బాంద్రా రైల్వేస్టేషన్లో తొక్కిసలాట.. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌ | CCTV Captures Moments Before Stampede At Mumbais Bandra Terminus | Sakshi
Sakshi News home page

బాంద్రా రైల్వేస్టేషన్లో తొక్కిసలాట.. క్షణాల ముందు సీసీటీవీ దృశ్యాలు వైరల్‌

Published Mon, Oct 28 2024 3:29 PM | Last Updated on Mon, Oct 28 2024 3:57 PM

CCTV Captures Moments Before Stampede At Mumbais Bandra Terminus

ముంబైలోని బాంద్రా టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌లో  తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ ఘటనలో 10  మందికి గాయాలయ్యాయి. బాంద్రా టెర్మినస్ లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్‌పై బాంద్రా -గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కే సమయంలో భారీగా ప్రయాణికులు ఒక్కసారిగా రావడంతో ఈ ఘటన జరిగింది.

 ాజాగా రైల్వేస్టేషన్‌లో రైలు రావడానికి ముందు ఎదురుచూస్తున్న ప్రయాణికులకు చెందిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. ఆదివారం తెల్లవారుజామున 2.44 గంటలకు 22 కోచ్‌లతో బాంద్రా-గోరఖ్‌పూర్‌ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ప్లాట్‌ఫామ్‌ మీదకు రావడంతో జనరల్‌ బోగీలో ఎక్కేందుకు ఒక్కసారిగా ప్రయాణికులు ఎగబడినట్లు ఇందులో కనిపిస్తుంది. దీపావళి పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు. పెద్దఎత్తున రైలు ఎక్కేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. కొంతమంది ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ విండో ద్వారా కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.

 గాయపడిన వారిని షభీర్ అబ్దుల్ రెహ్మాన్ (40), పరమేశ్వర్ సుఖ్‌దర్ గుప్తా (28), రవీంద్ర హరిహర్ చుమా (30), రామసేవక్ రవీంద్ర ప్రసాద్ ప్రజాపతి (29), సంజయ్ తిలక్రం కాన్గే (27), దివ్యాంశు యోగేంద్ర యాదవ్ (18), మహ్మద్‌, షరీఫ్ షేక్ (25), ఇంద్రజిత్ సహాని (19), నూర్ మహ్మద్ షేక్ (18) లుగా అధికారులు గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement