రైల్వే స్టేషన్‌లో దీపావళి రద్దీ.. తొక్కిసలాటలో తొమ్మిదిమందికి గాయాలు | 9 People Injured in Stampede at Mumbai | Sakshi

రైల్వే స్టేషన్‌లో దీపావళి రద్దీ.. తొక్కిసలాటలో తొమ్మిదిమందికి గాయాలు

Oct 27 2024 10:13 AM | Updated on Oct 29 2024 1:33 PM

9 People Injured in Stampede at Mumbai

ముంబై: ముంబైలోని బాంద్రా టెర్మినల్ రైల్వే స్టేషన్‌లో ఈరోజు (ఆదివారం) ఉదయం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది గాయపడ్డారు. రైలు ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒక్కసారిగా పోటీ పడటంతో ఈ తొక్కిసలాట జరిగింది.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం తొక్కిసలాట అనంతరం అప్రమత్తమైన రైల్వే అధికారులు గాయపడినవారిని ముంబైలోని భాభా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది. బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తొక్కిసలాటలో గాయపడిన తొమ్మదిమందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాంద్రా టెర్మినస్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై ఉదయం 5.56 గంటలకు ఈ ఘటన జరిగింది.
 

బాంద్రా-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కడానికి ప్రయాణికులు పోటీ పడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని షబ్బీర్ అబ్దుల్ రెహ్మాన్ (40), పరమేశ్వర్ సుఖ్‌దర్ గుప్తా (28), రవీంద్ర హరిహర్ చుమా (30), రామసేవక్ రవీంద్ర ప్రసాద్ ప్రజాపతి (29), సంజయ్ తిలక్రం కంగాయ్ (27), దివ్యాంశు యోగేంద్ర యాదవ్ (27), మహ్మద్ షరీఫ్ షేక్ (25), ఇంద్రజిత్ సాహ్ని (19), నూర్ మహ్మద్ షేక్ (18)గా పోలీసులు గుర్తించారు.


 


ఇది కూడా చదవండి: కేజీఎఫ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement