బీహార్ రాష్ట్రంలోని బంకా జిల్లాలో రికార్డింగ్ డాన్సు చూస్తుండగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా దాదాపు 12 మందికి పైగా గాయపడ్డారు.
బీహార్ రాష్ట్రంలోని బంకా జిల్లాలో రికార్డింగ్ డాన్సు చూస్తుండగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా దాదాపు 12 మందికి పైగా గాయపడ్డారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణే ఈ సంఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఓ థియేటర్లో రికార్డింగ్ డాన్సులు జరుగుతుండగా, వాటిని వందలాది మంది చూస్తున్నారని, ఇంతలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడం, అగ్ని ప్రమాదం సంభవించినట్లు వదంతులు రావడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. మరణించినవారిలో ఒకరు స్థానికులు కాగా, మరో ఇద్దరు మాత్రం భాగల్పూర్ జిల్లాకు చెందినవారని చెప్పారు. క్షతగాత్రులను వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు.