న్యూఢిల్లీ, సాక్షి: నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. మూడోసారి ప్రధాని పదవిగా ప్రమాణం చేశాక.. సోమవారం ఉదయం పార్లమెంట్ సౌత్‌బ్లాక్‌లోకి ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉద్యోగులు ఆయనకు సాదర స్వాగతం పలికారు.
ఇక.. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధి నిధుల విడుదల ఫైల్ ఫై తొలి సంతకం చేశారు. తద్వారా.. 9.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో 20వేల కోట్ల రూపాయల నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది’’ అన్నారు.
ఇవాళ సాయంత్రం ఆయన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో.. కొత్త ప్రభుత్వం-వంద రోజుల కార్యచరణపై ఆయన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అలాగే.. స్పీకర్ ఎన్నిక తదితర అంశాల కోసం పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని సిఫార్సు చేసి.. దానిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిచే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment