devotional
-
అగ్నిగుండాలతో ముగిసిన కొమురవెల్లి మల్లన్న జాతర (ఫొటోలు)
-
శ్రీశైలం : కర్ణాటక,మహారాష్ట్రాల నుంచి పాదయాత్రగా వేలాది భక్తులు (ఫొటోలు)
-
ఏపీలో ప్రసిద్ధ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం.. ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
అడవులకే వెళ్ళాలా? మనసే కీలకం!
పూర్వం అనుభవజ్ఞులైన ఆలోచనాపరులు జీవితానికి సంబంధించి వివిధ దశలలో వివిధ నియమాలను, జీవన పద్ధతులను నిర్దేశించి చెప్పి, ఆ పద్ధతుల ప్రకారం జీవనం సాగిస్తే జీవితం సాఫీగా సాగడమే కాకుండా, ఇహలోకం నుండి నిష్క్రమించడం కూడా అంతగా బాధ అనిపించకుండా జరుగుతుందని చెప్పారు. ఆ పద్ధతులలో ఒక వ్యక్తి గృహస్థుడిగా జీవితాన్ని గడిపి, నిర్వర్తించాల్సిన ధర్మాలన్నిటినీ నిర్వర్తించాక, వృద్ధాప్యంలో సన్యాసాశ్రమం స్వీకరించి అడవులకు వెళ్ళిపోయి, శేషజీవితం అక్కడ గడిపి ప్రశాంతంగా ఇహలోకాన్ని వదిలి ప్రకృతిలో కలిసి పొమ్మన్నారు. అయితే, సన్యాసం స్వీకరించడం అందరూ చేయగలిగే పని కాదనీ, ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న బంధాలను ఒక్కసారిగా తెంచు కుని వెళ్ళిపోవడం ఏ కొద్దిమందికో మాత్రమే సాధ్యమయ్యే పనీ అని ఆచరణలో తేలింది. ఫలితంగా, అడవులకే వెళ్ళాలా? అన్న ప్రశ్న ఉదయించి, అన్నిటికీ మనసే మూలం కనుక, మనసు చేసే ఆలోచనలను కట్టడి చేస్తే, అడవులకు వెళ్ళవలసిన పనిలేదని చెప్పుకోవడం జరిగింది. ఈ విషయంపై దంతులూరి బాపకవి రచించిన ‘మూర్తిత్రయో పాఖ్యానము’ ద్వితీయాశ్వాసంలో ఆసక్తికరమైన వివరణ ఉంది. ‘ఇల్లు వదిలిపెట్టి అడవులలోకి అడుగుపెట్టగానే కామ సంబంధమైన ఆలో చనలు కరిగిపోయి, బుద్ధి నిష్కామమై మిగులుతుందా? మిగలదు కదా! అలాగే క్రోధ మోహ మద మాత్సర్యాలనే లక్షణాలు కూడా జీవితంలో ఏదో ఒక క్షణం నుండి మొదలై, మరొక క్షణంలో అంత మవ్వాలని కోరుకున్నప్పుడు అంతమయ్యేవిగా ఉండవు. ఒకవేళ ఎవరైనా అలా అనుకుంటే, తాను అలా అయిపోయానని అంటే... అతడిని మించిన మోసగాడు మరొకడు ఉండడు!’ అన్నది ఆ వివరణ సారాంశం. ఆ సందర్భంలో ముఖ్య విషయానికి ముక్తాయింపుగా ఈ క్రింది పద్యం చెప్పబడింది.చదవండి: UoH వర్సిటీ భూములను కాపాడాలి! తే. మనసు నిలుపలేని మనుజుండు వనములోనున్నయంత మోక్షయుక్తి లేదువహ్నిలోన నెన్ని వారముల్ వైచినంగుప్యమునకు హేమగుణము గలదె? ‘మనసును కట్టడి చేసుకోలేకపోతే అడవిలో ఉండి కూడా ప్రయో జనం ఏమీ కలగదు. అగ్నిలో ఎన్ని వారాల పాటు మండించి కరి గించినా కుప్యం (బంగారం, వెండి తక్క అన్యలోహం) బంగారమవు తుందా? కాదు కదా! ఆ విధంగానే ఆలోచనలను అదుపులో ఉంచు కోకుండా కొనసాగించే అడవులలో జీవనం ప్రయోజనం లేనిదిగా పరిణమిస్తుంద’ని భావం.ఇదీ చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?– భట్టు వెంకటరావు -
వేములవాడ రాజన్న ఆలయంలో అత్యంత వైభవంగా శివ కల్యాణం (ఫొటోలు)
-
సర్వమతాల భక్తులు కొలిచే సాగర్ మాత
సర్వ మతాల భక్తుల కోర్కెలు తీర్చే క్షేత్రంగా వెలుగొందుతోంది సాగర్ మాత ఆలయం. ఈ ఆలయం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం తీరంలో ఉంది. సాగర్మాత మహోత్సవాలను ఏటా మార్చి 7, 8, 9 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా పలు రాష్ట్రాల నుంచి భక్తులు హాజరవుతారు. విదేశీయులు సైతం ఈ ఉత్సవాలకు హాజరుకావడం విశేషం. ఉత్సవాల సమయంలోనే కాకుండా.. ప్రతి ఆదివారం భక్తులు ఆలయానికి వస్తుంటారు.ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగర్మాత (Sagar Matha) ఆలయానికి రాష్ట్రంలోనే విశిష్టత ఉంది. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా మందిర నిర్మాణం, గోపురంపై విగ్రహ సంపద రూపుదిద్దుకున్నాయి. భారతీయ చిత్రకళా నైపుణ్యం వీటిలో కనిపిస్తుంది. సాగర్ ఒడ్డున వెలిసిన మేరీమాత.. సాగర్మాత పేరుతో క్రైస్తవులతో పాటు హిందువులు, ముస్లింలు తదితర అన్ని మతాల నీరాజనాలను అందుకుంటోంది. భారతీయ సంప్రదాయ రీతుల్లో నిర్మాణం ఈ ఆలయం దేశంలోనే భారతీయ సంప్రదాయ రీతులలో నిర్మించిన తొలి క్రైస్తవ మందిరంగా చెబుతారు. ధూప, దీప, నైవేద్యాలు, తలనీలాలు సమర్పించటం వంటి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమాలన్నీ పూర్తిగా హిందూ పద్ధతిలో జరిగే క్రైస్తవ ఆలయం కావడం విశేషం. కోర్కెలు తీరిన భక్తులు జీవాలను బలి ఇస్తారు. సాగర తీరంలో వంటలు చేసుకొని ఆరగించి వెళ్తారు. సాగర్‌లో పయనించే నావికుడు.. రాత్రి వేళల్లో నక్షత్రాల సహాయంతో ఓడను నడిపి గమ్యస్థానం చేరినట్లు.. పాపపంకిలమైన లోకమనే సముద్రంలో మానవునికి మంచి అనే దారి చూపేందుకు మరియమాత నక్షత్రంగా ప్రకాశిస్తుందని.. భక్తులు చెబుతారు. ఆ నమ్మకంతోనే దీనికి సాగర్మాత మందిరం అని పేరు పెట్టారు. చదవండి: ఈ చిన్నారి పేరు దేశమంతా మారుమోగిపోతోంది!ఈ మందిరానికి 1977 అక్టోబర్ 10వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అప్పటి గుంటూరు మండల పీఠాధిపతి కాగితపు మరియదాసు ప్రారంభోత్సవం చేశారు. దీని నిర్మాణానికి మరియదాసుతో పాటు ముమ్మడి ఇగ్నేషియన్, తాను గుండ్ల బాలశౌరి విశేష కృషి చేశారు.ఆకట్టుకుంటున్న జపమాల స్థలాలు 2011 మార్చి 6న కృష్ణానదీ (Krishna River) తీరంలో నిర్మించిన జపమాల క్షేత్రాన్ని గుంటూరు పీఠాధిపతులు గాలిబాలి ప్రారంభోత్సవం చేశారు. ఏసుక్రీస్తు జననం నుంచి మరణం వరకు ఆయన జీవిత చరిత్ర గురించి ఏర్పాటు చేసిన 20 జపమాల స్థలాలు, ధ్యానమందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 2024లో సాగర్మాత ఆలయంపై, ఆలయంలోని 14 స్థలాల విగ్రహాలపై దేవదూతల విగ్రహాలను విచారణ గురువులు హృదయ్‌కుమార్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సాగర్‌మాతకు కొబ్బరికాయ కొట్టి అగర్బత్తీల హారతి, తలనీలాలు సమర్పించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. పుణ్యస్నానాలు చేసి ప్రార్థనలు జరుపుతారు. -
నెల్లూరులో వైభవంగా శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి రథోత్సవం (ఫొటోలు)
-
వరంగల్ జిల్లా : అట్టహాసంగా ప్రారంభమైన కొమ్మాల జాతర (ఫొటోలు)
-
భద్రాచలం : సీతారాముల కల్యాణ పనులు ఆరంభం (ఫొటోలు)
-
కన్నులపండువగా ధర్మపురి శ్రీలక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం (ఫొటోలు)
-
వైభవంగా పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం (ఫొటోలు)
-
యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం (ఫొటోలు)
-
దైవ భూమిలో ఇటువంటి ఏనుగుల గురించి తెలుసా? (ఫొటోలు)
-
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..పులకించిన భక్తజనం (ఫొటోలు)
-
శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
మల్లన్నగుట్టే.. చిన్న శ్రీశైలం
రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిధానపల్లి (Nidhanapalle) గ్రామ శివారులోని మల్లన్నగుట్ట (mallanna gutta) చిన్న శ్రీశైలంగా పేరొందింది. గుట్టపై ఉన్న ప్రధాన దేవాలయంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి కొలువై ఉన్నాడు. క్షేత్రం ఎగువభాగంలోని గుహాంతరాళమున మహామునుల తపో స్థలములు, స్వామివారి పుట్టులింగములు ఉండటం మల్లన్నగుట్ట ప్రత్యేకత. మునుల తపస్సు చేత ప్రసిద్ధి చెందిన గుట్టపై కొలువై ఉన్న మల్లికార్జునస్వామి భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రజల నమ్మకం. ప్రతీ సంవత్సరం మాఘమాసం బహుళ త్రయోదశి నుంచి పాల్గుణమాసం విదియ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తారు. గుట్టపై నిద్రిస్తే రోగాలు మాయం మల్లన్నగుట్టపై సువిశాలమైన మైదానం ఉంది. హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పరిసర గ్రామాల ప్రజలు వివిధ పర్వదినములలో స్వామివారి దర్శనం కోసం పరితపిస్తుంటారు. నూతన కార్యక్రమాలను గుట్టపై గల దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రారంభిస్తారు. ఎంతటి క్లిష్టమైన ఆపదల నుంచైనా భగవంతుడు తమను రక్షిస్తాడని భక్తుల ప్రగాఢమైన నమ్మకం. గుట్టపై నిద్రచేస్తే ఆయురారోగ్యములు, భోగ భాగ్యాలు పొందుతామని ప్రజలు విశ్వసిస్తారు. కోనేరు నీటితో సకల శుభాలు గుట్టపైకి వెళ్లేమార్గంలో సహజ సిద్ధమైన కోనేరు ఉంది. కోనేటిలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది. కోనేటి నీటిని ప్రజలు పరమ పవిత్రంగా భావిస్తారు. కోనేటిలోని నీటిని తీసుకెళ్లి పంటలపై చల్లితే చీడపీడలు తొలగి పంటలు సమృద్ధిగా పండుతాయని, పశువులపై చల్లితే పుష్కలంగా పాలు ఇస్తాయని, రోగాలు మాయమవుతాయని ప్రజల విశ్వాసం. మెరుగైన రోడ్డు సౌకర్యం నిధానపల్లి మల్లన్నగుట్ట(చిన్న శ్రీశైలం) చిట్యాల– భువనగిరి రోడ్డుకు సమీపంలో ఉంటుంది. గుట్టపైకి వాహనాలు వెళ్లడానికి ఘాట్‌రోడ్డు ఉంది. వాహనాల పార్కింగ్‌కు విశాలమైన మైదానం ఉంది. గత ఏడాది మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన సొంత డబ్బులతో ప్రధాన దేవాలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయడానికి బండరాళ్లను తొలగింపజేశారు. (Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?) ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాల వివరాలు ఈనెల 26న గణపతి పూజ, స్వస్తివాచనము, అంకురార్పణ, బ్రహ్మకలశ స్థాపనలు, ధ్వజారోహణం, ఉత్సవాల విగ్రహాలు గుట్టపైకి వేం చేయుట 27న స్వామివారి ఆర్జిత సేవలు, ప్రభోత్సవం, షావలు, రాత్రి కల్యాణ మహోత్సవం 28న రుద్ర చండీహవనం, అన్న ప్రసాద వితరణ, వీరభద్రేశ్వరస్వామి పూజ, ఖడ్గాలు, ప్రభల ఊరేగింపు, భద్రకాళి అమ్మవారి పూజ తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం 29న గెలుపు, మహదాశీర్వచనములు ఉంటాయి.చదవండి: కనువిందు.. ఇందూరు చిందు అత్యంత మహిమాన్వితుడు మల్లన్నగుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి పట్ల పరిసర ప్రాంత ప్రజలకు అపారమైన నమ్మకం. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు అత్యంత మహిమాన్వితుడు. బాధల నుంచి విముక్తి కలిగించే దైవమని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. –బేతోజు సత్యనారాయణశాస్త్రి, ప్రధానార్చకుడు చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్ -
హరహర మహదేవ..కాలినడకన శ్రీశైలం చేరుకుంటున్న భక్తులు (ఫోటోలు)
-
శ్రీశైలం : నల్లమల అడవుల్లో పాదయాత్రగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)
-
పెద్దగట్టు జాతర : కేసారం చేరిన దేవరపెట్టె..నేడు జాతర ముగింపు (ఫొటోలు)
-
యాదగిరిగుట్ట క్షేత్రంలో వైభవంగా గిరిప్రదక్షిణ.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభ (ఫొటోలు)
-
హైదరాబాద్ లో అరుదైన అర్ధనారీశ్వర దేవాలయం..ఎక్కడో తెలుసా.? (ఫొటోలు)
-
దురాజ్‌పల్లి : వైభవంగా లింగమంతుల స్వామి జాతర (ఫొటోలు)
-
మినీ మేడారం జాతర మూడో రోజు భక్తుల రద్దీ (ఫోటోలు)
-
వైభవంగా మినీ మేడారం జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
శ్రీ గజ్జలమ్మదేవి వార్షికోత్సవాలు బోనాలు సమర్పించిన భక్తులు (ఫొటోలు)
-
గుణదల మేరీమాత ఉత్సవాలు..వేలాదిగా తరలివస్తున్న భక్తజనం (ఫొటోలు)
-
ఆంధ్రప్రదేశ్ : ఏడాదిలో రెండు రోజులు మాత్రమే దేవాలయ దర్శనం
ఆత్మకూరు : ప్రముఖ శైవక్షేత్రాల్లో బండి ఆత్మకూరు మండల పరిధిలోని నల్లమల అడవిలో వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వరక్షేత్రం ప్రసిద్ధి చెందింది. కాకతీయ, విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయాన్ని పునఃనిర్మించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. దక్షిణ భారత నిర్మాణశైలిని ఆలయంలో గమనించవచ్చు. ఈ క్షేత్రాన్ని చూడాలంటే ఏడాదికి రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. శివరాత్రి వరకు ఈ క్షేత్రానికి వచ్చే పరిస్థితి లేదు. ఆలయంలో మహాశివుడే బ్రహ్మేశ్వరుడి రూపంలో కొలువై ఉన్నారు. ద్వాపరయుగంలో మహాభారత కురుక్షేత్ర సంగ్రామం అనంతరం అశ్వత్థామ.. శ్రీకృష్ణుడి ఆదేశానుసారంతో గుండ్లకమ్మ నది జన్మస్థానతీరాన శివలింగాన్ని ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం. ఆలయంలో గుండ్లబ్రహ్మేశ్వరస్వామితో పాటు రాజరాజేశ్వరిదేవి, అశ్వత్థామ, వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, నవగ్రహాలు కొలువై ఉన్నాయి. శివరాత్రి మినహా మరొకరోజు మాత్రమే ఆలయాన్ని దర్శించుకునేందుకు అటవీశాఖ అధికారులు అనుమతిస్తారు.ప్రకృతి రమణీయత..గుండ్ల బ్రహ్మేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఎన్నో వృక్షాలు, జంతువులు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో 353 వృక్షజాతులు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పులులు, మచ్చలపిల్లి, ఉడతలు తదితర జంతువులు, దుప్పులను చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 23 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. దేవాలయం సమీపంలో గుండ్లకమ్మ నది నంద్యాల, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాలో ప్రవహిస్తుంది. ఈ నదిపై కందుల ఓబుళరెడ్డి గుండ్లకమ్మ జలాశయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ జలాశయంతో ప్రకాశం జిల్లా పరిధిలో అనేక గ్రామాలకు తాగు, సాగునీరు అందుతోంది.ఇలా చేరుకోవచ్చు..వెలుగోడు మీదుగా గట్టుతండా నుంచి నేరుగా ఈ క్షేత్రాన్ని ట్రాక్టర్లు, వివిధ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. గతంలో ఆర్టీసీ బస్సులు, అన్ని వాహనాల్లో ఈ క్షేత్రానికి వెళ్లేవారు. తెలుగుగంగ రిజర్వాయర్‌ను నిర్మించడం, పులుల సంరక్షణ కేంద్రంగా ఈ క్షేత్రాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించి.. ఈ రహదారిని మూసి వేశారు. ఈ రహదారిని ఈ యేడాది మహాశివరాత్రి సందర్భంగా అనుమతించాలని అటవీశాఖ అధికారులకు భక్తులు విన్నవించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి దృష్టికి కూడా భక్తులు తీసుకెళ్లారు. ప్రస్తుతం నంద్యాల, వెలుగోడు, ఆత్మకూరు నుంచి సంతజూటూరు గ్రామం నుంచి పెద్దదేవలాపురం గ్రామం మీదుగా ఈ క్షేత్రానికి వెళ్లవచ్చు. నంద్యాల నుంచి గాజులపల్లె మీదుగా గిద్దలూరు సమీపంలోని దిగువమెట్ట వద్ద దిగి నేరుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. నంద్యాల నుంచి దిగువమెట్ట మీదుగా గుండ్ల బ్రహ్మేశ్వరానికి అన్నిరకాల వాహనాలు వెళ్తాయి. దూరం 42 కి.మీ ఉంటుంది. ఈ కేత్రానికి చేరాలంటే అటవీశాఖ అధికారులు అనుమతి తీసుకోవాలి. వారు కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. వాహనాలు ఉదయం 6 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు తిరిగి రావాల్సి ఉంటుంది.ప్రతి ఒక్కరూ సందర్శించాలినల్లమల అటవీ పరిధిలోని గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిందే. ఈ క్షేత్రంలో వెలిసిన రాజరాజేశ్వరిమాతను పూ జించాలి. ఈ క్షేత్రానికి ఒకప్పుడు వెలుగోడు, సంతజూటూరు, గిద్దలూరు మీదుగా వేలాది మంది భక్తులు కార్తీకమాసం, మాఘమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో వెళ్లేవారు. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్ పులుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయడంతో మహాశివరాత్రి సందర్భంగా రెండు రోజులు మాత్రమే అనుమతిస్తున్నారు. దేవాలయం అభివృద్ధి చెందాలంటే భక్తులను అనుమతించాలి. ఇక్కడ గుండ్ల బ్రహ్మేశ్వరస్వామిని దర్శిస్తే అనేక జన్మల పుణ్య ఫలితం ఉంటుంది.– కృష్ణశర్మ, ఆలయ పురోహితుడురెండు రోజులు మాత్రమేనల్లమల అభయారణ్యంలో గుండ్ల బ్రహ్మేశ్వరం క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది పులుల సంరక్షణ కేంద్రం కావడంతో ఎవరినీ అనుమతించం. కేవలం మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే ప్రకాశం, కర్నూలు జిల్లాల భక్తులను రెండు రోజులు మాత్రమే అనుమతిస్తాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.– ఉదయ్‌దీప్,గుండ్ల బ్రహ్మేశ్వరం రేంజ్ ఆఫీసర్ -
వరంగల్ : కాళేశ్వరంలో అంగరంగవైభవంగా మహాకుంభాభిషేకం (ఫొటోలు)
-
కరీంనగర్ : రమణీయం..శ్రీనివాస కల్యాణం (ఫొటోలు)
-
కరీంనగర్ : వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు..వైభవంగా ఎదుర్కోలు వేడుక (ఫొటోలు)
-
నార్కట్‌పల్లి : అంగరంగ వైభవంగా చెర్వుగట్టు రామలింగేశ్వరుడి కల్యాణోత్సవం (ఫొటోలు)
-
భక్తజనం మధ్య వైభవంగా దేవుని కడప క్షేత్రంలో రాయుని రథోత్సవం (ఫొటోలు)
-
అరసవిల్లి ఎల్లొద్దాం పదర్రా !!
ఓరి సూర్నారాయనా... ఓసి ఉషా..పదర్రా బేగి బయలుదేరితే అరసవిల్లి ఎల్లి ఎలిపొద్దుము.. ఈరోజు అసలే రథ సప్తమి. అలాగ వెళ్లి... దేముడికి దండం పెట్టిసి వచ్చిద్దుము... గాబరా పెడుతున్నాడు సురేసు... ఓరి గుంటడా ఒట్టి నీళ్ళు కాదురా బుర్రమీద రేగిపళ్ళు... జిల్లేడు ఆకు పెట్టుకుని పోసుకోరా పెరట్లొంచి మనవడు ఆదిత్య మీద కేకేసింది నానమ్మ సూరమ్మ.. ఏటే నాయినమ్మా పొద్దుట నుంచి గొల్లు గొల్లు పెడతన్నావు.. చిరాకు పడ్డాడు ఆదిత్య . గొల్లు కాదురా పిక్కిరోడా మన ఊరి దేముడు లోకానికే నాయకుడు ..ప్రపంచానికి దారి చూపే నాయకుడు.. యేటనుకున్నావు చెబుతోంది నానమ్మ పొయ్యిమీంచి నీళ్ళు దించుతూ... ఒసే.. పల్లకోయే నువ్వాన్నీ ఇలాగే సెప్తవు. సిరాకు పడ్డాడు బుడ్డోడు ఆదిత్య.. అవునురా నీకేకాదు..మీ నాన్నకు కూడా ఇలాగే నీళ్ళు పోసేదాన్ని.. మన ఊళ్లో ఆన్న సూర్యనారాయణ స్వామి మన శిక్కోలుకు ఆస్తి. ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుడు మన ఊళ్లో ఉండడం అంటే గొప్ప కాదేట్రా అంది.. పిల్లాడి నెత్తిన జిల్లేడు ఆకులు పెడుతూ అవునే నానమ్మ.. ఈ జిల్లేడు ఆకుల ఎందుకే.. చిన్నప్పటి నుంచి నెత్తి మీద పెట్టి నీళ్ళు పోస్తావు అన్నాడు ఆదిత్య.. ఒరేయ్ ఇవి వట్టి ఆకులు కాదురాజిల్లేడు ఆకుల స్నానానికి ఆధ్యాత్మికంగానే కాదు, శాస్త్రీయంగా కూడా విశిష్టత ఉంది. ఈ ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని నెత్తిమీద పెట్టుకుని స్నానం చేస్తే ఒంట్లో ఉన్న వేడి తగ్గడమే కాకుండా శరీరంలో ఉన్న చెడును సైతం తొలగిస్తుంది. ఈ ఆకుల్లో ఉండే లక్షణాలు జుట్టు రాలకుండా చేస్తాయి. గాయాలని పోగొట్టే గుణాలు కూడా ఉందిరా.. ఏదైనా చోట దెబ్బ తగిలి వాపు, నొప్పి వచ్చినా ఈ ఆకులు నయం చేస్తాయిరా అంది నానమ్మ. ఓహో అన్నాడు బుడ్డోడు. ఒరేయ్ నీకు ఇంకో విషయం చెప్పాలిరా అంది నానమ్మ.. పొద్దున్నుంచి నోరు ఆపకుండా వాగుతూనే ఉన్నావు మళ్లీ ఇంకేం చెప్తావె అన్నాడు ఆదిత్య. ఒరేయ్ అప్పట్లో ఎవరికైనా కొడుకు పుట్టాలి అంటే మన సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుని మొక్కుకొని.. సూర్య నమస్కారాలు చేస్తే కొడుకు పుట్టేవాడ్రా.. మీ నాన్న కూడా నాకు అలాగే పుట్టాడు.. అందుకే వాడికి సురేష్ అని పేరు పెట్టాం అంది నానమ్మ.. ఓహో అందుకేనా మా నాన్న తరచు అరసవిల్లి గుడికి వెళుతుంటాడు అన్నాడు పిల్లాడు.. అవున్రా సూర్యనారాయణ స్వామి మన శ్రీకాకుళానికి ఆస్తి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తానికి ఒక వెలుగు.. అందుకే మనం అందరం గుడికి పోదాం.. ముందు పిడకల మీద పరమాన్నం చేసి స్వామికి నైవేద్యం పెట్టి రిక్షాల వెళ్లిపోదాం సరేనా అంది నానమ్మ.. మన ఊళ్లో కాకుండా ఇంకెక్కడా సూర్యుడికి గుళ్ళు లేవా నానమ్మా అడిగాడు ఆదిత్య.. ఉన్నాయిరా కాశ్మీర్లో మార్తాండ ఆలయం ఉండేది.. కానీ అందులో పూజల్లేవు.. శిథిలమైంది.. ఒరిస్సా కోణార్క్ లో ఉన్నదీ సూర్యుని ఆలయమే కానీ అక్కడా పూజలు ఉండవు.. ఈ దక్షిణ దేశంలో పూజలందుకుంటున్న సూర్య ఆలయం మన ఊళ్లోనే ఉందిరా చిన్నా అని. చదవండి: పెళ్లేందుకే రవణమ్మా.. గ్రీన్ కార్డు వస్తలేదు.. ఉద్యోగం దిక్కులేదుసూర్యుణ్ణి ఆరాధించడం ద్వారా ధన.. గుణ సంపన్నులు అవుతారు బుజ్జి..నువ్వు రోజూ ఆయన్ను నమస్కరించి వీలైతే సూర్యనమస్కారాలు చేసుకో.. ఆరోగ్యం ఐశ్వర్యం దక్కుతాయి.. చెప్పింది నానమ్మ.. అదెలాగే అన్నాడు ఆదిత్య... అవునురా సత్రాజిత్తు అనే రాజు సూర్యుణ్ణి పూజించడం ద్వారానే శమంతక మణిని పొందాడు.. అది రోజుకు ఎంత బంగారం ఇస్తుందో తెలీదు.. అంతెందుకు రోజూ ఎండలో కాసేపు నిలబడితే ఒంటికి కూడా మంచిదిరా.... విటమిన్లు వస్తాయి చెప్పింది నానమ్మ.. నానమ్మ విటమిన్లు ఎండలో వస్తాయి కదాని నన్ను ఎండలో నడిపిస్తే కుదరదు. రిక్షాలో వెళ్దాం . నాకు అక్కడ సెనగలు ఖజ్జూరం కొనాలి మరి అన్నాడు..పిల్లాడు.. సరే పదండి..గమ్మున వెళ్ళి లైన్లో నిలబడదాం.. ఆదిత్యుణ్ణి దర్శిద్దాం అంటూ అందరూ బయల్దేరారు..- సిమ్మాదిరప్పన్న -
తిరుమలలో కన్నుల పండువగా రథసప్తమి వేడుకలు (ఫొటోలు)
-
ప్రత్యక్ష దైవమా.. ప్రణామం
రామవరప్పాడు: సమస్త జీవరాశి మనుగడకూ సూర్యుడే మూలాధారం. ఉదయభానుని అరుణ కిరణ స్పర్శతోనే ప్రకృతి మేల్కొంటుంది. ప్రాణికోటికి ప్రాణప్రదాత, ఆరోగ్యదాత భాస్కరుడే. ఆటవికుల నుంచి ఆధునికుల వరకూ జాతిమతాలకు అతీతంగా ఇనబాంధవుని ఆరాధిస్తూనే ఉంటారు. భారతీయ సంస్కృతిలో కశ్యప పుత్రుని స్థానం సమున్నతం. మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథినాడు రథసప్తమి (Ratha Saptami) పేరుతో సూర్యజయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు సప్తాశ్వాలు పూన్చిన రథాన్ని అధిరోహించి దక్షిణాయనాన్ని ముగించుకుని పూర్వోత్త దిశగా ప్రయాణం ఆరంభిస్తాడని భక్తుల విశ్వాసం. మాఘ సప్తమి (Magha Saptami) నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయని భారతీయుల నమ్మకం. సూర్యకిరణాలు (Sun Rays) తప్పనిసరిగా శరీరంపై ప్రసరించాలి. ఇందులో భాగంగానే వైదిక సంస్కృతిలో సంధ్యావందనం, సూర్యనమస్కారాలు వంటి పలు ప్రక్రియలు ఆచరణలోకి వచ్చాయి.సూర్యనమస్కారాల విశిష్టత సూర్యనమస్కారములు ఒక అద్భుతమైన వ్యాయామ పద్దతి. సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిష్టమైన ప్రాణాయామం, ధ్యానం, సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉంది. ఇందులో ఒక విశిష్టమైన ఆసన సరళి, ఒక మహోన్నతమైన శ్వాస నియంత్రణ ఒక పరమోత్కృష్ట ధ్యాన విధానం ఉన్నాయి. సూర్యనమస్కారాలు చూడటానికి సాధారణ వ్యాయామంలాగే కనిపించినా ఆచరించి చూస్తే ఒక అవ్యక్తానుభూతి కలుగుతుందని యోగ గురువులు చెబుతున్నారు. సూర్య నమస్కారాలతో మంచి ఆరోగ్యం నిత్యం సూర్య నమస్కారాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యవంతులవుతారు. శరీరంలోని ప్రతి అంగాన్నీ ఉత్తేజపరచే ప్రక్రియలు సూర్యనమస్కారాలు. ఈ పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలోని బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు కావడం, కీళ్లు వదులవడంతో నరాలు, కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై మనిషి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్వష్టం చేస్తున్నారు. వీటివల్ల బరువు తగ్గడంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడటం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్యనమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పారా థైరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంథులు సాధారణ స్థాయిలో పనిచేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి 1,12 ఆసనాలతో శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి. 2,11 ఆసనాలతో... జీర్ణవ్యవస్థను మెరుగు పడుతుంది. వెన్నుముక, పిరుదులు బలోపేతమవుతాయి. 3,10 ఆసనాలు.. రక్తప్రసరణ పెంచుతాయి, కాలి కండరాలను బలోపేతం చేస్తాయి, గ్రంథులపై కూడా ప్రభావం చూపుతాయి. 4,9 ఆసనాలు... వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి. 5,8 ఆసనాలు.. గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి. 6వ ఆసనం. మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. 7వ ఆసనం... జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నుముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది. యువతను చైతన్య పరుస్తున్నాం.. సూర్యనమస్కారాలు, యోగ ఆసనాలపై యువతకు ఉచితంగా అవగాహన కల్పిస్తున్నాం. యోగ, సూర్యనమస్కారాల విశిష్టత అందరికీ తెలియాలనే ఉద్ధేశ్యంతో యోగపై ప్రత్యేకంగా పుస్తకం రాశాను. ప్రత్యక్షంగా ఆసనాలు నేర్చుకోలేని వారి కోసం పరోక్షంగా అవగాహన కల్పించడం కోసం హై క్వాలిటీ రికార్డింగ్‌తో పర్ఫెక్ట్ టైమింగ్‌తో ఆడియో కూడా రూపొందించాను. పాఠశాలలు, కళాశాలల్లో యువత, విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ ఆడియో సాయంతో విజయవాడ, హైదరాబాద్‌తో పాటు అమెరికా, లండన్‌లో కూడా సెంటర్లు నడుస్తున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఆసనాలపై ఆశక్తి పెంపొందించుకుని ఆరోగ్యంగా ఉండటమే మా లక్ష్యం. 1. నమస్కారాసనం (ఓం మిత్రాయనమః )చాతీని ముందుకు చాచి భుజాలను విశ్రాంతిగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులనూ ప్రక్కల నుంచి ఎత్తి శ్వాస వదులుతూ రెండు చేతులనూ కలుపుతూ నమస్కార ముద్రలో ఛాతీని ముందుకు తీసుకురావాలి. సూర్యునికి అభిముఖంగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్చరించాలి.2. హస్త ఉత్తానాసనం ( ఓం రవయేనమః )కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి వెనుకకు తీసుకురావాలి. భుజాలను చెవులకు దగ్గరగా తీసుకురావాలి. తలను, నడుమును వెనుకకు వంచాలి. ఈ ఆసనంలో మడమల నుంచి చేతివేళ్ల వరకు మొత్తం శరీరాన్ని సాగదీయాలి.3. పాదహస్తాసనం (ఓం సూర్యాయనమః)శ్వాస వదలి, వెన్నుపూసను నిటారుగా ఉంచి నడుము నుంచి ముందుకు వంగాలి. శ్వాసను పూర్తిగా వదిలేసి చేతులను పాదాల పక్కకు భూమిమీదకి తీసుకురావాలి. తలను మెకాలుకు ఆనించాలి. కాళ్లు వంచకూడదు.4. అశ్వసంచలనాసనం (ఓం భానవే నమః )ఎడమ మెకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పై భాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.5. దండాసనం (ఓం ఖగాయనమః)శ్వాస తీసుకుంటూ ఎడమకాలును కూడా వెనుకకు చాచి మొత్తం శరీరాన్ని భూమికి సమాంతరంగా ఒకే లైన్లో ఉంచాలి6. సాష్టాంగ నమస్కారం (ఓం పుష్ణేనమః)ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. రెండు కాళ్లు రెండు మోకాళ్లు, రెండు చేతులు, రొమ్ము, గడ్డం ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.7. భుజంగాసనం (ఓం హిరణ్యగర్భాయనమః)ముందుకు సాగి ఛాతీని పైకిలేపి త్రాచుపాము ఆకారంలోకి తీసుకురావాలి. ఈ ఆకారంలో మోచేతులను వంచవచ్చు. భుజాలు మాత్రం చెవులకు దూరంగా ఉంచాలి. శ్వాసను పీల్చి తల వెనుకకు వంచాలి.8. పర్వతాసనం (ఓం మరీచయేనమః)ఐదవ స్థితివలెనే కాళ్లు చేతులను నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.9. అశ్వసంచలనాసనం (ఓం ఆదిత్యాయనమః)శ్వాస తీసుకుంటూ కుడి పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి. ఎడమ మోకాలు నేలమీద ఉంచి తుంటి భాగాన్ని కిందికి నొక్కుతూ పైకి చూడాలి.చదవండి: ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యారాధన!10. పాదహస్తాసనం (ఓం సవిత్రేనమః)శ్వాస వదులుతూ ఎడమపాదాన్ని ముందుకు తేవాలి. అరచేతులు భూమిమీద ఉంచాలి. అవసరమైతే మోకాలు వంచవచ్చు.11.హస్త ఉత్తానాసనం (ఓం అర్కాయనమః) శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు వెన్నుపూసను నిటారుగా చేసి, చేతులు పైకిలేపి కొంచెం వెనుకకు వంగి తుంటి భాగాన్ని కొద్దిగా బయటకు తోయాలి.12. నమస్కారాసనం (ఓం భాస్కరాయ నమః)నిటారుగా నిలబడి ఊపిరి పీల్చుకునేటప్పుడు అరచేతులను ఒకచోటచేర్చి నమస్కారం చేయాలి. -
వసంత పంచమి వేళ..విజయనగరం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
కనులపండువగా చెర్వుగట్టు జడల పార్వతీ రామలింగేశ్వర స్వామి నగరోత్సవం (ఫొటోలు)
-
ఆదిలాదాబాద్ : వైభవంగా నాగోబా జాతర..గంటల తరబడి క్యూలో భక్తులు (ఫొటోలు)
-
వైభవంగా కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
-
ఆ కేసుతో జీవితమే తలకిందులు.. సన్యాసం తీసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
-
ఆదిలాబాద్ : నాగోబా జాతర..ఇంద్రాదేవికి ‘మెస్రం’ పూజలు (ఫొటోలు)
-
సరస్వతి దేవికి అంకితం.. వర్గల్ ఆలయం గురించి ఈ విశేషాలు తెలుసా? (ఫొటోలు)
-
కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం,అగ్నిగుండాలు తరించిన భక్తకోటి (ఫొటోలు)
-
గాజులరామారం చిత్తారమ్మా జాతర..అశేష భక్తజనం (ఫొటోలు)
-
'గజేంద్ర మోక్షం' ఆధారంగా ఆలయం!
పురాతన ఆలయం, చెక్కు చెదరని శిల్పకళా సౌందర్యం, ఆహ్లాదకరమైన తుంగభద్ర (Tungabhadra) నదీతీరం.. వెరసి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే రాజోలి (Rajoli) వైకుంఠ నారాయణస్వామి నిలయం. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కల్యాణి చాళుక్య రాజు త్రిభువన మల్ల సోమేశ్వరుడు నిర్మించారని ఆధారాలు చెబుతున్నాయి. వైకుంఠ నారాయణస్వామి ఆలయం ముందు భాగంలో గరుత్మంతుని గుడి ఉంది. గుడికి ఎడమ భాగాన ధ్వజపీఠం, ఆ వెనుక బలిపీఠాలు ఉన్నాయి. వైకుంఠంలో వెలసిన శ్రీమన్నారాయణుడే రాజోలిలో కొలువైనట్లు భక్తుల విశ్వాసం. ఇక్కడున్న శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడు. మూడున్నర అడుగుల దివ్య మంగళుడు. అన్నిచోట్లా దర్శనమిస్తున్నట్టు కాకుండా.. ఇక్కడ చక్ర హస్తంలో గధ, గధ హస్తంలో చక్రం ధరించి ఉంటాడు. ఇలాంటి స్వామివారి దర్శనం ఎక్కడా ప్రాచుర్యంలో లేదు. నారాయణుడికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామి నెలకొన్న పీఠం రెండు అడుగుల ఎత్తు, అడుగున్నర వెడల్పు ఉంది. ఒకటిన్నర ఎత్తు ఉన్న అమ్మవారి విగ్రహాలు అందంగా, కళాత్మకంగా ఉన్నాయి. పక్కగుడిలోని అమ్మవారు కూర్చున్న పీఠం అడుగు కాగా, ఆమె మూర్తి ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉంది. దేవాలయం బయట పురాణ, మాయణ, గవత, వైష్ణవ పురాణగాథలు, జలభూభాగాల్లోని జంతు జాలాలను అద్భుత శిల్ప కళానైపుణ్యం ఉట్టి పడేలా మలిచారు. ఈ శిల్ప కళను చూడాలంటే రెండు కళ్లు చాలవు.ఇప్పటి రాజోలి.. ఒకప్పుడు అడవి గజేంద్ర మోక్షం(Gajendra Moksham) ఆధారంగా ఆలయ నిర్మాణం జరిగిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ప్రస్తుతం రాజోలి గ్రామం ఉన్న ప్రదేశమంతా అడవి. దీనికి కొద్ది దూరంలో రాంపాడు అనే గ్రామం ఉండేది. ఈ అడవిలో ఏనుగులు విపరీతంగా సంచరిస్తుండేవి. వేసవి కాలంలో ఏనుగులు తాగునీటికి చాలా ఇబ్బంది ఉండేవి. అక్కడికి కొద్దిదూరంలో అంటే.. ప్రస్తుతం తూర్పు గార్లపాడు గ్రామం దగ్గర దేవమ్మ మడుగు ఉండేది. ఏనుగులు అక్కడికి వెళ్లి దాహం తీర్చుకునేవి. ఒకరోజు ఏనుగులు దాహం తీర్చుకోవడానికి వెళ్లగా ఆ మందకు పెద్దదిక్కైన ఒక ఏనుగును మడుగులో ఉన్న మొసలి పట్టుకుంది. ఎంతకూ అది వదలకపోవడంతో ఆ ఏనుగు నారాయణుడిని ప్రార్థించిందని.. ఆ మొర విన్న స్వామి వైకుంఠం నుంచి ఏనుగును కాపాడేందుకు వచ్చారని భక్తుల నమ్మకం. శరణు వేడుకున్న వారిని కాపాడాలనే తొందరలో శంఖు, చక్ర, గధ, పద్మధరుడైన మహా విష్ణువు, చక్ర హస్తంలో గధ, గధ హస్తంలో చక్రం ధరించి వచ్చారంటారు. ఆ విషయం అమ్మవార్లు చెప్పాక స్వామివారు గమనించారని.. శరణు కోరిన ఏనుగును చక్రంతో కాపాడారని.. దాని ఆధారంగా ఇక్కడ గుడి నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతారు.తిరుమల వెంకన్నను దర్శించినంత ఫలితం అప్పట్లో కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతీయులు, వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు వెళ్లారు. వారిని అక్కడివారు ఎక్కడినుంచి వచ్చారని పలకరించగా.. తాము తుంగభద్ర నదీతీరంలోని రాజోలి ప్రాంతం వారిమని సమాధానమిచ్చారు. అందుకు వారు ఆశ్చర్యానికి లోనై.. సాక్షాత్తు వైకుంఠ నారాయణస్వామి కొలువైన ఆ దేవాలయాన్ని వదిలి ఇంత దూరం వచ్చారా? ఇక్కడి శ్రీనివాసుడే అక్కడి వైకుంఠ నారాయణుడని, అది సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి సన్నిధిని.. కలియుగ వైకుంఠమని స్పష్టం చేసినట్టు ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే తుంగభద్ర నదిలో రాంపాటి ఈశ్వరాలయం ఉంది.శ్రీమదలం పురీక్షేత్ర మహత్మ్యమ్ (స్థల పురాణం)లో ఒక శ్లోకం ఉంది. అందులో ‘తుంగా నారాయణస్సాక్షాత్ భద్రాదేవోమహేశ్వరః ఉభయోసంగమే యత్ర ముక్తిస్త్రత నసంశయః’.. అంటే తుంగ, భద్ర అనే రెండు నదులు పశ్చిమ కనుమల్లో వేర్వేరు చోట్ల ద్వారా ఒకచోట రెండు కలుస్తాయి. ఉంగానది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కాగా భద్రా నది పరమేశ్వరుడిగా చెబుతారు. ఈ నదులు ఎక్కడ ప్రవహిస్తాయో.. అక్కడ స్నానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. అంతటి పవిత్రమైన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది రాజోలి. ఇక్కడ వైకుంఠనారాయణ ఆలయంతో పాటు ఎడమవైపు శ్రీలక్ష్మి ఆలయం, వాయవ్య దిశలో అంజనేయ స్వామి, వేణుగోపాలస్వామి ఆలయం, నవగ్రహాలయం, ఈశ్వరాలయం, భువనేంద్రస్వామి ఆలయం ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది.ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ వైకుంఠ నారాయణస్వామి ఆలయం నిరాదరణకు గురవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖలో విలీనమైనా.. ఆలయానికి మాన్యాలున్నా అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయాన్ని వెలుగులోకి తెస్తే ముక్కోటి ఏకాదశి రోజు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తిరుపతి దాకా వెళ్లనవసరం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయం ఒక్క రాజోలికే కాక తెలంగాణకు, దేశానికే తలమానికమని వారు స్పష్టం చేస్తున్నారు. చదవండి: ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోకపోయినా.. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఆలయాన్ని అభివృద్ధిలోకి తెచ్చి చరిత్రను కాపాడాలని కోరుతున్నారు. ఇప్పటికే ముక్కోటి ఏకాదశికి జిల్లా నలుమూలలతో పాటు, కర్నూల్ జిల్లా నుంచి భక్తులు వస్తుంటారు. అమావాస్య రోజు, వైకుంఠ ఏకాదశి రోజు స్థానికులు దాతల సహాయంతో వేలాది మంది భక్తులకు అన్నదానం, అల్పాహారం, తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. పుష్కరాల సమయాల్లో తుంగభద్ర నదీ పరీవాహక గ్రామాల్లో ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే ఆలయం మరింత అభివృద్ధిలోకి నోచుకుంటుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక దృష్టి పెట్టాలి రాజోలిలోని వైకుంఠ నారాయణస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ప్రభుత్వం ఈ ఆలయంపై శ్రద్ధ పెట్టాలి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఇది చాలా మందికి తెలియక ఎన్నో వ్యయ ప్రయాసలతో దూరాన ఉన్న క్షేత్రాలకు వెళ్తున్నారు. ఈ ఆలయం విశిష్టత తెలిసినట్లయితే భక్తులు ఎక్కువగా దర్శించుకుని, ఆలయాభివృద్ధి జరిగే అవకాశముంది. – సురేశ్, శాంతినగర్ చరిత్ర కలిగిన ఆలయం గజేంద్ర మోక్షం ఆధారంగా నిర్మించిన వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో ప్రతి ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. చరిత్ర కలిగిన ఈ ఆలయం వివక్షకు గురవుతోంది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఆలయం ప్రాచుర్యంలోకి తీసుకురావాలని స్థానికంగా ఎంతో కృషి చేస్తున్నాం. ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాలు, భజనలు చేస్తూ ఆధ్యాత్మికత భావనను పెంచుతున్నాం. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. – అంజి, రాజోలి -
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
విజయవాడ : కమనీయంగా గోద, రంగనాథుల కల్యాణం (ఫొటోలు)
-
విశాఖపట్నం : పాలను సముద్రంలో వదిలి..గంగమ్మతల్లికి పూజాలు (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు (ఫొటోలు)
-
విజయవాడ : వైభవంగా ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు (ఫొటోలు)
-
భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి (ఫోటోలు)
-
విశాఖపట్నం : కనకమహాలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
రాజమహేంద్రవరం : ఘనంగా మరిడమ్మ తల్లి బోనాల జాతర (ఫొటోలు)
-
శ్రీకాళహస్తి : అంగరంగ వైభవంగా ఏడు గంగమ్మల జాతర (ఫొటోలు)
-
అహం బ్రహ్మాస్మి
దైవం ఒక నమ్మకం కాదు. సత్యమే, దైవం. నమ్మకాలన్నీ మనస్సుకు సంబంధించినవి. మనస్సు సత్యం కానే కాదు. నమ్మకాలేవీ నిజాలు కాదు. నమ్మకాలకు, విషయజ్ఞానానికి అతీతమైనదే సత్యం. దైవాన్ని అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలవు. సత్యాన్ని నీలోపల అన్వేషించాలి. భౌతికమైన ఆచారాలు, క్రతువులు ఏవీ కూడా నీకు దైవాన్ని తెలియజేయలేవు. అహం అనే అడ్డును తొలగించుకోనంత వరకు దైవాన్ని తెలుసుకోలేవు. నిన్ను దైవం నుండి వేరు చేసేది అహమే. అహం అనే భ్రమ వీడితే మిగిలేది దైవమే... దివ్యచైతన్యమే... అదే అసలైన నీవు... అదే నీ సహజస్థితి.. అదే దైవం. ప్రతిక్షణం చైతన్యంతో ఉండాలి. ఏపని చేస్తున్నా దానితో కలిసిపోకుండా ఒక సాక్షీ చైతన్యంగా ఉండాలి. చేసేవాడివి నీవు కాదు. అనుభవించేవాడివి కూడా నీవు కాదు. వీటిని చూస్తున్న ద్రష్టవే నీవు. అదే ఆత్మ, అదే దైవం, ఆ అద్వైతస్థితే దైవం. మనస్సు ‘నేను’ కాదు. మనస్సు వెనుక దాన్ని సాక్షిగా చూస్తున్న చైతన్యమే ‘నేను’. ఈ ‘నేను’ కి పుట్టుక లేదు చావు కూడా లేదు ద్వంద్వాలకు అతీతం. దాన్ని ఏదీ కలుషితం చేయలేదు. ఆ ఆత్మస్థితే నీ సహజస్థితి. విషయాలకు అంటని ఆ సాక్షివి కావాలి. అప్పుడే భ్రమలతో పుట్టిన ‘నేను’ అంతమై అసలైన ‘నేను’ (ఆత్మ) ప్రజ్వలిస్తుంది. ఆలోచనలన్నీ అంతమై ఆత్మ ప్రకాశిస్తుంది. ఏమి జరుగుతున్నా సరే నీవు ఈ అత్మస్థితిలోనే ఉండాలి. నడుస్తున్నా, మాట్లాడుతున్నా, తింటున్నా, వింటున్నా, నిద్ర΄ోతున్నా... నీవు సాక్షిగా ఉండిపోవాలి. మనం ఇప్పుడు అనుకుంటున్నది మెలకువ కానే కాదు. కళ్ళు తెరిచినా నిద్రలోనే ఉంటున్నాం. మన నిజతత్వం పట్ల ఎరుకలేకుండా శరీరమే నేను, మనస్సే నేను అనే భ్రమలో ఉంటూ ఉన్నాం. నేను సాక్షీ చైతన్యాన్ని అనే సత్యాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాం. అది తెలిసిన క్షణం ఆలోచనలు అగిపోతాయి. నీ నిజతత్వాన్ని ప్రతిబింబిస్తావు, నీవే ఆత్మగా ఉండి΄ోతావు. ఆ స్థితిలో సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం జరుగుతుంది. నమ్మవలసిన అవసరమే లేదు. నీవే సత్యం, నీవే దైవం. సత్యం అంటే ఆలోచనలు, నమ్మకాలు, సూత్రాలు, వర్ణనలు, విషయజ్ఞానం మొదలైనవేవీ కావు. సత్యం నీలోనే ఉంది. నీ నిజతత్వమే సత్యం. దైవం గురించిన వర్ణనలు, సిద్ధాంతాలు, పుస్తక జ్ఞానం మొదలైనవేవీ దైవాన్ని అనుభవంలోకి వచ్చేలా చేయలేవు. పైగా ఇంకా అడ్డుపడతాయి. అహాన్ని పెంచుతాయి. మనస్సును బలపరుస్తాయి. ఈ మనస్సు ఖాళీ ఐనపుడే సత్యం అనుభవమౌతుంది. ఈ సమాజమంతా మనస్సుతో నిర్మితమైదే. నీవు చూడాలనుకున్నదే కనబడుతుంది. మనస్సు భ్రమలతోనే నిర్మితం. దైవాన్ని కూడా వివిధ రూ΄ాల్లో ఊహించుకుంటుంది. అసలు మనస్సు, పదార్థం అనేవి కూడా లేవు. స్వచ్ఛమైన చైతన్యమే నీవు. అదే సత్యం... అదే దైవం.– స్వామి మైత్రేయ -
తిరుచానూరు బ్రహ్మోత్సవాలు: వైభవంగా పంచమితీర్థం
-
భక్తుల కొంగు బంగారం.. సుందరమైన సూగూరేశ్వర ఆలయం (ఫొటోలు)
-
చంద్రగిరి : స్వర్ణరథంపై సౌభాగ్యలక్ష్మీమగా శ్రీ పద్మావతి అమ్మవారు (ఫొటోలు)
-
చంద్రగిరి : శ్రీమహాలక్ష్మి అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారు (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
పుష్పగిరిలో భక్తుల్ని ఆకర్షిస్తున్న సైకత లింగం (ఫొటోలు)
-
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
కడప : ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోఉత్సవం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో చికున్ గున్యా ,డెంగీ జ్వరాల విజృంభణ.. (ఫొటోలు)
-
కడప నగరం లో ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజా (ఫొటోలు)
-
హైదరాబాద్ లో ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు (ఫొటోలు)
-
సముద్ర స్నానాలు ఆచరించి..భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫొటోలు)
-
శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవం..భక్తకోటి పరవశం (ఫొటోలు)
-
కార్తీక సోమవారం.. శ్రీశైల మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి వేడుకలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
శ్రీశైలంలో ఘనంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతులు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో చిత్రగుప్త ఆలయం: ఎక్కడ ఉందో తెలుసా? (ఫొటోలు)
-
వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌లో గంగా మహా హారతి (ఫొటోలు)
-
వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం..భారీగా తరలివచ్చిన భక్తజనం (ఫొటోలు)
-
విజయవాడ : ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి.. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భవానీలు (ఫొటోలు)
-
తిరుమల : సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు (ఫొటోలు)
-
తిరుమల : మోహినీ అవతారంలో శ్రీనివాసుడు.. మంత్రముగ్ధులైన భక్తులు (ఫొటోలు)
-
నవరాత్రి ఉత్సవాలు : అమృతవర్షంలో మధుర మీనాక్షి ఆలయ కోనేరు (ఫొటోలు)
-
శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు (ఫొటోలు)
-
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
తిరుపతి : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)
-
తిరుపతి : పోలేరమ్మ నగరోత్సవం..కిక్కిరిసిన వెంకటగిరి (ఫొటోలు)
-
తిరుపతి జిల్లా వెంకటగిరి లో పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వైభవంగా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
కాణిపాకం : కనులపండువగా సిద్ధి వినాయక రథోత్సవం (ఫొటోలు)
-
సుగుణ భూషణుడు... విభీషణుడు!
విభీషణుడు విశ్రవసు, కైకసిల సంతానమే విభీషణుడు, రావణాసురుని చిన్న తమ్ముడు. అందరికంటే పెద్దవాడు రావణాసురుడు, కుంభకర్ణుడు రెండవవాడు. విభీషనుడు వీరిద్దరికంటే పూర్తి భిన్నమైన వాడు. సంస్కారవంతుడు, ఉత్తమోత్తమగుణాలు కలవాడు. సోదరులంటే అభిమానం కలవాడు. అందులో రావణాసురుడు అంటే భయభక్తులున్నవాడు. సీతమ్మ వారిని రావణాసురుడు చెర పట్టినప్పుడు‘అన్నా నీకు ఇది తగదు’ అని మొదట హెచ్చరించింది విభీషణుడే. తదుపరి ఎన్నడూ రావణుని మందిరానికి వెళ్ళింది లేదు.హనుమ లంకాదహనం చేసినప్పుడు మరోసారి రావణునికి హితబోధ చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. రావణుడు, సీతమ్మ దగ్గరకు వెళ్ళి గడువు పెట్టి వస్తున్నప్పుడు, రావణుని ఏకాంతంగా కలసి చెప్పాలనుకుని భయంతో విరమించుకున్నాడు. ఈ దిశలో రామలక్ష్మణులు, వానర సైన్యంతో సముద్రాన్ని దాటి రావడం, రావణునితో సమర భేరి మోగించడం జరిగింది ఆ సమయంలో రాచకొలువులో కోపోద్రిక్తుడై యుద్ధంలో ఆ రోజు విధులను కొంతమంది రాక్షస వీరులను నియమించాడు. అప్పుడు కూడా విభీషనుడు, రావణునికి చెప్పలేకపోయాడు. అన్న అంటే అంత భయం అతనికి. యుద్ధంలో రాక్షస వీరులు మరణిస్తుంటే తట్టుకోలేక పోయాడు విభీషణుడు. అప్పుడే పూజ ముగించి దైర్యంతో నేరుగా రావణుని దగ్గరకు వెళ్ళాడు.. అప్పుడు రావణుడు ‘‘రా విభీషణా!రేపు యుద్ధంలో నీవే నాయకత్వం వహించాలి’’ అని చెబుతుండగా, విభీషణుడు చేతులు జోడించి ‘అగ్రజా! యుద్ధం మనకు వద్దు.సీతమ్మ పరమ సాధ్వి. ఆ రామలక్ష్మణులు దైవాంశ సంభూతులు... అందువల్ల... ’’ అంటుండగా రావణుని తీక్షణ చూపులు చూడలేక తల దించుకున్నాడు. మళ్ళీ ధైర్యంతో ‘ఒక్కసారి ఆలోచించు ఒక రాజుగా మీకు ఇది శ్రేయస్కరం కాదు. రాజు ప్రజల బాగోగులు చూడాలి. స్త్రీలకు రక్షణగా ఉండాలి. నా మాట విను, ఆ సీతమ్మ వారిని రాముల వారికి అప్పగించు. సమయం మించి పోలేదు. చేసిన తప్పు ఒప్పుకుని ఆ శ్రీరాముల వారిని శరణు వేడు. నీకు జయం కలుగుతుంది. శరణుజొచ్చిన వారిని అక్కున చేర్చుకునే మంచి గుణాలు అయనకు ఉన్నాయి, మీ మేలు కోరి ఈ లంక ప్రజల తరపున చివరిసారిగా చెబుతున్నాను. సీతమ్మ వారిని అప్పగించు, చేసిన తప్పు ఒప్పుకో! నిన్ను శ్రీ రాములు వారు కరుణిస్తారు’’ అని పరి పరి విధాలుగా చెప్పాడు.ఆ మాటలు విని రావణుడు ‘‘అయ్యిందా నీ ఉపన్యాసం? నాకే నీతులు చెబుతావా! ముల్లోకాలలోనూ నాకు ఎదురు లేదు అనే విషయం నీకు తెలియదా! ఆ రాముని వధించి, సీతను వివాహం చేసుకొనుటకే నేను నిశ్చయించుకున్నా, నీ హితబోధ నాకు కాదు. ఇదే నిన్ను శాసిస్తున్నాను. రేపు యుద్ధ భూమిలో నీవే ప్రధాన బాధ్యత వహించాలి ఇది నా ఆజ్ఞ’’ అని చర చర వెళ్ళిపోయాడు రావణుడు. విభీషణుడు అన్నీ ఆలోచించి శ్రీరాముల వారి దగ్గరకు ‘శరణు, శరణు’ అని వెళ్ళాడు.శ్రీ రాముడు అతన్ని చూశాడు. వినమ్రంగా, చేతులు జోడించి ఉన్న విభీషణుని చూడగానే ఆసనంపై నుంచి లేచి తన హృదయానికి హత్తుకున్నాడు.‘నా జన్మ ధన్యమైంది ప్రభూ’’ అంటూ శ్రీ రాముల వారి పాదాలు తాకి తన భక్తి, వినయం నిరూపించుకున్నాడు. ఆ విధంగా శ్రీరాముడితో విభీషణునికి స్నేహం కుదిరింది. రాముడికి యుద్ధంలో చేదోడుగా ఉన్నాడు. రావణుని మరణానంతరం లంకకు విభీషణుడు రాజైనాడు. ఇది శ్రీ రాముల వారు, విభీషణునికి ఇచ్చిన కానుక. లంకకు రాజైన విభీషణుడు సుపరిపాలన చేసి, ప్రజలకు ఉత్తమ పాలన అదించాడు. విభీషణుని చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు -
ఇంద్రుడితో గృత్సమదుడి మైత్రి..
శౌనక మహర్షి వంశంలో సునహోత్రుడు అనే తపస్వి ఉన్నాడు. ఆయన వేదవేదాంగ శాస్త్ర పారంగతుడు, ధర్మనిరతుడు, శమదమాది సంపన్నుడు. సంసారాశ్రమంలో ఉన్నా, నిత్య కర్మానుష్ఠానాన్ని నియమం తప్పక ఆచరించేవాడు. అతడికి ముగ్గురు కొడుకులు పుట్టారు. వారు: కౌశుడు, శాల్ముడు, గృత్సమదుడు. సునహోత్రుడి ముగ్గురు కొడుకుల్లోనూ గృత్సమదుడు మహాతపస్విగా ప్రఖ్యాతి పొందాడు.వేదవేత్త అయిన గృత్సమదుడు అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకోదలచాడు. వేదమంత్రాలతో అగ్నిదేవుడిని భక్తిగా స్తుతించాడు. అగ్నిదేవుడికి ప్రీతికరమైన మంత్ర సప్తకాన్ని పఠిస్తూ, యజ్ఞం చేశాడు. గృత్సమదుడి నిష్కళంక భక్తితత్పరతలకు అగ్నిదేవుడు అమిత ప్రసన్నుడయ్యాడు. అతడి ఎదుట దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు. గృత్సమదుడు వరమేదీ కోరకపోయినా, అతడికి అగ్నిదేవుడు దివ్యశరీరాన్ని అనుగ్రహించాడు. ముల్లోకాలలో మూడు శరీరాలతో ఒకేసారి సంచరించగల దివ్యశక్తిని ప్రసాదించాడు.అగ్నిదేవుడి కటాక్షంతో దివ్యశరీరధారి అయిన గృత్సమదుడు సాక్షాత్తు ఇంద్రుడిలా ప్రకాశించసాగాడు. భూమిపైన, ఆకాశంలోను, గాలిలోను ఒకేసారి మూడు దివ్యశరీరాలతో స్వేచ్ఛగా తిరుగాడసాగాడు. అలా తిరుగుతూ ఒకనాడు గృత్సమదుడు స్వర్గానికి వెళ్లాడు. ఇంద్రుడి శత్రువులైన ధుని, చమురి అనే ఇద్దరు రాక్షస సోదరులు స్వర్గంలోని నందనవనంలో ఉల్లాసంగా విహరిస్తున్న గృత్సమదుడిని చూశాడు. ఇంద్రుడిలాంటి దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న గృత్సమదుడిని చూసి, అతడే ఇంద్రుడనుకున్నారు. ‘మన అదృష్టం కొద్ది ఇంద్రుడు ఒంటరిగా దొరికాడు. ఇదే తగిన అదను. ఇక్కడే అతణ్ణి మట్టుబెట్టేద్దాం’ అని రాక్షస సోదరులిద్దరూ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆయుధాలు పట్టుకుని, ఒక్కుమ్మడిగా అతడిపై దాడికి విరుచుకుపడ్డారు.హాయిగా విహరిస్తున్న తన ఎదుట ఇద్దరు రాక్షసులు ఆయుధాలతో ప్రత్యక్షమవడంతో గృత్సమదుడు ఒకింత ఆశ్చర్యపోయాడు. దివ్యదృష్టితో వారి ఆంతర్యాన్ని కనుగొన్నాడు. ఏమాత్రం తొణకకుండా, తన క్షేమం కోసం, వారి నాశనం కోసం ఇంద్రుడి గుణగణాలను ప్రశంసించే వేదమంత్రాలను పఠించాడు. ఇంద్రుడి గుణగణాలను వినగానే దాడికి తెగబడ్డ ఇద్దరు రాక్షసులకూ భయంతో గుండె జారినంత పనైంది. ‘అనవసరంగా పొరపాటు చేశామా’ అని ఆలోచనలో పడ్డారు. వారు ఇంకా తేరుకోక ముందే ఇంద్రుడు అక్కడకు ఐరావతంపై వచ్చాడు. రాక్షస సోదరులు ధుని, చమురి ఒకేసారి ఇంద్రుడి మీదకు ఆయుధాలు ప్రయోగించారు. ఇంద్రుడు వాటిని తన వజ్రాయుధంతో తుత్తునియలు చేశాడు. ఇద్దరు రాక్షసులనూ తన వజ్రాయుధంతోనే మట్టుబెట్టాడు.ఆ సంఘటనతో ఇంద్రుడిని ప్రత్యక్షంగా చూసిన గృత్సమదుడు పరమానందం పొందాడు. మళ్లీ ఇంద్రుడిని స్తుతిస్తూ వేదమంత్రాలను పఠించాడు. ఇంద్రుడి శౌర్యప్రతాపాలను, గుణగణాలను వేనోళ్ల పొగిడాడు. గృత్సమదుడి స్తోత్రానికి ఇంద్రుడు సంతోషించాడు. ‘మునివర్యా! నేటితో నువ్వు నాకు మిత్రుడివయ్యావు. నువ్వు చేసిన ప్రశంస నీ నిష్కల్మషమైన అంతఃకరణకు సాక్షి. నీ స్తోత్రం నాకు ప్రీతి కలిగించింది. నువ్వు చేసిన స్తుతి నీ సమస్తమైన కోరికలనూ ఈడేరుస్తుంది. నీకేం కావాలో కోరుకో!’ అన్నాడు.‘దేవేంద్రా! నీ కటాక్షంతో నాకు దివ్యమైన వాక్చమత్కృతి, సకల ఐశ్వర్యాలు కలగనివ్వు. నిరంతరం నా హృదయంలో నీ స్మరణనే ఉండనివ్వు. ఎల్లప్పుడూ నీ అనుగ్రహాన్ని పొందనివ్వు’ అని కోరాడు. ఇంద్రుడు ‘తథాస్తు!’ అన్నాడు. అంతే కాకుండా, గృత్సమదుడి చేయి పట్టుకుని, తనతో పాటు తన ప్రాసాదానికి తీసుకుపోయాడు. అతిథి మర్యాదలు చేశాడు. గృత్సమదుడికి ఇంద్రుడు అతిథి మర్యాదలు చేస్తుండగా, దేవగురువు బృహస్పతి అక్కడకు వచ్చాడు. బృహస్పతిని చూసిన గృత్సమదుడు ఆయనను స్తుతిస్తూ వేదమంత్రాలను పఠించాడు. బృహస్పతి సంతోషించి, ‘సురేశ్వరుడిని, సురగురువును విద్యా వినయాలతో సంతృప్తి పరచినవాడి కంటే మేధావి మరొకడు లేడు’ అని పలికాడు. కొన్నాళ్లు ఆతిథ్యం పొందాక గృత్సమదుడు ఇంద్రుడి వద్ద సెలవు తీసుకుని, తన ఆశ్రమానికి బయలుదేరాడు.అగ్నిదేవుడి వరప్రభావంతో గృత్సమదుడు కోరుకున్నప్పుడల్లా త్రిలోక సంచారం చేస్తూ కాలక్షేపం చేసేవాడు. క్రమం తప్పకుండా ఆచరించే నిత్యానుష్ఠానాలలో అగ్నిని, ఇంద్రుడిని, బృహస్పతిని స్తుతిస్తూ వేదమంత్రాలను పఠిస్తుండేవాడు. ఇలా ఉండగా, ఒకనాడు ఇంద్రుడికి గృత్సమదుడి భక్తిని పరీక్షించాలనే ఆలోచన పుట్టింది.వెంటనే ఇంద్రుడు ఒక పక్షిరూపం ధరించాడు. అడవిలో అరణిని, దర్భలను ఏరుకుంటూ ఉన్న గృత్సమదుడి భుజం మీద వాలాడు. గృత్సమదుడు కొంత దూరం ముందుకు కదిలినా, భుజం మీద వాలిన పక్షి ఎగిరిపోలేదు. గృత్సమదుడు దివ్యదృష్టితో తన భుజం మీద వాలిన పక్షి ఇంద్రుడేనని గ్రహించాడు. పక్షిరూపంలో ఇంద్రుడి ఆకస్మిక ఆగమనానికి సంతోషభరితుడై, ఇంద్రుడిని ఖగేంద్రుడిగా, సురేంద్రుడిగా స్తుతిస్తూ స్తోత్రం పఠించాడు.గృత్సమదుడికి తనపైనున్న అనన్యభక్తికి సంతోషించిన ఇంద్రుడు నిజరూపంలో అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘మిత్రమా! నీ భక్తి తత్పరతలపై నాకిక ఎటువంటి సందేహమూ లేదు. సర్వకాల సర్వావస్థలలోనూ నీవు నాకు మిత్రుడవై ఉంటావు. నాకు నిన్ను మించిన ఉత్తమ భక్తుడెవరూ లేరు. నీ కోసం స్వర్గద్వారాలు, ఇంద్రభవన ద్వారాలు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. నీవు ఎప్పుడు కోరుకున్నా, యథేచ్ఛగా, నిరాటంకంగా నా వద్దకు వచ్చిపోతూ ఉండు’ అని పలికి, సెలవు తీసుకుని స్వర్గానికి పయనమయ్యాడు. – సాంఖ్యాయన -
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు (ఫొటోలు)
-
August 30: ఆధ్యాత్మిక సమాచారం..
శ్రీవారి దర్శనానికి 18 గంటలు..తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 19 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 76,772 మంది స్వామివారిని దర్శించుకోగా 30,293 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.82 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.ఆగమోక్తంగా గురుదక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు..శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురుదక్షిణామూర్తికి గురువారం ఆగమోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గురుదక్షిణామూర్తికి పలు రకాల అభిõÙక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమరి్పంచారు. భక్తులు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన..సింహాచలం: సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఉదయం స్వర్ణపుష్పార్చన వైభవంగా జరిగింది. ఆలయ బేడా మండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుదీర్చారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అషో్టత్తర శతనామావళి పూజ నిర్వహించారు.కనకమహాలక్షి్మకి త్రికాల పంచామృతాభిషేకం..డాబాగార్డెన్స్: శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా విశాఖలోని బురుజుపేట కనకమహాలక్ష్మి దేవస్థానంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు గురువారం 25వ రోజుకు చేరాయి. అమ్మవారికి విశేష పూజలు, త్రికాల పంచామృతాభిషేక సేవ, విశేష హోమాలు నిర్వహించారు. విశిష్ట శ్రావణలక్ష్మీ పూజలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు.ఘనంగా పైడితల్లి అమ్మవారి జాతర..కిర్లంపూడి: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని జపగతినగరంలో వేంచేసిన పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆలయం వద్ద నాట్య ప్రదర్శన, కోలాటం వంటి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించారు. పండితులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.నేటితో ముగియనున్న వరలక్ష్మీ వ్రతాలు..సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోటలోని బాలత్రిపుర సుందరి సమేత చాళుక్య కుమార రామభీమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న సామూహిక వరలక్ష్మీ వత్రాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఈ సామూహిక వ్రతాల్లో తమ పేర్లు నమోదు చేయించుకున్న మహిళలు ఉదయం 9 గంటలకు ఆలయానికి హాజరుకావాలన్నారు.ఘనంగా సామూహిక సత్య దత్త వ్రతాలు..పిఠాపురం: స్థానిక శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో శ్రావణ బహుళ ఏకాదశి సందర్భంగా గురువారం సామూహిక సత్య దత్త వ్రతాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామికి ప్రత్యేక అభిõÙకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహిక సత్య దత్త వ్రతాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.నిత్యార్జిత కల్యాణం సేవా టికెట్ పెంపు.. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలోని శ్రీవారి నిత్యార్జిత కల్యాణం సేవా టికెట్ రుసుము సెపె్టంబరు ఒకటో తేదీ నుంచి పెరగనుంది. ప్రస్తుతం రూ.1,500గా ఉన్న ఈ టికెట్ ధరను రూ.2 వేలకు పెంచుతున్నటుŠట్ ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు గురువారం వెల్లడించారు. స్వామివారికి జరిగే నిత్య కల్యాణానికి ఎంతో విశిష్టత ఉంది. కోరిన కోర్కెలు తీరిన భక్తులు, కోర్కెలు తీరాలని మొక్కుకున్నవారు ఈ సేవలో ఎక్కువగా పాల్గొంటారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో 70 నుంచి 100 మంది, ప్రతి శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో 230 నుంచి 250 మంది వరకు దంపతులు ఈ సేవలో పాల్గొంటున్నారు. -
ఆధ్యాత్మిక సిరి.. స్వర్ణగిరి! అందరి నోటా ఇదే మాట..
సాక్షి, సిటీబ్యూరో, యాదాద్రి: హైదరాబాద్ తూర్పున టెంపుల్ టూరిజానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇష్టదైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇటీవల భువనగిరి పట్టణ శివారులో నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఆధ్యాతి్మక భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు, యాత్రికులు క్యూ కడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం విశేషం. దీంతో పాటు దేవాలయం పరిసర ప్రాంతాల్లో అనేక ఇతర ఆధ్యాత్మిక మందిరాలు సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి..భువనగిరిలోని స్వర్ణగిరితోపాటు కొలనుపాకలో వెలసిన జైన మందిరం, జగద్గురు రేణుకాచార్యులు ఉద్భవించిన చండికాండ సహిత సోమేశ్వరాలయాలకు సైతం భక్తుల తాకిడి కనిపిస్తోంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇదే ప్రాంతంలో ఉండనే ఉంది. ఒక్క రోజులో దేవాలయాలన్నీ చుట్టి రావచ్చు. వారాంతం, సెలవు రోజుల్లో ఆధ్యాతి్మక పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతోంది.భక్తులతో కిటకిట.. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు గడిచిన నాలుగు నెలలుగా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే యాదగిరిగుట్టకు రోజుకు సుమారు 40 వేల మంది భక్తులు సందర్శించుకుంటుండగా, తాజాగా స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరాలయంలోనూ సుమారు 25 వేల మంది భక్తులు వస్తున్నారని అంచనా వేస్తున్నారు. వారాంతం, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయ నమూనాను పోలి ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలకు చెందినవారే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం భక్తులు దేవాలయాలను దర్శించుకుంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలియనివారుండరు. తాజాగా స్వర్ణగిరి ఆదే స్థాయిలో గుర్తింపు పొందుతోంది. వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఆలయాలు రూపుదిద్దుకోవడం, బస్సు, రైళ్ల సదుపాయాలూ ఉండటంతో ప్రయాణం మరింత సులభంగా మారుతోంది. అదే సమయంలో విశాలమైన రహదారి సదుపాయాలు ఉన్నాయి. దీంతో సొంత వాహనాల్లోనూ పెద్ద సంఖ్యలోనే వస్తున్నారు. స్వర్ణగిరి ఆలయంలో భక్తులకు మధ్యాహ్నం అన్న ప్రసాదాలు అందిస్తున్నారు.ప్రయాణం ఇలా.. హైదరాబాద్ నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో స్వర్ణగిరి దేవాలయం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే యాదగిరిగుట్ట, కొలనుపాక ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు వెళ్లేందుకు వరంగల్ జాతీయ రహదారి ఉపయోగకరంగా ఉంటుంది. నిత్యం వేలాదిగా బస్సులు, కార్లు, ఇతర రవాణా వాహనాలు ఆ మార్గంలో నడుస్తున్నాయి. ఉప్పల్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆర్టీసీ బస్సులను నడిపిస్తుంది. కొలనుపాక వెళ్లాలనుకునే జైన భక్తులు ఆలేరు నుంచి ఆరు కిలోమీటర్లు వెళ్లాలి. సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట మార్గంలో వెళ్లే కృష్ణా, గోల్కొండ, భాగ్యనగర్, కాకతీయ, పుషు్పల్, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లు భువనగిరి, యాదాద్రి, ఆలేరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. అక్కడి నుంచి ఆటో, బస్సులో వెళ్లవచ్చు.మరికొన్ని దర్శనీయ ప్రాంతాలు..యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, స్వర్ణగిరి ఆలయంతో పాటు తెలంగాణలో పేరొందిన పది దేవాలయాలు ఉన్నాయి.. ఆ వివరాలు... – అలంపూర్ జోగులాంబ దేవాలయం – బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం – వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయం – కొండగట్టు వీరాంజనేయస్వామి దేవాలయం – యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం – చిలుకూరు బాలాజీ దేవాలయం – ఖర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం – ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంతిరుపతి ఫీల్ ఉంది..కుటుంబ సభ్యులతో కలసి స్వర్ణగిరి, యాదగిరి గుట్ట, ఆ చుట్టూ ఉన్న టెంపుల్స్ వెళ్లాము. స్వర్ణగిరి కొత్తగా కడుతున్నారు. అక్కడికి వెళ్లగానే తిరుపతి ఫీల్ ఉంటది. యాదగిరి గుట్ట కొత్తగా కట్టిన తరువాత తప్పనిసరిగా ప్రతిఒక్కరూ చూడాలి. ఒక్క రోజులో దేవాలయాలన్నీ దర్శనం చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేశాం. ఆధ్యాత్మిక టూర్ ప్లాన్ చేసుకున్నవారికి ఇది బాగుంది. – జలజా రెడ్డి, మణికొండ -
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం (ఫొటోలు)
-
తిరుమల : రూములు లేవు గోవిందా ... (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతం (ఫొటోలు)
-
కర్నూలు : మంత్రాలయంలో వైభవంగా రాఘవేంద్రుడి మహారథోత్సవం (ఫొటోలు)
-
వింధ్యపర్వతాన్ని అణచిన అగస్త్యుడు..
బ్రహ్మదేవుడి ఆదేశంతో సూర్యుడు మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ లోకానికి వెలుగు పంచుతూ వస్తున్నాడు. సూర్యుడు ప్రదక్షిణ చేసే పర్వతం కావడంతో మిగిలిన దేవతలందరూ మేరువును గౌరవించసాగారు. మేరువు వైభవం వింధ్యపర్వతానికి అక్కసు కలిగించింది. సూర్యుడు మేరువు చుట్టూనే తిరుగుతుండటం, దేవతలు సైతం మేరువునే గౌరవిస్తుండటం, మేరువును గౌరవించే వారెవరూ తనను పట్టించుకోకపోవడం వింధ్యుడి అహాన్ని దెబ్బతీసింది.నారద మహర్షి ఒకనాడు ఆకాశమార్గాన వింధ్యను దాటుకుని కాశీనగరం వైపు వెళుతుండగా, వింధ్యుడు ఆయనను పలకరించి, ‘మహర్షీ! మా పర్వతాల్లో మేరువు గొప్పా? నేను గొప్పా?’ అని అడిగాడు. ‘ఇద్దరూ ఉన్నతులే! ఎవరి గొప్ప వారిదే!’ అని పలికి, నారద మహర్షి నారాయణ నామజపం చేస్తూ ముందుకు సాగిపోయాడు. నారదుడి సమాధానం వింధ్యుడికి రుచించలేదు.ఒకనాడు వింధ్యుడు ఉండబట్టలేక సూర్యుడిని అడ్డగించి, ‘ఓ కర్మసాక్షీ! ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నాను. నువ్వు ఆ మేరుపర్వతం చుట్టూనే ప్రదక్షిణగా తిరుగుతున్నావు. నా వంక చూసీ చూడనట్లు సాగిపోతావేం? నీకిది ఏమైనా మర్యాదగా ఉందా?’ అని నిలదీశాడు. ‘సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకే నేను మేరువు చుట్టూ పరిభ్రమిస్తున్నాను. నేను ఆయన ఆజ్ఞ మీరి లోకరీతిని తప్పితే, జీవులకు మనుగడ అసాధ్యం’ అన్నాడు సూర్యుడు.సూర్యుడి మాటలు వినే స్థితిలో లేని వింధ్యుడు ‘లోకరీతి ప్రకారం నాలాంటి ఉన్నతుల మాట కూడా నెగ్గాలి. రేపటి నుంచి నువ్వు నా చుట్టూ కూడా తిరుగు’ అని హుకుం జారీ చేశాడు.‘అయ్యా! నేనేమీ చేయలేను. మేరుపర్వతం మహోన్నతమైనదే కాదు, సృష్టికర్త ఆదేశం కూడా తనకే అనుకూలంగా ఉంది’ అంటూ సూర్యుడు చక్కా పోయాడు.అహం దెబ్బతిన్న వింధ్యుడు ఎలాగైనా మేరువుకు గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తనను తాను అంతకంతకూ పెంచుకుని, ఆకాశానికి అడ్డుగా నిలిచాడు. ఆ దెబ్బకు సూర్యచంద్రుల గతులు తప్పి లోకం అంధకారంలో మునిగిపోయింది. వింధ్యుడి విశ్వరూపం చూసి, దేవతలకు దిక్కు తోచలేదు. వారంతా వెంటనే ఇంద్రుడి వద్దకు పరుగు పరుగున వెళ్లి, జరుగుతున్న ఉత్పాతాన్ని వివరించారు.లోకానికి తలెత్తిన ఈ విపత్తును తప్పించగల సమర్థుడు అగస్త్యుడు మాత్రమేనని తలచాడు ఇంద్రుడు. వెంటనే దేవతలను వెంటపెట్టుకుని, అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్లాడు. వింధ్యుడి ఆగడాన్ని ఆయనకు చెప్పి, ‘మహర్షీ! ఎలాగైనా నువ్వే ఈ ఆపదను తప్పించాలి’ అని ప్రార్థించాడు. ‘మరేమీ భయం లేదు. వింధ్యుడి సంగతి నేను చూసుకుంటాను’ అని చెప్పి అగస్త్యుడు ఇంద్రాది దేవతలను సాగనంపాడు. ఇంద్రాదులు తిరిగి స్వర్గానికి వెళ్లిపోయాక, అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి వింధ్యపర్వతం దిశగా బయలుదేరాడు. దేవతలు, మహర్షులు పట్టించుకోవడం మానేసిన తనవైపు అగస్త్యుడు సతీ సమేతంగా వస్తుండటం చూసి, వింధ్యుడి ఆనందానికి అవధులు లేకపోయాయి.‘మహర్షీ! నా జన్మ ధన్యమైంది. నేను తమ వద్దకు రాలేనని ఎరిగి, నా జన్మ పావనం చేయడానికే మీరిలా తరలి వచ్చినట్లున్నారు. మీకు ఏవిధంగా సేవ చేయగలనో ఆదేశించండి’ అంటూ అగస్త్యుడి ముందు మోకరిల్లాడు వింధ్యుడు.‘ఓ పర్వతరాజా! నేను అత్యవసరమైన పని మీద దక్షిణ దిశగా వెళుతున్నాను. నువ్వేమో దారికి అడ్డుగా ఇంత ఎత్తుగా ఉన్నావు. అసలే పొట్టివాణ్ణి. నువ్వు కాస్త తలవంచి తగ్గావంటే, ఏదోలా నిన్ను దాటుకుని దక్షిణాపథం వైపు వెళతాను’ అని పలికాడు అగస్త్యుడు.‘ఓస్! అదెంత పని!’ అంటూ వింధ్యుడు తలవంచి, పూర్తిగా మోకరిల్లాడు.వింధ్యుడు శిరసు వంచడమే తరువాయిగా అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి పర్వతానికి అటువైపు చేరుకున్నాడు. ‘పర్వతరాజా! నాది మరో విన్నపం. పని పూర్తయ్యాక నేను ఏ క్షణాన అయినా ఇటు తిరిగి రావచ్చు. నేను మళ్లీ తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉన్నావంటే, నేను సులువుగా నా ప్రయాణాన్ని పూర్తి చేసుకోగలను’ అన్నాడు. మాట నిలబెట్టుకోవడానికి వింధ్యుడు తలవంచుకుని అలాగే ఉండిపోయాడు. అగస్త్యుడు ఇప్పటికీ అటువైపుగా మళ్లీ రాలేదు. వింధ్యుడి గర్వాన్ని అగస్త్యుడు చాకచక్యంగా అణచాడు. – సాంఖ్యాయన -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫొటోలు)
-
తుల్జాభవానీ అమ్మవారి సేవలో జెనిలీయా దంపతులు.. (ఫొటోలు)
-
మారిషస్ : 108 అడుగుల వేంకటేశ్వర స్వామి విగ్రహం (ఫొటోలు)
-
విశాఖపట్నం : భక్తిశ్రద్ధలతో మార్వాడిల కావడి యాత్ర (ఫొటోలు)
-
చ్యవనుడి చేతిలో.. ఇంద్రుడి గర్వభంగం?
అశ్వనీ కుమారుల వల్ల చ్యవన మహర్షికి నవయవ్వనం లభించింది. తనకు యవ్వనాన్ని ప్రసాదించిన అశ్వనీ దేవతలకు ప్రత్యుపకారం చేయాలని తలచాడు చ్యవనుడు. అప్పటికి అశ్వనీ కుమారులకు సోమపానం చేసే అర్హత లేదు. అందువల్ల వారి చేత సోమపానం చేయిస్తానని చ్యవనుడు ప్రతిజ్ఞ చేసి, వారిని సాదరంగా సాగనంపాడు. యవ్వనవంతుడైన చ్యవనుడిని చూడటానికి ఒకనాడు అతడి మామగారైన సంయాతి వచ్చాడు. నవయవ్వన తేజస్సుతో మెరిసిపోతున్న అల్లుడిని చూసి సంయాతి సంతోషించాడు.తన రాజ్యం సుభిక్షంగా ఉండటానికి, రాజ్యప్రజల క్షేమం కోసం, తన అభివృద్ధి కోసం యజ్ఞం తలపెట్టానని సంయాతి చెప్పాడు. మామగారు యజ్ఞం తలపెట్టడం పట్ల చ్యవనుడు సంతోషం వ్యక్తం చేశాడు. తానే స్వయంగా ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తానని చెప్పి, యజ్ఞానికి ముహూర్తాన్ని నిర్ణయించాడు. యజ్ఞ ముహూర్తానికి కొద్దిరోజులు గడువు ఉండగానే భార్య సుకన్యతో కలసి చ్యవనుడు మామగారైన సంయాతి ఇంటికి చేరుకున్నాడు. నిర్ణీత ముహూర్తానికి సంయాతి తన అల్లుడు చ్యవనుడి ఆధ్వర్యంలో యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞానికి ఇంద్రాది అష్టదిక్పాలకులు వచ్చారు.యజ్ఞం శాస్త్రోక్తంగా జరుగుతోంది. పురోహితులు మంత్ర సహితంగా హవిస్సులను సమర్పిస్తున్నారు. యజ్ఞంలో సోమాన్ని సమర్పించే ఘట్టం వచ్చింది. అశ్వనీ దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం చ్యవనుడు వారికి కూడా సోమాన్ని సమర్పించడానికి సిద్ధపడ్డాడు. చ్యవనుడు చేయబోతున్న పనిచూసి ఇంద్రుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ‘అశ్వినులు దేవతలు కారు. వారికి సోమపానార్హత లేదు. వారికి సోమాన్ని సమర్పించడం అనాచారం’ అంటూ అభ్యంతరపెట్టాడు. మిగిలిన దిక్పాలకులు కూడా ఇంద్రుడికి వంత పలికారు.చ్యవనుడు వారిని ఏమాత్రం లక్ష్యపెట్టకుండా, అశ్వినులకు సోమాన్ని సమర్పించాడు. చ్యవనుడి చేతుల మీదుగా అశ్వినులు సంతృప్తిగా సోమపానం చేశారు. అశ్వినులు సోమపానం చేయడాన్ని కళ్లారా చూసిన ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు. పట్టరాని ఆగ్రహంతో రగిలిపోతూ, చ్యవనుడిపై విసరడానికి తన వజ్రాయుధాన్ని పైకెత్తాడు. మహిమాన్వితుడైన చ్యవనుడు మంత్రోచ్ఛాటన చేస్తూ, ఇంద్రుడి వైపు తన చూపు సారించాడు. వజ్రాయుధంతో పైకెత్తిన ఇంద్రుడి చేయి అలాగే కదలకుండా నిలిచిపోయింది. ఇంద్రుడు నిశ్చేష్టుడయ్యాడు. ఈ దృశ్యాన్ని చూసి మిగిలిన దిక్పాలకులంతా హతాశులయ్యారు.వెంటనే చ్యవనుడు యజ్ఞగుండంలో హవిస్సును వేయగా, అందులోంచి భీకరాకారుడైన ‘మధుడు’ అనే రాక్షసుడు పుట్టుకొచ్చాడు. భూమ్యాకాశాలను తాకుతున్నట్లున్న శరీరం, పదునైన కోరలు, అగ్నిజ్వాలలాంటి నాలుకతో పెదవులు నాక్కుంటూ వచ్చి ఇంద్రుణ్ణి అమాంతం మింగేయబోయాడు. ఇది చూసి దిక్పాలకులు హాహాకారాలు చేశారు. ఇంద్రుడు భయకంపితుడయ్యాడు.‘రక్షించు మహర్షీ! రక్షించు!’ అంటూ చ్యవనుడి పాదాల మీద పడ్డాడు. అశ్వనీకుమారుల సోమపానానికి తాను అంగీకరిస్తున్నానని ప్రకటించాడు. ఇంద్రుడి పట్ల శాంతించిన చ్యవనుడు అతడికి అభయమిచ్చాడు. యజ్ఞగుండం నుంచి వెలువడిన మధుడిని సాగనంపడానికి ప్రయత్నించాడు. ‘ఇంద్రుడిని విడిచిపెట్టి, ఇక్కడి నుంచి వెళ్లిపో!‘ అని మధుడిని ఆదేశించాడు. చ్యవనుడి ఆదేశంతో మధుడు ఇంద్రుడిని విడిచిపెట్టాడు. తర్వాత చ్యవనుడి ఎదుట వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ‘మహర్షీ! నీ సంకల్పంతో నన్ను సృష్టించావు. నాకు ఆశ్రయాన్ని చూపిస్తే, ఇక్కడి నుంచి వెళ్లిపోతాను’ అని పలికాడు.‘నువ్వు మద్యాన్ని, స్త్రీలోలురను, మృగయా వినోదంలో మునిగి తేలే వేటగాళ్లను, అక్షక్రీడలో కాలం వెళ్లబుచ్చే జూదరులను ఆశ్రయించుకుని ఉండు’ అని ఆదేశించాడు. చ్యవనుడి ఆదేశంతో మధుడు అక్కడి నుంచి వెంటనే అదృశ్యమైపోయాడు. పెను ప్రమాదాన్ని తప్పించుకున్న ఇంద్రుడు బతుకు జీవుడా అనుకుంటూ స్వర్గానికి బయలుదేరాడు. మిగిలిన దిక్పాలకులు కూడా తమ తమ నెలవులకు బయలుదేరారు. చ్యవన మహర్షి తన తపోమహిమను వెల్లడి చేసిన యజ్ఞవాటిక గల పర్వతానికి ‘అర్చీక పర్వతం’ అనే పేరు వచ్చింది. – సాంఖ్యాయన -
Naga Panchami: భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు (ఫొటోలు)
-
కాచిగూడ తుల్జా భవన్లో ఘనంగా మంగళ గౌరీ పూజ (ఫొటోలు)
-
ఈ పసివాడు.. యాగానికి రక్షగా నిలబడడం ఏమిటి?
విశ్వామిత్రుడు వచ్చి శ్రీరాముడిని యాగపరిరక్షణార్థం పంపించమని అడిగినప్పుడు, కేవలం పదిహేనేండ్ల బాలుడు, ఈ పసివాడు యాగానికి రక్షగా నిలబడడం ఏమిటి? అని కంగారుపడి, పంపించడానికి సంకోచించాడు దశరథ మహారాజు. తపస్సు చేయగా చేయగా కలిగిన సంతానం కాబట్టి దశరథుడి మనసులో ఆ కంగారు, దిగులు సహజమే! అయితే, అలా పంపమని అడిగిన విశ్వామిత్రుడు ఆ మాత్రం ఆలోచన లేకుండానే అడిగాడా? అన్నది ఆ క్షణాలలో దశరథుడు, శ్రీరాముడి మీదనున్న అపారమైన ప్రేమ కారణంగా ఆలోచించలేకపోయిన సంగతి.పిల్లల క్షేమానికి ఏది రక్షగా పనిచేస్తుంది? అని ప్రశ్న వేసుకున్నపుడు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత ధర్మబద్ధంగా జీవనాన్ని సాగిస్తారో అంత క్షేమంగా వారి పిల్లలు ఉంటారన్న సమాధానాన్ని సూచించిన సన్నివేశం ఇది. దశరథుడి సంకోచానికి విశ్వామిత్రుడు కోపగించుకోవడం చూసిన వశిష్ఠుడు కలగజేసుకుని ‘దశరథ మహారాజా! దక్షప్రజాపతి కుమార్తెలైన జయకు, సుప్రభకు భృశాశ్వుడనే ప్రజాపతి ద్వారా కలిగిన కామరూపులు; మహా సత్వసంపన్నులు, అస్త్రములు అయినటువంటి నూర్గురు కొడుకులను విశ్వామిత్రుడు పొంది ఉన్నాడు.వాళ్ళల్లో ఏ ఒక్కడైనా కూడా యాగరక్షణ అనే పనికి సరిపోతాడు. ఇక శస్త్రాస్త్రాల సంగతంటావా? ఈయనకు తెలియని శస్త్రాలు, తలుచుకుంటే ఈయన సృష్టించలేని అస్త్రాలు లేవు. అటువంటి ఆయనతో పంపించడానికా నీవు సంకోచిస్తున్నావు?’ అని ఊరడించి, దశరథుడితో ఇంకా ఇలా చెప్పాడు."చ. అనలము చేత గుప్తమగు నయ్యమృతంబును బోలె నీ తపో ధనపరిరక్షితుం డగుచు దద్దయు నొప్పెడు నీ తనూభవుం డని నకృతాస్త్రుడైనను నిరాయుధుడైన నిశాట కోటికిం జెనకగ రాదు కౌశికుడు చెప్పగ గేవల సంయమీంద్రుడే"పూర్వం క్షీరసాగర మథనంతో లభించిన అమృతకలశం భయంకరమైన విషాగ్ని కింద దాచబడి ఉన్నట్లుగా, నీ కొడుకైన శ్రీరాముడనే అమృతకలశం నీ తపోధనం అనే ప్రాణశక్తి చేత పరిరక్షించబడుతూ ఉన్నది. అటువంటి స్థితిలో శ్రీరాముడు నిరాయుధుడుగా ఉన్నప్పటికీ ఆ రాక్షస సమూహం అతడిని ఏమీ చేయలేదు. కౌశికుడు కంటికి కనిపిస్తున్నట్లుగా కేవలం మునిమాత్రుడు కాడు సుమా!’ అని వివరించాడు వశిష్ఠుడు ‘భాస్కర రామాయణం’ బాలకాండలోని పై సన్నివేశంలో. సంతానం ప్రాణాలకు వారి తల్లితండ్రుల ధర్మబద్ధ జీవనమే అన్నిటినీ మించిన రక్ష అని పైసన్నివేశం చాలా బలంగా చెప్పింది. – భట్టు వెంకటరావు -
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : రికార్డు స్థాయిలో దుర్గమ్మకు సారె సమర్పణ (ఫొటోలు)
-
కేవలం వాయుభక్షణతో.. పదివేల ఏళ్లు తపస్సు!
సమస్త లోకాలకు ఆధారభూతమైన ధర్మాన్ని దేవ దానవులు ఎవరూ చూడలేదు. సత్య స్వభావం కలిగిన ధర్మ స్వరూపాన్ని దర్శించడం కోసం దుర్వాసుడు తపస్సు ప్రారంభించాడు.కేవలం వాయుభక్షణతో పదివేల ఏళ్లు తపస్సు కొనసాగించినా, ధర్ముడు కరుణించలేదు. దర్శనమివ్వలేదు. తపస్సు చేసి చేసి దుర్వాసుడు కృశించిపోయాడు. ఆయనకు ధర్ముడి మీద పట్టరాని ఆగ్రహం కలిగింది. కోపం పట్టలేని దుర్వాసుడు ధర్ముడిని శపించాలనుకున్నాడు. అది గ్రహించిన ధర్ముడు వెంటనే దుర్వాసుడి ముందు తన నిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. తనతో పాటు సత్యం, బ్రహ్మచర్యం, తపస్సులను; యమ నియమ, దానాలను కూడా వెంటబెట్టుకు వచ్చాడు.సత్యం, బ్రహ్మచర్యం, తపస్సు బ్రాహ్మణుల రూపంలో రాగా, యమం ద్విజుడి రూపంలోను, నియమం ప్రాజ్ఞుడి రూపంలోను, దానం అగ్నిహోత్రుడి రూపంలోను వచ్చాయి. వారికి తోడుగా క్షమ, శాంతి, లజ్జ, అహింస, స్వచ్ఛత స్త్రీల రూపంలోను, బుద్ధి, ప్రజ్ఞ, దయ, శ్రద్ధ, మేధ, సత్కృతి, శాంతి, పంచయజ్ఞాలు, వేదాలు స్వస్వరూపాలతో వచ్చి నిలిచాయి. ఈ విధంగా ధర్ముడు సపరివారంగా దుర్వాసుడి ముందుకు వచ్చాడు.‘మహర్షీ! తపోధనుడివైన నువ్వు ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? కోపం శ్రేయస్సును, తపస్సును నశింపజేస్తుంది. పుణ్యకర్మలను క్షయింపజేస్తుంది. అందువల్ల ప్రయత్నపూర్వకంగా కోపాన్ని విడనాడాలి. దయచేసి శాంతించు! నీ తపోధనం చాలా గొప్పది’ అన్నాడు ధర్ముడు.ధర్ముడు అనునయంగా మాట్లాడటంతో దుర్వాసుడు కొద్ది క్షణాల్లోనే శాంతించాడు.‘మహాత్మా! దివ్యపురుషుడిలా కనిపిస్తున్న నువ్వెవరివి? నీతో వచ్చినవారంతా తేజస్సంపన్నులుగా ఉన్నారు. వారంతా ఎవరు?’ అడిగాడు దుర్వాసుడు. ధర్ముడు తనతో వచ్చిన తన పరివారాన్ని ఒక్కొక్కరినే దుర్వాసుడికి సవివరంగా పరిచయం చేశాడు. ‘అందరిలోనూ వృద్ధురాలిగా కనిపిస్తున్న స్త్రీ నా తల్లి దయ. గొప్ప తపస్విని. నేను ధర్ముడిని, ధర్మ పురుషుణ్ణి’ అని పలికాడు. ‘ఓ ధర్మపురుషా! మంచిది. మీరంతా నా వద్దకు ఎందుకు వచ్చారు? నేను మీకు చేయగల సాయమేమైనా ఉందా?’ ప్రశ్నించాడు దుర్వాసుడు.‘మహర్షీ! శాంతించు. నా మీద ఎందుకు కోప్పడుతున్నావో చెప్పు? నేను నీ పట్ల చేసిన అపచారం ఏమిటి? కారణం చెప్పాలనిపిస్తేనే చెప్పు. ఇందులో నిర్బంధమేమీ లేదు’ అన్నాడు ధర్ముడు. ‘ధర్మపురుషా! నా కోపం నిష్కారణమైనది కాదు. నా కోపానికి తగిన కారణం ఉంది. చెబుతాను, విను! నేను చాలా కష్టపడి దయా శౌచాలతో నా శరీరాన్ని పరిశుద్ధం చేసుకున్నాను. నీ దర్శనం కోసం పదివేల ఏళ్లు అత్యంత కఠోరంగా తపస్సు చేశాను. అయినా, నువ్వు నన్ను కరుణించలేదు. ఇంతకాలం వేచి ఉండేలా చేశావు. నీకు నా మీద దయ లేదు. అందుకే నీ మీద కోపం వచ్చింది. అందుకే నిన్ను శపించాలనుకున్నాను’ కొంచెం కినుకగా పలికాడు దుర్వాసుడు.‘మహర్షీ! దయచేసి శాంతించు. నువ్వు తొందరపడి శపిస్తే, నీ శాపానికి నేను నాశనమైతే, ఈ లోకమంతా నశిస్తుంది. నీ బాధకు మూలకారణాన్ని తొలగిస్తాను. ఇహపరాల్లో నీకు గొప్ప సుఖం కలిగేలా చేస్తాను. లోకంలో ముందు సుఖాన్ని పొందినవాళ్లు తర్వాత దుఃఖాన్ని పొందుతున్నారు. ముందు దుఃఖాన్ని పొందినవాళ్లు తర్వాత సుఖాన్ని పొందుతున్నారు. పాపాత్ములు ఏ శరీరంతో పాపం చేస్తారో, అదే శరీరంతో బాధలు అనుభవిస్తారు. అది వారు చేసిన పాపానికి ఫలం’ అని ధర్ముడు హితబోధ చేశాడు.అంతా విన్నప్పటికీ దుర్వాసుడు కినుక మానలేదు. ‘ధర్మపురుషా! నువ్వెన్ని చెప్పినా, నీ మీద నాకు కోపం తగ్గడంలేదు. అందువల్ల నిన్ను శపించాలనే అనుకుంటున్నాను’ అన్నాడు. ‘ఓ మహర్షీ! నా వల్ల నీకు కోపం వస్తే, దయచేసి క్షమించు. క్షమించకుంటే నన్ను దాసీపుత్రుడిగా చేయి లేదా రారాజుగా చేయి లేదా చండాలుడిగా చేయి. వినయంగా ఉండేవారిపై బ్రాహ్మణులు ప్రసన్నత చూపరు కదా!’ అన్నాడు. దుర్వాసుడు వెంటనే, ‘ధర్మపురుషా! నువ్వు కోరినట్లే రారాజువుగా, దాసీ పుత్రుడిగా, చండాలుడిగా జన్మించు’ అని ఏకకాలంలో మూడు శాపాలనిచ్చి వెళ్లిపోయాడు.దుర్వాసుడి శాపఫలితంగా ధర్మపురుషుడు తర్వాతి కాలంలో పాండురాజుకు ధర్మరాజుగా, దాసీపుత్రుడు విదురుడిగా, విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని బాధించినప్పుడు చండాలుడిగా పుట్టాడు. చివరకు ధర్మపురుషుడు కూడా తాను చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. – సాంఖ్యాయన -
ఇంద్రకీలాద్రి : దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు (ఫొటోలు)
-
భక్తుని వేదన..
సాధారణంగా కష్టాలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో మనిషి నిరాశకు గురవుతాడు. తన ప్రార్థనలు, వినతులు దైవం వినిపించుకోడా ఏమిటి అనే సందేహం కలుగుతుంది. భగవంతునికి అనేక మంది భక్తులుంటారు. వాళ్ళు గొప్పగా పూజలు చేస్తుంటారు. అంతమందిలో తానేం గుర్తుంటాడు? ఇలా ఆలోచిస్తూ సాధారణంగా నిస్పృహకు లోనవుతుంటారు మానవులు.సరిగ్గా భక్త హృదయాలను చదివినట్లుగా నరసింహ శతక కవి, ‘ఓ దేవా! నా వంటి సేవకుల సమూహం నీకు కోట్ల కొలది ఉంటారు. వారి సందడిలో, వారి సేవలలో నన్ను అశ్రద్ధతో మర్చిపోవద్దు. వారి పుణ్యాతిశయం చేత చాలా మంది సేవకులు నీవెంట పడేవారుండగా నీకు నేనే మాత్రం! నీవు మెచ్చే పనులు నేను చేయలేను. ఈ భూజనులలో నేను పనికిమాలిన వాణ్ణి. అయినా, నీ శుభమైన చూపు నాపై ప్రసరించు’ అని ప్రార్థిస్తాడు.అలాగే ‘నా రెండు కన్నులతో నిన్ను చూసే భాగ్యం నాకెప్పుడు? నా మనసులో కోర్కె తీరునట్లు నీ రూపం చూపించు. పాపం చేసినవారికి కనిపించనని ప్రమాణం చేసుకున్నావా? కానీ, పాపులను పరిశుద్ధు లను చేసే దేవుడివి నువ్వే అని మహాత్ములంతా నిన్ను స్తుతిస్తారు. పాపులను రక్షించి నందుకే నీకింత కీర్తి. చెడ్డవాడినైననూ నాకు కనిపించవా!’ అని వేడు కుంటాడు.ఇందులో భక్తులందరి వేదనా ఉంది. ఆర్తి ఉంది. తనను మాత్రమే దేవుడు పట్టించుకోవట్లేదేమో అనే సందేహం ఉంది. భగవంతుని కరుణ శీఘ్రంగా తనపై ప్రసరించాలని, ఆ దివ్య రూపాన్ని కళ్లారా దర్శించి తరించాలనే తపన ఉంది. తాను భగవంతుడు మెచ్చే పనులు చేయటం లేదేమో, అందుకే ఆయన దయ తనకు లభించడం లేదేమో, అలా మెప్పించే శక్తి తనకు లేదుకదా అనే నిస్సహాయత ఉంది. భగవంతుని విషయంలో భక్తుల హృదయాలలో సహజంగా కనిపించే వేదన ఇదే! – డా. చెంగల్వ రామలక్ష్మి -
నిజామాబాద్ : ఘనంగా ఖిల్లా శారదాంబ గద్దె ఊరేగింపు (ఫొటోలు)
-
మహబూబ్‌నగర్ : ఘనంగా పోచమ్మ అమ్మవారి బోనాలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న ఆషాఢ సారె సమర్ఫణలు (ఫొటోలు)
-
విజయవాడ : దుర్గమ్మకు ఘనంగా ఆషాడమాసం సారె (ఫొటోలు)
-
చంద్రసేనుడి ఔన్నత్యం! స్వర్ణగిరి, చంద్రగిరి రాజ్యాల మధ్య..
స్వర్ణగిరి, చంద్రగిరి రాజ్యాల మధ్య తరతరాలుగా శత్రుత్వం ఉంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చంద్రగిరి రాజు చంద్రసేనుడు ఇరుగుపొరుగు రాజ్యాలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటాడు. ఒకరోజు స్వర్ణగిరి రాజు సూర్యసేనుడికి ఒక లేఖ పంపాడు. ‘సూర్యసేన మహారాజులవారికి నమస్కారములు.నేను మీతో మైత్రి కోరుకుంటున్నాను. శత్రుత్వమనేది మన తండ్రుల మధ్య ఉండేది. మన మధ్య కాదు. ప్రజల మధ్య కాదు. ఆ శత్రుత్వం వారితోనే అంతమవనీ. మన రాజ్యాల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాన్ని కోరుకుంటున్నాను. మీరు అంగీకరించగలరని భావిస్తున్నాను’ అని లేఖలో కోరాడు.సూర్యసేనుడు అందుకు సమాధానంగా..‘మా నాన్న తన జీవితకాలమంతా మీ రాజ్యాన్ని శత్రురాజ్యంగానే భావిస్తూ వచ్చాడు. మీతో కలవలేదు. నేనూ మా నాన్నగారి మార్గంలోనే నడుస్తాను. మీతో స్నేహం నాకిష్టం లేదు’ అంటూ చంద్రసేనుడితో స్నేహాన్ని తిరస్కరిస్తూ లేఖ రాశాడు. ఇరుగు పొరుగు రాజ్యాలతో మంచి సంబంధాలు కలిగి ఉండటం మంచిదని, వారు స్నేహ హస్తం అందిస్తున్నప్పుడు తిరస్కరించడం మంచిది కాదని మంత్రి ఎంత చెప్పినా సూర్యసేనుడు ఒప్పుకోలేదు.ఒకసారి చంద్రగిరి రాజ్యంలో విపరీతంగా వర్షాలు కురవడంతో చెరువులు తెగి వరద వచ్చింది. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. పేదల గుడిసెలు కొట్టుకొని పోయాయి. వరద వల్ల చాలా నష్టం వాటిల్లింది. ఇరుగు పొరుగు రాజ్యాల రాజులు ఆహారపదార్థాలు, నిత్యావసర వస్తువులు, వస్త్రాలు,« దనం, ఔషధాలు మొదలగునవి అందించి వరద బాధితులను ఆదుకున్నారు. సూర్యసేనుడు మాత్రం మంత్రి చెప్పినా ‘శత్రురాజ్యానికి మనమెందుకు సాయం చేయాలి?’ అంటూ పూచిక పుల్ల కూడా సాయం చేయలేదు.ఒకసారి సాయంత్రం సూర్యసేనుడు వనవిహారం చేస్తూ ఓ మొక్కపై అందంగా ఊగుతున్న ఓ పువ్వును చూశాడు. దాన్ని తుంచి వాసన చూశాడు. కొద్ది సేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. రాజ భటులు భవనానికి చేర్చారు. రాజ వైద్యుడు వైద్యం చేసి మెలకువ తెప్పించాడు. ఆ రోజు నుండి ఆయన తీవ్రమైన నరాల నొప్పితో బాధ పడసాగాడు. రాజవైద్యుడు.. అనేక రకాల ఔషధాలు వాడినా నరాల జబ్బు నయం కాలేదు. మంత్రి, రాజవైద్యుడు చుట్టు పక్కల రాజ్యాల నుండి రాజవైద్యులను పిలిపించి వైద్యం చేయించారు.రోజురోజుకీ నొప్పి పెరుగుతోంది కానీ తగ్గలేదు. రాజవైద్యుడు సూర్యసేనుడితో ‘మహారాజా! మీరు అంగీకరిస్తే ఒక మాట చెబుతాను. చంద్రగిరి రాజ్య వైద్యుడు సౌశీల్యుడిని మించిన వైద్యుడు ఈ చుట్టుపక్కల లేడు. వైద్యశాస్త్రంలో దిట్ట. ఆయనకు తెలియని వైద్యం లేదు. ఆయన మాత్రమే మీ జబ్బును నయం చేయగలడని నా నమ్మకం’ అని చెప్పాడు. సూర్యసేనుడు తటపటాయిస్తూ ‘చంద్రసేనుడు మనతో స్నేహం కోరితే తిరస్కరించాను. ఆ రాజ్యం వరదలతో అతలాకుతలమైతే నేను పూచిక పుల్ల కూడా సాయం చేయలేదు. ఇప్పుడు నా కోసం వాళ్ళ వైద్యుడిని చంద్రసేనుడు పంపుతాడంటారా?’ అన్నాడు సందేహంగా.అక్కడే ఉన్న మంత్రి ‘ప్రయత్నిస్తే తప్పులేదు కదా! నేనే స్వయంగా వెళ్లి అడుగుతాను’ అన్నాడు. సూర్యసేనుడు అంగీకరించాడు. మంత్రి చంద్రగిరి రాజ్యానికి వెళ్లి చంద్రసేనుడితో విషయం చెప్పాడు. చంద్రసేనుడు మారుమాట్లాడకుండా తన వైద్యుడిని పంపడానికి సమ్మతించాడు. సౌశీల్యుడు.. మంత్రిని జబ్బు వివరాలు అడిగి రకరకాల ఔషధాలు తీసుకుని స్వర్ణగిరికి వచ్చాడు. సూర్యసేనుడిని పరీక్షించి కొంతకాలం ఆ రాజ్యంలోనే ఉండి తన వైద్యంతో జబ్బును నయం చేశాడు.చంద్రసేనుడి పట్ల తన ప్రవర్తనకు సూర్యసేనుడు పశ్చాత్తాపపడ్డాడు. ఇరుగుపొరుగుతో శత్రుత్వం మంచిది కాదని, అందరితో కలసిమెలసి ఉండటమే ఉత్తమ లక్షణమని, పట్టింపులతో సాధించేదేమీ లేదని సూర్యసేనుడు గ్రహించాడు. చంద్రసేనుడి ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ, స్నేహం కోరుతూ లేఖ రాశాడు. ఆనాటి నుంచి రెండు రాజ్యాల మధ్య స్నేహం చిగురించింది. – డి.కె.చదువులబాబుఇవి చదవండి: ఈ దొంగతనమనేది ఒక పెద్ద జబ్బు.. చివరికి? -
తిరుమలలో వైభవంగా పుష్ప పల్లకి సేవ (ఫొటోలు)
-
మూడో గది రహస్యం.. 46 ఏళ్ల తర్వాత ఇలా! తెరుచుకున్న పూరీ రత్నభాండాగారం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆషాఢ మాసోత్సవాలు (ఫొటోలు
-
విజయవాడ : శోభాయమానంగా శ్రీ జగన్నాథ రథయాత్ర (ఫొటోలు)
-
జగన్నాథ రూపాలు... చిత్రకారుడి కుంచెలో! (ఫొటోలు)
-
ధర్మ జిజ్ఞాస: కలిపురుషుడు.. కల్కి అవతారం!
మనం ఏదైనా పూజాది కార్యక్రమాలలో సంకల్పం చెప్పుకునేప్పుడు కలియుగే, ప్రథమ పాదే అని చెప్పుకుంటాం. అంటే కలియుగం మొదటి నాలుగవ వంతులో అని అర్థం. కలియుగం పైన అధికారం కలిపురుషుడిది. అతడి పెత్తనంలో ఉండే కలియుగ లక్షణాలని కొద్దిగానో, విపులంగానో అన్ని పురాణాలు ప్రస్తావించాయి. ధర్మం ఒక పాదం అంటే నాలుగవ వంతు మాత్రమే ఉంటుంది, మూడు పాళ్ళు అధర్మమే ఉంటుంది. అది మరింత పెచ్చు పెరిగి సజ్జనులు బతక లేని పరిస్థితి వచ్చినప్పుడు శ్రీమహావిష్ణువు దుష్టసంహారం చేసి, శిష్టరక్షణ చేయటానికి భూమిపై అవతరిస్తాడు. ఆ అవతారం పేరు కల్కి.శంబల అనే గ్రామంలో విష్ణుయశుడు అనే సదాచార సంపన్నుడైన నైష్ఠిక బ్రహ్మణుడికి, సుమతికి జన్మించి, పద్మావతి అనే సింహళ రాజకన్యని వివాహమాడి, తెల్లని గుర్రాన్ని అధిరోహించి ఖడ్గం ధరించి దుష్టసంహారం చేస్తాడు. భూ భారాన్ని తగ్గిస్తాడు – ఇదీ పురాణాలన్నింటి క్లుప్తసారాంశం. ఈ అవతారం కలియుగం చివరలో వస్తుంది. త్రేతాయుగం చివరలో రామావతారం, ద్వాపరయుగం చివరలో కృష్ణావతారం వచ్చినట్టు.కల్కి ఎప్పుడు అవతరిస్తాడు? కలి విజృంభించినప్పుడు కల్కి అవతరిస్తాడు, యుగాంతంలో. యుగాంతం అనగానే సృష్టి అంతా జలమయం అయిపోయి ఏమీ లేని స్థితి అని అర్థం కాదు. కలి లక్షణాలు కలవారు, కలిప్రభావితులు సమసిపోతారు. కృతయుగంలో ఉండదగిన వారు మిగిలి ఉంటారు.కలి లక్షణాలు: పరీక్షిత్తు పరిపాలన చేస్తున్న కాలంలో కురు జాంగల దేశాలలో పర్యటిస్తూ ఒంటికాలితో సంచరిస్తున్న వృషభరూపంలో ఉన్న ధర్మదేవుడు, గోరూపంలో ఉన్న భూమాతల సంభాషణ విన్నాడు. గోమాత కన్నీరు కార్చటానికి కారణం ధర్మదేవుడు అడిగాడు. ‘‘దేహం వ్యాధిగ్రస్తమై, ముఖం వాడిపోయి ఉన్నాయి. బంధువులకి ఆపద కలిగిందా? మూడు కాళ్ళు లేని నన్ను పట్టుకుంటారని బాధపడుతున్నావా?ఇక ముందు లోకమెట్లా ఉంటుందో తలుచుకుని దుఃఖిస్తున్నావా?’’ అని గోవు భయానికి కారణాలని అడుగుతాడు. అవి కలియుగ లక్షణాలు. 1. యజ్ఞాలు లేక దేవతలకి హవిస్సులు అందవు. 2.భర్తలు భార్యలను భరించరు. 3. పిల్లలు తల్లితండ్రులను పోషించరు. 4. సరస్వతి చెడ్డవారిని ఆశ్రయిస్తుంది. 5 ఉత్తమ విప్రులు రాజులకి సేవ చేస్తారు. 6. ఇంద్రుడు వానలు కురిపించడు. 7. దేశంలో న్యాయం నశించి పోతుంది. 8. మానవులు ఆహార నిద్రా భయ మైథునాదుల పట్ల మాత్రమే ఆసక్తి కలిగి ఉంటారు. 9. నీచులు పరిపాలిస్తూ ఉంటారు."కలి ఉంటే ప్రపంచం ఎట్లా ఉంటుందో గోవు మాటల్లో తెలిసింది. ఈ లక్షణాలు మానవులలో కొద్దిగానైనా ఉంటాయి. అవి కృతయుగంలో నామ మాత్రంగా ఉంటే, త్రేతాయుగంలో సగానికి సగం ఉంటే, ద్వాపరంలో మూడువంతులు ఉంటే, కలియుగంలో క్రమక్రమంగా పెరిగి అవి మాత్రమే ఉండే స్థితికి చేరుకోటం జరుగుతుంది. అప్పుడు కల్కి గుర్ర మెక్కి వచ్చి, కత్తితో దుష్టసంహారం చేస్తాడు. అది ఎప్పుడు? గో వృషభ సంభాషణలో కలియుగం ఎప్పుడు మొదలైనది తెలిసింది కదా! కృష్ణ నిర్యాణంతో. కలియుగం ఆరంభం అయి 5,125 సంవత్సరాలు." ‘‘ఇదంతా కృష్ణుడు శరీరం వదలటం వల్ల జరిగింది. నీవు కూడా ఒక్క కాలితో కుంటుతూ ఉన్నావు. కలిపురుషుడి ప్రేరణతో భయంకర పాపకృత్యాలని చేస్తున్న మానవులని చూస్తే దుఃఖం కలుగుతోంది. దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, నాకు, నీకు, నానా వర్ణాశ్రమాలకి, గోవులకి బాధ కలుగుతోంది.’’ అని తన బాధకి కారణాన్ని చెప్పింది గోరూపధారి అయిన భూదేవి. ఇది కలి ప్రభావం యొక్క ఫలితం.పరీక్షిత్తు ధర్మదేవుణ్ణి, భూదేవిని సముదాయించి, కలితో కఠినంగా మాట్లాడుతూ కత్తి తీశాడు. భయపడిన కలిపురుషుడు రాజచిహ్నాలని వదలి పరీక్షిత్తు కాళ్ళమీద పడి దయ తలచమనిప్రార్థించాడు. పరీక్షిత్తు అతడిని చంపక ధర్మవర్తనులు ఉండే తన రాజ్యం వదలి దూరంగా ΄÷మ్మన్నాడు. కలిపురుషుడు తాను ఎక్కడ ఉండాలో చెప్పమనిప్రార్థించాడు. పరీక్షిత్తు అతడు ఉండటానికి నాలుగు ప్రదేశాలని సూచించాడు. అవి జూదం, మద్యపానం,ప్రాణివధ, స్త్రీ (పరస్త్రీ వ్యామోహం) ఉన్న చోట్లు. అవి చాలవు మరికొన్ని కావాలని అడిగాడు. బంగారం అనే ఐదో చోటు కూడా కలికి ఇచ్చాడు. బంగారంతో వచ్చే అసత్యం, గర్వం, కామం, హింస, వైరం అనే మరొక ఐదు స్థానాలు కలి నివాసాలు అయ్యాయి.ఇప్పుడే ఇట్లా ఉంటే, చివరి నాలుగోవంతు సమయంలో ఎట్లా ఉంటుందో? అని భయం అక్కర లేదు. ధర్మమార్గంలో చరించే వారి దగ్గరకు కలిపురుషుడు రాడు. అధర్మమార్గంలో ఉండేవారిని చక్కజేసి, ప్రేరేపించే వారిని మట్టుపెట్టటానికి కల్కి రానే వస్తాడు. – డా.ఎన్. అనంతలక్ష్మి -
సుధర్ముడి కథ: ఒకనాడు అతడు వ్యాపారం కోసం..
త్రేతాయుగారంభంలో మద్ర దేశంలోని శాకల నగరంలో సుధర్ముడనే వర్తకుడు ఉండేవాడు. అతడు గొప్ప ధనికుడు, ధార్మికుడు. ఒకనాడు అతడు వ్యాపారం కోసం విలువైన వస్తువులు తీసుకుని సురాష్ట్రానికి బయలుదేరాడు. సుధర్ముడు రాత్రివేళ ఎడారి మార్గంలో ప్రయాణిస్తుండగా, కొందరు బందిపోటు దొంగలు అతణ్ణి అడ్డగించి, అతడి వద్దనున్న వస్తువులన్నీ దోచుకుపోయారు.ఉన్నదంతా దొంగలు ఊడ్చుకుపోవడంతో సుధర్ముడు ఆ ఎడారి మార్గంలో దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా మిగిలాడు. నిస్సహాయుడిగా ఎడారిమార్గంలో పిచ్చివాడిలా తిరగసాగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ మర్నాటి ఉదయానికి ఎడారిని దాటుకుని, ఒక అడవికి చేరుకున్నాడు. ఆకలితో శక్తినశించి ఉండటంతో అడవిలోని ఒక జమ్మిచెట్టు కింద కూలబడ్డాడు.నీరసంతో అతడు ఆ చెట్టు కిందనే నిద్రపోయాడు. సాయంత్రం చీకటి పడుతుండగా మెలకువ వచ్చింది. బడలిక తీరడంతో నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ఎదురుగా వందలాది ప్రేతాలతో కలసి ఉన్న ప్రేతనాయకుడు కనిపించాడు. సుధర్మడికి భయం, ఆశ్చర్యం కలిగాయి. ఎక్కడెక్కిడి నుంచో వచ్చిన ప్రేతాలు ఆ ప్రేతనాయకుడి చుట్టూ కూర్చున్నాయి. సుధర్ముడు ఆశ్చర్యంగా ఆ ప్రేతనాయకుడినే చూస్తూ ఉండిపోయాడు.తననే గమనిస్తున్న సుధర్ముడిని చూసిన ప్రేతనాయకుడు, అతడికి స్వాగతపూర్వకంగా నమస్కారం చేశాడు. దాంతో సుధర్ముడికి భయం పోయి, నెమ్మదిగా ప్రేతనాయకుడితో స్నేహం చేశాడు. ప్రేతనాయకుడు సుధర్ముడిని ‘నువ్వెవరివి? చూడటానికి సౌమ్యుడిలా కనిపిస్తున్నావు. ఎక్కడి నుంచి ఈ అడవికి ఒంటరిగా వచ్చావు? నీకేమైనా కష్టం కలిగిందా? చెప్పు’ అని అడిగాడు. ప్రేతనాయకుడు అలా ఆదరంగా అడగటంతో సుధర్ముడు కంటతడి పెట్టుకుని, తన కష్టాన్నంతా దొంగలు దోచుకుపోయారని, ఇప్పుడు తనకు దిక్కులేదని బాధపడ్డాడు.ప్రేతనాయకుడు సుధర్ముణ్ణి ఓదార్చారు. ‘మిత్రమా! కాలం కలసిరానప్పుడు ఇలాంటి దుస్సంఘటనలు జరుగుతుంటాయి. ధైర్యం తెచ్చుకో! తిండి మానేసి శరీరాన్ని శుష్కింపజేసుకోకు. ముందు దిగులుపడటం మానేయి. కాలం నీకు మళ్లీ అనుకూలిస్తుంది’ అని ధైర్యం చెప్పాడు. తర్వాత తన సహచర ప్రేతాలకు సుధర్ముడిని పరిచయం చేస్తూ, ‘మిత్రులారా! ఇతడు సుధర్ముడు. ఈనాటి నుంచి నాకు మిత్రుడు. అందువల్ల మీకు కూడా మిత్రుడే!’ అని పరిచయం చేశాడు.అంతలోనే అక్కడకు గాల్లోంచి ఒక మట్టికుండ పెరుగన్నంతో వచ్చి నిలిచింది. అలాగే మరో కుండ మంచినీళ్లతో వచ్చింది. వాటిని చూసి ప్రేతనాయకుడు ‘లే మిత్రమా! స్నానాదికాలు పూర్తి చేసుకుని, ముందు భోంచేయి.’ అన్నాడు. సుధర్ముడు స్నానం చేసి వచ్చి, ప్రేతనాయకుడు, అతడి సహచర ప్రేతాలతో కలసి పెరుగన్నం తిన్నాడు. వారి భోజనం పూర్తి కాగానే రెండు కుండలూ అదృశ్యమైపోయాయి. తర్వాత ప్రేతనాయకుడికి వీడ్కోలు పలికి మిగిలిన ప్రేతాలు కూడా అదృశ్యమైపోయాయి.ఇదంతా సుధర్ముడికి ఆశ్చర్యకరంగా అనిపించింది. ‘మిత్రమా! ఈ నిర్జనారణ్యంలోకి అమృతంలాంటి పెరుగన్నాన్ని, చల్లని మంచినీళ్లను ఎవరు పంపారు? నీ సహచర ప్రేతాలెవరు? ఇంతకూ నువ్వెరివి?’ అని ప్రశ్నలు కురిపించాడు.‘సుధర్మా! గత జన్మలో నేను శాకల నగరంలో సోమశర్మ అనే విప్రుణ్ణి. నా వద్ద పుష్కలంగా సంపద ఉన్నా, ఎన్నడూ ధర్మకార్యాలు చేసి ఎరుగను. పరమ పిసినారిగా బతికేవాణ్ణి. నా పొరుగునే సోమశ్రవుడనే వైశ్యుడు ఉండేవాడు. దాదాపు నా వయసు వాడే కావడంతో చిన్ననాటి నుంచి అతడితో స్నేహం ఏర్పడింది. అతడు భాగవతోత్తముడు, ధార్మికుడు. అతడి దానధర్మాలు చూసినా, నాలో మార్పు రాలేదు. చాలాకాలం గడిచాక ఇద్దరమూ వార్ధక్యానికి దగ్గరయ్యాం.ఒకనాడు భాద్రపద ద్వాదశినాడు పర్వస్నానం కోసం నా వైశ్యమిత్రుడితో కలసి ఐరావతి, నడ్వా నదుల సంగమ స్థలానికి వెళ్లాను. సంగమ స్నానం చేసిన రోజున నేను పవిత్రంగా ఉపవాసం ఉన్నాను. అక్కడే స్నానానికి వచ్చిన విప్రోత్తముణ్ణి పిలిచి, అతడికి ఒక కుండలో తియ్యని పెరుగన్నాన్ని, మరో కుండలో చల్లని నీళ్లను, గొడుగును, పాదరక్షలను దానంగా ఇచ్చాను. నా జన్మలో నేను చేసిన దానం అదొక్కటే! తర్వాత ఆయువు ముగిసి, మరణించాక నేను ప్రేతాన్నయ్యాను.ఆనాడు ఆ విప్రుడికి దానం చేసిన అన్నమే అక్షయంగా మారింది. ప్రతిరోజూ మధ్యాహ్నం పెరుగున్నం కుండ, నీటి కుండ ఇక్కడకు వస్తాయి. మేమంతా భోజనం ముగించగానే అదృశ్యమవుతాయి. అతడికి ఇచ్చిన గొడుగు ఇప్పుడు జమ్మిచెట్టుగా మారి, నాకు, నా సహచరులకు నీడనిస్తోంది’ అని చెప్పాడు ప్రేతనాయకుడు.‘మిత్రమా! నీ చరిత్ర ఎంతో గొప్పగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలో, నాకు దారేదో చెప్పు?’ అన్నాడు సుధర్ముడు.‘మిత్రమా! బాధ్రపద శ్రావణ నక్షత్రయుత ద్వాదశీ వ్రతాన్ని ఆచరించు. నీకు శుభాలు కలుగుతాయి. అయితే, నాదొక కోరిక. నాకు, నా సహచర ప్రేతాలకు గయ క్షేత్రంలో పిండప్రదానాలు చేయి. నువ్వు పిండదానం చేస్తే, మాకు పిశాచరూపాల నుంచి విముక్తి దొరుకుతుంది’ అని చెప్పి ప్రేతనాయకుడు సుధర్ముణ్ణి తన భుజాలపై కూర్చోబెట్టుకుని, అడవిని దాటించి శూరసేన రాజ్యలో విడిచిపెట్టాడు.సుధర్ముడు శూరసేన రాజ్యంలో మెల్లగా చిన్న చిన్న వ్యాపారాలు చేసి, కాలక్రమంలో పెద్ద వర్తకుడిగా ఎదిగాడు. ప్రేతనాయకుడు చెప్పినట్లుగానే భాద్రపద ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. గయ క్షేత్రానికి వెళ్లి ప్రేతనాయకుడికి, అతడి ప్రేతపరివారానికి శాస్త్రోక్తంగా పిండప్రదానాలు చేశాడు. వారితో పాటే తన పితరులకు, బంధువులకు పిండప్రదానాలు చేశాడు. సుధర్ముడు పిండప్రదానాలు చేయగానే ప్రేతనాయకుడు, అతడి సహచరప్రేతాలు దివ్యలోకాలకు వెళ్లిపోయారు. – సాంఖ్యాయనఇవి చదవండి: అద్వైత: బజ్ మంటున్న అలారం శబ్దానికి? -
శంకుకర్ణుడి కథ: వ్యాస మహర్షి శిష్యులతో కలసి..
వ్యాస మహర్షి శిష్యులతో కలసి కాశీ నగరంలో ఉన్న కాలంలో ప్రతిరోజూ అక్కడి తీర్థాలను, ఆలయాలను సందర్శించసాగాడు. ఒకనాడు కృత్తివాసేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత వ్యాస మహర్షి శిష్యులతో కలసి కపర్దీశ్వర లింగాన్ని దర్శించుకోవడానికి బయలుదేరాడు. కపర్దీశ్వర లింగానికి సమీపంలోని పిశాచమోచన తీర్థంలో స్నానమాడి, పితృతర్పణాలు విడిచి, కపర్దీశ్వరుడిని పూజించాడు.వ్యాసుడు, అతడి శిష్యులు అక్కడ ఉండగానే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక ఆడజింక కపర్దీశ్వర లింగం చుట్టూ ప్రదక్షిణలు చేయసాగింది. దానిని తినడానికి ఒక పెద్దపులి అక్కడు వచ్చింది. పెద్దపులి జింక మీద పడి, గోళ్లతో చీల్చి దానిని చంపేసింది. వ్యాసుడు, అతడి శిష్యబృందం అటువైపుగా వస్తుండటం గమనించిన పెద్దపులి, చంపేసిన జింకను అక్కడే వదిలేసి పారిపోయింది.అప్పుడే ఒక అద్భుతం జరిగింది. కపర్దీశ్వరుడి ముందు మరణించిన జింక గొప్ప కాంతితో ప్రకాశించింది. మూడు కళ్లతో, నల్లని మెడతో, తలపై నెలవంకతో ఒక వృషభాన్ని ఎక్కి, అదే ఆకారంలో ఉన్న మరో పురుషుడితో కలసి కనిపించింది. జింక చుట్టూ ఒక జ్వాల వెలిగి, గణేశుడి రూపం పొంది అదృశ్యమైంది. వ్యాసుడి శిష్యులు ఈ పరిణామానికి విభ్రాంతులయ్యారు. ‘మహర్షీ! ఏమిటి ఈ అద్భుతం? దీనికి కారణమేమిటి?’ అని అడిగారు.‘ఇదంతా కపర్దీశ్వరుడి మహాత్మ్యం. కపర్దీశ్వరలింగం మహా మహిమాన్వితమైనది. దీనిని సేవించినట్లయితే, సమస్త పాపాలూ తొలగిపోతాయి. ఇక్కడే ఉన్న పిశాచమోచన తీర్థంలో స్నానమాడి, కపర్దీశ్వరుడిని పూజిస్తే, ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి. ఈ మహాత్మ్యాన్ని వివరించాలంటే, మీకు శంకుకర్ణుడి కథ చెప్పాలి’ అన్నాడు వ్యాసుడు.‘ఎవరా శంకుకర్ణుడు? అతడి కథ ఏమిటి? తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. చెప్పండి గురుదేవా!’ అభ్యర్థించారు శిష్యులు.శిష్యుల అభ్యర్థనకు సాదరంగా తలపంకించిన వ్యాసుడు శంకుకర్ణుడి కథను ఇలా చెప్పసాగాడు:‘ఈ కపర్దీశ్వర క్షేత్రంలోనే లోగడ శంకుకర్ణుడనే మహాముని ఉండేవాడు. ఆయన నిరంతరం రుద్రమంత్రాలు జపిస్తూ కపర్దీశ్వరుడిని పూలు, పండ్లతో పూజిస్తుండేవాడు. జపతపాలతో యోగసాధనలో గడిపేవాడు. ఒకనాడు ఆయన యోగసాధనలో ఉండగా, ఆకలితో అలమటిస్తున్న పిశాచరూపంలో ఉన్న ఒక పురుషుడు వచ్చాడు. ఆ పిశాచాన్ని చూసి, శంకుకర్ణుడు ఎంతో జాలిపడ్డాడు.‘ఓ పిశాచమా! నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకొచ్చావు?’ అని ప్రశ్నించాడు. శంకుకర్ణుడు తనను ఆదరంగా ప్రశ్నలు అడగటంతో ఆ పిశాచం కన్నీళ్లు పెట్టుకుని, తన వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించాడు.‘మునీశ్వరా! గత జన్మలో నేను సంపన్న బ్రాహ్మణుణ్ణి. ధనమదంతో బతికినన్ని రోజులూ ఎవరికీ ఎలాంటి దానధర్మాలూ చేయలేదు. మంచి పనులేవీ చేయలేదు. ఒకనాడు వారణాసికి వెళ్లి, అక్కడ కొలువైన విశ్వేశ్వరుణ్ణి పూజించాను. కొంతకాలానికి కాలధర్మం చెందాను. కాశీ విశ్వేశ్వరుణ్ణి ఒక్కసారి పూజించినందున నేను నరకానికి వెళ్లలేదు. అయితే, బతికి ఉన్నన్నాళ్లూ పుణ్యకార్యాలేవీ చేయకపోగా, పాపాలు చేయడంతో ఇలా పిశాచరూపంలో మిగిలాను. ఆకలిదప్పులకు అలమటిస్తూ దిక్కుతోచక ఇక్కడే సంచరిస్తున్నాను. మహాత్మా! నాకీ పిశాచరూపం నుంచి విముక్తి దొరికే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. నువ్వే నాకు దిక్కు’ అని దీనంగా వేడుకున్నాడు.‘ఓ పిశాచమా! నువ్వు చాలా పుణ్యాత్ముడివి. లోకంలో నీవంటి పుణ్యాత్ములు చాలా అరుదు. పూర్వజన్మలో నువ్వు సకల విశ్వాధినేత అయిన విశ్వేశ్వరుణ్ణి స్వయంగా స్పృశించి పూజించావు. ఆ పుణ్యఫలం వల్లనే తిరిగి ఇదే క్షేత్రానికి వచ్చావు. నీకు వచ్చిన భయమేమీ లేదు. ఇక్కడ కొలువై ఉన్న కపర్దీశ్వరుణ్ణి మనసారా ప్రార్థించి, ఈ పుష్కరిణిలో స్నానం చేయి. నీకీ పిశాచ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది’ అని ధైర్యం చెప్పాడు శంకుకర్ణుడు.శంకుకర్ణుడి సూచనతో ఆ పిశాచం కపర్దీశ్వరుణ్ణి స్మరిస్తూ, పుష్కరిణిలో స్నానం చేశాడు. పుష్కరిణిలో స్నానం చేయగానే అతడికి పిశాచరూపం పోయి, గొప్ప తేజస్సుతో దివ్యరూపం వచ్చింది. తనకు పిశాచరూపం నుంచి విమోచన కలిగించిన శంకుకర్ణుడి ముందు మోకరిల్లి, నమస్కరించాడు. వెంటనే దేవతలు పంపిన దివ్యవిమానమెక్కి, దివ్యలోకాలకు వెళ్లిపోయాడు.ఆ అభాగ్యుడికి పిశాచరూపం పోయినందుకు శంకుకర్ణుడు ఎంతో సంతోషించాడు. ఇదంతా కపర్దీశ్వరుడి మహిమేనని తలచి, కపర్దీశ్వరుణ్ణి స్తుతించాడు. తర్వాత ఓంకారాన్ని ఉచ్చరిస్తూ అలాగే నేలకొరిగిపోయాడు. ప్రాణాలు కోల్పోయిన శంకుకర్ణుడి జీవాత్మ కపర్దీశ్వర లింగంలో ఐక్యమైపోయింది. మునులారా! ఇదీ శంకుకర్ణుడి వృత్తాంతం. మరణానంతరం పిశాచరూపం పొందిన బ్రాహ్మణుడికి ఆ రూపం నుంచి విముక్తి కలిగించడం వల్లనే ఈ పుష్కరిణి పిశాచమోచన పుష్కరిణిగా ప్రఖ్యాతి పొందింది. ఈ పుష్కరిణిలో స్నానం చేసి, కపర్దీశ్వరుణ్ణి పూజించేవారికి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి’ అని ముగించాడు వ్యాసుడు. – సాంఖ్యాయన -
దొంగల దోపిడి..
ఓ లక్ష్మీనృసింహ స్వామీ! నాకు చేయూతనివ్వవయ్యా! మమ దేహి కరావలంబమ్!నాకు కనిపించడం మానేసింది. అంధత్వం ఏర్పడింది. ఎదురుగా మంచీ, చెడూ కనిపిస్తుంటే కూడా ఏది ఏదో పోల్చుకోలేకుండా ఉన్నాను. ఇది పాపం, ఇది పుణ్యం అని గుర్తించలేకపోతున్నాను. ఎటు పోతున్నానో, ఎటు పోవాలో, ఏమి కాబోతున్నదో ఏమీ పాలు పోవడం లేదు. ఇది నేత్రవ్యాధి కాదు. బుద్ధి వైకల్యం. నేను వివేకాన్ని కోల్పోయాను. నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు!మహాబలవంతులైన చోరులు నా మీద దాడి చేసి, అమూల్యమైన నా వివేక ధనాన్ని దొంగిలించుకెళ్లారు. ఆ దొంగలకు ‘ఇంద్రియాలు’ అని నామధేయం. నేను ఏమరుపాటుగా ఉండగా, వాళ్ళు నన్ను ఇట్టే లొంగదీసుకుని, భోగలాలసత అనే ఇనుప గొలుసులతో కట్టివేసి, నా వివేకాన్ని ఊచముట్టుగా దోచేశారు. దాంతో నేను అవివేకిగా, మూర్ఖుడిగా, పాప పుణ్యాల గ్రహింపు లేకుండా, నాకు ఏది మేలో నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను.నాకు మిగిలిందల్లా ఇంద్రియ భోగాల మీద మితిలేని, మతిలేని వ్యామోహం. ఆ మోహాంధకారం నా జీవితాన్ని చీకటి కూపం చేసేసింది. అది ఏ గోతిలోకి లాక్కెళితే అందులో పడిపోతున్నానే తప్ప, నాకు క్షేమకరమైన మార్గాన్ని స్వయంగా ఎంచుకోగల శక్తిని, దొంగలు దోచారు. నా బుద్ధి పని చేయడం మానేసింది. విచక్షణా జ్ఞాననేత్రం మూసుకుపోయింది. నాకు చేయూత ఇచ్చి, ఈ అంధకారంలో నుంచి బయటపడే మార్గం చూపు స్వామీ!"అంధస్య, మే, హృత వివేక మహా ధనస్యచోరైః మహా బలిభిః ఇంద్రియ నామధేౖయెఃమోహాంధకార కుహరే విని పాతితస్యలక్ష్మీనృసింహ, మమ దేహి కరావలంబమ్!"– ఎం. మారుతి శాస్త్రి -
కపిలుడికి.. హనుమంతుడి అనుగ్రహం!
గంగాతీరంలోని బార్హస్పత్యపురం గ్రామంలో కపిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. కపిలుడు సదాచార సంపన్నుడు. దైవచింతనాపరుడు. హనుమంతుడికి పరమభక్తుడు. అయితే, అతడు నిరుపేద. భార్యా పుత్రులను పోషించుకోవడానికి కూడా నానా ఇబ్బందులు పడుతుండేవాడు. రోజూ ఉదయమే గంగానదిలో స్నానం చేసి, నది ఒడ్డునే హనుమన్నామ స్మరణలో కాలం గడిపేవాడు. దాతలు ఎవరైనా దక్షిణలు ఇస్తే, సాయంత్రానికి ఏ కూరగాయలో, ఆకుకూరలో కొనుక్కుని ఇంటికి వెళ్లేవాడు. దాతల దక్షిణలు దొరకని నాడు కపిలుడి కుటుంబం పస్తులుండేది.ఒకనాడు కపిలుడు యథాప్రకారం గంగానదికి వెళ్లి స్నానం చేసి, జపానికి కూర్చున్నాడు. తదేకదీక్షలో జపంలో నిమగ్నుడై, కాలాన్ని మరచిపోయాడు. ఆ సమయంలో హనుమంతుడు దీర్ఘకాయుడిగా ప్రత్యక్షమయ్యాడు. దేదీప్యమానమైన కర్ణకుండలాలతో, చతుర్భుజాకారుడై, గదాధారిగా కనిపించాడు. హనుమంతుడితో పాటు నలుడు, నీలుడు, మైందుడు, ద్వివిదుడు, జాంబవంతుడు తదితర వానరయోధులందరూ ఉన్నారు.కపిలుడు గంగాజలంతో హనుమంతుడి వాలాన్ని అభిషేకించాడు. ఆ అభిషేకజలం నుంచి వాలసాగరం అనే నది పుట్టింది. కపిలుడు ఆ నదికి పూజించి, హనుమతో వచ్చిన జాంబవతాది వానర వీరులను పూజించి, హనుమంతుడిని స్తోత్రపాఠాలతో ప్రార్థించాడు. కపిలుడి భక్తి తత్పరతకు హనుమంతుడు సంతృప్తి చెందాడు. ‘వరం కోరుకో’ అన్నాడు హనుమంతుడు. భక్తిపారవశ్యుడైన కపిలుడు ఏమీ కోరుకోలేదు. హనుమంతుడు సపరివారంగా అదృశ్యమయ్యాడు. అప్పటికే చీకటిపడటంతో కపిలుడు ఇంటికి చేరుకున్నాడు. ఉత్త చేతులతో ఇంటికి వచ్చిన కపిలుడిని చూసి అతడి భార్య ‘అయ్యో! కనీసం ఆకుకూరైనా తేకపోయారు. ఈ పూట పిల్లలకు ఏం వండిపెట్టగలను. కూడు గుడ్డకు కటకటలాడుతున్నా, మీ జపతపాలు మీవే కదా!’ అని రుసరుసలాడుతూ పిల్లలకు మంచినీళ్లు తాగించి పడుకోపెట్టింది.మర్నాడు తెల్లవారింది. కపిలుడు యథాప్రకారం గంగాతీరానికి వెళ్లడానికి సంసిద్ధుడయ్యాడు. అతడి భార్య సణుగుడు ప్రారంభించింది. ‘ఎంత చెప్పినా వినరు కదా! మీ జపతపాల గోల మీదేగాని, కుటుంబం గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? రాత్రి పస్తు పడుకున్న పిల్లల తిండితిప్పల గురించి ఏమైనా ఆలోచించారా?’ అంది.‘ఊరుకో! అన్నీ ఆ హనుమంతుడే చూసుకుంటాడు. మనం నిమిత్తమాత్రులం. అన్నట్లు చెప్పడం మరచాను. నిన్న నాకు హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఎంత ప్రసన్నంగా ఉన్నాడో స్వామి! హనుమతో పాటు జాంబవతాది వానర వీరులందరూ కనిపించారు. నా జన్మ ధన్యమైంది. ఇంక నాకేం కావాలి’ అన్నాడు కపిలుడు.‘ఔను! హనుమంతుడూ గొప్పవాడే, మీరూ ధన్యులే! మీ కుటుంబానికి మాత్రం దారిద్య్రం తప్పదు’ కినుకగా అంది కపిలుడి భార్య. ఆమె ఇంకా తన సణుగుడు కొనసాగిస్తుంటే వినలేక కపిలుడు ఇల్లు వదిలి, గంగాతీరం వైపు బయలుదేరాడు.కుటుంబ పరిస్థితిపై కపిలుడికీ బాధగానే ఉంది. అయినా హనుమంతుడి మీదనే భారం వేసి, గంగలో స్నానం చేసి, ఒడ్డున ధ్యానానికి కూర్చున్నాడు.అతడు తదేక ధ్యానంలో ఉండగా, హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు.‘కపిలా! నువ్వు నా భక్తుడవు. నీకు, నీ కుటుంబానికి క్షేమసౌఖ్యాలు కలిగించడం నా కర్తవ్యం. నీ ఇంటి పెరట్లోని రేగుచెట్టు కింద ధనరాశుల బిందె పాతరవేసి ఉంది. దానిని తవ్వితీసి, నీ కుటుంబమంతా ఆనందంగా జీవించండి’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు.కపిలుడు సంతోషంగా ఇంటికి వచ్చి, జరిగిన సంగతిని భార్యకు చెప్పాడు. భర్త చెప్పిన మాటలు ఆమెకు ఏమాత్రం సంతోషం కలిగించలేదు.‘ఇది మరీ విడ్డూరంగా ఉంది. మీరు భక్తులు, హనుమంతుడు భగవంతుడు. ఆయనకే భక్తుని మీద దయ ఉంటే, ఈ రాతినేలను తవ్వి, ధనపు బిందెను తీసి ఇవ్వవచ్చు కదా! శ్రీరాముడు వారధి కట్టినప్పుడు పెద్ద పెద్ద బండలనే మోసుకువచ్చాడని మీరు పురాణం చెబుతుంటారు. ఈమాత్రం బరువును ఆయన తవ్వి తీయలేడా? మన పెరట్లోని రాతినేలను మీరు తవ్వగలరా? నేను తవ్వగలనా?’ అంది నిష్ఠూరంగా.కపిలుడికి భార్య మాటలు బాధ కలిగించాయి. ‘పరమ కరుణామూర్తి అయిన భగవంతుడు వరమిచ్చాడు. నేలలోని ధనరాశులను తవ్వితీసే భారం కూడా పాపం ఆయనదేనా? ఏది ఏమైనా ఈ మాటలన్నీ నా హనుమకు చెప్పజాలను. నా బాధ నేనే అనుభవిస్తాను’ అనుకున్నాడు. హనుమంతుని మంత్రం జపిస్తూ నిద్రపోయాడు.మర్నాడు వేకువనే కపిలుడి భార్య నిద్రలేవగానే, ధనరాశులతో నిండిన భారీ బిందె ఆమె ముందు ఉంది. ఇల్లంతా బంగారుకాంతులతో ధగధగలాడుతూ కనిపించింది. వెంటనే భర్తను నిద్రలేపింది. హనుమంతుడి దయాభిక్షకు వివశుడైన కపిలుడు స్తోత్రపాఠాలు గానం చేయసాగాడు. ఇన్నాళ్లూ హనుమ మహిమను తెలుసుకోలేని తన అజ్ఞానానికి కపిలుడి భార్య పశ్చాత్తాపం చెందింది. ఆనాటి నుంచి కపిలుడితో పాటు అతడి భార్య కూడా హనుమంతుడిని అర్చించడం ప్రారంభించింది. దొరికిన ధనరాశుల్లో కావలసినన్ని ఉంచుకుని, మిగిలిన ధనరాశులను కపిలుడు హనుమద్భక్తులకు పంచిపెట్టాడు. – సాంఖ్యాయనఇవి చదవండి: Vinesh Phogat: పట్టు వదలని పోరాటం..! -
తిరుమల : శ్రీవారి ఆలయంలో ముగిసిన జ్యేష్టాభిషేకం (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారికి శాస్త్రోక్తంగా జ్యేష్టాభిషేకం (ఫొటోలు)
-
తిరుపతి : గంగమ్మకు మరుపొంగళ్లతో భక్తుల మొక్కులు (ఫొటోలు)
-
బ్రహ్మ నారదుల పరస్పర శాపాలు..
శ్రీమన్నారాయణుడి నాభి కమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు నారాయణుడి ఆజ్ఞ మేరకు సకల చరాచర జగత్తును సృష్టించే పని ప్రారంభించాడు. బ్రహ్మదేవుడి వెనుక భాగం నుంచి అధర్ముడు, వామ భాగం నుంచి అలక్ష్మి అనే దారిద్య్రదేవత, నాభి నుంచి విశ్వకర్మ, ఆ తర్వాత అష్టవసువులు ఉద్భవించారు.బ్రహ్మ మనసు నుంచి సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే నలుగురు పుత్రులు ఉదయించారు. ‘మీరంతా భూమ్మీదకు వెళ్లి సృష్టి చేయండి’ అని వారిని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు.తమకు సంసార వ్యామోహం లేదని చెప్పి, ఆ నలుగురు మానస పుత్రులూ తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు. బ్రహ్మ ముఖం నంచి స్వాయంభువ మనువు, అతడి భార్య శతరూప ఆవిర్భవించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి భృకుటి నుంచి కాలాగ్ని, మహాన్, మహాత్మ, మతిమాన్, భీషణ, భయంకర, రుతుధ్వజ, ఊర్ధ్వకేశ, పింగళాక్ష, రుచి, శుచి అనే ఏకాదశ రుద్రులు ఉద్భవించారు. వీరిలో కాలాగ్ని రుద్రుడు ప్రళయకాలంలో సృష్టిని సంహరిస్తాడు.ఏకాదశ రుద్రుల ఆవిర్భావం తర్వాత బ్రహ్మదేవుడి కర్ణేంద్రియాల నుంచి పులస్త్యుడు, పులహుడు, కుడికంటి నుంచి అత్రి, ఎడమకంటి నుంచి క్రతు, నాసిక నుంచి అరణి, ముఖం నుంచి అంగిరస, ఎడమభాగం నుంచి భృగువు, కుడిభాగం నుంచి దక్షుడు, ఆయన నీడ నుంచి దక్షుడు, కంఠభాగం నుంచి నారదుడు, స్కంధభాగం నుంచి మరీచి, గొంతు నుంచి అపాంతరతమ, నాలుక నుంచి వశిష్ఠ, పెదవుల నుంచి హంస మహర్షి, కుడి పార్శ్వం నుంచి యతి తదితర మహర్షులు ఉద్భవించారు.బ్రహ్మదేవుడు వారందరినీ పిలిచి, ‘మీరంతా నేటి నుంచి సృష్టికార్యం చేయండి’ అని ఆజ్ఞాపించాడు. నారదుడికి బ్రహ్మదేవుడి ఆజ్ఞ రుచించలేదు. ‘తండ్రీ! మాకంటే ముందుగా పుట్టిన మా సోదరులు సనక సనందాదులకు ముందుగా వివాహం చేసి, వారిని సృష్టికార్యానికి వినియోగించు. ఆ తర్వాత మమ్మల్ని గురించి ఆలోచించవచ్చు. వారేమో తపస్సు చేయడానికని వెళ్లిపోయారు. వారినేమీ అనకుండా, మమ్మల్ని సంసార నరకకూపంలోకి తోసేయాలని అనుకోవడం ఏమి న్యాయం? సంసారకూపంలో చిక్కుకున్నవాళ్లు ఎంతటివారైనా దాని నుంచి బయట పడలేరు కదా! మాకు కూడా సంసారం చేసి, సృష్టికార్యాన్ని కొనసాగించాలనే ఇచ్ఛ లేదు. తపోవృత్తిని ఆశ్రయించి జీవించాలనేదే మా కోరిక’ అన్నాడు నారదుడు. నారదుడి నిష్ఠురానికి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది.‘నన్ను ధిక్కరించడమే కాకుండా, ఎదురు సమాధానం చెబుతావా? అందుకే నిన్ను శపిస్తున్నాను. నేటి నుంచి నీ జ్ఞానం అంతరిస్తుంది. త్వరలోనే నువ్వు గంధర్వుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో నువ్వు స్త్రీలోలుడివి అవుతావు. ఎందరో స్త్రీలతో విషయ భోగాలను అనుభవిస్తావు. ఆ జన్మ చాలించిన తర్వాత ఒక దాసికి పుత్రుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో విష్ణుకథలను వినడం వల్ల, విష్ణుభక్తులను సేవించడం వల్ల తర్వాత జన్మలో తిరిగి నా పుత్రుడిగా జన్మిస్తావు. నువ్వు చేసిన అపరాధానికి ఇదే తగిన శిక్ష’ అని కఠినంగా పలికాడు.బ్రహ్మ శాపంతో నారదుడికి దుఃఖం ముంచుకొచ్చింది. ‘తండ్రీ! నా మీద కోపాన్ని ఉపసంహరించుకో! ఎందరినో సృష్టించే నీకు కోపం తగదు. అయినా, నేనేం తప్పు చేశానని? నేను చెడుమార్గంలో సంచరిస్తూ ఉంటే నన్ను దండించవచ్చు గాని, నేను తపస్సు చేసుకుంటానంటే అకారణంగా శపించావే! ఇదేమైనా న్యాయమా? భావ్యమా? శపిస్తే శపించావు గాని, ఎన్ని జన్మలు ఎత్తినా హరిభక్తి విడవకుండా ఉండేలా నన్ను అనుగ్రహించు. బ్రహ్మపుత్రుడైనా సరే హరిభక్తి లేనివాడు సూకరంతో సమానుడు’ అన్నాడు నారదుడు.అప్పటికి కాస్త శాంతించిన బ్రహ్మ ‘అన్ని జన్మలలోనూ నువ్వు హరిభక్తుడిగానే ఉంటావు’ అన్నాడు.‘తండ్రీ! ఏ యజమాని అయినా తన భార్యకు, సంతానానికి, బంధువులకు, సేవకులకు సన్మార్గాన్ని చూపిస్తే అతడు ఉత్తమ గతులు పొందుతాడు. అలా కాకుండా, చెడుమార్గాన్ని చూపిన వాడు నరకానికి పోతాడు. శ్రీహరి మీద భక్తిప్రపత్తులను పెంచుకున్నవాడిని తిరస్కరిస్తే, అతడు గురువైనా, తండ్రి అయినా, కొడుకు అయినా, యజమాని అయినా దుర్మార్గుడే అవుతాడు. అందువల్ల తండ్రీ! నా తప్పు లేకపోయినా నువ్వు నన్ను శపించావు. కాబట్టి నువ్వు కూడా శాపానికి అర్హుడివే!సకల సృష్టికీ కారకుడివి అయినప్పటికీ నీకు మంత్రం, స్తోత్రం, పూజ అనేవి లోకంలో లేకుండా పోతాయి. నీకు భూమ్మీద ఆలయాలు కూడా ఉండవు. నిన్ను ప్రత్యేకంగా ఆరాధించే భక్తులెవరూ ఉండరు. నా శాప ప్రభావం మూడు కల్పాల వరకు ఉంటుంది. మూడు కల్పాలు గడచిన తర్వాత మాత్రమే నీకు ఇతర దేవతలతో సమానమైన పూజలు అందుతాయి’ అని శపించాడు నారదుడు. నారదుడి శాపం కారణంగానే బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన మంత్ర స్తోత్రాలేవీ లేవు. – సాంఖ్యాయన -
దేవుడు స్వతంత్రుడా?
ఈ సృష్టిలో నిజంగా స్వతంత్రులెవరైనా ఉన్నారా? లౌకిక ప్రపంచాన్ని గమనిస్తే... కుటుంబ సభ్యులు కుటుంబ యజమాని వశంలో ఉంటారు. ఆ యజమాని తనకు జీవనోపాధి ఇచ్చే మరో యజమానికి వశుడు. ఆ యజమాని కూడా చట్టానికీ, ప్రభుత్వానికీ లోబడవలసిందే. సవ్యమైన పాలన అందించే ప్రభువు కూడా ప్రజల అభీష్టాలకు అనుగుణంగా పాలించాలి. పూర్తి స్వతంత్రుడు కాలేడు. ఇక ప్రజాస్వామ్యమైతే, ప్రజలే స్వాములని పేరులోనే ఉంది. పాలకులు సేవకులు!ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే... జగత్తంతా దైవాధీనం. శివుడి ఆజ్ఞ లేకుండా చీమ చిటుక్కుమనడం కూడా జరగదని నమ్మకం. ‘నా వల్లనే ఈ జగత్తంతా నడుస్తుంది!’ – మత్తః సర్వ ప్రవర్తతే– అని గీతాచార్యుడి ప్రకటన. ‘పరమాత్మనైన నేను అధిష్ఠానంగా ఉంటుండగా, త్రిగుణాత్మకమైన నా మాయా శక్తి త్రిలోకాలను సృష్టిస్తుంది. భూతకోటి యావత్తూ ఈ మాయా శక్తి వశులై నడుస్తారు’ అంటాడు. అలాంటప్పుడు, ఇక ప్రాణులకు స్వాతంత్య్రం ఎక్కడ? ఏపాటి? పోనీ ఆ దైవం స్వతంత్రుడా అంటే, పూర్తి స్వతంత్రం ఆయనకూ లేదు. ఆ భగవంతుడిని తమ వశంలో ఉంచుకోగల వాళ్ళు కూడా ఉన్నారు.భాగవతంలో దుర్వాస మహర్షి అంబరీశుడిని అకారణంగా సంహరించబోగా, విష్ణుమూర్తి సుదర్శన చక్రం, తనకున్న దుష్ట శిక్షణ కర్తవ్యాన్ని అనుసరించి, తనంతట తానే మునీంద్రుడిని తరుముతూ వెళ్తుంది. దాన్ని తప్పించుకునే మార్గం తెలియక, తిరిగి తిరిగి ముని చివరికి విష్ణుమూర్తినే ప్రార్థిస్తాడు.‘నీ ఆయుధాన్ని ఉపసంహరించుకుని నన్ను రక్షించ’మని. ‘అంత స్వతంత్రం నాకెక్కడిది?’ అంటాడు విష్ణుమూర్తి. ‘అహం భక్త పరాధీనః, అస్వతంత్రః ఇవ ద్విజ!– ఓ మునీంద్రా, నేను నా భక్తుల అధీనంలో ఉండేవాడిని. అక్కడ నాకు స్వతంత్రం లేదు. నా హృదయం వాళ్ళకు బందీ. సద్గుణవతులైన స్త్రీలు, సత్పురుషులైన తమ భర్తలను వశం చేసుకొన్నట్టు, ఆ సాధువులు నన్ను వశం చేసుకుంటారు. నా ఆయుధాన్ని ఆపగల శక్తి అంబరీషుడికే ఉంది. నాకు లేదు!’ – ఎం. మారుతి శాస్త్రి -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయి కుమార్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
బ్రహ్మజ్ఞానం అంటే...
ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు బ్రహ్మజ్ఞానం తెలియాలని ఆశపడ్డారు. వారిద్దరినీ ఓ మంచి గురువు వద్దకు పంపారు. ఇద్దరూ గురుకులవాసం పూర్తి చేసుకుని ఇంటికొచ్చారు. తండ్రి తన పెద్దకొడుకుని చూసి ‘బ్రహ్మజ్ఞానం గురించి ఏం నేర్చుకున్నావు’ అని అడిగాడు. వెంటనే ఆ కొడుకు వివిధ అంశాల గురించి చెప్పుకుంటూ పోతున్నాడు. వేదాల నుంచీ, శాస్త్రాల నుంచీ ఉదాహరణలు చెబుతున్నాడు. అతడి మాటలకు అడ్డు తగులుతూ ‘సరే ఆపు’ అని తండ్రి అన్నాడు.ఈసారి బ్రహ్మజ్ఞానం గురించి నువ్వేం నేర్చుకున్నావని చిన్న కొడుకుని అడిగాడు తండ్రి. అతను నోరెత్తలేదు. తల వంచుకుని నిల్చున్నాడు. తండ్రి అతని వంక చూశాడు. నీ వాలకం చూస్తుంటే నీకే బ్రహ్మజ్ఞానం గురించి అంతో ఇంతో తెలిసినట్లుందన్నాడు. ‘బ్రహ్మం గురించి పూర్తిగా తమకు తెలుసని పలువురు అనుకుంటూ ఉంటారు. అది ఎలాంటిదంటే బ్రహ్మాండమైన చక్కెర కొండ నుంచి ఒక్క రవ్వ చక్కెరను తీసుకుని పోతున్న చీమ మరోసారి వచ్చినప్పుడు ఈ మొత్తం కొండను తీసుకుపోతానని చెప్పడం లాంటి’దని రామకృష్ణపరమహంస చెప్పారు.బ్రహ్మం అనేది మన ఆలోచనలకు, మాటలకు అతీతమైనది. గొప్ప గొప్ప మహాత్ములను కూడా ఈ విషయంలో పెద్ద చీమలని చెప్పవచ్చు. వారందరూ ఓ ఏడెనిమిది చక్కెర రవ్వలను తీసుకుపోయి ఉంటారు. అంతే. బ్రహ్మం అనే మహాసముద్ర తీరాన నిల్చుని కాళ్ళు తడుపుకోవడం లాంటిదే వారు బ్రహ్మజ్ఞానం తమకు తెలుసునని చెప్పడం. నిజానికి వారందులో మునగలేదు. మునిగి ఉంటే వారు తిరిగివచ్చి ఉండరు.‘అనగనగా ఓ ఉప్పు బొమ్మ ఉండేది. సముద్రం లోతెంత అని తెలుసుకోవడంకోసం అందులోకి దూకాలన్నది దాని ఆశ. అలాంటి ఆశ పుట్టినప్పుడు అది ఉత్తినే ఉండగలదా! సరే, సముద్రం లోతెంత చూసేద్దామని నిర్ణయించుకుంది. వెంటనే అది సముద్రంలో దూకేసింది. కొంచెం దూరం వెళ్ళిందో లేదో... అంతే సంగతులు. ఉప్పుబొమ్మ సముద్రంలో దూకితే ఏమవుతుంది... కొంచెం కొంచెంగా కరగనారంభించింది. కాస్సేపటికే బొమ్మ మొత్తం కరిగిపోయింది.అది ఇంకేం కనిపెట్టగలదు సముద్రం లోతుని! అలాగే బ్రహ్మజ్ఞానం తనకొచ్చేసింది అనుకున్న మనిషి మౌనంగా ఉంటాడు. అది వచ్చేంతవరకూ మట్లాడుతూనే ఉంటాడు. తేనె తాగడం కోసం ఓ భ్రమరం తోటలోకి వెళ్ళింది. అది పువ్వు మీద వాలే వరకే ఝుమ్మని శబ్దం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పువ్వు మీద వాలిందో ఆ క్షణంలోనే అది మౌనమైపోతుంది. అలాటిదే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడ’మని పరమహంస అంటారు. – యామిజాల జగదీశ్ఇవి చదవండి: June11: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ -
పూర్వం 'ధ్రువసంధి' అయోధ్యకు.. రాజుగా..
పూర్వం ధ్రువసంధి అయోధ్యకు రాజుగా ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య మనోరమ, రెండో భార్య లీలావతి. సద్గుణ సంపన్నుడైన ధ్రువసంధి యజ్ఞయాగాదికాలు చేస్తూ, బ్రాహ్మణులకు, సాధు సజ్జనులకు, పేదసాదలకు విరివిగా దానాలు చేస్తుండేవాడు.ధ్రువసంధికి మనోరమ ద్వారా సుదర్శనుడు, లీలావతి ద్వారా శత్రుజిత్తు అనే కొడుకులు కలిగారు. వారిద్దరూ గురుకులవాసంలో సకల శాస్త్రాలు, అస్త్రశస్త్ర విద్యలు నేర్చి, అన్ని విద్యల్లోనూ ఆరితేరారు. ధ్రువసంధి పెద్దకొడుకు సుదర్శనుడికి త్వరలోనే పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. వినయశీలుడు, వీరుడు అయిన సుదర్శనుడికి ప్రజామోదం కూడా ఉండేది. అయోధ్య ప్రజలందరూ సుదర్శనుడే తదుపరి రాజు కాగలడని అనుకునేవారు.సుదర్శనుడికి పట్టాభిషేకం చేయడానికి ధ్రువసంధి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుసుకుని, అతడి రెండో భార్య లీలావతి తండ్రి, శత్రుజిత్తు మాతామహుడు యుధాజిత్తు సహించలేకపోయాడు. తన మనవడినే రాజుగా చేయాలని ధ్రువసంధిని కోరాడు. పెద్దకొడుకుకే పట్టాభిషేకం చేయడం ధర్మమని తేల్చి చెప్పిన ధ్రువసంధి అతడి కోరికను నిరాకరించాడు.సుదర్శనుడిపై అసూయతో రగిలిపోతున్న యుధాజిత్తు ఒకనాడు అకస్మాత్తుగా తన సేనలతో అయోధ్యపై విరుచుకుపడ్డాడు. ధ్రువసంధిని చెరసాలలో పెట్టి, తన మనవడైన శత్రుజిత్తుకు రాజ్యాభిషేకం చేసి, తానే అధికారం చలాయించడం మొదలుపెట్టాడు. తన సేనలతో ఎలాగైనా సుదర్శనుడిని, అతడి తల్లి మనోరమను బంధించడానికి ప్రయత్నించాడు.అయితే, ప్రమాదాన్ని శంకించిన మనోరమ కొందరు మంత్రులు, ఆంతరంగికుల సాయంతో కొడుకు సుదర్శనుడితో కలసి అరణ్యాల్లోకి వెళ్లిపోయింది. అరణ్యమార్గంలో ముందుకు సాగుతుండగా, మార్గమధ్యంలో కనిపించిన భరద్వాజ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంది. భరద్వాజ మహర్షి వారికి జరిగిన అన్యాయం తెలుసుకుని, జాలితో తన ఆశ్రమంలోనే వారికి వసతి కల్పించాడు.మనోరమ, సుదర్శనులను ఎలాగైనా పట్టి బంధించి, చెరసాల పాలు చేయాలని భావించిన యుధాజిత్తు వారిని వెదకడానికి రాజ్యం నలుమూలలకు, పొరుగు రాజ్యాలకు వేగులను పంపాడు. కొన్నాళ్లు గడిచాక వారు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంటున్నట్లు సమాచారం తెలుసుకున్నాడు.సైన్యాన్ని, పరివారాన్ని వెంటబెట్టుకుని యుధాజిత్తు ఒకనాడు భరద్వాజుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ‘ఓ మునీ! నువ్వు అన్యాయంగా సుదర్శనుడిని, మనోరమను నీ ఆశ్రమంలో బంధించి ఉంచావు. వాళ్లను వెంటనే నాకు అప్పగించు’ అని దర్పంగా ఆదేశించినట్లు పలికాడు. అతడి మాటలకు భరద్వాజుడు కన్నెర్రచేసి కోపంగా అతడివైపు చూశాడు.భరద్వాజ మహర్షి ఎక్కడ శపిస్తాడోనని యుధాజిత్తు మంత్రులు భయపడ్డారు. వెంటనే యుధాజిత్తును వెనక్కు తీసుకుపోయారు. ‘మళ్లీ ఈ పరిసరాల్లో కనిపిస్తే నా క్రోధాగ్నికి నాశనమవుతారు’ అని హెచ్చరించాడు భరద్వాజుడు. ఆ మాటలతో యుధాజిత్తు పరివారమంతా వెనక్కు తిరిగి చూడకుండా అయోధ్యకు పరుగు తీశారు.భరద్వాజుడి ఆశ్రమంలో ఒక మునికుమారుడు మనోరమకు క్లీబ మంత్రాన్ని ఉపదేశిస్తుండగా, సుదర్శనుడు విన్నాడు. ఆ శబ్దం అతడికి ‘క్లీం’ అని వినిపించింది. క్లీంకారం దేవీమంత్రం. సుదర్శనుడు తదేక దీక్షతో క్లీంకారాన్ని జపించసాగాడు. సుదర్శనుడి నిష్కల్మష భక్తికి అమ్మవారు సంతసించి, అతడి ముందు ప్రత్యక్షమైంది. అతడికి ఒక దివ్యాశ్వాన్ని, గొప్ప ధనువును, అక్షయ తూణీరాలను ఇచ్చింది. ‘నువ్వు తలచినంతనే నీకు సాయంగా వస్తాను’ అని పలికి అదృశ్యమైంది.ఆనాటి నుంచి సుదర్శనుడు, మనోరమ నిరంతరం భక్తిగా దేవిని పూజించసాగారు. కొన్నాళ్లకు ఒకనాడు ఒక నిషాదుడు సుదర్శనుడిని చూడవచ్చాడు. అతడు ఒక రథాన్ని సుదర్శనుడికి కానుకగా సమర్పించాడు. అమ్మవారు ఇచ్చిన అస్త్రశస్త్రాలు ధరించి, నిషాదుడు బహూకరించిన రథంపై సుదర్శనుడు యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధంలో అతడికి అమ్మవారి శక్తి తోడుగా నిలిచింది.సుదర్శనుడి ధాటికి యుధాజిత్తు సేనలు కకావిలకమయ్యాయి. అతడి ధనుస్సు నుంచి వెలువడుతున్న బాణాలు తరుముకొస్తుంటే, వారంతా భీతావహులై పలాయనం చిత్తగించారు. యుద్ధంలో ఘనవిజయం సాధించిన సుదర్శనుడు తన రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. – సాంఖ్యాయన -
జగత్తంతా ఈశ్వరమయం!
ద్వారకలో శ్రీకృష్ణుడు సభలో కొలువుతీరి ఉండగా, ఒకరోజు ఒక బోయవాడు చేతిలో ఉత్తరంతో వచ్చి శ్రీకృష్ణుడి దర్శనాన్ని కోరగా, సేవకులు అతడిని శ్రీకృష్ణుడి సముఖానకు తెచ్చి, వచ్చిన పనియేదో ప్రభువుల వారితో విన్నవించుకోమనగా, ఆ బోయవాడు ‘కుండినపురంలోని భీష్మక మహారాజు సభలో అమాత్యులవారు వ్రాసి ఇచ్చిన వర్తమానాన్ని యేలినవారి సముఖాన పెట్టడానికి రయాన వచ్చాను ప్రభూ!’ అని వివరం చెప్పాడు.‘మహారాజశ్రీ అఖండలక్ష్మీ సమేతులైన శ్రీకృష్ణులవారికి మేము వ్రాసి పంపించే విన్నపము. ఇక్కడి సర్వక్షేమ స్థితిని శ్రీవారికి ఈవరకే తెలిపియుంటిమి. ఇప్పుడు విన్నవించుకొనుట యేమనగా– భీష్మక మహారాజులవారు వారి కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించి, స్వయంవరానికై రాజులందరికీ వర్తమానాలు పంపించారు. ఆ సందర్భంగా శ్రీకృష్ణులవారు కూడా వేంచేయాలని కోరుకుంటూ ఎంతో ఆదరంతో మిమ్ములను ఆహ్వానించమని మాకు ఉత్తరువులను ఇచ్చారు.కనుక స్వామివారు తప్పక విచ్చేయగలరని మా విన్నపము!’ అని ఆ లేఖలోని విషయాన్ని మంత్రివర్యులు చదివి వినిపించగా విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, సభలో కొలువై ఉన్న వారిని ఉద్దేశించి ‘కూతురు పెళ్ళి ఘనంగా చేయాలని ఉత్సాహంతో భీష్మక మహారాజు పంపిన వర్తమానాన్ని విన్నారు కదా! ఆ ఆహ్వానంపై మీ అభిప్రాయాన్ని ఆలోచించి చెబితే బాగుంటుంది. ఆప్తులైన మీరందరూ మేలైనదిగా ఏది అనుకుంటారో, ఆ దారిలో నడుచుకుంటేనే కదా ప్రభువునైన నాకు శుభం చేకూరుతుంది!’ అని అంటాడు. శ్రీకృష్ణుడి మాటలకు సభలోని అందరూ ముగ్ధులై–"నీరజనాభ కార్యముల నిశ్చయమిట్టిదటంచు దెల్పగా నేరుచువారలుం గలరె నీయెదుటన్ సకలాంతరాత్మవై నేరిచినట్టివారలను నేర్వనివారనిపించి దిద్దగానేరిచినట్టి దేవుడవు నీకొకరా యెఱిగించు నేర్పరుల్"‘ఓ పద్మనాభ స్వామీ! జరగవలసిన పనిని గురించి ‘ఇది ఇలా జరిగితే బాగుంటుంది’ అని మీకు చెప్పగలిగినవారు ఉన్నారా? సకలమూ తెలుసునని భావించేవారి చేత కూడా వారికి ఏమీ తెలియదని వొప్పించగలిగే నేర్పు కలిగిన దేవుడవైన మీకు చెప్పగలవారు ఎవరైనా ఈ ముల్లోకాలలోనూ ఉన్నారా?’ అని భక్తితో బదులిచ్చారని కోటేశ్వరకవి రచించిన ‘భోజసుతా పరిణయం’ కావ్యం, ప్రథమాశ్వాసంలోని సన్నివేశంలో రసవత్తరంగా వర్ణించబడింది. ‘సకలాంతరాత్మవు’ అని ఒక్క మాటలో ‘జగత్తులోని ప్రతిదీ ఈశ్వరాంశయే!’ అని చెప్పడం ఇందులో గ్రహించదగినది. – భట్టు వెంకటరావు -
వసు మహారాజు వృత్తాంతం! ఒకనాడు తన సోదరుల్లో..
కాశ్మీర దేశాన్ని పూర్వం వసువు అనే మహారాజు పరిపాలించేవాడు. ధర్మాధర్మాలు ఎరిగిన వసువు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించేవాడు. అతడి పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. నిత్యం యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ దేవతలను తృప్తిపరచేవాడు. నిరంతరం శ్రీమన్నారాయణుడినే మనసులో నిలుపుకొని ధర్మబద్ధ జీవనాన్ని కొనసాగించేవాడు.కొన్నాళ్లకు వసు మహారాజుకు మోక్ష కాంక్ష ఎక్కువైంది. రాజ్యభారాన్ని విడిచి, తపస్సు ద్వారా మోక్షాన్ని సాధించాలనే కోరిక పెరగడంతో, ఒకనాడు తన సోదరుల్లో సర్వసమర్థుడైన వివస్వంతుడిని పిలిచి, అతడి కుమారుడికి రాజ్యభారాన్ని అప్పగించాడు. తర్వాత బంధుమిత్ర పరివారాన్ని, రాజ్యాన్ని విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరాడు.కాలినడకన సాగుతూ దారిలో ఉన్న తీర్థాలన్నీ దర్శించుకుంటూ పరంధాముడైన శ్రీమన్నారాయణుడు పుండరీకాక్షుడిగా కొలువైన పుష్కర తీర్థానికి చేరుకున్నాడు. తన తపస్సుకు అనువైన క్షేత్రం పుష్కర తీర్థమేనని తలచి, అక్కడ తగిన చోటు వెదుక్కుని తపోదీక్షలో కూర్చున్నాడు. శరీరం శుష్కించిపోయేలా కఠోర తపస్సు సాగించాడు. పుండరీకాక్షుడే పరమదైవంగా భావిస్తూ ఒకనాడు ఆశువుగా స్తోత్రాన్ని పఠించసాగాడు.‘నమస్తే పుండరీకాక్ష నమస్తే మధుసూదన/ నమస్తే సర్వలోకేశ నమస్తే తిగ్మచక్రిణే/ విశ్వమూర్తి మహాబాహుం వరదం సర్వతేజసమ్/ నమామి పుండరీకాక్షం విద్యా విద్యాత్మకం ప్రభుం/ ఆదిదేవం మహాదేవం వేద వేదాంగ పారగం/ గంభీరం సర్వదేవానాం నమామి మధుసూదనం..’ అంటూ వసు మహారాజు పుండరీకాక్ష పారస్తుతిని పఠిస్తుండగా, ఒక్కసారిగా అతడి ముందు ఒక భయంకరాకారుడు ప్రత్యక్షమయ్యాడు. తుమ్మమొద్దులాంటి నల్లని దేహంతో, చింతనిప్పుల్లాంటి ఎర్రని కళ్లతో ఉన్నాడు. అతడు ‘రాజా! ఏమి ఆజ్ఞ!’ అని అడిగాడు.ఈ పరిణామానికి వసు మహారాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. ‘ఓయీ కిరాతకా! ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు?’ అని ప్రశ్నించాడు. ‘రాజా! పూర్వం నువ్వు దక్షిణపథాన ధర్మప్రభువుగా ఉన్నావు. ఒకనాడు మృగయావినోదం కోసం అడవికి వెళ్లావు. అక్కడ జంతువులను వేటాడుతూ నువ్వు సంధించిన బాణం పొరపాటున ఒక మునికి తగిలింది. ముని ఆర్తనాదం విని నువ్వు హుటాహుటిన అతడి వద్దకు చేరుకున్నావు. అప్పటికే అతడు మరణించాడు. అనుకోని ఆ సంఘటనకు నీలో ఆందోళన కలిగింది. బ్రహ్మహత్యకు పాల్పడినందుకు బాధతో లోలోపలే కుమిలిపోయావు. రాజ్యానికి చేరుకున్న తర్వాత ఈ వృత్తాంతాన్ని నీ ఆంతరంగికుడికి చెప్పావు. అయినా అపరాధ భావన నీ మనసును తొలిచేయసాగింది. ఎలాగైనా ఆ పాపం నుంచి విముక్తి పొందుదామని భావించావు. శ్రీమన్నారాయణుడిని మనసారా ధ్యానించి ద్వాదశినాడు ఉపవాసం ఉన్నావు. ఆ పుణ్యదినాన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కోసం ఒక బ్రాహ్మణుడికి గోదానం చేశావు. ఆ వెంటనే ఉదరశూలతో బాధపడుతూ నువ్వు ప్రాణాలు వదిలావు. ప్రాణాలు వదులుతున్న సమయంలో అప్పటి నీ భార్య ‘నారాయణి’ పేరును ఉచ్చరించావు. ఆ కారణంగా నీకు ఒక కల్పం వరకు విష్ణులోక నివాసయోగం లభించింది.రాజా! నేనొక బ్రహ్మరాక్షసుడిని. అత్యంత ఘోరమైన వాణ్ణి. నీ దేహంలోనే ఉన్న నాకు ఇదంతా తెలుసు. నేను నిన్నెలాగైనా పీడించాలని అనుకున్నాను. ఇంతలో విష్ణుదూతలు నన్ను బయటకు లాగి రోకళ్లతో చావగొట్టారు. ఇక లోపలికి ప్రవేశించలేక నీ రోమకూపాల నుంచి పూర్తిగా బయటపడ్డాను. నువ్వు స్వర్గంలోకి ప్రవేశించావు. నీలో నా తేజస్సును నింపి నేను కూడా నీతో పాటు స్వర్గానికి వచ్చాను. ఇదంతా గడచిన కల్పంలో జరిగిన చరిత్ర.ఈ కల్పంలో నువ్వు కాశ్మీర రాజకుమారుడిగా జన్మించావు. ఆనాటి నుంచి నేను నీ రోమకూపాల్లోనే ఉండిపోయాను. నువ్వు ఎన్నో గొప్ప గొప్ప యాగాలు చేశావు. అవేవీ నన్ను ఏమీ చేయలేకపోయాయి. అయితే, రాజా! ఇప్పుడు నువ్వు పుండరీకాక్ష పారస్తుతిని పఠించగానే నేను నీ రోమకూపాల నుంచి బయటపడి, ఇలా కిరాతుడిలా ఏకరూపాన్ని పొందాను. పరమాత్ముడి స్తోత్రాన్ని విని పూర్వజన్మలో చేసిన పాపాల నుంచి విముక్తిని పొందాను. నాకిప్పుడు ధర్మబుద్ధి కలిగింది’ అని చెప్పాడు. కిరాతుడి ద్వారా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్న వసు మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. తన జన్మాంతర వృత్తాంతాన్ని చెప్పిన కిరాతుడిని వరం కోరుకోమన్నాడు. పరమాత్మ జ్ఞానం తప్ప తనకు వరమేదీ అక్కర్లేదన్నాడు కిరాతుడు. ‘ఓ కిరాతుడా! నీ వల్ల నా పూర్వజన్మ వృత్తాంతమంతా తెలుసుకున్నాను. నీకు అనేకానేక కృతజ్ఞతలు. ఇకపై నువ్వు నా అనుగ్రహంతో ధర్మవ్యాధుడిగా ప్రసిద్ధి పొందుతావు. జ్ఞానమార్గంలో మోక్షం పొందుతావు. పుండరీకాక్షుడైన శ్రీమన్నారాయణుడే పరమదైవమని తలచి, భక్తిశ్రద్ధలతో ఈ పుండరీకాక్ష పారస్తుతిని పారాయణం చేసిన వారికి, ఆలకించిన వారికి పుష్కరతీర్థంలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది’ అని పలికాడు వసు మహారాజు. వెంటనే అతడి ముందు ఒక దివ్యవిమానం వచ్చి నిలిచింది. దేవదూతలు అతడికి సాదరంగా స్వాగతం పలికారు. తమతో పాటు విమానంలోకి ఎక్కించుకుని, వసు మహారాజును స్వర్గానికి తీసుకుపోయారు. – సాంఖ్యాయన -
Hanuman Jayanti: ఈ అద్భుత తెలివితేటలే.. శ్రీరామ–సుగ్రీవ మైత్రి కలిసేలా..
భారత దేశంలో అత్యధిక భక్తుల చేత నిత్యం ఆరాధించబడుతున్న దైవం ఆంజనేయ స్వామి. పురాణాల్లో ఏ దేవునికీ లేని ప్రత్యేకత హనుమంతుని సొంతం. హనుమంతుడు గొప్ప వ్యాకరణశాస్త్ర పండితుడు. బాల్యంలో కఠోర దీక్షతో, శ్రద్ధగా సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్నాడు. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాలు తెలిసిన వ్యక్తి. ఎదుటివారిని ఆకట్టుకునేలా ప్రసంగించే వాక్చాతుర్యం ఆయన సొంతం.ఈ అద్భుత తెలివితేటలే శ్రీరామ–సుగ్రీవ మైత్రిని కలిసేలా చేసింది. శ్రీరాముణ్ణి యజమానిగా, సుగ్రీవుణ్ణి మహారాజుగా ఇద్దరికీ సమ ప్రాధాన్యత నిచ్చాడు. లంకలో రావణునికి నీతి వచనాలతో హిత బోధ చేశాడు. మనం హనుమంతుని జీవిత చరిత్ర నుండి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎదుటి వారిని మెప్పించే నైపుణ్యం, యజమాని (మనం పని చేసే డిపార్ట్మెంట్/కంపెనీ) పట్ల పూర్తి విధేయత, నమ్మకం, సంపూర్ణ విశ్వసనీయతతో ఎలా ఉండాలి వంటివి నేర్చుకోవచ్చు.ఇంతేనా... ఆయన నుంచి నేర్చుకోవలసిన సుగుణాలు చాలానే ఉన్నాయి. ఎదుటివారిపట్ల సముచిత గౌరవం, నమ్మిన వారి కోసం ఏమైనా చేసే త్యాగనిరతి, శత్రువుల పట్ల సమ న్యాయబద్ధంగా వ్యవహరించే మాటతీరు, గురువు పట్ల నిస్వార్థ భక్తి భావన, రాజ్యం పట్ల సైనికుడిగా విద్యుక్త ధర్మం, నిరాడంబర జీవనం, అన్ని తెలిసినా ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస, ధర్మరక్షణ కోసం శ్రమించే వీరత్వం, ఆపద సమయంలో ప్రదర్శించే ఆత్మ విశ్వాసం లాంటివి ముఖ్యమైనవి.తాను ఎంత బలవంతుడైనప్పటికీ అతి సాధారణంగా జీవించడం హనుమంతుడు మనకు నేర్పాడు. సముద్రాన్ని దాటినా, లంకను సగం కాల్చినా, సీతమ్మను తీసుకువచ్చే బలం ఉన్నా... ఎప్పుడూ పొంగిపోలేదు. సుగ్రీవుని వేలాది సైన్యంలో తానూ ఒక సైనికుడిగా రాచకార్యంలో భాగంగానే ఈ పనులు నిర్వర్తించానని భావించాడు. ఇంత చేసి అంత చెప్పుకునే చాలామందికి హనుమాన్ కనువిప్పు. ఆధునిక భావి తరానికి చక్కని మార్గదర్శి. హనుమంతుని జీవనాన్ని అధ్యయనం చేసిన వారికే ఆ గొప్పతనం తెలుస్తుంది. – భైతి దుర్గయ్య (నేడు హనుమాన్ జయంతి) -
తిరుపతి : గంగమ్మకు మరు పొంగళ్లు సమర్పించిన భక్తులు (ఫొటోలు)
-
Short Story: ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో..
ఒకానొకప్పుడు సౌరాష్ట్రంలో ఒక క్షత్రియుడు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలను పీడించుకు తిన్నాడు. నిస్సహాయులైన ప్రజలు అతడిని నేరుగా ఏమీ అనలేక లోలోపలే అతడిని తిట్టుకునేవారు. అతడి ప్రస్తావన వస్తేనే చాలు, చీత్కరించుకునేవారు. జన్మలో ఎలాంటి పుణ్యకార్యం చేయని ఆ క్షత్రియుడు కాలం తీరి మరణించాడు. పూర్వజన్మ పాపకర్మల ఫలితంగా బ్రహ్మరాక్షసుడిగా జన్మించాడు.నర్మదానది పరిసరాల్లోని అడవుల్లో దొరికిన జీవిని దొరికినట్లే తింటూ తిరుగుతుండేవాడు. పొరపాటున ఆ అడవిలోకి మనుషులు ఎవరైనా అడుగుపెడితే వారిని కూడా తినేస్తూ నరమాంస భక్షకుడిగా మారాడు. బ్రహ్మరాక్షసుడి ధాటికి భయపడి మనుషులు ఆ అడవిలోకి అడుగుపెట్టడమే మానుకున్నారు. ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుడి ఆశ్రమానికి వచ్చాడు. నరమాంసం తిని చాలారోజులు కావడంతో ఆ బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని ఎలాగైనా తినేయాలని అనుకున్నాడు. అయితే, మంత్ర యోగ విద్యల్లో ఆరితేరిన ఆ మునీశ్వరుడు సామాన్యుడు కాదు. బ్రహ్మరాక్షసుడి ప్రయత్నాన్ని గ్రహించి, మహా మహిమాన్వితమైన విష్ణుపంజర స్తోత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. స్తోత్ర ప్రభావంతో బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని సమీపించ లేకపోయాడు. అయినా, ఆశ చావని బ్రహ్మరాక్షసుడు అదను చూసుకుని మునీశ్వరుడిని తినేయాలనుకుని, ఆశ్రమం బయటే కాచుకుని ఉన్నాడు. అలా నాలుగు నెలలు గడచిపోయాయి. అన్నాళ్లు వేచి చూడటంతో బ్రహ్మరాక్షసుడి శక్తి క్షీణించింది. శరీరం నీరసించింది. అడుగు వేసే ఓపిక లేక అతడు అక్కడే కూలబడిపోయాడు. ధ్యానం నుంచి లేచిన మునీశ్వరుడు ఆశ్రమం వెలుపల కూలబడిన రాక్షసుడిని చూశాడు. అతడిపై జాలిపడ్డాడు. నీరసించిన రాక్షసుడు నెమ్మదిగా పైకిలేచి, ఓపిక తెచ్చుకుని ‘మహాత్మా! నేను ఎన్నో పాపాలు చేశాను. అడవిలో తిరుగాడే జంతువులనే కాదు, అడవిలోకి అడుగుపెట్టిన ఎందరో మనుషులను కూడా చంపి తిన్నాను. నా పాపాలు తొలగిపోయే మార్గం చెప్పండి’ అని దీనంగా ప్రార్థించాడు.‘ఓయీ రాక్షసా! నేను నరమాంసభక్షకులకు ఉపదేశం చేయను. పాపోపశమన మార్గం ఎవరైనా విప్రులను అడిగి తెలుసుకో! ముందుగా నువ్వు నరమాంసభక్షణ మానేయి’ అని చెప్పి మునీశ్వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బ్రహ్మరాక్షసుడు ఆనాటి నుంచి మనుషులను చంపి తినడం మానేశాడు. కేవలం వన్యమృగాలను మాత్రమే వేటాడి, వాటిని చంపి తింటూ, తన పాపాలు ఎలా తొలగిపోతాయా అని చింతిస్తూ ఉండసాగాడు. కొద్దిరోజులు రాక్షసుడికి అడవిలో ఆహారం దొరకలేదు. ఆకలితో ఉన్న బ్రహ్మరాక్షసుడు ఆహారాన్వేషణ కోసం అడవికి వచ్చాడు. ఎంతసేపు ప్రయత్నించినా ఒక్క జంతువైనా దొరకలేదు. మధ్యాహ్నం కావస్తుండగా రాక్షసుడికి ఆకలి బాగా పెరిగింది. సరిగ్గా అదే సమయానికి ఒక బ్రాహ్మణ యువకుడు పండ్లు కోసుకోవడానికి అడవిలోకి వచ్చాడు.ఆకలి తీవ్రత పెరగడంతో బ్రహ్మరాక్షసుడు తన పూర్వ నియమాన్ని పక్కనపెట్టి, బ్రాహ్మణ యువకుడిని భక్షించి ఆకలి తీర్చుకోవాలని భావించాడు. ఒక్క ఉదుటన అతడి వద్దకు చేరుకుని, అతడిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి బ్రాహ్మణ యువకుడు భయభ్రాంతుడయ్యాడు. రాక్షసుడి చేతిలో ఎలాగూ చావు తప్పదనే నిశ్చయానికి వచ్చిన బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నన్ను ఎందుకు పట్టుకున్నావో చెప్పు. నువ్వు నన్ను వదలాలంటే నేనేం చేయాలో చెప్పు’ అని అడిగాడు.‘ఓరీ మానవా! నేను నరమాంస భక్షకుడిని. వారం రోజులుగా నాకు ఆహారం దొరకలేదు. చివరకు నువ్వు దొరికావు. నిన్ను విడిచిపెడితే నాకు ఆకలి ఎలా తీరుతుంది?’ అన్నాడు. ‘రాక్షసా! నేను మా గురువుగారికి ఆహారంగా ఫలాలు తీసుకుపోవడానికి వచ్చాను. నీకు ఆహారమవడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. కొద్దిసేపు గడువిస్తే నేను ఈ ఫలాలను నా గురువుగారికి ఇచ్చి వస్తాను’ అన్నాడు బ్రాహ్మణ యువకుడు. ‘దొరక్క దొరక్క దొరికావు. నిన్ను విడిచిపెట్టాక నువ్వు తిరిగి రాకపోతే నా గతేమిటి? అయితే, ఒక పని చేశావంటే నిన్ను విడిచిపెడతాను. నేను ఇంతవరకు చాలా పాపాలు చేశాను. జాలి దయ లేకుండా ఎందరో మనుషులను చంపి తినేశాను. నా పాపాల నుంచి విముక్తి పొందే మార్గం చెప్పావంటే నిన్ను తినకుండా వదిలేస్తాను’ అన్నాడు.బ్రాహ్మణ యువకుడికి ఏమీ తోచలేదు. చివరకు తాను నిత్యం పూజించే అగ్నిదేవుడిని స్మరించుకున్నాడు. అతడి ప్రార్థనకు అగ్నిదేవుడు స్పందించాడు. అతడికి సాయం చేయమని సరస్వతీదేవిని కోరాడు. అగ్ని కోరిక మేరకు సరస్వతీదేవి బ్రాహ్మణ యువకుడికి మాత్రమే కనిపించి, ‘నాయనా భయపడకు. నీ నాలుక మీద నిలిచి ఒక దివ్యస్తోత్రాన్ని పలికిస్తాను. అది విన్న రాక్షసుడు నిన్ను విడిచిపెడతాడు’ అని చెప్పింది.సరస్వతీదేవి మాటతో ధైర్యం తెచ్చుకున్న బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నేనిప్పుడు ఒక దివ్యస్తోత్రం వినిపిస్తాను. ఈ స్తోత్రాన్ని త్రికాలాల్లోనూ పఠించావంటే, నీ సమస్త పాపాలూ నశించి, తుష్టి, పుష్టి, శాంతి కలుగుతాయి’ అని చెప్పి తన నోట నిలిచిన సరస్వతీదేవి అనుగ్రహంతో విష్ణుసారస్వత స్తోత్రాన్ని ఆశువుగా పఠించాడు.బ్రాహ్మణ యువకుడు దివ్యస్తోత్రాన్ని బోధించగానే బ్రహ్మరాక్షసుడు ఎంతో సంతోషించి, అతడిని తినకుండా వదిలేశాడు. బ్రాహ్మణ యువకుడు రాక్షసుడికి నీతులు బోధించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. – సాంఖ్యాయనఇవి చదవండి: Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'! -
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం (ఫొటోలు)
-
'అంధకాసుర వధ'! ఒకనాడు కైలాస పర్వతంపై..
శివపార్వతులు ఒకనాడు కైలాస పర్వతంపై ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. శివుడిని ఆటపట్టించడానికి పార్వతీదేవి వెనుక నుంచి ఆయన కళ్లు మూసింది. పరమేశ్వరుడి కళ్లు మూయడంతో కొన్ని క్షణాలు అంతటా చీకటి ఆవరించింది. అప్పుడు అంధుడైన ఒక బాలుడు జన్మించాడు. సంతానం కోసం తన గురించి తపస్సు చేస్తున్న హిరణ్యాక్షుడికి శివుడు ఆ బాలుడిని అప్పగించాడు. పుట్టు అంధుడు కావడం వల్ల ఆ బాలుడికి అంధకుడనే పేరు వచ్చింది.అంధకుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అంధకుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతడి అంధత్వాన్ని పోగొట్టడమే కాకుండా, అనేక వరాలనిచ్చాడు. వరగర్వితుడైన అంధకుడు ముల్లోకాలను పట్టి పీడించడం మొదలుపెట్టాడు. ఒకనాడు అంధకుడు కైలాసంలో సంచరిస్తున్న శివపార్వతులను చూశాడు. అతడికి పార్వతీదేవిపై మోహం కలిగింది. పార్వతీదేవిని తనకు అప్పగించాలని, లేకుంటే తనతో యుద్ధానికి సిద్ధపడాలని శివుడికి కబురు పంపాడు. అంధకుడి అనుచితమైన కోరిక తెలుసుకున్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అంధకుడితో యుద్ధానికి తలపడ్డాడు. అవంతీ దేశంలోని మహాకాలవనంలో ఇద్దరికీ భీకరమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో అంధకుడు శివుడిని నానా రకాలుగా బాధించాడు. సహనం నశించిన పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బకు అంధకుడి శరీరం నుంచి రక్తం ధారలు కట్టింది. ఆ రక్తధారల నుంచి అనేక అంధకాసురులు పుట్టుకొచ్చారు. శివుడు సంహరించే కొద్ది మరింత మందిగా పుట్టుకు రాసాగారు.అంధకుడి నెత్తురు కిందపడకుండానే తాగేయడానికి మహేశ్వరి, బ్రహ్మీ, కౌమారి, మాలినీ, సౌవర్ణీ తదితర 189 మాతృకా శక్తులను శివుడు సృష్టించాడు. ఈ మాతృకా శక్తులు అంధకాసురుడి శరీరం నుంచి ధారగా కారుతున్న రక్తాన్ని తాగేశారు. అంధకాసురుడి రక్తం తాగి తృప్తి చెందిన మాతృకలు కొద్దిసేపు ఆగారు. ఈలోగా మరింతమంది అంధకాసురులు పుట్టుకొచ్చి రకరకాల ఆయుధాలతో పరమశివుడిని బాధించడం ప్రారంభించారు.అంధకాసురుడి బాధ భరించలేక శివుడు చివరకు మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు హుటాహుటిన అక్కడకు చేరుకుని, శుష్కరేవతి అనే శక్తిని సృష్టించాడు. ఆ శక్తి వెళ్లి అంధకాసురుడి శరీరంలోని రక్తాన్ని చుక్కయినా వదలకుండా పీల్చేసింది. దాంతో కొత్త అంధకాసురులు పుట్టడం ఆగిపోయింది. పోరులో మిగిలిన అంధకాసురులను శివుడు సంహరించాడు.చివరకు శివుడు తన త్రిశూలంతో అసలు అంధకుడిని పొడిచాడు. అతడు నేలకూలి మరణించబోతూ శివుడిని భక్తిగా స్తుతించాడు. మరణానంతరం తనకు శివ సాన్నిధ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించాడు. శివుడు ‘తథాస్తు’ అన్నాడు. అంధకాసురుడు తృప్తిగా కన్నమూశాడు. అంధకాసురుడి మరణం తర్వాత రక్తం రుచి మరిగిన 189 మాతృకలకు ఇంకా ఆకలి తీరలేదు. వారంతా శివుడి వద్దకు వచ్చి, ‘శంకరా! మా ఆకలి ఇంకా తీరలేదు. చాలా ఆకలిగా ఉంది. నువ్వు అనుమతిస్తే, సమస్త ప్రాణులనూ భక్షిస్తాం’ అన్నారు. మాతృకల కోరిక విని శివుడు దిగ్భ్రాంతి చెందాడు. ‘మాతృకలారా! మీ ఆలోచన తప్పు. మీరంతా లోకాన్ని రక్షించాలి గాని, భక్షించాలని కోరుకోవడం దారుణం’ అన్నాడు.మాతృకలు శివుడి మాటలను లెక్కచేయకుండా, ముల్లోకాలలోనూ ప్రాణులను భక్షించడం మొదలుపెట్టారు. మాతృకల ఆగడానికి దేవ దానవ మానవులందరూ హాహాకారాలు ప్రారంభించారు. శివుడు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు. తాను సృష్టించిన మాతృకలను తానే సంహరించలేక, కనీసం వాని నిలువరించలేక సతమతమయ్యాడు. చివరకు శివుడు నరసింహావతారాన్ని స్మరించాడు. మెరిసే జూలుతో కూడిన సింహం తల, పదునైన గోళ్లు, పెద్దకోరలతో సాగరఘోషను మించిన భీకర గర్జన చేస్తూ నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు నరసింహుడిని పరిపరి విధాలుగా స్తుతించాడు. ‘స్వామీ! నేను సృష్టించిన మాతృకలు నా అదుపు తప్పారు. నా మాటను లక్ష్యపెట్టకుండా లోకాలను భక్షిస్తున్నారు. నా చేతులతో సృష్టించిన వారిని నేను నాశనం చేయలేకపోతున్నాను. కనుక నువ్వే మాతృకలను అదుపు చేయాలి’ అని ప్రార్థించాడు.శివుడి విన్నపాన్ని ఆలకించిన నరసింహుడు వాగీశ్వరి, మాయ, భగమాలిని, కాళి అనే నాలుగు శక్తులను, వారికి అనుచరులుగా ఉండటానికి మరో ముప్పయిరెండు దేవతా శక్తులను సృష్టించాడు. నరసింహుడి ఆజ్ఞతో ఈ శక్తులన్నీ కలసి లోకాలను భక్షిస్తున్న మాతృకలపై మూకుమ్మడిగా దాడి చేశాయి. నృసింహ శక్తుల ధాటికి తట్టుకోని మాతృకలు పరుగు పరుగున వచ్చి నరసింహుడి పాదాల ముందు మోకరిల్లి శరణు వేడుకున్నాయి. నరసింహుడు వారికి అభయమిచ్చాడు.‘మాతృకలారా! దేవతా శక్తులు మానవులను దయతో పాలించాలి, వారిని భక్షించకూడదు. నా మాట ప్రకారం మీరు ఈనాటి నుంచి లోకాలను పాలిస్తూ, అందరూ పరమేశ్వరుణ్ణి పూజించేలా చేయండి. నా భక్తులకు, శివభక్తులకు, మీకు బలులు సమర్పించేవారికి రక్షణ కల్పిస్తూ, వారు కోరిన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తూ ఉండండి. రానున్న కాలంలో మీరందరూ మానవుల పూజలు అందుకుంటారు’ అని చెప్పి, నరసింహుడు తాను సృష్టించిన శక్తులతో పాటు అంతర్ధానమయ్యాడు. మాతృకలు ఆనాటి నుంచి నరసింహుడు ఆజ్ఞాపించిన ప్రకారం శాంతియుతంగా మారి లోకాలను కాపాడుతూ వస్తున్నారు. – సాంఖ్యాయనఇవి చదవండి: 'క్రమశిక్షణ' అంటే వెంటనే గుర్తుకొచ్చేది...! -
Tataiahgunta Gangamma Jatara: వైభవంగా తాతయ్యగుంట గంగమ్మజాతర (ఫొటోలు)
-
తిరుమల : వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు (ఫొటోలు)
-
గంగమ్మ జాతర : అమ్మా.. గంగమ్మ తల్లీ.. చల్లంగా చూడు (ఫొటోలు)
-
ఘనంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
కైలాసంలో శ్రీకృష్ణుడు! 'ఒకనాడు శుభముహూర్తం చూసుకుని'..
శ్రీకృష్ణుడు పుత్రసంతానం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు శుభముహూర్తం చూసుకుని, ద్వారకా నగరం నుంచి బయలుదేరి, గంగా తీరంలోని ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఉపమన్యుడి ఆశ్రమంలో రుద్రాక్షలు ధరించి, శరీరమంతా భస్మ లేపనాలు పూసుకున్న మునులు రుద్ర మంత్రాలను జపిస్తూ ఉన్నారు. శివ తపస్సంపన్నులైన ఆ మునులను చూసి, శ్రీకృష్ణుడు నమస్కరించారు. వారందరూ శంఖ చక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుడికి ప్రతి నమస్కారాలు చేసి, ఆహ్వానించారు. వారు వెంట రాగా శ్రీకృష్ణుడు ఉపమన్యుడి కుటీరంలోకి అడుగు పెట్టాడు.శ్రీకృష్ణుడిని చూసి ఉపమన్యుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. లేచి ఎదురేగి, కృష్ణుణ్ణి ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ప్రభూ! పరమయోగులకు సైతం దుర్లభమైన నీ దర్శనం ఆశ్చర్యకరంగా ఉంది. నీ రాక నాకు అమితానందం కలిగిస్తోంది. నీ రాకకు కారణం తెలుసుకోవచ్చునా?’ అని అడిగాడు.పరమ యోగీశ్వరుడైన ఉపమన్యుడికి శ్రీకృష్ణుడు నమస్కరించి, ‘మహాత్మా! నేను శంకరుణ్ణి దర్శించాలని అనుకుంటున్నాను. నువ్వు భగవంతుడి దర్శనం చేయించగల సమర్థుడివి. ఏం చేస్తే నేను పరమేశ్వరుణ్ణి చూడగలను?’ అని అడిగాడు. ‘భక్తితో తపస్సు చేయడం వల్లనే పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. అందువల్ల ఈ ఆశ్రమంలో ఆయన కోసం తపస్సు చేయి’ అని చెప్పాడు ఉపమన్యుడు.ఉపమన్యుడి ద్వారా దీక్ష తీసుకున్న శ్రీకృష్ణుడు నార వస్త్రాలు ధరించి, శరీరమంతా భస్మాన్ని పూసుకుని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి కఠినమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక పరమశివుడు పార్వతీ సమేతంగా ఆకాశమార్గంలో నిలబడి శ్రీకృష్ణుడికి దర్శనం ఇచ్చాడు. కిరీటం, త్రిశూలం, పినాక ధనువు, పులిచర్మంతో కూడిన వస్త్రం ధరించిన శివరూపంలో ఒకవైపు, శంఖ చక్ర గదా ఖడ్గాలు ధరించిన విష్ణురూపంలో మరోవైపు శ్రీకృష్ణుడికి పరమేశ్వర దర్శనం కలిగింది. పరమశివుడికి అంజలి ఘటిస్తూ నిలుచున్న దేవేంద్రుడు, హంస వాహనంపై ఆసీనుడైన బ్రహ్మదేవుడు, నంది, కుమారస్వామి, గణపతి సహా మహా మునిపుంగవులందరూ పరమశివుడితో కలసి శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడు పరమానందభరితుడై పరమశివుడిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రాన్ని పఠించాడు.పరమశివుడు ఆదరంగా శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకుని, ‘కృష్ణా! నువ్వే అందరి కోరికలు తీర్చేవాడివి కదా, ఎందుకు తపస్సు చేస్తున్నావు? నువ్వెవరివో నీకు జ్ఞాపకం రావడం లేదా? నువ్వే అనంతుడివి, అప్రమేయుడివి, సాక్షాత్తు నారాయణుడివని తెలుసుకో’ అన్నాడు.శ్రీకృష్ణుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ‘శంకరా! నీ వల్ల మాత్రమే తీరే కోరికను కోరుతున్నాను. అందుకే తపస్సు చేశాను. నాకు నాతో సమానుడైన వాడు, పరమ శివభక్తుడు అయిన కుమారుడు కావాలి. అనుగ్రహించు’ అన్నాడు. కృష్ణుడి భక్తికి పార్వతీ పరమేశ్వరులు అమితానందం చెందారు. తమతో పాటు కొన్నాళ్లు కైలాసంలో గడపవలసిందిగా కోరి, అతణ్ణి ఆకాశమార్గాన కైలాసానికి తీసుకుపోయారు. కృష్ణుణ్ణి కూడా కైలాసవాసులు పరమశివుడితో సమానంగా పూజించసాగారు. కృష్ణుడు కైలాసంలో ఆనందంగా విహరించసాగాడు.కృష్ణుడు ద్వారకానగరంలో కనిపించి అప్పటికే చాలా రోజులు గడచిపోయాయి. కృష్ణుణ్ణి చూసిపోదామని ఒకనాడు గరుత్మంతుడు వచ్చాడు. పరిస్థితి తెలుసుకుని, కృష్ణుణ్ణి వెదకడానికి బయలుదేరాడు. ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కృష్ణుడు లేకపోవడంతో ద్వారకకు వెనుదిరిగాడు. సరిగా అప్పుడే, కృష్ణుడు లేడని తెలుసుకుని, కొందరు రాక్షసులు ద్వారక మీద దండెత్తారు. గరుత్మంతుడు యుద్ధం చేసి వారందరినీ సంహరించి ద్వారకా నగరాన్ని కాపాడాడు.కొన్నాళ్లకు నారద మహర్షి కైలాసంలో శ్రీకృష్ణుడిని చూసి, అక్కడి నుంచి నేరుగా ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకా పురప్రజలు ఆయన చుట్టూ చేరి, ‘మహర్షీ! మా కృష్ణుడు నగరాన్ని విడిచి వెళ్లి చాలా రోజులైంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన క్షేమ సమాచారాలు ఏమైనా మీకు తెలుసా?’ అని అడిగారు.‘ప్రజలారా! భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు కైలాసంలో ఉన్నాడు. అక్కడ ఆయన ఆనందంగా విహరిస్తున్నాడు. కొద్దిరోజులుగా అక్కడే ఉంటూ పార్వతీ పరమేశ్వరుల ఆతిథ్యం పొందుతున్నాడు. నేను ఆయనను చూసే ఇక్కడకు వచ్చాను’ అని చెప్పాడు.నారదుడి మాటలు వినగానే గరుత్మంతుడు వెంటనే ఎగిరి వెళ్లి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు దివ్యసింహాసనంపై పరమశివుడి పక్కనే ఆసీనుడై కనిపించాడు. గరుత్మంతుడు పరమేశ్వరుడికి, కృష్ణుడికి నమస్కరించాడు.కృష్ణుడి వద్దకు వెళ్లి, ‘స్వామీ! నువ్వు రోజుల తరబడి కనిపించకపోవడంతో ద్వారకా వాసులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి ద్వారకకు నాతో పాటు రావలసినదిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు.కృష్ణుడు పార్వతీ పరమేశ్వరుల వద్ద అనుమతి తీసుకుని, గరుత్మంతుడిని అధిరోహించి ద్వారకకు చేరుకున్నాడు. కృష్ణుడు నగరంలో అడుగుపెడుతూనే ద్వారకా వాసులు ఆయనకు ఘనస్వాగతాలు పలికి, అడుగడుగునా మంగళహారతులతో నీరాజనాలు పట్టారు.కొంతకాలానికి శ్రీకృష్ణుడికి జాంబవతి ద్వారా పరమేశ్వరుడి వరప్రసాదంగా సాంబుడు జన్మించాడు. సాంబుడు శ్రీకృష్ణుడంతటి పరాక్రమవంతుడిగా, పరమ శివభక్తుడిగా ప్రసిద్ధి పొందాడు. – సాంఖ్యాయన -
Badrinath Temple Photos: జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన ఆధ్యాత్మిక యాత్ర (ఫొటోలు)
-
Simhachalam Temple: సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భక్తుల రద్దీ (ఫొటోలు)
-
Badrinath In Hyderabad: హైదరాబాద్ శివారులో బద్రీనాథుడు.. అచ్చం ఉత్తరాఖండ్ లాగే నిర్మాణం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లోనే కోల్కత్తా కాళీ మందిర్.. స్వర్ణశిల్పి టెంపుల్ ప్రత్యేక (ఫొటోలు)