Dharmapuri
-
వైభవంగా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం (ఫొటోలు)
-
కన్నులపండువగా ధర్మపురి శ్రీలక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం (ఫొటోలు)
-
ధర్మపురిని దర్శిస్తే... యమపురి ఉండదట !
ధర్మపురి: ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం ప్రాంగణంలోనే యమధర్మరాజు ఆలయం ఉంది. ఇక్కడి యమధర్మరాజు విగ్రహం దేశంలోనే అరుదైనదిగా చెబుతుంటారు. భక్తులు ముందుగా యమధర్మరాజును దర్శించుకున్న తర్వాతే శ్రీలక్ష్మీనృసింహ, వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. యమధర్మరాజు భరణి జన్మనక్షత్రం సందర్భంగా ప్రతి నెలా ఆలయ ప్రాంగణంలో ఆయుష్షు హోమం, హారతి, మంత్రపుష్పం తదితర పూజలు చేస్తారు. ఏటా దీపావళి పర్వదినం సందర్భంగా యమ ద్వితీయ వేడుకలు నిర్వహిస్తారు. యమ ద్వితీయ రోజు యమధర్మరాజు నరక ద్వారాలను మూసివేసి తన సోదరి అయిన యమి ఇంటికి వెళ్లి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. నరక ద్వారాలు మూసిన సందర్భంగా ఆరోజు మృతిచెందిన వారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని నమ్మకం. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వస్తుంటారు. యమధర్మరాజు ఆలయంలో ఆయుష్షు హోమం ఇదీ ఆలయ ప్రాశస్త్యం పూర్వం యముడు తాను చేసిన పాపాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. మనస్సుకు శాంతి కావాలని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు. చివరగా నృసింహస్వామిని దర్శించుకునేందుకు ధర్మపురికి చేరుకున్నాడు. పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి.. నృసింహుడిని శరణు వేడుకుంటాడు. స్వామి అనుగ్రహం లభించి పాప విముక్తుడయ్యాడు. నృసింహుని కృపతో ఆలయంలో దక్షిణ దిశలో వెలిశాడు. ముందు భక్తులు తనను దర్శించుకున్న తర్వాతే నృసింహుడిని దర్శించుకునేలా వరం పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి. కాగా యముడు గోదావరి నదిలో స్నానం ఆచరించిన చోట యమగుండాలు అనే పేరు వచ్చింది. క్రీ.శ 850– 928 నాటి ఆలయం ధర్మవర్మ అనే రాజు పాలించినందుకు ధర్మపురికి ఆ పేరు వచ్చింది. ఈ క్షేత్రం క్రీ.శ. 850– 928 నాటి కంటే ముందునుంచే ఉన్నా.. క్రీ.శ. 1422–1436 కాలంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. అనంతరం 17వ శతాబ్దంలో నృసింహ ఆలయాన్ని పునరుద్ధరించినట్టు చరిత్ర చెబుతోంది.మా ఇలవేల్పు లక్ష్మీనృసింహుడు ధర్మపురి లక్ష్మీనృసింహుడు మా ఇంటి ఇలవేల్పు. స్వామివారి దర్శనం కోసం వస్తూనే ఉంటాం. ఇక్కడున్న యమ ధర్మరాజును దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని మా నమ్మకం. – భారతి, భక్తురాలు, కరీంనగర్యముని దర్శనం కోసం వస్తాం ధర్మపురిలోని యమ ధర్మరాజు దర్శనం కోసం వస్తుంటాం. దేశంలో ఇలాంటి ఆలయం ఎక్కడా లేదని అంటుంటారు. అందుకే ఏటా యమున్ని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో వస్తాం. – సాహితి, భక్తురాలు, మంచిర్యాలఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ధర్మపురిలోని యమధర్మరాజు ఆలయాన్ని దేశంలోనే అరుదైనదిగా భావిస్తారు. అందుకే యముడు, లక్ష్మీనృసింహుని దర్శనం కోసం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. – శ్రీనివాస్, ధర్మపురి ఆలయ ఈవో -
ఘనంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
ఘనంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
తిరుపతి/హైదరాబాద్, సాక్షి: వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నేడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. ఏపీలో వైష్ణవ ఆలయాలకు వేకువ ఝామునే భక్తులు క్యూ కట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. గోవిందా నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక.. వీఐపీల తాకిడి వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో.. తిరుమలకు వీఐపీల తాకిడి నెలకొంది. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్.ఎల్. భట్టి, జస్టిస్ శ్యామ్ సుందర్, జస్టిస్ తారాల రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్‌లు విచ్చేశారు. అలాగే.. ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. ఇవాళ ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణలో.. మరోవైపు తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. -
ధర్మపురి శ్రీలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న నైనా జైశ్వాల్
ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో కొలువైన శ్రీలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దైవదర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైనాకు ఆశీర్వాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది ఆమెను శాలువాతో సన్మానించారు. శ్రీలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న అనంతరం నైనా జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘‘అలలకు అలుపు లేదు.. శిలలకు చూపు లేదు.. కాలాలకు రూపు లేదు.. మౌనానికి భాష లేదు.. కానీ, ఆ గోవింద నామాలకు అంతులేదు’’ అంటూ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. సర్వేజనా సుఖీనోభవంతని తాను కోరుకున్నానని ఆమె చెప్పారు. కాగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్.. చదువుల తల్లి.. కుంగుబాటుకు లోనైన బలహీన మనస్కుల్లో సానుకూల దృక్పథాన్ని నింపే మోటివేషనల్ స్పీకర్.. ‘వరల్డ్ పీస్ అంబాసిడర్’గా గుర్తింపు పొందారు నైనా. 17 ఏళ్ల వయసులో పీహెచ్డీ మొదలుపెట్టిన ఆమె 22 ఏళ్లకు పూర్తి చేసి డాక్టరేట్ సాధించారు. దేశంలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు. నైనా జైశ్వాల్ స్ఫూర్తిదాయక ఇంటర్వ్యూ -
ధర్మపురి స్ట్రాంగ్ రూమ్: 17 గంటలు పరిశీలన.. 26 దాకా ఉత్కంఠ
సాక్షి, జగిత్యాల: తాళాలు మిస్సింగ్ లాంటి అనేక మలుపుల మధ్య సాగిన ధర్మపురి స్ట్రాంగ్ రూం ఎపిసోడ్ ఓ కొలిక్కికి వచ్చింది. నాలుగున్నరేండ్ల గది తెరిచిన అధికారులు.. సుమారు 17 గంటలపాటు స్ట్రాంగ్ రూమ్ డాక్యుమెంట్స్‌ను పరిశీలించారు. హైకోర్ట్ ఆదేశాలతో నిన్న (ఏప్రిల్ 23 ఆదివారం) ఉదయం 11 గంటలకు తాళాలు పగులగొట్టి స్ట్రాంగ్ రూమ్ తెరవగా.. ఇవాళ(సోమవారం) ఉదయం 4 గంటల 50 నిమిషాలకు డాక్యుమెంట్ల పరిశీలన ముగిసింది. గత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా అధికారులు పరిశీలించారు. సేకరించిన డాక్యుమెంట్స్ ను నివేదిక రూపంలో ఈనెల 26 లోపు హైకోర్టుకు సమర్పించనున్నారు జగిత్యాల జిల్లా అధికారులు. డాక్యుమెంట్ల పరిశీలన ముగింపుతో హైడ్రామాకు తెర పడగా హైకోర్ట్ తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అడ్లూరి అభ్యంతరాలు.. 👉హై కోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల అధికారుల పర్యవేక్షణ లో 17A మరియు 17 c కి సంబందించిన డాక్యుమెంట్స్ సేకరించడం జరిగింది 👉కౌంటింగ్ సమయంలో రికార్డ్ చేసిన విడియో ఫుటేజ్, సీసీ ఫుటేజ్ లేవు అని అధికారులు చెప్పడం జరిగింది. 👉ఎలక్షన్ పోలింగ్ అయిన తరువాత ఈవీఎంలను ప్రభుత్వం నోటిఫైడ్ చేసిన ప్రాంతంలో ఉంచాలి. కానీ, ధర్మపురి జూనియర్ కాలేజి లో ఈవీఎంలను ఉంచడం జరిగింది. అది ప్రభుత్వం నోటిఫైడ్ చెయ్యని ప్రాంతం!. 👉పోలింగ్ అయిన దగ్గర నుండి ఈవీఎంలను భద్రపరిచే వరకు అధికారులు ఎక్కడ నిబంధనలు పాటించలేదు.. 👉 నాలుగున్నర సంత్సరాలుగా స్ట్రాంగ్ రూం తాళాలు మిస్సింగ్ అయిన పరిస్థితి లోపల కోర్టు ఆదేశాల ప్రకారం తాళాలు పగలగొట్టి స్ట్రాంగ్ రూం ఓపెన్ చేస్తే పోలింగ్ కి సంబంధించిన పత్రలు సీల్ లేకుండా, ఒక క్రమ పద్దతిలో లేకుండా ఉన్నాయి. 👉209 కి సంబంధించిన పోలింగ్ బూత్ కి సంబందించిన 17C డాక్యుమెంట్స్ కి సీల్ వేసి లేదు. 👉ఒక క్యాబినెట్ మంత్రి కి సంబంధించిన ఎన్నికల పోలింగ్ లో ఇన్ని అవకతవకలు జరిగాయి అయినప్పటికీ మేము కోరెది రికౌంటిన్ మాత్రమే.. 👉స్ట్రాంగ్ రూం తాళాలు పోయాయి అని అధికారికంగా ప్రకటించారు.దానికి కారణం అయిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి,వారి పైన క్రిమినల్ కేసు ఫైల్ చెయ్యాలి, వారిని వెంటనే సస్పెండ్ చేయాలి. 👉అదే విధంగా 17c కి సంబంధించిన ఈవీఎంలను మళ్ళీ లెక్కించాలి.. 👉ఇదంతా మంత్రి కొప్పుల ఈశ్వర్ కుట్రరపూరితంగ చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. 👉దీనిపై హైకోర్టు కి మా అడ్వకేట్ ద్వారా విన్నవిస్తం. మరోవైపు కోర్ట్ ఆదేశాల మేరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రక్రియ సజావుగా సాగుతోందని, నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్టు వెల్లడించిన మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రతినిధులు. ► గత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ► కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 10న స్ట్రాంగ్ రూం ఓపెన్ చేసి 17ఏ, 17సీ డాక్యుమెంట్లు, సీసీటీవీ ఫుటేజీలు, సంబంధిత డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉండగా, స్ట్రాంగ్ రూం నంబర్ 786051 నంబర్ తాళాలు మిస్ అయినట్లు ఆఫీసర్లు గుర్తించారు. ► సుమారు ఐదు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. దీంతో తాళాన్ని బ్రేక్ చేయాలని ఆఫీసర్లు నిర్ణయించగా, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఢిల్లీ నుంచి త్రీమెన్ కమిటీ సభ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీలను సమగ్ర నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ► దీంతో రంగంలోకి దిగిన త్రీమెన్ కమిటీ సభ్యులు ఈ నెల 17న కొండగట్టులోని జేఎన్టీయూలో గతంలో కలెక్టర్లుగా పనిచేసిన శరత్, రవితో పాటు అడిషనల్ కలెక్టర్లు రాజేశం, అరుణశ్రీ, ధర్మపురి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ భిక్షపతిలను ఎంక్వయిరీ చేశారు. ఆ ఎంక్వయిరీకి సంబంధించిన వివరాలను వారు కోర్టుకు నివేదించారు. ► దీంతో ఈ నెల 23న ధర్మపురి స్ట్రాంగ్ రూం లాక్ పగలగొట్టాలని లేదా టెక్నీషియన్ తో తీయాలని, ప్రతి ఘటనను కెమెరాలో రికార్డు చేయాలని కోర్టు సూచించింది. అందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 26న కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ► అయితే, ఈ కేసు రెండున్నరేళ్ల పాటు పెండింగ్ లో ఉండగా, ధర్మపురి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ భిక్షపతి కోర్టుకు హాజరుకాకపోవడం.. అరెస్ట్ వారంట్ రావడంతో మళ్లీ కొంత పురోగతి కనిపించింది. ► కోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా నూకపల్లిలో వీఆర్కే కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్‌ను ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఆయా పార్టీల, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో ఆదివారం ఉదయం 11 గంటలకు లాక్ పగలగొట్టి ఓపెన్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను, సీసీటీవీ ఫుటేజీలకు చెందిన జిరాక్స్ లను అటెస్ట్ చేసి వాటిని ఈ నెల 26న అధికారులు కోర్టుకు అందజేయనున్నారు. -
ధర్మపురి వివాదంలో మరో ట్విస్ట్.. కాంగ్రెస్ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల జిల్లా: మరోసారి ధర్మపురి ఎన్నికల వివాదం ఉత్కంఠ రేపుతోంది. ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలను అధికారులు పగలగొట్టిన సంగతి తెలిసిందే.. అయితే, నాలుగు బాక్సులకు మినహా మిగతా వాటికి తాళాలు లేవని, అధికారుల చర్యలు అనుమానం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, హైకోర్టు ఆదేశాలతో ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు అధికారులు పగలగొట్టారు. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నిక ఫలితాలపై వివాదం నెలకొంది. గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి.. హైకోర్టును ఆశ్రయించారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిటిషన్‌తో నివేదిక సమర్పించాలని జగిత్యాల జిల్లా అధికారులు, నాటి జిల్లా ఎన్నికల అధికారిని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 10వ తేదీనే స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి అధికారులు సిద్ధమయ్యారు. కాగా, స్ట్రాంగ్ రూమ్ తాళం చెవుల మిస్సింగ్‌తో హైడ్రామా నెలకొంది. కీస్ మిస్సింగ్‌పై విచారణ చేపట్టాలని భారత ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. చదవండి: ధీరుడు కన్నీళ్లు పెట్టడు.. రేవంత్ నీతో నాకు పోలికేంటి..? ఈటల కౌంటర్ కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 17వ తేదీన నాచుపల్లి జేఎన్టీయూలో నాటి ఎన్నికల అధికారి శరత్, ఆ తర్వాత విధులు నిర్వహించిన కలెక్టర్ రవినాయక్, ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ బాషాతో పాటు, నాటి రిటర్నింగ్ ఆఫీసర్, ఇతర అధికారులను ఈసీఐ బృందం విచారించింది. ఈసీఐ నివేదిక సమర్పించడంతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో నాటి అభ్యర్థుల సమక్షంలో ఆదివారం.. స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు. -
ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టిన అధికారులు
-
కాసేపట్లో తెరుచుకోనున్న ధర్మపురి స్ట్రాంగ్ రూమ్
-
ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టిన అధికారులు
సాక్షి, జగిత్యాల జిల్లా: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు అధికారులు పగలగొట్టారు. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నిక ఫలితాలపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి.. హైకోర్టును ఆశ్రయించారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిటిషన్‌తో నివేదిక సమర్పించాలని జగిత్యాల జిల్లా అధికారులు, నాటి జిల్లా ఎన్నికల అధికారిని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 10వ తేదీనే స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి అధికారులు సిద్ధమయ్యారు. కాగా, స్ట్రాంగ్ రూమ్ తాళం చెవుల మిస్సింగ్‌తో హైడ్రామా నెలకొంది. కీస్ మిస్సింగ్‌పై విచారణ చేపట్టాలని భారత ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 17వ తేదీన నాచుపల్లి జేఎన్టీయూలో నాటి ఎన్నికల అధికారి శరత్, ఆ తర్వాత విధులు నిర్వహించిన కలెక్టర్ రవినాయక్, ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ బాషాతో పాటు, నాటి రిటర్నింగ్ ఆఫీసర్, ఇతర అధికారులను ఈసీఐ బృందం విచారించింది. ఈసీఐ నివేదిక సమర్పించడంతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో నాటి అభ్యర్థుల సమక్షంలో ఆదివారం స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు. నాటి ఎన్నికలకు సంబంధించిన కీలకమైన ప్రొసీడింగ్స్, 17ఏ, 17 సీ ఫామ్స్‌తో పాటు, ఫలితాల రోజు కౌంటింగ్ రూమ్ సీసీ కెమెరాల ఫుటేజ్‌ను జిల్లా అధికారులు సమర్పించనున్నారు. ఏప్రిల్ 26లోపు నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ధర్మపురి ఎన్నిక వివాదంపై కోర్టు తీర్పు, తదుపరి పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చదవండి: బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్ ఛీ! బాత్రూం బిర్యానీ! -
ధర్మపురి: స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్/ కరీంనగర్: ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతు వివాదంపై తెలంగాణలో ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతుపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో తెలపాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించింది. ఈ సందర్బంగా తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. 2018లో లక్ష్మణ్ కుమార్(కాంగ్రెస్)పై 441 ఓట్ల తేడాతో కొప్పుల ఈశ్వర్ గెలుపొందారు. కాగా, కొప్పుల విజయంపై లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు.. 2018 ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయని.. ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం కోర్టును ఆశ్రయించారు. 441 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగినట్టు ఆరోపించారు. దీంతో, మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని కోరారు. -
ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి
-
కావాలనే స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్ చేశారు..
-
తెరుచుకున్న జగిత్యాల స్ట్రాంగ్ రూమ్..!
-
ట్విస్ట్: ధర్మపురి ఎన్నికపై హైకోర్టు ఆదేశాలు.. స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్
జగిత్యాల: జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి 2018లో జరిగిన ఎన్నికల డాక్యుమెంట్ కాపీలు, సీసీ ఫుటేజీలు, ఇతర ఎన్నికల సామగ్రి భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్ తాళాలు మిస్సయ్యాయి. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అక్రమమని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సుమారు నాలుగున్నరేళ్లుగా కొనసాగుతోంది. అయితే, ఎన్నికల ఫలితాలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచి 17ఏ, 17సీ డాక్యుమెంట్ కాపీలు, సీసీ ఫుటేజీలు, ఎన్నికల ప్రొసీడింగ్స్‌ను ఈనెల 11న తమకు సమరి్పంచాలని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా సమక్షంలో మల్యాల మండలం నూకపల్లి వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచేందుకు ఉద్యోగులు వెళ్లారు. ధర్మ పురి నియోజకవర్గానికి సంబంధించిన మూడు స్ట్రాంగ్‌రూమ్‌లు వీఆర్కే కళాశాలలో ఉండగా, అందులో కోర్టు అడిగిన 17ఏ, 17సీ వీడియో ఫుటేజీలు భద్రపర్చిన గది లాక్ ఓపెన్ కాలేదు. మిగతావి రెండు ఓపెన్ అయ్యాయి. అందులో ఈవీఎంలు, వీవీప్యాడ్లు భద్రంగానే ఉన్నాయి. కోర్టు అడిగిన డాక్యుమెంట్లు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్ మాత్రమే ఓపెన్ కాకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై కలెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గం స్ట్రాంగ్‌రూమ్–3కి లాక్ ఓపెన్ కావడం లేదని తెలిపారు. పతినెలా వచ్చి చూసినప్పుడు తాళానికి సీల్ వేసే ఉందన్నారు. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని, నివేదిక సమరి్పస్తామని, హైకోర్టు నిర్ణయానుసారం వ్యహరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ తప్పిదం వల్లే: అడ్లూరి ధర్మపురి నియోజకవర్గ ఎన్నికల వీడియో ఫుటేజీ, డాక్యుమెంట్లు ఉంచిన రూమ్ 786051 తాళం చెవి లేకపోవడానికి కలెక్టర్, మంత్రి కొప్పుల ఈశ్వరే బాధ్యత వహించాలని డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కలెక్టర్ తప్పిదం వల్లే ఇది జరిగిందని ఆరోపించారు. -
నిజాన్కి నేనే గెల్సిన.. రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే..
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. గాడ రొండం త్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. గా బంగ్ల ముంగట విక్రమార్కుడు మోటరాపిండు. ఆపి హారన్ గొట్టిండు. హారన్ సప్పుడినంగనే బేతా లుడు బంగ్లకెల్లి ఇవుతల కొచ్చిండు. మోట రెక్కి ఎన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్ప బట్టిండు. గప్పుడు ఎన్క సీట్ల గూసున్న బేతాలుడు – ‘‘నన్ను గూసుండ బెట్టుకోని గుంతలు, ఎత్తు గడ్డలు, కంకర తేలిన తొవ్వలని సూడకుంట మోటర్ నడ్పుతవు. ఒక్కోపారి ట్రాఫిక్ల ఇర్కపోతవు. కోపం గినొస్తె నువ్వు గాన్ని గీన్ని తిట్టొచ్చు. నీకు ఎటూ సుద్రాయించక పోవచ్చు. నీకు యాస్ట రాకుంట ఉండెతంద్కు గిప్పుడు నడుస్తున్న ఒక కత జెప్త ఇను. ‘‘నెల దినాల సంది మునుగోడుల నడ్సిన బైఎలచ్చన్ల బాగో తంకు పర్ద బడ్డది. పది మంత్రులు, తొంబైమంది ఎమ్మెల్యేలే గాకుంట ముక్యమంత్రి గుడ్క బాగోతమాడితె పదివేల చిల్లర ఓట్లతోని టీఆర్ఎస్ దిక్కుకెల్లి పోటి జేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెల్సిండు. అన్నా! నువ్వు గెల్సినందుకు పటాకులు గాలుస్తం. లడ్లు, కోవపేడలు పంచిపెడ్తం. మందు గొడ్తం. కోల్లు, మేకలు గోసి దావత్ జేసుకుంటం. పది లచ్చల రూపాయలు ఇయ్యే అని గాయిన దిక్కుకెల్లి పని జేసిన టీఆర్‌ఎసోల్లు అడిగిండ్ర’’ ని బేతాలుడు అన్నడు. ‘‘గాల్లు అడిగితె కూసుకుంట్ల రూపాయ లిచ్చిండా?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘వందల కోట్ల రూపాయలు కర్సు జేస్తె కింద మీద బడి బై ఎలచ్చన్ల గెల్సిన. ఇంతకుముందు మీరు అడి గట్లిస్తె కడిగి నట్లయింది. ఇంక పైసలు యాడికెల్లి దేవాలె. ఎంత గనం తన్లాడినా కమస్కం నల్ఫై వేల ఓట్ల మెజార్టి రానందుకు కేసీఆర్ నారాజైండు అన్కుంట గాయిన మొత్తుకుండు.’’ ‘‘బీజేపీ దిక్కు కెల్లి నిలబడ్డ రాజగోపాల్ రెడ్డి ఏమన్నడు?’’ ‘‘కింద బడ్డా మీది కాలు నాదే. న్యాయం నా దిక్కే ఉన్నది. టీఆర్ఎస్కు ఓటు ఎయ్యకుంటె పింఛన్లు ఇయ్యమని బెదిరిచ్చిండ్రు. తొండి జేసి గెల్సిండ్రు. నిజం జెప్పాలంటె నేనే గెల్సిన అన్నడు.’’ ‘‘గీ ఎలచ్చన్ల బాగోతంల బుడ్డర్ ఖాన సుంటి కె.ఎ. పాల్ ఏమన్న అన్నడా?’’ ‘‘నూరుకు అర్వై ఓట్ల లెక్కన నాకు ఓట్లు వొస్తయి. గని టీఆర్ఎస్, బీజేపీలు ఈవీఎంల తోని తోతిరి జేసినయి. ఈవీఎంలు వొద్దంటె గా రొండు పార్టిలు అడ్డంబడి నన్ను గెల్వకుంట జేసినయి. నిజాన్కి నేనే గెల్సిన. ఇయ్యాల గాకున్నా రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే అని కె.ఎ. పాల్ అన్నడు. ఎలచ్చన్లు గిప్పటి తీర్గ గాకుంట హర్రాజ్ తోని బెట్టాలె. ఎవ్వలు అందరికన్న ఎక్వ కోట్లు పంచి పెట్టుడే గాకుంట కోట్ల రూపాయల మందు బోపిచ్చెతందుకు ముంగట్కి వొస్తరో గాల్లే గెల్సినట్లు సాటి య్యాలని సర్కార్ అనుకుంటున్నది. కోట్ల రూపాయలు కర్సు బెట్ట కుండుడే గాకుంట మందు బోపియ్యనోల్లకు ఎలచ్చన్ల పోటి జేసే హక్కు ఉండదని జెబ్దామనుకుంటున్నరు. ఓటుకు నాల్గు వేలు ఇస్త మని మూడు వేలే ఇచ్చిండ్రు. కడ్మ వెయ్యి ఎప్పుడిస్తరని కొందరు లొల్లి బెట్ట బట్టిండ్రు’’ ‘‘గింతేనా ఇంకేమన్న ఉన్నదా?’’ ‘‘సార్ మీరు రాజినామ జెయ్యుండ్రి. రాజినామ జేస్తె మును గోడు లెక్క బై ఎలచ్చన్లొస్తయి. సర్కార్ పైసలు మంజూరు జేస్తది. దాంతోని మా పరిగి మంచిగైతది అన్కుంట పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డికి ఒకడు ఫోన్ గొట్టిండు. అన్నా! పౌరన్ నువ్వు మంత్రి కుర్సికే గాకుంట ఎమ్మెల్యేకు నువ్వు రాజినామ జేసి బై ఎలచ్చన్లు తేయే. నువ్వు రాజినామ జేస్తె ధర్మపురి నియోజక వర్గమే గాకుంట మా బత్కులు బాగై తయే అన్కుంట బతికెపల్లి కెల్లి రమేశ్ అనెటోడు మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఫోన్ గొట్టిండు. అచ్చెమ్మ పెండ్లి బుచ్చెమ్మ సావు కొచ్చిన తీర్గ మునుగోడు బై ఎలచ్చన్లు మా పానం మీదికొ చ్చిందే అన్కుంట మంత్రి మొత్తుకుండు. మునుగోడు ఎలచ్చన్ల నేనే గెల్సిన అని కూసుకుంట్ల అన్నడు. న్యాయంగ జూస్తె నేనే గెల్సిన అని రాజ గోపాల్ రెడ్డి అంటె గీల్లిద్దరు గాదు నేనే గెల్సిన అని కె.ఎ. పాల్ అంటున్నడు. ఇంతకు ఎవ్వలు గెల్సిండ్రు. ఎవ్వలు ఓడిపోయిండ్రు . గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటివా అంటె నీ మోటర్ గుంతల బడ్తది’’ అని బేతాలుడన్నాడు. ‘‘మునుగోడుల మందు, మనీ గెల్సింది. జెనం ఓడి పోయిండ్రు’’ అని విక్రమార్కుడు జెప్పిండ్రు. బొందల గడ్డ రాంగనే బేతాలుడు మోటర్ దిగి ఇంటికి బోయిండు. (క్లిక్: ఓట్ల పండ్గ ఎట్లైంది.. మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ.. ఇక్కడి నుంచే కవిత పోటీ చేసే ఛాన్స్?
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా రాజకీయం భవిష్యత్తులో రసవత్తరంగా మారనుంది. జిల్లా కేంద్ర నియోజకవర్గంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగిత్యాల జిల్లాపై బీజేపీ రాష్ట్ర నేతలు గానీ, ఎంపీ అర్వింద్ గానీ దృష్టి సారించడంలేదనే ఆరోపణ వినిపిస్తోంది. కేవలం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంపీ గెలిచినా పార్టీ పటిష్టం కాలేదు. జగిత్యాలకు ప్రత్యేక స్థానం రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల సీటు ప్రత్యేక స్థానం పొందింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్ విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్‌నేత జీవన్ రెడ్డి ఓటమి పాలవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని భారీ మెజార్టీతో సాధించుకున్నారు జీవన్‌రెడ్డి. టీఆర్ఎస్లో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య పోరు ఎమ్మెల్యే సంజయ్‌కు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం నియోజకవర్గ పర్యటనలకు, నిరసనలకు మినహా పార్టీ బలోపేతంపై దృష్టిసారించకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారనుంది. చదవండి: పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా? జగిత్యాల నుంచి పోటీకి ఆ ఇద్దరి ప్రయత్నాలు అయితే సంజయ్ కుమార్ ఈసారి టీఆర్ఎస్ టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలోని ఇద్దరు ముఖ్య నేతలు తామే ఎమ్మెల్యే అభ్యర్ధులమని ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జగిత్యాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేత ఎల్. రమణ టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన కూడా జగిత్యాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. బీజేపీ సైతం ఉనికి పోరాటాలకే పరిమితం అయ్యిందని రాజకీయ విశ్లేషకుల వాదన. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ గెలిచాక జగిత్యాల కూడా అందులో ఉండటంతో కొంత జోష్ పెరిగినా వర్గ విభేదాలు ఎక్కువయ్యాయి. కొడుకును రంగంలోకి దింపనున్న విద్యాసాగర్ కోరుట్లకు విద్యాసాగర్ రావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కోరుట్ల నుంచి విద్యాసాగర్ తన కుమారుడు సంజయ్‌ను పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే సంజయ్ హైదరాబాదులో వైద్యుడిగా పని చేస్తున్నారు. ఎన్నికల వాతావారణం రావడంతో సంజయ్ ఇప్పటినుంచే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ నేతలు మూడు వర్గాలుగా విడిపోయి ఎవరికివారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్ది రాములు, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కొడుకు నర్సింగరావు పోటీకి రెడీ అవుతున్నారు. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన జేయన్ వెంకట్ టికెట్టు ఆశిస్తున్నారు. చదవండి: గుజరాత్లో బీజేపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత.. ఈసారి కాంగ్రెస్‌దే విజయం.. టీఆర్ఎస్లో కుమ్ములాటలు ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గం ధర్మపురికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార టీఆర్ఎస్లో స్థానికంగా కుమ్ములాటలు చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి మీద కొప్పుల ఈశ్వర్వి జయం సాధించారు. కొప్పుల ఈశ్వర్ చేతిలో ఓటమి పాలైన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ రీ కౌంటింగ్ కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఎలాగైనా ఈసారైనా ఈశ్వర్‌ను ఓడించాలని లక్ష్మణ్ కుమార్పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ టిక్కెట్ తనకే ఇవ్వాలని కోరుతున్నారు. కొప్పుల ఈశ్వర్‌కు తలనొప్పి టీఆర్ఎస్లో వర్గ విభేదాలు కొప్పుల ఈశ్వర్‌కు తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం లింక్ 2 లో భాగంగా పైపులైన్ వేసిన భూములకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం తక్కువగా ఉందని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. రోడ్ల వెడల్పులో ఇళ్ళు కోల్పోయినవారికి పరిహారం అందక వారు అధికార పార్టీ మీద గుర్రుగా ఉన్నారు. ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 15 వార్డుల్లో టీఆఆర్ఎస్ ఎనిమిది, కాంగ్రెస్ ఏడు వార్డులు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు తరువాత బీజేపీలో చేరిన గడ్డం వివేక్‌కు రెండు పార్టీల కార్యకర్తలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో ధర్మపురిలో బీజేపీ తరపున నిలిచి గెలవాలని ఆయన ఆశిస్తున్నారు. -
చిన్న చిన్న రోల్స్ చేసుకునే నన్ను హీరోగా చేశారు
‘‘ధర్మపురి పేరుతో జగత్గారు సినిమా తీశారని తెలియగానే ఆశ్చర్యం కలిగింది. గోదావరి తీరాన పురాతనమైన ధర్మపురి గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఆలయం పేరుతో వస్తున్న ‘1996 ధర్మపురి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘1996 ధర్మపురి’. శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి దర్శకుడు మారుతి, నిర్మాతలు వై.రవి శంకర్, యస్.కె.యన్, సెవెన్ హిల్స్ సతీష్, రచయిత డార్లింగ్ స్వామి, నటుడు జీవీ అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘జగత్ కథ చెప్పిన రోజే ఈ సినిమా అందరి హృదయాలకి దగ్గరవుతుందనిపించింది’’ అన్నారు. ‘‘మా సినిమాను సపోర్ట్ చేస్తూ రిలీజ్ చేస్తున్న ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ వారికి, గీతా ఆర్ట్స్ వారికి థ్యాంక్స్’’ అన్నారు చిత్ర నిర్మాత భాస్కర్. ‘‘ప్రస్థానం’తో నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ‘1996 ధర్మపురి’ చాలా బాగా వచ్చింది’’ అన్నారు జగత్. ‘‘చిన్న చిన్న రోల్స్ చేసుకునే నన్ను హీరోగా చేసి, నా ప్రతిభని బయటకు తీసిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు గగన్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1271266370.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: మాటల్లో చెప్పలేని తిట్లు, భౌతిక దాడి చేసింది.. వాపోయిన హీరో నన్ను గర్భవతిని చేసి మోసం చేసింది ఆ డైరెక్టర్ కాదు! -
నేను బతికేలా లేను.. బిడ్డలు, నువ్వు జాగ్రత్త!
సాక్షి, గొల్లపల్లి(ధర్మపురి): కరోనా అంటే భయపడవద్దని.. ఇంటి వద్దనే తగ్గుతుందని అందరిలో ధైర్యం నూరిపోసిన తానే ధైర్యం కోల్పోయాడు. ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేరేందుకు వెనుకాడాడు. చివరికి శ్వాససంబంధిత సమస్య తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరి ప్రాణాలు కోల్పోయాడు. ‘నువ్వు.. బిడ్డలు జాగ్రత్త..’ అంటూ ఆస్పత్రిలో చేరే ముందు చెప్పినవే చివరిమాటలు అయ్యాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బండారి చంద్రశేఖర్ కరోనా కాటుకు బలయ్యాడు. చంద్రశేఖర్ బుగ్గారం మండలం గంగాపూర్ ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్గా పనిచేస్తున్నారు. భార్య లహరి, కొడుకు చరణ్‌తేజ(14), కూతురు కీర్తి(11) ఉన్నారు. చంద్రశేఖర్ చిన్న వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు.. మారుమూల ప్రాంతంలోని పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. గ్రామంలో ఎవరికీ ఇబ్బంది ఎదురైన తనకు తోచిన సహాయం అందించేవారు. ఇలా అందరికీ సాయం చేసే శేఖర్ ఈ నెల 19న కరోనాతో పోరాడి ప్రాణాలు వదిలాడు. ఇంటి వద్దే తగ్గుతుందనుకున్నారు కరోనా పాజిటివ్ అని తెలిసినా భయపడలేదు. హోమ్ క్వారంటైన్లో ఉండి మందులు వాడితే తగ్గిపోతుందని భావించాడు. శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్ తీసుకెళ్తామన్నాం. హైదరాబాద్ ఆసుపత్రిలో ఎక్కువ మంది లక్షలు ఖర్చు చేసుకున్నా తగ్గుతలేదని, ఇంటి వద్దనే మందులు వాడితే తగ్గిపోతుందని మాకు చెప్పాడు. అయితే ఐదు రోజులకే ఆరోగ్యంలో మార్పులు కనిపించాయి. వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాం. ఆసుపత్రిలోకి వెళ్లే సమయంలో బిడ్డలు.. నువ్వు జాగ్రత్త అన్న మాటలే చివరి మాటలు అవుతాయని అనుకోలేదు. ఆయన బతికిరావాలని మొక్కరాని దేవుళ్లకు మొక్కినం. రూ.8 లక్షల వరకు ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదు. నాన్న వస్తాడమ్మ.. నాన్నకు ఏమికాదని నా పిల్లలు అంటుంటే దుఃఖం ఆగడం లేదు. – లహరి, శేఖర్ భార ఇప్పుడెవరిస్తారు నాన్న మా నాన్న అడుగక ముందే అన్ని ఇచ్చారు. నాన్న చనిపోయి 11 రోజులవుతుంది. బయటకు వెళ్తే ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చేది. ఇప్పుడెవరిస్తారు నాన్న?. ప్రైవేట్ స్కూల్లో నన్ను, చెల్లిని చదవించావు. నేను బాగా క్లెవర్ అని కలెక్టర్ అయ్యే దాకా చదివిస్తాను అన్నావు. కానీ కలెక్టర్‌ను చేయకుండానే వెళ్లిపోయావు. నాకు బైక్ నేర్పించావు. నువ్వు లేకుండా బైక్ నడుపబుద్ది కావడం లేదు నాన్న. చెల్లి కీర్తి సారీ ఫంక్షన్ గ్రాండ్‌గా చేస్తానన్నావు. ఇప్పుడు కనిపించనంత దూరంగా వెళ్లిపోయిండు. మా నాన్న మళ్లీ రావాలి. – చరణ్‌తేజ్, కీర్తి చదవండి: బ్లాక్‌ఫంగస్ దానివల్ల రాదు.. ఇది అసలు విషయం! దమ్ము కొడితే.. దుమ్ములోకే.. -
విషాదం: కోతుల భయంతో గుండె ఆగింది
సాక్షి, ధర్మపురి: కోతులు దాడి చేస్తాయేమోనన్న భయంతో ఓ మహిళ గుండె ఆగి మరణించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బట్టపల్లి మోహన్ ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం కుటుంబంతో ధర్మారానికి వచ్చాడు. ఇక్కడే ఉంటూ వడ్రంగి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మోహన్ కూతురు రేవతి (34)కి వివాహం అయినప్పటికీ ధర్మారంలో తండ్రి వద్దనే ఉంటోంది. ఉదయం ఇంటి నుంచి రేవతి బయటకు వస్తున్న సమయంలో గుంపుగా వచి్చన కోతులు పెద్దగా అరుస్తూ ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వాటిని చూసిన రేవతి భయంతో అక్కడే కుప్పకూలింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. గుండెపోటుతోనే మరణించిందని వైద్యులు తెలిపారు. కాగా, రేవతికి ముగ్గురు పిల్లలున్నారు. చదవండి: కొత్త ట్విస్ట్: యువతికి షాకిచ్చిన జొమాటో డెలివరీ బాయ్ -
పెళ్లి సంబంధాలు చూస్తున్నారని యువతి ఆత్మహత్య
సాక్షి, ధర్మపురి: తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్మపురి మండలంలోని జైనా గ్రామంలో చోటుచేసుకొంది. ఎస్సై కిరణ్‌కుమార్ వివరాల ప్రకారం.. జైనాకు చెందిన సట్టా వినీత(20)కి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. యువతి మాత్రం తనకు పెళ్లి వద్దని, చదువుకోవాలని ఉందని ఎంత చెప్పినా వారు వినలేదు. దీంతో మనస్తాపం చెంది, మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: (పెళ్లయిన తొమ్మిది నెలలకే...) -
ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. క్షణాల్లో
చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటిపై వెళ్తున్న యువతి రోడ్డు దాటే క్రమంలో యాక్సిడెంట్‌కు గురైంది. ఆ సమయంలో తనతో ఓ పాప కూడా ఉంది. అత్యంత వేగంగా దూసుకొచ్చిన బైకర్ వారిని ఢీకొట్టడంతో ఇద్దరూ గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. బైకర్ సైతం తీవ్రగాయాల పాలయ్యాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు వీరిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. (చదవండి: రోడ్డు ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం) కాగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గురైన ముగ్గురు మైనర్లే కావడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ధర్మపురి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.(చదవండి: మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం ) -
50 అడుగుల బావిలో గున్న ఏనుగు
సాక్షి, సేలం(తమిళనాడు): తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో గున్న ఏనుగు బావిలో పడిపోయింది. అటవీశాఖ సిబ్బంది 13 గంటల పాటు శ్రమించి ఏనుగును సురక్షితంగా బయటకు తీశారు. పాలక్కోడు సమీపంలోని ఏలకుండూర్ గ్రామంలో 50 అడుగుల లోతైన బావి ఉంది. గురువారం నీటి కోసం వచ్చిన ఒక ఆడ గున్న ఏనుగు ప్రమాదవశాత్తు అందులో జారి పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి బావిలో ఉన్న నీటిని మోటార్లతో బయటకి తోడేశారు. ఏనుగుకు రెండు మత్తు సూదులు ఇచ్చి క్రేన్ల సహాయంతో బావిలోంచి అతికష్టం మీద బయటకు తీశారు. అనంతరం ఏనుగుకు వెటర్నరీ వైద్యులు చికిత్స చేశారు. (ట్రాఫిక్ కానిస్టేబుల్ వైరల్ వీడియో) -
జో బైడెన్‌తో ధర్మపురి వాసి
ధర్మపురి : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు దిశలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జోబైడెన్‌తో ధర్మపురికి చెందిన అర్చకుడు కశోజ్జుల చంద్రశేఖర్‌శర్మ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2003లో అమెరికాలోని వెల్మింగ్టన్ సిటీలోని మహాలక్ష్మీ అమ్మవారి ఆలయానికి జోబైడెన్ రాగా.. అక్కడే అర్చకుడిగా ఉన్న చంద్రశేఖర్‌శర్మ ప్రత్యేక పూజలు చేసి నుదుట తిలకం దిద్దారు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం చంద్రశేఖర్‌శర్మ శాన్ఫ్రాన్సిస్కోలో హన్మాన్ ఆలయం నిర్మించి అక్కడే ఉంటున్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ జో బైడెన్‌కు హిందూ దేవుళ్లపై విశ్వాసం ఎక్కువగా ఉందని, అమ్మవారి కృపతో అధ్యక్షుడిగా గెలుపొందుతారని జోస్యం చెప్పారు. -
మైనర్‌ను వేధించిన కానిస్టేబుల్ తొలగింపు
సాక్షి, ధర్మపురి: ఓ మైనర్‌తో పలుసార్లు అసభ్యంగా ప్రవర్తించి వేధించిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. ధర్మపురికి చెందిన ఓ బాలిక(14) తెలంగాణ రాష్ట్ర అండర్-14 విభాగంలో కెప్టెన్‌గా వ్యవహరించి ఇటీవల కబడ్డీ పోటీల్లో జాతీయస్థాయికి ఎంపికైంది. కబడ్డీలో మరింత పట్టు సాధించేందుకు జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి పీఈటీ ఆదేశాల మేరకు రెండు, మూడు సార్లు ప్రత్యేక కోచింగ్‌కు వెళ్లింది. ధర్మపురి ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సురేందర్ అనే యువకుడు కోచింగ్ ఇచ్చాడు. ఈ సమయంలో బాలికను మాయమాటలతో లోబరుచుకునేందుకు అనేకసార్లు ప్రయత్నించాడు. ధర్మపురిలో ఇటీవల జరిగిన లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన రథోత్సవం రోజున వేడుకలను తిలకించడానికి వస్తున్న బానలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక రోదిస్తూ ఇంటికెళ్లింది. తల్లిదండ్రులు, పోలీసులకు తెలిపింది. బాలిక ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ సురేందర్‌పై పోక్సోయాక్టు కింద వేధింపుల కేసు నమోదు చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జైలుకు పంపించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. (లే నాన్నా.. లే..) -
జగిత్యాల,ధర్మపురిలో టీఆర్ఎస్ కైవసం
-
తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య
సాక్షి, పెగడపల్లి(కరీంనగర్) : కుటుంబకలహాల కారణంగా అల్లారుముద్దుగా పెంచీ పెద్ద చేసిన తండ్రి.. కొడుకునే అంతమొందించిన సంఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో చోటుచేసుకుంది. సంఘటన స్థలాన్ని జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, మల్యాల సీఐ కిషోర్ సందర్శించారు. మృతుడి తల్లి గంగవ్వ, డీఎస్పీ వివరాల మేరకు..దోమలకుంటకి చెందిన నక్క రమేశ్–గంగవ్వ దంపతులకు కుమారుడు జలేందర్(21), కూతురు స్నేహ ఉన్నారు. ఉపాధి నిమిత్తం రమేశ్ కొన్నేళ్లపాటు దుబాయి వెళ్లి ఇటీవల తిరిగొచ్చాడు. కొద్దిరోజుల నుంచి భార్యభర్తలు రమేశ్,గంగవ్వ మధ్య డబ్బు విషయమై గొడవలు జరుగుతున్నాయి. దుబాయ్‌లో సంపాదించిన డబ్బు తనకు ఇవ్వకుండా తల్లిదండ్రులు, ఆడబిడ్డకు పంపించాడనే కారణంతో గొడవలు తీవ్రమయ్యాయి. కొద్దిరోజులక్రితం నుంచి రమేశ్ తన తల్లి కొమురవ్వ, తండ్రి రాయమల్లు వద్ద ఉంటున్నాడు. బుధవారం ఉదయం రమేశ్ పనులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా కొడుకు జలేందర్, భార్య గంగవ్వ డబ్బు విషయమై గొడవపడ్డారు. ఈ క్రమంలో రమేశ్, తన తండ్రి రాయమల్లు సహకారంతో కత్తితో జలేందర్‌ను కడుపు, చాతిపై పొడిచి గొడ్డలితో దాడి చేయగా తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడిక్కడే మృతిచెందాడు. అడ్డుగా వచ్చిన భార్య గంగవ్వ కుడివైపు పొత్తి కడుపుపై కత్తిగాటు చేయడంతో తీవ్రగాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నక్క రమేశ్ పరారీలో ఉన్నాడు. సీఐ కిషోర్ ఆధ్వర్యంలో రమేశ్, ఆయనకు సహకరించిన జలేందర్ తాత రాయమల్లుపై కేసు నమోదు చేసి అయిందని డీఎస్పీ తెలిపారు. పెగడపల్లి ఎస్సై జీవన్ వారి వెంట ఉన్నారు. కాగా మృతుడి తల్లి గంగవ్వ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిం దితులపై సెక్షన్ 303, 307ఆర్/విత్ 109, 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి పరిశీలించారు. హత్యకు దారి తీసిన కారణాలు పోలీసుల ద్వారా తెలుసుకున్నారు. -
మత్తులో ట్రావెల్స్ డ్రైవర్, కండక్టర్
బుగ్గారం : జగిత్యాల నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు డ్రైవర్, కండక్టర్ బుధవారం డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. జగిత్యాల ఆర్డీవో నరేందర్ గుర్తించడంతో ప్రయాణికుల కు ముప్పు తప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం జగిత్యాల నుంచి మంచిర్యాలకు ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు 30మంది ప్రయాణికులతో బయలు దేరింది. అదే సమయం లో ధర్మపురి వైపు ఆర్డీవో నరేందర్ కారులో వెళ్తున్నారు. బస్సు అతివేగంగా, అజాగ్రత్తగా వెళ్తుండటాన్ని గమనించి బుగ్గారం ఎస్సై చిరంజీవికి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఎక్స్‌రోడ్డు వద్ద బస్సును అడ్డగించి డ్రైవర్ ఖాజా, కండక్టర్ జీవన్రెడ్డికు ఆల్కహాల్ పరీక్ష నిర్వహించారు. వారిద్దరూ మద్యం సేవించినట్లు రుజువు కాగా కేసు నమోదు చేశారు. ప్రైవేటు బస్సును స్టేషన్‌కు తరలించారు. -
భర్త కోసం భార్య ఆత్మహత్యాయత్నం
ధర్మపురి: ‘నాయకుల పలుకుబడితో నా భర్తను అణగదొక్కడానికి రౌడీషీట్ ఓపెన్ చేసిండ్రు. అవమానం భరించలేకనే శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డా’నని బాధితురాలు అనూష రోదిస్తూ తెలిపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని నేరెల్ల గ్రామానికి చెందిన జాజాల అనూష(28) అదే గ్రామానికి చెందిన జాజాల రమేష్‌ను 2017లో ప్రేమవివాహం చేసుకుంది. వీరికి చైత్రిక(15 నెలలు) కూతురు ఉంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ పదవికి అనూష, ఎంపీటీసీ పదవికి రమేష్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రమేష్‌పై 2015, 2016, 2018లో మొత్తం మూడు కేసులున్నాయని, ఏడాది క్రితం ఒకటి, ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్‌లో మొత్తం రెండు కేసులు కొట్టుడుపోగా మిగిలిన చిన్నపాటి కేసు కరీంనగర్లో నడుస్తోందని తెలిపింది. కొందరు నాయకులు పలుకుబడితో తన భర్తపై రౌడీషీట్ ఓపెన్ చేశారని, పలువురు పలు విధాలుగా మాట్లాడుతూ హేళన చేస్తున్నారని వివరించింది. ఈక్రమంలో మనస్తాపానికి గురై శనివారం ధర్మపురి పోలీస్‌స్టేషన్ ముందు క్రిమిసంహారకమందు తాగి స్టేషన్లోకి వెళ్లింది. కొంత సేపటికి కిందపడిపోగా ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అవమానం భరించలేకనే ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. జరిగిన సంఘటనపై ఎస్సై శ్రీకాంత్‌ను వివరణ కోరగా అనూష భర్త రమేష్‌పై రౌడీషీట్ ఉందని, రైడీషీట్కు ఆత్మహత్యాయత్నానికి సంబంధం లేదని, కుటుంబకలహాలతోనే క్రిమిసంహారకమందు తాగి స్టేషన్‌కు రాగా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. పరామర్శించిన అడ్లూరి.. జగిత్యాలక్రైం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనూషను సాయంత్రం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించారు. కాగా, ఆమె భర్తపై రౌడీషీట్ కేసు నమోదు చేశారని, మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
దేశంలోనే ‘హరితహారం’ సరికొత్త రికార్డు
సాక్షి, ధర్మారం(ధర్మపురి): దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టి రికార్డు సృష్టించిందని రాష్ట్ర సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామ శివారులో వానరవనంలో ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ‘30 రోజుల ప్రణాళిక’ను గ్రామగ్రామాన అమలు చేయటం జరుగుతోందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను ఆయా గ్రామాల పాలకవర్గాలతో పాటుగా అధికారులకు అప్పగించి ప్రభుత్వం పకడ్బందీగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటుందన్నారు. నాలుగేళ్లలో కోటి 50 లక్షల మొక్కలను నాటడం జరిగిందన్నారు. కోతుల విధ్వంసంతో పంటలు నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో వనారవనాన్ని ఏర్పాటు చేసి పండ్ల మొక్కలను పెంచుతుందన్నారు. దీంతో గ్రామాల్లో ఉన్న కోతులు అడవిలోకి వెళతాయన్నారు. ఈ వనంలో 180 రకాల పండ్ల మొక్కలను నాటుతున్నామన్నారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో ఈ కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఫొటోలకు పోజులివ్వటం కాదు.. ‘మొక్కలను నాటి వెళ్ళి పోవటం కాదు.. పెట్టిన ప్రతి మొక్కను రక్షించాలి.. నేను మొక్కను నాటుతుంటే నా వెంట ఉంటూ నిలపడితే సరికాదు. నా వద్ద బెల్లం లేదు.’ అన్నారు. మంత్రి ఈశ్వర్ ఖిలావనపర్తి వానరవనంలో మొక్కలు నాటేందుకు వచ్చిన మంత్రి ఈశ్వర్‌కు మొక్కను నాటిన తర్వాత సరిపడు మట్టి అందుబాటులో లేకపోవటంతో మంత్రికి కోపాన్ని తెప్పించింది. గుంతలు ఎందుకు తీయలేదని గ్రామస్తులను ప్రశ్నించారు. తాను వెళ్లిన తర్వాత ఇంతే సంగతా అని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ఎంతో గొప్పదని ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని ఆయా గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలన్నారు. ఎంపీపీ కరుణశ్రీ, జెడ్పీటీసీ పద్మజ, సర్పంచ్ కనకతార, ఎంపీటీసీ సుజాత, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జితేందర్‌రావు, నాయకులు బలరాంరెడ్డి, రాజేశం, రాజయ్య, బుచ్చిరెడ్డి, మల్లేశం, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
జే7 ఫోన్ పేరుతో మోసం చేసిన యువతి
సాక్షి, ధర్మపురి : వెల్గటూరు మండలం తాళ్లకొత్తపేట గ్రామంలో శనివారం మరో ఆన్లైన్ మోసం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పొన్నం అనిల్‌కు ‘మీకు ఆన్లైన్లో జే 7 ఫోన్ ఆఫర్ వచ్చింది. రూ.1800 చెల్లించి ఫోన్ తీసుకోవాలని ఓ అమ్మాయి పదిరోజుల నుంచి ఫోన్‌చేసి విసిగిస్తోంది. అనుమానం వచ్చిన అతడు మొదట ఫోన్ వద్దని తప్పించుకున్నాడు. అయినా వదలకుండా ‘నీకు ఫోన్ పోస్టులో వచ్చిందని, తక్కువ ధరకు వచ్చిన ఫోన్‌ను ఎందుకు వదిలేస్తున్నావని, ఫోన్‌తో పాటు జియోసిమ్, ఆరునెలల పాటు నెట్, కాల్స్ ఉచితంగా వస్తాయని’ మభ్యపెట్టారు. దీంతో అనిల్ పోస్ట్‌మాన్‌కు రూ.1800 చెల్లించి పార్సల్‌ను తీసుకున్నాడు. తెరిచి చూడగా అందులో రూ.20 కూడా ఖరీదు చేయని ధనలక్ష్మీ యంత్రం ఉంది. తాను మోసపోయానని తెలుసుకుని సదరు నంబరుకు ఫోన్ చేస్తే పొంతన లేని సమాధాలు వచ్చాయి. ఎండపెల్లి ఘటన మరిచిపోక ముందే ఇది జరుగడం మండలవాసులను విస్మయానికి గురి చేస్తోంది. యువకులు అపరిచితుల ఆఫర్స్‌కు ఆశపడి మోసపోవద్దని వెల్గటూరు పోలీసులు సూచిస్తున్నారు. -
గిట్లనే చేస్తే కేంద్రంపై తిరుగుబాటు
సాక్షి, వెల్గటూరు(కరీంనగర్) : బీజేపీ నాయకులు చౌకబారు రాజకీయాలు చేస్తే కేంద్రంపై తిరుగుబాటు తప్పదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. ‘పార్లమెంట్ ఎన్నికల్లో అడ్డిమారి గుడ్డి దెబ్బలా నాలుగు సీట్లలో గెలిచిన మీరు ఎగిరెగిరి పడుతున్నరు.. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చావుదెబ్బ తిని.. సున్నాకే పరిమితం అయ్యారు. అయినా మీ వైఖరిలో మార్పు రావడం లేదు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏనాడైనా అభివృద్ధికి సహకరించారా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నయా పైసా సాయం లేకున్నా.. తగాదా ఎందుకు అని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాం.. మీరు ప్రతి దాన్ని గిట్లనే రాజకీయం చేస్తే తిరగబడతామని మంత్రి హెచ్చరించారు. బీజేపీ నేతలకు నిజంగా తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా వచ్చేలా చూడాలని, తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టాలని సవాల్ విసిరారు. రాష్ట్రం నుంచి ఏటా రూ.2.30 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి పోతే.. రాష్ట్రానికి రూ.30 వేల కోట్లు మాత్రమే వస్తున్నాయని వివరించారు. పింఛన్లలోనూ కేంద్రం వాటా రూ.200 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ.1,200 కోట్లు ఇస్తుందని స్పష్టం చేశారు. అభివృద్ధికి ఏ మాత్రం సహకరించని మీకు ధర్నాలు చేసే నైతిక హక్కు లేదన్నారు. ప్రజలకు నష్టం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రైతులకు యూరియా అందించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ధర్నా ఎందుకు చేస్తున్నట్లు? బీజేపీ నాయకులు ధర్నాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. గ్రామాలలో అభివృద్ధి పనులు చేసేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం సరైనదేనా అని ప్రశ్నించారు. మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్నామని చెప్పుకోవడానికే తప్పా ప్రజలకు ఉపయోగపడవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ధర్నా చేస్తున్నారని అడిగితే ఒకరేమో యూరియా కోసమని, మరొకరు బస్సు బాధితుల కోసమని, ఇంకొకరు నీళ్ల కోసమని పొంతనలేని సమాధానాలు చెప్పడంతోనే బీజేపీ నాయకులకు క్లారిటీ లేదని తెలిసిందన్నారు. ధర్నాలు ఉనికి కోసం కాదని, ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని మంత్రి హితవు పలికారు. -
ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఎల్లంపల్లి నీరివ్వాలి
సాక్షి, ధర్మారం(ధర్మపురి): ఎల్లంపల్లి నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డీ–83 కెనాల్ ద్వారా ఆయకట్టుకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం ప్రకటన చేయాలని లేని పక్షంలో సెప్టెంబర్ 6న రాష్ట్ర రహదారిపై వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టుతామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. ధర్మారం మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎల్లంపల్లి నీటిని దోపిడి చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నాడని ఆరోపించిన కేసీఆర్ ప్రస్తుతం ఆయన చేస్తున్న పనేంటో స్పష్టం చేయాలన్నారు. ఎల్లంపల్లి నిర్మాణ సమయంలో పేర్కొన్న డీపీఆర్‌లో ఆంధ్ర ప్రాంతానికి నీరు తరలిస్తున్నట్లు ఎక్కడ లేదని మాయమాటలతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ తప్పుదోవపట్టించారని ఆరోపించారు. అప్పటి డీపీఆర్‌లో ఎల్లంపల్లి నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్ డీ–83 ద్వారా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు సాగునీరందించాలని స్పష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం కేసీఆర్ డీపీఆర్‌కు విరుద్ధంగా ఇక్కడ రైతులకు సాగునీరందించకుండా హైదరాబాద్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 6లోగా ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా రైతులకు సాగునీరందించే విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని లేకుంటే రైతు ఉద్యమం చేపట్టాల్సివస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, ప్రధానకార్యదర్శి కర్రె సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కన్నం అంజయ్య, మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శులు బండారి శ్రీనివాస్, తీగుల్ల సతీష్‌రెడ్డి, సందనేని లక్ష్మణ్, పత్తిపాక సింగిల్‌విండో చైర్మన్ తాడ్వాయి రాంగోపాల్‌రెడ్డి, నాయకులు మెడవేని శ్రీని వాస్, ఎల్లాల మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
భార్య గొంతుకోసి.. తానూ ఆత్మహత్యాయత్నం
సాక్షి, ధర్మపురి : భార్యపై అనుమానంతో బ్లేడ్‌తో గొంతుకోసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గంగాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని గంగాపూర్‌కు చెందిన గోలి ప్రమీల–రాజయ్యల రెండో కూతురు రజిత(అలియాస్ జక్కుల లావణ్య)ను మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన జక్కుల తిరుపతికి ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి చేశారు. కొంతకాలం వరకు బాగానే ఉన్నా తిరుపతి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై గతంలో గొడవలు జరగగా లావణ్య ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతరం లావణ్య తల్లిగారింటికొచ్చింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు కలుగజేసుకొని దంపతులిద్దరికి కౌన్సెలింగ్ చేసి ఒక్కటి చేశారు. వీరికి అక్షిత్(6), రిత్విక(3) సంతానం కలిగారు. రాఖీ పండుగ సందర్భంగా దంపతులిద్దరూ తమ పిల్లలతో కలిసి గంగాపూర్‌కు వచ్చారు. లావణ్య చెల్లెలు జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవం కావడంతో ఆమెను చూసి గురువారం సాయంత్రం గంగాపూర్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం తమ స్వగ్రామం రామక్రిష్ణాపూర్‌కు వెళ్దామని తిరుపతి కోరగా తాను తర్వాత వస్తానని లావణ్య చెప్పడంతో అతను బయలుదేరి వెళ్లాడు. కొంతదూరం వెళ్లాక తిరిగొచ్చిన తిరుపతి భార్యను దగ్గరికి తీసుకొని వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతుకోశాడు. లావణ్య భర్తను నెట్టివేసి కేకలు వేస్తూ వీధిలోకి పరుగులు తీసింది. చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక సర్పంచ్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదే సమయంలో గ్రామస్తులు గుమికూడడంతో బయటకు వచ్చిన తిరుపతి గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గ్రామస్తులు ప్రైవేటు వాహనంలో ఇద్దరిని జగిత్యాలలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. లావణ్య ఆరోగ్యం నిలకడగా ఉండగా, తీవ్రంగా రక్తస్రావం కావడంతో తిరుపతిని కరీంనగర్ తరలించారు. బాధితురాలి తల్లి ప్రమీల ఫిర్యాదుతో ఎస్సై చిరంజీవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గోదారంత ఆనందం..
సాక్షి, జగిత్యాల : పరవళ్లు తొక్కుతున్న గోదావరిని చూసి సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి నృసింహుని పాదాల చెంతకు సజీవ గోదా వరి సాక్షాత్కరిస్తోందని వ్యాఖ్యానించారు. 150 కిలోమీటర్ల మేర నిండుకుండలా ఉన్న గోదావరిని చూసి తనువు పులకరిస్తోందన్నారు. తన గర్భంలోని దాదాపు వంద టీఎంసీల నీటిని తెలంగాణ బిడ్డలకు ఇవ్వడానికి గోదావరి సంసిద్ధంగా ఉందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మంగళవారం సీఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. అనంతరం జగిత్యాల జిల్లాలో ధర్మపురి లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఎవరూ కలలో కూడా అను కోలేదు, దీనిపై నాకు కూడా సందేహాలుండేవి. కానీ నేడు ఈ అద్భుతాన్ని నా కళ్లతో చూస్తున్నాను‘‘అని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం మనల్ని చూసి నేర్చుకుంటోందని, ప్రతి పక్షం రోజులకోసారి కేంద్ర ప్రభుత్వ, ఇతర రాష్ట్రాల కార్యదర్శులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని చెప్పారు. సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, మనల్ని మించినోడు దేశంలోనే లేడని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంతో 400 టీఎంసీల నీరు.. గోదావరి నది ద్వారా ఇంతకుముందు లభించే నీటి కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ద్వారా అదనంగా 400 టీఎంసీల నీరు లభ్యం కానుందని సీఎం కేసీఆర్ వివరించారు. గోదావరి నదిపై సీడబ్ల్యూసీ పొందుపర్చిన 44 ఏళ్ల రికార్డులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. జూన్ నుంచి నవంబర్ వరకు నెలకు 60 టీఎంసీల చొప్పున 360 టీఎంసీలు, నవంబర్ నుంచి జూన్ వరకు వర్షాలు తక్కువ పడే కాలంలోనూ 40 టీఎంసీల చొప్పున మొత్తం 400 టీఎంసీల నీటితో 45 లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయని తెలిపారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి రోజుకు 3 టీఎంసీల చొప్పున, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు ద్వారా మల్లన్నసాగర్‌కు రోజుకు 2 టీఎంసీలు, అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోస్తారని వివరించారు. ఎల్లంపల్లి ఇక ఎప్పటికీ ఎండిపోదని స్పష్టంచేశారు. ధర్మపురి నృసింహుని పాదాల చెంత గోదావరి 365 రోజులు నీటితో కళకళలాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సారెస్పీలో నీటి లభ్యత తక్కువగా ఉందని, ప్రస్తుతం 9 టీఎంసీల మేరకే పరిమితమైందని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా 70 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీకి తరలించి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ తెలిపారు. గోదావరికి మించి వేరే మార్గం లేదు రాష్ట్రానికి గోదావరి నదికి మించి ప్రత్యామ్నాయం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సాగు, తాగు నీరు, పరిశ్రమలకు గోదావరి తప్ప మరో మార్గం లేదన్నారు. కానీ గోదావరి కింద కళకళలాడుతూ, పైన మాత్రం వెలవెలబోతోందన్నారు. మేడిగడ్డ వద్ద గోదావరి నది బెడ్ లెవల్ 88 మీటర్లు ఉండగా, బ్యారేజీ నిర్మాణం 100 మీటర్ల లెవల్ వరకు, అన్నారం వద్ద బెడ్ లెవల్ 106 మీటర్లు ఉండగా బ్యారేజీ నిర్మాణం 119 మీటర్లు, సుందిళ్ల వద్ద బెడ్ లెవల్ 118 మీటర్లు ఉండగా, బ్యారేజీ నిర్మాణం 130 మీటర్ల ఎత్తుకు, ఎల్లంపల్లి వద్ద 129 మీటర్ల నుంచి ప్రాజెక్ట్ నిర్మాణం 148 మీటర్ల ఎత్తుకు నిర్మించుకున్నామని వివరించారు. గత పాలకులైతే మరో 25 ఏళ్లైనా వీటిని పూర్తి చేసేవారు కాదని వ్యాఖ్యానించారు. ఎల్లంపల్లి పూర్తిస్థాయి సామర్థ్యానికి నిండిందని, ఇక్కడి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపు పూర్తయితే ప్రాజెక్ట్ లక్ష్యం 65 శాతం సాఫల్యమైనట్లేనని చెప్పారు. వారం రోజుల్లో మిడ్‌మానేరుకు నీరు విడుదల కావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇకపై అప్పర్ మానేరు, మిడ్‌మానేరు నిండుకుండలా కళకళలాడతాయన్నారు. ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీకి నీటిని తరలించడం రివర్స్ పంపింగ్ కాదని, లిఫ్టింగ్ మాత్రమేనని ఆయన వివరించారు. తెలివితక్కువ మాటలొద్దు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భారీగా ఖర్చులు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 400 టీఎంసీలను ఎత్తిపోసేందుకు అయ్యే ఖర్చు ఏటా రూ.4,992 కోట్లు మాత్రమేనని చెప్పారు. అది కూడా అవసరమైనప్పుడు మాత్రమే ఎంత అవసరమో అంతే వినియోగించుకుంటారని వివరించారు. బహుముఖ ప్రయోజనాలు కలిగిన ఈ ప్రాజెక్టు కోసం తమ మెదళ్లను ఎంతగానో కరిగించామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నది గర్భంలోనే 91 ఎకరాల విస్తీర్ణంలో నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టు రూపకల్పన చేశామని చెప్పారు. భూసేకరణతో రైతులకు ఇబ్బందులు కాకుండా చేశామన్నారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా సొంత నిధులు, తెలివితేటలతో ప్రాజెక్ట్ పూర్తి చేశామని వివరించారు. కొన్ని ప్రగతి నిరోధక, రాజకీయ శక్తులు ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు 300 కేసులు వేశాయని విమర్శించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడిన జయప్రకాశ్ నారాయణకు తెలంగాణతో ఏం సంబంధమని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం వద్దన్న వ్యక్తి, సగం తెలివి ఉన్న ఆయనది ఏ సిద్దాంతమని నిలదీశారు. 50 వేల రైతు కుటుంబాల కంటే ముఖ్యమైన వారు రాష్ట్రంలో ఎవరున్నారన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమించిన కేసీఆర్ బతికుండగా రాష్ట్రానికి అన్యాయం జరగనిస్తాడా, సోయి తప్పి పనిచేస్తాడా, రాష్ట్రానికి కష్టం, నష్టం రానిస్తాడా’’అని వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులకు అయ్యే విద్యుత్ ఖర్చు రూ.5 వేల కోట్లు ఆదా చేసి ఎవరికి కిరీటం తొడగాలని ప్రశ్నించారు. ధర్మపురి నృసింహుడు నమ్మిన దేవుడు.. ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి తాను నమ్మి మొక్కిన దేవుడని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం వ్యాప్తి చెంది, ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిందని గుర్తుచేశారు. ఆలయాభివృద్ధికి ఇప్పటికే ప్రకటించిన రూ.50 కోట్లతోపాటు మరో 50 కోట్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నృసింహుని ఆలయంతోపాటు శివాలయం, కోనేరు అంతా ఒకే ప్రాంగణంలోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నెలరోజుల్లో ధర్మపురిలో ప్రత్యేకంగా పర్యటిస్తానని చెప్పారు. ధర్మపురి మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, నియోజకవర్గంలోని మండల కేంద్రాలకు రూ.25 లక్షలు, ఒక్కో గ్రామపంచాయతీకి రూ.10 లక్షలు ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, కలెక్టర్ శరత్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, చెన్నమనేని రమేశ్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్ ఉన్నారు. గోదారమ్మకు సారె నిండుగా ప్రవహిస్తూ పరవళ్లు తొక్కుతున్న గోదావరికి సీఎం కేసీఆర్ సారె సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి హెలికాప్టర్లో చేరుకున్నారు. జోరువానలో కాలినడకన ఆయన పర్యటన సాగింది. నిర్ణీత సమయానికంటే గంట ఆలస్యంగా మేడిగడ్డ చేరుకున్న కేసీఆర్.. తొలుత ఏరియల్ సర్వే ద్వారా బ్యారేజీని పరిశీలించారు. అనంతరం బ్యారేజీపై ఉన్న 35వ గేట్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. తన వెంట ఉన్న ప్రజాప్రతినిధులకు, ఇతర అధికారులకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఇప్పటివరకు ఎన్ని టీఎంసీల నీరు దిగువకు వెళ్లిందనే విషయాన్ని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు మూసి ఉంటే 100 మీటర్ల నీటిమట్టం ఉంటుందని, అలాంటిది అన్ని గేట్లు తెరిచినా దాదాపు 96.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం ఉండటం చూసి సీఎం ఆనందం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యమే 180 టీఎంసీలు ఎత్తిపోయడమని.. అయితే ఒక్క వారంలోనే దాదాపు 250 టీఎంసీల నీరు కిందికి వెళ్లిందని తెలిసి.. అనుకున్నది సాధించామని ఆనందపడ్డారు. ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోందని అధికారులు సీఎంకు వివరించారు. దాదాపు 50 నిమిషాలపాటు అక్కడే గడిపిన కేసీఆర్.. బ్యారేజీ గేట్ల నిర్వహణ, వరద నియంత్రణకు సంబంధించి ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం గోదారమ్మకు పసుపు, కుంకుమ, పూలతో సారెను సమర్పించారు. మేడిగడ్డ పర్యటనలో సీఎం వెంట çమంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ ఆర్.భాస్కరన్ తదితరులు ఉన్నారు. -
‘కాళేశ్వరం గురించి జయప్రకాశ్‌కు ఏం తెలుసు’
సాక్షి, జగిత్యాల: కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి జయప్రకాశ్ నారాయణకు ఏం తెలుసు.. ఆయనది హఫ్ నాలెడ్జ్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మంగళవారం ఆయన మేడిగడ్డ, సుందిళ్ల జలాశయాలతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టులను కూడా పరిశీలించారు. అనంతరం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సజీవంగా కనిపిస్తోన్న గోదావరిని చూసి తన మనసు పులకిస్తోంది అన్నారు. గోదావరి నదిలోనే 100 టీఎంసీల నీరు నిండుకుండలా సజీవంగా ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో పంప్‌హౌస్ ఒక్కో ప్రాజెక్టుతో సమానమని చెప్పారు. కాళేశ్వరం మల్టిపుల్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల అనుకున్న దాని కంటే ఎక్కువగా లాభం చేకూరనుంది అన్నారు కేసీఆర్. 25 ఏళ్లైనా పూర్తి కానటువంటి ప్రాజెక్ట్‌లను కేవలం మూడేళ్లలో పూర్తి చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నికరంగా 400 టీఎంసీల నీరు లభిస్తుందని.. 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తుందని తెలిపారు. ఆరునెలల పాటు నెలకు 60 టీఎంసీలు.. మిగతా సమయంలో నెలకు 40 టీఎంసీలు ఎత్తిపోస్తామని సీఎం వివరించారు. పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎల్లంపల్లి నుంచి తీసుకుంటామన్నారు. ప్రతి రోజు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లకి 3 టీఎంసీలు, మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్‌కు 2 టీఎంసీలు తీసుకుంటామని తెలిపారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 9.6 టీఎంసీల నీరు మాత్రమే ఉందన్నారు కేసీఆర్. అక్కడ నీరు లేనప్పుడు ఇక్కడి నుంచి వరదకాలువ ద్వారా పంపింగ్ చేస్తామన్నారు. వివిధ దశల్లో ఎత్తిపోస్తూ 350 మీటర్ల ఎత్తున ఉన్న మిడ్ మానేరుకు నీటిని తీసుకెళ్తామని తెలిపారు. కాళేశ్వరం మల్టిపుల్ ప్రాజెక్టని.. ఇప్పటి వరకు మొత్తం ప్రాజెక్టులో 65 శాతం సాఫల్యం వచ్చిందన్నారు కేసీఆర్. కరెంట్ బిల్లు రూ. 4992 కోట్లు 400 టీఎంసీల కోసం ఏడాదికి రూ.4992 కోట్ల కరెంట్ బిల్లు ఖర్చవుతుందని కేసీఆర్ తెలిపారు. ఇది కూడా ప్రతి ఏటా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అహోరాత్రులు కష్టించి పనిచేసిన ఇంజినీరింగ్, నీటిపారుదల సిబ్బందిని కేసీఆర్ అభినందించారు. తుపాకుల గూడెం, సీతారామ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ప్రసుత్తం రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేసుకున్నామని.. అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నారు. సంక్షేమంలో మనమే నంబర్.1 సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని కేసీఆర్ అన్నారు. వికలాంగులకు రూ.3,116 పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, వంటి ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశం ఆశ్చర్యపోయేలా అమలు చేస్తున్నామన్నారు. మనల్ని ఆదర్శంగా తీసుకుని ఒడిషాలో రైతు బంధు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతుల అప్పులు తీరిపోయి మిగులు సాధించే వరకు రైతులకు ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామన్నారు. తాను బతికున్నంత కాలం రైతులకు కష్టం రానియనని కేసీఆర్ స్పష్టం చేశారు. ధర్మపురి ఆలయ అభివృద్ధికి మరో 50 కోట్లు ఆలయ అభివృద్దికి ఇప్పటికే రూ. 50 కోట్లు కేటాయిస్తానని చెప్పాను అన్నారు కేసీఆర్. త్వరలోనే స్తపతులను రప్పించి కొంత స్థలం సేకరించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఆలయ అభివృద్ధికి మరో 50 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. ధర్మపురి గోదావరి తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాక నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి రూ.10లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ధర్మపురి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రానికి రూ.25లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. -
మేడిగడ్డ చేరుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సందర్శించారు. అధికారులు, ఇంజనీర్లతో కలిసి బ్యారేజీ వద్ద గోదావరి వరదను పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటెల రాజేందర్, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. ఇక మేడిగడ్డ సందర్శన అనంతరం కేసీఆర్ గోలివాడ పంపుహౌజ్, ఆ తర్వాత ఎల్లంపల్లి బ్యారేజీ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం ధర్మపురి చేరుకుని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు నిరసనగా.. ‘మా నీళ్లు మాకు ఇచ్చిన తరువాతే ఇతర ప్రాంతాలకు తరలించాలి’ అని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి ఇంచార్జి కన్నం అంజన్న వెల్గటూరులో ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. ఇక ధర్మపురి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత కేసీఆర్ విలేకరులతో మాట్లాడనున్నారు. -
ఫేస్బుక్ మిత్రుల ఔదార్యం
సాక్షి, ధర్మపురి (కరీంనగర్) : అనారోగ్యంతో బాధపడుతున్న వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇరువురు పేద మహిళలకు వైద్య ఖర్చుల కోసం ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ చొరవతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు రూ.1.15 లక్షలు సాయం అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన మానెపెల్లి వరలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతోంది. భర్త ట్రాక్టర్ డ్రైవర్. వైద్య పరీక్షలకు కూడా డబ్బులు లేకపోవడంతో వైద్యానికి నోచుకోలేక పోయింది. అదేవిధంగా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బోదినపు లక్ష్మి కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోగా, ఉన్న ఒక్క కూతురు చదువు మానేసి తల్లికి సేవలందిస్తోంది. ఫేస్బుక్ పోస్టుతో దాతల సాయం బాధితుల సమస్యలను వివరిస్తూ ధర్మపురికి చెందిన రమేష్ జూలై 4న ఫేస్బుక్లో పోస్టు చేసి సాయం అందించాలని బాధితుల ఖాతా వివరాలను పొందుపర్చాడు. దాంతో మిత్రులు వరలక్ష్మి బ్యాంకు ఖాతాకు రూ.62 వేలు, బోదినపు లక్ష్మి బ్యాంకు ఖాతాకు రూ.53 వేలు సాయం పంపించారు. దాతలు అందించిన సాయంతో వైద్యం చేయించుకోవడం కోసం బాధితులు ఆస్పత్రికి వెళ్లారు. -
గురుకులం విద్యార్థిని పరార్
సాక్షి, ధర్మపురి: మైనార్టీ గురుకుల పాఠశాల నుంచి అర్ధరాత్రి ఓ విద్యార్థిని పరారైన సంఘటన ధర్మపురిలో జరిగింది. ధర్మపురి మండలం మగ్గిడిలోని మైనార్టీ గురుకుల పాఠశాలను ఇటీవల ధర్మపురి పట్టణంలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ స్తంభంకాడి మోహన్ పర్యవేక్షణలో సుమారు 260కి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి ధర్మపురికి చెందిన అశ్వియా సోహాన్ అనే 7వ తరగతి విద్యార్థిని పాఠశాల వెనుక గేట్ నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. రాత్రిపూట కూతురు ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. జరిగిన సంఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు హాసియా, అలీపాషాతో పాటు మాజీ వైస్ ఎంపీపీ అయ్యోరి రాజేశ్, ముస్లీం నాయకులు ప్రిన్సిపాల్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అర్ధరాత్రి ఒంటరిగా పాఠశాల నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించకపోవడం ఏంటని సిబ్బంది తీరుపై ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగారు. ఇటీవల ఇక్కడ చదివే ఇద్దరు విద్యార్థినులు ఇదే విధంగా పాఠశాల నుంచి ఇళ్లకు వెళ్లగా ఆ విషయాన్ని కప్పిపుచ్చారంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. జరిగిన సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తామని ప్రిన్సిపాల్ చెప్పడంతో శాంతించారు. -
ఇసుక లారీని ఢీకొన్న ట్యాంకర్
ధర్మపురి: జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఇసుక లారీని ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. నేరెళ్ల సాంబశివ దేవాలయం, విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద గల జాతీయ రహదారి పక్కన ఇసుక లారీ (టీఎస్19 టీ1159) టైరు పంక్చర్ కావడంతో నిలిపివేశారు. శుక్రవారం తెల్లవారు జామున రామగుండం నుంచి నాందేడ్‌కు బయలుదేరిన ట్యాంకర్ నేరెళ్ల వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా ట్యాంకర్ ఇంజన్లో మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ విజయపోక్రే (30) క్యాబిన్‌లోనే చిక్కుకోవడంతో సజీవ దహనమయ్యాడు. డ్రైవర్ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా బాబులేశ్వర్ వాసిగా గుర్తించారు. రెండు గంటలపాటు చెలరేగిన మంటలు కాగా, ట్యాంకర్, లారీ ఢీకొన్న ఘటనలో రెండు గంటల పాటు మంటలు చెలరేగాయి. ఇసుక లారీ టైర్లు కాలి బూడిదయ్యాయి. ట్యాంకర్ ఢీకొట్టిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో లారీని మరమ్మతు చేస్తున్న డ్రైవర్, క్లీనర్లు దూరంగా పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ట్యాంకర్లో ఇంధనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రాకపోకలు నిలిచిపోయాయి. -
తమిళనాడు ధర్మపురిలో రాజకీయాల్లో ఆసక్తికర పోరు
-
కరీమ్ భాయ్ చాయ్
ప్రతి ఊరిలోను ఎన్నో కొన్ని కాకా హోటళ్లు ఉంటాయి. అలాగే ఆ ఊరికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చే హోటళ్లు ప్రత్యేకంగా ఉంటాయి. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని అబ్దుల్ కుటుంబీకులకు చెందిన హోటల్స్‌కు అటువంటి ప్రత్యేకత ఉంది. అబ్దుల్ కరీం పేరు చెబితే పంటి కింద కరకరలాడే శబ్దాలు చేసే చేకోడీలు, ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంటూ తాగే టీలు గుర్తుకు వస్తాయి. ఆయన సోదరులైన అబ్దుల్ మునీర్ పేరుచెబితే నోటికి ఘాటుగా తగిలే మిరపకాయ బజ్జీల ఘుమఘుమలు అటుగా అడుగులు వేయిస్తాయి. ప్రస్తుతం మునీర్, ఇక్బాల్ సోదరులు నడిపిన హోటల్స్ లేకపోయినా, కరీమ్ చేగోడీ సెంటర్ మాత్రం దిగ్విజయంగా నడుస్తోంది. బియ్యప్పిండి, నువ్వులతో తయారు చేసే కరకరలాడే పల్చని గారెల వంటి పదార్థాన్ని కరీమ్ భాయ్ చేకోడీ అంటారు. ఈ వంటకం కరీమ్ ప్రత్యేకత. ధర్మపురి గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల వారు సైతం కరీమ్ని పలకరించకుండా ఉండలేరు. ఆయన చేకోడీల మహిమ అలాంటిది. గత 60 సంవత్సరాలుగా ధర్మపురిలో కరీమ్ చేకోడీలతోపాటు అటుకులు, గుడాలు కూడా అందిస్తున్నారు. ఆయన చేతిలో ఏం మహత్యం ఉందో గాని, అక్కడకు వచ్చినవారు ఆయన చేతి టీ తాగకుండా ఉండలేరు. కరీమ్ బ్రాండ్‌గా..! ధర్మపురిలో చేకోడీలంటే కరీమ్ చేకోడీలే అనేంత గుర్తింపు పొందారు. కరీమ్ మరణించినా, హోటల్ రూపు మారిపోయినా కరీమ్ చేకోడీలంటే అందరూ గుర్తుపడతారు. ప్రస్తుతం ఆయన మనమడు (కూతురు జహీదా కుమారుడు) అస్లాం ఈ హోటల్‌ను నడుపుతున్నారు. టీ మినహా మిగతా తినుబండారాలను ఇప్పటికీ ఇంటి దగ్గర తయారుచేసి అంగడికి తీసుకువస్తారు. ఆరు దశాబ్దాలుగా ఈ హోటల్లో దొరికే చేకోడీలు అదే రుచితో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దేశవిదేశాలలో స్థిరపడ్డ ఈ పట్టణ వాసులు ఇప్పటికీ ధర్మపురి వస్తే కరీమ్ చేకోడీ తినకుండా వెళ్లరు. స్వస్థలానికి వచ్చిన వారందరికీ ఈ స్టాల్ ఒక మీటింగ్ పాయింట్. మిత్రులతో కలిసి బాల్య జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, ఇక్కడ టీ తాగి, చేకోడీలు తిని వెళ్తారు. కరీం చేకోడీ, టీ, అటుకులు, గుడాలు తినేందుకు ఈ హోటల్‌కు రాకుండా వెనక్కు వెళ్లరు. అదే తీరు... ధర్మపురి నడిబొడ్డున ఉన్న ఈ హోటల్‌ను ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో ఒక బల్ల మీద 60 ఏళ్ల కిందట ప్రారంభించారు. 2007లో అబ్దుల్ కరీమ్ మరణించారు. దీంతో కరీమ్ రెండవ కుమారుడు నయీమ్... తన తండ్రి హోటల్‌ను కొనసాగించారు. నయీమ్ అనంతరం అస్లాం 12 సంవత్సరాలుగా ఈ హోటల్‌ను నడుపుతూ, సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. తమ వంటకాలలో దహీ వడను చేర్చారు అస్లాం. ఇక్కడి దహీ వడ కొద్దిగా కారంగా ఉండటం వీరి ప్రత్యేకత.హోటల్‌పై థియేటర్ ప్రభావం...గతంలో థియేటర్ నడిచిన సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం నుంచి రాత్రి ఇలా రెండు పూటలు నడిచేది. ప్రస్తుతం కొద్దిగా మార్పులు వచ్చాయి. అయినప్పటికీ అదే గుర్తింపు ధర్మపురి ప్రజల్లో ఉంది. ఈ హోటల్లో టీ కోసం చుట్టుపక్కల ఊర్ల నుంచి స్వయంగా పాలు తీసుకు వచ్చేవారు. ప్రస్తుతం ప్యాకెట్ పాలను కూడా వాడుతున్నారు. నాటి నుంచి నేటి వరకు అదే టీ పొడిని వాడటం వీరి ప్రత్యేకత. ఆనందంగా ఉంటుంది ... మా క్యాంటీన్‌కి ఎక్కువగా యువకులు వçస్తూంటారు. ఈ గ్రామంలో చదువుకుని పై చదువుల కోసం, ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లినవారు సెలవులకు తల్లిదండ్రులను చూడటానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మా దగ్గరకు వచ్చి, మా చేకోడీ తిని, టీ తాగి వెళ్తూంటారు. ఒకరితో ఒకరు వారు పంచుకునే అనుభవాలను నేను ఆనందంగా వింటుంటాను. -
విలక్షణ ధర్మపురి
సాక్షి ,గొల్లపల్లి(ధర్మపురి): ధర్మపురి... నాలుగు నియోజకవర్గాల నుంచి విడిపోయి 2009లో ఆరు మండలాలతో పురుడుపోసుకున్న నియోజకవర్గం. మేడారం, చొప్పదండి, బుగ్గారం, జగిత్యాల నియోజకవర్గాల్లో ఉన్న గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మపురి, బుగ్గారం, వెల్గటూరు, ధర్మారం సంపూర్ణ మండలాలను కలిపి ధర్మపురి(ఎస్సీ) నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. గతంలో ఆయా నియోజకవర్గాల నుంచి హేమాహేమీలే పరిపాలించారు. పలుమార్లు స్వతంత్రులే సత్తాచాటగా... టీడీపీ– కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ సాగింది. ధర్మపురి ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు టీఆర్ఎస్ తరఫున బరిలో దిగుతున్న ‘కొప్పుల ఈశ్వర్’ కే ఇక్కడి ప్రజలు పట్టం కడుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలో బీసీ ఓటర్లే అధికంగా ఉండడంతో వారిని ఆకర్షించే పనిలో పడ్డారు ఆయా పార్టీల అభ్యర్థులు. ఇదీ ముఖచిత్రం... జగిత్యాల ,జిల్లా ధర్మపురి నియోజకవర్గం 2009కి ముందు వేర్వేరు నియోజకవర్గాల్లో ఉండేది. మేడారం, చొప్పదండి, జగిత్యాల, బుగ్గారం నియోజకవర్గాల నుంచి పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూర్, ధర్మారం, బుగ్గారం, ధర్మపురి మండలాలను విడదీసి ధర్మపురి(ఎస్సీ) నియోజకవర్గాన్ని 2009లో ఏర్పాటు చేశారు. నాలుగు జిల్లాల సరిహద్దుగా ఈ జిల్లా ఉంటుంది. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు సరిహద్దు ప్రాంతాలుగా నియోజకవర్గంలోని గ్రామాలు ఉంటాయి. నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురిలో శ్రీ లక్ష్మినృసింహస్వామి, నియోజవర్గంలోని సగభాగంలో గోదావరి నది ప్రవహిస్తుంటాయి. శాతవాహనులు ఏలిన కోటిలింగాల ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఇప్పుడు ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌తో పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 129 గ్రామాలు ఉన్నాయి. మొత్తం 2,02,666 ఓటర్లున్నారు. పురుషులు 99,775మంది, మహిళలు 1,02,883 ఉన్నారు. మొత్తంగా నియోజకవర్గంలో 62శాతం బీసీఓట్లు ఉండగా...23ఎస్సీ, 15ఇతర వర్గాల ఓట్లు ఉన్నాయి. దీంతో అభ్యర్థుల గెలుపోటముల్లో బీసీలే కీలకం కానున్నారు. నాలుగు నియోజకవర్గాల ప్రాంతం... ప్రస్తుత ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న పెగడపల్లి, ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్, ధర్మారం, గొల్లపల్లి మండలాలు పునర్విభజనకు ముందు జగిత్యాల, చొప్పదండి, మేడారం, బుగ్గారం నియోజకవర్గాల్లో ఉండేవి. గొల్లపల్లి మండలంలోని ఎనిమిది గ్రామాలు జగిత్యాల నియోజకవర్గంలో, 17గ్రామాలు చొప్పదండిలో ఉండేవి. ధర్మపురి మండలంలోని సిరికొండ గ్రామం ఒక్కటే చొప్పదండి పరిధిలో ఉండేది. మిగితా గ్రామాలు బుగ్గారం పరిధిలో ఉండేవి. పెగడపల్లి మండలంలోని 4 గ్రామాలు జగిత్యాలలో, 5 మేడారంలో, 17గ్రామాలు చొప్పదండి పరిధిలోకి వచ్చేవి. వెల్గటూర్ మండలంలోని 19 గ్రామాలు మేడారంలో, 5చొప్పదండిలో, 2బుగ్గారంలో ఉండేవి. ధర్మారం మండలం సంపూర్ణంగా మేడారంలో ఉండేది. 2009 నుంచి ఇవన్నీ కలిపి సంపూర్ణంగా ధర్మపురి నియోజకవర్గంగా ఏర్పడ్డాయి. విలక్షణ తీర్పు... మేడారం, చొప్పదండి, బుగ్గారం, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు 1957లో ఏర్పాటయ్యాయి. మేడారం 1957, 1962లో జనరల్‌గా ఉండేది. 1967నుంచి ఎస్సీస్థానంగా మారిపోయింది. 2008 ఉపఎన్నిక వరకు 10 సార్లు ఎన్నికలు జరిగాయి. 2004నుంచి మేడారంలో ప్రాతినిథ్యం వహించిన కొప్పుల ఈశ్వర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 2009లో ధర్మపురి(ఎస్సీ)రిజర్వుడు కావడంతో ఇటువైపు దృష్టి పెట్టారు. 1957లో ఏర్పడిన చొప్పదండి నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా సీహెచ్. రాజేశ్వర్‌రావు(పీడీఎఫ్)తరఫున గెలుపొందారు. తరువాత కాంగ్రెస్ నుంచి 1962లో బండారి రాములు, 1978లో ఐఎన్‌సీ(ఐ) నుంచి న్యాలకొండ శ్రీపతిరావు, 1983లో గుర్రంమాధవరెడ్డి(ఇండింపెండెంట్)గెలిచారు. 1985,86,94లో టీడీపీ నుంచి న్యాలకొండ రాంకిషన్‌రావు హ్యాట్రిక్ సాధించి, కేబినెట్లో స్థానం సంపాదించారు. తరువాత 1999లో కాంగ్రెస్ నుంచి కోడూరి సత్యనారాయణగౌడ్ గెలుపొందారు. 2004లో టీడీపీ నుంచి సానమారుతి విజయం సాధించారు.2009 నుంచి చొప్పదండి నుంచి కొన్ని గ్రామాలు విడిపోయి ధర్మపురిలో కలిశాయి. ఇక బుగ్గారం జనరల్ స్థానం అయినప్పటికీ స్వతంత్రుల హవా కొనసాగింది. దివంగత శాసనసభాపతి జి. నారాయణరావు మహరాణి గంజ్, మాజీ మంత్రి కే.వీ. కేశవులు సిర్పూర్ ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహించారు. 1957లో బద్ధం ఎల్లారెడ్డి, 1962లో ఏనుగు నారాయణరెడ్డి, 1972లో జోగిని దామోదర్‌రావు ఇండిపెండెంట్లుగా విజయం సాధించారు. 1978లో ఇందిరా ప్రభంజనంలో కాంగ్రెస్ అభ్యర్థి అంబల్ల రాజారాం, 1983లో కాంగ్రెస్ అభ్యర్థి కడకుంట్ల గంగారాంను గెలిపించారు. 1985లో టీడీపీ నుంచి శికారి విశ్వనాథంకు పట్టం కట్టారు. 1989లో ఇండింపెండెంట్ అభ్యర్థి జువ్వాడి రత్నాకర్ రావును గెలిపించారు. 1994లో శికారి విశ్వనాథం(టీడీపీ), జువ్వాడి రత్నాకర్‌రావు(కాంగ్రెస్), పోటీచేయగా టీడీపీకి విజయం అందించారు. 1996, 2004లో రత్నాకర్‌రావు శాసనసభకు ఎంపికయ్యారు. తరువాత 2009లో బుగ్గారం ధర్మపురిలో విలీనమైంది. టీఆర్ఎస్కు కంచుకోటగా... 2009లో ఏర్పడిన ధర్మపుని నియోజకవర్గం ఎస్సీస్థానానికి రిజర్వుడు కావడంతో కాంగ్రెస్ నుంచి మాజీ జెడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, టీఆర్ఎస్ నుంచి మేడారం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొప్పుల బరిలో దిగారు. కాగా నూతన నియోజకవర్గంలో ప్రజలు కొప్పులకే పట్టం కట్టారు. తరువాత 2010 ఉప ఎన్నిక, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి కొప్పుల ఈశ్వర్ హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లో చీఫ్‌విప్‌గా కొనసాగారు. ప్రముఖులు ఇక్కడి నుంచే... ధర్మపుని నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాల నుంచి చాలా మంది ప్రముఖులు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావుది ధర్మపురి మండలం తిమ్మాపూర్. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాల తాజా, మాజీ ఎమ్మెల్యే తాటిపత్రి జీవన్‌రెడ్డిది పెగడపల్లి మండలం బతికెపల్లి. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సాన మారుతిది వెల్గటూరు మండలం గొల్లకోట స్వస్థలం. బీజేపీ రాష్ట్ర నాయకుడు, ప్రస్తుత పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి స్వస్థలం ధర్మారం మండలం కమ్మర్ఖాన్పేట్. ఈసారి బరిలో వీరే.. ధర్మపురి నియోజకవర్గం నుంచి ఈ సారి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు టికెట్ రాగా.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వరుసగా మూడుసార్లు ద్వితీయస్థానంలో ఉంటూ వచ్చిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఇంకా అధిష్టానం టికెట్ కేటాయించకపోయినా... ప్రచారంలో జోరుగా తిరుగుతున్నారు. ఈ సారి తనకే ప్రజలు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుంచి టిక్కెట్ దక్కించుకున్న కన్నం అంజయ్య తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇంకా పలు పార్టీలకు చెందిన నాయకులు టికెట్‌కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఉండేవి! గొల్లపల్లి: ఆయన రాజకీయంలో ఆరితేరారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా.. ఓసారి మంత్రిగా కొనసాగారు. ఇప్పటికీ ఆయన రాజకీయాలను శాసిస్తున్నారు. ఆయనే మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు.రాజకీయాలు,ఎన్నికలపైనాటి..నేటిపరిస్థితులనుఆయన‘సాక్షి’తోపంచుకున్నారు. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా.. ఓ సారి మంత్రిగా పనిచేశాను. మా ప్రభు త్వంతో ప్రజలకు సత్సంబంధాలు ఉండేవి. ఏ విషయం ఉన్నా.. ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు కలిసి చర్చించేవాళ్లం. ఇప్పుడలాంటిది కనిపించడం లేదు. ప్రజలకు.. నాయకులకు... ప్రభుత్వానికి గ్యాప్ వచ్చి ంది. మంత్రులకు కూడా విలువలేకుండా పోయింది. అధికారులదే హవా నడుస్తోంది. మంత్రులకు అధికారులే భయపడటం లేదు. ఓ చిన్నపనిని నా దగ్గరి స్నేహితుడని ఓ మంత్రికి చెబితే అదీ పూర్తికాలేదు. అదేమంటే ప్రభుత్వంలో ‘మాదేం నడుస్తుందే.. అంతా ఆ పెద్దాయనే.. (సీఎం కేసీఆర్ ) చూసుకుంటున్నడు. మేం నిమిత్తమాత్రులం..’ అన్నారు. ఇప్పటి ఎన్నికల్లో అంత డబ్బుదే హవా నడుస్తోంది .సేవ అనే మాటకు అర్థం లేకుండాపోయింది. అప్పడు ప్రజలు మాటకు కట్టుబడి ఉండేవారు. ఒక్కసారి మాట ఇస్తే ఓటు వేసేవారు. ఇప్పుడు అందరికీ జై కొడుతున్నారు. ప్రజలతో నాయకులకు ప్ర త్యక్ష సంబంధాలు లేనే లేవు. ఫేస్బుక్, వాట్సాప్ పాపులర్ అయ్యింది. మా హయాంలో కోరుట్లలో ఒక్కసారి మీటింగ్ పెట్టాను. సీఎంతో మాట్లాడాలని ప్రజలు కోరారు. అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి అక్కడికక్కడే ప్రజలతో మాట్లాడించాను. ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఇగ ఈ సీఎం ఉన్నడు..! కొండగట్టు వద్ద బస్సు ప్రమాదం జరిగి 65మంది చనిపోయినా.. కనీసం తొంగిచూడలేదు..!! అంతపెద్ద సంఘటనకే స్పందించకుంటే ఇగ దేనికి స్పందిస్తడు..? అప్పటికి ఇప్పటికీ బాగా తేడా వచ్చింది. ఎస్సై, సీఐ, ఎమ్మార్వో బదిలీ కావాలన్నా డబ్బే అవసరమైతంది. అధికారులదే రాజ్యం అయింది. 1989 ఎన్నికల్లో నేను రూ.1.40లక్షలు వెచ్చించి ఎంఎల్ఏగా ఎన్నికయ్యాను. ఇప్పడు రూ. 5కోట్ల నుంచి రూ.10 కోట్లు వెచ్చిస్తున్నారు. వారు గెలికాచక మళ్లీ ఆ డబ్బును ప్రజల నుంచే రాబట్టుకుంటున్నారు. ప్రజాసేవ కోసం ఇప్పడు పోటీచేయటం లేదు. సంపాదనే ధ్యేయంగా పోటీ చేస్తున్నారు. నిజాయితీ అనేది ఏ స్థాయిలో కనిపించటం లేదు. భూరికార్డుల పేరుతో కొత్త పాస్‌బుక్కులు రైతులకు ఇచ్చారు. సవరణచేయడానికి లంచం తీసుకున్నారు. కొత్తబుక్కుల్లో తప్పులు దొర్లుతే రైతులను పీడించుకుని లంచాలు మేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వం తీరు. క్రైం ఫ్లాష్‌బ్యాక్ పెద్దపల్లి తొలి ఎమ్మెల్యే హత్య పెద్దపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1952లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన ముదిగంటి కొండాల్‌రెడ్డి పదవీకాలం ముగిసిన తర్వాత హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఓదెల మండలం పొత్కపల్లి గ్రామానికి చెందిన కొండాల్‌రెడ్డి 1952లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. 1957 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో కలిసి పనిచేశారు. అయితే గ్రామంలో వ్యక్తిగత కక్ష్యల కారణంగా గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కొండాల్రెడ్డిపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఆ కేసులో ముగ్గురికి హైకోర్టు యావజ్జీవకారగార శిక్ష విధించింది. ప్రస్తుతం శిక్ష అనుభవించి విడుదలైన అనంతరం వృద్ధాప్యంతో కేసులో ఉన్నవారందరూ మరణించారు. ఆకాలంలో బాహుబలిని పోలిన కొండాల్‌రెడ్డి సుమారు ఆరున్నర ఫీట్ల ఆజానుభావుడు. ఆహారం సైతం భారీగా తీసుకునే వారు. భారీ కాయుడైన కొండాల్రెడ్డిని చూసి గ్రామంలో ప్రజలు భయపడేవారు. ఆ కాలంలోనే కొండాల్రెడ్డికి లైసెన్స్ రివాల్వర్ ఉండేదని గ్రామస్తులు చెబుతుంటారు. ముదిగంటి కొండాల్‌రెడ్డి (ఫైల్) సీనియర్ సిటీజన్ వాయిస్... 1952నుంచి ఓటు వేస్తున్నా... గోదావరిఖని(రామగుండం): ఆశ కోసం కాదు ఆశయం కోసం వచ్చే నాయకులను ఎమ్మెల్యేగా ఎన్నుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి.1952నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్నా. అప్పటికీ... ఇప్పటికి ఎన్నికల జరిగే పద్ధతిలో చాలా తేడా వచ్చింది. 1952లో కరీంనగర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేత పీవీ.నర్సింహారావు సీపీఐ కార్యకర్త బద్ధం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు అం టే ఓటర్లలో ఏమేరకు చైతన్యం ఉందో అర్థం అవుతోంది. -
ధర్మపురి ఘటనతో అది నిర్ధారణ అయ్యింది!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారని, ఇది ధర్మపురిలో అక్కడి పోలీసులు పట్టుబడిన ఘటనతో నిర్ధారణ అయ్యిందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆ రాష్ట్రంలోని అధికార యంత్రాంగాన్ని తెలంగాణలో మోహరిస్తూ అరాజకీయానికి పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్లు తెలిపారు. చర్యల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే... టీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోరని అన్నారు. అక్రమాలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడితే తాము బాధ్యత వహించమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్తో సహా ప్రతీ రాజకీయ పార్టీ నేత వాహనాన్ని తనిఖీ చేయాల్సిందేనని అన్నారు. టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, బాల్క సుమన్, బీబీ పాటిల్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దాస్యం వినయభాస్కర్‌తో కలసి కేటీఆర్ తెలంగాణ భవన్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. ముగ్గురిని గుర్తించిన ఇక్కడి పోలీసులు ‘హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం వేదికగా తెలంగాణలో అరాజకీయానికి చంద్రబాబు తెరలేపారు. అక్కడి పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థను తెలంగాణ ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారు. సర్వేల పేరుతో రాష్ట్రంలో తిరుగుతున్నారని గతంలో మేం ఆరోపణలు చేశాం. అయితే ఏపీ పోలీసు వ్యవస్థతోనే మహాకూటమి తరుఫున డబ్బులు పంపిణీ చేస్తున్నారని నిర్ధారణ అయ్యింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కొందరు అనుమానాస్పదంగా ఉండటంతో అక్కడి స్థానికులు ప్రశ్నించారు. డబ్బులతో దొరికిన వారిని ఏపీ పోలీసు విభాగంలోని నారాయణరెడ్డి, వెంకటేశ్వర్రావు, మధుబాబుగా ఇక్కడి పోలీసు శాఖ గుర్తించింది. సమాచార సేకరణ అయితే ఏమోగానీ ఇలా డబ్బులు పంపిణీ చేయడం ఏమిటి?. వీరిని పట్టుకున్న అర గంటలోనే ఏపీ ఇంటెలిజెన్స్ ఏసీపీ బోస్ ఫోన్ చేసి విడిపించే ప్రయత్నం చేశారు. ధర్మపురిలో ఉన్న వారు సీఐ స్థాయి వారు కావడంతో పైఅధికారిగా బోస్ గట్టిగా ఆదేశించారు. ఇటీవల టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ సన్నిహితుడైన తెలుగు యువత నాయకుడు అనిల్ వాహనంలో కూడా రూ.50 లక్షలు దొరికాయి. ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడనేది స్పష్టమవుతోంది. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలి... పోలీసు శాఖ పూర్తిగా పరిధి ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. ఏపీ పోలీసులు ఆ రాష్ట్ర సరిహద్దులోని ప్రాంతాల్లో ఉంటే ఏమోగానీ... తెలంగాణలోని ధర్మపురిలో డబ్బులతో దొరకడం ఏమిటి? దీనికి బాధ్యులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ప్రతీ నాయకుడి వాహనాన్ని తనిఖీ చేయాలి. చంద్రబాబు ఇక్కడి పత్రికల్లో, టీవీల్లో ప్రచారం చేస్తూ ఏపీ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో చంద్రబాబు ఎలా ప్రచారం చేస్తారు. రూ.500 కోట్లు ఖర్చు చేసి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో అధికారంలోకి వచ్చేలా రాహుల్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలోనే చెప్పారు. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీల నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత ఎన్నికల్లో ఇన్నోవాలో రూ.3 కోట్లు చేరవేస్తూ దొరికిపోయారు. ఆయన రిపీటెడ్ అఫెండర్ అయ్యుండొచ్చు. ఎవరినీ వదలొద్దు. ఎల్.రమణ మంత్రుల క్వార్టర్స్‌లో తిష్ట వేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీసీపీ బోస్ రేవంత్‌రెడ్డితో రెగ్యులర్‌గా కాంటాక్టులో ఉన్నాడు. రమణ, రేవంత్.. ఏపీ సీఎం చంద్రబాబుకు అనుసంధానకర్తలుగా పని చేస్తున్నారు. ఈ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో ఫిర్యాదు చేశాం. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. అరాజకీయాన్ని టీఆర్ఎస్ సహించదు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే... మా కార్యకర్తలు దాడులకు దిగితే, ఏదైనా జరిగితే బాధ్యత మాది కాదు. ఆవేశంతో అవాంఛనీయ సంఘటనలు జరిగితే మేం ఏం చేయలేం. రూ.500 కోట్ల ఖర్చు నిజమే..! డబ్బుల పంపిణీని ఎన్నికల సంఘం నియంత్రించాలి. వాహనాలను ఇంకా క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఉత్తమ్, రేవంత్ గతంలో నోట్ల కట్టలతో దొరికిన దొంగలు. అందుకే వాహనాలను ఆపితే ఉలిక్కిపడుతున్నారు. జరుగుతున్న ఘటనలు చూస్తుంటే చంద్రబాబు ఇక్కడ రూ.500 కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నాడనేది నిజమే అని అనిపిస్తోంది. ఏపీ పోలీసు శాఖ ఇంటెలిజెన్స్ విభాగం తెలంగాణలో డబ్బుల పంపిణీలో ఉండి, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సోము చనిపోవడానికి కారణమయ్యారు. ఎన్నికల కోసం పోలీసు వ్యవస్థను పావుగా వాడుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ఇంచార్జీ కుంతియా బ్రోకర్ అని ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి అన్నారు. వారి పార్టీలో పదవులు అమ్ముకుంటారని ఆయనే చెప్పారు. దొంగలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఫోన్ టాప్ చేయాల్సిన కర్మ లేదు’అని అన్నారు. సెన్షేషన్ రైజ్ ఈవెంట్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపణలను ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా... మనుషులు మాట్లాడితేనే స్పందిస్తామని కేటీఆర్ అన్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు ముగ్గురు ధర్మపురిలో పట్టుబడిన ఘటనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఈ సందర్భంగా మంత్రి చూపించారు. -
‘గల్లి పార్టీని ఢిల్లీ వరకూ పెంచింది కాంగ్రెసే’
సాక్షి, ధర్మపురి : పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వళ్లించినట్టుగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ విమర్శించారు బీజేపీ జన చైతన్యయాత్ర మంగళవారం జగిత్యాల జిల్లా ధర్మపురికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఎంఐఎంను తమ పార్టీ విమర్శిస్తుంటే కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ బీజేపీకి సహకరిస్తుందనటం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నంతకాలం ఎంఐఎంతో అంటకాగి గల్లీకి పరిమితమయిన పార్టీని ఢిల్లీ వరకు పెంచి పోషించింది కాంగ్రెసే అని.. ఒవైసీ ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ గాంధీని కలిసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు కంటిచూపు మందగించిందని, వాళ్ళు డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిదని సలహా ఇచ్చారు. ఒక్క బీజేపీ తప్ప అన్ని పార్టీలు ఎంఐఎంతో అంటకాగుతున్న పార్టీలేనని విమర్శించారు. ఎంఐఎం పార్టీ ఆగడాలను అడ్డుకుంటున్నపార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని గుర్తు చేశారు. బీజేపీ జన చైతన్యయాత్రకు వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్చుకోలేక పోతోందని, ఈ యాత్రను ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నిలువరించలేరని హెచ్చరించారు. మత పరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అయినప్పటికీ మజ్లిస్ పార్టీ, మైనార్టీల ఓట్ల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం 4 శాతం ఉన్న రిజర్వేషన్లు 12 శాతం పెంచాలని చూస్తుందని ఆరోపించారు. ఘనంగా లక్ష్మణ్ పుట్టిన రోజు వేడుకలు... మంగళవారం కె. లక్ష్మణ్ పుట్టినరోజు కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్‌చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు లక్ష్మణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
‘హరిత’లో అసాంఘిక కార్యకలాపాలు
సాక్షి, ధర్మపురి: ధర్మపురిలోని హరితహోటల్లో పర్యాటకంమాటున రాసలీలలు కొనసాగుతున్నాయి. మందుబాబులు.. విటులు హోటల్‌ను వేదిక చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రెండునెలల క్రితం మందుబాబులతోపాటు కండోమ్ ప్యాకెట్లు దొరికాయి. ఆ సంఘటన మరువకముందే సోమవారం ఓ జంట రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ధర్మపురికి వచ్చే పర్యాటకుల కోసం గోదావరి ఒడ్డున మూడేళ్ల క్రితం పర్యాటక శాఖా వారి ఆధ్వర్యంలో హరితహోటల్‌ను నిర్మించారు. ఈ హోటల్లో మద్యం, మాంసానికి తావులేదు. హోటల్లో ఉండాలంటే ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకుంటారు. హోటల్లో చేరేముందు పర్యాటకుల ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసు కోవాల్సి ఉంటుంది. నిర్వాహకులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రెండునెలల క్రితం పోలీసులు దాడుల చేయగా.. హోటల్ అసాంఘిక కార్యకలపాలు సాగిస్తున్నట్లు తేలింది. ఆ సమయంలో మేనేజర్‌ను సస్పెం డ్ చేశారు. అప్పటినుంచి హోటల్ నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అడ్డంగా దొరికిన జంట భార్యాభర్తలమని చెప్పి హోటల్‌ను అద్దెకు తీసుకున్న ఓ జంట రెండురోజులుగా బయటకు రావడం లేదు. దీంతో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో పోలీసులు గదిని తెరువగా ఆ జంట రెడ్‌హ్యాండెడ్‌గా దొరికింది. గదిలో మందుతోపాటు ఇతర వస్తువులున్నాయి. కరీంనగర్‌కు చెందిన ఓ వివాహిత (భర్త నుంచి విడాకులు తీసుకుంది) సిద్దిపేటకు చెందిన ఓ యు వకుడితో ప్రేమలో పడింది. హోటల్లో గదిని తప్పుడు చిరునామాతో అద్దెకు తీసుకున్నట్లు తేలింది. అయినా సిబ్బంది ఆధార్‌కార్డులు పరిశీలించకుండానే వారినుంచి కొంతసొమ్ము తీసుకుని అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. దీంతో సీఐ లక్ష్మీబాబు జంటకు కౌన్సెలింగ్ ఇచ్చారు. హోటల్ నిర్వాహకులనూ మందలించారు. తప్పుడు ధ్రువీ కరణ పత్రాలతో వస్తే గదులు ఇవ్వవద్దని సూచించారు. -
ధర్మపురిలో కాల్పులు..ఒకరి మృతి
ధర్మపురి: ఎల్లమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తిని ధర్మపురిలో గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. రామగుండంకు చెందిన పోడేటి సత్యనారాయణగౌడ్ (51) హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. బుధవారం బంధువులతో కలసి జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమాలాపూర్‌లో ఎల్లమ్మ బోనాల్లో పాల్గొనేందుకు వచ్చారు. రాత్రి 10 గంటలకు తమ బంధువులు భైరవేని రాకేశ్, వెంకటేశ్, బావమరిది రాజు, నోముల వెంకటేశ్‌లతో కలసి ధర్మపురిలో ఉన్న సత్య వైన్స్ వద్దకు వెళ్లారు. వాహనం దిగి షాపు వద్దకు వెళ్లి చూడగా అప్పటికే వైన్స్ మూసి ఉంది. తిరిగి వాహనం ఎక్కుతుండగా అక్కడే మాటు వేసి ఉన్న నల్లదుస్తులు ధరించిన ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. దీంతో సత్యనారాయణ ఛాతీ, మెడపై తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. -
కన్నీరు పెట్టిన జైనా..
సాక్షి, ధర్మపురి: జైన కన్నీరుపెట్టింది.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తల్లీపిల్లల అంత్యక్రియలకు శనివారం ఊరంతా కదిలింది. ఒక పాడెపై తల్లి.. మరో పాడెపై ఇద్దరు పిల్లల మృతదేహాలను ఉంచి నిర్వహించిన శవయాత్ర అందరినీ కన్నీరు పెట్టించింది. తల్లీపిల్లలకు ఊరంతా కంటతడితో వీడ్కోలు పలికింది. జైనా గ్రామానికి చెందిన టేకుమట్ల సత్తవ్వ(32) దోహాఖతర్ నుంచి స్వగ్రామానికి వస్తున్న భర్తను తీసుకొచ్చేందుకు తన కుమారుడు శ్రావణ్(12), కూతరు శాలిని (10)తో వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. వీరితోపాటు ధర్మపురికి చెందిన కారు డ్రైవర్ జెట్టి రాజ్‌కుమార్(24) కూడా దుర్మరణం చెందాడు. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులు స్వగ్రామానికి శుక్రవారం రాత్రి తీసుకువచ్చారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. జైనాలో తల్లీపిల్లల మృతదేహాలను చూసేందుకు ఊరంతా కదలివచ్చింది. ఒకే పాడెపై అన్నాచెల్లెలు.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బంధువులు సత్తవ్వ మృతదేహాన్ని ఒక పాడెపై, అన్నాచెల్లెలు శావ్రణ్, శాలిని మృతదేహాలను ఒకపాడెపై ఉంచి అంతిమాయాత్ర నిర్వహించారు. ఈదృశ్యం అందరినీ కదిలించింది. దోహాఖతర్ నుంచి వచ్చిన సత్తవ్వ భర్త రాజేశ్ ముగ్గురికీ నిప్పుపెట్టాడు. గ్రామ శివారులోని గోదావరి నది వరకు అంతిమయాత్ర సాగింది. ముగ్గురి మృతదేహాలను నదిలో ఖననం చేశారు. కాగా, ధర్మపురిలో కారు డ్రైవర్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ శుక్రవారం రాత్రి పరామర్శించారు. శనివారం జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు -
శామీర్‌పేటలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం
మేడ్చల్ జిల్లా : శామీర్ పేట మండలం తుర్కపల్లి గ్రామ సమీపంలో రాజీవ్ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి శంషాబాదు ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సత్తవ్వ(35) , శ్రావణ్(10) , షాలిని(12)తో డ్రైవర్ రాజ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సత్తవ్వ భర్త ఖతార్ నుంచి ఇండియాకు వస్తుండటంతో ఆయనకు కుటుంబసభ్యులు స్వదేశీ ఆహ్వానం పలికేందుకు ఎయిర్ పోర్టుకు బయలు దేరారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అందరూ చనిపోవడంతో బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పురుగుల మందే పెరుగన్నమాయె..
గొల్లపల్లి(ధర్మపురి) : వ్యవసాయమే తన కుటుంబానికి జీవనాధారం. తనకున్న నాలుగెకరాలు సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు బిడ్డలను ఇంటర్ వరకు చదివించి వివాహాలు చేశాడు. కొడుకును డిగ్రీ చదివిస్తున్నాడు. కొన్నేళ్లుగా కాలం కరుణించకపోవడంతో అనుకున్న స్థాయిలో పంట చేతికందడం లేదు. అయినా భగీరథ ప్రయత్నం చేశాడు. అప్పుచేసి బావిలో పూడిక తీయించాడు. ఈ సారిసాగు చేసిన పంట కూడా ఎండిపోయింది. అప్పు తీర్చేదారి కనిపించక తన వ్యవసాయ పొలం వద్దనే క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కనపర్తి కమలాకర్‌రావు (48)కు భార్య విజయ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రెండేళ్ల క్రితం కూతుళ్ల వివాహం చేశారు. కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. తనకున్న నాలుగెకరాల్లో సాగు చేస్తున్నాడు. ఈ సారి నీళ్లు తక్కువగా ఉండడంతో ఎకరంన్నరలో వరి, 30 గుంటల్లో ఆరుతడి పంటలు వేశాడు. ఎస్సారెస్పీ నీరు చివరి ఆయకట్టుకు అందకపోవడంతో పంట ఎండిపోయే స్థితికి చేరింది. దీంతో మూడున్నర లక్షలు అప్పుతెచ్చి తన వ్యవసాయబావిని 12గజాల వరకు తవ్వించాడు. ఆ నీళ్లు సరిపోకపోవడంతో వరిపొలం ఎండిపోయింది. వ్యవసాయానికి, కూతుళ్ల పెళ్లిళ్లకు చేసిన అప్పు రూ. 10లక్షలు దాటింది. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో కొన్నిరోజులుగా మనస్తాపంతో ఉంటున్నాడు. శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. ఉదయం 11 అయినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే కమలాకర్ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విగతజీవిగా పడిఉన్న కమలాకర్‌రావు మృతదేహం వద్ద కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. సీఐ లక్ష్మిబాబు, ఎస్సై శ్రీకాంత్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని మాజీ జెడ్పీచైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించారు. -
గోదావరి కంపు.. కంపు
ధర్మపురి: రాయపట్నం గోదావరిలో అపరిశుభ్రత తాండవిస్తోంది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రాయపట్నం వంతెనవద్ద గత పుష్కరాల సందర్భంగా ఘాటును ఏర్పాటుచేశారు. ఎల్లంపెల్లి బ్యాక్‌వాటర్ నిండుగా ఉండడంతో భక్తులు పుష్కరఘాట్ వద్దనే స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే గోదావరిలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఫొటోలు, ప్లాస్టిక్ కవర్లు, కొబ్బరి చిప్పలు, దుస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. పగిలిన గ్లాసుముక్కులు కాళ్లకు గుచ్చి ఇబ్బందులు పడుతున్నామని భక్తులు అంటున్నారు. గోదావరిలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేయాలని కోరుతున్నారు. -
అమ్మా.. మాట్లాడమ్మా..!
ధర్మపురి: తల్లి మంచం పట్టింది. ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. గోరుముద్దలు తినిపించాల్సిన మాతృమూర్తి అచేతనావస్థలో పడి ఉంది. ‘అమ్మా..అమ్మా..’అంటూ ఆ పసిపిల్లలు పిలిస్తే చూడటంతప్ప దగ్గరకు తీసుకోలేని దైన్య పరిస్థితి. మరోపక్క చేతనైనంత వరకు వైద్యం చేయించిన భర్త.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితుల్లో ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ కుటుంబం తమను ఆదుకునే దిక్కుకోసం ఎదురు చూస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బూర్గుపల్లెకి చెందిన సౌదాని రాజయ్య, కొమురమ్మ దంపతులు. వీరికి కుమారుడు నాగేశ్ (6 సంవత్సరాలు), ఆల్య, అహల్య(6 నెలలు) కవలలు ఉన్నారు. రాజయ్య గొర్రెలు మేపుకుంటూ, కొమురమ్మ కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 40 రోజుల క్రితం ఉదయం ఇంటి వద్ద ఇద్దరు పసికందులకు పాలు తాగిస్తుండగా... కొమురమ్మ ఒక్కసారి పక్కకు పడిపోయింది. ఒడిలో ఉన్న ఇద్దరు చిన్నారులు రోదిస్తుండగా.. అప్పుడే ఇంటికి వచ్చిన భర్త రాజయ్య భార్యను లేపడానికి ప్రయత్నించాడు. కానీ, అచేతనావాస్థకు చేరింది. కాళ్లూచేతులు చచ్చుబడిపోయాయి. మాట్లాడటానికి ప్రయత్నించినా నోరు పెగలలేని పరిస్థితి. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనపై రాజయ్య షాక్‌కు గురయ్యాడు. వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు పరీక్షించి ‘యూరో పెరాలసిస్’గా గుర్తించారు. ఈ జబ్బు వేలల్లో ఒకరికి వస్తుందన్నారు. ఆస్పత్రిలో రూ. ఐదు లక్షలు ఖర్చు కొమురమ్మ చికిత్స కోసం ఇప్పటి వరకు రూ. 5 లక్షలు ఖర్చు చేశాడు. ఆస్పత్రిలో చేరిన తొలినాళ్లలో ఒక్క ఇంజెక్షన్ రూ. 18,300 పెట్టి కొనుగోలు చేశాడు. ఇలా రోజుకు 4 ఇంజెక్షన్లు వేయాల్సి వచ్చింది. వరుసగా ఐదు రోజుల పాటు ఇలా ఇంజెక్షన్లు చేయించినా.. వ్యాధి నయం కాలేదు. 20 రోజులకు పైగా ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందించారు. పూర్తిగా నయం కావాలంటే మరో రూ. 5 లక్షలు అవసరమని వైద్యులు చెప్పారు. అయితే, కొమురయ్య చేతిలో చిల్లిగవ్వలేదు. వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో 15 రోజుల క్రితం ఆస్పత్రినుంచి ఇంటికి తీసుకొచ్చారు. చెట్ల పసర్ల వైద్యం కోసం స్వగ్రామమైన నిర్మల్ జిల్లా కడెం మండలం మద్దికుంటకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. 55 గొర్లెను అమ్మిన.. కొమురమ్మ వైద్యం కోసం చేతిలో డబ్బు లేకుండే. నా దగ్గరున్న 55 గొర్రెలు అమ్మగా.. రూ.2 లక్షల యాభై వేలు వచ్చినయి. మరో రూ.2.5 లక్షలు అప్పు చేసిన. మొత్తం రూ.5 లక్షలకు పైగా ఖర్చయింది. అయినా నయం కాలే. మరికొన్ని రోజులుంటే నయమైతదని డాక్టర్లు చెప్పారు. ఇక చేతిలో చిల్లిగవ్వ లేదు. కేసీఆర్ ఇచ్చిన 19 గొర్రెలు మాత్రమే ఉన్నాయి. దిక్కులేక చెట్ల పసరు పోయిస్తున్న. – రాజయ్య, భర్త -
అయ్యా.. ఆదుకోండి
కరీంనగర్ జిల్లా : ఓ రోడ్డు ప్రమాదం ఆ దంపతులిద్దరినీ వికలాంగులను చేసింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త కాలు కోల్పోగా, భార్య నడుము, కాలు విరిగాయి. ఇద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం ఇప్పటికే అప్పుచేసి రూ.5 లక్షలు ఖర్చు చేశారు. పూర్తిగా కోలుకునేందుకు కనీసం మరో రూ.3 లక్షల వరకు అవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. కూలీ చేసుకుని బతికే తమ ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. బుగ్గారం మండలం మద్దునూర్‌కు చెందిన బండారి స్వరూప–సత్తెన్న దపంతులకు ఇద్దరు కూమారులు ఉన్నారు. తమకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కూలీ ప నులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. క్రమంలో పెద్ద కొడుకు హరీశ్(27) రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్‌వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధిలేక స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఈనెల 25న ధర్మపురిలోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో హరీశ్ తన భార్య రిషిత, కూతరు ప్రజ్యోతితో కలిసి «బైక్‌పై ధర్మపురికి బయల్దేరాడు. గ్రామ శివారులోని పెట్రోలు పంపు సమీపంలో బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన వరంగల్‌కు చెందిన కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు హరీశ్ కాలు పూర్తిగా విరిగిందని, రిషిత నడుము ఎముకలు, కాలు ఫ్యాక్చర్ అయ్యాయని నిర్ధారించారు. హరీశ్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు పంపించారు. రిషితకు కరీంనగర్లో చికిత్స చేస్తున్నారు. కాలు తొలగింపు.. కారు డీకొట్టిన సంఘటనలో హరీశ్ కాలు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో హైదరాబాద్‌లో వైద్యులు గురువారం దానిని తొలగించారు. మరోవైపు కరీంనగర్లో చికిత్స పొందుతున్న అతడి భార్య రిషిత కోలుకుంటోంది. ప్రస్తుతం ఇద్దరికీ ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు. అయితే పూర్తిగా కోలుకోవడానికి మరో రూ.3 లక్షల అవసరమని తెలిపారు. ఇప్పటికే తెలిసిన వారివద్ద అప్పులు చేసి మూడు రోజుల్లో చికిత్సకు రూ.5 లక్షలు ఖర్చు చేశామని, తమ ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం, దాతలు సాయం అందించాలని హరీశ్ దంపతులు, అతడి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
ప్రాణం తీసిన ప్రేమ.. ప్రేయసి సోదరులే..
♦ చెర్లపల్లిలో యువకుడి హత్య ♦ గొడ్డలితో నరికి చంపిన ప్రియురాలి తండ్రి, సోదరులు ♦ చెర్లపల్లిలో జగిత్యాల–ధర్మారం రోడ్డుపై ఘటన ధర్మపురి: ప్రేమ ఓ యువకుడి ప్రాణం తీసింది. నిజమైన ప్రేమ త్యాగం కోరుకుంటుందంటారు. ఇక్కడ మాత్రం ప్రియుడి ప్రాణాన్నే బలికోరింది. ప్రేయసి తండ్రి, సోదరులే ప్రియుడిపాలిట కాలయములయ్యారు. మాటువేసి పట్టపగలే నడిరోడ్డుపై నరికేశారు. ఈ సంఘటన వెల్గటూర్ మండలం చర్లపల్లిలో మంగళవారం జరిగింది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. చెర్లపల్లి గ్రామానికి చెందిన జుంజుపల్లి సుధాకర్(28), ఇదే గ్రామానికి చెందిన సిరిగిరి సుమ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం సుమ తండ్రి రామయ్య, సోదరులు వరుణ్, హరీశ్‌కు తెలియడంతో సుమతో మాట్లాడొద్దని పలుమార్లు హెచ్చరించారు. అయినా సుధాకర్ పట్టించుకోలేదు. దీంతో అతడిపై కక్ష్య పెంచుకున్నారు. ఈక్రమంలో ఓరోజు సుమ, సుధాకర్ ద్విచక్రవాహనంపై జగిత్యాల నుంచి వస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. ఈ సంఘటనలో సుమకు గాయాలయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సుధాకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు అతడిపై 307 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈక్రమంలో సుధాకర్ ఓరోజు సుమ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. వారిని బెదిరించాడు. దీంతో వారు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా మరో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇరువర్గాలు పరస్పరం ఘర్షణ పడుతున్నారు. దీంతో ఎలాగైనా సుధాకర్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్న సుమ కుటుంబ సభ్యులు పథకం ప్రకారం.. మంగళవారం ఉదయం జగిత్యాల–ధర్మారం రోడ్డుపై ఆటోలో సుమ తండ్రి రామయ్య, సోదరులు వరుణ్, హరీశ్ కాపుకాచారు. సుధాకర్ ద్విచక్రవాహనంపై బయటకు రాగానే ఆటోతో బైక్‌కు డ్యాష్ ఇచ్చారు. సుధాకర్ కిందపడగానే వెంటతెచ్చుకున్న గొడ్డలితో అతడి మెడపై నరికి పారిపోయారు. కొన ఊపిరితో ఉన్న సుధాకర్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. సుమ తండ్రి రామయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోగా అతడి కొడుకులు పరారీలో ఉన్నారు. ప్రేమ విషయమై సుమతో పోలీసులు మాట్లాడగా, సుధాకర్ రెండేళ్లుగా తన వెంటపడుతున్నాడని, ప్రేమపేరుతో వేధిస్తున్నాడని ఆరోపించింది. మృతుడి అన్న రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ ప్రకాశ్ తెలిపారు. -
వానరానికి అంత్యక్రియలు
కేకేనగర్ : ధర్మపురి జిల్లా కారియమంగళం ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం విద్యుదాఘాతానికి గురై వానరం మృతి చెందింది. దానికి స్థానికులు పూలమాలలు వేసి అంజలి ఘటించి అంత్యక్రియలు జరిపారు. -
పడవ మునిగి ఇద్దరి గల్లంతు
ధర్మపురి(జగిత్యాల జిల్లా): బుగ్గారం మండలం చిన్నాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పడవ మునిగిపోయి ఇద్దరు గల్లంతయ్యారు. రాయకల్ మండలకేంద్రానికి చెందిన బొమ్మవేణి వెంకటేశ్(25), గాజుల రాజు(16) అనే ఇద్దరు చుట్టపు చూపుగా చిన్నాపూర్ గ్రామానికి చెందిన గట్టు శ్రావణ్ ఇంటికి వచ్చారు. ఊరి చివర ఉన్న చెరువులో చేపలకు మందు వేద్దామని ముగ్గురూ కలిసి పడవలో చెరువులోకి వెళ్లారు. అయితే పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. శ్రావణ్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. మిగతా ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
నలుగురు యువకుల మృతి
జగిత్యాల: అతి వేగం ప్రాణాలు తీసింది. మితిమీరిన వేగంతో బైక్ నడపడంతో బైక్‌లో ప్రయానిస్తున్న నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వద్ద మితిమీరిన వేగంతో వస్తున్న ఓబైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. మృతులు బుగ్గారాం మండలం బీరుసాని గ్రామానికి చెందిన, సురమల్ల హరీష్ , కస్తూరి సాయి, ఉరుమట్ల మధుకర్ , కాంపెల్లి మహేశ్ లుగా గుర్తించారు. మృతులందరూ 22 ఏళ్లలోపు యువకులే. -
రైతు కూలీ మృతి
గొల్లపల్లి(ధర్మపురి) : మోటార్ మరమ్మతుకోసం బావిలోకి దిగిన రైతు కూలి కరెంట్‌కు బలైన సంఘటన జగిత్యాల జిల్లా బొంకూర్‌లో జరిగింది. కూలీకి తీసుకెళ్లిన రైతు సంఘటన స్థలం నుంచి పారిపోవడంతో పరిహారంకోసం మృతదేహంతో అతడి ఇంటి ఎదుట ఆందోళన దిగారు. బొంకూర్ గ్రామానికి చెందిన పెద్దపల్లి సత్తయ్య(45)కి భార్య సుజాత, ఇద్దరు కూతుర్లు ఆకాంక్ష, అంజలి, కొడుకు విష్ణువర్ధన్ ఉన్నారు. సత్తయ్యకు గుంట భూమి కూడా లేదు. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఓరుగంటి తిరుపతిరావు రైతు బావి మోటార్ (నీటిలో అమర్చింది) పని చేయడం లేదు. మరమ్మతు చేసేందుకు తిరుపతిరావుతో కలిసి బావి వద్దకు వెళ్లగా మోటార్ పైకి తీస్తూ మరమ్మతు చేస్తుండగా తిరుపతిరావు ఆన్‌చేయడంతో షాక్ తగిలి సత్తయ్య బావిలో పడి అక్కడిక్కడే మృతి చెందాడు. తిరుపతిరావు అక్కడి నుంచి జారుకుని ఊరిలో కనిపించకుండా పోయాడు. సత్తయ్య ఇంటికి రాకపోవడంతో రైతు బావి వద్దకు కుటుంబసభ్యులు వెళ్లే సరికి శవమై కనిపించాడు. సత్తయ్య కూతుర్లు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాస్తుం డగా దూరంకావాల్సి వచ్చింది. తిరుపతిరావు ఇంటి ముందు సత్తయ్య భార్య, కుటుంబ సభ్యులు గ్రామస్తులు శవంతో ఆందోళనకు దిగారు. పరిహా రం చెల్లించే వరకు ఇక్కడి నుంచి కది లే ది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఎస్సై ఉపేంద్ర చారి, ధర్మపురి సీఐ శ్రీనివాస్ తిరుపతిరావు బంధువులతో మాట్లాడించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తిరుపతిరావు ఆస్తి సత్తయ్య కుటంబసభ్యుల పేరిట రాసి ఇవ్వాలనే డిమాం డ్తో సోమవారం రాత్రి వరకు ఆందోళన కొనసాగింది. -
అంత్య పుష్కర సంరంభం
* తొలిరోజు లక్ష మందికిపైగా భక్తుల పుణ్యస్నానాలు * గోదావరి వెంట పుణ్యక్షేత్రాల్లో సందడి సాక్షి నెట్వర్క్: పుణ్యక్షేత్రాలు శోభిల్లాయి.. భక్తజన సందడితో గోదారి పులకించింది.. ఆదివారం గోదావరి అంత్య పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతీ క్షేత్రంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మంత్రి ఈటల రాజేందర్ అంత్య పుష్కరాలను ప్రారంభించారు. తొలి రోజు దాదాపు లక్ష మందికిపైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారు. ఈ నెల 11 వరకు పుష్కర సందడి కొనసాగనుంది. పులకించిన భద్రాద్రి ఖమ్మం జిల్లా భద్రాచలంలో తెల్లవారుజామున 6 నుంచి గౌతమీ మాత వేడుక ఆరంభమైంది. సీతారాముల మూర్తులతో వేద పండితుల సామూహిక స్నానాలతో అంత్య పుష్కరాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. రాములోరి ప్రతిమలు, శ్రీపాదుకలు, చక్ర పెరుమాళ్లకు జలాభిషేకం తర్వాత భక్తజనం గోదారమ్మ ఒడిలో తరించింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పితృదేవతలకు పిండ ప్రదానం చేసి స్నానాలు చేశారు. హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్ శ్రీపాదుకలను తలపై పెట్టుకొని, స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం పుష్కర స్నానమాచరించారు. మొదటి రోజు 30 వేల మంది భక్తులు పుష్కర స్నానం చేసినట్టు అంచనా. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర, చెన్నూరు, మంచిర్యాల ఘాట్లలో 24 వేల మంది వరకు పుణ్య స్నానాలు ఆచరించారు. కరీంనగర్లో 35 వేల మంది.. గుంటూరుకు చెందిన దత్త పీఠాధిపతి విశ్వంజీ విశ్వయోగి మహరాజ్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి మంత్రి ఈటల రాజేందర్ ధర్మపురిలో అంత్య పుష్కరాలు ప్రారంభించారు. కృష్ణా పుష్కరాలను సైతం ఇదే స్థారుులో నిర్వహించేందుకు సీఎం ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. జిల్లాలోని పలు ఘాట్ల వద్ద దాదాపు 35 వేల మంది స్నానాలు ఆచరించారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడలో, రెంజల్ మండలం త్రివేణి సంగమ క్షేత్రంలో, బాల్కొండ మండలం ఎస్సారెస్పీ వద్ద, మోర్తాడ్ మండలం తడపాకల్‌లో ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. రాజమహేంద్రవరం.. జనసంద్రం సాక్షి, రాజమహేంద్రవరం/ఏలూరు: దేశంలో ఒక్క గోదావరి నదికి మాత్రమే వచ్చే అంత్య పుష్కర సంరంభం ఆదివారం ఏపీలోనూ ఆరంభమయ్యింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సరస్వతీ(వీఐపీ) ఘాట్‌లో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఎంపీ మురళీమోహన్, స్థానిక ఎమ్మెల్యేలు తదితరులు గోదావరి తల్లికి ఉదయం పూజలు చేసి అంత్య పుష్కరాలను ప్రారంభించారు. ఈ నెల 11 వరకూ గోదావరి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. గతేడాది జూలై 14 నుంచి 12 రోజులపాటు ఆది పుష్కరాలు జరిగిన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరంతోపాటు జిల్లాలోని వివిధ ఘాట్లలో, గోదావరి నదీ పాయలలో వేకువజాము నుంచే ప్రజలు అంత్య పుష్కర స్నానాలు ఆరంభించారు. అయితే ఇక్కడ భక్తులు ఆశించిన స్థాయిలో రాలేదు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో సుమారు 10వేల మంది పుణ్యస్నానాలు ఆచరించగా.. జిల్లావ్యాప్తంగా ఆ సంఖ్య 48వేలు దాటిందని అధికారుల అంచనా. పట్టిసీమ పుష్కర ఘాట్‌లో అధిక సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించి, శివక్షేత్రంలోని శ్రీ భద్రకాళీ సమేతవీరేశ్వరస్వామిని దర్శించుకున్నారు. -
ధర్మపురిలో గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభం
ధర్మపురి (కరీంనగర్): కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గోదావరి అంత్యపుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం గుంటూరు దత్త పీఠాదిపతి విశ్వయోగి విశ్వంత్ జీ స్వామి పుష్కరాలను ప్రారంభించారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పది లక్షల కోసం ప్రాణం తీశారు
హత్య కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్టు మరో ముగ్గురి కోసం గాలింపు ధర్మపురి : ధర్మపురి శివారులోని రామయ్యపల్లెలో గత నెల 25న జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. రూ.10 లక్షల కోసం ఇద్దరు వ్యక్తులు సుల్తానాబాద్‌కు చెందిన పాలాజి రామయ్య(59)ను కిరాతకంగా హత్య చేశారు. అనంతరం అనుమానం రాకుండా మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసినట్లు నిర్ధారించారు. నిందితులు గర్రెపెల్లి శ్రీనివాస్, పరశురాములును ధర్మపురి సీఐ వెంకటరమణ గురువారం అరెస్ట్ చూపారు. ఆయన కథనం ప్రకారం.. సుల్తానాబాద్‌కు చెందిన రామయ్య గ్రామంలో వడ్రంగి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతడికి రాజీవ్ రహదారిని అనుకుని ఉన్న స్థలాన్ని పెట్రోల్ బంక్ కోసం గర్రెపెల్లి శ్రీనివాస్‌కు లీజుకు ఇచ్చాడు. సుమారు రూ.10 లక్షల లీజు డబ్బులు బకాయి పడడంతో ఈ విషయమై రామయ్య, శ్రీనివాస్‌కు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం శ్రీనివాస్ రూ.10 లక్షల చెక్కును రామయ్యకు ఇచ్చాడు. అది బౌన్స కావడంతో మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో విసుగు చెందిన శ్రీనివాస్ రామయ్యను హత్య చేయాలని పథకం పన్నాడు. ఈ మేరకు ఇద్దరు కిరాయి రౌడీలను మాట్లాడి వారికి రూ.25 వేల చొప్పున రూ.50 వేలు ముట్టజెప్పాడు. అయితే ఈ ప్లాన్ బెడిసికొట్టింది. డబ్బులు తీసుకున్నవారు హత్య చేయకపోగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో శ్రీనివాస్ రంగంలోకి దిగాడు. గత నెల 25న డబ్బులు ఇస్తానని రామయ్యకు చెప్పాడు. అదే రోజు కరీంనగర్ మండలం చింతకుంటకు చెందిన పరశురాములుతో కారులో ఇంటికి వచ్చి రామయ్యను తీసుకెళ్లాడు. కారు కరీంనగర్ శివారుకు రాగానే పరశురామ్ రామయ్యకు క్లోరోఫాం ఉన్న చేతిరుమాలు వాసనచూపడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం స్థానిక చల్మెడ ఆనందరావు ఆస్పత్రి సమీపంలో పరశురాములు వెంటతెచ్చుకున్న కత్తితో రామయ్య గొంతుకోశాడు. మృతదేహాన్ని ధర్మపురి శివారులోని రామయ్యపల్లెకు తీసుకెళ్లి ముళ్లపొదల్లో పడేసి పెట్రోల్‌పోసి దహనం చేశారు. 29వ తేదీన గుర్తించి గుర్తుతెలియని వ్యక్తి హత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గూడెంగుట్ట వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన శ్రీనివాస్, పరశురాములును అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా రామయ్యను హత్య చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. రామయ్యను హత్యచేసేందుకు డబ్బులు తీసుకున్న అనిల్, సమ్మయ, అమర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. హత్య కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్టు మరో ముగ్గురి కోసం గాలింపు ధర్మపురి : ధర్మపురి శివారులోని రామయ్యపల్లెలో గత నెల 25న జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. రూ.10 లక్షల కోసం ఇద్దరు వ్యక్తులు సుల్తానాబాద్‌కు చెందిన పాలాజి రామయ్య(59)ను కిరాతకంగా హత్య చేశారు. అనంతరం అనుమానం రాకుండా మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసినట్లు నిర్ధారించారు. నిందితులు గర్రెపెల్లి శ్రీనివాస్, పరశురాములును ధర్మపురి సీఐ వెంకటరమణ గురువారం అరెస్ట్ చూపారు. ఆయన కథనం ప్రకారం.. సుల్తానాబాద్‌కు చెందిన రామయ్య గ్రామంలో వడ్రంగి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతడికి రాజీవ్ రహదారిని అనుకుని ఉన్న స్థలాన్ని పెట్రోల్ బంక్ కోసం గర్రెపెల్లి శ్రీనివాస్‌కు లీజుకు ఇచ్చాడు. సుమారు రూ.10 లక్షల లీజు డబ్బులు బకాయి పడడంతో ఈ విషయమై రామయ్య, శ్రీనివాస్‌కు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం శ్రీనివాస్ రూ.10 లక్షల చెక్కును రామయ్యకు ఇచ్చాడు. అది బౌన్స కావడంతో మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో విసుగు చెందిన శ్రీనివాస్ రామయ్యను హత్య చేయాలని పథకం పన్నాడు. ఈ మేరకు ఇద్దరు కిరాయి రౌడీలను మాట్లాడి వారికి రూ.25 వేల చొప్పున రూ.50 వేలు ముట్టజెప్పాడు. అయితే ఈ ప్లాన్ బెడిసికొట్టింది. డబ్బులు తీసుకున్నవారు హత్య చేయకపోగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో శ్రీనివాస్ రంగంలోకి దిగాడు. గత నెల 25న డబ్బులు ఇస్తానని రామయ్యకు చెప్పాడు. అదే రోజు కరీంనగర్ మండలం చింతకుంటకు చెందిన పరశురాములుతో కారులో ఇంటికి వచ్చి రామయ్యను తీసుకెళ్లాడు. కారు కరీంనగర్ శివారుకు రాగానే పరశురామ్ రామయ్యకు క్లోరోఫాం ఉన్న చేతిరుమాలు వాసనచూపడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం స్థానిక చల్మెడ ఆనందరావు ఆస్పత్రి సమీపంలో పరశురాములు వెంటతెచ్చుకున్న కత్తితో రామయ్య గొంతుకోశాడు. మృతదేహాన్ని ధర్మపురి శివారులోని రామయ్యపల్లెకు తీసుకెళ్లి ముళ్లపొదల్లో పడేసి పెట్రోల్‌పోసి దహనం చేశారు. 29వ తేదీన గుర్తించి గుర్తుతెలియని వ్యక్తి హత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గూడెంగుట్ట వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన శ్రీనివాస్, పరశురాములును అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా రామయ్యను హత్య చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. రామయ్యను హత్యచేసేందుకు డబ్బులు తీసుకున్న అనిల్, సమ్మయ, అమర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. -
మనసెలా వచ్చిందమ్మా..!
వెల్గటూరు: కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని సరస్వతీమాత ఆలయంలోని బాత్రూంలో గురువారం మూడురోజుల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. బాత్రూంలో నుంచి శిశువు అరుపులు విన్న చుట్టుపక్కలవారు అక్కడికి వెళ్లి చూడగా శిశువు కనిపిం చింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ సంతోష్ సంఘటనాస్థలానికి వచ్చి శిశువును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించగా, వారు శిశుగృహకు తరలించారు. చూడగానే ముద్దొస్తున్న శిశువును వదిలించుకోవడానికి ఆ తల్లికి మనసెలా వచ్చిందోనని స్థానికులందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడశిశువు కావడంతోనే వదిలేశారా.. లేక మరేవైనా కారణాలున్నాయూ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ధర్మపురి హుండీ ఆదాయం రూ.22 లక్షలు
ధర్మపురి (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ లెక్కింపులో రూ. 22,43,723 నగదుతో పాటు,19 గ్రాముల బంగారం, 2.280 గ్రాముల వెండి, విదేశాలకు చెందిన 26 కరెన్సీ నోట్లు ఉన్నాయని ఆలయ అధికారులు తెలిపారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం
ధర్మపురి (కరీంనగర్) : పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సోమిశెట్టి శారద(28) ఆదివారం పోలీస్ స్టేషన్ బయట ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని స్టేషన్లోకి పరుగులు తీసింది. మంటలకు ఆమె శరీరం దాదాపు కాలిపోయింది. ఇది గుర్తించిన పోలీసులు మంటలు ఆర్పి 108 సాయంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. -
ధర్మపురిలో భారీ అగ్ని ప్రమాదం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ధర్మపురి పట్టణంలోని బస్టాండు చుట్టూ ఉన్న దుకాణాలు బుధవారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదంలో కాలి బుడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక దుకాణంలో మంటలు చెళరేగి క్షణాల్లో పరిసర దుకాణాలకు వ్యాపించాయి. వేకువ జాము కావడంతో జన సంచారం లేదు. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.50 లక్షల దాకా ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. -
ధర్మపురిలో భారీ అగ్నిప్రమాదం
-
ధర్మపురిలో భారీ అగ్నిప్రమాదం
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మంగళవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బస్టాండ్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. అగ్నిప్రమాదంలో 16 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. మరో ఏడు దుకాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాదాపు రూ. 50 లక్షలకుపైగా ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కర్నూలు జిల్లాలో అగ్నిప్రమాదం
-
'ధర్మపురి ఓ ఆధ్యాత్మిక కేంద్రం'
ధర్మపురి : కరీంనగర్ జిల్లా ధర్మపురి ఆధ్యాత్మిక కేంద్రమని పంబ పీఠాధిపతి గోవిందానంద సరస్వతి శర్మ పేర్కొన్నారు. ధర్మపురి పుణ్యక్షేత్రంలో పుష్కర స్నానం ఆచరించిన అనంతరం ఆయన తన ప్రవచనామృతాన్ని అందించారు. పుష్కర స్నానం చేయడం పూర్వ జన్మ సుకృతమన్నారు. వరుణుడి కరుణ కోసం దేవుడిని ప్రార్థించామన్నారు. -
ట్రాఫిక్ కంట్రోల్ చేసిన మంత్రి హరీష్‌రావు
-
తెలంగాణలో పుష్కరాలకు ట్రాఫిక్ కష్టాలు
-
పుష్కరాల్లో మరో ఇద్దరు మృతి
కరీంనగర్(ధర్మపురి): కరీంనగర్ జిల్లా ధర్మపురికి పుష్కర స్నానం కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి శనివారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. బాలాపూర్‌కు చెందిన కర్నాటి అశోక్(42) తన భార్య సునీత, ఇద్దరు పిల్లలతో కలిసి రాత్రి 9.30 గంటల సమయంలో ధర్మపురి చేరుకున్నాడు. బస్టాండ్ సమీపం నుంచి గ్రామపంచాయతీ నందిచౌరస్తా వద్దకు చేరుకుని అక్కడ ఉన్న ఫెన్సింగ్‌కు ఒరిగాడు. ఫెన్సింగ్‌కు అమర్చిన విద్యుత్ దీపాలకు చెందిన వైరు దెబ్బతినడంతో పాటు వర్షంతో తడిసి ఉండటంతో అశోక్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోవటంతో రాత్రి 10 గంటలకు మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ నీతూప్రసాద్ సందర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అశోక్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గుండెపోటుతోటుతో వృద్ధుడు.. ధర్మపురికి పుష్కర స్నానాల కోసం వచ్చిన ఓ వృద్ధుడు శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం నాచారం గ్రామానికి చెందిన అనుగుల వెంకటిగౌడ్(70) బంధువులతో కలిసి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో పుష్కరస్నానం కోసం ఘాట్ వద్దకు వెళ్లిన సమయంలో గుండెనొప్పితో కుప్పకూలిపోయూడు. బంధువులు వెంటనే ఆయనను వైద్యశిబిరానికి తరలించారు. అప్పటికే వెంకటిగౌడ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
ధర్మపురిలో మంత్రుల మకాం
శని, ఆదివారాల్లో సెలవుల దృష్ట్యా ధర్మపురికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. దీంతో ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ధర్మపురిలో పుష్కరాల పర్యవేక్షకులుగా మంత్రులు ఈటల రాజేందర్, టి.హరీష్‌రావులను నియమించారు. ఈ మేరకు వీరిద్దరు శని, ఆదివారాల్లో ధర్మపురిలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పుష్కరాలపై సమీక్షలు నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోనున్నారు. -
23న ధర్మపురికి సీఎం రాక!
రాయికల్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈనెల 23న ధర్మపురి పుణ్యక్షేత్రానికి రానున్నట్లు తెలిసింది. ఈ నెల 14న ధర్మపురిలో మహా పుష్కరాలను ప్రారంభించిన సీఎం పుష్కర స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెళ్లిపోరుున విషయం తెలిసిందే. కేసీఆర్ కుటుంబ సభ్యురాలు మృతి చెందడంతో గుడి బయట నుంచి దండం పెట్టుకొని హైదరాబాద్ పయనమయ్యూరు. దీంతో 23న పుష్కరాలను స్వయంగా పర్యవేక్షించడంతో పాటు ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి దర్శించుకునేందుకు వస్తున్నట్లు సీఎంవో నుంచి జిల్లా అధికారులకు శుక్రవారం సమాచారం అందినట్లు తెలిసింది. ఈ విషయంపై టీఆర్ఎస్కు చెందిన ఓ ముఖ్య నేతను సాక్షి సంప్రదించగా ఆయన మాత్రం సీఎం పర్యటనను ధ్రువీకరించలేదు. అరుుతే రాజమండ్రి పుష్కరాల్లో భక్తుల తొక్కిసలాట సంఘటనను దృష్టిలో ఉంచుకుని.. ధర్మపురిలో కేసీఆర్ పర్యటనను అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. గతంలో జిల్లాకు వచ్చిన సందర్భంలో ధర్మపురిలో పుష్కర స్నానం చేసి ఆలయం, పట్టణ అభివృద్ధికి వరాలు ప్రకటిస్తానని చెప్పారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ తన తాజా పర్యటనలో ధర్మపురికి వరాలు జల్లు కురిపించే అవకాశముందని భావిస్తున్నారు. ఆలయం, పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. -
పుష్కర పనుల్లో లోపించిన నాణ్యత : మధుయాష్కి
ధర్మపురి (కరీంనగర్) : తెలంగాణలో గోదావరి పుష్కరాల పనులను సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అనుచరులకే అప్పగించారని, దాంతో వారు పనులను నాసికరంగా పూర్తి చేశారని నిజామాబాద్ మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కి ఆరోపించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా వెళ్లి గోదావరి నదిలో పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన పుష్కర ఘాట్ పనుల్లో నాణ్యత లోపించిందన్నారు. భక్తులకు తాగునీరు, రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని విమర్శించారు. -
జనసంద్రమే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : గోదావరి మహాపుష్కరాలకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రెండోరోజైన బుధవారం దాదాపు 10 ల క్షల మంది భక్తులు వచ్చారు. అధికారిక లెక్కల ప్రకారం... బుధవారం సాయంత్రం 6 గంటల వరకు అందిన వివరాల ప్రకారం 7.3 లక్షలకు పైగా భక్తులు పుష్కర స్నానమాచరించారు. రాత్రి వేళల్లోనూ భక్తులు వేలాది సంఖ్యలో తరలివస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి దాటే వరకు జిల్లావ్యాప్తంగా 10 ల క్షలకుపైగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించే అవకాశాలున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం అభిప్రాయపడింది. జిల్లాలోని ప్రధాన పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కాళేశ్వరం ప్రాంతాలకు భక్తజనం పోటెత్తారు. పార్కింగ్ స్థలాలు వేలాది వాహనాలు, బస్సులతో నిండిపోయాయి. కాళేశ్వరంలో 3 వేలకుపైగా ప్రైవేటు వాహనాలు... 200కు పైగా ఆర్టీసీ బస్సుల్లో భక్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. తొలిరోజు రెండు లక్షల మంది హాజరుకాగా... జాయింట్ కలెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం రెండోరోజు సాయంత్రం 6 గంటల సమయానికే భక్తుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. సాయంత్రం 6 తరువాత సైతం జనం వేలాదిగా వస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి దాటేవరకు కాళేశ్వరంలో భక్తుల సంఖ్య 3 ల క్షలు దాటే అవకాశాలున్నాయని జిల్లా అధికారులు తెలిపారు. ధర్మపురిలోనూ దాదాపు ఇదే సీను. బుధవారం సాయంత్రం వరకు 2.75 ల క్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించినట్లు ధర్మపురి తహశీల్దార్ మహేశ్వర్ వెల్లడించారు. అర్ధరాత్రి దాటే సమయానికి ఆ సంఖ్య 3 లక్షలు దాటే అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. కాళేశ్వరానికి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలతోపాటు మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి పవిత్ర గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించారు. జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు ఉదయం నుంచి సాయంత్రం వరకు కాళేశ్వరంలోనే ఉండి ఘాట్ల ఏర్పాట్లు పరిశీలించారు. జిల్లాలోని ప్రధాన ఘాట్లయిన మంథని, కోటిలింగా ల, గోదావరిఖని, రాయపట్నం ప్రాంతాలకు భక్తులు వేలాదిగా తరలిచ్చారు. పోలీసు లెక్కలు వేరే... పుష్కరాలకు ఎంతమంది వచ్చారనే వివరాలను జిల్లా ఎస్పీ డి.జోయల్‌డేవిస్ బుధవారం రాత్రి మీడియాకు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలీసుల లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 36 పుష్కర ఘాట్లకు 5.15లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో కాళేశ్వరంలో 1.70 ల క్షలు, ధర్మపురిలో 2.50 లక్షలు, కోటిలింగాలలో 32 వేలు, మంథనిలో 15 వేలు, గోదావరిఖనిలో 18,500 మంది భక్తులు హాజరైనట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ సాయంత్రం 6 గం టల ప్రాంతంలో వెల్లడించిన మీడియా ప్రకటనలో కాళేశ్వరానికి 2.5లక్షల మంది భక్తులు వచ్చినట్లు ఉండగా రాత్రి 9 గంటలకు ఎస్పీ విడుదల చేసిన మీ డియా ప్రకటనలో 1.70ల క్షల మంది వచ్చారని పేర్కొనడం గమనార్హం. దీనినిబట్టి అధికారులు, పోలీసుల మధ్య సమన్వయం లేదని తెలుస్తోంది. -
రెండో రోజూ.. పుష్కర హోరు!
* తెలంగాణలో లక్షలాది మంది పుణ్య స్నానాలు * కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలానికి పెద్దసంఖ్యలో భక్తుల రాక * రాత్రి పొద్దుపోయాక కూడా తరలి వస్తున్న జనం సాక్షి నెట్వర్క్: దారులన్నీ గోదారి వైపే.. తీరమంతా జనసంద్రమే.. ఎక్కడ చూసినా పుష్కరుడి సందడే.. గోదావరి మహా పుష్కరాల్లో రెండోరోజూ భక్తజనం పోటెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాన పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం కిక్కిరిసిపోయాయి. బుధవారం రాత్రి 9 గంటల వరకు సుమారు 15 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. రాత్రి పొద్దుపోయాక కూడా వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. రాష్ట్రం మొత్తమ్మీద ఒక్క కరీంనగర్ జిల్లాలోనే సుమారు 10 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అందులోనూ ధర్మపురికి అత్యధికంగా భక్త జనసందోహం తరలివచ్చింది. ఇక్కడ 2.75 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ధర్మపురి తర్వాత అధిక సంఖ్యలో కాళేశ్వరానికి 2.5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. భద్రాద్రికి పోటెత్తిన భక్తజనం.. ఖమ్మం జిల్లా భద్రాచలానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇక్కడ 1.70 లక్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించారు. భక్తుల తాకిడి పెరగడంతో రామయ్య దర్శనానికి గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణ క్యూలైన్లలో నిలబడ్డ భక్తులు సీతారామచంద్రస్వామి దర్శనం కోసం 6 గంటల సమయం వేచి ఉండగా.. రూ.200 టిక్కెట్ తీసుకున్న వారు సైతం 3 గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది. తొలిరోజుతో పోలిస్తే పర్ణశాలకు భక్తుల రాక పెరిగింది. రెండోరోజు దాదాపు 15 వేలకుపైగా భక్తులు పుష్కరస్నానం ఆచరించారు. ఆదిలాబాద్‌లోని బాసరకు తొలిరోజుతో పోలిస్తే భక్తుల సంఖ్య తగ్గింది. రెండోరోజు ఇక్కడ దాదాపు 40 వేల మంది స్నానాలు చేశారు. చెన్నూరులో 25 వేల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. సోన్ ఘాట్ వద్ద దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి షవర్ కింద పుష్కర స్నానం ఆచరించారు. గూడెం ఘాట్‌కు వచ్చిన భక్తులు ఘాట్ల వద్ద నీళ్లు లేకపోవడంతో సమీపంలోని ధర్మపురి వెళ్లారు. నిజామాబాద్ జిల్లాలో వివిధ ఘాట్లలో 92 వేలకుపైగా భక్తులు పుష్కర స్నానం చేశారు. వరంగల్ జిల్లాలో సుమారు 20 వేల మంది భక్తులు పుష్కర స్నానం చేశారు. బుధవారం అమావాస్య కావడంతో భక్తుల సంఖ్య కాస్త తగ్గింది. గురువారం నుంచి జనం పెద్దఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. -
ధర్మపురికి 4 లక్షల మంది భక్తులు!
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గోదావరి పుష్కర ఘాట్ల వద్ద బుధవారం సాయంత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. తెలంగాణ నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి కూడా తాకిడి పెరగటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. -
ధర్మపురిలో దత్తన్న పుష్కరస్నానం
ధర్మపురి : కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ఉదయం 11 గంటల వరకు లక్షకు పైగా భక్తులు పుష్కర స్నానం ఆచరించారని అధికారులు తెలిపారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ధర్మపురిలోని పుష్కర ఘాట్ వద్ద బుధవారం పుష్కర స్నానం చేశారు. త్రివేణి సంగమం క్షేత్రం కాళేశ్వరానికి రెండో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తిరుగు ప్రయాణమైన భక్తులకు ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
ధర్మపురికి పోటెత్తిన భక్తులు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని దర్మపురికి భక్తులు పోటెత్తారు. గోదావరి పుష్కరాల రెండో రోజు భారీగా భక్తులు తరలివచ్చారు. బుధవారం ఉదయం 11 గంటల వరకు లక్షకు పైగా భక్తులు పుష్కర స్నానమాచరించారు. కాగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ధర్మపురి పుష్కర స్నానం ఆచరించి పూజలు నిర్వహించారు. అదేవిధంగా కాళేశ్వరంలోని ఘూట్ కు భక్తులు భారీగా వచ్చారు. దాంతో అక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల పటిష్ట చర్యలు తీసుకున్నారు. -
ధర్మపురికి గోదావరి పుష్కరశోభ
-
‘కుంభమేళా’పై కుంభకర్ణ నిద్ర!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యమనే కుంభకర్ణ నిద్ర పోతుండటంతో వాటి ఏర్పాట్లలో ప్రణాళిక గల్లంతైంది. పుష్కరాలకు కేవలం 3 నెలల గడువే ఉన్నప్పటికీ పుష్కర ఘాట్లు, రోడ్ల నిర్మాణం, దేవాలయాల వద్ద వసతుల కల్పన వంటి పనులేవీ మొదలు కాలేదు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటన సందర్భంగా బాసర వద్ద 3 రోజుల క్రితం హడావుడిగా పుష్కరఘాట్లకు శ్రీకారం చుట్టిన అధికారులు మంథని, కాళేశ్వరం, ధర్మపురి, కోటిలింగాల తదితర ప్రాంతాల్లో మాత్రం పనులను ప్రారంభించలేదు. గడువులోగా పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా వర్షాకాలం మొదలయ్యే నాటికి పనులు పూర్తికాకుంటే ఆ తర్వాత హడావుడిగా నిర్వహించినా వానల దెబ్బకు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహా కుంభమేళాకు ఏడాది ముందే పనులు చేపట్టింది. ఇప్పుడు మహారాష్ట్ర సర్కారు కూడా అదే బాటలో పయనిస్తోంది. కానీ మన ప్రభుత్వ విభాగాలు మాత్రం ముందస్తు ఏర్పాట్లలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. స్థల సేకరణా జరగని తీరు.. గోదావరి పుష్కరాల్లో అతి ముఖ్యమైనవి స్నానఘట్టాలు, మహిళలు వస్త్రాలు మార్చుకునే గదులు. వీటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు కొన్ని చోట్ల కనీసం స్థల సేకరణ కూడా పూర్తి కాలేదు. ధర్మపురి, బాసర దేవాలయాల వద్ద గోదావరి ఒడ్డు వద్ద ఆలయాలకు సంబంధించి ఎక్కువగా స్థలం లేదు. ఈ ప్రాం తాల్లో కచ్చితంగా ప్రైవేటు స్థలాలను ఎంపిక చేయాల్సిందే. కానీ ఇప్పటి వరకు ఆ కసరత్తు పూర్తికాలేదు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం లాంటి దేవాలయాల వద్ద అధికారులు చేతులెత్తేసేలా కనిపిస్తోంది. గతంలో సరస్వతీ పుష్కరాలు, ప్రాణహిత పుష్కరాలప్పుడు అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేసి చేతులెత్తేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఇప్పుడూ అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. ముందుకు సాగని రోడ్ల పనులు... పుష్కరాల నేపథ్యంలో గోదావరి తీరంలోని దేవాలయాలకు మంచి రోడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 35 పనులను గుర్తించి రూ.250 కోట్లను రోడ్లు భవనాల శాఖకు కేటాయించింది. కానీ టెండర్ కసరత్తు ఇటీవలే పూర్తై ఆ పనుల్లో 3, 4కు మించి ప్రారంభం కాలేదు. కాళేశ్వరం దేవాలయానికి గంగారం నుంచి దామరకుంట, అన్నారం మీదుగా 30 కిలోమీటర్ల మేర రూ. 33 కోట్లతో రెండు వరసల రోడ్డు నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు నిర్మాణ సామగ్రి కూడా అక్కడికి చేరలేదు. ఈ దేవాలయం వద్ద కేవలం 36 గదులే ఉన్నాయి. గదుల కొరత తీవ్రంగా ఉంది. ఈసారి భక్తుల సంఖ్య భారీగా పెరగనున్నందున గతంలో సరస్వతీ పుష్కరాల సమయంలో నిర్మించినట్లుగా షెడ్లను రెట్టింపు చేయాలని ఆలయ కమిటీ ప్రతిపాదిస్తే దాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. ఇప్పుడూ ఇన్చార్జిల పాలనే పుష్కరాల సమయంలో ఆయా ఆలయాలకు అధికారులను కేటాయించాల్సి ఉన్నా కరీంనగర్ జిల్లా దేవాలయాల వద్ద పరిస్థితులను పర్యవేక్షించాల్సిన అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వరరావును వేములవాడ ఇన్చార్జి కమిషనర్‌గా నియమించారు. ఆయన కార్యాలయంలో సూపరింటెండెం ట్ కేడర్ అధికారిని ధర్మపురి ఆలయ ఇన్చార్జి కమిషనర్‌గా నియమించారు. సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఈవో రాజ్‌కుమార్‌కు మంథని గోదావరి పుష్కర ప్రాంత అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిం చారు. ఆయన ఇప్పటికే 15 ఆలయాల బాధ్యత చూస్తున్నారు. ఆలయాల అభివృద్ధి పనులకు కొన్నింటికి టెండర్లు పూర్తి కాలేదు. -
బాధ్యతలు స్వీకరించిన కొప్పుల
హాజరైన ఈటెల, నాయకులు కరీంనగర్ సిటీ/ధర్మపురి: చీఫ్‌విప్‌గా నియమితులైన ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ శుక్రవారం పదవీబాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీలో తనకు కేటాయించిన కార్యాలయంలో ఉదయం ఈశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, కోరుట్ల, మంథనిఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులు హాజరై కొప్పులను అభినందించారు. మంత్రి పదవిని ఆశించిన కొప్పుల చీఫ్‌విప్ పదవిని ముందుగా నిరాకరించడం తెలిసిందే. ఆయన పదవీబాధ్యతలు చేపట్టకపోవడంతో టీఆర్ఎస్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది. చివరకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసిన తరువాత కొప్పుల చీఫ్‌విప్‌గా కొనసాగడానికే మొగ్గుచూపారు. ముహూర్తం ప్రకారం శుక్రవారం తన కార్యాలయంలో పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గం నుంచి టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కొప్పుల ఈశ్వర్ సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. -
‘ఆసరా’ అందేదెప్పుడు..?
ధర్మపురి : అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయ లోపంతో పింఛన్ల పంపిణీ రచ్చగా మారింది. కార్యక్రమానికి రాజకీయ రంగు పులుమడంతో అది కాస్తా రాస్తారోకో చేసే వరకు వెళ్లింది. ధర్మపురిలో సోమవారం పింఛన్లు పంపిణీచేశారు. లబ్ధిదారులు ఎక్కువగా ఉండడంతో మండల పరిషత్ కార్యాలయంలో కార్యక్రమం చేపడతామని ఎంపీడీవో భాస్కరాచారి నిర్ణయించారు. పంచాయతీ కార్యాలయంలోనే పంపిణీచేయూలని సర్పంచ్ సంగి సత్తెమ్మ కోరారు. అయితే పండుటాకులు, వికలాంగులు గంటల తరబడి నిరీక్షించి ఆకలి, దప్పికకు దూరమయ్యారు. టీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుని మండల కార్యాలయంలోనే పంపిణీచేయూలని పట్టుబట్టడంతో అధికారులు డైలమాలో పడిపోయూరు. మండలపరిషత్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని సర్పంచ్‌తోపాటు మరికొందరు అడ్డుకున్నారు. సభావేదికపై ఉన్న కుర్చీలు, టేబుళ్లు తొలగించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో కార్యదర్శి మేఘమాల తహశీల్దార్ కార్యాలయూనికి వెళ్లింది. బయటకు రావాలంటూ నినాదాలు చేస్తు కార్యాలయాలను ముట్టడించారు. జాతీయ రహదారిపై సర్పంచ్ సంగి సత్తమ్మ, కాంగ్రెస్ నాయకులు, పింఛన్‌దారులు మూడు గంటలపాటు రాస్తారోకో చేశారు. చివరకు కార్యదర్శి మేఘమాల గ్రామపంచాయతీలోనే పంపిణీచేసేందుకు ఒప్పుకోగా వివాదం సద్దుమణిగింది. అర్హులకు పింఛన్లు అందించాలని డిమాండ్‌చేస్తూ వికలాంగులు, వితంతువులు, వృద్ధులతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడే రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. కమిషనర్ శ్రీకేశ్‌లట్కర్ అక్కడకు చేరుకుని మాట్లాడారు.. అర్హత ఉన్న వారందరికీ త్వరలో పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. రామగుండం నగరపాలక సంస్థలో పింఛన్ల మంజూరు కోసం చేపట్టిన సర్వేపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్లు సోమవారం ఆందోళన నిర్వహించారు. పింఛన్లు పంపిణీ చేయడానికి డీఆర్డీఏ పీడీ ఎస్.విజయగోపాల్ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చారు. ఆర్డీవో, తహశీల్దార్‌తో సమీక్ష జరిపారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్లు అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయనకు వివరించారు. ప్లకార్డులతో బైఠాయించి నిరసన తెలిపారు. స్పందించిన పీడీ వారంలోగా అన్ని డివిజన్లలో రీ సర్వే పూర్తిచేయిస్తామని హామీ ఇచ్చారు. కోరుట్ల మండలంలోని జోగిన్‌పల్లికి చెందిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎంపీడీ వోకార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.పింఛన్లు అందించాలని మెట్పల్లి మండలం వేంపేట గ్రామస్తులు మండల పరిషత్ ఎదుట ఆందోళ చేశారు. రామగుండం మండలం జయ్యారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట జయ్యారం, గుడిపల్లి, పుట్నూర్‌కు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు 400 మంది ఆందోళన చేపట్టారు. పింఛన్లు పంపిణీ చేస్తున్న గ్రామ కార్యద ర్శిని అడ్డుకున్నారు. పింఛన్లు అడిగితే ఈవోపీఆర్డీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన వితంతులు ఆందోళనకు దిగారు. తమ భర్తలు చనిపోయి ఏళ్లు గడుస్తోందని, రేషన్ కార్డుల్లో పిల్లలు ఉన్నప్పటికీ పెండ్లిళ్లు అయ్యాయా..! అని ప్రశ్నించడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరికి సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఎంపీడీవో కలుగజేసుకుని శాంతిపజేశారు. ఆసరా పథకం కింద అర్హులైన వారికి పింఛన్లు అందలేదని బోరుునపల్లి మండలం తడగొండ, బూర్గుపల్లి గ్రామాల్లో ఆందోళన చేశారు. తడగొండలో సర్పంచ్ కట్ట కనుకమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు కట్ట భాగ్య, పంచాయతీ కార్యదర్శి అనిల్‌ను గంటసేపు పంచాయితీ కార్యాలయంలో నిర్భందించారు. ఎస్సై రాజేశ్వరరావు, ఏఎస్సై చల్ల వెంకట్రాజం వెళ్లి సముదాయించారు. అర్హులకు పింఛన్లు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. -
మళ్లీ ‘హొగ్నెకల్’ రచ్చ
తమిళనాడుతో కయ్యానికి కర్ణాటక మళ్లీ కాలువు దువ్వతోంది. సమసిన హొగ్నెకల్ సరిహద్దు వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చే పనిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పడ్డారు. హొగ్నెకల్ తమదేనని, దీనిపై రీ సర్వే చేయాలని కేంద్రాన్ని కోరుతామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కల్పిస్తున్నాయి. సాక్షి, చెన్నై : తమిళనాడు-కర్ణాటకల మధ్య వివాదాల కు కొదవ లేదు. అందులో ప్రధానమైనవి కావే రి నదీ జలాల సమస్య, హొగ్నెకల్ సరిహద్దు వ్యవహారమే. కావేరి వివాదంలో తమిళనాడుకు అనుకూలంగా తీర్పు రావడంతో అగ్గిమీద గుగ్గిలంలా కర్ణాటక ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కావేరి జలాల్ని అడ్డుకునే విధంగా తమ రాష్ట్రంలో రెండు డ్యాంల నిర్మాణానికి కసరత్తులు వేగవంతం చేసింది. ఈ వివాదం ఓ వైపు ఉంటే, మరో వివాదంగా సమసిన హొగ్నెకల్ సరిహద్దు రచ్చను మళ్లీ తెర మీదకు తెచ్చే పనిలో పడింది. 2006లో మొదలు కావేరి నదీ తీరంలో ధర్మపురి జిల్లాలో ఉన్న భారత నయాగరగా పేరెన్నిక గన్న హొగ్నెకల్ జలపాతంపై పూర్తి హక్కుల్ని తమిళనాడు కలిగి ఉంది. కావేరి నదీ తీరాన్ని పరిగణనలోకి తీసుకుని 1998లో అటు కర్ణాటకలో బెంగళూరు తాగునీటి పథకానికి, ఇటు తమిళనాట హొగ్నెకల్ ఉమ్మడి తాగు నీటి పథకానికి చర్యలు చేపట్టారు. 2006లో ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల దాహార్తిని తీర్చే రీతిలో హొగ్నెకల్ పథకానికి శ్రీకారం చుట్టడంతో వివాదం మొదలైంది. హొగ్నెకల్ తమ రాష్ట్రానికి చెందిదంటూ వివాదానికి తెర మీదకు తీసుకురావడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. హొగ్నెకల్ తమదంటే, తమదంటూ రెండు రాష్ట్రాలు వాదులాడుకున్నాయి. చివరకు తమిళనాడు, కర్ణాటక అటవీ శాఖ, నీటి పారుదల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. సరిహద్దు వ్యవహారాన్ని తేల్చుకు నే పనిలో పడ్డారు. బ్రిటీషు పాలకుల హయూం లో రూపకల్పన చేసిన శాసనాల మేరకు సర్వేలు నిర్వహించారు. ఎట్టకేలకు ఈ సర్వేలో హొగ్నెకల్ తమిళనాడుకే చెందుతుందని తేల్చారు. మళ్లీ తెరపైకి... తాజాగా సరిహద్దు చర్చను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు క ర్ణాటక పావులు కదుపుతోంది. కర్ణాటకలో సాగుతున్న డ్యాం నిర్మాణ కసరత్తుల వ్యవహారాన్ని దారి మళ్లించే విధంగా హొగ్నెకల్ వివాదాన్ని మళ్లీ తెర మీదకు తెచ్చే పనిలో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య పడ్డట్టున్నారు. మీడియాతో మాట్లాడే క్రమంలో ఆయన హొగ్నెకల్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. హొగ్నెకల్ కర్ణాటక భూ భాగమేనని, సర్వేలు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉందని వ్యాఖ్యానించారు. రీసర్వేకు పట్టుబడుతూ కేంద్రాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు. ఇది కాస్త ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లోని తమిళ సంఘాల్లో, అన్నదాతల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. మళ్లీ ఉత్కంఠ సమసి పోయిన వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి తమిళుల మనోభావాలతో చెలగాటం ఆడేం దుకు యత్నిస్తున్న కర్ణాటక చర్యల్ని ఎండగట్టేందుకు ఇక్కడి రాజకీయ పక్షాలూ సమాయత్తం అవుతోన్నాయి. దీంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో మళ్లీ ఎక్కడ ఉద్రిక్తత రేగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
ధర్మపురిలో ఘనంగా గోదావరి మహాహారతి
కరీంనగర్: ధర్మపురిలో ఘనంగా గోదావరి మహాహారతి నిర్వహించారు. బీజేపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆధ్వర్యంలో జరిగిన మహాహారతిలో వాసుదేవానంద సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరి హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్ కూడా అయిన మురళీధర్ రావు మాట్లాడుతూ గ్రామీణ పేదరికాన్ని తొలగించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా గోదావరి హారతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదావరి పవిత్రతను కాపాడటం, జీవనదిగా ఉంచుకోవడం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. గోదావరి తీరాన వెలసిన దేవాలయాలను స్నానఘట్టాలను పునరుద్ధరిస్తామన్నారు. ** -
చంద్రయ్య కేసుపై సీఐడీ
జిల్లాలో సంచలనం సృష్టించిన కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో అనుమానాస్పద మృతి ఘటనపై ఇన్నాళ్లకు డొంక కదులుతోంది. సీఐడీ అధికారులు మూడురోజులుగా విచారణ జరుపుతుండడంతో సంఘటనకు సంబంధమున్న పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే మృతుడు సాన చంద్రయ్య తల్లిదండ్రులను విచారించి వారితోపాటు పలువురి స్టేట్మెంట్లు రికార్డు చేసినట్లు సమాచారం. కరీంనగర్ క్రైం : ధర్మపురి సహకార బ్యాంకులో 2013 డిసెంబర్ 21న జరిగిన చోరీలో 1,345 గ్రాముల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీకి గురైంది. జనవరి 18న రాత్రి ధర్మపురి మండలం బుగ్గారానికి చెందిన సాన చంద్రయ్య(27) ఉరఫ్ చందు, దశరథ పూర్ణ, మేడిపల్లి మండలానికి చెందిన భూమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరునాడు(జనవరి 19న) రాత్రి 9.45 గంటలకు పోలీస్‌స్టేషన్ భవనంపై నుంచి కిందపడి రక్తపుగాయాలతో చంద్రయ్య కనిపించాడు. వెంటనే దర్మపురి ఎస్సై ఆధ్వర్యంలో చంద్రయ్యను కోరుట్లలోని ఓ ఆస్పత్రికి తరలించి, అక్కడినుంచి కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే అతడు చనిపోయాడు. వెంటనే స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు పలు రకాల కథనాలు చెప్పి సిబ్బందిని వెనకేసుకువచ్చారనే ఆరోపణలున్నాయి. చంద్రయ్యపై ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఈ సమయంలోనే చంద్రయ్య మృతి చెందాడని మానవహక్కుల సంఘం నేతలు ఆరోపించారు. మరో పక్క చంద్రయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు ఇది ప్రమాదం కాదని... జరగరానిది ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసినా అధికారులు స్పందించలేదు. సీన్ ఆఫ్ అఫెన్స్‌ను పట్టించుకోలేదు. ఘటన ఎక్కడ జరిగిందో అక్కడ ఉండే ఎస్‌హెచ్‌వో, సీఐలు బాధ్యత వహించాల్సి ఉంటుందని నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నా.. మరోపక్క ఎమ్మెల్యేలు, ప్రజలు రోడ్డెక్కి ధర్నాలు చేసినా పట్టించుకున్న ఉన్నతాధికారి లేరు. కంటితుడుపు చర్యగా సిరిసిల్ల డీఎస్పీ నర్సయ్యను, శాఖాపర విచారణకు పరిపాలన ఎస్పీ జనార్దన్‌రెడ్డిని విచారణాధికారులుగా నియమించి చేతులు దులుపుకున్నారు. సంఘటన జరిగిన వారం రోజులకు ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్న పోలీసు అధికారులకు ఉత్తమ సేవా అవార్డులు ఇచ్చి సన్మానించగా... చంద్రయ్య కుటుంబానికి మాత్రం ఏ న్యాయం చేయలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధర్మపురి సీఐ, ఎస్సై జగన్మోహన్ను సాధారణ బదిలీల్లో బదిలీ చేశారే తప్ప ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నది లేదు. మిగతావారు మాత్రం ఇప్పటికీ అక్కడే విధుల్లో కొనసాగుతున్నారు. ఈ విషయమై ప్రజలు, మానవహక్కుల సంఘం నాయకులు ఆందోళనలు చేసినా ఉన్నతాధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ఈ ఘటన తర్వాత కొన్నాళ్లకు కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు వేధిస్తున్నారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వీటితోపాటు సివిల్ సెటిల్మెంట్లలోనూ పోలీసులు వేధిస్తున్నారని పలువురు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నివేదికలేమయ్యాయో.. బ్యాంకు చోరీ కేసులో అనుమానితులైన చంద్రయ్య, పూర్ణ, భూమేశ్లపై కేసు నమోదు చేసి వారి నుంచి 25 గ్రాముల బంగారం రికవరీ చేశారు. అయితే చంద్రయ్య మృతిపై విచారణాధికారులు అసలు నివేదిక ఇచ్చారా? వాటిపై తీసుకున్న చర్యలేంటి? అనే విషయాలపై ఏ స్పష్టతా లేదు. చంద్రయ్య మృతిపై అప్పటి ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, విద్యాసాగర్‌రావు, సీహెచ్ విజయరమణారావు అసెంబ్లీలో లేవనెత్తుతామని పేర్కొన్నా.. తర్వాత విషయమే మరిచిపోయారు. వీరిలో కొందరు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నా.. ఆ ఊసే ఎత్తడం లేదు. ఆదుకుంటామని, ఆర్థికసాయం చేస్తామని చెప్పిన అధికారులు మళ్లీ అటువైపు తొంగి కూడా చూడలేదు. విచారణతో గుబులు సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పుడు సీఐడీ అధికారులు విచారణ మొదలెట్టడంతో ఘటనకు సంబంధం ఉన్న పోలీసు అధికారుల్లో గుబులు మొదలైంది. విచారణ నిర్వహించి న్యాయం చేయాలని చంద్రయ్య తల్లిదండ్రులతోపాటు మానవహక్కుల సంఘం నాయకులు పలుమార్లు మానవహక్కుల కమిషన్‌కు, ఇతర చోట్ల ఫిర్యాదు చేశారు. దీంతో పూర్తిస్థాయిలో విచారించి నివేదిక అందజేయాలని సీఐడీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సదరు అధికారులు మూడు రోజులుగా ధర్మపురితోపాటు కోరుట్లలో విచారణ చేస్తున్నారు. చంద్రయ్య తల్లిదండ్రులైన నారాయణ-శంకరమ్మను కరీంనగర్ పిలిపించి విచారించి, పలువురి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారని సమాచారం. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. -
భూరగడ
ధర్మపురి : అధికారుల నిర్లక్ష్యంతో అటవీ గ్రామాల్లో భూసంబంధమైన వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. అసైన్మెంట్, అటవీ భూములకు ఎలాంటి హద్దులు నిర్ణయించకపోవడంతో గిరిజనులు ఎవరికి వారు భూములు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. ఈక్రమంలో భూమి తమదంటే తమదని దాడులు చేసుకుంటున్నారు. ఇదే కోవలో గురువారం మండలంలోని తుమ్మెనాలలో 564 కంపార్టుమెంటులో సుమారు 50ఎకరాల అటవీ భూమి తమదంటే తమదని తుమ్మెనాలవాసులు, పెద్దనక్కలపేట పరిధిలోని బోదరగూడానికి చెందిన గిరిజనులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. ఫారెస్టు సెక్షన్ అధికారి బాపురాజు, సర్వేయర్ చంద్రయ్య రెండు గ్రామాలకు హద్దులు నిర్ణయిస్తుండగా వివాదం చెలరేగింది. సదరు భూమిలో బోదరగూడానికి చెందిన గిరిజనులు మూడు రోజులుగా చెట్టు నరుకుతూ సాగుకు యోగ్యంగా మలుచుకుంటున్నారు. ఇందుకు తుమ్మెనాలవాసులు అభ్యంతరం చెబుతున్నారు. ఆభూమి గ్రామ పరిధిలోనే ఉందని, గ్రామస్తులకే చెందాలని పట్టుబడుతూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వేయర్ వచ్చి హద్దులు నిర్ణయిస్తుండగా బోదరగూడెం గిరిజనులు వచ్చి అడ్డుకున్నారు. తుమ్మెనాలవాసులు కూడా ఎదురు తిరిగారు. ఒకరినొకరు తోసేసుకున్నారు. పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో బోదరగూడానికి చెందిన తట్ల శంకర్, తట్ల నర్సవ్వ, తుమ్మెనాలకు చెందిన రేని మల్లవ్వ తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అంతకు ముందే కొందరు గిరిజనలు పోలీసులకు సమస్య వివరించడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడినవారిని జగిత్యాలలోని ఆసుపత్రికి తరలించారు. అటవీ భూములు తమకే చెందాలని గిరిజనలు, తుమ్మెనాలకే చెందాలని వీఎస్ఎస్ చైర్మన్ పద్మాకర్, ఉపాధ్యక్షుడు మల్లేశం పట్టుబట్టారు. -
ఎక్కడి నుంచి పోటీ చేయాలో అధిష్టానమే నిర్ణయిస్తుంది
ధర్మపురి: సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయాలా.. లేక టీడీపీ తరఫున ప్రచారం చేయాలా అనే విషయాన్ని పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తెలిపారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల తన 98వ చిత్రం ‘లెజెండ్’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా మళ్లీ పుణ్యక్షేత్రాలను దర్శించుకొంటున్నానని తెలిపారు. ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని విలేకరులు అడుగగా.. నేను పోటీ చేయాలా.. చేస్తే ఎక్కడినుంచి.. లేక పార్టీ ప్రచారానికే అంకితం కావాలా.. అనే విషయాలను అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని చెప్పారు. చంద్రబాబు తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణలను ప్రస్తావించగా.. నో పాలిటిక్స్.. నేను వ్యక్తిగతంగానే వచ్చాను తప్ప రాజకీయంగా రాలేదని బదులిచ్చారు. ఆయనవెంట దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రామ్ ఆచంట, కెమెరామన్ రాంప్రసాద్ ఉన్నారు. -
చంద్రబాబు బోగస్ మాటలు నమ్మొద్దు
ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో వై.విశ్వేశ్వరరెడ్డి ధర్మపురి (వజ్రకరూరు),న్యూస్‌లైన్ : అధికార దాహంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇస్తున్న బోగస్ హామీలను నమ్మవద్దని ఉరవకొండ నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ప్రజలకు సూచించారు. ధర్మపురి, చిన్నహోతురు, పొట్టిపాడు, గూళ్యపాళ్యం, వజ్రకరూరు గ్రామాల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈయన వెంట ఆయా గ్రామాల్లో ఎంపీటీసీ అభ్యర్థులు నారాయణప్ప, దేవేంద్ర, రవికుమార్, రజియాబేగం, వెంకటేశ్ నాయక్, జెడ్పీటీసీ అభ్యర్థి నంచర్ల ఇందిరమ్మ ఇంటింటా ప్రచారం చేశారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు. ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పుకోలేని ఆ పార్టీ నాయకులు పచ్చకండువాలు వేసుకుంటున్నారన్నారు. దీంతో టీడీపీ బలపడినట్లు ఆ పార్టీ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని, ఎన్నికల తర్వాత చంద్రబాబు దిమ్మతిరుగుతుందన్నారు. వైఎ స్సార్సీపీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. విజన్ 2020 అం టూ చంద్రబాబునాయుడు నగరాలకే పరిమితమై పల్లెలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో గ్రామీణాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని ఆయన గుర్తుచేశారు. ఆయన అందించిన సంక్షేమ పాలన తిరిగి రావాలంటే అది జగన్మోహన్రెడ్డి వల్లనే సాధ్యమన్నారు. పార్టీ ఫ్యాను గుర్తుకు ఓటువేసి ఆయనకు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, తాలుకా కమిటీ సభ్యులు శైలజారాజశేఖరరెడ్డి, వెంకటరెడ్డి, నారాయణరెడ్డి, స్టీరింగ్ కమిటీసభ్యులు లాయర్ ఉమాపతి, మండల పార్టీ కన్వీనర్లు జ యేంద్రరెడ్డి, భూమాకమలారెడ్డి, మండల నాయకులు భరత్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, చలపతి, ఉమాపతి, మహానందరెడ్డి, కిశోర్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ధర్మపురి సహకార బ్యాంకులో భారీ చోరీ
కరీంనగర్ జిల్లా ధర్మపురి సహకార బ్యాంకులో గత అర్థరాత్రి భారీ చోరీ చోటు చేసుకుంది. బ్యాంక్ లాకర్ల నుంచి రూ.23 లక్షల విలువైన బంగారు నగలు మాయమైనాయి. అలాగే రూ. 2.68 లక్షల నగదును దొంగలు దోచుకుపోయారు. బ్యాంక్‌లో చోరీ జరిగిందని బ్యాంక్ అధికారులు బుధవార గుర్తించారు. దాంతో అధికారులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాంక్ లాకర్లతోపాటు చోరీ జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంక్ వద్ద భద్రత సిబ్బంది లేకపోవడం వల్లే చోరీ జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బ్యాంక్‌లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
నడక యాతన!
=కాలిబాటలు, పొలంగట్లే రహదారులు =నిధులున్నా రోడ్లు వేయని పంచాయతీరాజ్ =చాలా చోట్ల గుంతలుపడి దెబ్బతిన్న ఆర్అండ్బీ రోడ్లు =ప్యాచ్‌లే తప్ప శాశ్వత పనులు నిల్ =జిల్లాలో ఇదీ పరిస్థితి రాష్ట్ర రాజకీయాలను శాసించే అధినాయకులు మన జిల్లాలోనే ఉన్నారు. ఒకరు తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రని పోషిస్తున్నారు. ఇంకొకరు మూడేళ్లకుపైగా సీఎం పదవిని పట్టుకుని ఊగిసలాడుతున్నారు. వీరిలో ఒక్కరూ తమ సొంత జిల్లాలోని రోడ్ల దుస్థితిపైన దృష్టి పెట్టలేదు. గుంతలు పడి.. రాళ్లుతేలి.. నడవడానికి వీలులేని స్థితికి చేరినా కన్నెత్తి చూసేవారే కరువయ్యారు. అక్కడక్కడా నిధులున్నా అధికారుల నిర్లక్ష్యంతో అవి మురిగిపోతున్నాయి. గ్రామీణ రోడ్ల దుస్థితిపై శుక్రవారం సమరసాక్షి ప్రత్యేక కథనం.. సాక్షి, చిత్తూరు : జిల్లాలోని రోడ్లు నరకానికి నకళ్లుగా మారా యి. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా పట్టించుకునే వారే లేకుండాపోయారు. కుప్పం నియోజకవర్గంలో 465 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఇందులో కుప్పం నుంచి కేజీఎఫ్‌కు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. కృష్ణగిరి-కుప్పం రోడ్డు గుంతలమయంగా మారింది. వంద వసంతాల ఉత్సవాలు నిర్వహించిన నిధులతోనే మరమ్మతులు చేస్తున్నా రు. ప్రత్యేకంగా బడ్జెట్ లేదు. పంచాయతీరాజ్ రోడ్లు గుంతలు పడి, కంకరతేలిపోయాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 25 గ్రామాలకు పూర్తిగా రోడ్డు సౌకర్యం లేదు. గత అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు ఆర్‌అండ్‌బీరోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు కోతకు గురయ్యాయి. బి.కొత్తకోట జాతీయ రహదారి అమరనారాయణపురం క్రాస్ నుంచి తుమ్మనంగుంట వరకు గుంతలు పడి పోయింది. పలమనేరు నియోజకవర్గ పరిధిలో 481 కిలోమీటర్ల ఆర్అండ్బీ రాష్ట్ర రహదారులు, 60 కి.మీ మేర పీఆర్ రోడ్లు ఉన్నాయి. వీటిల్లో మూలతిమ్మేపల్లె నుంచి తప్పిడిపల్లె వరకు, ధర్మపురి నుంచి వెంకటాపురం, గంగవరం కేసీపెంట నుంచి అప్పిశెట్టిపల్లె, గాంధీనగర్, పెద్దపంజాణి మండలంలోని లింగమనాయునిపల్లె, నాగిరెడ్డిపల్లె, గుండ్లం వారిపల్లె, పలమనేరు మండలంలో జగమర్ల యానదికాలనీ రోడ్లు దుస్థితికి చేరాయి. 90 పంచాయతీల్లో 33 చోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సత్యవేడు నియోజకవర్గంలో చెరివి, పీవీ.పురం, గొల్లపాళెం, చమర్తకండ్రిగ, సత్యవేడు - మాదరపాకం రోడ్లు దెబ్బతిన్నాయి. చెరివి రోడ్డు ఆరు కిలోమీటర్ల మేర శ్రీసిటీ సెజ్‌లో ఉంది. ఈ రోడ్డు నిర్వహణను ఆర్అండ్బీ గాలికొదిలేసింది. పీవీ.పురం రోడ్డు క్వారీ వాహనాల తాకిడికి ధ్వంసమైంది. పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు నిధులు రాకపోవడంతో గుంతలు పడినా పూడ్చే పరిస్థితి లేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 14 గ్రామాలకు రోడ్లు లేవు. చెరువుకట్టలు, బండ్లబాటల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని గ్రామాలకు పొలంగట్లే రహదారులు. పంచాయతీ రాజ్రోడ్లకు నామమాత్రంగా గుంతలు పూడ్చడం మినహా, శాశ్వత పనులు చేయడం లేదు. బీఆర్జీఎఫ్ నిధులతోనైనా మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నగరి నియోజకవర్గం పుత్తూరు మండలంలో అక్కెరి దళితవాడ, వేణుగోపాలపురం రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రామచంద్ర ఎస్టీ కాలనీకి రోడ్డు సౌకర్యమే లేదు. చెరువు కట్టపై రాకపోకలు సాగిస్తున్నారు. నగరి మండలంలో దువ్వూరు సుబ్బారెడ్డి కండ్రిగకు రోడ్డే వేయలేదు. కాసావేడు ఎస్టీ కాలనీకీ అదే పరిస్థితి. కృష్ణారామాపురం వద్ద రోడ్డు గతులమయమైంది. చెరుకు లారీలు, ట్రాక్టర్లతో రోడ్డు ధ్వంసమైంది. చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి మండలం గంగుడుపల్లె రోడ్డు, అనుప్పల్లెకు వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చంద్రగిరి ఇందిరమ్మకాలనీ, మల్లయ్యగారిపల్లె, రాయలపురం గ్రామాలకు రోడ్లు అంతంతమాత్రమే. మదనపల్లె మండలంలోని 16 పంచాయతీల్లో 384 పల్లెలు ఉంటే, 150 గ్రామాలకు కేవలం కాలిబాటలే దిక్కు. ఐదేళ్లుగా పీఆర్ నిధులున్నా ఖర్చుచేయని పరిస్థితి. చిన్నాచితకా రోడ్ల ప్యాచ్పనులనూ పట్టించుకునేవారే లేకుండా పోయారు. 61 రోడ్లు ఉంటే వీటిల్లో జాతీయ రహదారులూ గుంతలు పడిపోయాయి. మేకలవారిపల్లె, మిట్టామర్రి, మేడిపల్లె, ఆవులపల్లె గ్రామస్తులు శ్రమదానంతో రోడ్లు నిర్మించుకున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో బాలగంగనపల్లె, పెనూమూరు మండలంలో సామిరెడ్డిపల్లె ఎగువ దళితవాడ, రామాపురం గ్రామాలకు రోడ్లు లేవు. సామిరెడ్డిపల్లె దళితవాడకు చెరువులో నుంచి వెళ్లాలి. వర్షాలుకు నీళ్లొస్తే ఆ గ్రామంతో సంబంధాలు తెగిపోయినట్టే. వెదురుకుప్పం మండలం మాంబేడుకు రోడ్డే లేదు. -
ఘోర రోడ్డు ప్రమాదం
ధర్మపురి (హొసూరు), న్యూస్‌లైన్: తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవంలో పాల్గొని తిరిగి వస్త్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ధర్మపురి జి ల్లాలోని గెట్టూరు గ్రామానికి చెందిన కార్తి (30) తమ ఊరి సమీపంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈయన తన స్నేహితులైన మణి, మైఖేల్‌రాజ్, కత్తాన్దురై, గోవిందసామి, రాము, అరవళన్, హంసరాజ్తో కలసి శనివారం తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవానికి వెళ్లారు. ఆదివారం కార్తీక పౌర్ణమి కావడంతో అరుణాచలేశ్వరస్వామిని సందర్శించుకుని సో మవారం ఉదయం తిరువణ్ణామలై నుంచి వ్యాన్‌లో త మ గ్రామానికి బయలుదేరారు. కడత్తూరు సమీపంలో ని వడసలపట్టి వద్ద సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ఎదురుగా సిమెంట్ లోడ్‌తో వస్తున్న లా రీని వారి వాహనాన్ని ఢీకొంది. దీంతో వ్యాన్ ముందు భాగం నుజ్జనుజ్జయిపోయింది. ఈ ప్రమాదంలో మ ణి (39), కార్తి (30) డ్రైవర్ అరివళన్ (35), మైఖేల్‌రాజ్ (40) సంఘటనా స్థలంలోనే ప్రాణాలను కోల్పోయారు. స్థానికులు వచ్చి వ్యాన్‌లో చిక్కుకుపోయి, మృత్యువుతో పోరాడుతున్న వారిని కాపాడటానికి ప్ర యత్నించారు. అదే సమయంలో రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనాలచోదకులు వారిని బయటకు లాగేం దుకు సహకారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వ్యాన్‌లో చిక్కుకుపోయిన ఐదుగురిని 108 అంబులెన్స్‌లో ధర్మపురి ప్ర భుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన కొన్ని నిమిషాలకే హంసరాజ్ (25) మరణించారు. కత్తాన్ దురై, గోవిందస్వామి, రాములకు వైద్యం అందిస్తున్నా రు. వీరిలో కత్తాన్దురై పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన ఐదుగురిని శవ పరీక్ష నిమిత్తం అదే ఆస్పత్రిలో ఉంచారు. లారీ డ్రైవర్ ఎం.జి.ఆర్‌ను అరెస్టు చేశారు. వాహనాలు ఢీకొనడంతో రాకపోకలు స్తంభించిపోయూరుు. పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృత్యువులోనూ విడదీయని బంధం తిరువణ్ణామలై వెళ్లి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కో ల్పోయిన ఐదుగురు ప్రాణ స్నేహితులు, ప్రతి ఏటా తి రువణ్ణామలై వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం వారి సంప్రదాయం. కానీ ఈ ఏడు జరిగిన దుర్ఘటనలో ఐదుగురు ఒక్కసారిగా మృత్యువాత పడడం ఆ గ్రామ ప్రజలను విషాదంలో ముంచివేసింది. మమ్మల్ని ఆదుకోండి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కార్తి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చిన కలె క్టర్‌ను వేడుకున్నారు. కార్తికి 11 నెలల క్రితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ఇతడిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు దిక్కులేకుండా పోయింది. -
చెన్నైలో తెలుగు సంఫూల సమైక్యహొరు
-
మృతదేహాన్ని భద్రపరచండి