శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం | Car Collided With Lorry In Shameerpet | Sakshi
Sakshi News home page

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Fri, May 4 2018 7:33 AM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

Car Collided With Lorry In Shameerpet - Sakshi

ప్రమాద స్థలం వద్ద కారు

మేడ్చల్ జిల్లా :  శామీర్ పేట మండలం తుర్కపల్లి గ్రామ సమీపంలో రాజీవ్ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్‌ జిల్లా ధర్మపురి నుంచి శంషాబాదు ఎయిర్‌ పోర్టుకు వెళ్తున్న సమయంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సత్తవ్వ(35) , శ్రావణ్(10) , షాలిని(12)తో డ్రైవర్‌ రాజ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.

సత్తవ్వ భర్త ఖతార్ నుంచి ఇండియాకు వస్తుండటంతో ఆయనకు కుటుంబసభ్యులు స్వదేశీ ఆహ్వానం పలికేందుకు  ఎయిర్‌ పోర్టుకు బయలు దేరారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అందరూ చనిపోవడంతో బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement