వందల ఏళ్ల నీరిక్షణ సాకారమైంది. కోట్లాది మంది భక్తుల కలను నిజం చేస్తూ ఆయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. భవ్య రామమందిరంలో దివ్య రాముడు కొలువుదీరాడు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్క అయోధ్యలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రజలు ఈ వేడుకను వైభవంగా జరుపుకున్నారు. జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఎంతోమంది భక్తులు విరాళాలు అందించారు. .దేశ విదేశాలకు చెందిన రామభక్తులు కానుకలు, విరాళాలు సమర్పించారు. రోజూ కూలి పని చేసుకునే వారి నుంచి బడా వ్యాపారుల వరకు తమకు తోచినంతా సాయం చేసి రామలయ నిర్మాణంలో భాగమయ్యారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేష్ పటేల్‌రాముడికి భారీ విరాళం అందించారు.
‘ల్యాబ్ డైమండ్ కంపెనీ’ యజమాని అయిన ముకేష్ పటేల్, ఆయన కుటుంబం రాముడికి రూ. 11 కోట్ల విలువైన కిరీటం చేయించారు. కిరీటాన్ని నాలుగు కిలోల బంగారం. వజ్రాలు, జెమ్‌స్టోన్స్, కెంపులు, ముత్యాలు, నీలమణితో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ మేరకు ముకేష్ తన తండ్రితో కలిసి అయోధ్యను సందర్శించి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ అధికారులకు అందజేశారు.
చదవండి: Ayodhya: అయోధ్యకు తొలిరోజు పోటెత్తిన భక్తులు
అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు సమాచారం. ఈ బంగారంతో రామాలయం తలుపులు, గర్భ గుడి, త్రిశూలం మొదలైనవి చేయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత బంగారం ధర ప్రకారం 101 కేజీల బంగారం అంటే రూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావించాలి. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్‌కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లు సేకరించారు. వీరిలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లాఖి, ఆయన కుటుంబం రాముల వారికి భూరి విరాళం ఇచ్చినట్టు సమాచారం. దిలీప్ కుటుంబం అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు తెలుస్తోంది..ప్రస్తుత బంగారం ధర ప్రకారంరూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఈ బంగారాన్ని రామాలయ తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్‌కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అధికమని తెలుస్తోంది.
మరోవైపు నేటి నుంచి(జనవరి 23) సాధారణ భక్తులకు దర్శనం అనుమతించడంతో అయోధ్యకు భక్తులు పోటెత్తారు. చలిలోనూ ఉదయం మూడు గంటల నుంచి ఆలయం భయట భారీగా క్యూ కట్టి శ్రీరాముడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు రెండు స్లాట్లు కల్పించారు. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు.. అలాగే.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గం. వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment