Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Acb Court Issues Key Orders On Jail Facilities For Mp Mithun Reddy1
ఎంపీ మిథున్‌రెడ్డికి వసతులపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

సాక్షి, విజయవాడ: రాజమండ్రి సెంట్రల్‌ జైలు అధికారులకు ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ మిథున్‌రెడ్డికి జైల్లో వసతులపై ఆదేశాలిచ్చిన ఏసీబీ కోర్టు.. వారంలో మూడు సార్లు లాయర్ల ములాఖత్‌కు అనుమతి ఇచ్చింది.వారానికి మూడు సార్లు కుటుంబసభ్యుల ములాఖత్‌కు కూడా కోర్టు అనుమతులు ఇచ్చింది. బెడ్ సదుపాయం కల్పించాలని కోర్టు ఆదేశించింది. రోజుకొకసారి ఇంటి భోజనం తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు.. న్యూస్ పేపర్, మినరల్ వాటర్ అనుమతించాలని ఆదేశించింది.మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. రాజమండ్రి జైల్లో తనకు కేటాయించిన బ్లాక్‌లో సరైన సదుపాయలు లేవని చెబుతూ ఆయన పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఎంపీ మిథున్‌రెడ్డి సదుపాయాల పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా? అని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారిని ఏసీబీ జడ్జి ప్రశ్నించారు.అయితే.. కోర్టు ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని జైలు అధికారులు చెప్పారు. దీంతో.. చట్టాలు చేసే వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలి కదా అని జడ్జి అన్నారు. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్‌ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ పిటిషన్లపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Ysrcp Legal Cell Manohar Reddy Fires On Chandrababu2
మద్యం కేసు ఛార్జీషీట్‌లో అన్ని కట్టుకథలే: మనోహర్‌రెడ్డి

సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు ఛార్జిషీట్‌లో అన్నీ కట్టు కథలేనని.. వేధింపులు, అబద్దపు వాంగ్మూలాలు తప్ప మరేమీ లేవని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్సారసీపీ నేతలను ఎక్కువ కాలం జైల్లో ఉంచాలనే కుట్రతోనే సిట్ పని చేస్తోందని.. అనేక కుంభకోణాలకు బిగ్‌బాస్ చంద్రబాబేనని మనోహర్‌రెడ్డి అన్నారు.మద్యం కేసులో అక్రమ అరెస్టులు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి కోర్టుకు తన ఆవేదనను వెలిబుచ్చారు. ఎల్లో మీడియా వలన తన కుటుంబం పడుతున్న ఆవేదనను కోర్టు ముందు పెట్టారు. విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నట్టు ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. ఎల్లోమీడియా రాసే వార్తలే ఛార్జిషీట్, రిమాండ్ రిపోర్టుల్లో కనిపిస్తోంది. మా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ రాసే రాతల వలన మానసిక ఆవేదన చెందుతున్నట్టు కోర్టుకు చెప్పారు’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘జైలు పక్కన ఉన్న బిల్డింగుల మీద నుండి కొందరు మా ఫోటోలు తీస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఫోటోలు తీస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. అవినీతి మచ్చలేని ధనుంజయరెడ్డి సిట్ అధికారుల వేధింపులకు గురవుతున్నారు. ఛార్జిషీట్ టీడీపీ ఆఫీసులో రూపొందుతోంది. దానికి ఢిల్లీలో తుది మెరుగులు దిద్దుతున్నారు. లిక్కర్ స్కాం ఛార్జిషీట్‌లో మోకాలికి బోడిగుండుకు ముడి వేశారు...అబద్దపు వాంగ్మూలాలు, గాలి‌ పోగేసిన వార్తలు, కాల్ డేటా తప్ప ఈ ఛార్జిషీట్‌లో మరేమీ లేదు. సిట్ చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కదానికీ సాక్ష్యాలు చూపలేదు. డిస్ట్రలరీ యజమానులను బెదిరించి, అబద్దపు వాంగ్మూలం తీసుకున్నారు. బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని బెదిరించి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. దాని మీద వాసుదేవరెడ్డి మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. చెవిరెడ్డి గన్‌మెన్లు గిరి, మదన్‌రెడ్డిలను సిట్ విపరీతంగా హింసించింది. మిథున్‌రెడ్డిది బలమైన రాజకీయ కుటుంబం. అలాంటి కుటుంబాన్ని వేధిస్తున్నారు...ఛార్జిషీట్‌లో ఉన్నదంతా కట్టుకథలే. వైఎస్సార్‌సీపీ నేతల మీటింగులను కూడా మద్యం స్కాం కోసమే అంటూ కట్టుకథ అల్లారు. టార్గెట్ చేసుకున్న వ్యక్తులను అరెస్టు చేయటమే లక్ష్యంగా మద్యం కేసును నడుపుతున్నారు. తమకు కావాల్సినట్టు చెబితే సాక్ష్యులుగా, లేకపోతే దోషిలుగా చిత్రీకరిస్తున్నారు. 2014-19 మధ్యలో చంద్రబాబు అనేక కుంభకోణాల్లో నిందితుడు. అన్ని అక్రమాలజు ఆయనే బిగ్ బాస్. ఐఎంజీ కేసులో బిగ్ బాస్ చంద్రబాబు. రాజధాని భూములు, ఫైబర్ నెట్, రింగురోడ్డు అలైన్మెంట్.. ఇలా అనేక అవినీతి, అక్రమాల్లో బిగ్ బాస్ చంద్రబాబే’’ అని మనోహర్‌రెడ్డి దుయ్యబట్టారు.

Sakshi Editorial On Chandrababu Govt Conspiracy On Mithun Reddy3
కట్టుకథల కుట్ర సర్కార్‌!

కుట్రలు తప్ప తెలియనివాడికీ, వంచనతప్ప మరేదీ చేతగానివాడికీ మనుగడ కోసం కట్టుకథలను ఆశ్రయించటం తప్ప దిక్కులేదు. ఈవీఎంల మాయాజాలంతో ఏపీలో నిరుడు గద్దెనెక్కింది మొదలు కూటమి ప్రభుత్వం రౌడీలనూ, గూండాలనూ ప్రోత్సహించి హత్యలకూ, దౌర్జన్యాలకూ తెగబడటంతో పాటు తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. రెడ్‌ బుక్‌లో సరికొత్త అంకం లిక్కర్‌ స్కాం! ఆ పేరిట ఇప్పటికే కొంతమంది మాజీ అధికారులను జైలుపాలు చేసిన ప్రభుత్వం, తాజాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ మిథున్‌ రెడ్డిని అరెస్టు చే సింది. విద్యార్థి రాజకీయాల నాటినుంచీ తనకు బద్ధ వ్యతిరేకి అయిన మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డిపై కక్ష తీర్చుకోవటానికే ఆయన కుమారుడు మిథున్‌రెడ్డిని ఇందులో ఇరికించారన్నది బహిరంగ రహస్యం. 2014–19 మధ్య అధికారం వెలగబెడుతున్నప్పుడు తన బినామీలకూ, సన్నిహితులకూ నిబంధనలు కాదని డిస్టిలరీలు పెట్టుకోవటానికి, మద్యం ఉత్పత్తికి ఎడాపెడా అనుమతులిచ్చి చీకటి జీవోల సాక్షిగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుంభకోణానికి ఆస్కారమే లేనిచోట ఏదో జరిగిపోయిందంటూ ఊదరగొడుతున్నారు. ‘ఆత్రగాడికి బుద్ధి మట్టు’ అనే నానుడి ఉత్తపుణ్యాన రాలేదు. ఎదుటివారిపై బురద చల్లి ఏదోరకంగా వారికి అవినీతి మకిలి అంటి ద్దామని తండ్రీ కొడుకులు పడుతున్న తాపత్రయం వాస్తవాల ముందు బొక్కబోర్లా పడుతోంది.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పాలనలో తీసుకొచ్చిన మద్యం విధానంలో కొత్తగా ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి అనుమతినిచ్చిన వైనం లేదు. సరిగదా... అంతకుముందు టీడీపీ ఏలుబడిలో చెలరేగిన మద్యం మాఫియా నడ్డి విరగ్గొట్టి, మద్యం దుకాణాలన్నిటినీ ప్రభుత్వపరం చేశారు. వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించారు. మద్యం విక్రయ వేళల్ని కుదించారు. బాబు హయాంలో తామర తంపరగా పెరిగిపోయి, ఊరూవాడా జనం మూల్గులు పీల్చిన బెల్ట్‌ షాపుల జాడే లేకుండా చేశారు. పర్మిట్‌ రూమ్‌ల దందా అడ్డుకున్నారు. ఆ విధానం కారణంగా తమ అక్రమ సంపాదన నిలిచిపోగా లబోదిబోమని అప్పట్లో గగ్గోలు పెట్టింది తెలుగు దేశీయులే. మద్యపాన ప్రియుల్ని తగ్గించటానికి ఇన్ని చేసిన జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఏకంగా రూ. 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందట! అందులో భారీమొత్తం డొల్ల కంపెనీల ద్వారా దుబాయ్‌కి తరలిపోయిందట!! ఇంగితజ్ఞానం వున్నవారెవరికైనా ఇందులోని కపట నాటకం అర్థమవుతుంది. బురద చల్లటానికి వీళ్లకంటూ ఒక పద్ధతుంటుంది. ముందు ఎల్లోమీడియాలో తప్పుడు కథనాలు వండివార్చుతారు. ఏదో జరిగిపోయిందంటూ ఆ మీడియా పెడబొబ్బలు పెడుతుంది. వాటిని ఆధారం చేసుకుని కేసులు రూపొందుతాయి. వాటిపై దర్యాప్తుకంటూ సీఐడీ ఆధ్వర్యాన సిట్‌ ఏర్పాటవుతుంది. ఏం చేయడానికీ పాలుబోని సిట్‌... ఎల్లోమీడియా తప్పుడు కథనాలనే రీసైక్లింగ్‌ చేసి చార్జిషీట్లుగా రూపొందిస్తుంది. అవి న్యాయస్థానం మెట్లెక్కకుండానే ఎల్లోమీడియాకు చేరతాయి. తమకు విశ్వసనీయంగా తెలిసిందంటూ ఆ మీడియా పతాక శీర్షికలతో పండగ చేసుకుంటుంది. ఇంతకూ జనంలో ఇసుమంతైనా విశ్వసనీయత లేని ఈ మీడియాకు ‘విశ్వసనీయంగా’ చెప్పేవారెవరు? ఇంకెవరు... తండ్రీకొడుకులూ, వారి అడుగులకు మడుగులొత్తే వీర విధేయ అధికారులూ! తమ కథనాలే చార్జిషీట్లుగా అవతారమెత్తాయని, అవే న్యాయస్థానాల పరిశీలనకు పోతున్నాయని తెలియనట్టు, కొత్తగా ఆ రోజే బయట పడినట్టు ఎల్లోమీడియా వికృత విన్యాసాలకు తెగబడుతుంది. 13 వేల ఫోన్‌కాల్స్‌ట, వందలాది వాట్సాప్‌ చాటింగ్‌లట. దుబాయ్‌లో జల్సాలట. జనం నవ్విపోతారన్న వెరపే లేదు. వారిపట్ల జవాబుదారీతనం అసలే లేదు.జనానికిచ్చిన వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏడాదికాలం మాయమాటలతో కాలక్షేపం చేసిన కూటమి సర్కారు ప్రజల దృష్టి మళ్లించటానికి ఎంచుకున్న సరికొత్త డ్రామా లిక్కర్‌ కుంభకోణం. పనిలో పనిగా ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టడం దీని ఆంతర్యం. 2014–19 మధ్య అధికారం వెలగబెడుతుండగా తన అంతేవాసులకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి ఖజానాను కొల్లగొట్టింది చంద్రబాబే. ఇది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఆరోపణ కాదు. సాక్షాత్తూ రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) విప్పిచెప్పిన లోగుట్టు. గుట్టుచప్పుడు కాకుండా స్వయంగా సంతకాలు చేసిన బాబు నిర్వాకం కారణంగా ఖజానాకు 2015–19 మధ్య రూ. 5,200 కోట్ల మేర గండి పడిందని ఆ సంస్థ బయటపెట్టింది. ఇదిగాక ఎంఆర్‌పీ కన్నా 20 శాతం అధిక ధరలకు విక్రయించి మరో రూ. 20,000 కోట్లు కొల్లగొట్టారని బయటపడటంతో 2023లో కేసు నమోదైన కారణంగా బాబు, ఆయన అనుచరగణం బెయిల్‌ కూడా తీసుకున్నారు. మళ్లీ అధికారంలోకొచ్చాక ఈ దోపిడీ మరింత విశృంఖలంగా పెరిగింది.తమ మద్యం కుంభకోణాన్ని చూసీచూడనట్టు వదిలేయకుండా కేసులుపెట్టి నడిబజారులో నిలబెట్టినందుకే బాబు కక్షతో రగిలిపోతున్నారు. పర్యవసానంగానే తాజా కేసు. జగన్‌ ప్రభుత్వ కొత్త మద్యం విధానంపై వాస్తవానికి 2021లోనే టీడీపీ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)కు ఫిర్యాదుచేసింది. అందులో మొహం వాచేలా తీర్పు వెలువడింది. ఎలాంటి అవకతవకలూ జరగలేదని, మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా వున్నదని సీసీఐ తేల్చిచెప్పింది. ఒకసారి ఛీకొట్టించుకున్నా బుద్ధిరాని పార్టీ ఇప్పుడు అధికారంలోకి ఎగబాకి నిస్సిగ్గుగా ఒక పెద్ద డ్రామాకు తెర లేపింది. ఈ ప్రహసనాన్ని జనం నిస్సందేహంగా తిప్పికొడతారు.

Bengaluru Court Issues Gag Order On Dharmasthala Case4
‘ధర్మస్థళ’పై ఉష్‌ గప్‌చుప్‌!

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థళలో ఉన్న శ్రీ మంజునాథ దేవాలయం, నేత్రావతి నదీ తీరం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మృతదేహాలను 20 ఏళ్ల పాటు సమీప అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టానంటూ ఆ దేవాలయంలో పని చేసిన పారిశుద్ధ్య కార్మికుడు షాకింగ్‌ విషయం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం ధర్మశాలలో తప్పిపోయిన కోల్‌కతాకు చెందిన ఎంబీబీఎస్‌ విద్యార్థిని అనన్య భట్‌ అంశాన్ని తెరపైకి తీసుకువస్తూ ఆమె తల్లి సుజాత భట్‌ దక్షిణ కన్నడలోని బెత్తంగడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.దీంతో ధర్మస్థళ హత్యాకాండపై సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. దీనిపై స్పందించిన కర్ణాటక మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌదరి.. రెండు దశాబ్ధాల కాలంలో ధర్మస్థళలో అదృశ్యమైన మహిళలు, బాలికల కేసులు, అసహజ మరణాలు, హత్యలు, లైంగిక దాడులపై పునర్విచారణ జరపాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు.ఈ ఒత్తిళ్లతో స్పందించిన కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తునకు ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసింది. ఇంటర్నల్‌ సెక్యూరిటీ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ప్రణవ్‌ మొహంతి నేతృత్వం వహించేలా ఆదేశాలు ఇచ్చింది. వివిధ విభాగాలకు చెందిన మరో ముగ్గురు ఉన్నతాధికారులనూ సిట్‌లో నియమించింది.ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలక ట్విస్ట్‌ చోటు చేసుకుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్న ధర్మస్థళ మారణహోమం కేసుపై బెంగళూరు కోర్టు మంగళవారం గ్యాగ్‌ ఆర్డర్‌ ఇచ్చింది. శ్రీ మంజునాథ ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే సోదరుడు హర్షేంద్ర కుమార్‌ డి. దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా న్యాయస్థానం ఈ ఆదేశాలను ఇచ్చింది.వివిధ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ధర్మస్థళ ఉదంతానికి సంబంధించి ఉన్న 8,842 లింక్‌లను తొలగించాలని కోర్టు ఆదేశించింది. మా పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలకు సంబం«ధించిన కవరేజీకి సంబంధించిన లింకులు తొలగించాలని, డీ–ఇండెక్స్‌ చేయాలని కోరిన హర్షేంద్ర తన పిటిషన్‌లో ‘ఎక్స్‌’, ఫేస్‌బుక్‌ పోస్టులు, థ్రెడ్‌లను ప్రస్తావించారు. ఈ వివాదంపై యూట్యూబ్‌ ఛానెళ్లు, సోషల్‌ మీడియా, ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, డిజిటల్‌ మీడియాల్లో ప్రచురించడం, ప్రసారం చేయడం, ఫార్వార్డ్‌ చేయడం, అప్‌లోడ్‌ చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.బెంగళూరులోని పదో అదనపు సిటీ సివిల్‌ సెషన్స్‌ కోర్టులో హర్షేంద్ర దాఖలు చేసిన పిటిషన్‌లో గ్యాగ్‌ ఆర్డర్‌తో పాటు జాన్‌ డో ఆర్డర్‌ను పొందారు. హర్షేంద్ర తన పిటిషన్‌లో 338 సంస్థలు, వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చారు. 4,140 యూట్యూబ్‌ వీడియోలు, 932 ఫేస్‌బుక్‌ పోస్ట్‌లు, 3,584 ఇన్‌స్ట్రాగామ్‌ పోస్ట్‌లు, 108 న్యూస్‌ లింక్‌లు, 37 రెడ్డిట్‌ పోస్ట్‌లతో పాటు 41 ’ఎక్స్‌’ పోస్టులతో కలిసి 8,842 లింక్‌లను తన పిటిషన్‌లో పొందుపరిచారు.వీటిలో ’లెట్‌ మీ ఎక్స్‌ప్లెయిన్‌’ ఎపిసోడ్లు, ది న్యూస్‌ మినిట్‌లోని వీడియోలు ఉన్నాయి. ప్రతివాదులుగా జాబితా వార్తలు, కంటెంట్, వీడియోలు ఉంచిన థర్డ్‌ ఐ, ధూత, సమీర్, ది న్యూస్‌ మినిట్, డెక్కన్‌ హెరాల్డ్, ది హిందూ, ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, ప్రజావాణి, కన్నడ ప్రభ, హోస దిగంత, బెంగుళూరు మిర్రర్, ఉదయవాణి, దినమణి, దిన తంతి, దినకరన్, సంయుక్త కర్ణాటక, విజయవాణి, విశ్వవాణి, కేరళ, న్యూస్‌ కా18 తదతరాలను చేర్చారు.గ్యాగ్‌ ఆర్డర్‌ కేవలం పిటిషన్‌లో ప్రస్తావించిన వాటిని మాత్రమే నియంత్రించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హర్షేంద్ర జాన్‌ డో ఆర్డర్‌ కోసం న్యాయమూర్తికి విన్నవించారు. ఈ మేరకు కోర్టు ఇంజెక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వడంతో పిటిషన్‌లో పేరు లేని సంస్థలు, వ్యక్తులు, పార్టీలను ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఈ ఆదేశాల జారీ సందర్భంగా న్యాయమూర్తి విజయ కుమార్‌ రాయ్‌ ‘ప్రతి పౌరుడికి ప్రతిష్ట అనే చాలా ముఖ్యమైంది. సంస్థ, దేవాలయంపై ఆరోపణ వచ్చినప్పుడు అవి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. పరువు నష్టం కలిగించే ఒక ప్రచురణ కూడా సంస్థల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ ఉత్తర్వు తమ భావప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని, దానిని రద్దు చేయాలని కోరుతూ యూట్యూబ్‌ పోర్టల్‌ థర్డ్‌ ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. – శ్రీరంగం కామేష్‌

Mallu Bhatti Vikramarka says We will gather support for BC Reservation Bill5
మద్దతు కూడగడతాం: డిప్యూటీ సీఎం భట్టి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని వెనుక బడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం కోసం ప్రయత్నిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సహేతుకమని భావించే ప్రతీ రాజకీయ పార్టీని కలుస్తామన్నారు. ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా సహకరించాలని అన్ని పార్టీలను కోరతామని, అందరి మద్దతూ కూడగడతామని చెప్పారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయి పార్టీలను కలిసి మద్దతు కోరతామని చెప్పారు. శతాబ్దాల నుంచి అన్యాయం జరుగుతున్న వర్గాలకు న్యాయం చేసే దిశలో తాము మంచి సంకల్పంతో తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరిస్తారనే ప్రగాఢ నమ్మకం ఉందని చెప్పారు. ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టి చర్చించినప్పుడు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కూడా మద్దతిచ్చాయని, ఇప్పుడు పార్లమెంట్‌లో కూడా ఆ పార్టీలు మద్దతివ్వాలని కోరారు. ఈ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ సమాచారం కోరినా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అన్నీ వివరిస్తాం రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ల పెంపు విషయంలో అనుసరించిన శాస్త్రీయ పద్ధతులను దేశంలోని పార్లమెంట్‌ సభ్యులకు వివరిస్తామని భట్టి చెప్పారు. కాంగ్రెస్‌ ఎంపీలతోపాటు ఇతర పార్టీల ఎంపీలకు కూడా పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా అన్ని విషయాలను తెలియజేస్తామన్నారు. గతంలో జరిగిన సర్వేల అనుభవాలు, తాము నిర్వహించిన పైలట్‌ సర్వే, సర్వే ప్రశ్నావళి రూపకల్పన, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన సమావేశాలు, ఎన్యూమరేషన్‌ ప్రక్రియ, డేటా ఎంట్రీతోపాటు ఈ సర్వేను స్వతంత్ర నిపుణల కమిటీతో అధ్యయనం చేయించిన తీరును అందరికీ అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. మొత్తం 88 కోట్ల పేపర్లలో నిక్షిప్తమైన కులగణన సమాచారాన్ని సరళీకృతం చేసిన అనంతరం అవసరమైన సమాచారాన్ని ప్రజలకు అందించామని చెప్పారు. నిపుణల కమిటీ ఇచ్చిన నివేదికను కూడా అసెంబ్లీలో, కేబినెట్‌లో పెట్టి ఆమోదించిన తర్వాత ప్రజల ముందుకు తెస్తామని వెల్లడించారు. ఆయన అడ్డుకునేలా మాట్లాడతారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావుకు దళితులన్నా, బీసీలన్నా చిన్నచూపు ఉన్నట్టుందని భట్టి వ్యాఖ్యానించారు. అందుకే ఆయా వర్గాలకు మేలు చేసే ప్రయత్నాలు ఎప్పుడు జరిగినా ఆయన అడ్డుకునే విధంగా మాట్లాడతారన్నారు. గతంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో జరిగిన వ్యవహారంలో ఆయన పాత్ర ఏంటో అందరికీ తెలుసన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తాము చెప్పామని, చేశామని అన్న భట్టి.. తామే చెప్పాం కాబట్టి తామే చేసుకోవాలని రాంచందర్‌రావు వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. తామేమీ బీజేపీ అంతర్గత వ్యవహారాల గురించి అడగడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే ప్రక్రియ గురించి అడుగుతున్నామని చెప్పారు. రాంచందర్‌రావు పంపిన లీగల్‌ నోటీసులు అందాయా అన్న ప్రశ్నకు భట్టి సీరియస్‌గా స్పందించారు. ‘లీగల్‌ నోటీసులకు భట్టి భయపడడు. నేను ఏం మాట్లాడానో దానికి కట్టుబడి ఉన్నా. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్‌ పార్టీగా, వ్యక్తిగా ఏం చెప్పాలో తెలుసు’ అని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ పార్టీకి చిత్తశుద్ధి లేకపోతే ఇంత ప్రక్రియ ఎందుకు చేస్తామని, ఈ అంశాన్ని ఇంత దూరం తీసుకొచ్చామంటేనే తమ చిత్తశుద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని భట్టి చెప్పారు. నాడు అవసరం లేదన్న వారే..అసలు కులగణన అవసరమే లేదని పార్లమెంటులో చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. తెలంగాణలో జరిగిన సర్వే అనంతరం దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో కులగణన చేయాలనే నిర్ణయానికి వచ్చారని భట్టి చెప్పారు. ‘తెలంగాణలో జరిగిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన (సీప్యాక్స్‌) దేశంలోనే ఒక చారిత్రక సర్వేగా నిలిచిపోనుంది. సర్వే వద్దన్న మోదీ తెలంగాణ సర్వేతోనే ఒప్పుకునే స్థితికి తీసుకొచ్చాం. ఈ ప్రక్రియకు ఆద్యుడైన రాహుల్‌గాంధీ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం అనుసరించేలా చేశాం. ఇక దేశంలో ఎప్పుడు, ఎక్కడ, ఏ రాష్ట్రంలో సర్వే జరిగినా తెలంగాణను మోడల్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా శాస్త్రీయంగా ఈ సర్వే చేశాం’ అని భట్టి చెప్పారు.

INDW VS ENGW 3rd ODI: Harmanpreet Completes Century In 82 Balls6
విధ్వంసం సృష్టించిన టీమిండియా కెప్టెన్‌.. వన్డేల్లో రెండో వేగవంతమైన శతకం

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టుతో ఇవాళ (జులై 22) జరుగుతున్న నిర్ణయాత్మక చివరి వన్డేలో భారత మహిళా జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చెలరేగిపోయింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ కేవలం 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, భారత్‌ తరఫున వన్డేల్లో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేసింది. ఫలితంగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.ఈ మ్యాచ్‌లో మొత్తంగా 84 బంతులు ఎదుర్కొన్న హర్మన్‌ 14 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి ఔటైంది. హర్మన్‌తో పాటు భారత ఇన్నింగ్స్‌లో జెమీమా రోడ్రిగెజ్‌ (50), స్మృతి మంధన (45), హర్లీన్‌ డియోల్‌ (45), రిచా ఘోష్‌ (38 నాటౌట్‌), ప్రతిక రావల్‌ (26) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బ్యాటర్ల ధాటికి ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. సోఫీ ఎక్లెస్టోన్‌ (10-2-28-1) మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. లారెన్‌ బెల్‌ 10 ఓవర్లలో 82, లారెన్‌ ఫైలర్‌ 10 ఓవర్లలో 64, చార్లోట్‌ డీన్‌ 10 ఓవర్లలో 69, లిన్సే స్మిత్‌ 10 ఓవర్లలో 74 పరుగులు సమర్పించుకొని తలో వికెట్‌ తీశారు.భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీలు..70 స్మృతి మంధన vs ఐర్లాండ్‌ రాజ్‌కోట్ 202582 హర్మన్‌ప్రీత్ కౌర్ vs ఇంగ్లాండ్ చెస్టర్-లీ-స్ట్రీట్ 202585 హర్మన్‌ప్రీత్ కౌర్ vs దక్షిణాఫ్రికా బెంగళూరు 202489 జెమిమా రోడ్రిగ్స్ vs దక్షిణాఫ్రికా కొలంబో RPS 2025ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు తలో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్‌ సొంతమవుతుంది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగగా, భారత్ 3-2 తేడాతో ఆ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది.

BoyCott Hari Hara Veera Mallu Hashtags Trending On Social Media7
పవన్‌ వ్యాఖ్యలు.. ట్రెండింగ్‌లో #BoycottHHVM

పవన్‌ కల్యాణ్‌ ప్రవర్తన వింతగా ఉంటుంది. సినిమాలు వేరు రాజకీయాలు వేరని ఆయనే చెబుతాడు. మళ్లీ ఆయనే సినిమా వేదికపై రాజకీయాలు, రాజకీయ వేదికలపై సినిమా విషయాలు మాట్లాడుతాడు. పవన్‌ ప్రవర్తనే ఇప్పుడు ఆయన సినిమాను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ఆయన హీరోగా నటించిన హరి హర వీరమల్లు సినిమాకు ఇప్పుడు నిరసన సెగ తగిలింది. పవన్‌ వ్యాఖ్యలతో విసుగెత్తిపోయిన వైఎస్సార్‌సీసీ అభిమానులకు తోడు అల్లు అర్జున్‌, మహేశ్‌, ప్రభాస్‌ లాంటి స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ కూడా హరిహర వీరమల్లు సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు. దీంతో #BoycottHHVM ట్యాగ్‌ ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది.ఏం జరిగిదంటే..తాజాగా జరిగిన హరిహర వీరమల్లు సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ రాజకీయాలు మాట్లాడారు. సినిమా గురించి చెప్పడం మరచి.. ‘గతంలో భీమ్లా నాయక్‌ సినిమా టికెట్‌ రూ.10-15 పెట్టిన నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. మన సత్తా ఏంటో చూపిద్దాం’ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. దీనికి ఆజ్యం పోసేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. ఇప్పుడు ఇదే నిరసనకు దారి తీసింది. వైఎస్సార్‌సీపీ అభిమానులు పవన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సినిమాను బాయ్‌కాట్‌ చేస్తున్నారు. మేమే కాదు ..మాతో పాటు మరో 20-30 మందిని కూడా సినిమాను చూడనియ్యబోమంటూ #BoycottHHVM హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్స్‌ చేస్తున్నారు.స్టార్‌‌ హీరోల ఫ్యాన్స్‌ కూడా..అభిమానం ఉంటే ఆ హీరో సినిమాలు చూడాలే తప్ప ఇతర హీరోల సినిమాలను నాశనం చేయకూడదు. కానీ పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఏ హీరోకైనా కాస్త పేరొస్తే చాలు.. ఆయన సినిమాను తొక్కేయాలని చూస్తారనే టాక్‌ టాలీవుడ్‌లో ఉంది. గతంలో బన్నీ, మహేశ్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ సినిమాలపై ట్రోల్స్‌ చేశారు. పుష్ప 2 రిలీజ్‌ అప్పుడు అయితే అల్లు అర్జున్‌పై దారుణమైన కామెంట్స్‌ చేస్తూ.. సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఇతర హీరోల ఫ్యాన్స్‌ అన్నట్లు అందరి హీరోల సినిమాలను ట్రోల్‌ చేశారు. ఇప్పుడు ఆ స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ కూడా పవన్‌ సినిమాపై పగ బట్టారు. తాము హరిహర వీరమల్లు సినిమాను చూడబోం అంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తూ..తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు వైఎస్సార్‌సీపీ అభిమానులు, మరోవైపు స్టార్‌ హీరోల ప్యాన్స్‌ దెబ్బకి #BoycottHHVM హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.అనవసరం గా కెలుక్కున్నారు రా సైనిక్స్..మీకు ర్యాంప్ ఆడిస్తున్నారు AA Army 🔥🔥🔥😂😂🔥🔥 #AAArmy #BoycottHHVM pic.twitter.com/JbrppHXqqk— నల్లపరెడ్డి 🔥🔥🔥 (@naveenk23021806) July 21, 2025Get ready to face trolls #HHVMమూవీస్ లో రాజకీయం చేయకండి రా అంటే వినరు అనుభవిస్తారు ఇప్పుడు చూస్తాం ఎలా ఆ మూవీ హిట్ అవుతుందో.....✊🏿✊🏿 గతం లో జరిగినది మర్చిపోయినట్టు ఉన్నారు ఈ సారి బాగా గుర్తుండిపోతుంది..... #BoycottHHVM#BoycottHHVM pic.twitter.com/SH7yvXWHFI— Aji (@AJAY83527762580) July 21, 2025ముందు నూయ్ వెనక గుయ్ అన్నటుంది చాలా రిస్క్లో పడ్డాడు @PawanKalyan 🫣🤭NTR FANS MINGUTHARU :::..🔥🔥MH & AA FANS THANTARU:::🔥🔥YSRCP FANS KINDA KOSTARU :::::ఎటు చూసినా కింద మీద వాయిస్తున్నారు 🔥🔥#BoycottHHVM #BoycottHHVM pic.twitter.com/2JXfcONayv— Aji (@AJAY83527762580) July 21, 2025#BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #pk🐕 pic.twitter.com/X2WNe3EFY0— Tony (@Youth4YSRCP) July 22, 2025Hero Evaru..............?Hero Name Cheppandi Ra Ayya .....?Hero Brahmanandam Antunnaru ..?Nijamena..........? 🤣🤣#BoycottHHVM pic.twitter.com/8VGiub64Ag— Lakshmi Reddy (@Lakshmired7313) July 22, 2025నిన్న మొన్నటి నుండి #BoycottHHVM అని మా వాళ్ళు అంటుంటే సరే అని లైట్ తీసుకున్న కానీ ఈరోజు కొంతమంది గాంజ నా కొడుకులు నా అన్న @ysjagan గురించి తప్పుగా మాట్లాడారు 🔥చూస్కుందాం బారాబర్ చూస్కుందాం 🔥🔥సినిమాని చూడాలి అనుకునేవాళ్ళను కూడా మీ అతితో నాశనం చేసుకుంటున్నారు 🤙#BoycottHHVM pic.twitter.com/uZTQOwhmoT— jagan__fan__kurnool (@darvesh_md25012) July 22, 2025సినిమా వాళ్ళు ఇంకా మారారా ??#HariHaraVeeraMallu ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి రాజకీయ విమర్శలు !!#BoycottHHVM అని పిలుపు ఇచ్చిన వైసీపీ సోషల్ మీడియా సైన్యం ….సిగ్గు ఉన్న వైసీపీ అభిమాని ఎవడు ఈ సినిమా చూడడు అని శపధం !! pic.twitter.com/qAJzYhjj6f— cinee worldd (@Cinee_Worldd) July 21, 2025సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడతారా.. ముందు ముందు ఉంది రా మీకు జాతర..YCP boys.. HHVM is a disaster movie #BoycottHHVMpic.twitter.com/U2d1IoQjeb— 𝕁𝕦𝕤𝕥 𝔸𝕤𝕜𝕚𝕟𝕘 🇮🇳 (@JustAsking2_0) July 21, 2025నా దగ్గర డబ్బులు లేవు అని బీద అరుపులు అరిచి, వాడికున్న అలాగా ఫాన్స్ దగ్గర నుండి ఓపెనింగ్స్ రాబెట్టుకొని(తల్లి చెల్లి పెళ్ళాం దగ్గర పుస్తులు తాకట్టు పెట్టి మరీ కొంటారు పిచ్చి నా) నెక్స్ట్ మూవీకి ఎక్సట్రా పేమెంట్ అడుగుతాడు.ఇది బుర్ర తక్కువ వెధవలికి అర్ధం కాదు🤣😂.#BoycottHHVM pic.twitter.com/Rxs0Wfd1xh— గంగ పుత్రుడు (@bheesmudu) July 22, 2025సినిమా టికెట్ ధర పెంచి గర్వంగా చెప్పుకోవడం కాదు...💦💦💦దమ్మూ ధైర్యం ఉంటే రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చి గర్వంగా చెప్పుకోండి... #BoycottHHVM pic.twitter.com/IZ3Oa93n6j— Ayyapa Reddy (@YSJaganMarkGove) July 22, 2025Get ready to face trolls #HHVMమూవీస్ లో రాజకీయం చేయకండి రా అంటే వినరు అనుభవిస్తారు ఇప్పుడు చూస్తాం ఎలా ఆ మూవీ హిట్ అవుతుందో.....✊🏿✊🏿 గతం లో జరిగినది మర్చిపోయినట్టు ఉన్నారు ఈ సారి బాగా గుర్తుండిపోతుంది..... #BoycottHHVM#BoycottHHVM pic.twitter.com/SH7yvXWHFI— Aji (@AJAY83527762580) July 21, 2025

Sakshi Guest Column On How China developed8
చైనాలో ఇంత అభివృద్ధి ఎలా?

చైనా పేరు వినగానే సర్వసాధారణంగా తోచే ప్రశ్నలు కొన్నున్నాయి. అక్కడ ఇంతటి అభివృద్ధి ఎందుకు? మార్క్సిజం, సోషలిజం పరిస్థితి ఏమిటి? ప్రజలకు స్వేచ్ఛలు ఉంటాయా? వంటివి. ఇవి ఎంత ముఖ్యమైన ప్రశ్నలో వాటన్నింటి మధ్యగల పరస్పర సంబంధం కూడా అంత ముఖ్యమైనది. ఈ విషయాల గురించి ఎంతో చదువుతుంటాం, వింటుంటాం. కానీ అక్కడి పరిస్థితులను కళ్లారా చూడటం, వారితో మాట్లాడి తెలుసుకోవటం వేరు. చైనాలో కొద్ది వారాల పాటు పర్యటించిన తర్వాత కలిగిన అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.రెండు శతాబ్దాలుఅభివృద్ధి గురించి మాట్లాడేవారు గుర్తించనిది ఏమంటే, ఈ భావనకు, అభివృద్ధి చెంది తీరాలన్న పట్టుదలకు మూలాలు చరిత్రలో ఉన్నాయి. అవి 1949 నాటి కమ్యూనిస్టు విప్లవంతో మొదలయ్యాయి. వారిలో విప్లవం కోసం ఎంత తపన ఉండేదో, బలమైన అభివృద్ధి కోసం అంత ఉండేది. ఆ మేరకు వారి ఆలోచనలు ఏమిటి? చైనా, భారతదేశం గొప్ప చరిత్ర, సంస్కృతి, ఆర్థికాభివృద్ధి ఉండిన దేశాలు. విదేశీయుల ఆధిపత్యం, దోపిడీ వల్ల దెబ్బ తిన్నాయి. చైనాకు సంబంధించి 1839 నాటి మొదటి నల్లమందు యుద్ధంతో మొదలై సరిగా 110 సంవత్సరాల తర్వాత 1949లో కమ్యూనిస్టు విప్లవం విజయవంతమయే వరకు గల కాలాన్ని కమ్యూనిస్టులు ‘అవమానాల శతాబ్దం’ (సెంచరీ ఆఫ్‌ హ్యూమిలియేషన్‌) అన్నారు. తమ నాయకత్వాన ఆ తర్వాతి నూరేళ్లు 1949 నుంచి 2049 కాలం ‘పునరుజ్జీవన శతాబ్దం’ (సెంచరీ ఆఫ్‌ రిజువనేషన్‌) కావాలని గట్టిగా తీర్మానించుకున్నారు.చైనా చరిత్రను, సంస్కృతిని విస్తారంగా అధ్యయనం చేసినట్లు పేరున్న మావో కాలంలో జరిగిన ఈ తీర్మానం ప్రకారం ఈ రోజు వరకు అన్ని ప్రభుత్వాలు కూడా ఏకదీక్షతో పనిచేస్తూ వస్తున్నాయి. తమ లక్ష్యం సాధనకు అవసరమైన అవగాహనలు, ప్రణాళికలు, వాటి అమలులో పట్టుదల, అందుకు కావలసిన ఆర్థిక, శాస్త్ర–సాంకేతిక, మానవ వనరులు అన్నీ వారికున్నాయి. ప్రజల సహకారం ఉంది. అందువల్లనే, ‘పునరుజ్జీవన శతాబ్దం’ 1949లో మొదలై ఇప్పటికి 75 సంవత్సరాలు గడిచి ఇంకా 25 సంవత్సరాలు మిగిలి ఉన్న దశకు చేరేసరికి, చైనా ఇంతటి అభివృద్ధిని సాధించగలిగింది. ఈ లక్ష్య సాధన కోసం వారు చేస్తున్న గమనార్హమైన ప్రయత్నం మరొకటి ఉంది. కమ్యూనిస్టు విప్లవానికీ, అవమానాల శతాబ్దం, పునరుజ్జీవన శతాబ్దం అనే భావనలకూ బీజాలు ఏ విధంగానైతే వారి చరిత్ర, సంస్కృతులలో ఉన్నాయో, అదే ప్రకారం ఆ చరిత్ర, సంస్కృతి, జాతీయ భావన, దేశభక్తి భావనల పునాదిగా ప్రజలను పాజిటివ్‌గా సమీకృతం చేస్తూ, వారిని ఈ అభివృద్ధి మహా యజ్ఞంలో భాగస్వాములను చేయగలుగుతున్నారు. ఆ అభివృద్ధి ఫలాలను మొత్తం మానవజాతి చరిత్రలోనే ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఇది సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి మాట.కళ్లకు కట్టిన అభివృద్ధిఇక ఆ అభివృద్ధి తీరుతెన్నులపై అనేక కథనాలు తరచు వెలువడుతున్నవే అయినందున, ఆ వివరాలు, గణాంకాలలోకి ఇక్కడ వెళ్లటం లేదు. వాటిలో పేర్కొననివి, నేను స్వయంగా చూసి సంభ్రమం చెందినవి కూడా అనేకం ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం చెప్తాను. నేను బీజింగ్‌ నుంచి శియాన్‌ నగరానికి వెళ్లిన హైస్పీడ్‌ రైలు వేగం గంటకు 350 కి.మీ.లు. అది గాక 450 కి.మీ. రైలు మరొక మార్గంలో ఉంది గానీ అందులో ప్రయాణించలేదు. అయితే, 600 కి.మీ.ల రైలుపై ప్రయోగాలు జరుగుతున్నట్లు విన్నాను. చైనా నుంచి ఇండియా చేరిన తర్వాత 48 గంటలలో వచ్చిన వార్త ఆ ప్రయోగం విజయవంతమైందని, ఆ రైలు వేగం 620 కి.మీ.లకు చేరిందని. అక్కడి హైస్పీడ్‌ రైళ్లు ఏవీ నేలపై నడవవు. వందల, వేల కి.మీ.లు ఎలివేటెడ్‌ కారిడార్లలోనే (హైదరాబాద్‌ మెట్రో తరహాలో) నడుస్తాయి. చైనా అభివృద్ధి లక్ష్యం 2049 నాటికి ప్రస్తుత రెండవ స్థానం నుంచి మొదటి స్థానానికి చేరాలని. అవమానాల శతాబ్ది, పునరుజ్జీవన శతాబ్దిగా మారాలన్న లక్ష్యం ఆ విధంగా నెరవేరగలదన్నది ఆలోచన. ప్రచారంలోకి రాలేదు గానీ ఈ ఆలోచన మావో కాలంలోనే మొదలై నేటికీ కొనసాగుతున్నది. ఆ రోజులలో అందుకు సవాళ్లు పలు అభివృద్ధి చెందిన అన్ని దేశాల నుంచి ఉండేవి. ఇపుడు మిగిలింది అమెరికా ఒక్కటే. ఇది అన్నింటికి మించిన సవాలు. ఇక్కడి తరహా లోనే...ప్రస్తుతానికి మాత్రం చైనా అభివృద్ధికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు సజావుగానే సాగుతున్నట్లు కనిపిస్తున్నది. అందువల్లనే ఆర్థికంగా రెండవ స్థానానికి చేరింది. పర్చేజింగ్‌ పవర్‌ పేరిట (సమానమైన సరకులు, సర్వీసులకు అయే ఖర్చు అమెరికా కన్న చైనాలో తక్కువ కావటం)లో అమెరికాను 2017లోనే మించిపోవటం, నౌకా బలంలో అమెరికాను దాటడం, వైమానిక శక్తిపై పెట్టుబడులు, ఆధునిక పరిశోధనలు గణనీయంగా పెంచుతుండటం, సైన్స్‌–టెక్నాలజీ రంగంలో దరిదాపులకు వస్తుండటం, కొన్నింటిలో ఇప్పటికే అమెరికా కన్న ముందుకు పోవటం వంటివి ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఏక ధ్రువ ప్రపంచం నుంచి బహుళ ధ్రువ ప్రపంచం అనే నినాదం, బ్రిక్స్, బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బిఆర్‌ఐ) వంటి సంస్థలు, ఇతర దేశాలతో అమెరికా కూటమికి భిన్నంగా విన్‌–విన్‌ పాలసీ (మీరు, మేము ఉభయులమూ లాభపడాలి) అనే ఆర్థిక సంబంధాలు, మీ అంతర్గత విషయాలలో అమెరికా కూటమి వలె జోక్యం చేసుకోబోమనే రాజకీయ విధానం, సైన్స్‌ – టెక్నాలజీ బదిలీలు మొదలైనవి దీర్ఘకాల ఆర్థిక – రాజకీయ వ్యూహాలు అవుతున్నాయి. అందుకు ఒక మంచి ఉదాహరణను చెప్పాలంటే, నేను చైనాలో ఉన్న రోజులలోనే బ్రిక్స్‌ సమావేశాలు బ్రెజిల్‌లో జరిగాయి. ఆ సంస్థలో చేరే దేశాలపై పెద్ద ఎత్తున అదనపు సుంకాలు విధించగలమని గతం నుంచి హెచ్చరిస్తుండిన ట్రంప్, అదే హెచ్చరిక తిరిగి చేశారు. కానీ, అదేమీ లెక్క చేయకుండా ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల నుంచి మరొక 16 దేశాలు కొత్తగా చేరాయి. ఇవన్నీ అమెరికా పలుకుబడిని తగ్గించి చైనా పలుకుబడిని పెంచేవి. చైనా 2049 నాటికి అగ్రరాజ్యమయ్యేందుకు తోడ్పడగలవి.ఇవే రంగాల గురించి తెలుసుకోగలది ఇంకా చాలా ఉంది గానీ అదంతా ఇక్కడ చెప్పుకోలేము గనుక మొదట ప్రస్తావించిన ప్రశ్నలలో రెండు ముఖ్యమైన వాటి గురించి కొద్దిగా చూద్దాము. అక్కడ మార్క్సిజం, సోషలిజం, క్యాపిటలిజం పరిస్థితి ఏమిటన్నది ఒకటి. ప్రజలకు గల స్వేచ్ఛలు ఏమిటన్నది రెండవది. క్యాపిటలిజం పెట్టుబడులు, వ్యాపారం, లాభాలు అక్కడి ప్రభుత్వపరంగా, సంపన్నులైన చైనీయులపరంగా, బయటి దేశాలతో ఉమ్మడి పెట్టుబడుల పరంగా బాగా వర్ధిల్లుతున్నాయి. ఈ విధానాలు డెంగ్‌ శియావో పింగ్‌ సంస్కరణలు, 2001లో డబ్ల్యూటీవోలో చైనా చేరటం నుంచి మొదలై సాగుతున్నాయి. ఆ విధంగా ఒనగూరే లాభాలు, సమాజంలో కింది స్థాయి వరకు లభిస్తున్న ఆదాయాలూ క్లాసికల్‌ సోషలిజానికి ప్రత్యామ్నాయంగా మారాయి. సోషలిజం విత్‌ చైనీస్‌ క్యారక్టరిస్టిక్స్‌ అన్న డెంగ్‌ సూత్రీకరణకు రూపం, సారం ఇదేననుకోవాలి. అడుగడుగునా కెమెరాల నిఘాలు, మౌలికంగా వ్యవస్థకు వ్యతిరేకమైన చర్యలను సహించక పోవటం, ఒకే పార్టీ వ్యవస్థల వల్ల ఎన్నికలు గ్రామస్థాయిలో తప్ప ఇతరత్రా లేకుండటం మినహా, ఇక్కడ ఉన్న స్వేచ్ఛలన్నీ అక్కడా కనిపించాయి. చదువులు, ఉద్యోగ వ్యాపారాలు, దేశ విదేశాలకు ప్రయాణాలు, సంపాదనలు, ఖర్చులు, అవినీతి, విలాసాలు, కోరుకున్నట్లు బట్టలు వేసుకోవడం, కొన్ని అవలక్షణాలు, సంప్రదాయికమైన నమ్మకాలు, ఆచారాలు అన్నీ ఉన్నాయి. చివరకు నైట్‌ లైఫ్‌ వీధులు, మసాజ్‌ పార్లర్లు, సెక్స్‌ టాయ్‌ షాపులు సహా. సగటు మనిషికి ఇంతకన్న కావలసిన స్వేచ్ఛలేమిటి?టంకశాల అశోక్‌ వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Ysrcp Leaders Fires On Minister Atchannaidu Comments9
మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఫైర్‌

సాక్షి, తాడేపల్లి: మంత్రి అచ్చెనాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాలంటే డ‌బ్బులు కావాలి.. ఆడ‌బిడ్డ నిధి ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అమ్మాలి’’ అంటూ మాట్లాడ‌డానికి సిగ్గులేదా అచ్చెన్నాయుడూ?’’ అంటూ ఆర్కే రోజా ట్వీట్‌ చేశారు. ఎన్నిక‌ల ముందు హామీలు ఇచ్చేట‌ప్పుడు తెలియ‌దా?. అప్పుడేమో ఓట్లు కోసం అడ్డ‌మైన హామీలు ఇచ్చి.. అధికారంలోకి వ‌చ్చాక ఇలా మాట్లాడమ‌ని మీ నాయ‌కుడు చంద్రబాబు చెప్పారా?’’ అంటూ ఆర్కే రోజా ఎక్స్‌ వేదికగా నిలదీశారు.`సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాలంటే డ‌బ్బులు కావాలి, `ఆడ‌బిడ్డ నిధి` ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అమ్మాలి` అంటూ మాట్లాడ‌డానికి సిగ్గులేదా @katchannaidu? ఎన్నిక‌ల ముందు హామీలు ఇచ్చేట‌ప్పుడు తెలియ‌దా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డ‌మైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వ‌చ్చాక ఇలా… pic.twitter.com/v9v8fq8C1r— Roja Selvamani (@RojaSelvamaniRK) July 22, 2025అమ‌లు చేయ‌లేన‌ప్పుడు హామీలు ఎందుకిచ్చారు?: విడదల రజినిఒక్క హామీని కూడా అమ‌లు చేయ‌కుండా సుప‌రిపాల‌న‌కు తొలి అడుగు అంటూ టీడీపీ వాళ్లు మాట్లాటం చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి విడదల రజిని ట్వీట్‌ చేశారు. చంద్రబాబు సంప‌ద సృష్టిస్తా, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తాన‌ని చెప్పారు. ఇప్పుడేమో అచ్చెన్నాయుడు ఆడ‌బిడ్డ నిధి` ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అమ్మాలంటూ మాట్లాడుతున్నారు. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌లేన‌ప్పుడు ఎందుకు హామీలు ఇచ్చారు?’’ అంటూ విడదల రజిని ప్రశ్నించారు.ఒక్క హామీని అమ‌లు చేయ‌కుండా సుప‌రిపాల‌న‌కు `తొలి అడుగు` అంటూ @JaiTDP వాళ్లు మాట్లాడ‌డం చాలా విడ్డూరంగా ఉంది. @ncbn ఏమో సంప‌ద సృష్టిస్తా, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తాన‌ని చెప్పారు. ఇప్పుడేమో @katchannaidu `ఆడ‌బిడ్డ నిధి` ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అమ్మాలంటూ… pic.twitter.com/hLaNmjTiqB— Rajini Vidadala (@VidadalaRajini) July 22, 2025అచ్చెన్నాయుడు వ్యాఖ్య‌లు దుర‌దృష్ట‌క‌రం: వరుదు కల్యాణి‘‘ఆడ‌ బిడ్డ‌ల క‌ష్టాలు తాను క‌ళ్లారా చూశాన‌ని.. వారిని ఆ క‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డేయ‌డానికి ఆడ‌బిడ్డనిధి ప‌థ‌కం తీసుకువ‌చ్చామ‌ని ఎన్నిక‌ల ముందు చంద్రబాబు ప్ర‌తి స‌భ‌లోనూ ప్ర‌చారం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికీ ప్ర‌తి నెలా రూ.1,500లు ఇస్తామ‌న్నారు. అధికారంలోకి వ‌చ్చాక మొద‌టి ఏడాది ఇవ్వ‌నే లేదు. ఇప్పుడేమో ఆడ‌బిడ్డ నిధి పథ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అమ్ముకోవాలంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్య‌లు చేయ‌డం దుర‌దృష్ట‌క‌రం’’ అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు.ఇది మంచి ప్ర‌భుత్వ‌మా చంద్రబాబూ?: పుష్పశ్రీవాణిఎన్నిక‌ల ముందేమో సంప‌ద సృష్టిస్తాం, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తామన్నారు. ఓట్లు వేయించుకుని గ‌ద్దెనెక్కిన త‌ర్వాత సంక్షేమప‌థ‌కాలు అమ‌లు చేయ‌లేమ‌ంటున్నారు. ఆడబిడ్డ నిధి` ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్రదేశ్‌ను అమ్ముకోవాలంటూ వ్యాఖ్య‌లు చేయ‌డం మీకు త‌గునా అచ్చెన్నాయుడూ?. ఇది మంచి ప్ర‌భుత్వ‌మా చంద్రబాబూ?’’ అంటూ మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి ఎక్స్‌ వేదికగా నిలదీశారు.

Innovative system in 40 govt schools for reducing bag weight for Students10
బడి సంచి భారం కాదిక్కడ!

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: స్కూల్‌ విద్యార్థులు నిత్యం బండెడు పుస్తకాలున్న బ్యాగ్‌లను భుజాన మోసుకుంటూ వెళ్లడం పరిపాటే. కానీ కరీంనగర్‌ జిల్లా గంగాధర మండల పరిధిలోని సుమారు 40 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన, వినూత్న విధానం అమలవుతోంది. అక్కడి బడుల్లో కిలోల కొద్దీ పుస్తకాలను మోయలేక మోస్తూ బడికి వచ్చే విద్యార్థులు కనిపించరు. కేవలం చిన్నపాటి బడి సంచితో బడికివచ్చే బాలలే ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఎక్కువ పుస్తకాలు తెస్తే వెంటనే అదనపు బరువును ఉపాధ్యాయులు తొలగించేస్తారు. ఇందుకోసం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. దీంతో విద్యార్థులు ఆయా పాఠశాలలకు వెళ్లడాన్ని భారంగా భావించట్లేదు. గతేడాది నుంచే..: గంగాధర మండలం ఎంఈవో ఏనుగు ప్రభాకర్‌రావు గతేడాది ఒద్యారం స్కూల్‌ హెంఎంగా, ఎంఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ సమయంలో పలువురు విద్యార్థులు అధిక బరువుతో ఉన్న బ్యాగులతో బడికి రావడాన్ని ఆయన గమనించారు. వారిలో పలువురు పిల్లల భుజాలు, నడుములు ఒంగిపోవడం, నడకలో మార్పు రావడం, కాళ్ల ఆకారంలో మార్పులు ఉండటాన్ని గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేందుకు పుస్తకాల బరువును తగ్గించాలని నిర్ణయించారు. ఇందుకోసం స్కూలు ఆవరణలోనే త్రాసు ఏర్పాటు చేశారు. అక్కడ విద్యాశాఖ నిర్దేశించిన ప్రకారం.. ఏ విద్యార్థి ఎంత బరువు మోయాలనే సూచనల ఆధారంగా అంతే బరువు ఉండేలా అదనపు పుస్తకాలను తప్పించారు. రెండు జతల పుస్తకాలు.. విద్యార్థులు టెక్ట్స్‌ బుక్స్, నోట్‌ బుక్స్‌ను సూŠక్‌ల్‌కు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉండటంతో బ్యాగుల బరువు పెరుగుతోంది. అందుకే బ్యాగుల బరువు తగ్గించేలా గత విద్యాసంవత్సరం ముగింపు సందర్భంగా హైస్కూలు పిల్లల పాఠ్యపుస్తకాలను సేకరించి వాటిని ఈ ఏడాది ప్రతి విద్యార్థికీ అదనపు సెట్‌ కింద అందించారు. దీనివల్ల విద్యార్థులు ఇంటి వద్ద పాత పుస్తకాలను, బడిలో కొత్త పాఠ్యపుస్తకాలను ఉంచుతున్నారు. ఫలితంగా వారికి పాఠ్యపుస్తకాలను మోసుకెళ్లే బాధ తప్పింది. అలాగే హోంవర్క్, ఫెయిర్‌ నోట్స్‌ను మాత్రమే పిల్లలు తీసుకెళ్లేలా ఏర్పాటు చేశారు. హాయిగా ఉంది పుస్తకాల బరువు తగ్గించాక చాలా హాయిగా ఉంది. అంతకుముందు దాదాపు 9 కిలోల బ్యాగ్‌ మోయాల్సి వచ్చేది. ఇప్పుడు తక్కువ పుస్తకాలతో స్కూల్‌కు వెళ్తున్నా. నెత్తి, భుజం నొప్పులు తగ్గిపోయాయి. – ఎం.శ్రావ్య, 8వ తరగతి, జెడ్పీ హెచ్‌ ఎస్, ఒద్యారం నడుం నొప్పి పోయింది గతంలో బ్యాగు బరువు వల్ల అమ్మానాన్న దిగబెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరమైన పుస్తకాలనే తీసుకెళ్తుండటం వల్ల బ్యాగు బరువు తగ్గింది. అందుకే మేమే తీసుకెళ్లగలుగుతున్నాం. ఇప్పుడు నడుం నొప్పి, భుజాల నొప్పి లేవు. – రామంచ హర్షిత 10వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్, గట్టుబూత్కూరు, గంగాధర మండలం

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement