ఢిల్లీ: జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోదీ బహూకరించిన కిరీటం చోరీపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోదీ బహూకరించిన కిరీటం చోరీకి గురికావడం పట్ల తీవ్రంగా ఖండించింది. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి అపవిత్ర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడింది.
‘‘ఢాకాలోని తంతిబజార్‌లో పూజా మండపంపై దాడి, జేశోరేశ్వరి కాళీమాత ఆలయంలో చోరీ జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా బాధాకరం. బంగ్లాదేశ్‌లోని హిందువులు సహా మైనారిటీలు, వారి ప్రార్థన మందిరాల భద్రత, మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలను తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
కాగా, 2021 మార్చిలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని.. కాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా అందించిన సంగతి తెలిసిందే. బంగ్లాలోని సత్ఖీరా జిల్లా ఈశ్వరీపూర్‌లోని ఈ కాళీ ఆలయం శక్తి పీఠాల్లో ఒకటి. స్థానిక కళాకారులు మూడు వారాల పాటు శ్రమించి దీన్ని తయారుచేశారు.
ఇదీ చదవండి: 50 ఏళ్లలో తొలిసారి సహారా ఎడారిలో వరదలు.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment