అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలరాముడిగా కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువులరు సెలబ్రెటీలకు, ప్రముఖులకు ఆహ్వానం అందింది. అయితే వారంతా ఈ ఈవెంట్‌కి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ టీవీల్లో ఫుల్ మేకప్‌తో ట్రెండీ దుస్తులతో కనపించేవారంతా ఒక్కసారిగా సంప్రదాయ దుస్తుల్లోకి మారిపోయారు. మనం రోజూ తెరపై చూసిన నటీ నటులేనే అన్నంతగా వారి ఆహార్యం మారిపోయింది. వారంతా ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..!
ఈ మహత్తర మహోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, ఆమె భర్తతో కలిసి వచ్చింది. కత్రినా బంగారు రంగు చీరలో సంప్రదాయ గృహిణిలా కనిపించగా, ఆమె భర్త చక్కటి తెల్లటి కుర్తా పైజామా, బోల్డ్ డిజైన్‌లో ఉన్న దుపట్టతో తళుకున్నమన్నాడు. ఇరువురిని చూస్తే రెండు కళ్లవు చాలవు అన్నంత అందంగా సంప్రదాయ బద్ధమైన దుస్తులతో అలరించారు. ఇక 'యానిమల్' హిరో సతీమణి అలియా భట్ సైతం గోల్డెన్ బోర్డర్‌తో ఉన్న లక్స్ గ్రీన్‌చీరలో వచ్చింది. పైగా భుజంపై మ్యాచింగ్ శాలువా ధరించి హుందాగా వచ్చింది. ఇక ఆమె భర్త రణబీర్ కపూర్ తెల్లటి ధోతీ కుర్తాలో అదిరిపోయే లుక్క్‌లో సందడి చేశాడు. అతను కూడా మంచి క్లాసిక్ శాలువా ధరించాడు. పైగా ఇరువురు ఎలాంటి మేకప్ లేకుండా నేచురల్ లుక్‌లో కనిపించారు.
ఇక వారితో పాటు రోహిత్ శెట్టి తెల్లటి కుర్తా సెట్‌లో అదిరిపోయాడు. ఇక బిగ్‌బీ, బాలీవుడ్ లెజండరీ నటుడు అమితా బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్ఛన్ కూడా తెల్లటి కుర్తా సెట్‌లో కనిపించారు. అలాగే కంనా రనౌత్ ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంది. ఆమె నిన్న అయోధ్యలో చీరకట్టులో చీపురు పట్టుకుని మరీ ఆలయాన్ని శుభ్రం చేసింది. ఇవాళ ఈ ప్రాణ ప్రతిష్ట వేడుకలో నారింజ రంగు చీర, విత్ మ్యాచింగ్ శాలువతో స్టన్నింగ్ లుక్‌తో కనిపంచింది. ఇక సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మహా సంప్రోక్షణకు ఒక రోజు ముందు ఆయోధ్యకు చేరుకున్నారు.
ఆయన ధనుష్‌తో కలిసి సందడి చేశారు. ఈ వేడుకలో ఆయన తెల్లటి కుర్తా పైజామా సెట్ తోపాటు శాలువా ధరించారు. మరో ప్రముఖ నటి మాదురి దీక్షిత్ గోల్డ్ అంచుతో కూడిన పసుపు రంగు చీర, ఫుల్ హ్యండ్స్ బ్లౌజ్‌తో తళుక్కుమనిపించింది. ఆమె భర్త తెల్లటి పైజామా, మెరూన్ రంగు కుర్తాను ధరించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లు పారిశ్రామికవేత్త అనిల్ అంబానితో మాట్లాడుతూ కనిపించారు. రామ్ చరణ్ తెల్లటి పైజామా, ఐవరీ కుర్తా ధరించగా, చిరంజీవి ఐవరీ పట్టు ధోతీ, కుర్తా సెట్‌లో కనిపించారు.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక ఆయుష్మాన్ ఖురాన్‌కూడా తెల్లటి కుర్తాలో అందంగా కనిపించారు. అయితే ఇతను నెహ్రు కోట్ డిజైన్ వేర్‌లో కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి కూడా. ఏదీఏమైనా ఇలాంటి ప్రాణప్రతిష్ట క్రతువుల్లో సినీ తారలు సంప్రదాయ దుస్తులు ధరించి మన ఆచార వ్యవహారాల పట్ల తమకున్న గౌరవాన్ని, ఆసక్తిని చాటుకోవడమే అందరీ మనసులను గెలుచుకున్నారు. అంతేగాదు మనం వెళ్లున్న కార్యక్రమానికి తగ్గట్టు ఉండే ఆహార్యం ఆ మనిషి వ్యక్తిత్వం, వైఖరీ ఏంటన్నది చెప్పకనే చెబుతుంది సుమా!.
(చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్‌లో ఇలా చూడండి!)
Comments
Please login to add a commentAdd a comment