
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని నాంగ్లోయీలోని ఒక భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నికీలలు భవన్నాన్నంతటినీ చుట్టుముట్టాయి. మంగళవారం పొద్దుపోయాక ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భవనంలో ఉంటున్నవారంతా భయాందోళనలకు లోనయ్యారు. అయితే వారంతా అప్రమత్తమై, తమ బాల్కనీలలోనికి చేరుకుని ఒక్కొక్కరుగా రెండో అంతస్థు నుంచి దూకారు. ఈ నేపధ్యంలో వారంతా గాయాలపాలయ్యారు. బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమేమిటన్నది ఇంకా వెల్లడి కాలేదు.
देखिए एक घर में लगी भयंकर आग,एक शख़्स दूसरी मंज़िल से कूद पड़ा
आग लगने की घटना दिल्ली नांगलोई फोन मार्किट कल देर रात की है , जिसका वीडियो सामने आया है बताया जा रहा है गैस लीक होने की वजह से एक घर की पहली मंजिल पर आग लग गई थी,दूसरी मंज़िल पर से एक व्यक्ति ने छलांग लगा दी जो घायल… pic.twitter.com/MvwtDgwzua— Lavely Bakshi (@lavelybakshi) February 18, 2025
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో భవనంలో ఎగసిపడుతున్న మంటలను, బాల్కనీలో నుంచి దూకుతున్నవారిని చూడవచ్చు. అలాగే అక్కడే ఉన్న ఫైర్ బ్రిగేడ్ మంటలు ఆపే ప్రయత్నం చేయడాన్ని కూడా గమనించవచ్చు. భవనంలో వ్యాపించిన మంటల నుంచి మొత్తం ఆరుగురు రెండో అంతస్థు నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఇది కూడా చదవండి: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?.. భగవంత్ మాన్ క్లారిటీ