ఐస్... వెంటనే ఐసైపోదు... | ICE cubes not Dissolved immediately | Sakshi
Sakshi News home page

ఐస్... వెంటనే ఐసైపోదు...

Published Sat, Jun 7 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

ఐస్... వెంటనే ఐసైపోదు...

ఐస్... వెంటనే ఐసైపోదు...

మందులో ఐసేసుకోవాలి. మనమైతే.. ఫ్రిజ్‌లోని ఐస్ ముక్కలు తీసుకుంటాం.. వేసుకుంటాం.. మనమైతే ఇలా చేస్తాం.. కానీ పాశ్చాత్య దేశాల్లో సెలబ్రిటీలు వంటివారు ఇలాంటి వాటిని ఇష్టపడటం లేదట.. ఐస్ ముక్కల్లోనూ లగ్జరీ చూస్తున్నారట.. ఇలాంటోళ్ల కోసమే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గ్లేస్ లగ్జరీ ఐస్ కంపెనీ ఈ ఐసు క్యూబ్స్‌ను తయారుచేసింది. వీటి గొప్పతనమేమిటంటే.. ఇవి కచ్చితంగా చతురస్రాకారంలో ఉంటాయి. షేప్‌లో ఇసుమంతైనా తేడా రాదు. ఐస్ ముక్క వేసిన వెంటనే.. అది డ్రింక్‌ను త్వరితగతిన చల్లగా చేయడంతోపాటు దాదాపు 40 నిమిషాలపాటు కరగకుండా ఉంటుంది. అంతేకాదు.. పారదర్శకంగా ఎటువంటి రుచి లేకుండా ఉంటాయి. అంటే.. మీ మందు తాలూకు టేస్ట్‌ను దెబ్బతీయవన్నమాట. అన్నీ బాగున్నాయి.. రేటెంత అని అడుగుతున్నారా? 50 ఐస్ ముక్కల బ్యాగు ధర రూ.20 వేలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement