
ముంబై: భారతీయుల కలల నగరం ముంబై(Mumbai) త్వరలో మరో ఖ్యాతిని కూడా దక్కించుకోబోతోంది. ముంబైలోని థానేలో 11 అంతస్థుల రైల్వే స్టేషన్ నిర్మితం కానుంది. ఈ రైల్వే స్టేషన్‌లో కేవలం రైళ్ల రాకపోకలే కాకుండా ప్రయాణికులకు వినోదాన్ని అందించే పలు వేదికలు కూడా సిద్ధం కానున్నాయి. ఈ రైల్వే స్టేషన్ పైభాగంలో అద్భుతమైన మాల్, ఆఫీస్ స్పేస్, రిటైల్ షాపులు కూడా ఉండనున్నాయి. ఈ ప్రాజక్టు పూర్తయితే రైల్వేశాఖకు భారీగా ఆదాయం సమకూరనుంది.
థానే రైల్వే స్టేషన్(Thane Railway Station)లోని 10ఏ ప్లాట్‌ఫారంలో తొమ్మిది వేల చదరపు మీటర్ల ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టుకు కేటాయించనున్నారు. దీనితోపాటు 24,280 చదరవు మీటర్ల ప్రాంతాన్ని లీజుకు తీసుకోనున్నారు. ఈ లీజు 60 ఏళ్ల పాటు కొనసాగనుంది. ఈ ప్రాజెక్టును 2026, జూన్ 30 నాటికి పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రైల్వే స్టేషన్‌కు బస్సులు, మెట్రో సేవలను అనుసంధానించనున్నారు.
రైల్వే స్టేషన్ బేస్‌మెంట్(Basement)లో పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఇక్కడి నుంచే లోకల్ బస్సులు ఎక్కే అవకాశం కల్పించనున్నారు. పైఫ్లోర్‌లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ఇక్కడ ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్‌లు ఏర్పాటు చేయనున్నారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటుకు కూడా అనుమతి ఇవ్వనున్నారు.
ఇది కూడా చదవండి: Holi 2025: ఈ దేశాల్లోనూ అంబరాన్నంటే హోలీ వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment