
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 506 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పథకం పనులకు ప్రధాని మోదీ ఈ నెల 6న వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం రూ.24,470 కోట్లను వెచి్చంచనుంది.
స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లకు మెరుగులు దిద్దడం, కొత్త, మెరుగైన సూచికల ఏర్పాటు, ఆధునిక మౌలిక వసతుల కల్పన వంటి వాటికి ఈ మొత్తాన్ని వెచి్చస్తారని పీఎంవో తెలిపింది. మొత్తం 508 స్టేషన్లలో తెలంగాణలోని 21, ఆంధ్రప్రదేశ్‌లోని18 రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మొత్తం 1,309 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చే యాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందు లో భాగంగా తాజాగా ఒకేసారి 506 స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment