
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని గిర్‌గావ్ చౌపటీలో గల నాలుగు అంతస్తుల భవనంలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనమయ్యారని, ముగ్గురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఒక ప్రకటనలో తెలిపింది. భవనంలో చాలామంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.
ముంబైలోని గిర్‌గామ్ చౌపటీ ప్రాంతంలోని గోమతి భవన్‌లో లెవల్-2లో మంటలు చెలరేగాయని బీఎంసీ తెలిపింది. 10 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పే పని కొనసాగుతోంది. మంటలు భవనంలోని మూడు, నాలుగు అంతస్తులకు వ్యాపించాయి.
రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తమకు ఈ సమాచారం అందిందని పోలీసు అధికారి తెలిపారు. అనంతరం పది అగ్నిమాపక యంత్రాలతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. భవనం నుంచి దహనమైన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. భవనంలోని మూడో అంతస్తులో ఈ మృతదేహాలు కనిపించాయని అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో పొగమంచు.. విమానాలు మళ్లింపు
#WATCH | Maharashtra: Fire broke out at Gomti Bhawan Building in Mumbai's Girgaon Chowpatty. Firefighting operations are underway. pic.twitter.com/jZHbCxkNUF
— ANI (@ANI) December 2, 2023