ముంబైలో ఓ భవంతిలో భారీ అగ్ని ప్రమాదం | Fire breaks out at Mumbai building, 5 dead | Sakshi
Sakshi News home page

ముంబైలో ఓ భవంతిలో భారీ అగ్ని ప్రమాదం

Published Sat, Jun 6 2015 9:54 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

ముంబై నగరంలోని చండివాలి ప్రాంతంలో ఓ భారీ భవంతిలో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ముంబై:నగరంలోని చండివాలి ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల భవనంలో శనివారం సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంథేరీలోని ఇరవై అంతస్తుల పైగా ఉన్నా భవనంలోని 14వ  అంతస్తులో ఈరోజు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆకస్మికంగా మంటలు వ్యాపించి భారీ అగ్ని ప్రమాదానికి దారి తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

 

దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. మృతులు సంఖ్య  మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement