
కంచరపాలెం : కంచరపాలెం పరిధి రామ్మూర్తిపంతులుపేట ఆరాధ్య దైవం పైడిమాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలేళ్ల సంబరం సోమవారం ఘనంగా నిర్వహించారు

ఈ సందర్భంగా ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణం నుంచి అమ్మవారి ప్రతిమలను ఊరేగింపుగా తీసుకొచ్చారు

అమ్మవారి ప్రధాన విగ్రహాన్ని ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ దంపతులు, గ్రామ కమిటీ సభ్యులు తోడ్కొని వచ్చి తొలేళ్ల సంబరాన్ని ప్రారంభించారు.

పలు వేషధారణలు, నేలవేషాలు ఆకట్టుకున్నాయి

సుమారు 385 అమ్మవారి ప్రతిమలు ఊరేగింపుగా తీసుకొచ్చారు

వేలాది మంది భక్తులు తరలివచ్చారు







