మోదీ విదేశీ యానాల లెక్కలు ఇవ్వలేం
లక్నో: ప్రస్తుత ప్రధాని, మాజీ ప్రధానిల విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలు ఇవ్వడం కుదరదని ప్రధాని కార్యాలయం తెలిపింది. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ల విదేశీ పర్యటనల ఖర్చుల వివరాలు కోసం సామాజిక కార్యకర్త నూతన్ ఠాకూర్ సమాచార హక్కు చట్టం కింద గత జూన్16న దరఖాస్తు చేశారు. అయితే ఈ పిటిషన్ అర్థం లేనిదని ప్రధానిల ఖర్చుల వివరాలు ఇవ్వలేమని పీఎంవో కేంద్ర సమాచార అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ప్రధానుల పర్యటనల గురించి పీఎంఓ, ఇతర శాఖలను ఫైళ్ల కాపీలు ఇవ్వాల్సిందిగా కోరానన్నారు. ఆర్‌టీఐ సెక్షన్ 19 ప్రకారం సౌత్‌బ్లాక్‌లో ఉన్న అప్పిలేట్ అథారిటీ సయ్యద్ ఇక్రం రిజ్విని సంప్రదించాల్సిందిగా ప్రవీణ్‌కుమార్ సూచించారని నూతన్ ఠాకూర్ మీడియాకు తెలిపారు.