ప్రజలకు అభివాదం చేస్తున్న రాజు ఫ్రెడరిక్ దంపతులు
కోపెన్‌హేగెన్: డెన్మార్క్ రాజ సింహాసనాన్ని పదో ఫ్రెడరిక్ ఆదివారం అధిష్టించారు. రాణి రెండో మార్గరెట్ (83) అనారోగ్య కారణాలతో సింహాసనం వీడుతున్నట్లు కొత్త సంవత్సరం మొదటి రోజే ప్రకటించారు. 900 ఏళ్ల డెన్మార్క్ రాచరిక చరిత్రలో రాజు స్వచ్ఛందంగా సింహాసనం వీడటం ఇదే తొలిసారి. రాజధాని కోపెన్‌హేగెన్‌లోని జరిగిన కేబినెట్ సమావేశంలో సింహాసనం నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపే పత్రంపై రాణి సంతకం చేశారు. తర్వాత ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్‌సన్ రాజభవనం బాల్కనీ నుంచి పదో ఫ్రెడరిక్‌ను రాజుగా ప్రకటించారు.
ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాజభవనం వెలుపల వేలాది మంది గుమికూడారు. ‘గాడ్ సేవ్ ది కింగ్’అని చెబుతూ రాణి అక్కడి నుంచి ని్రష్కమించారు. రెండో మార్గరెట్‌తో పాటు ఆస్ట్రేలియా మూలాలున్న ఫ్రెడరిక్ భార్య క్వీన్ మేరీ రూపంలో డెన్మార్క్‌కు ఇద్దరు రాణులుంటారు. ఫ్రెడరిక్, మేరీల పెద్ద కుమారుడు క్రిస్టియన్ (18) యువరాజు హోదాతో సింహాసనానికి వారసుడయ్యారు. డెన్మార్క్ రాజరికం యూరప్‌లోనే అత్యంత పురాతనమైంది.
10వ శతాబ్దంలో వైకింగ్ రాజు గోర్డ్ ది ఓల్డ్ కాలం నుంచి అప్రతిహతంగా కొనసాగుతోంది. 1146లో అప్పటి డెన్మార్క్ రాజు మూడో ఎరిక్ లామ్ స్వచ్ఛందంగా సింహాసనం నుంచి వైదొలిగి, సన్యాసం తీసుకున్నారు. డెన్మార్క్ రాజుగా తొమ్మిదో ఫ్రెడరిక్ 1947 నుంచి 1972వరకు కొనసాగారు. ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో ఆయన కుమార్తె రెండో మార్గరెట్ సింహాసనం అధిíÙ్ఠంచారు. దాదాపు 52 ఏళ్లపాటు రాణిగా కొనసాగారు.
Comments
Please login to add a commentAdd a comment