరు దయచేసి భగవంతుడి దగ్గర ప్రార్థించగలరు’’ అని రాజు ఎంతో వినయంగా అడిగాడు.జ్ఞాని ‘‘అలాగే’’ అన్నాడు.‘‘దేవుడా, ఈ భూప్రపంచం మీద అందరూ సంతోషంతో ఉండాలి. అంతటా ప్రశాంతత నెలకొనాలి. అందరికీ సకల సిరిసంపదలు సమకూరి మంచి జరగాలి’’ అని జ్ఞాని ప్రార్థించాడు.ఈ మాటలన్నీ జ్ఞాని పెద్దగానే చెప్పాడు. ఆ మాటలను విన్న రాజు నిరాశ చెందాడు.జ్ఞాని ప్రార్థన ముగియడంతోనే రాజు ఆయనతో..‘‘స్వామీ ఏమిటిది.. నాకోసం కదా మిమ్మల్ని ప్రార్థించమన్నాను. కానీ మీరు ప్రపంచంలోని వారందరి కోసమూ ప్రార్థించారు. పోనీ అందులో నేను పాలిస్తున్న నా దేశం పేరో, నా పేరో లేదు.. నేనిలా మిమ్మల్ని కోరలేదుగా... ప్రత్యేకించి నా కోసం కదండీ ప్రార్థించమన్నాను’’ అన్నాడు.జ్ఞాని చిరునవ్వుతో చూశాడు.‘‘మీకొక విషయం అర్థం కాలేదనుకుంటాను. ప్రపంచం కోసం నేను ప్రార్థించడంలో తప్పేమీ కనిపించలేదు. అందరూ బాగుండాలని కదా నేను కోరుకున్నాను. అందరిలో మీరు లేకుండా పోతారా.. మీరూఉన్నారుగా..’’ అని జ్ఞాని అన్నాడు.అయితే జ్ఞాని జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు.‘‘అయినా ...’’ అని రాజు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. జ్ఞాని లోపలికి వెళ్లి ఓ బక్కెట్టు నిండా నీరు తీసుకొచ్చి రాజుకి అందించాడు. ఆ నీరు తన ఆవరణలో ఉన్న చెట్లకు పోయమన్నాడు. రాజు అలాగే చెట్లన్నింటికీ పోసి జ్ఞాని వద్దకు వచ్చాడు.‘‘అన్నట్టు నీరెక్కడ పోశారు’’ అని జ్ఞాని అడిగాడు.‘‘అన్ని చెట్లకు పోశాను’’అన్నాడు రాజు.‘‘చెట్లలో ఏ భాగానికి పోశారు.’’ అడిగాడు జ్ఞాని.‘‘వేరుకే’’ అన్నాడు రాజు.‘‘మీ చర్య విచిత్రంగా ఉంది. కొమ్మల్లో ఆకులు చాలా వరకూ వాడినట్లు కనిపిస్తున్నాయి కదా... మీరేమో ఆకులపైన పోయకుండా వేళ్లకు నీరు పొయడమేంటీ’’ అని అడిగాడు జ్ఞాని.అప్పుడు రాజు ‘‘వేరుకి పోస్తే ఆ నీరు అన్ని కొమ్మలకూ ఆకులకూ తానుగా విస్తరించదా చెప్పండి’’ అని అన్నాడు.‘‘సరిగ్గా నేనూ అదే చేశాను..’’ అన్నాడు జ్ఞాని.‘‘ప్రపంచంలోని మానవజాతి అంతా బాగుండాలని, కాపాడమని దేవుడిని ప్రార్థించాను. ఇలా వేడుకోవడం వల్ల అది అందరి కోసమూ కోరుకున్నట్టే అవుతుంది. అంతే తప్ప మిమ్మల్ని విస్మరించినట్లు కాదు’’ అని జ్ఞాని చెప్పడంతోనే రాజుకి విషయంబోధపడింది. మరో మాట మాట్లాడక మౌనం వహించి తన కళ్లు తెరిపించిన జ్ఞానికి నమస్కరించి అక్కడి నుంచి నిష్క్రమించాడు. – యామిజాల జగదీశ్ -
ధర్మజిజ్ఞాస
తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలంటారు కదా! మరి దేవుళ్లకి ఈ పూజలూ వ్రతాలూ ఎందుకు? తలిదండ్రులకి రోజూ నమస్కరిస్తే చాలుగా?! భగవంతుడి పేరిట పూజలూ వ్రతాలూ చేస్తూ వాటిలో మునిగిపోయి వయసులో పెద్ద అయిన తల్లిదండ్రులకి సకాలంలో భోజనం పెట్టని పక్షంలో, అలాగే తలిదండ్రుల్ని సక్రమంగా గౌరవించని పక్షంలో ఈ వ్రతాలూ, పూజలూ వ్యర్థమే అని చెప్పడం వాళ్లని ప్రత్యక్ష దైవాలనడంలోని అంతరార్థం. తిండి తినని పక్షంలో వ్యాధి వికటించే పరిస్థితిలో తల్లిగాని తండ్రిగాని ఉంటే వాళ్లకి ప్రత్యేకమైన వంటని చేయించి ఆబ్దికం నాడైనా సరే మరో ప్రదేశంలో భుజింప చెయ్యాలని ధర్మశాస్త్రం నిశ్చయించి చెప్పింది. ఏకలవ్యుని విషయంలో ద్రోణుడు ఎందుకలా చేశాడు? ఏకలవ్యుడు ఒక ఆటవిక జాతి యువకుడు. ద్రోణాచార్యుని వద్ద విలువిద్యను అభ్యసించాలన్న తన కోరికను ద్రోణుడికి తెలియచేసాడు. కొన్ని కారణాల వల్ల ద్రోణుడు అతని కోరికను తిరస్కరించాడు. దాంతో ఏకలవ్యుడు బంకమట్టితో ద్రోణుని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సంపాదించాడు. ఒకసారి విలువిద్య సాధనకు అర్జునుడు, ద్రోణుడు తదితరులు అడవికి వేట కుక్కలను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్లింది. కొత్తవేషధారణతో ఏకలవ్యుడు కనిపించేసరికి గట్టిగా అరిచింది. కుక్క అరుపుకు చిరాకు కలిగిన ఏకలవ్యుడు ఆ కుక్క నోరు తెరచి. తిరిగి మూసుకునే వ్యవధిలో దాని నోటిలోనికి 7 బాణాలు వేసాడు. తరువాత ఆ కుక్క అత్యంత దయనీయంగా అర్జునునికి కనిపించింది. విచారించగా ఆ ప్రాంతంలో ఏకలవ్యుడు అనే అతను విలువిద్య నేర్చుకుంటున్నాడని తెలిసింది. ద్రోణాచార్యులు ఏకలవ్యుడిని చూడటానికి వెళ్లారు. ఏకలవ్యుడు తన గురువు గారికి ఘనంగా స్వాగతం పలికాడు. ఏకలవ్యుడి విలువిద్య చూసి ఎంతో సంతోషించారు. అయితే, విలువిద్యలో ఎంతో నైపుణ్యం ఉండి కూడా ధర్మా«దర్మ విచక్షణ లేకుండా తనను చూసి అరచింది అనే చిన్న కారణానికి దాని నోట్లోకి బాణాలు వేసి మూగజీవం మీద తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఏకలవ్యుడి వల్ల లోకానికి, ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుందని భావించిన ద్రోణుడు, రాబోయే ప్రమాదాలను ముందే నివారించటానికి ఏకలవ్యుని కుడిచేతి బొటన వేలుని దక్షిణగా ఇమ్మని అడిగాడు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడిచేతి బొటనవేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు. ద్రోణుడు ఆశించినట్లుగానే ఏకలవ్యుడు ఇక తన విలువిద్యను ప్రదర్శించలేకపోయాడు. -
ఎంపీ అభ్యర్థులకు సెంటిమెట్ దేవుళ్లు
రామారెడ్డి: రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి(రామారెడ్డి) శ్రీకాలభైరవుడు, మద్దికుంట గ్రామంలోని శ్రీబుగ్గరామలింగేశ్వరుడి ఆలయాలు ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీ అభ్యర్థులకు సెంటిమెట్ దేవుళ్లుగా మారారు. ఈ రెండు ఆలయాల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికలకు ముందు, గెలుపు తర్వాత దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రవీందర్‌రెడ్డి కాలభైరవుడికి పూజలు చేసిన తర్వాతే ప్రచారం ప్రారంభించారు. అలాగే ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే నల్లమడుగు సురేందర్ కాలభైరవుడిని దర్శించుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డి కాలభైరవుడికి పూజలు నిర్వహించి ప్రచారం ఆరంభించారు. అలాగే కామారెడ్డి ఎమ్మెల్యేలుగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన గంప గోవర్ధన్, షబ్బీర్ అలీతో పాటు బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి బుగ్గరామలింగేశ్వరుడిని దర్శించుకున్న తర్వాతే ఎన్నికల ప్రచారం చేశారు. ప్రస్తుం పార్లమెంట్ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ కాలభైరవుడిని దర్శించుకుని ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి బుగ్గరామలింగేశ్వరుడికి పూజలు చేసిన తర్వాతే రంగంలోకి దిగారు. ఇలా అభ్యర్థులకు కాలభైరవస్వామి, బుగ్గరామలింగేశ్వరస్వామి సెంటిమెంట్ దేవుళ్లుగా మారారు. -
విధేయత లేని ప్రార్థనలు అర్థరహితం
ప్రవాహం లాంటి ప్రార్థనా ధాటి కొందరిది. అంతటి ఆత్మీయావేశం వారి నిజ జీవితంలో ఉంటుందా అంటే అనుమానమే. అద్భుతమైన పదాలు ఏరి కూర్చిన పూదండ మరికొందరి ప్రార్థన. ఆ ఆత్మీయ సౌందర్యం వారి విశ్వాస జీవితంలో మాత్రమే కనిపించదు.. నవరసాలూ గొంతులోనే పలికిస్తూ సాగే ఏక పాత్రాభినయం మరికొందరి ప్రార్థన. కాని వారి విశ్వాస జీవితం నిండా నీరసమే, నటనే. దేవునితోనే నేరుగా సంభాషించే మహిమానందకరమైన సాధనంగా దేవుడే మనకిచ్చిన ‘ప్రార్థన’ అనే ఆరాధనా మాధ్యమం తాలూకు సరికొత్త రూపాలివి. ప్రార్థనాశక్తిని తక్కువచేసే ప్రయత్నం కానే కాదిది. ‘విశ్వాసికి ప్రార్థన ప్రాణవాయువు’. ప్రార్ధన సర్వస్వమే, కాని మన క్రియలకు ప్రత్యామ్నాయం కాదు. ఐగుప్తు దాస్య విముక్తి నాటి రాత్రి మోషే వెంబడి నడిచిన లక్షలాదిమంది ఇశ్రాయేలీయులు తమ త్రోవలో ముందుకు సాగకుండా అడ్డుపడ్డ ఎర్ర సముద్రాన్ని, వెనక తరుముకొస్తున్న ఫరో సైన్యాన్ని చూసి భయపడి ‘ఐగుప్తులో మాకు సమాధులు లేవని మమ్మల్నిక్కడికి తెచ్చావా?’ అంటూ మోషే మీద విరుచుకుపడగా, వారికి భయపడి మోషే దేవుణ్ణి ప్రార్థిస్తుండగా, ఇది ప్రార్థించే సమయమా? అని గద్దిస్తూ,‘నీ చేతిలోని కర్రతో సముద్రాన్ని కొట్టి, అదిచ్చే దారిలో ముందుకు సాగిపో!!’ అన్నాడు దేవుడు (నిర్గమ 14:13–16). దేవుని ఆజ్ఞలకు విధేయులవడానికన్నా ప్రార్థించడానికే ప్రాధాన్యతనిచ్చే వారికి దేవుడు వేసే మొట్టికాయ ఇది. ప్రార్థన గొప్పది కాని దేవుని పట్ల, దేవుని ఆజ్ఞలపట్ల మన ‘విధేయత’ మరెంతో గొప్పది. క్రియలు లేని, దేవుని పట్ల విధేయత లేని ప్రార్థన అర్థరహితమైనది. యెరికో తర్వాత ‘హాయి’ పట్టణంలో ఇశ్రాయేలీయులు ఓడినప్పుడు మొహం చెల్లక ప్రార్థిస్తున్న యెహోషువను, ఓటమికి కారణమైన పాపం ఎక్కడుందో తెలుసుకోకుండా ప్రార్థన ఎందుకు చేస్తున్నావని దేవుడు నిలదీశాడు (యెహోషువ 7:10). అపుడు ఆకాను అనే వ్యక్తి చేసిన అవిధేయతా పాపం బట్టబయలై, ప్రాయశ్చిత్తం కూడా జరిగింది. ‘నీవు బలిపీఠం మీద అర్పణ చెల్లిస్తున్నపుడు, ఎవరితోనైనా నీకు విరోధమున్నదని గుర్తొస్తే, అర్పణనొదిలేసి వెళ్లి ముందు సమాధానపడాలి’ అన్న యేసుక్రీస్తు ఆదేశం కొత్తనిబంధనకాలపు మన ప్రార్థనలను సరికొత్తగా నిర్వచిస్తోంది (మత్తయి 5:23,24). ప్రార్ధనకన్నా, అర్పణకన్నా నిర్దోషమైన హదయానికే దేవుడు విలువనిస్తాడు. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో, ఇంకెవరితోనూ సమాధానం లేకున్నా, వాటిని సరిదిద్దుకోకుండా, కేవలం ప్రార్థనలతో విశ్వాసుల్లో హాజరు వేయించుకొనే వేషధారుల జీవితాలు అందుకే ఆనందం కరువై వెల వెలబోతుంటాయి. దేవుని ప్రేమను తెలుసుకోవాలన్న ఆశతో ఉన్న వేలాదిమంది చుట్టూ కనిపిస్తుంటే, ప్రభువా నన్నెలా వాడుకొంటామంటూ ఇంకా ప్రార్థనలే చేస్తున్న విశ్వాసులు ఇకనైనా కళ్ళు తెరవాలి. కొత్తనిబంధన బైబిల్ సారాంశమే దేవుని ప్రేమను మాటల్లో, క్రియల్లో కూడా ప్రకటించడమైతే ఇంకా ప్రార్థనలతో కాలక్షేపం దేనికి? ప్రార్థన చెయ్యకూడదని కాదు, ప్రార్థన మాత్రమే చేస్తాను అన్న ధోరణి సరైనది కాదు. ప్రభువు పనికి పూనుకొన్న విశ్వాసి జీవితంలో ప్రార్థనా వూటలు అనంతంగా ఉబుకుతుంటాయి, మనిషి పనిచేస్తూ ఊపిరి కూడా పీల్చుకొంటున్నట్టే, విశ్వాసి ప్రార్థన, పరిచర్య ఒకేసారి సాగుతూ ఉంటాయి. ప్రార్థన మిళితమైన పరిచర్య జీవితం వారిది.. ఒక ధనికుడు పేదలు, దీనులకు సాయం కలగాలంటూ రోజూ ప్రార్థన చేసేవాడట. ఆ ప్రార్థన రోజూ వినే అతని పదేళ్ల కొడుకు ఒకసారి ‘నీకున్న డబ్బంతా నాకిచ్చెయ్యి నాన్నా’ అన్నాడు. ఎందుకని అడిగితే, ‘అదంతా పేదలకు పంచేస్తాను నీ ప్రార్థనలన్నీ ఒక్క రోజులో నిజం చేస్తాను’ అన్నాడట. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
విశ్వాసికి ప్రభువే భద్రతావలయం
క్రైస్తవుడుగా మారిన పౌలు మీద యూదులు, ముఖ్యంగా వారిలోని సద్దూకయులు అనే తెగవారు పగబట్టి ఎలాగైనా సరే అతన్ని చంపేవరకు పచ్చినీళ్ళు కూడా ముట్టకూడదని శపథం చేశారు. కోటలోనే కావలిలో ఉన్న పౌలును విచారణకోసమని బయటికి రప్పించి ఆయన్ని చంపేయాలన్నది వారి కుట్ర. అయితే పౌలు మేనల్లుడు అది విని వెళ్లి భద్రతాధిపతులకు చెబితే ఆ రాత్రే ఇద్దరు శతాధిపతులు, 200 మంది సైనికులు, 200 మంది ఈటెలు విసిరేవారితోపాటు 70 మంది గుర్రపు రౌతులతో భద్రతనిచ్చి పౌలును అత్యంత సురక్షితంగా వారు కైసరయకు పంపారు (అపో.కా.23:12–25). మన ఆయుష్కాలపు లెఖ్ఖ దేవుని జీవగ్రంథంలో రాయబడి ఉందని బైబిల్ చెబుతోంది (కీర్తన 139:16). అంటే మన ఆయుష్కాలాన్ని తగ్గించే శక్తి కానీ, పెంచే శక్తి గాని మనుషుల చేతుల్లో లేదన్నది దాని తాత్పర్యం. ఇపుడు అందరికీ అందుబాటులో ఉన్న ఈ బైబిల్ గ్రంథమే ఆ కాలంలోనూ ‘తోరా’ పేరుతో అప్పటి యూదులకు కూడా అందుబాటులో ఉన్నా, ప్రతి విశ్రాంతి దినం నాడు వాళ్లంతా దాన్ని చదువుతున్నా, ఈ వాక్యం అందులో రాయబడి ఉన్నదని తెలిసినా, సద్దూకయులు దేవుని ఈ వాక్యానికి విరుద్ధంగా పౌలును చంపి ఆయన ఆయుష్కాలాన్ని తగ్గించేద్దామనుకున్నారు. వాళ్ళు పౌలు హత్యకు కుట్రనైతే చేశారు కానీ మూడు విషయాలను మర్చిపోయారు. మానవుని ఆయుష్కాలాన్ని తన వశంలో పెట్టుకున్న దేవుని సాన్నిధ్యం అనునిత్యం పౌలుకు తోడుగా ఉన్నదని వాళ్ళు మర్చిపోయారు. ఆ కారణంగానే తమ కుట్ర సంగతి విని అధికారులకు చేరవేసే ఒక వ్యక్తిని పౌలు మేనల్లుడి రూపంలో దేవుడే అక్కడ ఏర్పాటు చేశాడని కూడా వాళ్లకు తెలియదు. అన్నింటికన్నా ముఖ్యంగా, పౌలు ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నపుడు దేవుడే ఆయనతో అంతకుముందు రాత్రి మాట్లాడి ‘ధైర్యంగా ఉండు, యెరూషలేము లోలాగే నీవు రోమా పట్టణంలో కూడా నన్ను గూర్చి సాక్ష్యమియ్యవలసి ఉన్నది’ అని వెల్లడించాడు (23:11). అంటే కనీసం రెండున్నర ఏళ్ళ తర్వాత రోమాకు వెళ్లే వరకు నీకు ఆయుష్కాలమున్నదని దేవుడు ఆయన్ను హత్యచేయాలని కుట్ర పన్నుతున్న యూదుల మధ్య ఉన్నపుడే పౌలుకు తెలియజేశాడన్నమాట!!! దేవుని ఈ ‘భద్రతా వలయం’ విశ్వాసి చుట్టూ ఉన్నంతవరకు విశ్వాసిని ఈ లోకం కానీ, అతని శత్రువులు కానీ, మరే ఇతర ప్రమాదాలు కానీ ఏమీ చేయలేవని దాని అర్థం. మరణం కనుచూపు మేరలోనే ఉన్నట్టు కనిపిస్తున్నా అది విశ్వాసిని తాకడానికి దేవుని సెలవు కావాలి. దేవుడు తన కృపకొద్దీ అతడికి ఈ పరిరక్షణా వ్యవస్థను ఏర్పర్చి, దాన్ని తన పర్యవేక్షణలోనే పెట్టుకున్నాడు. రోగాలు, బాధలు, ప్రమాదాలు, కుట్రలు, కుతంత్రాలు ఉప్పెనలా మీద పడుతున్నా మన ప్రాణం మీద మాత్రం వాటికి అధికారం లేదు. ఆ విషయాన్నే దేవుడు తన భక్తుడైన యోబు విషయంలో అపవాదికి ఆజ్ఞ ఇచ్చాడు (యోబు 2:6). దేవుని కృపకు, ప్రేమకు ఇది పరాకాష్టే కదా!! అందుకే శత్రువుల భయంతో వాళ్ళ కుట్రల మధ్య దినమొక గండంగా బతికిన దావీదు తన కీర్తనలో ‘గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా నేను ఏ అపాయానికీ భయపడను. ఎందుకంటే నీ దుడ్డు కర్ర, నీ దండం ఆదరిస్తుంది‘ అంటాడు (23:4). చివరికి మరణం సంభవించినపుడు కూడా విశ్వాసికి దాంట్లో భయపడేదేమీ లేదు. మరణం విశ్వాసికి ఒక గదిలోనుండి మరో గదిలోకి వెళ్లడం లాంటిదే. కాకపోతే ఆనందమేమిటంటే వదిలేసే గదిలోనూ దేవుడు విశ్వాసి వెన్నంటే ఉంటాడు, మరణానంతరం అతడు ప్రవేశించే కొత్తగదిలోనూ అతనికి స్వాగతమివ్వడానికి దేవుడు ఎదురుచూస్తుంటాడు. ఆ ఆనందంతోనే పౌలు ‘మనం బతికినా, చనిపోయినా ప్రభువు వారమేనన్న’ ధీమా వ్యక్తం చేస్తాడు (రోమా 8:14). ప్రభువుకోసం బతకడంలోని ఆనందాన్ని అనుభవించని వాడికి ప్రభువుకోసం చనిపోయే ధైర్యముండదు. ఆ కారణం వల్లే జీవితంలో ఎంతో ధైర్యంగా బతికిన వారు వాళ్ళు కూడా మరణానికి భయపడుతుంటారు. ప్రభువు కోసం జీవించడంలో, మరణించడంలో కూడా విశ్వాసి నిర్భయుడు. అందువల్ల దేవుని గ్రంథంలో లెక్కించి రాయబడిన రోజులు పూర్తి కాకమునుపు విశ్వాసిని మరణం ఒడిలో వేయగల శక్తి ఏదీ ఈ లోకంలో లేనే లేదు. రెవ.డా.టì .ఎ.ప్రభుకిరణ్ email: prabhukirant@gmail.com పఠనీయం అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీపనగరీజడానాం చైతన్య స్తబక మకరంద శ్రుతిఝరీదరిద్రాణాం చింతామణి గుణనికా, జన్మజలధౌనిమగ్నానాం దంష్ట్ర్రామురరిపు వరాహస్య భవతీ! పఠించే విధానం: ఈ శ్లోకాన్ని 40 రోజులపాటు ప్రతిరోజూ ప్రాతఃకాలంలో స్నానం చేసి 11మార్లు పఠించి అమ్మవారికి ధూపదీప హారతులివ్వాలి. పారాయణ ఫలం: సంసారకష్టాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. ధనహీనులకు దారిద్య్ర బాధలు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాఃవసన్త స్సామన్తో మలయమరుదాయోధన రథఃతథాప్యేక స్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్‌అపాఙ్గాత్తే లబ్ధ్యా జగదిదమనఙ్గో విజయతే పారాయణ విధానం: స్నానం చేసి శుచిగా ఉండి ఈ శ్లోకాన్ని 108 రోజులపాటు రోజుకు 108 మార్లు పఠించాలి. చెరకు రసాన్నిౖ నెవేద్యంగా సమర్పించాలి. పారాయణ ఫలం: దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి సత్సంతానం కలుగుతుంది. -
జగమేలే పరమాత్మా! నీకిది తగునా!!
ఆర్తత్రాణ పరాయణుడివి, శరణాగత రక్షకుడివి, పిలిస్తే పరుగెత్తేకొచ్చేవాడివి, ఎంతటి కష్టాల్నయినా వహించేవాడివి, సహించేవాడివి...ఒక్కసారి వచ్చి దర్శనమిమ్మంటే రావేం తండ్రీ...అంటూ త్యాగయ్య... బహుశః నీవు రాకపోవడానికి మరో కారణం కూడా ఉండి ఉండవచ్చంటూ ఆ కీర్తనలో ఇలా అంటాడు...‘‘ఖగరాజు నీయానతి విని వేగ చన లేడో –గగనానికిలకు బహుదూరంబని నాడో...’’. గరుత్మంతుడేమయినా..‘‘అబ్బో అంతదూరం ఎక్కడ పోతాం లేండి...ఎక్కడాకాశం !!! ఎక్కడ భూమి !!! ఇంతదూరం నుంచి అక్కడికి ఏం పోతాం లేండి.’’ అన్నాడా స్వామీ... భగవంతుడితో తమ ఆర్తిని ఎంత లలితమైన పదాలతో వాగ్గేయకారులు వ్యక్తం చేసారో చూడండి. ఒకవిధంగా అది దెప్పిపొడుపు.. ఇంత మొరపెట్టుకున్నా ఆయన రానందుకు... కానీ అంతరార్థంలో...‘నిజంగా నీవు రావాలనుకుంటే, నాకు కనపడాలనుకుంటే అక్కడి నుంచి ఇక్కడకు ప్రత్యేకంగా పనికట్టుకుని రావాలా స్వామీ. నువ్వెక్కడ లేవు కనుక...‘ఇందుగలడందులేడని సందేహము వలదు...’ అని ప్రహ్లాదుడంటే అక్కడే ఉన్న స్తంభం చీల్చుకుని రాలేదా స్వామీ... అలాటిది ఇవ్వాళ నిజంగా నువ్వు రావాలనుకుంటే..‘పాపం త్యాగయ్య అంత బాధపడుతున్నాడు, ఒక్కసారి కనపడిపోదాం...అనుకుంటే నీకు గరుత్మంతుడి అవసరమేముంది కనుక.. నీవెక్కడ లేవు కనుక అని మరో అర్థం. గజేంద్రుడు ఎప్పుడు పిలిచాడు... చిట్టచివర ఓపికంతా అడుగంటిన తరువాత..‘లా ఒక్కింతయు లేదు... ధైర్యము విలోలంబయ్యె, ప్రాణంబులా ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చె...’’ అంటూ ఊపిరి ఆగిపోయేముందు పిలిచిన పిలుపు నీకు వినపడినప్పుడు ఈరోజు ఇంత ఆర్తితో ఇంత ఎలుగెత్తి నిన్ను పిలుస్తున్నా నీ చెవినపడలేదా స్వామీ... ఒకవేళ నేనే తప్పు చేసానేమో...‘జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు...’ అంటున్నారు త్యాగయ్య. నాకేదయినా కష్టం వస్తే నీకు చెప్పుకుంటాను. నాకు ఆకలేసింది, అన్నం దొరకలేదు, నాకు సంగీతంలో ఏదో సమస్య వచ్చింది, నేను అవి నీతో తప్ప మరెవరికి చెప్పుకుంటాను... కానీ ఇప్పుడు నా సమస్య నువ్వే. నేను పిలుస్తున్నా నీవు రాకపోతే నేనెవరికి చెప్పుకోను... జగాలను ఏలే వాడివి... లోకాలకన్నింటికీ ఏలికవు నువ్వు. ఇవ్వాళ నీవే కనపడకపోతే నేనెవరితో చెప్పుకోను తండ్రీ... రాముడు కనపడడం లేదు.. అని ఎవరితోనయినా చెప్పుకుంటే సిగ్గుచేటు..ఏమిటీ, నీకు రాముడు కనపడ్డం లేదా అని హేళన చేయరా స్వామీ.. నువ్వు కూడా తేలిగ్గా తీసేయవద్దు... నన్ను పగవాడిగా చూడకు. ఇంతకన్నా నాకు చేతకాదు... నా ఆర్తి విను.. చూడకుండా ఉండలేను రామా! ‘నగుమోము కనలేనీ నాదు జాలీ తెలిసీ... ఆలస్యం చేయకు... ఒక్కసారి కనపడు. వారి మనసు నొచ్చుకున్నప్పుడు సంగీతకారుల, భక్తి తాదాత్మ్యత ఎంత పరాకాష్టకు చేరుకుంటుందంటే... సాక్షాత్... వారి ఇష్టదైవాన్ని కూడా నిలదీసేస్తారు... అయితే దానిలో పారుష్యం ఉండదు, ఆర్తిమాత్రమే కనబడుతుంది.. దాశరథీ శతక కర్త.. ఒక సందర్భంలో ‘‘దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ దాసుల దాసుడా గుహుడు తావక దాస్యమొసంగినావు, నే జేసిన పాపమో వినుతి జేసిన గానవు, గావుమయ్య నీ దాసులలోన నేనొకడ దాశరథీ ! కరుణాపయోనిధీ!’’ అంటారు. అంటే ‘‘నీకేమయినా శబరి చుట్టమా, గుహుడు సేవకుడా... వారితో దాస్యం (సేవలు) చేయించుకున్నావు. నేను పనికి రాలేదా.. నీ దాసానుదాసుల్లో నేనూ ఒకడినే కదా... నన్నెందుకు కరుణించవు’’ అంటాడు..అప్పటికప్పుడు సందర్భాన్ని అనుసరించి గురువుగారు పాడమంటే రాముడి దర్శనం కోసం వెంపర్లాడిపోయిన త్యాగయ్య నోటివెంట అలవోకగా వచ్చిన అద్భుతమైన కీర్తన ఇది. ఇది ప్రప్రథమమైన ప్రయోగమే అయినా పండిపోయిన భక్తికి ప్రతి అక్షరం అద్దం పడుతుంది. ఆ తరువాత వారి నోటివెంట అజరామరమైన కీర్తనలు చాలా వచ్చాయి. -
దైవం మానుష రూపేణా
ఏమిటి? దైవం మానుష రూపేణా! అని సాయిని గురించి అన్నారా? దేవుడు ఓ మనిషి రూపంలో కనిపిస్తున్నాడని కదా దానర్థం. దేవుడంటే కనిపించనివాడు కదా! మనుష్యుడంటే అన్ని బాధలకీ గురవుతూ కనిపిస్తూ ఉండేవాడు కదా! ఇలా ఈ ఇద్దరూ తూర్పు పడమరల్లా ఉంటూంటే ఇద్దరూ ఒకటేనంటూ ఎలా అనడం సబబు? అనిపిస్తుంది పై దృష్టితో చూస్తే.సంస్కృతంలో ‘గంగాయాం ఘోషః’ (గంగానదిలో గొల్లపల్లె) అనే మాట ఒకటుంది. నిజంగా ఓ పల్లెటూరు ఓ నదిలో ఉండటం అసాధ్యం. మరి అసాధ్యమైనదని తెలిసి కూడా ఇలా ఎలా అనగలుగుతున్నారట? గంగానది ఎంత చల్లగానూ ప్రశాంతంగానూ మనసుకి ఆనందం కలిగించేది గానూ చక్కని చల్లని గాలులతోనూ ఉంటుందో అలా ఈ పల్లెటూరు కూడా అంతగానూ గంగానది పోలికలతోనూ ఉంటుందని దాని భావం. అదే తీరులో ‘దైవం మానుష రూపేణ’ అంటే కావడానికి మనిషే అయినా దైవంలా అన్ని సందర్భాల్లోనూ కాపాడుతూ వస్తూ దైవంతో సమానంగా అనిపిస్తాడని దీనర్థం. ఈ నేపథ్యంలో ఎలా ఈ సాయి ఆ దైవంలా అనిపించాడో చూద్దాం! సాయిలో దైవం... భారతంలో భీష్ముడూ విదురుడూ కుంతీ అనే వాళ్లు కనిపిస్తారు. వీళ్లు జీవిస్తున్న కాలంలోనే కృష్ణుడూ ఉన్నాడు. ప్రధానంగా ఈ ముగ్గురూ ఆ కృష్ణుడ్ని మానవావతారంలో తమ కళ్లతో చూస్తున్నా కూడా, ఎప్పుడూ ఆ కృష్ణుడ్ని ఓ దైవంగా భావిస్తే దర్శించేవాళ్లే తప్ప, ఏనాడూ దైవమనే భావనే వాళ్లకి ఉండేది కాదు. (ఆత్మలో ఎరుకయున్..) అందుకే ఎంత మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అనే ఆ అంశాన్ని ఒకటికి రెండు మార్లు లోపల అనుకుని ఆ మీదటే మాట్లాడుతూ ఉండేవాళ్లు, 9 తీరుల భక్తి భావంలోనూ ఈ తీరుభక్తి (దైవమే సుమా!) ఒకటి.అదే తీరగా ఖాపర్దే (దాదాసాహెబ్ ఖాపర్దే) అనే ఆయన తన కుటుంబంతో సహా షిర్డీకి వచ్చి కొంతకాలం పాటు ఉండదలిచాడు. ఆయనేదో అందరు భక్తుల్లా సాధారణుడు కాడు. గొప్ప పండితుడు. పైగా అంత విద్య తన వద్ద ఉందనే అహంకారాన్ని ఏ మాత్రమూ ప్రదర్శించేవాడు కాదు. అతి సాధారణంగా ఉంటూ అందరితోనూ కలిసిమెలిసి తిరుగుతూ ఉంటూ తన అసాధారణ విధానాన్ని ఏనాడూ చూపించడం కోసం ప్రయత్నం కూడా చేసి లేడు.ఎప్పుడూ ఆయన పాదాల దగ్గరే నిలబడి ఉంటూ కూచోవాలనే ఆలోచనతో కూడా ఉండేవాడు కాడు. ఎవరైనా భక్తులు సాయికి ఏ ఫలాన్ని గానీ ఆహారాన్ని గానీ సమర్పించుకుంటే సాయి దాన్ని తీసుకుని ఖాపర్దేకి గాని ఇస్తే దైవానికి మనం దేన్నైనా సమర్పిస్తే పూజారి దాంట్లో సగాన్ని మనకి ఇస్తే ఎలా దాన్ని ప్రసాదంగా భావిస్తూ తీసుకుంటామో అలా సాయి ఇచ్చిన ఫలహారాలని మాత్రమే తీసుకుంటూ ఉండేవాడు. ఈయన భక్తిలోని లోతు తెలియని ఏ కొందరో మరీ అంతగా ఉండాలా? అనుకునే వాళ్లు. ఇటుపక్క ఆంగ్లభాషలో నిష్ణాతుడు కావడమే కాకుండా, అటుపక్క విద్యారణ్యులవారి ‘పంచదశి’ని చక్కగా తేలిక తేలిక పదాలతో వివరించి చెప్తూండేవాడు దానియందిష్టమున్న భక్తులకి. ఆకాశంలో 7వ ఎత్తులో గరుడుడికి నేల మీద అలా అడుగులేస్తూ నడవడం ఎంతో కష్టం కదా! అయినా అంతటి మహా పండితుడు ఇటు ఆంగ్లం అటు సంస్కృతం ఈ రెంటికీ మధ్యలో తెలుగులోనూ కూడా అయ్యుండీ. అందరికీ అర్థమయ్యే స్థాయికి దిగి ఎదుటివారికి అర్థమయ్యేంత వరకూ తాను తృప్తి చెందేవాడు కాడు. ఇలా వివరించి చెప్పడానికి దేన్నో ఆశించి ఉండటం కాదు కారణం – ఆనాటి మహనీయుల విజ్ఞానం అతిసామాన్యునికి కూడా అందాలి, అందజెయ్యాలనే తాపత్రయం మాత్రమే.సాయి వద్దకొచ్చే ఎందరో సాయిని చనువుగా పలకరించడం, అప్పుడప్పుడు వాదించి మాట్లాడటం, మరి కొందరైతే తిట్లు తినడం, ఇంకొందరైతే ఆయనకి ముందు నడవటం, కలిసి వెళ్తూ ఉండటం... వంటివి చేస్తూ ఉండేవారు గానీ ఖాపర్దే మాత్రం ఏనాడూ అలా ప్రవర్తించేవాడే కాదు సరికదా సాయి సమక్షంలో ఆయన కనీసం కూచుని కూడా ఎరుగడు– నోరు విప్పి మాట్లాడేవాడు కాదు తనంత తానుగా. సాయి మాట్లాడి ప్రశ్నిస్తే తప్ప సమాధానాన్ని కూడా ఇచ్చేవాడు కాదు. ఈయన్ని చూసే ఈయన విధానం నచ్చి క్రమంగా ఈయన గమనించిన సాయిలోని దైవత్వాన్ని గుర్తించి ‘నూల్కర్ బుట్టి’ అనే ఇద్దరూ కూడా ఖాపర్దేలాగానే ప్రవర్తిస్తూ ఉండేవారు. ఖాపర్దేనే ముగ్గురిగా మూడు రూపాలతో ఉన్నాడా? అనిపిస్తూ ‘ఉండేవాళ్లు ఖాపర్దేని చూస్తూ విజ్ఞానంలో పై స్థాయిలో ఉండే పెద్దలంతా ఓ మాటని అనుకునేవాళ్లు – వేదాలదగ్గరికి సామాన్యశబ్దాలు వెళ్లి మారు మాట్లాడలేక మౌనంగా ఎలా ఉంటాయో, అలా ఈ ముగ్గురూ సాయి సమ్ముఖంలో మౌనంగానే ఉంటూ ఉంటారు అని. ఎంత పచ్చినిజం ఆ మాటలు! లోకంలో సాధారణంగా ఎక్కడో కాని భార్యాభర్తలిద్దరూ ఒకే తీరుగా ఉండటమనేది కనిపించదు. ఈమె తీవ్ర దైవభక్తి పరురాలైతే ఆయన నాస్తికుడు కాకపోయినా అంత దైవభక్తి పరుడు కాకుండానూ లేదా ఆమె చేసేదాన్ని మరీ అంత చాదస్తమా? అనుకునే తీరుగానూ ఉంటుంటారు. చిత్రమేమంటే ఖాపర్దే సాయి పట్ల చూపుతున్న ఆ భక్తితత్పరతలోని లోతుని గమనించి ఆమె కూడా సాయి పట్ల అంత గాఢ భక్తి కలిగినదిగానూ అయిపోయింది.ఆయన మహాపండితుడైతే ఆమె చక్కని వంటకత్తె. దాంతో సాయికి ఏయే పదార్థాలు భోజనంలో రుచికరంగా ఉంటాయో ప్రతి నిత్యం గమనిస్తూ ఆ పదార్థాలనే ఆమె స్వయంగా వండి తేవడమూ, తెచ్చిన ఆ పళ్లెం మీద గుడ్డని కప్పి భక్తి పూర్వకంగా సాయికి దైవానికి సమర్పించే నైవేద్యమనుకుంటూనే ఆయన ముందుంచడమూ చేస్తూ ఉండేది.ఎందరో ఎందరెందరో ఎన్నెన్నో వంటకాలని, సాయి ఇష్టమైన భక్ష్యాలని ఫలాలని తెచ్చి వెండిపళ్లాలలో ఆయన సమ్ముఖంలో ఉంచినా, సాయి మాత్రం ఖాపర్దే భార్య తెచ్చిన పళ్లెం ఎక్కడుందా? అని ఓ క్షణం పరిశీలించి ముందుగా ఆ పళ్లెంలోని ప్రసాదాన్నే ఆరగిస్తూండేవాడు. ఒక్కోసారి సాయి తన భక్తులతో మాట్లాడుతూనో భిక్షాటనకంటూ వెళ్లి తాను తెచ్చిన ఆహారాన్ని కుక్కలకీ పక్షులకీ... ఇతర జీవులకీ వేస్తూ భోజన సమయాన్ని దాటి తినకుండా ఉంటే, ఆ సాయి భోజనాన్ని తీసుకుని తినేంతవరకూ ఈమె కూడా తింటుండేది కాదు. అంతటి దైవభావన ఆ దంపతులకి సాయి విషయంలో ఉంటూండేది. ఖాపర్దేకి కొన్ని ముఖ్యవ్యవహారాలుండి ఆయన ఒకే బిగిని 4 నెలల కంటే ఉండలేక వెళ్లవలసి వస్తూంటే, ఆయన తన భార్యని అక్కడే సాయికి భోజన సమర్పణం కోసం ఉంచేసి వెళ్లాడు. అంతటి గాఢభక్తి ఆ ఇరువురికీ. అది కూడా దైవసమాన దృష్టితో కూడిన భక్తి మాత్రమే. ఇదీ కారణం! ఎవరెవరి మనసులోని మాటల్నైనా, ఎంత దూరంలో వాళ్లు మాట్లాడుకున్నా గ్రహించగల శక్తి సాయికుందని అనేక ఉదాహరణల ద్వారా మనం తెలుసుకున్నాం. అలాంటి సాయి ఎవరిలో భక్తి ఎంత స్థాయిలో ఉందో తెలుసుకోలేడా? ఆ కారణంగా ఖాపర్దే దంపతుల భక్తిలోని లోతుదనాన్ని గ్రహించి – ఆ దంపతులకి సాధన మార్గంలో తేలికైన మార్గాన్ని ఉపదేశ రూపంగా చూపాలనుకున్నాడు. అలా అనుకున్న సమయానికి ఖాపర్దే పొరుగు ప్రదేశంలో తన కుటుంబపు పనిమీద వెళ్లి ఉండటాన్ని గ్రహించి, ముందుగా ఆమెకి సులువైన సాధనమార్గాన్ని (భగవంతుని అనుగ్రహాన్ని సాధించే పద్ధతిని) తెలియజేయాలనుకున్నాడు మనసులో.ఓ రోజు ఆమె ప్రతిరోజులాగానే సాయికి పళ్లెం నిండుగా తినుబండారాలని పట్టుకొచ్చింది! సాయికిష్టమైన పూరీ హల్వా అన్నం పప్పు పచ్చడి వడియాలూ మొదలైన పదార్థాలని పళ్లెం నిండుగా తెచ్చి సాయి ముందుంచిందో లేదో ఏ మాత్రమూ ఆలస్యం చేయకుండా సాయి ఆ పళ్లాన్ని తీసుకున్నాడు తన చేతితో. ఇవే పదార్థాలతో పాటు అటూ ఇటూగా మరికొన్ని పదార్థాలని వెండి పళ్లాలలో పట్టుకొచ్చి సాయికి మరింత దగ్గరగా ముందు వరుసలోనే పెట్టారు కొందరు.ఇన్ని పళ్లాలున్నా ఖాపర్దే భార్య తెచ్చిన పళ్లాన్ని మాత్రమే సాయి తీసుకుని భోజనాన్ని ప్రారంభించగానే సాయి భక్తుడూ అతిసన్నిహితుడూ నిరంతరం ఆయనతోనే ఉండేవాడూ ఆయన శ్యామా సాయిని ఉద్దేశించి పలుకుతూ ఏదో ప్రశ్నని అడుగదలిచినట్లుగా తన ముఖాన్ని సాయి వైపు చూస్తూ ఉంచాడు. సాయి శ్యామాని చూస్తూ – ‘ఏం అడుగదలిచా?’– వన్నట్లు కళ్లెగరేశాడు. శ్యామా నిర్భయంగా! ‘‘సాయిదేవా! దైవసమానులైన వారికి ప్రపంచ పద్ధతుల కంటే భిన్నమైన ధోరణులు కదా ఉంటాయి! ఇందరు ఇన్ని తినుబండారాలని ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి అతిపవిత్రంగా వండి తెచ్చి సమర్పిస్తూ ఉంటే అందరినీ మౌనంగా కాదంటూ ఖాపర్దే ధర్మపత్ని తెచ్చిన పళ్లాన్నే స్వీకరిస్తూ ఉన్నావు గదా! కనీసం రుచిని చూసి నచ్చలేదంటూ కొన్ని పళ్లాలని దూరంగా జరిపేసినా ఆ భక్తురాండ్రకి కొంత మానసికంగా తృప్తి ఉంటుంది గానీ, కనీసం అలా ముట్టుకోకుండా కూడా ఎంతో పరిశుభ్రత ఉట్టిపడుతూ ఉండే పళ్లాలని కూడా అలా జరిపివేస్తున్నావే! అది ఆ భక్తురాండ్ర మనసుకి గాయాన్ని కలిపించేది కాదా? అయినా అందరూ ఒక్కరే అని ప్రబోధించే నీకు ఈ వివక్షని చూపించడం సమంజసం అనిపిస్తోందా? భోజనాన్ని ఎలా ఉన్నా భిక్షాటనకి వెళ్లి తెచ్చినప్పుడు చద్ది అన్నమైనా, అది తెచ్చాక ఆ అన్నపుగిన్నెలో కాకులు కుక్కలు పిల్లులు మూతిని పెట్టి తిన్నా కూడా ఏ అసహ్యం భేదభావనా లేకుండా.. ఆరగించే నీకు ఖాపర్దేసతీమణి తెచ్చే ఆహారమే అంత ఇష్టం అవుతూ ఉండటంలో లోపలి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. నీతో బాగా చనువు ఉన్నవాణ్ని నేను కాబట్టి ఈ ప్రశ్నని ఇందరి సమక్షంలోనూ అడుగుతున్నాను. దీనిలో ఏదో పరమార్థం ఉండి ఉంటుందని భావిస్తున్నాను. నన్ను మన్నించి తెలుపరూ?’ అని అడిగాడు. ఆ సుదీర్ఘ ప్రశ్నని సాయి విని చిరునవ్వు నవ్వుతూ ‘శ్యామా! ఈమె తెస్తున్న ఆహార పదార్థాలూ ఎంతటి శ్రేష్ఠమైనవో తెలియజెప్తాను విను. ఈ జన్మలో ఖాపర్దే పండితునికి భార్యగా కనిపిస్తున్న ఈమె తన కిందటి జన్మల్లో మొదటి జన్మలో అతిసాధువూ పుష్టికలదీ ఎందరికో పాలని ఇచ్చినదీ అయిన తెల్లని ఆవు. ఒక వ్యాపారస్తుడు అప్పటి ఆమె యజమాని.తరువాత జన్మలో ఆమె ఓ తోటమాలి ఇంట్లో జన్మించింది. ఆ మీద జన్మలో క్షత్రియజాతిలో పుట్టి ఓ వర్తకునికి భార్య అయింది. ఆ మీదట జన్మలో ఓ బ్రాహ్మణవంశంలో పుట్టి పరమ ఆచారపరురాలూ సంప్రదాయ విధానం కలిగినదీ అయింది. చెప్పలేని దైవభక్తి ఆమెకి ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా అయిపోయింది. ఎంతో కాలం నుండీ ఎదురుచూస్తూ ‘ఎప్పుడు చూస్తానా?’ అనుకుంటున్న ఈమె కాస్త ఈ జన్మలో ఎక్కడో పుట్టి ఇప్పుడు షిర్డీకి వచ్చి తనని తాను నాకు చూపించుకుంటోంది. ఆశ్చర్యకరంగా ఆమె భర్త కూడా పండితుడయ్యుండీ, ఆ సంస్కృత ఆంగ్ల పాండిత్యం అలాగే అధికారమూ హోదాలేని నన్నే ఆదరించడం కూడా జరుగుతూ ఉంది. ఈ ఇద్దరిలోనూ కనిపించే ఆ భక్తీ నా పట్ల చూపుతున్న ఆ భావనా (దైవ సమానభావన) మా ముగ్గురికే తెలుస్తుంది. అందుకే ఇష్టంగా తింటున్నాను. ఈ జన్మలూ ఆ జన్మకీ జన్మకీ మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పాలంటే మరికొంత సమయం పడుతుంది గాని తృప్తిగా రెండు ముద్దల్ని నన్ను తిననీ! ఇలా ఆమె భోజనాన్ని తినడమనేది పక్షపాత బుద్ధిని చూపడం లేదా ఇతరుల్ని గాయపడేలా చేయడం అనుకోవద్దు.నా గురించి తెలియని భక్తులు కాదు వీళ్లంతా.. అంటూ మొత్తం అన్నాన్ని తినేసి తన ఆసనంలో కూర్చున్నాడు సాయి.ఇలా తననీ తన భర్తనీ అందరి సమక్షంలో సాయి అంతగా ప్రశంసించినా ఆమెలో ఏవిధమైన గర్వమూ కళ్లలో మెరుపూ అందరికంటే తానెక్కువ అనే భావంతో కనిపించాల్సిన నవ్వూ... ఏమీ లేనే లేవు. ఎవరి గురించో తానువింటున్నట్లుగా ఓ నది సముద్రంలో చెప్పలేనంత జలంతో వచ్చి కలిసినా సముద్రంలో ఏ మాత్రపు పెరుగుదలా లేకుండా గంభీరంగా యథాపూర్వంగానే (పూర్వం ఎలా ఉందో అలానే) ఉండిపోయింది. అది అందరికీ విస్మయాన్ని కలిగించింది.వాక్కు ద్వారా శక్తిపాతంసాయి అలా ఆసనంలో కూర్చున్నాడో లేదో ఆమె సాయి పాదాలని మృదువుగా నొక్కసాగింది. అలా తన పాదాలని మర్దన చేస్తున్న ఆమె చేతులని తాను తన చేతులతో గ్రహిస్తూ... ‘తల్లీ! ఓ మంత్రాన్నిజపించు’– అంటూ ‘రాజారామ్– రాజారామ్– రాజారామ్.. అంటూ ముమ్మారు అతిమంద్రంగా ఆమెకి ఉపదేశించాడు. ఇదేనమ్మా నువ్వు నిత్యం జపించాల్సిన మంత్రం! అంటూ ఆమె కళ్లలోకి ఆర్థ్రంగా చూశాడు. ‘దేవా!’ అని ఆమె అంటూంటే.. నీ జీవిత పరమార్థం నెరవేరేది ఈ మంత్రంతోనే. మీ దంపతులకి శ్రేయస్సు కలుగుతుంది’ అని ముగించాడు సాయి. వాక్ శక్తిపాతం చేశాడన్నమాట సాయి.శక్తిపాతమంటే..?ఎత్తుగా ఉన్న ప్రదేశం నుంచి నీరు పల్లంగా ఉన్న ప్రదేశంలో పడ్డట్టుగా ఉదాత్త తపశ్శక్తి ఉన్న మహనీయుని నుంచి ఆయన ఆర్జించిన తపశ్శక్తిలోని ఓ కొంత(ఈ తపశ్శక్తిని ఎంత నిష్ఠతో ఇష్టంతో మనఃపూర్వకంగా గ్రహించగల శక్తి ఉన్న వ్యక్తి ఉన్నాడో అతనికి అంత మాత్రమే లభించడం శక్తిపాతం ద్వారా లభిస్తుంది.ఒక సామాన్యశక్తిమంతుడు నిరంతర వ్యాయామం ద్వారా ఎంత బలవంతుడు తన అభ్యాసానికి అనుగుణంగా కాగలుగుతాడో అలా శక్తి పాతమనేది కూడా సాధకుని భక్తితత్పరతకి అనుగుణంగానే ఉంటుంది. ఖాపర్దే భార్య ఇలా భక్తిశ్రద్ధలతో సాయిని కేవలం ఓ సాధకునిగా లేదా సిద్ధునిగా లేదా తమ కోరికలని తీర్చే మహనీయునిగా కాక ఓ దైవంలానే నిరంతరం భావించింది కాబట్టి, సాయి కూడా తనలో దృష్టితో ఆమెని అంతటి నిరంతర సాధకురాలిగా గుర్తించాడు కాబట్టీ ఆమెకి తన వాక్కు ద్వారా తన తపశ్శక్తిని శక్తిపాతరూపంగా అందజేశాడు.అంతేకాదు. ‘తల్లీ! నా శక్తిపాతం ద్వారా శక్తి మంతురాలివైన నువ్వు చేయాల్సింది ‘నా నామజపం కాదు– రాజారామ్– అనే మంత్రంతో ఆ రామచంద్రుడ్ని మాత్రమే’ అని మౌనంగా తెలియజేశాడు కూడా.స్వాములవారు సమీపానికి భక్తులు వెళ్లడం మంత్రోపదేశాన్ని పొందటం, మళ్లీ మరొకరి వద్దకి వెళ్లడం కొంతకాలమయ్యాక మరొకరి వద్దకి వెళ్లి ఉపదేశం తీసుకుందామనే ఆలోచనతో ఉండటం ఎంత సరికాదో, గురువుని మెప్పించి శక్తిపాతం ద్వారా మంత్రోపదేశాన్ని పొందటం ఎంత సరైనదో పరోక్షంగా తెలియజేశాడు సాయి ఈ సంఘటన ద్వారా. ఆయన ‘మూర్తీభవించిన దైవం’ అనే దృష్టితో సేవించింది కాబట్టే ఆమెకి మంత్రాన్ని పొందడం సాధ్యమైంది. ‘నాకు మోక్షవిద్య కావాలి! అందుకే వచ్చాను....’ – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
నిస్సారమైన భూమిలో దేవుని నూరంతల దీవెన
‘ఈ దేశంలోనే ఉండు, ఇక్కడే నిన్ను ఆశీర్వదిస్తానంటూ దేవుడు వాగ్దానం చేస్తే, ఇస్సాకు దేవుని మాటకు కట్టుబడి ఎడారి అయిన గెరారు దేశంలోనే జీవించాడు. నిజానికి దేవుడు ఆయనకు చూపించిన గెరారు లోయ ఆ బెయేర్షెబా ఎడారిలోకెల్లా అత్యంత నిస్సారమైన ప్రాంతం. అయితే ఇస్సాకు దేవుని మాటకు విధేయుడై అక్కడ నివసిస్తూ శ్రమించి వ్యవసాయం చేస్తే, దేవుడు నూరంతల పంటను అనుగ్రహించాడు. ఒక విత్తనం వేస్తే వంద విత్తనాలు రావడం ఎక్కడైనా జరిగేదే. కాని ఆ నిస్సారమైన భూమిలో దానికి నూరంతలు అంటే ఒక విత్తనానికి పదివేల విత్తనాల పంట చేతికొచ్చింది. అలా అనతికాలంలోనే ఇస్సాకు ఆ దేశంలోకెల్లా గొప్ప వాడయ్యాడు(ఆది 26:12). ఇశ్రాయేలీయుల మూలపితరులు అబ్రాహాము, ఆయన కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ‘మా దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు’ అంటూ ఇశ్రాయేలీయులు ఎంతో ఘనంగా చెప్పుకునే గొప్ప ‘పితరుల త్రయం’ వారు ముగ్గురూ!! ఈ ముగ్గురిలో ఇస్సాకు చాలా మెత్తటి వాడు, మితభాషి, పైగా మిగతా ఇద్దరికున్నంత తెగింపు, చైతన్యం ఉన్నవాడు కాదు. బైబిల్లో కూడా ఆయన గురించి చాలా తక్కువ వివరాలున్నాయి. కాని దేవుని పట్ల విధేయతలో మాత్రం ఆయన ఎవరికీ తక్కువ కాదు. గెరారు లోయ నిస్సారమైన ప్రాంతమని నిస్పృహచెందకుండా తాను కష్టపడితే దేవుడే ఆ కష్టాన్ని ఆశీర్వదిస్తాడని నమ్మి అతను నూరంతల దీవెన పొందాడు. అయితే దేవుని ఆశీర్వాదంతో అతి త్వరలోనే అతడక్కడ చాలా ధనవంతుడై ఎంతో గొప్పవాడు కావడంతో, స్థానికులైన ఫిలిష్తీయులకు అసూయ కలిగి కలహించారు. కాని అతని వెనుక దేవుడున్నాడని గ్రహించిన ఫిలిష్తీయుల రాజు తానే తన పరివారంతో సహా ఇస్సాకు ఇంటికొచ్చి మరీ ఆయనతో శాంతి ఒప్పందం చేసుకొని విందారగించాడు. దేవుడిచ్చేదానికి, మనిషి సంపాదించుకునే దానికి మధ్య ఉన్న తేడా అదే. దేవుడిచ్చే సంపద శత్రువులను మిత్రులుగా మార్చుతుంది, మనిషి సంపాదించుకునేది మిత్రులను కూడా శత్రువులుగా మార్చుతుంది. అలా ఇస్సాకు క్రమంగా బలం, ధైర్యం పుంజుకొని అక్కడి పరిస్థితులన్నీ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తన తండ్రి తవ్వించగా ఫిలిష్తీయులు పూడ్చేసిన బావుల్ని మళ్ళీ తవ్వించాడు. కొన్ని కొత్త బావుల్ని కూడా తవ్వించాడు. అలా ఎంత ఎదిగినా, ఆ దేశానికి రాజంతటివాడు స్వయంగా తనవద్దకు వచ్చినా, ఇస్సాకు మిడిసిపడలేదు. తలవంచే తత్వం, కష్టపడేతత్వం, సాత్వికత్వం, దేవుడిచ్చిన పారలౌకిక జ్ఞానం, శాంతికాముకత కలిగిన విశ్వాసిగా ఇస్సాకు తనపట్ల దేవుని ప్రసన్నతను నిరూపించుకున్నాడు. లోకంలోని ధనవంతుల్లో కళ్ళు నెత్తికెక్కి అది నడమంత్రపు సిరిగా మారి, అందర్నీ శత్రువులను చేసుకొని అశాంతితో జీవించేవాళ్లే చాలామంది ఉంటారు. అయితే ఎంతసంపన్నులైనా సరే అటు దేవునికి ఇటు సమాజానికి కూడా ఒదిగి జీవించే ఇస్సాకు లాంటి వాళ్ళు చాలా అరుదు. ఇస్సాకు లాంటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలను, శాంతిని పంచుతారు. నేను మహా విశ్వాసియైన అబ్రాహాము కొడుకును కాబట్టి దేవుడెలాగైనా ఆశీర్వదిస్తాడులే అని అతను చేతులు ముడుచుకొని సోమరిలాగా కూర్చోలేదు. తన వంతు కష్టపడ్డాడు. దేవుడు ఎవరి ఆశీర్వాదాలు వారికే ఇస్తాడు. అబ్రాహామువి అబ్రాహామువే, ఇస్సాకువి ఇస్సాకువే!! నా తండ్రిని దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడులే అన్న భరోసాతో విశ్వాసులుండకూడదు. ప్రతి విశ్వాసికి దేవునితో సన్నిహితమైన, పూర్తిగా వ్యక్తిగతమైన తనదైన ఒక అనుబంధం, సహవాసం ఉండాలి. అదే సంపదలను, శాంతిని చేకూర్చుతుంది. ఆశీర్వాదాలను తన స్వాస్త్యంగా ప్రతి విశ్వాసి ఎవరికి వారు సొంతగా సంపాదించుకోవాలి. తాత్పర్యమేటంటే, దేవునికి మనవలు మనవరాళ్ళుండరు. విశ్వాసులంతా ఆయనకు కుమారులు, కుమార్తెలే!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మా దేవుడు వైఎస్సార్!
అన్నమయ్య సర్కిల్: ఆ వృద్ధురాలు తన ఇంట్లో దేవుడి చిత్రపటాలతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాన్ని ఉంచి నిత్యం పూజలు చేస్తుంటుంది. అంతేకాకుండా ప్రతి సంక్రాంతికి తన ఇంటి పెద్దలతో పాటు వైఎస్సార్‌కి కూడా కొత్త బట్టలు పెట్టి మొక్కుతుంటుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వేనూతనపల్లి గ్రామానికి చెందిన ధనమ్మ (75) ఆదివారం తన నివాసం ముందు దేవుని పటాలతో పాటు వైఎస్సార్ చిత్ర పటాన్ని శుభ్రం చేస్తుండగా ఆమెను ‘సాక్షి’ పలకరించింది. ‘మా ఇంటి దేవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. మేము కూలీ చేసుకుని బతికేటోళ్లం. రెక్కాడితే కానీ ముద్ద దిగదు. నా భర్త మునుస్వామికి అనుకోకుండా మోకాళ్లు నొప్పులు రావడంతో మంచం పట్టాడు. ఆ సమయంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా ఆపరేషన్ చేయించుకున్నాము. మాకు పింఛన్ మంజూరు చేసి దాంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చారు. ఆ దేవుడు ఇచ్చిన ఇంటిలో తలదాచుకుంటూ బతుకుతున్నాము. పదో తరగతి వరకు చదివిన నా కొడుకు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వైఎస్సార్ చనిపోయాక మళ్లీ మాకు కష్టాలు మొదలయ్యాయి. ఐదేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. మళ్లీ ఆ దేవుడు రూపంలో ఆయన కొడుకు వైఎస్.జగన్ వస్తే మా బతుకుల్లో వెలుగు వస్తుందని ఆశతో జీవిస్తున్నాం. ప్రతి సంక్రాంతికి మా పెద్దలతో పాటు వైఎస్ రాజశేఖరరెడ్డికి కొత్తబట్టలు పెట్టి మొక్కుతుంటాము. అందుకే ఆ దేవుడి ఫొటో శుభ్రం చేస్తున్నా’. అని ధనమ్మ తెలిపింది. -
దేవుని సార్వభౌమత్వానికి తలవంచితేనే ఆశీర్వాదం
ప్రార్థన ఎలా చెయ్యాలి? దేవునితో విశ్వాసి చేసే ‘ప్రార్థన’ అనే సంభాషణ ఎలా సాగాలి? తన గురించైనా, మరి దేని గురైంచైనా సర్వజ్ఞుడైన దేవునికి, విశ్వాసి కొత్తగా ఏదైనా చెప్పవలసిన అవసరం ఉంటుందా? మరి మనం చెప్పవలసిందేమీ అవసరం లేకుండా ముందే అంతా ఎరిగిన దేవునితో ప్రార్థనలో మనమాయనకు ఏమి చెప్పాలి? విశ్వాసిలో బాహ్యం, ఆంతర్యం అనే రెండు ప్రధానాంశాలుంటాయని అపొస్తలుడైన పౌలు వివరించాడు (2 కొరింథీ 4:16). ఈ రెండింటి మధ్యా అంతర్గతంగా నిరంతర సంఘర్షణ సాగుతూ ఉంటుంది. లోకం ప్రాతినిధ్యం వహించే మన బాహ్యానికి, దైవసంబంధమైన మన ఆంతర్యంలోని ఆత్మీయతకు ఎప్పుడూ ఘర్షణే!! అయితే ఎంత నలిగినా, బలహీనపడ్డా, చింతచచ్చినా పులుపుచావదన్నట్టు, మనిషిలోని ‘అహం’ మాత్రం ఓటమిని అంత తొందరగా అంగీకరించదు. కాని ఈ అంతర్గత సంఘర్షణలో మనిషిదెప్పుడూ ఓటమే!! గెలవాలన్న ప్రయత్నమే తప్ప, గెలిచే అవకాశాలు మనిషికి ఏ మాత్రం లేని ఈ రంగంలోనే, దేవుని ప్రేమ మాత్రం అంతకంతకూ మరెక్కువగా విశ్వాసిలో పరిపూర్ణమౌతుందంటాడు అపొస్తలుడైన పౌలు. తన జీవితంలో ఒక ముల్లు ఉండేదంటాడాయన. ముండ్లు లేని జీవితాలసలుంటాయా? అయితే ఆ ముల్లును తొలగించమని తాను ముమ్మారు వేడినా దేవుడు దానిని తొలగించలేదు సరికదా, ‘నా కృప నీకు చాలు, నీ బలహీనతల్లోనే నా శక్తి సంపూర్ణమవుతుందని దేవుడు తనకు బదులిచ్చాడు’ అని పౌలు తన నిస్సహాయతను, ఓటమిని కొరింథీ చర్చికి వివరించుకున్నాడు (2కొరింథీ 12:1–9). అతిశయపడేందుకు పౌలు జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎవరికీ లేని ఒక పరలోకానుభవం కూడా ఉంది. ఆయన పరలోకం దాకా వెళ్లి మానవుల వశంలో లేని ఎన్నో పారలౌకికానుభవాలకు గురయ్యాడు.. కానీ తిరిగొచ్చిన తర్వాత ఆ ‘అనుభవం’ గురించి ఏ ఒక్కరికి కూడా ఆయన చెప్పుకోలేదు. సరికదా అలా పరలోకానికి వెళ్ళింది తానే అని కూడా చెప్పుకోకుండా, అలా వెళ్లిన ఒక వ్యక్తి తనకు తెలుసునని మాత్రం పౌలు తన పత్రికలో వివరించడం పౌలు సాత్వికత్వానికీ, వినయానికి, తగ్గింపు స్వభావానికి స్పష్టమైన ఉదాహరణ.. కానీ క్రీస్తు ప్రేమకు నన్ను అంతకంతకు దగ్గర చేసే నా బలహీనతలయందే నేను అతిశయిస్తాను తప్ప, అతిశయించేందుకు తన వద్ద మరేదీ లేదని అపొస్తలుడైన పౌలు అంత సవినయంగా ప్రకటించుకోవడం, పైపై మెరుగుల ప్రచారం తప్ప మరేదీ లేని క్రైస్తవానికి ప్రతినిధులైన నేటి తరం విశ్వాసులకు, పరిచారకులకు ఎన్నటికీ అర్థం కాదు. కొందరి ప్రార్థనల నిండా వాళ్ళ జీవితంలోని ముండ్ల ప్రస్తావనే ఉంటుంది. ముల్లు తీసెయ్యమని అడగడం తమ హక్కు, దాన్ని తీసివేయడం దేవుని బాధ్యత అన్నట్టుగా వాళ్ళ ప్రార్థనలు సాగుతుంటాయి. అయితే తన ముల్లు తీసెయ్యమంటూ తాను మూడుసార్లు అడిగినా దేవుడు అందుకు తిరస్కరించి, ఆ ముల్లు నిన్ను బలహీనుణ్ణి చెయ్యడంలోనే నా బలం నీలో పరిపూర్ణమవుతుందంటూ దేవుడు జవాబిచ్చాడని పౌలు రాసుకున్నాడు. మనం ఏదడిగితే అది ఇస్తూ మనల్ని సంతోషపర్చడానికే దేవుడున్నాడన్న పద్ధతిలో లోతులు లేక కేవలం పబ్బం గడుపుకునే బాపతు పద్ధతిలో సాగుతున్న ఈనాటి పరిచారకుల పసలేని ప్రసంగాల కారణంగా ‘దేవుని సార్వభౌమత్వం’ అనే అత్యంత ప్రాముఖ్యమైన ఆత్మీయాంశం విశ్వాసులకు అర్ధం కావడం లేదు. దేవుడు సార్వభౌమత్వం కలిగిన సర్వాధికారి తప్ప, మనమేది అడిగితే అది తెచ్చిచ్చే ‘అల్లాఉద్దీన్ అద్భుతదీపం’ కాదు. కూడా. మనమడిగింది ఆయన చేస్తాడు కాని దాన్ని చెయ్యకుండా ఉండే సార్వభౌమత్వం కూడా దేవుని సొంతం. దేవుని సంపూర్ణంగా విశ్వసించడమంటే, దేవుని సార్వభౌమత్వాన్ని విశ్వసించడమే, దేవుని విధానాలను, దేవుని సమయాన్ని సంపూర్ణంగా ఎరగటమే!! దేవునిలో ఎదగడమంటే, ప్రాపంచికంగా మనం బలహీనపడటమేనన్న పౌలు మాటలు, దేవుని హృదయస్పందనకు సాదృశ్యాలు. ‘మన బాహ్యపురుషుడు కృషిస్తున్నా, ఆంతర్య పురుషుడు దినదినం వినూత్నపర్చబడుతున్నాడు’ అంటాడు పౌలు. అలాంటి ఆత్మీయవృద్ధిని, దేవుని సార్వభౌమత్వాన్ని కాంక్షిద్దాం. -
పరివర్తనతో పాప ప్రక్షాళనం
నిరాశ, నిస్పృహల వల్ల కలిగే నష్టాలు, అనర్ధాలు, వినాశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, దాన్నుండి వారిని రక్షించడానికి ముహమ్మద్ ప్రవక్తమహనీయులు ఒక సంఘటన వినిపించారు. దీనివల్ల ప్రజలు తమ జీవితంలోని ఏదో ఒకదశలో తమ పాపాలకు సిగ్గుపడి, పశ్చాత్తాప హృదయంతో చిత్తశుద్ధిగా దేవునిముందు సాగిలపడి, క్షమాభిక్ష వేడుకుంటే, ఆయన తప్పకుండా క్షమిస్తాడన్న గుణపాఠం లభిస్తుంది.పూర్వజాతిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు కరడుగట్టిన నేరస్తుడు. ఎన్నో హత్యలు చేశాడు. ఇకనైనా పరివర్తన చెందుదామని ఒక సాధువును ఆశ్రయించాడు.‘అయ్యా.. నేను ఒకపాపాత్ముణ్ణి. ఇప్పటివరకు 99 హత్యలు చేశాను. ఇకనైనా మారదామనుకుంటున్నాను. పరివర్తన చెందుదామని నిర్ణయించుకున్నాను. మరి నాపాపాలను దేవుడు క్షమిస్తాడా?’ అని ఆశగా ప్రశ్నించాడు. దానికా సాధువు, ‘లేదు.. లేదు.. నీ క్షమాపణకు ఇప్పుడు ఎలాంటి అవకాశాలూలేవు.’ అని కరాఖండిగా సమాధానం చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి నిరాశకు లోనై ఆ సాధువును చంపేశాడు.తరువాత అతడు మరో ధార్మిక గురువును అన్వేషించాడు. అతనికి తన వృత్తాంతమంతా వినిపించి, ‘ఇన్ని హత్యలకు పాల్పడిన నన్ను అల్లాహ్ కరుణిస్తాడా.. నా క్షమాపణను స్వీకరిస్తాడా... నా పాపాలకు నిష్కృతి ఉన్నదా..?’ అని ప్రశ్నించాడు ఆశగా..అప్పుడా ధార్మిక పండితుడు, ’ఎందుకు లేదు.. అల్లాహ్ అమిత దయాళువు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనంతంగా కరుణించేవాడు. క్షమాపణాద్వారాలు ఎల్లవేళలా తెరుచుకొనే ఉన్నాయి. చిత్తశుద్ధితో మన్నింపును కోరుకో.. ఆయన తప్పకుండా క్షమిస్తాడు. అయితే, ఇక్కడి వాతావరణమూ, ఇక్కడి పరిసరాల ప్రభావమూ అంత బాగా లేదు. కాబట్టి నువ్వు ధార్మికచింతన అధికంగా ఉన్న ఫలానా ఊరికి వెళ్ళిపో. ఆధ్యాత్మిక చింతనాపరులైన అక్కడి ప్రజలతో కలిసి కొత్తజీవితాన్ని ప్రారంభించు.’ అని హితవు చేశాడు.దీంతో ఆ వ్యక్తి మారిన మనసుతో, పరివర్తిత హృదయంతో ఊరువదిలి బయలుదేరాడు. కాని తను వెళ్ళదలచుకున్న ఊరికి చేరకముందే మార్గమధ్యంలోనే మృత్యువు సంభవించింది. అప్పుడు దేవుని కారుణ్యదూతలు, యాతనా దూతలు అక్కడికి చేరుకున్నారు. ఇతడు వందహత్యలు చేసిన హంతకుడు. చివరలో పశ్చాత్తాపం చెందినప్పటికీ, ఇంతవరకూ ఒక్క పుణ్యకార్యమైనా చెయ్యలేదు. అన్నారు యాతనా దూతలు.‘కాదు, ఇతను ఎన్నిపాపాలు చేసినప్పటికినీ,ç పరివర్తనచెంది, దేవుని సమక్షంలో క్షమాపణ వేడుకొని మారిన మనసుతో మంచి వైపుకు వచ్చాడని కారుణ్య దూతలు వాదించి, తమతో తీసుకుపోయారు. కనుక చెడులు చేస్తున్నవారు, ఇప్పటికే అనేక చెడులు చేశామని, చెడుల్లో కూరుకు పోయామని, ఇక ఇప్పుడు మంచి పనులు చేసినా ప్రయోజనం ఏముంటుందని నిరాశ పడకూడదు. జరిగిన పాపాలు, పొరపాట్ల పట్ల పశ్చాత్తాపం చెంది, మంచిమనసుతో, పరివర్తిత హృదయంతో కొత్తజీవితాన్ని ప్రారంభిస్తే దేవుడు తప్పకుండా కరుణిస్తాడు. ఎలాంటి సందేహమూలేదు. అల్లాహ్ అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని, సన్మార్గంపై నడపాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
వివేక వాణి
ఒక బొమ్మను దేవుడని మనం పూజించవచ్చు. కానీ, దేవుణ్ణి బొమ్మగా భావించకూడదు. అదేవిధంగా ప్రతిమలో భగవంతుడున్నాడని తలచడం తప్పుకాదు. భగవంతుడు ప్రతిమ అనుకోవడం తప్పు.గ్రంథాల వల్ల మతాలు రూపొందడం లేదు. కానీ, మతాలు గ్రంథాలకు కారణమవుతున్నాయి. ఈ సంగతి మనం విస్మరించకూడదు. ఏ గ్రంథమూ భగవంతుణ్ణి సృష్టించలేదు. భగవంతుడే అనేక ఉద్గ్రంథాల రచనకు దివ్యప్రేరణ కలిగించాడు. -
ప్రార్థనతో ఆశ్రయం...ఆనందం
దేవుని ‘సంపూర్ణమైన సంరక్షణ’ ఒక కవచంలాగా, ఒక దుర్భేద్యమైన కోటలాగా మనల్ని, మన కుటుంబసభ్యుల్ని ఆవరించి ఉండగా ఏ అపాయమూ మనల్ని సమీపించదన్న అంశం చాలా విలువైనది. ఎన్నోసార్లు ఆ అంశం ఇతివృత్తంగా వ్యాసాలూ రాశాను. అయితే దేవుని మీద నాకున్న ఆ విశ్వాసానికి ఒక పరీక్ష ఎదురైంది. నా పెద్ద కూతురు ప్రవచన పెళ్లి జీవన్పాల్తో 2012లో జరిగినప్పటినుండి అతని ఉద్యోగరీత్యా వారు అబుదాబి (యుఏఐ)లో ఉంటున్నారు. మేమంతా ఎంతో ఆనందంగా ఎదురు చూస్తుండగా, 2017లో ప్రవచన గర్భం దాల్చింది. అప్పటినుండీ నా భార్య ఇక్కడినుంచి వెళ్లి కూతురుతోపాటే ఉంది. స్కానింగ్‌లో కవల పిల్లలని చెప్పడంతో మా సంతోషానికి అవధుల్లేవు. డిసెంబర్ 1న ప్రసవం జరుగుతుందన్నారు. కొన్ని ప్రసవ సంబంధమైన కాంప్లికేషన్స్ ఉన్నా మేమెంతో ఆనందంగా ఉన్నాం. ఇంతలోనే హఠాత్తుగా, ప్రవచనకు నొప్పులొస్తున్నాయని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామంటూ నా భార్య ఏడుస్తూ ఆగస్టు 17న ఉదయం కాల్ చేసింది. ఏం జరుగుతోందో మాకర్థమయ్యేలోగానే మళ్ళీ కాలొచ్చింది ప్రసవమై ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని. మాకెవ్వరికీ ఆనందించాలో, బాధపడాలో తెలియని అనిశ్చిత స్థితి. సరిగా ఆరు నెలల ఆరురోజులకు పుట్టారు నా మనవరాళ్లు. వెంటనే అక్కడికెళ్లి ప్రార్ధించి అక్షయ, ఆశ్రయ అని నేనే నామకరణం చేశాను. అక్షయ 440 గ్రాముల బరువు, ఆశ్రయ 536 గ్రాములుంది. వాళ్ళు బతికే అవకాశాలు 15 శాతం మాత్రమేనని. ఒకవేళ బతికినా అన్ని శరీరాంగాలు, వ్యవస్థలు ఆరోగ్యంగా, సక్రమంగా ఉండే అవకాశం 5 శాతం మాత్రమేనని డాక్టర్లు తేల్చారు. ఆది మాకందరికీ ముఖ్యంగా ప్రవచనకు, జీవన్ పాల్‌కు పిడుగుపాటయ్యింది. వాళ్ళు బతకడం కష్టమని ఇంత గొప్ప డాక్టర్లు తేల్చేసినా, మేమంతా ప్రార్థిస్తునే ఉన్నాము. అయితే మనసులో ఏదో ఒక మూలన అనుమానం, దేవుడు అద్భుతం చేస్తాడా? అని. మా ఆశలు నీరుగార్చుతూ ‘అక్షయ’ 14 రోజులు మాత్రం బతికి ప్రభువును చేరుకుంది. జీవన్‌పాల్ తన భార్య కోసం ౖ«పైకి ధైర్యంగా కనిపిస్తున్నా, ప్రవచనను ఓదార్చడం మాలో ఎవరివల్లా కాలేదు. దేవుడు గొప్పవాడు, శ్రమల్లో చెయ్యి విడువడు అని ప్రసంగాలు, వ్యాసాల్లో లక్షలమందికి ప్రకటించే నా విశ్వాసానికి ఇప్పుడొక పెను సవాలు ఎదురయింది. ఆ రాత్రి భోరున ఏడుస్తూ ప్రవచన వచ్చి‘డాడీ, ఎందుకిలా అయ్యింది.. ఇంకొక పాపైనా దక్కుతుందా...’ అనడుగుతుంటే నాకూ దుఃఖం పొర్లుకొచ్చింది. కాని తేరుకొని ‘విశ్వాసానికి ప్రథమ శత్రువు భయమే. నీవు నమ్మితే దేవుడు అద్భుతం చేస్తాడు, ఏడవొద్దు, ప్రార్థన చెయ్యి’ అని ప్రవచనను చిన్నప్పుడు సముదాయించినట్లే సముదాయించాను. ఆ రాత్రంతా మౌనంగా ప్రార్థన చేశాను. నా భార్య కూడా పుట్టెడు దుఃఖంలో ఉంది కాని ప్రార్థన చేస్తోంది. ఆశ్రయను బతికించమనీ, డిప్రెషన్ అంచుల్లో జీవచ్ఛవంలా ఉన్న నా కూతుర్ని కూడా బతికించమనీ... ఆ రాత్రంతా నేను చాలా మెల్లిగా చేసుకొంటున్న ప్రార్ధనలో ప్రతి మాటా తాను విన్నానని, అదే తనను బలపర్చిందని ఆ తర్వాత ప్రవచన నాకు చెప్పింది. ప్రవచన ఆ కాళరాత్రిలో ఎంత బలాన్ని ప్రభువులో పుంజుకొందంటే, ఆశ్రయ ఇంక్యూబేటర్లో ఉన్న ఆసుపత్రికి ప్రతి రోజూ వెళ్లి ఉదయం నుండి రాత్రి భర్త తనను పికప్ చేసుకోవడానికి వచ్చేదాకా లాంజ్‌లోనే ప్రార్థిస్తూ కూర్చునేది. దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుకునేది. కొందరైతే డిప్రెషన్‌తో ఆమె పిచ్చిదవుతోందన్నారు. డాక్టర్లు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని సూచించేవారు. ఈ లోగా మా విశ్వాసానికి అన్నీ అవరోధాలే!! ఆశ్రయ బ్రెయిన్లో క్లాట్ ఏర్పడింది, ఒకసారి ఊపిరితిత్తులు రెండూ ఫెయిల్ అయ్యాయి, కంటిచూపు మందగించింది, శరీరంలో రక్తం తగినంతగా లేక 5 సార్లు రక్తమార్పిడి చేశారు. అది ప్రతిసారీ ప్రాణగండమే. రెండుసార్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్కు గురై ఆశ్రయకు ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. కాని విశ్వసించినట్టే, దేవుడు ‘చిన్నారి ఆశ్రయ నావ’ ను ఇన్ని పెను తుఫానుల్లోనూ క్షేమంగా తీరం చేరుకోవడానికి ఇమ్మానుయేలు దేవుడై తన తోడునిచ్చాడు. వైద్యచరిత్రలో మరో అధ్యాయం సృష్టిస్తూ, వైద్యనియమాలను, విశ్వాసాలను తిరగరాస్తూ ఈ ఏడాది జనవరి 5 న ఆశ్రయ అబుదాబి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చింది. ఇదేమీ జరగనప్పుడు, మాకొక మనవడో, మనుమరాలో పుడితే ఎవరెస్టు పర్వతమంత ఆనందం మా సొంతమనుకునే వారం. కాని జనవరి 5న ఆశ్రయ ఇంటికొచ్చినపుడు మేమనుభవించిన ఆనందం పది ఎవరెస్టు పర్వతాలకన్నా ఎక్కువే! ఎందుకంటే అన్ని ఆరోగ్యవ్యవస్థలూ సక్రమంగా, అన్ని అవయవాలూ చక్కగా పనిచేస్తూ, అందరికీ ఆనందాన్ని పంచుతూ, ఆడుతూ. దేవుని పాటలు పాడుతూ పరవళ్లు తొక్కే జలపాతం లాంటి ‘ఆశ్రయ’, దేవుడు మా కుటుంబానికిచ్చిన అపురూపమైన మాకు క్రిస్మస్ కానుక. దేవునిలో మా అందరి విశ్వాసం రెట్టింపయ్యింది. మానవాళికి తోడుగా ఉండేందుకు యేసుప్రభువే భువికి దిగివచ్చిన క్రిస్టమస్ రాబోతోంది... ఆయన తోడ్పాటును కోరుకోవడానికి అందరికీ ఇది మరో అవకాశం. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
చిన్నతిరుమలేశుని సాక్షిగా..స్వాహా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అందినకాడికి దండుకోవడం.. అది బట్టబయలైతే సరిచేసుకోవడం. ఇదీ చినవెంకన్న సాక్షిగా ద్వారకాతిరుమల ఆలయంలో సాగిపోతున్న వ్యవహారం. ‘పెద్దల’ అండదండలు, అధికారుల ఆశీస్సులు ఉన్న కొందరు సిబ్బంది, వారు చేసిన తప్పులను మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. వెంకన్న సొమ్ములు దిగమింగి ఏళ్లతరబడి దర్జాగా తిరుగుతున్నవారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుంటున్నారు. దీంతో ఇక్కడ అక్రమార్కులు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది. ఎలాగో క్రిమినల్ చర్యలుండవు.. మహా అయితే సస్పెండ్ చేస్తారు. ఎలాగోలా నెల తిరక్కుండా మళ్లీ ఉద్యోగంలో చేరిపోవచ్చు. ఇది దేవస్థానంలోని కొందరు ఉద్యోగుల ధీమా.! రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం దినదినాభివృద్ది చెందుతోంది. భక్తుల రాకకు అనుగుణంగా స్వామి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అయితే ఈ దేవస్థానంలో కొందరు సిబ్బంది రూ.లక్షల్లో సొమ్ములు స్వాహా చేసి ఏళ్లు గడుస్తున్నా, వారిపై అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోక పోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఈఎండీలు, నేతిడబ్బాలు, కవర్ల స్కామ్‌లు దర్పణంగా నిలుస్తున్నాయి. పక్కదారిపట్టిన ఈఎండీలపై చర్యలేవీ.. శ్రీవారి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు గాను కాంట్రాక్టర్లు చెల్లించిన ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) సొమ్ము దేవస్థానానికి పూర్తిస్థాయిలో జమకావడం లేదని గతేడాది అక్టోబర్‌లో అప్పటి ఈవో వేండ్ర త్రినాథరావు గుర్తించారు. 2013 నుంచి 2016 మధ్య కాలంలో సుమారు 200 డీడీలకు సంబంధించి రూ. 10 లక్షలకు పైగా సొమ్ము పక్కదారి పట్టినట్లు తెలుసుకుని, దానిపై సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఆయన నోటీసులిచ్చారు. దీనిపై అప్పట్లో సాక్షి దినపత్రికలో ‘గోవిందా.. గోవింద’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇదిలా ఉంటే ఇంజినీరింగ్ విభాగ పీఎస్ చార్జెస్ ఉద్యోగి ఎల్టీ.కుమార్ విధుల పట్ల నిర్లక్ష్యం వహించి కొన్ని డీడీలు అకౌంట్ సెక్షన్‌కు పంపకుండా పక్కన పడేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే మరికొన్ని డీడీలు పనులు పూర్తి కాకుండానే సంబంధిత కాంట్రాక్టర్లకు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే విషయం తెలుసుకున్న అధికారులు పక్కనపడేసిన డీడీలను అకౌంట్లో వేయించి, ఆడిట్లు చేయించారే గానీ ఇందుకు బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంకన్నా... కవర్ల స్కామ్ ఏమైందయ్యా? శ్రీవారి ఆలయంలో ప్రసాదాల కవర్ల కొనుగోలులో సైతం కొందరు సిబ్బంది తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. 2013లో దాదాపు రూ.15 లక్షల వరకు కవర్ల స్కామ్ జరిగినట్లు బట్టబయలైంది. దీనిపై అప్పట్లో సాక్షి దినపత్రికలో ‘ప్రసాదాల కవర్ల కొనుగోలులో కుంభకోణం’ శీర్షికన 2013 అక్టోబర్ 29 నుంచి వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై అప్పటి ఈవో వేండ్ర త్రినాథరావు విచారణ నిర్వహించి, కవర్ల కొనుగోలులో భారీ స్కామ్ జరిగినట్లు నిర్ధారించారు. దీనిపై ముగ్గురు ఉద్యోగులకు మెమోలు కూడా జారీ చేశారు. అలాగే కవర్లు తక్కువగా సరఫరా చేసి, ఎక్కువ బిల్లులు వసూలు చేయడంపై సంబంధిత కాంట్రాక్టర్‌కూ అధికారులు నోటీసులిచ్చారు. అధికారుల చర్యలను నిలుపుదల చేసేందుకు కొందరు ఉద్యోగులు అప్పట్లో జోరుగా పైరవీలు సాగించారు. ఇవి ఫలించడంతో అక్రమార్కులు ఈ స్కామ్ నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉంటే కవర్లు సరఫరా చేసిన కాంట్రాక్టరు సెక్యూరిటీ నిమిత్తం దేవస్థానం వద్ద ఉంచిన సుమారు రూ. 15 లక్షలను అధికారులు రికవరీ చేసి, చేతులు దులుపుకున్నారు. సొమ్ము రికవరీ జరిగిందంటే.. ఇక్కడ తప్పు జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అటువంటప్పుడు ఈ అవకతవకలు జరగడానికి కారకులైన ఉద్యోగులపై ఇప్పటి వరకు క్రిమినల్ చర్యలుగానీ, శాఖాపరమైన చర్యలుగానీ ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేతి డబ్బాల వ్యవహారంలో.. ఆలయంలో ఇటీవల కొందరు వంట స్వాములు మూడు నేతిడబ్బాలను పక్కదోవ పట్టించారు. విషయం తెలుసుకున్న అధికారులు వాటిని దాచిపెట్టిన ఇంటికెళ్లి మరీ స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఇంటి యజమాని ఫలానా ఉద్యోగులు తమ వద్ద నేతిడబ్బాలను ఉంచినట్లు చెప్పారు. అయితే ఆ ఉద్యోగులు తమకు సంబంధం లేదని, ఆ ఇంటి యజమానికి, తమకు పడకపోవడం వల్లే అలా చెబుతున్నారని అన్నారు. దీనిపై విచారణ నిర్వహించిన అధికారులు క్రిమినల్ చర్యలు తీసుకోకపోయినప్పటికీ కనీసం శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇందుకు బాధ్యులుగా భావించి, ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అయితే చిన్నచిన్న తప్పులు చేసే ఉద్యోగులపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్న అధికారులు దేవుడి సొమ్మును రూ.లక్షల్లో స్వాహా చేస్తున్న ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పెద్దల అండదండలున్న ఉద్యోగులకు అధికారులు సైతం కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు గోల్మాల్ అయిన సొమ్మును రికవరీ చేయడమే కాకుండా, అందుకు బాద్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు. -
అవని తల్లి
పెళ్లయిన పదేళ్ల వరకూ పిల్లలు పుట్టలేదు అవనికి. ఎన్నో పరీక్షలు చేయించి, ఎన్నెన్నో మందులు, చికిత్సలూ తీసుకున్నాక ఆమె గర్భం ధరించింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆమె కడుపులో ఉన్న బిడ్డకు ఎందుకో ఆత్రుత కలిగింది కాబోలు ఎనిమిదోనెలలోనే భూమ్మీద పడాలనుకున్నాడు. పడ్డాడు. దురదృష్టవశాత్తూ ఆ బిడ్డ బతకలేదు. ఆ దుఃఖాన్ని తట్టుకోవడం చాలా కష్టమైంది ఆవనికీ, భర్తకూ కూడా. వారం రోజుల తర్వాత ఇంటికి పంపించారామెను హాస్పిటల్ నుంచి. పొరుగింటిలో పసికందు కేరింతలు చూడగానే ఆమెకు పాలు రావడం మొదలైంది. డాక్టర్‌కు ఫోన్ చేస్తే పాలు పోయేందుకు ఏవో మందులు చెప్పారు. అవనికెందుకో ఆ మందులు వాడబుద్ది కాలేదు. పాలను పిండి పారబోయడం లేదా మందులు వాడి పాలు రాకుండా చేసుకోవడమే ఆమె ముందున్న ప్రత్యామ్నాయాలు. ఆమెకు ఆ రెండు మార్గాలూ ఇష్టం లేకపోయింది. సరిగ్గా అదే సమయంలో ఫేస్బుక్లో ఒక పోస్టింగ్ చూసిందామె. ఒక బిడ్డకు తల్లిపాలు కరువయ్యాయనీ, పోతపాలు పడటం లేదనీ, దయగల తల్లులెవరైనా ఆ బిడ్డకు పాలిచ్చి పసికందు ప్రాణాలు కాపాడమని ఉంది అందులో. తల్లిపాలు కరువైన ఆ బిడ్డకు తన పాలు ఇచ్చి ఆదుకునేందుకు ఆమె అరక్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే వెళ్లి వాడికి పాలిచ్చింది. ఆమె స్నేహితురాలి పిల్లకు కూడా పాలు అవసరమయ్యాయి. ఇంకా మరికొందరి విషయం కూడా ఆమె దృష్టికి వచ్చింది. భర్త అనుమతి తీసుకుని వారందరికీ పాలిచ్చిన తల్లి అయిందామె. పాలిచ్చినందుకు ఆమె ఏమీ తీసుకోదు తన పాలు తాగుతున్న ఆ పసికందు ఫొటో తప్ప. వారిలోనే ఆమె తన బిడ్డని చూసుకుంటోంది. అలా ఓ ఏడాది గడిచింది. అవని ఇప్పుడు మళ్లీ గర్భం దాల్చింది. మామూలుగానైతే అందులో ఆశ్చర్యం ఏమీ ఉండేది కాదు. కానీ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆమె మరోసారి గర్భం దాల్చే అవకాశం లేదని వైద్యులు చెప్పారామెకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసేముందు. తనకు పుట్టిన పిల్లాడు తనకు లేకపోయినా, తన పాలిచ్చినందుకు అవనికి ఇప్పుడు దేవుడందుకే వరమిచ్చాడు కాబోలు. అందుకే అంటారు పెద్దలు. నిస్వార్థంగా మనం ఎవరికైనా ఏమయినా మేలు చేస్తే అంతకు పదింతల ఫలితం మనకు దక్కుతుందని. – డి.వి.ఆర్. -
అమ్మ ప్రేమను మించిన అల్లాహ్ ప్రేమ
పూర్వకాలంలో ఒక మనిషి ఏదో ఊరుకు వెళుతున్నాడు. సుదూరప్రయాణం. ప్రయాణానికి అవసరమైన సరంజామా అంతా సర్దుకున్నాడు. ఆహారం, నీళ్ళు, దుస్తులు, పైకం అంతా వాహనం పైనే సర్దేశాడు. కొండలు, కోనలు, అడవి మార్గాన ప్రయాణం సాగుతోంది. మార్గమధ్యంలో అనూహ్యంగా ఒంటె తప్పిపోయింది. చుట్టూ దట్టమైన అడవి. అంతా కీకారణ్యం. కనుచూపుమేర ఎక్కడా జనసంచారమే లేదు. ఒంటరిగా, సాధ్యమైనంతమేర అడవి అంతా గాలించాడు. కాని ఒంటె ఆచూకీ దొరకలేదు. ఆహారం, తాగునీరు, దుస్తులు, పైకం అన్నీ దానిపైనే ఉన్నాయి. కనీసం గొంతుతడుపుకుందామన్నా చుక్కనీరులేదు. ఆకలి..దాహం.. అలసట.. భయం.. ఒంట్లో ఏమాత్రం సత్తువ లేదు. నీరసం ఆవహించింది. ఏం చేయాలో అర్ధంకావడం లేదు. వెదికే ఓపిక లేదు. కాళ్ళు తడబడుతుండగా ఆ వ్యక్తి ఓ చెట్టు కింద కూలబడ్డాడు. బాగా అలసిపోయి ఉండ డం వల్ల కళ్ళు మూతలుపడ్డాయి. నిద్రముంచుకొచ్చేసింది. క్షణాల్లో గాఢనిద్రలోకి జారుకున్నాడు. తరువాత కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తప్పిపోయిన తన ఒంటె దర్శనమిచ్చింది. నీరు, ఆహారం, దుస్తులు, పైకం అన్నీ పదిలంగా ఉన్నాయి. ఆశ్చర్యం.. ఆనందం.. తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు.. ఇదికలా.. నిజమా..? అన్నసంశయంలో పడిపొయ్యాడు. కొన్ని క్షణాలపాటు అతనికేమీ అర్ధం కాలేదు. చివరికి కలకాదు నిజమే అని నిర్ధారించుకున్నాడు. ముహమ్మద్ ప్రవక్త వారు ఈసంఘటనను సహచరులకు వినిపించి ‘ఆవ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది?’ అని ప్రశ్నించారు. ‘దైవప్రవక్తా.! ఆవ్యక్తి ఆనందానికి అవధులే ఉండవు. జీవితంపై ఆశలు వదులుకున్న అతను ఎంతగా సంతోషిస్తాడో మేము మాటల్లో చెప్పలేము. అతని మానసిక ఆనందాన్ని వర్ణించడం ఎవరితరమూ కాదు. అమితమైన సంతోషంతో అతని హృదయం ఉప్పొంగి, ఆనంద తాండవం చేస్తుంది.’ అని విన్నవించారు సహచరులు. అప్పుడు ప్రవక్తమహనీయులు, ‘‘దారితప్పిన ఒకవ్యక్తి నిజం తెలుసుకొని, సన్మార్గం అవలంబించి తన వైపుకు మరలినప్పుడు దైవం కూడా అలాగే సంతోషిస్తాడు. తన దాసుల్లో ఏ ఒక్కరూ నరకంలోకి పోవడాన్ని అల్లాహ్ సుతరామూ ఇష్టపడడు. అందుకే ఆయన మానవుల మార్గదర్శకం కోసం అనేక ఏర్పాట్లు చేశాడు. కనుక మానవులు తమ తప్పు తెలుసుకొని, మంచిమార్గం వైపు మరలితే అల్లాహ్ ప్రేమకు, ఆయన కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులై ఇహ, పరలోకాల్లో సాఫల్యం పొందవచ్చు’’ అని బోధించారు. పరాత్పరుడైన దైవం మనందరికీ రుజుమార్గంపై నడిచే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.! – ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
కుటుంబవ్యవస్థే సమాజానికి కీలకం...
ఎఫ్రాయిము మన్యంలో నివసించిన యాజక వంశీయుడైన లేవీయుడు ఎల్కానా (న్యాయా 17:7). హన్నా అతనికి రెండవ భార్య, వారికి పిల్లలు లేరు. ఇశ్రాయేలీయుల మందిరం అప్పట్లో షిలోహులో ఉండేది. ప్రజలంతా అవిధేయులై దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న కారణంగా దేవుని ప్రత్యక్షత పూర్తిగా అరుదైపోయి, నిర్ణయాత్మకత, పటిష్టత లోపించిన ఎలీ లాంటి అసమర్థ యాజకుని ఆత్మీయనాయకత్వంలో దేవుని మందిరం తన ప్రాభవాన్ని కోల్పోయిన చీకటి రోజుల్లో హన్నా ప్రార్థనలకు జవాబుగా సమూయేలు ప్రవక్త ఒక వ్రతపుత్రుడుగా జన్మించాడు. హన్నా తాను మొక్కుకున్నట్టుగానే, ఇంకా పసిబాలుడుగానే ఉన్న సమూయేలును తెచ్చి మందిరంలో పరిచర్యకు ప్రతిష్టించింది. సమూయేలును మందిరంలోనే వదిలి హన్నా వెళ్ళిపోయింది. అలా సమూయేలు ప్రవక్త పసివాడుగా ఉన్నప్పటినుండే ఆలయంలో దేవుని పరిచర్యను నిబద్ధతతో చెయ్యడం ఆరంభించాడు. సమూయేలుతో దేవుడు పసితనం నుండే మాట్లాడుతూ ఉండటంతో, దేవుని ప్రత్యక్షతలు మళ్ళీ ఆరంభమై చీకటి రోజులకు తెరపడింది. ఇది కుటుంబ వ్యవస్థ సాధించిన ఘన విజయం. లేవీయులంతా దేవుని మందిరపు దరిదాపుల్లోనే నివసించాల్సి ఉండగా, ఏ కారణంవల్లో షిలోహు మందిరానికి దూరంగా ఎఫ్రాయిము మన్యంలో నివసించిన ఎల్కానా దేవుని మందిరాన్ని మర్చిపోకుండా ఏటేటా దర్శించిన విశ్వాసి కాగా, నాకొక కుమారుణ్ణి ప్రసాదిస్తే అతన్ని నీ సేవకు ప్రతిష్ఠిస్తానంటూ మొక్కుబడి ప్రార్థన చేసి తన మాటకు కట్టుబడిన అంతకన్నా గొప్ప విశ్వాసి హన్నా!! అలా హన్నా తన ప్రార్ధనతో గొడ్రాలితనమనే తన వ్యక్తిగత సమస్యను తీర్చుకుంది, దేవుని ప్రత్యక్షత కరువైన ఆనాటి ఇశ్రాయేలీయుల ఆత్మీయ సమస్యను కూడా తన కుమారుడైన సమూయేలు ద్వారా పరిష్కరించింది. ప్రార్థనాపరులైన తల్లిదండ్రులు అటు కుటుంబాన్ని, ఇటు సమాజాన్ని కూడా ఎంత గొప్పగా ఈనాడు కూడా ప్రభావితం చెయ్యగలరన్న దానికి ఎల్కానా, హన్నాలే ప్రత్యక్ష సాక్ష్యం. కొడుకు పుడితే తమకెంతో ప్రయోజకుడవుతాడు, వృద్ధాప్యంలో అండగా ఉంటాడన్న స్వార్థంతో సమూయేలును వాళ్ళు తమవద్దే ఉంచుకోవచ్చు. కానీ తమ ప్రయోజనాలకన్నా, సమాజ ప్రయోజనాలు, దేవుని సంకల్పాలే మిన్న అని నమ్మిన ఆదర్శ దంపతులు వారు. అప్పుడే పాలు విడిచిన, బహుశా కేవలం మూడేళ్ళ వయసున్న తన పసి కుమారుణ్ణి, అతని ఆలనాపాలనా ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఆలయంలో ఒంటరిగా వదిలి వెళ్తున్నపుడు హన్నా హృదయం ఎంతగా తల్లడిల్లిందో మనం అర్థం చేసుకోవచ్చు. తల్లి కౌగిలిలో వెచ్చగా ఒదిగి హాయిగా పడుకోవాల్సిన సమూయేలు, ఇకనుండి మందిరంలో రాతినేలపై ఒక్కడే పడుకోవలసి ఉంటుందని హన్నాకు తెలుసు. అందుకు ఆమె ఒక పరిష్కారాన్ని కనుగొంది. అంత పిన్నవయసులోనూ ఆమె తన కుమారునికి దేవుణ్ణి పరిచయం చేసింది(1సమూ 1:28). ఇకనుండి దేవుడే తన కుమారునికి తోడుగా ఉండాలని, ఉంటాడని ఆమె నమ్మింది. అలా తల్లిదండ్రులిద్దరి ఆత్మీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఎదిగిన సమూయేలు త్వరలోనే గొప్ప ప్రవక్తగా ఆ దేశంలో స్థిరపడి ఇశ్రాయేలీయులకు గొప్ప నాయకత్వాన్నిచ్చాడు. సౌలు, దావీదు చక్రవర్తుల కాలంలో రాచరిక వ్యవస్థకు, ప్రజలకు మధ్య గొప్ప అనుసంధానకర్తగా ఉంటూ చీకటి రోజులను కాస్తా అటు ఆత్మీయంగా, ఇటు లోకపరంగా కూడా క్షేమకాలంగా మార్చడంలో ముఖ్యపాత్ర వహించాడు. తమ పిల్లలకు అన్నీ ఇచ్చేందుకు, వారి భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దేందుకు ఆరాటపడే తల్లిదండ్రులు వారికి దేవుణ్ణివ్వడం, దేవుణ్ణి పరిచయం చెయ్యడంలో మాత్రం ఎంతో అలసత్వం ప్రదర్శిస్తుంటారు. ’ఇదిగో మీ అమ్మ, నాన్న, మామ, తాత, అమ్మమ్మ’ అంటూ మాటలు రానప్పుడే పిల్లలకు అందర్నీ పరిచయం చేసే తల్లి, తండ్రి, ‘ఇదిగో నీ దేవుడు’ అని కూడా పరిచయం చెయ్యాలి. తల్లి ఒడి వెచ్చదనం, తండ్రి నేతృత్వంలోని భద్రతా భావంతోపాటు దేవుని నిత్యసహవాసం, ఆదరణ, విశ్వాసపు తొలిపాఠాలు పసితనంలోనే పిల్లలకు ఉగ్గుపాలతోపాటు రంగరించి పోయాలి. అలాంటి పెంపకంలోనే పిల్లలు సమాజ కల్యాణానికి పాల్పడే గొప్ప విశ్వాసులుగా తయారవుతారు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
నమస్కరించండి
గౌతమ బుద్ధుడు ఓరోజున బోధివృక్షానికి నమస్కరిస్తూ ఉండటం చూశాడు ఒక శిష్యుడు. అతని దృష్టిలో బుద్ధుడు భగవంతుడితో సమానం. అలాంటి బుద్ధభగవానుడు ఒక చెట్టుకు ఇంతటి గౌరవాన్ని ఇవ్వడం చూసి అతనికి ఆశ్చర్యం వేసింది. దాంతో ఉండబట్టలేక బుద్ధుణ్ణి సమీపించి, ఆయనకు నమస్కరించి, ‘‘భగవాన్, మీరే భగవత్ స్వరూపులు కదా, మీరు ఒక మామూలు చెట్టుకు ఎందుకని నమస్కరిస్తున్నారో తెలుసుకోవచ్చా?’’ అని అడిగాడు. అందుకు బుద్ధుడు చిరునవ్వుతో, ‘‘మనిషిలో అహంకారం చిగురించకుండా చేసే శక్తి ప్రకృతిలో ఉంది. అందుకే ప్రకృతిలో భాగమైన చెట్టుకు నమస్కరిస్తున్నాను. భవిష్యత్తులో మీరు ఎప్పుడూ అహంకారాన్ని తెచ్చుకోవద్దు. వినయంగా, నమ్రతగా మెలగండి. అందరితోనూ ప్రేమాభిమానాలతోనూ, గౌరవంగానూ నడుచుకోండి. అప్పుడు మిమ్మల్ని అహంకారం ఆవరించదు. మిమ్మల్ని చూసి, అందరూ కూడా అదే బాటలో నడుస్తారు’’ అని బోధించాడు. బుద్ధభగవానుడి నుంచి తనకు ఎంతో విలువైన కానుకలాంటి విషయాన్ని బోధించినందుకు శిష్యుడు ఎంతగానో సంతోషించాడు. శిష్యులకు ఏమైనా మంచి విషయాలను బోధించాలనుకునేవారు ముందుగా తాము ఆచరించాలి. అప్పుడు శిష్యులు తాము కూడా అనుసరిస్తారు. -
సనాతనం నిత్యనూతనం
ఆత్మ విషయంలో తాత్వికులు మనసుతో తాదాత్మ్యత చెందితే, అదే ఆత్మను భగవంతుడు అని భక్తులు భక్తిమార్గంలో ఆరాధిస్తారు. అదే ఆత్మను అనంతశక్తి అంటూ శాస్త్రవేత్తలు ప్రయోగాలతో నిరూపించేందుకు ప్రయత్నం చేస్తారు. ఉపనిషత్తులు సత్యాన్వేషణ ఎలా చేయాలో చెబుతాయి. సత్యమంటే మనం సాధారణ అర్థంలో తీసుకునే ఋజువాక్కులు కాదు.‘ఎల్లప్పుడు నిలిచి ఉండే వస్తువు. మహిమాన్వితమైన అనంతమైనశక్తి. రంగులేకున్నా, రూపులేకున్నా ఇంద్రియానుభవ స్వరూపాలకు అదే హేతువు. అది జననమరణాలు లేనిదైన శక్తి. దాని గురించి మాత్రమే ఉపనిషత్తులు చర్చిస్తాయి. అంతేకాకుండా, ఆ శక్తి పరిణామక్రమానికి నిదర్శనమైన ఖగోళ పదార్థాలన్నీ అశాశ్వత పదార్థాలు. నశించిపోతూ వస్తున్న అస్థిరపదార్థాల గురించి తాత్విక పరిశోధకులు ఉపనిషత్తులలో చర్చించలేదు. ఎందుకంటే, అవి హేతువులు కావు. అసలైన హేతువు, స్థిరవస్తువు, స్వతఃసిద్ధమైంది అయిన ఆత్మ గురించి మాత్రమే విశేషమైన చర్చ జరిగింది. ఇక ఆత్మ సనాతనంగా ఉంటూనే, నిత్యనూతనంగా ఎలా ఉండగలుగుతోంది అనేది పెద్ద ప్రశ్న. ఆత్మ తన ఉనికిని స్థిరంగా కొనసాగించడానికి పరిణామాన్ని ఆశ్రయించింది. ఈ పరిణామ ప్రక్రియలో తనకు తానుగా ఖగోళ పదార్థంగా మారుతూ, తిరిగి తనకు తానుగా అనంతశక్తిగా మారుకుంటూ తన స్థిరత్వాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఈ ప్రక్రియను అంతా తన లోపలనే గుంభనంగా కొనసాగిస్తూ నిశ్చలంగా, నిర్దిష్టంగా, శాశ్వతంగా ఉంటూ వస్తోంది, ఉండబోతోంది. ఆ శక్తి పరిణామాన్ని ఆశ్రయించడంలో రెండు ప్రాథమిక చర్యల ద్వారా పదార్థంగా ఏర్పడుతూ, గతిస్తూ ఉంటుంది. తద్వారా తన ఉనికిని నిత్యనూతనంగా ఉంచుకుంటోంది. ఆ చర్యలే సంలీనం, విచ్ఛిత్తి. క్వార్క్‌లు, హైడ్రోజన్ లాంటి అణువుల సంలీనం వలన నక్షత్రాలు, గ్రహాలు లాంటి ఖగోళ పదార్థాలేర్పడతాయి. అలా ఏర్పడిన వాటిల్లో అనుకూల వాతావరణం ఉన్న గ్రహాల పైన జైవికపదార్థాల సంలీనం వలన జీవాలు ఏర్పడతాయి. ఈ పదార్థాలు తమ మనుగడ తర్వాత విచ్ఛిన్నం చెందుతూ, తిరిగి అన్నీ శక్తిరూపంలోకి మారిపోతాయి. తద్వారా శక్తి ఎప్పుడూ స్థిరంగా ఉంటూ, తనకు తానుగా ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. – గిరిధర్ రావుల -
ఇఖ్ లాస్ అంటే..?
ఒక ప్రవచనం ప్రకారం– ప్రళయ దినాన మొట్టమొదట ముగ్గురు వ్యక్తుల విషయంలో అల్లాహ్ తన తీర్పును వెలువరించారు. దైవమార్గంలో, ధర్మం కోసం పోరాడి ప్రాణాలర్పించిన షహీదును అందరికంటే ముందు న్యాయస్థానంలో హాజరుపరిచారు. దైవం అతణ్ణి ‘‘నీవు నీ బాధ్యతలను ఎంతవరకు నెరవేర్చావు? ఎటువంటి కర్మలు ఆచరించావు?’’ అని ప్రశ్నించాడు. ‘ప్రభూ! నేను నీ మార్గంలో పోరాడాను. నీ ప్రసన్నత కోసం ప్రాణాలను ధారపోశాను.’ అని సమాధానం చెప్పాడతను. ‘‘నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. నువ్వు కేవలం గొప్ప వీరుడవనిపించుకోవాలని జిహాద్లో పాల్గొన్నావు. ప్రజలంతా నిన్ను వీరుడవని, శూరుడవని పొగిడారు కదా! ఆ మేరకు దానికి తగిన ప్రతిఫలం నీకు అక్కడే లభించింది. ఇక్కడేమీ లేదు.’ అని అతణ్ణి నరకంలో పడవేయించాడు దైవం. తర్వాత ఒక విద్వాంసుడిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. దైవం అతన్ని ‘‘ఒక పండితుడవైన నువ్వు ఏ మేరకు సత్కార్యాచరణ చేశావు? ప్రజలకు ఏమి బోధించావు?’’ అని ప్రశ్నించాడు. అప్పుడతను, ‘‘ప్రభూ! నేను నువ్వు పంపిన గ్రంథాన్ని అధ్యయనం చేశాను. ఆచరించాను. దాన్ని ఇతరులకు బోధించాను.’’ అని చెప్పాడు. అప్పుడు దైవం, ‘‘అదంతా అబద్ధం. నువ్వు కేవలం ప్రజల మెప్పు పొందడానికి, ప్రజల చేత గొప్ప పండితుడిగా, విద్వాంసుడిగా కీర్తించబడాలనే ఉద్దేశ్యంతోనే అలా చేశావు. నువ్వు ఆశించిన పేరు ప్రతిష్టలు నీకు అక్కడే లభించాయి. కనుక నీకిక్కడ ఏమీ లేదు’’ అని చెప్పి, అతణి ్ణకూడా నరకంలో పడవేయించాడు. తరువాత, ఒక గొప్ప ధనవంతుడి వంతు వచ్చింది. అతన్ని కూడా దైవం ‘‘ఇంత సంపద, ఇన్ని వరాలను పొందిన నువ్వు ఎలాంటి కర్మలు ఆచరించావు? సంపదను ఏ పనుల్లో వినియోగించావూ?’’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడా ధనవంతుడు, ‘దేవా! నీ ప్రసన్నత ఇమిడి ఉన్న ఏ సత్కార్యాన్నీ నేను విడిచిపెట్టలేదు. నీ సంతోషం కోసం, నీ మెప్పుకోసం నా సంపదను నీ మార్గంలో ఖర్చుపెట్టాను.’ అని సమాధానమిస్తాడు ఆ ధనవంతుడు. అప్పుడు దైవం, ‘‘నువ్వు కేవలం ప్రజల మెప్పుకోసం, ప్రజలంతా నిన్నొక గొప్పదాత అనుకోవాలని, త్యాగమయుడవని కీర్తించాలని, పొగడాలని నీ ధనాన్ని ఖర్చుపెట్టావు. నువ్వు ఆశించినట్లుగా ప్రజలంతా నిన్నొక గొప్పదాతగా, సత్కార్యాలు చేసేవాడిగా, పేదలను ఆదుకొనేవాడిగా గుర్తించి కొనియాడారు కూడా! ఇక్కడ నీకెలాంటి ప్రతిఫలమూ లేదు.’ అంటాడు దైవం.తరువాత అతణ్ణి కూడా ఈడ్చుకెళ్ళి నరకంలో పడవేయడం జరిగింది. మానవులు ఆచరించే కర్మల ప్రతిఫలం వారి వారి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరు ఏ సంకల్పంతో కర్మలు ఆచరిస్తే, ఆ మేరకు వారికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దుష్టసంకల్పంతో సత్కర్మలు ఆచరిస్తే సత్ఫలితం లభించదు. అందుకని ప్రతి విషయంలోనూ సంకల్పం అన్నది మనిషికి అవసరం, అనివార్యం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
హృదయాన్ని పదిలంగా చూసు కోవాలి...
హెబ్రోను నుండి దావీదుపురం లేదా యెరూషలేముకు తన రాజధానిని మార్చిన తర్వాత అక్కడ దావీదు చక్రవర్తి తన నివాసం కోసం గొప్ప రాజప్రాసాదాలను, తన సిబ్బంది, సైన్యం కోసం వందలాది ఇళ్లను కట్టించాడు. అత్యంత పవిత్రమైన దేవుని నిబంధన మందసాన్ని కూడా దావీదుపురానికి తెచ్చి, ఒక గుడారం వేసి అందులో ఉంచాడు. అయితే ఎంతో దీనస్థితి నుండి చక్రవర్తి స్థాయికి ఎదిగిన తానేమో దేవదారు పలకలు పొదిగిన మహా భవనాల్లో నివసించడం, తన ఔన్నత్యానికి కారకుడైన దేవదేవుని ప్రత్యక్ష సన్నిధికి సాదృశ్యమైన నిబంధన మందసమేమో తాత్కాలికమైన ఒక గుడారంలో ఉండటం దావీదుకు బాధకలిగించింది. వెంటనే ప్రవక్తయైన నాతానును దావీదు పిలిపించి, దేవుని నిబంధన మందసం కేంద్రంగా ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించాలనుకొంటున్నానని ప్రకటించాడు.దేవునికి మందిరం కట్టాలనుకోవడమనేది ఎంతో ఉదాత్తమైన ఆలోచన, అందులో తప్పేముంది? అన్న భావనతో, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నదంతా చేయమంటూ నాతాను దావీదుకు జవాబిచ్చాడు (1 దిన 17:1–14). అదే సమస్య అయ్యింది. రాజులకైనా, సామాన్య ప్రజలకైనా, ప్రవక్తగా నాతాను ప్రతి విషయాన్నిదేవుని సన్నిధిలో విచారించి తెలుసుకొని వారికి బదులివ్వాలి. కాని అది చక్రవర్తి ఆలోచన, పైగా మందిరం కడతానంటున్నాడు కదా, అందులో తప్పేముంది? అన్న ఉద్దేశ్యంతో నాతాను ’నీ హృదయంలో ఉన్నదంతా చేయమంటూ’ రాజుకు పూర్తి స్వేచ్ఛనివ్వడం దేవుడు హర్షించలేదు. నాకు మందిరాన్ని దావీదు కాదు, అతని కుమారుడైన సొలొమోను కడతాడంటూ ఆ రాత్రి దేవుడు నాతానుతో సెలవిస్తే, అదే విషయాన్ని నాతాను మరునాడు దావీదుకు తెలియజేశాడు. ఇశ్రాయేలు దేశానికి దావీదు చేసినంత సేవ మరెవరూ చేయకున్నా, మందిరం కట్టే ఘనతను మాత్రం దేవుడు అతనికియ్యలేదు. అలా దావీదు కట్టిన మహా మందిరంగా చరిత్రలో పేరుగాంచవలసిన యెరూషలేము మందిరం, దేవుని చిత్తంతో సొలొమోను కట్టిన మందిరంగా ప్రసిద్ధి చెందింది. దేవుని పనులు మనుషుల ఆలోచనలతో కాదు, దైవాభీష్టం మేరకు జరిగినప్పుడే లోక కల్యాణమవుతుంది. దైవప్రతినిధిగా నాతాను దేవుని సంకల్పాన్ని తెలుసుకోకుండా, నీ హృదయంలో ఉన్నదంతా చేయమంటూ దావీదును ప్రోత్సహించడం దేవునికి రుచించలేదు. పైకి మహాచక్రవర్తిగా అందరి మన్ననలందుకొంటున్న దావీదు హృదయం లోపలి పొరల్లోని రహస్యపుటాలోచనలు, దురాలోచనలు ప్రవక్తే అయినా మానవమాత్రుడైన నాతానుకు తెలియదు, కాని దేవదేవునికి తెలుసు. దావీదు, చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్న రహస్యాలోచనతో మందిరాన్ని కడతానంటున్నాడా లేక నిజంగా దేవుని మహిమ కోసమే కడతానంటున్నాడా... అన్నది దేవుడు తెలుసుకోలేడా? అందుకే, హృదయం చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధిగలది అంటోంది బైబిల్ (యిర్మీ 17:9). బైబిల్లో దైవిక విషయాల్లో ‘హృదయం’ అనే ప్రస్తావన వచ్చినపుడు, అది శరీరానికంతటికీ రక్తప్రసరణ చేసే ‘గుండె’గా కాక, మానవ జీవన స్థితిగతులన్నింటికీ మూలమైన, కీలకమైన నిర్ణయాలను చేసే ఒక ‘ఆలోచనావ్యవస్థ’గా దాన్ని అర్థం చేసుకోవాలి. దావీదు అది సరిగ్గా అర్థం చేసుకున్నాడు గనకే దేవుని ఆలోచనకు సమ్మతి తెలిపాడు, ‘నా హృదయానికి ఏక దృష్టిననుగ్రహించు’ అంటూ ప్రార్థించాడు (కీర్తన 86:11), తన నడవడిక, ఆలోచనల్లో ఏవీ దేవునికి అగోచరం కాదంటూ దేవుని స్తుతించాడు (కీర్తన 139). జీవితంలో మనం ఆయా నిర్ణయాలు తీసుకుంటాము. ఆ నిర్ణయాలే మన గమ్యాన్ని నిర్దేశించి, జీవితాన్ని శాసిస్తాయి. అయితే దేవుని సహాయంతో కాక మానవ హృదయంతో ఆలోచించి తీసుకున్న కొన్ని నిర్ణయాలే దీర్ఘకాలంలో తీరని అశాంతిని రేపి జీవితాన్ని దుర్భరం చేసిన ఉదంతాలు ఎన్నో ఉంటాయి. అందువల్ల స్వభావసిద్ధంగా ఒక ‘స్వతంత్ర ఆలోచనా వ్యవస్థ’గా పని చేయాలనుకునే మన హృదయానికి ‘దేవుని వాక్యం’ అనే కళ్లెం వేయడం శుభప్రదమైన పరిణామం. విచ్చలవిడితనం, అహంకారం, స్వార్థం, దుర్మార్గం వంటి అనేక పాపాలకు ప్రాప్తిస్థానంగా దుర్గంధపూరితమై ఉన్న హృదయానికి స్వచ్ఛమైన దైవవాక్యంతో ఉదకస్నానం చేయించాలి. దేవుణ్ణి అలా అక్కడే స్థిరప్రతిష్ఠ చేసుకోవాలి. అప్పుడది జీవజలాల ఊటలకు, లోకళ్యాణకారకమైన ఆలోచనలకు, చెరగని పవిత్రతకు స్థిర నివాసమై జీవితంలో శాంతి పరిమళించడానికి పునాది అవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
చిన్న విజయమైనా దేవుని తోడ్పాటుతోనే సాధ్యం!!
అపజయమంటే ఎవరికైనా బాధే!! కొన్ని అపజయాలైతే ఎన్నటికీ మర్చిపోలేని చేదు అనుభవాలను మిగిల్చి ముందుకు సాగకుండా చేస్తాయి. కాని విశ్వాస జీవితంలో అపజయాలు కొన్నిసార్లు అవసరమవుతాయి కూడా. కొన్ని అపజయాల్లో నేర్చుకున్న అత్యంత విలువైన పాఠాలు భవిష్యత్తులో మహా విజయాలకు పునాది రాళ్ళవుతాయి. అందుకే దావీదు ‘శ్రమ నొంది యుండుట నాకు మేలాయెను’ అంటాడు( కీర్తన 119:71). గొప్ప పట్టణమైన యెరికోలో సాధించిన ఘనవిజయం నేర్పిన పాఠాలకన్నా ఎంతో చిన్నదైన హాయి పట్టణంలో ఎదురైన ఘోరపరాజయం, ఇశ్రాయేలీయులకు, వారి నాయకుడైన యెహోషువకు అత్యంత విలువైన పాఠాలు నేర్పింది. యెరికోలో ఆకాను అనే వ్యక్తి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన ఉదంతంతోపాటు, దేవుని వాగ్దానాలు, సహాయం మీదకన్నా, ‘అది చాలా చిన్న పట్టణం, రెండుమూడు వందల మంది చాలు హాయిని జయించడానికి’ అంటూ వేగులవాళ్ళు తెచ్చిన సమాచారం మీద పూర్తిగా ఆధారపడ్డ కారణంగా యెహోషువ, అతని జనులు అక్కడ ఘోరంగా పరాజయం పాలయ్యారు. పైగా యెరికో దాడిలో, దేవుని ప్రత్యక్ష సన్నిధికి సాదృశ్యమైన దేవుని మందసం ఇశ్రాయేలీయులతోనే ఉంది. అలా యెరికో జైత్రయాత్రలో దేవుడే ప్రత్యక్షపాత్రను నిర్వర్తించాడు. అందుకే ఆ పట్టణాన్ని అంత సునాయాసంగా ఇశ్రాయేలీయులు గెలిచారు. యెరికో చాలా పెద్ద పట్టణం కదా దేవుని తోడుండాలనుకున్నారు, హాయి చాలా చిన్నదే కాబట్టి దేవుని తోడు అఖ్ఖర్లేదు, లక్షలమంది సైన్యమూ అవసరం లేదు, రెండు మూడువేలమంది మాత్రం చాలునన్న తప్పుడు వ్యూహం పన్ని, దారుణంగా ఓడిపోయారు. యెరికో విజయాన్ని ఆస్వాదించే అవకాశమే లేకుండా హాయి ఘోరపరాజయం ఇశ్రాయేలీయులను పూర్తిగా కుంగదీసింది (యెహోషువ 7). ఎన్నో గొప్ప విజయాలు సాధించిన విశ్వాసుల జీవితాల్లో చాలా చిన్నచిన్న విషయాల్లో ఎదురయ్యే అపజయాలే శాంతి, సంతృప్తి లేకుండా దిగజార్చుతాయి. ‘నేను’ ‘నా’ అన్న పదజాలం, భావజాలం దేవుని తోడ్పాటు అఖ్ఖరలేకుండా ముందుకు సాగవచ్చునన్న నకిలీ ధీమాను విశ్వాసికి కలుగజేస్తాయి. ప్రపంచాన్ని శాసించే స్థాయిని చేరుకున్న గొప్ప విశ్వాసులు, ఇంట్లో భార్య, పిల్లలే తమ మాట వినని దీనపరిస్థితుల్లో అంతర్గతంగా కుంగి కుమిలిపోయే దుస్థితి ఏర్పడేందుకు దేవుని విస్మరించడమే కారణం. యెరికోలో అసలు యుద్ధమే జరుగలేదు, కాని దేవుడు వారితో ఉన్నందున ఘనవిజయం సొంతమైంది. హాయి పట్టణస్థులు సంఖ్యలో కొద్దిమంది, పైగా చాలా బలహీనులైనా, దేవుడు తమతో లేని కారణంగా ఎంతో బలవంతులైన ఇశ్రాయేలీయులు ఓడిపోయి పారిపోవలసి వచ్చింది. విషయం చిన్నదైనా, ఎంతో పెద్దదైనా దేవుని తోడ్పాటు ఉంటేనే జీవితంలో విజయం వరిస్తుందున్న ప్రాథమిక పాఠాన్ని విశ్వాసి నేర్చుకోవాలి. నిజానికి యెరికో విజయం తర్వాత హాయిపై దాడికి వెళ్ళడానికి ముందు యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉంటే ఇంత అనర్ధం జరిగుండేది కాదు. యెరికో విషయంలో ఆకాను అనే వ్యక్తి చేసిన పాపాన్ని దేవుడు అప్పుడే తెలిపి ఉండేవాడు, ప్రాయశ్చిత్తం జరిగి ఉండేది, హాయిలో మొదటే విజయం వరించి ఉండేది. కుటుంబంలో పరిస్థితులు విషమించిన తర్వాత మోకరించి ప్రార్ధించేకంటే, తల్లిదండ్రులు ఆరంభం నుండీ ప్రార్ధనా జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిని విస్మరించకుండా ఉంటే కుటుంబాల్లో శాంతికి విఘాతం కలుగదన్నది విశ్వాసులు తెలుసుకోవాలి. విజయాలు సాధించేవారికే అపజయాల ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. దేవునితో ఎడతెగని బాంధవ్యమే జీవితంలో, కుటుంబంలో శాంతి పరిమళించడానికి ప్రధాన కారణం. జీవితంలో విజయాలు, అపజయాలు అంతర్భాగం. కాని అపజయం పొందిన తర్వాత దేవుని ప్రార్ధించి, నిందించే బదులు మన జీవితంలో ఉన్న ఆకానులను, అవిధేయతలను ముందు తెలుసుకొని పరితాపం చెందాలి. అది జరగకుండా, జీవితాన్ని సరిచేసుకోకుండా ఎంత ప్రార్ధించినా ఫలితముండదు సరికదా అపజయాలు కొనసాగుతూనే ఉంటాయి. బాక్సింగ్ లో తిరుగులేని జగద్విజేత మహమ్మద్ అలీ మార్చి 8,1961న తనతో తలపడుతున్న జో ఫ్రేజియర్ అనే బాక్సర్‌ను బాక్సింగ్ రింగ్‌లోనే తూలనాడుతూ అత్యంత అవమానకరంగా మాట్లాడాడు. బాక్సింగ్‌లో నేను చక్రవర్తిని, నన్ను ఓడించేవాడే లేడు, నువ్వెంత, నీ బలమెంత... ఒక చీమలాగా నిన్ను నలిపేస్తానంటూ హుంకరించాడు. ఆ తర్వాత కొద్దినిముషాలకే జో ఫ్రేజియర్ కొట్టిన ఒకే ఒక అనూహ్యమైన దెబ్బకు దిమ్మతిరిగి కిందపడిపోయి ప్రపంచ చాంపియన్‌షిప్‌ను చేజార్చుకున్నాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అన్నింటికీ మూలం మన హృదయమే
ఆదిమ అపోస్తలులైన పేతురు, యోహాను ఎక్కడికెళ్లినా తమ వెంట ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, ఆదరణను తీసుకెళ్లేవారు. వారి సాంగత్యంలో ప్రజలు ఎంతో ఆదరణ పొందేవారు, వాళ్ళు స్పర్శిస్తే చాలు ప్రజలు పరిశుద్ధాత్మపూర్ణులయ్యేవారు. వారినోట ప్రజల కోసం ఎప్పుడూ శాంతి, సాంత్వన, సహృదయపూరితమైన మాటలే వెలువడేవి. అందువల్ల తండోపతండాలుగా ప్రజలు వారిని కలుసుకోవడానికి వచ్చేవారు. ’పరిశుద్ధాత్మశక్తి’ వల్ల వారికి లభిస్తున్న ప్రజాదరణ చూసి అసూయచెంది, అది పొందితే తనకు కూడా అంతటి ప్రజాభిమానం లభిస్తుందన్న దురాలోచన ఆరోజుల్లో సీమోను అనే గారడీ వాడికి వచ్చింది. వెంటనే కొంత ద్రవ్యం వారి వద్ద పెట్టి, తనకు కూడా పరిశుద్ధాత్మ శక్తి వచ్చేలా చెయ్యమని అర్థించాడు. పరిశుద్ధాత్మ శక్తి పొందాలనుకోవడంలో తప్పు లేదు. కానీ తద్వారా మరీ ఎక్కువగా గారడీలు చేసి మరింత ప్రజాభిమానం సంపాదించాలనుకోవడం, పైగా ద్రవ్యమిచ్చి పరిశుద్ధాత్మశక్తి పొందాలనుకోవడం అతను చేసిన తప్పు. పేతురుకు, యోహానుకు సహజంగానే ఆగ్రహం కలిగింది. ‘నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు..నీవు ఘోరమైన దుష్టత్వంలో, దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. వెంటనే మారుమనస్సు పొంది దేవుని క్షమాపణ వేడుకొమ్మని వారతన్ని హెచ్చరించారు. మన ప్రవర్తన తాలూకు వేర్లు, మూలాలు మన హృదయంలో ఉంటాయని యేసుప్రభువు తన బోధల్లో ‘ఆత్మీయ రోగనిర్ధారణ’ చేశారు. ‘దుష్పవ్రర్తన’ అనే విషవృక్షం తాలూకు వేర్లు మన గుప్పెడు హృదయంలోనే అగోచరంగా ఉంటాయంటూ పరిసయ్యులు, శాస్త్రులను ఉద్దేశించి ప్రభువు చేసిన బోధ నాటి యూదుసమాజంలో పెద్ద దుమారాన్నే లేపింది. అందుకే వారాయన్ను చంపి తీరాలన్న తీర్మానానికి వచ్చారు. ప్రభువు చేసిన ఆ బోధ అప్పుడూ ఇప్పుడూ కూడా అన్ని తరాలు, వర్గాలు, వయసులవారికి వర్తిస్తుంది. బయటికి మన మొహంలో కనిపించే భావాలకు, లోపాలు హృదయంలో రహస్యంగా పెల్లుబికే లావా కు అసలు పొంతన ఉండదు. కొందరు పైకి తెగ నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోలోపల అందరి మీదా ఏడుస్తుంటారు, పక్కవాళ్ళమీద లోలోనే పళ్ళు కొరుకుతూంటారు, విద్వేషం ఇతివృత్తంగా మాటల్లో ‘విషం’ చిమ్ముతూ పైశాచికానందం పొందుతూంటారు. నరహత్య, దోపిడీ, వ్యభిచారం, దైవాజ్ఞాతిక్రమం వంటి అత్యంత హేయమైన పాపాల జాబితాలోకి ఈ ప్రవర్తన రాదేమో కానీ ఈ విద్వేషపూరిత ప్రవర్తన అన్ని పాపాలకన్నా ఎంతో ప్రమాదకరమైనది. మనలో అంతర్గతంగా ఏదైనా ‘చేదువేరు’ మొలిచి మనం దైవకృప పొందేందుకు అడ్డుపడకుండా జాగ్రత్తపడాలని పౌలు భక్తుడు విశ్వాసులను హెచ్చరించాడు హెబ్రీ 12:15). అంతర్గతంగా మనలో చేదువేరంటూ ఉంటే అది ఏదో ఒకసారి మొలకెత్తక మానదు, వటవృక్షంగా మారకా తప్పదు. ఇతరులను ద్వేషించి, వారిపై రహస్యంగా విషం చిమ్మే వాళ్ళు సాధారణంగా తమ జీవితాల్లో ఏదో సాధించాలని ఉబలాటపడి అది జరగక బొక్క బోర్లా పడ్డవాళ్లే!! అలా వారిలో వేళ్లూనిన ఆత్మన్యూనతా భావం, అభద్రతా భావం ఇలాంటి దుష్పవ్రర్తనకు పురికొల్పుతుంది. పరిశుద్ధాత్మశక్తి నిండిన విశ్వాసుల జీవితాల్లో, హృదయాల్లో ఆనందం, శాంతి, సంతృప్తి తాలూకు మంచి నీళ్ల ఊటలు నిరంతరం నిండి ఉంటాయి. వారి సహవాసంలో ప్రతి ఒక్కరూ ఆదరణ పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా మన హృదయాలను పరిశుద్ధపర్చుతాడు. అందుకే ఆ శక్తితో నిండిన చర్చిలు, విశ్వాసులు, పరిచారకుల మాటలు, క్రియలు ఆత్మీయ పరిమళంతో, ఆనందంతో నిండి ఉంటాయి. పాపం, రోజూ అందరినీ తన గారడీతో బోల్తా కొట్టించే సీమోను అనే గారడీ వాడు తన కుయుక్తితో ఆరోజు పేతురు, యోహానును కూడా బోల్తా కొట్టించబోయి తానే బోల్తా పడ్డాడు, అడ్డంగా దొరికి పోయాడు!!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
సాటిలేని నోవహు విశ్వాసం
భ్రష్టత్వంతో నిండిపోయిన లోకాన్నంతా మహా జలప్రళయం ద్వారా నిర్మూలించి ఒక సరికొత్త లోకాన్ని పునర్నిర్మించాలనుకున్న దేవుడు, అందుకు నోవహును, అతని కుటుంబాన్ని ఎంపిక చేసుకున్నాడు. దేవుని తీర్పు నుండి తనను తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ఒక ఓడను నిర్మించుకొమ్మని దేవుడే ఆదేశించాడు. విశ్వంలోని జీవులన్నింటిలో ఒక ఆడ, మగ జతను కూడా దాంట్లో చేర్చి ప్రళయం నుండి కాపాడేందుకు వీలైనంత పెద్ద ఓడ నిర్మాణం కోసం దేవుడు నోవహుకు కొలతలిచ్చాడు. లోకమంతా బలాత్కారం, భ్రష్టత్వంతో నిండిన నేపథ్యంలో దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించిన విశ్వాసులుగా నోవహు, అతని కుటుంబం అలా చరిత్ర, బైబిల్ పుటలకెక్కారు. ఒక సరికొత్త లోకంలో భాగం కానున్న జీవరాశి తాలూకు ‘విత్తనాలన్నీ’ ఓడలోకి ప్రవేశించిన తర్వాత, దేవుడు ఇంత పెద్ద లోకంలో నీవొక్కడివే నాకు నీతిమంతుడివిగా కనిపించావంటూ ప్రకటించి నోవహును, అతని కుటుంబాన్ని ఓడలోకి ప్రవేశించమని ఆదేశించి, వాళ్ళు లోనికి వెళ్లిన తర్వాత దేవుడే ఓడ తలుపును బయటి నుండి మూసివేశాడు(ఆది7:1,16). నీతిమంతుడైన నోవహును అతని కుటుంబాన్ని ఓడ లోపల భద్రపరిచిన దేవుని ప్రణాళికలో, ఆ ఓడ తలుపును దేవుడే బయటినుండి మూసివేయడం ఒక ప్రాముఖ్యమైన భాగం!! లేకపోతే జలప్రళయం ఆరంభమైన తర్వాత ఓడలోకి ప్రవేశించేందుకు తలుపు బయట జరిగే విపరీతమైన తొక్కిసలాటను, అలా ఎదురయ్యే తీవ్రవత్తిడిని తట్టుకోవడం నోవహుకు సాధ్యమై ఉండేది కాదు. అందుకే ఆ తలుపును బయటి నుండి తానే మూసేసి తాననుకున్నపుడు తెరిచే వీలును దేవుడు తన వశంలో పెట్టుకున్నాడు. జీవితం, కుటుంబం మనదే అయినా వాటిలో కొన్ని అంశాలను మాత్రం దేవుడు తన ఆధీనంలోనే ఉంచుకుంటాడు. అదే మనకు ఆశీర్వాదం కూడా!! ఓడలో నోవహు ఒక ఏడాదిపాటు ఉన్నాడు. బయట ఏం జరుగుతోందో అతనికి తెలియదు, ఓడ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా అతనికి తెలియదు. కాని దేవుడు ఆ తలుపును తన సంరక్షణ కోసమే మూసి ఉంచాడని, దేవుడు తప్పక దాన్ని ఒకరోజు తెరిచినప్పుడు తాను తన కుటుంబం ఒక సరికొత్త ప్రపంచంలోకి కాలుపెడతామన్న గొప్ప విశ్వాసం నోవహుది. చుట్టూ గాఢాంధకారం ముసిరిన అననుకూల పరిస్థితుల్లో కూడా, ఒకరోజు దేవుడు తన తేజోమయ పరిస్థితుల్లోకి తనను ప్రవేశపెడతాడన్న అద్భుతమైన విశ్వాసం నోవహుది. రాత్రి పడుకొంటూ తెల్లారి ఉదయాన్ని చూస్తాననుకోవడం విశ్వాసమే. కాని కొన్ని వందల కాళరాత్రుల అనుభవాల నేపథ్యంలో కూడా, దేవుడివ్వబోయే ఒక గొప్ప సూర్యోదయం కోసం ఎదురుచూడటం, నోవహు జీవితంలో మనం చూసే, దేవుడు కోరుకునే అసామాన్యమైన విశ్వాసం. ఓడ లోపలున్న నోవహు తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందా? అని ఎదురు చూడలేదు. ఓడ లోపలి జీవకోటినంతా కొత్త ప్రపంచం కోసం భద్రపరిచేందుకు, సిద్ధపర్చేందుకు దేవుడు తనకిచ్చిన పరిచర్యలో, తన కుటుంబంతో సహా సంపూర్ణంగా నిమగ్నమయ్యాడు. ‘దేవుడు తన పని తన సమయంలో చేసేలోగా, దేవుడు అప్పగించిన పనిని నేను నిబద్ధతతో చేస్తాను’ అన్నది నోవహు విశ్వాసం, సిద్ధాంతం!! దేవుడిచ్చిన కొలతల్లో, దేవుని అభీష్టం మేరకు ఓడను నిర్మించడం ద్వారా, లోకం తనను చూడకున్నా, తనను దేవుడు చూస్తు్తన్నాడన్న దైవభయంతో ఓడ లోపలి పరిచర్యనంతా నిబద్ధతతో చేసిన మహా దైవజనుడు నోవహు. మహా ప్రళయం లో అంతా తుడిచిపెట్టుకుపోగా నోవహు ఉన్న ఓడ ఒక్కటే మిగిలింది, తద్వారా నోవహు విశ్వాసం కూడా ఇన్ని తరాలుగా సజీవంగా మిగిలింది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
కార్పొరేట్ దేవుడు
జీవన కాలమ్ మొన్న వినాయక చతుర్థికి స్పెయిన్‌లో కొందరు హిందువులు వినాయకుని పూజ చేసుకున్నారు. అంతేకాదు, చిన్న ఊరే గింపు జరపాలనుకున్నారు. ఇది కొత్త సంప్రదాయం. తమ ఊరేగింపు వెళ్లే దారిలో ఒక చర్చి ఉంది. కనుక, ముందుగానే చర్చికి తమ ఉద్దేశం వివరిస్తూ ఆ దారిన వెళ్లడానికి అనుమతి కోరారు. చర్చి అధి కారులు నవ్వి, ‘‘మీ వినాయకుడు ఈ దారిన వెళ్లడమే కాదు, చర్చిలోకి వచ్చి మా ఏసు ప్రభువును కలిసి వెళ్లవచ్చు–ఇద్దరు దేవుళ్లూ మనందరినీ ఆశీర్వదిస్తారు’’ అన్నారు. మొన్న అదే వినాయక చవితినాడు తమిళనాడు షెన్కోటై్టలో మసీదు ఉన్న తమ రోడ్డులో ఊరే గింపు వెళ్లరాదని కొందరు ముస్లింలు, ముఖ్యంగా యువత హిందూ భక్తులను ఎదిరించారు. రెండు వర్గాల మధ్యా వాగ్వివాదాలు చెలరేగాయి. ఆవేశాలు పెరిగాయి. ఒకరి మీద ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఖాళీ విస్కీ సీసాలతో కొట్టుకున్నారు. మత దౌర్జన్యకారులు పది కార్లను, మూడు ఆటోలను, రెండు దుకాణాలను, ఒక ఏటీఎంనీ ధ్వంసం చేశారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. కలెక్టరు వచ్చారు. రెండు వర్గాలూ దేవుడిని అటకెక్కించి, మతాన్ని నెత్తిన పెట్టుకుని బిగుసుకున్నాయి. కర్ఫ్యూ విధించారు. ఏ దేశంలోనూ నాకు తెలిసి ఇలా దేవుడు వీధికెక్కడు. మతం వ్యక్తిగత విశ్వాసానికి ప్రతీక. ఒక వర్గం సామూహికంగా తమ దేవుడిని ఆరాధించడం ఈ దేశ సంప్రదాయం. మతం ఎల్లలను చెరిపేసిన మహానుభావులెందరో ఈ దేశంలో, ఇప్పుడు ఉన్నారు. ఇదే వినాయక చతుర్థి రోజున ఓ మిత్రుడు నాకు వాట్సాప్ సందేశాన్ని పంపాడు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అద్భుతంగా ‘వినా యక స్తుతి’ని జపించిన రికార్డింగు అది. కలియుగ ప్రత్యక్ష దైవంగా హిందువులు కొలిచే వేంకటేశ్వర స్వామి మీద అలంకరించే సాలిగ్రామ మాల, అను నిత్యం పూజలు జరిపే సువర్ణ పుష్పాలు ఇద్దరు ముస్లిం భక్తులు ఇచ్చినవని చెబుతారు. ఇంకో విచిత్రమైన ఇప్పటికీ సాగే సంప్రదాయం భద్రాచల దేవస్థానంలో ఉంది. ప్రతీ ముక్కోటి ఏకాదశికీ స్వామివారికి మొదటి అభిషేకం అక్కడి తహసీల్దారు చెయ్యాలి. ఆనాటి కంచర్ల గోపన్న తహసీల్దారు కనుక. అయితే రెండు సంవత్సరాలు ఒక ముస్లిం ఇక్కడ తహసీల్దారుగా ఉన్నాడు. ఆయనే అభిషేకం చేశాడు. ఒకసారి ఒక క్రైస్తవుడు తహసీ ల్దారుగా ఉన్నాడు. క్రైస్తవుడే అభిషేకం చేశాడు! ఇది అప్పటి తానీషా హుకుం. ఈ సంప్రదాయాలు, విశ్వాసానికి మతం లేదని నిరూపించిన అపూర్వ మైన ఘట్టాలు. ఇక సాంస్కృతిక రంగంలో తమ వైదుష్యంతో మతం ఎల్లలను చెరిపేసిన ఎందరో మహాను భావులు గుర్తుకొస్తారు. భారత రత్న బిస్మిల్లా ఖాన్, షేక్ చిన మౌలానా సాహిబ్ నుంచి నేటి జేసుదాసు వరకూ అదో వైభవం. చాలా సంవత్సరాల కిందట మద్రాసు వెంకటనారాయణ రోడ్డులోని వేంకటేశ్వర మందిరంలో జేసుదాసు స్వామిని దర్శనం చేసుకుని, కచేరీ చేస్తూ తోడి రాగంలో ‘‘అపరాధము లన్ని మరిచి’’ని ఆలపించడం అస్మదాదులకు గర్వ కారణం. నేను నా ‘ఆత్మకథ’లో రాసిన ఓ సంఘటనని ఇక్కడ ఉదహరించాలి. చిన్నతనంలో మా అమ్మ స్కూలుకి వెళ్లి రోజూ ఒక కాణీ పట్టుకుని వచ్చేదట. మా అమ్మమ్మ గమనించి కోప్పడి కూతురుతో స్కూలుకు వచ్చింది. మా అమ్మ కోసం ఎదురుచూస్తున్న గెడ్డం ముసలాయన్ని అడిగింది ‘‘ఏం తాతా! మా అమ్మాయికి రోజూ డబ్బు లిస్తున్నావు, ఎందుకు?’’ అని. ఆ ముసలాయన ఒక ముస్లిం. కంటతడి పెట్టుకుని, ‘‘ఈ వయస్సున్న నా కూతురు పోయిందమ్మా. ఆ పాపని చూస్తే నా బిడ్డ గుర్తుకు వస్తుంది’’ అన్నాడట. కడుపు తీపికి మతం లేదు. పేగు సంబంధానికి దేవుడు అడ్డం పడడు. ఇవాళ పరిస్థితులు ఎందుకిలా పరిణమించాయి. నాకు తెలుసు. మన మనస్సుల్లో నిలవాల్సిన దేవుడు వీధిన పడ్డాడు. దేవుడు పెట్టుబడిగా రాజకీయ పార్టీలు వెలిశాయి. అంతవరకూ పరవాలేదు. పదవిలో ఉన్న తమ దేవుడి భక్తుల్ని చూసి చదువులేని, సంస్కారం చాలని వర్గాలు రెచ్చిపోతు న్నాయి. మైనారిటీలకు మతం పెట్టుబడి. వీధిలో తమ మతం జెండా ఎగురవేయడం పార్టీకీ, తమ వర్గం గొప్పతనానికి నిదర్శనమని వారి ఉబలాటం. ఇది గొప్ప అనర్థం. దేవుడిని మనస్సుకీ, పూజ గదికీ పరిమితం చేయగలిగిన నాడు, పొరుగు మతానికి ఎల్లలు చెరిపివేయగల పెద్ద మనస్సుని వ్యవస్థ ప్రోది చేయ గలిగిన నాడు షెన్కోట్లై కనీసం స్పెయిన్ ఉదాత్తతని పుంజుకోగలదు. దేవుడు కార్లని తగలపెట్టమని ప్రోత్సహించడు. పరాయి దేవుడిని పలకరించడానికి ఉవ్విళ్లూరుతుంటాడు. గొల్లపూడి మారుతీ రావు వ్యాసకర్త -
దేవుడి కంటే పెద్దది
‘‘నా కుమారునికి సంతానం లేనందువల్ల నాకు దుఃఖంగా ఉంది. దయచేసి వాడికి పిల్లలు కలిగేలా చూడు స్వామీ’’ అని ప్రార్థించాడు. పరమేశ్వరుడు అదీ ప్రసాదించాడు. సంతానం లేని ఒక వ్యక్తి పరమేశ్వరుడిని ప్రార్థించి, ఆయన కృపతో సంతానాన్ని పొందాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. అయితే ఆ పిల్లవాడు పాలు తాగక బాధపెడుతుంటే, పరమేశ్వరుని తిరిగి ఇలా ప్రార్థించాడు. ‘‘దేవా! పుత్రుణ్ణి ఇచ్చావు. కాని వాడు పాలు తాగడం లేదు. ఎలా?’’ అని! పరమేశ్వరుడు ప్రత్యక్షమై అలాగే వాడు పాలు తాగుతాడని వరమిచ్చాడు. పిల్లాడు పాలు తాగడం మొదలు పెట్టాడు. పెరిగి అల్లరి పిల్లవాడయ్యాడు. తండ్రి మళ్లీ ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుడు బాలుడు అల్లరి మానతాడని వరమిచ్చాడు. ఈసారి వాడు మరీ మౌనంగా ఉండటం మొదలు పెట్టాడు. దాంతో తండ్రికి భయం వేసి మళ్లీ పరమేశ్వరుని ప్రార్థించాడు. పరమేశ్వరుని కృపతో తిరిగి మామూలయ్యాడా బాలుడు. అలా చాలాసార్లు ప్రార్థించిన తర్వాత వాడు పెద్దవాడై, ఉద్యోగాన్ని సంపాదించుకుని పెళ్లి చేసుకున్నాడు. ఈసారి వాడికి సంతానం లేదు. తండ్రి మళ్లీ పరమేశ్వరుని ప్రార్థించాడు. ‘‘నా కుమారునికి సంతానం లేనందువల్ల నాకు దుఃఖంగా ఉంది. దయచేసి వాడికి పిల్లలు కలిగేలా చూడు స్వామీ’’ అని. పరమేశ్వరుడు అదీ ప్రసాదించాడు. అటువంటి ప్రార్థనలకు అంతు ఉండదు. ఉన్న దానితో తృప్తి కలగదు. అందుకే మన పూర్వీకులు ముందే చెప్పారు. రూపాయి ఉన్నవాడికి వంద కావాలి. వంద ఉన్నవాడికైతే వేయి కావాలి. వేయి ఉన్న వాడికి లక్ష కావాలి. లక్ష ఉన్నవాడికి రాజు కావాలని ఉంటుంది. రాజుకు కుబేరుడు కావాలనీ, కుబేరుడికి ఇంద్రుడు కావాలనీ, ఇంద్రుడికి బ్రహ్మ కావాలనీ, బ్రహ్మకు విష్ణువు కావాలనీ, విష్ణువుకు శివుడు కావాలనీ... ఇలా కోరికలకు అంతెక్కడ?’’ పర్వతం పెద్దది. దానికంటే పెద్దది సముద్రం. దానికంటె పెద్దది ఆకాశం. దానికంటె పెద్దవాడు దేవుడు. దేవుడికంటె పెద్దది కోరిక. అసంతృప్తి మనిషికి దుఃఖాన్ని కలిగిస్తుంది. సంతృప్తి ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం కోసమే ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు ఇక కోరికలే ఉండవు. – శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి -
దేవుడు ‘నో’ చెబితే ఆశీర్వాదం!!
మన వాహనాలకు బ్రేకులెందుకుంటాయి? వేగాన్ని అదుపు చేయడానికి అనుకొంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి, బ్రేకులుంటే గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్ళడానికి వెనకాడని మీరు, అదే బ్రేకుల్లేని వాహనమైతే, దాన్ని ఆపే అవకాశం లేదు గనుక, గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడానికి కూడా సంకోచిస్తారు. అంటే బ్రేక ుల ఉద్దేశ్యం వాహనాన్ని ఆపడమే కాదు, మరింత వేగంగా వెళ్ళడానికి వీలు కల్పించడం కూడా అన్నది సుస్పష్టం. మన జీవిత ప్రయాణాల్లో, మన ప్రణాళికల్లో దేవుడు బ్రేకులు వేసేది కూడా మనల్ని అడ్డుకోవడానికి మాత్రమే కాదు, మనం ఆయన సంకల్పం మేరకు మరింత వేగం పుంజుకోవడానికి కూడా!! కొత్తనిబంధన కాలపు చర్చిని పరిశుద్ధాత్మదేవుడు పెంతెకొస్తు పండుగ నాడు యెరూషలేములోని మేడగదిలో స్థాపించాడు (అపొ.కా 2వ అధ్యాయం). కాని ఆనాటి అభిషేకంతో అక్కడినుండి బయలుదేరి అపొస్తలులుగా బయలువెళ్లిన వాళ్లంతా ప్రపంచంలోని నలుమూలల్లో ఆ చర్చి శాఖల్ని స్థాపించారు. వారిలో ప్రాముఖ్యమైనవాడు అపొస్తలుడైన పౌలు. అనేక పట్టణాలు, ప్రాంతాల్లో ఆయన ఆ చర్చి శాఖల్ని ఎన్నో స్థాపించాడు. అలా స్థాపిస్తూ యూరోప్ నుండి ఆసియా ఖండానికి వెళ్ళాలన్న పౌలు ప్రయత్నానికి దేవుడు ఒకరోజు బ్రేకులు వేశాడు (అపొ.కా.16:6). అపుడు దేవుని సంకల్పం కొరకు ఎదురుచూసిన పౌలుతో దేవుడు ఒక దర్శనం ద్వారా మాట్లాడాడు. మాసిదోనియా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తమ వద్దకు వచ్చి తమకు సువార్త చెప్పమని వేడుకొంటున్న ఒక దర్శనాన్ని పౌలు ఒక రాత్రి చూశాడు. మాసిదోనియా ప్రాంతం అలెగ్జాండర్ చక్రవర్తి జన్మభూమి, అతని సొంత స్థలం. ఆయన తర్వాత రాజ్యమేలిన చక్రవర్తులు ఆయన మీదున్న అసూయతో ఆ ప్రాంతాన్నంతా కొల్లగొట్టి బూడిద చేశారు. ఫలితంగా పేదరికం, అరాచకం, మితిమీరిన విచ్చలవిడితనం రాజ్యమేలే ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్ళడానికి సాహసించేవారు కాదు. అందుకే పౌలు అక్కడికి వెళ్లాలనుకోలేదు. కాని దేవుడు అతని ప్రయాణానికి బ్రేకులు వేసి మరీ ఆ ప్రాంతానికి పంపించాడు. ఫలితంగా మాసిదోనియా ప్రదేశంలో ఆయన అక్కడి రాజధానియైన ఫిలిప్పిలో, బెరయ అనే పట్టణంలో, థెస్సలొనీక పట్టణంలో కూడా చర్చి శాఖల్ని అద్భుతమైన రీతిలో ఆయన స్థాపించాడు. ఆ విధంగా ఆయన ముందనుకొన్న మార్గంలో కాకుండా ఇపుడు మరో మార్గంలో కొనసాగి కొరింథీ వంటి ఇంకా అనేక ప్రాముఖ్యమైన ఇతర పట్టణాల్లో కూడా విజయవంతంగా చర్చి శాఖల్ని స్థాపించాడు. మరోవిధంగా చెప్పాలంటే పౌలు చేసిన సువార్త యాత్రంతటినీ మాసిదోనియాకు ముందు ఆ తర్వాత అని విభజించగలిగినంత ప్రభావాన్ని ఆయన మాసిదోనియా సౌవార్తిక పర్యటన చూపించింది. దేవుడు మన ఆలోచనలకు సమ్మతి తెలుపకుండా నిరాకరించినపుడు, వాటిని అడ్డుకున్నపుడు, అంతకన్నా మెరుగైనదేదో ఆయన ఇవ్వబోతున్నాడని, లేదా మనం తలపెట్టిన దానిలో మనకు కనిపించని, అర్ధం కాని హానికరమైన అంశమేదో ఉందని అర్ధం. దేవుడు మనకు’నో’ చెప్పినపుడు దేవుడసలు మనల్ని ప్రేమిస్తున్నాడా? అన్న అనుమానం రాకమానదు. అయితే ఆయన ప్రేమించేవాడు గనుకను మనల్ని అడ్డుకొంటున్నాడన్న విశ్వాస స్థాయిలోకి మనం ఎదగాలి. అప్పుడు ఆయన ’నో’ చెబితే మనం ఆయనకు ’థాంక్ యు’ చెబుతాం. మనం ప్రవేశించాలనుకున్న తలుపును దేవుడు మూసిస్తే దాన్నే తెరవమంటూ పదే పదే బాదడం విశ్వాసం కానే కాదు. ఆ ద్వారం నీ స్థాయికి సరిపోదని అంతకన్నా శ్రేష్టమైన ద్వారాన్ని, మార్గాన్ని ఆయన నీ కోసం సిద్ధపరచాడని తెలుసుకోవాలి. ఒక్కసారి మన జీవితాల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే, మనకు దేవుడు బ్రేకులు వేసిన సందర్భాల కారణంగా ఎంత గొప్ప ఆశీర్వాదాలు మనకు చేకూరాయో మనకే అర్ధమవుతుంది. మనముందున్న జీవన ప్రయాణమంతా తెలుసుకోగలిగిన విజ్ఞత, శక్తి ఏ మానవునికి లేదు. అదంతా ఎరిగిన సర్వజ్ఞానిగా దేవుడు మన ప్రయాణాన్ని అడ్డుకొని మరో తెలియని మలుపు తిప్పితే, అంతకన్నా ఆశీర్వాదం మరొకటి ఉందా? అలా దేవుని చేతిలో చెయ్యి వేసి ప్రయాణించగలగడంలోని నిర్భయత్వం, నిశ్చింతా ఎంతో విలువైనది కాదా? – రెవ. డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
మళ్లీ దొరుకుతాయో లేదో!
అనగనగా ఒక రాజు. న్యాయంగా, ధర్మంగా రాజ్యపాలన చేసేవాడు. నిత్యం దేవుణ్ణి పూజించేవాడు. అతని భక్తి శ్రద్ధలకు ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చాడు.‘‘రాజా, నీ భక్తికి మెచ్చాను. ఏదైనా వరం కోరుకో’’ అన్నాడు. దేవుడి మాటలకు రాజు ఇట్లా అన్నాడు– ‘‘స్వామీ నీ కృపవల్ల నాకు ఏ లోటూ లేనప్పటికీ మీరే అనుగ్రíß స్తానన్నారు కాబట్టి కోరుతున్నాను – మీరు నాకు కనిపించినట్టే, నా ప్రజలందరికీ కూడా మీ దర్శనమిచ్చి వారిని ధన్యులను చెయ్యండి’’ అన్నాడు. ‘‘అది కుదిరే పని కాదు, నా పట్ల నిజమైన ఆర్తి, ప్రేమ ఉన్నవారికి మాత్రమే నేను కనపడతాను’’ అన్నాడు దేవుడు. రాజు విడిచిపెట్టకుండా పదే పదే అడిగేసరికి ‘సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా, నేను కొండమీద అందరికీ దర్శనమిస్తాను.’’ అన్నాడు దేవుడు. రాజు సంతోషంతో దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుని, మరుసటిరోజు ‘‘రేపు అందరూ కొండ దగ్గరకు నాతోపాటు రండి. అక్కడ భగవంతుడు మీకందరికీ దర్శనం ఇస్తాడు’’ అని నగరంలో దండోరా వేయించాడు.దేవుణ్ణి చూడాలన్న ఆశతో ప్రజలందరూ పోగయ్యారు. రాజు అందరినీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు. వారలా నడుస్తుండగా దారిలో ఒకచోట రాగి నాణేల కొండ కనిపించింది. వద్దు వద్దని రాజు చెబుతున్నా వినకుండా కొంతమంది అక్కడే ఆగిపోయి ఆ నాణాలను మూటకట్టుకుని, తమ ఇంటివైపు వెళ్లిపోయారు. రాజు ముందుకు సాగాడు. కొంతదూరం పోయాక వెండినాణాల కొండ కనిపించింది. మిగిలిన వారిలో కొందరు ‘వెండి నాణేలు మళ్లీ దొరుకుతాయో తెలియదు.. భగవంతుడు అయితే మరెప్పుడైనా కనిపిస్తాడు అనుకుని అటువైపు వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత బంగారపు నాణేల పర్వతం కనిపించింది. ప్రజలలో మిగిలినవారంతా, రాజు బంధువులతో సహా అటువైపే పరుగెత్తడం మొదలుపెట్టారు. వాళ్లు ఇతరుల లాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి వెళ్లిపోయారు. చివరికి రాజు, రాణి మిగిలారు. కొంతదూరం వెళ్లాక వారికి వజ్రాల పర్వతం కనిపించింది. రాణి అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నీ మూట కట్టుకోవటం ప్రారంభించింది. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. రాజుకు ఇచ్చిన మాట మేరకు దేవుడు అక్కడ నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే ‘‘ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ బంధువులు? నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలబడి వారి కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను.’’ అని అన్నాడు. రాజు బాధతో తల దించుకున్నాడు. -
దేవుడే మౌనం వహిస్తే..?
‘నిశ్శబ్దం’ కొంతసేపు బాగానే ఉంటుంది, ఆ తర్వాతే మనల్ని భయకంపితులను చేస్తుంది. ఒకవేళ దేవుడే నిశ్శబ్దం వహిస్తే?? అది మరీ భయం కలిగించే పరిణామం. ఏలియా ప్రవక్తగా ఉన్న కాలంలో ఇశ్రాయేలు దేశంలో అదే జరిగింది. అహాబు రాజు, అతని భార్య యెజెబెలు ప్రతిష్టించిన ‘బయలు’ అనే కొత్త దేవుని మోహంలో పడి ఇశ్రాయేలీయులంతా జీవము కల్గిన దేవుణ్ణి విస్మరించిన ఆ ‘చీకటికాలం’లో తీవ్రమైన క్షామం, దేవుని మౌనం వారికి దుర్భరమయ్యాయి. దేవుడు నిశ్శబ్దం వహించాడంటే, ఆయనకిష్టం లేని ఏదో అంశం లేదా పరిణామం విశ్వాసుల జీవితాల్లో లేదా కుటుంబంలో ఉందని అర్ధం. ఇశ్రాయేలీయులను కంటికి రెప్పలా కాపాడుతూ కనాను అనే వాగ్దాన దేశానికి తన బాహువుల మీద మోసుకొచ్చినట్టుగా వారిని తీసుకొని వస్తే నిజదేవుని ఆరాధనలతో ప్రతిధ్వనించవలసిన వారి ఇశ్రాయేలు దేశంలో, అహాబు భార్యయైన యెజెబెలు తన దేశమైన సీదోను నుండి తెచ్చి దేశమంతటా గుడులు కట్టి నిలబెట్టిన ‘బయలు’ దేవుని ప్రతిమల ఎదుట మోకరించడమే వారి క్షమార్హం కాని పాపమయ్యింది. ఈ లోకంలోని వాతావరణమంతా బయలు దేవుని ఆధీనంలోనే ఉంటుందన్నది సీదోనీయుల విశ్వాసం. అంతకాలం వర్షాలు క్రమం తప్పకుండా విరివిగా కురవడం కూడా ఆ ‘బయలు’ చలవేనన్న విశ్వాసం ఇశ్రాయేలీయులలో బలపడుతూండటంతో దేవుడు మూడున్నరేళ్ల పాటు వర్షం పడకుండా నిలిపివేశాడు. దాంతో బయలు దేవునికి ప్రజల పూజలు ముమ్మరమయ్యాయి. ఐనా వర్షాలు పడలేదు సరికదా దేశమంతటా కరువు తాండవించింది. ఆ దశలో మూడున్నరేళ్ల తర్వాత కర్మెలు పర్వతం మీద ఏలీయాకు బయలు దేవుని ప్రవక్తలకు మధ్య జరిగిన ’ప్రార్ధనల పోటీ’లో, వర్షం కురిపించడానికి వందలాది మంది బయలు ప్రవక్తలు చేసిన ప్రార్ధనలు విఫలం కాగా, ఇశ్రాయేలీయుల దేవుని పక్షంగా ఏలియా ఒక్కడే ఒంటరిగా నిలిచి చేసిన ప్రార్థన ఫలించి విస్తారమైన వర్షం పడింది. ఫలితంగా కర్మెలు పర్వతం మీద ఇశ్రాయేలీయుల్లో ఆ రోజున గొప్ప పశ్చాత్తాప విప్లవం, పునరుజ్జీవం పెల్లుబుకగా, వాతావరణం ఎవరి అధీనంలో ఉందో, ఎవరు నిజమైన దేవుడో అక్కడికక్కడే తేలిపోయింది(1 రాజులు 17,18 ఆధ్యాయాలు). ఆయన బిడ్డలమైన మనపట్ల దేవునిదెప్పుడూ తండ్రి మనస్సే!! చిన్నపుడు ఏదైనా తప్పు చేయాలంటే నాన్న కఠినంగా శిక్షిస్తాడన్న భయం కన్నా, రోజంతా గల గలా మాట్లాడుతూ అన్నీ తానే అయి ఎంతో ప్రేమతో చూసుకునే అమ్మకు తెలిస్తే ఆమె బాధపడి మౌనం వహిస్తుందేమోనన్న భావనే తప్పు జరగకుండా అడ్డుకునేది. తల్లిదండ్రులు శిక్షించినా, మౌనం దాల్చినా పిల్లల్ని బాధపెట్టేందుకు కాదు, వారిని సరిదిద్దేందుకే కదా? ఆనాడే కాదు, ఇప్పుడు కూడా విశ్వాసుల వ్యక్తిగత, కుటుంబ జీవితాల్లో దేవుడు మౌనం వహించాడన్న భావన కలిగితే వెంటనే స్వపరీక్ష చేసుకోవాలి. మనలో ఎక్కడ పొరపాటు ఉంది, ఎక్కడ దారి తప్పాము అన్నది తెలిసికొని పశ్చాత్తాప పడితే, దేవుడు మౌనం వీడుతాడు, ఆశీర్వాదాల వరద మళ్ళీ ఆరంభమవుతుంది.ప్రపంచంలో ఒక పాపి పశ్చాత్తాపపడితే ఆ భావనకున్న శక్తి ఎంతటిదంటే, అది దేవుని మనసును పూర్తిగా కరిగించేస్తుంది. ఆశీర్వాదాలు మనదాకా రాకుండా అడ్డుకొంటున్న పరిస్థితులను దేవుడే తొలగిస్తాడు. అయితే మనం పశ్చాత్తాపపడితేనే అది జరుగుతుంది. – రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుడితో మాట్లాడే సమయం
‘‘మంత్రజపాలు చేసినా, హోమాలు నిర్వహించినా, యజ్ఞయాగాదులు చేసినా, గొప్ప గొప్ప శాస్త్రాలు చదివినా బుద్ధి కుదురుగా లేకపోతే, ప్రవర్తన సరిగా లేకపోతే మోక్షం కలుగదు’’ అని తనను దర్శించడానికి వచ్చే భక్తులకు తరచు బోధించేవారు సాయి. ఒక గింజ మొలకెత్తి, చిగురులు తొడిగి, వృక్షం కావాలంటే ఎన్నో శక్తులు, ఎన్నో విధాల సాయం చేస్తాయి. నేల, నీరు, గాలి, సూర్యుడు.. ఇవన్నీ ఊపిరులూదితే కానీ ఆ గింజ ప్రాణం పోసుకోదు. ఎదగదు. అయినా ఇవన్నీ ఆ మొక్క నుంచి ఏమీ ఆశించవు. మీరూ ఎవరినుంచీ ఏమీ ఆశించకండి. చేతనైతే ఎవరికైనా మేలు చేయండి లేదంటే కనీసం కీడు చేయకుండా ఉండండి’’ అని బాబా బోధించేవారు. ఎల్లవేళలా దైవనామస్మరణ చేసేవారిని మాత్రమే కాదు, కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవటం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకపోవటం, మంచి భావనలతో మనసును నిష్కల్మషంగా ఉంచుకోవటం.. వీటిని ఆచరించేవారిని కూడా బాబా సదా అంటిపెట్టుకుని ఉంటారు. బాబా చూపిన ఆధ్యాత్మిక బాట కేవలం భక్తిపరమైనదే కాదు, అది మంచి జీవనశైలిని కూడా అలవరుస్తుంది. దానిని ఆచరించిన వారు అన్నింటా మంచి ఫలితాలను పొందుతారు. ఎందుకంటే ఆయన ఆచరణ సాధ్యం కాని విషయాలను ఆచరించమని చెప్పలేదు. ఫలానా నియమాలను పాటించాలని, యజ్ఞయాగాదులు చేయమని సూచించలేదు. తననే పూజించమని చెప్పలేదు. మరేం చేశారంటే.. మనిషి మోక్షం పొందడానికి సరికొత్త జీవన విధానాన్ని ప్రచారం చేశారు. అంతేకాదు, ఆ విధానంలో ఎలా జీవించాలో అందరికీ జీవించి చూపారు. అలాంటి జీవన శైలిని అలవరచుకుంటే ఎవరయినా ఎంతటి స్థాయికి చేరుకోగలరో తెలిసేలా జీవించారు. సాయి చెప్పిన దానిని బట్టి ప్రార్థన అంటే దేవుడితో బేరం కుదుర్చుకోవడం కాదు. ‘ఫలానా పని అయితే నీ దగ్గరకు వస్తాను, అదిస్తాను, ఇదిస్తాను, నాకు ఈ పని అయ్యేలా చూడు’ అని మొక్కుకోవడం కాదు. నిజమైన ప్రార్థనలో ప్రతిఫలాపేక్ష ఉండదు. మనకు జీవితమనే గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడం ప్రార్థనలోని పరమార్థం. ఇంకా సూటిగా చెప్పాలంటే – ‘ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడే సమయం’అన్నమాట. నిజంగా దేవుడి కోసం చేసే ప్రార్థనలో కోరికలు ఉండకూడదు. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండకూడదు. నిజమైన భక్తి ఎలా ఉండాలంటే.. మనసులో మంచిని తలుచుకోవాలి. కళ్లతో మంచిని చూడాలి. నాలుకతో మంచిని మాట్లాడాలి. చెవులతో మంచిని వినాలి. మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. ఎందుకంటే నిర్మలం కాని మనసులోకి భగవంతుడు ప్రవేశించలేడు. కాబట్టి పైన చెప్పిన మంచి పనులన్నింటినీ చేస్తూ, మనసును పూర్తిగా భగవంతుడి పైన లగ్నం చేయాలి. -
బంధించేదీ... విముక్తి కలిగించేదీ..!
ఒకసారి ఇద్దరు స్నేహితులు రోడ్డుమీద వెళుతున్నారు. దారిలో ఒకచోట భాగవత పురాణ కాలక్షేపం జరుగుతోంది. వాళ్లలో ఒకడు ‘‘ఒరేయ్! పురాణం విందాం రారా’’ అని లోపలకి వెళ్లి కూర్చున్నాడు. రెండవవాడు మాత్రం లోపలికి తొంగి చూసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. వాడు నేరుగా ఒక జూదగృహం వద్దకెళ్లాడు. కాని అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాడు. ఆ పరిసరాలు, వాళ్ల ప్రవర్తన అతనికి ఎబ్బెట్టుగా తోచాయి.‘ఛీ! ఎంత సిగ్గుచేటు, నా స్నేహితుడు పవిత్రమైన పురాణాన్ని వింటూ, సత్కాలక్షేపం చేస్తుంటే, నేనేమో ఇక్కడికొచ్చి చేరాను’ అని పశ్చాత్తాప పడ్డాడు. ఇక రెండవ వాడేమో, పురాణం వింటున్నాడు కానీ, కాసేపటికి మనసులో ఏదో పురుగు తొలిచింది. అతని దృష్టి కాస్తా పురాణం మీదినుంచి స్నేహితుడిమీద, అతను వెళ్లిన ప్రదేశం మీదా మళ్లింది. ‘నేనెంతో బుద్ధిహీనుణ్ణి. ఎప్పుడో జరిగిపోయిన పాత కథలను వింటూ ఇక్కడ కూర్చుండిపోయాను. వాడు ఏ వ్యభిచార గృహంలోనో, జూదగృహంలోనో హాయిగా కాలక్షేపం చేస్తున్నట్టున్నాడు’ అని వాపోయాడు. కాలం తీరి వాళ్లిద్దరూ మరణించారు.యమభటులు వచ్చి భాగవతం విన్నవాడి జీవాన్ని నరకానికి ఈడ్చుకుంటూ పోతే, జూదగృహానికి వెళ్లిన వాడి జీవాన్ని విష్ణుభటులు సగౌరవంగా స్వర్గానికి తీసుకెళ్లారు. భగవంతుడు మనిషిలో చూసేది అతనిలోని పవిత్రమైన భావాలను, నిర్మలమైన భక్తిని మాత్రమే. మనల్ని బంధించేదీ, విముక్తి కలిగించేదీ కూడా మనస్సే. మనసును అదుపులో పెట్టుకోగలిగితే చాలు... అంతా సౌఖ్యమే, ఆనందమే. -
దేవుడి భరోసా
అనగనగా ఓ జ్ఞాని. అతను మంచి జ్ఞానే. ఇలా ఎందుకు చెప్పవలసి వస్తోందంటే ఈ కాలంలో అక్కడక్కడా మనం చూస్తూనే ఉన్నాం. కొందరు నకిలీస్వాములను కూడా. కానీ మన కథలోని జ్ఞాని ఎంతో మంచివారు. ఓ రోజు అతని ఆశ్రమానికి ఓ వ్యక్తి వస్తాడు. జ్ఞానికి నమస్కరించి ఆకలేస్తోందని అంటాడు. అతని వినయానికి జ్ఞాని బోల్తాపడతాడు. ‘‘ఏం దిగులు పడకు. వేళ కాని వేళ వచ్చానని బాధ పడకు. నేనే స్వయంగా నీకు ఏదో ఒకటి చేసి పెడతా’’ అంటూనే ఇచ్చిన మాట ప్రకారం వంటచేసి అతనికి పెట్టి పడుకోమంటాడు. అతను అలాగేనని తృప్తిగా భోంచేసి నిద్రపోతాడు. తెల్లవారి చూసేసరికి ఆ వ్యక్తి కనిపించడు. అతనెప్పుడో పారిపోయి ఉంటాడు. మధ్యాన్నం అవుతుంది. ఇంతలో జ్ఞానికి కబురందుతుంది. నిన్న రాత్రి తన దగ్గర ఆశ్రయం పొందిన వ్యక్తి మంచి వాడు కాడని, దుష్టుడని. అది తెలిసి జ్ఞాని ‘ఛీ నేనెంత పాడు పని చేశానో. ఓ దుష్టుడి మాట నమ్మి వాడికి అన్నం పెట్టి పడుకోనిచ్చాను’ అని ఎంతో బాధ పడతాడు. చివరికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరున్న నదిలో తలస్నానం చేస్తే తప్ప చేసిన పాపం పోదు అని అనుకుంటాడు. నదికి బయలుదేరబోతుంటే ఆకాశం నుంచి ఓ దివ్య రూపమొచ్చి ఆ జ్ఞాని ముందు నిలబడుతుంది. ‘‘ఇదిగో నువ్వేంటో ఒక రోజు రాత్రి అన్నం పెట్టి పడుకోవడానికి చోటిచ్చినందుకే ఇంతగా బాధ పడుతున్నావు. ఏదో తప్పు చేశానని తెగ నలిగిపోతున్నావు. పైగా నదీ స్నానం చేసి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం పోతున్నావు. అదలా ఉంచి నా విషయానికి వస్తాను. నేను దేవుడే కావచ్చు. చెడ్డవారిని శిక్షించి మంచి వారికి అండగా ఉండాలి కదూ. కానీ నేనేం చేస్తున్నాను. దాదాపు యాభై ఏళ్ళుగా వాడికి అన్నపానీయాలు, ఉండేందుకు జాగా కూడా కల్పిస్తూ వస్తున్నాను. మరి నేనేం చేసుకోవాలి నన్ను... ఆలోచించు. నువ్వు కొన్ని గంటల సపర్యలకే ఇంతలా అయిపోతున్నావు. నువ్వేమీ బాధ పడక్కర్లేదు. నీకే పాపం అంటకుండా నేను చూస్తానులే’’ అని నచ్చచెప్తాడు.అప్పటికి జ్ఞాని మనసు శాంతించింది. – యామిజాల జగదీశ్ -
సాయి అనే మాటకి అర్థం..?
ఖండోబా గ్రామదేవత ఆలయ అర్చకుడు మహల్సాపతి పెట్టిన పేరే ‘సాయి’. ‘యా సాయీ!’ (దయచేసి రండి సాయీ!) అని ఆయన ఆహ్వానిస్తే సాయి లోనికొచ్చాడు.ఇంతకీ సాయి అనే పేరుతోనైతే మహల్సాపతి పిలిచాడు గానీ ఈ పదానికున్న అర్థం ఏమిటనే సంశయం మనకొస్తుంది కదా! మరాఠీ భాషా నిఘంటువు ప్రకారం సాయి అనే మాటకి ‘ప్రభువు – దేవుడు – నాథుడు – ప్రియుడు – ఫకీరు’ అనే అర్థాలున్నాయి. ఇది ఇప్పుడే కొత్తగా వచ్చిన పదం కాదు. భక్తకబీరు ‘సాయి’ అనే పదాన్ని ‘అత్యంత సమర్థతతో లోకాలని నడిపించే భగవంతుడు’ అనే అర్థం వచ్చేలా తనగీతాల్లో వాడాడు.‘సాయి’ అని ఎందుకు మహల్సాపతి సంబోధించాడో క్రమంగా చూసుకుంటూ వెళదాం. సాయి పదానికి మొదటర్థం ‘ప్రభువు’ అని. ‘భు’ అంటే ‘ఉన్నవాడు’ అని అర్థం. ‘స్వయం+భు+వు’ అనే పదానికి తనంతట తానుగా పుట్టి, ప్రస్తుతం ఉన్నవాడని అర్థం. అలాగే ‘ఆత్మభువు’ అనే మాటకి ఆత్మ నుండి పుట్టి ప్రస్తుతం ‘ఉన్నవాడు’ అని అర్థం. మనోభువు అనే మాటకి మనసు నుండి పుట్టి ప్రస్తుతం ‘ఉన్నవాడు’ అని అర్థం. ఈ తీరులో ‘ప్రభువు’ అనే అర్థమున్న సాయిపదానికి ‘ప్ర+భు+వు’అంటే మానవ అతీతమైన లక్షణాలు కలిగి ప్రస్తుతం ఉన్నవాడు అని అర్థమౌతుంది. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోగల శక్తి సాయికి ఉండడమనేది ఈ ప్రభువనే అర్థానికి సరైన ఉదాహరణ. ఇక సాయి అనే పదానికి ఉన్న రెండో అర్థం ‘దేవుడు’. దీవ్యతీత దేవః – ఎప్పుడూ మానసికానందంతో ఉండేవాడని దీనర్థం. ఎండకి మాడుతున్నా, వర్షం తనని తడుపుతున్నా, చలి తనని బాధిస్తున్నా, సమయానికి తిండి దొరక్కున్నా, ఎవరిమటుకు వారు తమతమ ఇళ్లలో తలుపులు వేసుకుని కూర్చున్నా – ఏవిధమైన దుఃఖమనేది లేకుండా అదే మసీదు దగ్గర ఉండటం. ఆ సమయంలో కూడా ఆనందంగానే ఉండటమనేది ‘దేవుడు’ అనే ఆ అర్థానికి సరైన ఉదాహరణ.సాయి అనే పదానికున్న మూడో అర్థం ‘నాథుడు’. ‘నాథే’ తాను అండగా ఉండి రక్షించేవాడని ఈ మాటకి అర్థం. కలరావ్యాధితో బాధపడుతున్న షిర్డీవాసులకి తాను అండగా ఉండే కదా గ్రామప్రజలు కలరా రోగులు కాకుండా రక్షించాడు! కాబట్టి నాథుడనే అర్థానికి ఉదాహరణ ఇదన్నమాట!సాయి అనే పదానికున్న నాలుగో అర్థం ‘ప్రియుడు’. ప్రియుడు అనగానే రోజులు మారాక ‘ప్రేమించిన వాడు’ అనేది అర్థంగా అయిపోయింది. అయితే ప్రియుడనేమాటకి సరైన అర్థం అది కాదు. శరీరం నిండుగా ప్రేమతత్త్వం కలవాడని. ప్రియుడు అనగానే కేవలం మనుషుల విషయంలో.. అందునా యవ్వనవంతుల విషయంలో మాత్రమే ప్రేమ కలిగినవాడనేది దాని భావంగా కనిపిస్తుంది. ప్రేమభావమనేది పక్షుల విషయంలో, కుక్కల విషయంలో, చెట్ల విషయంలో ఇలా అన్ని చరాచర జాతులన్నింటిలోనూ ఉండాలి. సాయి ఎన్నో పక్షులకి తిండిగింజల్ని వేసేవాడు. కుక్కలకి ఆహారాన్ని పెట్టేవాడు. నిత్యం ‘లెండీ’ అనే పేరుగల తోటలో చెట్లకి నీటిని క్రమం తప్పకుండా పోస్తుండేవాడు. కాబట్టి ప్రియుడనే ఆ అర్థానికి ఇవన్నీ ఉదాహరణలన్నమాట! సాయి అనే పదానికి ఉన్న చివరి అర్థం ‘ఫకీరు’. దేని మీదనూ ధ్యాసలేకుండా ఉండేవాడిని ఫకీరు అంటారు. ఒకే వస్త్రాన్ని కట్టుకోవడం, భిక్షాటన చేసి తెచ్చుకున్న ఆహార పదార్థాలని ఒక గిన్నెలో ఉంచి, కనీసం మూత కూడా లేకుండా చేసి.. కుక్కలు, పక్షులు, చీమలు తింటున్నా పట్టించుకోకుండా.. అవి తినగా మిగిలిందాన్ని ఏ మాత్రపు అసహ్యం లేకుండా తినడం, ఒకవేళ భిక్షాటనలో ఆహారం లభించకపోతే తిండి లేకుండా ఉండటం ఇవన్నీ ఫకీరు లక్షణాలే కదా! కాబట్టి ఫకీరు అనే అర్థానికి ఇవి ఉదాహరణలన్నమాట!ఇన్ని తీరుల లక్షణాలనీ గమనించాడు కాబట్టే ఖండోబా దేవాలయ అర్చకుడైన మహల్సాపతి ‘సాయి’ అనే పేరుతో ఆయన్ని సంబోధిస్తూ తన గౌరవాభిమాన భక్తులన్నిటినీ కలుపుతూ ‘యా సాయీ! (సాయీ! దయచేయండి)’ అన్నాడన్నమాట.సంస్కృత పండితులు కొందరు ‘సాయి’ అనే పదం సంస్కృత వ్యాకరణం ప్రకారం సరికాదు కాబట్టి ఆయన్ని ‘శాయి’ అని పిలవాలంటూ ‘శాయి బాబా’ అనడం మొదలెట్టారు ఒకప్పుడు. ‘శాయి’ అనే పదం సంస్కృత భాష ప్రకారం.. నిత్యం శయనించి (పరుండి) ఉండేవాడు (శేతే ఇతి శాయీ) అనే అర్థాన్నిస్తుంది. శేషుని మీద పరుండి ఉండేవాడు కాబట్టి ‘శేష శాయి’ అయ్యింది. ఆ పదాన్ని ఉచ్చరించేటప్పుడు ‘శేషసాయి’ అనకూడదు. ఇక్కడ ‘సాయి’ అనేది సంస్కృత భాషాపదం కాదు. మరాఠీ పదం కాబట్టి ‘శాయి’ అనకూడదు. ‘సాయి’ అనే అనాలి. అలాగే ‘బాబా’ అనేది కూడా ‘తండ్రి వలే రక్షకుడు’ అనే అర్థాన్నిస్తుంది కాబట్టి సాయి లేదా సాయి బాబా అనే అనాలి తప్ప శాయి అని గాని శాయిబాబా అనిగాని అనకూడదు. శాయి అనేది సంస్కృత పదమే అయినా మళ్లీ ‘బాబా’ అనేది సంస్కృతం కాదు కాబట్టి ‘శాయి బాబా’ అనకూడదు. దాసగణు కథ ఒక ఇంటిని మనం కట్టుకున్నాక ఏయే వస్తువులు మనకి అవసరమవుతాయో గమనించుకుని ఎలా తెచ్చుకుని మనింట్లోనే ఉంచుకుంటామో, అలా సాయి కూడా తనతో పాటుగా ఏయే లక్షణాలున్నవారిని ఎవరెవరిని శాశ్వతంగా ఉంచుకోవాలో బాగా ఆలోచించుకున్నాడు. ఆయన దృష్టి అనన్యసామన్యం కదా! అలా ఆయన మనోభీష్టానికి అనుగుణంగా వచ్చి ఆయన దగ్గరే ఉండిపోయినవాళ్లే కాకా సాహెబ్, నానా సాహెబ్, సచ్చరిత్ర రాయాలనే దృక్పథానికి వచ్చిన అన్నాసాహెబ్ అనేవాళ్లు. ఈ ముగ్గురూ మంచి మిత్రులైపోయారు. వీరు కాక ఇంకా ఎందరో ఆయన దగ్గరికి రావడం భక్తులుగా మారిపోయి ఆయన సన్నిధిలోనే ఉండిపోవడం జరిగింది.అలాంటి ఉత్తమ భక్తుల కోవలోకి మరొకర్ని రప్పించుకోవాలని మనసులో భావించాడు సాయి. ఆ అనుకున్నది ‘దాసగణు’ అనే ఒక పోలీసు ఉద్యోగాన్ని చేస్తున్నవానిని గూర్చి సాయి తనలో అనుకోవడం తడవు – దాసగణుకి షిర్డీ రావాలని అనిపించింది. సాయి అతణ్ణి చూస్తూ.. ‘గణూ! ఆ పోలీసు ఉద్యోగాన్ని మాని ఈ మానవసేవకి అంకితం అయిపోకూడదూ? ప్రశాంతంగా జీవితాన్ని వెళ్లదీయచ్చుగా!’ అన్నాడు.దాసగణు ఆ మాటలకి కొద్దిగా అసంతృప్తి పడి – ‘స్వామీ! నేనిప్పుడు సాధారణ పోలీసుని. ఎందుకో పదవోన్నతిని పొంది సబ్ ఇన్స్పెక్టరుగా కొంతకాలంపాటు ఆ హోదాలో ఉండి ఆ మీదట వద్దామనుకుంటున్నా’ అన్నాడు. సాయి చిరునవ్వుతో ‘అలాగా! అలాగే కానీ!’ అన్నాడు. చాలా తొందరకాలంలోనే దాసగణుకి పదవోన్నతి లభించింది. సబ్ ఇన్‌స్పెక్టరయ్యాక సాయి వద్దకొస్తానన్న ఆ మాట తనలో తిరుగాడుతూనే ఉంది. సాయి దర్శనానికొచ్చాడు. సాయి మాట్లాడుతూ.. ‘గణూ! ఇన్‌స్పెక్టరయ్యాక వచ్చేస్తానన్నావుగా!’ అన్నాడు. దాసగణు ఆ మాటకి సమాధానాన్ని చెప్పలేకపోయాడు. దానిక్కారణం ఆ ఉద్యోగంలో కొంతకాలం ఉండాలనే మోజు మాత్రమే. సాయి చిరునవ్వు నవ్వుకుంటూ తనలో అనుకున్నాడు. మంచి ఆధ్యాత్మిక భవిష్యత్తున్నవాడు కదా దాసగణు! ఈ లౌకిక ప్రవృత్తిలో ఎందుకిలా జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడు? అని. ఇలా అనుకుని ‘సరే గణూ! ఎలా ఆ ఉద్యోగాన్ని నిర్వహిస్తావో చూద్దాం!’ అన్నాడు సాయి. ఆ మాటకర్థం అప్పుడు తెలియలేదు దాసగణుకి.కొన్నాళ్లయ్యాక పోలీసుస్టేషన్లో ఏదో చోరీసొత్తు దొంగలనుండి రాబట్టి తెచ్చినది కనిపించలేదు. దురుదృష్టవశాత్తూ ఆ సొమ్ముని దాసగణు తీసి ఉంటాడనే అభియోగం మోపబడింది. నిజానికి తాను నిర్దోషి. ఎన్ని విధాల తాను దోషిని కాదంటూ తగిన పత్రాలని సమర్పించినా దాసగణు మాత్రమే నేరగాడుగా లెక్కించబడ్డాడు. దాంతో దాసగణు ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సాయి పలికిన పలుకుల్ని గుర్తు చేసుకుని – షిర్డీకి తన మకాంను మార్చేసాడు. 70 సంవత్సరాల వయసున్నప్పటికీ దృఢంగా ఉన్న తాను సాయిసేవలో పూర్తిగా తన జీవితాన్ని వెళ్లదీయాలని నిశ్చయించుకుని సాయి అనుమతిని కోరాడు. సాయి అనుగ్రహించాడు. దాసగణుది మంచి శ్రావ్యమైన కంఠం. రాగాలజ్ఞానం కూడా ఉంది. సొంతంగా కీర్తనలని రచించి స్వరపరిచి పాడగల నైపుణ్యం ఉంది. తనకి కల్గిన అనుభవంతో, సాయిది భవిష్యత్ జ్ఞాన శక్తి కల తపశ్శక్తి అని గ్రహించి సాయి మీదే కీర్తనలని సొంతంగా రచించాడు. అంతతో ఊరుకోకుండా చుట్టుపక్కలనున్న గ్రామాల్లో హరికథల రూపంలో సాయి చరిత్రని శ్రావ్యంగా పాడుతూ అనేకుల్లో సాయి భక్తిని రగుల్కొల్పాడు. శ్రావ్యమైన కంఠం, కీర్తనల్లోని సాహిత్యం కారణంగా కేవలం మహారాష్ట్రలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దాసగణు కీర్తనలని వినాలనే తపన ప్రారంభమయింది శ్రోతలైన భక్తులకి. దాంతో అనేక ప్రదేశాల్లో సాయి కీర్తనలని విరివిగా వినిపించాడు దాసగణు. ప్రతిఫలాపేక్ష ఏ మాత్రమూ లేకుండా ఇలా సాయి ప్రచారం విశేషంగా అయిన కారణంగా సాయి భక్తుల సంఖ్య మరింత అయిపోయింది. నిజమైన ఆశ్చర్యకరమైన అంశమేమంటే దాసగణు నిజానికి సాయి భక్తుడు కాదు. తొట్టతొలుతదశలో అతను పండరిపురాధీశుడైన విఠ్ఠల భక్తుడు. ఆ సాహిత్యాన్ని బాగా చదివిన వాడూ అనేక అనుభవాలని పొందినవాడు కూడా. అయితే షిర్డీక్కూడ వస్తుండేవాడు కేవలం విఠ్ఠలునివద్దకే కాకుండా. అలాంటి దాసగణు సాయిని సమీపించి పాదాలని స్పృశించి నమస్కరించి ‘ప్రభూ! ఒక్కసారి పండరిపురానికి వెళ్లి విఠ్ఠలుని దర్శించి రావాలని అనిపిస్తోంది. నీ సన్నిధిని విడిచి వెళ్లడమా? అని మనసు వెనకడుగువేస్తోంది! కాదు పాండురంగణ్ణి. దర్శించాల్సిందేనని బుద్ధి వెంటపడుతోంది! నాకేమీ పాలుపోవడం లేదు’ అన్నాడు. సాయి చిరునవ్వుతో దాసగణుని చూస్తూ ‘గణూ! పండరి వెళ్తేనే విఠ్ఠలుని దర్శనమవుతుందా? ఆయన అక్కడ మాత్రమే ఉన్నాడా? ఉంటూ ఉంటాడా? సరే! నీ అభీష్టానికి అనుగుణంగా పండరినాథుని దర్శనం కలిగేలా చేస్తాను. మరి నామగుప్తాహాన్ని (పండరి విఠ్ఠలదేవుని నామాన్ని క్రమం తప్పకుండా ఏడు రోజుల పాటు చేయడం) చేస్తావా?’ అన్నాడు. గురుదేవుని ఆజ్ఞ ప్రకారం తప్పక చేస్తానన్నాడు దాసగణు.తాను చెప్పిన ప్రకారం దాసగణు ఏడురోజుల పాటూ నియమనిష్ఠలతో పండరినాథుని దర్శనమవుతుందనే గట్టి ఎదురుచూపుతో సప్తాహాన్ని ముగించి సాయికి పాదాభివందనాన్ని చేసాడు. తలనెత్తి చూసే సరికి సాయి లేడు. పండరిపురనాథుడైన విఠ్ఠలుడే రుక్మిణీ సమేతంగా దర్శనమిస్తుండే సరికి దాసగణుకి కలిగిన ఆనందానికి శరీరం పట్టలేదు. ఏమిటీ వింత? నా దగ్గరికొచ్చి విఠ్ఠలుడు దర్శనమీయడమా? భగవంతుణ్ణి మన చెంతకి నామపారాయణం వల్ల రప్పించుకోగలమా? దానికి గురు అనుగ్రహం ఇంతగా ఉంటుందా? అనుకుంటూ ఆ విఠ్ఠలుని పాదాలని తన చేతులతో స్పృశించాడు. విఠ్ఠల పాండురంగడు విగ్రహరూపంలో లేడు. జీవించివున్న దైవరూపంలో సచేతనంగా కనిపించాడు. కనులనిండా ఆనందబాష్పాలు అలా కారిపోతుంటే... ‘సాయీ! సాయీ!’ అంటూ సాయిని మనఃపూర్వకంగా స్మరించాడు ఇంతటి ఆనందాన్ని కలిపించినందుకు. అంతే! ఎదురుగా అయిదడుగుల శరీరంతో తానెప్పుడూ ధరించే పెద్దలాల్చీతో సాయి కనిపించాడు. దాసగణుకి నోట మాట రాలేదు. సాయి నిత్యం తన చెంత ఉన్న కారణంగా ఆయన గొప్పదనాన్ని లెక్కించలేకపోయానని సిగ్గుపడ్డాడు.కొంతకాలమయ్యాక దాసగణుకి గంగాయమునల్లో స్నానం చేసి రావాలనే బుద్ధి పుట్టింది. ఆ అభిప్రాయాన్నే సాయికి వెల్లడించాడు. సాయి మళ్లీ పూర్వంలాగానే నవ్వి – దాసగణూ! గంగాయమునలు ఇక్కడలేవా? ఇది ప్రయాగ కాదనుకుంటున్నావా? తప్పక స్నానాన్ని చేయిస్తాను’ అనగానే దాసగణు సాయిపాదాల చెంత తన శిరసునుంచి నమస్కరించాడు. అంతే ఒకపాదం నుండి గంగా మరోపాదం నుండి యమునా ధారలుగా రాసాగాయి. దాసగణుతో పాటు అందరికీ ఆశ్చర్యం ఆనందం కలిగాయి. ఇది సాధ్యమా? ఎలా వచ్చాయి ధారలుగా? (సశేషం..) -
గోపురాలు కాదు, బలిపీఠాలు నిర్మించాలి
తాను ఎంతో ఇష్టపడి సృష్టించుకున్న భూమి యావత్తూ పాపభూయిష్టమైపోయిందన్న కోపంతో దేవుడు ఒక్క నోవహు కుటుంబాన్ని మాత్రం మినహాయించి, మహా జలప్రళయం ద్వారా భూలోకాన్నంతా ప్రక్షాళనం చేయగా... లోకంలో జీవనం మళ్ళీ ఆరంభమయ్యింది (ఆదికాండము 8 వ అధ్యాయం). పునరుత్పత్తి కోసం దేవుడు కాపాడిన నోవహు కుమారుల కుటుంబ వారసులే విస్తరించి అనేక దేశాలకు చెదిరిపోయి ఎన్నో జనాంగాలు, రాజ్యాలుగా ఏర్పడ్డారు(ఆది 10వ అధ్యాయం). అయితే భూలోకవాసుల పాపం నీళ్లతో కడిగితే పోయేది కాదని రుజువు చేస్తూ, కొద్దికాలానికే మళ్ళీ భ్రష్టత్వం ఆరంభమయింది. అది పెచ్చరిల్లి ప్రజలు అహంకారులై బాబెలు గోపుర నిర్మాణానికి పూనుకోవడంతో వారి భ్రష్టత్వం పరాకాష్టకు చేరుకుంది( ఆది 11వ అధ్యాయం). ఆకాశాన్నంటే ఒక గోపురాన్ని నిర్మించి పేరు సంపాదించు కుందామన్న అక్కడి ప్రజల ఆశయంలోని హద్దులు దాటిన స్వార్థం, ప్రజల్లో తమ జ్ఞానం పైన తమకున్న అతిశయం, చివరికి తమను తాము నాశనం చేసుకోవడానికే దారితీస్తుందని దేవుడు గ్రహించి, తానే జోక్యం చేసుకొని వారిలో అనేక భాషలు సృష్టించి గందరగోళం రేపి అక్కడి నుండి వారిని అనేక ప్రాంతాలకు చెదరగొట్టాడు. మానవాళికి రానున్న ఒక మహావిపత్తును దేవుడలా తప్పించాడు. అయినా, క్షణాల్లో దేవుని చేరగల ‘ప్రార్థన’ ‘ఆరాధన’ అనే అద్భుతమైన పవిత్ర ఆత్మీయ ప్రసార సాధనాల్ని దేవుడే తన ప్రజలకివ్వగా, ఆయన్ని చేరేందుకు ఆకాశానికి అంటే నిచ్చెనలాంటి గోపురాన్ని ప్రజలు కట్టాలనుకోవడం విడ్డూరమే కాదు, పెరుగుతున్న తన జ్ఞానంతో దేవుణ్ణే సవాలు చేయాలనుకున్న మనిషి తెలివి తక్కువతనం కూడా!! జలప్రళయం సమసిన తర్వాత ఓడలోనుండి తన కుటుంబంతో వెలుపలి కొచ్చిన వెంటనే నోవహు యెహోవా దేవునికి బలిపీఠం కట్టి ఆయన్ను ఆరాధించాడు. దేవుడు నోవహు ఆరాధనతో ఎంతగా ప్రసన్నుడు అయ్యాడంటే, మానవాళినంతటినీ, సమస్త జీవరాశినీ మునుపటి జలప్రళయంలో లాగా ఇంకెప్పుడూ తానిక సమూలంగా నాశనం చేయబోనని దృఢంగా నిశ్చయించుకున్నాడు (ఆది 8:20–22). గోపురనిర్మాణానికి పూనుకున్నవారిని దేవుని ఆ నిర్ణయమే ఆయన మహా ఉగ్రత నుండి కాపాడింది. దేవుడందుకే వారిని చెదరగొట్టడంతో సరిపెట్టుకున్నాడు. దేవుని మీద ప్రతిసారీ తిరుగుబాటు చేసి తనను తాను హెచ్చించుకునే ప్రాథమికమైన మనిషి పాపస్వభావం ఎన్నేళ్లు, ఎన్ని తరాలు గడిచినా మారలేదు. అయితే దేవుని మనసు నెరిగిన మహా భక్తులకు కూడా ఎన్నడూ కొరత లేదు. బాబెలు గోపురాలు కట్టినవాళ్ల తరాల వెనువెంటే బలిపీఠాలు కట్టిన అబ్రాహాము వంటి వినయమనస్కులు, సాత్వికుల తరం కూడా ఆరంభమైంది (ఆది 12వ అధ్యాయం). ఆ అబ్రాహాము వంశంలో నుండే ఎంతోమంది దైవ ప్రవక్తలు చివరికి జగద్రక్షకుడైన యేసు ప్రభువు ఈ లోకానికొచ్చాడు. బాబెలు మహా గోపురం మానవాతిశయానికి, అహంకారానికి సాదృశ్యమైతే, అబ్రాహాము కట్టిన చిన్న బలిపీఠాలు విశ్వాసి సాత్వికత్వానికి, విధేయతకు, వినమ్రతకు సాదృశ్యాలు. తలబిరుసుతనం, జ్ఞానంతో ఆకాశాన్ని తాకాలనుకోవడం ద్వారా కాదు, దీనులై తలవంచి దేవుని పాదాలనాశ్రయించడం ద్వారా మాత్రమే దేవుని ప్రసన్నతకు పాత్రులమవుతాం. సాత్వికత్వం, వినయం, విధేయతతో దేవుని ప్రసన్నతకు పాత్రులైన వారి జీవితాలు, పరిచర్యలు, కుటుంబాల ద్వారానే ‘దేవునిశక్తి’ లోకంలోనికి విడుదలఅవుతుంది, లోకాన్ని దైవాశీర్వాదాలతో నింపుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుడున్నాడని నిరూపిస్తే రాజీనామా
మనీలా : దేవుడున్నాడని ఎవరైనా నిరూపిస్తే దేశ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తానని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్ సవాలు విసిరారు. స్టూపిడ్ గాడ్ అంటూ రొడ్రిగో ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేవుడిపై తన వ్యాఖ్యాలతో రోమన్ క్యాథలిక్ దేశమైన ఫిలిప్పీన్స్‌లో వివాదంగా మారుతున్నారు. దక్షిణ దవవొ నగరంలో సైన్స్, టెక్నాలజీ అంశంపై శనివారం రొడ్రిగో మాట్లాడుతూ... ‘అసలు ఈ సృష్టిలో దేవుడు అనేవాడు లేడు. ఎవరైనా దేవుడు వున్నాడని నిరూపిస్తే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా. దేవుడు అనే పదానికి అర్థం ఏంటి. దేవుడి బొమ్మగాని, అతను మాట్లాడుతాడనిగాని ఎవరైనా నిరూపించగలరా? దేవుడు ఉన్నాడనే భావన చాలా మూర్ఖమైనది. ఇదేం మతమో’ అని వ్యాఖ్యానించారు. గతవారం రొడ్రిగో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసలు ఆ స్టూపిడ్ గాడ్ ఎవరని, క్యాథలిక్ బిషప్‌లను మానసిక రోగులని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డ్యూటర్ట్ క్రైస్తవ మత విశ్వాసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ప్రతిపక్ష నేత ఆంటోనియా ట్రిలియన్స్ రొడ్రిగోను ఒక దుష్టుడిగా అభివర్ణించారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా క్రూరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల విమర్శలను రొడ్రిగో అధికార ప్రతినిధి హ్యారి రోక్ తీవ్రంగా ఖండించారు. దేవుడిపైనా, మతాలపైన తన అభిప్రాయాన్ని రోడ్రిగో వ్యక్తపరిచారని, ఆ హక్కు ఆయనకు ఉందని తెలిపారు. -
భగవంతుని అనుగ్రహంతోనే శ్రేయస్సు
-
దేవుడు అడిగాడు.. కొడుకును బలిచ్చాను!
లండన్ : తాగిన మైకంలో 18 నెలల కొడుకును దేవుడికి బలి ఇచ్చిందో తల్లి. ఈ సంఘటన ఇంగ్లండ్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెస్ట్ యార్క్‌షైర్‌కు చెందిన జెమ్మా ప్రొక్టర్ తల్లి డెబోరాతో పాటు ముగ్గురు బిడ్డలతో బార్కెరెండ్‌లో ఓ అపార్ట్మెంట్లో నివాసముంటోంది. గత కొన్నేళ్లుగా ఆమె ‘‘పారానోయిడ్ స్కిజోఫ్రెనియా’’ అనే మానసిక వ్యాధితో బాధపడుతోంది. జెమ్మా తన 16వ ఏట నుంచే మద్యానికి బానిసవ్వటమే కాకుండా గంజాయి సైతం విపరీతంగా తీసుకునేది. గత కొద్ది రోజుల నుంచి దేవుడు తనతో మాట్లాడుతున్నాడని అందరితోనూ చెప్పేది. కొద్ది నెలలుగా విచిత్రంగా నడుచుకోవటమే కాకుండా క్రూరంగా ప్రవర్తించేది. అప్పటి వరకూ ఎప్పుడూ లేని విధంగా మత సంబంధ ప్రదేశాలకు ఎక్కువగా వెళ్లేది. ఓ రోజు ఎర్రటి దుస్తులు ధరించి నృత్యం చేస్తూ ఇంటి చుట్టూ తిరిగింది. ఆ తర్వాత తల్లి ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉన్న సమయంలో 18నెలల కొడుకును ఆరవ అంతస్తులోని తన ఇంటి కిటికీలో నుంచి కిందకు విసిరేసింది. సమాచారం అందుకున్న పోలీసులు జెమ్మాను అదుపులోకి తీసుకుని విచారించగా కొన్ని విస్తుగొలిపే విషయాలను వెల్లడించింది. జెమ్మా మాట్లాడుతూ.. తనతో దేవుడు రోజూ మాట్లాడేవాడని, పిల్లాడిని బలి ఇవ్వాలని అడిగే వాడని తెలిపింది. పిల్లాడు చాలా సంతోషంగా ఉన్నాడని.. ఎందుకంటే అతడు దేవుడి దగ్గరికి వెళ్లిపోయాడని పేర్కొంది. -
ఆలయాల సంరక్షణ ఎలా?
ఆ భగవంతునికి అర్చకుడు భగవత్ కైంకర్యంలో తన సర్వస్వాన్ని అర్పిస్తాడు. తనను, తన అధీనంలోని చేతన అచేతన సంపదను నిశ్శేషంగా సమర్పిస్తాడు. ఈ సమర్పణలో అర్చకుని భార్య, పిల్లలు, చుట్టాలు, ధన, కనక వస్తు వాహనాలు మొదలైనవి అతీ తం కావు, అన్నీ స్వామికి సమర్పించి, ఆయన ప్రసాదంగా స్వీకరిస్తాడు. అర్చకుడు ఆలయంలో సేవ చేసినపుడు అతనితోపాటుగా అతని కుటుంబం కూడా శారీరకంగా, మానసికంగా పాలుపంచుకుంటుంది. అర్చకత్వం అనేది ఒక బృహత్తర బాధ్యత. సమాజం సుఖశాంతులతో, సహ భావనలతో వర్ధిల్లాలని భగవంతుని అనునిత్యం ప్రార్థించే అర్చకుడు తిరిగి తనకు అదే సమాజం వస్తు రూపకంగా ఏదైనా తిరిగి ఇవ్వాలని కోరుకోడు. నిస్వార్థంగానే సమాజ శ్రేయస్సును ఆకాంక్షిస్తాడు. అటువంటి అమాయక అర్చకుని బాగోగుల గురించి సమాజం ఆలోచించాలి. అవును. తప్పకుండా ఆలోచించాలి. అర్చకుని గురించిన ఈ ఉపోద్ఘాతానికి కారణం ఉంది. ప్రస్తుత సమాజంలో క్షీణించిపోతున్న అర్చక వర్గ సంఖ్య గురించి వాడిగా వేడిగా చర్చలు జరుగుతున్నాయి. యువతరంలో అర్చకత్వంపట్ల సన్నగిల్లుతున్న సుముఖత, అర్చకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేని ఆడపిల్లలు వగైరా. అర్చక కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలు సైతం, అర్చకుని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ పరిణామం అత్యంత భయావహం. ఇప్పుడు బరువెక్కిన హృదయంతో ఇటువంటి నాజూకు విష యం గురించి పాఠకులతో తన భావాలను పంచుకోవాలనుకుంటున్నాము. మా ఉద్దేశం సమాజం ఈ సమస్యవైపు తన దృష్టి సారించలేదని కాదు. అర్చకులు ఆలయాలను విడిచిపెట్టి వెళ్లడానికి ప్రేరేపిస్తున్న కారణాల చిక్కుముడులను విప్పడానికి సమాజం కృషి చేస్తూనే ఉన్నది. 1987లో, నాటి ప్రభుత్వం ఆలోచనా రహితంగా చేసిన చట్టంతో వంశపారంపర్య అర్చకత్వం రద్దు అయింది. ఇది సరైన నిర్ణయం కాదని ఎలుగెత్తి చాటిన దేవాలయాల పరిరక్షణ ఉద్యమం, వంశపారంపర్య అర్చకత్వం మళ్లీ పునః అర్చకులకు ఇవ్వాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నది. దేవాలయాల పరిరక్షణ ఉద్యమం స్ఫూర్తితో భక్తులను ఈ దిశలో ఆలోచించేలా చేసింది. తాము అర్చకత్వ బాధ్యతల నుండి తప్పుకోవడానికి వంశపారంపర్య అర్చకత్వ రద్దే ప్రముఖ కారణంగా పలు వంశపారంపర్య అర్చక కుటుంబాలు పేర్కొన్నాయి. జీవనోపాధికై ఇతర ఉద్యోగాలను చూసుకోవాల్సి వచ్చిందని వారు వాపోయారు. ‘‘అర్చకుని కొడుకు తండ్రికి వారసుడుగా పనికిరాడని ప్రభుత్వమే చట్టం చేస్తే మేమేమి చెయ్యాలి’’ అని ప్రభుత్వంపై నింద మోపారు. తమ బాధ్యతల నుండి తప్పించుకున్నారు. గ్రామీణ దేవాలయాలను మూతపెట్టి వలసలు వెళ్లిపోయారు. 1996లో అమలు చెయ్యడానికి సాధ్యపడని తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు, ఒక అద్భుతమైన తీర్పును చెప్పినట్లుగా తమను తామే అభినందించుకుంది. ఎట్టకేలకు 2007లో వైఎస్ఆర్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనా రహిత చట్టాన్ని సవరించి వంశపారంపర్య అర్చకత్వానికి పునః అవకాశం కల్పించింది. ‘ధార్మిక పరిషత్’ను ప్రవేశపెట్టింది. కానీ దురదృష్టవశాత్తు దేవాదాయ శాఖలోని కొద్దిమంది స్వార్థపరులైన అధికారులు తమ ధోరణిని మార్చుకోని కారణంగా ఆ చట్టం కూడా అమలుకు నోచుకోలేదు. అర్చకులు వీధినపడ్డారు. దేవాలయాలు మూతపడ్డాయి. దేవాదాయ చట్టంలో సూచించినట్లుగా భక్త సమాజాల స్థాపనే ఇక మనకు మిగిలిన ఏకైక ఆశ. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద సమస్య ఉంది. ఈ ధోరణి ఇంకా భయపెట్టేదిగా ఉంది. గ్రామీణ ఆలయాలన్నీ మూతపడ్డాయి. అక్కడ పూజలు చెయ్యడానికి అర్చక కుటుంబాలు లేవు. స్థానికులు ఆలయాలను పూర్వస్థితికి తీసుకురావాలని ముందుకు వస్తున్నా కూడా, అర్చకులు తిరిగి తమ పూర్వ బాధ్యతలు స్వీకరిస్తారా అనేది ప్రశ్నార్థకం. దీనికి పరిష్కారం ఏమిటి? మనం, అవును. భక్తులమైన మనమే దీనికి తగిన పరిష్కారం ఆలోచించాలి. అర్చకులు గ్రామీణ ఆలయాలను వదిలి వెళ్లకుండా ఆపాలి. వారి కుటుంబ బాధ్యత మనం స్వీకరించాలి. ఈ పని ప్రభుత్వం ఏవో కొన్ని స్కీములు ప్రవేశపెట్టడం ద్వారా చెయ్యలేదు. దీనికి ఒకే మార్గం. భక్త సమాజాల స్థాపన. ఆలయాల నిత్య విధులకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ భక్త సమాజాలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వగలవు. ప్రతి గ్రామంలోనూ, అక్కడి స్థానికులైనా, లేకపోతే అక్కడి మూలాలు ఉన్నవారైనా కనీసం 15 కుటుంబాలు కలిసి సంవత్సరానికి కనీసం కొంత ధనాన్ని సేకరించగలిగితే, గ్రామంలోని ఆలయంలో నిత్య విధులు, ఉత్సవాలు సక్రమంగా జరిపించవచ్చు. నిజంగానే ఇది సాధ్యం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా... మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం. ఈ లక్ష్య సాధనకై అందరం పాటుపడదాం. సి.ఎస్. రంగరాజన్ వ్యాసకర్త ఆలయాల సంరక్షణ ఉద్యమ కన్వీనర్ మొబైల్ : 98851 00614 -
ధర్మజిజ్ఞాస
ఒక మంత్రం పట్టునివ్వాలంటే ఆ మంత్రాన్ని జపించవలసిన విధానం ఏమిటి? ఈ విషయాన్ని భగవద్గీత బాగా వివరించి చెప్పింది. మనసుకి ఏ ఆందోళనా, తొందరా లేని కాలాన్ని నిర్ణయించుకుని, మనం జపం చేస్తున్నంతసేపూ మననెవరూ పలకరించ(లే)ని తీరు ఏర్పాట్లున్న ప్రదేశంలో ఎంతసేపు మననాన్ని చేయగలమో అంతసేపు మననం చేయడం సరైన పద్ధతి. అలా మంత్రమననం చేసినదే లెక్కకి వస్తుంది. ఇటు అక్షమాలని తిప్పుతూ అన్నిటినీ పరిశీలిస్తూ ఎదుటివారి మాటలకి కళ్లతో నవ్వుతో ప్రతిస్పందిస్తూ మౌనంగా చేస్తూన్న జపం– మంచి కాలక్షేపానికి (సమయాన్ని వ్యయం చేయడానికి) పనికొస్తుంది. (శుచౌ దేశే...) ఏ దేవుణ్ణి ఎప్పుడు స్మరించాలి? ఉదయం వేళలో మనం శ్రీహరి శ్రీహరి అంటూ విష్ణువునే స్మరించాలి. మన పోషకత్వాన్ని నిర్వహించేది విష్ణువు గనుక ఉదయం లేవగానే ఆయన్ని స్మరిస్తే మన నిత్యజీవితం సాఫీగా సాగిపోతుంది. సూర్యాస్తమయ సమయంలో శివుని స్మరించాలి. అలాచేస్తే మన నిత్యజీవితంలో సమతుల్యత లభిస్తుంది. హర శబ్దానికి హరించువాడని అర్ధం ఆయన్ని సాయం సమయాల్లో ధ్యానిస్తే మన పాపాల్ని అన్నింటినీ హరింపచేస్తాడు. ‘‘ప్రదోషే హరిం న పశ్యాత్ నృసింహం రాఘవం వినా’’ విష్ణువు నృసింహావతారం ఎత్తింది సాయం సంధ్యా సమయంలోనే గనుక నృసింహునకు మినహాయింపు. ఇక రాముని విషయానికొస్తే ‘రమయతీతి రామః’’ –ప్రజలను రంజింప చేసే వాడు కనుక రాముని ఎల్లవేళలా స్మరించవలసిందే. పక్షానికి ఒకసారి సంభవించే మహాప్రదోష కాలంలో శివదర్శనం, శివనామ జపం మనకు అమిత ప్రయోజనకరం. సాయంసంధ్యసమయంలో ఉన్న త్రయోదశి తిధినాటి ప్రదోష కాలమే మహాప్రదోషమవుతుంది. ఆనాడు ఉదయం ద్వాదశి తిధి ఉన్నా ఇబ్బంది లేదు. కనుక ప్రదోషకాలం అన్ని విధాలా శుభప్రదమైంది, పవిత్రమైనది అని ఎంచి అర్ధనారీశ్వరుని ధ్యానించి మనం తరించాలి. -
దేవుళ్ల ‘మాన్యం’ మాయం
అది పాతబస్తీ ఫలక్‌నుమాలోని మల్లికార్జున స్వామి దేవాలయం.. ఆలయానికి నిజాం హయాంలో దాతలు భూములు విరాళంగా ఇచ్చారు.. ఆ వివరాలన్నింటినీ నాటి రికార్డుల్లో పొందుపరిచారు. ఇటీవల దేవాలయం భూమిని స్థానిక నేత ఒకరు కబ్జా చేస్తున్నట్టు దేవాదాయ శాఖకు ఫిర్యాదు అందింది.. దీంతో భూమి హద్దులు తెలుసుకునేందుకు పాత రికార్డుల కోసం వెతికితే వాటి జాడే కనిపించలేదు! నిజాం నాటి ఫైల్ మాయమైంది. విలువైన ఆలయ భూమి అన్యాక్రాంతమైంది!! సాక్షి, హైదరాబాద్ : ..ఇది ఈ ఒక్క దేవాలయం కథే కాదు.. రాజధాని నగరంలో అనేక దేవాలయాల భూముల సంగతి కూడా ఇంతే! కబ్జారాయుళ్లు ఇలా కొన్ని వేల ఎకరాల్ని చెరబట్టారు. భూముల్ని మాయం చేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించటం, రికార్డులను మార్చడం కాదు.. ఏకంగా ఫైళ్లనే మాయం చేసేశారు. చట్టంలో లొసుగులు, విభాగాల మధ్య సమన్వయ లేమిని ఆసరాగా చేసుకొని కబ్జా రాబందులు రెచ్చిపోయాయి. మాన్యం భూములకే దర్జాగా శఠగోపం పెట్టారు. రాజధానిలో ఎన్ని వేల ఎకరాల భూమి ఇప్పుడు కబ్జాపాలైందో, ఇంకా ఎంత ఉందో కూడా చెప్పలేని దుస్థితి నెలకొంది. లోకాయుక్తలో దాఖలైన ఓ కేసుతో ఈ వ్యవహారం డొంక కదిలింది. లోకాయుక్తా ఆదేశంతో అధికారులు రంగంలోకి దిగి దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయాన్ని జల్లెడపట్టి చివరకు నిజాం హయాంకు చెందిన దేవాలయ రిజిస్ట్రేషన్లకు చెందిన కొన్ని పత్రాలను మాత్రం గుర్తించారు. దాదాపు 35 వేల కాగితాలను వెతికిపట్టుకున్నారు. అవి ఉర్దూ, అరబిక్, పార్సీ లిపిలో ఉండటంతో ఆంగ్లంలోకి తర్జుమా చేయిస్తున్నారు. కొద్దిరోజులగా ఈ కసరత్తు జరుగుతోంది. కానీ వాటి వివరాలు మాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వ రాజ్యాభిలేఖన విభాగం (స్టేట్ ఆర్కివ్స్) సహకారంతో ఈ తర్జుమా వ్యవహారం జరుగుతోంది. విచిత్రమేంటంటే.. వాటిని కూడా మాయం చేసేందుకు కొందరు నేతలు తెర వెనుక యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నో ఉదాహరణలు.. లంగర్‌హౌజ్‌లోని శ్రీ రామచంద్రస్వామి దేవాలయానికి ఎకరాల కొద్దీ స్థలం ఉంది. కానీ వాటిల్లో ఎడాపెడా నిర్మాణాలు వెలిశాయి. ఆలయ నిర్వాహకులమంటూ కొందరు వాటిని పరాధీనం చేసేందుకు తెగబడ్డారు. నిర్వాహకుల వారసులమంటూ కొందరు అరాచకానికి తెరదీశారంటూ మరో వర్గం ఫిర్యాదులతో విషయం కోర్టుకు చేరింది. కానీ.. దేవాలయ మాన్యం వివరాలను తేల్చే రికార్డులు ఎప్పుడో మాయమయ్యాయి. అలాగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయానికి భోలక్‌పూర్ సర్వే నంబర్–92లో 1.34 ఎకరాల భూమి ఉన్నట్టు నిజాం కాలం నాటి పత్రాలు చెబుతున్నాయి. కానీ ఆ భూమి ఎక్కడుందో, దాని హద్దులేంటో దేవాదాయశాఖకు తెలియదు. దీంతో రెవెన్యూ సాయం కోరింది. ఆ వివరాలేవీ తమ రికార్డుల్లోనే లేవని రెవెన్యూ అధికారులు చేతులెత్తేశారు. రికార్డులు మాయం కావడంతో భూమి ఎక్కడుందో తెలియని దుస్థితి నెలకొంది. దిక్కుతోచని స్థితిలో దేవాదాయ శాఖ ఇప్పుడు నిర్మిస్తున్న దేవాలయాలకు మాన్యం ఉండటం లేదు. కేవలం ఆలయం మాత్రమే ఉంటోంది. కొన్నిచోట్ల రోడ్డు వైపు దుకాణాలు నిర్మించి వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని దేవుడి సేవలకు వినియోగిస్తున్నారు. కానీ పూర్వకాలంలో జాగీర్దాలు, పాలకులు, సాధారణ వ్యక్తులు దేవాలయాలకు పెద్దమొత్తంలో భూముల్ని విరాళంగా ఇచ్చారు. చిన్న చిన్న ఆలయాలకు కూడా వందల ఎకరాలు భూములున్న దాఖలాలున్నాయి. రాజధాని నగరంలోనూ ఇలా భూములు ఇచ్చారు. వాటి వివరాలను నిజాం పాలకులు ప్రత్యేకంగా పొందుపరిచారు. ఏ దేవాలయానికి ఎంత భూమి ఉందో తెలియాలంటే ఈ రికార్డులే ఆధారం. కానీ అవి లేకపోవటంతో ఇప్పుడు ఆయా ఆలయాలకు ఎంత భూమి ఉందో, ఉంటే హద్దులేమిటి అన్న వివరాలు దేవాదాయశాఖ వద్ద అందుబాటులో లేవు. పాత దేవాలయాల భూములకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే అటు రెవెన్యూ రికార్డుల్లో వెతుక్కోవడం, స్టేట్ ఆర్కైవ్స్‌లో పాత రికార్డుల కోసం పరుగెత్తటం తప్ప మరో ఆధారం లేకుండా పోయింది. 20 ఏళ్ల కిందటే మాయం? 20 ఏళ్ల క్రితమే దేవాదాయ శాఖ నుంచి ‘నిజాం’ రికార్డులు మాయమైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన ఓ బడా నేత, ఓ మైనారిటీ నేత, నగరానికి చెందిన మరో నేత సహకారంతోనే ఇవి గల్లంతయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి పలుకుబడితో కొందరు నేతలు రెచ్చిపోయారని, దేవాదాయ శాఖలో పదవీ విరమణ చేసిన కొందరు అధికారులు వారికి సహకరించారని తెలుస్తోంది. 1996 ప్రాంతంలో ఓ బడా నేత నిజాం కాలం నాటి ఔకాఫ్ రిజిస్టర్లను తన కార్యాలయానికి తెప్పించుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ ఫైళ్లు, ఔకాఫ్ రిజిస్టర్లు మాయమయ్యాయి. అధికారులను పావులుగా వాడుకొని.. హైదరాబాద్‌కు ప్రత్యేకంగా 1963–67 మధ్య టౌన్ సర్వే ల్యాండ్ రికార్డు(టీఎస్ఎల్ఆర్) రూపొందించారు. అప్పటి వరకు పహాణీలే దిక్కు. అంతకుముందు ఉన్న రికార్డుల్లోని వివరాలతో టీఎస్‌ఎల్‌ఆర్‌లో పొందుపరిచారు. ఇక్కడే మతలబు చోటుచేసుకుంది. పహాణీల్లోని వివరాలతో పొంతన లేకుండా కొన్ని ఇందులో నమోదయ్యాయి. కొన్ని వివరాలు పూర్తిగా గల్లంతయ్యాయి. దేవాలయాల భూముల వివరాలు పెద్దమొత్తంలో టీఎస్‌ఎల్‌ఆర్‌లో గల్లంతైనట్టు సమాచారం. ఇక వాటికి ఏకైక దిక్కు నిజాం రికార్డులే. ఈ విషయంపై కొందరు సీనియర్ అధికారులకు బాగా అవగాహన ఉంది. వారిని పావులుగా వాడుకుని.. రికార్డుల్లో వివరాలు గల్లంతైన తీరును ఆసరా చేసుకుని నేతలు కథ నడిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 1.34 ఎకరాల భూమి ఉన్నట్లు చూపుతున్న నిజాం కాలం నాటి రికార్డులు -
ఆలయాలు కొండమీదే ఎందుకు ఉంటాయి?
దేవుళ్లలో తేడా ఏమీ ఉండదు. ఎక్కడున్నా దేవుడు దేవుడే! నేలమీద ఉన్నా కొండపైన ఉన్నా భగవంతుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు. కరుణా కటాక్షాలను అందిస్తాడు. అందుకోసమే భగవంతుని సేవించుకోవడానికి భక్తులు ఎంతో దూరాభారానికి, వ్యయప్రయాసలకూ ఓర్చి కొండలపైకెక్కి మరీ ఆయనను సందర్శింటారు. అలా ఎందుకు, దేవాలయం మన మధ్యలోనే ఉంటే ఎంతో బాగుంటుందనుకుంటారు చాలా మంది. నిజానికి మనకు తనపై ఎంతటి భక్తి విశ్వాసాలు ఉన్నాయో తెలుసుకునేందుకే దేవుళ్లు కొండలపై, గుట్టలపై వెలిసినట్లు పెద్దలు చెబుతారు. అంతేకాదు, కొండలను, కోనలను ఉద్ధరించాలని స్వామికి ప్రేమ. అందుకే వాటిపై నివాసముంటాడు. తన పాదస్పర్శతో, భక్తుల పాదస్పర్శతో కొండలు తరిస్తాయి. సెలయేళ్లతో, ఫలవృక్షాలతో భక్తులకు సేదతీరుస్తాయి. దీని కోసమే రుషులు కొండలుగా పుట్టాలని కోరుకుంటారు. భద్రగిరి, యాదగిరి, వేదగిరి వీరంతా రుషులే! తపస్సు చేసి మరీ తమపై కొలువుండాలని కోరుకొని స్వామిని వరం కోరుకున్నారు. ఈ లోకంలో పరోపకార పరాయణులు పర్వతాలు, నదులు, వృక్షాలేనని అంటాడు మహాకవి వాల్మీకి. ఈ ముగ్గురు ఉన్నంతవరకు రామాయణం భూమి మీద ఉంటుందని వాల్మీకికి బ్రహ్మ వరమిస్తాడు. అందుకే కొండలు, కోనలు భగవంతునికి ప్రీతిపాత్రమైనవి. అక్కడే ఆయన కొలువై ఉంటాడు. లౌకికంగా చూస్తే, కొండలపైన మనుష్య సంచారం తక్కువగా ఉంటుంది, వాహనాల రణగొణ« ధ్వనులుండవు. కాలుష్యానికి ఆస్కారం ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. అందుకే దేవుడు కొండలపై వెలిశాడేమో మరి! -
దేవుళ్లు చూస్తుండటంతో...
లక్నో : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్వస్థలం గోరఖ్‌పూర్. జిల్లా న్యాయస్థానం, ఐజీ కార్యాలయాలు ఉన్న రోడ్లు ఎప్పుడూ జనసందోహంతో బిజీగా ఉంటాయి. కాస్త దూరంలో టాయ్లెట్లు ఉన్నా.. దారినపోయే కొందరు మాత్రం అదే పనిగా ఆ గోడలకే మూత్ర విసర్జన చేస్తుండేవారు. ఎన్ని చర్యలు తీసుకున్నా, చివరకు పోలీస్ కాపలాను ఉంచిన నివారించలేకపోయారు. తరచూ ఈ గోడల వద్ద కొందరు చెత్త చెదారం వేయటం.. మూత్ర విసర్జన చేసేవారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు లేడీకానిస్టేబుళ్లను మోహరించినా ప్రయత్నం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఓ ఆలోచన చేశారు. వెంటనే ముంబైకి చెందిన బత్వల్ అనే చిత్రకారుడికి కబురు పెట్టారు. మూత్ర విసర్జన నివారణకు కోసం ఆ గోడలపై దేవుడి బొమ్మలను చిత్రీకరించాలని అతన్ని కోరారు. దేవుళ్లు, ఇతర మతాలకు సంబంధించిన చిత్రాలు, రామాయంలోని ఘట్టాలు, ప్రముఖుల ఫోటోలతో బత్వల్ గోడలపై అందమైన పెయింటింగ్‌లు వేశాడు. ‘‘దేవుళ్లు చూస్తున్నారు.. మీ చెండాలం ఆపండి’’... అంటూ కొటేషన్లు రాసేశారు. ఈ ఆలోచన బాగా పని చేసింది. ప్రస్తుతం వాటి చుట్టు పక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండటంతోపాటు ఆయా గోడల వద్ద సెల్ఫీల కోసం జనాలు ఎగబడిపోతున్నారని గోరఖ్‌పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ చెబుతున్నారు. ఇలా బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన నివారించటం కోసం చేసే యత్నం సాధారణమైన అంశమే. కానీ, యూపీ సీఎం స్వస్థలంలోనే స్వచ్ఛ భారత్ విఫలం అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తగా.. స్వయంగా యోగి ఆదిత్యానాథ్ కలుగజేసుకోవాల్సి వచ్చింది. గత ఆరు నెలలుగా మున్సిపల్ అధికారులకు ఆయన అదే పనిగా ఆదేశాలు జారీ చేస్తుండటంతో.. ఏం చేయాలో తెలీక అధికారులు తలలు పట్టుకున్నారు. చివరకు ఓ సామాజిక వేత్త సాయంతో ఐజీ మోహిత్ ఈ సమస్యకు పుల్‌స్టాప్ పెట్టారు. -
నలుపే దైవం
తెలుపును కోరుకోవడంలో తప్పేం లేదు. నలుపును చెరిపేయాలనుకోవడంలోనే..n తెలుపంటే మనకున్న ‘పెద్దచూపు’ బయటపడుతుంది. చూపు పెద్దదవకూడదు. చిన్నదవకూడదు. సమంగా ఉండాలి. శ్రీకృష్ణుడు నల్లనివాడు. ఈవెన్ థో అందగాడు. ఆరాధించేస్తారు గోపికలు. ఆయన మురళీరవంలో ఉందీ అందం. ఫ్లూట్ ప్లే చేస్తున్నప్పుడు కాలు మీదుగా కాలు పోనిచ్చి నిలుచోవడంలో ఉంది అందం. కబుర్లేం చెప్పేవాడో గానీ వాటిల్లో ఉండేది అందం. చుట్టూ చేరేవారు పదహారువేల మంది ఫెయిర్ అండ్ లవ్లీ గర్ల్స్. ఆ నీలమేఘశ్యాముడి కళ్లలోకి చూస్తూ టైమ్ మర్చిపోయేవారు. వాళ్లెప్పుడూ లార్డ్ కృష్ణ.. బ్లాకా వైటా అని చూసుకోలేదు!అయితే, మనవాళ్లు చూసుకుంటున్నారు. మనవాళ్లు అంటే.. ఇండియన్స్. ఈమధ్య క్యాలెండర్లలో, స్టిక్కర్లలో శ్రీకృష్ణుడు ఫెయిర్ స్కిన్‌తో కనిపిస్తున్నాడు. పురాణాలను ఇలా ఇష్టంవచ్చినట్లు మార్చేయొచ్చా! నల్లగా ఉంటే తెల్లగా!! మార్చేస్తున్నారు. ఇంట్లో తగిలించుకునే పోస్టర్లో, ఇంటి తలుపుకు అంటించుకునే స్టిక్కర్లో నల్లనయ్య తెల్లనయ్యగా దర్శనం ఇస్తున్నాడు. గణపయ్య అయితే మన చిన్నప్పట్నుంచే వైట్ కలర్‌తో భారతీయ భువిలోకి వచ్చి ఉంటున్నాడు.ఎప్పుడైనా, ఎక్కడైనా చూశామా.. బ్లాక్ విఘ్నేశ్వరుడిని! పోనీ బాడీ మొత్తాన్ని వదిలేసినా ఆయన తల నల్లరంగులోనే ఉండాలి కదా.. ఇండియాలో కనిపించేవన్నీ బ్లాక్ ఎలిఫెంట్సే కాబట్టి! అలా ఉండడు. పాల మీగడ రంగులో ఉంటాడు. తెలుపంటే మనకు పిచ్చి ప్రేమ కాబట్టి, చర్మాన్ని తెల్లగా మార్చే క్రీములు పూసుకోవడంతో సరిపెట్టుకోవడం లేదు. నలుపు రంగులో ఉండే దేవుళ్లను కూడా తెలుపులోకి మార్చుకుంటున్నాం. పెళ్లి చేసుకోవడానికి తెల్లటివాళ్లు కావాలి. íసినిమాల్లో యాక్ట్ చెయ్యడానికి తెలుపే కావాలి. యాడ్ షూటింగుల్లో మోడలింగ్కీ ౖవైటే. ఇప్పుడు నల్లగా ఉండే దేవుళ్లకి కూడా వైట్ పెయింట్ వేసుకుంటున్నాం! తెలుపును కోరుకోవడంలో తప్పేం లేదు. నలుపును చెరిపేయాలనుకోవడంలోనే.. తెలుపంటే మనకున్న ‘పెద్దచూపు’ బయటపడుతుంది. చూపు పెద్దదవకూడదు. చిన్నదవకూడదు. సమానంగా ఉండాలి.ఇన్నాళ్లు నలుపుపై ఉన్న చిన్నచూపును పోగొట్టడానికి క్యాంపెయిన్లు నడిచాయి. ‘డార్క్ ఈజ్ బ్యూటీఫుల్’, ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’ ఇలాంటివి. ఫెయిర్‌నెస్ క్రీములకు పబ్లిసిటీ ఇచ్చే సినీ తారలు కూడా అవేర్నెస్తో అవతలికి వెళ్లిపోతున్నారు.. మేం చెయ్యం పొమ్మని. అయినా గానీ, వైట్కి ఉన్న వెయిట్ తగ్గడం లేదు. బ్లాక్‌కి ఉన్న ‘డ్రాబ్యాక్’ తగ్గడం లేదు. అమ్మాయిల విషయమైతే మరీ అన్యాయం. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత క్యూట్‌గా ఉన్నా, ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నా.. చివరికి కౌంట్ అయ్యేది తెలుపే కానీ, నలుపు కాదు. అందుకనిప్పుడు.. భరద్వాజ్ సుందర్ అనే చెన్నై యాడ్మేకర్, నరేశ్ నీల్ అనే ఫొటో గ్రాఫర్ కలిసి ‘డార్క్ ఈజ్ డివైన్’ అనే రివర్స్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. తెల్లటి దేవతామూర్తులను, తెల్లటి పౌరాణిక పాత్రలను నలుపు రంగులో ప్రెజెంట్ చేస్తున్నారు! అందుకోసం డార్క్‌గా, డాషింగ్‌గా ఉన్న మోడల్స్‌ని ఎంపిక చేసుకుని ఫొటోలు షూట్ చేస్తున్నారు. అపచారం కదా! ‘‘కానే కాదు’’ అంటున్నారు సుందర్, నరేశ్ నీల్. ‘‘దేవుడి సృష్టిలో అన్నీ సమానం అయినప్పుడు నలుపు ఇన్ఫీరియరు, తెలుపు సుపీరియరు ఎలా అవుతాయి? కావు అని చెప్పడానికే దేవుణ్ణి ఆశ్రయించాం. దేవుణ్ని దేహీ అనడం అపచారం అవుతుందా’’ అంటున్నారు. పాయింటే. -
గుండెల నిండా ప్రేమను నింపుకోవాలి
మనం మన తల్లిదండ్రుల్ని, పెద్దల్ని, గురువుల్ని ప్రేమిస్తాం, గౌరవిస్తాం. ఎందుకూ? వారు మన మేలుకోరేవారు. బాగు కోరేవారు. మన ఉన్నతిని కాంక్షించేవారు. మన శ్రేయోభిలాషులు. వారి ప్రేమాభిమానాలు, కారుణ్య వాత్సల్యాలు అనునిత్యం మనపై ప్రసరిస్తున్నాయి. చేసిన మేలును గుర్తించడం, చే సిన వారిపట్ల కృతజ్ఞత చూపడం మానవ నైజంలో ఉండే సహజ గుణం. ఉపకారి ముందు వినయ వినమ్రతలు కలిగి ఉండడం, అతని అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడం, వారు చెప్పింది చేయడం, వారి ఇష్టానికి వ్యతిరేకంగా నోరు మెదపకపోవడం వారిపట్ల విధేయతకు, అంకితభావానికి నిదర్శనం. కాని ఇంతకన్నా ఎక్కువ, లెక్కకు మిక్కిలి మేళ్ళు, ఉపకారాలు,అనుగ్రహాలు, వరాలు దైవం మనపై కురిపించాడు. మనపైనే కాదు, అందరిపై కురిపించాడు. ధనిక, పేద అనే భేదం లేకుండా, పాలకుడు సేవకుడు అన్న తేడాలేకుండా, పల్లె పట్నం అన్న వ్యత్యాసం లేకుండా, ఆడా మగా అన్న తారతమ్యం లేకుండా, వృద్ధులు– పిల్లలన్న విభజన లేకుండా ఆ కరుణామయుని అనుగ్రహాలు, ఆ దయామయుని కారుణ్య ఛాయ సమస్తాన్నీ పరివేష్టించి ఉంది. గుడిసెవాసులపై అయినా, భవనవాసులపై అయినా, అడవుల్లో అయినా, మైదానాల్లో అయినా, ఎటుచూసినా, ఎక్కడ చూసినా రేయింబవళ్ళు, ప్రతినిత్యం, అనుక్షణం ఆయన కారుణ్యానుగ్రహాలు వర్షిస్తూనే ఉన్నాయి. ఆయన దాహార్తులకు దాహాన్ని, అన్నార్తుల క్షుద్బాధను తీరుస్తున్నాడు. వస్త్రవిహీనులకు ఆచ్ఛాదన ప్రసాదిస్తున్నాడు. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్నిస్తున్నాడు. ప్రజల ఆందోళన దూరం చేస్తున్నాడు. కష్టాలు బాధల నుండి రక్షిస్తున్నాడు. నిస్సహాయులకు అండగా నిలుస్తున్నాడు. నీడ లేని వారికి గూడు కల్పిస్తున్నాడు. నిరాశ్రయులకు ఆశ్రయమిస్తున్నాడు. సమస్త ప్రాణుల సుఖమయ జీవనానికి సమతుల ప్రకృతిని సిద్ధంచేసి పెట్టాడు. ఏ వ్యక్తి, ఏ సమూహం, ఏ ప్రాణి కూడా ఏ ఒక్క క్షణమూ ఆయన అనుగ్రహానికి దూరంగా లేదు. అనుగ్రహం లేకుండా లేదు, మనజాలదు. మరి అలాంటి దయాసముద్రుని పట్ల, కరుణామయుని పట్ల మనకెలాంటి ప్రేమ ఉండాలి? ఆయనతో మనకెలాంటి అనుబంధం ఉండాలి? ఎవరైనా చెప్పగలరా.. అంచనా వేయగలరా..? లెక్కలు కట్టగలరా? ఆయన సకల లోకాలకు ప్రభువు. రాజాధిరాజు. ప్రభువులకు ప్రభువు. దయాళువు, కారుణ్య సముద్రుడు. క్షమానిధి. అన్నీ చూసేవాడు, అన్నీ వినేవాడు. నిదుర పోనివాడు. కునుకు రానివాడు. అలసిపోనివాడు. అలుపులేనివాడు. అన్నిటిపై అధికారం కలిగిన వాడు. పాలించేవాడు, పోషించేవాడు. అధికుడు, ఆధిక్యుడు. సర్వవ్యాపి. సర్వాంతర్యామి. జీవన్మరణాల విధాత. అలాంటి పరమ ప్రభువుపట్ల గుండెలనిండా ప్రేమ నింపుకోవాలి. – ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
దేవుడు మీముందుంటే... ఆశీర్వాదాలు మీ వెంటే
క్రైస్తవమంతా దేవుడు వాడుకున్న, దేవునికి, ఆయన సంకల్పాలకు విశ్వాసంతో తలవంచి విధేయత చూపిన ఒక వ్యక్తి ‘అబ్రాహాము’తో ఆరంభమైంది. మానవాళితో సహా విశ్వాన్నంతా సృష్టించి, దానంతటికీ యజమాని అయిన దేవుణ్ణి మానవాళి సృష్టి, ఆరంభంలోనే కొన్ని తరాల తర్వాతే పక్కన పెట్టి ఆరాధనల పేరిట నరబులుల, దుర్బలుల శ్రమదోపిడి, దేవాలయాల్లోనే శృంగారం, మితిమించిన విగ్రహారాధన వంటి దుష్ట సంప్రదాయాలను అనుసరిస్తున్న నేపథ్యంలో, దేవుడు అబ్రాహాము ద్వారా తన మార్గనిర్దేశనం చేశాడు. మధ్య ప్రాచ్య ప్రాంతమైన మెసొపొటేమియా (ఇప్పటి ఇరాన్, ఇరాక్ ప్రాంతం)లో ఉన్న అబ్రాహామును ‘నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్లు’అని ఆదేశించాడు. ‘ఏదేశానికి? అదెలా ఉంటుంది?’ అన్న ఎదురు ప్రశ్న వేయకుండా అప్పటికప్పుడు దైవాజ్ఞ పాలనకు అబ్రాహాము నడుము కట్టి బయలుదేరాడు. లోకాన్ని ప్రశ్నించడం అనేది మనిషి నైజంలో ఉంది. అయితే లోకాన్ని ప్రశ్నించడం హేతువాదమనిపిస్తుంది. దేవుణ్ణి ప్రశ్నించకపోవడమే నిజమైన విశ్వాసమనిపిస్తుంది. ‘నీవు వెళ్లు’ అన్న దైవాజ్ఞ పాలన వెనుక అబ్రాహాముకు ఆ దేవుని శక్తి సామర్థ్యాలు, ప్రేమాపూర్ణత పట్ల అవగాహన ఉంది. ఆ అవగాహనలో నుండే అతని విశ్వాసం పుట్టింది. ప్రశ్నించడం హేతుబద్ధమే కాని అది అవిశ్వాసం!! తల వంచి దేవునికి అవిధేయులం కావడం వల్ల లోకం సృష్టిలో మనం బలహీనులం కావచ్చు. కాని అదే ఆశీర్వాదాలకు ఆరంభం!! అందుకే తన పట్ల మానవాళి భక్తిశ్రద్ధలకు దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని ప్రామాణికం చేశాడు. కొత్త ఏడాది ముంగిట్లో నిలబడ్డ మనతో కూడా నీవు వెళ్లు అంటున్నాడు దేవుడు. రాబోయే 365 రోజుల కాలఖండంలో మనకేమేమి అనుభవాలు ఎదురుకానున్నాయో మనకు తెలియదు. కాని ‘నీవు నేను చూపించే దేశానికి వెళ్లు’ అని దేవుడాదేశిస్తే విధేయుడై Ðð ళ్లిన అబ్రాహాము పాలు తేనెలు ప్రవహించే కనానులో కాలు పెట్టినట్టే, మీరూహించని ఆశీర్వాదాలు, ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అద్భుతాలు చలిచూడనున్న మరో ఏడాదిలోకి మీరు కాలుపెట్టబోతున్నారు. ఎందుకంటే ‘నీవు వెళ్లు’ అని ఆదేశించిన దేవుడే అబ్రాహాముకు ముందుగా నడిచినట్టే, మీరు కాలు పెట్టకమునుపే ‘కొత్త ఏడాది’లో ఉన్న దేవుడు మీతోపాటు ఉంటాడు. కనానులో అబ్రహాము కరువునెదుర్కొన్నాడు. కాని అలా జరిగిన ప్రతిసారీ ఆయన విశ్వాసంలో స్థిరపడ్డాడు. రెట్టింపు ఆశీర్వాదాలు పొందాడు. ఇప్పుడిప్పుడే మనం కాలుపెట్టిన కొత్త ఏడాదిలోనూ కొన్ని చేదు అనుభవాల్లో కూడా అసాధారణమైన దైవకృపను, ఆయన సాన్నిధ్యాన్ని మీరనుభవిస్తారు. దేవుడున్న చోట లోకసంబంధమైన భయమనేది ఉండదు. అందువల్ల ‘మీకు దేవుడు ముందుం టే, విజయాలు, ఆశీర్వాదాలు మీ వెంటే! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
చూసినవాళ్లే ఎక్కువ
సాధారణంగా దేవుడు కాంతి రూపంలో ప్రత్యక్షం అవుతాడని, అదే దైవ సాక్షాత్కారం అని అంటూ ఉంటారు. అయితే అది ‘కాంతి’ కాదు, ‘భ్రాంతి’ అని కొట్టిపడేసే ‘అప్రత్యక్ష’ వాదులూ ఉన్నారు. అప్రత్యక్షవాదులు అంటే.. దేవుడు ప్రత్యక్షం అయ్యాడంటే నమ్మనివాళ్లు. వాళ్లను అలా వదిలేస్తే.. దేవుడిని చూశామని, దేవుడితో మాట్లాడామని కొంతమంది చెబుతుంటారు. దేవుడంటే నమ్మకం లేనివాళ్లు కూడా, దేవుడిని చూశామని చెప్పినవాళ్లను నమ్మకుండా ఉండలేనంతగా గట్టిగా ఉంటాయి ఆ చెప్పేవాళ్ల అనుభవాలు. అసలు నమ్మకుండా ఉండడం ఎందుకు? ఎందుకంటే.. దేవుడు ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించడు కనుక. ఎవరెస్టు శిఖరం కనిపిస్తుంది. నయాగరా జలపాతం కనిపిస్తుంది. కశ్మీర్ లోయ కనిపిస్తుంది. దేవుడు అలా కనిపించడు. అందుకే కనిపించని దేవుడిని ప్రత్యక్షంగా చూశామంటే, ‘నాకు ప్రత్యక్షం అయ్యాడూ’ అంటే ఎవరూ నమ్మరు. అయినా దేవుడు శిఖరంలానో, జలపాతంలానో, లోయలానో ఎందుకు కనిపించాలి? ఆయనది కనిపించని వేరే రూపం అనుకోవచ్చు కదా. అప్పుడు దేవుడిని సందేహించే పని ఉండదు. ఏ రూపమూ లేనివాడు ఏ రూపంలో కనిపించినా ‘చూడ్డానికి’ మనసు అంగీకరిస్తుంది. అయితే దేవుడికి రూపం లేకుండా లేదు! ‘నమ్మకం’ ఆ రూపం. నమ్మకంలోంచి ఏర్పyì న రూపం! నమ్మకం ఒకటే. రూపాలు అనేకం. ఇలా ఆలోచిస్తే.. మన చుట్టూ దేవుణ్ణి చూడనివాళ్ల కంటే, దేవుణ్ణి చూసినవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. వీళ్లందరికీ ఏదో ఒక రూపంలో దేవుడు ప్రత్యక్షం అయ్యే ఉంటాడు. -
దేవుడు పిలుస్తున్నాడంటూ ఆత్మహత్య
-
వర్ణించలేని అసమాన ప్రేమ!
దేవుణ్ణి అర్థం చేసుకున్నదానికన్నా, అపార్థం చేసుకోవడమే చాలా ఎక్కువ. ఎంతసేపూ మనుషుల్లో తప్పులు వెతికి దండించేవాడు, కోపిష్టి వాడన్నది పలువురి అభిప్రాయం. అందుకే ఆయన్ని ప్రేమించే వారికన్నా, ఆయన దండిస్తాడని జడిసి భయపడే వాళ్లే చాలామంది. కాని బైబిల్ మాత్రం దేవుడు ప్రేమౖయె ఉన్నాడు. అంటుంది. (1 యోహాను 4:8). దేవుడు, ప్రేమ ఏమాత్రం విడదీయలేనివి. దేవుడు దండించిన సందర్భాలు ప్రతి విశ్వాసి జీవితంలోనూ ఉంటాయి. అయితే విశ్వాసిని అకారణంగా బాధించేందుకుగాక, విశ్వాసిని సరిచేసి, అతన్ని ఇంకా అత్యున్నతమైన ఆశీర్వాదాలకు పాత్రుని చేయడమే ఆయన ఉద్దేశ్యం. ఆయన స్వభావరీత్యా ప్రేమామయుడే కాదు, మనమంతా ఆయనకు అత్యంత ప్రియమైన వారమని కూడా అర్థం చేసుకోవాలి. మానవాళిని ప్రేమించి, అతనికి సర్వసౌకర్యాలు, శాంతి, సంతోషం, సంతృప్తి కలిగించేందుకుగానూ వారి కోసమే విశ్వాన్నంతా దేవుడు సృష్టించాడని కూడా బైబిలు చెబుతోంది. అందుకే యేసుప్రభువు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్ముడు పావురం లాగా ఆయన మీదికి దిగిరాగా, ‘నీవు నా ప్రియ కుమారుడవు, నీలో నేను సంతోషిస్తున్నాను’ అన్న తండ్రిౖయెన దేవుని స్వరం ఆకాశం నుండి వినబడింది. వెంటనే అపవాది ఆయన్ను అరణ్యంలోకి కొనిపోయి 40 రోజుల పాటు ఎన్నో విధాలుగా శోధించినా, ఆయన వాటికి లొంగక విజయం సాధించడం ద్వారా తన పరలోకపు తండ్రి పట్ల తనకు గల ప్రేమను కూడా రుజువు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించే విషయంలో ఎప్పుడూ లోటు చేయడు. ఆ ప్రేమకు మన ప్రతిస్పందనలోని లోపాలు, మారని మన జీవితాలే దేవుని ఆశీర్వాదానికి ప్రతిబంధకాలవుతాయి. బకెట్‌లోని వేడినీళ్ల జోలికి వెళ్లవద్దని వారించినా వినని కొడుకును తండ్రి ఒక దెబ్బ వేస్తాడు ప్రేమగానే. అయినా వినకుండా వేడి నీళ్లతో ఒళ్లు కాల్చుకున్న కొడుకును తండ్రి భుజాన వేసుకుని డాక్టర్ వద్దకు ఏడుస్తూ పరుగెత్తుతాడు. అంతకన్నా మించిన ప్రేమతో. దేవుని ప్రేమ లోతు, వెడల్పు, పొడవెంతో అనుభవిస్తేనే అర్థమవుతుంది. బైబిలంతా క్షుణ్ణంగా చదివినా దేవుని ప్రేమ మాత్రం పూర్తిగా అర్థం కాదు. ఎందుకంటే దేవుని ప్రేమను సంపూర్ణంగా వ్యక్తం చేయగల భాషను, పదజాలాన్ని మానవుడిప్పటికీ కనిపెట్టలేడు. బైబిల్ చదివి దేవుడుతో కొంత అవగాహన పొందవచ్చు కాని నిరంతర ప్రార్థన అనే ఆత్మీయ వ్యాయామం, క్రమశిక్షణ, సంపూర్ణి విధేయతతోనే దేవుని ప్రేమ అర్థమవుతుంది. మనకు గుచ్చుకునే ముల్లు మనకన్నా దేవున్ణే ఎక్కువగా బాధిస్తుందన్న పారలౌకిక సత్యం ఆ స్థాయిలోనే బోధపడుతుంది. వ్యాపారంలో పెట్టుబడి బల్ల లాభం రావచ్చు, నష్టం కూడా రావచ్చు. కాని మన సమయాన్ని, ధనాన్ని, ప్రతిభా పాటవాలను దేవుణ్ణి ప్రేమించి ఆయనకోసం పెట్టుబవడిగా పెడితే నష్టం వచ్చే ప్రసక్తే లేదు. డబ్బుతో కొలవలేని, కొనలేని శాంతి సమాధానాలు ఆ దారిలో పుష్కలంగా మన సొంతమవుతాయి. చాచిన హస్తాలతో దేవుడు మనకోసం ఎప్పుడూ సిద్ధమే!! ఆ దృశ్యం కనపడకుండా మనల్ని ప్రబోధాలు, ప్రతికూలతలు శాసిస్తున్నాయి. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
గబ్బిలం.. దైవంతో సమానం
చిట్టమూరు: గబ్బిలం.. ఊరి చివర చెట్లకు తల్లకిందులుగా వేలాడే పక్షిలాంటి జీవి. నిజానికి ఇది క్షీరద జాతికి చెందినదైనా పక్షి తరహాలో సంచరించే ప్రత్యేక జీవి. ఇవి పగలంతా చెట్లకు వేలాడుతూ.. మేత కోసం రాత్రి సమయాల్లో మాత్రమే సంచరిస్తాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లి.. ఆహారాన్ని వేటాడి సూర్యోదయానికి తిరిగి చెట్లపైకి చేరుకుంటాయి. ఈ జీవులను దైవంగా భావించేవారూ ఉన్నారు. చిట్ట మూరు మండలం గునపాడు, పొదలకూరు మండలం మర్రిపల్లి, ముత్తుకూరు మండలం కొత్తపాలెం, సైదాపురం మండలం పర్సారెడ్డిపల్లి ప్రజలు గబ్బిలాలు గ్రామంలో ఉంటే శుభం కలుగుతుందని నమ్ముతారు. వేటగాళ్లు వాటిని పట్టికోకుండా.. ఆకతాయిలు చెదరగొట్టకుండా వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఈ గ్రామాల్లో గబ్బిలాలు సుమారు వందేళ్ల నుంచి ఉంటున్నాయని.. అవి వచ్చాకే తమ గ్రామాలు బాగుపడ్డాయని వృద్ధులు కథలుగా చెబుతుంటారు. ఇవి వాన రాకను తెలియజేస్తాయని.. రాత్రివేళ చెట్ల నుంచి కదలకపోతే వర్షం కురవబోతోందని సంకేతమని ఆ గ్రామాల ప్రజలు చెబుతున్నారు. వీటి కదలికల ఆధారంగానే రైతులు వ్యవసాయ పనులకు సమాయత్తం అవుతుంటారు. ఇవి పక్షులు కాదు వాస్తవానికి గబ్బిలాలు పక్షులు కాదు. పాలిచ్చే జాతికి చెందిన జంతువులు (క్షీరదాలు). ఇవి గుడ్లను పెట్టవు. పిల్లలను కంటాయి. క్షీరదాలలో ఎగరగలిగిన జంతువు ఇదొక్కటే. వీటికి కళ్లు, చెవులు, నోరు ఉంటాయి. కళ్లతో చూడకుండానే ఇవి దారి తెలుసుకుంటాయి. కటిక చీకట్లోనూ దేనినీ ఢీకొట్టకుండా ఎగరగలుగుతాయి. వీటి కళ్లకంటే చెవులే పవర్ ఫుల్. గబ్బిలం ఎగురుతున్నప్పుడు నోటితో సన్నని కూత వేస్తుంది. ఆ కూత మామూలు శబ్ద తరంగాల కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలది కావడంతో మన చెవులకు వినిపించదు. ఈ హై ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలు ఎదురుగా ఉండే అడ్డంకులకు తగిలి, ప్రతిఫలించి వెనక్కి తిరిగొచ్చి గబ్బిలం చెవులనుయ తాకుతాయి. ఇవి అత్యంత అల్పమైన శబ్దాలను కూడా విని అత్యంత వేగవంతమైన ప్రయాణంలోనూ దిశను మార్చుకోగలుగుతాయి. ఇక్కడి గబ్బిలాలు కేవలం పురుగులను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. -
ఏమిటీ శాపం!
మంచి జీవితాన్నివ్వు... ఒడిదొడుకులను అధిగమించే అందమైన బతుకునివ్వు... నిండా నూరేళ్ల ఆయుష్షును ప్రసాదించు... ఏ భక్తుడైనా ఆదిదేవుడి ముందు మోకరిల్లి ప్రార్థిస్తారు. ఏ దైవం కూడా తనువును చాలించి తనలో ఐక్యం కావాలని కోరదు... అలా కోరితే అది సైతానవుతుంది గానీ దైవమెలా అవుతుంది...? ఆ విషయాన్ని గ్రహించని ఓ యువతి ‘తనను దేవుడు పిలుస్తున్నా’డంటూ ఆత్మహత్యకు పాల్ప డింది. వివాహమై పట్టుమని పది రోజులే దాటింది ... అంతలోనే ఈ విషాదం. ఈ ఏడాది జూలై నెలలో కాకినాడ సమీపంలోని కరప మండలంలో ముగ్గురు మహిళలు ఇదే మాదిరిగా బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువకముందే తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామానికి చెందిన యాళ్ల గాయత్రీదేవి (20) మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాళ్లరేవు(ముమ్మిడివరం): తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామానికి చెందిన యాళ్ల గాయత్రీదేవి(20) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన 11 రోజులకే తనువు చాలించింది. కోరంగి ఎస్సై వి.సుమంత్, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..మండల పరిధిలోని జార్జిపేట గ్రామానికి చెందిన అద్దెంకి వెంకట రమణ సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె జ్యోతికి పెళ్లై అత్తారింటికి వెళ్లిపోగా, రెండో కుమార్తె గాయత్రీదేవికి గత నెల 25న కాకినాడ సూర్యనారాయణపురం గ్రామానికి చెందిన యాళ్ల సత్యమూర్తితో వివాహమైంది. అయితే మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డింది. ఇది గమనించిన గాయత్రీదేవి చిన్నమ్మ మంగాదేవి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తలుపులు పగులగొట్టారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను స్థానికులు హుటాహుటిన యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పెళ్లయ్యి రెండు వారాలు కూడా కాకముందే గాయత్రీదేవి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. వధూవరులుగా సత్యమూర్తి, గాయత్రీదేవి(ఫైల్ ఫొటో) ఏసులో ఐక్యమవుతానని.. యానాం యూకేవీ నగర్లో నివాసం ఉండే వెంకటరమణ అక్కడ అద్దెలు ఎక్కువగా ఉండడంతో ఏడాది క్రితం జార్జిపేటలోని తన బంధువుల పక్క పోర్షన్‌ను అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. గాయత్రీదేవి యానాంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండేది. ఆమె తల్లి సత్యవేణి 18 ఏళ్ల క్రితం క్రైస్తవమతాన్ని స్వీకరించగా, గాయత్రీదేవి కూడా నాలుగేళ్ల క్రితం క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. వీరు తరచూ యూకేవీ నగర్‌లోని చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసుకుని వస్తుంటారు. నిరంతరం ఏసుప్రభువును తలచుకుంటూ ప్రార్థనలు చేస్తుండేవారు. కొన్ని రోజులుగా గాయత్రీ దేవి వైఖరిలో తీవ్ర మార్పులు సంభవించాయి. తన జీవితం ఏసుకు అంకితమని చెబుతూ, తాను చనిపోయి ఏసులో ఐక్యమవుతాననేది. దీంతో ఆమె మాటలకు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందేవారు. ఆమెకు పెండ్లి చేస్తే మామూలుగా తయారవుతుందని భావించి క్రైస్తవ కుటుంబానికి చెందిన సత్యమూర్తితో అక్టోబర్ 30న నిశ్చితార్థం చేశారు. అయితే గాయత్రీదేవి తానెక్కడ ఏసుకు దూరమవుతానో అన్న ఆందోళనతో దిగులుగా ఉండేది. గత నెల 25 పాస్టర్ల సమక్షంలో సత్యమూర్తితో క్రైస్తవ వివాహం జరిపించారు. ఈనెల 3న సత్యమూర్తి జార్జిపేట వచ్చాడు. భార్యతో కలిసి యూకేవీ నగర్ చర్చికి వెళ్లడంతో పాటు యానాంలోని పలు పర్యాటక ప్రదేశాలను ఆసక్తిగా తిలకించారు. సోమవారం సత్యమూర్తిని గాయత్రీదేవి బాగానే సాగనంపిందని తల్లిదండ్రులు తెలిపారు. మంగళవారం ఇంట్లో ప్రార్థన చేసుకుంటుందనుకున్నామని, ఇంతలో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తాళ్లరేవు తహసీల్దార్ లోడా జోసెఫ్, కోరంగి ఎస్సై సుమంత్‌లు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. 2017 డిసెంబర్ 05.. ‘‘నా జీవితం ఏసుకే అంకితం.. నేను చనిపోయి ఆయనలో ఐక్యమవుతా’’ అంటూ ఆమె నిరంతరం కుటుంబ సభ్యులతో చెబుతుండేది. ఆమె మాటలకు ఆమె ఎక్కడ దూరమవుతుందోననే బాధలో కుటుంబ సభ్యులు ఉండేవారు. పెళ్లి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో క్రైస్తవ కుటుంబానికి చెందిన వ్యక్తితో క్రైస్తవ సంప్రదాయంలోనే 11 రోజుల క్రితం వివాహం జరిపించారు. అయినా ఆమె వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. దిగులుగానే ఉండేది. ఏమైందో తెలియదు.. ఇంట్లో ప్రార్థన చేసుకుంటుందనుకుంటున్న ఆమె.. చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనతో ఆమె కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. మంగళవారం తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో జరిగిన ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. 2017 జూలై తొమ్మిదో తేదీ.. ఆ మహిళలు ముగ్గురూ క్రైస్తవ మతం తీసుకున్నారు. వారిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కాగా ఒకరు చెల్లెలి కుమార్తె. నాలుగేళ్లుగా చర్చికి వెళుతున్నారు. ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదు. వెళితే చర్చికి.. లేకపోతే ఇంటికి వెళ్లి ప్రార్థనలు చేసుకోవడమే వారి పని. మరోవైపు వారికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు. జీవితం సజావుగానే సాగుతోంది. 2017 జూలై తొమ్మిదో తేదీన తమ కుమారుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాళ్ల ఇంటి వద్దే అందరికీ భోజనాలుపెట్టి, పాస్టర్‌తో ప్రార్థనలు చేయించారు. ‘‘దేవుడు వచ్చేస్తున్నాడు.. దేవుడి దగ్గరకు వెళ్లిపోవాలి’’ అంటూ మాట్లాడుకున్నారు. ఆదివారం రాత్రి ముగ్గురు మహిళలు చర్చికి వెళ్లి అక్కడే ఉండిపోయారు. ఉదయం పాస్టర్ లేచిన తర్వాత ప్రార్థన చేసి, పండ్లు పెట్టగా ఆ ముగ్గురూ ఇంటికి వచ్చేశారు. సోమవారం ‘‘ఇంటిలో దుష్టశక్తులు తిరుగుతున్నాయని అవి పోయేందుకు ప్రార్థనలు చేస్తాం’ అంటూ ఓ గదిలోకి వెళ్లి గడియపెడ్డారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఇంటి వెనుక వైపు తలుపు పైకెత్తి చూడగా ఆ ముగ్గురు ఉరి వేసుకుని చనిపోయారు. కరపలోని నీలయ్యతోటవీధిలో జరిగిన ఈ సంఘటనలో కరెడ్ల చంద్రం కుమార్తెలు రాసంశెట్టి సత్యవేణి(48), సత్తి ధనలక్ష్మి(40), ధనలక్ష్మి కుమార్తె సత్తి వైష్ణవి(18) ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినా.. ఇంత వరకూ ఆ మరణాల మిస్టరీ వీడలేదు. -
విధేయతతోనే దేవుని కార్యాలు సాధ్యం!
ఎంతో ఎల్తైన, దృఢమైన, అత్యంత దుర్భేద్యమైన యెరికో పట్టణ ప్రాకారాలు ఇప్పుడు యెహోషువాకు, ఆయన జనులైన ఇశ్రాయేలీయులకు ఎదురుగా ఉన్నాయి. వాగ్దాన దేశమంతా స్వతంత్రించుకోవడానికి యెరికోను స్వాధీనం చేసుకోవడం కీలకం, అత్యంత ఆవశ్యకం కూడా. ఏ విధంగా చూసినా యెరికోలో విజయం శక్తికి మించిన కార్యం! అందరి కళ్లూ నాయకుడైన యెహోషువాపైన ఉన్నాయి. కాని అతని కళ్లు మాత్రం దేవునివైపు చూస్తున్నాయి. ‘మీరంతా ప్రాకారాల చుట్టూ ఆరు రోజులపాటు రోజుకొకసారి తిరగండి, ఏడో రోజు ఏడు సార్లు తిరగండి. అప్పుడు అవి కూలిపోతాయి’ అన్నాడు దేవుడు (యెహోషువా 6:2–4). అంత పెద్ద సమస్యకు ఇంత చిన్న పరిష్కారమా? అవి వాటంతట అవే కూలిపోతాయా? సణగడం, గొణగడం అలవాటే అయిన ఇశ్రాయేలీయులు బహుశా ఇలా ఆలోచిస్తున్నారేమో! దేవుని ఆదేశం విని ఎవరెలా ప్రతిస్పందించారో బైబిలులో రాయలేదు కాని ఆజ్ఞలు అందిన వెంటనే వారందరినీ నాయకుడైన యెహోషువ ప్రాకారాల చుట్టూ ప్రదక్షిణకు పురికొల్పి వారితోపాటు నడిచాడు. నలభై ఏళ్ళ అరణ్యవాసంతో దేవుడు చేసిన అద్భుతాలన్నింటికీ ప్రత్యక్షసాక్షిగా దేవుని బాహుబలాన్ని అతను కించిత్తు కూడా సంశయించలేదు. దేవుడేదైనా అన్నాడంటే అది జరిగి తీరుతుందన్నది అతని విశ్వాసం. అందుకే దేవుని ఆదేశాలపాలనకు ‘విధేయత’తో ఉపక్రమించాడు. ఎర్రసముద్రాన్ని రెండు పాయలు చేయడం, క్రమం తప్పకుండా ఆకాశం నుండి మన్నా కురిపించడం, బండ నుండి పుష్కలంగా నీళ్ళు వెలికితీయడం వంటి కార్యాలు చేసిన దేవునికి యెరికో ప్రాకారాలు కూల్చడం ఎంత పని? అన్నది యెహోషువా విశ్వాసం. అందుకే అతనిలో అంత విధేయత! దేవుని విశ్వసిస్తే దేవుని పట్ల విధేయత కూడా పుష్కలంగా ఉండాలి. విశ్వాసం, విధేయత పర్యాయ పదాలు. దేవుడు ‘చేసిన’ అద్భుతాలు విశ్వాసాన్ని బలపరుస్తాయి. ఆయన చేయబోయే కార్యాలకు ‘విధేయత’ పునాది వేస్తుంది. మనం చాలాసార్లు ‘విశ్వాస పరీక్ష’లో నూటికి నూరుశాతం మార్కులతో పాసవుతాం కాని ‘విధేయతా పరీక్ష’లోనే ఫెయిల్ అవుతుంటాం. విశ్వాస విజయాలకు గండి పడేది మన విధేయత పలచబడినప్పుడే! ఏడు రోజుల తర్వాత కూలిపోయే గోడలచుట్టూ, ఏడు రోజులూ ఇశ్రాయేలీయులను ‘ప్రదక్షిణం’ చేయించిన విధేయత యెహోషువది. ఆ సమయంలో అతని కళ్లు సమస్యౖయెన ప్రాకారాల మీద కాదు, వాటిని కూల్చేస్తానన్న దేవునిఇదివరకటి అద్భుతాలమీద ఉన్నాయి. నాకున్న యెరికో గోడలాంటి సమస్యను దేవుడు తీర్చడంలేదన్న వ్యసన భావంతో ఉన్నారా? దేవుడు ఇదివరకే చేసిన అద్భుతాలను మననం చేసుకోండి. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్నీ మరువకుండా జ్ఞాపకం చేసుకోండి. అది విధేయతతోనే సాధ్యం. మీ విధేయతే మరో అద్భుతానికి దారి సరాళం చేస్తుంది. ఆరో రోజున వారి విధేయతకు బహుమానంగా దేవుడు యెరికో గోడలు కూల్చాడు. అక్కడి నుంచే ఇశ్రాయేలీలను గొప్ప జనాంగంగా కట్టడం ఆరంభించాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మీకు తెలుసా?
♦ వత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు వత్తులను (దీపారాధన) వెలిగించాలి. ♦ ఉదయం పూట తూర్పు దిశగా రెండు వత్తులు ఉండేటట్లు దీపం ముఖం ఉండాలి. ♦ సాయంత్రం పూట ఒక వత్తి తూర్పుగా, రెండవది పడమటగా ఉండాలి. ♦ శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం. ఇవి చేస్తే మంచి జరుగుతుంది. ♦ దైవప్రసాదాన్ని పారవేయరాదు. ♦ దీపాన్ని నోటితో ఆర్పరాదు. ♦ ఒక దీపం వెలుగుతుండగా, రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు. ♦ దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు. ♦ దేవుని పూజకు ఉపయోగించే ఆసనాన్ని వేరొక పనికి వాడరాదు. ♦ దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం, స్తోత్రాలు చదవకూడదు. పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. -
విశ్వాసిని చక్కదిద్దే ముల్లు!
గొంగళి పురుగు సీతాకోకచిలుకగా రూపాంతరం చెందడం దేవుని సృష్టిలో ఒక మహాద్భుతం. అదే ఒక సీతాకోకచిలుక గొంగళిపురుగుగా మారితే..? అది ఆ తర్వాత వినాశకరమైన, వికృతమైన పరిణామం. ఈనాడు మన చుట్టూ జరుగుతున్న పరిణామమిది. మనిషికున్న రోగాలన్నింటికీ మందులున్నాయేమోగానీ, అతనిలోని జీవన ప్రమాణాలు, విలువల దిగజారుడుకు విరుగుడు మందు లేదు. పైకి ఎంతో హుందాగా, అందంగా కనిపించే సభ్యమానవుని ఆంతర్యంలోని దిగజారుడుతనం అనే గొంగళిపురుగు స్వభావానికి ప్రతిరూపమే ఈనాడు సమాజంలో పెచ్చరిల్లుతున్న హింస, ఊచకోతలు, పగలు, ప్రతీకారాలు, కుట్రలు, అందమైన ఉద్యానవనంగా ఉండేందుకు దేవుడు నిర్దేశించిన మానవ జీవితాలు, అతని చుట్టూ ఉన్న సమాజంలో విలువలూ, ప్రమాణాలూ అంతరించిపోయి క్రమంగా పాడుదిబ్బగా మారుతున్న నేటి పరిస్థితికి కారణం మనిషి తన పూర్వపు గొంగళి పురుగు స్వభావాన్ని సంతరించుకోవడమే!! ఇది మనిషికీ, మొత్తం సమాజానికే ఒక ముల్లుగా మారింది. మరేం చేయాలి? తన జీవితంలో కూడా ఒక ముల్లు ఉండిందని, మూడుసార్లు ప్రార్థించినా దేవుడు దాన్ని తొలగించలేదు సరికదా, దాన్ని భరించేందుకు చాలినంత పనిస్తానన్నాడని, నా కృప నీకు చాలునని దేవుడు బదులిచ్చాడని పౌలు రాసుకున్నాడు (2 కొరింథి 12:7–9). అదే అపొస్తలుడైన పౌలు గొప్పదనం!! అపొస్తలుల్లో అత్యంత ప్రభావంతో కూడిన పరిచర్య చేసిన పౌలు నిజానికి నేను ప్రార్థన చేస్తే తిరుగు లేదు, నేను ఏదడిగితే అది దేవుడిచ్చాడు అని రాసుకోవచ్చు. ఆ ముల్లు ప్రస్తావన తీసుకు రావలసిన అవసరమే లేదు. కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పుకోగలిగిన తన అందమైన సీతాకోకచిలుక లాంటి జీవితంలో, అబద్ధాలాడే లేదా ఆ నిజాలను కప్పిపుచ్చే తన పూర్వపు గొంగళిపురుగు స్వభావాన్ని అతను మళ్లీ ఆశ్రయించదలచుకోలేదు. విశ్వాస జీవితంలో విజయమంటే అదే!! ప్రార్థనా జీవితమే అన్ని ముళ్లకు, సమస్యలకూ పరిష్కారం. ప్రార్థిస్తే దేవుడు ఆ ముల్లు తొలగించవచ్చు. ఒకవేళ ఆ ముల్లు కొనసాగడమే దేవుని సంకల్పమైతే, దాన్ని భరించే శక్తిని దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించవచ్చు. దేవుడు తన సంపూర్ణ శక్తిని కృప ద్వారా మన జీవితాల్లో ప్రవహింపజేసినప్పుడు అది అన్ని రంగాలనూ తాకి ఆనందమయం చేస్తుంది. మనిషి పతనమయ్యే ప్రమాదం ఉందనుకుంటే ముల్లును నలుగగొట్టడం ద్వారా అతని పతనాన్ని అరికట్టి ఆశీర్వాదపు బాటకు మళ్లించేదే దేవుని కృప!! సముద్రంలోని నీళ్లను, ఆకాశపు నక్షత్రాలను, లోకంలోని ఇసుక రేణువులను కొలువలేనట్టే దేవుని కృపను కూడా కొలువలేము. దేవుని శక్తి నిరూపణ ఆ కృప ద్వారానే జరిగి అవసరమైతే నలగగొట్టి అయినా సరే, విశ్వాసిని అతని ద్వారా సమాజాన్ని శాంతిమయం, ఆనందదాయకం చేస్తుంది!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
విశ్వాసికి నిజమైన అలంకారం విధేయతే!
పరాక్రమం హద్దులు దాటితే అది అరాచకం సృష్టిస్తుంది, అనర్థదాయకమవుతుంది. దావీదు సైన్యాధిపతి యోవాబు విషయంలో అదే జరిగింది. ఎన్నో యుద్ధాల్లో అతను దావీదుకు చేదోడు వాదోడుగా నిలిచి యుద్ధాలు గెలిపించాడు. కాని అతనిది కుట్రపూరితమైన స్వభావం, నిచ్చెనలెక్కే విషయంలో అందెవేసిన చేయి. తనవంటి శూరులే అయిన అబ్నేరు, అమాశాను చక్రవర్తి అయిన దావీదు ఆజ్ఞకు విరుద్ధంగా చంపి, దావీదు సైన్యానికి చివరికి రాజకుమారుడైన అబ్షాలోమును కూడా రాజాజ్ఞను ఉల్లంఘించి స్వయంగా చంపాడు. యోవాబు మహా పరాక్రమవంతుడే, కాని ‘విధేయత’లో అత్యంత బలహీనుడు. విజ్ఞత, విచక్షణ, లోపించిన పరాక్రమమతనిది. అలాటి వాడివల్ల దేశానికి మేలుకన్నా కీడే ఎక్కువగా జరుగుతుందన్న ముందు చూపుతో, దావీదు తన వారసుడైన సొలోమానుకు యోవాబు చేసిన రాజవ్యతిరేక చర్యలు వివరించి చెప్పి యోవాబు విషయంలో ‘నీకు తోచినట్టుగా చేయమని’ హెచ్చరించాడు. తానెంతో పరాక్రమవంతుణ్ణని, తనకెదురు లేదని భావించే యోవాబు ‘విచ్చలవిడితనం’తో సోలోమోను శత్రువులతో కలిశాడు. అదే అదనుగా భావించి సోలోమోను అతన్ని హతమార్చి, తనకూ, దేశానికీ కూడా ఉన్న బెడదను శాశ్వతంగా రూపుమాపాడు. లోకంలో చాలామంది జ్ఞానులు, పరాక్రమవంతులు, విజ్ఞుల బలహీనత తకున్న ‘హద్దులు’ తెలుసుకోలేకపోవడమే. ఎంతటి శూరుడైనా రాజాజ్ఞకు బద్ధుడు. ఈ చిన్న విషయం అంతటి పరాక్రమవంతుడైన యోవాబుకు తెలియకపోవడం ఆశ్చర్యం. శూరుని విధేయతే అతని పరాక్రమానికి వన్నె తెస్తుంది. దేవుని పరిచర్య ‘బ్రహ్మాండంగా’ చేసే చాలా మంది దైవ జనుల్లో, ఆ దేవుని పట్ల ‘విధేయత’ లోపించిన ప్రతిసారీ వారిలో ఒక యోవాబు కనిపిస్తాడు. దేవుడు అప్పగించిన పనిని మనం ఎంతో గొప్పగా చేస్తున్నామన్నది ఏమాత్రం ప్రాముఖ్యం కాదు. దేవుని పట్ల ఎంత విధేయంగా ఉంటున్నార్నదే వారి ప్రతిభకు గీటురాయి. ఎంతో శూరులనుకున్న చాలామంది చివరి దశలో ఆత్మీయంగా, కేరక్టర్ పరంగా దిగజారి చరిత్రహీనులు కావడానికి దారి తీసిన ఒకే కారణం దేవునిపట్ల వారి అవిధేయత. విశ్వాసికి నిజమైన అలంకారం విధేయతే! గొప్ప పనులు చేయడం ద్వారా కాదు, దేవుడు చెప్పిన పనులు చేయడం ద్వారా దేవునికి ప్రీతిపాత్రమవుతాం. యేసుప్రభువు చెప్పిన ఒక ఉపమానంలోని యజమానికి తాను చెప్పినట్లు చేసిన తన సేవకుణ్ణి ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా!’ అని అభినందిస్తాడు. దేవుని దృష్టిలో గొప్ప దైవజనులుండరు. నమ్మకమైన విధేయ దైవజనులు మాత్రమే ఉంటారు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుడిలాంటి మనిషి!
దేవుడు ఏ రూపంలో సాక్షాత్కరిస్తాడో ఎవరూ చెప్పలేదు. ఆ దేవుడు కూడా చెప్పలేడేమో తను ఏ రూపంలో మనిషికి సాక్షాత్కరిస్తాడో! మనిషికి దేవుడిని సాక్షాత్కరింపజేసేవారు వేరే ఉంటారు. ఎవరు ఆ ‘వేరే’? మనుషుల్లోని దేవుళ్లు! మనిషి కంటే ఒక మెట్టు పైన ఉన్నవాళ్లు, దేవుడిని మనిషి దగ్గరికి ఒక మెట్టు కింది దించగలిగిన వాళ్లు.. ఈ ‘మనుషుల్లోని దేవుళ్లు’. వీళ్లకు మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు.. ‘మనిషి’ అని గానీ, ‘దేవుడు’ అని గానీ అనకుండా! మనిషి అంటే మరీ తక్కువైపోతారనీ, దేవుడు అంటే మరీ ఎక్కువైపోతారని కాదు దీని అర్థం. మనిషికి, దేవుడికి మధ్య వారధిగా ఉన్నవారు మనిషీ, దేవుడు కాకుండా మరొకటేదైనా అయి ఉంటారు కదా! అందుకు. మళ్లీ ‘దేవుడిలాంటి మనిషి’ వేరు! దేవుడిలాంటి మనిషి అకస్మాత్తుగా సాక్షాత్కరిస్తాడు. దేవుడిలా! అతడిని ఏ దేవుడో వచ్చి సాక్షాత్కరింపజేయడు. మనకే అనిపిస్తుంది, కళ్లెదుట దేవుడు ప్రత్యక్షమైనట్లుగా. ‘ఏంటలా ఉన్నా?’ అంటాడు ఆ దేవుడి లాంటి మనిషి. మనతో ఏ బంధమూ, ఏ సంబంధమూ, ఏ అనుబంధమూ, ఏ భవబంధమూ లేని ఆ మనిషి! ‘తిన్నావా?’ అని అడుగుతాడు. ‘పిల్లలు ఎలా ఉన్నారు?’ అంటాడు. ‘కంటిలో ఆ చెమ్మ ఏమిటి?’ అని అంటాడు. ‘నేనేమైనా చేయగలనా?’ అని కూడా మనసును నిమురుతాడు. దేవుళ్లే వచ్చి దర్శించుకునే మనిషిలా అనిపిస్తాడు అప్పుడా దేవుడిలాంటి మనిషి! ఏమిటి తేడా ఈ దేవుడిలాంటి మనిషికి, మనుషుల్లోని దేవుడికి? మనుషుల్లోని దేవుడికి ఒక ఆశ్రమం ఉంటుంది. దేవుడి లాంటి మనిషి.. ఆశ్రయం కోసం మన దగ్గరికి వచ్చిన దేవుడిలా ఉంటాడు. మనుషుల్లోని దేవుడి దగ్గరకు మనం వెళ్తాం. దేవుడిలాంటి మనిషి మన దగ్గరకు వస్తాడు. అంతే తేడా. అంతే తేడా కాదు. అంత తేడా! దేవుడికీ, దేవుడిలాంటి మనిషి మధ్య కూడా తేడా ఉంది. మనం వెళ్లే దేవుడికి అంతకుముందే కట్టిన గుడి ఒకటి ఉంటుంది. మన దగ్గరకు వచ్చే దేవుడు మన గుండెలో గుడి కట్టుకుని వెళ్తాడు. మనం వెళ్లే దేవుడి దగ్గర తోపులాట ఉంటుంది. మన దగ్గరకు వచ్చే దేవుడు మన కోసమే వాళ్లను వీళ్లను తోసుకుని వస్తాడు. ఇవన్నీ కాదు, మనం వెళ్లే దేవుడి దగ్గర మన సమస్యలన్నీ చెప్పుకుంటాం. మన దగ్గరకు వచ్చే దేవుడు అడిగి మరీ మన సమస్యలు తెలుసుకుంటాడు. -
దురహంకారం దుష్టుల లక్షణం!
పర్షియా చక్రవర్తి హామాను అనే అధికారిని తన రాజ్యానికి ప్రధానమంత్రిని చేయగా ఒక చక్రవర్తి మినహా ఆ రాజ్యప్రజలంతా అతనికి సాగిలపడ్డారు. కాని దేవునికి మాత్రమే సాగిలపడే యూదుడైన మొర్దెకై అనే వ్యక్తి మాత్రం సాగిలపడటంలేదని రాజభటులు హామానుకు తెలిపారు. అందుకు ఉగ్రుడైన హామాను మొర్దెకైనే కాదు, పర్షియాలోని అతని జనులైన యూదులందరి సంహారానికి కుట్ర పన్నాడు. కాని దేవుని ప్రమేయంతో ఎస్తేరురాణి జోక్యం వల్ల జరిగిన అనూహ్య పరిణామాల్లో, తాను సంహరిద్దామనుకున్న మొర్దెకైనే చక్రవర్తి ఆజ్ఞానుసారం హామాను సన్మానించవలసి వచ్చింది. ఎస్తేరు రాణి స్వజనమైన యూదుల సంహారానికి హామాను చేసిన కుట్ర బట్టబయలై, హామానును అతని కుమారులను ఉరి తీయమని చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు. అంతకాలం అహంకారంతో విర్రవీగిన హామానును, అతని కుమారులను ఉరితీయమని చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు. అంతకాలం అహంకారంతో విర్రవీగిన హాహాను చివరికి ప్రాణరక్షణ కోసం ఎస్తేరు కాళ్లు పట్టుకోవడానికి కూడా దిగజారవలసి వచ్చింది. ఈలోగా రాజభటులు వచ్చి మొర్దెకైని ఉరి తీసేందుకు హామాను ఎల్తైన ఉరికొయ్య సిద్ధం చేశాడని చెబితే అదే కొయ్యకు హామానును ఉరి తీయమని చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు. స్వాభిమానులకు, అహంకారులకు ఎప్పుడూ వైరమే! విచిత్రమేమిటంటే మొర్దెకై సాగిలపడటం లేదని హామానుకు చాడీలు చెప్పిన రాజభటులే, మొర్దెకైని ఉరి తీసేందుకు హామాను ఎల్తైన ‘కొయ్య’ సిద్ధం చేశాడని చక్రవర్తికే చాడీలు చెప్పారు. అహంకారుల చుట్టూ చాడీలు చెప్పేవాళ్లు, చెంచాలు పోగవుతారని, అహంకారులు బలహీనులైన మరుక్షణం వాళ్లంతా శత్రుపక్షంలో చేరిపోతారని వేరుగా చెప్పాలా? లక్షలమంది సాగిలపడుతూండగా ఒక్క వ్యక్తి సాగిలపడకపోతే పోయేదేముందన్న విశాలమైన ఆలోచన లేకుండా, సాగిలపడని ఒక్కరి కోసం లక్షలమంది సంహారానికి కుట్ర చేసిన ‘దుష్టస్వభావమే’ హామానును అంతం చేసింది. అనుకోకుండా అందలమెక్కిన అనర్హులకే అహంకారం అనే జబ్బు చేస్తుంది. వారిని అభద్రతా భావనకు, తమ నీడను కూడా తామే నమ్మలేనంతటి అశాంతికి గురి చేస్తుంది. కుట్రలు, కుతంత్రాలే జీవితంగా మారి అహంకారులు అందరిని శత్రువులను చేసుకుంటారు. క్రోధానికి బానిసలై ఆలోచనాశక్తి లోపించగా వినాశనం వారిని తరుముకొస్తుంది. అహంకారానిది, భ్రష్టత్వానిక ఆలుమగల అన్యోన్య దాంపత్యం. అహంకారులు నిజానికి పరమ పిరికి వారన్నది మానసిక శాస్త్రవేత్తల విశ్లేషణ. అహంకారంతో బాగుపడ్డవాడు, సాత్వికుడై చెడిపోయినవాడు లేడన్నది అటు బైబిల్, ఇటు చరిత్ర కూడా చెప్పే తిరుగులేని సత్యం! ఐదడుగులు కూడా లేని స్వాభిమాని దావీదు, దున్నపోతులా ఉన్న ఏడడుగుల అహంకారి గొల్యాతును మట్టి కరిపించడం సత్యానికి, సాత్వికులకు దేవుడిచ్చిన విజయం. – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
ప్రవక్త నేర్పిన పాఠం
దేవుడు మానవులకు సంపదను ఇచ్చీ పరీక్షిస్తాడు. ఒక్కోసారి లేమికి గురిచేసీ పరీక్షిస్తాడు. ఇలా పరీక్షించే నిమిత్తం ఓ ముగ్గురు వ్యక్తుల దగ్గరకు దైవం తన దూతను పంపాడు. వారిలో ఒకడు కుష్టురోగి. మరొకడు పుట్టుగుడ్డి. మూడవవాడు వికారమైన రూపం కలిగిన వాడు. ముగ్గురూ నిరుపేదలే. దైవదూత మానవాకారంలో కురూపిగా ఉన్నవాడి దగ్గరికొచ్చి, అతని కోరికను చెప్పమన్నాడు. తాను అందవిహీనంగా ఉన్న నిరుపేదను కాబట్టి. తనకు రూపం కావాలని కోరుకున్నాడు. అప్పుడా దూత అతనికి మంచిరూపాన్ని తెప్పించి, ఒక చూడి మేకను బహూకరించి, దీనిద్వారా నీకు శుభం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత గుడ్డివాడి దగ్గరికెళ్ళి ఏం కావాలో చెప్పమన్నాడు. అప్పుడా గుడ్డివాడు చూపు కావాలని కోరుకున్నాడు. దూత అతడికి చూపును ప్రసాదించి ఒక చూడి ఆవును బహూకరించాడు. దీనిద్వారా నీకు శుభం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కుష్టురోగి వద్దకు వెళ్ళాడు. అతణ్ణి కూడా నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఆ కుష్టురోగి తన జబ్బు నయం కావాలని కోరుకున్నాడు. దూత దైవాన్ని ప్రార్థించి అతని కుష్టురోగాన్ని పూర్తిగా దూరం చేశాడు. తరువాత అతనికొక చూడి ఒంటెను బహూకరించి, దీనిద్వారా నీకు శుభం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. దైవదూత చెప్పినట్లే, ముగ్గురూ ధనవంతులుగా మారి, హాయిగా జీవించసాగారు. తరువాత కొంతకాలానికి దేవదూత, పూర్వం కురూపిగా ఉండి, ఇప్పుడు అందంగా ఉన్న సంపన్నుడి దగ్గరికి వెళ్ళాడు. తన పరిస్థితిని వివరిస్తూ ఒకమేకను దానం చేస్తే దాని ద్వారా బతుకుతానని అర్ధించాడు. కాని పూర్వపు కురూపి, తన గతాన్నంతా మర్చిపోయి ఏమాత్రం జాలి చూపకుండా కసురుకున్నాడు. అప్పుడా దూత, ‘దేవుడు నిన్ను కరుణించి, నీ కురూపితనాన్ని పోగొట్టి మంచి రూపాన్ని ప్రసాదించాడు. దాంతోపాటు సంపదనూ అనుగ్రహించాడు. కాని నువ్వు అన్నీ మరిచిపొయ్యావు. దైవం మళ్ళీ నిన్ను పూర్వ స్థితికే తెస్తాడు.’ అని శపించి, అక్కణ్ణించి వెళ్ళిపోయాడు. తరువాత, పూర్వం గుడ్డివాడిగా ఉన్నతని దగ్గరికి వెళ్ళి ‘అయ్యా! నేను నిస్సహాయస్థితిలో ఉన్న గుడ్డివాణ్ణి. నాకో ఆవును దానం చెయ్యి..’ అని వేడుకున్నాడు. అతనూ గతాన్నంతా మరచి మొదటి వాడికి లాగానే ఛీత్కరించాడు. దూత అతణ్ణి కూడా ‘దైవం నిన్ను మళ్ళీ పూర్వస్థితికే తెచ్చుగాక..!’అని శపించి వెళ్ళిపోయాడు. తరువాత కుష్టురోగిగా మారి, పూర్వం కుష్టురోగంతో బాధపడి, స్వస్థత పొందిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ‘అయ్యా. .నేను దిక్కూమొక్కూ లేని కుష్టురోగిని. నాకేదైనా సాయం చేసి పుణ్యం కట్టుకో’ అని అభ్యర్ధించాడు. పూర్వ కుష్టురోగి,’అయ్యో..ఎంత కష్టం వచ్చింది! గతంలో నేను కూడా ఇదే వ్యాధితో బాధపడ్డాను. అనేక కష్టాలు అనుభవించాను. దైవం నన్ను అనుగ్రహించి, స్వస్థతను ప్రసాదించి, ఇంత సంపదను ఇచ్చాడు. నీకేం కావాలన్నా తీసుకెళ్ళు. దేవుని పేరుమీద నీకు దానం చేస్తున్నాను.’అన్నాడు. అప్పుడు దేవదూత, ‘నాకేమీ అక్కర లేదు నాయనా. కేవలం పరీక్ష నిమిత్తం దేవుడు నన్ను మీ దగ్గరికి పంపాడు. ఆయన మీ ముగ్గురినీ పరీక్షించాడు. కాని నువ్వు మాత్రమే సఫలమయ్యావు. అంతా హాయిగా, సంతోషంగా అనుభవించు. నీకు శుభం కలుగుగాక..!’ అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ప్రవక్త చెప్పిన ఈ వృత్తాంతం అందరికీ చక్కని గుణపాఠం. మనిషి ఎప్పుడూ తన గతాన్ని మరువకూడదు. ఏ ఆధారంలేని నిరుపేదలను, వికలాంగులను సంపన్నుల్ని పరీక్షించడానికే సృష్టించి ఉంటాడు.అందుకని, నిలకడలేని ఆరోగ్యాన్ని, ఈరోజు ఉంటే రేపు ఉంటుందన్న నమ్మకంలేని సంపదను, సౌందర్యాన్ని చూసుకొని విర్రవీగకూడదు. – ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
దైవంలో ఉండటమే భక్తుడి లక్షణం
ఆత్మీయం దేవుడు చాలా పెద్దగా ఉంటాడేమో అన్నది ఓ పదేళ్ల బాలుడి సంశయం. అదే విషయం తండ్రిని అడిగాడు. అప్పుడే ఆకాశంలో వెళుతున్న ఒక విమానాన్ని చూపించి, అంతుంటాడు దేవుడని తండ్రి చెప్పాడు. దేవుడంత చిన్నవాడా అన్నాడా బాలుడు నిరుత్సాహంగా. మరునాడు తండ్రి విమానాశ్రయానికి తీసుకెళ్తే అక్కడ విమానాల్ని దగ్గర నుండి చూసి ‘విమానాలు ఇంత పెద్దవా?’ అన్నాడా బాలుడు. ‘‘అవును దూరం నుండి అన్నీ చిన్నవే. దేవుడూ అంతే. ఆయనకు సమీపంగా ఉంటే ఆయనెంత పెద్దవాడో అర్థమవుతుంది’’ అన్నాడు తండ్రి. ధర్మశాస్త్రోపదేశకుడొకాయనను ‘దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటిలోకి అతి ప్రాముఖ్యమైనదేది?’ అనడిగాడు ఒకతను. ప్రాముఖ్యమైనవి ఒకటి కాదు రెండున్నాయంటూ, దేవుని సంపూర్ణంగా ప్రేమించాలన్నది మొదటిది కాగా, దేవుని సంపూర్ణంగా ప్రేమించినట్టే, మన పొరుగువాడిని కూడా అంతే ప్రేమించాలన్నది రెండవ ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని జవాబిచ్చాడు. ‘నిజమే, బలులివ్వడం, హోమాలు చేయడం కన్నా ముఖ్యమైనది. దేవుని, మన పొరుగువానిని ప్రేమించడమే ముఖ్యమని అతను అంగీకరించాడు. అందుకు ఆ ఉపదేశకుడు, నీవు స్వర్గానికి దూరంగా లేవని వ్యాఖ్యానించాడు. దైవానికి దూరంగా ఉండటం కన్నా, దగ్గరగా ఉండటం మంచిదే! కాని ఈ రెండింటి కన్నా దైవంలో ఉండేవారు నిజంగా ధన్యులు. దేవుని మహా లక్షణాలు, ఆయన శక్తి భక్తునికి సొంతమవుతాయి. లోకమన్నా, లోకభోగాలన్నా అందరికీ ఆకర్షణే! దీపం పురుగులకూ దీపానికి ఉన్న ఆకర్షణలాంటిదే ఇది. చివరకు ఆ పురుగులన్నీ దీపం వెలుగులో తిరుగుతూనే దీపం మంటలో పడి అంతమవుతాయి. లోకానికి వెలుగు, మంట రెండూ ఉన్నాయి. లోకం వెలుగులో ఎదిగి బాగుపడాలనుకునేవారు చివరకు దాని మంటలో మాడి మసైపోక తప్పదు. -
దైవకార్యాలతో గ్రామాల్లో సుఖ శాంతులు
అమరాపురం: గ్రామాల్లో దైవ కార్యాలు చేయడం ద్వారా సుఖ శాంతులు వెల్లి విరుస్తాయని కర్ణాటక రాష్ట్రం సిద్దరబెట్ట మఠాధీశులు వీరభద్ర శివాచార్య స్వామీజీ అన్నారు. గురువారం మండలంలోని చిట్నడుకు గ్రామంలో ఈశ్వర దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు తమ ఇంటి నుంచి గంగాజలం తీసుకుని స్వామివారికి కుంభాలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తితోనే ముక్తి మార్గం పొందవచ్చని స్వామీజీ తెలిపారు. -
అంతా దైవ చిత్రం
నేను నా దైవం జరిగేదంతా మన మంచికే... అనే భావం ఎక్కడ నుంచి పుట్టి ఉంటుంది? దేవుడికి ప్రేమించడం తప్ప, ద్వేషించడం రాదనే నిజం నుంచి పుట్టింది. మనం అనుకున్నదేదో కాలేదని దేవుణ్ని నిందించవచ్చు! కానీ... దేవుడు నవ్వి... అంతా నీ మంచికే... అని ఆశీర్వదిస్తాడు!! చివరికి... మనం అనుకున్నది అనుకున్నట్లే జరక్కపోవడమూ మంచికే అని... మనకు ఆలస్యంగానైనా తెలుస్తుంది. జయచిత్ర జీవితంలో ఇలాంటివి ఎన్నో! ఆమె జీవితమే ఒక చిత్రం! అంతా దైవచిత్తం అని అర్థం చేసుకున్న జయచిత్రమిది!! తల్లిని మించిన దైవం లేదని అంటారు. దేవుడు ప్రతిచోట ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. సినీ నటి జయచిత్ర కూడా ఒక అమ్మే. ఆమె కుమారునికి జయచిత్ర దైవమైతే, ఆమెకు ఆమె తల్లి అమ్మాజీ దైవం. వీరందరూ కలిసి ఆరాధించే దేవుళ్లూ ఉన్నారు. అయితే ప్రతి మనిషిలోనూ భగవంతుడిని చూడగలగాలి, అదే అసలైన దైవారాధన అంటున్నారు జయచిత్ర. దైవం అనే మాటకు మీ నిర్వచనం ఏమిటి? మొత్తం ప్రపంచమే ఈ దేవుని సృష్టి. మన కంటికి కనపడని ఒక మహాశక్తి. మన ఊపిరి, ప్రాణం, ఆత్మ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..ఎన్నెన్నో. దేవుడు లేకుండా ఈ సృష్టిలో ఒక చిన్న విషయం కూడా జరుగదు. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు మీ ఇంటి ప్రాంగణంలో గుడి ఎందుకు కట్టించుకున్నారు?! అపుడు నేను సుమారు పదహారూ పదిహేడేళ్ల అమ్మాయిని. సోగ్గాడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాలు చేస్తున్నపుడు చెన్నై మహాలింగపురంలో మావాళ్లు ఇల్లు కడుతున్నారు. ఇంటి స్థలం ఒకవైపు కార్నర్‌గా ఉంది, దోష నివారణకు గుడి కడితే బాగుంటుందని అమ్మ సూచించారు. మహాబలిపురం నుండి మూడు అడుగుల వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించాం. మొదట మా కోసమని ఇంటి ప్రాంగణంలోపల ‘శ్రీ జయ వినాయగర్ ఆలయం’ పేరుతో నిర్మించాం. అ తరువాత అందరికీ అందుబాటులో ఉండేలా మార్పులు చేశాం. చిన్నప్పటి నుంచే మీలో భక్తి భావం ఉండేదా? మా అమ్మమ్మ, అమ్మ అమ్మాజీ గారు చాలా భక్తిపరులు. అమ్మవారు, శివుడు, అయ్యప్ప ఆలయాలకు నన్ను వెంటపెట్టుకుని వెళ్లేవారు. నాకు తోడుగా షూటింగులకు వచ్చినపుడు కూడా మడిగట్టుకుని పూజలు చేసేవారు. మీకు ఏ దేవుడంటే ఎక్కువ ఇష్టం? వినాయకుడు, వేంకటేశ్వరస్వామి అంటే మహా ఇష్టం. శ్రీ వేంకటేశ్వరుడు అంటే మన మధ్య జీవించి ఉండే దేవుడు. అత్తగారింటి వారు తిరుచ్చిరాపల్లిలోని శిరువాదియూరు అమ్మన్‌ను కొలుస్తారు. ప్రతి ఏడాది మే 19వ తేదీన మా కుటుంబం తిరుమల కొండపై దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాం. గత 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా వెళుతున్నాం. అంతా దైవానుగ్రహం. మీకంత దైవానుగ్రహం ఎలా కలిగిందని అనుకుంటున్నారు? మీకో విషయం చెప్పేదా. నేనే కాదు, మా కుటుంబ సభ్యులందరం కూడా పూర్వజన్మ సుకృతులం. ఎందుకంటే.. నేను కృష్ణ జయంతి రోజున పుట్టాను. మావారు శివరాత్రి రోజున జన్మించారు. మా బాబుది అనూరాధ నక్షత్రం. షిరిడీ సాయిబాబా సమాధి అయిన రోజుటి నక్షత్రం అది. అంతేకాదు కంచిపీఠం చంద్రశేఖర సరస్వతి మహా స్వాముల వారు కూడా అనూరాధ నక్షత్రంలో ఈ లోకంలో అవతరించారు. అది తలుచుకుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. అంతా బాగుంటే దైవానుగ్రహం అనుకుంటాం. ఏదైనా కీడు, నష్టం జరిగితే దేవుyì ని కోప్పడతాం. ఈ మానవ స్వభావంపై మీరేం చెబుతారు? కష్టనష్టాల మిళితమే జీవితం. ప్రతి ఒక్కటీ దైవసంకల్పమేనని భావించాలి. దేవుడిపై కోప్పడటం, అలగటం నా జీవితంలో ఎప్పుడూ లేదు. దేవుడా నేనేమైనా తప్పు చేశానా, క్షమించమని ప్రాధేయపడటమే. మనం అనుకున్నది జరగనపుడు ఎందుకిలా జరిగిందని అనుకోవడం సహజం. అంతమాత్రాన దేవుడిపై నిందలు వేయడం తగదు. మరోరకంగా మంచి జరుగుతుందని భావిస్తూ సమస్యలను సైతం సానుకూల దృక్పథంతో స్వీకరించడమే మన పని. కష్టాలు కలిగినపుడు కూడా ‘శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు’ అని సరిపెట్టుకుంటారా? అదే చెప్తున్నా.. జీవితంలో ప్రతికదలికకు భగవంతుడే కారణం అనే నమ్మకాన్ని పెంచుకుంటే కష్టనష్టాలను తట్టుకునే శక్తిని భగవంతుడే ఇస్తాడు. గత ఏడాది అక్టోబరులో కేవలం నేనొక్కదాన్నే అన్నింటికీ నిలబడి బాబు పెళ్లి చేసానంటే దేవుడిచ్చిన శక్తి కాక మరేమిటి. అంతేకాదు ఏదో శక్తి నన్ను నడిపించింది. మనుమడి పెళ్లిని (నా కుమారుడు) కనులారా చూసిన ఆనందంతో ‘నా కోడలు గ్రేట్’ అంటూ నన్ను మెచ్చుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆమె కన్నుమూసారు. నిష్టాగరిష్ట సంప్రదాయ కుటుంబంలో అత్తగారి 16 రోజుల కర్మక్రతువుల సేవలు కూడా ఏకైక కోడలిగా నెరవేర్చే శక్తిని కూడా నాకు ఆ దేవుడే ప్రసాదించాడు. ‘ఇది దైవ మహిమ’ అని అనుకున్న సందర్భాలు మీ జీవితంలో ఏవైనా ఉన్నాయా? ఓ..తప్పకుండా. మా అమ్మ, అమ్మమ్మ అందరం కలిసి చెన్నైకి సమీపంలోని అంగాళపరమేశ్వరీ అమ్మవారి ఆలయానికి వెళ్లేవారం. అక్కడ పెద్ద పాము పుట్ట ఉండేది. వెళ్లినపుడల్లా కోడిగుడ్డు వేసి పాలు పోసేదాన్ని. ఆ రకంగా పాము అంటే భయం కంటే భక్తి ప్రపత్తులు ఉండేవి. సరిగ్గా అదే సమయంలో ‘వెళ్లికిళమై వ్రతం’ (తెలుగులో నోము) చిత్రంలో హీరోయిన్గా బుక్ అయ్యాను. అపుడు నా వయస్సు 18 ఏళ్ల లోపే. అంత చిన్న వయస్సులో ఎంతో పొడవైన నిజమైన నాగుపాముతో ఏ మాత్రం భయం లేకుండా నటించానంటే అమ్మవారి కరుణే కారణం. అంతేకాదు, నాకు ఇంత మంచి జీవితం దక్కడం కూడా దైవ మహిమే అనుకుంటాను. ఇంతగా మిమ్మల్ని అనుగ్రహించిన ఆ దేవుడికి రుణపడి ఉన్నానన్న భావన మీలో కలిగిన సందర్భాలున్నాయా? దేవుడి రుణం తీర్చుకోవడం మానవ మాత్రునికి సాధ్యమా చెప్పండి? అయితే ఒక విషయం మాత్రం గుర్తుకు వస్తోంది. ఒకసారి చెన్నై టీనగర్‌లోని టీటీడీ ఆలయానికి వెళ్లినపుడు బైట గేటు మూసి ఉంది. ఇదేమిటి ఈ సమయంలో మూసి ఉన్నారని ఆలయ నిర్వాహకులను అడిగాను. శ్రీవారికి నైవేద్యం పెడుతున్నప్పుడు మూసివేస్తామని చెప్పారు. ఈ సంగతి భక్తులకు ఎలా తెలుస్తుంది? పైగా ఏమేమో అనుమానాలు వచ్చే అవకాశం ఉంది కదాని బాధపడ్డాను. నైవేద్యం సమయంలో గంట కొడుతూ ఉంటే భక్తులకు ఆ సంగతి అర్థం అవుతుందని, ఆ గంటను నేనే కొనిస్తానని నిర్వాహకులను కోరాను. వాళ్లు అంగీకరించారు. వెంటనే చెన్నైలోని ప్యారిస్ సెంటర్ వెళ్లాను. బురద కారణంగా కారు లోనికి వెళ్లే పరిస్థితి లేదు. అక్కడే ఒక సందులోకి దిగి వెళ్లి, ఓ షాపులో గంటను సెలక్ట్ చేశాను. ‘నేను మెయిన్ రోడ్డులోకి వెళ్లిన తరవాత గంట కొట్టు, గంట మోత నాకు అక్కడికి వినిపించాలి’ అని షాపు వాళ్లకు చెప్పి మళ్లీ ఆ బురదలో వెనక్కు నడుచుకుంటూ వచ్చి విన్నాను. నేటికీ ఆలయంలో స్వామివారికి నేను సమర్పించిన ఆ గంటను నైవేద్యం సమయంలో వినిపిస్తున్నారు. అయితే అది రుణం తీర్చుకోవడం కాదు. ఏమి చేసినా దేవుని రుణం తీరేది కాదు. దైవం మానుష రూపేణా అంటారు.. మరి మనుషులకు సేవ చేస్తే సరిపోతుంది కదా, ఈ పూజలు, అభిషేకాలు ఎందుకు? ప్రతిఒక్కరిలో దైవాన్ని చూడగల పరిణతి మనుషుల్లో పెరిగినపుడు మనం ఇతరులకు చేసే సేవలు ఆ దేవదేవుని పాదాల వద్దకు చేరుతాయి. దేవుడు ప్రత్యక్షమైతే ఏమి కోరుకుంటారు? జన్మజన్మలకు అమ్రేష్ వంటి కొడుకు పుట్టాలి. బాబు అంటే నాకు ప్రాణం. అతనిని చల్లగా చూడు తండ్రీ అని ప్రార్థిస్తాను. బిడ్డల్ని సంతృప్తిగా చూసుకునేందుకే ప్రతి తల్లి ఎక్కువ కాలం బ్రతకాలని ఆశపడుతుంది. అలాంటి ఆశే ప్రతి తల్లినీ బతికిస్తూ ఉంటుంది. మా బాబు తన సంగీత దర్శకత్వంలో తొలిసారిగా ‘జీవితం’ అనే ఆడియో నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేశాడు. అందులోని ‘ఏడు కొండల వెంకయ్యే ఈ లోకము’ అనే గీతాన్ని తెలుగు, తమిళంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు పాడారు. ఈ పాట తిరుమల కొండపై వినపడాలని తల్లిగా నేను చేసిన ప్రార్థనను స్వామి ఆలకించాడు. తిరుమల కొండల్లో బాబు ఆడియో వినిపించినపుడు పులకించిపోయాను. సంగీతం సరే తమిళంలో పాటలు కూడా రాస్తున్నాడు. తెలుగు చదవకున్నా తెలుగు పాటలు రాస్తున్నాడు. నా బాబుకు నేను బహూకరించిన నిలువెత్తు మురుగన్ త్రిశూలం ఒక కవచంలా కాపాడుతోంది. ప్రత్యక్షం కాకుండానే మాకు ఎన్నో వరాలు ఇచ్చిన ఆ దేవుడిని ఇంకేమి కోరుకునేది. – కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి చెన్నై -
జీవిత రహస్యం
ముల్లా నసీరుద్దీన్ ఓ రోజు బజారు వీధి గుండా నడచి వెళ్తున్నారు. ఆయనకు ఎదురుగా స్కూల్ పిల్లలతో ఒక పెద్దాయన వస్తున్నారు. ముల్లా ఆయనను చూసి ‘‘పిల్లల్ని ఎక్కడకు తీసుకుపోతున్నారు?’’ అని అడిగారు. ‘‘దేశంలో వానలు లేవు. పిల్లల మనస్సు కల్లా కపటం ఎరగదు. ఈ పిల్లల స్వచ్చమైన హృదయాలతో ప్రార్థన చేశారంటే దేవుడు తప్పక చెవి యొగ్గి వింటాడు. కనుక ఈ పిల్లల్ని తీసుకుపోయి ఊరు చివరున్న మైదానంలో ప్రార్థన చేయిస్తాను. దానితో దేశంలో తప్పక వానలు కురుస్తాయి...’’ అని ఆ పెద్దాయన అన్నారు. ఆయన మాటలు విని ముల్లా ఓ నవ్వు నవ్వారు. ఒక కుర్రాడిని దగ్గరకు పిలిచి ‘‘ప్రపంచంలో నీకు నచ్చని చోటేది?’’ అని అడిగారు ముల్లా. ‘‘స్కూలు’’ అన్నాడు కుర్రాడు ఏ మాత్రం ఆలోచించకుండా. మరొక కుర్రాడిని పిలిచి ‘‘ప్రపంచంలో నీకు నచ్చని మనిషి ఎవరు?’’ అని అడిగారు ముల్లా. ‘‘మా లెక్కల మాస్టారు..’’ అన్నాడు ఆ కుర్రాడు. ‘‘చూశారా? పిల్లలు అనుకున్నదల్లా జరుగుతుందంటే ప్రపంచంలోని స్కూళ్ళు అన్నీ కాలి బూడిదవుతాయి. వాటిలో ఉన్న మాస్టార్లు ఎవరూ మిగలరు...’’ అంటూ ముల్లా తన దారిన పోయారు. పిల్లలు తెలియనితనంతో కూడిన అమాయకులే. కనుక అందరి ప్రేమకూ వాళ్ళు పాత్రులవుతారు. అలాగని వారి అమాయకత్వాన్ని, తెలియనితనాన్ని ఆసరాగా చేసుకుని ఏదో జరిగిపోతుందని అనుకోకూడదు. తెలియనితనంలో ఉన్న వారిని తెలివైన వారిగా చేయడమే విద్యాలయం కర్తవ్యం. అలాగే జీవితం నుంచి జ్ఞానాన్ని తెలుసుకునే దిశలో ప్రయాణించడమే జీవుడికి విద్య అవుతుంది. – యామిజాల జగదీశ్ -
అర్థవంతమైన జీవితం అంటే..?
ఆత్మీయం నేనీ జీవితంతో విసిగిపోయాను అనో, ఈ లైఫంటే బోర్ కొడుతోంది అనో చాలామంది నోట వినిపించే మాటే. నిజానికి ఈ మాట అనడానికి వీలేలేదు. ఎందుకంటే, వినోద సాధనాలు విరివిగా ఉన్నాయి. అయినా, జీవితం విసుగు పుట్టిస్తోంది..! అందుబాటులో ఉన్న ఏ ఆధునిక వినోద సాధనమూ సంతోషాన్ని, తృప్తిని ఇవ్వడం లేదు. అందుకే ఈ జీవితానికి అర్థం ఏముంది అని నిరుత్సాహ పడటం. అసలు అలా ఎలా ఆలోచిస్తాం? జీవితంలో మనం చేసే ప్రతి పనికీ అర్థం ఉన్నప్పుడు... మన జీవితానికి మాత్రం అర్థం లేకుండా ఎలా పోతుంది? మరణం కంటే జీవితం మీదే ఇష్టం ఎక్కువ మనకు. కాకపోతే ప్రశాంతంగా అర్థవంతమైన జీవితాన్ని జీవించాలన్నదే ఆశ. ఇది అర్థం లేని ఆశేమీ కాదు. తీరని ఆశ అంతకన్నా కాదు. మన జీవితానికి అర్థం తెలుసుకోవడం మన చేతుల్లోనే ఉంది. దేవుణ్ని తెలుసుకుని, ఆయనతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు అర్థవంతమైన జీవితం అంటే ఏంటో బోధపడుతుందని, జీవితానికి ఒక అర్థమంటూ ఏర్పడుతుందని అనేక గ్రంథాలు తెలియ చేస్తున్నాయి. నిజాన్ని తెలుసుకున్ననాడు మనం దేవునికి ఎప్పుడూ దూరం కాము. అలా కానినాడు మన జీవితం అర్థరహితమూ కాదు. ఒక వస్తువు తాను దేనికోసం తయారు చేయబడిందో దానికి పరిపూర్ణంగా ఉపయోగించబడినప్పుడు దానికి అర్థం ఎలా ఏర్పడుతుందో, మనిషి జీవితమూ అంతే. దైవం కోసం జీవించినప్పుడు, మన జీవితాన్ని పరమాత్ముడి సేవకు అంకితం చేసినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. అర్థవంతమవుతాయి. అప్పుడు జీవితంలో విసుగు అనే పదానికి స్థానం లేకుండా పోతుంది. ఇక్కడ దైవం అంటే ఎవరో కాదు... సాటి మానవుడే దైవం. ప్రతి ప్రాణీ దైవమే! -
బైబిలులో దేవుడు గీసిందే తిన్నని గీత!
గొప్ప విశ్వాసిగా, మహా రచయితగా మారకముందు పి.ఎస్. లూయిస్ పరమ నాస్తికుడు. లోకంలో జరిగే అన్యాయాలు, దౌర్జన్యాలను చూసి దేవుడనేవాడుంటే లోకంలో ఇంత అధ్వానంగా, ‘వంకర’గా ఎందుకుంటుందనుకొని తిరుగుబాటు చేశాడు. కాని వేలెత్తి చూపేవన్నీ వంకరగీతలంటున్నానంటే ఎక్కడో ‘తిన్నని గీత’ కూడా ఉండాలి కదా! అనిపించి అన్వేషిస్తే బైబిలులో దేవుడు గీసిందే ‘తిన్నని గీత’ అని తెలుసుకున్నానని ఆయనొకసారి వివరించాడు. పాత నిబంధన, కొత్త నిబంధనగా రెండు భాగాలున్న బైబిలును లోకజ్ఞానంతో అర్థం చేసుకోవడం అసాధ్యం. ఎందుకంటే ఈ రెండు భాగాల్లోని ‘దైవప్రత్యక్షత’ను వివరించ పదాలు మనిషి కనిపెట్టినవైనా, ఆ తత్వం, భావం మాత్రం పూర్తిగా పారలౌకికం, దైవికం. అందుకే పీహెచ్‌డీలున్న మేధావులనుకునేవారు వారికి అర్థం కాని అత్యంత సూక్ష్మమైన, సునిశితమైన బైబిలులోని దైవికాంశాలను పామరులు, అర్థపామరులైనవారు బోధించడం చూస్తాం. యేసుక్రీస్తు ఆరోహణం, పునరాగమనం మధ్యకాలాన్ని, కృపాయుగం లేక క్షమాయుగంగా దేవుడు ప్రకటించి తన క్షమ, ప్రేమతత్వాన్ని రుజువు చేసుకున్నాడు. క్రమశిక్షణను నూరిపోయాలనుకున్న తండ్రి ప్రేమ కుమారుణ్ణి దండిస్తుంది. ప్రేమతో క్షమించి ముద్దాడుతుంది కూడా! ఈ తత్వాలన్నింటినీ సమగ్రంగా వివరించే ‘బైబిలు గ్రంథాన్ని మేధస్సుతో కాదు, మోకాళ్ల మీదుండి చదవాలి. ఈ అద్భుతమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది. కృపయు, సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాయి అని వివరించాడు (యోహాను 1:17). గది ఎంత అపరిశుభ్రంగా ఉందో చూపించే కరెంటు బల్బులాంటిదే ధర్మశాస్త్రం. కాని అది పాపాన్ని, అపరిశుద్ధతను ప్రక్షాళనం చేయలేదు. అందుకు వ్యాక్యూమ్ క్లీనర్లాంటి దైవ క్షమాగుణం, ప్రేమతత్వం కావాలి. అవి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి పరిచయం చేయబడ్డాయి. లోకాన్ని ప్రక్షాళనం చేస్తున్నాయి. దండించే శక్తి గల వానికే, క్షమించడానికి అధికారం ఉంటుంది. దేవుని నుండి నానాటికీ దూరమవుతున్న మానవాళి తిరిగి దేవునితో యేసుక్రీస్తు ద్వారా అనుసంధానం కావడానికి దేవుడే ప్రసాదించిన ఒక సువర్ణావకాశం ఈ ‘కృపాయుగం’. గాడి తప్పిన లోకంలో సాగుతున్న అరాచకాలు, అమానవీయత ఈ అంతటికీ పరిష్కారం దేవుని క్షమాగుణం, ప్రేమతత్వంలోనే ఉందనడానికి వేరే రుజువులు కావాలా? – రెవ. డా. టి.ఎ. ప్రభుకిరణ్ -
భయం మంచిదే!
ప్రతిమనిషికీ ఎంతో కొంత భయం అవసరం. అయితే ఈ భయం కేవలం భయంగా కాక గౌరవంతో కూడి ఉండాలి. అలా గౌరవం ఉన్నప్పుడు తప్పు చేయకూడదనే ఆలోచన కలగడమే కాక, తప్పు చేసి పెద్దల మనసు నొప్పించకూడదనే భావన ఏర్పడుతుంది. భయం అనేది మనిషి సక్రమమార్గంలో నడవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడనే భావన కలిగినప్పుడు ఆ వ్యక్తి తప్పు చేయడానికి వెనకాడతాడు. ‘పెద్దలను తూలనాడితే నరకానికి పోతావు’ అని ఎవరైనా అన్నప్పుడు, ‘నరకం అనేదే లేదు కదా, ఇంక అక్కడికి ఎలా పోతామనే భావన ఉంటే ఆ వ్యక్తి తçప్పు చేయడానికి వెనకాడడు. అలా కాక... ‘నరకం ఉంది, అక్కడ భయంకరమైన శిక్షలు పడతాయి’ అనే భయం ఉన్నప్పుడు తప్పు చేయడానికి జంకుతాడు. ఇతరుల సొమ్మును హరిస్తే రెట్టింపు సొమ్మును పోగొట్టుకుంటామనే భయం ఉన్నప్పుడు పరుల సొమ్మువైపు కన్నెత్తి చూడటానికి కూడా సాహసం చేయరు. తల్లిదండ్రులను గౌరవించకుండా, వారిని వీధిన పడేసేవారికి ముందుముందు మన పిల్లలు కూడా మనలను ఈ విధంగానే చూస్తారు అనే భయం ఉంటే పెద్దలను జాగ్రత్తగా చూస్తారు. కేవలం భయం లేకపోవడం వల్లే భ్రష్టుపట్టి పోయిన వారు... సీతను అపహరించిన రావణుడు; ఇంకా కంసుడు, కీచకుడు, దుర్యోధనుడు... చెప్పుకుంటూ పోతే ఎందరో. వీరందరికీ తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తామనే భయం లేకపోవడం వల్లే అలా భ్రష్టుపట్టిపోయారు. అందుకే గురువులు విద్యార్థులకు భయంతో కూడిన గౌరవాన్ని, సన్మార్గాన్ని అలవరుస్తారు. -
అజ్ఞానాన్ని పటాపంచలు చేసేవాడే గురువు!
అజ్ఞానమనే చీకటి ఎక్కడ ఉంటుందో, అక్కడ గురువు అవసరం ఉంటుంది. అప్పుడు భగవంతుడు గురువు రూపంలోనే వస్తాడు. అందుకే శివ కేశవులిద్దరూ కటిక చీకట్లోనే వచ్చారు. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన శ్రావణమాసం నుండి ఆరు నెలల తరువాత మాఘబహుళ చతుర్దశినాడు మహాశివరాత్రి అర్ధరాత్రివేళ ఆవిర్భవించింది లింగం. అది కూడా జ్యోతిర్లింగం. కృష్ణుడు దీపం. శివుడు దీపం. శివుడు జ్యోతిర్లింగమై కటికచీకట్లో అర్ధరాత్రివేళ తుదిమొదలు తెలియకుండా పాతాళం నుంచి అంతరిక్షం వరకు పెరిగిపోయిన ఓ పెద్దజ్యోతి స్వరూపంగా ప్రకాశించాడు. దాన్ని నమ్మితే ఆరాధన చేస్తే అది అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టి జ్ఞానమనే వెలుతురునిస్తుంది. అప్పుడు సమస్త భయాలు తొలగిపోతాయి. ఆత్మ అనేది ఎరుకలోకి వస్తుంది. అంటే గురువు ద్వారా భగవానుడు భక్తుడికి పరిచయమవుతాడు. నేను ఒక దీనుడి వంక చూశాను. నాలో పొంగిన ప్రేమ భావనను కారుణ్యమంటారు. పెద్దల్ని ప్రేమతో చూసాను. ఆ భావనకు గౌరవమని పేరు. నా తల్లిదండ్రులను చూశాను. అప్పుడు నాలో ఉద్భవించిన ప్రేమ వారిపట్ల నాకున్న భక్తికి గుర్తు. మరి అలా భగవంతుడి పట్ల భక్తి కలగడానికి భగవంతుడిని చూసిన వాడెవడు! అందుకే గురువు భగవంతుడిని పరిచయం చేయడానికి అనేక మార్గాలను ఎంచుకుంటాడు. నేను దారిన పోతున్నప్పుడు ఒక అద్భుతమైన భవంతి కనబడింది. ‘ఎంత బాగుంది, ఎవరిదండీ ఇది?’ అని అడుగుతాను. ఒక వస్తువును చూస్తే దాని యజమాని ఎవరని అడుగుతాం. ఇంటి పెరట్లో ఒక చేమంతి పువ్వు పూసింది. దాని సన్నటి తొడిమ మీద గుండ్రని దిండుమీద ఆకుపచ్చ పత్రగుచ్ఛంమీద ఇన్ని పసుపుపచ్చటి రేకులు అందంగా పేర్చి వాటిలోంచి ఆ సౌరభం వెదజల్లేటట్లు చేసిన మహాశిల్పి ఎవరు? నేను చిన్నప్పట్నించీ ఎన్నో గీతలు గీశా. అన్నీ చెరిగిపోయాయి. ఎవరో నా చేతిలో గీసిన గీతలు ఎన్నిసార్లు కడిగినా చెరిగిపోలేదు. ఎవరాయన? ఇప్పుడు విశ్వాన్ని బట్టి విశ్వనాథుణ్ణి వెతుకుతాను. విశ్వమున్నది. కంటిముందు కనబడుతున్నది. దీన్ని నిర్మించినవాడు ఒకడు ఉండి ఉండాలి. వాడెవరు... అన్న ఆర్తి ప్రబలితే అప్పుడు ఎరుకపరిచేది గురువే. అందుకే జ్ఞానం ఇవ్వగలిగిన వాడెవడో ఆయనే గురువు. అంధకారాన్ని పోగొడుతున్న వాడెవడో, అజ్ఞానమనే చీకటిని పటాపంచలు చెయ్యగలిగిన వాడెవడో ఆయనే గురువు. గురువు ఒక్కొక్కసారి బోధచేస్తాడు. మరొకసారి ప్రశ్న వేస్తాడు. ఒక్క ప్రశ్న చాలు. శంకరభగవత్పాదులు ఒకానొకప్పుడు మోహముద్గరలో శ్లోకరూపంలో ఒక ప్రశ్నవేస్తాడు. అసలు నేనెవరనే ఆలోచన తెచ్చుకోవడానికి, భగవంతునితో అనుసంధానం పొందడానికి ఆ ఒక్క శ్లోకం చాలు. -
మనుషుల్లో దేవుడు
చేతిలో ఓ గొడుగు... ఎవరూ వెంట రాకపోయినా ఒంటరిగా వెళుతున్న స్పెయిన్‌కు చెందిన ఆ వ్యక్తిని చూసిన వారు ఆశ్చర్యపోయేవారు. కనిపించిన అందరినీ అప్యాయంగా పలకరిస్తూ.. తన స్పర్శ ద్వారా ప్రేమతత్వాన్ని పంచుతున్న ఆయన పట్ల ప్రజల్లో రానురాను భక్తి భావం పెరిగింది. ఏ ప్రాంతానికి వెళ్లిన చిన్న పిల్లలకు చాక్లెట్లు అందిస్తూ వారితో సన్నిహితంగా మెలిగిన ఆయనే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. క్రైస్తవ మిషనరీలో భాగంగా ఇక్కడకు వచ్చిన ఆయన.. ఏనాడూ ప్రజల్లో మత వ్యాప్తికి సంబంధించిన అంశాలు మాట్లాడేవారు కారు. బహిరంగంగా తన ఆరాధ్య దైవాన్ని కొలిచేందుకు కూడా ఇష్టపడని ఆయన 1920 ఏప్రిల్ 9న స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో జన్మించారు. తన యుక్త వయసులో స్పానిష్ సైన్యంలో చేరి దేశానికి సేవ చేశారు. క్రిస్టియన్ మిషనరీని ఏర్పాటు చేసేందుకు 1952లో భారతదేశంలో అడుగు పెట్టిన ఆయన ఎన్నో చేదు అనుభవనాలను ఎదుర్కొన్నారు.ఆయన సేవా కార్యక్రమాలకు ఆకర్షితురాలైన నాటి ప్రముఖ పాత్రికేయురాలు అన్నే.. ఆయన వెన్నంటి నడిచారు. అప్పటి ఆంధ్రరాష్ట ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానందరెడ్డి ఆహ్వానం మేరకు రాష్ట్రానికి వచ్చిన ఆయనను అనంత కరువు కదిలించింది. 1969లో జిల్లా కేంద్రం అనంతపురానికి చేరుకున్న ఫెర్రర్‌కు ఎమ్మా బిల్డింగ్‌లో వసతి కల్పించారు. దానినే కార్యాలయంగా మార్చుకుని జిల్లాలో సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక్కడకు వచ్చిన తర్వాత ఆయన అన్నేను వివాహమాడారు. 1977 నుంచి అనంతలో ఆర్థిక వనరులను అభివృద్ధి పరిచేందుకు స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేశారు. చిన్నపిల్లలకు బలవర్ధక ఆహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. తాము చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులను చేయడం ద్వారా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ప్రజల మనిషిగా నిలిచిపోయారు. 2009లో జనవరి 8న ఆయన మహానిష్ర్కమణ అనంతరం ఆయన ఆశయసాధనలో ఆర్డీటీ సంస్థ ముందుకెళుతోంది. - అనంతపురం సప్తగిరి సర్కిల్ -
మాయ నుంచి బయటపడాలి
సాక్షాత్తూ పరమశివుని అంశగా పేర్కొనదగిన శ్రీ శంకర భగవత్పాదుల వారు సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం కేరళలోని కాలడిలో ఆర్యాంబ – శివగురువు దంపతులకు వైశాఖ శుక్ల పంచమినాడు జన్మించారు. వారు జన్మించేనాటికి భారతదేశం సాంఘికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా పతనావస్థలో ఉంది. వేదాలు, ఉపనిషత్తులు భగవంతుడొక్కడే అని ఘోషిస్తున్నా, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని వాదులాడుకుంటూ, పరమత ద్వేషులుగా మారి, దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి. దాన్ని సమర్థంగా నివారించి సనాతన ధర్మ ప్రబోధతో ప్రజలను ఏకీకృతం చేసిన వారు శ్రీ శంకర భగవత్పాదులు. పిన్న వయస్సులోనే వేదవేదాంగాలను ఆపోశన పట్టి మహా పండితులను, విద్వాంసులనూ తన వాక్పటిమతో, మేధాసంపత్తితో అబ్బురపరచేవారు. పతనావస్థలో ఉన్న భారతీయ సనాతన ధర్మాన్ని పరిరక్షించి ప్రజలందరినీ ఒక్క తాటి మీద నడిపించగల శక్తి ఒక్క అద్వైత మతానికే ఉందనీ, దాంతోనూ ఐక్యతను సాధించవచ్చనీ, అందుకు తన శిష్యులను కూడా సమాయత్తం చేయాలనీ సంకల్పించారు శంకర భగవత్పాదులు. భారతదేశం నలుమూలలా నాలుగు పరమ పీఠాలను స్థాపించారు. అందులో శ్రీ శృంగేరీ శారదా పీఠం ఒకటి. శారదాంబ ఆలయ ప్రాకారంపైన పీఠంపై ఆసీనులై ఉన్న శ్రీ శంకర భగవత్పాదుల వారి మూర్తి దర్శనమిస్తుంది. పక్కనే వారు మానవాళికి జ్ఞానబోధ చేసిన శంకర భాష్యం, తదితర మహాగ్రంథాలను కూడా దర్శించుకోవచ్చు. వందల ఏళ్ల క్రితమే వారు భాష్యత్రయాన్ని, అనేక ప్రకరణ గ్రంథాలను, శివానందలహరి, సౌందర్యలహరిని, మనీషా పంచకాన్ని, ఇవిగాక అనేక స్తోత్రరత్నాలను అందించారు. ఆయన అన్ని గ్రంథాలను రచించడానికి కారణం బ్రహ్మచే సృష్టించబడిన మనుషులలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారుంటారు. వారిలో కొందరు తపశ్శక్తిని నమ్మినవారు, మరికొందరు స్తోత్రాధ్యయనాదులయందు ఇచ్ఛగలవారు, వీరినందరినీ పరిపూర్ణ విజ్ఞానవంతులను చేయడమనే శంకరుల ఆశయం. ఆయన అందించిన శ్లోకాలనేకం నేటికీ పండిత, పామర జనాల నాలుకల మీద నర్తిస్తున్నాయి.శంకరులు బోధించిన సాధన చతుష్టయం ద్వారా విజ్ఞానధనులై సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముని కృపకు పాత్రులు కావడమే ఆయన జయంతినాడు మనం సమర్పించే నమోవాకాలు. –స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి శారదాపీఠం, విశాఖపట్నం -
ప్రేమ దివ్వెల ప్రజ్వలనం
భాషలన్నీ కలిసినా పదాలన్నీ కూర్చినా భావాలన్నీ పోసినా నీ మహిమను వర్ణించగలవా... స్వరాలన్నీ పలికినా రాగాలన్నీ శ్రుతి చేసినా తాళాలన్నీ లయమీటినా నీ స్తుతిని పాడగలవా... అమ్మానాన్నల ప్రేమ తోబుట్టువుల అనుబంధం ఆలుమగల అనురాగం హితుల మిత్రుల స్నేహం ప్రతిబింబించగలవా నీ అంతరంగం నాకో రూపునిచ్చావు జీవం పోశావు జీవితాన్ని అందంగా అమర్చావు అనుబంధాలను ఆస్తులను అనంతంగా ఇచ్చావు అన్నీ... ఆనందంగా పంచుకోవాలని! ఒక్కోటీ ఒక్కోటీ నువ్వు న న్నర్థించావు... కాదు కాదు.. ఆజ్ఞాపించావు ప్రేమించమన్నావు.. తోటి మనిషిని! ప్రేమ ఒక్కటే మా మధ్య వెలిగే దీపమన్నావు అది లేకపోతే చీకటి ఒక్కటే మాకు మిగిలే ఆస్తి అన్నావు... స్వామీ.. సృష్టికర్తా.. జీవదాతా.. మేము ఆశల ప్రేమికులం దురా ల దాసోహులం నీ వెలుగును ఆర్పేశాం... చీకటినే సొంతం చేస్కున్నాం.. నువ్విచ్చిన ఈ నేలను స్వార్థ చీకట్లతో నింపేశాం.. మా ద్వేషాలతో పగలతో మా సమస్త దుర్గంధాలతో నిన్ను తూట్లు పొడిచాం ఛిద్రం చేశాం.. రక్తం ఓడ్చాం... ప్రాణం పీల్చాం... అయినా కోపించవే...? ... శపించవే..? క్షమించడమే నీ శ్వాస ప్రేమించడమే నీ భాష మేం నిన్ను సమాధి చేసినా మాపై ప్రేమతో... మరణాన్ని జయించావు మేము సైతం మృత్యువును జయించే జయవీరులం కావాలన్నావు ప్రేమతో.. ఇప్పుడైనా ... గుండెను నింపుకుంటే చీకటి... మరణం.. మటుమాయమన్నావు తండ్రీ, నీ మరణం మా గుండెను కదిలించాలి నీ రుధిరం మాలో ప్రవహించాలి అప్పుడే మాకు నవోదయ నవజీవనం మా ఎదలతో... మా చుట్టూ ప్రేమ దివ్వెల మహాప్రజ్వలనం..!! – ఝాన్సీ కె.వి.కుమారి ఓషో వాణి ► దేవుడు కోరుకుంటే వచ్చేవాడు కాదు. మీకు ఎలాంటి కోరికలు లేనప్పుడే ఆయన మీ దగ్గరకు వస్తాడు. ► మనిషి లోపల దేవుడు దాగి ఉన్నాడు. ఆయన బయట పడేందుకు మీరే ఆయనకు ఒక చిన్న దారిని, మార్గాన్ని ఇవ్వండి. అదే సృజనాత్మకత. దివ్య సంభవాన్ని అనుమతించడమే సృజనాత్మకత. అది ఒక ధార్మిక స్థితి. సృష్టించే కళ అంటే అదే. ► ప్రకృతితో సామరస్యంగా వ్యవహరించడమే వివేక సారం. బుద్ధుడు, లావోట్జు, వంటి మార్మికులందరి సందేశం అదే. ► సహజంగా చేసే పని ఎప్పుడూ సంపూర్ణంగానే ఉంటుంది. చాలా గొప్పగా చెయ్యాలనే తపనతో చేసే అసహజమైన ప్రయత్నాలు ఎప్పుడూ అసంపూర్ణ ఫలితాలనే ఇస్తాయి. సహజత్వతమే సంపూర్ణత్వం. ► మీకు మీరు గుర్తున్నప్పుడు ఆ దేవుణ్ణి మీరు మరచిపోతారు. మిమ్మల్ని మీరు మరచిపోయినప్పుడు ఆ దేవుడు మీకు గుర్తొస్తాడు. వీటిలో ఏదో ఒకటే సాధ్యపడుతుంది. రెండింటినీ గుర్తుంచుకోవడం అసాధ్యం. ► అహం ఒక మానసిక దౌర్బల్యం. దానితో పరిపూర్ణత్వం సాధించడం అసంభవం. అది లేనప్పుడు పరిపూర్ణత్వం దానంతటదే సహజంగా సిద్ధిస్తుంది. – ఓషో భరత్ ‘సృష్టించే కళ’ నుంచి మీకు తెలుసా? తిరుమల శ్రీవారి ఆలయంలో మనం మూలమూర్తిని మాత్రమే దర్శించుకుంటాం. అయితే ఆయనతోపాటు మరో నాలుగు మూర్తులు భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్రశ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీ దేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు కూడా ఉంటారు. భోగ శ్రీనివాసునికి నిత్య సేవలు, కొలువు శ్రీనివాసునికి లెక్కల అప్పగింతలు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ఉగ్ర శ్రీనివాసమూర్తిని మాత్రం ఏడాదికోసారి సూర్యోదయానికి ముందు సర్వాలంకారాలతో ఊరేగింపుగా తీసుకు వెళ్ళి అంతరాలయానికి తీసుకొచ్చేస్తారు. భక్తుల కోర్కెలు తీర్చే భారం మాత్రం మూలమూర్తి వెంకన్నదే. ఈ మూర్తులకే ధృవబేరం, కౌతుక బేరం, బలిబేరం, స్నపన బేరం అని పేర్లు. తెలుసుకుందాం ► ప్రాతఃకాలంలో భారతాన్ని, మధ్యాహ్న సమయంలో రామాయణాన్ని, రాత్రివేళ భాగవతాన్ని పఠించాలి. ► దేవుడిని ఉంచిన స్థానంలో కంటే భక్తులు ఎత్తులో కూర్చోరాదు. ► దేవుని ఎదుట తలదువ్వరాదు, భోజనం చెయ్యరాదు. ► పుష్పాలను నీటితో తడపరాదు. ► గంటను నేలపై ఉంచరాదు. ► శని, ఆది, మంగళవారాల్లో కొత్తదుస్తులు ధరించరాదు. ► ఆలయంలో ఉండగా భగవంతుడికి తప్పించి పూజారితో సహా ఎవరికీ పాద నమస్కారం చేయరాదు. రాహువు జాతక రీత్యా వ్యక్తుల ఉత్థాన పతనాలలో కీలక పాత్ర పోషించే రాహువు మార్మికతకు, మానసిక భ్రమలకు కారకుడు. మోసాలకు, దుర్వ్యసనాలకు, హింసాప్రవృత్తికి, నేరస్వభావానికి కారకుడు. రాహువు నైసర్గిక పాపగ్రహం. అందువల్ల జాతకచక్రంలోని దుస్థానాలైన 6, 8, 12 ఇళ్లలో ఉన్నప్పుడు, ఉపచయాలైన 3, 6, 11 స్థానాలలో ఉన్నప్పుడు మేలు చేస్తాడు. జాతకచక్రంలో రాహువు ఇలాంటి అనుకూల స్థానాలలో ఉన్నప్పుడు తన దశాంతర్దశలలో శుభ ఫలితాలనే కలిగిస్తాడు. అలా కాకుండా కేంద్ర కోణాలలో ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. ఇక రవి, చంద్రులతో కలసి ఉన్నట్లయితే జాతకులకు రాహువు కారణంగా ఇబ్బందులు తప్పవు. జాతకంలో రాహువు పరిస్థితి ప్రతికూలంగా ఉంటే జాతకునిలో హింసా స్వభావం ప్రకోపించి, నేరాలకు పాల్పడే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది. తాగుడు, జూదం వంటి దుర్వ్యసనాలు, మోసాలు, చీకటి వ్యాపారాలు వంటివి జాతకుని వినాశనం వైపు నడిపించే సూచనలూ ఉంటాయి. జాతకంలో రాహువు సానుకూలంగా ఉంటే జాతకులు వైద్య, పారిశ్రామిక, సాంకేతిక, రాజకీయ, గూఢచర్య రంగాల్లో రాణిస్తారు. ఇంద్రజాలం, హిప్నాటిజం వంటి విద్యల్లోనూ వీరికి ప్రవేశం ఉంటుంది. ఒకవేళ రాహువు జాతకంలో దోషభూయిష్టంగా ఉన్నట్లయితే, రాహు శాంతి కోసం మినుములను, ఇనుప పాత్రలో నూనెను, నలుపు గొంగళిని దానంగా ఇవ్వాలి. రాహు మంత్రాన్ని 18 వేల సార్లు జపించి, 1800 హోమం, 180 తర్పణం చేసి, 18 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దుర్గా ఆరాధన, ఛిన్నమస్తా ఆరాధనల ద్వారా కూడా రాహువు దుష్ప్రభావాల నుంచి ఉపశమనం పొందవచ్చు. – దాస్ ఒక స్తోత్రం జీవితంలో కష్టాలు, కడగళ్లనుభవించేవారు, తరచు కార్యహాని కలుగుతున్నవారు ఈ కింది సంకటహర గణపతి స్తోత్రాన్ని ఆర్నెల్లపాటు రోజూ పారాయణ చేయడం వల్ల ఆయా కష్టాలన్నీ తొలగుతాయని శాస్త్రోక్తి. సంకట విమోచక గణపతి స్తోత్రం ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాస స్మరేన్నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమంచ షష్టం వికటమేవచసప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశాంతు గజాననం ద్వాదశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాన్నిత్యం నచ విఘ్నభయం తస్యసర్వసిద్ధికరం ప్రభోః విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభేత్ పుత్రం మోక్షార్థీ లభేత్ గతిం జపేద్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చః లిఖిత్వాయత్సమర్పయేత్ తస్య విద్యా వేత్సర్వా గణేశస్య ప్రసాదతః చేసేవాడు దేవుడే! మనం పనిముట్లం మాత్రమే! ఒక పండితుడు పరమశివుడిపై ఒక స్తోత్రాన్ని రచించాడు. ప్రజలు దానిని చదివి చాలా ఆనందించి, పండితుణ్ణి ఎంతగానో ప్రశసించారు. ఆ పండితుడు తాను సాధించిన ఈ పనిని చూసుకుని గర్వంతో పొంగిపోయాడు. మరునాడు అతను శివాలయానికి వెళ్లి నమస్కారం చేస్తుండగా, అక్కడ ఉన్న నంది తన పళ్లను బయటపెట్టి చూపించాడు. ఆ దంతాలమీద ఈ పండితుడు రాసిన స్తోత్రంలోని ప్రతి మాటా రాసి ఉంది. అది చూసి పండితుడు నిర్ఘాంతపోయాడు. అతని అహంకారం పటాపంచలయింది.ఈ కథను తన శిష్యులతో చెప్పి శ్రీ రామకృష్ణ పరమహంస ‘దీనిని బట్టి తెలిసిందేమిటంటే, దేవుడే అన్ని పనులూ చేసేవాడు! మనం ఆయన చేతిలో పనిముట్లు మాత్రమే! అని వారికి బోధించాడు. -
భూతదయ
దైవం దయామయుడు, కారుణ్య నిధి. నిజానికి కారుణ్యమన్నది దేవుని ప్రత్యేక గుణం.ఏ మనిషిలో ఏ మేరకు ఈసుగుణాలు ఉంటాయో ఆమేరకు వారు శుభకరులు, దైవకారుణ్యానికి అర్హులు. ఇలాంటి సుగుణాలలో కొంతభాగాన్ని పుణికిపుచ్చుకున్న ఓ వ్యక్తి జీవితం ఎలా సఫలమైందో చూద్దాం. పూర్వం గజని అనే గ్రామంలో ఒక వ్వక్తి ఉండేవాడు. అతని పేరు సుబుక్తగీన్. మంచివాడు. పేదవాడైనప్పటికీ ఆత్మాభిమానం కలిగిన అభిమానధనుడు. ఆ కారణంగానే జాతి అతన్ని తమ నాయకుడిగా ఎన్నుకుంది. వేట , విహార యాత్రలంటే అతనికి చాలా ఇష్టం. అలవాటు ప్రకారం ఒకనాటి సాయంత్రం అతడు వేటకు బయలు దేరాడు. అడవిలో చాలా దూరం వెళ్ళిన తరువాత ఒక జింక కనిపించింది. దాని వెంట దాని పిల్లకూడా ఉంది. జింకను చూడగానే సుబుక్తగీన్ కళ్ళుమెరిశాయి. ఉత్సాహంగా దానివెంట పడ్డాడు. తల్లీ పిల్ల అడవిలో అడ్డదిడ్డంగా ప్రాణ భయంతో పరుగులంకించుకున్నాయి. అతను కూడా వాటివెంట పడి తరమడం మొదలు పెట్టాడు. పాపం! కొద్దిసేపు ఉరుకులు పరుగుల తరువాత పిల్లజింక బాగా అలసిపోయి వేటగాడి చేతికి చిక్కింది. సుబుక్తగీన్ దాన్ని పట్టుకొని వెనుదిరిగాడు. మాతృ ప్రేమకు జాతి బేధాలేముంటాయి. తల్లి తల్లే కదా..! ఎంత జంతువైతే మాత్రం మాతహదయం ఊరుకుంటుందా..? బిడ్డకోసం రోదిస్తూసుబుక్తగీన్ వెనకాలే వస్తోందా తల్లి జింక. అతను వెనుదిరిగి చూశాడు. కొద్దిదూరంలోనే ఆగిపోయింది జింక. కాని దీనత్వం నిండినదాని చూపులు బిడ్డపైనే కేంద్రీకతమయ్యాయి. తన కూనకోసం ఆ మాతృహృదయం తల్లడిల్లిపోతోంది. భయం, తెగింపు, ప్రేమ మమకారం కలగలిసిన మానసిక ఆందోళనతో ఆ తల్లి జింక మాతృహృదయం ఎంతటి వేదన అనుభవిస్తుందో మాతృహృదయంతో ఆలోచిస్తేతప్ప అర్ధం కాదు. స్వతహాగా మంచి మనసు కల వాడైన సుబుక్తగీన్ క్షణ కాలం ఆగి ఆ తల్లి జింక మూగవేదనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. మనసులో జాలి పెల్లుబికింది. కరుణ కట్టలు తెంచుకుంది. కళ్ళు చెమర్చాయి. వెంటనే తన వద్దనున్న జింక పిల్లను వదిలిపెట్టాడు. అంతులేని ఆనందంతో జింక పిల్ల గెంతుతూ తల్లిఒడి చేరింది. తల్లిజింక కళ్ళనుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా ప్రేమగా పసికూనను నాకుతూ బిడ్డతో కలిసి అడవిలో అదృశ్యమైపోయింది. సుబుక్తగీన్ అవి వెళ్ళినవైపే తదేకంగా చూస్తూ, తప్తిగా ఓ నిట్టూర్పు విడిచి ఇంటిదారి పట్టాడు. ఆరోజు రాత్రి సుబుక్తగీన్ ఒక కల గన్నాడు. ముహమ్మద్ ప్రవక్త(స) కలలో కనిపించి, ‘పసికూనపై ఆశలు వదులుకొని నిస్సహాయంగా, దీనంగా, మూగగా విలపిస్తున్న మూగజీవిపై నువ్వు చూపిన దయా దాక్షిణ్యాలు దైవానికి ఎంతగానో నచ్చాయి. ముందు ముందు నీకు రాజయోగం లభించనుంది. ఎప్పుడూ ఇదే వైఖరి కలిగి ఉండు. సాటి మానవుల పట్ల, మూగప్రాణుల పట్ల కరుణతో వ్యవహరించు’. అని చెప్పారు. తరువాత కొన్నాళ్ళకు సుబుక్తగీన్ కల ఫలించింది. అనుకున్నట్లుగానే అతను రాజయ్యాడు. తనజీవితంలో జరిగిన ఈ సంఘటనను జీవితాంతం గుర్తుంచుకొని, జనసంక్షేమమే ధ్యేయంగా మంచి పరిపాలన అందించి గొప్ప పేరుప్రఖ్యాతులు గడించాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అమ్మ ఇక లేరు..
పీఠాధిపతి గాడ్ సతీమణి సీతామహాలక్ష్మి కన్నుమూత శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, భక్తులు వెదురుపాక(రాయవరం) : వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) సతీమణి సీతామహాలక్ష్మి(70) ఆదివారం కన్నుమూశారు. ఉదయం పది గంటల సమయంలో ఒక్కసారిగా ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి), కుటుంబ సభ్యులు సీతయ్యమ్మను రాయవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఆమె మృతదేహాన్ని భక్తుల సందర్శనార్థం పీఠానికి తీసుకుని వచ్చారు. పీఠాధిపతి గాడ్ సీతయ్యమ్మ మృతదేహం వద్ద నివాళులర్పించారు. సీతయ్యమ్మకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇంటి వద్ద నుంచి ఆస్పత్రికి వెళ్లే సమయంలో నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కిన సీతమ్మ అమ్మవారు కొద్ది నిమిషాల్లోనే తిరిగి మృతదేహమై రావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సీతయ్యమ్మను గాడ్‌తో సమానంగా భక్తులు పూజిస్తారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే అధిక సంఖ్యలో భక్తులు పీఠానికి తరలివచ్చారు. కన్నీటి పర్యంతమయ్యారు. కోటిపల్లిలో అంత్యక్రియలు.. సీతమ్మ అమ్మవారి మృతదేహానికి రాజమహేంద్రవరంలోని కోటిలింగాలరేవులో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. గాడ్ సోదరుడు, పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు గాడ్‌ను స్వయంగాను, ఫోన్లోనూ పరామర్శించారు. మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సర్పంచ్ కొండిపూడి సత్యప్రభ ఏసురత్నం, సొసైటీ అధ్యక్షుడు సత్తి వీరవెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ సత్తి హిమరాణిసావిత్రిదేవి, ఎంపీటీసీ సభ్యురాలు కొవ్వూరి సరోజాదేవి, బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు, పలువురు సాహితీవేత్తలు మేడసాని మోహన్, చిలకపాటి రాఘవాచార్యులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
అదే నిజమైన క్రైస్తవం!
సువార్త ప్రత్యుపకారం చేసే స్తోమత లేని దీనులకు చేసే సాయమే విశ్వాసికి అత్యంత ఆశీర్వాదకరమని యేసు ఇలా బోధించాడు. ఒక ధనవంతుడు గొప్ప విందు ఏర్పాటు చేసి పుర ప్రముఖులనందరినీ ఆహ్వానించాడు. అయితే వాళ్లంతా ఏవేవో సాకులు చెప్పి విందుకు రాలేమన్నారు. దాంతో నిరుపేదలు, వికలాంగులనందరినీ విందుకు తోడుకొని రమ్మని తన దాసుని పురమాయించగా, వాళ్లెంతో ఆనందంగా విందుకొచ్చారు. రాజవీధుల్లోని భిక్షగాళ్లను, కంచెల్లో పని చేసే కూలీలను కూడా పిలవమన్నాడతను. అలా కొత్త ఆహ్వానితులతో విందుశాల, అనుకోని ఆహ్వానంతో నిరుపేదల జీవితాలు నిండాయి. ధనికుని హృదయమూ ఆనందంతో నిండిపోయింది (లూకా 14:12–24). గొప్ప వాళ్లంతా అహకారంతో తృణీకరించగా, ఆ అవకాశాన్నే అత్యానందంతో పేదలు, నిర్భాగ్యులు, అణగారిన వారికిచ్చిన దేవుని అద్భుతమైన ప్రేమను వర్ణించిన ఉపమానమిది. విందులో అగ్రస్థానాల్లో కూర్చుని ఆరగించవలసిన వాళ్లు తమ ఆధిక్యతను పోగొట్టుకుంటే, అదే విందులో చివర్న అంట్లు కడిగి, బల్లలు శుభ్రపరచి, అంతా ఊడ్చిపెట్టే అధములను హెచ్చించి, అవే అగ్రస్థానాల్లో కూర్చోబెట్టి విందు చేసిన దేవుని అసమానమైన ప్రేమను వర్ణించే మాటలే లేవు (యాకోబు 4:6). నేల మీద కూర్చోవలసిన వారు ధనికునితో సమానంగా కూర్చొని విందారగించే ఈ సన్నివేశం దేవుని రాజ్యంలో మాత్రమే సాధ్యం. సోషలిజం, కమ్యూనిజంలాంటి వ్యవస్థలు సిద్ధాంతాల్లో మాత్రమే ప్రతిపాదించిన సర్వసమానవత్వాన్ని కేవలం బోధించడమే కాదు, ఆచరించి చూపించిన నిజమైన సమానత్వవాది యేసుక్రీస్తు. దేవుడే మానవధారిౖయె యేసుక్రీస్తుగా దిగివచ్చి, తన పాదధూళితో సమానమైన మానవాళితో సహవసించడం, వారిని అక్కున చేర్చుకోవడం అనూహ్యమైన అంశం. అదే ప్రేమను ప్రతి విశ్వాసీ అలవరచుకోవాలి. విశ్వాసలు ప్రతి చర్యా, మాటల్లో అది ప్రతిబింబించాలి. గొప్ప వారికి గౌరవాన్నిచ్చి అగ్రహోదాలివ్వడం, పేదవారిని ఛీకొట్టడం లోక సంస్కృతి. దీనులు, పేదలు, అణగారిన వారిని అక్కున చేర్చుకోవడం దైవిక నియమం. సమాజంలో గొప్పవాళ్లకు సలాములు చేస్తూ, గులాములుగా బతికే నీచ సంస్కృతికి విశ్వాసులు, ముఖ్యంగా దైవసేవకులు ముందుగా స్వస్తి చెప్పాలి. దేవుని చిరునామాను నిరుపేదల్లో వెదికి, ఆయన గుండెచప్పుడును విలాసాల్లో తేలియాడే ధనికుల జీవితాల్లో గాక మురికివాడల్లో బతికే బడుగువాళ్ల జీవితాల్లో వినడం ప్రతి విశ్వాసీ అలవరచుకున్నప్పుడు ఈ లోకమే పరలోకమవుతుంది.ఈ లెంట్‌డేస్ (శ్రమదినాలు)లోమనం ఆకలితో ఉన్న పేదవాళ్లకు అన్నం పెడదాం, అభాగ్యుల ఆకలి తీర్చుదాం. నీళ్లు తోడి చెరువులో పోయడం అవివేకం, నిష్ఫలమైన కార్యం. నీళ్లు చెట్టుకు పోయాలి, చేనుకు తోడాలి, నీటితో దీనుల దాహం తీర్చాలి. అదే దేవుడు మెచ్చే నిజ క్రైస్తవం!! – రెవ.డాక్టర్.టి.ఎ. ప్రభుకిరణ్ -
విశ్వాస దృక్పథం అంటే అదే!
మనం అడుగకుండానే దేవుడు మనకిచ్చిన అత్యంత అమూల్యమైన కానుక మన జీవితం! మనల్ని పుట్టించడంలో పదిమందీ మన ద్వారా ప్రయోజనం పొందాలన్నది దేవుని సంకల్పం. అలా అందరికీ ఆశీర్వాదకరంగా బతికేవారు తాత్కాలికంగా శ్రమ పడ్డా దేవుడిచ్చే అనూహ్యమైన ఆశీర్వాదాలకు పాత్రులవుతారు. కాని దేవుడిచ్చిన జీవితాన్ని చాలా భద్రంగా బతుకుతూ ఎవరికీ ప్రయోజనం చేకూర్చకుండా తమ కడుపు తాము చూసుకునే బాపతు వారు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో దెబ్బ తినక తప్పదు. అంతా దేవుని నుండి విలువైన ఈవులు కోరుకుంటారు. కాని ఆయన మనకిచ్చిన జీవితాన్ని మించిన విలువైన కానుక మరొకటి లేదు. అందువల్ల ఈ ‘కానుక’కు సంబంధించి దేవునికి ఒక రోజున లెక్క ఇవ్వాల్సి ఉంటుందన్న గ్రహింపుతో జీవిస్తే, పదిమందికీ ఆశీర్వాదకరంగా ఉంటే, దేవుడు తనవంతుగా వెయ్యింతల ఆశీర్వాదాలు జత చేస్తాడు. కాని ‘మా జీవితం–మా ఇష్టం’ అనుకుంటే దేవుని కృపకు దూరమవుతారా, చివరికి అశాంతికి లోనవుతాం. మరి కొందరైతే మహానటులు! దేవుణ్ణి కూడా బోల్తా కొట్టించగలమనుకునే ప్రబుద్ధులు ఎంతో చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటారు కాని నిజానికి వాళ్లు చేసేదల్లా వాళ్ల కోసమే! ఎంతో సౌమ్యంగా మాట్లాడే యేసుక్రీస్తు ఇలాంటి వేషధారులనుద్దేశించి అత్యంత కఠినమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. పక్కనే ఆకలితో అలమటించే వారిని కరుణించరు కాని, రోజూ పావురాలకు పిడికెడు గింజలు విదిల్చి పరలోకంలో బెర్తు కన్ఫర్మ్ చేసుకుందామనుకునే వారి పప్పులు దేవుని వద్ద ఉడకవు. విశ్వాసులు దేవుని హృదయ స్పందనను గ్రహించాలి. ఆకలి కేకలు, దౌర్జన్యం, పీడితుల ఆర్తనాదాలను ప్రతిఘటించాలి. విశ్వాసుల దృక్పథం, వైఖరి, చర్చలు, మాటల్లో ఆత్మీయతే నిస్వార్థత కాదు, సార్వత్రికత ఉండాలి. ఒక పాస్టర్‌ను ఎవరైనా చితకబాదితే వచ్చే ఆగ్రహం, ఒక పూజారిని, మసీదులో ముల్లాను ఎవరైనా కొట్టినా పెల్లుబకాలి! అదే సరైన విశ్వాస దృక్పథం, ఆత్మీయ విజయం!! – రెవ.డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
దురాశకు అంతులేకపోతే దేవుని కృప ఉగ్రతగా మారుతుంది!
• సువార్త అడక్కుండా దేవుడు మనకిచ్చేదెప్పుడూ ఆశీర్వాదకరమైనది. దేవుణ్ణి మనమడిగి తీసుకున్నది మాత్రం ఆశీర్వాదకరమైనది కావచ్చు, కాకపోవచ్చు. అందుకే యేసు ప్రభువు ‘నీ చిత్తమే సిద్ధించుగాక’ అంటూ చేసే ప్రార్థన అత్యంత ఆశీర్వాదకరమైన, శక్తితో కూడిన ప్రార్థన అని బోధించారు (మత్త6:10). మన పరలోకపు తండ్రిౖయెన దేవదేవునికి ఆయన పిల్లలమైన మనపట్ల అద్భుతమైన ప్రణాళికలున్నాయి. అవి యథాతథంగా నెరవేరడం మనకు అత్యంత ఆశీర్వాదకరం. కాని తెలిసీ తెలియక, మొండిగా, తొందరపాటుతో మనం చేసే ప్రార్థనలు ఆయన ప్రణాళికలు, తలంపుల నెరవేర్పునకు ఆటంకాలు కారాదు. ఇశ్రాయేలీయులు చేసిన తప్పు అదే. దేవుడు బానిసత్వం నుండి విముక్తినిస్తే దాని విలువనర్థం చేసుకోకుండా దారిలో ఆహారం సరిగా లేదంటూ సణిగే వారినేమనాలి? గుప్తు కఠిన దాస్యాన్ని దేవుడు దూరం చేస్తే, ఐగుప్తు అన్నమే బావుందంటూ, ఇశ్రాయేలీయులు వాపోవడం వారి మొదటి తప్పు. మన్నాకు బదులు మాంసమివ్వలేడా? అన్న అసంతృప్త భావనతో పరోక్షంగా దేవుని బాహుబలాన్ని శంకించడం వారి రెండవ తప్పు. ఐగుప్తు విముక్తి సమయంలో చూపించిన ప్రేమను దేవుడు అరణ్యమార్గంలో చూపించడం లేదన్న విధంగా మన్నాను తక్కువ చేసి పరోక్షంగా వ్యాఖ్యానించడం వారి మూడవ తప్పు. ఈ తప్పులు అప్పుడెప్పుడో ఇశ్రాయేలీయులు చేసినవే కాదు, ఇప్పటికీ మనం చేస్తున్న తప్పులివి. మనిషికి అంతులేని ఆశలంటారు. అది తప్పు. మనిషి దురాశకు అంతులేదు. అయితే దేవుని కృప కూడా అంతులేనిదే. కాకపోతే మనం పరిమితి దాటితే దేవుని కృప కాస్తా ఉగ్రతగా మారుతుంది. ఆయన ఉగ్రతను భరించడం మనుషులెవరికీ సాధ్యం కాదు. దురాశపడి జీవితంలో బాఉపడి సుఖపడ్డవాళ్లు, ఏదీ ఆశించకుండా దేవుడిచ్చిందే ఆశీర్వాదమనుకొని చెడిపోయిన వాళ్లు లోకంలో ఉండరు. – రెవ.డాక్టర్ టి.ఎ.ప్రభుకిరణ్ -
భారతీయ సంప్రదాయాలు మహోన్నతమైనవి
–మహాసహస్రావధాని గరికపాటి నరసింహరావు కర్నూలు(హాస్పిటల్): ప్రపంచంలోనే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మహోన్నతమైనవని మహాసహస్రావధాని గరికపాటి నరసింహరావు అన్నారు. వికాసభారతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ‘భారతీయ శంఖారావం’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన గరికపాటి నరసింహరావు మాట్లాడుతూ మనం అన్ని దేశాలను, మతాలను గౌరవిస్తూనే మన సంప్రదాయాలను ఆచరించాలన్నారు. గుడితో పాటు గుండెలోనూ దేవుడిని కొలువు చేసుకోవాలని సూచించారు. శాస్త్రం ప్రకారం శివలింగానికే అభిషేకం చేయాలని, ఇతర విగ్రహాలకు అర్చన చేయాలని సూచించారు. ఆంగ్లేయులు మన దేశీయులను శారీరకంగా, మానసికంగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. దానికి కొనసాగింపుగా నేటి ప్రభుత్వాలు మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు భాషను తీసేస్తున్నాయని విమర్శించారు. మాతృభాషను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. హంపి పీఠాధిపతి జగద్గురు విద్యారణ్యభారతి స్వామి మాట్లాడుతూ సంస్కారంతో కూడిన చదువే భవిష్యత్‌కు పునాది అవుతుందన్నారు. మహిళలు సన్మార్గాన్ని చూపే కార్యక్రమాలను టీవీల్లో చూడాలన్నారు. కార్యక్రమంలో వికాసభారతి సంఘటనా కార్యదర్శి నాగేంద్రప్రసాద్, అధ్యక్షుడు సుజాతశర్మ, భారతీయ స్ఫూర్తి కేంద్రం కార్యదర్శి శివప్రసాద్, ఉపాధ్యక్షులు హుసేన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఓటమి నేర్పే పాఠాలు అత్యంత విలువైనవి
• సువార్త యెరికో పట్టణాన్ని అద్భుతంగా స్వాధీనం చేసుకున్న విజయంతో ఆరంభమైన ఇశ్రాయేలీయుల వాగ్దాన దేశ జైత్రయాత్రకు వెనువెంటనే హాయి పట్టణంలో ఎదురైన అత్యంత అవమానకరమైన ఓటమితో బ్రేకులు పడ్డాయి. హాయి చాలా చిన్న పట్టణమైనందువల్ల మూడు వేలమంది సైనికులు చాలునన్న వేగులవారి సమాచారం నమ్మి యెహోషువా అంతేమందితో ఆ పట్టణం మీద దండెత్తాడు. కాని హాయి పట్టణస్తులు వారి సైన్యం ఇశ్రాయేలు వారిని తరిమికొట్టి వారిలో 36 మందిని హతమార్చారు. ఓడిపోయిన యెహోషువా దేవుని సన్నిధిలో మోకరించగా, ఇశ్రాయేలీయుల్లో ఒక వ్యక్తి చేసిన ఆజ్ఞాతిక్రమమనే పాపాన్ని బట్టి యుద్ధానికి తన సన్నిధిని ఇశ్రాయేలీయులతో పంపలేదని, అందుకే బలహీనుల చేతిలో ఓడిపోవలసి వచ్చిందని దేవుడు బదులిచ్చాడు. యెరికో పట్టణాన్నంతా ధ్వంసం చేయాలన్నది దేవుని ఆజ్ఞ కాగా, అక్కడి ఒక మంచి వస్త్రాన్ని, కొంత వెండిబంగారాలను ఆకాను అనే ఇశ్రాయేలు సైనికుడు ఆశించి తీసుకున్నాడని విచారణలో వెల్లడికాగా, యెహోషువా అతనికి అతని కుటుంబానికంతటికీ మరణదండన అమలుపర్చాడు. ఆవిధంగా పాపప్రాయశ్చిత్తం చేసిన తరువాత ఇశ్రాయేలీయులు హాయి పట్టణంపై మళ్లి దాడి చేసి గెలిచి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంత చిన్న విషయాన్ని కూడా దేవుడంత తీవ్రంగా పరిగణిస్తాడా? తద్వారా దేవుడు నేర్పాలనుకున్న గుణపాఠం అత్యంత విలువైనది కాబట్టి దేవుని దృష్టిలో అది తీవ్రమైన విషయమే! యుద్ధంలో 36 మందిని పోగొట్టుకున్నామని మధనపడుతున్న ఇశ్రాయేలీయులకు, ఒక వ్యక్తి పాపం వల్ల అసలు దేవుని సన్నిధినే పోగొట్టుకోవడం మరింత నష్టదాయకమో, బాధాకరమో దేవుడు తెలియజేశాడు. ఇశ్రాయేలీయులు హాయి సైనికులు తమను ఓడించలేదని, దేవుని సన్నిధి తమలో లేని కారణంగా తమను తామే ఓడించుకున్నామని తెలుసుకున్నారు. వాగ్దాన దేశమైన కనానులో యెరికోలాంటి అతి పెద్ద పట్టణమైనా హాయిలాంటి అతి చిన్నదైనా దేవుని సన్నిధి తమలో ఉటే తప్ప ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేమన్న ‘విజయ సూత్రాన్ని’ దేవుని ప్రజలు గ్రహించారు. ఆ గ్రహింపుతోనే కనాను దేశాన్ని అద్భుతంగా ఆ తర్వాత గెలుచుకున్నారు. యుద్ధ వ్యూహంలో వేగులవారి సమాచారం ఆధారంగా కాదు, దేవుని సన్నిధితో బలపడే అనుబంధం ఆధారంగా రూపొందించుకోవాలని వారి నాయకుడుగా యెహోషువా నేర్చుకున్నాడు. పాపం చేసి ఇశ్రాయేలీయుల ఓటమికి కారకుడైన ఆకాను ఉదంతం ఇప్పటికీ విశ్వాసులందరికీ ఒక హెచ్చరిక. వాగ్దాన దేశ జైత్రయాత్రలో ఎన్నో విలువైన అంశాలు కనిపించవచ్చు. అయితే వాటన్నింటికన్నా దేవుని సన్నిధే అత్యంత విలువైనదని అది లేకుండా బలహీనుల చేతిలో కూడా ఓడిపోవలసి ఉంటుందని దేవుడు వారికి నేర్పించాడు. హాయిలో ఓడినంత మాత్రాన వాగ్దాన దేశమంతా పోగొట్టుకున్నట్టు కాదని, జీవితాన్ని సరిచేసుకోవడం ద్వారా ప్రతి ఓటమినీ అధిగమించి మహావిజయం వైపు సాగవచ్చునని కూడా ఈ ఉదంతం తెలుపుతోంది. వాగ్దాన దేశ జీవితానికి అవసరమైన అత్యంత విలువైన పాఠాలను దేవుడు యెరికో మహా విజయం ద్వారా, హాయి ఓటమి ద్వారా కూడా నేర్పించాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి విశ్వాసి పరిశుద్ధత విషయంలో ఆయన రాజీపడడు. ఇంట్లోని కుక్క లేదా పిల్లి లాంటి పెంపుడు జంతువు నట్టింట్లో ‘అశుద్ధం’ చేస్తే, ఇంటిని శుభ్రపర్చుకోకుండా అందులో జీవించగలమా? దేవుని సన్నిధి నుండి మనల్ని దూరం చేసే పాపాన్ని కూడా వెంటనే ప్రక్షాళనం చేసుకోవాలి. అప్పుడే విజయం, ఆనందం, ఆశీర్వాదం! – రెవ.డాక్టర్.టి.ఎ. ప్రభుకిరణ్ -
లోక కల్యాణమే పీఠాల ధ్యేయం
మనిషిని ‘మనీషి’ చేసేది పీఠాధిపతులే గాడ్ 81వ జన్మదిన వేడుకల్లో ‘మండలి’ రాయవరం (మండపేట) : మనిషిలో మానవత్వాన్ని మేల్కొలిపి మనిషిని ‘మనీషి’గా తీర్చిదిద్దేది పీఠాధిపతులేనని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) 81వ జన్మదిన వేడుకలను గురువారం పీఠంలో ఘనంగా నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ జీఆర్ఎస్రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ లోక కల్యాణమే పీఠాల లక్ష్యమన్నారు. గాడ్ సందేశాన్ని జీవితాలకు అన్వయించుకుని మంచి మార్గంలో నడవాలన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు, రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ రావులపాటి సీతారామారావు, పేథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కేఎస్ రత్నాకర్ తదితరులు మాట్లాడుతూ విజయదుర్గా పీఠం ఆధ్యాత్మికతకు కేంద్రబిందువుగా భాసిల్లుతోందన్నారు. పీఠంలో ఆత్మీయత, అనురాగం, ఆప్యాయతలు లభిస్తాయన్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, వేదగణిత సంస్థ నిర్వాహకులు డాక్టర్ రేమెళ్ల అవధాని, దేవాదాయ శాఖ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ చిలకపాటి రాఘవాచార్యులు, ‘సాగరఘోష’ కవి గరికపాటి నరసింహారావు, టీటీడీ అవధాన చక్రవర్తి డాక్టర్ మేడసాని మోహన్, టీటీడీ ప్రెస్, ప్రింటింగ్ శాఖాధిపతి ప్రయాగ రామకృష్ణ, టీటీడీ కళ్యాణమస్తు ప్రోగ్రామ్ పండితుడు డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు మాట్లాడారు. పీఠం తరఫున ఇచ్చే ఉత్తమ ఆదర్శ దంపతుల పురస్కారాన్ని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సోదరుడు పీవీ మనోహరరావు దంపతులకు అందజేశారు. సభలో వేదపండితుడు డాక్టర్ రేమెళ్ల అవధాని రచించిన ‘సంక్షిప్త శబ్దవేగం’ పుస్తకాన్ని ఐవైఆర్ కృష్ణారావు ఆవిష్కరించారు. సాహితీవేత్త యర్రాప్రగడ రామకృష్ణ, పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు సభానిర్వహణ చేశారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి.. ప్రతి ఒక్కరూ ధర్మ, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, మంచి ఆలోచనలు చేసే వారికి దైవకృప తోడుగా ఉంటుందని పీఠాధిపతి గాడ్ అన్నారు. భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ మంచి పనులు చేసేవారికి అమ్మదయ ఎన్నడూ ఉంటుందన్నారు. లోక కళ్యాణం కోసం నిత్యం పీఠంలో అనేక హోమాలు, పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు.. జిల్లా నలుమూలల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పీఠంలోని విజయదుర్గా అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారిని నయనానందకరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు గాడ్‌కు పాదపూజ చేశారు. కార్యక్రమంలో వస్త్రవ్యాపారి తుమ్మిడి రామ్‌కుమార్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి అసోసియేట్ రీజనల్ కో ఆర్డినేటర్ కందర్ప హనుమాన్, దేవాదాయశాఖ ఏసీ రమేష్‌బాబు, వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. అనపర్తి సీఐ శీలబోయిన రాంబాబు పర్యవేక్షణలో రాయవరం, అనపర్తి, మండపేట, రామచంద్రపురం ఎస్సైలు వెలుగుల సురేష్, కిషోర్‌బాబు, నసీరుల్లా, నాగరాజు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. పీఠంలో భక్తులకు పీఠం పీఆర్వో వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. -
ముక్కోటి పూజల్లో భక్తకోటి
-
అహంకారం చీకటికన్నా ప్రమాదకరం
దురహంకారం, మూర్ఖత్వం కవలపిల్లలు. విషాదమేమిటంటే తన మూర్ఖత్వమే తనకు గొయ్యి తవ్వుతుందన్నది దురహంకారికి తెలియదు. ఈజిప్టు చక్రవర్తి ఫరో దురహంకారి, పరమమూర్ఖుడు కూడా! అక్కడ నాలుగొందల ఏళ్లుగా బానిసలుగా దుర్భర జీవితాన్ననుభవిస్తున్న ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో విడుదల చేయించడానికి దేవుడే పరోక్షంగా ఫరో మూర్ఖత్వం, దురహంకారంతో పోరాడవలసి వచ్చింది. ఇశ్రాయేలీయులు అక్కడ బానిసలే అయినా తమ ప్రతిభాపాటవాలతో, శ్రమతో ఈజిప్టు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. వాళ్లు దేశం వదిలివెళ్లిపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భయంతో ఫరో వారిని విడుదల చేయడానికి ససేమిరా అన్నాడు. ఈజిప్టు ప్రజలు, జంతువుల తొలి సంతానాన్ని దేవుడు హతం చేయడంతో ఫరో దిగి వచ్చి ఇశ్రాయేలీయులను పోనిచ్చాడు. అయితే దేవుడు దూరదృష్టితో వారిని కనానను దేశానికి దర్గరి దారిలో కాక, ఎర్రసముద్రం అడ్డుగా ఉన్న చుట్టు దారిలో నడిపించాడు (నిర్గమ 13: 17,18). ఇశ్రాయేలీయులను వదిలినట్టే వదిలి మనసు మార్చుకొని మూర్ఖత్వంతో వారి సంహారానికి ఫరో తన సైన్యంతో బయలుదేరాడు. ముందు సముద్రం, వెనుక ఫరో సైన్యంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యిలో ఉన్న ఇశ్రాయేలీయులకు, సముద్రాన్ని రెండు పాయలు చేసి మధ్యలో దారిని ఏర్పరచి, దేవుడు వారిని ముందుకు నడిపించాడు. అంతదాకా ఇశ్రాయేలీయులకు నీడనిస్తూ, దారి చూపిస్తున్న మేఘస్తంభాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఫరో సైన్యానికి మధ్యలో పెట్టాడు. అకారణంగా వారిని తరుముతూ వస్తున్న ఫరో సైన్యానికి తాము ఎర్ర సముద్రంలోకి వచ్చామన్నది తెలియలేదు. ఇశ్రాయేలీయులంతా సముద్రపు దారిని దాటేటప్పటికి ఫరో సైన్యం ఆ దారిలో సముద్రం మధ్యలో ఉంది. దేవుడు తిరిగి మేఘస్తంభాన్ని తొలగించి ఇశ్రాయేలీయులకు ముందు పెట్టినప్పుడు కాని ఫరోకు తామెంత ప్రమాదంలో చిక్కుకున్నామో అర్థం కాలేదు. కాని తప్పించుకునే మార్గం లేదు. దేవుడు సముద్రజలాల్ని యధాతథం చేయడంతో ఫరో, అతనితో పాటున్న వేలాదిమంది సైనికులు జలసమాధి అయ్యారు. అలా ఇశ్రాయేలీయులకున్న శత్రుభయమనేది లేకుండా పోయింది. ఈ ఉదంతం రెండు విషయాలు స్పష్టం చేస్తుంది. దగ్గరి దారులుండగా వాటిని కాదని దేవుడు చుట్టు దారిన నడిపిస్తున్నాడన్నా, ఎదురుచూస్తున్న ఆశీర్వాదాన్నివ్వడంలో ఆలస్యం చేస్తున్నాడన్నా, దాంట్లో ఒక మహాగొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడన్నది మొదటి విషయం. తాను బలవంతుడనని దురహంకారంతో ఎంత విర్రవీగినా దేవుడు తలుచుకుంటే చివరికి మట్టి కరిచి చరిత్రహీనుడు కాక తప్పదన్నది రెండవ అంశం. ప్రతికూలత ఎదురైనప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు, అనుకున్నవి అనుకున్నట్లుగా సాగనప్పుడు కృంగిపోకుండా, దేవుడు చుట్టుదారిలో నడిపించినా తుదకు ఆశీర్వాదకరమైన గమ్యానికే చేర్చుతాడని మనం నమ్మాలి. ఫరో బలం ముందు బానిసలైన ఇశ్రాయేలీయులెంత? కాని ఇశ్రాయేలీయుల వెనుక దేవుని బలం ఉన్నదని, ఆ బలాన్ని తానెదుర్కోలేనన్న వివేచనను ఫరో తన దురహంకారం కారణంగా కోల్పోయి దిక్కులేని వాడిలాగా దుర్మరణం చెందాడు. రాత్రి చీకటున్నా పగలు వెలుగుంటుంది. కాని దురహంకారి జీవితంలో పగలు, రాత్రి కూడా చీకటే, అనుక్షణమూ అశాంతే! ఫరో దురహంకార నిర్ణయానికి వేలాదిమంది సైనికులు బలైనట్టే, కొందరు నాయకుల మూర్ఖత్వం, దురహంకారం మొత్తం దేశాన్ని అశాంతిమయం చేయడం ఇప్పుడూ చూస్తున్నాం. కొండను కూడా పెకిలించగల శక్తి మంచితనానిది, మృదుత్వానిదైతే, ఉన్నట్టుండి కొండంత అశాంతికి గురి చేసే శక్తి దురహంకారానిది!! – రెవ.డాక్టర్.టి.ఎ. ప్రభుకిరణ్