Celebraties
-
బీ అలర్ట్.. వారికి కఠిన చర్యలు తప్పవు: సజ్జనార్ హెచ్చరిక
బెట్టింగ్.. ఈ పేరు వింటేనే ఎంతోమంది జీవితాలు ఛిద్రమైన ఉదంతాలు గుర్తుకు వస్తాయి. బెట్టింగ్ యాప్‌లు సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఈ వ్యసనంలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఉండగా.. యువత సైతం తప్పుడు దారిలో వెళ్తోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. దీంతో, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘యువత, ఎందరో బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రెటీలు ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చని అనుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లకపోవడం మంచిది. యాప్‌ను ఎవరు ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి యాప్ వస్తున్నాయి అనేది చూడాలి. ఎవరు అప్లోడ్ చేస్తున్నారు అనేది పర్యవేక్షించాలి. ఈ యాప్స్ ద్వారా ఎవరు లాభం పొందారు అనేది కూడా విచారణ చేపట్టాలి. ఇలాంటి యాప్స్ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు.ఇలాంటి యాప్స్‌పై అవగాహన కల్పించాలి. ఇప్పటకే పలు విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. డిజిటల్ అరెస్ట్, బ్యాంక్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్, ఓఎల్ఎక్స్ నేరాలు ఇలాంటివి అన్నీ గతంలో జరిగాయి. ప్రధాని మోదీ కూడా డిజిటల్ అరెస్ట్ మోసాలను వివరించారు. దీంతో, మోసాలు తగ్గుముఖం పట్టాయి. అలాగే, బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా అందరికీ అవగాహన కల్పిస్తే మోసాలు తగ్గిపోతాయి. మళ్లీ చెబుతున్నాను.. బెట్టింగ్ యాప్స్ వెళ్లకండి. జీవితాలను నాశనం చేసుకోవద్దు. బెట్టింగ్ యాప్స్ మాయలో పడకండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కదలికలు, ప్రవర్తనను గమనించాలి’ అని కోరారు.అలాగే, ప్రస్తుతం మార్కెట్లో వేలాది బెట్టింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయని, వీటిని ప్రోత్సహించే యూట్యూబర్లను, ప్రచారకర్తలను నమ్మ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రికెటర్లు, సినీ స్టార్లు, టీవీ సీరియల్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బు కోసం ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని ఆయన అన్నారు. కష్టపడి పనిచేస్తేనే డబ్బు వస్తుందని, షార్ట్‌కట్ మార్గాల్లో డబ్బును ఆశిస్తే నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే యూట్యూబర్లను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సజ్జనార్ తెలిపారు. ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ అనే ఉద్యమం ఊపందుకుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
చూపులతోనే గమ్మత్తు చేస్తున్న అవికా గోర్... చిన్నారి పెళ్లికూతురు కాదిక:
-
నేడు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
-
బెంగళూరు రేవ్ పార్టీ: ఆ ఇద్దరు నటులు ఎవరు?
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ దర్యాప్తుపై సీపీ దయానంద కీలక విషయాలు వెల్లడించారు. ఈ రేవ్ పార్టీలో ఇద్దరు నటులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అలాగే, అనుమానితుల బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు.కాగా, సీపీ దయానంద మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరు రేవ్ పార్టీ కేసును ఎప్పుగూడ పీఎస్‌కు బదిలీ చేయడం జరిగింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. రేవ్ పార్టీలో 150 మంది పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపుల్స్ స్వీకరించాము. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. రేవ్ పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశాము. డ్రగ్స్ కొనుగోలుపై ప్రత్యేక చట్టల ద్వారా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాము. బెంగళూరు రేవ్ పార్టీలో ఇద్దరు నటులు దొరికారు. ఇద్దరు నటుల రక్త నమునాలు తీసుకున్నాము. ఈ ఈవెంట్లో రాజకీయ ప్రముఖులెవరూ పాల్గొనలేదు. పోలీసులు వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజును అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. డ్రగ్స్ తెచ్చిన పెడ్లర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు వారు ఎక్కడి నుంచి డ్రగ్స్ తెస్తున్నారు. ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది’ అని అన్నారు. -
సెలబ్రిటీ శారీ డ్రేపర్: ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా..!
సెలబ్రిటీలకు స్టయిల్ని అద్ది.. వాళ్లను ఫ్యాషన్ స్టార్స్‌గా తీర్చిదిద్దే స్టయిలిస్ట్‌లు ఉంటారు. ముఖ్యంగా చీర కట్టు అనేది ఎప్పటికీ స్పెషల్. దీన్ని ప్రోషెషన్గా ఎంచుకుని సినీ సెలబ్రిటీలకు కట్టే స్థాయికి వెళ్లింది స్టార్ స్టయిలిస్ట్ డాలీ జైన్. ఆమె ఎలా శారీ డ్రేపర్‌గా మారిందో తెలుసుకుందామా..! ‘ఆరు గజాల ప్రతి చీరా నాకు 360 రకాల కట్టుతీరుల్ని, కుచ్చిళ్లను పరిచయం చేస్తున్నట్టనిపిస్తుంది’ అంటుందీ చీరకట్టు స్పెషలిస్ట్. దీపికా పదుకోణ్, ఆలియా భట్, ప్రియంకా చోప్రా, కరిష్మా కపూర్, సోనమ్ కపూర్, నీతా అంబానీ, ఈషా అంబానీ, శ్లోకా అంబానీ, రవీనా టండన్ వంటి సెలబ్రిటీలందరూ ఏ చిన్న ఫంక్షన్‌కి అటెండ్ కావాలన్నా డాలీ జైన్‌కి కబురు పెడతారు. ఆమె చేత చీర కట్టించుకుంటారు. అంతలా చీరకట్టును ఓ ప్రొఫెషన్ స్థాయికి తీసుకెళ్లిన డాలీ.. పెళ్లయిన కొత్తలో చీరంటే యమ చిరాకు పడేదట. బెంగళూరులో పుట్టిపెరిగిన ఆమె పెళ్లయ్యే వరకు జీన్స్.. టీ షర్ట్స్, కుర్తీలే ధరించేది. కానీ అత్తారింట్లో క్యాజువల్ వేర్ నుంచి అకేషనల్ వేర్ దాకా అన్నిటికీ చీరే మస్ట్ అని ఆమె సాసుమా ఆర్డర్ పాస్ చేశారు. తప్పక చీరకట్టుతో కుస్తీపట్టడం మొదలుపెట్టింది డాలీ. రోజూ ముప్పావు గంట పట్టేదట చీర కట్టుకునేసరికి. ఇప్పుడు రికార్డ్ రేంజ్లో 18.5 సెకన్లలో కట్టేస్తుంది.. కట్టిస్తుంది. ప్రొఫెషన్‌గా ఎలా మారింది? కారణం సినీతార శ్రీదేవే అనే ఆన్సర్ ఇస్తుంది డాలీ. చీరే కట్టుకోవాలి అని రూల్ పెట్టిన అత్తగారు.. కోడలు పడుతున్న అవస్థ చూసి జాలిపడి ‘కుర్తీలు వేసుకో’ అంటూ నియమాన్ని సడలించింది. అయితే అప్పటికే డాలీకి చీర మీద మోజు మొదలైంది. సో.. చీరనే కంటిన్యూ చేసింది. ఇంట్లో.. ఇరుగుపొరుగు.. బంధువుల్లో ఏ శుభకార్యం జరిగినా చీరకట్టడంలో అతివలకు సాయపడటమూ స్టార్ట్ చేసింది. అలాంటి ఒక సందర్భంలో ఆమె మేనమామ ఒక పార్టీ ఇచ్చాడు. అతను సినీతార శ్రీదేవి ఉండే అపార్ట్మెంట్లోనే ఉండేవాడట. అందుకని శ్రీదేవినీ ఆహ్వానించాడు. డాలీ కూడా వెళ్లింది. పార్టీలో శ్రీదేవి చీర మీద జ్యూస్ ఒలికిందట. ఆమె ఇబ్బందిపడుతుంటే డాలీ చొరవ తీసుకుని గబగబా మేనమామ భార్య చీరొకటి తెచ్చి.. శ్రీదేవికి ఇచ్చిందట. అంతేకాదు ఆమె చీరకట్టుకుంటూంటే.. కుచ్చిళ్లు పెట్టడంలో.. పల్లూ సెట్ చేయడంలో సహాయపడిందట కూడా. డాలీ చీరకట్టే నేర్పరితనానికి శ్రీదేవి అబ్బురపడుతూ ‘ఇన్నేళ్లుగా చీర కట్టుకుంటున్నాను.. ఇంతబాగా కుదిరిందిలేదెప్పుడూ! దీన్ని ఒక ప్రొఫెషన్‌గా తీసుకోవచ్చుగా?’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిందట. ఆలస్యం లేకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇదిగో ఇలా ఫేమస్ అయింది డాలీ. వందల్లోంచి లక్షల్లోకి... దాదాపు 20 ఏళ్లుగా శారీ డ్రేపర్ ప్రొఫెషన్లో కొనసాగుతూన్న డాలీ జైన్.. తొలి పారితోషికం రూ. 250. ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తుంది. ఆమె దగ్గర 20 మంది సభ్యులతో కూడిన టీమ్ ఉంటుంది. చీరనే కాదు.. హాఫ్ శారీ, దుపట్టా.. ఇలా అన్నిటినీ సెట్ చేస్తుంది. ఈ స్టయిలింగ్‌లో ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీలేం లేవు ఆమెకు. కేవలం చీర కట్టు మీద తనకున్న మమకారం.. సృజనతోనే ఈ స్థాయికి ఎదిగింది. తనలాంటి గృహిణులు ఎందరికో స్ఫూర్తిని పంచుతోంది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ? డాలీ జైన్ టాలెంట్ ఫ్యాషన్ డిజైన్ సందీప్ ఖోస్లా దృష్టిలో పడింది. నీతా అంబానీ 50 వ పుట్టిన రోజు ఫంక్షన్లో ఆమెకు చీర కట్టేందుకు డాలీని రికమెండ్ చేశాడు అతను. ఆ వేడుకలో మరెందరో సెలబ్రిటీల దృష్టిలోపడి బాలీవుడ్ ప్రవేశాన్ని సాధించింది. ఆమె ఫస్ట్ బాలీవుడ్ సెలబ్రిటీ వేడుక.. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ వెడ్డింగ్. అక్కణ్ణించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఎందరికో డాలీ ఫేవరేట్ శారీ డ్రేపర్ అయిపోయింది. -
Naila Grewal: నా యాక్టింగ్‌కి 'టెలివిజనే' నాకు ప్రేరణ!
నైలా గ్రేవాల్.. హిందీ నటి. ఇప్పుడు ఓటీటీ స్టార్ కూడా! బయటెంత ఫాలోయింగ్ ఉందో.. అంతకంటే ఎక్కువ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకు. ఇంకొన్ని వివరాల్లోకి వెళితే.. నైలా పుట్టి,పెరిగింది ఢిల్లీలో. మాస్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. డాన్స్ నేర్చుకుంది. థియేటర్ స్కిల్స్ కూడా ఒంటబట్టించుకుంది. ముందు మోడలింగ్ వైపే అడుగులేసింది. కానీ ఆసక్తి అంతా యాక్టింగ్ మీదే ఉండింది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా డాన్స్ బాలేలు చేస్తూ.. థియేటర్లో నటిస్తూ నటనా ప్రతిభను మెరుగుపరచుకునేది. అలాంటి ఒకానొక సందర్భంలోనే బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ నుంచి ఒక కబురు‡ వచ్చింది.. తను తీయబోయే ‘తమాషా’ సినిమాలో నైలాకు వేషం ఇస్తున్నట్టు. అది విన్న ఆమె సంతోషానికి అవధుల్లేవు. సెట్స్ మీదకు వెళ్లినప్పుడైతే కలా.. నిజమా అనుకుందట. మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ‘బరేలీ కీ బర్ఫీ’, ‘భాంగ్డా పా లే’, ‘థప్పడ్’లలో నటించింది. ‘ఇష్క్ విష్క్ రిబౌండ్’లో నటిస్తోంది. తాజాగా ‘మామ్లా లీగల్ హై’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నైలా లండన్‌లో లా చదివి.. ఢిల్లీలో వకీల్గిరీ ప్రారంభించిన లాయర్‌గా నటించింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఆమె నటనకే కాదు ఆమె అందానికి.. ఫ్యాషన్ స్టయిల్‌కి.. డాన్స్కీ అభిమానగణం ఉంది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవన శైలికి ఆమెను స్ఫూర్తిగా తీసుకునే అభిమానులూ ఉన్నారు. సినిమానైనా.. సీరియల్‌నైనా.. ఆ మాటకొస్తే కదిలే బొమ్మను ఫస్ట్ నేను చూసింది టెలివిజన్‌లోనే. అందుకే యాక్టింగ్‌కి టెలివిజనే నాకు ప్రేరణ, స్ఫూర్తి. సిల్వర్‌స్క్రీన్, స్మాల్‌స్క్రీన్, వెబ్‌స్క్రీన్.. ఏ స్క్రీన్ అయినా యాక్టర్స్‌కి ఒకటే. రీచింగ్‌లో తేడా తప్ప దేనికైనా టాలెంటే కొలమానం! - నైలా గ్రేవాల్. ఇవి చదవండి: లియాండర్ పేస్... ప్రముఖ డ్యాన్సర్! -
Priyamani: ప్రియ 'నటీమణి'.. పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె!
'ప్రస్తుతం కమ్‌బ్యాక్ హీరోయిన్స్ హవా నడుస్తోంది. ఆ లిస్ట్‌లో ప్రియమణి మస్ట్! గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె! సినీప్రియులు.. వెబ్ వీక్షకులకు సుపరిచితురాలు. కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు వెబ్‌స్క్రీన్ మీదా షైనింగ్ స్టారే! ప్రియమణి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి బ్రీఫ్‌గా..' ప్రియమణి అసలు పేరు ప్రియా వాసుదేవన్ మణి అయ్యర్. అమె తండ్రి వాసుదేవన్ మణి అయ్యర్ .. బిజినెస్‌మేన్, తల్లి లతా మణి అయ్యర్.. జాతీయ స్థాయి మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. చదువుకునే రోజుల్లోనే ప్రియమణి పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ మోడల్‌గా మారింది. అలా ఆమె తమిళ దర్శకుడు భారతీరాజా దృష్టిలో పడింది. చిత్రసీమకు పరిచయం అయింది. ఆమె కెరీర్ తమిళ చిత్రం ‘కంగలాల్ కైదు సెయి’ తో ప్రారంభమైనప్పటికీ, మొదట విడుదలైంది మాత్రం ‘ఎవరే అతగాడు’ అనే తెలుగు సినిమానే. ఆ తర్వాత ‘సత్యం’ సినిమాతో మలయాళంలోనూ అడుగుపెట్టింది. చేసిన సినిమాలన్నీ విజయవంతమవడంతో టైట్ స్కెడ్యూల్స్తో బిజీ అయిపోయింది. ‘యమదొంగ’ , ‘శంభో శివ శంభో’, ‘రక్త చరిత్ర 2’, ‘రగడ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటే ‘క్షేత్రం’, ‘చారులత’ వంటి చిత్రాలతో నటిగా నిరూపించుకుంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో షారుఖ్ ఖాన్‌తో ఒక పాటలో నటించి బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్‌ని పెళ్లి చేసుకుంది. సినిమాల నుంచి కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. తిరిగి రియాల్టీ షోస్, వెబ్ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకులకు దగ్గరైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో దేశ వ్యాప్తంగా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచిన సిరీస్ ‘ద ఫ్యామిలీ మేన్’. ఆమె నటించిన వెబ్ మూవీస్ ‘భామా కలాపం’, ‘భామా కలాపం 2’ రెండూ ఆహాలో స్ట్రీమింగ్‌లో ఉన్నాయి. పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉండాలన్న ఆలోచన నాకు లేదు. భార్య వంటింటికే పరిమితమనే మనస్తత్వం నా భర్తకు లేదు. నన్ను చాలా సపోర్ట్ చేస్తారాయన! – ప్రియమణి. ఇవి చదవండి: Sharmila Yadav: డ్రోన్ దీదీ -
ప్రాణ ప్రతిష్ట వేళ సెలబ్రెటీలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..!
అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలరాముడిగా కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువులరు సెలబ్రెటీలకు, ప్రముఖులకు ఆహ్వానం అందింది. అయితే వారంతా ఈ ఈవెంట్‌కి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ టీవీల్లో ఫుల్ మేకప్‌తో ట్రెండీ దుస్తులతో కనపించేవారంతా ఒక్కసారిగా సంప్రదాయ దుస్తుల్లోకి మారిపోయారు. మనం రోజూ తెరపై చూసిన నటీ నటులేనే అన్నంతగా వారి ఆహార్యం మారిపోయింది. వారంతా ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..! ఈ మహత్తర మహోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, ఆమె భర్తతో కలిసి వచ్చింది. కత్రినా బంగారు రంగు చీరలో సంప్రదాయ గృహిణిలా కనిపించగా, ఆమె భర్త చక్కటి తెల్లటి కుర్తా పైజామా, బోల్డ్ డిజైన్‌లో ఉన్న దుపట్టతో తళుకున్నమన్నాడు. ఇరువురిని చూస్తే రెండు కళ్లవు చాలవు అన్నంత అందంగా సంప్రదాయ బద్ధమైన దుస్తులతో అలరించారు. ఇక 'యానిమల్' హిరో సతీమణి అలియా భట్ సైతం గోల్డెన్ బోర్డర్‌తో ఉన్న లక్స్ గ్రీన్చీరలో వచ్చింది. పైగా భుజంపై మ్యాచింగ్ శాలువా ధరించి హుందాగా వచ్చింది. ఇక ఆమె భర్త రణబీర్ కపూర్ తెల్లటి ధోతీ కుర్తాలో అదిరిపోయే లుక్క్‌లో సందడి చేశాడు. అతను కూడా మంచి క్లాసిక్ శాలువా ధరించాడు. పైగా ఇరువురు ఎలాంటి మేకప్ లేకుండా నేచురల్ లుక్‌లో కనిపించారు. ఇక వారితో పాటు రోహిత్ శెట్టి తెల్లటి కుర్తా సెట్లో అదిరిపోయాడు. ఇక బిగ్‌బీ, బాలీవుడ్ లెజండరీ నటుడు అమితా బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్ఛన్ కూడా తెల్లటి కుర్తా సెట్లో కనిపించారు. అలాగే కంనా రనౌత్ ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంది. ఆమె నిన్న అయోధ్యలో చీరకట్టులో చీపురు పట్టుకుని మరీ ఆలయాన్ని శుభ్రం చేసింది. ఇవాళ ఈ ప్రాణ ప్రతిష్ట వేడుకలో నారింజ రంగు చీర, విత్ మ్యాచింగ్ శాలువతో స్టన్నింగ్ లుక్‌తో కనిపంచింది. ఇక సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మహా సంప్రోక్షణకు ఒక రోజు ముందు ఆయోధ్యకు చేరుకున్నారు. ఆయన ధనుష్‌తో కలిసి సందడి చేశారు. ఈ వేడుకలో ఆయన తెల్లటి కుర్తా పైజామా సెట్ తోపాటు శాలువా ధరించారు. మరో ప్రముఖ నటి మాదురి దీక్షిత్ గోల్డ్ అంచుతో కూడిన పసుపు రంగు చీర, ఫుల్ హ్యండ్స్ బ్లౌజ్‌తో తళుక్కుమనిపించింది. ఆమె భర్త తెల్లటి పైజామా, మెరూన్ రంగు కుర్తాను ధరించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లు పారిశ్రామికవేత్త అనిల్ అంబానితో మాట్లాడుతూ కనిపించారు. రామ్ చరణ్ తెల్లటి పైజామా, ఐవరీ కుర్తా ధరించగా, చిరంజీవి ఐవరీ పట్టు ధోతీ, కుర్తా సెట్లో కనిపించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక ఆయుష్మాన్ ఖురాన్కూడా తెల్లటి కుర్తాలో అందంగా కనిపించారు. అయితే ఇతను నెహ్రు కోట్ డిజైన్ వేర్లో కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి కూడా. ఏదీఏమైనా ఇలాంటి ప్రాణప్రతిష్ట క్రతువుల్లో సినీ తారలు సంప్రదాయ దుస్తులు ధరించి మన ఆచార వ్యవహారాల పట్ల తమకున్న గౌరవాన్ని, ఆసక్తిని చాటుకోవడమే అందరీ మనసులను గెలుచుకున్నారు. అంతేగాదు మనం వెళ్లున్న కార్యక్రమానికి తగ్గట్టు ఉండే ఆహార్యం ఆ మనిషి వ్యక్తిత్వం, వైఖరీ ఏంటన్నది చెప్పకనే చెబుతుంది సుమా!. (చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్‌లో ఇలా చూడండి!) -
ప్రముఖుల విడాకులు.. మానసిక కారణాలు..!
ప్రముఖుల రొమాన్సులు, వివాహాలే కాదు విడాకులు కూడా మీడియాలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అందరూ దాని గురించి చర్చించుకుంటారు. గతంలో ఆమీర్ ఖాన్-కిరణ్ రావు, అర్జున్ రాంపాల్-మెహర్ జెసియా, సమంతా రూత్ ప్రభు-నాగ చైతన్య, తాజాగా సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు చర్చనీయాంశాలయ్యాయి. అసలు కారణాలు ఎవరికీ తెలియకున్నా ఎవరి కారణాలు వారు వెతుక్కున్నారు. అయితే ఈ విడాకులను గాసిప్ లెన్స్ ద్వారా కాకుండా సైకాలజీ లెన్స్ ద్వారా పరిశీలిస్తే, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు దొరుకుతాయి. ఫేమ్ వల్ల వచ్చే మానసిక ఒత్తిడి నిరంతరం ప్రజల దృష్టిలో ఉండటం ఏ సెలబ్రిటీ జీవితానికైనా కష్టమైన, నష్టం కలిగించే విషయం. వారు చేసే చిన్న పొరపాటు కూడా భూతద్దంలో చూస్తారు, ఘోరమైన తప్పిదంగా మీడియాలో ప్రొజెక్ట్ చేస్తారు. దీంతో ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను కాపాడుకోవడానికి వారు నిరంతరం ఒత్తిడి అనుభవిస్తారు. ఈ ఒత్తిడి ఇద్దరి మధ్య ఉన్న ఇబ్బందులను, విభేదాలను తీవ్రతరం చేస్తుంది. బంధం, అనుబంధం డీప్‌గా మారడానికి ఆటంకం కలిగిస్తుంది. పాపులారిటీతో పెరిగే అహంభావం కీర్తి, సంపద, నిరంతర పాపులారిటీ వ్యక్తిలో అహంభావాన్ని, తద్వారా నార్సిసిజంను పెంచుతాయి. అంటే తనను తాను ప్రేమించుకోవడం పెరిగిపోతుంది. ఫలితంగా భాగస్వామి పట్ల సహానుభూతి, రాజీపడే తత్వం తగ్గిపోతాయి. భాగస్వాములను పాపులారిటీలో తనతో పోటీపడే కాంపిటీటర్‌గా మారుస్తుంది. పరస్పర విశ్వాసం, సాన్నిహిత్యాన్ని దెబ్బతీస్తుంది. బిజీ జీవితంతో బలహీనపడే బంధాలు సెలబ్రిటీల జీవితం ఎడతెగని షెడ్యూల్లు, చాలాకాలం పాటు విడివిడిగా ఉండాల్సి రావడంతో పరస్సర భావోద్వేగ సంబంధాన్ని కొనసాగించడంలో, విశ్వాసాన్ని పెంపొందించడంలో సవాళ్లుగా మారతాయి. భౌతికంగా, మానసికంగా అధిగమించలేని దూరాలను సృష్టిస్తాయి. చివరికి ఒకరితో ఒకరు డిస్ కనెక్ట్ అవుతారు. ఆర్థిక భద్రత పెంచే స్వాతంత్య్ర భావం సెలబ్రిటీలకు ఉండే ఆర్థిక భద్రత ఒక గిఫ్ట్‌లా కనిపించినప్పటికీ, సాంప్రదాయిక నిబద్ధతలను చెరిపేసే స్వాతంత్య్ర భావాన్ని కూడా పెంపొందిస్తుంది. ఫలితంగా సెలబ్రిటీ జంటలు వారి కాపురంలో ఎదుర్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు, సయోధ్యకోసం తక్కువ మొగ్గు చూపుతారు. ఎవరిదారి వారు చూసుకుంటారు. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ల న్యాయ పోరాటంలో హైలైట్ కావడం గమనార్హం. అయితే ఇవన్నీ సాధారణ మానసిక కారణాలు మాత్రమే. ప్రతి సెలబ్రిటీ విడాకుల వెనుక దానివైన ప్రత్యేక కారణాలు ఉంటాయని గుర్తించడం చాలా ముఖ్యం. పాపులారిటీకే ప్రాధాన్యం ఇవ్వడం, వైవాహికేతర సంబంధాలు, మానసిక ఒత్తిళ్లు, అహంకారం, అననుకూలత లాంటి అనేక అంశాలు అనేకం ఉండవచ్చు. తెరపై మెరిసే తారల జీవితాల్లో కూడా మనకు తెలియని అనేకానేక చీకటి గాధలు, బాధలు ఉండవచ్చు. వాటిని పరిష్కరించుకునే క్రమంలో అహానికి పోకుండా, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే మెరుగైన ఫలితం ఉండవచ్చు. --సైకాలజిస్ట్ విశేష్ ఫోన్ నెం: 8019 000066 psy.vishesh@gmail.com (చదవండి: పేరెంట్స్ నిర్లక్ష్యం చేస్తే Animal లా మారతారా? ) -
మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు
ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఒమన్‌లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు, వీరి కోసం వచ్చిన తెలుగు ప్రముఖుల మధ్య రెండు రోజుల పాటు శోభాయమానంగా వేడుకలు నిర్వహించారు. 'రాయల్ కింగ్ హోల్డింగ్'తోపాటు 'చిరు మెగా యూత్ ఫోర్స్' సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ అలరించాయి. ఇటీవల సినీరంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రముఖులు.. డా. మాగంటి మురళీ మోహన్ గారిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఒమన్ దేశ చిహ్నం అయిన కంజరి నడుముకు తొడిగి స్వర్ణ కంకణంతో గౌరవించడం ఈ వేడుకలో ప్రధానఘట్టంగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాత, సినీ పంపిణీదారు వ్యాపారవేత్త బుర్ర ప్రశాంత్ గౌడ్‌తోపాటు సీపీవైఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షలు రామదాస్ చందక ఈ వేడుకలు నిర్వహించారు. డా. మురళీమోహన్‌తో పాటు టాలీవుడ్ నటీమణులు.. రజిత, మధుమని, పింకీ, సోనియా చౌదరి, టివి నటి సంజన సంక్రాంతి వేడుకలకు కొత్త కళను తెచ్చారు. వేడుకలకు కుమారి మాధవి రెడ్డి చేసిన యాంకరింగ్ ఆకట్టుకుంది. సింగర్లు హనుమాన్, స్వాతి సత్యభామ, మోనికా యాదవ్ లు తమ సంగీతంతో ప్రేక్షుకలును కట్టిపడేసారు. పాటలకు తగ్గ డ్యాన్సులతో సందడి నెలకొంది. వేడుకలో ఢీ ఫేమ్ గోవింద్ టీమ్ స్టెప్పులతో స్టేజిని దులిపారు. జబర్దస్త్ సుధాకర్ తన కామెడీతో కడుపు ఉబ్బా నవ్వించారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మరో కళాకారుడు ఎమ్ఎస్ఆర్ నాయుడు తన వెంట్రిలాక్కుజమ్ నైపుణ్యంతో పిల్లలను అలరించారు. ఈ సంక్రాంతి సంబరాలకు హైదరాబాద్ నుంచి ఇన్‌కంటాక్స్ మాజీ అధికారి శ్రీకర్ వేముల, వ్యాపారవేత్త రమేష్ గౌడ్లు హాజరయ్యారు. ఒమన్‌లో వివిధ రంగాల్లో వ్యాపారాభివృద్ధి గురించి పరిశీలన చేశారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా సామాజిక బాధ్యతను మరిచిపోలేదు తెలుగు బిడ్డలు. ఇప్పటివరకు 20 సార్లకు పైగా రక్తదానం చేసిన 30 మంది యువతీయువకులకు మురళీమోహన్ సత్కరించారు. అంబేద్కర్ సేవాసమితి మహిళామణుల అధినేత శ్రీలతాచౌదరి శాలువాతో సత్కరించారు. ఇందులో భాగంగా తెలుగు కమ్యూనిటీకి విశేష సేవలను అందిస్తున్న రాజేష్ మడకశిరను మెమొంటోతో సత్కరించారు. ఈ వేడుక జరిగేందుకు అన్ని రకాలుగా సహకరించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థ, వైబ్రాంట్ సంస్థకు చెందిన పెద్దలు.. మల్లారెడ్డి, రవీంద్ర రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, సీఈఓ శ్రీనివాస్ రావులను సత్కరించారు. సంబరాల్లో సహాయ సహకారాలను అందించిన బాలాజీ, చంద్రశేఖర్, ప్రసాద్ రెడ్డి, నాగభూషణ్‌ను సన్మానించారు. సంక్రాంతి సంబరాలకు సహకరించిన రాయల్ కింగ్ యాజమాన్యానికి (రెన్నీ జాన్సన్ అండ్ టీం) అభినందనలు తెలిపారు. -
ఓటు వేసిన ప్రముఖులు వీరే...
-
సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగా.. గత ఎన్నికల్లోనే నా మొదటి ఓటు.. సెలబ్రిటీ కామెంట్..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగిన నేను చిన్నప్పటి నుంచీ ఎన్నికల సందడిని ఆసక్తిగానే గమనించేవాణ్ని. నాకు గత ఎన్నికల్లోనే తొలిసారి ఓటుహక్కు వచ్చింది. ఓటేయడం అద్భుతంగా అనిపించింది. రాష్ట్రం తలరాతను మనమే నిర్ణయిస్తున్నంత ఫీల్. ఎన్నికల్లో ఓటు వేయడం మనకు అందివచ్చే ఒక గొప్ప అవకాశం. మొదటి నుంచీ రాజకీయాలను, నేతలను దగ్గర నుంచీ పరిశీలిస్తూ ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే చాలా చాలా గుడ్. కానీ అంత తీరిక అందరికీ ఉంటుందా అనేది సందేహమే. ఐదేళ్లూ మన చుట్టూ ఏం జరుగుతుందో మనం అంతగా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా.. పోలింగ్‌కు కొన్ని రోజుల ముందైనా సరే ఒక్కసారి మన చుట్టూ జరిగిన మంచీ చెడూ బేరీజు వేసుకుని మేనిఫెస్టోల్ని విశ్లేషించుకుని ఓటు తప్పకుండా వేయడం అవసరం. గెలుపోటముల గురించి పక్కన పెట్టేద్దాం. పోలింగ్ రోజున ఓటు మాత్రం తప్పకుండా వేద్దాం. – కార్తీక్, సినీనటుడు, కేరాఫ్ కంచరపాలెం ఫేం -
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ఖరీదైన వివాహ వేడుకలు
-
అత్యంత ఖరీదైన సెలబ్రిటీ ఎంగేజ్మెంట్ రింగ్స్
-
రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీల ఫోటోలు మార్ఫింగ్.. 8 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వారిని పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ట్రోలింగ్‌కు పాల్పడుతున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు. ట్రోలింగ్లపై 20 కేసులు నమోదు నమోదు చేశామని, మరో 30 మంది ట్రోలర్స్‌కు నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. ఎమ్మెల్సీ కవిత ఫోటోలను మార్పింగ్ చేసి ట్రోలింగ్ చేశారని డీసీపీ తెలిపారు. ప్రభుత్వ పెద్దలపైనా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్యంగా కంటెంట్‌ను పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్నేహా మెహ్రా హెచ్చరించారు. అరెస్ట్ చేసిన వారిలో అట్టాడ శ్రీనివాసరావు, చిరసాని మణికంఠ, బద్దంజి శ్రవణ్, మోతం శ్రీను, పెరక నాగవెంకట కిరణ్, వడ్లూరి నవీన్, బొల్లి చంద్రశేఖర్, బిల్ల శ్రీకాంత్ ఉన్నట్లు చెప్పారు. -
ముంబైలో బాలీవుడ్ సెలబ్రెటీలతో యోగి భేటీ
ముంబైలో బాలీవుడ్ ప్రముఖ సెలబ్రెటీలతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం సమావేశమయ్యారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఉత్తరప్రదేశ్‌ని చలన చిత్ర అనుకూల రాష్ట్రంగా తెలియజేస్తూ..సినీ నిర్మాణానికి గమ్యస్థానంగా మార్చడం కోసం యోగి ఆదిత్యనాథ్ బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖు సభ్యులను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం యోగి మాట్లాడుతూ...సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు సభ్యులను ఎంపీలుగా చేశాం అని చెప్పారు. అలాగే మీరు ఎదుర్కొంట్ను సమస్యలకు ఏం చేయాలో కూడా తమకు తెలుసు అని అన్నారు. అదీగాక సమాజాన్ని ఏకం చేయడానికి, దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడటంలో సినిమా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ చలనచిత్ర అనుకూలా రాష్ట్రంగా ఆవిర్భవించిందని, జాతీయ చలచిత్ర అవార్డుల్లో, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్‌ఎప్‌ఐ)లో గుర్తింపు లభించిందని చెప్పారు. అంతేగాదు తమ ప్రభుత్వ సినిమా పాలసీ ప్రకారం..యూపీలో వెబ్‌సిరీస్ చిత్రీకరిస్తే 50% సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అలాగే స్టూడియోలు, ఫిల్మ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు 25 శాతం సబ్సిడీ ఇస్తమాని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బోనీకపూర్, గోరఖ్‌పూర్ లోక్‌సభ ఎంపీ, నటుడు రవికిషన్, భోజ్‌పురి నటుడు దినేష్ లాల్ నిర్హువా, నేపథ్య గాయకులు సోనూ నిగమ్, కైలాష్ ఖేర్, నటుడు సునీల్ శెట్టి, సినీ నిర్మాతలు చంద్రప్రకాష్ ద్వివేది, మధుర్ భండార్కర్, రాజ్‌కుమార్ సంతోషి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: శబరిమలైలో విడిచిపెట్టినా..తిరిగొచ్చిన పావురం..బిత్తరపోయిన యజమాని) -
నిమ్స్ డైరెక్టర్‌కు అపోలోలో చికిత్స.. ప్రభుత్వ ఆసుపత్రులపై చిన్నచూపు?
నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) డైరెక్టర్ మనోహర్ రెండు రోజుల క్రితం గుండెపోటుతో హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరడం వివాదాస్పదంగా మారింది. ప్రతిష్టాత్మక ఆసుపత్రికి డైరెక్టర్‌గా ఉన్న మనోహర్... తమ దవాఖానాను కాదని ప్రైవేటులో చికిత్స పొందుతుండడం చర్చనీయాంశంగా మారింది. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి ప్రతిష్టను మసకబార్చే చర్యగా నిమ్స్ ఉద్యోగులతో పాటు వైద్యరంగంలోని వారు కూడా దీన్ని తప్పుబడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎవరు ఏ ఆసుపత్రిలోనైనా.. మరెక్కడైనా చికిత్స పొందవచ్చు. అయితే సాక్షాత్తూ ఒక ఆసుపత్రికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తే ఆ ఆసుపత్రిని కాదని మరో చోట వైద్యసేవలు పొందడం సామాన్య ప్రజలకు అది ఎలాంటి సందేశం ఇస్తుంది? అంటూ పలువురు నిమ్స్ డైరెక్టర్ చికిత్స ఉదంతాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఉదంతాలు ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ నిమ్స్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందడం చర్చకు దారి తీసింది. అయితే ఈ దఫా ఏకంగా డైరెక్టరే నిమ్స్‌ను కాదని నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించడం మరింత వివాదంగా మారింది. వ్యక్తిగత, కుటుంబ వైద్యుడు అపోలోలో పనిచేస్తుండడం వల్లనే అక్కడ చికిత్సకు వెళ్లినట్టుగా డైరెక్టర్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే గతంలో ఇలాంటి సందర్భాల్లో సదరు వ్యక్తిగత వైద్యులే నిమ్స్‌కు వచ్చి ట్రీట్మెంట్స్ ఇచ్చిన దాఖాలాలున్నాయని మరికొందరు అంటున్నారు. నిజానికి నిమ్స్ కార్డియాలజీ విభాగానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది. ఎక్కడెక్కడి నుంచో రోగులు నిమ్స్‌కు వచ్చి చికిత్స తీసుకుని కోలుకుని వెళుతుంటారు. చదవండి: హైదరాబాద్‌లో రాగల 24 గంటల్లో భారీ వర్షం ఈ పరిస్థితుల్లో సాక్షాత్తూ నిమ్స్ డైరెక్టర్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం ఆసుపత్రి పేరు ప్రతిష్టలకు నష్టం కలుగజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారిన ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో బుధవారం రోజంతా చర్చోపచర్చలు నడిచాయి. ఎక్కువ మంది డైరెక్టర్ చేరికను తప్పుపట్టగా కొందరు సమర్థిస్తూ కూడా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల పిల్లలు చదవకపోవడం లాంటి పోలికల దగ్గర్నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు సైతం ప్రైవేటు ఆసుపత్రుల్నే ఆశ్రయిస్తుండడం దాకా ఈ చర్చల్లో భాగమయ్యాయి. ఏదేమైనా ఈ తరహా ఉదంతాలు పునరావృతం కాకుంటే మేలని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై, ఉన్నతాధికారులపై ఉందని, వారు వ్యక్తిగత చికిత్సల కోసం ప్రభుత్వాసుపత్రులను ఎంచుకోవడం ద్వారా ప్రజలకు స్ఫూర్తిని అందించాలని అందరూ కోరుకుంటున్నారు. -
చికోటి ప్రవీణ్ వాట్సాప్‌లో కీలక సమాచారం
-
తెర పై స్మొ ‘కింగ్స్’
రాజేంద్రనగర్‌కు చెందిన ఓ టీనేజర్ ఒకటి తర్వాత ఒకటిగా ప్యాకెట్ సిగిరెట్లు హాంఫట్ చేశాడు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. కేజీఎఫ్ సినిమాలో హీరోను చూసి ఆ కుర్రాడు ఫాలో అయ్యాడనేది తర్వాత తెలిసిన సంగతి. అయితే ఈ తరహాలో టీనేజర్లపై సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం తీవ్రమవుతోందని, మరింత తీవ్రంగా మారనుందని గతంలోనే నగరం వేదికగా నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. ఈ నేపధ్యంలో టీనేజర్ల భవిష్యత్తు ‘పొగ’చూరిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షి , హైదరాబాద్: మాస్ మీడియా మరియు ఇంటర్నెట్లోని సెలబ్రిటీల విజువల్స్‌కు ప్రభావితమైన యువకులు మద్యపానంతో పాటు ధూమపానానికి అలవాటు పడుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సీనియర్ సోషల్ సైంటిస్ట్ (డిప్యూటీ డైరెక్టర్) మేకం మహేశ్వర్ గతంలో నిర్వహించిన అధ్యయనం దీన్ని నిర్ధారించింది. ‘టీనేజర్స్ డైట్ మరియు హెల్త్–రిలేటెడ్ బిహేవియర్‌పై మాస్ మీడియా ప్రభావం’ అనే అంశంపై చేసిన సర్వేలో 15 శాతం మంది అబ్బాయిలు సెలబ్రిటీలను అనుకరించడానికే తాము సిగరెట్ తాగామని స్పష్టం చేశారు. సినిమాతో పాటు వెబ్‌సిరీస్ తదితర సోషల్ మీడియా సెలబ్రిటీలు సైతం వీరిని ప్రభావితం చేశారని తేలింది. మిగతా వయసుల వారితో పోలిస్తే టీనేజర్లపై స్మోకింగ్ సీన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఆన్లైన్ లోకం..అవగాహనే శరణ్యం.. ప్రపంచం అంతా ఆన్లైన్ మీదే నడిచే రోజులు వచ్చేస్తున్న పరిస్థితుల్లో పిల్లల్ని స్మోకింగ్ సీన్స్‌కి దూరంగా ఉంచడం అంత సులభ సాధ్యం కాదు. అయినా ఆ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ధూమపానం వల్ల కలిగే అనర్ధాలను తరచుగా వారికి వివరించి చెబుతూ ఉండాలని వైద్యులు, మానసిక చికిత్స నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీని నియంత్రించడం, వారి అలవాట్లపై ఓ కన్నేసి ఉంచాలని అంటున్నారు. టీనేజీకి...చాలా ప్రమాదకరం గతంలో టీనేజర్స్ స్మోకింగ్‌కు ఇంట్లో తండ్రో, తాతో, అన్నో.. ప్రభావం కారణమయ్యేది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రభావం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూపిస్తున్నాయి. సిగరెట్లలలో వందల కొద్దీ హానికారక పదార్ధాలు ఉంటాయి. చిన్నవయసులో అలవాటు పడితే అది ఎదుగుదల హార్మోన్లపైనా చెడు ప్రభావం చూపిస్తుంది. మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. ఆస్తమా, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మా పిల్లలకు ఆ అలవాటు కాదులే అనే ధీమాకి పోకుండా...స్మోకింగ్‌ను పిల్లలకు దూరంగా ఉంచడానికి వారిలో ముందస్తుగానే అవగాహన పెంచడం అవసరం. –డా.రమణప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ ఆసుపత్రి (చదవండి: తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది అభ్యర్థులకు ఉత్తమ ర్యాంకులు) -
రూటు మార్చిన కేటుగాళ్లు... గతంలో గోవా, బెంగుళూరు ఇప్పుడూ ముంబై నుంచి డ్రగ్స్
సాక్షి, హైదరాబాద్: మాదక ద్రవ్యాల సరఫరాదారులు రూటు మార్చారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు గోవా, బెంగళూరు, ముంబైల నుంచి కొకైన్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను నగరానికి తీసుకొచ్చి.. స్థానిక విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సెలబ్రిటీలకు విక్రయించేవాళ్లు. తాజాగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. వెస్ట్ బెంగాల్ నుంచి హెరాయిన్‌ను, పంజాబ్ నుంచి పాపి స్ట్రా కాన్సన్ట్రేట్ డ్రగ్స్‌ను నగరానికి తీసుకొస్తూ.. రాచకొండ పోలీసులకు చిక్కడమే ఇందుకు ఉదాహరణ. అక్రమ మార్గాలను ఎంచుకుని.. హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల వాళ్లు పని చేస్తుంటారు. వలస వచ్చిన వీరిలో కొంతమంది డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో విరివిగా దొరికే కొకైన్, హెరాయిన్ డ్రగ్స్‌లను హైదరాబాద్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. నగరంలో డ్రగ్స్ డిమాండ్‌ను గుర్తించి క్యాష్ చేసుకునేందుకు ఇలా చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలలో గ్రాము రూ.300 చొప్పున కొనుగోలు చేసి లారీలు, రైలు, బస్సులలో ప్రయాణించి నగరానికి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన దానిలో కొంత వారు వినియోగిస్తూనే.. మరికొంత డ్రగ్స్‌ను ఎక్కువ మొత్తానికి విక్రయిస్తున్నట్లు పలు కేసుల్లో పోలీసుల విచారణలో బయటపడింది. టోల్ ప్లాజాలు, పోలీస్ చెక్‌పోస్ట్‌లు లేని రూట్ల కోసం గూగుల్‌లో వెతికి మరీ రవాణా చేస్తున్నారని ఓ పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. డ్రగ్స్ రవాణా సమయంలో పైలెట్ వాహనాన్ని కూడా వినియోగిస్తున్నారు. వెనకాల డ్రగ్స్ వచ్చే వాహనానికి, పైలెట్ వెహికిల్‌కు మధ్య కనీసం 3– 5 కి.మీ. దూరం ఉంటుంది. పోలీసుల తనిఖీలను ఎప్పటికప్పుడు వెనకాల వాహనంలోని నిందితులకు చేరవేస్తుంటారు. ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే వాహనాన్ని రూటు మారుస్తుంటారని ఆయన వివరించారు. పట్టుబడిన నిందుతులు ఈ ఏడాది ఫిబ్రవరి 18న డ్రగ్ హెరాయిన్‌ను వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర నిందితులను మల్లాపూర్ క్రాస్ రోడ్స్‌లో స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) మల్కాజిగిరి, నాచారం పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 16 గ్రాముల హెరాయిన్ (బ్రౌన్ షుగర్)ను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 31న పాపి స్ట్రా కాన్సన్ట్రేట్ డ్రగ్‌ను పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ఇద్దరు నిందితులను కీసర– శామీర్‌పేట రోడ్లో ఎస్ఓటీ మల్కాజిగిరి, కీసర పోలీసులు పట్టుకున్నారు. 900 గ్రాముల పాపి స్ట్రాను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: సరదాగా మొదలై... వ్యసనంగా మారి!) -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
లాక్మే ఫ్యాషన్ వీక్.. తారల తళుకులు
-
ఫోటోగ్రాఫర్లు వెంటపడటంతోనే అలా చేశా.....!: గ్రిమ్స్
న్యూయార్క్: ప్రముఖులు, సెలబ్రెటీలు, బయట ఎక్కడైన కనిసిస్తే చాలు సెల్ఫీలంటూ అభిమానులు, ఫోటోగ్రాఫర్లు వెంటపడటం సదా మామాలే. పాపం వాళ్లమో వీటి నుంచి ఎలా తప్పించుకోవాలో అని నానా తంటాలు పడుతుంటారు. కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడ ప్రసిద్ధ కెనడియన్ గాయని, ఎలెన్ మస్క్ గర్ల్ ఫ్రెండ్ గ్రిమ్స్ ఫోటో గ్రాఫర్లకు ఝలక్ ఇవ్వాలనే ఆవిధంగా ఫోజు ఇచ్చానంటుంది. అసలేం జరిగిందా అనే కదా! (చదవండి: పుట్టుకతోనే చేతుల్లేవు.. కానీ చాలానే సాధించింది!) వివరాల్లోకెళ్లితే....అపర కుభేరుడు టెస్లా సీఈవోగా అంతకు మించి స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ ఏజెన్సీ ఓనర్‌గా అందరికీ సుపరిచితుడై ఎలన్ మస్క గర్ల్ ఫ్రండ్ అనో కవర్ మ్యాగ్జైన్ స్టోరీ కోసం లేక ప్రసిద్ధ కెనడియన్ గాయని కావడంతోనే ఆమె వెంట ఫోటోగ్రాఫర్లు తెగ వెంటపడుతుంటారు. దీంతో విసుగు చెందిన గ్రిమ్స్ లాస్ ఏంజెల్స్ వీధుల్లో ఒక చోట జర్మనీకి చెందిన తత్వవేత్త కార్ల్ మార్క్స్ పుస్తకం చదువుతున్నట్లుగా ఫోజు ఇస్తూ తిరుగుతుంటుంది. పైగా ఆ ఫోటోను ట్విట్టర్లో కూడా షేర్ చేసింది. అయితే ఆ పుస్తకం 1848 ఏళ్ల నాటి కమ్యూనిస్టు ప్రణాళిక, పెట్టుబడిదారీ సమాజంలో 'వర్గ పోరాటం' కు సంబంధించిన కార్లమార్క్స్ పుస్తకం కావడం విశేషం. ఈ క్రమంలో ఎలెన్ మస్క్‌కి దూరంగా ఉంటున్న ఈ సమయంలో ప్రజల్లో ఇది హాట్ టాపిక్‌గా మారి చర్చనీయాంశంగా మారుతుందనే తాను అలా చేశానంటోంది. ఆ పుస్తకం చదువుతున్న ఫోటో ఫిక్ తోపాటు సందేశాన్ని జోడించి మరీ ట్విట్టర్లో మరో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు తాను కమ్యూనిస్ట్వాదిని కానని, తాను ఎలెన్మాస్క్ ఇప్పటికీ కలిసే ఉంటున్నామంటూ కూడా ట్వీట్ చేసింది. గత నెలలో ఎలెన్ మాస్క్ తన గర్లఫ్రెండ్ గ్రిమ్స్‌తో విడిపోయాడంటూ రకరకాలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలెన్ మస్క్ కూడా గత నెల 'పేజ్ సిక్స్' అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తాము తమ పననుల్లో బిజీగా ఉండి దూరంగా ఉన్నామే తప్ప కలిసే ఉంటున్నామంటూ చెప్పడం గమనార్హం. (చదవండి: ఓల్డ్ కార్ సీట్ బెల్ట్‌తో బ్యాగ్‌లు) -
నెత్తిన బోనంతో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి.. ఫోటో హైలైట్స్
సాక్షి, హైదరాబాద్: బోనాలంటే నగరమంతా ఉత్సాహమే.. భాగ్యనగరమంతా సందడిగా బోనమెత్తుతోంది. ఇందుకు గ్రేటర్ హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. 113వ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఆదివారం బోనాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. పలువురు సినీ, టెలివిజన్ తారలు.. ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ ఫోటోలు మీకోసం పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారు బంగారు బోనంతో జోగిని శ్యామల నెత్తిమీద బోనాలతో మహిళలు అమ్మవారికి బోనం తీసుకొస్తున్న మాజీ మంత్రి గీతారెడ్డి బోనంతో వస్తున్న సింగర్ మధుప్రియ బోనమెత్తిన బిగ్‌బాస్ ఫేం సుజాత బోనాలతో మహిళల సందడి నెత్తిన బోనంతో బయల్దేరిన విజయశాంతి, పక్కన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బోనమెత్తిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బోనమెత్తిన హైదరబాద్ ఆడపడుచులు -
హాస్య నటుడు వివేక్ మృతి.. ప్రముఖుల నివాళులు
-
శ్రీవారిని దర్శించుకున్న హీరో ఆది దంపతులు
సాక్షి, తిరుపతి : తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, టాలీవుడ్ యంగ్ హీరో ఆది దంపతులు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డిలు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా హీరో ఆది మీడియాతో మాట్లాడుతూ... కరోనా తరువాత శ్రీవారిని మొదటిసారి దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తను నటించిన శశి చిత్రం ఈ నెల 19న రిలీజ్ అవబోతుందని, ట్రీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించినట్లే సినిమా కూడా హిట్ అవుతుందని ఆశీస్తున్నానని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో పాటు ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ .. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు గెలవాలని శ్రీవారిని మొక్కుకున్నాని అన్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ సిటింగ్ ఎమ్మెల్సీ అనుభవపరుడని పేర్కొన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ అభ్యర్థిని వాణీదేవి దివంగత మాజీ ప్రధాని పివీ నరసింహ రావు కూతురని గుర్తు చేశారు. వీరు ఇరువురు అత్యంత మెజారిటీతో గెలుపొందాలి అని కోరుకుంటున్నాని పేర్కొన్నారు. చదవండి: ఆస్కార్ నుంచి సూర్య సినిమా అవుట్.. -
అసెంబ్లీ ఎన్నికల బరిలో బెంగాలీ తారలు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజకీయ సమరంలో ప్రత్యర్థులకు పట్టపగలే చుక్కలు చూపించేందుకు రాజకీయపార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఏళ్ళ తరబడి పార్టీనే నమ్ముకొని పనిచేసిన నాయకులకు ధీటుగా ప్రజలను ఆకట్టుకొనేందుకు సినీ తారలు, దర్శకులను రాజకీయ పార్టీలు బరిలో దింపాయి. దీంతో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలకు బెంగాలీ చిత్ర పరిశ్రమ ఒక ఆయుధంగా మారింది. బెంగాలీ చిత్ర పరిశ్రమపై తృణమూల్ కాంగ్రెస్ దశాబ్దంన్నరగా ప్రభావం చూపుతోంది. గతంలో మమతా బెనర్జీ చేపట్టిన సింగూర్, నందిగ్రామ్ ఉద్యమాలకు సినీ రంగం మద్దతు పలికింది. 34 ఏళ్ళ వామపక్ష పాలనకు వ్యతిరేకంగా సాగిన కార్యక్రమాల్లోనూ బెంగాలీ సినీ పరిశ్రమలోని కొందరు కీలక పాత్ర పోషించారు. మమత బెనర్జీ కూడా ప్రతి ఎన్నికల్లోనూ సినీ పరిశ్రమలోని వారికి రాజకీయంగా అవకాశాలు ఇస్తూ, విజయాన్ని సాధిస్తూ వచ్చారు. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలతో బెంగాల్లో రాజ కీయ పరిస్థితి మారడం ప్రారంభమైంది. అప్పటివరకు తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిన సినీరంగ ప్రముఖులు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపించడంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలం బాగానే వికసించింది. ఇప్పడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగాలీ సినీ ప్రముఖులు కమలదళంవైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రెండు వర్గాలుగా.. ఇప్పుడు బెంగాలీ సినీలోకం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం అధికార తృణమూల్‌తో నిలబడగా, మరోవర్గం బీజేపీ పంచన చేరిపోయింది. బెంగాల్లో కమలదళం ఇంత మంది సినీ తారలను ఎందుకు బరిలో దింపడానికి మమతాబెనర్జీ బీజేపీపై చేస్తున్న ఘాటు విమర్శలే ప్రధాన కా>రణం. బీజేపీ బెంగాల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తోందని ఆమె భావించడం మొదలైన తర్వాత, ఎలాగైనా అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. బీజేపీ అంటే స్థానికేతర పార్టీ అనే భావనను మమతా బెనర్జీ ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు అవసరమైన ఏ ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు. దీంతో తప్పనిసరిగా దీదీ ఎత్తుగడలను దీటుగా ఎదుర్కొనేందుకు కమలదళం ఆమె ఫార్ములానే అనుసరించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే కమలదళం బెంగాలీ సినీలోకానికి చెందిన వారిపై ఆశలు పెట్టుకుంది. సినీ ప్రముఖులు పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో, దీదీ వ్యూహాలను చిత్తుచేయడంలో తమకు కలిసివస్తారని కమలదళం భావిస్తోంది. అదే సమయంలో సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న చాలా మంది ప్రముఖులను తృణమూల్ కాంగ్రెస్ కూడా బరిలోకి తీసుకువస్తోంది. సినీ ప్రముఖులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఓటుబ్యాంకును ప్రభావితం చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: (‘బంగారు బంగ్లా’ చేస్తాం: అమిత్ షా) (దెబ్బతిన్న పులి మరింత ప్రమాదకారి: దీదీ) బీజేపీలోకి మిథున్ మొదట నక్సలైట్ ఉద్యమం, వామపక్షాలకు మద్దతుదారుగా ఉండి 2014లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో అడుగుపెట్టిన మిథున్ చక్రవర్తి ఇప్పుడు కమలాన్ని బెంగాల్లో వికసింపచేసే పనిలో ఉన్నారు. మిథున్ చక్రవర్తి కాషాయ కండువా కప్పుకొనే ముందే బెంగాలీ నటులు యష్ దాస్ గుప్తా, హిరేన్ ఛటర్జీ, రుద్రానిల్ ఘోష్, నటి పాయల్ సర్కార్, స్రవంతి ఛటర్జీ, పాపియా అధికారి కమలదళంలో చేరిపోయారు. కేవలం సినీ తారలే కాకుండా, పలువురు టీవీ నటులు సైతం టీఎంసీ, బీజేపీ కండువాలు కప్పుకున్నారు. బాబుల్ సుప్రియో, రూప గంగూలీ, లాకెట్ ఛటర్జీలు బీజేపీలో చాలా కాలంగా ఉండగా, రిమామ్ మిత్రా, అంజనా బసు, కాంచన మొయిత్రాలు 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం కమలదళంలో సభ్యులయ్యారు. అయితే, బాద్షా మొయిత్రా, అనిక్ దత్తా, సబ్యసాచి చక్రవర్తి, కమలేశ్వర్ ముఖర్జీ, తరుణ్ మజుందార్, శ్రీలేఖా మిత్రా తదితర సినీ ప్రముఖులు ఇప్పటికీ వామపక్షాలతోనే ఉన్నారు. బెంగాల్ రాజకీయాలను వీరంతా ఏ మేరకు ప్రభావితం చేస్తారో వేచి చూడాల్సిందే. మమత వెనుక సినీలోకం పశ్చిమ బెంగాల్లో మొదటి నుంచి వామపక్ష భావజాలం సినిమాలు, సాహిత్యం, సంస్కృతిపై ఆధిపత్యాన్ని చెలాయించింది. కానీ 2006లో వామపక్ష పాలనకు చరమగీతం పాడేందుకు, మార్పును కోరుతూ మమతాబెనర్జీ చేసిన ప్రయత్నాలకు సినీ లోకం ఆసరాగా నిలిచింది. అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ మమతా బెనర్జీ విజయంలో సినీ ప్రముఖులు కీలక పాత్ర పోషించారు. అయితే 2009, 2014 ఎన్నికల్లో బెంగాలీ సినీ నటుడు తపస్ పాల్‌ను కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి, నటి శతాబ్ది రాయ్‌ను 2009, 2014, 2019 ఎన్నికల్లో బీర్భూమ్ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా నిలబెట్టిన మమతా బెనర్జీ ఇద్దరినీ గెలిపించుకోగలిగారు. అనంతరం 2016 అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు చిరంజీత్, నటి దేవశ్రీ రాయ్‌లను నిలబెట్టి ఇద్దరిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నటుడు దేవ్ (దీపక్ అధికారి), నటి మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్, శతాబ్ది రాయ్, మున్మున్ సేన్, నాటక రచయిత అర్పితా ఘోష్‌లను రంగంలోకి దింపినప్పటికీ, కేవలం దేవ్, మిమి, నుస్రత్ జహాన్, శతాబ్ది రాయ్‌లు ఎంపీలుగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నటి లాకెట్ ఛటర్జీని హుగ్లీ నుంచి నిలబెట్టి, ఎంపీని చేసుకో గలిగింది. తాజాగా ఇప్పుడు జరుగబోతున్న ఎన్నికలకు సంబంధించి టీఎంసీ అభ్యర్థుల ప్రకటన ఇప్పటికే పూర్తయింది. అందులో బెంగాలీ సినీ పరిశ్రమలోని ఆరుగురు నటీమణులు, ముగ్గురు నటులు, ఒక దర్శకుడిని మమతా బెనర్జీ బరిలో నిలిపింది. -
తిరుమలలో ప్రముఖులు..
-
రఘుబాబు కూతురి ఎంగేజ్మెంట్లో స్టార్ల సందడి
-
వాలెంటైన్స్ డే స్పెషల్: టాలీవుడ్ క్యూట్ కపుల్ ఫోటోలు
-
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..
-
హాస్య బ్రహ్మ బర్త్‌డే.. స్టార్ హీరోల విషెస్
-
ఈ ఎన్నికల్లో వారికే ఓటు వేద్దాం..
సాక్షి, హిమాయత్‌నగర్: సిటీ ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. మహిళల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఒకరోజు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారాహిల్స్ వస్తుండగా.. రోడ్డు పక్కన ఒక్క టాయ్‌లెట్ కూడా కనిపించలేదు. దీంతో నేను ఎంతో సఫరయ్యాను. నాలాగే చాలామంది మహిళలు టాయ్‌లెట్స్ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు. బయటికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. మనకు ఒక అవకాశం వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహిళలను ప్రగతిపథంలో నడిపించే వారిని గుర్తించి, షీ టాయ్‌లెట్స్‌ని ఏర్పాటు చేసే వారికి ఓటు వేద్దాం. అదే విధంగా చెత్త గార్బేజ్ విషయంలో కూడా మార్పులు రావాలి. దీంతో సిటీని మరింత ఆకర్షణీయంగా తీర్చేదిద్దే వారిని మన ఓటు ద్వారా ఎన్నుకుందాం. – నందిని రాయ్, సినీనటి చదవండి : బెస్ట్ సిటీగా మార్చుకుందాం: ఈషా రెబ్బ ఓటర్లలో రావాలి చైతన్యం.. ఓటుహక్కు అన్నది బ్రహ్మాస్త్రం. ఓటు ద్వారా మన ప్రశ్నలకు సమాధానం దొరికినా, దొరక్కపోయినా లీడర్స్‌కి మనం ఇచ్చే విలువ ఏంటి అంటే ఓటు వేయడం. ఓటు అనేది ఎప్పుడూ ఎంతో ముఖ్యమైనది. హైదరాబాద్‌లో ఉన్న వాతావరణానికి ఇంకొంచెం అభివృద్ధి జరిగితే బాగుంటుంది. మణికొండలాంటి ప్రాంతాల్లో మాటిమాటికీ బోర్లు వేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న గ్రౌండ్‌వాటర్‌ని ఎక్కువగా తోడేస్తున్నాం.. అంతేకాదు.. భారీ కన్స్ట్రక్షన్స్ చేపట్టడం, ఎక్కడ చూసినా సిమెంటు రోడ్లు వేసేస్తున్నాం.. హైదరాబాద్‌లోని పర్యావరణాన్ని మనం ఇంకొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనిపై ముఖ్యంగా ప్రజల్లో అవగాహన ఉండాలి.. చైతన్యం రావాలి. – అడివి శేష్ -
తారలు నెలల్లో స్లిమ్ అయిపోతారు
తగ్గడాలు పెరగడాలు సినిమాల్లో సాధారణం. బొద్దుగా కనిపించే తారలు నెలల్లో స్లిమ్ అయిపోతారు. కొన్ని సార్లు సినిమాలో పాత్రలు కోసం ఇలా చేస్తారు. కొన్నిసార్లు ఫిట్‌గా ఉండాలని ఫిక్స్ అయ్యే తగ్గిపోతారు. లాక్డౌన్లో కొందరు స్టార్స్ ఫిట్‌గా మారిపోయారు. బరువును మొత్తం దించేసుకున్నారు. బరువు తగ్గడంతో కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందంటున్నారు. ఆ విశేషాలు... పెరిగి.. తగ్గారు కృతీ సనన్ నాజూకుగానే ఉంటారు. అయితే ‘మిమి’ అనే హిందీ సినిమా కోసం సుమారు 15 కిలోల బరువు పెరిగారీ బ్యూటీ. ఈ సినిమాలో గర్భిణి పాత్రలో నటించారు కృతి. అందుకోసమే 15 కిలోలు పెరిగారామె. సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే తగ్గే పని మీద దృష్టి పెట్టారు. లాక్డౌన్ ఆమెకు కలిసొచ్చింది. ‘‘ఈ లాక్డౌన్లో బరువునంతా తగ్గించుకోవడం సులువు అయింది. నా ట్రైౖనర్ సహాయం వల్లే ఈజీ అయింది’’ అన్నారు కృతీ సనన్. ఫిట్ శింబు ఆ మధ్య తమిళ హీరో శింబు బరువు బాగా పెరిగారు. లాక్డౌన్లో పూర్తి శ్రద్ధ బరువు తగ్గడం మీదే పెట్టారు శింబు. లాక్డౌన్ ముందు వరకూ ఆయన సుమారు 102 కిలోల బరువు ఉన్నారు. ఇప్పుడు 71 కిలోలకు వచ్చేశారు. తగ్గడానికి ఎన్ని నెలలు పట్టిందీ అంటే.. దాదాపు ఏడాది. తగ్గే ప్రయత్నాన్ని గత నవంబర్‌లో మొదలుపెట్టారు. లాక్డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయంలో కఠోర శ్రమతో వర్కౌట్స్ చేశారట. రోజుకి రెండు మూడు గంటలు వ్యాయామానికి కేటాయించారు శింబు. ప్రతిరోజూ వాకింగ్, జిమ్‌తో పాటు టెన్నిస్, బాస్కెట్‌బాల్ ఆడుతూ వెయిట్‌లాస్ అయ్యారు. ‘‘ఏ పని చేయడానికి అయినా మనం బలంగా సంకల్పించుకోవాలి. మన సంకల్పమే ముఖ్యం’’ అంటారు శింబు. ఇంకో విశేషం ఏంటంటే.. రెండువారాలుగా హీరోయిన్ శరణ్యా మోహన్ వద్ద భరతనాట్యంలో కోచింగ్ తీసుకుంటున్నారాయన. ఓ డ్యాన్స్ బేస్డ్ సినిమాలో నటించనున్నారట. అందుకే ఈ శిక్షణ అని సమాచారం. నిజమైన ఆత్మవిశ్వాసం ఇప్పుడొచ్చింది కామెడీ పాత్రల్లో అందర్నీ ఆకట్టుకున్నారు తమిళ పొన్ను (తమిళ అమ్మాయి) విద్యుల్లేఖా రామన్. స్వతహాగా ఆమె బొద్దుగానే ఉంటారు. చేసేవి కూడా కామెడీ ప్రధానంగా సాగే పాత్రలే కాబట్టి తెర మీద మెరుపు తీగలా కనపడాల్సిన పని లేదు. అయితే ఫిట్ గా ఉండటం ముఖ్యం అనుకున్నారు. అందుకే బరువు తగ్గడం మీద శ్రద్ధ పెట్టారు. ‘‘ఇన్ని రోజులు నేను ఎలా ఉన్నా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అనుకున్నాను. కానీ అలా అనుకున్నాను.. అంతే. బరువు తగ్గిన తర్వాతే నిజమైన ఆత్మవిశ్వాసం వచ్చింది. మనసు పెట్టి చేస్తే అసంభవం అంటూ ఏదీ లేదు. అలాగే బరువు తగ్గడం వెనక పెద్ద రహస్యాలేవీ ఉండవు. శ్రద్ధగా శ్రమించడమే’’ అంటారు విద్యుల్లేఖా రామన్. దాదాపు పది కిలోలు తగ్గారామె. శరీరాన్ని గౌరవించాలి ‘‘మనందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మన శరీరాన్ని గౌరవించాలి. అనారోగ్య సమస్యల వల్ల లావు అవ్వడాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. కానీ తిండి విషయంలో కంట్రోల్ లేకపోవడం సరైనది కాదు’’ అంటారు ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ అవికా గోర్. ‘ఉయ్యాల జంపాల’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన అవికా తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో చాలా బరువు పెరిగారామె. లాక్డౌన్లో శరీరం మీద దృష్టి పెట్టి సుమారు 13 కిలోల వరకూ తగ్గారు. ‘‘ఇష్టమొచ్చింది తినేస్తూ వ్యాయామం చేయకుండా లావయ్యాను. ఓరోజు అద్దంలో నన్ను నేను చూసుకుని నివ్వెరపోయాను. చాలా నిరాశపడ్డాను. నా కాన్ఫిడెన్స్ అంతా పోయింది. డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ బరువు పెరగడంతో సరిగ్గా చేయలేకపోయాను. ఇక లాభం లేదనుకుని మళ్లీ వర్కౌట్స్ మొదలుపెట్టాను. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను’’ అన్నారు అవికా. -
బిహార్‌లో ఒక బాలీవుడ్డే ఉంది!
ఎన్నికల ర్యాలీకి జనం రావాలి. రావాలంటే.. బలమైన ఆకర్షణ ఏదైనా ఉండాలి. లీడర్‌కి సహజ ఆకర్షణ ఉంటుంది. అది కాదు. అదనపు ‘ఎట్రాక్షన్’ కావాలి. సినీ నటీమణుల గ్లామర్. బిహార్‌లో ఒక బాలీవుడ్డే ఉంది! రెండు, మూడు విడతల్లో వాళ్లంతా ప్రచారానికి రావచ్చు. అయితే వస్తారా?! ముంబై తార అమీషా పటేల్‌కు.. చేదు అనుభవం అయ్యాక కూడా! బిహార్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో సోమవారం అమీషా పటేల్, లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర ఎన్నికల ప్రచారానికి సినీ కథానాయికల వల్ల గ్లామర్ వస్తుంది. జనం వస్తారు. ఓట్లు కూడా పడితే పడొచ్చు. ప్రజల దృష్టి మాత్రం పడి తీరుతుంది. బాలీవుడ్ తార అమీషా పటేల్ బిహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర తరఫున ఔరంగాబాద్ జిల్లాలోని ఓబ్రా అసెంబ్లీ నియోజవర్గంలో ప్రచారానికి వచ్చారు. ఆయనే ఆమెను తనకు తెలిసిన వారి ద్వారా ప్రచారానికి పిలిపించుకున్నారు. అక్టోబర్ 28 న జరిగిన తొలి విడత పోలింగ్‌లో ఓబ్రా కూడా ఉంది. ప్రచారం అయ్యాక అమీషా ముంబై వెళ్లిపోయారు. ‘‘మేడమ్.. దౌద్నగర్ ర్యాలీ ముగిశాక మీ మీద అత్యాచారం జరగబోయిందని మీరు చెబుతున్నట్లుగా సోషల్ మీడియాలో ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. అది మీరేనా!’’ అని ప్రెస్ వాళ్లు వచ్చి అడిగారు. అమీషా ఆశ్చర్యపోయారు. ‘‘అవును. నన్ను బెదిరించారు. అత్యాచారం చేయబోయారు. దొరికి ఉంటే చంపేసేవారు కూడా. ప్రకాష్ చంద్ర ఉద్దేశపూర్వకంగా నా ఫ్లయిట్ మిస్సయ్యేలా చేశాడు. రాత్రంతా నన్నొక గ్రామంలో ఉంచాడు. నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. తప్పించుకుని వచ్చేశాను’’ అని చెప్పారు. చిన్న సంగతేం కాదు. నేడో రేపో ప్రకాష్ చంద్ర మీద కేసు ఫైల్ కావచ్చు. అయితే అమీషా చెబుతున్నవన్నీ అబద్ధాలని ఆయన అంటున్నారు. ప్రత్యర్థుల దగ్గర డబ్బులు తీసుకుని ఆమె అలా చెబుతున్నారని అయన ఆరోపణ. అమీషా మాత్రం.. ‘‘కావాలంటే చూడండి, నేను ముంబై వచ్చాక కూడా నన్ను బెదిరిస్తూ టెక్స్›్ట చేశాడు’’ అని సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, శ్వేతాబసు ప్రసాద్ ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలలో ప్రకాశ్ చంద్ర ఒక మాట అన్నారు. ‘‘బిహారేమీ ఎన్నికల ప్రచారానికి బాలీవుడ్ తారల కోసం ముఖం వాచిపోలేదు. మాకు సోనాక్షీ సిన్హా అంతటి వారే ఉన్నారు’’ అని! ఏమాత్రం అతకని మాట అది. అయినా.. సోనాక్షి గానీ, ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా గానీ లోక్ జనశక్తి పార్టీలో లేరు. మరో బిహార్ నటి అక్షరాసింగ్ ఇప్పటికే జనతాంత్రిక్ వికాస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. అక్షరాసింగ్ పాట్నా అమ్మాయే. నేహాసింగ్ రాథోడ్ అని ఇంకో అమ్మాయి (23) ఉన్నా ఆమె ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదు. భోజ్‌పురి ర్యాప్ సింగర్ తను. కేంద్రంలో ఎవరు పవర్లో ఉంటే వారిని, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారినీ విమర్శిస్తూ పాటలు పాడి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటుంది. బిహార్‌లోని మిగిలిన తారామణులంతా బాలీవుడ్లో ఉన్నారు. నవంబర్ 3, 7 తేదీలలో జరిగే రెండు, మూడు విడతల పోలింగ్ ప్రచారానికైతే వాళ్లెవరూ ఇప్పటి వరకు రాలేదు. సోనాక్షీ సిన్హా , అక్షరాసింగ్ బిహార్ నుంచి వెళ్లి బాలీవుడ్లో, ఇతర చిత్ర పరిశ్రమల్లో వెలిగిన, వెలుగుతున్న నటీమణులు చాలామందే ఉన్నారు. ప్రియాంక చోప్రా అయితే ఏకంగా హాలీవుడ్‌కే వెళ్లారు! ప్రియాంక జార్ఖండ్ అమ్మాయి. 2000లో జార్ఖండ్ విడిపోకముందు బిహార్‌లోనే కదా ఉంది. సోనాక్షీ సిన్హా పట్నా నుంచి బాలీవుడ్‌కి వెళ్లారు. శ్వేత బసు ప్రసాద్ పుట్టింది జంషెడ్పుర్లోనే. ఆమె మన తెలుగులోనూ నటించారు. నేహాశర్మది బిహార్‌లోని భగల్పూర్. రామ్‌చరణ్ తొలి చిత్రం ‘చిరుత’లో హీరోయిన్గా నటించారు. నీతూ చంద్ర పాట్నా నుంచి వెళ్లారు. నటి, బాలీవుడ్ నిర్మాత కూడా ఆమె. హిందీతో పాటు తెలుగు సహా అన్ని దక్షిణాది భాషల్లో నీతూ నటించారు. ‘గోదావరి’లో రాజీ ఈమే. బిహార్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన ‘ఝా’లు ముగ్గురు ఉన్నారు. అనురితా ఝా, కావేరీ ఝా, కోమల్ ఝా. కావేరీ, కోమల్ తెలుగులో కూడా నటించారు. కావేరిది దర్భంగా, కోమల్‌ది రాంచీ. అనురిత మధుబని అమ్మాయి. ఇంకొక బాలీవుడ్ నటి శాండిలీ సిన్హా మన ‘ఒరే పాండూ’ లో నటించారు. తనది ముజఫర్‌పుర్. నేహాసింగ్ రాథోడ్, దీపికా సింగ్ బిహార్ నుంచి మొత్తం పదికి పైగా బాలీవుడ్‌కి వెళ్లిన నటీమణులు వీళ్లు. ఈ సంఖ్య తక్కువేమీ కాదు. వీళ్లు కాకుండా టీవీలో దీపికాసింగ్ (దియా ఔర్ బాతీ హమ్), శృతీ ఝా (కుంకుం భాగ్య), రతన్ రాజ్‌పుత్ (సంతోషీ మా), ఛవీ పాండే (ఏక్ బూంద్ ఇష్క్), అలీషా సింగ్ (బూగీ ఊగీ) బిహార్ వాళ్లే. దీపిక ఢిల్లీలో ఉంటున్నా ఆమె పూర్వికులది బిహార్. శృతీ ఝా బెగుసరాయ్. ఛవీ పాండే పట్నా. అలీషా రాంచీ. బిహార్‌లో మిగిలిన రెండు విడతల పోలింగ్ ప్రచారానికి వీరిలో కొందరు ఏదో ఒక పార్టీ తరఫున వచ్చే అవకాశాలైతే ఉంటాయి. అయితే అమీషాకు ఎదురైన చేదు అనుభవం తర్వాత కూడా ప్రచారానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతారా?! ఎంత డబ్బు ఇస్తామన్నా?! శృతీ ఝా, రతన్ రాజ్‌పుత్ -
సీఎంఆర్ఎఫ్కు భారీగా ప్రముఖుల విరాళాలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు నిత్యావసరాల సర ఫరా కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పలువురు ప్రముఖులు విరాళం ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ వేణుగోపాల్ నాదెళ్ల సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ చెక్కును అనుపమ తండ్రి, మాజీ ఐఏఎస్ కేఆర్ వేణుగోపాల్ మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఒకరోజు వేతనం అంటే రూ.48 కోట్లను సీఎంఆర్ఎఫ్కు విరాళంగా ప్రకటించారు. ఈ చెక్కును ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కారం రవీందర్‌రెడ్డి, మమత సీఎంకు అందజేశారు. సినీ హీరో నితిన్ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్–టీఎస్ సభ్యులు రూ.16 కోట్ల విరాళం ప్రకటించారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తన ఒక నెల వేతనం రూ. 2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధి కోసం చెక్కు రూపంలో సీఎంకు అందించారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
దివికేగిన సినీ దిగ్గజాలు
-
కోడి రామకృష్ణ పార్దివదేహానికి ప్రముఖుల నివాళులు
-
జనగామ: ఓటర్లకు కళాకారులతో చైతన్యం
సాక్షి, జనగామ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం), ఓటరు వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) వినియోగంపై అధికారులు ఓటర్లకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మారిన ఓటింగ్ విధానంపై చైతన్యం చేస్తున్నారు. ఎవరికి ఓటేసినా ఒక్కరికే పడుతుందనే అపోహ తొలగించడంతో పాటు ఎవరికి ఓటేశామనే అంశాన్ని నిర్ధారించుకునే విధంగా ప్రింట్ కాపీని సైతం తీసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం ఓటర్లకు కల్పించింది. తాజాగా అమలులోకి వచ్చిన ఓటింగ్ విధానాన్ని ఓటర్లకు తెలియపర్చడం కోసం విస్త్రత ప్రచార కార్యక్రమాలకు జిల్లా ఎన్నికల అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాకేంద్రం నుంచి బూత్‌లెవల్ వరకు.. నూతన ఓటింగ్ పద్ధతులపై జిల్లానుంచి గ్రామీణ ప్రాంతంలోని బూత్‌లెవల్ వరకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని పలుశాఖల అధికారులతో పాటు దివ్యాంగులకు, మహిళ సంఘాలకు, వివిధ వర్గాల ఓటర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాలు, మండలకేంద్రాలు, పంచాయతీలు, బూత్‌లెవల్ వరకు ఓటేసే విధానం, ఓటు వినియోగంపై సవివరంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కళాశాలల్లో కొత్త విధానంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళాకారులతో ప్రచారం.. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులతో ఓటు హక్కు వినియోగంపై చైతన్యవంతం చేస్తున్నారు. గణేష్ నేతృత్వంలోని సంజీవ, శంకర్, చిరంజీవి, కనుకరాజు, సోమయ్య బృందం జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధిలో కళాకారులు నూతన ఓటింగ్ విధానం, సందేహాలు, అనుమానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జనగామ మునిసిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రాలు, మండలకేంద్రాల్లో గ్రామాల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డమ్మీ ఈవీఎం, వీవీప్యాట్లను ఏర్పాటుచేసి ఓటు వేయించి చూపిస్తున్నారు. ఇటు కళాకారులతో పాటు మరోవైపు ఓటింగ్ విధానం తెలియచేస్తూ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ముఖ్యకూడళ్ల వద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నాటికి మూడు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కళాకారుల అవగాహన కార్యక్రమాలకు ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్‌లోకి ఓటరు ఎలా వెళ్లాలి, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై చైతన్యవంతం చేస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజతో ఓటు విలువపై అవగాహన.. ఓటుహక్కు వినియోగంపై ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని కోరుతూ అశోక్‌తేజతో ప్రచారం చేయిస్తున్నారు. విలువైన ఓటును దుర్వినియోగం చేయొద్దని కోరుతున్నారు. ఓటింగ్ శాతం పెరిగేలా ఓటు వినియోగంపై ప్రచారం సాగిస్తున్నారు. -
విదేశీయులను పెళ్లాడిన సెలబ్రెటీలు
సెలబ్రెటీల జీవితాల్లో ప్రతీ అంశం ఆసక్తికరమే. అందుకే వారి వ్యక్తిగత జీవిత విశేషాల పై కూడా అభిమానులు ఆసక్తికనబరుస్తుంటారు. ముఖ్యంగా వారి ప్రేమ పెళ్లి లాంటి విషయాల కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ ప్రముఖం వినిపిస్తుంటాయి. ఇటీవల హాలీవుడ్లో సత్తా చాటుతున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ గాయకుడు జాన్ నికోస్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ఫంక్షన్స్‌లోనూ వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకు కనిపించటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. దీంతో గతంలో ఇలా విదేశీయులతో ప్రేమ పెళ్లిల్లు చేసుకున్న తారల జీవితాలకు సంబంధించిన చర్చ మొదలైంది. ఈ జాబితాలో దేశీయ తారలు చాలా మందే ఉన్నారు. ఇటీవల కాలంలో మన సెలబ్రెటీ నటీనటులు చాలా మంది విదేశీయులను పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది శ్రియా, ఆండ్రీ కోశ్చివ్‌ను వివాహం చేసుకోవడం, ఇలియానా, ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌తో ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం సాగించటం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా.. ప్రియాంక, నిక్ జోనాస్‌లకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. వీరి కుటుంబ కార్యక్రమాలకు కూడా ఇద్దరు కలిసి హాజరవుతున్నారు. గతంలో.. ప్రీతిజింటా లాస్ ఏంజిల్స్‌లోని ఆర్థిక విశ్లేషకుడు జీన్ గుడ్నఫ్తో కొంతకాలం పాటు డేటింగ్ చేసి 2016లో వివాహం చేసుకున్నారు. బుల్లితెర నటి ఆష్కా గొరాడియా అమెరికన్ బ్రెంట్ గ్లోబేతో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో గతేడాది డిసెంబర్లో వివాహం జరిగింది. లాస్ వెగాస్‌లో వీరు మొదటిసారిగా కలుసుకున్నారు. టీవీ నటి అయిన సుచిత్ర పిళ్లై డెన్మార్క్‌కు చెందిన లార్స్ జెల్సన్ అనే ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరు మొదటి సారిగా ముంబైలో జరిగిన ఓ వేడుకలో కలిశారు. అరుణోదయ్ సింగ్ అనే నటుడు కెనడాకు చెందిన లీ ఎల్టన్ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరు గోవాలో మొదటిసారిగా కలుసుకున్నారు. లక్కీ అలీ అనే గాయకుడి మూడో భార్య ఎలిజబెత్ హాలమ్. ఈమె మాజీ మిస్ గ్రేట్ బ్రిటన్. వీరికి 2010లో వివాహం జరిగింది. వివాహానంతరం ఈమె పేరును అయేషా అలీగా మార్చుకున్నారు. బాలీవుడ్ స్టార్ శశి కపూర్ బ్రిటీష్ నటి జెన్నిఫర్ కెండల్‌ను 1958లో వివాహమాడారు. సల్మాన్ ఖాన్, రొమేనియన్ మోడల్ లూలియా వాంటూర్కు మధ్య ఏదో నడుస్తుందన్న వార్త బాలీవుడ్లో ఇప్పటికీ హాట్ టాపికే. -
సెలబ్రిటీల కల్యాణాలతో సందడే సందడి
సాక్షి, తిరుమల: మూడు ముళ్లు.. ఏడడుగులు.. వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో కీలక ఘట్టం.. యువతీ యువకులకు అందమైన కల.. మధురమైన జ్ఞాపకం. ఇంతటి గొప్ప వివాహ వేడుకను నిత్య కల్యాణ చక్రవర్తి శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో చేసుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని అందరూ తపిస్తుంటారు. సప్తగిరీశుడి సన్నిధిలో ఏడాది పొడవునా వివాహబంధంతో కొత్తజంటలు ఒక్కటవుతుంటాయి. సెలబ్రెటీలు సైతం ఈ దివ్యక్షేత్రంలో పెళ్లి చేసుకునేందుకు మొగ్గుచూపుతారు. నాటి మేటి నటి జమున నుంచి రంభ వరకు సెలబ్రిటీ లెందరెందరో ఇక్కడ వివాహం చేసుకున్నారు. తిరుమలలో పెళ్లి చేసుకున్న కొందరు సెలబ్రిటీల వేడుకను మరోసారి మనం తిలకిద్దాం.. జమున–రమణరావు నాలుగు దశాబ్దాల కిందట అలనాటి నటి జమున,రమణరావు వివాహం తిరుమలలో జరిగింది. శ్రీవారి ఆలయానికి పడమర దిశలోని ఆల్ ఇండియా ఆర్యవైశ్య సమాజ సత్రంలో వైభవంగా వేడుక సాగింది. అప్పట్లో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి పదుల సంఖ్యలో సినీ తారలు విచ్చేశారు. వారిని చూసేందుకు ఏపీ, తమిళనాడు నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండ మీద జరిగిన జమున పెళ్లి వేడుకను నేటికీ స్థానికులు చర్చించుకుంటూ ఉంటారు. బాలకృష్ణ–వసుంధర మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల అభిమాన నటుడు, దివంగత ఎన్టీ రామారావు కుమారుడు హీరో బాలకృష్ణ, వసుంధర వివాహం తిరుమలలో జరిగింది. రెండున్నర దశాబ్దాల కిందట పడమర మాడ వీధిలోని కర్ణాటక సత్రంలో వారి పెళ్లి జరిగింది. ఇదే సందర్భంలోనే బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ, జయశ్రీ వివాహం జరిగింది. అప్పటికే హీరోగా రాణిస్తున్న బాలకృష్ణ వివాహ మహోత్సవానికి సినీనటులు, రాజకీయ నేతలు విచ్చేసి ఆశీర్వదించారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు తరలివచ్చారు. ఘట్టమనేని రమేష్ సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ్ణ పెద్ద కుమారుడు, హీరో రమేష్‌బాబు వివాహం జూన్ 18,1998లో ఇక్కడి కర్ణాటక సత్రాల్లో జరిగింది. కృష్ణ పెద్దకుమార్తె మంజుల,సంజయ్ స్వరూప్‌ల వివాహం కూడా ఇక్కడి శ్రీశృంగేరి శంకర మఠం లో జరిగింది. సినీ పరిశ్రమలోని పెద్ద లంతా హాజరయ్యారు. శ్రీకాంత్–ఊహ పదిహేనేళ్లకు ముందు ఇక్కడి ఎస్ఎంసీ కల్యాణ మండపంలో శ్రీకాంత్, ఊహ కల్యాణం జరి గింది. అప్పటికే ఇద్దరూ కూడా సినీస్టార్లుగా చిత్ర పరిశ్రమలో ఉ న్నారు. వివాహ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులు, నటులు విచ్చేసి ఆశీర్వదించారు. మీనా–విద్యాసాగర్ నటి మీనా–సాఫ్ట్వేర్ ఇంజినీర్ కె.విద్యాసాగర్ వివాహం 2009, జూలై 12న తిరుమలలో జరిగింది. బాలనటిగా, 1990లో సీతా రామయ్య గారి మనుమరాలు’ చిత్రంతో హీరోయిన్గా, 2009లో ‘వెంగమాంబ’ వంటి ఎన్నెన్నో విభిన్న పాత్రలతో మెప్పించిన మీనా పెళ్లివేడుక ఇక్కడి ఆల్ ఇండియా ఆర్యవైశ్య సమాజ సత్రంలో జరిగింది. నటులు సంఘవి, రాగిణి, కృష్ణ వేణి, దర్శకుడు చేరన్, నిర్మాతలు వి.దొరస్వామి రాజు, టి.శివ, పలువురు నటులు, ప్రము ఖులు హాజరయ్యారు. మహేశ్వరి–జయకృష్ణ గులాబి చిత్రం ఫేమ్ మహేశ్వరికి సాఫ్ట్వేర్ ఇంజినీర్ జయకృష్ణ్ణతో 2008, సెప్టెంబర్18న ఇక్కడి ఉడ్‌సైడ్ హోటల్లోని ఆర్యవైశ్య సత్రంలో పెళ్లి జరిగింది. మహేశ్వరి శ్రీదేవికి బంధువు కావడంతో బోనీ కపూర్ కుటుంబ సభ్యులు విచ్చేశారు. నటి మీనా, విజయకుమార్, మంజులతోపాటు వారి కుమార్తె శ్రీదేవి, మరికొందరు నటులు వేడుకల్లో పాల్గొన్నారు. రంభ–ఇంద్రకుమార్ నటి రంభ, కెనడాకు చెందిన ఎన్ఆర్ఐ ఇంద్రకుమార్ వివాహం తిరుమల కర్ణాటక సత్రాల్లో జరిగింది. ఏప్రిల్ 8, 2010లో జరిగిన ఈ వివాహానికి దర్శకులు రాఘవేంద్రరావు, ఆర్కే సెల్వమణి, హీరోయిన్ రోజాతోపాటు అనేక మంది నటీనటులు హాజరయ్యారు. కల్యాణోత్సవ సేవలో నిత్యం 900 జంటలు తిరుమల క్షేత్రం నిత్య కల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లుతోంది. శ్రీవేంకటేశ్వరుడు నిత్య కల్యాణ చక్రవర్తి. ఆలయంలో లోక కల్యాణార్థం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం నిత్యం జరుగుతుంది. కొత్తగా వివాహం చేసుకున్న జంటలు స్వామి దర్శనానికి వచ్చి శ్రీవారికి కల్యాణోత్సవం జరిపించే సంప్రదాయం క్రమంగా పెరుగుతోంది. ఆలయంలో ఐదు శతాబ్దాల కిందట కల్యాణోత్సవం ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకు 800 నుంచి 900 జంటల వరకు ఈ కల్యా ణోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తున్నారు. ఏడాది పొడవునా వివాహాలే .. తిరుమల క్షేత్రంలో నిత్యం పెళ్లి మంత్రాలు వినిపిస్తాయి. భాజా భజంత్రీలు మోగుతూనే ఉంటాయి. నవ వధూవరులు సరికొత్త ఆశలతో ఒక్కటవుతూ ఉంటారు. శుభ లగ్నాలతో పనిలేకుండా కూడా రోజూ పెళ్లి వేడుకలు సాగుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఏడాదిలో సుమారు పది వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. -
ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి హాజరైన ప్రముఖులు
పటాన్చెరు: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ద్వితీయ పుత్రుడు విక్రమ్‌రెడ్డి వివాహా మహోత్సవం ఘనంగా జరిగింది. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ పెళ్లికి హాజరయ్యారు. విక్రమ్‌రెడ్డి, పల్లవిల వివాహాం ఘనంగా జరిగింది. పటాన్చెరు శివారులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వైభవోపేతంగా వివాహం నిర్వహించారు. ఈ వివాహా మహోత్సవానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, ఉప ముఖ్య మంత్రి మహ్మూద్ అలీ, ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రి హరిష్‌రావు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మదన్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, అతని సోదరుడు మధుసూధన్‌రెడ్డిల స్నేహితులు, అభిమానులు, బంధుగణం ఈ పెళ్లికి హాజరయ్యారు. వివాహ మహోత్సవం సందర్భంగా పట్టణమంతటా సందడి కనిపించింది. వీఐపీల రాక పోకలు ఔటర్ మీదుగా సాగినా పట్టణంలో కన్వెన్షన్ సెంటర్ వైపు వచ్చిపోయే వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, రవీందర్‌రెడ్డి, యాదగిరియాదవ్‌లు కూడ పాల్గొని వీఐపీలను ఆహ్వానించడంలో బిజీగా కనిపించారు. మోదీ రాకతో మరింత మంది రాష్ట్ర స్థాయి నాయకులు మంత్రులు వీఐపీలు రాలేకపోయారని భావిస్తున్నారు. పట్టణంలో అన్ని కూడళ్ల వద్ద ప్రజలు ఎమ్మెల్యే తనయుడి వివాహం ఏర్పాట్లు కొత్తగా నిర్మించిన జిఎంఆర్ కన్వెన్షన్ చేయడంపై పలువురు వివాహ ఏర్పాట్ల గురించి చర్చించుకున్నారు.ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన గొప్ప విందు భోజనాలపై కూడా చర్చ జరిగింది. -
ట్విట్టర్ ఆక్రోశం
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆ నగరంలో పలు చోట్ల సంభవించిన దాడుల్లో ఇప్పటికే 150 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల ఆర్తనాదాలు, క్షతగాత్రుల హాహాకారాలతో పారిస్ నగరం చివురుటాకులా వణికింది. ఈ దాడిని ప్రపంచదేశాల నాయకులు ముక్తం కంఠంతో ఖండించారు. కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్, బాలీవుడ్ నటులు, గాయకులు, వివిధ రంగాల ప్రముఖులు ట్విట్టర్ లో స్పందించారు. ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండించిన పలువురు సెలబ్రిటీలు మృతులకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. పారిస్‌లో తమ బంధువులు, సన్నిహితుల క్షేమం కోసం ఆరా తీశామన్నారు. శాంతి సందేశాలను, ఫొటోలను షేర్ చేశారు. బాలీవుడ్ నటీ నటులు, అనుపమ్ ఖేర్, హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా, కేటీ పెర్రీ, నమ్రత్ కౌర్, అక్షయ్ కుమార్, అలియాభట్, తాప్సీ, క్రిస్ రాక్, నీల్ నితిన్ ముఖేష్ , ప్రాచీ దేశాయ్ తదితరులు ట్విట్టర్ లో తమ సందేశాలను పోస్ట్ చేశారు. ప్రే ఫర్ పారిస్ అంటూ ట్వీట్ చేశారు. Pray for Paris. pic.twitter.com/9scg3W27nD — Chris Rock (@chrisrock) November 14, 2015 Shocking,Appalling and disgusting!!!!! Yes this massacre is truly an attack on ALL humanity! Really praying for some peace in this world! — Alia Bhatt (@aliaa08) November 14, 2015 -
ఏమాయ చేస్తున్నావే.. సమంత
సిటీలో ఆకసమంత.. అందం: సమంత.. అందం, అభినయం ఆమె సొంతం. సకె్సస్ రేట్లో సమంత సూపర్‌హిట్. వెండితెరపై ఫుల్ మార్కులు కొట్టేసిన ఈ పుత్తడిబొమ్మ.. ఇప్పుడు ట్రెండ్ ఫాలో కావట్లేదు. ట్రెండ్ సెట్ చేస్తోంది. ఏదైనా ఈవెంట్‌కి హైదరాబాద్ వస్తే చాలు.. డిఫరెంట్ లుక్కుతో అదరగొడుతోంది. ఓసారి శారీ గౌన్‌లో నయగారాలు కురిపిస్తే.. ఇంకోసారి షరారాలో మెరిసిపోయింది, మరోసారి లెహంగా హంగులతో ఆకట్టుకుంది. ఇలా ఒక్కో ఈవెంట్‌కి ఒక్కో స్టైల్‌తో సెలబ్రిటీలు అందరిలోనూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్న ఈ బబ్లీ గాళ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఫ్యాషన్. బాలీవుడ్ తారలు ఎంతమంది సిటీ ఈవెంట్లలో మెరిసినా, వాళ్లలో ఎవరికీ రానంత ఫ్యాషన్ ఇమేజ్ సమంత సొంతం చేసుకుంది. స్టైలిస్ట్ ఇంటర్వ్యూ: అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, అల్లుడుశ్రీను... ఇలా సమంతతో రెగ్యులర్‌గా వర్క్ చేస్తున్న స్టైలిస్ట్ కోన నీరజ.. సాక్షి సిటీప్లస్ తరఫున జర్నలిస్ట్‌గా అవతారమెత్తి.. సమంతను ఇంటర్వ్యూ చేశారు. టాప్ స్టైలిస్ట్ ప్రశ్నలకు.. స్టైల్ క్వీన్ స్పందించిన తీరిది. హైదరాబాద్‌లోని మేజర్ ఈవెంట్స్‌లో.. నీ స్టైల్‌తో టాక్ ఆఫ్ ది సిటీ అవుతున్నావ్. ఏంటీ కథ? ఎటువంటి డ్రెస్ అయినా మన ఆత్మవిశ్వాసం పెంచేలా ఉండాలి. వేసుకున్న డ్రెస్ చూసి మనిషిని చదివేయొచ్చు. అందుకే కాన్ఫిడెంట్‌గా డ్రెసప్ అవ్వాలనే మెసేజ్ నా ద్వారా అమ్మాయిలకి వెళ్లాలనుకుంటున్నా. డ్రెస్సింగ్‌లో ప్రయోగాలు చేయడం ఇష్టమా? అవును. సినిమాల్లో.. సమంత ఈ క్యారెక్టర్ చేయలేదు.. అని అంటే, ఎలాగైనా అలాంటి క్యారెక్టర్ చేసి నిరూపించుకోవాలని అనిపిస్తుంది. అలాగే బయటికి వేసుకునే డ్రెస్‌లో కూడా నేను ప్రయోగాలు చేయడాన్ని ఇష్టపడతా. అంతే తప్ప వార్డ్‌రోబ్‌లో నుంచి ఏదో ఒకటిలే అనుకుని తీసేసి వేసుకుని వెళ్లిపోవాలని అనుకోను. ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి స్టైల్ పరంగా ప్లానింగ్ ఎలా? ఏముంది? అప్పటిదాకా ట్రై చేయని లుక్ గురించి నీతో.. సారీ (నవ్వులు) నా స్టైలిస్ట్ నీరజతో డిస్కస్ చేయడం, ఒక షేప్ అనుకోవడం.. దాని ప్రకారం ఫాలో అయిపోవడం.. అంతే! ఈ వెరైటీ లుక్స్ గురించి కామెంట్స్... చాలామంది బావుందంటున్నారు. కొంత మంది ‘ఎక్కువ కష్టపడుతోంది’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. పర్లేదు. ఏదైనా సరే గుడ్, బ్యాడ్ రెండూ ఉంటాయి. సిటీ ఈవెంట్లకు అంత శ్ర ద్ధగా తయారవ్వడం అవసరమా? ముంబైలో జరిగే ఈవెంట్స్‌లో బాలీవుడ్ తారలు సినిమాలకు దీటుగా మెరుస్తారు. ఇక్కడెందుకు మనవాళ్లు అలా కనపడరా.. అని చాలాసార్లు అనుకునేదాన్ని. లాస్ట్ ఇయర్ ఫిల్మ్‌ఫేర్ ఫంక్షన్ కోసం పూర్తి శ్రద్ధ పెట్టి స్పెషల్లుక్తో అటెండయ్యాను. దానికి నేషనల్ స్థాయిలో వెబ్సైట్ల నుంచి వచ్చిన పొగడ్తలు న న్ను ఇన్స్పైర్ చేశాయి. అప్పటి నుంచి ప్రతి ఈవెంట్‌కి డిఫరెంట్‌గా డ్రెసప్ అవుతున్నా. ఫ్యాషన్‌పై ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచీ ఉందా? బాగా. కాలేజ్ డేస్‌లో ఎన్నో బ్రాండ్స్ కొనాలనుకున్నా. పొజిషన్ లేక ఊరుకున్నా.. అప్పట్లో హాలీవుడ్ హీరోయిన్ ఆడ్రీ హెప్బర్న్ లుక్స్ ఇష్టపడేదాన్ని. నీకంటూ నప్పనివి ఏమైనా ఉన్నాయనుకుంటున్నావా? ఊ... హెవీ జ్యూవెలరీ నప్పదు. అలాగే అతిగా ఎక్స్పోజ్ చేసే దుస్తులు సరిపడవు. నాది బేసిగ్గా సాఫ్ట్‌లుక్. అందుకే అలాంటి స్టైల్సే మ్యాచ్ అవుతాయి. ఇంకా... నీ డ్రెస్సింగ్ ద్వారా ఇంకేం చెప్పాలని? స్టైలిస్ట్వి.. జర్నలిస్ట్‌గా బాగానే సెట్టయిపోయావే (నవ్వులు). స్టైల్ అంటే ఒళ్లు చూపడం కాదు. మన లుక్ మనమేంటో చెబుతుంది. మన పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. అది అమ్మాయిలు గుర్తుంచుకోవాలి. సెలబ్రిటీగా నీ స్టైల్స్ అమ్మాయిల మీద ఇంపాక్ట్ చూపిస్తాయంటావా? తప్పకుండా. సినిమాలలో పాత్ర పరంగా ఏవి, ఎలా ధరించినా అది వేరే. అయితే బయట మాత్రం మా డ్రెస్సింగ్ స్టైల్స్ యూత్‌ని ఇన్స్పైర్ చేస్తాయని నేననుకుంటున్నా. సిల్వర్ స్క్రీన్‌పై సోయగాలతో మతిపోగొట్టే సమంత.. ఇక్కడి ఈవెంట్లలో ఫాలో అవుతున్న డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్. మొన్నటి ఫిల్మ్‌ఫేర్ నుంచి తాజా ఫిల్మ్‌ఫేర్ వరకు.. పాల్గొన్న ప్రైవేట్ ఫంక్షన్లన్నీ సమంత ఫ్యాషన్ పరేడ్‌కు వేదికల్లా మారాయి. సిటీ ఈవెంట్ అంటే కాస్త ఇంపుగా, సొంపుగా ఉన్న డ్రెస్సయితే చాల్లే అనుకునే తారలకు భిన్నంగా.. ఈ తారక తళుక్కుమంటోంది. లక్షలు విలువ చేసే బ్రాండెడ్, డిజైనర్ దుస్తులతో ప్రత్యక్షమవుతోంది. డిజైనర్ ఎగ్జిబిషన్లు, ఆడియో ఫంక్షన్లు, తదితర కార్యక్రమాల్లో సమంత లుక్‌ని పింక్విల్లా వంటి టాప్‌క్లాస్ ఫ్యాషన్ వెబ్సైట్లు పొగిడాయి. వెండి తెరపై కిర్రాకు పుట్టిస్తున్న సమంత ఏదైనా ఈవెంట్‌కు వెళ్తే మాత్రం పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది. యాక్టింగ్‌లో నేటితరం మేటిగా నిలిచిన ఈ బ్యూటీ.. ఆహార్యంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. మన డ్రెసప్ను బట్టి మనమేంటో తెలుస్తుందంటూ.. ఫ్యాషన్ వేరింగ్పై కాస్త స్పెషల్ కేర్ పెట్టాలని డిసైడైంది. ఎప్పుడైతే ఆమె మైండ్‌లో అలా ఫిక్సయిందో.. ప్రతి ఈవెంట్లోనూ ఆమెకే టాప్చైర్ దక్కుతోంది. -
పంచామృతం: అన్నీ ఉన్నా... కష్టపడి పైకొచ్చారు
ఎంత కష్టమైనా పడి సక్సెస్‌ను సాధించాలని తపన ఉండటం మానవ సహజనైజం. అయితే సేఫ్జోన్లో ఉన్నప్పుడు కష్టపడానికి మనసు ఒప్పుకోకపోవచ్చు, శరీరం సహకరించకపోవచ్చు. సక్సెస్ సాధిస్తే పేరొస్తుంది, తద్వారా డబ్బు వస్తుంది. మరి అలాంటి డబ్బు చేతిలో ఉండగా కూడా కష్టపడే తత్వం కొంతమందికే ఉంటుంది. దుర్భరమైన పరిస్థితుల్లో కష్టపడి డబ్బు సంపాదించి ఎదగడం ఒక విధమైన సక్సెస్ అయితే.. అన్నీ అమరినా కూడా వ్యక్తిగతంగా కష్టపడి ఎదగడం మరో విధమైన విజయగాధ అవుతుంది. అలాంటి వారిలో కొంతమంది సెలబ్రిటీలు వీళ్లు. కరణ్ జోహార్: ఈ బాలీవుడ్ దర్శకుడి నేపథ్యం గురించి చెప్పేటప్పుడు ‘బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్’ అనే ఇంగ్లిష్ ఇడియంను కచ్చితంగా ఉపయోగింవచ్చు. ఈ డెరైక్టర్ సినిమాల్లో కథాంశాలు ఎంత రిచ్‌గా ఉంటాయో... కనిపించే పాత్రల్లో ఎంత కార్పొరేట్ లుక్ ఉంటుందో.. ఇతడి నేపథ్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. తండ్రి యశ్ జోహర్ బాలీవుడ్లో ఒక ప్రఖ్యాత నిర్మాత. ఆయన అడుగు జాడల్లోనే నడకమొదలు పెట్టి తన సృజనాత్మక శైలితో దర్శకుడిగా అటుపై నిర్మాతగా సక్సెస్‌ను సాధించాడు కరణ్ జోహార్. మణిరత్నం: ఈ సృజనాత్మక సినీ మేధావి కూడా ఆర్థికంగా ఒక ఉన్నత స్థాయి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. మణిరత్నం తండ్రి రత్నం అయ్యర్ ఒక సినీ నిర్మాత. మద్రాస్‌లో థియేటర్లు కూడా ఉన్నాయి వీళ్ల కుటుంబానికి. అయితే అలాంటి సినీ నేపథ్యాన్ని తన కెరీర్‌కు బేస్ చేసుకోవాలని మణి అనుకోలేదు. మొదట జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో ఎంబీఏపూర్తి చేశాడు. ఆ తర్వాత కుటుంబ నేపథ్యానికి దూరంగా వెళ్లి కన్నడలో సినిమాలు తీయడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఏక్తాకపూర్: ఒకవేళ ఏక్తా కపూర్ గనుక బాలీవుడ్‌పై తన మార్కును చూపలేకపోయుంటే ఈ పాటికి అక్కడ జితేంద్ర ఉనికి కూడా ఒక గతంగానే మారిపోయేదేమో! అలనాటి ఆ లెజెండరీ హీరోకి ఏక్తాతో పుత్రికోత్సాహం లభిస్తోంది. సినీ నేపథ్యం నుంచినే వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొంది ఏక్తా. బాలాజీ టెలిఫిలిమ్స్‌తో సీరియల్ ప్రొడ్యూసర్‌గా మారి వైవిధ్యమైన రీతిలో పేరు, డబ్బును సంపాదించింది. అటు నుంచి ‘డర్టీపిక్చర్’లాంటి సినిమాల ద్వారా నిర్మాతగా జాతీయ స్థాయిలో స్టార్ అయ్యింది. విశాల్: తెలుగు వాడే అయిన ఈ తమిళ హీరో విశాల్ తండ్రి కూడా సినీ నిర్మాత, వ్యాపారవేత్త. అయితే కుటుంబ నేపథ్యాన్ని పూర్తిగా పక్కనపెట్టి హీరో అర్జున్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా చేరిపోయాడు. అదే సమయంలో విశాల్ నేపథ్యాన్ని చూసిగాక అతడి రూపాన్ని చూసి ’ప్రేమ చదరంగం’ సినిమాలో నటించే అవకాశం లభించింది. అప్పటికీ కొంత ఆత్మనూన్యతాభావంతోనే ఆ సినిమాలో నటించాడట. అయితే ఆ సినిమా తమిళంలో హిట్ కావడంతో విశాల్ దశ తిరిగింది. నిర్మాత అయిన తండ్రి పేరుతో అవసరం లేకుండా విశాల్ పేరే ఒక బ్రాండ్ అయ్యింది. అజయ్ జడేజా ఈ తరం దాదాపుగా మరిచిపోయిన క్రికెటర్ జడేజా. ఇండియన్ నేషనల్ క్రికె ట్ టీమ్‌కు కొన్ని మ్యాచ్‌లలో కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన జడేజా కెరీర్ అనేక వివాదాల పాలై అంతమైంది. నవానగర్ రాజవంశానికి చెందిన జడేజా క్రికెట్ నైపుణ్యంతో జాతీయ జట్టులో స్థానం సంపాదించుకొని తన ఆట తీరుతో అందరినీ తన అభిమానులుగా మార్చుకొన్నాడు. వైస్‌కెప్టెన్, కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. తన తరంలో ప్రపంచంలోని ప్రముఖ పేరున్న క్రికెటర్‌గా నిలిచాడు. -
టీవీక్షణం: అసలు సిసలు ఆటగాడు!
సెలెబ్రిటీలు పాల్గొనే ఏ కార్యక్రమం అయినా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక వాళ్లు సినిమాల్లో మాదిరి స్టంట్స్ చేస్తూ, సాహసాన్ని ప్రదర్శిస్తుంటే చూడటం మరీ మజాగా ఉంటుంది. ‘ఖత్రోంకే ఖిలాడీ’ సక్సెస్ కావడానికి కారణం అదే. ఈ ప్రోగ్రామ్ ఐదో సిరీస్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రముఖ మోడల్, నటుడు రజనీష్ దుగ్గల్ విజేతగా నిలిచాడు. 2003లో మిస్టర్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న రజనీష్... రేమండ్, కిట్‌క్యాట్, మాంటెకార్లో, వేగనార్, యమహా, వీడియోకాన్, క్లినిక్ ఆల్‌క్లియర్ లాంటి ఉత్పత్తులకు మోడల్‌గా చేసి, ‘1920’ చిత్రంతో నటుడిగానూ పరిచయమయ్యాడు. ఇప్పుడీ షోలో విజేత కావడంతో మరింత ఫేమస్ అయిపోయాడు. ఇందులో గెలిచినందుకుగాను ఒక కారు, పాతిక లక్షల రూపాయలను గెలుచుకున్నాడు రజనీష్. గురుమీత్ చౌదరి, సల్మాన్ లాంటి బలమైన పోటీదారులను వెనక్కి నెట్టి గెలుపొందాలంటే చాలా స్టామినా ఉండాలి. అది ఉంది కాబట్టే రజనీష్ విజయం సాధించాడు. అసలు సిసలు అటగాడిగా నిరూపించుకుటన్నాడు! -
ఐస్... వెంటనే ఐసైపోదు...
మందులో ఐసేసుకోవాలి. మనమైతే.. ఫ్రిజ్‌లోని ఐస్ ముక్కలు తీసుకుంటాం.. వేసుకుంటాం.. మనమైతే ఇలా చేస్తాం.. కానీ పాశ్చాత్య దేశాల్లో సెలబ్రిటీలు వంటివారు ఇలాంటి వాటిని ఇష్టపడటం లేదట.. ఐస్ ముక్కల్లోనూ లగ్జరీ చూస్తున్నారట.. ఇలాంటోళ్ల కోసమే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గ్లేస్ లగ్జరీ ఐస్ కంపెనీ ఈ ఐసు క్యూబ్స్‌ను తయారుచేసింది. వీటి గొప్పతనమేమిటంటే.. ఇవి కచ్చితంగా చతురస్రాకారంలో ఉంటాయి. షేప్‌లో ఇసుమంతైనా తేడా రాదు. ఐస్ ముక్క వేసిన వెంటనే.. అది డ్రింక్‌ను త్వరితగతిన చల్లగా చేయడంతోపాటు దాదాపు 40 నిమిషాలపాటు కరగకుండా ఉంటుంది. అంతేకాదు.. పారదర్శకంగా ఎటువంటి రుచి లేకుండా ఉంటాయి. అంటే.. మీ మందు తాలూకు టేస్ట్‌ను దెబ్బతీయవన్నమాట. అన్నీ బాగున్నాయి.. రేటెంత అని అడుగుతున్నారా? 50 ఐస్ ముక్కల బ్యాగు ధర రూ.20 వేలు!