ఇంగ్లండ్లో కాల్పుల కలకలం | Three die in shooting incident in UK | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్లో కాల్పుల కలకలం

Published Tue, Jul 19 2016 8:12 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

Three die in shooting incident in UK

లండన్: బ్రిటన్లో మంగళవారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మరణించారు. మృతుల్లో దాడిచేసిన వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. మహిళలను తల్లీకూతురుగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రవాదులకు సంబంధం లేదని పోలీసులు తెలిపారు.

లింకన్షైర్లో కాస్ట్లె స్విమ్మింగ్ పూల్ సమీపంలో నిందితుడు ఇద్దరు మహిళలను కాల్చి చంపి, తర్వాత తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వీరు ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement