చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మారుతి వ్యాను చెట్టుని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వ్యాను చెట్టును ఢీకొనడంతో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సత్యనారాయణ(50) మహాలక్ష్మి(44) దీపమాల (22) సజీవ దహనమయ్యారు. మృతులు బెంగళూరు సంపంగినగర్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రసన్నకుమార్ అనే వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు.