Crown
-
బంగ్లాలో మోదీ గిఫ్ట్ చోరీ.. భారత్ తీవ్ర స్పందన
ఢిల్లీ: జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోదీ బహూకరించిన కిరీటం చోరీపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోదీ బహూకరించిన కిరీటం చోరీకి గురికావడం పట్ల తీవ్రంగా ఖండించింది. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి అపవిత్ర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడింది.‘‘ఢాకాలోని తంతిబజార్‌లో పూజా మండపంపై దాడి, జేశోరేశ్వరి కాళీమాత ఆలయంలో చోరీ జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా బాధాకరం. బంగ్లాదేశ్‌లోని హిందువులు సహా మైనారిటీలు, వారి ప్రార్థన మందిరాల భద్రత, మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలను తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా, 2021 మార్చిలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని.. కాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా అందించిన సంగతి తెలిసిందే. బంగ్లాలోని సత్ఖీరా జిల్లా ఈశ్వరీపూర్‌లోని ఈ కాళీ ఆలయం శక్తి పీఠాల్లో ఒకటి. స్థానిక కళాకారులు మూడు వారాల పాటు శ్రమించి దీన్ని తయారుచేశారు.ఇదీ చదవండి: 50 ఏళ్లలో తొలిసారి సహారా ఎడారిలో వరదలు.. ఫోటోలు వైరల్ -
Bangladesh: ప్రధాని మోదీ గిఫ్ట్‌గా ఇచ్చిన కాళీమాత కిరీటం చోరీ
బంగ్లాదేశ్‌లోని అమ్మవారి ఆలయంలో కాళీదేవి కిరీటం చోరికి గురవ్వడం కలకలం రేపుతోంది. సత్కిరాలోని జెషోరేశ్వరి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా చోరికి గురైన ఆ కాళేదేవి కిరీటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చారు. 2021 మార్చిలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. కాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఆలయంలోని కాళీమాతకు బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా అందించారు. ఈ కిరీటాన్ని వెండితో తయారు చేయగా.. బంగారు పూత పూశారు. అయితే ఇప్పుడు ఆ కిరీటం దుర్గాపూజ నవరాత్రోత్సవాల సందర్భంలో దొంగతనం చేయడం ప్రస్తుతం దుమారం రేపుతోంది.గురువారం రాత్రి ఆలయ పూజారి పూజలు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తున్న సమయంలో కిరీటం పోయినట్లుగా గుర్తించారు.ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు కనిస్తున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.స్పందించిన భారత్ఈ పరిణామంపై భారత్ స్పందించింది. ఆలయంలో కాళీమాత కిరీటం దొంగతనంపై ఆందోళనను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, దొంగిలించిన కిరీటాన్ని తిరిగి పొందాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఢాకాలోని భారత హైకమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
అయోధ్య రామయ్యకి విలువైన కిరీటం, దాత ఎవరంటే..
వందల ఏళ్ల నీరిక్షణ సాకారమైంది. కోట్లాది మంది భక్తుల కలను నిజం చేస్తూ ఆయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. భవ్య రామమందిరంలో దివ్య రాముడు కొలువుదీరాడు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్క అయోధ్యలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రజలు ఈ వేడుకను వైభవంగా జరుపుకున్నారు. జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఎంతోమంది భక్తులు విరాళాలు అందించారు. .దేశ విదేశాలకు చెందిన రామభక్తులు కానుకలు, విరాళాలు సమర్పించారు. రోజూ కూలి పని చేసుకునే వారి నుంచి బడా వ్యాపారుల వరకు తమకు తోచినంతా సాయం చేసి రామలయ నిర్మాణంలో భాగమయ్యారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేష్ పటేల్రాముడికి భారీ విరాళం అందించారు. ‘ల్యాబ్ డైమండ్ కంపెనీ’ యజమాని అయిన ముకేష్ పటేల్, ఆయన కుటుంబం రాముడికి రూ. 11 కోట్ల విలువైన కిరీటం చేయించారు. కిరీటాన్ని నాలుగు కిలోల బంగారం. వజ్రాలు, జెమ్‌స్టోన్స్, కెంపులు, ముత్యాలు, నీలమణితో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ మేరకు ముకేష్ తన తండ్రితో కలిసి అయోధ్యను సందర్శించి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ అధికారులకు అందజేశారు. చదవండి: Ayodhya: అయోధ్యకు తొలిరోజు పోటెత్తిన భక్తులు అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు సమాచారం. ఈ బంగారంతో రామాలయం తలుపులు, గర్భ గుడి, త్రిశూలం మొదలైనవి చేయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత బంగారం ధర ప్రకారం 101 కేజీల బంగారం అంటే రూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావించాలి. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్‌కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లు సేకరించారు. వీరిలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లాఖి, ఆయన కుటుంబం రాముల వారికి భూరి విరాళం ఇచ్చినట్టు సమాచారం. దిలీప్ కుటుంబం అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు తెలుస్తోంది..ప్రస్తుత బంగారం ధర ప్రకారంరూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఈ బంగారాన్ని రామాలయ తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్‌కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అధికమని తెలుస్తోంది. మరోవైపు నేటి నుంచి(జనవరి 23) సాధారణ భక్తులకు దర్శనం అనుమతించడంతో అయోధ్యకు భక్తులు పోటెత్తారు. చలిలోనూ ఉదయం మూడు గంటల నుంచి ఆలయం భయట భారీగా క్యూ కట్టి శ్రీరాముడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు రెండు స్లాట్లు కల్పించారు. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు.. అలాగే.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గం. వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతించనున్నారు. -
డెన్మార్క్ రాజుగా పదో ఫ్రెడరిక్
కోపెన్‌హేగెన్: డెన్మార్క్ రాజ సింహాసనాన్ని పదో ఫ్రెడరిక్ ఆదివారం అధిష్టించారు. రాణి రెండో మార్గరెట్ (83) అనారోగ్య కారణాలతో సింహాసనం వీడుతున్నట్లు కొత్త సంవత్సరం మొదటి రోజే ప్రకటించారు. 900 ఏళ్ల డెన్మార్క్ రాచరిక చరిత్రలో రాజు స్వచ్ఛందంగా సింహాసనం వీడటం ఇదే తొలిసారి. రాజధాని కోపెన్‌హేగెన్‌లోని జరిగిన కేబినెట్ సమావేశంలో సింహాసనం నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపే పత్రంపై రాణి సంతకం చేశారు. తర్వాత ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్ రాజభవనం బాల్కనీ నుంచి పదో ఫ్రెడరిక్‌ను రాజుగా ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాజభవనం వెలుపల వేలాది మంది గుమికూడారు. ‘గాడ్ సేవ్ ది కింగ్’అని చెబుతూ రాణి అక్కడి నుంచి ని్రష్కమించారు. రెండో మార్గరెట్‌తో పాటు ఆస్ట్రేలియా మూలాలున్న ఫ్రెడరిక్ భార్య క్వీన్ మేరీ రూపంలో డెన్మార్క్‌కు ఇద్దరు రాణులుంటారు. ఫ్రెడరిక్, మేరీల పెద్ద కుమారుడు క్రిస్టియన్ (18) యువరాజు హోదాతో సింహాసనానికి వారసుడయ్యారు. డెన్మార్క్ రాజరికం యూరప్‌లోనే అత్యంత పురాతనమైంది. 10వ శతాబ్దంలో వైకింగ్ రాజు గోర్డ్ ది ఓల్డ్ కాలం నుంచి అప్రతిహతంగా కొనసాగుతోంది. 1146లో అప్పటి డెన్మార్క్ రాజు మూడో ఎరిక్ లామ్ స్వచ్ఛందంగా సింహాసనం నుంచి వైదొలిగి, సన్యాసం తీసుకున్నారు. డెన్మార్క్ రాజుగా తొమ్మిదో ఫ్రెడరిక్ 1947 నుంచి 1972వరకు కొనసాగారు. ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో ఆయన కుమార్తె రెండో మార్గరెట్ సింహాసనం అధిíÙ్ఠంచారు. దాదాపు 52 ఏళ్లపాటు రాణిగా కొనసాగారు. -
అందాల పోటీల్లో.. తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ కిరీటం దక్కించుకుంది!
అందాల పోటీల చరిత్రలో ఓ ట్రాన్స్‌జెండర్ కిరీటం దక్కించుకుంది. శనివారం ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ఓ వేడుకలో 22 ఏళ్ల డచ్ మొలుకన్ మోడల్ రిక్కీ వాలెరీ కొల్లె అనే ట్రాన్స్ జెండర్ ఈ ఘనతను సృష్టించింది. ఆమె ఈ వేడుకలో హబీబా మోస్టాఫా, లౌ డిర్చ్లు, నథాలీ మోగ్బెల్జాదాలను వెనక్కి నెట్టి మరీ మిస్ నెదర్లాండ్స్ టైటిల్‌ను గెలుచుకుంది. అందాల పోటీల చరిత్రలో ఓ ట్రాన్స్‌జెండర్‌కి కిరీటం దక్కడం తొలిసారి. ఈ చారిత్రత్మక విజయం 72వ మిస్ యూనివర్స్ టైటిల్‌కు పోటీదారుగా తన స్థానాన్ని పదిలం చేసింది. ఈ మేరకు ట్రాన్స్‌జెండర్ హబీబా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..నా కమ్యూనిటీని గర్వించేలా చేశాను. నేను విజయం సాధించడం నాకు అత్యంత ముఖ్యం. అందుకోసం ప్రతిక్షణం తపనపడ్డా. నేను గెలుస్తానని భావించిన మిస్ నెదర్లాండ్స్ జట్టులోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తాను తనలాంటి వాళ్లందరికీ ఒక రోల్‌మోడల్‌గా ఉండాలని కోరుకున్నా. సమాజంలో తమ పట్ల ఉన్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడేలా శక్తిమంతం చేసేందుకు దీన్ని ఒక ఫ్లాట్‌ఫాంగా చేయాలనుకుంటున్నా. నిబద్ధత, బలం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం, తమలాంటి వారికి ఎలాంటి సమస్యలు లేకుండా చేయడమే తన ధ్యేయం అని పేర్కొంది రిక్కీ. మిస్ నెదర్లాండ్స్ సంస్థ నా వెనుక ఉండటం వల్లే ఈ విజయం సాధించగలిగానని సంతోషంగా చెబుతోంది రిక్కీ. (చదవండి: కెమెరా లాక్కున్న ఆక్టోపస్..ఇచ్చేదే లే! అంటూ యుద్ధమే చేసింది) -
అందాల పోటీల్లో భార్య ఓటమి.. కోపంతో భర్త ఏం చేశాడంటే..
బ్రెజిల్ దేశంలో జరిగిన ఓ అందాల పోటీల్లో తన భార్యని కాకుండా వేరే యువతిని విజేతగా ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన ఆమె భర్త ఒక్క ఉదుటున డయాస్ మీదకు దూకి విజేతకు ధరింపజేసే అందాల కిరీటాన్ని లాక్కుని నేలకేసి బలంగా విసిరికొట్టాడు. అందాల భామ నెత్తిన వయ్యారంగా ఒదిగిపోవాల్సిన ఆ కిరీటం కాస్తా ముక్కలు ముక్కలైపోయింది. వివరాల్లోకి వెళ్తే... బ్రెజిల్లో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ గే మాటో గ్రోసో అందాల పోటీని ఈ ఏడాది కూడా నిర్వహించారు. చాలామంది అందగత్తెలు ఈ పోటీల్లో హొయలొలికించారు. రౌండ్ల వారీగా పోటీదారులను జల్లెడ పట్టగా, విజేతను ప్రకటించే సమయానికి పోటీలో చివరికి నథాలీ బెకర్, ఇమాన్యులీ బెలి అనే ఇద్దరు మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో విజేతను ప్రకటించే సమయంలో వీరిద్దరిని ఎదురెదురుగా నిలబెట్టి మధ్యలో కిరీటాన్ని చేత్తో పట్టుకుని విజేతకు ధరింపజేసే క్రమంలో న్యాయ నిర్ణేత కొంత డ్రామా నడిపించింది. ఈ వ్యవధిలో తన భార్య నథాలీ బెకర్‌కు కాదని ఇమాన్యులీ బెలినిని విజేతగా ప్రకటించనున్నారని గ్రహించిన భర్త అమాంతం స్టేజి మీదకు దూకేశాడు. విజేతను ప్రకటించే లోపే న్యాయనిర్ణేత చేతుల్లో ఉన్న కిరీటాన్ని బలవంతంగా లాక్కుని నేలకేసి కొట్టాడు. అందరూ చూస్తుండగానే కోపంతో ఊగిపోయిన ఈ అతడు అక్కడితో ఆగకుండా తన భార్య చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకువెళ్లే సాహసం చేశాడు. ఇంకేముంది అక్కడే ఉన్న సెక్యూరిటీ వారు నథాలీ బెకర్ భర్తను పట్టుకుని దేహశుద్ధి చేసి విచారణ చేపట్టారు. నా భార్య ఓటమిని తట్టుకోలేకపోయా.. న్యాయనిర్ణేతలు నిర్ణయం సరైనది కాదని.. తన భార్యే ఈ పోటీల్లో గెలిచిందని, కానీ చివర్లో విజేతను తారుమారు చేస్తున్నారని అనిపించి ఆలా చేశానని నథాలీ బేకర్ భర్త వివరించాడు. అనంతరం ఈ పోటీల నిర్వాహకులు మాట్లాడుతూ.. అందాల పోటీ ముగింపు దశలో ఇలా జరగడం విచారకరమని, తమ నిర్ణయం సరైనదేనని చెప్పి ఇమాన్యులీ బెలినిని మిస్ గే బ్రెజిల్ 2023 విజేతగా ప్రకటించారు. Revolta na final do concurso Miss Brasil Gay 2023. Torcedor arranca coroa da vencedora e joga no chão durante a cerimônia de premiação. pic.twitter.com/rb6duFvAEn — Bruno Guzzo® (@brunoguzzo) May 28, 2023 -
జుట్టుపైనా వివక్ష! క్రౌన్ యాక్ట్ బిల్లుకు ఆమోదం, వారికి ఆనందానికి అవధుల్లేవ్
‘అది జుట్టా, కలుపు మొక్కా?’ అని ఒకరు, ‘గొర్రె బొచ్చుకు, వారి జుట్టుకు ఏమన్నా తేడా ఉందా?’ అని మరొకరు ‘నల్ల జుట్టుంటే ఉద్యోగానికేం పనికొస్తారు?’ జుట్టుపై అమెరికన్ల వివక్షాపూరిత వ్యాఖ్యలివి! జాతి వివక్ష, మత వివక్ష, కుల వివక్ష గురించి విన్నాం. కానీ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలో మాత్రం తలపై జుట్టు దగ్గర్నుంచి కాలి గోళ్ల దాకా అక్కడ అన్నింటా వివక్ష రాజ్యమేలుతోంది. నల్ల జుట్టుపై వివక్షను నిషేధిస్తూ టెక్సాస్ హౌస్ తాజాగా బిల్లును ఆమోదించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయంగా మారింది... జుట్టు నల్లగా, పొడవుగా, రింగులు తిరిగి ఉంటే అమెరికన్లు సహించలేరు. కొప్పు బాగా కుదిరితే చక్కగా ఉంటుందంటాం. కానీ నల్లజాతి అమ్మాయిలు రకరకాల హెయిర్ స్టైల్స్‌తో కొప్పును గొప్పగా ప్రదర్శించడం కూడా అమెరికన్లకు కంటగింపు వ్యవహారమే. స్కూళ్లు, పని ప్రాంతాలు, నలుగురు కలిసే చోట... ఇలా అంతటా ఈ వివక్ష తీవ్ర రూపు దాల్చి కన్పిస్తుందక్కడ. ఆఫ్రో, బ్రయిడ్స్, డ్రెడ్‌లాక్స్, కార్న్‌రోస్ హెయిర్ స్టైల్స్ చేసుకునే వారిపై వివక్ష పెరిగిపోతుండటంతో టెక్సాస్‌లో ప్రతినిధుల సభ కల్పించుకోవాల్సి వచ్చింది. నల్లజుట్టుపై వివక్ష పనికిరాదంటూ క్రౌన్ యాక్ట్ బిల్లును ఆమోదించింది. జుట్టుపై వివక్ష తగదంటూ డెమొక్రాట్ సభ్యురాలు రెట్టా బోవర్స్ తొలుత గళమెత్తారు. ఎవరి జుట్టు ఎలా ఉంటే అలానే ఉండనివ్వాలి. మార్చుకొమ్మని శాసించే హక్కు ఎవరికీ ఉండదు’’అన్నారామె. బోవర్స్ తొలిసారి ఈ బిల్లును ప్రతిపాదించినప్పుడు ఇదంత అవసరమా అని అంతా కొట్టిపారేసారు. కానీ ఇప్పుడది 143–5 ఓట్లతో నెగ్గడంతో ఆమె ఆనందం అవధులు దాటింది. బిల్లు ఎలా వచ్చిందంటే.. హ్యూస్టన్‌లో బార్బర్స్ హిల్ హైస్కూలులో అధికారులు డెండ్రే ఆర్నాల్డ్ అనే విద్యార్థిపై చూపిన వివక్ష ఈ బిల్లుకు కారణమైంది. ఆర్నాల్డ్ ఏడో తరగతి నుంచి జుట్టు పెంచుకుంటున్నాడు. అది ట్రినిడాడియన్ల సంస్కృతిలో భాగం. కానీ జుట్టు కత్తిరించుకోకుంటే గ్రాడ్యుయేషన్ క్లాసులకు అనుమతించేది లేదని స్కూలు అధికారులు తేల్చి చెప్పారు. అబ్బాయి తల్లిదండ్రులు కాళ్లావేళ్లా పడ్డా లాభం లేకపోయింది. ఇదంతా 2020లో జరిగింది. ఆర్నాల్డ్ కథ ఇంటర్నెట్లో వైరలైంది. అతనికి ప్రఖ్యాత టీవీ షో ది ఎలెన్ డిజెనరస్లో పాల్గొనే అవకాశం వచ్చింది. హెయిర్ లవ్ అనే షార్ట్ ఫిల్మ్ తీసిన దర్శకుడు మాథ్యూ ఎ చెర్రీ ఆ అబ్బాయిని ఆస్కార్ అవార్డు ఫంక్షన్‌కు కూడా ఆహ్వానించాడు. మరెందరో విద్యార్థులను జుట్టు పొడవుగా ఉందంటూ స్కూలు నుంచి తీసేసిన ఉదంతాలు వెలుగులోకి రావడంతో ఈ వివక్షను నిషేధిస్తూ చట్టం చేయాల్సి వచ్చింది. ఈ వివక్ష ఇప్పటిది కాదు! అమెరికాలో నల్ల జుట్టుపై వివక్ష 18వ శతాబ్దం నుంచీ ఉంది. ఆఫ్రికన్ల జుట్టు గొర్రె బొచ్చులా ఉంటుందని అప్పట్లోనే హేళన చేసేవారు. తర్వాత రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకునే నల్లజాతి మహిళలు ఉద్యోగాలకు పనికి రారన్న అభిప్రాయం అమెరికన్లలో పెరిగింది. జుట్టు ఎక్కువున్న వారికి వృత్తిపరమైన లక్షణాలేవీ ఉండవని, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే సామర్థ్యముండదని అడ్డమైన వాదనలు తెరపైకి తెచ్చారు. తెల్ల జుట్టు వాళ్లకే ఉద్యోగాల్లో ప్రాధాన్యమిచ్చేవారు. ఇంటర్వ్యూ ఉంటే హెయిర్‌స్టైల్ మారాల్సిందే! డోవ్, లింక్డిన్ సంస్థలు ఇటీవల జుట్టు వివక్షపై సంయుక్త అధ్యయనం చేశాయి. నల్లజాతి యువతుల్లో మూడింట రెండొంతుల మంది ఇంటర్వ్యూలకి వెళ్లినప్పడు హెయిర్ స్టైల్స్ మార్చుకుంటున్నట్టు తేలింది. నల్లటి కురులున్న 25–34 మధ్య వయసు వారిలో 20 శాతం మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. టీవీ షోలు, సోషల్ మీడియాలోనూ నల్ల జుట్టుపై విషం కక్కడం పరిపాటిగా మారింది. ఒబామా భార్యకూ తప్పలేదు! అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మహిళ మిషెల్‌కు కూడా జుట్టు వివక్ష తిప్పలు తప్పలేదు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా ఆమె తన రింగుల జుట్టును సాఫీగా ఉండేలా చేయించుకున్నారట. ఈ విషయం గతేడాది ఓ కార్యక్రమంలో ఆమే స్వయంగా చెప్పారు. ‘‘వైట్‌హౌస్‌లో ఉండగా ఒబామా పాలనపై కాకుండా నా జుట్టుపై ఎక్కడ చర్చ జరుగుతుందోనని హెయిర్‌స్టైల్ మార్చుకున్నా. ఒక నల్లజాతి కుటుంబం శ్వేతసౌధంలో ఉండటాన్ని సగటు అమెరికన్లు అంతగా జీర్ణించుకోలేరు. దానికి తోడు నా జుట్టుపైనా వివాదం రేగడం ఎందుకని భావించా’’అన్నారు. అమెరికా సమాజంలో జుట్టు వివక్ష ఎంతలా వేళ్లూనుకుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
తిరుమల: అలంకార ప్రియునికి ప్రకృతి సొబగులు
తిరుమల: ఇల వైకుంఠపురంలో కొలువుదీరిన శ్రీనివాసుడు అలంకార ప్రియుడిగా పూజలందుకుంటున్నా రు. సప్తగిరుల్లో లభ్యమయ్యే ప్రకృతి సిద్ధమైన వాటితో పాటు దేశ, విదేశాల నుంచి ఫలపుష్పాదులను తెప్పించి స్వామివారిని అలంకరిస్తుంటారు. వైఖానస ఆగమోక్తంగా శ్రీవారి ఉత్సవాల్లో పూటకో అలంకరణ చేస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయ్యప్ప స్వామికి స్నపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. చదవండి: రెండవ రోజూ దేవదేవుడి సేవలో సీఎం ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించడం సంప్రదాయం. ఈ సారి స్నపన తిరుమంజన సేవల్లో పవిత్రాలు, సజ్జ కంకులతో తయారు చేయించిన కిరీటాలు, మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామివారి అలంకరణలో ఎప్పటికప్పుడు కొత్తదనం కనిపించేలా టీటీడీ ఉద్యానవనశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే యాలకులు, పట్టువ్రస్తాలు, సజ్జ కంకులు, పవిత్రాలు, ఎండు ద్రాక్ష–రోస్ పెటల్స్, వట్టివేర్లు–ముత్యాలు, నల్ల–తెల్లద్రాక్ష, కురువేరు–పసుపు, ఎరుపు పెటల్స్, మల్లె–రోజా మొగ్గలతో స్వామివారికి వేర్వేరుగా కిరీటాలు, మాలలు తయారు చేయించి, స్వామివారి తిరుమంజన సేవలో అలంకరించారు. బహుసుందరం రంగనాయకుల మండపం శ్రీవారి ఉత్సవాల్లో స్నపన తిరుమంజనానికి ప్రత్యేకత ఉంది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆగమోక్తంగా స్నపన తిరుమంజన సేవ చేస్తారు. ఇందులో భాగంగా ఉద్యానవనశాఖ సిబ్బంది రంగనాయకుల మండపాన్ని విదేశీ ఫలపుష్పాలతో బహుసుందరంగా అలంకరించారు. ఎన్నడూ కనీవినీ ఎరుగని ఫలపుష్పాదులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, భక్తులకు కనువిందు చేశాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భారత్‌లో భారీ పెట్టుబడులు
ముంబై: హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే లాజిస్టిక్స్ సంస్థ క్రౌన్ వరల్డ్‌వైడ్ గ్రూప్ భారత్‌లో 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 223 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ ఈ విషయం వెల్లడించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ సర్వీసులను అందించేందుకు డిజిటల్ సామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు క్రౌన్ పేర్కొంది. 1996లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన క్రౌన్కు హైదరాబాద్ సహా చెన్నై, బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ తదితర 11 నగరాల్లో కార్యాలయాలు ఉన్నాయి. -
అశ్లీల నృత్యం.. అందాల కిరీటం వెనక్కి
పోర్టు మోర్స్‌బే: దేశంలో కానీ, సమాజంలో కానీ ఏదైనా విశిష్ట పురస్కారం, అవార్డు వంటివి పొందిన వ్యక్తులు తమ ప్రవర్తన పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజానికి ఆదర్శంగా నిలవాలి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదు నా ఇష్టం వచ్చినట్లే ఉంటాను అంటే ఈ అందాల సుందరికి పట్టిన గతే పడుతుంది. అందాల పోటీలో కిరీటం సాధించిన ఓ మహిళ అశ్లీల నృత్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయ్యింది. దాంతో నెటిజనులు సదరు మహిళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అసలు నీలాంటి దానికి ఇంతటి గౌరవం ఎలా లభించింది’’ అంటూ విమర్శించారు. ‘‘ఆ కిరీటం ధరించడానికి నీవు అనర్హురాలివి’’ అని ట్రోల్ చేశారు. ఈ దుమారం కాస్త పెద్దది కావడంతో షో నిర్వహకులు ఆమె వద్ద నుంచి కిరీటం వెనక్కి తీసుకున్నారు. ఆ వివరాలు.. లూసి మైనో అనే మహిళ(25) 2019లో మిస్ పాపువా న్యూగినియాగా ఎన్నికైంది. ఈ క్రమంలో ఆమె కొద్ది రోజుల క్రితం తన టిక్‌టాక్ అకౌంట్లో ఓ డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది. చాలా అశ్లీలంగా ఉన్న ఈ వీడియో పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. దాంతో మిస్ పసిఫిక్ ఐస్‌ల్యాండ్స్ పీజంట్ పీఎన్జీ కమిటీ లూసి మైనోకు ప్రదానం చేసిన కిరీటాన్ని వెనక్కి తీసుకుంది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘‘మా ప్రధాన ఉద్దేశం మహిళా సాధికారిత. మా వేదికది చాలా ప్రత్యేకమైన శైలి. సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ విలువలు ద్వారా మా దేశం, ఇక్కడి ప్రజల గురించి మిగతా లోకానికి తెలియజేస్తాం. ఇక మేం నిర్వహించే అందాల పోటీల ద్వారా స్వీయ విలువ, సమగ్రత, సామాజిక సేవ, విద్య వంటి అంశాలను ప్రచారం చేస్తాం’’ అని తెలిపారు. ‘‘ఇంత విలువైన అవార్డు సొంతం చేసుకున్న లూసి మైనో ఇలాంటి అశ్లీల డ్యాన్స్ వీడియోని షేర్ చేయడం మమ్మల్ని షాక్‌కు గురి చేసింది. రోల్‌మోడల్‌గా నిలవాల్సిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదు. అందుకే ఆమెకు ప్రధానం చేసిన కిరీటాన్ని వెనక్కి తీసుకున్నాం’’ అని తెలిపారు. ఇదే పని ఓ మగాడు చేస్తే మేం నవ్వుకునే వాళ్లం. కానీ లూసీ మైనో ఇలా చేయడం మమ్మల్ని నిరాశకు గురి చేసింది అన్నారు. చదవండి: షాకింగ్: అందాల పోటీ విజేతకు వేదిక మీదే ఘోర అవమానం -
వైరల్ : ప్రార్థన చేసి, గుంజీలు తీసి ఆపై..
సాక్షి , హైదరాబాద్ : ఒక దొంగ దర్జాగా గుడి లోపలికి వచ్చి దేవుడిని ప్రార్థన చేసి మరీ కిరీటాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ వింత ఘటన మన హైదరాబాద్‌లోని అబిడ్స్ ప్రాంతంలోనే బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. కాగా దొంగ చేసిన పని సీసీ కెమెరాలో రికార్డవడం అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దొంగతనం చేసే ముందు ఆ వ్యక్తి చేసిన పని అందరికి నవ్వు తెప్పిస్తుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ఉండే అబిడ్స్ ప్రాంతంలో ఉన్న దుర్గ గుడికి బుధవారం సాయంత్రం ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చిన సమయంలో గుడిలో ఎవరు లేరు. ఇదే అదనుగా భావించిన సదరు దొంగ కిరీటాన్నీ ఎత్తుకెళ్లాలని భావించాడు. అయితే కిరీటాన్ని దొంగలించడానికి ముందు తనను క్షమించాలంటూ ప్రదర్శనలు చేసి దేవతను ప్రార్థించి కొన్ని గుంజీలు తీశాడు. తరువాత తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని చుట్టు పక్కల చూశాడు. ఎవరు చూడట్లేదని నిర్థారించుకొని మెళ్లిగా కిరీటాన్ని తీసి తన షర్టులోకి దోపుకున్నాడు. మళ్లీ ఎప్పటిలాగే ఎవరికి ఏ అనుమానం రాకుండా బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యడు. గురువారం ఉదయం యధావిధిగా గుడికి వచ్చిన పూజారి విగ్రహానికి కిరీటం లేకపోవడాన్ని గమనించాడు. దీంతో వెంటనే మేనేజర్‌కు తెలపగా అతను పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిక్షించి దొంగ చేసిన పనికి అవాక్కయ్యారు. దొంగపై సెక్షన్ 380 కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. అయితే ఈ వీడియోపై సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. దేవుడి సొమ్మును ఎత్తుకెళ్తున్నందుకు తనకు ఏ పాపం తగలకూడదనే ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
టీటీడీ పరువు పోయె.. కిరీటాలు కరిగిపోయె!
తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు అలంకరించిన కిరీటాల చోరీ కేసును ఛేదించే విషయంలో ఎక్కడా టీటీడీ పాత్ర నామమాత్రంగా కూడా కనిపించలేదు. దేశంలోనే శక్తివంతమైన భద్రతా వ్యవస్థను కలిగి ఉన్న దేవస్థానం చోరీకి గురైన మూడు కిరీటాలను కనిపెట్టలేకపోయింది. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో పోలీసులే రంగంలోకి దిగి దొంగను పట్టుకున్నారు. అనంతరం కరిగించిన కిరీటాలకు సంబంధించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాక్షి, తిరుపతి : శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలంకరించిన మూడు బంగారు కిరీటాల చోరీతో టీటీడీ పరువు పోయిం దనే ప్రచారం జరుగుతోంది. దేవస్థానం భద్రతా వ్యవస్థ ఏమైందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కిరీటాలు అపహరణకు గురైన కేసులో టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిబ్రవరి 3న చోరీకి గురైన కిరీటాలను దొంగ కరిగించేశాడు. చోరీకి గురై 80 రోజులు గడచిపోయాక పోలీసులు దొంగను పట్టుకున్నారు. ఆ తర్వాత దొంగ దొరికాడని, బంగారం దొరికిందని సముదాయించుకోవడం తప్ప టీటీడీ చేసిందేమీ లేదని తెలుస్తోంది. రైడింగ్లు.. దర్శనాలు చేయించడానికేనా? తిరుమల తిరుపతి దేవస్థానం భద్రత కోసం ఆక్టోపస్ నుంచి హోంగార్డు వరకు దేశంలోనే అత్యంత పటిష్టమైన వ్యవస్థ ఉంది. అయితే వీరు నిర్వర్తించాల్సిన విధులు నిర్వహించడం లేదనే విమర్శలున్నాయి. తిరుమలలోని వివిధ దుకాణాల్లో రైడింగ్ చేసి హడావుడి చేస్తారు. అంతకంటే వీవీఐపీలు, వీఐపీల దర్శనాలు చేయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో బంగారు కిరీటాలు చోరీ అయితే ఇంతవరకు ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. నిత్యం భక్తులు ఉన్న సమయంలోనే కిరీటాలు చోరీకి గురైతే అందుకు టీటీడీ నిర్లక్ష్యమే కారణమనేందుకు శ్రీగోవిందరాజస్వామే సాక్షి. ఇంత జరిగినా టీటీడీలో ఏ అధికారి చోరీపై నోరు మెదప లేదు. సిఫారసు లేఖలతో పోస్టులు తెచ్చుకుని, డిప్యుటేషన్లపై టీటీడీకి చేరుకుని శ్రీవారి సేవా ముసుగులో వ్యాపారాలు చేసుకునేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప స్వామి ఆస్తులు, ఆభరణాలకు భద్రత విషయంపై దృష్టి సారించేవారు కరువయ్యారని భక్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కిరీటాలు కరిగించేశారని సాక్షి ముందే చెప్పింది శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలంకరించిన మూడు కిరీటాలను దొంగలించిన దొంగలు కరిగించేసి ఉంటారని సాక్షి ఫిబ్రవరి 14న కథనం ఇచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. స్వామి వారికి ఎవరో భక్తులు కానుక ఇచ్చిందనే నిర్లక్ష్యంతో టీటీడీ అధికారులు వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి. ఐదేళ్లుగా టీటీడీలో పాలన గాడి తప్పిందని దేవస్థానంలో పనిచేస్తున్న అధికారులే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. -
కిరీటం దక్కించుకున్న కిమ్ కుమారి
న్యూజెర్సీలోని ఫోర్ట్స్ సిటీలో జరిగిన తుదిపోరులో ‘మిస్ ఇండియా అమెరికా-2019’ కిరీటాన్ని అందాల భామ కిమ్ కుమారి దక్కించుకుంది. మిస్ న్యూజెర్సీ అయిన కుమారి అమెరిలోకి 26 రాష్ట్రాల నుంచి వచ్చిన 75మందితో పోటీపడి చివరికి విజేతగా నిలిచింది. దీంతో కిమ్ కుమారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అమృత చెహిల్, సౌమ్యా సక్సెనా రన్నరప్స్గా నిలిచారు. ఈ కార్యక్రమానికి అలనాటి బాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి న్యాయనిర్ణేతగా వ్యవహించారు. -
కిరీటాలు కరిగించేశారా?
శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో మాయమైన కిరీటాలు విక్రయించడం.. వాటిని కరిగించడం జరిగిపోయిందని తెలిసింది. అయితే ఈ విషయాన్ని టీటీడీ బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంది. మాయమైన కిరీటాల స్థానంలో కొత్త వాటిని తయారు చేయించి యథాస్థానంలో ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సాక్షి, చిత్తూరు, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తుల విగ్రహాలకు అలంకరించిన మూడు బంగారు కిరీటాలు మాయమైన విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం మాయమైన ఈ కిరీటాల జాడ ఇంతవరకు తెలియలేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా దొంగల జాడ కనిపెట్టకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. 1970లో తిరుమల శ్రీవారికి కానుకగా వచ్చిన ఈ మూడు కిరీటాల బరువు ఒక కిలో 300 గ్రాములు. ఆ కిరీటాలను బంగారు, వజ్రాలతో తయారుచేసి శ్రీవారికి సమర్పించారు. అయితే తిరుమలలో స్వామి వారికి కిరీటాలు ఉండడంతో వాటిని తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు అలంకరించారు. ఆ కిరీటాలతోనే ప్రతిరోజూ ఉత్సవమూర్తులను ఊరేగించేవారు. అయితే నిఘా వైఫల్యంతో విలువైన మూడు కిరీటాలు మాయమయ్యాయి. గుట్టుచప్పుడు కాకుండా విచారణ తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు మాయం టీటీడీకి మరో మాయని మచ్చగా మిగిలిపోయింది. విచారణ వేగవంతం చేసిన పోలీసులు, టీటీడీ విజిలెన్స్ ఆలయ అర్చకులు, సిబ్బందిని విచారించారు. అదేవిధంగా ఆటో డ్రైవర్, తమిళనాడుకు చెందిన మరి కొందరిని ఆదుపులోకి తీసుకున్నారు. మొత్తం 27 మందికి పైగా విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో తమిళనాడుకు చెందిన మత్తయ్య ఒకరు. మాయం చేసిన కిరీటాలను దొంగలు విక్రయించినట్లు సమాచారం. తిరుపతిలోని ఓ బంగారు వ్యాపారస్తుడికి విక్రయించడం, అతనుఇతర ప్రాంతాలకు తరలించి కరిగించడం కూడా పూర్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు, టీటీడీ విచారణలో విషయం బయటపడడంతో బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే రెండు వారాలైనా విచారణ పురోగతిపై ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనమని శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించేందుకు ప్రయత్నించినా.. పత్రికలు, మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు ఎక్కడో ఓచోట దొరికిపోతామనే కారణంతో గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. మాయమైన కిరీటాలను తయారు చేయించి గుట్టుచప్పుడు కాకుండా ఉత్సవమూర్తులకు అలంకరించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో కిరీటాలను తయారుచేయిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. కిరీటాల తయారీ పూర్తయ్యాక.. దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. దొంగలను చూపించి స్వాధీనం చేసుకున్న కిరీటాలను ఉత్సవమూర్తులకు అలంకరించామని చెప్పి కేసును తొక్కిపెట్టే యత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతుండడం గమనార్హం. -
కిరీటాలు మాయంలో పురోగతి
-
గర్భాలయంలో అర్చకులు లేని సమయంలో..!
సాక్షి, తిరుపతి: భక్తుల ముసుగులో వచ్చిన బయటి వ్యక్తులే కిరీటాలను దొంగిలించుకెళ్లినట్టు గుర్తించారు. అర్చకులు గర్భాలయంలో లేని సమయంలో చోరీ జరిగినట్టు తేల్చారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆలయంలోకి దొంగలు పడ్డారని పోలీసులు, టీటీడీ విజిలెన్స్ ప్రాథమిక విచారణలో తేల్చారు. కేసును మరింత లోతుగా విచారించేందుకు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. టీటీడీ పరిధిలోని ప్రధాన ఆలయాల్లో గోవిందరాజస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో శనివారం మూడు కిరీటాలు మాయమైన విషయం తెలిసిందే. చోరీ వెనుక అర్చకులు, సిబ్బంది ప్రమేయం ఉందనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే ప్రాథమిక విచారణలో వారి ప్రమేయం లేకపోవచ్చనే అంచనాకు వచ్చినట్టు తెలిసింది. అయినా కూడా ఆ రోజు ఆలయంలో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరి కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్టు సమాచారం. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు కొంతమంది అనుమానితులను గుర్తించారు. అందులో భాగంగా ఒక ఆటో డ్రైవర్, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరింత లోతుగా విచారించిన పోలీసులు, టీటీడీ విజిలెన్స్ బయటి వ్యక్తులే భక్తుల ముసుగులో ఆలయంలోకి చొరబడి కిరీటాలు ఎత్తుకెళ్లినట్టు నిర్థారణకు వచ్చారు. ఈ మేరకు సీసీ ఫుటేజిలను పరిశీలించి అనుమానితుడిని గుర్తించారు. అం దులో భాగంగా సోమవారం రాత్రి తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అనుమానితుడి ఫో టోను విడుదల చేశారు. చోరీకి పాల్పడ్డ వారి కోసం ఆరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన ట్టు ఎస్పీ వెల్లడించారు. ఫోటోలోని వ్యక్తి ఆచూకీ తె లిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని వివరించారు. అయితే ఆటో డ్రైవర్‌తో పాటు తిరుపతిలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. కాల్‌డేటా ఆధారంగా విచారణ ముమ్మరం చోరీ జరిగిన రోజున ఆలయ పరిసర ప్రాంతాల్లోని సెల్ టవర్ ఆధారంగా కాల్‌డేటాను పరిశీలిస్తున్నా రు. దొంగతనానికి పాల్పడ్డ వారి ఆచూకీ కోసం పోలీ సు బృందాలు వివిధ రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లా రు. కాల్‌డేటాను సేకరించిన పోలీసులు వాటి ఆధా రంగా గాలింపు చేపట్టారు. ఈ మేరకు పోలీసు బృం దాలు ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వెళ్లారు. దొంగల ను కాల్‌డేటా పట్టిస్తుందనే పోలీసులు భావిస్తున్నా రు. గర్భాలయం ముందు ఉన్న సీసీ కెమెరా గత కొన్ని రోజులుగా పనిచేయకపోవటానికి గల కారణా లపైనా కూపీ లాగుతున్నారు. అర్చకుల్లో రెండు వర్గా లు ఉండటంతో విచారణకు సహకరించటం లేదనే ప్రచారం జరుగుతోంది. విచారణకు సహకరించాలని జేఈఓ అర్చక బృందాలను కోరినట్టు తెలిసింది. అర్చకులు లేని సమయంలోనే.. గోవిందరాజస్వామి గర్భాలయం, సమీపంలో విధులు నిర్వహించాల్సిన అర్చకులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు పోలీసుల విచారణలో తేలింది. కిరీటాలు చోరీకి గురైన స మయంలో అర్చకులు గర్భాలయంలో లేరని తెలిసింది. ఇదే అదనుగా చూసి ఉత్సవమూర్తులకు అలంకరించి ఉన్న మూడు కిరీటాలను అపహరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, అర్చకులపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. గోవిందరాజస్వామి గర్భాలయంలో విధులు నిర్వహించే అర్చకులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంపై తొ లుత పోలీసులు వారినే అనుమానించారు. అయి తే విచారణలో వీరికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. అయినా గర్భాలయంలో విధులు నిర్వహించేవారి నిర్లక్ష్యమే చోరీకి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ మేరకు వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. -
తిరుపతి: మూడు బంగారు కిరీటాలు మాయం
సాక్షి, తిరుపతి : తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులకు అలంకరించే మూడు బంగారు కిరీటాలు మాయం అయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై శనివారం రాత్రి టీటీడీ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీవేంకటేశ్వరస్వామి అన్నగారైన శ్రీగోవిందరాజస్వామి ఆలయాన్ని 12వ శతాబ్దంలో శ్రీరామానుజాచార్యులు నిర్మించారు. తిరుమల కొండకు వచ్చిన ప్రతి భక్తుడు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామిని దర్శించుకుంటారు. శ్రీవారికి సమర్పించినట్టే గోవిందరాజస్వామికి కూడా రాజులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బంగారు, వజ్రాలతో పొదిగిన ఆభరణాలు, వజ్రవైఢూర్యాలతో పొదిగిన కిరీటాలు కానుకలుగా సమర్పించారు. కాగా శ్రీగోవిందరాజస్వామికి ప్రధానంగా ఐదు బంగారు కిరీటాలు ఉన్నట్లు సమాచారం. అయితే నిత్యం స్వామి వారికి అలంకరించి ఉండే మూడు కిరీటాలు మాయమయ్యాయి. మాయమైన మూడు కిరీటాలను ‘సదా సమర్పణ’ కిరీటాలు అని అంటారు. వజ్రాలతో తయారు చేయించిన ఈ కిరీటాలు మూడు 1.300 కిలోలు బరువు ఉంటాయని వెల్లడించారు. నిత్యం రద్దీగా ఉండే ఆలయంలో ఉత్సవ మూర్తులకు అలంకరించే మూడు విలువైన బంగారు కిరీటాలు మాయమైన విషయం శనివారం సుప్రభాత సేవ సమయంలోనే తెలిసినట్లు సమాచారం. ఆ వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ కిరీటాలు ఆలయంలో పనిచేసే వారికి తెలియకుండా మాయమయ్యే అవకాశం లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరు? ఎలా మాయం చేశారనే విషయంపై తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్, టీటీడీ విజిలెన్స్ అధికారులు, క్లూస్ టీం విచారణ చేపట్టారు. ఆలయంలోని సీసీ పుటేజిలను పరిశీలిస్తున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులను విచారిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తిరుపతిలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో పనిచేసే అధికారి ఒకరు విలువైన ఆభరణాలను మాయం చేసి తాకట్టుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇంకా విచారణ జరుగుతుండగానే... తాజాగా శ్రీగోవింద రాజస్వామి ఆలయంలో బంగారు కిరీటాలు మాయం కావడం సంచలనంగా మారింది. -
దళితుల చీలికకు కుట్ర
చీరాల రూరల్ : దళిత, బహుజనులు రాజ్యాధికార దిశగా పయనించాలని, అందుకు ఐకమత్యమనే మార్గాన్ని ఎంచుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మున్సిపల్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్లో దళిత, బహుజన సంఘాల మేధోమధన సదస్సు జరిగింది. సదస్సు కన్వీనర్ గోసాల ఆశీర్వాదం అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, హైదరాబాదుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎ.ఎం. ఖాన్ యస్థాని, సామాజిన న్యాయవేదిక కన్వీనర్ వై. కోటేశ్వరరావు ప్రసంగించారు. రాష్ట్రంలోని దళిత, బహుజనులంతా రాష్ట్రంలో అత్యల్పంగా ఉన్న పెత్తందార్ల కబంధ హస్తాల్లో చిక్కుకుని సమిధలవుతున్నారని పేర్కొన్నారు. బతకటానికి పోరాటాలు చేయాల్సిన విపత్కర పరిస్థితులు ప్రస్తుత సమాజంలో నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత, బహుజనులందరూ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావ్ పూలేలను ఆదర్శంగా తీసుకుని సమాజాన్ని ఏవిధంగా సంస్కరించాలో తెలుసుకొని పయనించాలని సూచించారు. ప్రమాదకరంగా బీజేపీ..ఆర్ఎస్ఎస్ దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడులు అధికమయ్యాయని వక్తలు పేర్కొన్నారు. దళిత, బహుజనులంతా ఐకమత్యమై బలమైన రాజకీయ శక్తిగా అవతరించి, సాంస్రృతిక ఐక్యత సాధించాలని పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కులాల కుంపట్లు, రిజర్వేషన్ల రగడతో దళిత, బహుజనులను చీల్చివేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని అలాంటి వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇక్కడ చర్చించిన అంశాలన్నింటిని క్రోడీకరించి సైద్ధాంతిక రూపంలోనికి తీసుకువచ్చి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాక దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందులో భాగంగా ఐదుగురితో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి వారిద్వారా ఇక్కడ చేసిన తీర్మానాలను కరపత్రాల రూపంలో ముద్రించి కార్యరూపం దాల్చే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. చీరాలలో పబ్బం గడుపుకుంటున్న పెద్దలు చేనేత జన సమాఖ్య రాష్ట్ర నాయకుడు మాచర్ల మోహనరావు మాట్లాడుతూ ప్రస్తుతం చీరాలలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయని, ఇక్కడున్న రాజకీయ పార్టీల నాయకులు ఒక వర్గం ప్రజలను అదే వర్గం ప్రజలపైకి ఉసిగొల్పుతూ వారి పబ్బం గడుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వరికూటి అమృతపాణి, బాంసప్ రాష్ట్ర కన్వీనర్ పరంజ్యోతి మాట్లాడుతూ దేశంలోని పెట్టుబడిదారులు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి పార్టీలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మాజీ మంత్రి పాలేటి రామారావు మాట్లాడుతూ సమాజంలో ఇటువంటి ఆహ్లాదకరమైన రాష్ట్ర సదస్సులు జరగడం మంచి పరిణామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబూరి సుబ్రహ్మణ్యం, పలుకూరి ప్రసాదరావు, నల్లబోతుల మోహన్‌కుమార్ ధర్మ, నీలం నాగేంద్రరావు, గోసాల సుధాకర్, పొదిలి ఐస్వామి, అబ్దుల్ రహీం, పిన్నిక శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాలకు చెందిన దళిత, బహుజన సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు -
స్వర్ణ కిరీటంతో బాబా దర్శనం
ధర్మవరం అర్బన్ : ఆపదల్లో ఉన్న భక్తుల సమస్యలను తీర్చి వారి వెన్నంటి ఉండే శ్రీ షిరిడిసాయినాథుడు భక్తులకు బంగారు కిరీటదారుడై దర్శనమిచ్చాడు. ధర్మవరం సాయినగర్‌లో ఉన్న శ్రీ షిరిడిసాయిబాబా ఆలయంలో సోమవారం ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. మధ్యాహ్నం వేలాది మందికి అన్నదానం చేశారు. అర్చక బృందం ఆధ్వర్యంలో వేదపండితులు షిరిడిసాయిబాబాకు లక్ష కుసుమార్చన నిర్వహించారు. జనసందోహంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. నేడు గ్రామోత్సవం మంగళవారం ఉదయం 7 గంటలకు బాబాకు అభిషేకంతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 4.30 గంటలకు బాబా ఉత్సవ విగ్రహంతో పట్టణ పురవీధులలో గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నట్లు సేవా సమితి సభ్యులు తెలిపారు. -
యువరాణి ప్రేమకధ
-
మిస్ వరల్డ్‌గా పొర్టారికో సుందరి
-
మిస్ వరల్డ్ గా స్టిఫానీ డెట్ వాల్లె
-
మిస్ వరల్డ్ కిరీటం తృటిలో మిస్
మేరీల్యాండ్: మిస్ వరల్డ్ కిరీటాన్ని భారత్‌కు చెందిన ప్రియదర్శిని చటర్జీ తృటిలో కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా 116 మంది పాల్గొన్న ఈ పోటీల్లో ప్రియదర్శిని టాప్ 20 వరకు చేరినా, టాప్ 5లో చోటు సంపాదించలేకపోయారు. మిస్ వరల్డ్ 2016 కిరీటాన్ని 19 ఏళ్ల పోర్టా రికో సుందరి స్టిఫానీ డెట్ వాల్లె గెలుచుకున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిర్వహించిన ఫైనల్ పోటీల్లో కెన్యా, ఇండోనేషియా, డొమీనికన్ రిపబ్లిక్, ఫిలిప్పైన్స్కు చెందిన సుందరీమణులను దాటుకొని విజేతగా స్టిఫానీ డెట్ వాల్లె నిలిచింది. కాగా, భారత్ తరపున చివరిసారిగా ప్రయాంకచోప్రా(2000) మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. అంతకు ముందు రీతా ఫారియా(1996), ఐశ్వర్యారాయ్(1994), డయానా హెడెన్(1997) యుక్తా ముఖి(1999)లు మిస్ వరల్డ్ కిరిటాన్ని దక్కించుకున్న వారిలో ఉన్నారు. ప్రియదర్శిని చటర్జీ -
భద్రకాళీ మాతకు కిరీటం సమర్పించిన సీఎం కేసీఆర్
-
బహుజనులు రాజ్యాధికారం చేపట్టాలి
అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దేవోళ్ల గంగాధర్ నిర్మల్‌రూరల్ : దేశంలో, రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చినా తమ సమస్యలు తీరలేదని, ఇక బహుజనులే రాజ్యాధికారం చేపట్టాల్సిన అవసరముందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దేవోళ్ల గంగాధర్ అన్నారు. స్థానిక టీఎన్జీవోస్ సంఘభవనంలో బుధవారం పార్టీ నిర్మల్ అసెంబ్లీ అధ్యక్షుడు బొర ముత్యం అధ్యక్షతన నియోజకవర్గస్థాయి పదాధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా పదాధికారులతో ప్రస్తుత పరిస్థితులు, చేపట్టాల్సిన అంశాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా తమకు ఒరిగిందేమి లేదని, ఇక సమస్యలను పరిష్కరించుకోవాలంటే బహుజనులే రాజ్యాధికారం చేపట్టాలని అన్నారు. సమావేశంలో బామ్సెఫ్ జిల్లా కన్వీనర్ మార రాజన్న, బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ పట్ల బాపురావు, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌రావు, శేర్లింగంపల్లి అసెంబ్లీ అధ్యక్షుడు హన్మంత్‌రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు నేర రాజన్న, పాముల బాపురావు, సుంకరి సాయన్న, మర్సకోల భీంరావు, మల్లెల భూమన్న, దేవోళ్ల రాజలింగం, లింగన్న, సదానందం తదితరులు పాల్గొన్నారు. -
బాబాకు బంగారు కిరీటం బహూకరణ
సాక్షి, మంగళగిరి : మండలంలో గురుపౌర్ణమి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పెదవడ్లపూడి గ్రామంలో దక్షిణ షిరిడీ సాయి బాగా ప్రసిద్ధి చెందిన సాయి మందిరంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. సాయినాథునికి చిల్లపల్లి షోరూం అధినేత శ్రీనివాసరావు బహూకరించిన వందకాసుల బంగారు కిరీటాన్ని తొడిగారు. అనంతరం మందిరంలో మంత్రి గంటాను సన్మానించారు. -
ధనికుల చేతిలో టీడీపీ బందీ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కర్నూలు సిటీ: రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బడుగు, బలహీన వర్గాల కోసం నందమూరి తారకా రామారావు..టీడీపీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు..పార్టీని ధనవంతుల కోసమే నడుపుతున్నట్లు కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. గడప గడపకు సీపీఐ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కర్నూలు నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ఎందుకు గట్టిగా నిలదీయడం లేదని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమి సాధించారని నవ నిర్మాణ దీక్షలు చేస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. దమ్ముంటే ఢిల్లీలో దీక్షలు చేసి విభజన హామీలను అమలు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల చంద్రబాబు అగ్రవర్ణాలకు చెందిన పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటన చేశారని, బాబు దృష్టిలో అగ్రవర్ణాల్లో పేదలంటే సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌లేనని రాజ్య సభసీట్ల కేటాయింపును బట్టి అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, సహాయ కార్యదర్శి మునెప్ప, నగర కార్యదర్శి రసూల్, ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ మాణిక్యం, ఏఐయస్‌యఫ్ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, రంగన్న తదితరులు పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ -
కిరీటదారి