
మహారాష్ట్రలోని నవీ ముంబైలో మూడంతస్తుల భవనం ‘ఇందిరా నివాస్’ కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. షాబాజ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్, ముంబై పోలీసులు, అగ్నిమాపక శాఖ, మున్సిపాలిటీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
#WATCH नवी मुंबई (महाराष्ट्र): शाहबाज गांव में तीन मंजिला इमारत 'इंदिरा निवास' ढह गई है। कई लोग मलबे में फंसे हुए हैं। मौके पर NDRF, पुलिस, अग्निशमन दल और नगरपालिका के अधिकारी पहुंचे हैं। बचाव कार्य जारी है।
अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/oNkccmXiS1— ANI_HindiNews (@AHindinews) July 27, 2024
మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4:35 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. భవనం కూలిపోతుండటాన్ని గ్రహించిన కొందరు బయటకు పరుగుపరుగున వచ్చారు. అయితే కొందరు బయటకు రావడం ఆలస్యం కావడంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనలో ఇద్దరిని రక్షించి ఆసుపత్రికి తరలించామని నవీ ముంబై మునిసిపల్ కమిషనర్ కైలాష్ షిండే తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపడుతున్నదని, కుప్పకూలిన భవనం పదేళ్ల క్రితం నాటిదని అన్నారు. భవన యజమానిపై చర్యలు తీసుకుంటామని షిండే పేర్కొన్నారు.
#WATCH नवी मुंबई (महाराष्ट्र): कैलाश शिंदे (पालिका आयुक्त नवी मुंबई) ने कहा, "करीब आज सुबह 5 बजे के पहले ये इमारत ढह गई। ये जी+3 की इमारत है सेक्टर-19, शाहबाज गांव में है। ये 3 मंजिला इमारत था इमारत से 52 लोग सुरक्षित बाहर निकले और मलबे में फंसे 2 लोगों को बचाया गया है और भी 2… https://t.co/tKmHs4xIWG pic.twitter.com/6ha8X3PtW9
— ANI_HindiNews (@AHindinews) July 27, 2024