three die
-
ఇంగ్లండ్‌లో కాల్పుల కలకలం
లండన్: బ్రిటన్‌లో మంగళవారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మరణించారు. మృతుల్లో దాడిచేసిన వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. మహిళలను తల్లీకూతురుగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రవాదులకు సంబంధం లేదని పోలీసులు తెలిపారు. లింకన్‌షైర్‌లో కాస్ట్లె స్విమ్మింగ్ పూల్ సమీపంలో నిందితుడు ఇద్దరు మహిళలను కాల్చి చంపి, తర్వాత తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వీరు ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
నివాస ప్రాంతంలో కూలిన విమానం
ముగ్గురు దుర్మరణం.. జపాన్‌లో ఘటన టోక్యో: జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని నివాస ప్రాంతంలో ఆదివారం ఓ చిన్న విమానం కుప్పకూలింది. ముగ్గురు దుర్మరణం చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. పైలట్ సహా నలుగురు ప్రయాణిస్తున్న విమానం ‘చోఫు’ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్ది సమయానికే కుప్పకూలింది. నలుగురి ప్రయాణికుల్లో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. విమానంలోని ఇద్దరు వ్యక్తులు, స్థానిక మహిళ ఒకరు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ‘నివాస గృహాల సమీపంలో విమానం కూలి పెద్ద ట్రక్కుపై పడింది. తర్వాత చూసే సరికి పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. మూడు ఇళ్లు, రెండు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. -
రికార్డింగ్ డాన్సులో తొక్కిసలాట.. ముగ్గురి మృతి
బీహార్ రాష్ట్రంలోని బంకా జిల్లాలో రికార్డింగ్ డాన్సు చూస్తుండగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా దాదాపు 12 మందికి పైగా గాయపడ్డారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణే ఈ సంఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఓ థియేటర్లో రికార్డింగ్ డాన్సులు జరుగుతుండగా, వాటిని వందలాది మంది చూస్తున్నారని, ఇంతలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడం, అగ్ని ప్రమాదం సంభవించినట్లు వదంతులు రావడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. మరణించినవారిలో ఒకరు స్థానికులు కాగా, మరో ఇద్దరు మాత్రం భాగల్పూర్ జిల్లాకు చెందినవారని చెప్పారు. క్షతగాత్రులను వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. -
కారు ప్రమాదంలో ముగ్గురి మృతి.. పలు అనుమనాలు
ప్రకాశం జిల్లా సంతమాగులూరు వద్ద ఘోరం జరిగింది. ఓ కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గరు మరణించగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను వినుకొండ మండలం రామిరెడ్డి పాలేనికి చెందిన అంజిరెడ్డి, లక్ష్మణరెడ్డి, శ్రీనివాసరెడ్డిగా గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన తీరును బట్టి చూసిన స్థానికులు మాత్రం దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు మృతులతో పాటు క్షతగాత్రులను తీసుకొచ్చి కారుతో సహా సంతమాగులూరు వద్ద పడేసి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన కారును వినుకొండకు చెందినదిగా గుర్తించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
పలమనేరులో ముగ్గురు సజీవ దహనం