ఇంత పారవశ్యమా, ఇలాంటి వీడియో మీరెపుడూ చూసి ఉండరు | Monkey chanting started playing devotion of God video going viral | Sakshi
Sakshi News home page

Monkey: ఇంత పారవశ్యమా! అటు భక్తులు,ఇటు నెటిజన్లు ఫిదా

Published Fri, Oct 15 2021 4:14 PM | Last Updated on Fri, Oct 15 2021 9:26 PM

Monkey chanting started playing devotion of God video going viral - Sakshi

దసరా పండుగ వేళ సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియో వైరల్‌గా మారింది. ఒక కోతి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఏకంగా ఒక సాధువు ఒడిలో  కూర్చున్న వానరం  లయబద్ధంగా కర్తల్ ప్లే చేసి అక్కడున్న వారినందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తేసింది.  ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా స్వయంగా ఆ రాముడి కోసం  దిగి వచ్చిన  హనుమాన్‌ అంటూ ముగ్ధులవుతున్నారు.

ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఒక కోతి భజన చేస్తున్న సాధువుల  చెంతకు చేరింది. వారితో పాటు భక్తి కీర్తనల్లో మునిగియంది. తాళానికి కనుగుణంగా భజనలో ఒక వాయిద్యాన్ని వాయిస్తూ ఆనందంలో మునిగిపోయింది. దీంతో సోషల్ మీడియా యూజర్లు ఫిదా అయితున్నారు. ఇది  హనుమంతుడి రూపమే అంటూ మురిసి పోతున్నారు. ఇంత పారవశ్యామా ఇలాంటి కోతిని తాను ఎన్నడూ చూడలేదు అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. చాలా ఆనందంగా ఉందంటూ మరో యూజర్‌ వ్యాఖ్యానించడం  విశేషం. పంకజ్ పరాశర్ తన  ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను లక్షలాది మందికి వీక్షించగా, 30 వేల మంది షేర్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement