PMO
-
Nidhi Tiwari: ప్రధానికి ప్రైవేట్ సెక్రటరీ
వ్యక్తిగత కార్యదర్శి బాధ్యత జటిలమైనది. బాస్ చెప్పింది అర్థం చేసుకుని చెప్పబోయేది గ్రహించి చెబుతున్నది అమలు చేయాలి. మరి ఆ బాస్ ప్రధాని అయితే?అలాంటి జటిలమైన బాధ్యతకు ఎంపికైంది నిధి తివారి. వారణాసికి చెందిన ఈ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ పి.ఎం.ఓ.లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. ఆమె వ్యక్తిత్వం, వ్యక్తిగత వివరాలు.వారణాసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలు కూడా తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయి ఈ స్థానానికి చేరిందే అని గర్వంగా చూస్తున్నారు. ప్రధానికి ప్రయివేట్ సెక్రటరీగా నియమితురాలైన నిధి తివారి సొంత ఊరు వారణాసి అయితే సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. మరి ఈ హర్షం సహజమే కదా. ఏ పార్లమెంట్ స్థానం నుంచి ప్రధానిప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ స్థానానికి చెందిన మహిళకే ప్రధాని ఈ అవకాశం ఇవ్వడం వారణాసి ప్రజలకు నచ్చింది. ప్రధాని రోజువారి కార్యక్రమాల సమన్వయం చూసే వ్యక్తిగా నిధి తివారి పని చేయడం అంటే సామాన్యమా? సన్నివేశం కొంచెం అటు ఇటుగా మనం సినిమాల్లో చూసినట్టే ఉంటుంది.ప్రధాని ముందు రోజు అడుగుతారు– ‘రేపటి నా కార్యక్రమాలు ఏమిటి?’నిధి తివారి చెప్తారు: ‘సర్.. ఫలానా శాఖకు చెందిన మంత్రి మిమ్మల్ని కలవడానికి వస్తారు. ఫలానా శాఖ డైరెక్టర్ వచ్చి నివేదిక అందజేస్తారు. ఫలానా కార్యక్రమంప్రారంభోత్సవానికి వెళతారు. అయితే ఈ కార్యక్రమాలు ఫిక్స్డ్ కాదు. ఇంత పెద్ద దేశంలో ఎన్నో తక్షణ సమస్యలు వస్తాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రధానిని అర్జెంట్‌గా కలవాలని ముఖ్యమంత్రుల దగ్గరి నుంచి ఉన్నత అధికారులు, ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు అపాయింట్మెంట్లు అడుగుతారు. దేశాల నుంచి ఆహ్వానాలు వస్తుంటాయి. వాటన్నింటినీ సమన్వయం చేసి, ప్రధాని ప్రాధాన్యాలు గమనించి కార్యక్రమాల రూపకల్పన చేయాల్సి ఉంటుంది. ఈ కత్తి మీద సాముకే నిధి తివారి ఎంపికైంది.ఎవరు ఈ నిధి?నిధి తివారి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత కార్యదర్శి (ప్రైవేట్ కార్యదర్శి)గా ఇటీవల ఆమె నియమితులవడంలో ‘పిఎంఓ’లో స్త్రీలప్రాధాన్యం పెరుగుతున్నదనడానికి మరో ఆనవాలుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2022 నవంబర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్నున్న నిధి ఇప్పుడు ప్రధాన వ్యక్తిగత కార్యదర్శిగా ప్రమోట్ అయ్యారు. వారణాసిలోని మెహమర్‌గంజ్‌లో పుట్టి పెరిగిన నిధి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ చేశారు. ఆ యూనివర్సిటీలోనే పరిచయమైన దియోరియా జిల్లాకు చెందిన వైద్యుడు డా.సుశీల్ జైస్వాల్‌ను 2006లో వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత సివిల్స్సివిల్ సర్వీసెస్‌లో చేరి దేశానికి తనవంతు సేవ చేయాలనేది చిన్ననాటి నుంచి నిధి లక్ష్యం. ’వివాహం విద్య నాశాయ’ అన్న మాటను అబద్ధం చేస్తూ కష్టపడి చదివి, వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (కమర్షియల్ ట్యాక్స్) ఉద్యోగం సాధించారు. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కి సన్నద్ధమయ్యారు. కొడుకు పుట్టినా ఆమె తన లక్ష్యం వీడలేదు. 2013 సివిల్స్ ఫలితాల్లో 96వ ర్యాంకు సాధించారు. ఐఎఫ్ఎస్ అధికారిణిగా 2016లో శిక్షణలో ఉన్న సమయంలోనే ఆమె చూపిన ప్రతిభకు గుర్తింపుగా ’అంబాసిడర్ విమల్ సన్యాల్ స్మారక పతకం’ అందుకున్నారు.మొదటి మహిళమోది ప్రధాని అయ్యాక ఈ 11 ఏళ్లలో వ్యక్తిగత కార్యదర్శులుగా వివేక్ కుమార్, హార్దిక్ సతీష్ చంద్ర షా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆ స్థానంలో నిధి తివారీ మొదటి మహిళగా నియమితులయ్యారు. ప్రధాని వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఆమెకు నెలకు రూ.1.44 లక్షల వేతనంతోపాటు ఇతర సదుపాయాలన్నీ అందుతాయి. ప్రతిభ, సామర్థ్యం ఉంటే స్త్రీల ఉన్నతికి ఆకాశమే హద్దు అని నిరూపించేందుకు నిధి తివారి మరో గొప్ప ఉదాహరణగా నిలిచారు.అజిత్ దోవల్ టీమ్లోప్రధానమంత్రి కార్యాలయంలో పని చేయడానికి ముందు ప్రభుత్వం ఆమెను విదేశీ వ్యవహారాల శాఖలో ’నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాలు’ (డిజార్మమెంట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్) విభాగంలో అధికారిగా నియమించింది. దాంతోపాటు రాజస్థాన్‌కు సంబంధించిన పలు అంశాలపైనా ఆమె పనిచేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆధ్వర్యంలో ఆమె చూపిన ప్రతిభ ఆమెపై గౌరవాన్ని పెంచింది. దేశ భద్రత, అణుశక్తి, విదేశీ వ్యవహారాల వంటి అంశాలను ఆమె చాకచక్యంగా నిర్వహించగలదన్న నమ్మకం కుదిరింది. ఆ తర్వాత 2023లో భారత్‌లో తొలిసారి జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో నిధి తివారీ చురుకుదనం, వ్యవహార శైలి, దీక్ష, పట్టుదలపై ప్రధానికి ఆమె మీద విశ్వాసం ఏర్పడింది. -
ఎవరీ నిధి తివారీ? ఏకంగా ప్రధాని మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా యువ ఐఎఫ్ఎస్ అధికారిణి..!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర క్యాబినేట్ నియమకాల కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది. నిధి తివారీ ఎవరంటే..2014 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారిణి జనవరి 6, 2023 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంతకుముందు 2022లో పీఎంవోలో అండర్ సెక్రటరీగా చేరారు. గతంలో ఆమె విదేశాంగ మంత్రిత్వ శాఖలో అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నియామకం జరిగింది. ఇక తివారీ పీఎంవోలో మూడు సంవత్సరాలకు పైగా పనిచేశారు. 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు, ఆమె వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (వాణిజ్య పన్ను విభాగంలో)గా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఉద్యోగంతో పాటు 2014 సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమై.. 96వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం నిధి ఈ పీఎంవోలో ప్రధానమంత్రి కార్యాలయం-పీఎంలో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా, పీఎంవోలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వశాఖలోనూ పని చేశారు. ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో ఉద్యోగం చేశారు. భారత్‌కు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో నిధి తివారీకి ఉన్న నైపుణ్యమే పీఎంవోలో కీలకపాత్ర పోషించే స్థాయికి చేరుకున్నారనేది అధికారిక వర్గాల సమాచారం. కాగా, ప్రధానమంత్రికి ఇప్పటివరకు ఇద్దరు ప్రైవేట్ కార్యదర్శులు ఉండగా..ఒకరు వివేక్ కుమార్ మరొకరు హార్దిక్ సతీశ్‌చంద్ర షా..ఇప్పుడు మూడో ప్రైవేట్ సెక్రటరీగా నిధి అగర్వాల్ నియామకం అయ్యారు.Nidhi Tewari appointed as Private Secretary to Prime Minister Narendra Modi. pic.twitter.com/erpTlJfjfn— Press Trust of India (@PTI_News) March 31, 2025 (చదవండి: నా పిల్లలు భారత్‌లోనే పెరగాలి ఎందుకంటే..? వైరల్‌గా అమెరికన్ తల్లి పోస్ట్) -
లేఆఫ్స్.. ఇన్ఫోసిస్‌లో అసలేం జరుగుతోంది!
ఢిల్లీ : ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల వంద మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఈ తొలగింపుల అంశం పీఎంవో కార్యాలయానికి చేరింది. దీంతో ఇన్ఫోసిస్‌లో అసలేం జరగుతోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల, ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 100 అభ్యర్థులకు ఇన్ఫోసిస్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించింది. అయితే, ఆ టెస్టులో ఉద్యోగులు ఫెయిలయ్యారు. దీంతో వారిని విధుల నుంచి తొలగించింది. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు పొందేలా జోక్యం చేసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ ఫిర్యాదు అనంతరం కేంద్ర కార్మిక శాఖ కర్ణాటక కార్మిక కమిషనర్‌కు మరో లేఖ జారీ చేసింది. ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్‌లో తొలగించిన ట్రైనీ ఉద్యోగుల విషయంలో జోక్యం చేసుకోవాలని, ఈ అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరి 25న జారీ చేసిన లేఖలో పేర్కొంది. రెండేళ్ల తర్వాత ఉద్యోగాలుఇన్ఫోసిస్ రెండేళ్ల క్రితం వందల మంది ఫ్రెషర్స్‌ని నియమించుకుంది. వెంటనే వారిని విధుల్లో తీసుకోలేదు. రెండేళ్ల తర్వాత గతేడాది అక్టోబర్‌లో విధుల్లోకి తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా వారిలో 300 మందికి పైగా ఫ్రెషర్స్‌కు అసెస్మెంట్ ఎగ్జామ్ నిర్వహించింది. అందులో ఫ్రెషర్స్ ఫెయిల్ అయ్యారనే కారణంతో విధుల నుంచి తొలగించింది. దీనిపై ఐటీ రంగంలో దుమారం చెలగరేగింది. ఇన్ఫోసిస్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ ఖండించింది. కేంద్రం కార్మిక శాఖ జోక్యం చేసుకుని ఇన్ఫోసిస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదే అంశంపై నైట్స్ పీఎంవో కార్యాలయానికి లేఖరాసింది. ఆ లేఖపై కేంద్ర కార్మిక శాఖ స్పందించింది. పీఎంవో కార్యాలయానికి ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ తొలగింపులపై ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులో అభ్యర్థులు తమ ఉద్యోగం తిరిగి పొందేలా, భవిష్యత్తులో ఇతర ఉద్యోగుల్ని అక్రమంగా తొలగించకుండా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొంది. ఆందోళన చేస్తాంమరోవైపు, ఇన్ఫోసిస్‌లో లేఆప్స్‌పై ఉద్యోగుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు మేము ఉద్యోగులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారుల్ని కోరుతున్నాం. కానీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే లేఆఫ్స్ గురైన ఉద్యోగులతో కలిసి ఆందోళన చేస్తామని ప్రకటించింది. వెంటనే ఈ సమస్యకు పరిష్కరం చూపేలా చర్యలు తీసుకోవాలని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
ఇన్ఫోసిస్ లేఆఫ్‌లలో మరో ట్విస్ట్..
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) లేఆఫ్‌లలో మరో పరిణామం చోటుచేసుకుంది. బలవంతపు తొలగింపులపై ఇన్ఫోసిస్ ట్రైనీలు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తలుపులు తట్టారు. ఇన్ఫోసిస్ తమను అన్యాయంగా తొలగించిందని (Layoffs), తిరిగి విధుల్లోకి తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి తొలగింపులు జరగకుండా చూడాలని కోరుతూ 100 మందికి పైగా బాధితులు పీఎంవోకి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఇన్ఫోసిస్ లో సామూహిక తొలగింపులపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర అధికారులను కోరుతూ కర్ణాటక లేబర్ కమిషనర్ కు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రెండో నోటీసు పంపింది. పీఎంవోకు పలు ఫిర్యాదులు అందాయని, కార్మిక చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర కార్మిక అధికారులను కోరింది. అలాగే బాధితుల పక్షాన పోరాడుతున్న ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్)కు సమాచారం అందించింది.700 మంది తొలగింపుగత రెండున్నరేళ్లలో క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా నియమించుకున్న సుమారు 700 మంది ట్రైనీలను ఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7న తొలగించింది. వీరు 2023 అక్టోబర్‌లోనే విధుల్లోకి చేరారు. అంతర్గత మదింపు కార్యక్రమంలో బాధిత ఉద్యోగులు విఫలమయ్యారని పేర్కొంటూ ఇన్ఫోసిస్ తొలగింపులను సమర్థించుకుంది. వీరిలో పనితీరు సంబంధిత సమస్యల కారణంగా 350 మంది ఉద్యోగులు మాత్రమే రాజీనామా చేశారని కంపెనీ పేర్కొంది. తొలగించిన ఉద్యోగులు అంతర్గత మదింపుల పారదర్శకతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఊహించని విధంగా పరీక్షల్లో క్లిష్టత స్థాయిని పెంచారని, దీంతో ఉత్తీర్ణత సాధించడం కష్టంగా మారిందని బాధితులు ఆరోపిస్తున్నారు.ఇన్ఫోసిస్ స్పందనఈ ఫిర్యాదులపై స్పందించిన ఇన్ఫోసిస్ తన వైఖరిని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ టెస్టింగ్ ప్రక్రియలను మూల్యాంకన విధాన పత్రంలో పొందుపరిచామని, ట్రైనీలందరికీ ముందస్తుగా తెలియజేశామని తెలిపింది. ఇన్ఫోసిస్ లో చేరే ప్రతి ట్రైనీ కంపెనీలో తమ అప్రెంటిస్ షిప్ ను అంగీకరిస్తూ రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపుతారని గుర్తు చేసింది. శిక్షణ ఖర్చును పూర్తిగా ఇన్ఫోసిస్ భరిస్తోందని పేర్కొంది. -
ట్రెయినీ ఐఏఎస్ పూజ వ్యవహారంపై పీఎంవో ఆరా
పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూజా ఖేడ్కర్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు నకిలీ అంగవైకల్యం, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)సర్టిఫికేట్లను సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగా.. పూజా ఖేడ్కర్ నియామకం గురించి ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఆరా తీస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.పూజా ఖేడ్కర్ పూణే కలెక్టర్ కార్యాయంలో అధికారిక హోదా కోసం ప్రయత్నించి వార్తల్లో నిలిచారు. ఉన్నతాధికారుల అనుమతిలేకుండా ప్రైవేట్ ఆడి కారును రెడ్ బ్లూ బెకన్ లైట్, వీఐపీ నెంబర్ ప్లేట్‌ను ఉపయోగించడం, అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఆయన ఛాంబర్‌ను వినియోగించడంతో వివాదం తలెత్తింది. ఆమె తీరుపై పూణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వం ఆమెను పుణె నుంచి వాశిమ్ జిల్లాకు బదిలీ చేసింది. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారుఈ క్రమంలో బుధవారం పీఎంవో కార్యాలయం అధికారులు పూజా ఖేడ్కర్ గురించి పూణే కలెక్టర్ సుహాస్ నుంచి నివేదికను కోరడం మరింత చర్చాంశనీయంగా మారింది. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LSBNAA) లో ఆమె గురించి ఆరా తీసింది. ఆమె పూణె నుంచి వాశిమ్ జిల్లాకు బదిలీ చేయడంపై నివేదిక కోరింది. పూర్తి నివేదికను ఎల్ఎస్బీఎన్ఏఏ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపనుంది.మహరాష్ట్ర చీఫ్ సెక్రటరీ (సీఎస్) సుజాత సౌనిక్ ఆమోదం తర్వాత నివేదిక పంపాలని ఎల్ఎస్బీఎన్ఏఏ డిప్యూటీ డైరెక్టర్ శైలేష్ నావల్ సంబంధిత పరిపాలన విభాగానికి విజ్ఞప్తి చేశారు. -
ప్రధాని కార్యాలయం మోదీ పీఎంవో కాదు, అది ప్రజా పీఎంవో అని మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మోదీ పీఎంవో కాదది... ప్రజా పీఎంవో!
న్యూఢిల్లీ: ‘‘ప్రధాని కార్యాలయమంటే అధికార కేంద్రమని మన దేశంలో పదేళ్ల కింది దాకా అభిప్రాయముండేది. కానీ నేను పుట్టింది అధికారం కోసం కాదు. నాకు అధికారం కావాలని ఎప్పుడూ ఆలోచించను. ప్రధాని కార్యాలయం కూడా అధికార కేంద్రం కాకూడదు. అది ప్రజల పీఎంవోగా ఉండాలి తప్ప మోద పీఎంవోగా కాదు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘నేను అధికారం కోసం జని్మంచలేదు. 140 కోట్ల మంది భారతీయులే నాకు దేవుళ్లు. వారి సంక్షేమమే నా పరమావధి. దానికోసమే వారు నాకు మరోసారి అవకాశమిచ్చారు. పీఎంవోను అధికార కేంద్రంగా మార్చే ఉద్దేశం నాకెన్నడూ లేదు. అది ప్రజల సంక్షేమం కోసం పని చేసే సంస్థగా ఉండాలి’’ అని స్పష్టం చేశారు. 2014 నుంచీ అదే దిశగా కృషి చేస్తూ వచ్చామన్నారు. ఆయన వరుసగా మూడోసారి ప్రధానిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే. సోమవారం ఉదయం ప్రధాని కార్యాలయంలో ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైలుపై తొలి సంతకం చేశారు. పీఎంఓలో అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారినుద్దేశించి మోదీ మాట్లాడారు. పీఎంవో ఒక ప్రేరక శక్తిగా నిలవాలన్నదే తన తపన అని చెప్పారు. ‘‘దేశమే ముందు. నాకైనా, మీకైనా ఇదే ఏకైక లక్ష్యం కావాలి’’ అని వారికి ఉద్బోధించారు. ‘‘2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుదాం. మీనుంచి నేను కోరేది అదే’’ అని స్పష్టం చేశారు. ‘‘మనం నిరీ్ణత పని గంటలు పెట్టుకుని, వాటికి పరిమితమై పని చేసేవాళ్లం కాదు. పని వేళలతో పాటు ఆలోచనలకు కూడా ఎలాంటి హద్దులూ లేనివాళ్లే నా పీఎంవో బృందం. వారిపై దేశమూ ఎంతో నమ్మకం పెట్టుకుంది’’ అన్నారు. ‘‘గత పదేళ్లో ఆలోచించిన, అమలు చేసిన దానికంటే ఎంతో ఎక్కువగా చేసి చూపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇదే నా భవిష్యత్తు విజన్’’ అని పేర్కొన్నారు.‘‘అంతర్జాతీయ ప్రమాణాలన్నింటినీ అధిగమిద్దాం. నిన్న ఎలా ఉన్నాం, ఈ రోజు ఎంత బాగా చేశామన్నది కాదు. ఇక ముందు ప్రతి రంగంలోనూ మనమే ప్రపంచంలో అగ్రగాములుగా ఎదగాలి. ఇప్పటిదాకా ఎవరూ చేరలేని శిఖరాలకు దేశాన్ని తీసుకెళ్దాం’’ అని అధికారులకు పిలుపునిచ్చారు. అది జరగాలంటే ఆలోచనల్లో స్పష్టత, చిత్తశుద్ధిపై నమ్మకం, ఆ దిశగా కష్టించే స్వభావం అత్యంత అవసరమని మోదీ చెప్పారు. పీఎంవో బృంద సభ్యులు అందిస్తూ వస్తున్న సహకారానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అదే నా శక్తి రహస్యం... తనకు ఇంతటి శక్తి ఎక్కడి నుంచి వస్తోందని ఈ ఎన్నికల సందర్భంగా చాలామంది అడిగారని మోదీ అన్నారు. ‘‘30 ఏళ్లుగా నాకీ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. నాలోని విద్యార్థి నిత్యం సజీవంగానే ఉంచుకుంటాను. బలహీనతకు, బద్ధకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వను. చైతన్యంతో, శక్తిమంతంగా ఉండటమే నా రహస్యం. అలా ఉన్నప్పుడే విజయవంతమైన వ్యక్తులుగా ఎదుగుతాం. నూతనోత్తేజం, రెట్టించిన ఉత్సాహం, శక్తియుక్తులతో ముందుకు సాగుతా’’ అని చెప్పారు. ‘పీఎం కిసాన్ నిధి’పై మోదీ తొలి సంతకం సాక్షి, న్యూఢిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం 17 వ విడత నిధుల విడుదల ఫైలుపై మోదీ తొలి సంతకం చేశారు. దాంతో దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున మొత్తంగా రూ.20 వేల కోట్ల నిధులు అందనున్నాయి. అనంతరం మోదీ మాట్లాడుతూ, తమది రైతు సంక్షేమానికి పూర్తిగా కట్టుబడ్డ ప్రభుత్వమన్నారు. అందుకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక తొలి సంతకం రైతు సంక్షేమ ఫైలుపై పెట్టడం సముచితమన్నారు. రైతులు, వ్యవసాయ రంగ అభివృద్ధికి మరింత కృషి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. -
అధికారం కోసమో..పదవి కోసమే నేను రాలేదు : పీఎంవోలో ప్రధాని మోదీ
అధికారం కోసమో పదవి కోసమే నేను రాలేదని ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ పీఎంవో సిబ్బందితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 140 కోట్ల మంది భారతీయులు నాకు పరమాత్మతో సమానం. ఇది మోదీ పీఎంవో కాదు.. ప్రజల పీఎంవో.. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతమీదే. అభివృద్ధికి మీరు వారధి లాంటి వారంటూ పీఎంవో సిబ్బందనిపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. -
ప్రధానిగా మోదీ తొలి సంతకం
న్యూఢిల్లీ, సాక్షి: నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. మూడోసారి ప్రధాని పదవిగా ప్రమాణం చేశాక.. సోమవారం ఉదయం పార్లమెంట్ సౌత్‌బ్లాక్‌లోకి ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉద్యోగులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఇక.. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధి నిధుల విడుదల ఫైల్ ఫై తొలి సంతకం చేశారు. తద్వారా.. 9.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో 20వేల కోట్ల రూపాయల నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది’’ అన్నారు. ఇవాళ సాయంత్రం ఆయన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో.. కొత్త ప్రభుత్వం-వంద రోజుల కార్యచరణపై ఆయన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అలాగే.. స్పీకర్ ఎన్నిక తదితర అంశాల కోసం పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని సిఫార్సు చేసి.. దానిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిచే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. -
ఈపీఎఫ్ఓ, పీఎంఓ డేటా లీకేజీ కలకలం?.. అప్రమత్తమైన కేంద్రం
దేశంలో డేటా లీకేజీ కలకలం రేపుతోంది. ప్రధాని కార్యాలయం (పీఎంఓ), ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)ల డేటాబేస్ నుంచి డేటా లీకైనట్లు తెలుస్తోంది. ఈ డేటా లీకేజీపై స్పష్టత ఇవ్వాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-In) కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డేటా లీకేజీపై సమాచారం ఉంది. కానీ వాస్తవమా? కాదా? అని తెలుసుకునేందుకు రివ్యూ జరుపుతున్నాం. సీఈఆర్టీ.ఇన్ ఇచ్చే రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డేటా లీకేజీ అంటూ వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్నట్లు కేంద్రానికి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. ‘డేటా లీకేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అయితే, సైబర్ నేరస్తులు ఒక సర్వర్ ను యాక్సిస్ చేసినట్లు కొన్ని వాదనలు వినిపిస్తున్నాయని, అందుకు తగ్గ ఆధారాలు లేవు’ అని స్పష్టం చేశారు. గ్లోబల్ సాఫ్ట్వేర్, కోడ్ రిపోజిటరీ గిత్ హబ్‌లో చైనీస్ సైబర్ ఏజెన్సీలకు చెందిన కొన్ని పత్రాలు లీక్ అయ్యాయని, ఈ డాక్యుమెంట్లలో ఈపీఎఫ్ఓ, ఇండియన్ పీఎంఓ, ఇతర పబ్లిక్ నుండి డేటా ఉందని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో పలు పోస్ట్ లు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ డేటా లీకేజీ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. భారత్ లక్ష్యంగా గత ఏడాది నవంబర్ లో విడుదల చేసిన నివేదిక ప్రకారం..ఇటీవల కాలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, తాజ్ హోటల్స్, ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ వంటి సంస్థలపై సైబర్ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పాటు ఐటీ, బిజినెస్ ఔట్ సోర్సింగ్ సంస్థలతో సహా పలు సర్వీసులు అందించే సంస్థలపై అత్యధికంగా సైబర్ దాడులు జరిగినట్లు నివేదికలు హైలెట్ చేశాయి. సింగపూర్ కు చెందిన సైబర్ ఫిర్మా 2023 నివేదిక సైతం ప్రపంచ వ్యాప్తంగా జరిగే సైబర్ దాడులు భారత్ ను లక్ష్యంగా చేసుకుని 13.7శాతం ఉందని, ఆ తర్వాత అమెరికా, ఇండో నేషియా,చైనా దేశాలు ఉన్నట్లు తేలింది. -
దర్శన్ అఫిడవిట్ పీఎంవో పనే: మహువా మొయిత్రా
ఢిల్లీ: మీడియాలో బహిర్గతమైన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ అఫిడవిట్ వ్యవహారంపై ఎంపీ మహువా మొయిత్రా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం దర్శన్‌పై ఒత్తిడి చేసి తెల్లకాగితంపై సంతకం చేయించారని ఆరోపించారు. పీంవోనే ఓ తెల్లకాగితంపై రాసి మీడియాకు లీక్ చేశారని అన్నారు. పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి సమర్పించిన అఫిడవిట్ విశ్వసనీయతపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అఫిడవిట్ లెటర్ హెడ్ లేని తెల్ల కాగితంపై ఉందని అన్నారు. అధికారికంగా విడుదల చేయలేదని చెప్పారు. 'వ్యాపార వేత్తగా కొనసాగుతున్న దర్శన్‌కు పీఎంతో పాటు మంత్రులందర్ని కలవగల సమర్ధత ఉంది. అలాంటప్పుడు పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి మొదటిసారి ప్రతిపక్ష ఎంపీగా కొనసాగుతున్న నాకు ఎందుకు లంచం ఇస్తారు? ఇది పూర్తిగా అసత్యం. ఈ లేఖను దర్శన్ కాకుండా పీఎంవోనే రాసింది. దర్శన్, ఆయన తండ్రిపై పీఎంవో బెదిరింపులకు పాల్పడింది. లేఖపై సంతకం చేయడానికి 20 నిమిషాలు సమయం ఇచ్చారు.' అని పేర్కొంటూ తాను దర్శన్ నుంచి లంచం తీసుకున్నాననే ఆరోపణలను మహువా మొయిత్రా ఖండించారు. అదానీ వ్యవహారాన్ని లేవనెత్తకుండా తన నోరు మూయించడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధపడిందని మహువా మెుయిత్రా ఆరోపించారు. అఫిడవిట్లో పేర్కొన్న విషయాలు హాస్యాస్పదమైన అంశాలుగా పేర్కొన్నారు. బీజేపీ ఐటీ సెల్లో మంచి రచనా నైపుణ్యం కలిగిన మందబుద్ధిగల వ్యక్తిచే ఈ లేఖను రాయించారని దుయ్యబట్టారు. దర్శన్ తనపై నిజంగా ఆరోపణలు చేయాలనుకుంటే మీడియా ముందుకు వస్తారు కానీ ఇలా ఏదో ఒక ఛానల్‌కు లీక్ చేయరని అన్నారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, ఆదానీ గ్రూప్‌ను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా టీఎంసీ నేత మొయిత్రా కుట్ర పన్నారని దర్శన్ ఆరోపించారు. ఈ మేరకు దర్శన్ సంతకం చేసిన అఫిడవిట్ ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. దర్శన్ అఫిడవిట్లో ఏముందంటే..? ► నాకు అనుకూలమైన ప్రశ్నలు అడిగేందుకు ఎంపీ అయిన మొయిత్రా నుంచి పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను తీసుకున్నాను ► ఇందుకుగాను ఆమె చాలా విలాసవంతమైన ప్రతిఫలాలు పొందారు. లగ్జరీ ఐటెమ్ అడిగేవారు. ఢిల్లీలోని ఆమె తన అధికారిక బంగ్లా ఆధునీకరణ పనులు చేయించుకున్నారు. దేశ, విదేశాల్లో ప్రయాణ ఖర్చులను భరించాలని డిమాండ్‌చేశారు. ► జాతీయస్థాయి నేతగా ఎదగాలని మొయిత్రాకు ఆశ. అందుకే ప్రధాని మోదీ, గౌతమ్ అదానీలను అప్రతిష్టపాలు చేసి ప్రతిష్ట పెంచుకుందామని స్నేహితులను ఉపాయాలు అడిగేవారు. ► పార్లమెంట్లో ఆమె ప్రశ్నలు అడిగేందుకు తగిన సమాచారాన్ని ఆమె పార్లమెంటరీ మెయిల్ ఐడీకి పంపేవాడిని. తర్వాత నేనే నేరుగా ప్రశ్నలు అప్లోడ్ చేసేవాడిని. ► ఆమెకు రాహుల్ గాందీ, శశి థరూర్, పినాకీ మిశ్రా వంటి నేతలతో సత్సంబంధాలు ఉండటంతో నాకూ లాభం ఉంటుందని భావించా. ► ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, బీబీసీ ఇలా ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థలకు చెందిన జర్నలిస్టులతో ఆమె మాట్లాడేవారు ► సుచేతా దలాల్, శార్దూల్ ష్రాఫ్‌లతోపాటు మాజీ అదానీ ఉద్యోగులు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి ప్రశ్నలు అడిగేవాళ్లం. ఇలా ఉండగా, తన పరువుకు భంగం కలిగేలా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించకుండా అడ్డుకోవాలంటూ మొయిత్రా వేసిన పిటిషన్ నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. లేఖ ఇంకా అందలేదు.: ఎథిక్స్ కమిటీ చీఫ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ లేఖ తనకు ఇంకా అందలేదని ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ సోంకర్ శుక్రవారం తెలిపారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే అంశం తీవ్రమైనదని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో సాక్ష్యాలను కమిటీ పరిశీలిస్తోందని సోంకర్ చెప్పారు. ఆధారాలు సమర్పించాలని ఇరువర్గాలను కోరామని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: ప్రయోజనం పొంది ప్రశ్నలడిగారు -
ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 506 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పథకం పనులకు ప్రధాని మోదీ ఈ నెల 6న వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం రూ.24,470 కోట్లను వెచి్చంచనుంది. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లకు మెరుగులు దిద్దడం, కొత్త, మెరుగైన సూచికల ఏర్పాటు, ఆధునిక మౌలిక వసతుల కల్పన వంటి వాటికి ఈ మొత్తాన్ని వెచి్చస్తారని పీఎంవో తెలిపింది. మొత్తం 508 స్టేషన్లలో తెలంగాణలోని 21, ఆంధ్రప్రదేశ్‌లోని18 రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మొత్తం 1,309 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చే యాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందు లో భాగంగా తాజాగా ఒకేసారి 506 స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. -
నిర్మలా సీతారామన్ అల్లుడు.. మోదీకి బాగా దగ్గర!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూతురు వాంగ్మయి వివాహం ఆడంబరాలకు దూరంగా జరిగింది. గురువారం బెంగళూరులో ఓ హోటల్లో వాంగ్మయి, ప్రతీక్ దోషీ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజకీయ ప్రముఖులెవరినీ నిర్మలా సీతారామన్ ఈ వివాహానికి ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ, నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో జర్నలిజం చదువుకున్న వాంగ్మయి.. మింట్ లాంజ్స్ బుక్స్ అండ్ కల్చర్ సెక్షన్లో ఫీచర్ రైటర్‌గా పని చేస్తున్నారు. ఇక గుజరాత్‌కు చెందిన ప్రతీక్ దోషి నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెల్లడైంది. నరేంద్ర మోదీకి ప్రతీక్ చాలా దగ్గర. అయితే అది చుట్టరికంగా కాదు.. మోదీతో సుదీర్ఘకాలంగానే ప్రతీక్ ప్రయాణం కొనసాగడం ద్వారా. ► గుజరాతీ అయిన ప్రతీక్ దోషి.. సింగపూర్ మేనేజ్మెంట్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయంలో(CMO)లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా ప్రతీక్ పని చేశాడు. ► అటుపై 2014 నుంచి ప్రధాని కార్యాలయం(PMO) అనుబంధంగా పని చేస్తున్నారు. 2019 జూన్‌లో దోషికి జాయింట్ సెక్రటరీ ర్యాంక్ దక్కింది. ► ప్రస్తుతం ఆయన పీఎంవోలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ-OSD)గా హోదాలో కొనసాగుతున్నారు. రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ వింగ్‌లో ఆయన పనిచేస్తున్నట్లు పీఎంవో వెబ్సైట్లో ఉంది. ► పరిశోధన & వ్యూహాలకు మాత్రమే పరిమితం కాకుండా.. భారత ప్రభుత్వ (వ్యాపార కేటాయింపు) నియమాలు, 1961 ప్రకారం.. ప్రధానమంత్రికి కార్యదర్శిగా సలహాలు ఇవ్వడమూ చేస్తున్నారు ప్రతీక్. ► ప్రతీక్.. పెద్దగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. అలాగే.. చెన్నైలో పుట్టి పెరిగిన వాంగ్మయి కూడా మీడియా కంట పెద్దగా పడింది లేదు. ► వాంగ్మయి-ప్రతీక్ల వివాహం బెంగళూరులోని టమరిండ్ ట్రీ హోటల్లో ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ::: సాక్షి వెబ్‌డెస్క్ -
ప్రధాని కార్యాలయ అధికారిగా బురిడీ కొట్టించి..చివరికి పోలీసులకు చిక్కి..
ముగ్గురు వ్యక్తులు ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన అధికారనంటూ ఫోజులిస్తూ జమ్ముకాశ్మీర్ యంత్రాంగాన్ని మోసగించారు. ఈ మేరకు గుజరాత్‌కి చెందిన కిరణ్ భాయ్ పటేల్ నేతృత్వంలోని బృందంలో ముగ్గురు వ్యక్తులు పీఎంఓ అధికారులుగా నటిస్తూ.. జమ్మూకాశ్మీర్‌లో పర్యటించి, బుల్లెట్ ప్రూఫ్ మహింద్రా స్కార్పియో కార్లలో తిరుగుతూ ఫైవ్ స్టార్ హోటళ్లలో అతిధ్యం అందుకున్నారు. వారి చేతిలో మోసపోయిన జమ్ము కాశ్మీర్ అధికారులు వారికి సకల రాచమర్యాదలు అందించారు. గతేడాది నుంచి ఈ ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన బృందం కశ్మీర్లో పర్యటిస్తుంది. అదికూడా రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి పర్యటనకు రావడంతో అనుమానం తలెత్తి.. భద్రతా అధికారులు సీఐడీకి సమాచారం అందించారు. కిరణ్ భాయ్ పటేల్ తోపాటు ఉన్న మిగతా ముగ్గురు వ్యక్తులను గుజరాత్‌కు చెందిన అమిత్ హితేష్ పాండియా, జే సితాపరా, రాజస్థాన్‌కి చెందిన త్రిలోక్ సింగ్‌లుగా గుర్తించారు. వీరంతా పీంఎంఓ బృందంగా నటిస్తూ.. గతుడాది అక్టోబర్ నుంచి కాశ్మీర్లో నాలుగు సార్లు పర్యటించారు. అధికారిక వర్గాల ప్రకారం..దక్షిణ కాశ్మీర్లో జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్న ఒక ఐఏఎస్ అధికారి సదరు సీనియర్ పీఎంఓ అధికారి సందర్శన గురించి పోలీసుల భద్రతా విభాగానికి సమాచారం అందించినట్లు అధికారికి వర్గాలు తెలిపాయి. దీంతో భద్రతా విభాగం నిందితుడు పటేల్‌కు జెడ్ ప్లస్ భద్రతలను అందించడమే గాక అక్టోబర్ నుంచి నాలుగు పర్యటనల్లో అతను ఎక్కడికి వెళ్లినా వీఐపీ హోదాగా వెంట స్థానిక పోలీసులు కూడా వచ్చారు. సదరు మోసగాడు కిరణ్ భాయ్ పటేల్ అక్కడ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి, నియంత్రణ రేఖ సమీపంలోని ఉరిలోని కమాన్ పోస్ట్ నుంచి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌కు వరకు పర్యటించాడు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పంచుకున్నాడు. అంతేగాదు అక్కడ దూద్పత్రిని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చడంపై చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. నిందితుడు పటేల్ తొలిసారిగా అక్టోబర్ 27న తన కుటుంబంతో సహా పర్యాటనకు వచ్చాడని ఆ తర్వాత పర్యటనలో ఈ ముగ్గురు వ్యక్తులు చేరినట్లు తెలిపారు. గట్టి నిఘాపెట్టిన సీఐడీ వర్గాలు అతడి గత చరిత్రను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆ వ్యక్తిని చాలా పకడ్బంధింగా అరెస్టు చేశారు. ఐతే పటేల్ అరెస్టు కావడానికి కొద్ది నిమిషాల ముందు మిగతా ముగ్గురు వ్యక్తులు తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. వారికి సహకరించిన ఇద్దరు పోలీసులపై కూడా చర్యలు తీసుకున్నారు. కాగా, నిందితుడు పటేల్‌ని దర్యాప్తు చేసేందుకు గుజరాత్ పోలీసులు కూడా రంగంలోకి దిగినట్లు తెలిపారు. (చదవండి: పనిలోంచి తీసేశారని క్లీనర్ రివేంజ్..కార్లపై యాసిడ్ పోసి..) -
మోదీ పర్యటన మళ్లీ వాయిదా!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన మరోసారి వాయిదా పడింది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి అధికారికంగా ఖరారు కాకముందే బీజేపీ నేతలు అత్యుత్సాహంతో పోటాపోటీగా ప్రకటించడం.. ఆనక వాయిదా పడటం రివాజుగా మారిందన్న చర్చ పార్టీలో సాగుతోంది. గతనెల 19న సికింద్రాబాద్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తున్నారని, పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగసభలో రైలు, రోడ్డు ప్రాజెక్ట్‌లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, జాతికి అంకితం వంటివి చేస్తారని బీజేపీ నేతలు నానా హడావుడి చేశారు. ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులకు పీఎంవో నుంచి సమాచారం లేకపోయినా సికింద్రాబాద్ జీఎం కార్యాలయానికి వెళ్లి వారితో పార్టీ నేతలు సమీక్ష నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్స్ సందర్శించి బహిరంగసభ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించేశారు. తీరా ఈ కార్యక్రమం వాయిదా పడడంతో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15న ఢిల్లీ నుంచి వర్చువల్‌గా మోదీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను లాంఛనంగా ప్రారంభించారు. మళ్లీ ఈనెల ఫిబ్రవరి 13న మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారంటూ అధికారిక కార్యక్రమం ఖరారు కాకుండానే బీజేపీ నేతలు మరోసారి హడావుడి చేశారు. ఈ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రైల్వే అధికారులు ఇందుకు సంబంధించిన సమాచారమేది ఇంకా అధికారికంగా రాలేదని స్పష్టం చేశారు. చివరకు ఈ కార్యక్రమం కూడా వాయిదా పడినట్టు ఇప్పుడు పార్టీనాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో 10వ తేదీన శుక్రవారం మొదలైన ‘ప్రజాగోస–బీజేపీ భరోసా’కార్యక్రమం ఈనెల 25వరకు జరగనుంది. ఆ కార్యక్రమం పేరిట 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11వేల వీధిచివర సమావేశాలు (స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్) నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, సంస్థాగతంగా ఏ మేరకు బలోపేతమైందన్న దానిని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని 11 వేల శక్తి కేంద్రాల్లో (3,4 పోలింగ్‌బూత్‌లు కలిపి ఓ కేంద్రం) ప్రజాగోస స్ట్రీట్‌కార్నర్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీని ఈ కార్యక్రమ రూపకర్త, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి , రాష్ట్రపార్టీ సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రధాని మోదీ సహా ఇతర ముఖ్యనేతల అధికారిక పర్యటనలు వాయిదాపడ్డాయని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈ నెలాఖరులో లేదా వచ్చేనెల మొదట్లో ప్రధాని రాష్ట్ర పర్యటనకు సంబంధించి అధికారికంగా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. -
‘జోషిమఠ్’పగుళ్లపై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పట్టణంగా పేరున్న జోషిమఠ్( చమోలీ జిల్లా)లో భూభాగం కుంగిపోతూ వస్తోంది. వందల సంఖ్యలో ఇళ్లకు బీటలువారాయి. సుమారు 600 కుటుంబాలను ఖాళీ చేసేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జోషిమఠ్‌లోని ప్రస్తుత పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చింది ప్రధానమంత్రి కార్యాలయం. కేబినెట్ సెక్రెటరీ సహా కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ విభాగం అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రెటరీ పీకే మిశ్రా సమీక్ష నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ ఉన్నతాధికారులతో పాటు జోషిమఠ్ జిల్లా అధికారులు సైతం హాజరుకానున్నారు. జోషిమఠ్‌లో భూమి కుంగిపోయి ఇళ్లకు బీటలు వస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. శనివారం జోషిమఠ్‌లో పర్యటించారు. ప్రభావితమైన 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జోషిమఠ్ ప్రజలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: Joshimath Sinking: జోషీ మఠ్‌లో వందలాది ఇళ్లకు పగుళ్లు.. తక్షణం 600 కుటుంబాలు ఖాళీ! ఏమిటీ జోషీమఠ్ ? -
ఎమ్మెల్యేలకు 'ఎర' వ్యవహారం.. పీఎంఓ సీరియస్..!
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం చినికిచినికి గాలివానలా మారుతుండటం, నేరుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలపైనే ఆరోపణలు రావడంతో.. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో చోటు చేసుకున్న ప్రలోభాలకు సంబంధించిన వీడియోలను తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు బహిర్గతం చేయడం, న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల సీఎంలు, జాతీయ మీడియా, దర్యాప్తు సంస్థలకు పంపిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంలోని వాస్తవాలను వెలికితీసే పనిలో పీఎంఓ నిమగ్నమైనట్టు కేంద్రంలోని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. పీఎంఓలోని ముగ్గురు కీలక అధికారులకు దీనికి సంబంధించిన బాధ్యతలు కట్టబెట్టినట్లు సమాచారం. వీడియోలో ఉన్న వ్యక్తులతో ప్రముఖులకు ఉన్న లింకులు, నకిలీ ఆధార్ కార్డులతో పాటు వారి కాల్ డేటా తదితర అంశాలపై లోతైన దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల రెండోవారంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఉండనున్నందున.. అప్పట్లోగానే దీనిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయనున్నట్టు తెలిసింది. ముఖ్యుల పేర్ల ప్రస్తావనతో అప్రమత్తం ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని బీజేపీ అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకుంది. మధ్యవర్తుల సంభాషణల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేర్లు ప్రస్తావనకు రావడం, దీన్ని ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ అంశంగా లేవనెత్తడం, గుజరాత్ ఎన్నికల ప్రచారాస్త్రంగానూ ప్రతిపక్షాలు దీన్ని వాడుకునే అవకాశాల నేపథ్యంలో.. పార్టీ జాతీయ నాయకత్వం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వాన్ని అప్రమత్తం చేసింది. రాజకీయంగా దీన్ని ఎదుర్కోవాల్సిన తీరు, న్యాయపరంగా చేయాల్సిన పోరాటంపై మార్గదర్శనం చేసింది. జాతీయ నాయకత్వం సూచనల మేరకు.. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ సైతం కేసీఆర్‌పై విమర్శల దాడి చేశారు. ఇక హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. మధ్యవర్తులపై ఇంటిలిజెన్స్‌కు ఆదేశాలు పీఎంఓ ఇప్పటికే సదరు వీడియో క్లిప్పింగ్‌లను సేకరించడంతో పాటు, మధ్యవర్తుల కాల్‌డేటాపై విశ్లేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం దీనిపై లోతైన విచారణ చేస్తున్నట్టు సమాచారం. మధ్యవర్తులు ఎవరు? వారికి బీజేపీతో సంబంధాలున్నాయా? బీజేపీ నేతలెవరితో టచ్‌లో ఉన్నారు?, వీరికి గతంలో ఏదైనా నేర చర్రిత ఉందా? అన్న అంశాలపై కూపీ లాగుతున్నారు. మధ్యవర్తుల రోజువారీ కార్యకలాపాలు, వారి వ్యాపారాలు, లావాదేవీలు ఆరా తీయాల్సిందిగా ఇంటిలిజెన్స్ సంస్థలకు ఆదేశాలిచ్చినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో మధ్యవర్తులు జరిపిన సంభాషణల్లో డబ్బుతో ముడిపడిన అంశాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు అందించిన సహకారం, రాజస్తాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సిద్ధమైన ప్రణాళిక, వాటికి తామందించిన సహకారం వంటి అంశాల ప్రస్తావన ఉండటంతో ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలి వేయరాదన్న గట్టి నిర్ణయానికి పీఎంఓ వచ్చినట్లు తెలిసింది. పీఎంఓకు కేంద్ర హోం శాఖ నివేదిక! ఈ అంశంలో కేంద్ర హోంశాఖ ప్రాథమిక ఇప్పటికే దర్యాప్తు చేసిందని, ఆ నివేదిక సైతం శుక్రవారం పీఎంఓకు చేరిందని సమాచారం. ఎఫ్ఐఆర్, కోర్టుకు సమర్పించిన అంశాలు, రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న అంశాలపై అందులో కూలంకషంగా వివరించినట్లు తెలిసింది. వీటన్నింటినీ నిశితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కాగా ఈ అంశం ఇప్పటికే న్యాయస్థానాల్లో విచారణ దశల్లో ఉన్నందున, కోర్టు ఆదేశాల అనంతరం దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ చేయించే అవకాశాలను కడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. చదవండి: ‘వీడియోలో అమిత్‌షా పేరు చెబితే.. సంబంధం ఉన్నట్టేనా?’ -
సికింద్రాబాద్ ప్రమాద ఘటనపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఓ లాడ్జిలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సెల్లార్లో ఈ-బైకులు పేలి.. ఆ అగ్నిప్రమాదంతో అదే కాంప్లెక్స్‌లోని లాడ్జిలో బస చేసిన ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ.. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక ఈ ప్రమాదంలో మరణించిన వాళ్లకు పీఎంఎన్ఆర్ఎఫ్(ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) తరపున రూ.2 లక్షలు, గాయపడిన వాళ్లకు రూ.50వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్విటర్లో ఓ ట్వీట్ చేసింది. Saddened by the loss of lives due to a fire in Secunderabad, Telangana. Condolences to the bereaved families. May the injured recover soon. Rs. 2 lakh from PMNRF would be paid to the next of kin of each deceased. Rs. 50,000 would be paid to the injured: PM @narendramodi — PMO India (@PMOIndia) September 13, 2022 -
... కంగ్రాట్స్ సార్!
... కంగ్రాట్స్ సార్! -
కేంద్ర శాఖల కార్యదర్శులతో ఏపీ బృందం భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పెండింగ్ సమస్యలపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం సోమవారం భేటీ అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వం వహిస్తున్న ఈ బృందంలో ఏపీ ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సహా ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని రాష్ట్ర ప్రతినిధుల బృందం కేంద్ర కార్యదర్శుల బృందాన్ని కోరింది. రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని, విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన సంస్థలన్నింటికీ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం కోరింది. కేంద్ర కార్యదర్శుల బృందం దృష్టికి తీసుకెళ్లిన వివరాలివే.. ►కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేస్తే.. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దేశంలో మిగిలిన 15 జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి నీటి పారుదల, తాగునీటి వ్యయాలను ఒక్కటిగానే పరిగణించి నిధులివ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,100 కోట్లను త్వరితగతిన మంజూరు చేసి, ప్రాజెక్టు పనులకు అంతరాయం కలగకుండా చూడాలి. ►రాష్ట్ర విభజనతో 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 45 శాతం ఆదాయం (రెవెన్యూ) మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కాగా.. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇదే నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చడానికి సహకరించాలి. ►2014 జూన్ నుంచి 2015 మార్చి 31 వరకు రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నిర్ధారించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతి తీసుకొచ్చి రెవెన్యూ లోటును రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులు, ఇతర బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. కాబట్టి రెవెన్యూ లోటు కింద రావాల్సిన రూ.18,830.87 కోట్లను చెల్లించి ఆదుకోవాలి. ►విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ సరఫరా చేశాం. ఇందుకు రూ.6,284 కోట్లను విద్యుత్ చార్జీల రూపంలో తెలంగాణ ఏపీకి చెల్లించాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో.. ఆ బిల్లులను చెల్లించేలా తెలంగాణ సర్కార్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలి. ►జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లోపించడంతో రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. దీని వల్ల రాష్ట్రంలో అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా రేషన్ అందిస్తోంది. దీని వల్ల అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన చేసి, ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలి. ►కరోనా మహమ్మారి ప్రభావం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్ల మేర రుణాలు పొందే వెసులుబాటు కల్పించాలి. ►భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చిన సైట్ క్లియరెన్స్‌ను రెన్యువల్ చేయాలి. వైఎస్సార్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మెకాన్ సంస్థ నివేదిక వీలైనంత త్వరగా అందేలా చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు గనులను వేగంగా కేటాయిస్తే.. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతుంది. కాగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. అనంతరం సమస్యల పరిష్కారానికి కార్యదర్శులతో ప్రధాని మోదీ కమిటీ ఏర్పాటు చేశారు. -
రాష్ట్ర సమస్యల పరిష్కారం దిశగా.. మరో ముందడుగు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాతోపాటు ఇతర అంశాల పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సమస్యలపై అధ్యయనం చేసి, పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం) ఏర్పాటు చేసిన కేంద్ర బృందం సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో సమావేశమవుతోంది. ఈ సమావేశంలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పీఎంవోకు కేంద్ర బృందం నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా ఈనెల 3న తనతో సమావేశమైనప్పుడు సీఎం వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించినట్లు పీఎంవో వర్గాలు వెల్లడించాయి. సోమవారం కేంద్ర బృందంతో సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై మరోసారి చర్చించేందుకు ఆదివారం ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ కమిటీ భేటీ అవుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధే అజెండా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 మే 30న బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తదితరులకు వి/æ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 3న ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసేందుకు సహకరించాలని కోరారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన వివరాలు ఇలా ఉన్నాయి. ► కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేస్తే.. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దేశంలో మిగిలిన 15 జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి నీటి పారుదల, తాగునీటి వ్యయాలను ఒక్కటిగానే పరిగణించి నిధులివ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,100 కోట్లను త్వరితగతిన మంజూరు చేసి, ప్రాజెక్టు పనులకు అంతరాయం కలగకుండా చూడాలి. ► రాష్ట్ర విభజనతో 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 45 శాతం ఆదాయం (రెవెన్యూ) మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కాగా.. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇదే నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చడానికి సహకరించాలి. ► 2014 జూన్ నుంచి 2015 మార్చి 31 వరకు రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నిర్ధారించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతి తీసుకొచ్చి రెవెన్యూ లోటును రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులు, ఇతర బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. కాబట్టి రెవెన్యూ లోటు కింద రావాల్సిన రూ.18,830.87 కోట్లను చెల్లించి ఆదుకోవాలి. ► విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ సరఫరా చేశాం. ఇందుకు రూ.6,284 కోట్లను విద్యుత్ చార్జీల రూపంలో తెలంగాణ ఏపీకి చెల్లించాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో.. ఆ బిల్లులను చెల్లించేలా తెలంగాణ సర్కార్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలి. ► జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లోపించడంతో రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. దీని వల్ల రాష్ట్రంలో అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా రేషన్ అందిస్తోంది. దీని వల్ల అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన చేసి, ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలి. ► కరోనా మహమ్మారి ప్రభావం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్ల మేర రుణాలు పొందే వెసులుబాటు కల్పించాలి. ► భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చిన సైట్ క్లియరెన్స్‌ను రెన్యువల్ చేయాలి. వైఎస్సార్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మెకాన్ సంస్థ నివేదిక వీలైనంత త్వరగా అందేలా చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు గనులను వేగంగా కేటాయిస్తే.. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతుంది. సానుకూలంగా స్పందించిన ప్రధాని సీఎం జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ఆ అంశాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పీఎంవో అధికారులను ఆదేశించారు. దాంతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ స్వామినాథన్ అధ్యక్షతన నలుగురు సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఈనెల 10న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బృందంతో చర్చించేందుకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర బృందం అజయ్ సేథ్, ఆర్థిక శాఖ(ఆర్థిక వ్యవహారాల విభాగం) కార్యదర్శి, పంకజ్‌కుమార్, కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి, దేబాశిస్ పాండా, కేంద్ర ఆర్థిక శాఖ (ఆర్థిక సేవల విభాగం), సుధాన్షు పాండే, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి. రాష్ట్ర బృందం ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, సమీర్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేఎస్ జవహర్‌రెడ్డి, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కరికాల వలవెన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, షంషేర్‌సింగ్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజా శంకర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్. -
భారత్‌లో టెస్లా.. పీఎం ఆఫీస్‌లోనే మంతనాలు!
ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ టెస్లా.. భారత్‌లో ఎంట్రీకి శతవిధాల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అనుమతులు దొరికిన వెంటనే.. ఈ ఏడాదిలోనే కార్లను భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లను దించి సొంత షోరూమ్‌లు, ఆన్లైన్ ద్వారా అమ్మకాలు చేపట్టాలని ప్రణాళిక గీసుకుంది. అయితే.. ఒకేఒక్క కారణంతో టెస్లా తటపటాయిస్తోంది. ప్రపంచంలో ఏ దేశంలో లేనంతంగా మన దేశంలోనే దిగుమతి సుంకం భారీగా ఉంది. ఈ తరుణంలో ఈ విషయంలో కొంచెం తగ్గితే మంచిదని భారత్‌ను బతిమాలుతున్నాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. మరోవైపు భారత్ మాత్రం ఈ విషయంలో తగ్గడం లేదు. టెస్లా డిమాండ్‌కు ఓకే చెబితే.. మిగతా కంపెనీల నుంచి, ముఖ్యంగా స్థానిక కంపెనీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతాయేమోనన్న ఆలోచనలో ఉంది. ఈ తరుణంలో దిగుమతి సుంకం తగ్గించడం మాట అటుంచి.. ముందు భారత్‌లో టెస్లా భవిష్యత్ ప్రణాళిక బ్లూప్రింట్(ఇంపోర్టెడ్ కార్ల అమ్మకం(చైనా నుంచి కాకుండా అనే కండిషన్), మేక్ ఇన్ ఇండియా(మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి) ఎక్కడ మొదలుపెడతారు.. తదితర వివరాలు) సమర్పించాలని కోరింది. ఈ పరిణామాల నడుమ.. టెస్లా కంపెనీ నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలోనే సంప్రదింపులు జరిపిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రాయిటర్స్ తాజా కథనం ప్రకారం.. భారత్‌లో టెస్లా వ్యవహారాలు చూసుకోబోయే మనుజ్ ఖురానా, ఇతర టెస్లా ఎగ్జిక్యూటివ్స్ కిందటి నెలలో పీఎం కార్యాలయంలో సంబంధిత అధికారులతో చర్చలు నిర్వహించారు. అంతేకాదు ఎలన్ మస్క్ స్వయంగా ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. సుంకాల తగ్గింపు వల్ల తమ కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించుకునే వీలు కలుగుతుందని, భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నామని మస్క్, ప్రధానిని కోరినట్లు సమాచారం. అయితే టెస్లా విజ్ఞప్తులకు భారత్ నుంచి ఎలాంటి బదులు వచ్చిందనేది తెలియాల్సి ఉంది!. ఒకవేళ టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలపై ఇంపోర్ట్ ట్యాక్స్ గనుక తగ్గించాలంటే.. ముందు భారత్‌లో కార్ల తయారీ ఒప్పందం మీద సంతకం చేయాలని ఆ సమావేశంలో సీనియర్ అధికారులు కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు టెస్లా ఒక్కటే కాదని, చాలా కంపెనీలు ఈవీల తయారీకి సిద్ధంగా ఉన్నాయని, కాబట్టి ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. దీంతో మరో దఫా చర్చలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక భారత్‌లో విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న వాహనాలపై వాటి ధర 40వేల డాలర్లులోపు ఉంటే 60 శాతం, 40వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే 100 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు. సో.. ఈ లెక్కన టెస్లా గనుక విక్రయాలు మొదలుపెడితే ధరలు భారీగా పెంచాల్సి ఉంటుంది. అప్పుడు బయ్యర్స్ ముందుకు రావడం కొంచెం కష్టం. అందుకే ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకాన్ని తగ్గించాలని టెస్లా కోరుతోందని టెస్లా కథనం. చదవండి: ఎలోన్ మస్క్ ఎంట్రీతో మెరుపు వేగంతో పెరిగిన ఇళ్ల ధరలు ఇదీ చదవండి: మస్క్ మావా.. జర బెంజ్‌ను చూసి నేర్చుకో! -
Covid-19: భారత్‌లో అక్టోబర్‌లో థర్డ్‌వేవ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల నుంచి భారత్‌లో సెకండ్ వేవ్ ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తుంది. అయితే కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. త్వరలో థర్డ్ వేవ్ రానుందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌లో అక్టోబర్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు పీఎంవోకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ఐడీఎం) నిపుణుల కమిటీ నివేదిక అందజేసింది. ఇక థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని ఎన్ఐడీఎం హెచ్చరించింది. (చదవండి: 4 నెలలు.. రూ.900 కోట్ల నష్టం) థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్యం కోసం సన్నద్ధం కావాలని ఎన్ఐడీఎం సూచించింది. థర్డ్‌వేవ్ సమయంలో ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలు సరిపోవని నివేదికలో వెల్లడించారు. ఇక చిన్న పిల్లలకు వైద్యం కోసం సిబ్బందిని పెంచాలని సూచించారు. వైద్య పరికరాలు, వెంటిలేటర్లు, అంబులెన్స్‌ల సంఖ్యను పెంచాలని తెలిపారు. దేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 82 శాతం శిశు వైద్యుల కొరత ఉండగా.. దేశవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63 శాతం ఖాళీలు ఉన్నట్లు ఎన్ఐడీఎం నివేదిక తెలిపింది. థర్డ్‌వేవ్ ముప్పును దృష్టిలో పెట్టుకుని వైద్యుల కొరత, ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. చదవండి: పిల్లలకూ కరోనా వ్యాక్సిన్ సిద్ధం.. ఎలా పనిచేస్తుంది? -
రేపే కేంద్ర కేబినెట్ విస్తరణ.. 5 రాష్ట్రాలకు ప్రాధాన్యం?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తు కొనసాగుతుంది. జూలై 7న(బుధవారం) కేంద్ర కేబినెట్ పునర్వవ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. రేపు సా.5:30 నుంచి 6 గంటల మధ్య కేబినెట్ విస్తరణ జరుగనుంది. తొలుత జూలై 7వ తేదీన కేబినెట్ పునర్వీవ్యవస్థీకరణ జరుగనున్నట్లు వార్తలు వచ్చినా, ఆ తర్వాత జూలై 8వ తేదీన కేబినెట్ విస్తరణ జరపాలని నిర్ణయించారు. కాగా, మళ్లీ ముందు అనుకున్న తేదీ ప్రకారం జూలై 7వ తేదీనే కేబినెట్ పునర్వవ్యవస్థీకరణకు మొగ్గు చూపారు. ఈ కేబినెట్లో 20 మందికి పైగా కొత్తవారికి అవకాశం దక్కనుంది. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఆధారంగా శాఖల మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర కేబినెట్లో మొత్తం 81 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ప్రస్తుతం 53 మందితోనే మంత్రివర్గం కార్యకలాపాలు కొనసాగిస్తుంది. మిగిలిన 28 స్థానాలను మరో రెండు రోజుల్లో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ముఖ్యనేతలతో భేటీ అయినట్లు తెలిసింది. కేబినెట్ విస్తరణ గురించి ఈ భేటీలో చర్చించనున్నారని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆశావాహుల జాబితాలో సీనియర్ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా, అసోం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, జేడీయూ నాయకులు ఆర్సీపీ సింగ్, లల్లన్ సింగ్ (బిహార్), అప్నా దళ్ నేత అనుప్రియ పాటిల్, పంకజ్ చౌదరి(యూపీ), కైలశ్ విజయవర్గీయ (మధ్యప్రదేశ్), నారాయణ రాణే (మహారాష్ట్ర), రీటా బహుగుణ జోషి, రామశంకర్ కథేరియా (యూపీ), పశుపతి పారస్, రాహుల్ కశ్వన్, చంద్రప్రకాశ్ జోషి (రాజస్థాన్) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. -
ప్రధాని మోదీ నివాసంలో జరగాల్సిన కీలక భేటీ రద్దు
-
క్లైమాక్స్‌లో కేబినెట్ విస్తరణ.. భేటీ రద్దు?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఈ వారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని పలువురు ఎంపీలకు అధిష్టానం సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అస్సాం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు ఎంపీలు హస్తినకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ తో ఈ సాయంత్రం ప్రధాని చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలు లక్క్ష్యంగా ఈ విస్తరణ ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ సహా మొత్తంగా 54 మందితో ఉన్న మంత్రి మండలిలో మరో 25 మందిని చేర్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించనున్నట్టు సమాచారం. మొత్తంగా ఏడుగురిపై వేటు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రుల భేటీ రద్దు? ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం జరగాల్సిన మంత్రుల భేటీ రద్దైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. మంగళ, గురువారం ప్రధాని పాల్గొనబోయే భేటీలు రద్దైనట్లు పీఎంవో నుంచి ఓ ప్రకటన వెలువడిందని ఆ కథనాల సారాంశం. బీజేపీ చీఫ్‌తో పాటు అమిత్ షా సహా మంత్రులు ఈ భేటీకి హాజరవుతారనే ఆశిస్తుండగా.. ఒకవేళ నిజంగా రద్దు అయితే తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇంకోవైపు ప్రధాని నరేంద్ర మోదీ-బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి సంతోష్ భేటీ మాత్రం యథావిధిగా కొనసాగనుందని మరో కథనం వెలువడుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారంలోనే జరగాల్సిన కేబినెట్ విస్తరణ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. -
భూమనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అభినందనలు
-
భూమనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అభినందనలు
తిరుపతి తుడా (చిత్తూరు జిల్లా): తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మానవత్వం చాటుకున్నారు. కరోనాతో మృతి చెందిన 21 మృతదేహాలను బంధువులు ఆస్పత్రిలో విడిచిపెట్టి వెళ్లగా, రుయా మార్చురీలో ఉన్న అనాథ మృతదేహాలకు బుధవారం ఎమ్మెల్యే ముందుకొచ్చి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. గత ఏడాది ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తిరుపతిలో తొలిసారి కరోనా మృతదేహాలకు ఎమ్మెల్యే భూమన దగ్గరుండి చివరితంతును నిర్వహించారు. మరోసారి ఇప్పుడు 21 మృతదేహాలకు సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాలను మహాప్రస్థానం వాహనంలోకి నేరుగా ఆయనే ఎక్కించారు. కరోనాబారిన పడిన మృతదేహాలకు ఏడాది నుంచి కోవిడ్–19 తిరుపతి ముస్లిం జేఏసీ నాయకులు తమ సొంత ఖర్చులతో అంతిమసంస్కారాలను నిర్వహిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూమన చివరితంతు నిర్వహించారు. భూమనకు పీఎంవో అభినందనలు ఎమ్మెల్యేకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అభినందనలు వచ్చాయి. ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా బుధవారం నిర్వహించిన వర్చువల్ మీటింగ్‌లో అభినందనలు తెలిపారు. తిరుపతిలో కరోనా బారినపడి మృతిచెందిన పార్ధివదేహాలకు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించడం అందరికీ ఆదర్శమని ఆయనను కొనియాడారు. చదవండి: కరోనా: ఒక్కడే.. ఆ నలుగురై! -
ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ప్రస్తుతం చాలా మంది కరోనా వైరస్ పేషెంట్లు ఆక్సిజన్ సరైన సమయానికి అందక చనిపోతున్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ తగినంతగా సరిపోవడం లేదు. అందుకే విదేశాల నుంచి యుద్ద విమానాల ద్వారా కేంద్రం ఆక్సిజన్ తీసుకొస్తుంది. ఇలాంటి తరుణంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కేర్స్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. వీటిని సాంకేతికంగా ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (PSA) మెడికల్ ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంట్స్ అని పిలుస్తున్నారు. "ఈ ప్లాంట్లను వీలైనంత త్వరగా నిర్మించాలని పీఏం ఆదేశించారు. ఈ ప్లాంట్ల వల్ల జిల్లా స్థాయిలో పెద్ద మొత్తంలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని" ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాంట్లను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుంది. ప్రతి జిల్లాలో అధికారులు గుర్తించిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఆకస్మికంగా ఆక్సిజన్ కొరత అనేది ఏర్పడదు. అలాగే, కోవిడ్ -19 రోగులకు, ఇతర రోగులకు అవసరమయ్యే ఆక్సిజన్ ఇక్కడే ఉత్పత్తి అవుతుందని పీఏంఓ తెలిపింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ సంవత్సరం అదనంగా 162 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చెయ్యడానికి పీఎం-కేర్స్ ఫండ్ నుంచి కేంద్రం రూ.201.58 కోట్లు కేంద్రం కేటాయించింది. దేశంలో ఇప్పటికే చాలా ఆస్పత్రుల్లో ఒక్కసారిగా ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీనితో ఆక్సిజన్ నిల్వలు ఒక్కసారిగా అయిపోయాయి. ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ మెడికల్ ఆక్సిజన్ లేని కారణంగా ఆదివారం నుంచి పేషెంట్లను చేర్చుకోవడం మానేసింది. దీనిపై అధికారులకు చర్చలు జరుపుతున్నారు. చదవండి: ప్రాణవాయువును అడ్డుకుంటే ఉరి తీస్తాం! -
ప్రశ్నలు సంధించాల్సిన సమయమిది
దేశంలోని ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితిని సమీక్షించేందుకు కీలకమైన అంతర్జాతీయ సందర్శకుడితో భేటీని ప్రధానమంత్రి కార్యాలయం రద్దు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీడియా కరోనా వాస్తవ పరిస్థితిపై మరిన్ని ప్రశ్నలను సంధించాలి తప్ప ప్రభుత్వం నుంచి వచ్చే ‘మమ్మల్ని నమ్మండి’ అనే రకం సమాధానాలకు తలూపవద్దు. ఈ విషయంలో మనం పదే పదే ప్రశ్నించడం ద్వారానే ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ అమలు వంటి వాటిపై పునరాలోచించడానికి వీలుపడుతుంది. ప్రభుత్వాలపై నమ్మకం పెట్టడం కాదు.. ప్రజలను, ప్రశ్నలు సంధించేవారిని ప్రభుత్వాలు విశ్వసించవలసిన సమయం ఇది. ప్రాణాంతకమైనది కానట్లయితే కరోనా అంటే మనందరికీ ఒక కామెడీగా ఉండేది. మన దేశంలో కనబడుతున్న కరోనా రకం బి. 1.617 బ్రిటన్‌లో తొలిసారి ఈ ఫిబ్రవరిలో కనిపించింది. కానీ మన దేశంలో మాత్రం కరోనా బీభత్సంగా వ్యాప్తి చెందడానికి కొత్త కరోనా రకం కారణం కాదని చెబుతున్నారు. వ్యాక్సిన్ పోర్ట్ ఫోలియోని మరింతగా విస్తరించాలని సూచించినందుకు కేంద్రమంత్రులు ప్రతిపక్ష సీనియర్ నేతను తూర్పారబడుతూ ఆయన మందుల కంపెనీలకు దళారీ అంటూ ముద్రవేసి మరీ అవమానించారు. సరిగ్గా మూడు రోజుల తర్వాత వాక్సిన్ పోర్ట్‌ఫోలియోను కేంద్రప్రభుత్వమే విస్తరించడం గమనార్హం. 45 ఏళ్లు పైబడిన వారికే కాదు మే 1 నుంచి దేశంలో 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ మొదలెడతామని కేంద్రం ప్రకటించింది. పైగా కరోనా వ్యాక్సిన్ కొరత లేదని, కానీ రాష్ట్రాలు మాత్రం వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేస్తున్నాయని కేంద్రం ఆరోపించింది. దేశంలో ఆక్సిజన్ కొరత లేదని సీనియర్ అధికారులతో కూడిన సాధికారక బృందం చెప్పింది. కానీ దేశంలోని ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు అంతర్జాతీయ సందర్శకుడితో భేటీని ప్రధానమంత్రి కార్యాలయం రద్దు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కరోనా వ్యాక్సినేషన్‌కి సంబంధించి పూర్తిగా నియంత్రించిన సమాచారం అనేది మహమ్మారి సామూహిక నిర్వహణకు, సహాయకారి కాదని చెప్పాలి. మహమ్మారితో తలపడేందుకు ఎలాంటి సమాచారాన్ని విడుదల చేస్తే సహాయకారి అవుతుంది? ఒకటి: భారత వైద్య పరిశోధనా మండలి వద్ద అందుబాటులో ఉన్న యాంటిజెన్ పరీక్షల సమాచారాన్ని బహిర్గతం చేయాలి. పరీక్ష స్వభావం రీత్యా ఇది తప్పిపోయిన ఇన్ఫెక్షన్లను కనుగొనడంలో లోపభూయిష్టమైన పద్ధతి. యాంటిజెన్ పరీక్షలను అధికంగా చేయించుకున్న నగరాలు, జిల్లా కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఈ పరీక్షల్లో ఇన్ఫెక్షన్లు లేవని తేలిన వ్యక్తులు స్వేచ్ఛగా తిరిగేస్తూ ఇతరులకు వైరస్ అంటించే ప్రమాదం కూడా ఉంది. రెండు: స్వీయ పరీక్ష, నిఘాకు, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటివాటికి సంబంధించిన పరీక్షలకు కారణాలేమిటని కనుగొనాల్సి ఉంది. స్వీయ రిపోర్టింగ్ కంటే కాంట్రాక్ట్ ట్రేసింగ్‌కి సంబంధించిన సమాచారాన్ని విస్తృత స్థాయిలో వెల్లడించడమే ఉత్తమం. మూడు: వివిధ రకాల వైరస్ల నిష్పత్తి యునైటెడ్ కింగ్డమ్ తరహా వైరస్ రకం బి.1.117. ఎక్కువగా సోకుతున్నట్లు పంజాబ్ ఆరోగ్య శాఖ నివేదించింది. దీనికి రోగనిరోధక శక్తినుంచి తప్పించుకునే ఉత్పరివర్తనం లేదు కాబట్టి ఈ వైరస్ రకం వాక్సినేషన్‌కి అధికంగా స్పందించవచ్చు. ఇకపోతే బి.1.117 రకం వైరస్ ఎక్కువగా ప్రబలుతున్న మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధక శక్తిని కల్పిస్తే ఇన్ఫెక్షన్ తీవ్రతను తగ్గించవచ్చు కానీ ఇది కూడా ఇన్ఫెక్షన్ను పూర్తిగా నిలిపివేయలేదు. ఎందుకంటే ఈ వైరస్ రకం రోగనిరోధక శక్తిని తగ్గించే ఉత్పరివర్తనాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల వ్యాధి నిర్వహణపై ప్రభావం చూపవచ్చు. పైగా రోగనిరోధక శక్తి ప్రయోజనాలను ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారన్నది కూడా ప్రధానమే. రోగనిరోధక శక్తిని వ్యాక్సిన్ ద్వారా అందించాక పెద్ద సంఖ్యలో ప్రజలకు మళ్లీ కరోనా సోకితే, వ్యాక్సిన్‌పై అనుమానాలు పెరగవచ్చు. ఇది వ్యాక్సిన్ కార్యక్రమంపై తీవ్ర ప్రభావం కలిగిస్తుంది. నాలుగు: కేసులు విస్తరిస్తున్న ప్రాంతం. పెద్ద నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు ఏవైనా సరే వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా ఉంటున్నాయి. మహారాష్ట్ర నుంచి వస్తున్న పరిమిత సమాచారం బట్టి కరోనా ఇప్పుడు పెద్ద నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వ్యాపిస్తున్న కరోనా చిన్న పట్టణాలు, పెట్టీ అర్బన్ ప్రాంతాలు, లేక గ్రామాలలో ఎటువైపు కదులుతోంది అనేది అస్పష్టం. వ్యాక్సిన్ భౌగోళిక ప్రాధమ్యతకు ఇది చాలా ముఖ్యం. అయిదు: ఏ వయస్సుల వారికి కరోనా సోకుతోంది, ఏ వయస్సుల వారు మరణిస్తున్నారు అనేది ముఖ్యం. యుక్తవయస్సులో ఉన్నవారికి కరోనా తీవ్రంగా సోకలేదని మనం భావిస్తూ వచ్చాం. ఇది మన వ్యాక్సినేషన్ వ్యూహాన్ని సమర్థిస్తూ వస్తోంది. కానీ ప్రస్తుతం కరోనా రెండో దశలో యువతీయువకులకు కూడా ఎక్కువగా సోకుతున్నట్లు కనిపిస్తోంది. ముంబైలో కరోనా గణాంకాలు ఇప్పటికీ 50 సంవత్సరాలకు లోపు వయసున్న వారిలో 65 శాతం మందికి కరోనా సోకుతున్నట్లు చెబుతున్నాయి. గతంలో ఇది 57 శాతం మాత్రమే ఉండేది. మరి ఇది వ్యాక్సినేషన్‌కి సంబంధించినదా లేక వైరస్ కొత్త రకానికి సంబంధించినదా అనేది ప్రశ్న. పుణే, ముంబై, ఢిల్లీ తదితర పట్టణాలనుంచి వస్తున్న నివేదికలు చూస్తుంటే ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయని తెలుస్తోంది. ముంబైలో కరోనా మరణాల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తున్నా, మహారాష్ట్ర లోని పలు జిల్లాల్లో అధిక మరణాలు సంభవిస్తున్నాయి. దీనిపై యంత్రాంగం దృష్టి పెట్టాలి. ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోవడం, మరణాలు తక్కువ కావడం జరుగుతోందంటే చాలామంది చికిత్స చేయించుకుంటూ రోగాన్ని నయం చేసుకుంటున్నారని, వృద్ధుల్లోనూ కేసులు తగ్గుతున్నాయని అర్థం. కాబట్టి ఏ వయస్సులో ఉన్న రోగులకు ప్రాధాన్యమివ్వాలి అనే అంశాన్ని ఈ వయోగత చట్రం ప్రభావితం చేస్తోంది. దీన్ని పారదర్శకంగా తెలియజేస్తే ఆక్సిజన్ కోసం, రెమ్డిసివిర్ ఇంజెక్షన్ కోసం పరుగులు తీస్తున్న కుటుంబాలకు కాస్త హామీ ఇవ్వవచ్చు. ఆరు: వ్యాక్సిన్ వేయించుకున్న వారు తీవ్రంగా వైరస్ సోకి ఆసుపత్రుల పాలయ్యారా? ఇప్పటికే కోటీ 10 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ కార్యకర్తలు పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకోగా, 45 ఏళ్లకు పైబడిన వయస్సు కలిగిన 9 కోట్లమంది ప్రజలు కనీసం ఒక సారి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రత్యేకించి పట్టణ కేంద్రాల్లో 45 ఏళ్లకు పైబడినవారు గణనీయమైన సంఖ్యలో వ్యాక్సిన్ వేయించుకున్నారని స్పష్టమవుతోంది. వీరు వైరస్ సోకినప్పటికీ ఆసుపత్రుల్లో చేరలేదంటే ఇది నిజంగా శుభవార్తే అవుతుంది మరి. ఏడు: వ్యాక్సిన్ తీసుకున్నాక కలిగే దుష్పరిణామలను నివేదిం చడం ద్వారా వ్యాక్సిన్‌పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమాచారాన్ని ప్రస్తుతం వ్యాక్సినేషన్ డేటాలో పొందుపర్చలేదు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్, జాన్సన్ వ్యాక్సిన్ తీసుకున్నాక కొన్ని కేసుల్లో రోగుల్లో రక్తం గడ్డకట్టిందని అంతర్జాతీయంగా వార్తలు వచ్చాయి. భారత్‌లో ఇంతవరకు 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఇలా రక్తం గడ్డ కట్టిన కేసులు కనిపించలేదు. అయితే ప్రభుత్వం వ్యాక్సిన్‌కి సంబంధించిన ప్రతికూల సమాచారాన్ని పూర్తిగా దాచి ఉంచుతుండడం కారణంగానే ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల విశ్వాసం సడలుతుండవచ్చు. ఎనిమిది: వ్యాక్సిన్ కొరతను గుర్తించి మన వ్యూహాన్ని మెరుగుపర్చుకోవాలి. వైరస్ వ్యాప్తిని బట్టి గ్రామీణ, పట్టణ, భౌగోళిక ప్రాధ్యానతల ప్రాతిపదికన మనం వ్యాక్సినేషన్ సమాచారాన్ని తప్పకుండా విడుదల చేయాలి. పట్టణ ప్రాంతాలకు అధికంగా సమాచారాన్ని ఇవ్వడం మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. భవన నిర్మాణ కార్మికులు నగరాల్లోని వీధి బళ్ల వర్తకులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా మనం ఫ్రంట్‌లైన్ కార్మికులను పునర్నిర్వచించవచ్చు. వీరిలో చాలామంది కరోనా సోకినప్పటికీ ఆదాయం కోల్పోతామనే భయంతో కరోనా పరీక్షలకు సిద్ధం కాకపోవచ్చు. తొమ్మిది: గత ఏడాది తమ ప్రాంతాలకు తిరిగొచ్చిన వలస కార్మికుల విషయంలో చేసినట్లుగానే ప్రస్తుతం లక్షలాది భక్తులు గుమికూడిన కుంభమేళా నుంచి తిరిగొచ్చిన వారిని మొత్తంగా క్వారంటైన్ చేసి పరీక్షించవలసిన అవసరం ఉంది. జనం గుమికూడిన తర్వాత కూడా వారికి వైరస్ సోకలేదంటే అది వారి అదృష్టమే కావచ్చు కానీ అంతమాత్రాన అలాంటి భారీ జన సమీకరణల ఘటనలను మనం తేలిగ్గా చూడకూడదు. పది: మీడియా కరోనా వాస్తవ పరిస్థితిపై మరిన్ని ప్రశ్నలను సంధించాలి తప్ప ప్రభుత్వాల నుంచి వచ్చే ‘మమ్మల్ని నమ్మండి’ అనే రకం సమాధానాలకు తలూపవద్దు. మనం పదే పదే ప్రశ్నించడం ద్వారానే వ్రభుత్వాలు పునరాలోచించడానికి వీలుపడుతుంది. ప్రభుత్వాలను వ్రజలు, మీడియా విశ్వసించడం కాదు.. ప్రజలను, ప్రశ్నలు సంధించేవారిని ప్రభుత్వాలు విశ్వసించవలసిన సమయం ఇది. పార్థా ముఖోపాధ్యాయ్ సీనియర్ ఫెలో, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ -
‘ప్రధాని మాస్క్ విలువ వెల్లడించలేం’
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ఎలాం టి మాస్కు ధరిస్తు న్నారు? దాని విలువ ఎంత? ఆయనకు వ్యాక్సిన్ వేశారా? అన్న సందేహాలతో హైదరాబాద్‌కి చెందిన రాబిన్ గతేడాది డిసెంబర్లో ఆర్టీఐ కింద ప్రధాన మంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై పీఎంవో తాజాగా స్పందించింది. ప్రధాని ధరించే మాస్కు వివరాలు, వ్యాక్సినేషన్ వివరాలు వ్యక్తిగతమైనవి పేర్కొంది. ఆర్టీఐ యాక్ట్‌లోని సెక్షన్ 8(1) కింద మీరు అడిగిన వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేసింది. ప్రధానికయ్యే ఈ ఖర్చును ప్రభుత్వం భరించదని సమాధానమిచ్చింది. -
నేడే వ్యాక్సినేషన్ డ్రైవ్
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసే, ప్రపంచం లోనే అతి పెద్దదైన వ్యాక్సినేషన్ కార్యక్రమా నికి ప్రధాని మోదీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారులైన ఆరోగ్య కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడతారు. వ్యాక్సినేషన్లో వాడే దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల టీకా డోసులను ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) తెలిపింది. ప్రజాభాగస్వామ్యంలో భాగంగా ప్రభుత్వం చేపట్టే ఈ బృహత్తర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పీఎంవో పేర్కొంది. 3,006 సెషన్ సైట్లు వ్యాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 3,006 సెషన్ సైట్లను ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేసినట్లు పీఎంవో తెలిపింది. మొదటి రోజు ప్రతి సెషన్ సైట్లో కనీసం 100 మందికి టీకా ఇస్తారని పేర్కొంది. మొదటి రోజు టీకా తీసుకునే కొందరు ఆరోగ్య కార్యకర్తలతో ప్రధాని మోదీ సంభాషించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఈ జాబితాలో ఉన్న ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రుల అధికారులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం శాఖకు చెందిన నిర్మాణ్ భవన్‌లోని కోవిడ్ కంట్రోల్ రూంను సందర్శించారు. కేటాయింపుల్లో వివక్ష ఉండదు టీకా కేటాయింపులపై కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి స్పష్టతనిచ్చింది. ‘వ్యాక్సినేషన్ డోసుల కేటాయింపుల్లో ఏ రాష్ట్రంపైనా వివక్ష చూపే ప్రశ్నే లేదు. ఇది ముందుగా సరఫరా చేస్తున్న వ్యాక్సిన్ డోసులు, రానున్న వారాల్లో డోసుల సరఫరా కొనసాగిస్తాం. టీకా సరఫరాలో లోటు జరుగుతుందనే ప్రశ్నే ఉత్పన్నం కాదు’అని పేర్కొంది. 31న పల్స్ పోలియో 16న జరిగే కోవిడ్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో పోలియో టీకా కార్యక్రమం పల్స్ పోలియో జనవరి 31వ తేదీకి వాయిదా పడిందని ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రపతి కార్యాలయం అధికారులతో సంప్రదింపుల అనంతరం పల్స్ పోలియోను రీ షెడ్యూల్ చేసినట్లు వివరించింది. గర్భవతులకు వ్యాక్సిన్ ఇవ్వవద్దు గర్భవతులు, పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇవ్వవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వకూడదో చెబుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. కేవలం 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొంది. గర్భవతులు, పాలిచ్చే తల్లుల మీద వ్యాక్సిన్ ప్రయోగాలు జరగనందున వారికి వ్యాక్సిన్ ఇవ్వవద్దని స్పష్టం చేసింది. మొదటగా ఇచ్చిన డోసుకు సంబంధించిన వ్యాక్సిన్నే 14 రోజుల వ్యవధితో ఇచ్చే రెండో డోసులోనూ ఇవ్వాలని స్పష్టం చేసింది. 15 వేల కొత్త కేసులు దేశంలో 24 గంటల్లో 15,590 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,27,683 కు చేరుకుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో కరోనా కారణంగా 191 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,51,918కు చేరుకుందని పేర్కొంది. -
వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కొన్ని కంపెనీల క్లినికల్ ట్రయల్స్ ముగింపు దశకు చేరాయి. తమ వ్యాక్సిన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఫైజర్, మోడెర్నా వంటి దిగ్గజ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. వ్యాక్సిన్ రాగానే ఉపయో గించాలంటే ప్రభుత్వం అత్యవసర అనుమతి (ఎమర్జెన్సీ ఆథరైజేషన్) ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాక్సిన్లకు ఇలాంటి అనుమతి ఇవ్వడానికి అందుబాటులో ఉన్న విధానాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ (వీటీఎఫ్) ఈ పనిలో నిమగ్నమై ఉంది. మోడెర్నా టీకా డోసు ధర ఎంతంటే.. ఫ్రాంక్ఫర్ట్: కరోనా టీకా అభివృద్ధిలో అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా ముందంజలో ఉంది. త్వరలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని నమ్మకంగా చెబుతోంది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టెఫానీ బాన్సెల్ మాట్లాడుతూ తమ వ్యాక్సిన్‌కుగాను ప్రభుత్వాల నుంచి ఒక్కో డోసుకు 25 డాలర్ల నుంచి 37 డాలర్లు(రూ.1,854–రూ.2,744) తీసుకుంటామని చెప్పారు. ఆర్డర్ చేసిన డోసులను బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంద న్నారు. ఫ్లూ వ్యాక్సిన్ డోసు 10 డాలర్ల నుంచి 50 డాలర్ల దాకా పలుకుతోంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధికారులు ఇప్పటికే మోడెర్నా సంస్థతో చర్చలు జరిపారు. వ్యాక్సిన్ డోసు 25 డాలర్ల లోపు ధరకే తమకు సరఫరా చేయాలని కోరారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. -
అసలేం జరిగింది.. ఆరా తీయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో జరిగిన అక్రమాలపై కేంద్రం విచారణకు ఆదేశించింది. నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడమేగాకుండా.. రూ.కోట్ల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడాన్ని తీవ్రంగా పరిగణించింది. సెర్ప్‌లో పశు గణన–జీవనోపాధి (లైవ్ స్టాక్–లైవ్లీ హుడ్స్) పథకంలో భారీగా అవకతవకలు జరిగినట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు ప్రధాన మంత్రి కార్యాలయానికి చేసిన ఫిర్యాదును పరిశీలించిన కేంద్రం.. దీనిపై విచారణ జరిపి ఆగస్టు6లోగా నివేదిక పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివద్ధిశాఖ జాయింట్ సెక్రెటరీ లీనా జోహ్రీ సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు లేఖ రాశారు. ఎన్ఆర్ఎల్ఎం (నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్) పథకం కింద 2018 నుంచి ఇప్పటివరకు జరిగిన కార్యకలాపాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. కాగా, ఇదే అంశంపై సామాజిక కార్యకర్త జలగం సుధీర్ కూడా ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆరోపణలు ఇవే..!. మహిళా సంఘాల సభ్యుల దగ్గర ఉన్న గొర్రెలు, మేకల పశు ఉత్పత్తి సామర్థ్యం, ఉత్పత్తి చేసిన పశు ఉత్పత్తుల విలువ పెంపుదల కోసం ఈ ఏడాది మార్చినాటికి 2,875 లైవ్ స్టాక్ ఫార్మర్ ప్రొడ్యూ సింగ్ గ్రూపులను ఏర్పాటు చేశారు. గ్రూపులలో లేని 75% మంది మహిళలకు జీవాలు లేకున్నా ఉన్నట్లు నమోదు చేసి.. భారీగా నకిలీ గ్రూప్‌లను సృష్టించారు. ఆ తర్వాత కమీషన్లకు ఆశపడి.. పశుఉత్పత్తి సామర్థ్యం, చేసిన పశు ఉత్పత్తుల విలువ పెంపుదల కోసం ఉపయోగపడని పరికరాలను కొనుగోలు చేశారు. ఏటా రూ.1.50 కోట్ల పరికరాల కొనుగోళ్లు జరుగుతున్నా.. గత రెండేళ్లలో ఎలాంటి ఇ–టెండర్లను పిలవకుండా బహిరంగ మార్కెట్ల లోని ధరల కంటే 2–3 రెట్లు ఎక్కువకు కొనుగోలు ధరలను నిర్ణయించి లైవ్ స్టాక్ లైవ్లీ హుడ్స్ యూనిట్లలో అవినీతికి పాల్పడ్డట్లు తెలిసింది. డిజిటల్ వేయింగ్ మిషన్, డ్రెంచింగ్ గన్, డిటిక్కింగ్ మిషన్ – వాక్సిన్ కారియర్ కొనుగోళ్లలో చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. పశుమిత్రల శిక్షణ కోసం చేసిన ముద్రణ పనుల్లోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. పశుమిత్రలకు ఆన్లైన్ క్లాస్‌లు..! ఎన్ఆర్ఎల్ఎం కింద పశు మిత్ర శిక్షణ ఇస్తారు. దీన్ని పశుసంవర్థకశాఖ లేదా వెటర్నరీ వర్సిటీ ద్వారా ఇప్పించకుండా..సెర్పే ఇచ్చింది. దీంతో ఈ శిక్షణకు సెక్షన్ 30(b) ఇండియన్ వెటర్నరీ కౌన్సిల్ యాక్ట్ 1984 ప్రకారం అవసరమైన గుర్తింపు నేటి వరకు రాలేదు. సెర్ప్ వద్ద నమోదైన పశుమిత్రల పని వివరాలు కూడా తప్పుల తడకేనని తెలుస్తోంది. శిక్షణ పొందిన 2,300 పశుమిత్రలలో కనీసం 200 మంది కూడా గ్రామాలలో పని చేయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,850 మంది పశుమిత్రలకు శిక్షణ ఇవ్వడానికి ఓ ఏజెన్సీకి చెల్లించేందుకు రూ.10.57కోట్లను ఖరారు చేశారు. పశువైద్య శాస్త్ర ప్రకారం ‘ప్రాక్టికల్ ఓరియెంటెడ్’గా శిక్షణ ఇవ్వాల్సిఉంటుంది. కోవిడ్–19 ఆంక్షలున్నా కమిషన్ల కక్కుర్తికి ఆశపడి ‘ఆన్ లైన్’పద్ధతిలో శిక్షణ ఇవ్వడం విడ్డూరం. -
గల్వాన్ లోయ మాదే
న్యూఢిల్లీ/బీజింగ్: గల్వాన్ లోయ తమదేనంటూ శనివారం చైనా చేసిన ప్రకటనను భారత్ తీవ్రంగా ఖండించింది. అతిశయోక్తితో కూడిన చైనా వాదన ఏమాత్రం ఆమోదయోగ్యంకాదని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘గల్వాన్ లోయ చారిత్రకంగా భారత్‌దే. గతంలో ఎన్నడూ ఇది చైనా భూభాగం కాదు. రెండు దేశాల బలగాలు ఈ ప్రాంతంలో గస్తీ చేపడుతున్నా చాలాకాలంగా ఎటువంటి ఘటనలు జరగలేదు. ఇదే తీరును చైనా కొనసాగించాలి. ఉల్లంఘించేందుకు చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా భారత బలగాలు తగిన విధంగా తిప్పికొడతాయి’ అని అన్నారు. ఇటీవల రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కుదిరిన అవగాహన మేరకు చైనా వ్యవహరిస్తుందని భావిస్తున్నామన్నారు. చైనా ట్విట్టర్లో కనిపించని మోదీ ప్రసంగం గల్వాన్ ఘటనపై ఈనెల 18వ తేదీన ప్రధాన మంత్రి మోదీ చేసిన ప్రసంగంతోపాటు, విదేశాంగ శాఖ ప్రతినిధి శ్రీవాస్తవ చేసిన వ్యాఖ్యలను చైనాలోని ప్రధాన సోషల్ మీడియా సైట్లు తొలగించాయి. వీబో, వుయ్‌చాట్ సైట్లలో వీటిని తమకు కనిపించకుండా చేశారని చైనాలోని భారత దౌత్యాధికారులు తెలిపారు. చైనా ట్విట్టర్ ‘సినావీబో’, ‘ఉయ్‌చాట్’కు కోట్లాదిగా యూజర్లున్నారు. అన్ని దౌత్య కార్యాలయాలు, ప్రధాని మోదీ వంటి పలువురు ప్రపంచ నేతలకు ఇందులో అకౌంట్లున్నాయి. వీబో, వుయ్చాట్ల్లో భారత్‌తో సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించి ఎలాంటి పోస్టులు లేవు. అది దుర్మార్గమైన భాష్యం భారత, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై ప్రధాని మోదీ ఇచ్చిన వివరణకు కొందరు దుర్మార్గపూరితంగా పెడార్థాలు తీస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) పేర్కొంది. ‘తూర్పు లద్దాఖ్‌లోని భారత భూభాగంలోకి ఎవరూ అడుగు పెట్టలేదు. భారత సైనిక పోస్టులను ఎవరూ ఆక్రమించుకోలేదు.. ’అంటూ శుక్రవారం ప్రతిపక్షాలతో భేటీలో ప్రధాని మోదీ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ నేతల నుంచి వచ్చిన వ్యాఖ్యలపై పీఎంవో వివరణ ఇచ్చింది. ‘మన జవాన్ల వీరోచిత పోరాటం ఫలితంగానే భారత్ వైపునున్న వాస్తవ నియంత్రణ రేఖ దాటి చైనా బలగాలు అడుగుపెట్టలేదని ప్రధాని మోదీ శుక్రవారం ప్రతిపక్షాలకు చెప్పారు. బిహార్ రెజిమెంట్‌లోని 16 మంది జవాన్ల త్యాగాల ఫలితంగానే ఆరోజు చైనా సైన్యం ఎల్ఏసీ దాటి వచ్చి, నిర్మాణాలు చేపట్టేందుకు చేసిన ప్రయత్నం సాగలేదు. మన జవాన్లు వారికి తగిన బుద్ధి చెప్పారు. దేశ సరిహద్దులు కాపాడేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ భారత్ వదులుకోదని ప్రధాని అన్నారు. కానీ, కొన్ని వర్గాలు ప్రధాని మోదీ వ్యాఖ్యలకు దుర్మార్గపూరితంగా వక్రభాష్యాలు చెప్పేందుకు ప్రయత్నించాయి’అని శనివారం పీఎంవో పేర్కొంది. మన భూభాగాన్ని చైనాకు అప్పగించారు: రాహుల్ భారత భూభాగాన్ని ప్రధాని మోదీ చైనాకు అప్పగించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత భూభాగంలోకి ఎవరూ అడుగుపెట్టలేదనీ, సైనిక పోస్టులను ఎవరూ ఆక్రమించుకోలేదని శుక్రవారం ప్రధాని మోదీ ఇచ్చిన వివరణపై ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ మేరకు స్పందించారు. ‘ప్రధాని మోదీ భారతీయ భూభాగాన్ని చైనా దురాక్రమణకు అప్పగించారు. అది చైనా ప్రాంతమే అయితే మన సైనికులు ఎందుకు, ఎక్కడ ప్రాణాలర్పించారు’అని ట్విట్టర్లో రాహుల్ ప్రశ్నలు సంధించారు. చిల్లర రాజకీయాలు వద్దు: అమిత్ షా గల్వాన్ లోయలోని భారత భూభాగాన్ని ప్రధాని మోదీ చైనాకు అప్పగించారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ట్విట్టర్లో విమర్శించారు. గల్వాన్ ఘటనలో గాయపడిన జవాను తండ్రి.. సరిహద్దు ఉద్రిక్తతలను రాజకీయం చేయొద్దంటూ రాహుల్‌ను కోరుతున్నట్లుగా ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. ‘రాహుల్ గాంధీకి సాహస సైనికుడి తండ్రి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. జాతి యావత్తూ కలిసికట్టుగా ఉండాల్సిన ఈ క్లిష్ట సమయంలో చిల్లర రాజకీయాలను పక్కనబెట్టి, జాతి ప్రయోజనాల కోసం సంఘీభావంగా నిలవాలి’అని హోం మంత్రి పేర్కొన్నారు. -
రేపు అఖిలపక్షం భేటీ
చైనా ఆర్మీ దాడిలో కల్నల్ సహా 20 మంది భారతీయ సైనికులు మరణించడం, తదనంతర పరిణామాలపై సమాచారం పంచుకునేందుకు ప్రధాని శుక్రవారం అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఆ భేటీలో విపక్ష, మిత్రపక్ష నేతలకు వివరించనున్నారు. ‘చైనా సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని చర్చించేందుకు జూన్ 19 సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పక్షాలతో సమావేశమవనున్నారు’ అని పీఎంఓ ట్వీట్ చేసింది. గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ అఖిలపక్ష భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. సరిహద్దు వివాదానికి సంబంధించి దేశమంతా ప్రభుత్వం వెనుక ఉందని, ఘర్షణలకు సంబంధించిన అన్ని వాస్తవాలను వెల్లడించాలని రాహుల్ గాంధీ బుధవారం డిమాండ్ చేశారు. -
సరిహద్దు వివాదం: ప్రధాని అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: లడక్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్-చైనా ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణలో కల్నల్ సహ 20 మంది సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సరిహద్దులో తాజా పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(జూన్ 19) సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం బుధవారం ట్వీట్ చేసింది. (సరిహద్దు ఘర్షణ : రాజ్‌నాథ్ మళ్లీ కీలక భేటీ) In order to discuss the situation in the India-China border areas, Prime Minister @narendramodi has called for an all-party meeting at 5 PM on 19th June. Presidents of various political parties would take part in this virtual meeting. — PMO India (@PMOIndia) June 17, 2020 తూర్పు లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో జరిగిన పోరాటంలో 45 మంది చైనా సైనికులు మరణించడం లేదా గాయపడి ఉండవచ్చని సమాచారం. ఇరుదేశాల సైనికులు పరస్పరం రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ప్రధాని వ్యక్తిగత కార్యదర్శికి కీలక పదవి
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత కార్యదర్శి రాజీవ్ టోప్నో ప్రపంచ బ్యాంకులో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు సీనియర్ సలహాదారుగా సేవలందించనున్నారు. అతనితో పాటు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో పని చేస్తున్న పలువురు అధికారులకు ఇతర పదవులను కేటాయిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) గురువారం ఆమోద ముద్ర వేసింది. మొత్తంగా ఐదుగురు అధికారులను విదేశీ వ్యవహారాలు చూసుకునేందుకు కేటాయించింది. కాగా 2009లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ టోప్నో ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ ఆఫీసర్‌గా నియమితులు అయ్యారు. ఆ తర్వాత 2014లో ప్రధానిగా ఎన్నికైన మోదీ రాజీవ్ టోప్నోను తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. ఇక 1999 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బ్రజేంద్ర నవనీత్ జెనీవాలోని ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత అంబాసిడర్‌గా దేశం తరపు శాశ్వత ప్రతినిధిగా నియామకమయ్యారు. 1993 ఐఏఎస్ బ్యాచ్ అధికారి రవికోటను వాషింగ్టన్లో భారత ఎంబసీ మంత్రిగా ఏసీసీ నియమించింది. లేఖన్ తక్కర్‌ను బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయంలో ఎకనామిక్ కౌన్సిలర్‌గా, హెచ్ అతేలీని ఆసియా బ్యాంకులో ఈడీకి సలహాదారుగా, అన్వర్ హుస్సేన్ షేఖ్‌ను ప్రపంచ వాణిజ్య సంస్థలో పర్మినెంట్ మిషన్ ఆఫ్ ఇండియా కౌన్సిలర్‌గా నియమించింది. (ప్రధాని సలహాదారులుగా రిటైర్డ్ ఐఏఎస్‌లు) -
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ కరోనా తీవ్ర ప్రభావంలో ఉన్న నేపథ్యంలో తరుణ్ బజాజ్ ఈ బాధ్యతలు చేపట్టారు. ఇంతక్రితం ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. గురువారం పదవీ విరమణ చేసిన అతను చక్రవర్తి స్థానంలో తరుణ్ బజాజ్ నియమితులయ్యారు. ఆర్థిక శాఖతో ఆయనకు పూర్వ అనుభవం ఉంది. 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన బజాజ్, 2015లో ప్రధాని కార్యాలయంలో చేరడానికి ముందు ఆర్థిక వ్యవహారాల శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. -
లాక్డౌన్ సడలింపు: పీఎంఓ సన్నద్ధ సమావేశం
న్యూఢిల్లీ: కరోనా(కోవిడ్-19) నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ నుంచి కేంద్రం మరికొన్ని రంగాలకు మినహాయింపునిచ్చిన నేపథ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో ఏడు ముఖ్య మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఏప్రిల్ 20 నుంచి లాక్డౌన్ నిబంధనలు సడలించిన తరుణంలో అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై శుక్రవారం చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లాక్డౌన్ పాక్షికంగా ఎత్తివేసినా నిబంధనలు కఠినంగా చేయాల్సిందిగా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ కార్యదర్శి హీరాలాల్ సమారియా, ఎమ్ఎస్ఎమ్ఈ కార్యదర్శి అరుణ్ పాండా, పట్టణాభివృద్ధి కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, గ్రామీణ అభివృద్ధి కార్యదర్శి రాజేశ్ భూషణ్, షిప్పింగ్ కార్యదర్శి గోపాల్ కృష్ణ, గనుల శాఖ కార్యదర్శి సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.(కరోనా.. మధ్యప్రదేశ్‌లో 35 మంది డిశ్చార్జ్) ఈ సందర్భంగా... ముఖ్యంగా ప్రజా రవాణా అందుబాటులో లేని తరుణంలో కార్మికుల తరలింపు విషయంపై ప్రధానంగా చర్చించినట్లు పేర్కొన్నారు. ఇక భవన నిర్మాణ కార్యకలాపాలు జోరుగా సాగనున్న వేళ ఆయా చోట్ల ఆశా వర్కర్లు, హెల్త్‌కేర్ వర్కర్ల సేవలను విరివిగా ఉపయోగించుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అదే విధంగా నిబంధనలు పాక్షికంగా సడలించిన కారణంగా పెద్ద ఎత్తును ప్రజలు రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉన్నందున శాంతి భద్రతల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలతో పీఎంఓ ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని పంచుకుంటూ సమీక్షిస్తుందని పేర్కొన్నారు. కాగా సోమవారం నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు, రోడ్డు, భవన నిర్మాణ రంగ పనులకు అనుమతినిచ్చిన నేపథ్యంలో రోజూ వారీ కూలీలకు కాస్త ఊరట లభించనుంది. ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం శుక్రవారం తాజాగా మరికొన్ని నిబంధనలను సడలింపునిచ్చిన విషయం తెలసిందే. తాజా సడలింపులు... గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు నీటి సరఫరా పారిశుద్ధ్య రంగానికి చెందిన నిర్మాణ పనులు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల కార్యకలాపాలకు అనుమతి కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, ప్రాసెసింగ్ ఇక హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కొద్దిపాటి సిబ్బందితో పనులు చేసుకోవచ్చు. వెదురు, కొబ్బరి, వక్క, కొకొవా తదితర ఉత్పత్తుల ప్లాంటేషన్, ప్యాకేజింగ్, అమ్మకం, మార్కెటింగ్ మొదలైన పనులను ఈ లాక్డౌన్ యథావిధంగా కొనసాగించుకోవచ్చు -
కరోనా: మంత్రులు రోజూ ఆ పని చేయాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరించకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. అయితే క్వారంటైన్లో ఉన్న వారికి కల్పిస్తున్న ఆరోగ్యభద్రత, వారికి అందిస్తున్న చికిత్స, అలాగే సామాజిక దూరం పాటిస్తున్న విధానం, కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు, మాస్క్‌లు, శానిటైజర్ల కొరత తదితర అంశాలపై మానిటర్ చేయడానికి ప్రతి రాష్ట్రానికి ఒక్కరిద్దరు మంత్రులను కేంద్రప్రభుత్వం ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. ఈ వారంలో జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చిన్న రాష్ట్రాలకు ఒక మంత్రిని ఇన్చార్జ్గా నియమించగా, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు, పెద్ద రాష్ట్రాలకు ఇద్దరు మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నట్టు మోదీ తెలిపారు. వీరు ప్రతిరోజు నమోదవుతున్న కరోనా కేసులు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, సామాజిక దూరం, కార్వంటైన్‌లో ఉన్న వారికి కల్పిస్తున్న సదుపాయాలు, అవసరం ఉన్న వారికి అందుబాటులో ఉన్న కమ్యూనిటీ కిచెన్లు, ఇతర పరిస్థితులు అన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు ప్రధానమంత్రి కార్యాలయానికి అందించాలని ఆదేశించారు. జిల్లా మేజిస్ట్రేట్లు, జిల్లా కలెక్టర్లను అడిగి ప్రాథమిక స్థాయిలో సమాచారాన్ని తీసుకొని రిపోర్టును అందించాలని మంత్రులకు సూచించారు. ఈ మేరకు కేంద్ర న్యాయ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తమ సొంత రాష్ట్రమైన బీహార్‌కి సంబంధించిన పరిస్థితిని ప్రతిరోజు తెలుసుకుంటూ రిపోర్టును అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ‘మంత్రులందరూ జిల్లా మేజిస్ట్రేట్లు, జిల్లా కలెక్టర్లను అడిగి కిందిస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలి. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పనిచేయాలి’ అని మంత్రులు పేర్కొన్నారు. -
అధికార పీఠాల్లో మార్పులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా పునః అభివృద్ధి ప్రణాళిక వివరాలు ఒక్కటొక్కటిగా వెల్లడవుతున్నాయి. శతాబ్దాల చరిత్రగల ల్యూటెన్స్ ఢిల్లీలో సరికొత్త పార్లమెంటు భవనంతోపాటు సెంట్రల్ సెక్రటేరియట్, మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది డిజైన్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. హెచ్సీపీ డిజైన్స్ అనే గుజరాతీ సంస్థ డిజైన్, కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్ ప్లానింగ్ హక్కులు సాధించుకుంది. మొత్తం ప్రాజెక్టు ఫీజు రూ. 229.75 కోట్లు కాగా.. నిర్మాణ వ్యయం రూ. 12,879 కోట్లు అని అంచనా. హెచ్సీపీ సంస్థ మాస్టర్ ప్లాన్‌తోపాటు డిజైన్లు, నిర్మాణ వ్యయం, ల్యాండ్‌స్కేపింగ్, ట్రాఫిక్, పార్కింగ్ వంటి అంశాలపై నివేదిక ఇవ్వనుంది. ఈ మెగా ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు...సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రధానమంత్రి నివాసాన్ని, కార్యాలయాన్ని సౌత్‌బ్లాక్‌కు దగ్గరగా మార్చనున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి కోసం నార్త్ బ్లాక్ పరిసరాల్లో కొత్తగా ఒక ఇంటిని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి నివాసం ఉన్న భవనాన్ని కూల్చి వేయనున్నారు. రాష్ట్రపతి భవన్, ఇండియాగేట్‌ల మధ్య ఉన్న మూడు కిలోమీటర్ల పొడవైన రాజ్‌పథ్‌లో కొత్త నిర్మాణాలు జరపాలన్నది హెచ్సీపీ ప్రణాళిక. ప్రస్తుత పార్లమెంటు భవనం పక్కనే త్రికోణాకారంలో ఉండే సరికొత్త పార్లమెంటు భవనం, సెంట్రల్ సెక్రటేరియట్లు ఇక్కడ నిర్మాణమవుతాయి. స్వాతంత్య్రం 75వ వార్షికోత్సవాల సందర్భంగా అంటే 2022 ఆగస్టు నాటికి కొత్త పార్లమెంటు భవనాన్ని సిద్ధం చేయాలన్నది లక్ష్యం. కామన్ సెక్రటేరియట్‌ను 2024 నాటికల్లా అందుబాటులోకి తెస్తారు. ప్రధాని, ఉప రాష్ట్రపతి ఇళ్లను సౌత్, నార్త్ బ్లాక్‌లకు దగ్గరగా మార్చడం వల్ల వీఐపీల కోసం ట్రాఫిక్‌ను ఆపాల్సిన అవసరం తగ్గనుంది. పైగా ప్రధాని ఇల్లు, కార్యాలయం దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాని ఇంటి నుంచి కార్యాలయానికి నడిచి వెళ్లేందుకూ అవకాశం ఉంటుంది. 8 భవనాలుగా సెంట్రల్ సెక్రటేరియట్.. కొత్త సెంట్రల్ సెక్రటేరియట్లో.. సెంట్రల్ విస్టాకు ఇరువైపులా నాలుగు భవనాల చొప్పున మొత్తం ఎనిమిది భవనాలు ఉంటాయి. ఒక్కో భవనంలో ఎనిమిది అంతస్తుల్లో వేర్వేరు మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటవుతాయి. మంత్రిత్వశాఖల్లో సుమారు 25 నుంచి 32 వేల మంది ఉద్యోగులు ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తున్నారు. ఆయా శాఖల కార్యాలయాల కోసం ఏటా రూ.వెయ్యి కోట్లు అద్దెల కోసమే చెల్లిస్తున్నట్లు అంచనా. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం పూర్తయితే అద్దె ఆదా అవడమే కాకుండా ఉద్యోగులందరూ ఒకే చోట పనిచేస్తారు. -
ఐఏఎస్ సత్యనారాయణ అవినీతిపై ఫిర్యాదు
ఎమ్మిగనూరు టౌన్: గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సత్యనారాయణ అవినీతి, అక్రమ సంపాదనపై ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)తోపాటు సీబీఐ డైరెక్టర్‌కు బీజేపీ రాష్ట్ర నేత, ఆలిండియా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.పురుషోత్తంరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌గా రెండున్నరేళ్లపాటు పనిచేసిన సత్యనారాయణ అప్పటి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ తోపాటు కేఈ కృష్ణమూర్తి పేరుతో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. అప్పట్లో పీఎంఏవై కింద కర్నూలుకు ఆరువేల గృహాలు, నంద్యాలకు 4,500, ఆదోనికి 4,700, ఎమ్మిగనూరుకు వెయ్యి గృహాలు మంజూరయ్యాయన్నారు. వీటి నిర్మాణ కాంట్రాక్టు పొందిన షాపూర్జీ పల్లోంజి కంపెనీ నుంచి తమిళనాడుకు చెందిన వాసన్ అండ్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్‌ను సత్యనారాయణ ఇప్పించి లబ్ధి పొందారన్నారు. అంతేగాక వాసన్ అండ్ కంపెనీకి ఇసుక సరఫరాకోసం తన సోదరుడి కుమారుడు మురళి, బంధువు శ్రీనివాస్‌లను బినామీలుగా పెట్టుకుని.. వారి పేరిట జిల్లాలోని కౌతాళం, గుడికంబాళి ఇసుక రీచ్‌లను మంజూరు చేయించారని ఆరోపించారు. ఆయన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి అక్రమాస్తులను జప్తు చేయాలన్నారు. ఈ మేరకు పీఎంవో, సీబీఐ డైరెక్టర్‌తోపాటు సీబీఐ జేడీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్లకు ఫిర్యాదు చేశానని తెలిపారు. -
భారత్‌లో వృద్ధి మాంద్యం..
న్యూఢిల్లీ: పాలనాధికారాలన్నీ ప్రధాని కార్యాలయంలోనే కేంద్రీకృతమై ఉన్నాయని, మంత్రులంతా నిమిత్తమాత్రులుగానే ఉంటున్నారని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పాలనతో ఎకానమీ తీవ్ర రుగ్మతలతో సతమతమవుతోందని .. దేశం ‘వృద్ధి మాంద్యం’ పరిస్థితుల్లో చిక్కుకుందని పేర్కొన్నారు. ఒక వార్తాపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశాన్ని గట్టెక్కించాలంటే పెట్టుబడులు, భూ.. కార్మిక చట్టాలపరమైన సంస్కరణలు మరిన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో పెట్టుబడులతో పాటు వృద్ధికి కూడా ఊతం లభించగలదని రాజన్ తెలిపారు. దేశ సమర్థతను మెరుగుపర్చుకోవడానికి, పోటీ దేశాలకు దీటుగా ఎదగడానికి .. ఉపయుక్తంగా ఉండే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంపై భారత్ దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ‘ప్రస్తుత ప్రభుత్వంతో సమస్యేమిటంటే .. అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయి. నిర్ణయాలే కాదు.. ఆలోచనలు, ప్రణాళికలు.. అన్నీ కూడా ప్రధాని చుట్టూ ఉండే కొద్ది మంది, ప్రధాని కార్యాలయం నుంచి వస్తుంటాయి. ఒక పార్టీ రాజకీయ, సామాజిక ఎజెండాను అమలు చేయడానికి ఇలాంటి విధానం పనికొస్తుంది కానీ.. ఆర్థిక సంస్కరణల విషయంలో ఇది పనిచేయదు. ఇందుకు రాష్ట్రాల స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో ఎకానమీ ఎలా పనిచేస్తుందన్న దానిపై అపార పరిజ్ఞానం అవసరమవుతుంది‘ అని రాజన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సంకీర్ణంగా నడిచినప్పటికీ.. ఆర్థిక విధానాల సరళీకరణను స్థిరంగా ముందుకు తీసుకెళ్లాయన్నారు. ‘తీవ్ర స్థాయిలో అధికార కేంద్రీకరణ, మంత్రులకు అధికారాలు లేకపోవడం తదితర అంశాల కారణంగా.. పీఎంవో దృష్టి పెట్టినప్పుడు మాత్రమే సంస్కరణలు జోరందుకుంటున్నాయి. పీఎంవో దృష్టి మిగతా అంశాలవైపు మళ్లిన మరుక్షణం.. సంస్కరణల జోరూ తగ్గిపోతోంది‘ అని రాజన్ అన్నారు. ముందుగా సమస్యను గుర్తించాలి.. ఆర్థిక మందగమనానికి మందు కనుగొనాలంటే.. ముందుగా సమస్య తీవ్రతను గుర్తించడం దగ్గర్నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుందని రాజన్ తెలిపారు. ‘సమస్య పరిమాణాన్ని గుర్తించాలి. సమస్య తాత్కాలికమేనని.. ప్రతికూల వార్తలు, అననుకూల సర్వేలను తొక్కి పెట్టి ఉంచితే అది పరిష్కారమైపోతుందనే ఆలోచనల నుంచి బైటికి రావాలి. విమర్శించే ప్రతి ఒక్కరికీ రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం మానుకోవాలి. దేశం వృద్ధి మాంద్య పరిస్థితుల మధ్యలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన ఒత్తిడి ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. భారత జీడీపీ వృద్ధి రేటు.. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్టమైన 4.5%కి పడిపోయిన నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సంస్కరణలు తేవాలి.. రియల్ ఎస్టేట్, నిర్మాణ, ఇన్ఫ్రా రంగాలు.. వాటికి రుణాలిచ్చిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సంక్షోభంలో ఉన్నాయని రాజన్ చెప్పారు. బ్యాంకుల్లో మొండి బాకీలు కూడా తోడవడంతో రుణ వితరణ వృద్ధి ఉండటం లేదన్నారు. సామాన్యుల నుంచి కార్పొరేట్ల దాకా అందరి రుణభారం, యువతలో నిరుద్యోగిత పెరిగిపోతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భూ సమీకరణ, కార్మిక చట్టాలపరమైన సంస్కరణలు, స్థిరమైన పన్నులు.. నియంత్రణా వ్యవస్థల విధానాలు అమలు చేయాలని రాజన్ సూచించారు. -
‘మందగమనానికి రాజన్ మందు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని కార్యాలయంలో అధికారం కేంద్రీకృతం కావడం ద్వారా దేశంలో ఆర్థిక వృద్ధి మందగమనం కొనసాగుతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. మూలధనం, భూమి, కార్మిక మార్కెట్లు, పెట్టుబడులు, వృద్ధిని సరళీకరించేలా సంస్కరణలు అవసరమని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. పోటీతత్వాన్ని పెంపొందించడం, దేశీయ సమర్ధతను మెరుగుపరిచేందుకు భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో చేరాలని కోరారు. ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో తప్పు ఎక్కడ జరుగుతుందనే దాన్ని ముందుగా మనం అర్ధం చేసుకోవాలని, ప్రస్తుత ప్రభుత్వంలో అధికార కేంద్రీకరణ గురించి ప్రస్తావించాలని వ్యాఖ్యానించారు. నిర్ణాయక వ్యవస్థలోనే కాదు సలహాలు ప్రణాళికలు సైతం ప్రధాని చుట్టూ, ప్రధాని కార్యాలయంలో చేరిన కొద్ది మంది నుంచే వస్తున్నాయని రాజన్ స్పష్టం చేశారు. ఇది పార్టీ రాజకీయ, సామాజిక అజెండాకు ఉపకరిస్తున్నా ఆర్థిక సంస్కరణల విషయంలో ఫలితాలను ఇవ్వడం లేదని పెదవివిరిచారు. రాష్ట్రస్ధాయిలో కాకుండా దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై వీరికి పెద్దగా అవగాహన ఉండటం లేదని అన్నారు. గత ప్రభుత్వాలు సంకీర్ణ సర్కార్లు అయినా తదుపరి ఆర్థిక సరళీకరణను స్ధిరంగా ముందుకు తీసుకువెళ్లాయని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం కనిష్ట ప్రభుత్వం..గరిష్ట పాలన నినాదంతో అధికారంలోకి వచ్చినా దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్ ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన తొలి చర్య దాన్ని అర్థం చేసుకోవడమేనని చెప్పుకొచ్చారు. ప్రతి విమర్శకులకూ రాజకీయ దురుద్దేశం అంటగట్టడం సరికాదని, మందగమనం తాత్కాలికమనే భావనను విడనాడాలని రఘురాం రాజన్ హితవుపలికారు. -
‘పన్ను’ ఊరట!
న్యూఢిల్లీ: మందగమన బాటలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా పలు చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇన్వెస్టర్ల సెంటిమెంటును మెరుగుపర్చేందుకు, విదేశీ పెట్టుబడులు మరింతగా ఆకర్షించేందుకు.. మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టనుంది. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) ట్యాక్స్, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీటీ), డివిడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ)లను తగ్గించే విధంగా.. వాటి స్వరూపాన్ని మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నీతి అయోగ్, ఆర్థిక శాఖలో భాగమైన రెవెన్యూ విభాగంతో కలిసి ప్రధాని కార్యాలయం (పీఎంవో) వీటిని సమీక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘నవంబర్ ఆఖరు నాటికి దీనిపై కసరత్తు పూర్తి కావచ్చు. బడ్జెట్లో లేదా అంతకన్నా ముందే ఇందుకు సంబంధించిన ప్రకటనలు ఉండవచ్చు‘ అని వివరించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 3న కేంద్రం ప్రవేశపెట్టవచ్చని అంచనా. సావరీన్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, బీమా తదితర రంగాల సంస్థలు.. దేశీ ఈక్విటీల్లో మరింత పెట్టుబడులు పెంచేందుకు ప్రోత్సహించే విధంగా ..ఇతర దేశాలకు దీటుగా దేశీయంగా పన్ను రేట్లను సవరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అధికారులు తెలిపారు. ‘ఈక్విటీ, డెట్, కమోడిటీల మార్కెట్ల పన్ను రేట్లను సమీక్షిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లో పన్నుల విధానాన్ని క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా పెన్షన్ ఫండ్స్ నుంచి దేశీ ఈక్విటీల్లోకి పెట్టుబడులు ఆకర్షించాలంటే పెద్ద ప్రతిబంధకంగా ఉంటోందన్న అభిప్రాయాల నేపథ్యంలో డీడీటీని గణనీయంగా తగ్గించడంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష పన్నులను సమీక్షించేందుకు ఏర్పాటైన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.. దీన్ని ఏకంగా తొలగిం చాలని సిఫార్సు చేసింది‘ అని వివరించారు. ఎల్టీసీజీ..డీడీటీ..ఏంటంటే.. షేర్ల విక్రయంతో ఇన్వెస్టరుకు లాభాలు వచ్చిన పక్షంలో క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది పైబడి అట్టే పెట్టుకున్న షేర్లను విక్రయిస్తే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 10 శాతం ఎల్టీసీజీ అమల్లోకి వచ్చింది. ఒకవేళ లాభాలు రూ. లక్ష దాటితేనే ఇది వర్తిస్తుంది. ఏడాది వ్యవధి లోపే షేర్లను విక్రయించిన పక్షంలో స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎస్టీసీజీ) ట్యాక్స్ 15% మేర వర్తిస్తుంది. ఇక, కంపెనీలు తమ వాటాదారులకు పంచే డివిడెండుపై ప్రస్తుతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(సెస్సులు, సర్‌చార్జీలన్నీ కలిపి) 20.35% స్థాయిలో ఉంటోంది. ఎల్టీసీజీ, డీడీటీలపై దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు చాన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నారు. రూ. 1.5 లక్ష కోట్ల ఆదాయానికి గండి.. పన్ను రేట్లలో కోతలతో ప్రభుత్వ ఖజానాకు రూ. 1.5 లక్షల కోట్ల మేర ఆదాయానికి గండిపడే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను మరింతగా విక్రయించడం, పన్ను రాబడులను మెరుగుపర్చుకోవడం, వ్యయాలను నియంత్రించుకోవడం వంటి చర్యలతో దీన్ని భర్తీ చేసుకోవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వృద్ధికి ఊతమిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత కొద్ది నెలలుగా పలు సంస్కరణలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై మరింత దూకుడు, బడ్జెట్లో జరిపిన కేటాయింపులను వినియోగించుకునేలా ప్రభుత్వ విభాగాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ బ్యాంకులు.. చిన్న సంస్థలకు రుణాలిచ్చేలా చర్యలు వీటిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆగ్నేయాసియా మొత్తం మీద భారత్‌లోనే కార్పొరేట్ ట్యాక్స్ తక్కువగా ఉంది. ఈ సంస్కరణలు.. దేశీ స్టాక్ మార్కెట్లకు, ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు ఊతమిస్తున్నాయి. ఆదాయపు పన్ను రేటూ తగ్గింపు: డీబీఎస్ కార్పొరేట్ ట్యాక్స్ రేటును 25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేటును కూడా భారత్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని సింగపూర్‌కి చెందిన డీబీఎస్ బ్యాంకు ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం రూ. 2.5 లక్షలుగా ఉన్న మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచవచ్చని వివరించింది. రూ. 5 లక్షలకు పైబడిన ఆదాయాలపైనా ట్యాక్స్ రేటును తగ్గించవచ్చని తెలిపింది. దీని వల్ల చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గుతుందని, మధ్య స్థాయిలో ఉన్న వారికీ ఓ మోస్తరు ఊరట లభించగలదని.. పై స్థాయి శ్లాబ్‌లో ఉన్న వారికి మాత్రమే పన్ను భారం పెరగవచ్చని డీబీఎస్ బ్యాంకు పేర్కొంది. -
వైదొలిగిన ‘ప్రిన్సిపాల్ సెక్రటరీ’ మిశ్రా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రిన్సిపాల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు. అయితే రెండు వారాలు ఆ పదవిలో కొనసాగాల్సిందిగా మోదీ ఆయనను కోరినట్లు ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి సితాన్షు కర్ తెలిపారు. పదవీ విరమణ పొందనున్న మిశ్రాకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘నేను పీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన కొత్తలో మిశ్రా చాలా సహాకారం అందించారని, దేశాభివృద్ధికి ఎంతో సేవ చేసిన ఆయనకు విరమణానంతరం అంతా మంచే జరగాలి’ అని ఆకాంక్షించారు. ప్రధానిగా మోదీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన ప్రభుత్వంలో పనిచేయ డం గర్వంగా భావిస్తు న్నానని మిశ్రా తెలిపా రు. 1967 బ్యాచ్ ఐఏ ఎస్ అధికారి అయిన మిశ్రా వివిధ బాధ్యతల అనంతరం 2009లో ట్రాయ్ చైర్మన్‌గా వైదొలిగారు. 2014లో పీఎంవోలో బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీ అయ్యారు. కేబినెట్ సెక్రటరీగా పదోన్నతి పొందిన పీకే సిన్హాకు పీఎంవోలో ఓఎస్డీగా ప్రభుత్వం బాధ్యతలు కల్పించింది. -
ఇమ్రాన్ ఖాన్‌కు ‘కరెంట్’ షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంతత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ విద్యుత్ సరఫరా సంస్థ షాక్ ఇచ్చింది. ఇస్లామాబాద్‌లోని పీఎంవో కార్యాలయానికి సంబంధించి పేరుకుపోయిన విద్యుత్ బిల్లులు చెల్లించకుంటే వెంటనే కరెంట్ సరఫరా నిలిపేస్తామని హెచ్చరించింది. పీఎంవో సెక్రటేరియెట్‌కు ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ (ఇస్కో) ఈ మేరకు నోటీసులిచ్చింది. పీఎంవో కార్యాలయం రూ.41 లక్షల బిల్లు చెల్లించకుండా బకాయి పడిందని.. అంతేగాక గత నెలలో చెల్లించాల్సిన రూ.35 లక్షల బకాయిలు అలానే ఉన్నాయని పేర్కొంది. అక్కడ వరుసగా రెండు నెలల కరెంట్ బిల్లులు చెల్లించని పక్షంలో హెచ్చరికలు జారీ చేసి విద్యుత్ సరఫరా నిలిపేయొచ్చు. -
రాజీవ్ ఆదేశాలతోనే సిక్కుల ఊచకోత
న్యూఢిల్లీ: 1984లో సిక్కులను ఊచకోత కోయాలని రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నపుడు ప్రధాని కార్యాలయం(పీఎంవో) నుంచి ఆదేశాలు వచ్చాయని బీజేపీ గురువారం సంచలన ఆరోపణ చేసింది. ఈ విషయం నానావతి కమిషన్ దృష్టికి వచ్చిందని తెలిపింది. అయితే నానావతి కమిషన్ రిపోర్టు మాత్రం బీజేపీ ఆరోపణలకు భిన్నంగా ఉండటం గమనార్హం. ప్రధాని ఇందిరాగాంధీని 1984 అక్టోబర్ 31న ఆమె అంగరక్షకులైన ఇద్దరు సిక్కులు కాల్చిచంపడంతో ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. దాదాపు 3,000 మంది అమాయక సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. ‘నానావతి’ రిపోర్టులో ఏముంది? సిక్కుల ఊచకోతపై 2000లో ఎన్డీయే ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ జీటీ నానావతి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. 2005లో సమర్పించిన ఈ నివేదికలో నానావతి కమిషన్ స్పందిస్తూ.. ‘సిక్కులకు గుణపాఠం చెప్పాలని రాజీవ్ అన్నట్లు వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యం లేదు. ఢిల్లీలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు రాజీవ్ కృషి చేశారు. ఇందిర హత్య అనంతరం ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు’ అని తెలిపింది. దమ్ముంటే ప్రజాసమస్యలపై పోరాడండి: కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ప్రస్తుతం 2019 ఎన్నికలు జరుగుతున్నాయే తప్ప 1951, 1966, 1984 లోక్‌సభ ఎన్నికలు జరగడం లేదు. దమ్ముంటే నిజమైన ప్రజా సమస్యలపై పోరాడండి. మోదీ పెద్ద అబద్దాలకోరుగా మారిపోయారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషిగా తేలిన కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు గతేడాది డిసెంబర్లో యావజ్జీవ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
ఎన్నికల కోడ్‌ను ‘పీఎంవో’నే ఉల్లంఘిస్తే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘కేంద్ర పాలిత ప్రాంతాల చారిత్రక ప్రాధాన్యత, సంస్కతి, స్థానిక హీరోలు, ఆర్థిక, మతపరమైన ప్రాముఖ్య అంశాలు, అక్కడ పండే ప్రధాన పంటలు, ముఖ్య పరిశ్రమల తదితర వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించండి’ అంటూ ‘నీతి ఆయోగ్’కు చెందిన పింకీ కపూర్ అనే అధికారి ఏప్రిల్ 8వ తేదీన చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ అడ్వైజర్‌కు, ఢిల్లీ ప్రధాన కార్యదర్శికి, పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శితోపాటు ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులకు ఈ మెయిల్ చేశారు. ఈ ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార పర్యటన నేపథ్యంలో ఆయన ఈ మెయిల్‌ను పంపారు. అంటే ప్రధాని ఎన్నికల ప్రసంగంలో ప్రస్తావించేందుకు ఈ వివరాలు అడిగినట్లు సులభంగానే అర్థం అవుతోంది. అంతకుముందు ‘నీతి ఆయోగ్’ నుంచి బీజేపీ పాలిత మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు మార్చి 31వ తేదీన ఇలాంటి ఈ మెయిలే వెళ్లింది. అలాగే మహారాష్ట్రలోని వార్ధా, లాథూర్ జిల్లాల కలెక్టర్లకు కూడా ఇలాంటి ఈ మెయిల్స్ వెళ్లాయని వారి నుంచి వచ్చిన లేఖల ద్వారా స్పష్టం అవుతోంది. గోండియా సంక్షిప్త చరిత్ర, భౌగోళిక స్వరూపం, మతాల ప్రాతిపదికన జనాభా శాతం తదితర విరాలతో ‘ప్రధాన మంత్రి కార్యాలయానికి గోండియా జిల్లా సంక్షిప్త సమాచారం’ అనే శీర్షికతో అక్కడి జిల్లా కలెక్టర్ పంపించారు. లాథూర్‌కు సంబంధించిన చరిత్ర, చారిత్రిక కట్టడాలు, ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల వివరాలను తెలియజేస్తూ అక్కడి కలెక్టర్ కూడా లేఖను పంపించారు. వార్ధా జిల్లా కలెక్టర్ నుంచి అలాంటి సమాచారమే అందింది. ‘వార్ధా డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ ఫర్ పీఎంవో’ అనే శీర్షికతో పంపిన ఆ లేఖలో ఆ ప్రాంతాన్ని భారత స్వాతంత్య్ర సమర యోధులు మహాత్మా గాంధీ, వినోబాభావే లాంటి వారు సందర్శించి కొంతకాలం అక్కడ గడిపనట్లుగా వివరాలు ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ ఒకటవ తేదీన వార్ధా, మూడవ తేదీన గోండియాలో, ఏప్రిల్ 9వ తేదీన లాథూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. జిల్లా కలెక్టర్ల నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని ఆయన అక్కడక్కడ సందర్బోచితంగా ప్రస్తావించారు. మార్చి 10వ తేదీ నుంచే ఎన్నికల కోడ్ మార్చి పదవ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. అంటే ఆ నాటి నుంచి ప్రధాన మంత్రి, మంత్రులు సహా ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారెవరూ కూడా అధికారిక కార్యక్రమాలతో పార్టీ ప్రచార కార్యక్రమాలను ముడిపెట్ట రాదు. ఎన్నికల ప్రచారం కోసం అధికార యంత్రాంగం సేవలను ఏమాత్రం ఉపయోగించుకోరాదు. అలాంటప్పుడు ప్రధాని కార్యాలయానికి ‘థింక్ ట్యాంక్’గా వ్యవహరిస్తున్న ‘నీతి ఆయోగ్’ సమాచారం కోసం జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయడం ఏమిటీ ? ఎన్నికల సందర్భంగా ఎలక్టోరల్ అధికారులుగా కీలక బాధ్యతలు నిర్వహించే కలెక్టర్లు కావాల్సిన సమాచారాన్ని సేకరించి ఇవ్వడం ఏమిటీ? వారి చర్య ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం కాదా ? ఇదే విషయమై మహారాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి దిలీప్ షిండేను మీడియా ప్రశ్నించగా, ఈ విషయాలేవి తన దష్టికి రాలేదని తప్పించుకున్నారు. ఎన్నికల కోడ్ స్ఫూర్తి ఏమిటంటే! ‘పదవుల్లో ఉన్న వారు ఎవరైనా ఎన్నికల ప్రక్రియ పవిత్రతను పరిరక్షించాలి. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను అందులో పోటీచేసేవాళ్లు శంకించేలా, లేదా సందేహించేలా ఎవరు ప్రవర్తించకూడదు, ప్రవర్తించారన్న సందేహం కలిగేలా కూడా వ్యవహరించరాదు’ అంటూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌కు రాసిన లేఖలో ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి నరేంద్ర బుటోలియా స్పష్టం చేశారు. అధికార హోదాలో ఉండి రాహుల్ గాంధీ ప్రకటించిన ‘న్యాయ్ యోజన’ పథకాన్ని విమర్శించినందుకు ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఫిర్యాదులు రావడంతో నరేంద్ర బుటోలియా ఇలా స్పందించారు. అనేక ఆరోపణలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఇప్పటి వరకు పాలకపక్ష బీజేపీపై అనేక ఆరోపణలు వచ్చాయి. కోడ్ అమల్లోకి వచ్చాక ‘నమో టీవీ’ ప్రసారాలను ప్రారంభించడం అందులో ఒకటి. ఎలాంటి బ్రాడ్ కాస్టింగ్ లైసెన్స్ లేకుండా ఆ టీవీ ప్రసారాలు కొనసాగడం అశ్చర్యం. రాహుల్ గాంధీని విమర్శించే విషయంలో మత పరమైన అంశాలను ప్రస్తావించి కోడ్ ఉల్లంఘించారంటూ ప్రధాని మోదీపైనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ పలు రాష్ట్రాల గవర్నర్లపై ఫిర్యాదులు వచ్చిన విషయం తెల్సిందే. (చదవండి : ‘నమో టీవీ’ ఎలా వచ్చింది ?) -
పీఎంవోను దిగజార్చారు
ఇంఫాల్/ఖుముల్వాంగ్: ప్రధాని మోదీ ప్రధానమంత్రి కార్యాలయాన్ని (పీఎంవో) పబ్లిసిటీ మినిస్టర్ ఆఫీసుగా దిగజార్చారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఆరోపించారు. ప్రధాని పీఎంవోను తన మార్కెటింగ్ కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ర్యాలీలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రధాని ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఏం చదివారో ఇప్పటివరకు ఎవరికీ తెలియదని రాహుల్ వ్యాఖ్యానించారు. అసలు ఆయన ఏదైనా యూనివర్సిటీకైనా వెళ్లారో లేదో అని ఎద్దేవా చేశారు. ప్రధాని డిగ్రీకి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా ఇప్పటి వరకు స్పందన రాలేదని వాపోయారు. మణిపూర్ వర్సిటీలో అప్పటి వీసీ ఏపీ పాండే తీరును వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడాన్ని రాహుల్ ప్రస్తావించారు. ప్రజలంతా మూర్ఖులని మోదీ భావన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ మిర్జాపూర్: ప్రజలంతా మూర్ఖులనే భావనలో ప్రధాని మోదీ ఉన్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక యూపీలో మూడు రోజులపాటు గంగా యాత్రలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఐదేళ్లుగా ప్రధాని దేశంలోని ప్రతి వ్యవస్థపై దాడి చేస్తూనే ఉన్నారు. అందులో మీరు కూడా ఒక భాగమే. వేధింపులకు గురిచేస్తే నేను భయపడను. పోరాడుతా’ అని చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం అతిపెద్ద ఉపాధికల్పన పథకం ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏను (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) ప్రవేశపెట్టింది. కానీ బీజేపీ ప్రభుత్వం శ్రామికుల స్థానంలో మెషీన్లతో పనులు పూర్తి చేస్తోంది’అని ఆమె ఆరోపించారు. వారణాసి రామ్‌నగర్‌లోని మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పూర్వీకుల ఇంట్లో శాస్త్రి విగ్రహం వద్ద నివాళులర్పించారు. వారణాసిలో చిన్నారితో సెల్ఫీకి పోజిస్తున్న ప్రియాంక -
మోదీ ‘బిల్లులు’ ఎవరు చెల్లిస్తున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన జనవరి ఒకటవ తేదీ నుంచి 42 రోజుల్లో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 27 పర్యటనలు జరిపారు. ఆయన ఈ పర్యటనల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా బీజేపీ ఏర్పాటు చేసిన పలు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఉదాహరణకు జనవరి 3వ తేదీన పంజాబ్‌లో పర్యటించిన ఆయన జలంధర్‌లో ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ను అధికార హోదాలో ప్రారంభించారు. ఆ తర్వాత గురుదాస్‌పూర్‌లో బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అదే విధంగా జనవరి 5వ తేదీన నరేంద్ర మోదీ ఒడిశాలోని బారిపడకు వెళ్లి అధికార కార్యక్రమాల్లో పాల్గొని అదే రోజు పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అధికార కార్యక్రమాలతోపాటు పార్టీ కార్యక్రమాలను కలపడం వల్ల బిజీగా ఉండే ప్రధానమంత్రులకు బోలడంత ప్రయాణ సమయం కలసి వస్తుంది. అయితే ప్రయాణ ఖర్చుల సంగతి ఏమిటీ? అధికారిక కార్యక్రమాల కోసం వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల బీజేపీకి ఖర్చు కలసి వస్తుందా? బీజేపీయే ఖర్చును భరించడం వల్ల పీఎంవో కార్యాలయానికి ఖర్చు కలసి వస్తుందా? ఇరు వర్గాలు ఖర్చులను పంచుకుంటాయా ? ఖర్చుల విషయంలో అధికారిక కార్యక్రమాలను, ప్రైవేటు లేదా పార్టీ కార్యక్రమాలను పీఎంవో ఎలా వేరు చేస్తోంది ? పీఎంవో కార్యలయానికున్న నిబంధనల ప్రకారం ప్రధాని అధికారిక కార్యక్రమాల కోసం వెళ్లినప్పుడే ఆయన ప్రయాణ ఖర్చులను భరించాలి. పార్టీ కార్యక్రమాలకు హాజరయినప్పుడు పార్టీయే భరించాల్సి ఉంటుంది. రెండు పర్యాయాలు ప్రధాన మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఈ నిబంధనలను కచ్చితంగా పాటించారు. అయితే ఆయన అధికారిక కార్యక్రమాలను, ప్రైవేటు లేదా పార్టీ కార్యక్రమాలను ఎప్పుడు కలపలేదు. నరేంద్ర మోదీ ఇప్పుడు రెండింటిని కలపారు కనుక ప్రయాణ ఖర్చులను ఎవరు, ఏ మేరకు భరిస్తున్నారన్న ప్రశ్న తలెత్తింది. ఇదే విషయమై మీడియా ఇటీవల పీఎంవో కార్యాలయానికి లేఖలు రాసినా అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫిబ్రవరి 9వ తేదీన ఆయన అస్సాం వెళ్లి, అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. ఆనవాయితీ ప్రకారం దాన్ని రెండు పర్యటనలుగా పేర్కొనాల్సిన పీఎంవో ఒకే పర్యటనగా పేర్కొంది. ఈ లెక్కన మోదీ జనవరి ఒకటవ తేదీ నుంచి 27 పర్యటనలు చేయగా, పీఎంవో 12 పర్యటనలు చేసినట్లు పేర్కొన్నది. జనవరి 4వ తేదీన నరేంద్ర మోదీ మణిపూర్, అస్సాంలో చేసిన పర్యటన, జనవరి 22వ తేదీన వారణాసిలో చేసిన పర్యటన వివరాలు అసలు లేవు. ఆయన చేసిన 27 పర్యటనల్లో 13 పర్యటనలకు సంబంధించి ఎలాంటి కేటగిరీ లేదు. అధికార పర్యటనకు వెళ్లారా ? ప్రైవేటు పర్యటనకు వెళ్లారా లేదా విదేశీ పర్యటనకు వెళ్లారా? అన్న కేటగిరీలు తప్పనిసరి పేర్కొనాలి. ఖర్చులు ఎవరు భరించాలో తెలియడం కోసమే ఈ విభజన. నరేంద్ర మోదీ 2014 మే నెల నుంచి 2017 ఫిబ్రవరి మధ్యన జరిపిన 128 అనధికార పర్యటనలకు పీఎంవో కార్యాలయం భారత వైమానిక దళానికి 89 లక్షల రూపాయలను చెల్లించిందంటూ ‘హిందుస్థాన్ టైమ్స్’ ఓ వార్తను ప్రచురించడంతో ఆ డబ్బును తాము పీఎంవో కార్యాలయానికి ‘రీయింబర్స్’ చేశామంటూ బీజేపీ వివరణ ఇచ్చింది. అయితే అందుకు ఎలాంటి సాక్ష్యాలు చూపలేదు. అంతేకాకుండా పీఎంవో మార్గదర్శకాల ప్రకారం ప్రధాన మంత్రి అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించే మాట్లాడాలి. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయకూడదు. పార్టీ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఎలాంటి విమర్శలైన చేయవచ్చు. మొదట్లో మోదీ కూడా ఈ నిబంధనను కచ్చితంగా పాటించారు. ఆ తర్వాత ఏ కార్యక్రమంపై ఎక్కడికెళ్లినా ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. మన్మోహన్ సింగ్ మొదటిసారి ప్రధాన మంత్రిగా ఐదేళ్లలో 368 రోజులు విదేశాల్లో పర్యటించగా, రెండో పర్యాయం 284 రోజులు విదేశాల్లో పర్యటించారు. అదే నరేంద్ర మోదీ ఇప్పటికే 565 రోజులు విదేశాల్లో పర్యటించారు. -
జ్ఞాపికల వేలంతో గంగా ప్రక్షాళన
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ వివిధ సందర్భాల్లో స్వీకరించిన 1800కు పైగా జ్ఞాపికలను జనవరిలో పదిహేను రోజుల పాటు సాగిన వేలంలో విక్రయించినట్టు ప్రధాని కార్యాలయం(పీఎంఓ) ఆదివారం వెల్లడించింది. వేలం ప్రక్రియ ద్వారా సమకూరిన మొత్తాన్ని గంగా నదీ ప్రక్షాళనకు వెచ్చిస్తామని పేర్కొంది. ప్రధానికి లభించిన జ్ఞాపికల వేలం ద్వారా నిధులు ఎంతమేర వసూలయ్యాయనే వివరాలను పీఎంఓ పేర్కొనలేదు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ) ఈ వేలం నిర్వహించింది. కాగా, ఈ వేలంలో ప్రత్యేకంగా చెక్కతో తయారు చేసిన బైక్ రూ 5 లక్షలు పలికింది. రూ 5000 బేస్ ధరగా నిర్ధారించిన శివుని విగ్రహం రూ పది లక్షలు పలికిందని పీఎంఓ తెలిపింది. ఇక రూ 4000 బేస్ ధరగా నిర్ణయించిన అశోకుడి స్ధూపం రూ 13 లక్షలకు వేలంలో విక్రయించామని వెల్లడించింది. రూ 4000 ప్రామాణిక ధర కలిగిన గౌతమ బుద్ధ విగ్రహం వేలంలో రూ ఏడు లక్షలు పలికిందని పేర్కొంది. ప్రధాని మోదీ గతంలో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ తనకు లభించిన మెమెంటోలను వేలం ద్వారా విక్రయించి ఆ నిధులను బాలికల విద్య కోసం కేటాయించేవారని, అదే సంప్రదాయం ఇప్పుడూ కొనసాగిస్తున్నారని పీఎంఓ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. -
పారదర్శకత సర్కారు బాధ్యత
నాలుగేళ్లక్రితం రఫేల్ ఒప్పందంపై సంతకాలు అయింది మొదలు దాని చుట్టూ అల్లుకుంటున్న అనేకానేక ఆరోపణలకూ, సందేహాలకూ ఇప్పట్లో ముగింపు ఉండకపోవచ్చునని తాజాగా వెల్లడైన మరో అంశం నిరూపిస్తోంది. మన దేశం, ఫ్రాన్స్ మధ్య ఈ ఒప్పందంపై చర్చలు సాగుతున్న సమ యంలో ప్రధాని కార్యాలయం అధికారుల తీరుపై రక్షణ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఒక ఆంగ్ల దినపత్రిక వెల్లడించడంతో ఈ వ్యవహారంలో మళ్లీ కొత్త సందేహాలు పుట్టుకొ చ్చాయి. రఫేల్ ఒప్పందంపై ఏడుగురు సభ్యులున్న రక్షణ శాఖ అధికారుల బృందం ఫ్రాన్స్‌తో చర్చిస్తుండగా, దానికి సమాంతరంగా అదే అంశంపై ప్రధాని కార్యాలయం (పీఎంఓ) అధికారులు కూడా ఫ్రాన్స్‌తో మంతనాలు జరపడాన్ని అప్పట్లో ఆ శాఖను చూస్తున్న మంత్రి మనోహర్ పారికర్ దృష్టికి రక్షణ అధికారులు దృష్టికి తీసుకొచ్చారని ఆ కథనం చెబుతోంది. ఇది సరికాదని పీఎంఓకు చెప్పమన్నా పారికర్ ఈ విషయంలో చొరవ తీసుకోలేదు. ప్రస్తుత రక్షణ మంత్రి నిర్మలా సీతారా మన్ ఏం చెప్పినా, ఎలా సమర్థించుకున్నా ఆ విషయంలో రేగిన అనుమానాలు రూపుమాసిపోవు. ఒక వ్యవహారంలో ఆరోపణలొచ్చినప్పుడు, సందేహాలు వ్యక్తమైనప్పుడు దానికి సంబంధిం చిన సమస్త అంశాలను తేటతెల్లం చేయడం పాలకుల కనీస కర్తవ్యం. ప్రభుత్వం ఆ పని చేయనంత మాత్రాన వాస్తవాలు మరుగునపడి ఉండిపోతాయనుకోవడం సరికాదు. మీడియా చురుగ్గా పని చేసేచోట ఎప్పుడో ఒకప్పుడు అవి వెల్లడవుతాయి. ప్రభుత్వ తీరును ప్రశ్నార్థకం చేస్తాయి. అప్పుడు ఆ అనుమానాలు మరింత చిక్కబడతాయి. ఒప్పందంలో ఇంతవరకూ డబ్బులు చేతులు మారింది లేదు.. రఫేల్ విమానాలు మన దేశానికి వచ్చింది లేదని బీజేపీ నేతల వాదన. కాబట్టి స్కాం కాదం టున్నారు. అలాగే ఈ విమానాల ఉత్పత్తికి భారత్‌లో ఏ సంస్థను భాగస్వామిగా చేర్చుకోవాలో నిర్ణ యించుకునే స్వేచ్ఛ ఒప్పందం ప్రకారం రఫేల్ విమానాలు ఉత్పత్తి చేసే డస్సాల్ట్ సంస్థకే ఉంద న్నదీ నిజమే కావొచ్చు. కానీ ఎప్పటికప్పుడు సంజాయిషీ ఇవ్వడం తప్ప సమగ్రంగా అన్నిటినీ ప్రజల ముందు ఎందుకు ఉంచరు? రఫేల్ ఒప్పందంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచా రణ సమయంలో కేంద్రం నివేదించిన వివరాల్లో పీఎంఓ పాత్ర గురించిన ప్రస్తావన ఎందుకు లేదు? ఒక్కసారి వెనక్కి వెళ్లి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి దారితీసిన పూర్వాప రాలు తెలుసుకుంటే ఇదిలా ఎడతెగకుండా సాగడం వల్ల జరిగే నష్టమేమిటో అర్ధమవుతుంది. 2012లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇదే డస్సాల్ట్‌తో యుద్ధ విమానాల గురించి చర్చలు సాగాయి. దాదాపు ఒప్పందం కుదిరే దశలో అదంతా నిలిచిపోయింది. చర్చల సందర్భంగా ఆ సంస్థ 126 యుద్ధ విమానాలు మనకు సమకూర్చేందుకు...అందులో 18 విమానాలను 2015 కల్లా అందించేందుకు అవగాహన కుదిరింది. మిగిలిన 108 విమానాలనూ అవసరమైన సాంకేతిక పరి జ్ఞానాన్ని అందించడం ద్వారా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో ఉత్పత్తి చేసేం దుకు ఏడేళ్లపాటు సహకరిస్తామని చెప్పింది. అయితే డస్సాల్ట్–హెచ్ఏఎల్ మధ్య జరిగిన తదుపరి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈలోగా రఫేల్ యుద్ధ విమానాల సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతూ మీడియాలో కథనాలు రావడంతో ఆ ఒప్పందం సాకారం కాలేదు. రక్షణ కొనుగోళ్లకు ఒప్పందాలు ఖరారు కావడానికి ముందో, తర్వాతో ఆరోపణలు ముసురుకోవడం మన దేశంలో రివాజుగా మారింది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రక్షణ శాఖను తానే చూస్తూ, తనకు అత్యంత సన్నిహితుడైన అరుణ్‌సింగ్‌ను ఆ శాఖలో సహాయమంత్రిగా నియమించారు. 1987లో బోఫోర్స్ శతఘ్నుల ఒప్పందంపై ముసురుకున్న వివాదం ఎన్ని మలుపులు తీసుకుందో, అత్యంత భారీ మెజారిటీ సాధించి అధికారంలోకొచ్చిన రాజీవ్ దాని పర్యవసానంగా రాజకీయంగా ఎంత దెబ్బతిన్నారో అందరికీ తెలుసు. దానికి విరుగుడుగా నిజాయితీపరులని పేరున్న నేతలను ఎంచు కుని వారికి రక్షణ శాఖ కట్టబెట్టడం ఆనవాయితీగా మారింది. వాజపేయి హయాంలో జార్జి ఫెర్నాండెజ్, యూపీఏ ఏలుబడిలో ఏకే ఆంటోనీ, మోదీ ప్రభుత్వం మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ అందుకే అప్పగించారు. కానీ వీరు కూడా ఆరోపణల భారాన్ని మోయక తప్పలేదు. కొనుగోళ్లకు సంబంధించి, వాటి పారదర్శకతకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందు తున్నాయి. దళా రుల ప్రమేయం లేకుండా చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబు తున్నారు. కానీ చివరాఖరికి ఆరోపణలు మాత్రం తప్పడం లేదు. వీటి తక్షణ ఫలితమేమంటే... మన రక్షణ దళాలకు అవసరమైన యుద్ధ విమానాలు, శతఘ్నులు, ఇతర పరికరాలు సకాలంలో సమకూరడం లేదు. రఫేల్ ఒప్పందంలో లొసుగులున్నాయంటున్న విపక్షాలు దాన్ని బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయి. విపక్షాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మినహా మరెవరూ ఈ విషయాన్ని పెద్దగా మాట్లాడటం లేదు. ఆయన శక్తి అంత సరిపోతున్నట్టు లేదు. ఇతర నేతలకు రఫేల్ వ్యవహారంపై ఆసక్తి లేదో... వారికి అసలు అవగాహనే కొరవడిందో చెప్పలేం. ఈమధ్యే కోల్‌కతాలో జరిగిన విపక్ష ర్యాలీలో ఈ స్కాంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు విపక్షాల బలహీనతను పట్టిచూపుతుంది. బాబు గారికి రఫేల్ ఫైటర్ జెట్ విమానాలకూ, జెట్ ఎయిర్వేస్ విమానాలకూ తేడా తెలియదు. విపక్షాలు ఇలాంటి దైన్యస్థితిలో ఉండటం ప్రభుత్వానికి వరమే కావచ్చుగానీ... దాపరికం అంతిమంగా తమకే చేటు తెస్తుందని అది గుర్తించడం అవసరం. రక్షణ శాఖ బృందం చర్చిస్తుండగా ఈ ఒప్పందంలో పీఎంఓ ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందో, రక్షణ శాఖ కార్యదర్శి అభిప్రాయాన్ని ఎందుకు బేఖాతరు చేశారో వివరించడం దాని బాధ్యత. మీడియాలో వచ్చినప్పుడల్లా సంజాయిషీ ఇస్తూ, ఎదురుదాడులు చేస్తూ పోయే వ్యూహాన్ని విడిచి అన్నిటినీ పారదర్శకంగా ప్రజల ముందుంచాలి. -
పీఎంవో సమీక్షను జోక్యంలా భావించలేం
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో రక్షణ శాఖ నిర్ణయాలకు భిన్నంగా ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుందని, ఫ్రాన్స్ ప్రభుత్వంతో సమాంతరంగా చర్చలు జరిపిందన్నఓ జాతీయ పత్రిక కథనాన్ని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. పీఎంవో సమీక్షను జోక్యంగా భావించలేమని అన్నారు. ఇదే నివేదికలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఇచ్చిన వివరణను మీడియా ప్రస్తావించలేదన్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వంతో రఫేల్ ఒప్పందంపై చర్చలను ప్రస్తావిస్తూ అంతా సజావుగా సాగుతుందని పారికర్ స్వదస్తూరితో రాసిన నోట్‌ను మీడియా ఉద్దేశపూర్వకంగా విస్మరించిందన్నారు. రఫేల్‌పై పార్లమెంట్లో, న్యాయస్ధానాల్లోనూ ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని, దీనిపై ఇంకా మాట్లాడటం సమయం వృధాయేనని పేర్కొన్నారు. రఫేల్‌పై ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ సమాధానం ఇచ్చిందన్నారు. కాగా రఫేల్ ఒప్పందంలో పీఎంవో జోక్యంపై రక్షణశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసిందంటూ జాతీయ మీడియా ప్రచురించిన కథనంతో రఫేల్ వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపింది. రఫేల్ ఒప్పందం విషయంలో రక్షణశాఖ నిర్ణయాలకు భిన్నంగా పీఎం కార్యాలయం వ్యవహరిస్తూ ఫ్రాన్స్‌తో సమాంతరంగా చర్చలు జరిపిందన్న కథనంతో మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విరుచుకుపడ్డారు. రఫేల్ డీల్‌లో తన సన్నిహితుడు అనిల్ అంబానీకి భాగస్వామ్యం కట్టబెట్టేందుకు చౌకీదార్ మోదీ ప్రయత్నించారనేందుకు రక్షణ శాఖ నోట్ నిదర్శనమని నిప్పులు చెరిగారు. -
పీఎస్‌యూల విక్రయంపై పీఎంఓ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్ధల (పీఎస్‌యూ) వ్యూహాత్మక విక్రయ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) బుధవారం కీలక సమావేశం నిర్వహించింది. నీతి ఆయోగ్ సూచించిన పీఎస్‌యూల విక్రయంలో సత్వరమే ముందుకెళ్లే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించారు. ఎయిర్ ఇండియా, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, బీఈఎంఎల్, స్కూటర్క్ ఇండియా వంటి 35 పీఎస్‌యూలను విక్రయించాల్సిన జాబితాలో నీతి ఆయోగ్ పొందుపరిచింది. నిర్ధిష్ట పీఎస్‌యూ విక్రయాల్లో కొన్ని సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న క్రమంలో వీటిని ఎదుర్కొంటూ అవరోధాలను అధిగమించి, మొత్త విక్రయ ప్రక్రియను వేగిరపరిచేందుకు పీఎంఓ ప్రయత్నిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మలిదశలో బాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు హిందుస్ధాన్ ఫ్లోరోకార్బన్, హిందుస్ధాన్ న్యూస్‌ప్రింట్, హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్, సెంట్రల్ ఎలక్ర్టానిక్స్ వంటి పలు పీఎస్‌యూల విక్రయ ప్రకియను చేపట్టనున్నారు. -
సార్ మా ఇంటి దగ్గర ఎలియన్ ఉంది!
పూణె : ఎలియన్స్ భూమికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వాటి గ్రహానికి పంపుతున్నాయి. దానిలో భాగంగా అవి మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. అదేంటో కనుక్కోండి సార్ అంటూ ప్రధాని కార్యాలయానికి ఈ మెయిల్ చేసాడో వ్యక్తి. ఈ విషయం గురించి విచారణ చేసిన పోలీసులు సదరు వ్యక్తి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇలా చేశాడని తేల్చారు. ఆసక్తి రేపిన ఈ సంఘటన వివరాలు.. కొథ్రూడ్ ప్రాంతానికి చెందిన ఓ 47 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లుగా బ్రెయిన్ హ్యామరేజ్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతను మానసిక పరిస్థితి క్షీణించింది. కొన్ని రోజుల క్రితం తన ఇంటి బయట మూడు లైట్లు వెలుగుతుండటం చూశాడు. దాంతో అవి ఎలియన్స్‌కు సంబంధించిన వస్తువులగా భావించాడు. ఈ విషయం గురించి విచారణ చేయాల్సిందిగా ప్రధాని ఆఫీస్‌కు ఈ- మెయిల్ చేశాడు. ‘ఎలియన్స్‌కు సంబంధించిన వస్తువు ఒకటి నా ఇంటి సమీపంలో తిరగుతుంది. అది భూమికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వాటి గ్రహానికి చేరవేస్తుంది. దీని వల్ల మనకు అపాయం కల్గుతుంది. కాబట్టి వెంటనే ఈ విషయం గురించి విచారణ చేపట్టండి’ అంటూ ప్రధాని ఆఫీస్‌కు ఈ మెయిల్ చేశాడు. పీఎంఓ అధికారులు దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేశారు. ప్రభుత్వ ఆదేశం మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సదరు వ్యక్తి మానసిర స్థితి సరిగా లేకపోవడంతో ఇలా చేశాడని తేల్చారు. అతను ఇలా మెయిల్ చేసిన విషయం ఇంట్లో కుటుంబ సభ్యులేవరికి తెలియదన్నారు. -
బ్లాక్‌మనీ వివరాల వెల్లడికి పీఎంవో ‘నో’
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు విదేశాల నుంచి తిరిగొచ్చిన నల్లధన వివరాలు వెల్లడించడానికి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నిరాకరించింది. ఈ వ్యవహారంపై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. వివరాలు బహిర్గతమైతే దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున వెల్లడించలేమని స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) సెక్షన్ 8 (1) (హెచ్) ప్రకారం దర్యాప్తునకు ఆటంకం కలిగే సమాచార వెల్లడికి మినహాయింపు ఉందంటూ.. ఈ విషయమై తమ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు సాగిస్తున్నట్లు వివరించింది. అక్టోబర్ 16న సీఐసీ జారీ చేసిన ఆదేశాలకు పీఎంవో ఈ మేరకు సమాధానం ఇచ్చింది. అయితే, అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ (జీఎఫ్ఐ) సంస్థ అధ్యయనం ప్రకారం.. 2005–14 మధ్య రూ.5.44 లక్షల కోట్ల నల్లధనం అక్రమంగా దేశంలోకి రాగా, రూ.1.16 లక్షల కోట్లు విదేశాలకు తరలిపోయింది. -
నేడు మన్ కీ బాత్ 50వ ఎపిసోడ్
న్యూఢిల్లీ: ప్రతి మాసాంతపు ఆదివారం నాడు ప్రధాని మోదీ ప్రసంగించే ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం ఆకాశవాణి రేడియో చానళ్లు, దూరదర్శన్‌లో ప్రసారమవుతుండటం తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఆదివారం (నవంబర్ 25) మన్ కీ బాత్ 50వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అక్టోబర్ 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆదివారంతో 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకోబోతోందని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
‘అవినీతి’ వివరాలకు పీఎంఓ నో
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల సమాచారాన్ని వెల్లడించడానికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నిరాకరించింది. ఆ వివరాలు అంతర్గతమని, వాటిని బహిర్గతపర్చడం పెద్ద కసరత్తు అని బదులిచ్చింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌధరిపై సీబీఐ ఉన్నతాధికారి ఒకరు అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో పీఎంఓ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులపై అప్పుడప్పుడు అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఐఎఫ్ఎస్ అధికారి సంజీవ్ చతుర్వేది ఆర్టీఐ కింద దాఖలుచేసిన అర్జీకి సమాధానంగా చెప్పింది. -
మంత్రుల అవినీతిని బయటపెట్టండి
న్యూఢిల్లీ: 2014–17 మధ్యకాలంలో కేంద్ర మంత్రులపై వచ్చిన అవినీతి ఫిర్యాదులను, వారిపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని ముఖ్య సమాచార కమిషనర్ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఆదేశించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సంజీవ్ చతుర్వేది పిటిషన్ మేరకు సమాచార కమిషనర్ రాధాకృష్ణ మాధుర్ పీఎంవోకు పైవిధంగా సూచించారు. మోదీ ప్రధాని అయిన తరువాత విదేశాల నుంచి రప్పించిన నల్లడబ్బుపై పూర్తి సమాచారం ఇవ్వాలని, రప్పించిన నల్లధనం దేశప్రజల బ్యాంకు ఖాతాల్లో ఎంత డిపాజిట్ చేశారో కూడా వెల్లడించాలని ఆయన పీఎంవోను ఆదేశించారు. సంజీవ్ చతుర్వేది గతంలోనే సమాచార హక్కు చట్టం కింద ప్రధాన మంత్రి కార్యాలయానికి పై విషయాలపై దరఖాస్తు చేసుకున్నారు. అయితే నల్లధనం ‘సమాచారం’ కిందకు రాదని ఆయన దరఖాస్తును ప్రధాని కార్యాలయ వర్గాలు తిరస్కరించాయి. అయితే సమాచార కమిషనర్ ఈ వాదనను కొట్టిపారేశారు. దరఖాస్తుదారుడు తప్పుగా దరఖాస్తు చేశారనడంలో వాస్తవం లేదని, పీఎంవో వాదన సరికాదని ఆయన తేల్చిచెప్పారు. -
మోదీ ఆస్తి వివరాలు: సొంత కారు కూడా లేదు
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖల ఆస్తుల వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి సామాన్య ప్రజల్లో ఉండటం సహజమే. అదే తనను చాయ్‌వాలాగా చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ గురించి అయితే ఆసక్తి మరి ఎక్కువగా ఉంటుంది. అయితే తాజాగా పీఎంవో మోదీ ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా ప్రకటించింది. మార్చి 31,2018 వరకు ఉన్న లెక్కల ప్రకారం ఈ వివరాలను వెల్లడించింది. మోదీ ఆస్తుల విలువ రెండున్నర కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉన్నట్టు పీఎంవో పేర్కొంది. వివిధ బ్యాంకుల్లో కోటి రూపాయల నగదు ఉండగా.. మోదీ వద్ద 50వేల రూపాయల నగదు ఉన్నట్టు పేర్కొంది. మోదీకి సొంతంగా ఒక కారు గానీ, బైకు గానీ లేవని తెలిపింది. అలాగే ఆయన పేరు మీద ఎటువంటి రుణాలు లేవని స్పష్టం చేసింది. పీఎంవో వెల్లడించిన వివరాలు: మోదీ వద్ద ఉన్న నగదు- రూ. 48,944 గాంధీనగర్ స్టేట్ బ్యాంక్‌లో డిపాజిట్- రూ.11,29,690 మరో ఎస్బీఐ అకౌంట్లో- రూ.1,07,96,288 ఎల్ అండ్ టీ ఇన్ఫ్రా బాండ్(ప్రస్తుత విలువ)- రూ. 20,000 జాతీయ పొదుపు పత్రం బాండ్ విలువ- రూ. 5,18,235 జీవిత బీమా పాలసీ- రూ. 1,59,281 మోదీ వద్ద ఉన్న బంగారం విలువ(కేవలం 4 ఉంగరాలు) - రూ.1,38,060 స్థిరాస్తుల విషయానికి వస్తే.. గాంధీనగర్‌లోని ఓ నివాస గృహంలో మోదీకి నాలుగో వంతు వాటా ఉంది. దీనిని ఆయన 2002లో 1,30,488 రూపాయలకు కొనుగోలు చేశారు. తర్వాత దానిపై 2,47,208 రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం దాని విలువ కోటి రూపాయలు ఉన్నట్టు పీఎంవో తెలిపింది. -
మహిళా సాధికారికత వ్యాసాలు.. ఎత్తుగడలో భాగమేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : గత పది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రి వర్గంలోని ముగ్గురు మహిళలు, బీజేపీ పాలనలోని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే రాసిన వ్యాసాలు వివిధ జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరి వ్యాసాల్లో ప్రధానంగా చర్చించిన అంశం... మహిళా సాధికారికత. మోదీ నాలుగేళ్ల పాలనలో మహిళాభ్యున్నతి కోసం తీసుకున్న చర్యలను ఆ వ్యాసాలు వివరించాయి. ఇంత మంది మహిళా నేతలు ఒకే అంశంపై వ్యాసాలు రాయడం కాకతాళీయమే కావచ్చు. అయితే.. దీని వెనుక ప్రధాని కార్యాలయం(పీఎంవో) దీర్ఘకాలిక వ్యూహం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎత్తుగడలో భాగమేనా!? ఎన్డీయే పాలనలో మహిళలకు పెద్దగా ఒరిగిందేమీ లేదన్న భావనను తొలగించేందుకు ప్రధాని కార్యాలయం వేసిన ఎత్తుగడలో భాగమే ఈ వ్యాసాలని తెలుస్తోంది. మోదీ పాలనలో మహిళలకు జరిగిన మేలుపై వ్యాసాలు, బ్లాగులు, అభిప్రాయాలు రాయాల్సిందిగా ప్రధాని కార్యాలయం మహిళా మంత్రులకు, బీజేపీ నాయకత్వంలోని రాష్ట్రాలకు చెందిన మహిళా నేతలకు సూచించిందని విశ్వసనీయ వర్గాల కథనం. వీరు రాసే వ్యాసాల ప్రచురణ బాధ్యతను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిందని ఆ వర్గాలు వెల్లడించాయి. పీఎంవో సూచన మేరకు రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు వ్యాసాలు రాశారు. అవి ఆగస్టు20, 30 తేదీల మధ్య ఔట్లుక్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తదితర పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ, ఉమా భారతిలు కూడా వ్యాస రచనకు సన్నద్ధమవుతున్నారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కోహినూర్ తెచ్చేందుకు ఏం చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత పురాతన, అమూల్యమైన వస్తువులను తిరిగి భారత్‌కు తెప్పించే విషయమై తీసుకున్న చర్యలేమిటో తెలపాలంటూ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో), విదేశాంగశాఖను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూర్ వజ్రం, సుల్తాన్‌గంజ్ బుద్ధ, నాసక్ వజ్రం, టిప్పు సుల్తాన్ ఖడ్గం, ఉంగరం, పులి బొమ్మ, మహారాజా రంజిత్‌సింగ్ బంగారు సింహాసనం, షాజహాన్ వినియోగించిన మరకత గ్లాసు, సరస్వతి విగ్రహం తదితరాలను భారత్‌కు తిరిగి తెప్పించేందుకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని సమాచార హక్కు చట్టం కార్యకర్త బీకేఎస్‌ఆర్ అయ్యంగార్ దరఖాస్తు చేశారు. దీన్ని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)కు బదిలీ చేశారు. స్పందించిన ఏఎస్ఐ.. విలువైన వస్తువులను తిరిగి తెప్పించే అంశం తమ పరిధిలోనిది కాదని బదులిచ్చింది. అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలించిన అమూల్యమైన వస్తువులను మాత్రమే తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు తమ శాఖ కృషి చేస్తుందని, బ్రిటిష్ కాలంలో తరలిపోయిన వస్తువులను తిరిగి తెచ్చే అధికారం తమకు లేదని సమాధానమిచ్చింది. ఈ విషయం తెలిసి కూడా పీఎంవో, విదేశాంగ శాఖ.. ఆర్టీఐ దరఖాస్తును ఏఎస్ఐకి ప్రతిపాదించడంపై సీఐసీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న వారసత్వ సంపదను తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. -
వయసు చెప్తే.. కట్నం ఎంతో చెప్తుంది..
భోపాల్, మధ్యప్రదేశ్ : ‘మీ అంచనాలకు తగ్గ వరకట్నం ఎదురుచూస్తోంది. ఓ పురుషుడిగా మీరు ఎక్కువ మొత్తం కోసం కాస్త గట్టిగా ప్రయత్నించాల్సిందే.’ పెళ్లి కాని అబ్బాయిలను ఉద్దేశించి ఓ వెబ్సైట్లో పొందుపర్చిన మాటలు. ఈ సలహా వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా.. నిజంగానే ఓ వెబ్సైట్ అబ్బాయిలకు వచ్చే వరకట్నాన్ని ముందు అంచనా వేసి చెప్తోంది. సదరు వెబ్సైట్లోకి వెళ్తే వయసు, కులం, వృత్తి, వేతనం, దేశం(ఎక్కడ పని చేస్తున్నారనే దాని గురించి), తండ్రి వృత్తి తదితర వివరాలను కోరుతుంది. వీటితో పాటు వరుడి స్కిన్ కలర్‌ను కూడా అడుగుతుంది. నలుపు, తెలుపు అనే ఆప్షన్లను ఎంచుకున్న వారిని ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలను చూపుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా బుధవారం ట్వీట్ చేశారు. ఓ వ్యక్తి సదరు వెబ్‌సైట్‌ను తనకు చూపించారని తెలిపారు. ఇలాంటి వెబ్సైట్లపై చర్యలు తీసుకుపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. భారత్‌లో వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం నేరమని సదరు వెబ్సైట్ డెవలపర్స్‌ను ఉద్దేశించి రాసుకొచ్చారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయాలకు ఫిర్యాదు చేశారు. -
సివిల్స్ కేటాయింపులో మార్పులకు యోచన
న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సర్వీసుల కేటాయింపులో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం సివిల్స్ పరీక్షలో సాధించిన ర్యాంకుల అధారంగా అభ్యర్థులకు సర్వీస్ కేటాయిస్తున్నారు. అనంతరం మూడు నెలల ఫౌండేషన్ కోర్సును పూర్తిచేశాక అభ్యర్థులు తమతమ సర్వీసుల్లో చేరుతున్నారు. అయితే ఈ ఫౌండేషన్ కోర్సు పూర్తయిన తర్వాతే అభ్యర్థులకు సర్వీసుల్ని కేటాయించే విషయాన్ని పరిశీలించాలని సంబంధిత విభాగాలను ప్రధాని కార్యాలయం(పీఎంవో) కోరింది. సివిల్స్, ఫౌండేషన్ కోర్సులో పొందిన ఉమ్మడి మార్కుల ఆధారంగా సర్వీసుల్ని కేటాయించే అంశాన్ని సమీక్షించాలంది. సివిల్స్ విజేతలను ఇండియన్ రెవిన్యూ సర్వీస్, ఇండియన్ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ వంటి ఇతర కేంద్ర సర్వీసులకు కేటాయించే అంశంపై అభిప్రాయాలను తెలియజేయాలని సంబంధిత విభాగాలను కోరింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిఏటా సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
ఏపీలో ఇసుక మాఫియాపై పీఎంఓకు ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియాపై వాటర్ మెన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డా.రాజేంద్ర సింగ్ సోమవారం ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు లేఖ రాశారు. అధికార టీడీపీ నేతల అండతో ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ‘కృష్ణ, గోదావరిలో యథేచ్ఛగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. వాళ్ల చేతుల్లో ఆయుధాలున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇసుక మాఫియాతో అన్ని స్థాయిల అధికారులు కుమ్మక్కు అయ్యారు. అక్రమ తవ్వకాలతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. టీడీపీ నేతల అరాచకాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అటవీశాఖతో దర్యాప్తు చేయించాలి’ అని రాజేంద్ర సింగ్ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో సాగుతున్న ఇసుక తవ్వకాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్ చేస్తూ ‘రేలా’అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. -
ఏడాది క్రితమే పీఎన్బీ స్కాం వెలుగులోకి..
నేడు పేపర్లు, టీవీల్లో మేజర్ వార్త ఏదైనా ఉంది అంటే అది పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణమే. వేల కోట్ల రూపాయల నగదును దోచుకున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయారు. దేశీయ బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా ఇది వెలుగులోకి వచ్చింది. విజయ్‌మాల్యా, సుబ్రతారాయ్, సత్యం రామలింగ రాజులను మించి నీరవ్ మోదీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. అయితే ఈ స్కాంపై గతేడాదే అథారిటీలకు ముందస్తు హెచ్చరికలు వెళ్లినప్పటికీ, వారి పట్టించుకోలేదని తెలుస్తోంది. 2016 జూలైలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త హరి ప్రసాద్ గతేడాదే ఈ కుంభకోణాన్ని బయటపెట్టారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ కూడా రాశారు. విజయ్ మాల్యాను మించిపోయే అతిపెద్ద కుంభకోణం చోటుచేసుకోబోతుందని అథారిటీలను హెచ్చరించారు. '' విజయ్ మాల్యా, సహారా గ్రూప్ సుబ్రతా రాయ్, సత్యం గ్రూప్ రామలింగరాజులకు మాదిరిగా ముంబైకు చెందిన ఓ వ్యక్తి లేదా కంపెనీ వేలకోట్ల రూపాయల ప్రజల నగదును దోచుకుంటోంది. వెయ్యి కోట్ల మేర ప్రజల దనం దుర్వినియోగం పాలవుతోంది. ఈ మోసదారుడు ఎవరో కాదు గీతాంజలి జెమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ మెహల్ చౌక్సి. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్, మెహల్ చౌక్సి, ఇతర సబ్సిడరీలు, స్కాంకు పాల్పడే కంపెనీల వివరాలన్నింటిన్నీ పీడీఎఫ్‌లో ఎన్‌క్లోజ్ చేసి ఆర్ఓసీ మహారాష్ట్రకు లేఖ పంపించా. కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే లేఖను పీఎంఓకు కూడా పంపించా. కానీ వారు నా లేఖను పరిగణలోకి తీసుకోలేదు. రెండు లేదా మూడు నెలల అనంతరం నా కేసును మూసివేస్తున్నట్టు ఆర్ఓసీ మహారాష్ట్ర నుంచి లేఖ వచ్చింది. విజయ్‌మాల్యా లాగా వీరు దేశం విడిచి పారిపోకుండా చూడాలంటూ అభ్యర్థించా. కానీ ఎలాంటి ప్రయోజనం కలుగలేదు'' అని ప్రసాద్ చెప్పారు. జరుగబోయే స్కాం గురించి ముందస్తుగా అధికారులను హెచ్చరించినప్పటికీ, వారు ఇలా నిర్లక్ష్యపూర్వకంగా స్పందించడంతో, వ్యవస్థపై తనకున్న నమ్మకం పోయిందన్నారు ప్రసాద్. అయితే ప్రసాద్, చోక్సికి వ్యతిరేకంగా ఎలాంటి ఫైట్ చేయలేదు. ఈ కుంభకోణం గురించి తనకు లీక్ కావడంతో, ముందస్తుగానే పీఎంఓకు అలర్ట్ ఇచ్చారు. కానీ వారు పట్టించుకోలేదు. ప్రసాద్‌కు ఇవ్వాల్సిన రూ.13 కోట్లను ఇవ్వకుండా.. ఆయన్ను చోక్సి మోసం చేశారు. బెంగళూరులోని గీతాంజలి జెమ్స్ ఫ్రాంచైజీని ప్రసాద్ నిర్వహిస్తున్నారు. చెల్లిస్తానన్న ఏ నగదును చోక్సి తనకు ఇవ్వలేదని ప్రసాద్ ఆరోపించారు. స్టోర్ ప్రాంతాల అద్దె ఇలాంటివేమీ తనకు ఇవ్వకుండా ఎగొట్టారన్నారు. ఈ విషయంపై ప్రసాద్ బెంగళూరులోని సెంట్రల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా దాఖలు చేశారు. ఏడాది అనంతరం ప్రసాద్ చెప్పినట్టు బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితమే అధికారులు స్పందించి ఉంటే, ఈ స్కాం ఇంతదూరం వచ్చేది కాదని ప్రజలు, విపక్షాలు మండిపడుతున్నాయి. -
గిరి గీసుకోవద్దు
న్యూఢిల్లీ: సంకుచిత ధోరణులు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రధాన అడ్డంకులుగా మారాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వినూత్న మార్గాల ద్వారా ఇలాంటి వాటిని అధిగమించి పాలనను వేగవంతం చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు. పలు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 380 మంది డైరెక్టర్లు, డిప్యూటీ కార్యదర్శులతో మోదీ మంగళవారం సమావేశమై పలు విషయాలపై చర్చించినట్లు పీఎంఓ ప్రకటన విడుదల చేసింది. 2022 నాటికి నవభారత్ లక్ష్య సాధనకు అంకితభావంతో పనిచేయాలని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు. ‘సంకుచిత ఆలోచనా దోరణులు ప్రభుత్వ పాలనకు అడ్డంకిగా మారాయి. అధికారులు గిరిగీసుకోకుండా ఇలాంటి వాటిని వినూత్న మార్గాల ద్వారా అధిగమిస్తే పాలన వేగవంతమవుతుంది’ అని మోదీ అన్నారు. మెరుగైన ఫలితాలు రాబట్టాడానికి డైరెక్టర్, డిప్యూటీ కార్యదర్శి స్థాయి అధికారులు ప్రత్యేక బృందాలను నియమించుకోవాలని సూచించారు. పాలన, అవినీతి నిర్మూలన, ప్రభుత్వ సంస్థలు, గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, రవాణా, జల వనరులు, స్వచ్ఛ భారత్, కమ్యూనికేషన్, పర్యాటకం, తదితరాలు ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చినట్లు పీఎంఓ పేర్కొంది. -
మోదీ విదేశీ యానాల లెక్కలు ఇవ్వలేం
లక్నో: ప్రస్తుత ప్రధాని, మాజీ ప్రధానిల విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలు ఇవ్వడం కుదరదని ప్రధాని కార్యాలయం తెలిపింది. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ల విదేశీ పర్యటనల ఖర్చుల వివరాలు కోసం సామాజిక కార్యకర్త నూతన్ ఠాకూర్ సమాచార హక్కు చట్టం కింద గత జూన్16న దరఖాస్తు చేశారు. అయితే ఈ పిటిషన్ అర్థం లేనిదని ప్రధానిల ఖర్చుల వివరాలు ఇవ్వలేమని పీఎంవో కేంద్ర సమాచార అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రధానుల పర్యటనల గురించి పీఎంఓ, ఇతర శాఖలను ఫైళ్ల కాపీలు ఇవ్వాల్సిందిగా కోరానన్నారు. ఆర్టీఐ సెక్షన్ 19 ప్రకారం సౌత్‌బ్లాక్‌లో ఉన్న అప్పిలేట్ అథారిటీ సయ్యద్ ఇక్రం రిజ్విని సంప్రదించాల్సిందిగా ప్రవీణ్‌కుమార్ సూచించారని నూతన్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. -
ప్రధాని ఆర్డర్స్: 300 కంపెనీలపై ఉక్కుపాదం
న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ కు పాల్పడుతున్న షెల్ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని ప్రధాని నరేంద్రమోదీ ఆఫీసు ఆదేశించిన వారం రోజుల్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో కనీసం 300 షెల్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఎన్నఫోర్స్మెంట్ శనివారం రైడ్స్ ప్రారంభించింది.16 రాష్ట్రాల్లోని 100 పైగా ప్రాంతాలకు సంబంధమున్న 300 షెల్ కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ దాడుల్లో ఇప్పటికే ఓ ముంబాయి ఆపరేటర్ 20 డమ్మీ డైరెక్టర్లతో 700 షెల్ కంపెనీలను రన్ చేస్తూ.. రూ.46.7కోట్లను మార్చినట్టు తేలింది. ఈడీ దాడులు చేస్తున్న ప్రాంతాల్లో హైదరాబాద్, కోల్ కత్తా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, చంఢీఘర్, పట్నా, బెంగళూరులు ఉన్నాయి. చెన్నైలోని 8 కంపెనీలకు లింక్ ఉన్న 13 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుందని తెలుస్తోంది. ఈ కంపెనీలు కేవలం పేపర్‌కే పరిమితమయ్యాయని, ఎలాంటి కార్యకలాపాలు జరపడం లేదని గతనెలే పీఎంఓ గుర్తించింది. ఈ షెల్ కంపెనీలను ఇతర కంపెనీలు పన్నుల ఎగవేతకు, మనీ లాండరింగ్ కు ఉపయోగిస్తున్నారని పీఎంఓ తేల్చింది. బ్లాక్ మనీ వ్యతిరేకంగా ప్రధాని మోదీ చేస్తున్న పోరాటంలో వీటిపై దాడులు జరపడం అతిపెద్ద సవాళ్లేనని అధికార వర్గాలంటున్నాయి. ఈ దాడుల్లో భాగంగానే షెల్ కంపెనీలు , వాటి డైరెక్టర్ల డేటా బేస్ ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ కార్యదర్శి, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి జాయింట్ గా ఈ టాస్క్ ఫోర్స్ నిర్వహిస్తున్నారు. గత మూడేళ్లలో 1155 షెల్ కంపెనీలను తొలగించారని, వీటితో మనీ లాండరింగ్ కు పాల్పడుతున్న 22వేలకు పైగా లబ్దిదారులను గుర్తించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్లాక్ మనీపై పోరాటాన్ని ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. ఈడీ, ఐటీ, సంబంధిత ఏజెన్సీల ద్వారా దాడులు నిర్వహించి అవినీతిని వెలికి తీస్తున్నారు. అయితే పెద్ద నోట్ల రద్దు అనంతరం ఈ కంపెనీల ద్వారా 550 మంది రూ.3900 కోట్లు నగదును మనీ లాండరింగ్ పాల్పడినట్టు తెలిసింది. వీటిని నిగ్గుతేల్చడానికే ప్రభుత్వం నేడు ఏకకాలంలో ఈ దాడులు నిర్వహిస్తోంది. కాగ, రద్దయిన నోట్లను డిపాజిట్ చేసుకోవడానికి ఇతర దేశాల్లో ఉన్న భారతీయులకు ఇచ్చిన అవకాశం కూడా నిన్నటితోనే(మార్చి 31) ముగిసింది. -
ఇండియన్ ఆర్మీలో ఆర్డర్లీ: సంచలన వీడియో
-
ఇండియన్ ఆర్మీలో ఆర్డర్లీ: సంచలన వీడియో
- ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు: జవాన్ - స్పందించిన ఆర్మీ చీఫ్.. ఇక ‘ఫిర్యాదుల పెట్టె’ న్యూఢిల్లీ: నిన్నటిదాకా భద్రతా బలగాలకే పరిమితం అయిన ‘జవాన్ వీడియోల’ వ్యవహారం మొదటిసారి భారత సైన్యం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీలో కొందరు అధికారులు జవాన్లతో చేయించకూడని పనులు చేయిస్తున్నరని, దీనిపై రాష్ట్రపతి, ప్రధానులకు లేఖరాసినందుకు ప్రతీకారంగా తాను టార్చర్‌కు గురవుతున్నానంటూ ఓ ఆర్మీ జవాన్ శుక్రవారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్చేశాడు. భద్రతా బలగాల్లో పనిచేస్తోన్న జవాన్లకు సరైన భోజనం, జీతభత్యాలు అందడంలేదన్న బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్ల వీడియోలపై దుమారం చల్లారకముందే మూడోది బయటికిరావడం గమనార్హం. డెహ్రాడూన్‌లోని 42వ ఇన్ఫంట్రీ బ్రిగేడ్‌లో లాన్స్ నాయక్‌గా పనిచేస్తోన్న యజ్ఙప్రతాప్ సింగ్.. శుక్రవారం యూట్యూబ్‌లో ఒక వీడియోను పోస్ట్చేశాడు. కొందరు అధికారులు.. కిందిస్థాయి జవాన్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, షూపాలిష్ లాంటి పనులు చేయిస్తున్నారని సింగ్ ఆరోపించాడు. ఇదే విషయమై గతంలో తాను.. రాష్ట్రపతి, ప్రధాని, రక్షణశాఖ, హోంశాఖలకు లేఖలు రాశారనిని, దీనిపై ప్రధాని కార్యాలయం వివరణ కూడా అడిగిందని గుర్తుచేశాడు. ‘ఫిర్యాదు చేసే సమయంలో నేను ఆర్మీ నిబంధనలను ఉల్లంఘించలేదు. ఎప్పుడైతే ప్రధాని కార్యాలయం రిపోర్టు అడిగిందో, అప్పటి నుంచి నాపై వేధింపులు రెట్టింపు అయ్యాయి. ఆత్మహత్యకు ప్రేరేపించేలా అధికారులు నన్ను దూషిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం ఆర్మీ నియమాలకు విరుద్ధం కాబట్టి నేనాపని చేయడంలేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్నా’అని యజ్ఙప్రతాప్ సింగ్ వీడియోలో చెప్పారు. (భారత ‘బోర్డర్’లో సంచలనాలు) ఫిర్యాదుల పెట్టె: ఆర్మీ చీఫ్ కాగా, భద్రతా బలగాలు, ఆర్మీ జవాన్ల వరుస వీడియోలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. అత్యున్నత బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇకపై అన్ని చోట్లా ‘ఫిర్యాదుల పెట్టెలు’(Complaint Boxs) ఉంచుతామని తెలిపారు. ‘తమ సమస్యలపై జవాన్లు వీడియోలు పోస్ట్ చేయడం కన్నా, పై అధికారులకు ఫిర్యాదుచేస్తే బాగుంటుంది’అని రావత్ హితవు పలికారు. ఇప్పటివరకు వెలుగుచూసిన వీడియో ఉదంతాలపై విచారణ జరుగుతున్నదని గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేసే క్రమంలో పాకిస్థాన్‌పై ఏక్షణంలోనైనా సర్జికల్ దాడులకు సిద్ధమని రావత్ పేర్కొన్నారు. -
‘రద్దు’పై ఎవరిని సంప్రదించారో సమాచారం లేదు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రకటించిన పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముందు.. ఏ అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారో సమాచారం లేదని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ‘ఈ కార్యాలయం రికార్డుల్లో దరఖాస్తుదారు అడిగిన సమాచారం లేదు’ అని పేర్కొంది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8న ఆకస్మికంగా చేసిన ప్రకటనకు ముందు కేంద్ర ఆర్థికమంత్రి, అలాగే ప్రధాన ఆర్థిక సలహాదారు అభిప్రాయాలు తీసుకున్నారా? అన్న ప్రశ్నకు జవాబిచ్చేందుకు కూడా పీఎంవో నిరాకరించింది. ఆర్టీఐ చట్టంలోని ‘సమాచారం’ నిర్వచన పరిధిలోకి ఈ ప్రశ్నలు రావని పేర్కొంది. -
'నా అకౌంట్లో రూ.100కోట్లు పడ్డాయి'
ఘజియాబాద్: తన జన్ ధన్ బ్యాంకు ఖాతాలో రూ.100 కోట్ల నగదు డిపాజిట్ అయిందని ఓ మహిళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి ఈ-మెయిల్లే పంపింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన శీతల్ యాదవ్ కు మీరట్ లో గల ఓ భారతీయ స్టేట్ బ్యాంకు బ్రాంచిలో జన్ ధన్ ఖాతా ఉంది. కాగా, ఈ నెల 18వ తేదీన డబ్బు డ్రా చేసుకునేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంకు వెళ్లిన శీతల్ కు బ్యాలెన్స్ అమౌంట్ ను చూసి షాక్ గురైంది. రూ.99,99,99,394లు తన అకౌంట్లో ఉండటాన్ని గుర్తించింది. ఈ విషయాన్ని తొలుత నమ్మలేకపోయిన శీతల్.. ఏటీఎం వద్దకు వచ్చిన మరొకరికి చూపించి ద్రువీకరించుకుంది. అప్పటికీ నమ్మలేక దగ్గరలోని ఎస్ బ్యాంకు ఏటీఎం వద్దకు వెళ్లి మరో మారు బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్ ను చెక్ చేసి చూసింది. మరలా ఖాతలో రూ.100కోట్లు ఉన్నట్లు చూపడంతో ఈ విషయాన్ని తన భర్త జైలెదార్ సింగ్ కు చెప్పింది. శీతల్ ను వెంటబెట్టుకుని బ్యాంకు వద్దకు వెళ్లిన జైలెదార్.. బ్యాంకు అధికారులకు డబ్బు విషయాన్ని చెప్పాడు. బ్యాంకు మేనేజర్ అందుబాటులో లేడని మరలా రావాలని వారు చెప్పడంతో మరుసటి రోజు మరలా బ్యాంకుకు వెళ్లగా వేరే కారణాలు చెప్పి మళ్లీ పంపేశారు. దీంతో అనుమానం వచ్చిన జైలెదార్.. ఓ ఎడ్యుకేటెడ్ పర్సన్ కు జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆయన సలహాతో సోమవారం ప్రధానమంత్రి కార్యాలయానికి అకౌంట్ కు సంబంధించిన వివరాలను పంపినట్లు మీడియాతో చెప్పాడు. -
జియోకు అనుమతి ఇవ్వలేదు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముద్రణ మరియు ఎలక్ట్రానిక్ ప్రకటనల్లో నరేంద్ర మోదీ చిత్రాలు ఉపయోగించడానికి రిలయన్స్ జియోకు అనుమతి మంజూరు చేయలేదని స్పష్టం చేసింది. రాజ్యసభలో సమాజ్ వాది పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్ గురువారం అడిగిన ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానంగా సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. ఎలక్ట్రానిక్ యాడ్స్ పై ప్రధాన మంత్రికార్యాలయం నుంచి (పీఎంఒ) నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు. మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా యూనిట్, అడ్వర్టయిజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ డైరెక్టరేట్ (డీఏవీపీ), వివిధ మీడియా సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ప్రకటనలకు అనుమతి ఇస్తుందని తెలిపారు. కానీ తమ నోడల్ ఏజెన్సీ డీఏవీపీ ఏ ప్రైవేటు సంస్థ కు మోదీ ఫోటోలను విడుదల చేయలేదని చెప్పారు. అయితే అనుమతిలేకుండానే ప్రధాని ఫోటోలను వాడుకోవడంపై జియోపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని శేఖర్ కోరారు. చిహ్నాలు మరియు పేర్లు (అసమాన వినియోగం నివారణ) చట్టం 1950 ప్రకారం కన్జ్యుమర్ అఫైర్స్ , ఫూడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ సమాధానమిస్తుందని చెప్పారు. కాగా బిలియనీర్ రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో ఇన్ ఫ్రాటెల్ వ్యాపార ప్రకటనల్లో మోదీ పోటోలు దర్శనమివ్వడంపై పలు విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. -
పెద్దనోట్ల రద్దు: రంగంలోకి పీఎంవో!
న్యూఢిల్లీ: డబ్బును పొందడానికి బ్యాంకుల ముందు, పోస్టాఫీసుల ముందు ప్రజలు గంటలుగంటలు తీవ్రకష్టాలు పడుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా డబ్బు ఉపసంహరణ ఎలా సాగుతున్నదో తెలుపుతూ నివేదిక ఇవ్వాలని అధికారులను కోరింది. ‘ప్రధానమంత్రి దేశంలోకి వచ్చారు. ఆయన త్వరలోనే బ్యాంకుల అధిపతులు, ఇతర భాగస్వాములతో దేశంలోని పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. (కరెన్సీ మార్పిడి అంశంపై) ప్రధాని ఇప్పటికే నివేదిక కోరారు’ అని పీఎంవో వర్గాలు మీడియాకు తెలిపాయి. నోట్లరద్దుపై ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రధాని మోదీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పాల్గొననున్నారు. పెద్దనోట్ల కరెన్సీ రద్దు నిర్ణయం ప్రకటించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడురోజుల జపాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. జపాన్ పర్యటన ముగించుకొని భారత్ వచ్చిన ఆయన పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న పాట్లపై స్పందించిన సంగతి తెలిసిందే. తనకు 50 రోజుల సమయం ఇస్తే ప్రజల కష్టాలను దూరం చేస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మరోవైపు ఆర్బీఐ కూడా తమ తగినంత కరెన్సీ ఉందని, ఈ విషయంలో భయాలు వద్దని భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
భారీగా పెరిగిన ఎంపీల వేతనాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యులకు శుభవార్త. ఎంపీల వేతనాలు 100 శాతం పెంపుకు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) ఆమోదం తెలిపింది. దీంతో పార్లమెంట్ సభ్యులకు ప్రస్తుతమున్న వేతనం రూ.50 వేల నుంచి రెండింతలు పెరిగి లక్ష రూపాయలకు చేరుకుంది. కేవలం వేతనాలను మాత్రమే కాక, అలవెన్స్‌లను కూడా పీఎంవో సమీక్షించింది. పీఎంవో ఆమోదంతో మొత్తంగా పార్లమెంట్ సభ్యులు అందుకునే వేతనాలు నెలకు రూ.1,90,000 నుంచి రూ.2,80,000 కు ఎగిశాయి. ఈ వేతన ప్రతిపాదనను బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యానాథ్ అధినేతగా పార్లమెంట్ సభ్యుల వేతన, అలవెన్స్ జాయింట్ కమిటీ రూపొందించింది. అంతకముందు ఎంపీల వేతన పెంపుకు ప్రధాని మోదీ ఓ ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటుచేశారు. కానీ పార్లమెంట్ సభ్యుల నుంచి వచ్చిన ఒత్తిడి క్రమంలో ఈ కమిషన్‌ను మోదీ రద్దుచేశారు. పార్లమెంట్ సభ్యుల అలవెన్స్ చూసుకుంటే, ప్రతినెలా వారికి ఇచ్చే నియోజకవర్గ భత్యం రూ.45,000 ల నుంచి రూ.90,000కు పెరిగింది. సెక్రటరీ సహాయం, కార్యాలయ భత్యం కింద నెలకు రూ. 90,000ను పార్లమెంట్ సభ్యులు అందుకోనున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి వేతనాన్ని కూడా రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రపతి వేతనంతో పాటు గవర్నర్ వేతనాన్ని కూడా రూ.1.10 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచనున్నారు. -
24X7 నరేంద్ర మోదీ @ డ్యూటీ
న్యూఢిల్లీ: ఎంత తీరికలేని ఉద్యోగమైనా.. పండుగలకో, ఫంక్షన్లకో సెలవంటూ తీసుకోని ఉద్యోగులు ఉంటారా? కార్మిక చట్టాల ప్రకారం ఒక ఉద్యోగి పనిగంటలు 8. మహాఅయితే 12 గంటలు. కానీ 24X7 కర్తవ్యనిర్వహణకే కంకణబద్ధుడైన వ్యక్తిని ఎప్పుడైనా చూశారా?.. అవును. ఆ వ్యక్తి మరెవరోకాదు.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే! 2014, మే 26న పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు మోదీ ఒక్కటంటే ఒక్క సెలవు కూడా తీసుకోలేదు. అంతేకాదు, ప్రతి రోజు.. ప్రతి నిముషం.. ఆయన డ్యూటీలోనే ఉంటారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) పేర్కొంది. దేశ ప్రధానుల సెలవులకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించిన ఓ వ్యక్తికి మంగళవారం పీఎంవో రాతపూర్వక సమాధానం చెప్పింది. గతంలో పనిచేసిన ప్రధానుల సెలవులకు సంబంధించిన సమాచారమేదీ తమ వద్ద లేదన్న పీఎంవో.. సంబంధిత రికార్డులను అక్కడ భద్రపర్చరని తెలిపింది. అయితే ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం ఒక్కటంటే ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, నిత్యం డ్యూటీలో ఉండటం ప్రధాని బాధ్యతల్లో ఒకటని పీఎంవో పేర్కొంది. 66 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా దేశాన్ని నడిపిస్తోన్న మోదీ ఎంతైనా గ్రేటేకదా! -
పీఎంఓకు ‘క్రీ మీలేయర్ పెంపు’
న్యూఢిల్లీ: ఓబీసీలకు రిజర్వేషన్ల వర్తింపులో ప్రస్తుతమున్న క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. కుటుంబ ఆదాయ పరిమితిని రూ. 8 లక్ష లకు పెంచుతూ రూపొందించిన ప్రతిపాదనల ఫైలును సామాజిక న్యాయ శాఖ ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిందని, త్వరలో కేంద్ర కేబినెట్లో ఈ అంశం చర్చకు వస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఉండగా... కుటుంబ ఆదాయం రూ. 6 లక్షల వరకూ ఉంటేనే రిజర్వేషన్‌ను వర్తింపచేస్తున్నారు. పరిమితిని పెంచాలంటూ కొన్ని నెలలుగా కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. క్రీమీలేయర్ నిర్వచనాన్ని సమీక్షించి ఇతర వెన కబడ్డ వర్గాలకు వర్తించేలా జూలైలోనే ఎన్డీఏ ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలంటూ కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయమంత్రి రాందాస్ అథవాలే ఆగస్టులో డిమాండ్ చేశారు. ఆ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ప్రస్తావించారు. పెంపు రూ. 8 లక్షలుంటే సరిపోతుందన్న ఆ శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ వాదనతో చివరకు ఆ మేరకే పెంచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పెంపును కేబినెట్ ఆమోదించాక... నవంబర్-డిసెంబర్లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఈ అంశం లాభిస్తుందని బీజేపీ నమ్మకం పెట్టుకుంది. -
పీఎంవోకు సీఐసీ నోటీసులు
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల (2002) తర్వాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల సమాచారానికి సంబంధించి ప్రధాన మంత్రి కార్యాలయం, గుజరాత్ ప్రభుత్వానికి కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) నోటీసులు జారీ చేసింది. ఆర్టీఐ చట్టం ప్రకారం మూడో వ్యక్తి అభిప్రాయం కూడా అవసరమన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను చూపుతూ నవంబర్ మొదటి వారం కేసు విచారణ సమయంలో వివరణ ఇవ్వాలంటూ నోటీసులిచ్చింది. ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ 2013, డిసెంబర్ 16న సమాచారహక్కు దరఖాస్తు దాఖలు చేశారు. మోదీ, వాజపేయి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల వివరాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అగర్వాల్ కంటే ముందు ఈ సమాచారం కోసం మరొకరు ఆర్టీఐ దరఖాస్తు పెట్టారు. అయితే ఈ సమాచారం ఇచ్చేందుకు పీఎంవో నిరాకరించింది. -
'ఆన్ లైన్ మోసాల్లో చిక్కుకోవద్దు'
ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ఆయన కొన్ని విషయాలను వెల్లడించారు. తన పేరు చెప్పి, పీఎం సంతకం అని చెబుతూ కొందరు అడ్డదార్లలో డబ్బు సంపాదించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఆ సంతకాలేవీ తనవి కాదని ఈ విధంగా తన పేరు చెప్పి ఆన్ లైన్లో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆ ఆన్ లైన్ మోసాలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పీఎం సంతకం నకిలీదని పేర్కొంటూ పీఎంవో కూడా ఈ విషయాలపై ట్వీట్ చేసింది. మోదీ ఫొటోలను మార్ఫింగ్ చేశాడన్న కారణంగా గత మేలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భారత్ లో అత్యధిక ట్విట్టర్ ఫాలోయర్స్ జాబితాలో పీఎం మోదీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. -
నా అకౌంట్ లోకి 15 లక్షలు ఎప్పుడొస్తాయి?
న్యూఢిల్లీ: నా ఖాతాలోకి రూ.15 లక్షలు ఎప్పుడొస్తాయి? అని రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ప్రధాన మంత్రి కార్యాలయా(పీఎంవో)నికి దరఖాస్తు చేశాడు. అతనికి 15 రోజుల్లోపు సమాచారమివ్వాల్సిందిగా పీఎంవోను కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘నల్ల ధనాన్ని వెనక్కి రప్పించి, దేశంలోని ప్రతి పేదవాడికి రూ.15 లక్షలిస్తా’ అని మోదీ హామినిచ్చారనీ, ఆ హామీ అమలు ఎంతవరకు వచ్చిందో చెప్పాలని ఝాలావాడ్ జిల్లాకు చెందిన కన్హయ్య లాల్ పీఎంవో సహ చట్టం కింద దరఖాస్తు చేశారు. దేశం నుంచి అవినీతిని తరిమికొట్టడానికి కొత్త చట్టం ఎప్పుడు తెస్తారో కూడా చెప్పాలని కన్హయ తన దరఖాస్తులో పేర్కొన్నాడు. రైలు ప్రయాణాల్లో వృద్ధులకు 40 శాతం రాయితీని ఇస్తూ యూపీఏ తీసుకొచ్చిన పథకాన్ని తొలగించే ఆలోచన ఏదైనా ఉందా అని కూడా కన్హయ్య అడిగారు. సమాధానం లేకపోవడంతో ఆయన అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించారు. విచారణకు వచ్చిన పీఎంవో అధికారి తమ వాదన వినిపిస్తూ, అర్జీ తమ వద్దకు రాలేదనీ, అందుకే సమాచారమివ్వలేక పోయామని చెప్పారు. 15 రోజుల్లో కన్హయ్యకు సమాచారం ఇవ్వాలని ప్రధాన సమాచార కమిషనర్ రాధాకృష్ణ మాథూర్ పీఎంవోను ఆదేశించారు. -
ఆ దేశ పర్యటనకు ఎదురుచూస్తున్నా:మోదీ
న్యూఢిల్లీ: సింగపూర్ లో పర్యటించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలిపారు. సింగపూర్ ను సందర్శించాల్సిందిగా ఆదేశ డిప్యూటీ ప్రధాన మంత్రి థర్మన్ షన్ముగరత్నమ్ ఆహ్వానించారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది. షన్ముగరత్నమ్ మోదీకి స్మాట్ సిటీలు, స్కిల్ డెవలప్ మెంట్, ద్వైపాక్షిక సంబంధాలను గురించి వివరించారని పీఎంఓ తెలిపింది. మోదీ గతేడాది నవంబర్ లో సింగపూర్ లో పర్యటించారు. ఈ నెల 22 న గుండెపోటుతో మరణించిన భారత సంతతికి చెందిన సింగపూర్ దివంగత అధ్యక్షుడు ఎస్.ఆర్. నాథన్ గొప్ప దార్శనికుడని మోదీ కొనియాడారు. -
పీఎంఓకి పేదవ్యక్తే దొరకలేదట!
ఓ పూట తిని, మరోపూట పస్తులుంటూ కాలాన్ని వెల్లబుచ్చే పేదవారు భారత్‌లో వీధికొక్కరైనా కనిపిస్తుంటారు. చాలా టీవీ షోలలో వారి ఆర్తనాదాలు వినిపించిన క్షణాలు లేకపోలేదు. అలాంటిది ప్రధానమంత్రి కార్యాలయానికి దేశంలో ఒక్క పేదవాడు కూడా దొరకలేదట. దేశంలో పేదవ్యక్తిగా ఎవరున్నారో గుర్తించడం కష్టమై, దాతృత్వ హృదయంతో పేదవాడికి దానం చేసిన చెక్‌ను తిప్పి పంపించేసింది. రాజస్తాన్‌లోని శిఖర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ టీచర్ దీప్‌చంద్ శర్మ, 2015 జూన్ 10న లక్ష రూపాయల చెక్‌ను దేశంలోని పేదవ్యక్తికి సాయార్థంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ చెక్‌ను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపారు. అయితే 2016 ఫిబ్రవరి 2న, ప్రధానమంత్రి కార్యదర్శి పీకే భళి, శర్మను సంప్రదించి, దేశంలో పేదవ్యక్తి ఎవరున్నారో గుర్తించకపోవడం వల్ల తను పంపిన చెక్‌ను సాయార్థంగా ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. పీఎమ్ రిలీఫ్ ఫండ్‌లో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్నట్టు చెప్పారు. తర్వాత ఆ లక్ష రూపాయల డిమాండ్ డ్రాప్ట్‌ను శర్మకు పంపించేశారు. -
‘షరతుల విరాళాలను అనుమతించలేం’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి సహాయ నిధికి వచ్చే విరాళాల్లో షరతులను అనుమతించలేమని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఓ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ ప్రధాన సమాచార కమిషనర్ ఆర్.కె.మాథూర్‌కు ఇచ్చిన జవాబులో పీఎంవో ఈ విషయాన్ని తెలిపింది. ఢిల్లీకి చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త దీప్చంద్ర శర్మ గతేడాదిలో పీఎంవోకి రూ.లక్ష చెక్కుని విరాళంగా ఇచ్చారు. తాను పంపిన రూ.లక్ష చెక్కుని దేశంలోనే అత్యంత పేదవాడికి ఇవ్వాలని లేని పక్షంలో తనకే ఆ చెక్కుని తిరిగి ఇవ్వాలని కోరాడు. తన చెక్కుని ఎవరికి ఉపయోగించారో తెలపాలని కోరుతూ ఆయన గత జూన్‌లో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. దీనిపై స్పందించిన పీఎంవో ప్రధానమంత్రి సహాయనిధికి వచ్చే విరాళాల్లో షరతులను అనుమతించరంది. -
స్మృతి ఒప్పుకోలేదు.. ప్రకాశ్ చేసేశారు.!
దేశ అత్యున్నత మేనేజ్ మెంట్ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎం)లకు బోర్డ్ ఆఫ్ గవర్నర్(బీఓజీ)లను నియమించుకునే అవకాశాన్ని కల్పిస్తూ మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జయదేవకర్ నిర్ణయం తీసుకున్నారు. ఐఐఎంలను స్వతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బీఓజీలను సంస్థలే నియమించుకునే అవకాశాన్ని ఇవ్వాలని పీఎంవో సూచనలు చేసింది. ఈ ఏడాది మే నెలలో ఐఐఎం-అహ్మదాబాద్ తన బీఓజీగా పేర్కొన్న పేర్లను మానవవనరుల శాఖ మాజీమంత్రి స్మృతి ఇరానీ కాదని వాటిని వెనక్కు పంపిన విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరైన ఆర్. శేషసాయి, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు చైర్మన్ దీపక్ పరేఖ్, హీరో మోటర్ కార్ప్ సీఎండీ పవన్ ముంజల్ ల పేర్లలో ఒకరిని ఎంపిక చేయాలని ఐఐఎం-అహ్మదాబాద్ స్మృతిని కోరింది. వీరిలో ఎవరిని ఎంపిక చేయకపోవడానికి కారణం చెప్పకుండా ఆ డాక్యుమెంట్లను స్మృతి వెనక్కు పంపారు. కొద్దిరోజుల క్రితం మానవ వనరులశాఖ మంత్రిగా ప్రకాశ్ జయదేవకర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పీఎంవో సూచనలకు అనుగుణంగా ఐఐఎంలు సొంతంగా చైర్మన్లను నియమించేందుకు ఆయన అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన బిల్లును కేబినేట్ లో ఆమోదం పొందడానికి సిద్ధమైంది. ఇరానీ హయాంలోని బిల్లులో ఐఐఎం ఎంపిక చేసిన చైర్మన్ అపాయింట్ మెంట్ ను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం రూపొందించిన బిల్లులో ప్రభుత్వానికి చైర్మన్ నియామకంతో ఎలాంటి సంబంధం ఉండదు. -
మోదీ టీం శాలరీలు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పరిపాలనలో సాయంగా నిలుస్తున్న టాప్ అధికారుల జీతాలను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) ఆర్టీఐ కింద బయటపెట్టింది. అత్యధికంగా ప్రధానమంత్రి కార్యదర్శి భాస్కర్ ఖుబ్లే రూ. 2లక్షల వేతనాన్ని అందుకుంటున్నారు. చాలా మంది జాయింట్ సెక్రటరీలు రూ.1.7లక్షల జీతం అందుకుంటుండగా.. అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా రూ.1,62,500లను అందుకుంటున్నారు. వరుసగా ప్రిన్సిపల్ సెక్రటరీ న్రిపేంద్ర మిశ్రా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. జాయింట్ సెక్రటరీల్లో అత్యధికంగా తరుణ్ బజాజ్ రూ.1,77,750లు నెలవారీ జీతంగా తీసుకుంటున్నారు. అత్యల్పంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రూ.17వేలను వేతనాన్ని అందుకుంటున్నారు. ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాల వివరాలను పీఎంవో జూన్ 1నుంచి తన వెబ్ సైట్లో ప్రజలకు అందుబాలు ఉంచింది. ఆర్టీఐ ద్వారా ప్రజలు ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్న సమాచారాన్ని ప్రభుత్వమే వాలంటరీగా విడుదల చేస్తోంది. మన్మోహన్ సర్కారు కూడా పీఎంవో ఉద్యోగుల జీతభత్యాలను ప్రకటించిన విషయం తెలిసిందే. -
వీవీఐపీల ఫోన్ ట్యాపింగ్ సంచలనం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తల దగ్గర్నుంచి, న్యాయవాదుల వరకు ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనే వార్త ఇపుడు సంచలనం మారింది. ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ 2001-06 మధ్య కాలంలో ఈ ట్యాపింగ్ కు పాల్పడిందని ఓ సుప్రీంకోర్టు న్యాయవాది వాదిస్తున్నారు. ఈ మేరకు ఆయన పిల్ కూడా దాఖలు చేశారు. క్యాబినెట్ మంత్రులు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి కార్పొరేట్ వేత్తలు, ప్రముఖ న్యాయవాదుల ఫోన్ల ను ఎస్సార్ సంస్థ ట్యాప్ చేసిందని ఆరోపిస్తున్నారు. ఈ నెల 1న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది సురేన్ ఉప్పల్ దీనిపై 29 పేజీల పిర్యాదు చేశారని కథనాలు తెలుపుతున్నాయి. ఈ ఫిర్యాదు మేరకు ఎస్సార్ మాజీ ఉద్యోగి అల్ బాసిత్ ఖాన్ ఈ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎస్సార్ సంస్థలో భద్రతా అధిపతిగా చేసే కాలంలో ఖాన్ ప్రముఖుల ఫోన్లకు అంతరాయం కలిగిస్తూ వారి సంభాషణలను రికార్డు చేసేవాడని, మేనేజ్ మెంట్ ఆదేశాల మేరకు అతను ఈ చర్యలకు పాల్పడినట్టు న్యాయవాది పేర్కొన్నారు. కొన్నేళ్లపాటు యథేచ్చగా సాగిన ఈ వ్యవహారం, 2011 మేలో తేడా వచ్చి, ఖాన్ ను సంస్థ నుంచి బయటికి పంపేశారని ఫిర్యాదులో చెప్పారు. ఈ పరిమాణానికి షాకైన ఖాన్ తన దగ్గరున్న టేపులను బయటపెట్టాలనుకున్నాడని, తనను కలిసేందుకు కూడా ప్రయత్నించాడని న్యాయవాది పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించడానికి ప్రస్తుతం ఖాన్ అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. ఫోన్లకు, మెసేజ్ లకు అతను అందుబాటులో లేడని ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టు చేసింది. ఈ విషయాలపై మరిన్ని నిజనిజాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫోన్ల ట్యాపింగ్ ను ఎస్సార్ సంస్థ ఖండిస్తోంది. న్యాయవాది స్టేట్ మెంట్ పూర్తిగా తప్పుడు సమాచారమని, అసలు దీనికి ఆధారాలే లేవని ఎస్సార్ సంస్థ పేర్కొంది. అతని డిమాండ్లను సంస్థ నెరవేర్చకపోవడం వల్లే, ఇలా నిందలు వేస్తున్నారని మండిపడింది. అసలు ఎస్సార్ సంస్థ ఎవరి పోన్లపై ఎప్పుడు నిఘా ఉంచలేదని, దీనికోసం అసలు వ్యక్తులనే నియమించలేదని తెలిపింది. ప్రస్తుత రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, మాజీ మంత్రి ప్రఫూల్ పటేల్, రామ్ నాయక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, ఏడీఏజీ చైర్మన్ అనిల్ అంబానీ, అతని భార్య టీనా అంబానీ, కంపెనీల్లోని వివిధ ప్రముఖ అధికారులు, మాజీ కేబినెట్ మంత్రి ప్రమోద్ మహాజన్, ఎంపీ అమర్ సింగ్ ల ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాని తెలుస్తోంది. ఈ లిస్టులో ఇంకా చాలామందే ప్రముఖులున్నట్టు సమాచారం.ఈ ట్యాపింగ్ వ్యవహరంపై రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. దీనిపై కేంద్రం వెంటనే విచారణ చేపట్టాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఓ దిగ్భ్రాంతికరమైన వ్యవహారమని, ప్రైవేట్ సర్వీసు ప్రొవేడర్లు చేసే ఈ చర్యలు దేశ రక్షణకు, భద్రతకు హానికరమని జేడీయూ అగ్రనేత శరద్ యాదవ్ అన్నారు. -
ఇక తెలుగులోనూ పీఎంవో
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన వివరాలతో కొత్త వెబ్సైట్ ప్రారంభమైంది. మొత్తం ఆరు భాషలతో దీనిని రూపొందించారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం దీనిని ప్రారంభించినట్లు అధికార వర్గాల సమాచారం. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పటి నుంచి బెంగాలీ, గుజరాతి, మరాఠీ, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఇక నుంచి పీఎంవో వెబ్ సైట్ అందుబాటులో ఉంటుంది. 'ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయం 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్పీఎంఇండియాడాట్ గవ్డాట్ఇన్ మొత్తం ఆరు ప్రాంతీయ భాషల్లో లభించనుంది' అని ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతీయ భాషలకు చెందినవారికి దగ్గరయ్యేందుకు ప్రధాని చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇది కూడా ఒకటి అంటూ ఈ సందర్భంగా సుష్మా చెప్పారు. -
సోషల్ మీడియాలో ఆ మంత్రులదే హవా!
న్యూఢిల్లీ: ఎక్కువమంది ప్రజలతో సంబంధాలు కొనసాగించడానికి, తమ విధానాలను, విమర్శలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలో ఉన్న బలమైన అస్త్రం సోషల్ మీడియా అని చెప్పొచ్చు. సోషల్ మీడియా వినియోగం విషయంలో మిగిలిన పార్టీలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ ప్రత్యేక శ్రద్థ తీసుకుంటుంది. ఈ విషయం కొందరు కేంద్ర మంత్రులు నిరంతరం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండటం చూస్తేనే అర్థమౌతోంది. మొన్నటికి మొన్న రైల్వే మంత్రి సురేష్ ప్రభు.. ఓ ప్రయాణికురాలు తనకు రైళ్లో ఆపద ఉందని ట్వీట్ చేస్తే వెంటనే స్పందించి అధికారులను అప్రమత్తం చేసిన విషయం ఈ తెలిసిందే. ఇకపోతే సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్‌గా ఉండని మంత్రులపై కూడా పీఎంఓ కార్యాలయం ఓ కన్నేసింది. వీరికి సోషల్ మీడియాను ప్రభావవంతంగా వినియోగించడం ఎలా అనే అంశంపై క్లాసులు పెట్టి మరీ నేర్పిస్తున్నారని తెలిసింది. ట్విట్టర్, ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉండాలని స్వయానా అధినాయకత్వమే కోరుతుండటంతో లీడర్లు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మంత్రుల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హెచ్ఆర్డీ మినిస్టర్ స్మృతీ ఇరానీ, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్, వాణిజ్య మంత్రి నిర్మాలా సీతారామన్, జితేంద్ర సింగ్‌లు కూడా సాధారణ ప్రజానికానికి సైతం సోషల్ మీడియాలో రిప్లైలు ఇస్తూ అందుబాటులో ఉంటున్నారు. ఈ ఆరుగురు మంత్రుల బాటలోనే మిగతా నేతలు కూడా నడవాలని, మంత్రుల రోజువారి సోషల్ మీడియా కార్యకలాపాలను ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఇలాంటి చర్యలతో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడటమే కాకుండా పారదర్శకత సైతం పెరుగుతోందని ఆశిస్తున్నారు. -
ప్రధాని డిగ్రీ వివరాలు ఇవ్వండి: సీఐసీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ డిగ్రీలకు సంబంధించి వివరాల్ని అందించాలంటూ ఢిల్లీ, గుజరాత్ వర్సిటీలతో పాటు ప్రధాని కార్యాలయాన్ని కేంద్ర సమాచార సంఘం(సీఐసీ) శుక్రవారం ఆదేశించింది. డిగ్రీ పూర్తయిన ఏడాది, ఇతర వివరాలు అందిస్తే పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఆయా వర్సిటీలకు వీలువుతుందని సీఐసీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు పీఎంఓను కోరారు. 1978 లో గ్రాడ్యుయేషన్ (ఢిల్లీవర్సిటీ) 1983లో పోస్టు గ్రాడ్యుయేషన్ (గుజరాత్ యూనివర్సిటీ)లకు సంబంధించి నరేంద్ర దామోదర్ మోదీ పేరిట ఉన్న వివరాల్ని పరిశోధించి ఇవ్వాలంటూ ఆయా యూనివర్సిటీల ప్రజా సమాచార విభాగం అధికారులను సమాచార సంఘం కోరింది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ప్రధాని విద్యార్హతల వివరాల్ని కోరినప్పుడు ఇవ్వడం సబబుగా ఉంటుందని తన ఉత్తర్వుల్లో ఆచార్యులు పేర్కొన్నారు. ప్రధాని డిగ్రీలపై కేజ్రీవాల్ నుంచి వచ్చిన వివరణల్నే ఆర్టీఐ దరఖాస్తుగా పరిగిణించిన సీఐసీ ఈ ఆదేశాలు జారీచేసింది. -
'బలవన్మరణాల లెక్కల్లో బంతాట'
అహ్మదాబాద్: గుజరాత్లో రైతు ఆత్మహత్యలపై కేంద్రం కాకి లెక్కలు చెబుతోంది. అటు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న గణాంకాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న గణాంకలకు పొంతన లేకుండా పోతోంది. గుజరాత్లో 2003-2012 మధ్య కేవలం ఒకే ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం ) ప్రకటించింది. కానీ, రాష్ట్ర హోంశాఖ రికార్డుల్లో మాత్రం 413మంది రైతులు పంటనష్టం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు వివరాలు ఉన్నాయి. భరత్ సింగ్ ఝాలా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా ఈ విషయాలు వెలుగు చూశాయి. ఇక, ఈ రెండు సమాధానాలకు భిన్నంగా రాజ్యసభలో కేంద్ర వ్యవసాయశాఖ సహాయక మంత్రి మాత్రం 2013-14 సంవత్సరంలోనే 600మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. అయితే, 2013లో 582మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2014లో 45మంది రైతులు, 555 రైతు కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారని చెప్పారు. కాగా, ఓ పక్క రాష్ట్రంలో వందల సంఖ్యలో రైతులు చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లెక్కలు ఉంటే కేవలం ఒక్క రైతే ఆత్మహత్య చేసుకున్నాడని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ముమ్మాటికీ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడమేనంటూ భరత్ సింగ్ ఝాలా అనే సమాచార హక్కు చట్ట కార్యకర్త అన్నారు. ఇదిలాఉండగా, ఇదే సమాచారం కోసం గుజరాత్‌కు చెందిన మరో కార్యకర్త దరఖాస్తుకోగా 2005-2014 మధ్య 413 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తమ వద్ద వివరాలున్నాయంటూ పోలీసు శాఖ వివరాలు వెల్లడించింది. -
మోదీ దగ్గరున్న నగదు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్ద పెద్దగా ఆస్తులు లేవన్న సంగతి తెలిసిందే. ఎప్పుడో 13 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన ఓ బంగ్లా మాత్రమే ఆయన దగ్గరున్న ప్రధాన ఆస్తి. దీని ధర కాలక్రమంలో 25 రెట్లు పెరిగిపోయి.. దీనివల్లే ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 1.41 కోట్లకు చేరుకుంది. అయినా ప్రధాని మోదీ వ్యక్తిగతంగా తన దగ్గర ఉంచుకున్న నగదు ఎంతో తెలుసా? అక్షరాల రూ. 4,700 మాత్రమే. గడిచిన ఆర్థిక సంవత్సరాంతనికి మోదీ వద్ద నున్న చేతిలో నగదు రూ. 4,700 మాత్రమేనని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఆయన ఆస్తుల వివరాలను పీఎంవో సోమవారం వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో మోదీ వద్ద చేతిలో నగదు 2014 ఆగస్టు 18 నాటికి రూ. 38,700 ఉండగా, ఆర్థిక సంవత్సరం ముగిసిపోయేసరికి రూ. 4,700లకు పడిపోయిందని పీఎంవో వెల్లడించింది. మొత్తానికి ప్రధాని మోదీ స్థిర, చరాస్తులు 2015 మార్చ్ 31 నాటికి కొద్దిగా పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పోల్చుకుంటే రూ. ఒక కోటి 26 లక్షల 12 వేల 288 నుంచి రూ. ఒక కోటి 41 లక్షల 14వేల 893కు పెరిగాయి. మోదీ 2014 మే 26న ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయినా ఆయనకు వ్యక్తిగతంగా ఎలాంటి వాహనాలు లేవు. ఇప్పటికీ మోదీకి గుజరాత్ లోనే బ్యాంకు ఖాతా ఉంది. ఢిల్లీలో బ్యాంకు ఖాతా లేదు. మోదీ వద్ద 45 గ్రాముల బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ గత ఏడాదికాలంలో రూ. 1.21 లక్షల నుంచి రూ. 1.19 లక్షలకు పడిపోయింది. ఆయనకు ఎల్ అండ్ టీ ఇన్ ఫ్రా బాండ్స్ (పన్ను మినహాయింపు ఉంటుంది) లో రూ. 20 వేల విలువైన పెట్టుబడులు, రూ. 5.45 లక్షల జాతీయ పొదుపు సర్టిఫికెట్లు, రూ. 1.99 లక్షల జీవిత బీమా, మొత్తంగా రూ. 41.15 లక్షల చరాస్తులు మోదీ వద్ద ఉన్నాయి. మోదీకి ఎలాంటి అప్పులు, రుణాలు లేవు. ఈ మేరకు మోదీ ఆస్తుల వివరాలను 2016 జనవరి 30వ తేదీ నాటికి పీఎంవో వెబ్ సైట్ లో అప్ డేట్ చేశారు. ఇక స్థిరాస్తి విషయానికొస్తే గాంధీనగర్ లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ మాత్రమే మోదీ వద్ద ఉంది. ఈ నివాస ఆస్తిలో 3,531.45 చదరపు అడుగుల స్థలం మోదీ పేరిట ఉంది. ఇందులో 169.81 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించి ఉంది. దీనిని అప్పట్లో మొత్తంగా రూ. 2,47,208లకు కొనుగోలు చేయగా దాని మార్కెట్ విలువ 25 రెట్లు పెరిగిపోయి రూ. కోటికి చేరింది. -
ఆరెస్సెస్ అనుబంధ సంస్థకు పీఎంవో షాక్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తో అనుబంధమున్న విజ్ఞాన భారతి సంస్థకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి ఊహించని షాక్ ఎదురైంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో తమకు ప్రదానం చేయాల్సిన అవార్డును చివరిక్షణంలో పీఎంవో తిరస్కరించడంపై ఆ సంస్థ నిరసన వ్యక్తంచేస్తోంది. దేశీయ విజ్ఞానాన్ని (సైన్స్) అభివృద్ధి పరిచేందుకు కృషిచేస్తున్న విజ్ఞానభారతి సంస్థకు అనిల్ కకోద్కర్, జీ మాధవన్ నాయర్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 7న ఢిల్లీ ఐఐటీలో భారీస్థాయిలో 'ప్రాక్టికల్ సైన్స్ లెసెన్స్'ను నిర్వహించడం ద్వారా ఈ సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సపాదించింది. గతంలో ఈ రికార్డు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ పేరిట ఉండేది. ఈ ఘనతను గుర్తించిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తమకు అవార్డు ప్రకటించామని, దీనిని అందుకునేందుకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు రావాలని తెలిపిందని విజ్ఞానభారతి ప్రధాన కార్యదర్శి ఏ జయకుమార్ తెలిపారు. కానీ చివరినిమిషంలో ఈ అవార్డుకు పీఎంవో నుంచి అనుమతి రాలేదంటూ తమకు సమాచారమిచ్చారని, ఇది తీవ్ర దిగ్భ్రాంతికరమని, శాస్త్రవేత్తల లోకానికి షాక్ లాంటిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఎంవో తిరస్కారానికి కారణాలేమిటో కూడా తమకు తెలుపలేదని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని ఆయన కోరారు. -
పీఎంఓలోనూ మందకొడితనమే!
విశ్లేషణ పాలనాధికారుల అవినీతి వెల్లడించే అధికారిని బతకనిచ్చే రోజులా ఇవి? ఐఎఫ్ఎస్ పాసై హరియాణాలో అటవీ శాఖలో పని చేస్తున్న సంజీవ్ చతుర్వేది అనే యువ అధికారి ఆ రాష్ర్టంలో అవినీతిపైన వివరంగా నివేదిక ఇచ్చాడు. సహచరులూ, నాయకులూ కూడా అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. దీనిపై చర్యలను అడ్డుకునేందుకు చతుర్వేదిపైనే ఎదురు ఆరోపణలు చేసి పోలీసు దర్యాప్తు ప్రారంభించారు. నాటి కాంగ్రెస్ అటవీ శాఖ మంత్రి జైరాం రమేశ్ దృష్టికి ఈ విషయం వచ్చింది. ఆయన ఇద్దరు ఉన్నతాధికారుల దర్యాప్తు కమిటీని వేశారు. అవినీతిని రూపుమాపేందుకు, చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించిన సంజీవ్ చతుర్వేదిపైన కావాలని కుట్ర చేసి తప్పుడు క్రిమినల్ కేసు పెట్టారని, ముందు ఈ కేసును తొలగించి, అవినీతిపరులపైన వెంటనే సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కమిటీ సూచించింది. సంజీవ్ చతుర్వేదిపైన తప్పుడు కేసు తొలగించక తప్పలేదు. హరియాణా కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు అనుమతించవలసి ఉంటుంది. కానీ వారికి ఇష్టంలేదు. దీనిపైన మరొక న్యాయ అభిప్రాయాన్ని కోరారు, రాష్ట్ర అవినీతిని విచారించే అధికారం కేంద్రా నికి లేదని, కనుక ఆ నివేదిక రాజ్యాంగ వ్యతిరేకమనీ, ఆ నివేదికను పాటించాల్సిన పని లేదని హరియాణా ప్రభుత్వం వాదించింది. దీనికి కేంద్ర నాయకుల సహకారం కూడా ఉందనే విమర్శలున్నాయి. రెండు ప్రభుత్వాలు మారాయి. హరియాణాలో కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చింది. ఈ నేపథ్యంలో సుభాష్ చంద్ర అగర్వాల్ సమాచార హక్కును వినియోగిస్తూ సంజీవ్ చతుర్వేది వ్యవహారంలో చర్యలు ఏం తీసుకున్నారని పర్యావరణ మంత్రిత్వశాఖను ఆర్టీఐ కింద అడిగారు. మొదట ప్రధాని కార్యాలయం ఆయన అడిగిన సమాచారం వ్యక్తిగతమైందని వాదించింది. అయితే మూడో వ్యక్తి అయిన సంజీవ్ చతుర్వేదిని అడిగి అభిప్రాయం తెలుసుకున్నారా అని కమిషన్ ప్రశ్నించింది. లేదన్నారు. కమిషన్ కార్యాలయం టెలిఫోన్లో సంజీవ్‌ను అభి ప్రాయం అడిగితే ఆయన అది తన వ్యక్తిగత సమాచారం కాదని, ఒకవేళ వ్యక్తి గత సమాచారమని అనుకున్నా, దాన్ని వెల్లడించడానికి తమకు అభ్యంతరమేదీ లేదని ప్రజా సమాచార అధికారికి చెప్పారు. ఆ మేరకు అడిగిన ఆ సమాచారాన్ని ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. ఇదివరకు ప్రధాన సమాచార కమిషనర్ శ్రీమతి సుష్మా సింగ్ కూడా ఈ విధంగానే సంజీవ్ చతుర్వేదికి సంబంధించిన వ్యవహారాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆ ఆదేశాలను పునఃసమీక్షిం చాలని పీఎంఓ కోరింది. దాన్ని కమిషన్ తిరస్కరించింది. మళ్లీ అదే డిమాండ్‌తో మరొక పిటిషన్ వేసారు. తాజాగా కమిషన్ ఇచ్చిన ఆదేశాన్ని కూడా పునఃసమీ క్షించాలని కోరారు. ఆ తరువాత మరొక పిటిషన్ వేస్తూ ఇదివరకటి సీఐసీ ఆదేశాన్ని ఇప్పటి సీఐసీ ఆదేశాన్ని కూడా పునఃసమీక్షించాలని కోరారు. దీన్ని సుభాష్ వ్యతిరేకించారు. పునఃసమీక్షించే అధికారాన్ని చట్టం సీఐసీకి ఇవ్వలేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తా విస్తూ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయరాదని వెంటనే ఈ పిటిషన్లు తిరస్కరించాలని కోరారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీ విజయ్ శర్మ ఈ రెండు పిటిషన్లను తిరస్కరించి అభ్యర్థి కోరిన సమా చారాన్ని ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయాన్ని డిసెంబర్ మూడో తేదీన ఒక ఉత్తర్వు ద్వారా ప్రధాన మంత్రి కార్యాలయానికి తెలిపారు. సంజీవ్ చతుర్వేది నివేదనల పైన, ఫిర్యాదులైపైన తీసుకున్న చర్యలేమిటి? ఇద్దరు సభ్యుల కమిటీ సిఫార్సు లను అమలు చేశారా? డీఓపీటీ అధికారులు కోరిన న్యాయనిపుణుల అభిప్రాయాన్ని లీక్ చేసిన వారెవరు? దానిపైన ఏచర్య తీసుకున్నారు? అవినీతి అధికారుల మీద సీబీఐ దర్యాప్తు చేయాలన్న సిఫార్సును అమలు చేయడానికి గత రెండు మూడేళ్లుగా ప్రధానమంత్రి కార్యాలయం గానీ హరియాణా ప్రభుత్వం గానీ ఏం చర్యలు తీసుకున్నది? అని సుభాష్‌చంద్ర అగర్వాల్ అడిగారు. పర్యావరణ మంత్రిత్వశాఖను అడిగిన సమా చారం, డీఓపీటీని అడిగిన సమాచారాన్ని వారు ఇచ్చారని, సీఐసీ ఉత్తర్వులను పాటించారని అగర్వాల్ తెలిపారు. కాని ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఇంకా సమాచారం అందలేదని ఫిర్యాదు చేశారు. ఈ సమాచార అభ్యర్థన రెండో అప్పీలులో చాలా కీలకమైన అంశాలున్నాయన్న సుభాష్ వాదనతో కమి షన్ ఏకీభవించింది. పరిపాలనా పరమైన, రాజ్యాంగ పరమైన అంశాలు ఎన్నో ఇమిడి ఉన్నా యన్నారు. డీఓపీటీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కాగితాలో్ల అనేక వివాదాలు వెల్లడైనాయని చెప్పారు. అవినీతిని అంతం చేయడానికి, కొందరి పైన అవి నీతి ఆరోపణలు వచ్చినందున దర్యాప్తు జరిపించడం ద్వారా తాము అవినీతిని సహించబోమని పాలకులు తెలియజే యవలసిన అవసరం ఉందని వాదించారు. ఇద్దరు ప్రధాన కమిషనర్లు, ఒక సమాచార కమిషనర్ ఆదేశించిన మేరకు సుభాష్ కోరిన సమాచారాన్ని పక్షం రోజుల్లో ఇవ్వాలని కమిషన్ ఆదేశాలు జారీచేసింది. (సుభాష్ చంద్ర అగర్వాల్ వర్సెస్ పర్యావరణ మంత్రిత్వ శాఖ కేసు ఇఐఇఅఅ2015000525లో సీఐసీ డిసెంబర్ 29, 2015న ఇచ్చిన తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్) -
డియర్ మోదీ..ఎనిమిదేళ్ల బాలుడి లెటర్
బెంగళూరుకు చెందిన ఎనిమిదేళ్ళ బాలుడు.. భారత ప్రధాని కార్యాలయానికి ఉత్తరం ఎందుకు రాయాల్సి వచ్చింది? బెంగళూరులోని ఏ పరిస్థితి... అతడిని అంతగా వేధించింది? ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంఘటన.. ఆ చిన్నారి హృదయాన్ని కుదిపేసింది. నిరంతరం రద్దీగా ఉండే వాయువ్య బెంగళూరులో కీలక జంక్షన్‌లోని గ్రిడ్ లాక్ ప్రాంతం... ప్రయాణీకుల సహనానికి పరీక్ష పెడుతుండటం ఆ పసి హృదయం తట్టుకోలేక పోయింది. అందుకు ఏం చేయాలో తీవ్రంగా ఆలోచించిన అభినవ్ చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. దేశ ప్రధాని మోదీ కార్యాలయానికి విషయాన్ని తెలియజేయడం ఒక్కటే మార్గం అనుకున్నాడు. బెంగళూరులోని నేషనల్ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న అభినవ్.. ప్రతిరోజూ స్కూలుకు మూడు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. బెంగళూరు విద్యారణ్యపుర లోని దొడ్డబొమ్మసంద్రలో అభినవ్ కుటుంబం నివసిస్తుంది. అయితే కేవలం మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు చేరేందుకు ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల సమయం పడుతోంది. అవుటర్ రింగ్ రోడ్డు దగ్గరలోని, గోరెగుంటెపాల్య జంక్షన్, రైల్వే క్రాసింగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్.. ట్రాఫిక్ ఇబ్బందులకు కారణంగా మారింది. సమస్యను ప్రతిరోజూ కళ్ళారా చూస్తున్న అభినవ్.. పరిష్కారం కోసం పీఎం కార్యాలయానికి ఉత్తరం రాశాడు. అయితే అభినవ్ ఉత్తరానికి పీఎంవో కార్యాలయం వెంటనే స్పందించింది. బెంగళూరులో సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖను కోరింది. రక్షణ అధికారుల ఆంక్షల వల్ల ప్రాజెక్టు నిర్మాణం తీవ్ర ఆలస్యం అవుతోంది. 'ట్రాఫిక్ సమస్య ఒక్క ప్రజారోగ్యానికి సంబంధించినదే కాదు, నా చదువును కూడ ప్రభావితం చేస్తోంది.' అంటూ అభినవ్ రాసిన ఉత్తరం... ఇప్పుడు బెంగళూరు లోని ప్రజా సమస్యను దేశ ప్రధాని దృష్టికి చేర్చింది. -
మోదీ ఆఫీసుకు మూడో తరగతి విద్యార్థి లేఖ
అక్కడ ఓ ఫ్లైఓవర్ పనులు చాలాకాలంగా సా...గుతున్నాయి. అటు వైపు రాకపోకలు సాగడం లేదు. ఈ సమస్యతో చాలా కాలంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎవరూ ఏమీ చేయలేదు. మూడో తరగతి చదువుతున్న అభినవ్ (8) అనే కుర్రాడికి ఇది ఇబ్బందిగా అనిపించింది. దాంతో వెంటనే బెంగళూరు వాయవ్య ప్రాంతంలో ఉన్న ఈ సమస్య గురించి, అక్కడి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రధానమంత్రి కార్యాలయానికి వెంటనే ఒక లేఖ రాశాడు. అతడి ఇంటి నుంచి యశ్వంత్‌పూర్‌లో ఉన్న స్కూలుకు 3 కిలోమీటర్ల దూరమే అయినా, వెళ్లడానికి 45 నిమిషాలు పడుతోంది. అక్కడ రైల్వేక్రాసింగ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఈ విషయాన్ని అతడు తన ఈమెయిల్లో వివరంగా రాశాడు. ఈ ఫ్లై ఓవర్ పనులు ఆగిపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు తన చదువు కూడా దెబ్బతింటోందని అతడు ఆ లేఖలో రాశాడు. దాంతో ప్రధానమంత్రి కార్యాలయం వెంటనే రైల్వేశాఖకు ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా సూచించింది. -
'ఆ పరిస్థితిని ఎదుర్కొనే సత్తా ఉంది'
న్యూఢిల్లీ: పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకటించింది. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సత్తా భారత ప్రభుత్వానికి ఉందని పీఎంఓ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో ఉగ్రవాదులు దాడికి తెగబడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. హోంమంత్రిత్వ శాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పారు. ఇటువంటి దాడులను తిప్పికొట్టగల సత్తా తమకు ఉందని పునరుద్ఘాటించారు. -
మంత్రుల కోసం విమానాలు ఆపారా?
రిజిజు, ఫడ్నవీస్ కోసం ఎయిరిండియా విమానాలు ఆపినట్టు ఆరోపణలు న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరేన్ రిజిజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కోసం ఎయిరిండియా విమానాలను నిలిపేసినట్టు ఆరోపణలు రావడం వివాదాస్పదమైంది. మంత్రుల కోసం విమానాలను ఆపేసి ప్రయాణికులను ఇబ్బం దుల పాలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలపై నివేదిక ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) గురువారం పౌర విమానయాన శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఘటనలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని పౌరవిమానయాన శాఖ ఎయిరిండియాను ఆదేశించింది. ఎయిరిండియా నుంచి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని పౌరవిమానయాన కార్యదర్శి ఆర్ఎన్ చౌబే తెలిపారు. జూన్ 24న లేహ్ నుంచి ఢిల్లీకి వచ్చే ఎయిరిండియా విమానంలో రిజిజు ప్రయాణించారు. అయితే రిజిజు, జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్, మరో సహాయకుని కోసం విమానంలో ఉన్న చిన్నారితో పాటు ముగ్గురు ప్రయాణికులను దించేశారని, దీని వల్ల విమానం గంట ఆలస్యమైందని వార్తలు వెలువడ్డాయి. ఇక జూన్ 29న ముంబై నుంచి అమెరికాకు వెళ్లే ఎయిరిండియా విమానం మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సహాయకుడు కాలంచెల్లిన వీసాను తీసుకురావడంతో అసలు వీసాను తీసుకువచ్చే వరకూ విమానాన్ని నిలిపేశారని మీడియాలో వార్తలొచ్చాయి. క్షమాపణ చెప్పిన రిజిజు, అశోక్‌గజపతి తమ వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగడంపై కేంద్రమంత్రి కిరేన్ రిజిజు క్షమాపణ చెప్పారు. అయితే తమ గురించి కొందరు ప్రయాణికులను విమానం నుంచి దించేశారనే విషయం తనకు తెలియదన్నారు. కాగా, ఎయిరిండియా విమానం ఆలస్యం కావడానికి తాను కారణం కాదని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు. -
సమాచారం లేదు!
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కారు తమ ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రసార మాధ్యమాల ద్వారా ఓవైపు ఏకరువు పెడుతుంటే మరోవైపు ప్రధాని కార్యాలయం (పీఎంవో) మాత్రం దీనిపై తమ వద్ద ఎటువంటి సమాచారం లేదంటూ చెప్పుకొచ్చింది. మోదీ ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన 20 ముఖ్యమైన విజయాలను తెలియజేయాలంటూ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన ఓ దరఖాస్తుకు పీఎంవో ఈ మేరకు బదులిచ్చింది. ఆర్టీఐ కింద కోరిన సంబంధిత సమాచారం ఒకటికన్నా ఎక్కువ ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్నందున ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 6 (3) ప్రకారం దాన్ని ఇతర శాఖలకు బదిలీ చేయట్లేదని పీఎంవోలోని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐవో) అంబుజ్ శర్మ ఆర్టీఐ దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. ఆర్టీఐ అమలు అధ్యయనంపై ఫెలోషిప్ దేశవ్యాప్తంగా ప్రత్యేకించి మారుమూల ప్రాంతాల్లో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలవుతున్న తీరుపై అధ్యయనం చేసేందుకు జర్నలిజం, ఎన్జీవో రంగాలకు చెందిన వారి సేవలను వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం మూడు నెలల ఫెలోషిప్‌ను ప్రవేశపెట్టనుంది. 25 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వయసుగల జర్నలిస్టులు, ఆర్టీఐకి సంబంధించిన పౌర సమాజ సంఘాల సభ్యులు, పరిశోధకులు, ఆర్టీఐ శిక్షకులెవరైనా ఈ ఆర్టీఐ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో న్యాయవాద నేపథ్యం ఉన్న వారికే ఆర్టీఐ ఫెలోషిప్లను పరిమితం చేసేవారు. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారు ఆర్టీఐ నిబంధనల అమలు, సమాచార వెల్లడి మార్గదర్శకాలు, ఒక్కో రంగంలో అమలవుతున్న అత్యుత్తమ ఆచరణ విధానాల గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి మొత్తం రూ. 2 లక్షల స్టైపెండ్ అందుతుంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ (డీవోపీటీ)కు దరఖాస్తు పంపాల్సిన చివరి తేదీ జూన్ 22. -
మర్యాద కోసం పిలిస్తే.. రాద్ధాంతమా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలవడం కేవలం మర్యాదపూర్వకమేనని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన ఒకరోజు తర్వాత పీఎంఓ నుంచి ఈ ప్రకటన వచ్చింది. మాజీ ప్రధానమంత్రులు చాలామందిని ఈ భేటీకి పిలిచామని పీఎంఓ అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడకు కూడా ఆహ్వానం వెల్లిందని, అయితే ఆయన బెంగళూరులో ఓ సమావేశానికి హాజరు కావాల్సి ఉండటంతో రాలేకపోతున్నట్లు చెప్పారని అన్నారు. దాంతో ప్రధాని ముఖ్యకార్యదర్శి నృపేంద్ర మిశ్రా స్వయంగా దేవెగౌడకు ఫోన్ చేసి.. ఆయనకు ఖాళీ ఉన్నప్పుడు మోదీని కలవాల్సిందిగా ఆహ్వానించారు. ఏడాది పాలన పూర్తయిన ఒకరోజు తర్వాత.. మే 27న ప్రధాని నరేంద్రమోదీ తన అధికారిక నివాసం నెం.7 రేస్‌కోర్సు రోడ్డు నివాసంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ విమర్శించడం.. దాన్ని బీజేపీ శ్రేణులు కూడా తిప్పికొట్టడం వెంటవెంటనే జరిగిపోయాయి. -
ప్రతీది వారికి చెప్పాల్సినవసరం లేదు : పీడీపీ
న్యూఢిల్లీ: శాంతిభద్రతలనేవి రాష్ట్రానికి సంబంధించిన విషయం అని, ప్రతీది ప్రధాని కార్యాలయానికి చెప్పాల్సిన అవసరం లేదని జమ్మూకశ్మీర్‌లోని అధికార పార్టీ పీడీపీ పేర్కొంది. ప్రత్యేక కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, హుర్రియత్ నేత మసరత్ అలాం విడుదలపై అధికార పీడీపీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఇదే విషయంపై ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో వివరణ ఇస్తూ అలాంను పీడీపీ ప్రభుత్వం విడుదల చేసిందని, ఆ విషయంలో కేంద్రాన్ని సంప్రదించలేదని చెప్పారు. జమ్మూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం దేశానికి వ్యతిరేకమైన నిర్ణయమని, కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో పట్టుబట్టడంతో ప్రధాని ఈ వివరణ ఇచ్చారు. దేశ సమైక్యత తమకు ముఖ్యమని దీనిపై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో స్పందించిన పీడీపీ ప్రధాని వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించింది. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ-పీడీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
పీఎంఓ యాప్‌పై సలహాల కోసం పోటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) కోసం ఓ మొబైల్ ఫోన్ యాప్‌ను అభివృద్ధి పరచేందుకు ప్రజల నుంచి సలహాలు స్వీకరించడానికి ప్రభుత్వం ఆన్లైన్ సెర్చింజన్ గూగుల్‌తో కలసి బుధవారం ఓ పోటీ ప్రారంభించింది. అప్లికేషన్ నిర్మాణం, అందులో ఏం ఉండాలన్నదానిపై సూచనల కోసం దీన్ని నిర్వహిస్తున్నట్లు పోటీ ప్రారంభించిన సమాచార, సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రెండు నెలల్లో ఈ యాప్ రూపొందుతుందన్నారు. ‘మైగవ్’ వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకున్న వారందరూ ఈ పోటీకి అర్హులు. -
నేతాజీ రహస్య ఫైళ్లను బహిర్గతపరిచే విశిష్టాధికారం ప్రధానికి లేదు: పీఎంఓ
కోల్‌కతా: స్వాతంత్య్ర పోరాటయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుమానాస్పదరీతిలో కనిపించకుండాపోయిన ఘటనకు సంబంధించి రహస్యంగా ఉన్న ఫైళ్లను బహిర్గతపరిచే అధికారం ప్రధానమంత్రికి లేదని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) స్పష్టంచేసింది. ప్రజా రికార్డుల నిబంధనలు-1997ప్రకారం రహస్యంగా ఉన్న రికార్డులను బట్టబయలుచేసే ఎలాంటి అధికారం ప్రధానికి దఖలుపడలేదని పేర్కొంది. ఈమేరకు కేరళకు చెందిన శ్రీజిత్ పణికర్ అనే ఐటీ నిపుణుడు సమాచారహక్కు చట్టం కింద దాఖలుచేసిన దరఖాస్తుకు పీఎంఓ బదులిచ్చింది. రహస్య ఫైళ్లను వర్గీకృత జాబితా నుంచి తొలగించి, వాటిని నేషనల్ ఆర్కైవ్స్‌కు తరలించే విశిష్టాధికారం ప్రధానికి ఉందా అని శ్రీజిత్ తన దరఖాస్తులో ప్రశ్నించారు. నేతాజీకి సంబంధించి మొత్తం 41 ఫైళ్లు ఉండగా వాటిలో 5 ఫైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1) రెడ్‌విత్ 8(2) ప్రకారం బహిర్గతం చేయలేమని పీఎంఓ వెల్లడించింది. -
ఆ అధికారాలు ప్రధానికి కూడా లేవు
స్వాతంత్ర పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ అదృశ్య ఘటనకు సంబంధించిన ఫైళ్లలోని ఎలాంటి సమాచారం ఇవ్వలేమని ప్రధాని మంత్రి కార్యాలయం తేల్చిచెప్పింది. ప్రధానికి కూడా దానిని బహిర్గతం చేసే అధికారాలు లేవని సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సమాధాన మిచ్చింది. కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఐటీ ఉద్యోగి శ్రీజిత్ పనికార్ 'మిషన్ నేతాజీ' పేరిట జరుగుతున్న పరిశోధన బృంద సభ్యుడు. ఈయన నేతాజీ అదృశ్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించే ప్రత్యేక అధికారాలు ప్రధానికి ఉన్నాయా అని సదరు దరఖాస్తులో ప్రశ్నించారు. ఆ దస్తావేజుల నఖలు తమకు పంపించాలని కూడా కోరారు. ఈ వివరాలపై మొత్తం ఎన్ని ఫైల్స్ ఉన్నాయని ప్రశ్నించారు. అయితే, మొత్తం 41 ఉన్నాయని సెక్షన్ 8(1) (a), 8(2) ఆర్టీఐ 2005 చట్టం ప్రకారం అందులోని ఐదు ఫైళ్లలోని వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని పేర్కొంది. పబ్లిక్ రికార్డ్స్ నిబంధనలు -1997 కూడా కొన్ని ఫైల్స్ వివరాలను యథేచ్చగా వెల్లడించే అధికారం ప్రధానికి ఇవ్వలేదని సమాధానమిచ్చింది. గతంలో ఢిల్లీకి చెందిన ఆర్టీఐ ఉద్యమకారుడు సుభాష్ అగర్వాల్ దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి సమాధానమిచ్చింది. పొరుగుదేశాలతో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉన్నందున వాటి వివరాలు వెల్లడించలేమని పేర్కొంది. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, పొరుగు దేశాలతో ఉన్న శాస్త్రీయ,సాంకేతిక, ఆర్థిక సంబంధాల దృష్ట్యా వాటిని బహిర్గతం చేయడం సాధ్యం కాదని పీఎంవో తెలిపింది. -
వరద బాధితులకు పీఎంవో విరాళం
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంవో) సిబ్బంది, అధికారులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఒక రోజు వేతనాన్ని స్వచ్ఛందంగా ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి అప్పగించాలని సిబ్బంది, అధికారులు నిర్ణయించినట్టు పీఎంవో గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆరు దశాబ్దాల కాలంలో ఎన్నడూ కనివినీ ఎరుగనిరీతిలో జమ్మూకాశ్మీర్‌ను వరదలు ముంచెత్తడంతో ఇప్పటి వరకూ 215 మంది మృత్యువాతపడగా.. లక్షలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే. -
జమ్మూ వరద బాధితులకు పీఎంఓ విరాళం!
న్యూఢిల్లీ: జమ్మూ,కాశ్మీర్ వరద బాధితులకు ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది, అధికారులు ఒకరోజు జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఒకరోజు జీతాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయనిధికి అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న జమ్మూ,కాశ్మీర్ ప్రజలకు తాము తోడుగా ఉన్నామనే భావన, భరోసాను కల్పించడానికి సహాయం అందించామని పీఎంఓ ఓ ప్రకటనలో వెల్లడించింది. జమ్మూ వరద బాధితులకు వెంటనే నిత్యవసర వస్తువులను, నీరు, ఇతర సహాయాన్ని అందించాలని అధికారులును ప్రధాని మోడీ ఆదేశించారు. జమ్మూ,కాశ్మీర్ వరదల్లో 200 మంది చనిపోగా, 82 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
అధికారుల విదేశీయానం కఠినతరం
న్యూఢిల్లీ: ఉన్నత స్థాయి అధికారులు అధికారి విదేశీ పర్యటనలకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను కేంద్ర సచివాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేశాయి. ఈ నిబంధనల మేరకు ఉన్నతాధికారుల విదేశీ పర్యటనల ప్రతిపాదనలను ప్రధాని కార్యాలయం (పీఎంఓ), కార్యదర్శుల స్క్రీనింగ్ కమిటీ పరిశీలించవలసి ఉంటుంంది. వారి విదేశీ పర్యటనలకు పీఎంఓ, విదేశాంగ మంత్రిత్వశాఖ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖల అనుమతి తప్పనిసరి అవసరం. ప్రతిపాదిత పర్యటనల వివరాలు ఆయా మంత్రిత్వశాఖల వెబ్సైట్లలో తప్పని సరిగా పొందుపరచాలని పీఎంఓ స్పష్టం చేసింది. -
నరేంద్ర మోడీ చూస్తున్నాడు జాగ్రత్త!!
ప్రధానమంత్రి కాగానే నరేంద్ర మోడీ సోషల్ మీడియాపై దృష్టి పెట్టారు. మంత్రులందరూ ట్విట్టర్, ఫేస్ బుక్ లను వాడాలని ఆయన ఆదేశించారు. అంతే కాదు. సామాన్యులకు అర్థం అయ్యేలా హిందీని వాడాలని చెప్పారు. మరో అడుగు ముందుకేసి ప్రతి 8 గంటలకు ఒక సారి సోషల్ మీడియా పోకడలపై రిపోర్టులు ఇవ్వాలని తన కార్యాలయ సిబ్బందిని ఆయన అదేశించారు. దీని కోసం 20 మందితో ఒక టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్ ఏ మంత్రులు ఏం ట్వీట్ చేశారు, ఫేస్ బుక్ లో ఏం అప్ లోడ్ చేశారు, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు, ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఏం ట్రెండ్ అవుతున్నాయి వంటి అంశాలపై విశ్లేషణలు అందించాలని మోడీ ఆదేశించారు. దీని ద్వారా ప్రజల ఆలోచన, అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వీలుంటుంది. దీంతో తన సిబ్బందిలో ఎవరేం చేస్తున్నారో నరేంద్ర మోడీ, మంత్రివర్గ సహచరులు ఏం చేస్తున్నారో మోడీ తెలుసుకుంటారు. తన కొత్త ఎంపీలకు కూడా సోషల్ మీడియా విషయంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పేందుకు ఒక వర్క్ షాప్ ను త్వరలో మోడీ నిర్వహించబోతున్నారు. -
సివిల్స్ సర్వీస్ విజేతకు మోడీ అభినందన!
Congratulated Rajesh Kumar, son of a PMO staff member, on clearing civil services exam. A proud accomplishment! pic.twitter.com/wLlDEe4FQ7— Narendra Modi (@narendramodi) June 25, 2014 న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడైన విద్యార్ధి రాజేశ్ కుమార్ ను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో సేవలందిస్తున్న ఓ ఉద్యోగి కుమారుడు సివిల్స్ పరీక్షలో ఉత్తమ ర్యాంకును సంపాదించుకున్నారు. బుధవారం సౌత్ బ్లాక్ లోని ప్రధాని కార్యాలయంలో మోడీని రాజేశ్ కుమార్ కలుసుకున్నారు. గొప్ప ఘనతను సాధించావని, యువతకు సూర్తిని అందించేలా సేవలందించాలని రాజేశ్ కుమార్ ను అభినందించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్ లో ఓ సందేశంతోపాటు ఫోటోను పోస్ట్ చేసింది. -
ప్రధాని మోడీని కలిసిన అమీర్ ఖాన్!
Noted film personality Shri @aamir_khan met PM @narendramodi today pic.twitter.com/6DQpthVnAf — PMO India (@PMOIndia) June 23, 2014 ప్రధాని నరేంద్రమోడీని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ దేశరాజధానిలో కలుసుకున్నారు. ప్రధాని పదవిని చేపట్టిన మోడీని అమీర్ కలవడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీని బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు జై హో సినిమా ప్రమోషన్ కోసం ఆహ్మదాబాద్ వెళ్లిన సల్మాన్ ఖాన్ .. మోడీని కలుసుకున్న సంగతి తెలిసిందే. మోడీని సల్మాన్ కలుసుకోవడం వివాదస్పదమైంది. అయితే మోడీని మర్యాదపూర్వకంగానే అమీర్ కలుసుకున్నట్టు తెలుస్తోంది. మోడీ, అమీర్ ల భేటి వెనుక వివరాలు వెల్లడికాలేదు కాని.. ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం మోడీ, అమీర్ ఫోటోను సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేసింది. Follow @sakshinews -
పీఎంఓలో ఓ రౌండు అలా తిరిగొచ్చా!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం ఉదయాన్నే తన కార్యాలయం (పీఎంఓ)లో అలా.. ఓసారి తిరిగారు. అన్ని విభాగాలను దగ్గరుండి పరిశీలించారు. అక్కడున్న అధికారులతో మాటలు కలిపి విషయాలు తెలుసుకున్నారు. అలాగే, అక్కడున్న సదుపాయాల గురించి అధికారులను అడిగారు. అంతే.. వెంటనే ఆ ఫొటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసేశారు. ''ఉదయాన్నే సౌత్ బ్లాక్‌కు వెళ్లి, పీఎంఓలో ఓ రౌండు తిరిగొచ్చా'' అని అందులో పేర్కొన్నారు. పసుపు పచ్చటి కుర్తా, తెల్లటి చుడీదార్ ధరించిన ఆయన అధికారులతో మాట్లాడుతున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాగా, మరోవైపు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ముచ్చటించారు. Took a round of the PMO on reaching South Block this morning pic.twitter.com/aXDDMjh4K6 — Narendra Modi (@narendramodi) May 29, 2014 -
ఆర్టికల్ 370 రద్దుపై విస్తృత చర్చ!
* వివాదానికి తెరతీసిన పీఎంఓ మంత్రి వ్యాఖ్యలు * మండిపడ్డ ఒమర్, పీడీపీ * వివరణ ప్రకటన విడుదల చేసిన జితేంద్ర సింగ్ న్యూఢిల్లీ/శ్రీనగర్: ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన కార్యాలయూనికి (పీఎంఓ) చెందిన ఓ మంత్రి వివాదానికి తెరతీశారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని అధికరణం 370 రద్దుకు సంబంధించి పీఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రతిపక్ష పీడీపీ ఆగ్రహానికి కారణమయ్యూయి. మంగళవారం బాధ్యతలు స్వీకరించిన సింగ్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దుకు అంగీకరించని వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ అంశంలోని మంచిచెడులపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు జమ్మూకాశ్మీర్‌లోని ప్రతి ఒక్కరినీ సంప్రదించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ అంశంపై బీజేపీ పూర్తిగా వృత్తిపరమైన నైపుణ్యంతో వ్యవహరిస్తోందని, కాశ్మీర్ లోయలో సమావేశాలు నిర్వహిస్తోందని వివరించారు. కొందరికి నచ్చజెప్పడంలో (ఆర్టికల్ 370 రద్దుపై) సఫలీకృతులమయ్యూమని కూడా చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. రాష్ట్రానికి, మిగతా దేశానికి మధ్య ఉన్న ఏకైక రాజ్యాంగపరమైన సంబంధం ఆర్టికల్ 370 ఒక్కటేనని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘రాసి పెట్టుకోండి.. అంతేకాదు ఈ ట్వీట్‌ను సేవ్ కూడా చేసుకోండి. మోడీ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోయినా.. 370 ఉన్నంత కాలం కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉంటుంది. అది లేకపోతే ఉండదు ’ అంటూ తీవ్రంగా స్పందించారు. ఆర్టికల్ 370 రద్దుపై వ్యాఖ్యలు చేసిన జితేంద్ర సింగ్‌కు ప్రధాని, బీజేపీ నాయకత్వం కళ్లెం వేయూలని పీడీపీ సూచించింది. వివాదం నేపథ్యంలో మంగళవారం రాత్రి పొద్దుపోయాక మంత్రి మరో ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యలను మీడియూ తప్పుగా చిత్రీకరించిందన్నారు. ప్రధానమంత్రిని ఉటంకిస్తూ ఆర్టికల్ 370పై తానెలాంటి వ్యాఖ్యలూ చేయలేదని వివరణ ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వం ఇదంత ప్రాధాన్యత లేని వివాదంగా పేర్కొనేందుకు ప్రయత్నించింది. ‘దీనిపై మేమో నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికల ప్రచారంలో మేమేం చెప్పామో మీరు చూశారు. ప్రభుత్వం దీనిపై నిర్మాణాత్మక దృక్పథాన్ని అనుసరిస్తుంది..’ అని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. -
పీఎంవో సైట్ లో తొలి సందేశం
సుస్థిర, సుపరిపాలన అందిస్తానని దేశ ప్రజలకు మోడీ హామీ తనకు ప్రజల ఆశీస్సులు, సహకారం కావాలని వినతి న్యూఢిల్లీ: 15వ భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) వెబ్సైట్ ద్వారా దేశప్రజలకు తొలి సందేశం ఇచ్చారు. మార్పును ఆశించి తనకు పట్టం కట్టిన దేశ ప్రజలకు సుస్థిర, సుపరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తనకు ప్రజల మద్దతు, ఆశీస్సులు, సహకారం కావాలని ఆకాంక్షించారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని అత్యున్నత దశకు తీసుకెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేశాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయడం ద్వారా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలిచి ప్రపంచ శాంతికి, అభివృద్ధికి పాటుపడేలా చేస్తామన్నారు. పీఎంవో వెబ్సైట్ తనకు, ప్రజలకు మధ్య ప్రత్యక్ష సంబంధాల మాద్యమంగా పని చేస్తుందని ఆయన ఆకాంక్షించారు. టెక్నాలజీపై తనకు అపారమైన నమ్మకం ఉందని, సోషల్ మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలతో అభిప్రాయాలు పంచుకోవచ్చని చెప్పారు. దీని ద్వారా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేపట్టబోయే వినూత్న కార్యక్రమాల గురించి, తన పర్యటనలు, ప్రభుత్వ పథకాల గురించి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని వివరించారు. కాగా, మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని సెకన్లలోనే పీఎంవో వెబ్సైట్ రూపు రేఖలు మారిపోయాయి. మోడీ తొలి సందేశం, ఆయనకు సంబంధించిన చిత్రాలతో పీఎంవో వెబ్సైట్ కొత్త సొబగులు అద్దుకుంది. అలాగే కొన్ని కొత్త సెక్షన్లను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో మోడీ వ్యక్తిగత జీవితం ఒక విభాగంగా ఉంది. మోడీ ప్రొఫైల్‌ను కూడా పొందుపరిచారు. ఇందులో మోడీని అంకితభావం, క్రియాశీలకత, ధృడచిత్తం కలిగిన నాయకునిగా.. వంద కోట్ల మంది ప్రజల ఆశా రేఖగా అభివర్ణించడం గమనార్హం. అలాగే ఆర్ఎస్ఎస్ వలంటీర్ స్థాయి నుంచి బీజేపీ నేతగా మోడీ ఎదిగిన తీరును సవివరంగా అందించారు. -
ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం
-
ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. దాంతో ఆరుఅగ్నిమాపక శకటాలు హుటాహుటిన పీఎంఓకు చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. ఆ ఘటనపై సమాచారం అందుకున్న న్యూఢిల్లీ నగర ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులంతా అగమేఘాల మీద సౌత్ బ్లాక్‌లోని పీఎంఓకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే మంటలు అదుపులోకి వచ్చాయిని.... అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పీఎంఓ అగ్నిప్రమాదంపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
'పీఎంవోలో మన్మోహన్ పాత్రను పరిశీలించుకోవాలి'
న్యూఢిల్లీ: ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంవో) లో దేశ ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర ఏమిటో ఒక్కసారి ఆయన పునఃపరిశీలించుకోవాలని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ విమర్శించారు.ప్రధాని కార్యాలయంలో అతనొక నిమిత్త మాత్రుడేనేనని మన్మోహన్ మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకంలో పేర్కొనడంతో బీజేపీ తన మాటలకు మరింత పదునుపెట్టింది. ప్రధాని కార్యాలయంలో ప్రభుత్వం యొక్క ప్రభావం కంటే ప్రధాన కార్యదర్శి పాత్ర ఎక్కువగా కన్పిస్తుంని జైట్లీ తన బ్లాగులో పోస్ట్ చేశారు. గత రెండు రోజులుగా ఈ పుస్తకాన్ని చదువుతున్నానని ఆయన తెలిపారు. ప్రధాని అధికారాలను ఏవిధంగా కుంచించారో ఈ పుస్తకంలో వెల్లడించారని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ పై సంజయ్ బారు రాసిన పుస్తకంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని బీజేపీ అభిప్రాయపడుతోంది. ఈ పుస్తకంలో ఉన్న చాలా విషయాలు పీఎంవో కార్యాలయంలో ప్రధాని పాత్రపై అనేక సందేహాలకు దారితీస్తోందని తెలిపింది. ‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్- ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్’ పేరుతో బారు రాసిన పుస్తకంపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. -
ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు, వివాదంలో సంజయ్ బారు
న్యూఢిల్లీ: ప్రధాని మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారువా వివాదంలో చిక్కుకున్నారు. పుస్తక రచనలో వ్యక్తిగత ఆర్థిక లాభం కోసం తన పదవిని దుర్వినియోగం చేశారని ప్రధాని మంత్రిత్వశాఖ ఆరోపించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ ను కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మగా చేసిందని బారువా పుస్తకంలో పేర్కొనడం వివాదస్పదమైంది. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్ మేకింగ్ మన్మోహన్ సింగ్' అనే పుస్తకంలోని కొంత భాగం పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. వ్యక్తిగత స్వార్ధం కోసం తన హోదాను వాడుకోవడంపై ప్రధాని కార్యాలయం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. -
ప్రధాని రాజీనామా వార్తలు నిరాధారం-PMO
-
ప్రధాని రాజీనామా వార్తలు నిరాధారం
-
ప్రధాని రాజీనామా వార్తలు నిరాధారం
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారని వచ్చిన వార్తలు నిరాధారామని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మరోవైపు మూడోసారి ప్రధాని పదవి రేసులో తను లేనని ప్రకటించేందుకు మన్మోహన్ సింగ్ కొత్త ఏడాది, వచ్చేనెల 3వతేదీ ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారని తెలిసింది. 2014 ఎన్నికలకు రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు ప్రధాని మార్గం సుగమం చేస్తారు. అటు జనవరి 17న ఏఐసీసీ సమావేశాలు జరగనుండటంతో ప్రధాని అభ్యర్ధిని ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం కూడా కాంగ్రెస్ తమ ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇంజనీర్ అంకమ్మరావు కథ సుఖాంతమైయ్యింది. ఈ తెల్లవారుజామున... నాలుగు గంటలకు బోడో తీవ్రవాదులు ఆయన్ని విడుదల చేశారు. తాను క్షేమంగా వున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు అంకమ్మరావు. ఈ నెల 22న అసోంలోని ఆమ్గురిలో అంకమ్మరావును బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురానికి చెందిన అంకమ్మరావు అస్సోంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అంకమ్మరావు విడుదలతో ఆయన కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది. -
ప్రధాని తప్పేం లేదు!
న్యూఢిల్లీ: బొగ్గు వివాదంపై ప్రధాని కార్యాలయం(పీఎంవో) ఎట్టకేలకు నోరు విప్పింది. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి మసి అంటలేదని, గనుల కేటాయింపంతా సవ్యంగానే సాగిందని స్పష్టంచేసింది. ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన హిందాల్కో కంపెనీకి ఒడిశాలోని తలాబిరా గనిని కేటాయించడంలో ప్రధాని మన్మోహన్సింగ్ నిజాయితీగా, నిష్పక్షికంగా వ్యవహరించారంది. ఈ మేరకు 2005లో జరిగిన ఈ కేటాయింపు పరిణామాలను వివరిస్తూ శనివారం ప్రకటన విడుదల చేసింది. తలాబిరా గనికి సంబంధించి అధికారులు తన ముందు ఉంచిన వివరాలన్నింటినీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే బొగ్గు శాఖ మంత్రి హోదాలో ప్రధాని తుది నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. హిందాల్కోకు గని కట్టబెట్టేందుకు ప్రభుత్వ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌ను పక్కనపెట్టారన్న ఆరోపణలను తోసిపుచ్చింది. కేటాయింపు పత్రాలు అందుబాటులో ఉన్నందున సీబీఐ స్వేచ్ఛగా దర్యాప్తు చేసుకోవచ్చని పేర్కొంది. తలాబిరా గని కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ ఆదిత్య బిర్లా చైర్మన్‌పై కుమారమంగళం బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌పై సీబీఐ కేసు పెట్టడం తెలిసిందే. తనది తప్పయితే ప్రధానిదీ తప్పే అవుతుందని పరేఖ్ ఇటీవల వ్యాఖ్యానించారు. నిర్ణయం ఎందుకు మారిందంటే బొగ్గు గని కేటాయింపుపై నిర్ణయం మారడంపై పీఎంఓ వివరణ ఇచ్చింది. బొగ్గు శాఖ నుంచి పీఎంఓకు వినతి అందిందని, దీంతో మొదట తీసుకున్న నిర్ణయం మారిందని వివరించింది. ప్రకటనలోని వివరాలు.. తలాబిరా-2, 3 గనులను హిందాల్కోకు కేటాయించాలని కోరుతూ 2005, మేలో కుమారమంగళం బిర్లా నుంచి పీఎంఓకు లేఖ అందింది. దీన్ని పరిశీలించి, నివేదిక పంపాలని బొగ్గు శాఖ అధికారులకు పీఎంఓ సూచించింది. ఆ గనులను కేటాయించాలంటూ బిర్లా నుంచి జూన్‌లో పీఎంవోకు మరో లేఖ వచ్చింది. దీన్నీ పీఎంవో బొగ్గు శాఖకు పంపింది. తర్వాత తలాబిరా-2 కోసం మూడు సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ నైవేలీకి గని కేటాయించాలని నిర్ణయించిందంటూ బొగ్గుశాఖ అధికారులు పీఎంవోకు ఫైలు పంపారు. అందులో హిందాల్కోకు గని కేటాయించొద్దంటూ బొగ్గు శాఖ మూడు కారణాలను పేర్కొంది. తలాబిరా-2ను హిందాల్కోకే కేటాయించాలని కోరుతూ 2005, ఆగస్టులో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధానికి లేఖ రాశారు. విద్యుత్ ప్లాంట్ల కంటే అల్యూమినియం ప్రాజెక్టుల వల్లే ఎక్కువ సంపద సృష్టి జరుగుతుందని, హిందాల్కోకు గని ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ లేఖ నేపథ్యంలో బొగ్గుశాఖ నిర్ణయాన్ని మార్చుకుంది. గనులను నెవైలీ కార్పొరేషన్‌కు కాకుండా హిందాల్కోకు కేటాయించాలనిసహేతుక కారణాలతో పీఎంవోకు చెప్పింది. దీంతో హిందాల్కోకు గనుల కేటాయింపుపై ప్రధాని తుది నిర్ణయం తీసుకున్నారని వివరించింది. దర్యాప్తును కాంగ్రెస్ నీరుగారుస్తోంది: బీజేపీ ఈ స్కాంపై సీబీఐ దర్యాప్తును నీరుగార్చేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని, ప్రధానిపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. గనుల కేటాయింపులో అధికారుల నిర్ణయానికి ప్రధాని ఎలా బాధ్యుడవుతారని కేంద్రమంత్రి మనీష్ తివారీ ప్రశ్నించారు. హిందాల్కోకు గని కేటాయించాలని నవీన్ ప్రధానికి లేఖ రాయడం తప్పు కాదని ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. నవీన్‌పై తప్పుడు ప్రచారానికే కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేస్తోందని విమర్శించింది.