palamaner
-
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
-
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
-
చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
చిత్తూరు జిల్లా, సాక్షి: ‘‘ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్.. జగన్‌కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపు.. పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం పలమనేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందన్నారు.‘‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. రూ.2 లక్షల 70వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించాం. 59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. పిల్లల చదువులు కోసం అమ్మఒడితో ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం’’ అని సీఎం జగన్ చెప్పారు‘‘రైతన్నల కోసం ఆర్బీకే వ్యవస్థ పనిచేస్తోంది. ఏ గ్రామానికి వెళ్లిన గ్రామ సచివాలయం కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?. మన ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎప్పుడైనా ఇచ్చారా అని అడుగుతున్నా.. 14 ఏళ్లు సీఎంగా చేశాను అంటాడు చంద్రబాబు. ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు అబద్దాలు, మోసాలతో వస్తున్నాడు’’ అని సీఎం జగన్ దుయ్యబట్టారు.‘‘రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?. అర్హులకు 3 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా?. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?. సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చడా?. మళ్లీ ఈ మోసగాళ్లు సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నారు. కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తాననంటారు.. నమ్ముతారా?’’ అంటూ చంద్రబాబు మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు.ప్రత్యేకహోదాను అమ్మేసిన బాబు లాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా?• మోసగాళ్లతో మనం యుద్ధం చేస్తున్నాం• కొత్త హామీలతో మోసం చేసేందుకు మళ్లీ ముగ్గురు కలిసి వస్తున్నారు• 14 ఏళ్లపాటు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మంచైనా చేశాడా?• అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు, మోసాలు• అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు చంద్రముఖి మారిపోతాడు• బాబు తన హయాంలో పేద ప్రజలకు ఒక్క సెంటు భూమైనా ఇచ్చాడా? • ఈ 59 నెలల పాలనలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం• మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశాం• మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి 99 శాతం అమలు చేశాం• 59 నెలల పాలనలో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ• ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి• చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే• మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది• గ్రామ సచివాలయాల్లో ప్రజలకు 600 రకాల సేవలు అందుతున్నాయి• వర్షం రూపంలో దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తున్నారని భావిస్తున్నా -
వైఎస్సార్సీపీలోకి చేరిన పలమనేరు టీడీపీ నేత
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ నేత ఆర్వీ సుభాష్ చంద్రబోష్ వైఎస్సార్సీపీలో చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన ఆర్వీ సుభాష్ చంద్రబోస్ శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి జాయిన్ అయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి ఆర్వీ సుభాష్ చంద్రబోస్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్జే భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ పాల్గొన్నారు. చదవండి: ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు -
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డీఎస్పీ తండ్రి మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: పలమనేరు మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో గిరి గౌడ్ (80) మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని కర్ణాటకలోని ఉనసూర్ ఎక్సైజ్ డీఎస్పీ తండ్రిగా గుర్తించారు. డీఎస్పీ తల్లి తీవ్రంగా గాయపడగా, డీఎస్పీ విజయకుమార్‌కు రెండు కాళ్లు విరిగాయి. చికిత్స నిమిత్తం వారిని జాలప్ప ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి ఎక్సైజ్ సీఐ లోకేష్ బయటపడ్డారు. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. వెలుగులోకి అసలు నిజాలు? -
TDP Drama: ఛీ..ఛీ.. మరీ ఇంత అన్యాయమా!
సాక్షి, చిత్తూరు(పలమనేరు): టీడీపీ నాయకులు గురువారం మున్సిపాలిటీలోని గొబ్బిళ్లకోటూరుకు చెందిన ఇద్దరు దివ్యాంగులు, వారి తల్లిని పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయానికి పిలిపించి, వారితో అయ్యా.. తమకు పింఛన్ రాలేదని చెప్పించి, డ్రామా ఆడించి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కానీ ఇదంతా ఒట్టి డ్రామానేనని అధికారులు తేల్చారు. ఆ నిజాన్ని మళ్లీ సోషల్ మీడియాలో పెట్టి, నిరూపించారు. ఈ సంఘటన గురువారం పలమనేరులో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పచ్చినిజాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీలోని గొబ్బిళ్లకోటూరుకు చెందిన వీరమ్మ(55)కు వితంతు పింఛను ప్రతినెలా రూ.2750, ఈమె కుమారులైన శంకరయ్య(25), లక్ష్మీనారాయణ(24)కు దివ్యాంగ పింఛన్లుగా ఒక్కొక్కరికి రూ.3 వేలు మొత్తం రూ.8,750 ప్రతినెలా అందుతోంది. ఈ నేపథ్యంలో పింఛన్ల సామాజిక తనిఖీలో భాగంగా గతనెల 27న గంటావూరు సచివాలయ అధికారి జలంధర్, వెల్ఫేర్ సెక్రటరీ శివకుమార్ వారికి సిక్స్‌స్టెప్ వ్యాలిడేషన్ ఫారాలను ఇచ్చారు. గత నెల 28న వారి ఇంటిని కొలచి, రికార్డులోకి ఎక్కించారు. నిబంధనల మేరకు ఇల్లు ఉండడంతో పింఛన్లుకు అర్హులేనంటూ ఆన్లైన్లో వారికి పెన్షన్ మంజూరు చేశారు. చదవండి: (నువ్వు గెలవలేవు.. నన్ను ఓడించలేవు) ఈనెల ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే ఆ వార్డు వలంటీర్ సింధు, అక్కడి పంచాయతీ కన్వీనర్లు, అధికారులు, సచివాలయ సిబ్బందితో కలసి ఆ కుటుంబంలోని ముగ్గురికి పింఛన్లను అందజేశారు. ఇందుకు సంబంధించి వారు సంతకాలు చేశారు. అయితే వారిని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఇకపై మీకు పింఛన్లు రావని బెదిరించినట్టు తెలిసింది. పింఛన్లు నమ్ముకుని బతికే తమకు వచ్చేనెల పింఛన్లు రావేమోనని వారు టీడీపీ నాయకులు సూచనలతో పట్టణంలోని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఇంటి ముందు ఆర్తనాదాలు చేస్తూ వెళ్లి తమ కుటుంబంలో అందరికీ పింఛన్లు తొలగించారని చెప్పడం, ముందుగానే పథకం పన్నిన టీడీపీ నేతలు ఆ సంఘటనను వీడియో తీసి, సోషల్ మీడియా వైరల్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు, అక్కడి కౌన్సిలర్లు రవి, కన్వీనర్ జాఫర్ అక్కడకు వెళ్లి వాస్తవాలను మళ్లీ వారినోటే చెప్పించారు. వారు పింఛను తీసుకున్నట్టు ఆధారాలను సోషల్ మీడియాలో పెట్టారు. ప్రభుత్వం అర్హులకు పింఛన్లులిస్తున్నా తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా టీడీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేస్తామని అధికారులు తెలిపారు. ఏదేమైనా టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై జనం అసహ్యహించుకుంటున్నారు. -
ఉధృతంగా కైగల్ జలపాతం.. అజాగ్రత్తగా ఉంటే అంతే..
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమపనేరు నియోజకవర్గంలోని కైగల్ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కైగల్ నది ప్రవహించి బైరెడ్డిపల్లె మండలంలో హోరెత్తుతోంది. దీంతో పర్యాటకులు కైగల్ జలపాతాన్ని తిలకించేందుకు తరలివస్తున్నారు. వరుసగా మూడేళ్లపాటు నది ప్రవహిస్తుండడంతో రాళ్లు చాలా నునుపుగా మారి పాచిపట్టాయి. అడుగు పెడితే ఎప్పుడు జారుతుందో తెలియదు. కైగల్ వాటర్‌ఫాల్స్‌లోని మృత్యుకోనలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. ఇక్కడ నీరు గుండ్రంగా చుట్టుకుంటూ వెళ్లి ఓ రాతి గుహలోకి చేరుతోంది. ఇందులో పడిన వ్యక్తి ఈత వచ్చినా పైకి రావడం కష్టమే. మొన్నటిదాకా కైగల్ జలపాతంలోకి పర్యాటకులు వెళ్లకుండా బైరెడ్డిపల్లె పోలీసులు నిషేధం విధించారు. కానీ అడవిలో పలు మార్గాల నుంచి పర్యాటకులు జలపాతం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ జాగ్రత్తగా లేకపోతే విహారం కాస్తా విషాదంగా మారిపోతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. (క్లిక్: మగవాళ్లకు మాత్రమే.. ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే?) -
ఎమ్మెల్యేగా విశేష సేవలు.. సెంటు భూమి, ఇల్లు కూడా లేని నేత
స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆయన భావాలు చీకటిలో చిరుదివ్వెలు. మనం ఏమి చేశామని కాకుండా.. మనకు ఏమి లాభం అని ఆలోచించే మనుషుల్లో, స్వాతంత్య్ర పోరాటంలో తనవంతు పాత్ర పోషించి చిల్లిగవ్వ ఆశించని మహానుభావుడు. దేశం కోసం పక్కనపెడితే.. ఊరికి కాస్త మంచి చేసినా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ అడుగడుగునా కనిపిస్తున్న పరిస్థితుల్లో.. ఆయన మిగుల్చుకుంది నాలుగు జతల బట్టలు మాత్రమే. భూమి ఇస్తామన్నా.. ఇల్లు తీసుకోమన్నా.. తృణప్రాయంగా తిరస్కరించిన ఆ దేశభక్తుడు ప్రజల గుండెల్లో తనపేరు చిరస్థాయిగా ఉంటే చాలని కోరుకోవడం చూస్తే ఎలాంటి వారైనా ‘సెల్యూట్’ చేయాల్సిందే. అచ్చ తెలుగు భారతీయత ఉట్టిపడే పంచె, లాల్చీ ధరించిన.. వయస్సు శత వసంతాలు దాటిన ఆయనతో స్వాతంత్య్రోద్యమ మాట కలిపితే.. ఆ పోరాట పటిమ తూటాలా పేలుతుంది.. ఆ వయస్సులోనూ, ప్రతి మాటలోనూ ‘రాజ’సం ఉట్టిపడుతుంది.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తోంది.. భరతమాత ముద్దుబిడ్డగా ఆయన మనస్సు త్రివర్ణ శోభితమవుతోంది. పలమనేరు: ‘‘ప్రభుత్వం నుంచి ఏనాడు ఏమి ఆశించలేదు. ఇప్పుడు నాకు నాలుగు జతల బట్టలు తప్ప ఇంకేమీ లేవు అని స్వాతంత్య్ర సమరయోధులు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ చిన్న(టీసీ) రాజన్ వెల్లడించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ప్రాంతంలోని స్వాతంత్య్ర సమరయోధులు, మృతి చెందిన వారి సతీమణులను సన్మానించే కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు బుధవారం నిర్వహించారు. పలమనేరుకు చెందిన టీసీ రాజన్, దివంగత రామ్మూర్తి సతీమణి జయలక్షుమమ్మకు మేళతాళాలమధ్య ఘనస్వాగతం పలికి వారి అనుభవాలను ఆలకించి ఘనంగా సన్మానించారు. నాటి పరిస్థితులు ఆయన మాటల్లోనే.. నా వయస్సు ఇప్పుడు 104 ఏళ్లు మరో రెండు నెలల్లో 105లో పడతాను. చెవులు సరిగా వినపడవు, కంటిచూపు తగ్గింది. జిల్లాలో బతికున్న ఫ్రీడం ఫైటర్లలో బహుశా నేనే మిగిలానేమో. దేశానికి స్వాతంత్య్రం కోసం నాడు ఎందరో వీరులు పడిన కష్టాలను నేటి సమాజానికి తెలిసేలా ప్రభుత్వం చేస్తున్న మంచి పని ఇది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండేది. ఆపై కొన్ని పార్టీలొచ్చాయి. 1956లో రాజాజీ స్వతంత్ర పార్టీని స్థాపిస్తే అందులో రంగాను జాతీయ అధ్యక్షునిగా నియమించారు. నన్ను చిత్తూరు జిల్లా కార్యదర్శిని చేశారు. 1957లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెనాలిలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీచేసి రంగా ఓడిపోయారు. అనంతరం చిత్తూరు ఎంపీగా ఉన్న అనంతశయనం అయ్యంగార్ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బిహార్ గవర్నర్‌గా నియమించింది. దీంతో ఇక్కడి ఎంపీ స్థానానికి 1962లో ఎన్నిక వస్తే రంగాను స్వతంత్ర పార్టీ ఇక్కడ పోటీలో పెట్టింది. అప్పట్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి విశ్వనాథ రెడ్డిపై 19వేల మెజారిటీతో గెలిచారు. ఈ విజయానికి నేను చేసిన కృషికి మెచ్చి, 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ పలమనేరు అభ్యర్థిగా నన్ను నిలబెట్టింది. ఈ ఎన్నికలో నేను 9వేల మెజారిటీతో గెలిచాను. గ్రామాల్లో తిరిగాను గెలిచిన తరువాత నెలకు 15 రోజులు గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొన్నా. ఆ సమస్యలను అసెంబ్లీలో చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. రైతులు పండించిన బియ్యాన్ని రవాణా చేయకుండా బెల్ట్ ఏరియాగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలో ఆరేడు చెక్ పోస్టులుండేవి. ఈ సమస్యను అసెంబ్లీలో చర్చించి దాన్ని రద్దు చేయించా. పాలార్ బేసిన్ స్కీమ్ మేరకు నదులపై చెక్‌డ్యామ్‌లు నిషేధం పెట్టారు. దీనిపై పోరాటం సాగించా. ఆ పోరాటం వల్లే రాష్ట్రంలో నదులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు. దీనిపై అసెంబ్లీలో చర్చించి అన్ని గ్రామాల్లోనూ వెలుగులు నింపా. ఊరూరా పండగే జెండా పండగ వచ్చిందంటే ఊరు ముందు పచ్చతోరణాలను కట్టి జెండా ఎగురవేసే వాళ్లు. ఆ జెండా ఎగురవేయడం కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. జెండా ఎగురవేసి తరువాత నిర్వహించే సమావేశంలో గ్రామ పెద్దలు, స్వాతంత్య్రం కోసం పాటు పడిన వారు ప్రసంగిస్తుంటే వినేందుకు ఎగబడేవారు. అందరూ తెల్లటి దుస్తులను ధరించి కార్యక్రమానికి వచ్చేవారు. ఊరూరా జెండా పండుగ రోజు స్థానిక ప్రముఖులు, విద్యావేత్తలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేవారు. శాకాహారిని నేను పక్కా శాకాహారిని. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు భోజనంలో తీసుకుంటా. నేను ఇంత ఆరోగ్యంగా ఉండానంటే మా వంశంలోని జీన్స్ కారణమే. మా అక్క 108 ఏళ్లు బతికింది. మా అన్నలు 98 ఏళ్లు బతికారు. ప్రత్యేకంగా నేను ఆహారమేమీ తీసుకోనూ. అయితే మితంగా తింటాను. ప్రస్తుతం బెంగళూరులోని పటేల్ లేఅవుట్, వర్తూర్‌లో కుమారుడి వద్ద ఉంటున్నాను. ఈ దేశమే నాది అయినప్పుడు ఇక ఇల్లెందుకు, పొలమెందుకు.. నేను దేశం కోసమే పుట్టాను. దేశం కోసమే పోరాడాను. అందుకే ప్రభుత్వాలు ఇచ్చే నజరానాలపై మోజు పడలేదు. స్వాతంత్య్ర పోరాటంలో నన్ను అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టినా వెనుకడుగు వేయలేదు. 55 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యేగా సేవలందించా. అప్పట్లో స్వాతంత్య్ర సంబరాన్ని ఊరూరా ప్రజలే స్వచ్ఛందంగా జెండా ఎగురవేసి దేశభాక్తిని చాటుకునేవారు. ఈ దేశం నా కోసం ఏం చేసిందని కాకుండా, నా దేశానికి నేనేం చేయగలనని మాత్రం ఆలోచించాను. ఈ జీవితంలో దేశం కోసం చేయాల్సిందంతా చేశాను. – టీసీ రాజన్, స్వాతంత్య్ర సమరయోధుడు జైల్లోనే పరిచయాలు టెలిగ్రాఫ్లైన్ల (ప్రభుత్వ ఆస్తుల)ను ధ్వంసం చేసిన అభియోగం కింద అప్పటి ఎస్పీ సుబ్బరాయన్ నన్ను మూడు నెలలు రాజమండ్రి జైల్లో పెట్టారు. అదే జైల్లో ఉన్న టీకే నారాయణరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, రాచకొండ నరసింహులు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డితో పరిచయం ఏర్పడింది. మరింత దేశభక్తి పెరిగింది. అప్పట్లో నరసింహారెడ్డి, సీతారామయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, పెండేకంటి వెంకటసుబ్బయ్యతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నా. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి వద్దనుకున్నా. తామ్రపత్రమూ వద్దనే చెప్పాను. మాజీ ఎమ్మెల్యేలకు పింఛను వద్దని వ్యతిరేకించాను. ప్రభుత్వం ఇచ్చే 15 ఎకరాల భూమి కూడా తీసుకోలేదు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇంటి స్థలమూ వద్దని చెప్పాను. ఉట్టి అన్నానికి ఉప్పుకూడా ఇచ్చేవారు కాదట గాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిస్తే నా భర్త రామమూర్తి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న బ్రిటీష్ అధికారులు టెలిఫోన్ కమ్మీలను కత్తిరించిన కేసులో ఆయన్ను జైలులో పెట్టారు. ఆ సమయంలో ఒట్టి అన్నం మెతుకులు పెట్టారంట. అది తినేందుకు చప్పగా ఉంటుందట. కాస్త ఉప్పు ఇవ్వమని అడిగితే చాలా హింసించేవారని నా భర్త చెప్పేవారు. అలాంటి ఆంగ్లేయుల బానిస సంకెళ్లను తెంచి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయులను స్మరించుకోవడం మన ధర్మం. - నాటి స్వాతంత్య్ర సమరయోధులు రామమూర్తి సతీమణి జయలక్షుమమ్మ -
కుప్పంలో తమిళ యాక్టర్ పోటీపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
సాక్షి, చిత్తూరు జిల్లా: ఎన్నికల హామీల్లో 95 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి సిఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. వేలాది కోట్లు ఖర్చు చేసి ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, సచివాలయ భవనాలు నిర్మించాం. ఈ అభివృద్ధి చంద్రబాబుకు కనిపించట్లేదు. విద్య, వైద్యంకి సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా అనేక పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించగలరు అని సీఎం గుర్తించారు. ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చదవండి: (దళారీలకు టీటీడీ చెక్.. శ్రీవారి ఖజానాకు రూ.500 కోట్ల ఆదాయం) కుప్పంలో పోటీపై పెద్దిరెడ్డి క్లారిటీ '2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు 175 సాధిస్తుంది. కుప్పంలో పోటీపై ఎల్లో మీడియా.. తమిళ యాక్టర్‌తో మంతనాలు అని వార్తలు రాసింది. 2024లో కుప్పం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్ మాత్రమే. గతంలో పలమనేరులో మేము గెలిపించిన వ్యక్తి.. వేరే పార్టీకి పోయి మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వెంకటే గౌడను మరింత మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. సీఎం వైఎస్ జగన్‌కు మనమంతా ఎప్పుడు అండగా నిలవాలి అని ప్రజల్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. చదవండి: (టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.30 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’) -
టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.30 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’
పలమనేరు (చిత్తూరు): ఒక్కగానొక్క కుమార్తె కావడంతో భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు ఆ తల్లిదండ్రులు. అయితే ఏడాది తిరగకుండానే ఎనిమిది నెలల గర్భిణి అని కూడా చూడకుండా భర్త, అత్తమామలు కలసి రూ.30 లక్షల అదనపు కట్నం కోసం వేధించి బాధిత కుటుంబీకులపై దాడి చేసిన సంఘటన బుధవారం పలమనేరులో వెలుగుచూసింది. వివరాలిలా.. పలమనేరు పట్టణంలోని జిలానీ క్రాస్‌కు చెందిన మహ్మద్ అజాం కుమార్తె మిస్బాల్ అల్‌ఖైర్‌కు పట్టణంలోని మసీదువీధికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ మున్సిపల్ వైస్ చెర్మన్ చాంద్‌బాషా కుమారుడు యూసఫ్ ఖాదీర్‌తో 11 నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు కట్నం కింద కిలో బంగారు, 750 గ్రాములు వెండి, కియా కారు, బుల్లెట్ బండి, 50 జతల దుస్తులు, 50 వాచ్‌లు, లక్షలాది రూపాయలు విలువజేసే వస్తువులను అబ్బాయికి కానుకగా ఇచ్చారు. రెండునెలల పాటు సజావుగా సాగిన వీరి కాపురం, ఆపై రూ.30 లక్షల అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. మత్తుకు బానిసైన భర్తతో వేధింపులు తాళలేక విషయాన్ని బాధితురాలు తన తల్లి, అన్న, పెద్దనాన్నలకు తెలిపింది. వారు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ చేసి కాపురాన్ని సరిదిద్దారు. అయితే మళ్లీ బాధితురాలికి వేధింపులు తప్పలేదు. బాధితురాలు ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి కావడంతో అబార్షన్ చేసుకోవాలని అత్తారింటి బెదిరింపులు మొదలయ్యాయి. దీనిపై ఈ నెల 28న బాధితురాలి కుటుంబీకులపై దాడి జరిగింది. ఫలితంగా తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు మిస్భాల్ అల్‌ఖైర్ ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చదవండి: (సీఎం పీఏ పేరుతో ఫేక్ మెసేజ్‌లు) -
YS Jagan: పులివెందుల పర్యటనకు సీఎం జగన్
పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17వ తేదీన పులివెందులలో పర్యటన దృష్ట్యా అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం కడప ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. భాకరాపురంలో గల హెలీప్యాడ్‌ను, ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌ను పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్అండ్బీ అతిథి గృహంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన నేతలు, నాయకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలో పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. అలాగే హెలీప్యాడ్ నుంచి ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వరకు ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన రానుండటంతో ఆయా ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రాజు, బాలమద్దిలేటి, ఎస్ఐలు గోపినాథరెడ్డి, చిరంజీవి, హాజివల్లి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: (YSR: గుర్తుందా నాటి విజయ గాథ) ప్రొద్దుటూరులో... ప్రొద్దుటూరు క్రైం /ప్రొద్దుటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 17న ప్రొద్దుటూరుకు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఏర్పాట్లను వేరు వేరుగా పరిశీలించారు. బైపాస్‌రోడ్డులోని శ్రీదేవి ఫంక్షన్హాల్లో జరిగే వివాహ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ►మంగళవారం ఎస్పీ, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు హెలిప్యాడ్ స్థలంతో పాటు కల్యాణమండపాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద, ఫంక్షన్హాల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్పీ స్థానిక పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చారు. మాజీ డీసీసీబీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాలరెడ్డి పాల్గొన్నారు. ►కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ పనులను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలన్నారు. ►ఈ కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ నజీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, కార్యదర్శి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిజమైన స్నేహితులెవరూ లేరు.. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు..
సాక్షి, పలమనేరు: పాఠశాల నిర్వాహకుడి సూటిపోటి మాటలకు కలత చెంది మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని మిస్బా సూసైడ్ లెటర్ బుధవారం బయటపడింది. తన వల్ల తండ్రికి ఇబ్బందులు రాకూడదంటే ఆత్మహత్యే శరణ్యమని లెటర్లో పేర్కొంది. తన బాధ పంచుకునేందుకు నిజమైన స్నేహితులు లేరని, ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చదువులో పోటీ కారణంగా తోటి విద్యార్థినితో సమస్యలు వచ్చినట్టు వెల్లడించింది. చదవండి: (మా అమ్మాయిని సూటిపోటి మాటలతో చంపేశారు!) డబ్బు గల వారికే పాఠశాల యాజమాన్యం కొమ్ము కాస్తోందని, తనను మానసికంగా వేధిస్తోందని తెలిపింది. వేధింపులను తట్టుకోలేక మరణిస్తున్నానని స్పష్టం చేసింది. చదువులో ఎదురైన ఆటంకాలు, పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండడంతో మిస్బా మానసికంగా నలిగిపోయినట్లు లెటర్ ద్వారా వెల్లడవుతోంది. దీనిపై ఎస్ఐ నాగరాజును వివరణ కోరగా, బాలిక తండ్రి మంగళవారం సూసైడ్ నోట్ సమాచారం అందించలేదన్నారు. అయితే బుధవారం ఇంట్లో లెటర్ దొరికిందని చెబుతున్నారని తెలిపారు. ఈ లేఖను సైతం కేసు విచారణకు తీసుకుంటామని వెల్లడించారు. -
మా అమ్మాయిని సూటిపోటి మాటలతో చంపేశారు!
సాక్షి, పలమనేరు: పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం ఉద్రిక్తతకు దారితీసింది. సూటిపోటి మాటలు, వేరే పాఠశాలకు మార్చడాన్ని అవమానంగా భావించి తమ కుమార్తె ఉరేసుకుని తనువు చాలించిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి కథనం మేరకు.. పట్టణంలోని రాధాబంగ్లా ప్రాంతానికి చెందిన వజీర్ కూతురు నిజ్బా స్థానిక బ్రహ్మర్షి పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. టెన్త్ క్లాస్‌లో నిజ్బా, మరో బాలిక టాపర్లుగా పోటీపడి చదువుతున్నారు. పిల్లల మధ్య జరిగే చిన్నపాటి విషయాల కారణంగా తరచూ పాఠశాల బినామీ కరస్పాండెంట్ రమేష్ నిజ్బా తల్లిదండ్రులను చులకనగా మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో నిజ్బా అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు బడికి వెళ్లలేదు. తిరిగి స్కూల్‌కు వెళ్లగా ఒకేక్లాస్‌లో ఇద్దరు విద్యార్థినుల మధ్య చదువులో పోటీ కారణంగా ఇబ్బందిగా ఉందని, పరీక్షలు ఇక్కడే రాసినా కొన్నాళ్లు వేరే స్కూల్‌కు పంపుదామని కరస్పాండెంట్ చెప్పినట్లు బాలిక తండ్రి వజీర్ తెలిపాడు. దీంతో రెండ్రోజుల నుంచి రంగబాబు సర్కిల్లోని ఆదర్శ స్కూల్‌కు నిజ్బా వెళ్తోంది. ఇలా ఉండగా మంగళవారం ముభావంగా ఉండడంతో పాఠశాల హెచ్ఎం తండ్రిని పిలిచి బాలికను ఇంటికి పంపించారు. ఇంటికొచ్చిన బాలిక తాను స్కూల్ యూనిఫామ్ మార్చుకుంటానని గదిలోకి వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చింది. కిటికీలో నుంచి చూడగా మెడకు చున్నీ చుట్టుకుని వేలాడుతోంది. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బాలిక తల్లి నసీమా తన బిడ్డను సూటిపోటి మాటలతో చంపేశారయ్యా అంటూ కన్నీటి పర్యంతమైంది. పలమనేరులో ఉద్రిక్తత తమ కుమారై ఆత్మహత్యకు కారణమైన బ్రహ్మర్షి పాఠశాల కరస్పాండెంట్, టీచర్లను అరెస్టు చేసే దాకా బిడ్డకు అంత్యక్రియలను నిర్వహించమని మృతురాలి కుటుంబీకులు, బంధువులు ఆందోళన చేయడంతో పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం రాత్రి 9 గంటల వరకు స్థానిక రంగబాబు సర్కిల్లో ఆందోళనలకు దిగారు. వీరికి బంధువులు, స్నేహితులు మద్దతు తెలిపారు. బిడ్డ మృతికి కారణమైన కరస్పాండెంట్‌ను, వేరే స్కూల్ విద్యార్థినిని తమ పాఠశాలలో మూడు రోజులు పెట్టుకున్న ఆదర్శ పాఠశాల హెచ్ఎంను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయడంతో పలమనేరు ఇన్చార్జ్ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి బాధితులతో మాట్లాడి పరారీలో ఉన్న నిందితులను 24 గంటల్లో అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నించిన స్థానిక టీడీపీ నాయకులను ఆందోళనకారులు అడ్డగించడం గమనార్హం. -
నిరాడంబరతకు ఆయనో నిలువుటద్దం
పలమనేరు (చిత్తూరు జిల్లా): కౌన్సిలర్ కాగానే మందీ మార్బలంతో హంగామా చేసే రాజకీయ నాయకులు మనకు నిత్యం ఎక్కడపడితే అక్కడ తారసపడుతుంటారు. కానీ, పాత తరానికి చెందిన కొందరు అతి సామాన్య జీవితం గడిపి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆ కోవకు చెందిన వారే పలమనేరు మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధులు ఠానేదార్ చిన్నరాజన్. ఈయన పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలం, రాయలపేటలో 1918 సెప్టెంబర్ 11న తండ్రి అన్నయ్యగౌడుకు ఎనిమిదో సంతానంగా జన్మించారు. ఇతని భార్య బద్రాంభ న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పనిచేసి గతంలోనే మృతిచెందారు.( చదవండి: మినీ బ్యాంకులుగా రైతు భరోసా కేంద్రాలు) ఇతనికి నలుగురు సంతానం. 1967లో పలమనేరు ఎమ్మెల్యేగా స్వతంత్ర పార్టీ తరఫున గెలుపొందారు. ప్రజాసమస్యలపై శాసనసభలో మంచి వక్తగా పేరుంది. 1972లో ఎమ్మెల్యేలకు పింఛన్ ఇవ్వాలనే ప్రతిపాదనొస్తే సేవచేసే ఎమ్మెల్యేకెందుకయ్యా పింఛనంటూ తొలుత వ్యతిరేకించింది ఇతనే. ఈనెల 11న ఆ మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ 104వ పుట్టినరోజు సందర్భంగా ఆయన విశిష్టతలు ఈ తరం వారి కోసం.. ►పట్టణంలోని కొత్తపేటలో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్న ఆయనకు సెంటు భూమి లేదు. పైసా నిల్వలేదు. ఉండేందుకు సొంత గూడు కూడా లేదు. ►మాజీ ఎమ్మెల్యేల కోటాలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని వద్దంటూ నిరాకరించారు. ►స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో సొంత నియోజకవర్గంలో ఇవ్వజూపిన భూమిని కూడా వద్దన్నారు. ►ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాష్ట్రంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం ద్వారా భూగర్భ జలాల పెంపు, దురాక్రమణలో ఉన్న ఆవులపల్లి అడవిని ప్రభుత్వపరం చేయించారు. ►సివిల్ సప్లయిస్ బెల్టు ఏరియా రద్దు తదితరాలను అసెంబ్లీలో లేవనెత్తి ప్రభుత్వాన్ని ఆలోజింపచేసిన ఘనత ఆయనకే దక్కింది. ►రాజకీయాలంటే కేవలం సేవేగాని సంపాదన కాదని.. నీతి, నిజాయితీలే ఆభరణాలనే సంకల్పంతో ఆయన నిరాడంబర జీవితాన్ని గడిపారు. చదవండి: Sai Dharam Tej: సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ కెమెరా పుటేజీ వీడియో -
పలమనేరులో 60 అడుగుల వైఎస్సార్ విగ్రహం
పలమనేరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 60 అడుగుల విగ్రహాన్ని చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ వీరాభిమాని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాల్లో ఇదే ఎత్తయినది. వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా గురువారం విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. పట్టణానికి చెందిన దేవీగ్రూప్ మేనేజింగ్ పార్టనర్, గంగవరం మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సి.వి.కుమార్ తన స్థలంలో సొంత నిధులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడుకు చెందిన కాళీశ్వరన్ తొమ్మిది నెలలు కష్టపడి ఈ విగ్రహాన్ని రూపొందించారు. పలమనేరు సమీపంలోని చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిలో వైఎస్సార్ సర్కిల్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇవీ చదవండి: దుర్గం చెరువు: విదేశాల్లో ఉన్నామా అనే ఫీలింగ్! అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. -
పలమనేరు: రోడ్డుపై మదపుటేనుగు హల్చల్
సాక్షి, పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు– గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారిపై ముసలిమొడుగు వద్ద మదపుటేనుగు శుక్రవారం హల్చల్ చేసింది. సమీపంలోని కౌండిన్య అభయారణ్యం నుంచి రోడ్డుపైకి వచ్చిన ఏనుగు రోడ్డును దాటి తూర్పు వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్ కారణంగా వెళ్లలేక రోడ్డుపైనే 2 గంటలపాటు తిరుగుతూ ఉండిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ఏనుగు తిరుగుతుండటంతో జనం భయంతో పరుగులు తీశారు. చాలాసేపు అక్కడే ఉన్న మదపుటేనుగు తిరిగి కృష్ణాపురం అటవీ ప్రాంతం వైపుగా వెళ్లిపోయింది. -
బైక్, లద్ధాక్.. ఓ జంట
నిత్యం బైక్‌లపైనే తిరిగే ఉద్యోగం కావడమేమో గానీ.. ఆ యువకుడు బైక్ రైడింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు.. అందుకు సంబంధించి వీడియోలను యూట్యూబ్‌లో చూడటం మొదలెట్టాడు. అలా రాష్ట్రం నుంచి బైక్ రైడింగ్ చేసే సుమారు 20 మంది వ్లాగ్‌లను యూట్యూబ్‌లో గమనిస్తూ వచ్చాడు. అయితే వారంతా ఒంటరిగానే బైక్ రైడింగ్ చేస్తున్నారు. ఏపీ నుంచి దాదాపు 12 మంది లద్ధాక్ ఒంటరిగానే వెళ్లొచ్చారు. ఈ నేపథ్యంలో తను భార్యతో కలిసి వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన అతనికి వచ్చింది.. వెంటనే భార్యకు ఆ విషయం చెప్పాడు. మొదట ఒకింత భయపడ్డా.. భర్త ఉత్సాహానికి ముచ్చట పడుతూ ఓకే చెప్పేసింది.. లద్ధాక్ వెళ్లొచ్చింది. పలమనేరు: మండలంలోని అప్పినపల్లెకు చెందిన రంపాల రమేష్ అదే మండలంలోని ఓ ప్రైవేట్ డె యిరీలో ఐటీ సలహాదారు. అతని భార్య తులసీకుమారి గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు. వీరు గత నెల రెండో తేదీన తమ యమహా ఎఫ్‌జీఎస్ వీ3 బైక్ పై తమ సాహస యాత్రను ప్రారంభించారు. పలమనేరు నుంచి హైదరాబాద్, నాగ్‌పూర్, ఝాన్సీ, గ్వాలియర్, ఢిల్లీ, పానిపట్, అంబాలా, పతన్‌కోట్, జమ్మూ, పత్నిటాప్, సింథన్‌టాప్, అనంత్‌నాగ్, శ్రీనగర్, దాల్ సరస్సు, కార్గిల్, లేహ్, వారిల్లాపాస్, చెంగాలాటాప్, లద్ధాక్ దాకా ప్రయాణం సాగించారు. మార్గం మధ్యలోని పుణ్య స్థలాలు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలను సందర్శిస్తూ వెళ్లారు. అక్కడి నుంచే కష్టాలు జమ్మూ బోర్డర్ వరకూ వీరి ప్రయాణం సాఫీగానే సాగినా.. అక్కడి నుంచి కష్టాలు మొదలయ్యాయి. విపరీతమైన చలి వాతావరణం, కొండ మార్గాలు, లోయలు, సముద్ర మట్టానికి 982 అడుగుల ఎత్తు లో ప్రయాణం.. అయినా పట్టువదలకుండా తమ ప్రయాణాన్ని సాగించి ఎట్టకేలకు లద్ధాక్ చేరారు. అక్కడి ప్రజలు వీరిపై ఎంతో ప్రేమాభిమానాలు చూపారు. అక్కడ లాడ్జిలు, హోటళ్ల వంటివి ఉండ వు. స్థానికులే ప్రయాణికులకు తమ ఇళ్లల్లో ఆతిథ్యం ఇస్తారు. అలాగే ఈ జంటకు కూడా ఆశ్రయం ఇచ్చి తమను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని రమేష్ దంపతులు చెప్పారు. ఆ తర్వాత అక్కడ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. తమ యాత్రలోని రోజువారి విశేషాలను ‘రమేష్ రంపాల ఫస్ట్ కపుల్ రైడర్ ఫ్రం చిత్తూరు’ అనే వ్లాగ్‌లో పోస్ట్ చేస్తూ వచ్చారు. తమ యాత్రను విజయవంతంగా ముగించుకుని ఆదివారం వీరు స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ ప్రయాణంలో వీరికి రూ.2 లక్షల దాకా ఖర్చు చేశారు. లడక్ వెళ్లి రావడానికి వీరికి 37 రోజుల సమయం పట్టింది. మొత్తం 11,500 కి.మీ ప్రయాణించారు. గ్రామస్తుల సత్కారం ఈ జంట లద్ధాక్‌కు బైక్‌పై వెళ్లి వస్తున్నారని తెలిసి అప్పినపల్లె్ల గ్రామస్తులు ఆలయంలో వీరి పేరున ప్ర త్యేక పూజలు చేయించారు. అనంతరం రమేష్, తులసీకుమారి జంటను సన్మానించారు. పలమనేరు నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చారంటూ స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ వీరికి అభినందనలు తెలిపా రు. ఇండియా–పాక్ సరిహద్దుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఒకింత ఆందోళన చెందామని, అక్క డి ప్రజలు ప్రేమానురాగాలు చూపినట్టు తెలిపారు. ఈ యాత్ర ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసిన ట్టు రమేష్, తులసీకుమారి దంపతులు చెప్పారు. -
చిత్తూరు కుర్రోడు హీరోగా ‘ప్రేమకథ’
సాక్షి,చిత్తూరు(పలమనేరు): పలమనేరు కుర్రోడు హీరోగా నటించిన కాశీ వర్సెస్ లవ్ (చిత్తూరోడి ప్రేమకథ)చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆ చిత్ర దర్శకులు అశ్విని కామరాజ్ శనివారం మీడియాకు తెలిపారు. పలమనేరు మండలం పకీరుపల్లికి చెందిన అశ్విని కామరాజ్ దర్శకులుగా జరావారిపల్లికి చెందిన చిన్నా హీరోగా, బెంగళూరుకు చెందిన సంధ్య హీరోయిన్గా, పదిమంది స్థానికులు ఇందులో నటించినట్లు తెలిపారు. నంది ఆర్ట్స్ పతాకంపై హైదరాబాద్‌కు చెందిన నంది కె.రెడ్డి నిర్మాతగా కాశీ వర్సెస్ లవ్ చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేశామన్నారు. చిత్రానికి సంబంధించిన పాటలను లహరి ఆడియో ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు. పలమనేరు పరిసర ప్రాంతాలతోపాటు జిల్లాలో మేజర్ పార్ట్, హైదరాబాద్, గుంటూరులో చిత్ర షూటింగ్ పూర్తి చేసినట్లు వివరించారు. ఈ చిత్రాన్ని నెలఖారులో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేయన్నునట్టు పేర్కొన్నారు. చిత్ర పోస్టర్లు పట్టణంలో హల్చల్ చేస్తున్నాయి. -
శివుని చెంతకు ఎమ్మెల్యే వెంకటేగౌడ..!
సాక్షి, పలమనేరు : కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లా గొనగుప్ప కూర్గ్ అడవుల్లోని కుందాకొండపై శివాలయంలో స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆదివారం దసరా సందర్భంగా మొక్కు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే దట్టమైన అడవిలో రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి పరమశివుడిని దర్శించుకున్నారు. -
రూ.50 వేలు తీసుకుని కూతరినే అమ్మేశాడు!
సాక్షి, పలమనేరు : ఓ తండ్రి తన కుమార్తెను అమ్మేశాడు. రూ.50 వేలు తీసుకుని ముక్కుపచ్చలారని పన్నెండేళ్ల బాలికను 36 ఏళ్ల వ్యక్తి వెంట పంపించేశాడు. అతను ఆ బాలికను వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన పెద్దపంజాణి మండలం ముదరంపల్లిలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన జోగి వెంకటరమణ పందులు పెంచుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అతనికి నలుగురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. మూడో కుమార్తె (12) ఐదో తరగతి వరకు చదివి ఇంటివద్దే ఉంటోంది. బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లికి చెందిన సురేష్ (36) గతంలో వెంకటరమణ పెద్ద కుమార్తెను వివాహం చేసుకుంటానని అడిగాడు. అతను నిరాకరించడంతో కొన్నాళ్ల తరువాత రెండో కుమార్తెను వివాహం చేసుకుంటానని అడిగాడు. అది కూడా కుదరకపోవడంతో మూడో కుమార్తెనైనా తనకిచ్చి పెళ్లి చేయాలని పట్టుబట్టాడు. వెంకటరమణ నిరాకరించడంతో తానే రూ.50 వేలు ఎదురు కట్నం ఇస్తానని ఆశచూపాడు. దీంతో అంగీకరించిన బాలిక తండ్రి నాలుగురోజుల క్రితం పెళ్లికి రంగం సిద్ధం చేశాడు. డబ్బులు తీసుకుని కుమార్తెను సురేష్‌కి ఇచ్చి రహస్యంగా పెళ్లి చేయాలని చూశాడు. గ్రామస్తులు పెద్దపంజాణి పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాలిక తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనారిటీ తీరేవరకు వివాహం చేయనని వెంకటరమణ నుంచి స్టేట్మెంట్ తీసుకుని పంపించేశారు. డబ్బులు తీసుకుని పెళ్లి వాయిదా వేస్తే ఇబ్బంది వస్తుందని భావించిన వెంకటరమణ శనివారం ఉదయం తన కుమార్తెను సురేష్ వెంట పంపించేశాడు. బాలికను చప్పిడిపల్లి తీసుకెళ్లిన సురేష్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వివాహం చేసుకున్నట్లు సమాచారం. గ్రామస్తులు ఈ విషయాన్ని పుంగనూరు ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు పోలీసులతో కలిసి ముదరంపల్లి వెళ్లారు. అక్కడ బాలిక, ఆమె తండ్రి జాడ కనిపించలేదు. దీనిపై ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉషాపణికర్ను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని, వెంటనే పుంగనూరు సీడీపీవోను అప్రమత్తం చేసి బాలికకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: ఉపాధి ఎరగా.. వ్యభిచార కూపంలోకి.. -
ఆసుపత్రికి సుమతి..
పలమనేరు (చిత్తూరు జిల్లా): క్యాన్సర్ బారిన పడి మంచానికే పరిమితమైన తల్లిని కాపాడుకునేందుకు చిన్నారి కొడుకు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’ దినపత్రికలో ‘అమ్మకు ప్రేమతో..’ శీర్షికన శుక్రవారం వచ్చిన కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన ఆదేశాలతో పలమనేరు మున్సిపల్ కమిషనర్ విజయసింహా రెడ్డి తన సిబ్బంది, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు బాధితురాలు సుమతి ఇంటికి వెళ్లారు. ఆరోగ్య వైద్యశాఖ సిబ్బంది, ఆరోగ్యమిత్ర ఆమెను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్య సేవలందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సుమతి సమస్య, ఆమెకు వైద్యం ఎలా అందించాలి, ఆమె కుమారుడు పవన్ కుమార్‌ను ఎలా చదివించాలి.. తదితరాలపై నివేదికను రియల్‌టైమ్ గవర్నెన్స్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. దేశ విదేశాల నుంచి స్పందిస్తున్న దాతలు ఇదిలా ఉంటే.. సుమతి పరిస్థితి తెలుసుకుని ఆదుకుంటామని.. ఆమె కుమారుడ్ని చదివిస్తామని ప్రవాస భారతీయులు అనేకమంది ముందుకు వస్తున్నారు. ఈ మేరకు పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. అమెరికాలోని చికాగోకు చెందిన ఎన్ఆర్ఐ తిరుమలరెడ్డి జోజిరెడ్డి వారి ఆకలి తీర్చేందుకు తక్షణ సాయంగా రూ.5 వేలను హైదరాబాద్‌లోని తమ బంధువుల ద్వారా మున్సిపల్ కమిషనర్‌కు అందించారు. మరింత సాయమందిస్తామని జోజిరెడ్డి అక్కడ నుంచి తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఇంకో ఐటీ ఉద్యోగి కూడా సాయం అందించారు. ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమతి పరిస్థితిపై స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు చిత్తూరు కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్త ఆదేశాలతో విచారణ జరిపారు. ఆమెకు వైద్య సౌకర్యంతోపాటు ఉండేందుకు పక్కా ఇల్లు, రేషన్‌కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం వీఆర్వోలతో కలిసి రూ.5 వేల నగదు, దుప్పట్లు, పండ్లను ఆమెకు అందజేశారు. దాతలెవరైనా వీరికి సాయం చేయాలనుకుంటే.. పి.సుమతి, W/O శ్రీనివాసులు, ఆంధ్రా బ్యాంకు ఖాతా నంబరు : 181810100022142 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ANDB00011408కు జమచేయవచ్చునని తెలిపారు. మరోవైపు.. సుమతికి సీఎం సహాయ నిధి ద్వారా వైద్యసాయం అందించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తామని స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. -
ఆరుకు చేరిన మృతుల సంఖ్య
సాక్షి, చిత్తూరు : పలమనేరు రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ టీటీడీ ఉద్యోగి విష్ణు మృతి చెందాడు. ఈ నెల(సెప్టెంబర్)14న తిరుపతికి చెందిన విష్ణు తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. తన సోదరిని బెంగళూరులో దింపేందుకు కుటుంబ సభ్యులతో కలసి కారులో వెళ్తుండగా పలమనేరు నియోజవర్గ పరిధిలోని టీటీడీ గోశాల వద్ద అదుపు తప్పి రోడ్డుకు ఎడమ వైపు రెయిలింగ్‌ను ఢీకొని వంద మీటర్ల దూరంలో ఎగిరిపడింది. కారు ఇంజన్ రెయిలింగ్‌ను రాసుకోవడంతో క్షణాల్లో మంటలు చెలరేగి పెట్రోల్ ట్యాంకుకు నిప్పంటుకుంది. (చదవండి : ప్రాణం తీసిన అతి వేగం) సగం కాలిపోయి ఆర్తనాదాలు చేస్తున్న విష్ణును సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు రక్షించి 108లో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వేలూరు సీఎంసీకి రిఫర్ చేశారు. చికిత్స పొందుతూ విష్ణు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే విష్ణు భార్య జాహ్నవి (35), కుమారుడు పవన్రామ్ (13), కుమార్తె అస్త్రిత (10), విష్ణు సోదరి కళ (42), ఆమె కుమారుడు భానుతేజ (19) మృతి చెందారు. -
చంద్రబాబు పంచే డబ్బుకు ఆశపడొద్దు
-
హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయావు బాబు?
సాక్షి, పలమనేరు(చిత్తూరు): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ నేరం చేయకపోతే.. సీబీఐకి, ఈడీకి, తెలంగాణ పోలీసులకు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. చివరకు తెలంగాణలోని పోలీసు కానిస్టేబుల్ అన్న కూడా చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నేరగాడు కాకపోతే హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసగించారు. ఈ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో పలమనేరులో రహదారులు కిక్కిరిసిపోయాయి. మండుటెండల్లో తన కోసం అక్కడికి వచ్చిన వారందరికీ వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. విలన్ చేసే అన్ని పనులు చంద్రబాబు చేశారు.. ‘చంద్రబాబు హయాంలో అవినీతి, అన్యాయాలు, అక్రమాలు పరాకాష్టకు చేరాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలన అవినీతిమయం. సినిమాలో విలన్ పాత్రలో ఉన్న వ్యక్తి చేసే అన్ని పనులను చంద్రబాబు చేశారు. గత 20 రోజులుగా చంద్రబాబు చేస్తున్న నీచమైన రాజకీయాలు చూడండి. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా చెప్పడంలో ఆయనను మించిన వారు లేరు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. అవసరం వచ్చినప్పుడు మళ్లీ అదే ఎన్టీఆర్ ఫొటోకు దండేసి దండం పెడతారు. చంద్రబాబు అధికారానికి ఎవరైనా అడ్డోస్తే.. ఆ వ్యక్తిని ఏం చేయాడానికైనా ఆయన వెనకడారు. ప్రజలను, ప్రతిపక్ష నాయకుడిని ఇలా ఎరవరిని వదిలిపెట్టరు. రేపు అధికారానికి అడ్డువస్తాడని అనుకుంటే ప్రధానిని కూడా వదిలిపెట్టరు. వ్యవస్థలను నాశనం చేశారు.. చంద్రబాబు తనకు సంబంధిన వ్యక్తులను అధికారులగా నియమించుకుని.. వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. చంద్రబాబుకు ఓటు వేయడము అంటే హత్య రాజకీయాలకు ఓటు వేయడమే. మాఫీయాకు ఓటు వేయడమే. గ్రామాల్లో ప్రజలు గెలిపించుకున్న సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు విలువలేకుండా పోయింది. ప్రస్తుతం గ్రామాల్లో జన్మభూమి కమిటీల మాఫీయా నడుస్తోంది. రాష్ట్రమంతా చంద్రబాబు మాఫీయా నడుస్తోంది. చంద్రబాబు హయంలో సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అన్నట్టుగా తయారైంది. మనిషిని పొగొట్టుకున్నది మా కుటుంబం మా చిన్నాన్న వివేకానందరెడ్డిని చంపించింది చంద్రబాబే. ఈ హత్య కేసును విచారించేంది వీళ్ల పోలీసులే. హత్య కేసును తప్పుదోవ పట్టించి వక్రీకరించేది చంద్రబాబే. అందుకు అనుకూలంగా ఎల్లో మీడియాలో కథనాలు వెలువడతాయి. మనిషిని పొగొట్టుకుంది మా కుటుంబం. పైగా బాధలో ఉన్న మా కుటుంబంపై నిందలు మోపుతారు. ఇలా చేస్తే న్యాయం ఎలా జరుగుతోంది?. చంద్రబాబు నేరం చేయకపోతే ఈ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించరు?. చంద్రబాబు నేరగాడు కాకపోతే సీబీఐకి, ఈడీకి, ఐటీకి, చివరకు తెలంగాణ కానిస్టేబుల్‌కు కూడా ఎందుకు భయపడుతున్నారు?. చంద్రబాబు నేరగాడు కాకపోతే.. తనపై ఉన్న అన్ని కేసులో టెక్నికల్ కారణాలు చూపుతూ స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు?. చంద్రబాబు మించిన దుర్మార్గుడు, ద్రుష్టుడు, నీచుడు ఎవరు లేరని ఎన్టీఆర్ ఎన్నోసార్లు చెప్పారు. హత్య రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు... నాగార్జున విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చిన రిషితేశ్వరి అనే విద్యార్థిని దారుణంగా చనిపోయిన కేసులో బాబురావును ఎందుకు అరెస్ట్ చేయలేదు?. ఆ వ్యక్తి చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టే అతని జోలికి ఎవరూ వెళ్లలేదు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మహిళ ఎమ్మార్వో వనజాక్షిని అక్కడి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకుని ఇడ్చుకుంటూ పోతే ఎలాంటి కేసు లేదు, ఎలాంటి అరెస్ట్ లేదు. ఆ ఎమ్మెల్యే తప్పు చేశారని కోర్టు చెప్పినా కూడా చర్యలు లేవు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అదే వ్యక్తికి టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ నడిపిన మృగాలను చంద్రబాబు కాపాడారు. కాల్‌మనీ బాధితులకు జరిగిన అన్యాయంపై మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో తోటలను తగులబెట్టించారు. చివరకు దళితులపై కూడా కేసులు పెట్టారు. 2014 ఎన్నికల్లో తమ కులాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అడిగిన ప్రతి ఒక్కరిని కొట్టించి, వారిపై కేసులు పెట్టించి వేధింపులకు గురిచేశారు. పత్తికొండలో నారాయణరెడ్డిని అతి కిరాతకంగా నరికించింది చంద్రబాబు కాదా?. తాడిపత్రి ప్రభుత్వ కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్‌ను విజయ భాస్కర్‌రెడ్డిని నరికి చంపిన ఘటన నిజం కాదా?. చంద్రబాబు పాలన కాలంలో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను అడ్డగోలుగా చంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాజకీయ నాయుడు వంగవీటి రంగ, ఐఏఎస్ అధికారి రాఘవేంద్ర రావు వీరందరు చంద్రబాబు హయంలోనే చనిపోయారు. చంద్రబాబు పాలనలో లా అండ్ ఆర్డర్ ఉందా?. చంద్రబాబు ఇచ్చే మూడు వెలకు మోసపోకండి.. చంద్రబాబు అన్యాయాలు చేస్తారు, మోసాలు చేస్తారు.. ఎన్నికల వచ్చేసరికి రోజుకో డ్రామా, రోజుకో కథ అల్లుతారు. రాబోయే 20 రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయి. మనం చంద్రబాబు ఒక్కరితోనే కాదు ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేస్తున్నాం. ప్రతీ ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. మీరంతా నాన్నగారి పాలన చూశారు. నాన్నగారి కంటే గొప్ప పరిపాలన ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుందాం. ఎమ్మెల్యేగా వెంకట్‌ను, ఎంపీగా రెడ్డప్పను దీవించమని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆశీర్వదించమ’ని కోరారు. -
చిత్తూరు జిల్లాలో విషాదం
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో విషాదం చోటుచేసుకుంది. సెఫ్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ అస్వస్థతకు గురైన ఎనిమిది మంది దుర్మరణం చెందారు. కాగా శుక్రవారం ఉదయం వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీహెచ్‌పీఎల్)కు చెందిన సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు మొత్తం ఎనిమిది మంది వచ్చారు. కాగా ట్యాంక్ నుంచి ఒక్కసారిగా విష వాయువు వెలువడటంతో వీరంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిలో ఏడుగురు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరంతా మొరం గ్రామ సమీపానికి చెందినవారు. మృతులు రెడ్డప్ప, రమేష్, రామచంద్ర, కేశవ, గోవిందస్వామి, బాబు, వెంకట్రాజు శివగా గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మరోవైపు సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ, ఏఎస్పీతో ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తక్షణ సాయం కింద జిల్లా సబ్ కలెక్టర్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దుర్ఘటనపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.