‘ప్రధాని మాస్క్‌ విలువ వెల్లడించలేం’  | Prime Minister Mask Value Cannot Be Revealed: PMO | Sakshi
Sakshi News home page

‘ప్రధాని మాస్క్‌ విలువ వెల్లడించలేం’ 

Published Fri, Feb 5 2021 2:30 AM | Last Updated on Fri, Feb 5 2021 2:30 AM

Prime Minister Mask Value Cannot Be Revealed: PMO - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ ఎలాం టి మాస్కు ధరిస్తు న్నారు? దాని విలువ ఎంత? ఆయనకు వ్యాక్సిన్‌ వేశారా? అన్న సందేహాలతో హైదరాబాద్‌కి చెందిన రాబిన్‌ గతేడాది డిసెంబర్‌లో ఆర్టీఐ కింద ప్రధాన మంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై పీఎంవో తాజాగా స్పందించింది. ప్రధాని ధరించే మాస్కు వివరాలు, వ్యాక్సినేషన్‌ వివరాలు వ్యక్తిగతమైనవి పేర్కొంది. ఆర్టీఐ యాక్ట్‌లోని సెక్షన్‌ 8(1) కింద మీరు అడిగిన వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేసింది. ప్రధానికయ్యే ఈ ఖర్చును ప్రభుత్వం భరించదని సమాధానమిచ్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement