Diamond Trader
-
కృత్రిమ వజ్రాలు తయారీ.. లాభనష్టాలు ఎవరికంటే..
వజ్రం అంటే దాదాపు అందరికీ కోహినూర్ వజ్రం గుర్తొస్తుంది. భూమిలోపల కొన్ని ఏళ్ల తరబడి చోటు చేసుకున్న రసాయన చర్య ఫలితంగా వజ్రం పుట్టుకొస్తుంది. వజ్రాన్ని కార్బన్ ఘన మూలకంగా భావించొచ్చు. అందులోని పరమాణువులు స్ఫటికాల ఆకారంలో కనిపిస్తాయి. దీంతో వజ్రం గట్టిగా ఉంటుంది. ఇతర ఏ పదార్థాల్లో లేని ఉష్ణవాహకత సామర్థ్యం వజ్రంలో ఉంటుంది. సహజంగా దొరికే వజ్రాల వయసు 1 బిలియన్ నుంచి 3.5 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. భూమిలో 150 నుంచి 250 కిలోమీటర్ల లోపలికి తవ్వితే కానీ వజ్రాలు లభ్యం కావు. అలాంటి సహజ వజ్రాలకు పోటీగా ఇప్పుడు కృత్రిమ వజ్రాలను తయారుచేస్తున్నారు. తాజాగా యాంట్వెర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్ (ఏడబ్ల్యూడీసీ) నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ల్యాబ్ గ్రోన్ డైమండ్ల మార్కెట్ వాటా 2016లో 1% నుంచి 2024లో 20%కి పెరిగినట్లు తేలింది. 2030లో అది భారీ వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. కృత్రిమ వజ్రం ఎలా తయారు చేస్తారంటే.. న్యూయార్క్‌లోని జనరల్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో 1954లో తొలిసారి ల్యాబ్ గ్రోన్ డైమండ్‌ను సృష్టించారు. తరువాత అనేక పరిశోధనలు చేసి వాటి తయారీ వేగం పెంచడానికి రెండు పద్ధతులు కనుగొన్నారు. అందులో ఒకటి అధిక పీడనం, అధిక ఉష్ణం(హెచ్‌పీహెచ్‌టీ) రెండోది రసాయన ఆవిరి నిక్షేపణ(సీవీడీ). ఈ రెండు పద్ధతులకు సీడ్ తప్పనిసరి. అంటే ఏదైనా ఇతర డైమండ్లోని కొంత భాగం సీడ్‌గా పని చేస్తుంది. అధిక పీడనం, అధిక ఉష్ణం పద్ధతిలో సీడ్, స్వచ్ఛమైన గ్రాఫైట్ కార్బన్‌ను ఒక చోట ఉంచుతారు. వాటిని దాదాపు 1500 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు. అలాగే పీడనాన్ని కలిగిస్తారు. దాంతో కార్బన్ డైమండ్గా రూపాంతరం చెందుతుంది. రసాయన ఆవిరి నిక్షేపణ విధానంలో కార్బన్ రిచ్ గ్యాస్ నింపిన ఛాంబర్లో సీడ్‌ను ఉంచి 800 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు. దాంతో కార్బన్ డైమండ్గా మారుతుంది. నాణ్యత ఎలా ఉంటుందంటే.. భూమిలో నుంచి తవ్వి తీసిన వజ్రాల్లాగే ల్యాబ్ వజ్రాలను డైమండ్ టెస్టర్‌తో పరీక్షిస్తారు. వాటిలోని కార్బన్ మిశ్రమం, ఉష్ణవాహకత ఇంచుమించు సహజ వజ్రాల్లానే ఉంటాయి. దృఢంగా ఉండటంతోపాటు, గీతలు పడవు. కిందపడినా పగిలిపోవు. సహజంగా వజ్రాన్ని ఎలా కోస్తారో వీటిని కూడా అలాగే కోయాల్సి ఉంటుంది. యంత్రాల్లో వినియోగించే కొన్ని లోహాలు గట్టిదనం లేక విరిగిపోతుంటాయి. అటువంటి చోట కృత్రిమ వజ్రాలనే వాడుతున్నారు. కృత్రిమ వజ్రాలతో పనిముట్లు కూడా తయారు చేస్తున్నారు. విద్యుత్ తయారీ రంగంలోనూ స్వచ్ఛమైన సింథటిక్ డైమండ్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. హైపవర్ లేజర్ డయోడ్స్లో వాటిని ఉష్ణవాహకాలుగా వినియోగిస్తున్నారు. డిమాండ్ ఎలా ఉందంటే.. సహజంగా అరుదుగా దొరికే వాటిపై ఉన్న వ్యామోహం కృత్రిమంగా దొరికే వాటిపై ప్రజలకు ఉండదు. పురాతన వజ్రం అనగానే ధనికులు కోట్లు కుమ్మరించి కొనుగోలు చేస్తుంటారు. కృత్రిమం అనగానే చిన్నచూపు చూస్తారు. నేటి రోజుల్లో వివాహ శుభకార్యాలకు బంగారం కొనడం సర్వ సాధారణమైంది. దాంతో భిన్నంగా ఉండాలని కొందరు వజ్రాల ఉంగరం, వజ్రాల నగల కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇదీ చదవండి: త్వరలో భారత మొబైల్ ఫోన్ బ్రాండ్ మధ్య తరగతి ప్రజలు కూడా కనీసం ఓ డైమండ్ ఉంగరమైనా సరే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారు కృత్రిమ వజ్రాలు ఎంపిక చేసుకుంటే ఖర్చు కలిసి వస్తుందని తయారీదారులు చెబుతున్నారు. అయితే సహజ వజ్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్న కృత్రిమ వజ్రాల ధర భవిష్యత్తులో మరింత తగ్గిపోవచ్చనే ఊహాగానాలున్నాయి. దాంతో కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. -
అయోధ్య రామయ్యకి విలువైన కిరీటం, దాత ఎవరంటే..
వందల ఏళ్ల నీరిక్షణ సాకారమైంది. కోట్లాది మంది భక్తుల కలను నిజం చేస్తూ ఆయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. భవ్య రామమందిరంలో దివ్య రాముడు కొలువుదీరాడు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్క అయోధ్యలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రజలు ఈ వేడుకను వైభవంగా జరుపుకున్నారు. జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఎంతోమంది భక్తులు విరాళాలు అందించారు. .దేశ విదేశాలకు చెందిన రామభక్తులు కానుకలు, విరాళాలు సమర్పించారు. రోజూ కూలి పని చేసుకునే వారి నుంచి బడా వ్యాపారుల వరకు తమకు తోచినంతా సాయం చేసి రామలయ నిర్మాణంలో భాగమయ్యారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేష్ పటేల్రాముడికి భారీ విరాళం అందించారు. ‘ల్యాబ్ డైమండ్ కంపెనీ’ యజమాని అయిన ముకేష్ పటేల్, ఆయన కుటుంబం రాముడికి రూ. 11 కోట్ల విలువైన కిరీటం చేయించారు. కిరీటాన్ని నాలుగు కిలోల బంగారం. వజ్రాలు, జెమ్‌స్టోన్స్, కెంపులు, ముత్యాలు, నీలమణితో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ మేరకు ముకేష్ తన తండ్రితో కలిసి అయోధ్యను సందర్శించి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ అధికారులకు అందజేశారు. చదవండి: Ayodhya: అయోధ్యకు తొలిరోజు పోటెత్తిన భక్తులు అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు సమాచారం. ఈ బంగారంతో రామాలయం తలుపులు, గర్భ గుడి, త్రిశూలం మొదలైనవి చేయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత బంగారం ధర ప్రకారం 101 కేజీల బంగారం అంటే రూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావించాలి. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్‌కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లు సేకరించారు. వీరిలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లాఖి, ఆయన కుటుంబం రాముల వారికి భూరి విరాళం ఇచ్చినట్టు సమాచారం. దిలీప్ కుటుంబం అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు తెలుస్తోంది..ప్రస్తుత బంగారం ధర ప్రకారంరూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఈ బంగారాన్ని రామాలయ తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్‌కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అధికమని తెలుస్తోంది. మరోవైపు నేటి నుంచి(జనవరి 23) సాధారణ భక్తులకు దర్శనం అనుమతించడంతో అయోధ్యకు భక్తులు పోటెత్తారు. చలిలోనూ ఉదయం మూడు గంటల నుంచి ఆలయం భయట భారీగా క్యూ కట్టి శ్రీరాముడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు రెండు స్లాట్లు కల్పించారు. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు.. అలాగే.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గం. వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతించనున్నారు. -
గుజరాత్లో సన్యాసిగా సంపన్నుడి కూతురు
చిన్నవయసులో భౌతిక సుఖాలను త్యజించి సన్యాసం స్వీకరించింది తొమ్మిదేళ్ల చిన్నారి. ఈ ఘటన గుజరాత్‌లోని వెసు అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. పైగా ఆ చిన్నారి సంపన్న వజ్రాల వ్యాపారి కూతురు. వివరాల్లోకెళ్తే వజ్రాల వ్యాపారి ధనేష్ అతడి భార్య సంఘ్వీలకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె దేవాన్షి సన్యాసిగా దీక్ష తీసుకుంటున్నట్లు కుటంబ సభ్యులు తెలిపారు. ఆ చిన్నారి తండ్రి సూరత్‌లో దాదాపు మూడు దశాబ్దాల నాటి డైమండ్ పాలిషింగ్ ఎగుమతి సంస్థ సంఘ్వీ అండ్ సన్స్ యజమాని. ప్రస్తుతం ఆమె అన్ని విలాసాలను త్యజించి సన్యాసి దీక్ష తీసుకుంటుంది. చిన్న వయసు నుంచి ఆమె ఆధ్యాత్మిక జీవితం వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. అంతేగాదు అధికారికంగా ఈ సన్యాసి జీవితాన్ని స్వీకరించడానికి ముందు ఇతర సన్యాసులతో సుమారు రూ.700 కి.మీ దూరం నడించిందని, వారిలా జీవనం సాగించిందని కుంటుంబికులు చెబుతున్నారు. ఆమెకు ఐదు భాషలు తెలుసని, పైగా ఇతర ప్రత్యేక నైపుణ్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ సన్యాసి దీక్ష వేడుక గత శనివారం ప్రారంభమైంది. అంతేగాదు మంగళవారం, దేవాన్షి 'దీక్ష' తీసుకునే ఒక రోజు ముందు, నగరంలో కోలాహలంగా పెద్ద ఎత్తున మతపరమైన ఊరేగింపు జరిగింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: విచిత్రమైన ప్రేమ కథ: చనిపోయి తమ ప్రేమను గెలిపించుకున్న జంట!) -
'ఈ వజ్రాల వ్యాపారి.. మనిషీ వజ్రమే'
సూరత్: సూరత్‌లో ఆదివారం 151 జంటలు మూడుముళ్ల బంధంలో ఒక్కటయ్యారు. వధూవరులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. పెళ్లి కుమార్తెల కోసం ఖరీదైన బంగారు ఎంబ్రాయిడరీ చీరలు తెప్పించారు. మూడురోజుల పాటు జరిగిన వివాహ వేడుకకు దాదాపు లక్షమంది హాజరయ్యారు. వివాహ వేదికను అందంగా అలంకరించారు. రుచికరమైన వంటలు వండించారు. ఖర్చు 5 కోట్ల రూపాయలు. ఈ ఘనమైన ఏర్పాట్లను చూస్తే అందరూ ధనవంతుల పెళ్లిళ్లు అని అనుకుంటారు. అయితే పెళ్లి కుమార్తెలలో ఎవరికి తండ్రీ లేడు. వివాహం చేసుకోవడానికి ఆర్థిక స్థోమతలేనివారు. సూరత్ చెందిన వజ్రాల వ్యాపారి మహేశ్ శావని ఓ తండ్రిలా వచ్చి.. సొంతఖర్చుతో అంగరంగవైభవంగా పేద యువతులకు సామూహిక వివాహాలు జరిపించారు. తమ ఇంట్లో శుభకార్యాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసే కోటీశ్వరులు చాలా మంది ఉండొచ్చు కానీ ఇలాంటి దాతలు మాత్రం అరుదు. కొన్నేళ్లుగా మహేశ్ శావని తండ్రిలేని, నిరుపేద యువతులకు ఓ తండ్రిలా ఉచిత వివాహాలు జరిపిస్తున్నారు. 2008లో మహేశ్ దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి తన ఇద్దరు కుమార్తెల పెళ్లికి కొన్ని రోజుల మందు మరణించాడు. మహేశ్ తన ఉద్యోగి బాధ్యతలను భుజాన వేసుకుని తండ్రిగా ఆ ఇద్దరు అమ్మాయిలకు వివాహం జరిపించాడు. అప్పట్నుంచి ప్రతి ఏటా తండ్రి లేని నిరుపేద యువతులకు సొంత ఖర్చుతో ఘనంగా వివాహాలు జరిపిస్తున్నారు. ప్రతి వధువుకూ బంగారు నగలు, దుస్తులు, కలశం, ఓ పళ్లెం అందజేస్తారు. పెళ్లి రోజున తండ్రి అవసరం ఎంతన్నది తండ్రిలేనివారికే తెలుస్తుందని విమలా కోరింగా అనే వధువు చెప్పింది. మరో వధువు మీటల్ గోండాలియా మాట్లాడుతూ.. 'రెండేళ్ల క్రితం మా నాన్న మరణించారు. నా పెళ్లికి డబ్బులు ఎలా సమకూర్చాలని అమ్మ ఆందోళన చెందేది. మహేశ్ శావని పప్పా దేవుడిలా వచ్చి ఆదుకున్నారు' అని సంతోషం వ్యక్తం చేసింది.