
సాక్షి, చిత్తూరు జిల్లా: పలమనేరు మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో గిరి గౌడ్ (80) మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని కర్ణాటకలోని ఉనసూర్ ఎక్సైజ్ డీఎస్పీ తండ్రిగా గుర్తించారు.
డీఎస్పీ తల్లి తీవ్రంగా గాయపడగా, డీఎస్పీ విజయకుమార్‌కు రెండు కాళ్లు విరిగాయి. చికిత్స నిమిత్తం వారిని జాలప్ప ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి ఎక్సైజ్ సీఐ లోకేష్ బయటపడ్డారు.
చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. వెలుగులోకి అసలు నిజాలు?