stampede
-
ప్రజలపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదు: YV Subba Reddy
-
వేంకటేశ్వర స్వామి భక్తుల ప్రాణాలకు విలువలేదు అన్నట్లు కూటమి సర్కార్ వైఖరి
-
పవన్‌కు మానవత్వం లేదు: RK Roja
-
భక్తులు పోతేనేం.. మనోళ్లు భద్రమే..!
‘సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు...! అయితేనేం..! మనోళ్లు సేఫ్ కదా...! ఇక కేస్ క్లోజ్ చేద్దాం..’... సీఎం చంద్రబాబు తేల్చి చెప్పేశారు!!‘ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆడిన ఆగ్రహం డ్రామా అవసరం లేదు.. ఇక చాల్లే.. తగ్గు..!’... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సంకేతం ఇచ్చారు!! ‘అయితే ఓకే అంటూ ముందస్తు వ్యూహం ప్రకారం పవన్ గప్‌చుప్...!’’‘అయినాకానీ పవన్ జోరుకు బ్రేకులు వేయమని బీఆర్ నాయుడుకు ఆదేశం..!’‘ఎవరో చెబితే మేం చేస్తామా?.. క్షమాపణలు చెప్పాలనడంపై బీఆర్ నాయుడు ప్రతి స్పందన!!సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యంతోనే తిరుపతిలో ఎన్నడూలేని విధంగా తొక్కిసలాట సంభవించి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబే ప్రధాన ముద్దాయి అని యావత్ భక్త కోటి మండిపడుతుండటంతో సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతో రంగంలోకి దిగారు. ఈ దుర్ఘటన తమను కలచి వేసిందని మొసలి కన్నీళ్లు కారుస్తూ తిరుపతిలో హై డ్రామాకు తెర తీశారు. సీఎం చంద్రబాబు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు... చిందులు తొక్కినట్టు వీడియో కెమెరాల ఎదుట కపట నాటకాన్ని రక్తి కట్టించారు. కానీ చంద్రబాబు కుయుక్తులు బెడిసి కొట్టాయి. ఇవి కచ్చితంగా సర్కారీ హత్యలేనని యావత్ ప్రజానీకం తేల్చి చెప్పింది. దీంతో కొందరు అధికారులపై చర్యలు తీసుకుని విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అదే సమయంలో గతంలో తాము చెప్పినట్లుగా రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేయని టీటీడీ అధికారులపై చర్యలకు ఉపక్రమించడం చంద్రబాబు కుట్రలకు నిదర్శనం. వైఫల్యానికి కారకులైన తన అస్మదీయ అధికారులపై మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోకుండా వారిని కాపాడుతుండటం గమనార్హం. ఈ పరిణామాలన్నీ ఒక్కటే స్పష్టం చేస్తున్నాయి.. తిరుపతి దుర్ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని నిగ్గు తేలుస్తున్నాయి. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పి ఈ డ్రామాలో తన వంతు పాత్రను రక్తి కట్టించారు. పనిలో పనిగా టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ససేమిరా అనడం గమనార్హం. సీఎం ఆదేశాల మేరకే ఆయన ఇలా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ఆయన మాట మార్చినా పవన్ కళ్యాణ్ సూచనను మొదట తిరస్కరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సీఎం చంద్రబాబు సమక్షంలోనే టీటీడీ చైర్మన్, ఈవో పరస్పర ఆరోపణలతో అసలు విషయాన్ని బయట పెట్టారు. తిరుమల ఆలయ వ్యవహారాల్లో టీటీడీ, ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లో ఏమాత్రం సమన్వయం లేదని తేల్చి చెప్పారు. ఈ నిర్వాకాలు, వైఫల్యాల కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుని అమాయక భక్తులు మృత్యువాత పడినట్లు చంద్రబాబు సమీక్ష సాక్షిగా నిర్ధారణ అయింది.చైర్మన్, అదనపు ఈవో సేఫ్తిరుపతిలో భక్తుల దుర్మరణం దుర్ఘటనకు బాధ్యులైన అస్మదీయ అధికారులను టీడీపీ కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా వెనకేసుకొచ్చింది. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. టీటీడీ చరిత్రలో కనీవిని ఎరుగని విషాదానికి బాధ్యత వహించి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి. ఆయన సమ్మతించకపోయినా ప్రభుత్వమే ఆయనతో రాజీనామా చేయించాలి. కానీ ఆయన్ను చంద్రబాబు పల్లెత్తు మాట అనలేదు. ఎన్నికల్లో టీడీపీకి బాకాగా పని చేసిన టీవీ5 చానల్‌కు బీఆర్ నాయుడు అధినేత కావడం దీనికి ప్రధాన కారణం. ఇక శ్రీవారి ఆలయం దర్శనాలు, సౌకర్యాల కల్పనకు ప్రధాన బాధ్యత వహించాల్సింది తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరే! తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లు కూడా శ్రీవారి ఆలయ దర్శనం టికెట్ల కోసమే. అయినా వెంకయ్య చౌదరిని ప్రభుత్వం కనీసం బదిలీ చేయలేదు. అస్మదీయ అధికారులకు రక్షణవైకుంఠ ఏకాదశి క్యూలైన్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత టీటీడీ విజిలెన్స్ డీఎస్పీ ఎన్టీ రామ్కుమార్దే. అయినా సరే ఆయనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. టీటీడీ విజిలెన్స్ విభాగంలో ఆయన ప్రధాన రింగ్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తొక్కిసలాట సంభవించిన ప్రాంతాలు తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తాయి. ఆ ప్రాంత డీఎస్పీ వెంకటనారాయణపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇదే అదనుగా సహకరించని అధికారులపై వేటుతిరుపతిలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధ్యులైన అనుకూల అధికారులను కాపాడుతున్న సీఎం చంద్రబాబు మరోవైపు నిబంధనల ప్రకారం నడుచుకుంటూ తమకు సహకరించని అధికారులకు పొగబెడుతున్నారు. ఇదే అదనుగా గతంలో అక్రమ కేసుల నమోదుకు తమకు సహకరించని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. టీటీడీ విజిలెన్స్ ప్రధాన అధికారి (సీవీఎస్ఓ) శ్రీధర్‌ను ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయాలంటూ శ్రీధర్‌పై కూటమి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తోంది. అయితే ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసుల నమోదుకు ఆయన తిరస్కరించడంతో తిరుపతి దుర్ఘటనను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం శ్రీధర్‌ను బదిలీ చేసింది. మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాలతో ఏమాత్రం సంబంధంలేని తిరుపతి జేఈవో గౌతమిని ప్రభుత్వం బదిలీ చేసింది. అదే రీతిలో డీఎస్పీ రమణకుమార్, క్యూలైన్ల నిర్వహణతో సంబంధం లేని టీటీడీ గోశాల డైరెక్టర్ హర్‌నాథ్‌రెడ్డిని సస్పెండ్ చేసింది.బీఆర్ నాయుడు, వెంకయ్య చౌదరిపై మంత్రుల ఫిర్యాదు.. వారించిన బాబుమంత్రులు అనగాని సత్య ప్రసాద్, ఆనం రాంనారాయణరెడ్డి గురువారం సీఎం చంద్రబాబు తిరుపతిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీరుపై ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు ఆ విషయాలు తరువాత మాట్లాడదామంటూ దాటవేశారు. బీఆర్ నాయుడు, వెంకయ్య చౌదరి ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోబోనని సంకేతాలిచ్చారు. ఈవో బదిలీకి రంగం సిద్ధం..టీటీడీ ఈవో శ్యామలరావును బదిలీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే వెంటనే బదిలీ చేస్తే ఆయనతోపాటు తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కూడా బదిలీ చేయాల్సి ఉంటుంది. అందుకే కొద్ది రోజుల తరువాత శ్యామలరావుని బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈవోకు అవమానం...!టీటీడీ ఈవో శ్యామలరావును సాగనంపేందుకు సిద్ధమైన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయనకు పొగబెడుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవోను అందరి ఎదుట ఏక వచనంతో సంబోదిస్తూ తీవ్రంగా అవమానించారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ఆలయానికి వచ్చిన ఈవో శ్యామలరావును చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉద్దేశపూర్వకంగానే అగౌరవపరిచేలా వ్యవహరించడం గమనార్హం. ఆలయంలో ఆయనతో ఎవరూ మాట్లాడకుండా, కనీస గౌరవం ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు దన్నుతోనే ఆయన సామాజికవర్గానికి చెందిన టీటీడీ చైర్మన్, అదనపు ఈవో ఇలా వ్యవహరిస్తున్నట్లు టీటీడీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి: ఉషశ్రీచరణ్
-
ఆ ఆరుగురు ఇక్కడే చనిపోయారు.. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్..
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగింది
-
తిరుపతిలో టోకెన్ల కోసం తొక్కిసలాట జరగడం దురదృష్టకరం
-
మీరందరూ క్షమాపణ చెప్పాలి BR నాయుడుపై పవన్ సంచలన వ్యాఖ్యలు
-
తిరుమలలో తొక్కిసలాటపై బాబు,పవన్ KA పాల్ సవాల్..
-
బాబు పాపాలే యమపాశాలై!
సాక్షి, అమరావతి: కలియుగ వైకుంఠం తిరుమల–తిరుపతిని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలే అమాయక భక్తుల పాలిట యమపాశాలుగా మారాయి! కక్ష సాధింపు చర్యలతో తిరుమల పవిత్రతకు కళంకం తేవాలన్న కుట్రతో సమర్థ టీటీడీ వ్యవస్థను దిగజార్చారు. ఇక తిరుమల–తిరుపతిని వేదికగా చేసుకుని ఉప ముఖ్యమంత్రి సాగించిన సనాతన డ్రామా శ్రీవారి దివ్యక్షేత్రం పవిత్రతకు భంగం కలిగించి పటిష్ట వ్యవస్థను దెబ్బతీసింది. తన వందిమాగదులను రాజ్యాంగేతర శక్తులుగా మార్చి తిరుమల–తిరుపతిలో తిష్ట వేయించిన సీఎం చంద్రబాబు నిర్వాకాలే అమాయకుల అకాల మరణానికి కారణ భూతమ య్యా యి. లక్షలాది మంది తరలి వస్తారని తెలిసినా సరే కనీస ఏర్పాట్లలో తీవ్ర అల సత్వమే తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారి తొక్కిసలాటకు దారితీసి పెను విషాదాన్ని మిగిల్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. తిరుపతిలో ఆరుగురు భక్తుల దుర్మరణం పూర్తిగా చంద్రబాబు సర్కారు చేసిన హత్యలేనన్నది స్పష్టం! దీన్ని దురదృష్టకర ఘటనగా ముద్ర వేసి తన వైఫల్యాలను కప్పిపుచ్చుతూ పక్కదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఈ ఉదంతంలో ప్రధాన ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబేనన్నది యావత్ భక్త కోటి ఏకాభిప్రాయం. ఓ ప్రణాళిక లేదు.. సమీక్షలూ లేవుతిరుమలకు రోజూ 80 వేల మంది భక్తులు వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఏటా 7 లక్షల మంది శ్రీవారి దర్శనం చేసుకుంటారు. గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి టీటీడీ ఏటా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తుంది. తిరుమల జేఈవో నేతృత్వంలో టీటీడీ విజిలెన్స్, రెవెన్యూ, తిరుపతి పోలీసులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. క్యూలైన్లలో భద్రత, ఇతర సౌకర్యాలను ఈవో, జేఈవో, ఎస్పీ, కలెక్టర్ పర్యవేక్షిస్తారు. అదనపు ఎస్పీ, ఆర్డీవో, డీఎస్పీలు, తహశీల్దార్లు, భారీ సంఖ్యలో టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు 24 గంటలూ అక్కడే ఉంటూ ప్రణాళిక కచ్చితంగా అమలయ్యేలా చూస్తారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుత పాలక మండలి వీటిపై దృష్టి పెట్టలేదు. టికెట్ల జారీకి కనీస మార్గదర్శకాలను పాటించలేదు. టికెట్ల జారీ ప్రణాళిక, ఏర్పాట్లను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించ లేదు. కనీసం అధికారులను ఆరా కూడా తీయలేదు.సర్కారు వైఫల్యాలకు రుజువులివిగో..వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లను జనవరి 9వ తేదీ తెల్లవారుజాము నుంచి జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. టోకెన్ల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుపతి చేరుకుని ముందు రోజు మధ్యాహ్నం నుంచే క్యూ లైన్లలో వేచి చూస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు చేయలేదు. శ్రీనివాసం, బైరాగిపట్టెడలోని ఎంజీవో పాఠశాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకోగా టీటీడీ వారిని క్యూ లైన్లలోకి అనుమతించకుండా రోడ్లపైనే నిలబెట్టేసింది. వచ్చినవారిని వచ్చినట్టుగా క్యూలైన్లలోకి పంపించి టికెట్లు జారీ చేసి ఉంటే భక్తులు సులభంగా ముందుకు కదులుతూ టికెట్లు తీసుకుని బయటకు వచ్చేవారు. కానీ క్యూ లైన్లలోకి అనుమతించకుండా ప్రవేశ ద్వారం వద్దే గంటల తరబడి పడిగాపులు కాసేలా చేశారు. మరోవైపు ఎముకలు కొరికే చలిలో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు.భోజనం, ఇతరత్రా అవసరాలకు బయటకు వెళితే మళ్లీ రద్దీలో రాలేమన్న ఆందోళనతో గంటల తరబడి అక్కడే నిరీక్షించారు. టీటీడీ వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంతమంది వచ్చారనే అంచనా కూడా వేయలేదు. ఆహారం, తాగు నీటి పంపిణీ గురించి పట్టించుకోలేదు. పోలీసు అధికారులు పత్తా లేకుండా పోయారు. ఉన్న కొద్ది మంది భక్తులతో అత్యంత దురుసుగా ప్రవర్తించారు. లక్షలాది మంది భక్తులు గంటల తరబడి రోడ్ల మీద నిరీక్షించిన తరువాత.. తాపీగా బుధవారం రాత్రి 8 గంటల సమయంలో క్యూలైన్లలోకి అనుమతిస్తామని ప్రకటించి గేట్లు తెరిచారు. అప్పటికే గంటల తరబడి నిరీక్షించిన భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లలోకి ప్రవేశించడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఉపద్రవాన్ని గుర్తించిన తరువాత కూడా టీటీడీ, పోలీసు అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించ లేదు. అసలు అక్కడ తగినంత మంది పోలీసు, టీటీడీ విజిలెన్స్ అధికారులు, సిబ్బంది అందుబాటులో లేరు. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో (తిరుమల) వెంకయ్య చౌదరి నుంచి తక్షణ స్పందన కొరవడి విషాదం చోటు చేసుకుంది.తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయమే ఇంతటి పెను విషాదానికి ప్రధాన కారణం. లక్ష మందికిపైగా భక్తులు వచ్చినా టికెట్ల జారీ కోసం పటిష్ట క్యూలైన్లు, ఇతర వ్యవస్థలు తిరుమలలో మాత్రమే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా తిరుపతిలోనే టికెట్లు జారీ చేస్తామని ప్రకటించాయి. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఉన్నవారినే తిరుమల వెళ్లేందుకు అలిపిరి వద్ద అనుమతిస్తామని ప్రభుత్వం, టీటీడీ ప్రకటించాయి. తిరుపతిలోని కౌంటర్లలో టోకెన్లు పొందితే కానీ అలిపిరి దాటి వెళ్లలేరు. దాంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన భక్తులు తిరుపతిలోనే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఎంతమంది భక్తులు వస్తారనే అంశాన్ని ప్రభుత్వం, టీటీడీ కనీసం అంచనా వేయలేదు. పది రోజులపాటు దర్శనం ఏర్పాటు చేశామని చెబుతూ అతి ధీమాతో కళ్లు మూసుకుపోయి వ్యవహరించాయి. ఎన్ని రోజులు ఉత్తర ద్వార దర్శనం కల్పించినా వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి దర్శనానికే లక్షలాది భక్తులు మొదటి ప్రాధాన్యమిస్తారనే విషయాన్ని పట్టించుకోలేదు.బాబు విధేయుడు బదిలీతో సరిసాక్షి, అమరావతి: తిరుపతిలో చోటు చేసుకున్న విషాదానికి బాధ్యుడైన తన అస్మదీయ అధికారిని కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యమివ్వడం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఓ డీఎస్పీ, గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి జేఈవో గౌతమిని బదిలీ చేశారు. ఆశ్చర్యకరమేమిటంటే.. భక్తుల భద్రతకు ఎస్పీ ప్రధాన బాధ్యత వహించాలి. కానీ ఎస్పీ సుబ్బారాయుడు చంద్రబాబుకు వీర విధేయుడు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయన్ను వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించేందుకే డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చి తిరుపతి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే కొద్ది నెలలుగా ఆయన అక్రమ కేసులతో అరాచకానికి పాల్పడుతున్నారు. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు అయినప్పటికీ సుబ్బారాయుడిని సస్పెండ్ చేయకుండా బదిలీతో సరిపెట్టారు. కొద్ది రోజుల్లో ఆయనకు మరో ప్రధాన పోస్టింగు ఇవ్వాలనే ఉద్దేశంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. -
వీళ్లా ‘పాలకులు’?
సాక్షి, అమరావతి: టీటీడీని సీఎం చంద్రబాబు పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. అత్యంత వివాదాస్పదులు, తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నవారికి టీటీడీ పాలక మండలిలో స్థానం కల్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలలో దళారుల దందాకు తలుపులు బార్లా తెరిచారు. ఎన్నికల్లో తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టి టీడీపీకి బాకా ఊదిన టీవీ 5 చానల్ చైర్మన్ బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్‌గా నియమించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు.. దేవుడి పట్ల భక్తి లేదు. సివిల్ సర్వెంట్‌గా పాటించాల్సిన నిబంధనల పట్ల పట్టింపు లేదు. ఉన్నదల్లా కులం.. దాని నుంచి వచ్చిన బలం! అంతకు మించి ఏ కోశానా సమర్థత, నిజాయితీ, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలన్న ఇంగితం లేవు. వెంకయ్య చౌదరి భక్తులను పురుగుల్లా చూస్తూ ఇప్పుడు ఆరుగురి ప్రాణాలు బలిగొనడానికి కారణమయ్యారు. టీడీపీ కార్యకర్తలా వెంకయ్య చౌదరి...నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన వెంకయ్య చౌదరి టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ రాజ్యాంగేతర శక్తిలా చెలరేగిపోతుంటారు. శ్రీవారి కన్నా స్వప్రయోజనాలే ఎక్కువ అనే తెంపరితనంతో వ్యవహరిస్తుంటారని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. తన సామాజిక వర్గానికి చెందిన అస్మదీయ అధికారి అనే ఏకైక అర్హతతో సీఎం చంద్రబాబు ఆయన్ను ఏఈవోగా నియమించారు. ఆయన్ను కలిసేందుకు ఎవరైనా వస్తే మీరు టీడీపీకి చెందిన వారా? అని ప్రశ్నించిన తర్వాతే ఇతర విషయాలు మాట్లాడతారనేది బహిరంగ రహస్యం. డీఆర్ఐలో విధులు..వెంకయ్య చౌదరి డీఆర్ఐలో పని చేసినప్పుడు పూర్తిగా టీడీపీ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించారనే తీవ్ర ఆరోపణలున్నాయి. అప్పట్లో టీడీపీలో ఒక వెలుగు వెలిగి రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించి ఇప్పుడు పార్టీ మారి శాసనసభ్యుడిగా ఉంటూ... బ్యాంకులనుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా కుచ్చు టోపీ పెట్టిన ఓ నాయకుడికి వెంకయ్య ప్రధాన అనుచరుడిగా మెలిగారని చెబుతారు. ఓఎస్డీగా వ్యవహారాలు..2014 –19 మధ్య బాబు సీఎంగా ఉన్న సమయంలో వెంకయ్య చౌదరి ఓఎస్డీగా నియమితులయ్యారు. పెద్దల అండ ఇబ్బడి ముబ్బడిగా ఉండటంతో అడిగేవారు లేరని రెచ్చిపోయిన వెంకయ్య చౌదరి కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తించారని చెబుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎంని కలవడానికి వచ్చినా వారి పట్ల నిర్లక్యంగా వ్యవహరించేవారని, వెకిలిగా మాట్లాడేవాడని అంటుంటారు.ఖనిజాభివృద్ధి శాఖ ఎండీగా..అనంతరం వెంకయ్య చౌదరిని ఓఎస్డీ పదవి నుంచి తప్పించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) ఎండీగా నియమించారు. ఆ పదవిలోనూ చంద్రబాబు, తన కులస్తుల నమ్మకాన్ని వెంకయ్య చౌదరి ఏమాత్రం వమ్ము చేయలేదనే ఆరోపణలున్నాయి. టీడీపీకి చెందిన వారికి మరీ ముఖ్యంగా తన కులానికి చెందిన వ్యాపారస్తులకు లాభాలు చేకూర్చే విధంగా వ్యవహరించారు. 2019లో టీడీపీ పరాజయం అనంతరం వెంకయ్య చౌదరి అక్రమాలు, అవినీతిపై విచారణకు ప్రభుత్వం సిద్ధం కావడంతో దీన్ని పసిగట్టిన ఆయన అడ్డదారుల్లో, టీడీపీ మద్దతుదారుల సాయంతో రిలీవింగ్ లెటర్ సంపాదించుకుని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. బాబు తిరిగి అధికారంలోకి రాగానే చంద్రముఖి మళ్లీ నిద్రలేచింది అన్నట్లుగా వెంకయ్య చౌదరి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చారు. అడుగులకు మడుగులొత్తినందుకే... ఎల్లో మీడియాలో ఒకటైన టీవీ–5 చైర్మన్ బీఆర్ నాయుడు టీడీపీని స్థాపించినప్పటి నుంచి తాను ఆ పార్టీలో సభ్యుడిగా ఉన్నానని చెప్పుకుంటూ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు అడుగులకు మడుగులొత్తారు. అందుకే చంద్రబాబు ఇప్పుడు ఆయనకు టీటీడీ చైర్మన్ పదవిని బహుమతిగా ఇచ్చారు. టీటీడీ చైర్మన్ పదవి దక్కాక బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై నోరుపారేసుకున్నారు. జగన్ త్వరలో జైలుకెళ్లడం ఖాయమని.. చంద్రబాబు కొత్త కేసులు పెడితే జగన్ శాశ్వతంగా జైల్లో ఉండాల్సిందేనని విషం కక్కారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక ఆ సంస్థ పరిపాలన వ్యవహారాల కంటే రాజకీయ వ్యవహారాలకే బీఆర్ నాయుడు పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. పాలనా వ్యవహారాలను గాలికొదిలేసి టీటీడీని టీడీపీ కార్యాలయంగా మార్చేయడంవల్లే తిరుమల చరిత్రలో ఎన్నడూలేని రీతిలో ఘోరం జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో!
చిత్తూరు అర్బన్/తిరుపతి అర్బన్: ‘తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను వాళ్లే చేశారేమో..! దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి ఇలా చేశారని అనుమానం ఉంది. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకో వడానికి తిరుపతిలో టోకెన్లు ఇస్తారనే విషయం నాకు తెలియదు’ అంటూ సీఎం చంద్రబాబు అన్నారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల క్యూలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు గురువారం పరిశీలించారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అసలు గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఇలాంటి ఘనటలు జరుగుతున్నాయన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలని, అలాకాదంటే మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఏకాదశి దర్శనం ఉంటుందన్నారు. పది రోజుల పాటు వైకుంఠ దర్శనం కల్పించడం ఎంత వరకు సమంజసమని అన్నారు. దీనికి ఆగమ శాస్త్రాలు ఒప్పుకుంటాయో లేదో తనకు తెలియదని చెప్పారు. ఆలయ పద్ధతులు ఆగమన శాస్త్రం ప్రకారం ఉండాలని చెప్పారు. భవిష్యత్తులో ఏ ఆలయంలోనూ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీలో కొన్ని మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతిలో టోకెన్లు ఇవ్వడం తన జీవితంలో చూడలేదని చెప్పారు. బీఆర్ నాయుడుకు ఇందులో అనుభవంలేదు కదా అని అన్నారు. బైరాగిపట్టెడ వద్ద పార్కులోని భక్తులను అనుమతించడం సరికాదన్నారు. భక్తుల రద్దీని చూసిన తరువాత అర్ధ గంట ముందే వాళ్లకు టోకెన్లు ఇచ్చి ఉండాల్సిందన్నారు. ఇక్కడ విధుల్లో ఉన్న డీఎస్పీ రమణకుమార్, టీటీడీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి ఘటన స్థలంలో ఉండి కూడా పర్యవేక్షణలో విఫలమయ్యారని, వారిద్దరిన సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు. ఘటనకు బాధ్యులుగా గుర్తించి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్, టీటీడీ జేఈవో గౌతమిని బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. జరిగిన మొత్తం ఘటనపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వడానికి జ్యుడిషియల్ విచారణకు కూడా ఆదేశిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను టీటీడీ ద్వారా అందిస్తామన్నారు. వారి కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని చెప్పారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న తిమ్మక్క, ఈశ్వర్‌కు చెరో రూ.5 లక్షలు, గాయపడ్డ మరో 33 మందికి ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందిస్తామన్నారు. ఈ 35 మందికి ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం కల్పించి, వారి సొంత ఊళ్లల్లో దిగబెడతామని చంద్రబాబు చెప్పారు.ముగ్గురిపై బదిలీ వేటుతిరుపతి ఘటనకు బాధ్యులను చేస్తూ ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు టీటీడీ జేఈవోను ప్రభుత్వం బదిలీ చేసింది. టీటీడీ జేఈవో(హెల్త్అండ్ఎడ్యుకేషన్) గౌతమిని ఆ పోస్టు నుంచి తప్పించారు. ఈమెను తక్షణమే జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎస్.శ్రీధర్, తిరుపతి (అర్బన్) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎల్ సుబ్బరాయుడును కూడా బదిలీ చేశారు. వీరిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నిర్లక్ష్యమే చంపేసింది
తిరుపతి తుడా/తిరుపతి సిటీ/చంద్రగిరి: మితిమీరిన ప్రచారం, అవగాహన రాహిత్యం, భద్రత ఏర్పాట్ల వైఫల్యం భక్తులకు శాపంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతి కేంద్రంగా భక్తులకు టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్, అధికారులు నెల రోజుల నుంచి సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. తరచూ కౌంటర్ల ఏర్పాట్లను పరిశీలిస్తూ, సామాన్య భక్తులకు దర్శనం కల్పించడమే ముఖ్య ఉద్దేశమంటూ ఊదరగొట్టారు. అతి ప్రచారం కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుపతికి పోటెత్తారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఆ స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంతో కౌంటర్ల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. గురువారం ఉదయం 5 గంటల నుంచి మూడు రోజులకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను జారీ చేస్తామని ముందుగానే ప్రకటించడంతో సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు తిరుపతి చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజాము 5 గంటల నుంచే కౌంటర్ల వద్ద బారులు తీరారు. సాయంత్రానికి మరింత మంది తోడవ్వడంతో క్యూలైన్ల వద్ద రద్దీ పోటెత్తింది. సరిగ్గా ఇదే సమయంలో అధికారులు అనాలోచిత నిర్ణయంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. దీంతో వేలాదిగా భక్తులు కౌంటర్ల వద్దకు పరుగులు పెట్టడం.. తోపులాట చోటుచేసుకోవడం.. ఆరుగురు మృతి చెందడం.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం తెలిసిందే. అరుపులు, కేకలు.. నరకయాతన శ్రీనివాసం సముదాయం వద్ద టోకెన్లు తీసుకునేందుకు వేచి ఉన్న భక్తుల్లో సేలంకు చెందిన మల్లిక తీవ్ర అస్వస్థతకు గురైంది. భక్తుల రద్దీతో తోపులాటలో భాగంగా ఆమెకు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో క్యూలైన్ నుంచి బయటకు తీసుకొచ్చినట్లు భర్త కృష్ణన్ తెలిపారు. తొలుత అంబులెన్స్‌లో స్థానిక డీబీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో రుయాకు తరలించే క్రమంలో ఆమె మార్గం మధ్యలో మృతి చెందింది. ఈ ఘటన చోటు చేసుకున్న నిమిషాల వ్యవధిలోనే సత్యనారాయణపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ తోపులాట చోటు చేసుకుంది. అయితే ఇక్కడ పరిస్థితి కొంత సేపటికి అదుపులోకి రావడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం రాత్రి 8.25 గంటల ప్రాంతంలో బైరాగిపట్టెడలోని రామానాయుడు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్యూలైన్ల వద్ద భారీ తోపులాట చోటు చేసుకుంది. దీనికి తోడు అదే సమయంలో తొక్కిసలాటలో కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిన లావణ్య స్వాతిని బయటకు తీసుకొచ్చే క్రమంలో వెలుపలదారి గేట్లను పోలీసులు తెరవడం మరింతగా తొక్కిసలాటకు కారణమైంది. అక్కడ పోలీసు బందోబస్తు లేకపోవడంతో వందలాది మంది భక్తులు అక్కడి నుంచి తోసుకొచ్చారు. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగింది. ముందు వరుసలోని భక్తులు కిందపడి పోవడంతో.. వెనుక ఉన్న వారు వారిని తొక్కుకుంటూ వెళ్లడంతో ఒక్కసారిగా అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అక్కడ ఏం జరుగుతోందో తెలియక వెనుక, ముందు ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమను తాము రక్షించుకోవడానికి వెలుపలకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో కింద పడిన వారిని సైతం తొక్కుకుంటూ తమ కుటుంబ సభ్యులను కాపాడేయత్నంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.నీళ్లు లేవు.. టాయ్లెట్లు లేవు.. ఇవేం ఏర్పాట్లు?కౌంటర్ల వద్ద తాగునీరు, పాలు, అల్పాహారం అందించాలన్న కనీస ఆలోచన కూడా టీటీడీకి రాకపోవడం దుర్మార్గం అని భక్తులు మండిపడ్డారు. చాలా మంది భక్తులు ఆకలితో అలమటించి, నీరసించిపోయారు. క్యూలోంచి పక్కకు వెళితే వెనుకబడిపోతామనే భయంతో చాలా మంది అక్కడి నుంచి కదల్లేదు. చంటి పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు గంటల తరబడి వేచి ఉండటంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మహిళలకు కనీసం మొబైల్ టాయ్లెట్లను సైతం ఏర్పాటు చేయకపోవడంతో వారు నరకయాతన అనుభవించారు. ఇన్ని ఇబ్బందులు ప్రత్యక్షంగా కళ్లకు కనిపిస్తుంటే.. ఏర్పాట్లు ఘనంగా చేశామని టీటీడీ చైర్మన్ మీడియాకు పదే పదే ఎందుకు చెప్పారని భక్తులు నిలదీశారు. దైవ దర్శనానికి వస్తే ప్రాణాలు తీశారని మండిపడ్డారు. -
దేవదేవా.. ఏమిటీ విషాదం!
వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారం గుండా వెళ్లి దేవదేవుని దర్శనం చేసుకుంటే జీవిత కాలం ఆ తదాత్మ్యంలో, భగవంతుడు మోక్ష ప్రాప్తి కలిగిస్తాడన్న ఆనందంలో గడిపేయొచ్చు. ఇదే విశ్వాసంతో లక్షలాది భక్తులు వైకుంఠ ఏకాదశికి తిరుమలేశుని దర్శించుకోవాలని తలంచారు. కానీ, ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్య ధోరణి వల్ల దేవదేవుని దర్శనం కాకుండానే, ఆ ఆనందాన్ని పొందకుండానే ఆరుగురు ప్రాణాలొదిలారు. దేవుడిని దర్శించుకొని వస్తామని ఇంటి నుండి వెళ్లిన వారు విగతజీవులై వస్తున్నారన్న వార్త వారి కుటుంబాలకు శరాఘాతంలా తగిలింది. ఓ కుటుంబంలో పిల్లలకు తల్లి దూరమైంది. మరో కుటుంబంలో లక్ష్మీ కళ తప్పింది. మరో ఇంట్లో కుమారుడి క్షేమం కోసం నిత్యం పూజలు చేసే తల్లే దూరమైంది. ఇంకొక ఇంటి పెద్ద కానరాని దూరాలకు వెళ్లిపోయిడు.. – సీతంపేట, మద్దిలపాలెం, కంచరపాలెం (విశాఖపట్నం), నర్సీపట్నంఅమ్మ చనిపోయిందని పిల్లలకు ఎలా చెప్పాలి?‘తిరుపతి వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనం ఒక్కసారైనా చేసుకుంటానని అనడంతో కాదనలేకపోయాను. కానీ, ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుందని కలలో కూడా ఊహించలేదు. మా అక్క, మరో ముగ్గురు బంధువులతో కలిసి ఈ నెల 5న తిరుపతికి బయల్దేరింది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో క్యూలో ఉండగా ఫోన్ చేసింది. భోజనం చేశారా? పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగింది. ఫోన్లో గోలగా వినిపించడంతో, జనాలు ఎక్కువగా ఉన్నట్టున్నారు జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పింది. మళ్లీ ఫోన్ చేయలేదు. గంట తర్వాత ఫోన్ చేస్తే కలవలేదు. రాత్రి 11 గంటల సమయంలో మా అక్క ఫోన్ చేసి తొక్కిసలాటలో అందరం తలో దిక్కు అయిపోయామని, అందరం కలిశాం.. కానీ లావణ్య కనిపించడంలేదని చెప్పింది. ఆస్పత్రికి వెళ్లి చూడగా లావణ్య చనిపోయి ఉందని రాత్రి 12.30 సమయంలో నాకు ఫోన్ చేసి చెప్పారు. దర్శనానికి వెళ్లిన అమ్మ తిరిగి వస్తుందని నా పిల్లలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తల్లిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని పిల్లలకు మీ అమ్మ చనిపోయిందని, దేవుడి దగ్గరికి వెళ్లిపోయిందని నా నోటితో ఎలా చెప్పను’ అంటూ లావణ్య భర్త సతీష్ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే విశాఖపట్నం వెంకటేశ్వర కాలనీ ప్రజలహృదయాలు బరువెక్కాయి. విశాఖలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన సూరిశెట్టి లావణ్య తన ఆడపడుచు, మరో ముగ్గురు మహిళలతో కలిసి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ నెల 5న తిరుమల వెళ్లారు. టోకెన్ల కోసం క్యూలో ఉండగా జరిగిన తొక్కిసలాటలో లావణ్య ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త సతీష్ సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద పాప శ్రీలాస్య 9వ తరగతి, చిన్న పాప కీర్తి 6వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ తల్లి లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. తల్లి మరణవార్తను పిల్లలకు ఎలా చెప్పాలో తెలియక సతీష్ వారిని బాజీ జంక్షన్‌లోని తన అక్క ఇంటికి పంపించేశాడు.‘శాంతి’ దూరమై విలపిస్తున్న కుటుంబంవిశాఖపట్నం కంచరపాలెం సమీపంలోని గాంధీనగర్‌లో కండిపిల్లి శాంతి కుటుంబం వేంకటేశ్వర స్వామి భక్తులు. ఆమె భర్త వెంకటేష్ ఆటో డ్రైవర్. కుమారుడు మహేంద్ర వరప్రసాద్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముగ్గురూ గోవింద మాల దీక్ష చేపట్టారు. తొమ్మిది రోజుల పాటు గోవింద నామస్మరణతో కఠిన నియమాలు పాటిస్తూ దీక్ష చేశారు. 11వ రోజున దీక్ష విరమణ కోసం ఆ కుటుంబం తిరుపతికి వెళ్లింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో శాంతి దుర్మరణం పాలయ్యారు. తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి వెంకటేష్, వరప్రసాద్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి కన్నీరుమున్నీరయ్యారు. దీంతో ఇందిరానగర్‌లోని శాంతి తల్లి, అన్నదమ్ములు, బంధువులు, గాంధీనగర్‌లోని అత్తమామలు విషాదంలో కూరుకుపోయారు. శాంతి అందరితో మంచిగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, తిరుమల వెళ్లాలంటేనే భయంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముందు ఉన్న అమ్మ చనిపోయింది‘టోకెన్ల కోసం క్యూలో ఉండగా గేట్లు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట జరిగింది. నేను, నాన్న వెనుక ఉన్నాం. ముందు ఉన్న అమ్మ తొక్కిసలాటలో మిగతావారి కాళ్ల కింద నలిగిపోయింది’ అని ఆమె కుమారుడు కండిపిల్లి వరప్రసాద్ రోదిస్తూ జరిగిన సంఘటనను వివరించాడు.నా కూతురిని పొట్టన పెట్టుకున్నారుతిరుపతి దర్శనానికి వెళ్లిన నా కూతురు శాంతిని ప్రభుత్వమే పొట్టన పెట్టుకుంది. వైకుంఠ ఏకాదశికి లచ్చల్లో భక్తులు వస్తారని తెలిసినా, దేవస్థానం అధికారులు, ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా భక్తుల మరణానికి కారణమయ్యారు. నా కడుపు కోత నాయకులకు శాపంగా మారాలి. – కిల్లాడి అప్పలనరసమ్మ, శాంతి తల్లిమా కుటుంబాన్ని బాగా నడిపించేది మా కోడలు శాంతి మరణవార్త వినగానే మా ప్రాణాలు పోయినట్టు అయ్యింది. ఆమె అందరినీ కలుపుకొంటూ కుటుంబాన్ని నడిపేది. గ్రామంలో, చుట్టుపక్కల ఇళ్లలో, బంధువులతో కలుపుగోలుగా ఉండేది. మమ్మల్ని బాగా చూసుకునేది. – కండిపిల్లి అప్పారావు, శాంతి మామయ్యకుమారుడి ఉన్నతి కోసం పరితపించి..విశాఖపట్నం మద్దిలపాలెం రామాలయం సమీపంలో నివసించే ఆటో డ్రైవర్ గుడ్ల లక్ష్మారెడ్డి, రజనీ (47) దంపతులకు ఒక్కడే కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి. ఎంతో కష్టపడి అతన్ని బాగా చదివించారు. రెండేళ్ల క్రితం ఎంఎస్ చదువు కోసం అమెరికా పంపించారు. ఇందుకోసం ఇంట్లో సగభాగాన్ని విక్రయించారు. కుమారుడి భవిష్యత్తు బాగుండాలని రజని నిత్యం శ్రీ వేంకటేశ్వర స్వామికి పూజలు చేసేదని సమీప బంధువులు తెలిపారు. ప్రతి శనివారం ఆమె స్వామిని ప్రత్యేకంగా ఆరాధించేది. కుమారుడికి మంచి ఉద్యోగం రావాలని కోరుకునేది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిత్యం ఆరాధించే వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లక్ష్మారెడ్డి దంపతులు, బంధువులు పది మంది తిరుపతి వెళ్లారు. వారంతా ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల కోసం క్యూలో నిలబడ్డారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో రజనీ ప్రాణాలు కోల్పోయింది. కుమారుడి చదువు పూర్తయి, ఉద్యోగం వచ్చే సమయంలోనే రజని మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పైసా పైసా కూడబెట్టి తనను అమెరికా పంపిన తల్లి ఇక లేదన్న వార్త విని హర్షవర్ధన్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. అతను శుక్రవారం అమెరికా నుంచి విశాఖపట్నం చేరుకుంటాడని రజని బంధువులు తెలిపారు.ఆ ఇల్లే దేవాలయం గుడ్ల రజని పరమ భక్తురాలు. నిత్యం భగవత్ ఆరాధనలో గడిపేది. ఆమె ఇంట్లో ఎక్కడ చూసినా దేవుని చిత్రపటాలే కనిపిస్తాయి. ఆమె ఇల్లే ఓ దేవాలయం. కుమారుడి భవిష్యత్తు కోసం వేంకటేశ్వరస్వామికి నిత్యం పూజలు చేసేది. సాయిబాబాని ఆరాధించేది. అంతటి భక్తురాలు ఇలా అర్ధంతరంగా మరణించడంతో మేమందరం జీర్ణించుకోలేకపోతున్నాం. – ఎం.లక్ష్మి, మద్దిలపాలెంవెళ్లిపోయిన పెద్ద దిక్కు..తిరుపతి తొక్కిసలాట మృతుల్లో ఒకరైన బొడ్డేటి నాయుడుబాబు నర్సీపట్నం పట్టణంలోని పెదబొడ్డేపల్లి నివాసి. బోరుబావుల నిర్మాణ కార్మికుడు. భార్య మణికుమారి, కుమార్తె సునీత ఉన్నారు. ఈ నెల 6న నాయుడుబాబు, మణికుమారి, నర్సీపట్నం మండలం చెట్టుపల్లికి చెందిన కుటుంబ స్నేహితులైన కరణం సత్యనారాయణ, అతని భార్య సంతోషి కలిసి తిరుపతి వైకుంఠ దర్శనానికి వెళ్ళారు. క్యూలో జరిగిన తొక్కిసలాటలో భార్య, భర్త తలోదారి అయ్యారు. మణికుమారిని పోలీసులు రక్షించారు. నాయుడుబాబు మరణించారు. ఆయన ఫోన్ నుంచే పోలీసులు మణికుమారికి ఈ విషయం చెప్పారు.ఏటా తిరిగి వచ్చే నాన్న ఈసారి రాలేదునాన్నకు వేంకటేశ్వరస్వామి అంటే ఎనలేని భక్తి. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్తుంటాడు. అప్పుడు కాకుండా మరో మూడు నాలుగుసార్లు దర్శనానికి వెళ్తాడు. ఈ సారి రద్దీ దృష్ట్యా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లవద్దని చెప్పాం. ఏటా దర్శనం చేసుకొని ఆనందంగా తిరిగి వచ్చే నాన్న ఈసారి రాలేదు. మాకు నాన్నే పెద్ద దిక్కు. మా కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలి’ అంటూ కుమార్తె సునీత రోదిస్తోంది. – సునీత, నాయుడుబాబు కుమార్తె నా కుడి భుజం పోయింది...నా కుడి భుజం పోయింది. నాకు అన్ని విషయాల్లో నా సోదరుడు అండగా ఉండేవాడు. స్వామి సన్నిధిలో ఇలా జరగటం బాధాకరం. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయాం. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – బి.వి.రమణ, నాయుడుబాబు సోదరుడు -
తిరుపతి తొక్కిసలాట - క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫోటోలు)
-
తిరుపతిలో సీఎం చంద్రబాబు డ్రామా.. మైక్ లేకుండా.. మైక్ పెట్టుకుని
తిరుపతి: సీఎం చంద్రబాబు మార్క్ డ్రామాను చూసి తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు విన్యాసాలు చూసి వామ్మో అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే?తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు అధికారులపై చిందులు తొక్కారు. తమాషాలు చేస్తున్నారా? అంటూ టీటీడీ ఈవోపై ఫైరయినట్లు కలరింగ్ ఇచ్చారు. మీడియా కెమెరాలు చూసుకుని మరి హైడ్రామా పండించారు. బాధ్యత తీసుకుని సమీక్ష చేయాల్సిన ముఖ్యమంత్రి మీడియా కెమెరాల ముందు చేసిన హడావిడి చూసి జనం కూడా అవాక్కయ్యారు.ఏదైనా మంచి జరిగితే తనఖాతాలో వేసుకునే చంద్రబాబు.. ఏదైనా తప్పు జరిగితే ఇతరులపై నెట్టివేయడం చంద్రబాబు దిట్టా అంటూ చర్చించుకుంటున్నారు. -
LIVE: తిరుపతి ఘటనపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి
-
అంబులెన్సుకు ఫోన్ చేయమంటే ఫోన్లో వీడియోలు చూస్తున్నారు
-
బాబు దొంగ డ్రామా.. మైక్ లేకుండా.. మైక్ పెట్టుకుని
-
తప్పు ప్రభుత్వానిదే పవన్ మరో ప్రాయశ్చిత్త దీక్ష ?
-
రోజా ఫైర్...!
-
వైఎస్ జగన్ గూస్ బంప్స్ విజువల్స్
-
అడ్డుకున్న పోలీసులు... తగ్గేదేలే అంటూ నడుచుకుంటూ వెళ్లిన జగన్