ఎవరీ నిధి తివారీ? ఏకంగా ప్రధాని మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా యువ ఐఎఫ్ఎస్ అధికారిణి..! | Nidhi Tewari Appointed Private Secretary To PM Modi | Sakshi
Sakshi News home page

ఎవరీ నిధి తివారీ? ఏకంగా ప్రధాని మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా యువ ఐఎఫ్ఎస్ అధికారిణి..!

Mar 31 2025 4:33 PM | Updated on Mar 31 2025 6:17 PM

Nidhi Tewari Appointed Private Secretary To PM Modi

ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్‌ సెక్రటరీగా నిధి తివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్(డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర క్యాబినేట్‌ నియమకాల కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది. 

నిధి తివారీ ఎవరంటే..
2014 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారిణి జనవరి 6, 2023 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంతకుముందు 2022లో పీఎంవోలో అండర్‌ సెక్రటరీగా చేరారు. గతంలో ఆమె విదేశాంగ మంత్రిత్వ శాఖలో అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె మోదీ ప్రైవేట్‌ కార్యదర్శిగా నియామకం జరిగింది. 

ఇక తివారీ పీఎంవోలో మూడు సంవత్సరాలకు పైగా పనిచేశారు. 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు, ఆమె వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (వాణిజ్య పన్ను విభాగంలో)గా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఉద్యోగంతో పాటు 2014 సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమై.. 96వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం నిధి ఈ పీఎంవోలో ప్రధానమంత్రి కార్యాలయం-పీఎంలో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, పీఎంవోలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వశాఖలోనూ పని చేశారు. ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో ఉద్యోగం చేశారు. భారత్‌కు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో నిధి తివారీకి ఉన్న నైపుణ్యమే పీఎంవోలో కీలకపాత్ర పోషించే స్థాయికి చేరుకున్నారనేది అధికారిక వర్గాల సమాచారం. 

కాగా, ప్రధానమంత్రికి ఇప్పటివరకు ఇద్దరు ప్రైవేట్ కార్యదర్శులు ఉండగా..ఒకరు వివేక్ కుమార్ మరొకరు హార్దిక్ సతీశ్చంద్ర షా..ఇప్పుడు మూడో ప్రైవేట్‌ సెక్రటరీగా నిధి అగర్వాల్‌ నియామకం అయ్యారు.

 

(చదవండి: నా పిల్లలు భారత్‌లోనే పెరగాలి ఎందుకంటే..? వైరల్‌గా అమెరికన్‌ తల్లి పోస్ట్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement