
ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ సమీపంలోని బ్రహ్మపుష్కరిణి (కోనేరు)లో శుక్రవారం సాయంత్రం బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన శ్రీలక్ష్మీనృసింహుని డోలోత్సవం, తెప్పోత్సవాలను కన్నులపండువగా నిర్వహించారు

ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బ్రహ్మపుష్కరిణి వరకు మంగళ వాయిద్యాలతో తీసుకెళ్లారు. కోనేరులో హంసవాహనంపై ఐదు ప్రదక్షిణలు చేసి తెప్పోత్సవం నిర్వహించారు

అనంతరం భోగ మండపంలోని ఊయలపై స్వామివార్లను ఆశీనుల్ని చేసి డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు

వేలాది భక్తుల నర్సింహ నామస్మరణతో కోనేరు ప్రాంతం మారుమోగింది









