
వెబ్‌సైట్ నుంచి తీసిన స్క్రీన్ షాట్
భోపాల్, మధ్యప్రదేశ్ : ‘మీ అంచనాలకు తగ్గ వరకట్నం ఎదురుచూస్తోంది. ఓ పురుషుడిగా మీరు ఎక్కువ మొత్తం కోసం కాస్త గట్టిగా ప్రయత్నించాల్సిందే.’ పెళ్లి కాని అబ్బాయిలను ఉద్దేశించి ఓ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన మాటలు. ఈ సలహా వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా.. నిజంగానే ఓ వెబ్‌సైట్ అబ్బాయిలకు వచ్చే వరకట్నాన్ని ముందు అంచనా వేసి చెప్తోంది.
సదరు వెబ్‌సైట్‌లోకి వెళ్తే వయసు, కులం, వృత్తి, వేతనం, దేశం(ఎక్కడ పని చేస్తున్నారనే దాని గురించి), తండ్రి వృత్తి తదితర వివరాలను కోరుతుంది. వీటితో పాటు వరుడి స్కిన్ కలర్‌ను కూడా అడుగుతుంది. నలుపు, తెలుపు అనే ఆప్షన్లను ఎంచుకున్న వారిని ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలను చూపుతోంది.
దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా బుధవారం ట్వీట్ చేశారు. ఓ వ్యక్తి సదరు వెబ్‌సైట్‌ను తనకు చూపించారని తెలిపారు. ఇలాంటి వెబ్‌సైట్లపై చర్యలు తీసుకుపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. భారత్‌లో వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం నేరమని సదరు వెబ్‌సైట్ డెవలపర్స్‌ను ఉద్దేశించి రాసుకొచ్చారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయాలకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment