Cabinet Meeting
-
డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ?
-
తెలంగాణ కేబినెట్ సమావేశం
-
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సర్వే ఇది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ పూర్తయిందని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 4న ఈ సర్వే నివేదికను రాష్ట్ర కేబినెట్‌కు అందిస్తామని, ఆ రోజున ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ అయి నివేదికపై చర్చిస్తుందని వెల్లడించారు. అదే రోజున అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీలో నివేదికపై చర్చిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే’పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్‌తోపాటు కో–చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు ఆదివారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.దేశంలో ఎక్కడా లేనంత కచ్చితంగా..రాష్ట్ర ప్రభుత్వం యాభై రోజుల్లోనే 96.9 శాతం కచ్చితత్వంతో సమగ్ర సర్వే నిర్వహించి రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఎక్కడా ఇంతటి కచ్చితత్వంతో సర్వే జరగలేదన్నారు. 2023 అసెంబ్లీ ఎన్ని కల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి న హామీ మేరకు ఈ సర్వే చేపట్టామని తెలిపారు. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వేకు సంబంధించి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి తదితరులు ఆదివారం మంత్రివర్గ ఉపసంఘానికి సర్వే నివేదిక సమర్పించారని వెల్లడించారు.సంక్షేమ కార్యక్రమాల కోసంరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ సర్వే వివరాలను వినియోగించుకుంటామని తెలిపారు. ఇది కేవలం డేటా సేకరణ ప్రక్రియ మాత్రమే కాదని, సామాజిక న్యాయ విప్లవమని వ్యాఖ్యానించారు. సర్వేపై తప్పుడు ప్రచారాలు, హైకోర్టులో పిల్లు వేయడం వంటి సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో సర్వే సమగ్రంగా కొనసాగిందని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేలా అధికార యంత్రాంగం వివిధ కార్యక్రమాలు నిర్వహించి.. సర్వేను విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న ప్రతి అధికారి, సిబ్బందికి మంత్రివర్గ ఉపసంఘం అభినందనలు తెలుపుతోందన్నారు. రాష్ట్ర చరిత్రలో మైలురాయిసమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రాష్ట్ర చరిత్రలో మైలురాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకాన్ని ప్రదర్శిస్తూ సర్వేలో పాలు పంచుకున్నారని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సర్వేను అడ్డుకునేందుకు తప్పుడు ప్రచారం చేశారని, వాటిని ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. ఈ సర్వే సామాజిక న్యాయాన్ని నిర్ధారించడంలో నిబద్ధతతో కూడిన ప్రయత్నమని మంత్రి దామోదర రాజనర్సింహ అభివర్ణించారు. ఇలాంటి సర్వేలు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రణాళిక శాఖ ము ఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.రేపు అసెంబ్లీ సమావేశంసాక్షి, హైదరాబాద్: ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర అసెంబ్లీ సమావేశం కానుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదేశాల మేరకు ఈ భేటీ జరుగుతోందని పేర్కొంటూ.. శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఆదివారం బులెటిన్ విడుదల చేశారు. -
స్థానిక ఎన్నికలకు ‘భరోసా’ దిశగా..!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు, వాటికి ముందే రైతు భరోసా, ఇతర పథకాల అమలు ప్రధాన ఎజెండాగా శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. త్వరలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో.. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన కీలక అంశాలపై రెండు గంటలకుపైగా చర్చించినట్టు సమాచారం. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినా.. ఆ డబ్బు నేరుగా రైతులకు వెళ్లలేదని, రైతులకు నేరుగా సాయం అందకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లడం ఇబ్బందికరమని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ‘రైతు భరోసా’ పథకాన్ని అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళితే మంచిదని సూచించినట్టు సమాచారం.ఈ పథకం అమలు తీరు ఎలా ఉండాలన్న దానిపై దాదాపు మంత్రులంతా తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు తెలిసింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గతంలో ఏటా రూ.10 వేలు పెట్టుబడి సాయం ఇవ్వగా ఇప్పుడు రూ.12 వేలకు పెంచుదామని... భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తున్నందున ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని సీఎం, డిప్యూటీ సీఎంలు వివరించినట్టు సమాచారం. ఈ మేరకు రూ.12 వేలు రైతు భరోసా ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ..: ఇక రుణమాఫీ అనుకున్న ప్రకారం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని.. రుణమున్న ప్రతి రైతుకు మాఫీ జరగలేదనే చర్చ జరుగుతోందని కొందరు మంత్రులు ప్రస్తావించినట్టు తెలిసింది. రైతు రుణమాఫీ కోసం రూ.31 వేలకోట్లు అవసరమనే అంచనాల నేపథ్యంలో రూ.21 వేల కోట్లే ఇచ్చామని, ఇంత తేడా ఎలా వచ్చిందని కేబినెట్ భేటీకి హాజరైన ఉన్నతాధికారులను ఓ మంత్రి అడిగినట్టు సమాచారం.ఇలాంటి సమయంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినా ప్రయోజనం ఉండకపోవచ్చని... ఎంపిక కాని వారి నుంచి ప్రతికూలత ఎదురవుతుందనే చర్చ జరిగినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని వాయిదా వేయాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. మరోవైపు కొత్త రేషన్‌కార్డుల జారీ చాలా ముఖ్యమని, వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 26వ తేదీ నుంచి రూ.12 వేలు రైతు భరోసా, రూ.12 వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. -
ఉగాదికి సన్నబియ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలందరికీ రేషన్‌కార్డులపై ఉచితంగా సన్న బియ్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీని.. ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఖరీఫ్ (వానాకాలం)లో రైతులు పండించిన సన్న ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చి సేకరిస్తున్న ప్రభుత్వం.. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కొత్త రేషన్‌కార్డుల కోసం ఇప్పటికే 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే మరోసారి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు కోరుతూ కేబినెట్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. అదనంగా 10 లక్షల కొత్త కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. పేద, దిగువ మధ్య తరగతికి ఊరట ప్రస్తుతం రాష్ట్రంలో 89.6 లక్షల రేషన్ కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రతి లబ్ధిదారుకు నెలకు 6 కిలోల చొప్పున దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీనికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయనుంది. తద్వారా బియ్యం బ్లాక్ మార్కెటింగ్, రీసైక్లింగ్‌ను పూర్తిగా కట్టడి చేయవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధరలు బాగా పెరిగిపోయాయి. సాధారణ రకం సన్న బియ్యం ధర కిలో రూ.60–65 వరకు ఉండగా.. ఫైన్ రకాల బియ్యం ధర రూ.70కిపైగానే ఉంది. దీనితో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోంది. ప్రభుత్వం రేషన్‌కార్డులపై ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఆసక్తి చూపని మధ్య తరగతి వర్గాల వారు ఆ బియ్యాన్ని కిలో రూ.10–20 చొప్పున దళారులకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యం తిరిగి రైస్‌మిల్లులకు చేరుతోంది. మిల్లులు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. రేషన్‌పై సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తే దానిని వినియోగించుకుంటారని.. బ్లాక్ మార్కెట్ సమస్య తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదనపు ఖర్చేమీ లేకుండానే పేద, మధ్యతరగతి కుటుంబాల వారు సన్న బియ్యం అన్నం తింటారని, ఇది వారికి భారీ ఊరట అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్కార్‌పై మరో రూ.1,500 కోట్ల భారం రాష్ట్రంలో 89.6 లక్షల రేషన్‌కార్డులు ఉండగా.. అందులో జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినవి 54.5 లక్షలు ఉన్నాయి. అంత్యోదయ అన్న యోజన పథకం కింద మరో ఐదున్నర లక్షల కార్డులున్నాయి. వీరందరికీ కేంద్ర ప్రభుత్వమే ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చేదానికి అదనంగా మరో కిలో అదనంగా కలిపి ఆరు కిలోల చొప్పున లబ్ధిదారులకు అందిస్తోంది. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మరో 35.66 లక్షల ఆహార భద్రత కార్డులపై రాష్ట్ర ఖర్చుతోనే బియ్యం పంపిణీ చేస్తోంది. ఇదంతా దొడ్డు బియ్యం మాత్రమే. అయితే కేంద్రం నేరుగా బియ్యం ఇవ్వకుండా కిలోకు రూ.36 చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ ద్వారా.. ఈ బియ్యాన్ని సమకూర్చుకుంటుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 89.6 లక్షల కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా చేయనుంది. సన్న బియ్యం కోసం కిలోకు రూ.55, ఆపై ఖర్చవుతుందని అంచనా. అంటే కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వమే వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏటా సుమారు రూ.3,600 కోట్ల సబ్సిడీని భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై సన్న బియ్యం పంపిణీతో మరో రూ.1,500 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బియ్యం బాగుంటాయన్న సూచనలతో..సంక్రాంతి నుంచే సన్నబియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన సన్నవడ్లను కనీసం రెండు మూడు నెలలైనా మాగనిచ్చి మిల్లింగ్ చేస్తేనే బియ్యం బాగుంటాయని నిపుణులు సూచించడంతో.. రెండు నెలల తర్వాతే సన్న వడ్లను మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో చర్చించిన అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నాయి. ఉగాది (మార్చి నెలాఖరు) నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. -
అన్నదాతలకు అండగా..
న్యూఢిల్లీ: రైతన్నలకు మరింత చేయూతనిచ్చేలా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. డై అమ్మోనియం ఫాస్ఫేట్(డీఏపీ)పై అదనపు రాయితీ గడువును పొడిగించింది. 50 కిలోల డీఏపీ ఎరువు రూ.1,350కి లభించనుంది. ఈ రాయితీ వల్ల ప్రభుత్వంపై రూ.3,850 కోట్ల భారం పడనుంది. వాస్తవానికి అదనపు రాయితీ గడువు గత ఏడాది డిసెంబర్ 31న ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. డీఏపీపై వన్–టైమ్ స్పెషల్ ప్యాకేజీని పొడిగించాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. జనవరి 1వ తేదీ నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ఈ ప్యాకేజీ కింద టన్ను డీఏపీ రాయితీని రూ.3,500గా నిర్ణయించారు. గత ఏడాది ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 దాకా అమల్లో ఉంది. డీఏపీ ధరను నియంత్రించడానికి ప్రభుత్వం రూ.2,625 కోట్లు ఖర్చు చేసింది. ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా అదనపు రాయితీ గడువును మరోసారి పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. తక్కువ ధరలకే రైతులకు డీఏపీ అందించాలన్నదే లక్ష్యమని స్పష్టంచేసింది. అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ మన దేశంలో 2024–25 రబీ, ఖరీఫ్ సీజన్లలో తగినంత డీఏపీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. కేంద్ర కేబినెట్ భేటీ వివరాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. రైతన్నలు 50 కిలోల డీఏపీని ఇకపై కూడా రూ.1,350కే కొనుగోలు చేయవచ్చని చెప్పారు. అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. డీఏపీపై వన్–టైమ్ స్పెషల్ ప్యాకేజీ రూ.3,850 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి, యుద్ధాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో డీఏపీ ధరలు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. 2014 నుంచి 2024 దాకా ఎరువుల రాయితీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11.9 లక్షల కోట్లు ఖర్చు చేసింది. 2004 నుంచి 2014 దాకా ఇచ్చిన దానికంటే(రూ.5.5 లక్షల కోట్లు) ఇది రెండు రెట్లు అధికం కావడం గమనార్హం. 28 గ్రేడ్ల ఫాస్ఫేటిక్ అండ్ పొటాసిక్ ఎరువులను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తోంది. రెండు పథకాలకు కేటాయింపులు పెంపు రెండు పంటల బీమా పథకాల గడువును కేంద్రం పొడిగించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై), రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్)ను మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలో బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగింది. రెండు బీమా పథకాల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 15వ ప్లానింగ్ కమిషన్ గడువు ప్రకారం 2025–26 వరకు ఇవి అమల్లో ఉంటాయి. ఈ రెండు బీమా పథకాల అమలు కోసం ప్రత్యేకంగా ఫండ్ ఫర్ ఇన్నోవేషన్, టెక్నాలజీ(ఎఫ్ఐఏటీ) పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం విశేషం. ఈ నిధికి ప్రభుత్వం రూ.824.77 కోట్లు కేటాయించింది. రెండు పథకాలకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. అందుకే వీటికి నిధుల కేటాయింపులు పెంచుతున్నట్లు వివరించారు. పంటల బీమా పథకాల్లో పంటల నష్టం అంచనా, క్లెయిమ్ సెటిల్మెంట్ను వేగంగా పూర్తిచేయడానికి ఫండ్ ఫర్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాలసీల సంఖ్యలో పీఎంఎఫ్‌బీవై అనేది దేశంలో అతిపెద్ద బీమా పథకం. ప్రీమియంల విషయంలో మూడో అతిపెద్ద పథకం. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతోంది. పీఎంఎఫ్‌బీవై, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ అమలుకు 2020–21 నుంచి 2024–25 దాకా రూ.66,550 కోట్లు కేటాయించగా, 2021–22 నుంచి 20253–26 వరకు ఈ కేటాయింపులను రూ.69,515.71 కోట్లకు పెంచారు. #WATCH | Delhi | On PM Fasal Bima Yojana, Union Minister of Electronics & IT Ashwini Vaishnaw says, "Farmers will continue to get DAP at Rs 1,350 per 50 kg bag, which costs more than Rs 3,000 in other countries... This package will cost about Rs 3,850 crore... Since 2014, PM… pic.twitter.com/yUyKNBfxqf— ANI (@ANI) January 1, 2025 #WATCH | Delhi | On PM Fasal Bima Yojana, Union Minister of Electronics & IT Ashwini Vaishnaw says, "Rs 800 crore fund for innovation and technology has been created for faster assessment, faster claim settlement, and fewer disputes... To increase coverage and ease enrollment, PM… pic.twitter.com/DAJEGcgWm5— ANI (@ANI) January 1, 2025కొత్త సంవత్సరంలో తొలి నిర్ణయం రైతులకే అంకితం నూతన సంవత్సరంలో కేబినెట్ మొదటి సమావేశంలో తీసుకున్న మొదటి నిర్ణయాన్ని రైతు సోదరులకు, సోదరీమణులకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొ న్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘పంటల బీమా పథకాలకు నిధుల కేటాయింపులు పెంచాలన్న ప్రతిపాదనను కేబినెట్ సమావేశంలో ఆమోదించాం. దీనివల్ల పంటలకు మరింత భద్రత లభిస్తుంది. పంటలకు నష్టం వాటిల్లినా రైతులు దిగులు పడాల్సిన అవసరం ఉండదు. డీఏపీపై వన్–టైమ్ ప్రత్యేక ప్యాకేజీ గడువును పెంచడంతో తక్కువ ధరకే ఎరువు లభిస్తుంది’’ అని ప్రధానమంత్రి వివరించారు. -
TG: 30న కేబినెట్ భేటీ.. రేషన్‌కార్డులపై చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ ఈనెల 30వ తేదీన భేటీ కానుంది. మంత్రి వర్గ సమావేశం సందర్భంగా తెలంగాణలో రైతులకు రైతు భరోసా, రేషన్ కార్డుల విధి విధానాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ‘ఈనెల 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా రైతు భరోసా, రేషన్‌కార్డుల విధివిధానాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇదే సమయంలో భూమిలేని పేదలకు నగదు బదిలీపై కేబినెట్లో చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
-
నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో... రికార్డ్స్ ఆఫ్ రైట్స్ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు.
-
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశంకానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో... కొత్త రెవెన్యూ చట్టం ‘రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్)’బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. అనంతరం ఈ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతించేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. ఇక రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి విధివిధానాలను మంత్రివర్గం ఖరారు చేయనుంది. వీటిపై శాసనసభలో చర్చ నిర్వహించనుంది. మరోవైపు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ సమరి్పంచిన విచారణ నివేదికను సైతం కేబినెట్ పరిశీలించి శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించనుంది. ‘ఫార్ములా–ఈ’రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎంతో మంత్రి పొంగులేటి భేటీ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఆర్ఓఆర్ బిల్లు తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఇక ధరణిపై ఏర్పాటైన కమిటీ సభ్యులు కోదండరెడ్డి, ప్రొఫెసర్ సునీల్ ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలసి బిల్లులోని అంశాలను వివరించారు. -
జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం కసరత్తు
-
ఒక రోజు ముందుగానే జరుగుతున్న కేబినెట్ భేటీ
-
ట్రంప్ కేబినెట్లో కీలక పదవులు దక్కించుకుంది వీరే.. (ఫొటోలు)
-
కాసేపట్లో YSRCP ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ
-
పవన్ వ్యాఖ్యలపై మంత్రివర్గంలో చర్చ
సాక్షి, అమరావతి: చిన్నారులు, మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. చివరలో చంద్రబాబు ప్రత్యేకంగా మంత్రులతో రాజకీయాలు, ఇతర అంశాలపై మాట్లాడారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై పోలీసులు సరిగా స్పందించడం లేదని, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పినట్లు లీకులిచ్చారు. కొందరు అధికారుల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తోందని ఈ సందర్భంగా పలువురు మంత్రులు చెప్పినట్లు సమాచారం. కొన్ని జిల్లాల ఎస్పీలు తమ ఫోన్లు తీయడం లేదని ఒకరిద్దరు మంత్రులు చెప్పినట్లు తెలిసింది. పోలీసు యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడం లేదని, కింది స్థాయి అధికారులపై నెపం మోపి తప్పించుకుంటున్నారని చెప్పగా, చంద్రబాబు స్పందిస్తూ నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిలో పెడతానని చెప్పినట్లు సమాచారం. రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను దేనికీ ఉపయోగించకుండా మ్యూజియంగా మార్చి అందరికీ చూపిద్దామని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. పవన్ వ్యాఖ్యలపై టాపిక్ డైవర్ట్ పవన్ వ్యాఖ్యలపై మంత్రివర్గంలో చర్చ అంతా జరిగిన నష్టాన్ని కవర్ చేసుకునే క్రమంలోనే సాగినట్లు తెలిసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని, ఆడబిడ్డలను రేప్ చేస్తుంటే సరైన చర్యలు తీసుకోవడం లేదన్న వ్యాఖ్యలకు విరుద్ధంగా టాపిక్‌ను డైవర్ట్ చేసి.. మంత్రివర్గంలో చర్చించడం గమనార్హం. ఆ విషయాలపై కాకుండా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా గురించి పవన్ వ్యాఖ్యలు చేసినట్లు చర్చలు జరిపినట్లు తెలిసింది. హోం మంత్రిని, డీజీపీని పవన్ నిలదీసిన ప్రస్తావన సమావేశంలో రాకపోవడం విశేషం. పవన్ వ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతి భద్రతల డొల్లతనం బయట పడడంతో ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోయింది. దాన్ని కవర్ చేసేందుకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలన్న దానిపై పవన్ మాట్లాడినట్లు డైవర్ట్ చేసి దానిపై చర్చ జరిగేలా చేసినట్లు తెలిసింది. -
భూ కబ్జాలపై కఠిన శిక్షలు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ చట్టం –1982లో లొసుగులుండటంతో భూ కబ్జాలు పెరిగిపోతున్నందున ప్రస్తుత చట్టాన్ని రద్దు చేసి, కొత్త చట్టం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత చట్టం నగరీకరణ భూ కబ్జాలకే వర్తిస్తుందని.. శిక్షలు, జరిమానాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త చట్టం ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. కొత్త చట్టం ప్రకారం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటవుతుందని, కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ జరుపుతారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ, లేదా ప్రైవేట్ భూముల ఆక్రమణలు చేసినట్లు తేలితే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఆక్రమణ చేసిన భూమి విలువతో పాటు నష్టపరిహారం (జరిమానా) కూడా విధిస్తారని చెప్పారు. కేబినెట్ మరిన్ని నిర్ణయాలు మంత్రి మాటల్లోనే.. రూ.1,000 కోట్లు పెట్టుబడి లక్ష్యంగా డ్రోన్ పాలసీ ఏపీ డ్రోన్ పాలసీతో పాటు సెమి కండక్టర్ పాలసీ, డేటా పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,000 కోట్లు పెట్టుబడి లక్ష్యంగా 2024–29 డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. డ్రోన్ పాలసీ ద్వారా రూ.3 వేల కోట్లు రాబడి వస్తుందని అంచనా. డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఫెసిలిటీకి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాలు కేటాయింపు. డ్రోన్ స్కిల్ ఇన్స్టిట్యూట్, డ్రోన్ పైలెట్ శిక్షణ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు. తద్వారా 15 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు. 25 వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాల ఏర్పాటు. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు. డ్రోన్ రంగంలో పరిశోధనలు చేపట్టే విద్యా సంస్థలకు రూ.20 లక్షలు ప్రోత్సాహం. 2024–29 డేటా పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024–29 సెమి కండక్టర్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సెమి కండక్టర్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్‌కు 50% కేంద్రం కేపిటల్ సబ్సిడీ ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 30% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. టీడీపీ కార్యకర్తలకు ‘ఉపాధి’ నజరానా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ ఖజానా నుంచి భారీ నజరానా మంజూరు చేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. 2014–18 సంవత్సరాల మధ్య నామినేషన్‌పై పనులు చేసిన టీడీపీ కార్యకర్తలకు రూ.331 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు, తదితర పనులు చేసిన చిన్న చిన్న కార్యకర్తలను ఆర్ధికంగా ఇబ్బందికి గురి చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ పేరుతో బిల్లులు ఇవ్వలేదు. చాలా మంది బిల్లుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ప్రభుత్వం ఎప్పుడైనా సరే తిరిగి విచారణ చేయొచ్చని చెప్పింది. నష్టపోయిన వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగు నిర్ణయం తీసుకోవచ్చని కూడా తెలిపింది. ఈ మేరకు 4.41 లక్షల పనులకు సంబంధించి రూ.331 కోట్లు చెల్లించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం బకాయిలకు 12 శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉందనే విషయంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. మరిన్ని నిర్ణయాలు ఇలా.. ⇒ జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు ఈ నెల 1వ తేదీ నుంచి వర్తించేలా 60 నుంచి 61 ఏళ్లకు పెంపు. ⇒ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గాల సమగ్రాభివృద్ధికి కుప్పం, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటు. ⇒ ఏపీసీఆర్డీఏ పరిధిని 8,352.69 చదరపు కిలో మీటర్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం. సత్తెనపల్లి మున్సిపాలిటీలోని 1,069 చదరపు కిలోమీటర్లను, పల్నాడు జిల్లాలోని ఆరు మండలాల్లో 92 గ్రామాలను, బాపట్ల జిల్లాలోని ఐదు మండలాల్లో 62 గ్రామాలను ఏపీ సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చారు. జాతీయ హైవేలను కలుపుతూ 189 కిలోమీటర్ల పొడవునా ఏపీ సీఆర్డీఏలో ఓఆర్ఆర్ నిర్మాణం. ⇒ పిఠాపురంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ కేంద్రం 100 పడకలకు పెంపుతో పాటు 66 అదనపు పోస్టులు మంజూరు. ⇒ సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం సరఫరా చేసేందుకు తీసుకువచ్చిన నూతన మద్యం విధానం మూడు ఆర్డినెన్స్‌ల స్థానే మూడు చట్టాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం. జీఎస్టీ చట్ట సవరణ ముసాయిదా బిల్లుకూ ఆమోదం. ⇒ సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థుల ఫీజు బకాయిలను తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీ యాజమాన్యాలకు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం. ⇒ ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్టంలోని సెక్షన్–3లో సవరణలకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం. 1990లో ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆరు పైసలు, 2022లో ఒక రూపాయిగా ఉంది. ఈ డ్యూటీని చెల్లించకుండా న్యాయ స్థానాలకు వెళ్తున్నందున, బకాయిల వసూలుకు వీలుగా చట్టంలో సవరణలు. ⇒ ఏపీఐఐసీకి 50 ఎకరాల వరకు భూమి కేటాయింపునకు అనుమతివ్వడంతో పాటు ఏపీఐఐసీ చేసిన 311 భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం. -
పోలవరంపై మరో కుట్ర.. బాబు మార్క్ ‘రహస్య’ రాజకీయం!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అప్పులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకముందే చంద్రబాబు ఇప్పటికే భారీ మొత్తంలో అప్పులు తెచ్చారు. మరోవైపు.. పోలవరంపై కూడా చంద్రగ్రహణం పట్టుకుంది. బాబు పాలనలో పోలవరంపై మరో కుట్ర జరిగింది.పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించారు. 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుండి 41.15 మీటర్ల ఎత్తుకి కుదింపు జరిగింది. కాగా, పోలవరం ఎత్తు తగ్గించినప్పటికీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కేబినెట్లో అభ్యంతరం తెలుపలేదు. అయితే, ఆగస్టు 28వ తేదీన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును 41.15 మీటర్లకే తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదు. ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. ప్రాజెక్ట్ ఎత్తు కుదింపుతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోనుంది. 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎత్తు కుదించడంతో 115.4 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోనుంది. పోలవరంపై చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత వైఖరిపై రైతుల్లో ఆందోళన నెలకొంది.ఇదిలా ఉండగా.. ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు నేడు అప్పులు తేచ్చే ప్రక్రియలో బిజీ అయిపోయారు. తాజాగా చంద్రబాబు.. మరో మూడు వేల కోట్ల అప్పు తెచ్చారు. నిన్న 7.17 శాతం వడ్డీకి మూడు వేల కోట్లను ఏపీ ప్రభుత్వం అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా కూటమి ప్రభుత్వం రుణం సమీకరించింది. ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే 59వేల కోట్లను చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేసింది. మరోవైపు.. కార్పొరేషన్ల ద్వారా మరో ఎనిమిది వేల కోట్లు అప్పులు తీసుకుంది. కాగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే చంద్రబాబు ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. -
కులగణనకు ఇంటింటి సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను నవంబర్ 4 లేదా 5న ప్రారంభించి 30లోగా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సర్వేకు సంబంధించిన ప్రశ్నావళి, విధివిధానాలను ఆమోదించింది. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని ఫిబ్రవరి 17న శాసనసభలో తీర్మానం చేయడంతోపాటు ఇప్పటికే జీవో 18 ప్రభుత్వం జారీ చేయగా సీఎం రేవంత్ సోమ వారం రాష్ట్ర నోడల్ అధికారి, జిల్లా కలెక్టర్లతో సమావేశమై సర్వేపై దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా, మండల స్థాయిలోని 80 వేల మంది అధికారులు, సిబ్బందికి కులగణనపై శిక్షణ అందించనున్నట్లు పొన్నం తెలిపారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 ఇళ్లను కేటాయించి సర్వే పూర్తి చేయడానికి 3, 4 రోజుల సమయం ఇస్తున్నామన్నారు. 15–20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తికానుందని... ఇప్పటికే షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వం ఒక్క రోజులో కుటుంబ సర్వే నిర్వహించి వివరాలను బయటపెట్టలేదని.. కానీ తాము సర్వే ముగిశాక సమాచారాన్ని, ప్రయోజనాలను ప్రజా బాహుళ్యంలో ఉంచి పారదర్శకంగా వ్యవహరిస్తామని పొన్నం తెలిపారు. సర్వేలో సరైన సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామసభ పెట్టి కులమతాలు, పారీ్టలకు అతీతంగా పేదల్లో బహు పేదలను ఎంపిక చేయాలని నిర్ణయించామన్నారు. దీపావళి మర్నాడు లేదా ఆ తర్వాతి రోజున సీఎంతోపాటు మంత్రులం స్వయంగా మొగ్గు వేసి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఉద్యోగులకు ఒక డీఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు పెండింగ్ డీఏలను చెల్లించాల్సి ఉండగా దీపావళి కానుకగా 2022 జనవరి నుంచి రావాల్సిన ఒక డీఏను మంజూరు చేశామని పొంగులేటి చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే జీవో 317 కింద గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులను స్పౌజ్, ఆరోగ్య, పరస్పర కేటగిరీల కింద తక్షణమే సొంత ప్రాంతాలకు బదిలీలు నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. జీవో 317 కింద దూర ప్రాంతాలకు వెళ్లిన ఇతర ఉద్యోగుల సమస్యతోపాటు ఉద్యోగ నియామకాలకు జీవో 46తో ఉన్న ఇబ్బందుల పరిష్కారానికి చట్ట రీత్యా, కోర్టుల రీత్యా చిక్కులున్న నేపథ్యంలో తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కేంద్రం ఆమోదం కోసం పంపాలని నిర్ణయించామని పొంగులేటి తెలిపారు. ఉద్యోగులకు ఒక డీఏ చెల్లిస్తే ప్రభుత్వంపై రూ. 3 వేల కోట్ల భారం పడనుందని.. అందుకు ప్రతి నెలా రూ. 230 కోట్లు అదనంగా కావాలని పొన్నం తెలిపారు. నాలుగు కేటగిరీలుగా మిల్లర్ల విభజన.. రాష్ట్రంలో మిల్లర్లను నాలుగు విభాగాల కింద విభజిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎలాంటి ఆరోపణలు లేని మిల్లర్లకు ప్రథమ కేటగిరీ, ప్రభుత్వ నోటిసులకు స్పందించి చెల్లింపులు చేసిన వారిని రెండో కేటటిరీ, నోటిసులిచ్చినా చెల్లింపులు చేయక రికవరీకి గురైన వారిని మూడో కేటగిరీగా విభజించి వారి నుంచి బ్యాంకు గ్యారెంటీలు తీసుకున్న తర్వాత ధాన్యం సేకరణలో అనుమతించాలని, ఇంకా డిఫాల్టర్లుగా మిగిలిపోయిన వారిని అనుమతించరాదని నిర్ణయించామన్నారు. మిల్లర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి పొరుగు రాష్ట్రాల్లో అవలంభిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి ఆమోదించామని చెప్పారు. రూ. 24,269 కోట్లతో మెట్రో రెండో దశ హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టును కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్ కింద నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. నాగోల్–శంషాబాద్, రాయదుర్గ్–కోకాపేట, ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట, మియాపూర్–పటాన్చెరు, ఎల్బీనగర్–హయత్‌నగర్ కారిడార్లలో 76.4 కి.మీ. కొత్త మెట్రో రైల్వే లైన్‌ను రూ. 24,269 కోట్ల అంచనాలతో ఏర్పాటు చేయడానికి రూపొందించిన డీపీఆర్‌ను కేంద్రానికి పంపేందుకు మంత్రివర్గం ఆమోదించింది. పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ, ఆర్ అండ్ బీ పరిధిలో 16–17 వేల కి.మీ. కొత్త రోడ్ల నిర్మాణం/పునరుద్ధరణ పనుల విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి తప్పనిసరిగా బీటీ రోడ్డు, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు 4 లేన్ల రోడ్లను నిర్మించాలన్న ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రతి ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని పీపీపీ విధానంలో వచ్చే 4 ఏళ్ల పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ. 25 వేల కోట్ల నుంచి రూ. 28 వేల కోట్ల వ్యయం కానుందని ప్రాథమికంగా అంచనా వేసింది. మరికొన్ని నిర్ణయాలు.. ⇒ ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి గోషామహల్ స్టేడియం స్థలాన్ని అప్పగించడంతోపాటు ములుగులోని గిరిజన వర్సిటీకి 211 ఎకరాల భూమిని, స్పోర్ట్స్ వర్సిటీకి గచ్చిబౌలి స్టేడియాన్ని అప్పగించాలనే ప్రతిపాదనలకు ఆమోదం. ⇒ మధిర, వికారాబాద్, హుజూర్‌నగర్‌లో స్కిల్స్ వర్సిటీకి అనుబంధంగా కొత్త ఐటీఐల మంజూరు. ⇒ కొత్తగా ఏర్పడిన 8 కోర్టులు, రెండు వైద్య కళాశాలలకు సిబ్బంది మంజూరు. ⇒ కేంద్ర ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా కడెం ప్రాజెక్టులో పూడికతీతకు ఆమోదం. అన్ని ప్రాజెక్టుల్లో 23 శాతం పూడికతో నిండి ఉన్నాయని, భవిష్యత్తులో వాటిలోని పూడిక తొలగిస్తామని పొంగులేటి తెలిపారు. సినీనటుడు బాలకృష్ణకు స్టూడియో నిర్మాణానికి ఎలాంటి స్థలం కేటాయించలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దీపావళికి ముందే పొలిటికల్ బాంబుల పేలుళ్లు రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు ఒకట్రెండు రోజుల్లో పేలబోతున్నాయని దక్షిణ కోరియా పర్యటన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి స్పందించారు. దీపావళి టపాసుల కంటే ముందే ఇవి పేలుతాయని స్పష్టం చేశారు. కాగా, దక్షిణ కొరియాలో అమలైన నదుల పునరుజ్జీవ ప్రాజెక్టు గురించిన వివరాలను మంత్రులు పొంగులేటి, పొన్నం తమ సహచరులకు వివరించినట్లు సమాచారం. అయితే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు గురించి ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై ప్రత్యేకంగా మరో సమావేశం ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయం కేబినెట్లో వ్యక్తమైనట్లు తెలియవచ్చింది. -
తెలంగాణ కాబినెట్ కీలక నిర్ణయాలు
-
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. కీలక అంశాల పై చర్చ
-
Telangana Cabinet Meeting: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ..
-
ఇసుకపై ఇంకో అబద్ధం
సాక్షి, అమరావతి: ఇసుకపై కేబినెట్ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలను వల్లె వేసింది. ఇసుకపై జీఎస్టీని రద్దు చేస్తూ బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. నిజానికి జీఎస్టీని రద్దు చేసే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ లేదు. అయినా సరే ఇసుకపై జీఎస్టీని రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, ఇక నుంచి పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటుందని మంత్రి రవీంద్ర ప్రకటించడంపై అధికార యంత్రాంగం సైతం విస్తుపోతోంది.ఇసుక తవ్వకం, లోడింగ్ వ్యయంపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం వినియోగదారులపైనే పడుతుంది. ప్రైవేట్ ఏజెన్సీలు ఇసుక సేల్ పాయింట్ల దగ్గర విక్రయిస్తే ఐదు శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇది కూడా వినియోగదారులపైనే పడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తనకు లేని అధికారంతో జీఎస్టీని రద్దు చేస్తూ ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.జీఎస్టీ కౌన్సిల్‌దే నిర్ణయంఇసుక సహా ఏదైనా సరే జీఎస్టీ నుంచి మినహాయింపు పొందాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రతిపాదించాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై జీఎస్టీ నుంచి మినహాయింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటే నోటిఫికేషన్ జారీ చేస్తారని, అది దేశమంతా వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రానికో మాదిరిగా జీఎస్టీ ఉండదని, మీడియా సమావేశంలో మంత్రి చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఇసుకపై సీనరేజ్ రద్దు చేసే అధికారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అయితే జీఎస్టీ కూడా రద్దు చేశామని ప్రకటించడమంటే ప్రజల కళ్లకు గంతలు కట్టడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చట్టం గురించి తెలియదా?ఇసుక కార్యకలాపాలపై ఎస్జీఎస్టీని మాత్రమే రీయింబర్స్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, అంతకు మించి జీఎస్టీని రద్దు చేసే అధికారం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. అందరి కన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేశానని, తనకు ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు జీఎస్టీని రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తెలియదా? అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిర్మాణ రంగానికి ప్రైవేట్ ఏజెన్సీల నుంచి కొనుగోలు చేసే ఇసుకపై 2017 సీజీఎస్టీ చట్టం సెక్షన్ 9 ప్రకారం ఐదు శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇసుక తవ్వకం, లోడింగ్ వ్యయంలో సీజీఎస్టీ చట్టం సెక్షన్ 7 (1) ప్రకారం 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఈ చట్టం జమ్మూ–కశ్మీర్ మినహా దేశమంతా వర్తిస్తుంది.మాఫియాను అరికట్టలేక చేతులెత్తేశారు..!తనకు ఏమాత్రం అధికారం లేని జీఎస్టీని రద్దు చేసినట్లు అబద్ధాలు చెబుతూ సీఎం చంద్రబాబు ఇసుక వినియోగదారులతో చెలగాటం ఆడుతున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రంలో ఇసుక దొరకపోవడానికి, అత్యధిక ధరలకు విక్రయించడానికి మూల కారణం పచ్చ ముఠాలేనని తెలిసినా వారిని నిరోధించకుండా గత ప్రభుత్వంపై నిందలు మోపటాన్ని బట్టి ఇసుక మాఫియాను అరికట్టలేక చంద్రబాబు చేతులెత్తేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇసుక బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందని, అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ అధికారులు ఇచ్చిన నివేదికలను పట్టించుకోకుండా గత ప్రభుత్వంపై బురద చల్లితే ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రిగా తానే ఉన్నాననే విషయాన్ని విస్మరిస్తున్న చంద్రబాబు టీడీపీ నేతల ఇసుక దోపిడీని అరికట్టకుండా ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ప్రజలు విశ్వసించరని చెప్పారు. ఇసుక విధానంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు మార్పులు చేసినా ప్రయోజనం శూన్యమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సరఫరా కేంద్రాల వద్ద గంటల తరబడి వాహనాలు నిరీక్షించాల్సి రావడం వల్ల ఎక్కువ రవాణా చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. బ్లాక్ మార్కెటింగ్, అస్తవ్యస్థంగా రీచ్‌ల నిర్వహణ గురించి తెలిసినా పట్టించుకోకపోవటాన్ని బట్టి ప్రభుత్వం ఈ దోపిడీని ప్రోత్సహిస్తున్నట్లు భావించాల్సి వస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
దళారీల ఇసుక బుకింగ్
సాక్షి, అమరావతి: దళారులు నిమిషాల్లో ఆన్లైన్లో భారీగా ఇసుక బుకింగ్ చేస్తున్నారని, ధరలు పెంచి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో వ్యాఖ్యానించారు. గతంలో ఉన్న ఇసుక మాఫియానే ఇప్పుడూ దోచేస్తోందని ఆరోపించారు. దళారుల వల్లే రాష్ట్రంలో ఇసుక ధరలు పెరిగాయని చెప్పాలంటూ సీఎం చంద్రబాబు అంతకుముందు మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ఆయన ప్రత్యేకంగా రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఇసుక ధరలు గతంలో కంటే ఎక్కువగా ఉండడం వల్ల ప్రజల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈ సందర్భంగా పలువురు మంత్రులు వాపోయినట్లు తెలిసింది. అయితే దళారులు, రవాణా చేసేవారి వల్ల ధరలు పెరిగాయని ప్రజలకు చెప్పాలని సీఎం వారికి సూచించారు. తక్కువ రేటుకు ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకుని బ్లాక్ మార్కెట్లో ఎక్కువకు అమ్ముతున్నట్లు ప్రచారం చేయాలని నిర్దేశించినట్లు తెలిసింది. ఈ సమస్యను అధిగవిుంచేందుకు ఇసుకపై సీనరేజీ చార్జీ ఎత్తేశామని, ఓవర్‌లోడ్ వాహనాలను ఆపకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించినట్లు సమాచారం. ఇసుకను పూర్తి ఉచితంగా ఇచ్చేందుకు సీనరేజ్, జీఎస్టీని రద్దు చేస్తూ తాజాగా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక సంస్ధలకు చెందాల్సిన రూ.264 కోట్ల సీనరేజ్‌ను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొలుసు పార్ధసారధి, వంగలపూడి అనిత మీడియాకు వెల్లడించారు.రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేపట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం అనుమతించిందని, ఎన్జీటీ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. 108 రీచ్‌లు, 25 స్టాక్ పాయింట్లు, 17 మాన్యువల్ రీచ్‌లను జిల్లా ఇసుక కమిటీలకు అప్పగించామన్నారు. సొంత అవసరాలకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, లారీల్లో రీచ్‌లకు వెళ్లి నేరుగా ఇసుక తీసుకెళ్లవచ్చని, అయితే వారంతా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధన విధించినట్లు తెలిపారు. ఆన్లైన్లో చేసుకోలేకపోతే రీచ్ దగ్గరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తీసేందుకు బోట్ల అసోసియేషన్లను అనుమతించామన్నారు.ఐదు జిల్లాల్లో 20 శాతం మార్జిన్‌తో విక్రయంవిశాఖ, అనకాపల్లి, తిరుపతి, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో ఇసుక రీచ్‌లు లేనందున చిన్న అవసరాలకు ఇసుక కావాల్సిన వారికి సరఫరా చేసేందుకు మినరల్ డీలర్లను నియమించి 20 శాతం మార్జిన్‌తో విక్రయించేంలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఐదు జిల్లాల్లో బల్‌్కగా కావాల్సిన వారు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చన్నారు. అక్రమ రవాణా, అక్రమ విక్రయదారులపై పీడీ చట్టం కింద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తమిళనాడు, కర్నాటక, ఒడిశా, తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు చేసి సీసీ కెమేరాలతో నిఘా పెడతామన్నారు. రాష్ట్రంలో అవసరాలకే ఇసుక వినియోగించాలని, బయట రాష్ట్రాలకు ఒక్క ట్రక్కు కూడా వెళ్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సొంత అవసరాల కోసం రీచ్‌కు వెళ్లి నేరుగా ఇసుక ఉచితంగా తీసుకోవచ్చునని, అయితే తిరిగి అధిక ధరకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకందీపావళి సందర్భంగా ఈ నెల 31వ తేదీ నుంచి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అర్హత గల గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తామన్నారు. అక్టోబర్ 31వ తేదీన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. గ్యాస్ సరఫరా ఏజెన్సీలకు ప్రభుత్వం నగదు డిపాజిట్ చేస్తుందని, సంబంధిత ఏజెన్సీ 48 గంటల్లోగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ జమ చేస్తుందన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఏప్రిల్ – జూలై వరకు ఒక ఉచిత సిలిండర్, ఆగస్టు – నవంబర్ మధ్యలో ఒక ఉచిత సిలిండర్, డిసెంబర్ – మార్చి మద్యలో ఒక ఉచిత సిలిండర్‌ను పంపిణీ చేస్తామన్నారు. రెండు నెలల్లో అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి నాదెండ్ల ప్రకటించారు. దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని అమలు చేయడం మహిళల సాధికారత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అనిత చెప్పారు.జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం రద్దురూ.100 కోట్లు దాటిన పనుల టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలని గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో పారదర్శకత లేదని, ఆ చట్టాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని మంత్రి పార్ధసారధి తెలిపారు. సీవీసీ నిర్దేశించిన విధి విధానాల మేరకు టెండర్ల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు.⇒ వార్షిక ఆదాయం రూ.20 కోట్లు ఉన్న దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్య 15 నుంచి 17కు పెంపు చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం. పాలకమండలిలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరు చొప్పున అవకాశం. ⇒ విశాఖలో శ్రీ శారదా పీఠానికి వేదపాఠశాల, సంస్కృతి పాఠశాల నిర్వహణకు 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన నాలుగు జీవోల రద్దుకు మంత్రి మండలి ఆమోదం.⇒ 2021 ఆగస్టు 15 నుంచి గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ జీవోఐఆర్ వెబ్సైట్లో పొందుపరచాలని నిర్ణయం. ⇒ చెవిటి, మూగ, కుష్ఠు వ్యాధిగ్రస్తులపై వివక్ష నిర్మూలించేందుకు ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం –1968, ఆయుర్వేదం, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం–1956, డాక్టర్ ఎన్టీఆర్ వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చట్టం–1986లో పలు అంశాల సవరణలకు మంత్రిమండలి ఆమోదం. ⇒ విశాఖ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ సీట్లను 25 నుంచి 100కి పెంచుతూ జారీ చేసిన 134 జీవోకు మంత్రిమండలి ఆమోదం. కళాశాలలో 25 టీచింగ్, 56 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు. ⇒ మంగళగిరిలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలోని 30 పడకల ఆస్పత్రిని వంద పడకలుగా మార్చేందుకు ఆమోదం. 73 అదనపు పోస్టుల మంజూరు. ⇒ వరి సేకరణ కోసం మార్క్‌ఫెడ్ ద్వారా రూ.1,800 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి ఆమోదం. ⇒ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే తీసుకున్న రూ.80 కోట్ల బ్యాంకు ఋణానికి ప్రభుత్వ గ్యారెంటీని కొనసాగించేందుకు మంత్రి మండలి ఆమోదం.ఆ దళారులు మీవాళ్లే కదా?⇒ కూటమి సర్కారు రాగానే పచ్చ ముఠాల ఇసుక దందా⇒ గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుక మాయం⇒ నిర్మాణ రంగం కుదేలై 40 లక్షల మంది కార్మికుల అవస్థలు⇒ ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకోలేకే బ్లాక్ మార్కెట్ ఆరోపణల పాటఅధికారంలోకి రాగానే స్టాక్ యార్డుల్లో భద్రపరిచిన లక్షల టన్నుల ఇసుక నిల్వలను కరిగించేసి నాలుగు నెలల పాటు నిర్మాణ రంగాన్ని స్తంభింప చేసిన కూటమి సర్కారు తన నిర్వాకాలను కప్పిపుచ్చుకునేందుకే దళారులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే నాటకానికి తెర తీసినట్లు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్ సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన విషయం తెలిసిందే. కూటమి సర్కారు అధికారంలోకి రావడమే ఆలస్యం పచ్చ ముఠాలు సగం నిల్వలను అమ్ముకుని సొమ్ము చేసుకోగా మిగతా ఇసుకను సైతం ఒక్క రేణువు కూడా మిగల్చకుండా ఆరగించేశాయి. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా తవ్వేసి అందినకాడికి దండుకోవడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. 40 లక్షల మంది ఆధారపడ్డ నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు జోవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. ఈ ఇసుక దోపిడీని ప్రతిపక్షం ఎక్కడికక్కడ ఎండగట్టడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో చేసిన తప్పులను కప్పి పుచ్చి మభ్యపెట్టే యత్నాల్లో భాగంగానే బ్లాక్ మార్కెట్ నాటకానికి కూటమి సర్కారు తెర తీసినట్లు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతో జనం జేబులను గుల్ల చేసి గుమ్మడి కాయ దొంగలా జేబులు తడుముకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
హైడ్రాకు ఇక పూర్తి స్వేచ్ఛ... సంస్థకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ కేబినెట్ సమావేశంలో నిర్ణయం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
తెలంగాణ కేబినెట్ లో కీలక అంశాలపై నిర్ణయం !
-
ముసాయిదానే.. కొత్త చట్టం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల రికార్డులకు సంబంధించిన ‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024 (ఆర్వోఆర్)’ చట్టం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి వచ్చింది. ఒకట్రెండు చిన్న చిన్న మార్పులు మినహా ముసాయిదా కింద రూపొందించిన అంశాలనే చట్టం రూపంలో అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి త్వరలోనే దీనిపై ఓ స్పష్టత ఇస్తారని.. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తారని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. దాంతోపాటు ఈ చట్టాన్ని వెంటనే అమల్లోకి తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేస్తారా? లేక అసెంబ్లీలో పెట్టిన బిల్లుపై విస్తృతంగా చర్చించి చట్టంగా చేస్తారా? అన్న దానిపై మాత్రం తర్జనభర్జన కొనసాగుతున్నట్టు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈనెల 20న జరిగే కేబినెట్ సమావేశం ముందుకు ఆర్డినెన్స్ వచ్చే అవకాశం లేదని అంటున్నాయి. అయితే కేబినెట్ ఎజెండాపై బుధవారం స్పష్టత వస్తుందని, ఎజెండాలో భూముల చట్టం ఆర్డినెన్స్ ఉంటే రూపకల్పన, జారీ ఏర్పాట్లకు సిద్ధంగానే ఉన్నామని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. ముసాయిదా బిల్లు ఇదే.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 2న రాష్ట్ర ప్రభుత్వం ‘ఆర్వోఆర్–2024’ ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్వోఆర్–2020 చట్టంలో పరిష్కరించలేని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతూ 20 సెక్షన్లతో ఈ ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. 1936, 1948, 1971, 2020 నాటి ఆర్ఓఆర్ చట్టాలను పరిశీలించి, వాటి అమలుతో చేకూరిన ఫలితాలను బేరీజు వేసి కొత్త చట్టం ముసాయిదాను తయారు చేసింది. తెలంగాణలో ఆర్వోఆర్ చట్టాల అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాల అంచనాల ప్రకారం రూపొందించిన ఈ ముసాయిదాలో పాస్ పుస్తకాలు రాని భూముల సమస్యల పరిష్కారం, కొత్త రికార్డును ఎప్పుడైనా తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ లాంటి వెసులుబాట్లు కల్పిస్తూ అనేక అంశాలను ముసాయిదాలో పొందుపరిచారు. బిల్లు పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆర్వోఆర్ చట్టానికి రెండోసారి మార్పు జరుగుతోంది. 2020లో బీఆర్ఎస్ హయాంలో ఆర్వోఆర్–2020 చట్టం అమల్లోకి తెచ్చారు. అందులోని అనేక అంశాలకు సవరణలు, మార్పు చేర్పులతో ఆర్వోఆర్–2024ను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ముందు పెట్టింది. ముసాయిదాపై ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి 23 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. మంత్రులు, రెవెన్యూ శాఖ సీనియర్ అధికారులు, భూచట్టాల నిపుణులు, మేధావులు, సామాన్యులు.. ఇలా అన్ని వర్గాలు అభిప్రాయాలు స్వీకరించింది. ఈ వివరాలతో జిల్లాల కలెక్టర్లు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ మూడు అంశాలే కీలకం ప్రజలతోపాటు భూచట్టాల నిపుణుల నుంచి వచ్చిన అనేక సూచనలు, సలహాల్లో మూడు అంశాలు కీలకమని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటు ప్రతిపాదన ముసాయిదా చట్టంలో లేదని.. భూసమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని పలువురు సూచించారు. అయితే రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు, ఆర్ఓఆర్ చట్టానికి సంబంధం లేదని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. అయితే భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్–బీలో పెట్టిన 18లక్షల ఎకరాల భూముల సమస్యలను పరిష్కరించేందుకు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉందని అంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వొచ్చని, లేదా ముసాయిదా చట్టంలోని సెక్షన్–4 ప్రకారం కూడా ఏర్పాటు చేయవచ్చని పేర్కొంటున్నాయి. ఇక అప్పీల్, రివిజన్లకు సంబంధించిన అంశంలోనూ చాలా సూచనలు వచ్చాయి. తహసీల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజిస్రే్టషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే అప్పీల్‌ను కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్‌కు చేసుకోవాలని.. సెకండ్ అప్పీల్‌ను సీసీఎల్ఏకు, రివిజన్ కోసం ప్రభుత్వానికి లేదంటే సీసీఎల్ఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చట్టంలో ప్రతిపాదించారు. అయితే ఈ అప్పీల్ అవకాశం ఆర్డీవో స్థాయిలోనూ ఉండాలని పలువురు సూచించారు. రిజిస్రే్టషన్, మ్యుటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి అని.. ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూఆధార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇస్తామన్న ప్రతిపాదనలపైనా పలు సూచనలు వచ్చాయి. వీటి విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది. సాదాబైనామాలకు అవకాశం ఆర్వోఆర్–2024 చట్టం అమల్లోకి వస్తే పెండింగ్‌లో ఉన్న 9.4 లక్షల సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది. ఈ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని ప్రత్యేక సెక్షన్లో ప్రతిపాదించారు. ఇక అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి ఈ చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదనే విమర్శలున్నాయి. అయితే అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడానికి, ఆర్వోఆర్ చట్టానికి సంబంధం లేదని.. అసైన్డ్ భూములపై హక్కులు రావాలంటే హక్కుల బదలాయింపు నిషేధిత చట్టాన్ని (పీవోటీ) సవరించాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు వివరిస్తున్నాయి. మొత్తమ్మీద ముసాయిదా చట్టంలో ఒకట్రెండు అంశాల్లోనే మార్పు ఉంటుందని.. అది కూడా మార్గదర్శకాలు తయారు చేసినప్పుడు వాటిలో పొందుపరుస్తారని పేర్కొంటున్నాయి. -
అభయ కేసు : సీఎం దీదీకి గవర్నర్ హుకుం జారీ
కోల్‌కతా: ఆర్జీ కర్ ఆస్పత్రి అభయ ఘటన కేసుతో పశ్చిమ బెంగాల్ ఆందోళనతో అట్టుడికిపోతుంది. ఈ తరుణంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ సీఎం మమతా బెనర్జీకి ఆదేశాలు జారీచేశారు. వెంటనే అత్యవసర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి, సమస్యపై చర్చించాలని ఆదేశించినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.మరోవైపు ఇదే కేసులో కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌పై విమర్శలు వెల్లువెత్తతున్నాయి. వినీత్ గోయల్‌పై వేటు వేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రజల డిమాండ్‌పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని గవర్నర్ సీవీ ఆనంద బోస్.. దీదీకి సూచించినట్లు సమాచారం. ఇదీ చదవండి : 25 దేశాలు.. 135 నగరాల్లో ఆందోళనలురాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనకర పరిణామాలపై ప్రభుత్వం బాధ్యత వహించాలి. మౌనంగా ఉండకూడదు. రాష్ట్రం.. రాజ్యాంగం,చట్టబద్ధమైన పాలనలో పనిచేయాలి. వైద్యురాలి ఘటన కేసులో సమస్యను గుర్తించకుండా, అలసత్వం ప్రదర్శించకూడదు. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను తొలగించాలనే ప్రజల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి’ అని సీవీ ఆనంద బోస్ ప్రభుత్వానికి ఆదేశించినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. #KolkataHorror | #ShaktiFightback The Governor's directives to W.B CM Mamata Banerjee, as per sources: - Hold emergency state cabinet meeting. - Have state cabinet discuss the RG Kar case. - Address demand to replace Kolkata top cop. On the other hand, TMC's… pic.twitter.com/hp84HL0LxR— TIMES NOW (@TimesNow) September 9, 2024 -
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రివర్స్ టెండరింగ్ తొలగించేందుకు కుట్ర
-
కూటమి ప్రభుత్వంలో రోజుకో ‘చిత్రం’! పుత్రరత్నం కోసం..
విజయవాడ, సాక్షి: రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదువా?. తన తనయుడు, మంత్రి నారా లోకేష్ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలపై అధికార వర్గాల్లో ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెడ్ బుక్ పాలనతో రెచ్చిపోమ్మని చినబాబుకు హక్కులు కట్టబెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు పాలనాపరమైన వ్యవహారాలను సైతం తనయుడి కోసం వాయిదా వేస్తుండడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. నారా లోకేష్ పర్యటనల వివరాలు టీడీపీ వర్గాలకే తెలియకుండా రహస్యంగా ఉంచుతుంటారు చంద్రబాబు. తాజాగానూ ఆయన అలాంటి పర్యటనలోనే ఉన్నారట. ఈ క్రమంలో ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం.. రేపటికి వాయిదా పడింది. ఇందుకు లోకేషే కారణం. తొలుత ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేరిట ఆదేశాలు వెలువడ్డాయి. అయితే.. లోకేష్ విహార యాత్ర ఉందని తెలియక ఆ ఆదేశాలు పంపిన సీఎస్.. ఆ వెంటనే తేదీని మార్చేసి మరోసారి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇదేం కొత్త కాదు. ఈ నెలలోనే ఇలా జరగడం రెండోసారి. ఈ నెల రెండో తేదీ జరగాల్సిన కేబినెట్ భేటీని లోకేష్ విహారయాత్ర నేపథ్యంలోనే.. 7వ తేదీకి మార్చారు. ఇప్పుడు కూడా రహస్య పర్యటన నేపథ్యంలోనే మరోసారి మార్చారు. ఒక మంత్రి లేకుండా కేబినెట్ సమావేశం వాయిదా వేసిన దాఖలాలు గత ప్రభుత్వాల్లో ఏనాడూ లేదని, లోకేష్ సీఎం చంద్రబాబు కొడుకు కాబట్టే ఇలా నడుస్తోందని అధికార వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఇంకెన్ని చిత్రాలు చూడాలో?!.ఇదీ చదవండి: కాల్చుకు తింటున్న కూటమి సర్కార్! -
జలాశయాల్లో పూడికతీత
సాక్షి, హైదరాబాద్: రాజస్తాన్, మహారాష్ట్రల తరహా రాష్ట్రంలోని జలాశయాల్లో పూడిక తొలగించనున్నారు. ఇందుకోసం భారీ యంత్రాలతో తవ్వకాలు (మెకానికల్ డ్రెడ్జింగ్) జరిపే పనులను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ విధానంలో పూడికతీతకు ప్రభుత్వం ఎలాంటి ఖర్చు చేయదు. పైగా ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ఆధ్వర్యంలో టెండర్లు ఆహ్వానించి అత్యధిక ధర కోట్ చేసిన బిడ్డర్‌కు పూడికతీత పనులు అప్పగించే అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది.బిడ్డర్ పన్నులు, సెస్, జీఎస్టీ, రాయల్టీని పనులు దక్కించుకున్న వారు చెల్లించాల్సి ఉంటుంది. తవ్విన మట్టి, ఇసుకను బిడ్డర్ విక్రయించుకోవచ్చు. అయితే ఈ మోడల్ అమలుపై తుది నిర్ణయం తీసుకోలేదు. జలాశయాల్లో పూడిక తొలగింపుపై కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జాతీయ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఉత్తమ్ నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. అనేక అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. ⇒ రాష్ట్రంలో మొత్తం 929 టీఎంసీల సామర్థ్యం కలిగిన 159 భారీ జలాశయాలున్నాయి. సగానికి పైగా జలాశయాలు 25 ఏళ్లకు పైబడినవే కావడంతో భారీగా పూడిక పేరుకుపోయింది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన 14 ప్రాజెక్టులపై అధ్యయనం జరపగా, పూడికతో అవి 35 టీఎంసీల (16శాతం) నిల్వ సామర్థ్యం కోల్పోయినట్టు తేలింది. ⇒ పూడికతో ఏటా ప్రపంచవ్యాప్తంగా రిజర్వాయర్లు 0–5 శాతం వరకు నిల్వ సామర్థ్యాన్ని నష్టపోతున్నాయి. ⇒ పీఎం కిసాన్ సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) మార్గదర్శకాల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన కొత్త జలాశయం నిర్మించడానికి రూ.162 కోట్లు కావాలి. ⇒ జలాశయాల్లో పూడిక పెరగడంతో నిల్వ సామర్థ్యాన్ని నష్టపోతున్నాయి. వాటి రక్షణపై ప్రభావం చూపడంతోపా టు ఆయకట్టుకు సాగునీరు, తాగునీటి సరఫరాలో లోటు ఏర్పడుతోంది. పర్యా వరణ సమస్యలూ తలెత్తుతున్నాయి. ⇒ జలాశయాలు, డ్యామ్‌లు, ఆనకట్ట లు, బరాజ్‌లు, నదులు, కాల్వల్లో పూడికతీత పనులకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరముండదు. కేంద్రం మినహాయింపు కల్పించింది. పూడికతీత ద్వారా వాటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించాలి. ⇒ నీటిపారుదల, గనుల శాఖలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈనెల 14న సమగ్ర నివేదిక సమర్పించాలి. పూడికతీత చేపట్టిన రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి. ⇒సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూడికతీత జరగాలి. వాటి రక్షణ విషయంలో రాజీ పడరాదు. ⇒ పూడికతీతలో సారవంతమైన మట్టిని వెలికితీస్తే రైతాంగానికి ఉచితంగా సరఫరా చేయాలి. రవాణా చార్జీలు రైతులే భరించాలి. ⇒ పూడికతీతతో వెలికితీసే ఇసుకను ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి వాడాలి. మట్టిని ఎప్పటికప్పుడు ఇతర చోట్లకు తరలించాలి. -
‘వక్ఫ్’ అధికారాల కట్టడి!
న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టాన్ని సమూలంగా మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేస్తూ వక్ఫ్ చట్టానికి సవరణలకు కసరత్తు పూర్తి చేసింది. మొత్తం 40 సవరణలకు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఏదైనా ఆస్తిని వక్ఫ్ ప్రాపరీ్టగా గుర్తించే వక్ఫ్ బోర్డు అధికారాన్ని పరిమితం చేయడమే సవరణల లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డు క్లెయిం చేసే ఆస్తులకు వెరిఫికేషన్ ప్రక్రియ తప్పనిసరి. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర బోర్డులలో మహిళలకు ప్రాతినిధ్యం కలి్పంచడం కూడా సవరణల్లో ఒకటి. బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చని సమాచారం. ఈ చర్యలను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా ఖండించింది. వక్ఫ్ బోర్డుల అధికారాలు తదితరాల్లో ఎలాంటి జోక్యాన్నీ సహించేది లేదని ప్రకటించింది. అవసరమైతే కోర్టుకు వెళ్లయినా వీటిని అడ్డుకుంటామని స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డులు సుమారు 9,40,000 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 8,70,000 ఆస్తులను పర్యవేక్షిస్తున్నాయి. వక్ఫ్ చట్టం 1995కు యూపీఏ ప్రభుత్వం 2013లో కొన్ని సవరణలు చేసి బోర్డుల అధికారాన్ని పెంచింది. పుణ్య, మతపరమైన లేదా ధారి్మక ప్రయోజనాల కోసం ఆస్తిని ఇవ్వడాన్ని వక్ఫ్ అంటారు. ఈ ఆస్తులను నియంత్రించడానికి చట్టం స్థాపించబడింది.ఈ భూములపై వచ్చే ఆదాయం పేద ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు, ధారి్మక కార్యక్రమాల నిర్వహణ కొరకు వాడాలి. దాతలు యిచి్చన ఈ భూముల్ని అమ్మే అధికారం వక్ఫ్ బోర్డుకు సైతం లేదు. అయితే రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు విస్తృతమైన హక్కులున్నాయి. ఇలాంటి ఆస్తులను సర్వే చేయడానికి ఆలస్యమవుతోందని ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. ఆస్తుల దురి్వనియోగాన్ని నివారించడానికి, వక్ఫ్ ఆస్తులను పర్యవేక్షించడంలో జిల్లా మేజి్రస్టేట్లను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా పలు మార్పులు చేయాలని నిర్ణయించింది. మత స్వేచ్ఛకు వ్యతిరేకం: ఒవైసీ వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేసే ప్రతిపాదనను ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ‘‘దీని వెనుక బీజేపీ హిందూత్వ ఎజెండా ఉంది. మత స్వేచ్ఛను దెబ్బతీయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. వక్ఫ్ ఆస్తులను లాక్కునేందుకే ఈ సవరణలు. ఇది మతస్వేచ్ఛకు విరుద్ధం’’ అని ఆరోపించారు. -
రేపు కేంద్ర కేబినేట్ భేటీ
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు(గురువారం) కేంద్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. గురువారం ఉదయం 10:30 గంటలక కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. Union Cabinet to meet tomorrow, 18th July at 10:30 AM: Sources— ANI (@ANI) July 17, 2024 -
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
అమరావతి, సాక్షి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. మంగళవారం సచివాలయంలో జరిగిన ఈ భేటీలో ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా చర్చించినట్లు సమాచారం.నేటి మంత్రి మండలి భేటీలో కొత్త ఇసుక విధానానికి అమోదం తెలిపిన కేబినెట్.. ఇసుక పాలసీ విధివిధానాల రూపకల్పనపై మాత్రం ఎటూ తేల్చలేకపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే.. పౌర సరఫరాల శాఖ ద్వారా 2 వేల కోట్లు అప్పు తీసుకునేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.ఇక.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైనా కేబినెట్లో చర్చ జరిగింది. ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుందని, అలాగే సీఎం చంద్రబాబు ఇటీవల ప్రవేశపెట్టిన శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చించాలనే కేబినెట్ నిర్ణయించినట్లు సమాచారం. -
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సాక్షి, అమరావతి: సచివాలయంలో మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సందర్భంగా తల్లికి వందనం, కొత్త ఇసుక, ఎక్సైజ్ పాలసీకి సంబంధించి నూతన విధానాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపైనా చర్చిస్తారని తెలిసింది.ఉదయం 10:45 గంటలకు సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరి రోడ్డు మార్గంలో సచివాలయానికి చేరుకుంటారు. 11 గంటలకు మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 3:45 గంటలకు సచివాలయం నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానశ్రయానికి చేరుకుని ఢిల్లీకి వెళ్తారు. -
రేపు ఏపీ కేబినెట్ భేటీ
సాక్షి, విజయవాడ: రేపు(మంగళవారం) ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.మరోవైపు.. సీఎం చంద్రబాబు రేపు(మంగళవారం) సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్రమంత్రులను చంద్రబాబు కలవనున్నట్టు తెలుస్తోంది. -
ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ
సాక్షి, విజయవాడ: ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదంపై చర్చించనున్నట్లు సమాచారం. 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు చర్చించే అంశాలు శాఖల వారీగా ఇవ్వాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. -
రేపు కేంద్ర కేబినెట్ సమావేశం
న్యూఢిల్లీ, సాక్షి: ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు(జులై 3, బుధవారం) సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. భేటీ ఎజెండా, అందులో చర్చించబోయే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
నేడు ఏపీ తొలి కేబినెట్ సమావేశం
-
వలంటీర్ల వ్యవస్థపై నేడు స్పష్టత!
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కిందట రాష్ట్రంలో కొత్తగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం యథావిధిగా పూర్తిస్థాయిలో అమలు చేస్తుందా లేక మార్పులు చేస్తుందా అన్నదానిపై సోమవారం కొంత స్పష్టత వస్తుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో గెలుపొందిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వలంటీర్ల వ్యవస్థపై చర్చించే అవకాశం ఉందని, ఈ వ్యవస్థపై ప్రభుత్వ ఆలోచనలు ఏమిటన్నది తెలుస్తుందని చెబుతున్నాయి.చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ.. గత ఐదేళ్లలో కొత్తగా ఏర్పడిన ఈ వ్యవస్థకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయనతోపాటు మంత్రివర్గ సభ్యులందరికీ కూలంకషంగా వివరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధికారులు వివిధ రకాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు (పీపీటీలు) సిద్ధం చేశారు. మంత్రివర్గ సమావేశానికి ముందే సోమవారం సంబంధిత మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఆ శాఖ అధికారులతో వేరుగా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున మొత్తం 2.65 లక్షలమంది వలంటీర్లతో 2019 ఆగస్టు 15న గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన విషయం తెలిసిందే. అదే ఏడాది 2019 ఆక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను కూడా అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు ఏకంగా 1.34 లక్షల కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసి అప్పటికప్పుడే భర్తీ చేసింది.ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. అయితే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా గౌరవ వేతనంతో పనిచేసే 2.65 లక్షల మంది వలంటీర్లపై మొన్నటి ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అనేక ఆంక్షలు విధించడంతో పాటు ఇతర కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వలంటీర్లు రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం దాదాపు లక్షన్నరమంది వలంటీర్లు మాత్రమే పనిచేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. -
ఒకే దఫా రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దఫాలో రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని తెలిపింది. ఇందుకు రూ. 31 వేల కోట్లు అవసరమని పేర్కొంది. సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9వ తేదీని రుణమాఫీకి కటాఫ్‌గా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రుణమాఫీపై రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమై చర్చించింది. అనంతరం సహచర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గే మడమ తిప్పని నాయకులు ‘2022 మే 6వ తేదీన వరంగల్‌లో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్‌లో రూ.2 లక్షల వరకు రుణమాఫీ ప్రకటించారు. అందుకు సంబంధించి మంత్రివర్గంలో విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నాం. వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేయాలన్న కాంగ్రెస్ విధానంతో ముందుకుపోతున్నాం. సోనియాగాం«దీ, రాహుల్‌గాం«దీ, ఖర్గే మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు. 2004లో కరీంనగర్లో తెలంగాణ ఇస్తానన్న మాటను సోనియా నిలబెట్టుకున్నారు. దానివల్ల ఏర్పడిన రాజకీయ సంక్షోభం, కాంగ్రెస్ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు అందరికీ తెలుసు. సోనియా మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారు. సోనియాగాంధీ ఏదైనా మాట చెప్పారంటే అది శిలాశాసనమే. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిలబడతారు. రూ.2 లక్షల రుణమాఫీపై మేధావులు, విశ్లేషకులు కూడా కాంగ్రెస్‌వి అలవి కాని మాటలు అంటూ వ్యాఖ్యానించారు..’ అని సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణ విముక్తి ‘కేబినెట్లో రుణమాఫీ విధివిధానాలపై చర్చించాం. త్వరలో జీవో విడుదల చేస్తాం. రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరం. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఐదేళ్లలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. రుణమాఫీకి అవసరమైన సొమ్మును సేకరించి రైతులకు రుణవిముక్తి కల్పిస్తాం.ప్రజాపాలన, రైతు సంక్షేమం, రైతు రాజ్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. రుణమాఫీతో 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వం 2014, 2018లలో రెండుసార్లు రుణమాఫీ చేసింది. మొదటిసారి రూ.16 వేల కోట్లు, రెండోసారి రూ.12 వేల కోట్లు మాఫీ చేసింది. ఇలా రెండు విడతలుగా చేసిన రుణమాఫీ మొత్తం రూ.28 వేల కోట్లు మాత్రమే. అప్పటి ప్రభుత్వం 2018 డిసెంబర్ 11వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది..’ అని రేవంత్ చెప్పారు. 8 నెలల్లోగానే రుణమాఫీ ‘గత ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని నాలుగు విడతలు, వడ్డీ మాపీ చేస్తామని చెప్పి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రైతులను సంక్షోభం వైపు తీసుకెళ్లి అన్నదాతల ఆత్మహత్యలకు కారణమైంది. పదేళ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కానీ మా ప్రభుత్వం 8 నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ పార్లమెంటు ఎన్నికలు రావడంతో రెండున్నర నెలలు కోడ్‌లోనే గడిచిపోయాయి. అయితే 8 నెలల్లోపే సామాజిక బాధ్యతతో రుణమాఫీకి చేసేందుకు మంత్రివర్గం మొత్తం ఏకతాటిమీద నిలిచి, ఏక గొంతుకతో నిర్ణయం తీసుకుంది. రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల్లోని రైతు రుణాల వివరాలను సేకరించాం..’ అని సీఎం తెలిపారు. నిధుల సేకరణ బాధ్యత ఆర్థిక మంత్రిది ‘రుణమాఫీకి నిధుల సేకరణ ఆర్థిక మంత్రి భట్టి బాధ్యత. ఈ విషయంలో ఏదైనా ఉంటే ఆయన్ను సంప్రదించవచ్చు. ఏ ప్రాతిపదికన చేస్తామనేది మా అంతర్గత అంశం. అయితే గడువులోగానే చేస్తాం. ఆయనలాగా (కేసీఆర్) వాయిదాలతో చేయాలంటే ఇంత హడావుడి ఎందుకు? గడువు కంటే ముందు చేస్తే మీకేమైనా (విలేకరులకు) అభ్యంతరమా? తినబోతూ రుచులెందుకు? దీనిపై ఎవరికీ శషబిషలు అవసరం లేదు. నియమ నిబంధనలు అన్నీ జీవోలో పొందుపరుస్తాం..’ అని రేవంత్ చెప్పారు. రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ‘రైతు భరోసా (గతంలో రైతుబంధు)పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, ధనికులకు ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశాం. రైతు ప్రతినిధులు, రైతు సంఘాలు సహా పలువురు స్టేక్ హోల్డర్లతో చర్చించి జూలై 15వ తేదీలోగా కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఆ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతుభరోసా కల్పించేలా నిర్ణయం తీసుకుంటాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కొన్ని పత్రికలు లేనిపోనివి రాస్తున్నాయి.. ‘మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వ పరిపాలన పరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యత మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు అప్పగించాం. వారిద్దరు ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారం. ఏదైనా సమాచారం ప్రసారం చేసేముందు మీడియా మిత్రులు ఇది గమనించాలి. కొన్ని పత్రికలు లేని వార్తలను రాస్తున్నాయి. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఎక్కడో ఒకదగ్గర ఎవరో ఏదో మాట్లాడారని చెబుతూ వార్తలు రాస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, వివరాలపై, అలాగే అపోహాలపై సమాచారం కావాలంటే ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదించాలి. ఊహించుకొని, కాయించుకొని రాయకుండా ఇలా చేశాం. మిగతా విషయాలకు సంబంధించిన వివరాలను ఆయా శాఖల మంత్రులు ఇస్తారు. అయితే రాజకీయాలపై ఎవరైనా ఏదైనా మాట్లాడతారు..’ అంటూ రేవంత్ వివరించారు. సాహసోపేతమైన నిర్ణయం: తుమ్మల రుణమాఫీ ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయమని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఆర్థికంగా ఎంత కష్టమున్నా, ఇబ్బంది ఉన్నా రుణమాఫీ చేయడానికి పూనుకున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మాఫీ లెక్క తేలిందా? సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూ. 31 వేల కోట్ల రుణమాఫీ ప్రకటించింది. ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రకటించారు. అయితే ఒక్క 2023– 24లోనే తెలంగాణలో రైతులు ఏకంగా రూ. 64,940 కోట్ల స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని 2022 మే నెలలోనే ప్రకటించింది.ఈ నేపథ్యంలో గత ఏడాది రుణాలు తీసుకున్న చాలామంది రైతులు తిరిగి చెల్లించలేదని బ్యాంక్ వర్గాలు అంటున్నాయి. కాగా ఒక్క ఏడాదిలో రూ. 64 వేల కోట్ల రుణాలుంటే రూ. 31 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పడమేమిటని విశ్లేషకులు అంటున్నారు. ఒక్క ఏడాదికే ఇంత తేడా ఉంటే.. ఐదేళ్లకు ఎంత ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ లెక్కలపై స్పష్టత రావాల్సి ఉంది. -
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
-
సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ..
ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర మంత్రివర్గం,ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) తొలి సమావేశం ఇవాళ సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధాన ఆర్థిక విధానాలు,పలు కార్యక్రమాలను చర్చ జరగనుంది.అనంతరం,జులైలో జరగనున్న 2024-25 పూర్తి బడ్జెట్‌పై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీసీఈఏ అంటే ఏమిటి?ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ)కేంద్రంలోని అత్యంత ముఖ్యమైన కమిటీలలో ఒకటి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పారిశ్రామిక విధానాలు, ఇతర కీలక ఆర్థిక కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలను ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.సీసీఈఏలో 8 కేబినెట్ కమిటీలు:1. కేబినెట్ నియామకాల కమిటీ2. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 3. రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ4. పెట్టుబడి,వృద్ధిపై కేబినెట్ కమిటీ5. భద్రతపై కేబినెట్ కమిటీ6. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ7. ఉపాధి,నైపుణ్యాభివృద్ధిపై కేబినెట్ కమిటీ8. వసతిపై కేబినెట్ కమిటీ -
చంద్రబాబు కేబినెట్ తొలి భేటీ ముహూర్తం ఖరారు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో కొలువు దీరిన కొత్త మంత్రి వర్గ తొలి సమావేశానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 24వ తేదీన ఉదయం సచివాలయం మొదటి బ్లాకులో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అన్ని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.ఇక కొత్త మంత్రులు ఒక్కొక్కరిగా బాధ్యతలు స్వీకరిస్తూ వస్తున్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన శాసన సభ సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్-డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. బుధవారం శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు.ఇదీ చదవండి: డిప్యూటీ సీఎంగా పవన్, తొలి సంతకం దేని మీద అంటే.. -
మోదీ 3.0 : కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు
సాక్షి, ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాన మంత్రి కేంద్రమంత్రులకు శాఖలను కేటాయించారు. ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ, పట్టణాల్లో 3కోట్ల గృహాలు నిర్మించేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయిఅమిత్ షా : కేంద్ర హోం శాఖనిర్మల సీతారామన్ : ఆర్థిక శాఖజయశంకర్ - విదేశాంగ శాఖరాజ్ నాథ్ సింగ్ :రక్షణ శాఖమనోహర్ లాల్ కట్టర్ : పట్టణ అభివృద్ధి శాఖశివరాజ్ సింగ్ చౌహన్ : వ్యవసాయ శాఖ మంత్రి , పంచాయతీరాజ్ శాఖసీఆర్ పాటిల్ : జలశక్తిపీయూష్ గోయల్ : వాణిజ్య శాఖ మంత్రిఅశ్విని వైష్ణవ్ : సమాచార శాఖ మంత్రిధర్మేంద్ర ప్రధాన్ : మానవ వనరులు అభివృద్ది శాఖగజేంద్ర సింగ్ శేకావత్ : టూరిజం, సాంస్కృతిక శాఖ జేపీ నడ్డా : వైద్య ఆరోగ్య శాఖ మంత్రిజితిన్ రాం మాంజీ : సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమల శాఖ మంత్రిఅన్నపూర్ణ దేవి : మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిభూపేంద్ర యాదవ్ : అటవీ, పర్యావరణ శాఖకిరణ్ రిజిజు : పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిచిరాగ్ పాశ్వాన్: క్రీడా శాఖ మంత్రికుమారస్వామి : భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ : షిప్పింగ్ శాఖ మంత్రిజ్యోతి ఆదిత్య సింధియా: టెలికాం, ఈశాన్య రాష్ట్రాల శాఖప్రహ్లాద జోషి : రెన్యూవబుల్ ఎనర్జీరవణీత్ సింగ్ బిట్టు : మైనార్టీ శాఖ సహాయ మంత్రిహర్ష మల్హోత్ర - రోడ్లు జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రిసురేష్ గోపి : టూరిజం సహాయ శాఖ మంత్రితెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవేకిషన్ రెడ్డి : కేంద్ర గనుల శాఖ మంత్రిబండి సంజయ్ : హోంశాఖ సహాయ మంత్రిరామ్మోహన్ నాయుడు : కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రిశ్రీనివాస్ వర్మ : ఉక్కు, భారీ పరిశ్రమలు శాఖ సహాయ మంత్రిపెమ్మసాని చంద్రశేఖర్ : గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రులు వీరే.. ఇక్కడ క్లిక్ చేయండిమరికొద్ది సేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ మంత్రి వర్గం సమావేశం లోపే నేతలకు శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులకు ఎవరికి ఏయే శాఖ కేటాయిస్తారని అంశంపై ఉత్కంఠ కొనసాగుతుండగా..సీనియర్ మంత్రులను అదే శాఖల్లో కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదివారం కొలువుదీరిన మోదీ 3.0 కేబినెట్లో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు చేరారు. వారికి కీలక శాఖలు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. హోం,రక్షణ శాఖ, ఆర్ధిక శాఖ వంటి కీలక పదవులు బీజేపీ నేతలకేననే ప్రచారమూ కొనసాగుతుంది.ప్రాధన్యాత కలిగిన శాఖపై కిషన్ రెడ్డి పట్టుమరోవైపు తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతున్నాయనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఏపీ, తెలంగాణలకు రెండు కేబినెట్, మూడు సహాయమంత్రి పదవులు దక్కనున్నాయి. అయితే తెలంగాణ నుంచి గతంలో కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ టూరిజం శాఖ అప్పగించాగా.. ఈ సారి మాత్రం ఈసారి ప్రాధాన్యత కలిగిన శాఖను కిషన్ రెడ్డి ఆశిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలపైనా ఇక క్యాబినెట్ సమావేశంలో పార్లమెంటు సమావేశాల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈనెల 15 నుంచి 22 వరకు పార్లమెంట్ సమావేశాలను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం కానుందని, 15 నుంచి మూడు రోజులపాటు ఎంపీల ప్రమాణస్వీకారం, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉండనుంది. అనంతరం ఈనెల 22న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. -
ప్రధానిగా మోదీ తొలి సంతకం
న్యూఢిల్లీ, సాక్షి: నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. మూడోసారి ప్రధాని పదవిగా ప్రమాణం చేశాక.. సోమవారం ఉదయం పార్లమెంట్ సౌత్‌బ్లాక్‌లోకి ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉద్యోగులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఇక.. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధి నిధుల విడుదల ఫైల్ ఫై తొలి సంతకం చేశారు. తద్వారా.. 9.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో 20వేల కోట్ల రూపాయల నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది’’ అన్నారు. ఇవాళ సాయంత్రం ఆయన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో.. కొత్త ప్రభుత్వం-వంద రోజుల కార్యచరణపై ఆయన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అలాగే.. స్పీకర్ ఎన్నిక తదితర అంశాల కోసం పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని సిఫార్సు చేసి.. దానిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిచే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎవరికి ఏ శాఖ ?..మోదీ కేబినెట్ మీటింగ్
-
ప్రధాని పదవికి మోదీ రాజీనామా
న్యూఢిల్లీ: మోదీ 2.0 కేబినెట్ చివరి సమావేశం ఢిల్లీలో ముగిసింది. 17వ లోక్‌సభను రద్దు చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ప్రధాన పదవికి రాజీనామా లేఖతో పాటు 17వ లోక్‌సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందించారు.ఈ నెల 7న జరిగే బీజేపీ,ఎన్డీఏ సమావేశంలో మోదీని నేతగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం 8న మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు కేబినెట్ భేటీలో ఎన్డీఏ 3.0 ప్రభుత్వ ఏర్పాటుపైనా చర్చించిట్లు తెలుస్తోంది. కాగా, ఇవాళ సాయంత్రమే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల భేటీ కూడా జరగనుంది. ఈ భేటీలో కొత్త ప్రభుత్వ కూర్పు, ఫ్రెండ్లీ పార్టీలకు మంత్రిపదవులు, ప్రభుత్వ కామన్ ఎజెండా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. భేటీ అనంతరం ఎన్డీఏ నేతలు రాష్ట్రపతిని కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. -
ముందస్తు ఎన్నికలకు సునాక్
లండన్: ముందస్తు ఎన్నికలపై జోరుగా సాగిన ఊహాగానాలే నిజమయ్యాయి. పలురకాలుగా సాగిన ఊహాగానాలకు తెరదించుతూ జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రాజు చార్లెస్–3కి తెలిపానని, పార్లమెంట్ రద్దుకు ఆయన అనుమతించారని వెల్లడించారు. వేసవిలో ఆరు వారాల్లో ఎన్నికలకు వెళుతున్నట్లు చెప్పారు. అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో కేబినెట్ భేటీ అనంతరం భారతీయ సంతతి బ్రిటన్ ప్రధాని సునాక్ ముందస్తు ఎన్నికల ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమైతే 2025 జనవరిలోగా బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. 10 డౌనింగ్ స్ట్రీట్ బయట ఎన్నికల ప్రకటన చేస్తూ.. తన పదవీకాలంలో సాధించిన విజయాలను సునాక్ వివరించారు. ‘మీకు వీలైనంత భద్రత ఇవ్వడానికి నా అధికార పరిధికి లోబడి చేయగలిగినంతా చేస్తాను. ఇది నా హామీ. బ్రిటన్ తన భవిష్యత్తును ఎంచుకోవాల్సిన తరుణమిది’ అని రిషి సునాక్ దేశ ప్రజలనుద్దేశించి అన్నారు. సునాక్ కన్జర్వేటివ్ పారీ్టకి ఓటమి తప్పదని, లేబర్ పార్టీకి విస్పష్ట మెజారిటీ కనిపిస్తోందని చాలా ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో వరుసబెట్టి లేబర్ పారీ్టయే గెలుస్తూ వచ్చింది. ఈ తరుణంలో రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సాహసం చేయడం గమనార్హం. అంతకుముందు బుధవారమే పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సునాక్ బదులిస్తూ ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలుంటాయని చెప్పారు. అయితే ఆకస్మింగా కేబినెట్ భేటీని ఏర్పాటు చేయడంతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆకస్మిక కేబినెట్ భేటీ కోసం విదేశాల్లో ఉన్న మంత్రులు సైతం అర్ధంతరంగా తమ పర్యటనలు ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. చివరికి కేబినెట్ సమావేశం అనంతరం సునాక్ జూలై 4న ఎన్నికలుంటాయని ప్రకటించారు. -
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
-
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు.. మంత్రివర్గ భేటీ నిర్వహణ కోసం పలు షరతులతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్ ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు.అత్యవసరమైన అంశాలు మాత్రమే..లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు.. అత్యవసరమైన, నిర్ణీత గడువులోగా అమలు చేయాల్సిన అంశాలను మాత్రమే కేబినెట్ భేటీలో చర్చించాలని ఈ లేఖలో ఈసీ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్న నేపథ్యంలో.. అప్పటి వరకు నిరీక్షించడం సాధ్యం కాని, అత్యవసరమైన అంశాలను మాత్రమే మంత్రివర్గ సమావేశం ఎజెండాలో చేర్చాలని పేర్కొంది. మంత్రివర్గ సమావేశం ఎజెండాలో ప్రతిపాదించిన రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇక ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులెవరినీ సమావేశానికి హాజరుకావాలని కోరరాదని ఆదేశించింది.కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లు, పంటల సాగుపై నిర్ణయాలు!వాస్తవానికి గత శనివారమే కేబినెట్ భేటీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈసీ అనుమతి కోరింది. ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసుకుంది. సోమవారంలోగా ఈసీ అనుమతించకుంటే మంత్రులతో కలసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు కూడా. కానీ తాజాగా ఈసీ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం అత్యవసర అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి తొలగిపోయింది. ఈ భేటీలో కాళేశ్వరం బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు, ధాన్యం కొనుగోళ్లు, వర్షాకాలం పంటల సాగు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. -
కేబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..
-
కేబినెట్ భేటీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ, మేడిగడ్డ బ్యారేజీకి అత్యవసర మరమ్మతుల నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడా నికి వీలుగా శనివారం ప్రభుత్వం నిర్వహించతల పెట్టిన మంత్రివర్గ సమావేశం అనివార్య పరిస్థి తుల్లో వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కేబినెట్ భేటీ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని రాష్ట్ర సర్కారు కోరింది. కానీ ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వేయిదా వేసినట్టు శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పాలనపై దృష్టి పెడతామన్న సీఎంరాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ ముగియగా, వచ్చే నెల 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. మార్చి 15న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది జూన్ 6తో ముగియనుంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో రెండు నెలలుగా పాలన వ్యవహారాలు స్తంభించిపోయాయి. సీఎం, మంత్రుల రోజువారీ అధికారిక సమీక్షలు, సమావేశాలు బంద్ అయ్యా యి. ఈ నేపథ్యంలో 13న పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాలన వ్యవహారాలపై మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే కేబినెట్ భేటీ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులు కేబినెట్ భేటీ కోసం హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. ఒడిశా నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముంబై నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాయ్‌బరేలి నుంచి సీతక్క నగరానికి చేరుకున్నారు. ఏక్షణంలోనైనా ఈసీ అనుమతి లభించవచ్చనే ఉద్దేశంతో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలో వేచిచూశారు. రాత్రి 7 గంటల వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసింది. ఒకపక్క ఈసీ అనుమతి కోసం నిరీక్షిస్తూనే సీఎం రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత సీఎం, మంత్రులు సచివాలయం నుంచి వెళ్లిపోయారు. ఎజెండాలో కీలక అంశాలుజూన్ 2తో రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తికా నున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల మధ్య అపరిష్కృతంగా ఉండి పోయిన విభజన వివాదాలు, ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణ, ధాన్యం కొను గోళ్లు, రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి గాను మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అలాగే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం బ్యారేజీల మరమ్మ తులు, ఈ విషయమై నిపుణుల కమిటీ సమర్పించిన మధ్యంతర నివేదికలోని సిఫారసుల అమలుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకుంది. స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కానీ ఈసీ అనుమతించకపోవడంతో ఇందుకు అవకాశం లేకుండా పోయింది. అవసరమైతే ఈసీని కలుస్తాం: సీఎం రేవంత్ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడు అనుమతి వస్తే అప్పుడు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. సోమవారం వరకు ఈసీ నుంచి అనుమతి రానిపక్షంలో, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఆయన తెలిపారు. అప్పటికీ ఈసీ సానుకూలంగా స్పందించని పక్షంలో జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, ఇతర అత్యవసర అంశాలపై చర్చించలేకపోయామని సీఎం పేర్కొన్నారు. -
వీడిన గందరగోళం.. సాయంత్రం కేబినెట్ భేటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రిమండలి సమావేశ నిర్వహణపై గందరగోళం వీడింది. ఇవాళ భేటీ ఉంటుందని రెండ్రోజుల కిందటి సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించగా.. సీఎం కార్యాలయం నుంచి మంత్రులకు ఇప్పటిదాకా అధికారిక సమాచారం వెళ్లకపోవడంతో ఉంటుందా? ఉండదా? అనే చర్చ నడిచింది. చివరకు సాయంత్రం భేటీ ఉంటుందని తెలుస్తోంది. కీలకమైన అంశాలపై తెలంగాణ మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగానే తెలంగాణ కేబినేట్ సమావేశం పై తర్జనభర్జన కొనసాగింది. మరోవైపు ఇప్పటికే కేబినేట్ భేటీలో చర్చించే అంశాలు ఇవేనంటూ సీఎంవో కొన్ని అంశాలను మీడియాకు విడుదల చేసింది. తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలురుణమాఫీ నిధుల సమీకరణ పై నిర్ణయంధాన్యం కొనుగోళ్లు , ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చరాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చమేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చకొత్త విద్యా సంవత్సరం లో చేపట్టవలసిన చర్యలపై చర్చకేబినెట్ భేటీ నిర్వహణ కోసం ఎన్నికల సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోరినట్లు సమాచారం. అయితే అనుమతి దొరికిందా? లేదా? అనే స్పష్టత రాలేదు. ఈలోపే సాయంత్రం 4గం. కేబినెట్ భేటీ ఉంటుందని మీడియాకు సీఎంవో సమాచారం అందించింది. -
తొలి వంద రోజులకు, వచ్చే ఐదేళ్లకు రోడ్‌మ్యాప్
న్యూఢిల్లీ: మరో రెండు నెలల్లో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వానికి తొలి వంద రోజుల రోడ్‌మ్యాప్‌తోపాటు రాబోయే ఐదేళ్ల రోడ్‌మ్యాప్ రూపొందించాలని మంత్రివర్గ సహచరులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. మోదీ అధ్యక్షతన ఆదివారం ఉదయం ఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. తొలి వంద రోజుల రోడ్‌మ్యాప్, ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను సమర్థంగా ఎలా అమలు చేయాలన్నదానిపై నిపుణులతో, సంబంధిత శాఖల కార్యదర్శులతో సంప్రదింపులు జరపాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు జరిగే తేదీలను నోటిఫై చేసే ప్రక్రియను కేంద్ర కేబినెట్ ప్రారంభించింది. ఎన్నికల సంఘం ప్రతిపాదనలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మంత్రివర్గం పంపించింది. రాష్ట్రపతి ఆమోదంతో తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 20న వెలువడనుంది. నోటిఫికేషన్ అనంతరం నామినేషన్ల పక్రియ ప్రారంభమవుతుంది. ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వేర్వేరు తేదీల్లో ఏడు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. -
ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
-
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ!
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రేపోమాపో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రానుందనే ప్రచారం నేపథ్యంలో కేబినెట్ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలే ఈ భేటీ ఎజెండాలో ప్రధానంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పునరుద్ధరణ, వారికి రూ.5 లక్షల జీవిత బీమా పథకం అమలు తదితర అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటనపై సైతం మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలిసింది. సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో జరగనున్న మహిళా సదస్సులో ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయాలను ప్రకటించనున్నారు. కాగా మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పట్లో అమలు చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే నిర్ణయాలు ఉండకపోవచ్చని తెలిసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై నిర్ణయం గవర్నక్ కోటా కింద నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. తాజాగా ఈ ఉత్తర్వులను కొట్టివేసిన రాష్ట్ర హైకోర్టు, వారి పేర్లను పునః పరిశీలన జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమెర్ అలీ ఖాన్‌లను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్రమంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మళ్లీ కోదండరాం, ఆమెర్ అలీ ఖాన్ల పేర్లనే గవర్నర్‌కు ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ప్రభుత్వంలో కొనసాగుతున్న 1100 మంది రిటైర్డ్ అధికారులను కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అలాగే విద్యుత్ సంస్థల్లో కొత్త డైరెక్టర్లు, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం, అదనపు పోస్టులతో గ్రూప్–2, గ్రూప్–3 అనుబంధ నోటిఫికేషన్ల జారీ లాంటివి కూడా మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉంది. కాళేశ్వరంపై 15 అంశాల్లో విచారణ కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం, కొత్త సచివాలయం, అమరవీరుల స్థూపం నిర్మాణం, మిషన్ భగీరథ వంటి అంశాలపై జ్యుడిషియల్, విజిలెన్స్ విచారణలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆయా విచారణలకు సంబంధించిన విధివిధానాలను కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. విజిలెన్స్, ఏసీబీ, సీఐడీ, ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయయూర్తితో కమిషన్ వేసి విచారణకు ఆదేశించే అంశంపై నిర్ణయం తీసుకోన్నుట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 15 అంశాలపై విచారణ జరిపించాలని ప్రతిపాదిస్తూ ఆ మేరకు విధివిధానాలను (టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్) నీటిపారుదల శాఖ సిద్ధం చేసింది. -
Lok Sabha elections 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంపు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని(డీఏ), పెన్షనర్లకు కరువు సహాయాన్ని(డీఆర్) బేసిక్ పే/పెన్షన్‌పై మరో 4 శాతం పెంచింది. ప్రస్తుతం డీఏ/డీఆర్ 46 శాతం ఉంది. తాజా పెంపుతో ఇది 50 శాతానికి చేరింది. పెంచిన భత్యం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. దీనివల్ల కోటి మందికిపైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని తెలియజేసింది. ఉద్యోగులకు డీఏ అదనపు వాయిదా సొమ్ము, పెన్షనర్లకు కరువు సహాయం(డీఆర్) సొమ్ము ఈ ఏడాది జనవరి 1 నుంచి చెల్లించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ధరలు పెరగడంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏను 50 శాతానికి పెంచినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ పెంపు వల్ల ఖజానాపై ప్రతిఏటా రూ.12,869 కోట్ల భారం పడనుంది. 2024 జవవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు ప్రభుత్వం రూ.15,014 కోట్లు చెల్లించనుంది. డీఏ పెంపుతో ఉద్యోగులకు ఇతర భత్యాలు, గ్రాట్యుటీ సైతం పెరుగుతాయి. డీఏ/డీఆర్ కాకుండా ఇతర భత్యాల పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.9,400 కోట్ల భారం పడుతుంది. ఏడో కేంద్ర వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారమే డీఏ/డీఆర్‌ను కేంద్రం పెంచింది. ఉజ్వల రాయితీ గడువు పెంపు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్లపై రూ.300 చొప్పున ఇస్తున్న రాయితీ గడువును కేంద్రం మరో ఏడాది పెంచింది. వాస్తవానికి ఈ గడువు ఈ ఏడాది మార్చి 31న ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ రాయితీని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రతిఏటా 12 సిలిండర్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. ముడి జనపనారకు మరో రూ.285 ముడి జనపనారకు కనీస మద్దతు ధరను కేంద్రం మరో రూ.285 పెంచింది. దీనివల్ల క్వింటాల్ ముడి జనపనార ధర రూ.5,335కు చేరుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ కనీస మద్దతు ధర వర్తిస్తుంది. రూ.10,037 కోట్లతో ‘ఉన్నతి’ ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం ‘ఉన్నతి’కి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఈ పథకం రూ.10,037 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించే పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇస్తారు. 2034 మార్చి 31 దాకా ఈ పథకం అమల్లో ఉంటుంది. రూ.10,372 కోట్లతో కృత్రిమ మేధ ఐదేళ్ల పాటు అమలు చేసే ఇండియా కృత్రిమ మేధ(ఏఐ) మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మిషన్‌కు ప్రభుత్వం రూ.10,373 కోట్లు కేటాయించింది. ఈ మిషన్‌లో భాగంగా 10,000 జీపీయూ సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీని అందుబాటులోకి తీసుకొస్తారు. -
సార్వత్రిక ఎన్నికల వేళ.. మార్చి3న కేంద్ర కేబినెట్ భేటీ
ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మార్చి 3న కేంద్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఢిల్లీ చాణక్యపురిలోని సుష్మాస్వరాజ్ భవన్లో కేబినెట్ భేటీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మార్చి రెండో వారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల ముందే.. కేబినెట్ భేటీ కానుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పర్యటించి.. ఎన్నికల సంసిద్ధతను పర్యవేక్షిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మార్చి 9 తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం శాసనసభలకు 2024 మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక.. వీటితోపాటు జమ్మూకశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2014 లోక్‌సభ ఎన్నికలను తొమ్మిది విడతల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. మార్చి 5న ఎన్నికల ప్రక్రియ మొదలై మే 16న ఫలితాలు వెలువడ్డ విషయం తెలిసిందే. 2019లో మాత్రం లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ను ఏడు దఫాల్లో నిర్వహించింది. మార్చి 10న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా మే 23న ఫలితాలను ఈసీ విడుదల చేసింది. చదవండి: కాంగ్రెస్ అకౌంట్ నుంచి రూ. 65 కోట్లు రికవరీ చేసిన ఐటీ -
నేడు మంత్రివర్గ సమావేశం!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు సమాచారం. శాసనసభ, మండలిలో శనివారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నట్లు అధికారవర్గాల సమాచారం. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. శుక్రవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందాక.. మంత్రివర్గ సమావేశం జరుగుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు ఇవే..
-
నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్
సాక్షి, అమరావతి: 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీకి సమర్పించనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024–25 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. అదే సమయానికి శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను చదువుతారు. అంతకు ముందు ఉదయం 8 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. మొత్తం బడ్జెట్ రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. -
మరో రెండు గ్యారంటీలు..తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
-
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 500 గ్యాస్ సిలిండర్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఆదివారం కేబినెట్ మీటింగ్ జరిగింది. తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుదీర్ఘంగా మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణ కేబినెట్.. 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం, 500 గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు, టీఎస్‌ను టీజీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ఉద్యోగ పోస్టులకు మరో 160 అదనపు పోస్టులు కలిపి రీ-నోటిఫికేషన్ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి... ఈ నెల 8 తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం గవర్నర్ స్పీచ్‌కు ఆమోదం తెలిపాం పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ పథకాలను ఈ అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రారంభిస్తాం కులగణన చేయాలని కేబినెట్ నిర్ణయించింది తెలంగాణ తల్లి అంటే ఓక వ్యక్తి గుర్తుంచ్చేలా చేసారు.. మేము తెలంగాణ తల్లిలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించాం ఇక నుంచి అన్ని రకాల వ్యవహారాలు టీఎస్‌కు బదులుగా టీజీగా జరుగుతాయి జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతం మారుస్తూ కేబినెట్ ఆమోదం రాష్ట్ర చిహ్నం రాచరిక పాలనకు ప్రతీకగా ఉండొద్దని.. రాష్ట్ర చిహ్నం మార్చాలని కేబినెట్ నిర్ణయించింది -
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
-
రేపు సమావేశం కానున్న మంత్రివర్గం..కాంగ్రెస్ గ్యారెంటీల అమలుపై చర్చ
-
రెండు గ్యారంటీలపై రేపు నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో జరగనుంది. కేబినెట్ భేటీలో ప్రధానంగా రెండు గ్యారంటీల అమలుకు సంబంధించి చర్చించనున్నట్లు సమాచారం. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి కూలంకషంగా చర్చించి, అమలు చేసే తేదీని కూడా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ రెండింటితో పాటు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వ్యయం ఎంత అవుతుంది.? ఎంతమందికి లబ్ధి చేకూరుతుందన్న అంశాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా 4వ తేదీన జరిగే సమావేశంలో ఏ రెండింటిని అమలు చేయాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి, ఎప్పటివరకు నిర్వహించాలో కూడా నిర్ణయిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ మేరకు కేబినెట్ భేటీలో ఆమోదం తీసుకునే అవకాశాలున్నాయి. ఈనెల 8న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు జరిగే అవకాశం ఉందని, 9న బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. -
అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం..!
-
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. మెగా డీఎస్సీకి గ్రీన్‌సిగ్నల్
-
సీఎం వైఎస్ జగన్ కేబినెట్ సమావేశ దృశ్యాలు
-
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. మెగా డీఎస్సీకి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు కీలక అంశాలకు ఆమోదం ► మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ►6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం ►వైఎస్సార్ చేయూత 4వ విడతకు ఆమోదం ►ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదల ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం ►ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ►ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఆమోదం ►ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం ►ఎస్ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం ►యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు ►అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం ►నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం ►శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ►ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ►ఆ మేరకు చట్టంలో సవరణకు కేబినెట్ ఆమోదం -
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ
-
గ్రామ పంచాయతీలకు గ్రేడ్ –5 కార్యదర్శులు
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలు, సచివాలయాల మధ్య మరింత సమన్వయం తెస్తూ పాలనాపరంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఒక పంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉండేలా ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శుల హోదాలో పని చేస్తున్న వారికి అవకాశం కల్పించనుంది. మిగిలిన నాలుగు కేటగిరీ పంచాయతీ కార్యదర్శుల తరహాలోనే వారికి డీడీవో అధికారాలను కల్పించనున్నారు. గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఆయా పంచాయతీల బాధ్యతలను అప్పగించనున్నారు. ఈమేరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలు బుధవారం మంత్రివర్గ సమావేశంలో తుది ఆమోదం కోసం చర్చకు రానున్నాయి. సచివాలయాలతో పాటు గ్రేడ్ – 5 కార్యదర్శుల నియామకం 2019లో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుకు ముందు గ్రామ పంచాయతీల్లో గ్రేడ్ 1, 2, 3, 4 కేటగిరీ పంచాయతీ కార్యదర్శులు మాత్రమే విధులు నిర్వహించారు. చిన్నవైతే మూడు నాలుగు పంచాయతీలకు కలిపి ఒకే కార్యదర్శి బాధ్యతలు నిర్వహించేవారు. పంచాయతీరాజ్ శాఖ దీన్ని క్లస్టర్ పంచాయతీ విధానంగా వ్యవహరిస్తోంది. ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున సచివాలయాల వ్యవస్థతోపాటు గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శుల నియామకాన్ని కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. నాటి నుంచి గ్రేడ్ – 1 పంచాయతీ కార్యదర్శి మొదలు కొత్తగా నియమితులైన గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శి వరకు ఆయా సచివాలయాల్లో కార్యదర్శి హోదాలోనే విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయాల ద్వారా అందజేసే 545 రకాల ప్రభుత్వ సేవలతో సహా ప్రతి కార్యక్రమాన్ని వారికే అప్పగించారు. పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలు మాత్రం పాత క్లస్టర్ విధానంలోనే కొనసాగుతున్నాయి. మిగతా కార్యదర్శుల మాదిరిగానే.. సచివాలయాల ఏర్పాటు సమయంలో గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శులకు మిగిలిన నాలుగు కేటగిరీ ఉద్యోగుల మాదిరిగానే జాబ్‌చార్టు నిర్ధారించినా ప్రొబేషన్ ఖరారు కానందున పంచాయతీ బిల్లులు తయారీ లాంటి డీడీవో అధికారాలను మాత్రం పూర్తి స్థాయిలో అప్పగించలేదు. ఇప్పుడు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శులకు కూడా 1–4 గ్రేడ్ కేటగిరీ పంచాయతీ కార్యదర్శుల తరహాలోనే అన్ని రకాల డీడీవో అధికారాలు దక్కుతాయి. తద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఒక కార్యదర్శిని కేటాయించడం ద్వారా పంచాయతీల కార్యకలాపాల నిర్వహణలో వేగం పెరిగే అవకాశం ఉంటుంది. సర్పంచ్లకూ అదనపు అధికారాలు! ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రేడ్ – 1 మొదలు గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శులకు అదనపు అధికారాలు దక్కడంతో పాటు సర్పంచ్‌లకు కూడా మరిన్ని అధికారాలు లభించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. పంచాయతీ రెగ్యులర్ ఉద్యోగుల (010 పద్దు ఉద్యోగులు) నెలవారీ జీతాల బిల్లులను ప్రతిపాదించే అధికారం కార్యదర్శులతో పాటు సర్పంచ్‌లకు ఉమ్మడిగా మేకర్, చెక్కర్ హోదాలో లభించనుంది. రాష్ట్రంలో 500 పైబడి జనాభా ఉండే ప్రతి గ్రామ పంచాయతీకీ సచివాలయ కార్యదర్శిగానూ, పంచాయతీ కార్యదర్శిగానూ ఒక్కరే కొనసాగనున్నారు. ఆయా పంచాయతీల పరిమాణాన్ని బట్టి కార్యదర్శులకు బాధ్యతలు కేటాయిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నెలకొల్పిన సచివాలయాల వ్యవస్థ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన వేలాది మంది గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు తమ కు చిన్న పంచాయతీల బాధ్యతలు కూడా అప్పగించాలని చాలా కాలంగా కోరుతున్నారు. ఇప్పుడు వారికి కోరిక నెరవేరుతుండటంతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం జగన్ అధ్యక్షతన ఈనెల 31 కేబినెట్ భేటీ
-
ఈ నెల 31న కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్.జవహర్‌రెడ్డి అన్ని శాఖల కార్యదర్శులకు తెలియజేశారు. ఈ సమావేశానికి తీసుకెళ్లాల్సిన ప్రతిపాదనలను 29వ తేదీ ఉదయం 11 గంటలకల్లా సాధారణ పరిపాలన(కేబినెట్) విభాగానికి పంపించాలని అన్ని శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ అంశంపై మంత్రి మండలిలో చర్చించడంతో పాటు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
డెన్మార్క్ రాజుగా పదో ఫ్రెడరిక్
కోపెన్‌హేగెన్: డెన్మార్క్ రాజ సింహాసనాన్ని పదో ఫ్రెడరిక్ ఆదివారం అధిష్టించారు. రాణి రెండో మార్గరెట్ (83) అనారోగ్య కారణాలతో సింహాసనం వీడుతున్నట్లు కొత్త సంవత్సరం మొదటి రోజే ప్రకటించారు. 900 ఏళ్ల డెన్మార్క్ రాచరిక చరిత్రలో రాజు స్వచ్ఛందంగా సింహాసనం వీడటం ఇదే తొలిసారి. రాజధాని కోపెన్‌హేగెన్‌లోని జరిగిన కేబినెట్ సమావేశంలో సింహాసనం నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపే పత్రంపై రాణి సంతకం చేశారు. తర్వాత ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్ రాజభవనం బాల్కనీ నుంచి పదో ఫ్రెడరిక్‌ను రాజుగా ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాజభవనం వెలుపల వేలాది మంది గుమికూడారు. ‘గాడ్ సేవ్ ది కింగ్’అని చెబుతూ రాణి అక్కడి నుంచి ని్రష్కమించారు. రెండో మార్గరెట్‌తో పాటు ఆస్ట్రేలియా మూలాలున్న ఫ్రెడరిక్ భార్య క్వీన్ మేరీ రూపంలో డెన్మార్క్‌కు ఇద్దరు రాణులుంటారు. ఫ్రెడరిక్, మేరీల పెద్ద కుమారుడు క్రిస్టియన్ (18) యువరాజు హోదాతో సింహాసనానికి వారసుడయ్యారు. డెన్మార్క్ రాజరికం యూరప్‌లోనే అత్యంత పురాతనమైంది. 10వ శతాబ్దంలో వైకింగ్ రాజు గోర్డ్ ది ఓల్డ్ కాలం నుంచి అప్రతిహతంగా కొనసాగుతోంది. 1146లో అప్పటి డెన్మార్క్ రాజు మూడో ఎరిక్ లామ్ స్వచ్ఛందంగా సింహాసనం నుంచి వైదొలిగి, సన్యాసం తీసుకున్నారు. డెన్మార్క్ రాజుగా తొమ్మిదో ఫ్రెడరిక్ 1947 నుంచి 1972వరకు కొనసాగారు. ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో ఆయన కుమార్తె రెండో మార్గరెట్ సింహాసనం అధిíÙ్ఠంచారు. దాదాపు 52 ఏళ్లపాటు రాణిగా కొనసాగారు. -
అయోధ్య ఎయిర్‌పోర్టుకు మహర్షి వాల్మికి పేరు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు–అయోధ్యధామ్’ అని పేరుపెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలని కూడా నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. రైల్వేలో ‘సున్నా కర్బన ఉద్గారాల’ లక్ష్యాన్ని సాధించడానికి అమెరికాతో ఒప్పందానికి అనుమతించింది. మారిషస్ భాగస్వామ్యంతో ఉమ్మడిగా బుల్లి ఉపగ్రహం అభివృద్ధికి అవగాహనా ఒప్పందానికి కూడా అంగీకరించింది. ‘పృథ్వీ విజ్ఞాన్’కు ఆమోదం ఎర్త్ సైన్సెస్ రంగంలో ఐదు వేర్వేరు పథకాల కింద పరిశోధనలకు, కేటాయించిన నిధుల వినియోగానికి ఉద్దేశించిన ‘పృథ్వీ విజ్ఞాన్’కు కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని అమలుకు రూ.4,797 కోట్లు కేటాయించింది. ఇది ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. వాతావరణం, సముద్రం, క్రయోస్పియర్, పోలార్ సైన్స్, సీస్మాలజీ, జియోసైన్సెస్ వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. పృథ్వీ విజ్ఞాన్ కింద రీసెర్చ్ ప్రాజెక్టులను విదేశీ సంస్థలకు అప్పగించడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గయానా నుంచి ముడి చమురు కొనుగోలుతో పాటు హైడ్రో కార్బన్ రంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం కుదుర్చుకునేందుకూ అంగీకరించింది. గయానాలో ముడి చమురు అన్వేషణ, ఉత్పత్తిలో భారతీయ కంపెనీలకు సైతం భాగస్వామ్యం కలి్పస్తారు. ప్రపంచ దేశాలతో అయోధ్య అనుసంధానం: మోదీ అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలపడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీన్ని వాల్మికి మహర్షికి దేశ ప్రజల తరపున ఘనమైన నివాళిగా అభివరి్ణంచారు. అయోధ్యను ప్రపంచ దేశాలతో అనుసంధానించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. -
వైఎస్సార్సీపీ నేతల కీలక సమావేశం
-
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం..ఇంకా ఇతర అప్డేట్స్
-
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 45 అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్.. పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సామాజిక పెన్షన్‌ను రూ. 2,750 నుంచి రూ. 3,000 పెంపునకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఉచిత చికిత్స పరిమితిని రూ.25 లక్షలకు పెంపునకు ఆమోదం తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం తెలిపారు. జనవరిలో వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సామాజిక పెన్షన్లను రూ. 2,750 నుంచి రూ. 3,000 వేలకు పెంపునకు కేబినెట్ ఆమోదం ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ కెబినెట్ నిర్ణయం 90 శాతం కుటుంబాలకు ఆరోగ్య శ్రీ సేవలు ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ విశాఖలో లైట్‌మెట్రో రేల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం వైఎస్సార్ ఆరోగ్యశ్రీపై విస్తృతంగా అవగామన కల్పించాలని సీఎం జగన్ ఆదేశం ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో జబ్బున్న వాళ్లను జల్లెడ వేసి పట్టాం ఆరోగ్యశ్రీ అవగాహన.. ప్రచార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణ ఖర్చుల కింద రూ. 300 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన వారికి మందులను డోర్ డెలివరీ చేస్తాం. వైద్యారోగ్య రంగంలో వివిధ స్ఖాయిల్లో పోస్టుల భర్తికీ కెబినెట్ ఆమోదం ఏడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిర్ణయం. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్ ఆమోదం కుల, ఆదాయ ధ్రువీకరణాల పత్రాల మంజూరులో సంస్కరణలకు కేబినెట్ ఆమోదం కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు గ్రామ సచివాలయంలో పొందవచ్చు 75 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ కోర్టుల్లో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్ చెల్లింపు యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో పనిచేసే టీమ్స్‌కు 15శాతం అలవెన్స్ పెంపు 51 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రాలో 31 లక్షల మంది రిజిస్ట్రేషన్ ఆడుదాం ఆంధ్రా బ్రాండ్ అంబాసిడర్‌గా అంబటి రాయుడు కేబినెట్ సబ్‌కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ఆమోదం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ఈ నెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కూడా పంపిణీ జరుగుతుంది. జనవరి 10 నుంచి 23 వరకు మహిళలకు ఆసరా నాలుగో విడత కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం. జనవరి చివరి నుంచి చేయూత కార్యక్రమం ఉంటుంది. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఆర్ధిక సహాయం చేయడానికి కేబినెట్ ఆమోదం ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు కెబినెట్ నిర్ణయం ఇకపై ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం మెరిటైం బోర్డు పరిధిలోకి తెస్తూ కెబినెట్ నిర్ణయం