Western countries
-
యూరప్‌లో శాంతి తక్షణావసరం
ఒకప్పుడు ఉక్రెయిన్ తుది విజయం వరకూ మద్దతునిద్దామనే పశ్చిమ దేశాల ప్రజల అభిప్రాయం ఇప్పుడు క్రమేపీ తగ్గుతోంది. యూగోవ్ సర్వే సంస్థ తాజాగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, స్వీడన్, డెన్మార్క్, యూకేలలో ప్రజాభి ప్రాయాన్ని సేకరించింది. ఈ ఏడు దేశాల ప్రజలు సంవత్సరం క్రితం ఇచ్చిన మద్దతుకు కట్టుబడి లేరు. ఉక్రెయిన్‌కు మద్దతునిచ్చే వారి సంఖ్య స్వీడన్లో 57 శాతం నుంచి 50 శాతానికి, యూకేలో 50 శాతం నుంచి 36 శాతానికి, డెన్మార్క్‌లో 51 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో శాంతి చర్చల ద్వారా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం వెతకాలనే వారి సంఖ్య ఇటలీలో 45 శాతం నుంచి 55 శాతానికి, స్పెయిన్‌లో 38 నుంచి 46 శాతా నికి, ఫ్రాన్స్‌లో 35 నుంచి 43 శాతానికి, జర్మనీలో 38 నుంచి 45 శాతానికి పెరిగింది. జనవరి 20 నాడు అమెరికా అధ్యక్ష అధికార పగ్గాలు చేపట్టనున్న ట్రంప్ ఉక్రెయిన్‌కు మద్దతు ఉప సంహరించుకొనే అవకాశాలు ఉన్నాయని 62 శాతం జర్మనీ ప్రజలు, 60 శాతం స్పెయిన్ వాసులు, 56 శాతం బ్రిటన్ ప్రజలు, 52 శాతం ఫ్రెంచ్ జనాలు అభిప్రాయ పడ్తున్నారని యూగోవ్ వెల్లడించింది.ఉక్రెయిన్ – రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమై మూడేళ్లు నిండనున్నాయి. ఆర్థిక ఆంక్షలతో రష్యాను అదుపులోకి తెచ్చుకోవచ్చునని రష్యాపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాల అంచనాలకు విరుద్ధంగా రష్యా చమురు వాణిజ్యంతో ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగానే ఉంచుకొంది. రష్యాపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలే ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల్లో ద్రవ్యోల్భణం, నిరుద్యోగం పెరుగుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ఫ్రాన్స్, జర్మనీ, యూకే, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రభుత్వాలు పతనమైపోతు న్నాయి. డిసెంబర్ ప్రారంభంలో ఫ్రెంచ్ ప్రధాని మైకెల్ బార్నియర్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో నెగ్గలేక కూలిపోయింది. జర్మన్ ఛాన్సలర్ షోల్జ్ తన ఆర్థిక మంత్రిని బర్తరఫ్ చేయటంతో 3 సంవత్సరాల సోషల్ డెమాక్రాట్స్–గ్రీన్స్–ఫ్రీ డెమాక్రటిక్ పార్టీల కూటమి ప్రభుత్వం పడిపోయింది. ఓక్స్ వాగెన్, ఆడీ వంటి అనేక కార్ల కంపెనీలు మూత పడుతున్నాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌కు జర్మనీ మద్దతు కూడా జర్మనీ ప్రజలు స్వాగతించటం లేదు.బ్రిటన్‌లో 22 నెలలు ఏలిన కన్సర్వేటివ్ ప్రధాని రిషి సునాక్ రాజీనామా చేసి ఎన్నికలకు పిలుపునివ్వగా లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యూన్ సుక్ అవినీతి ఊబిలో కూరుకుపోయి, నేషనల్ అసెంబ్లీ తీర్మానాలను తన వీటో ద్వారా నిరోధించటంతో జనాగ్రహానికి గురై రాజీనామా చేయక తప్పలేదు. పశ్చిమాసియాలో గాజాపై యుద్ధం చేయిస్తూ 50 వేల వరకూ సామాన్య ప్రజల్ని చంపిన ఇజ్రాయెల్‌కు మద్దతు పలికిన అమెరికా అధ్య క్షుడు జో బైడెన్ ట్రంప్ చేతిలో ఓటమి చెందారు. 2023లో ఉక్రెయిన్ విషయంలో బైడెన్ తప్పుడు నిర్ణయం తీసుకొన్నారని అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. సుదీర్ఘ కాలం పాటు యుద్ధం జరిగేలా చేసి... రష్యా, ఉక్రెయిన్ ప్రజలు ఒకరినొకరు చంపుకునేలా చూడటమే పశ్చిమ దేశాల లక్ష్యంగా ఉంది. అమెరికా ప్రత్యర్థి రష్యాను బలహీన పర్చటమే తమ ధ్యేయమని, అన్ని రంగాలలో నిర్వీర్యం చేస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్ప టికే అనేకసార్లు ప్రకటించారు. రష్యాతో నాటో దేశాలు దౌత్య సంబంధాల్ని తెగతెంపులు చేసుకొన్నాయి. రష్యా సంపదను కొల్లగొట్టి దేశాన్ని ముక్కలు ముక్కలు చేయటమే అమెరికా ధ్యేయం.యుద్ధం ప్రారంభంలో శాంతి ఒప్పందాలకు ఉక్రె యిన్–రష్యాలు అంగీకరించాయని టర్కీ, ఇజ్రాయిల్ తెలిపాయి. రష్యా యుద్ధం విరమిస్తే, ఉక్రెయిన్ తటస్థ దేశంగా నాటో సభ్యత్వాన్ని కోరదనేది సారాంశం. అయితే అప్పటి యూకే ప్రధాని జాన్సన్ ఆఘ మేఘా లపై కీవ్ వెళ్లి ఉక్రెయిన్ ఆధ్యక్షుడు జెలెన్స్కీని ఒప్పందానికి దూరంగా ఉంచగలిగాడు. 9 ఏళ్ల క్రితం జరిగిన మిన్స్కు ఒప్పందాన్ని పశ్చిమ దేశాలు ఎప్పుడూ గౌర వించలేదు. ఉక్రెయిన్ మిలిటరీ పరంగా బలం పుంజు కోటానికే మిన్స్కు ఒప్పందాన్ని ఎర వేశామని సాక్షాత్తు ఒకప్పటి జర్మనీ ఛాన్సలర్ మెర్కల్ ప్రకటించారు కూడా. ఫ్రాన్స్ కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి లేమని ఒప్పుకొంది. నాటో దేశాలు యుద్ధానికే మొగ్గు చూపా యని టర్కీ విదేశాంగ మంత్రి, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని కూడ తెలియజేశారు. లిండేగ్రాహం వంటి అమె రికా కాంగ్రెస్ సభ్యుడు ‘చివరి ఉక్రేనియన్’ వరకూ రష్యాతో పోరాటానికి బహిరంగ మద్దతు ఉంటుందని, ‘అమెరికా ప్రాణాలను పణంగా పెట్టకుండా ఉక్రెయి న్కు ఆయుధ సహాయం చేయటం అమెరికా ‘తెలివైన పెట్టుబడి’ అని అన్నారు.ఉక్రెయిన్‌లో ఏ ప్రాంత ప్రజలు కూడా నిరంతర యుద్ధానికి మద్దతు పలకటం లేదు. ఒకప్పుడు ఉక్రెయిన్ నాయకుల విజయంపై ఉన్న ఆశలను నేడు క్రమేపీ వదులుకొంటున్నారు. తాజా సర్వేల్లో ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీపై భ్రమల్ని ప్రజలు వదులుకుంటున్నారు. ఉక్రెయిన్ ఫ్రంట్‌లైన్‌లు కుప్పకూలిపోతున్నాయి. నాటో భౌగోళిక విస్తరణకు ఉక్రెయిన్ భారీ మూల్యం చెల్లిస్తున్నది. సంఘర్షణ ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఉక్రెయిన్ ప్రజలు మరిన్ని ప్రాణ నష్టాలతో, ఆర్థిక నష్టాలతో అంత ఎక్కువ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈ స్పష్టతతో పశ్చిమ దేశాల వ్యూహం భవి ష్యత్తులో విఫలమవుతుంది. రష్యాపై ఉక్రెయిన్ శత్రు వైఖరిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే యుద్ధం ముగు స్తుంది. రష్యా కూడా శాంతి మార్గాలు వెతకాలి.బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్,కేఎల్ యూనివర్సిటీ ‘ 98494 91969 -
G7 Summit 2024: చైనా అండతోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం
రోమ్: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రెండేళ్లకుపైగా దాడులు కొనసాగించే శక్తి రష్యాకు ఎలా వచి్చంది? అమెరికాతోపాటు పశి్చమ దేశాలు డ్రాగన్ దేశం చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. చైనా అండదండలతోనే ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోందని, సాధారణ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని జీ7 దేశాలు ఆరోపించాయి. ఇటలీలో సమావేశమైన జీ7 దేశాల అధినేతలు తాజాగా ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అండ చూసుకొని రష్యా రెచి్చపోతోందని ఆరోపించారు. రష్యా యుద్ధ యంత్రానికి చైనానే ఇంధనంగా మారిందని జీ7 దేశాలు మండిపడ్డారు. రష్యాకు మిస్సైళ్లు డ్రోన్లు చైనా నుంచే వస్తున్నాయని ఆక్షేపించారు. జీ7 దేశాలు సాధారణంగా రష్యాను తమ శత్రుదేశంగా పరిగణిస్తుంటాయి. ఈ జాబితాలో ఇప్పుడు చైనా కూడా చేరినట్లు కనిపిస్తోంది. మారణాయుధాలు తయారు చేసుకొనే పరిజ్ఞానాన్ని రష్యాకు డ్రాగన్ అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు చైనా నేరుగా ఆయుధాలు ఇవ్వకపోయినా ఆయుధాల తయారీకి అవసరమైన విడిభాగాలు, ముడి సరుకులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తోందని ఆక్షేపించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన ఉక్రెయిన్‌లో మారణహోమం సృష్టించేలా రష్యాకు సహకరిస్తున్న దేశాలపై, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకతప్పదని జీ7 దేశాల అధినేతలు తేలి్చచెప్పారు. ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధమైన యుద్ధానికి మద్దతివ్వడం మానుకోవాలని హితవు పలికాయి. ఉక్రెయిన్‌పై దాడుల తర్వాత రష్యాపై పశి్చమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో తమకు అవసరమైన సరుకులను చైనా నుంచి రష్యా దిగుమతి చేసుకుంటోంది. అలాగే రష్యా నుంచి చైనా చౌకగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇరుదేశాలు పరస్పరం సహరించుకుంటున్నాయి. టిబెట్, షిన్‌జియాంగ్‌తోపాటు హాంకాంగ్‌లో చైనా దూకుడు చర్యలను జీ7 సభ్యదేశాలు తప్పుపట్టాయి. చైనా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఆరోపించాయి. మరోవైపు డ్రాగన్ దేశం అనుసరిస్తున్న వ్యాపార విధానాలను అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు తప్పుపడుతున్నాయి. ఎలక్ట్రికల్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులు, సోలార్ ప్యానెళ్ల తయారీకి చైనా ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోంది. దీంతో ఇవి చౌక ధరలకే అందుబాటులో ఉంటూ విదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా ఆయా దేశాల్లో వీటిని తయారు చేసే కంపెనీలు గిరాకీ లేక మూతపడుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల్లో కోతపడుతోంది. చైనా దిగుమతులతో పశి్చమ దేశాలు పోటీపడలేకపోతున్నాయి. చైనా ఎత్తుగడలను తిప్పికొట్టడానికి చైనా ఉత్పత్తులపై అమెరికాతోపాటు ఈయూ దేశాలు భారీగా పన్నులు విధిస్తున్నాయి. -
G7 Summit 2024: జీ7 ప్యాకేజీ ఎప్పుడు? ఎలా?
28 నెలలుగా కొనసాగుతున్న రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ చాలావరకు ధ్వంసమైంది. యుద్ధం ఆగేదెన్నడో, ఉక్రెయిన్ పునరి్నర్మాణం మొదలయ్యేదెప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జీ7 దేశాల కూటమి 50 బిలియన్ డాలర్ల (రూ.4.17 లక్షల కోట్లు) రుణ ప్యాకేజీని ప్రకటించడం ఉక్రెయిన్‌కు ఎంతగానో ఊరట కలిగించే పరిణామం అనే చెప్పాలి. వివిధ దేశాల్లో ఉన్న రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయం నుంచే ఈ ప్యాకేజీని ఉక్రెయిన్‌కు ఇవ్వనున్నట్లు జీ7 దేశాలు వెల్లడించాయి. దీనిపై ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ విజేతగా నిలవడానికి ఈ సాయం ఒక గొప్ప ముందడుగు అని అభివరి్ణంచారు. ఈ నేపథ్యంలో జీ7 ప్రకటించిన రుణ ప్యాకేజీ, ఉక్రెయిన్‌కు కలిగే లబ్ధి, ఇందులో ఇమిడి ఉన్న ఇబ్బందులు, వివిధ దేశాలు స్తంభింపజేసిన రష్యా ఆస్తుల గురించి తెలుసుకుందాం. 2022 ఫిబ్రవరిలో రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై హఠాత్తుగా దాడికి దిగింది. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ సైతం ఎదురుదాడి ప్రారంభించింది. ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. వేలాది మంది సామాన్య ప్రజలు, సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలంటూ పశి్చమ దేశాలు హెచ్చరించినా రష్యా లెక్కచేయడం లేదు. దీంతో రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టడానికి తమ దేశంలో ఉన్న రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను పశి్చమ దేశాలు స్తంభింపజేశాయి. ఈ ఆస్తుల విలువ 300 బిలియన్ డాలర్ల (రూ.25.06 లక్షల కోట్లు) వరకు ఉంటుంది. వీటిపై ప్రతి సంవత్సరం 3 బిలియన్ డాలర్ల (రూ.25 వేల కోట్లు) వడ్డీ, ఆదాయం లభిస్తోంది. రష్యా ఆస్తులు చాలావరకు ఐరోపా దేశాల్లో ఉన్నాయి. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నందుకు రష్యా పరిహారం చెల్లించాల్సిందేనని అమెరికా సహా పశి్చమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు రష్యా ఒప్పుకోవడం లేదు. దాంతో రష్యా ఆస్తులపై వస్తున్న వడ్డీని, ఆదాయాన్ని పరిహారం కింద ఉక్రెయిన్‌కు ఇవ్వాలని తాజాగా జీ7 దేశాలు నిర్ణయించాయి. ఇబ్బందులు ఏమిటి? విదేశాల్లో ఉన్న ఆస్తులు ఒకవేళ మళ్లీ రష్యా నియంత్రణలోకి వస్తే రుణాన్ని తిరిగి చెల్లించడం కష్టమే. స్తంభింపజేసిన రష్యా ఆస్తులను శాంతి చర్చల్లో భాగంగా విడుదల చేయాల్సి వస్తే రుణాన్ని చెల్లించడానికి జీ7 దేశాలు మరో మార్గం వెతుక్కోవాలి. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రష్యా ఆస్తులపై కొన్నిసార్లు అనుకున్నంత వడ్డీ గానీ, ఆదాయం గానీ రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులెదురవుతాయి. అలాగే రుణ భారాన్ని జీ7 దేశాలన్నీ పంచుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మరో వారం రోజుల్లో తుది ప్రణాళికను ఖరారు చేయనున్నారు. యూరప్‌లోని రష్యా ఆస్తులపై ఆంక్షలను కొనసాగించడానికి ప్రతిఏటా యూరోపియన్ యూనియన్(ఈయూ)లో ఓటింగ్ జరుగుతోంది. ఈయూలోని ఏ ఒక్క సభ్యదేశం వీటో చేసినా ఆంక్షలు రద్దవుతాయి. ఆస్తులు రష్యా అ«దీనంలోకి వెళ్లిపోతాయి. ఈయూలోని హంగేరీ దేశం ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోంది. ఒకవేళ హంగేరీ వీటో చేస్తే ఉక్రెయిన్ రుణ ప్యాకేజీ ప్రణాళికలు మొత్తం తలకిందులవుతాయి. తమ ఆస్తులపై వచ్చే వడ్డీని, ఆదాయాన్ని పశి్చమ దేశాలు మింగేస్తామంటే రష్యా చూస్తూ కూర్చోదు కదా! కచ్చితంగా ప్రతీకార చర్యలకు దిగుతుంది. రష్యాలోనూ పశి్చమ దేశాల ఆస్తులున్నాయి. వాటిని రష్యా ప్రభుత్వం గతంలోనే స్తంభింపజేసింది. తమ ఆస్తులపై వడ్డీని కాజేసినందుకు ప్రతిచర్యగా పశ్చిమదేశాల ఆస్తులపై వడ్డీని సైతం రష్యా లాక్కొనే అవకాశం లేకపోలేదు. హక్కులు బదిలీ చేయడం సాధ్యమేనా? రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయాన్ని నష్టపరిహారంగా ఉక్రెయిన్‌కు ఇవ్వాలనుకోవడం బాగానే ఉన్నప్పటికీ ఇందులో చట్టపరమైన అవరోధాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రష్యా అంగీకారం లేకుండా ఇలా చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంటున్నారు. మొండిగా ముందుకెళ్తే తీవ్ర వివాదానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తొలుత న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఒక దేశానికి సంబంధించిన ఆస్తులను స్తంభింపజేసిప్పటికీ వాటిపై హక్కులను ఇతర దేశాలకు బదిలీ చేయడం సాధ్యం కాదు. అవి ఎప్పటికైనా సొంత దేశానికే చెందుతాయి. భౌగోళికంగా తమ దేశంలో ఉన్న ఇతర దేశాల ఆస్తులను ఆయా దేశాల అనుమతి లేకుండా స్వా«దీనం చేసుకొని అనుభవిస్తామంటే కుదరదు. రష్యా ఆస్తులను ఎలా వాడుకోవచ్చు? రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్‌కు ఇచ్చేసే అవకాశం లేదు. జీ7లోని ఏ దేశమైనా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకొని ఆ సొమ్మును ఉక్రెయిన్‌కు ఇవ్వొచ్చు. రుణాన్ని తీర్చేయడానికి రష్యా ఆస్తులపై వస్తున్న వడ్డీ, ఆదాయాన్ని చెల్లించవచ్చు. తమకు అందే సొమ్మును ఆయుధాలు కొనుగోలు చేయడానికి, దేశ పునరి్నర్మాణానికి ఉక్రెయిన్ ఉపయోగించుకొనేందుకు ఆస్కారం ఉంది. జీ7 నుంచి రుణ ప్యాకేజీ ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌కు చేరే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి రాబోయే పదేళ్లలో 486 బిలియన్ డాలర్లు (రూ.40.58 లక్షల కోట్లు) అవసరం. ఇది ముమ్మాటికీ దొంగతనమే: పుతిన్ రష్యా ఆస్తులపై వచ్చే ఆదాయంతో ఉక్రెయిన్‌కు ప్యాకేజీ ఇవ్వాలన్న జీ7 దేశాల నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ దొంగతనమేనని చెప్పారు. చోరులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తమ ఆస్తుల జోలికి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. పుతిన్ శుక్రవారం రష్యా విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జీ7 దేశాల నిర్ణయంపై చర్చించారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా దొంగతనం కచ్చితంగా దొంగతనమే అవుతుందన్నారు. జీ7 దేశాల నిర్ణయాన్ని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా శుక్రవారం ఖండించారు. ఈ నిర్ణయం చట్టపరంగా చెల్లదని తేలి్చచెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరికలపై స్పందించిన జైశంకర్
కోల్‌కతా: భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల గురించి విదేశీ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మండిపడ్డారు. భారత్‌లోని ఎన్నికల గురించి వ్యతిరేక కథనాలు ప్రచురిస్తోందన్నారు. తాను రాసిన ‘‘వై భారత్ మాటర్స్’’ బుక్ బంగ్లా ఎడిషన్‌ను జైశంకర్.. కోల్‌కతాలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జైశంకర్ మాట్లాడారు.‘‘విదేశీ మీడియా మన దేశాన్ని ప్రభావితం చేయాలనుకుంటోంది. ఎందుకుంటే ఈ ప్రపంచాన్ని వాల్లు గత 70-80 ఏళ్ల నుంచి ప్రభావం చేస్తున్నామని భావిస్తున్నాయి. కొన్ని పాశ్చాత్య దేశాలు సైతం వాళ్లు ప్రపంచాన్ని 200 ఏళ్ల నుంచి ప్రభావితం చేస్తున్నామని భావిస్తున్నాయి. వాళ్లు తమ అలవాట్లను మార్చుకోవటం అంత సులువైన పని కాదు...విదేశీ మీడియా ఎందుకు భారత్‌కు వ్యతిరేకంగ కథనాలు ప్రచురిస్తోంది?. ఎందుకంటే దేశంలో ఒక వర్గం వారు పాలించాలని ఆరాటపడుతోంది. అందుకే ప్రభావితం చేయలానుకుంటోంది. కానీ, భారతీయ ప్రజలంతా అలా భావించటం లేదు. అదీకాక విదేశీ మీడియా రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సైతం బహిరంగంగా ఆమోదం తెలుపుతోంది. వారు తమ ప్రాధాన్యతను దాచుకోవటం లేదు. చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. కొంతమంది ఇలానే 300 ఏళ్ల నుంచి ప్రవర్తిస్తూ చాలా అనుభవం పొందారు. ..కొన్ని న్యూస్‌పేపర్లు తరచూ దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తుంటాయి. పలు ఇండెక్స్‌ల్లో తక్కువగా చూపుతారు. తమ ఎన్నికల ఫలితాలను నిర్ణయించుకోవడానికి కోర్టుకు వెళ్లే దేశాలు సైతం.. మనకు ఎన్నికలు నిర్వహించటం గురించి తెలియజేయటం చాలా విడ్డూరం’’ అని జైశంకర్ అన్నారు.ఇరాన్‌లోని చాబహార్ పోర్టుకు సంబంధించి భారత్ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఒప్పందంపై అమెరికా చేసిన ఆంక్షల హెచ్చరికలపై మంత్రి శంకర్ స్పందించారు.‘ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతం మొత్తం ప్రయోజనం చేకూర్చుతుంది. ఈ విషయంలో సంకుచితంగా ప్రవర్తించటం మానుకోవాలి. గతంలో ఇదే చాబహార్ పోర్టు గురించి అమెరికా ప్రశంసలు కురిపించింది. అమెరికా చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇది అందరీ ప్రయోజనం కోసం చేపట్టిన ఒప్పందం. ఈ విషయాన్ని కూడా సంకుచితం స్వభావంతో చూడవద్దు’ అని జైశంక్ అన్నారు. -
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా..! అయితే జాగ్రత్త..!!
జగిత్యాల: ఇలా ఒకరిద్దరు కాదు.. సుమారు 25 మంది యువకులను కెనడా, జర్మనీ వంటి దేశాలకు పంపిస్తానని చెప్పి సాయితేజ అనే ఏజెంట్ సుమారు రూ.కోటి వరకు దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీళ్లంతా జగిత్యాల పోలీసులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. ఉత్త లెటర్లే.. సాధారణంగా కెనడా, జర్మనీ వంటి దేశాలకు వెళ్లేవారు ఆయా దేశాల్లో ఉన్న కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నట్లు వాటికి సంబంధించిన ఆఫర్ లెటర్లను ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఈ ఆఫర్ లెటర్ల ఆసరాగా ఆయా కంపెనీలకు వెళ్లడానికి అవసరమైన అర్హతలు, మెడికల్, బయోమెట్రిక్ వంటి ఇతర అర్హత పత్రాలు జతచేయాల్సి ఉంటుంది. అయితే సదరు ఏజంట్‌గా పనిచేసిన వ్యక్తి యూరప్ కంపెనీల బోగస్ ఆఫర్ లెటర్లను సృష్టించి ఉపాధి కోసం వలస వెళ్లే యువకులకు ఇచ్చి వాటితో హైదరాబాద్‌లో మెడికల్, బయోమెట్రిక్, స్టాంపింగ్ చేయించడం గమనార్హం. ఇదే రీతిలో కొల్వాయికి చెందిన ఏజంట్ ఓ వ్యక్తిని జర్మనీకి పంపగా.. అతడిని అక్కడి ఎయిర్‌పోర్టు నుంచి తిప్పి పంపినట్లు సమాచారం. ఆందోళనలో యువకులు.. జగిత్యాల, కోరుట్ల, బీర్పూర్, సారంగాపూర్ ప్రాంతానికి చెందిన సుమారు 25 మంది యువకులు ఏడాదిన్నరగా యూరప్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లాలన్న ఆశతో కొల్వాయికి చెందిన ఏజెంట్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. అతడు ఒక్కో యువకుడి నుంచి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు తీసుకుని కెనడా, జర్మనీ దేశాలకు పంపేతంతును పూర్తి చేసినట్లు సదరు ఏజెంట్ నమ్మించినట్లు తెలిసింది. సుమారు ఏడాదిన్నరపాటు తమను యూరప్ దేశాలకు పంపుతాడని ఆశపడ్డ యువకులు కొన్నాళ్లపాటు వేచిచూసి చివరకు తాము మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. కేసులు నమోదు చేశాం.. యూరప్ దేశాలకు పంపిస్తానని నకిలీ పత్రాలు ఇచ్చి మోసం చేసినట్లు కొంతమంది యువకులు మాకు ఫిర్యాదు చేశారు. ఆయా యువకులు మోసపోయిన ఏరియాల్లోని పోలీస్స్టేషన్లలో రెండు కేసులు నమోదు చేశాం. – వెంకటస్వామి, డీఎస్పీ, జగిత్యాల ‘మాది కోరుట్ల. కెనడాకు వెళ్దామని మా ఫ్రెండ్ ద్వారా బీర్పూర్ మండలం కొల్వాయికి చెందిన సాయితేజను ఏడాది క్రితం సంప్రదించిన. ఆయన నా దగ్గర రూ.ఏడు లక్షలు తీసుకున్నాడు. నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చి మెడికల్, బయోమెట్రిక్ చేయించాడు. తరువాత రెండు నెలలకు ఆయనే అవి నకిలీవని చెప్పి మీ డబ్బులు మీకు ఇస్తానన్నాడు. తరువాత ఓ చెక్ ఇచ్చాడు. అది బౌన్స్ అయింది. నెలరోజులుగా సాయితేజ ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. వాళ్లింటికి వెళితే ఇంట్లో ఎవరూ లేరు. చైతన్య, కోరుట్ల -
విదేశీ పర్యటనకు చిన్నారి.. 'అభి తుమనిషా'
కర్ణాటక: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉపన్యాస పోటీల్లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సంపాదించి మలేషియా పర్యటనకెళ్లడం సంతోషకరమని హోసూరు కార్పొరేషన్ విద్యాకమిటీ అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు. హోసూరు పారిశ్రామికవాడ జూజువాడి ప్రభుత్వ ఉన్నతోన్నత పాఠశాలలో అభి తుమనిషా గత ఏడాది ప్లస్‌టూ చదువుతూ రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీల్లో మొదటి స్థానం సంపాదించుకొంది. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామొళితో కలిసి మలేషియా పర్యటనకు తీసుకెళ్లారు. -
ఎదుగుతున్న గొప్ప శక్తి.. భారత్
న్యూఢిల్లీ: భారత్ ఎదుగుతున్న ‘గొప్ప శక్తి‘గా మారే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు మార్టిన్ వోల్ఫ్ పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ 2050 నాటికి అమెరికాతో సమానమైన పరిమాణాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. పశ్చిమ దేశాలూ ఈ విషయాన్ని గుర్తిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్‌లో ఆయన రాసిన ఒక ఆరి్టకల్‌లో ముఖ్యాంశాలు.. ► భారత్ 2050 వరకూ వార్షికంగా 5 శాతం లేదా కొంచెం అటుగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని కొనసాగించగలదని నేను విశ్వసిస్తున్నాను. ► ‘చైనా ప్లస్ వన్‘ (కేవలం చైనాలోనే పెట్టుబడులు కాకుండా మరొక దేశంలో కూడా..) వ్యూహాన్ని అనుసరించే కంపెనీలకు భారతదేశం స్పష్టమైన స్థానం. పోటీ పూర్వక పెద్ద మార్కెట్‌ను దేశం కలిగి ఉంది. ► ప్రస్తుత భారత్ 1.43 బిలియన్ జనభా సంఖ్య 2050 నాటికి 1.67 బిలియన్లకు చేరుతుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. ► దేశంలో బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. రుణ వృద్ధి భారీగా మెరుగుపడే అవకాశం కనిపిస్తోంది. ► దేశ జనాభా, ఆర్థిక వ్యవస్థ రెండూ రాబోయే దశాబ్దాల్లో వేగంగా వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాము. చైనా తరహాలో కాకుండా భారత్‌తో పాశ్చాత్య దేశాలకు సన్నిహిత సంబంధాలు ఉండడం సానుకూల పరిణామాలకు దారితీసే అంశం. ► ఒకప్పుడు నిషేధానికి గురయిన నరేంద్ర మోడీ, ఇప్పుడు భారత్‌లో రాజకీయంగా ఆధిపత్య ప్రధాన మంత్రిగా వాషింగ్టన్లో జో బిడెన్‌తో ఆలింగనం చేసుకుంటున్నారు. పారిస్‌లో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కూడా ఇదే అనుబంధం కొనసాగుతోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా శక్తివంతమైన దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు దీనినిబట్టి అర్థం అవుతోంది. ► 2023 నుంచి 2028 మధ్య భారత్ వార్షిక వృద్ధి సగటును 6 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేయడం మరో విశేషం. ఒక శాతం తగ్గినా 5 శాతం సుస్థిర వృద్ధి కొనసాగుతుంది. ► యువత అధికంగా ఉండడం, శ్రామికశక్తి తగినంత అందుబాటులో ఉండడం, ఆ శ్రామిక శక్తి నాణ్యతను మెరుగుపరిచే సామర్థ్యం, అధిక పొదుపు రేటు, వృద్ధిపై విస్తృత స్థాయి ఆశలు భారత్‌కు సంబంధించి చెప్పుకోవాల్సిన మరికొన్ని అంశాలు. ► భారత్ విషయంలో 2050 వరకూ సగటు వృద్ధి 5 శాతంగా నమోదయితే, అమెరికా వృద్ధి రేటు 1.4 శాతంగా ఉండే వీలుంది. ► భారత్ జీడీపీలో అధిక భాగం దేశీయ వినియోగం నుంచే సమకూరుతోందని, కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరికొన్ని నెలల పాటు నిదానించినా, దేశీ వినియోగంతో భారత్ బలంగా నిలబడుతుందని ప్రపంచబ్యాక్ అధ్యక్షుడు అజయ్ బంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఎనమిస్ట్ మారి్టన్ వోల్ఫ్ భారత్‌కు సానుకూలంగా ఇచి్చన ప్రకటన దేశాభివృద్ధికి భరోసాను ఇస్తోంది. మొండిబకాయిలు తగ్గుతుండడం హర్షణీయం: ఎస్అండ్పీ ఇదిలావుండగా, బ్యాంకింగ్ మొండిబకాయిలు తగ్గుతుండడం భారత్ ఎకానమీకి లాభిస్తున్న అంశమని ఎస్అండ్పీ ప్రైమరీ క్రెడిట్ విశ్లేషకులు దీపాలి సేథ్ ఛాబ్రియా పేర్కొన్నారు. ఎకానమీ పురోగతి నేపథయంలో 2025 మార్చి నాటికి బలహీన బకాయిల పరిమాణం మొత్తం రుణాల్లో 3 నుంచి 3.5 శాతం శ్రేణికి పడిపోతాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2024–26 మధ్య భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 నుంచి 7.1 శాతం మేర నమోదుకావచ్చని ఎస్అండ్పీ మిడ్ ఇయర్ గ్లోబల్ బ్యాంక్ అవుట్‌లుక్ పేర్కొంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కూడా భారత్ కొనసాగుతుందని విశ్లేíÙంచింది. ద్రవ్యోల్బణం సమస్య ఉన్నప్పటికీ, దీనిని దేశం అధిగమించగలదన్న విశ్వాసాన్ని దీపాలి సేథ్ ఛాబ్రియా వ్యక్తం చేశారు. -
రష్యాపై ఎందుకీ తటస్థ వైఖరి?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని నిర్మించే ప్రయత్నాలు నిలిచిపోయాయి. ఒకప్పుడు ఉక్రెయిన్ అనుకూల వైఖరిని తీసుకున్న దేశాలు కూడా రష్యాకు అనుకూలంగానో, తటస్థంగానో మారిపోయాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలోని అలీనోద్యమం నుంచి ప్రస్తుత జాగరూకత, తటస్థ వైఖరి ప్రభావితమయ్యాయి. తమ నిబంధనల మేరకు వ్యవహరించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ అలీనోద్యమం ఒక మార్గం కల్పించింది. నిర్దిష్ట ఆర్థిక, రాజకీయ ప్రోత్సాహకాలు కూడా ఇందులో ప్రభావం చూపుతున్నాయి. అయితే, అలీన దేశాలకు మానవతా సాయం అందించాలన్న పాశ్చాత్య దేశాల నిబంధనల వెలుగులో ఈ తటస్థత అనేది ఒక ‘గమ్మత్తయిన సంతులన చర్య’గా మారుతోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది దాటిన తర్వాత, రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని నిర్మించే ప్రయత్నాలు నిలిచిపోయినట్లు కనిపిస్తోంది. చాలాదేశాలు తటస్థతను ఎంచుకోవడమే దీనికి కారణం. కొన్ని ఆధారాల ప్రకారం, రష్యాను ఖండిస్తున్న దేశాల సంఖ్య కూడా ప్రస్తుతం తగ్గిపోయింది. ఉక్రెయిన్ అనుకూల వైఖరి నుండి బోట్స్ వానా రష్యా పైవు మళ్లింది. దక్షిణాఫ్రికా, తటస్థత నుంచి రష్యా అనుకూల వైఖరి చూపుతోంది. రష్యా చర్యను ఖండించిన కొలంబియా ఇప్పుడు తటస్థ వైఖరి అవలంబిస్తోంది. అదే సమయంలో, చాలా దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి అయిష్టత చూపుతున్నాయి. ఆఫ్రికాను తీసుకుందాం. మాస్కో తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని ఆఫ్రికన్ యూనియన్ పిలుపునిస్తున్నప్పటికీ, అనేక ఆఫ్రికా ఖండ దేశాలు తటస్థంగానే ఉంటున్నాయి. ఇది ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి వామపక్ష అనుకూల ప్రభుత్వాల సంప్రదాయ ఫలితమేనని కొందరు పరిశీలకులు వాదిస్తు న్నారు. ఆఫ్రికా దేశాల అయిష్టతకు మూలం తమ అంతర్గత వ్యవహారాల్లో కొన్నిసార్లు రహస్యంగా, కొన్నిసార్లు బహిరంగంగా పాశ్చాత్య దేశాలు పాటించిన జోక్యందారీ చరిత్రలో ఉందని మరికొందరు చెబుతున్నారు. రష్యాను ఖండించడానికి అయిష్టత చూపడం అనేది ఆఫ్రికాను దాటిపోయింది. రష్యా బేషరతుగా, తక్షణం ఉక్రెయిన్ నుంచి వెళ్లి పోవాలంటూ ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని 2023 ఫిబ్రవరిలో లాటిన్ అమెరికన్ దేశాల్లో చాలావరకు బలపర్చాయి. ఉక్రెయిన్‌కి అనుకూలంగా ఐక్యరాజ్యసమితి చేసిన పలు తీర్మానాలను బ్రెజిల్ బలపర్చినప్పటికీ, అది రష్యాను నిర్ద్వంద్వంగా ఖండించలేదు. ఐక్యరాజ్య సమితిలో బొలీవియా, క్యూబా, ఎల్ సాల్వడార్, వెనిజులా దేశాల వైఖరిని చూద్దాం. పాశ్చాత్య దేశాల ఆంక్షలను రష్యా తిప్పి కొట్టాలని అవి సూచించాయి. పైగా, బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ దేశాలు ఉక్రెయిన్ కు సైనిక సహాయం చేయాలన్న పిలుపును తిరస్కరించాయి. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు అందించాలని జర్మనీ తీసుకున్న నిర్ణయాన్ని మెక్సికో ప్రశ్నించింది. ఆసియాలోనూ ఇదే రకమైన విభజనలు కనిపిస్తున్నాయి. జపాన్, దక్షిణ కొరియా బహిరంగంగానే రష్యాను ఖండించాయి. కానీ ఆగ్నే యాసియా దేశాల కూటమి సామూహికంగా ఈ ఖండన చేయలేదు. ఇక చైనా విషయానికొస్తే – రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం నెరుపుతూనే, ఐక్యరాజ్యసమితిలో పెరుగుతున్న తన ప్రాభవం ద్వారా సమతుల్యత సాధించేలా వ్యవహరిస్తోంది. భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశంగా ఉన్నప్పుడు, ఉక్రెయిన్ ఘర్షణపై జరిగిన ఓటింగుకు గైర్హాజరైంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలోని అలీనోద్యమం నుంచి ప్రస్తుత జాగరూకత, తటస్థ వైఖరి ప్రభావితమయ్యాయి. తమ నిబంధనల మేరకు ఘర్షణతో పోరాడటానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అలీనోద్యమం ఒక మార్గం కల్పించింది. అందువల్ల సోవియట్ యూనియన్, పాశ్చాత్య దేశాల ప్రభావ పరిధికి వెలుపల విదేశీ విధానంలో స్వయంప్రతిపత్తిని ఈ దేశాలు పొందగలిగాయి. యూరోపియన్ యూనియన్ వైఖరిని బలపర్చడంలో ఇతర దేశాల అయిష్టత అనేది విదేశీ విధాన స్వతంత్ర కాక్షకూ, పొరుగు దేశంతో విరోధం పెట్టుకోవడానికి అయిష్టతకూ సంబంధించినదిగా ఉంటోందని యూరోపియన్ యూనియన్ ఆంక్షల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పశ్చిమ దేశాలకూ, రష్యాకూ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లో చిక్కుకుపోకుండా ఉండటానికి అలీన విధానం ఆయా దేశాలకు ఉపకరిస్తోంది. ఈ కారణం వల్లే, అనేక ప్రజాస్వామిక దేశాలు తటస్థ వైఖరికి ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంపోసా ‘ఇరుపక్షాలతో మాట్లాడండి’ అనడంలో దీన్నే మనం చూడవచ్చు. రష్యాను ఖండించ డానికి వ్యతిరేకంగా ఉండాలని దేశాలు నిర్ణయించుకోవడంలో నిర్దిష్ట ఆర్థిక, రాజకీయ ప్రోత్సాహకాలు ప్రభావం చూపుతున్నాయి. ఇండియాకు పెరిగిన రష్యా చమురు ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో రష్యా, భారత్ ఒకే విధమైన వ్యూహాత్మక, రాజకీయ అభిప్రాయాలను పంచుకోవడం కొనసాగించాయని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. 2000 సంవత్సరంలో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం నేపథ్యంలో బహుళ ధ్రువ గ్లోబల్ వ్యవస్థను నిర్మించాలన్నది రష్యా ఉద్దేశంగా ఉండింది. అమెరికాను భాగస్వామిగా చేసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండాలని భారతదేశాన్ని రష్యా అభ్యర్థించేది. అలాగే భారతీయ అణ్వాయుధ కార్యక్రమానికి రష్యా మద్దతునిచ్చింది, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా మారడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను రష్యా బలపరుస్తూ వచ్చింది. భారత్ ఆయుధ వాణిజ్యంలో రష్యా కీలక భాగస్వామిగా ఉండ టాన్ని రష్యా కొనసాగించింది. 1992 నుంచి 2021 వరకు భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 65 శాతం వరకు రష్యా సరఫరా చేసింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి, భారత్‌కు చౌక ధరకు చమురు అందించే కీలకమైన సరఫరాదారుగా రష్యా మారి పోయింది. 2021లో రష్యా నుంచి రోజుకు 50 వేల బ్యారెల్స్‌ను భారత్ కొనుగోలు చేయగా, 2022 జూన్ నాటికి అది రోజుకు పది లక్షల బ్యారెల్స్‌కు పెరిగింది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా ప్రయోజనాలు ప్రపంచంలోనే అత్యంత పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారుల్లో ఒక్కటిగా ఉన్న బ్రెజిల్ అత్యధిక ఎరువుల వినియోగదారు కూడా. 2021లో రష్యా నుంచి బ్రెజిల్ దిగుమతి చేసుకున్న దిగుమతుల విలువ 5.58 బిలియన్ డాలర్లు కాగా, వాటిలో 64 శాతం వాటా ఎరు వులదే. తమ రెండు దేశాల మధ్య ఇంధన సంబంధాలను విస్తరించుకోవడంలో భాగంగా రష్యా గ్యాస్ సంస్థ గాజ్ప్రోమ్ బ్రెజిల్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెడుతుందని 2023 ఫిబ్రవరిలో బ్రెజిల్ ప్రక టించింది. 2023 మార్చి నాటికి బ్రెజిల్‌కు రష్యా డీజిల్ ఎగుమతులు కొత్త రికార్డులను చేరుకున్నాయి. అదే సమయంలో రష్యన్ చమురు ఉత్పత్తులపై ఈయూ ఆంక్షలు కూడా పతాక స్థాయిని చేరుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సంద ర్భంలో– రష్యా, చైనాలతో కలిసి దక్షిణాఫ్రికా సంయుక్త నౌకా విన్యా సాలను చేపట్టింది. నౌకాదళ నిధుల లేమితో ఉన్న దక్షిణాఫ్రికా ఈ విన్యాసాల నుంచి ప్రయోజనం పొందుతుంది. ఆఫ్రికా ఖండానికి అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా రష్యా నిలుస్తోంది. అణుశక్తిని కూడా రష్యా సరఫరా చేస్తోంది. ఆఫ్రికా ఖండానికి 30 శాతం వరకు గోధుమ వంటి ధాన్యాలను కూడా రష్యా సరఫరా చేస్తోంది. రష్యా ఉత్పత్తుల్లో 70 శాతం వరకు ఆఫ్రికా ఖండానికి చేరుతున్నాయి. మరొక ప్రజాస్వామిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు మద్దతుగా నిలబడాలని అభ్యర్థనలు చేస్తున్నప్పటికీ, అలీన విధానం ఇప్పటికీ పాపులర్ ఎంపికగా కొనసాగుతోందని ఉక్రెయిన్ యుద్ధం ఎత్తి చూపింది. భారత్ వంటి దేశాలకు ముఖ్యమైన రాజకీయ ఉనికిగా అలీన విధానం చాలాకాలంగా కొనసాగుతూ వస్తోంది. ఇతర ఉదంతాలను చూస్తే, అధ్యక్షుడు జైర్ బొల్సొనారో హయాంలో ఇది మారినప్పటికీ, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే బ్రెజిల్ వంటి దేశాల సంప్రదాయ విధానంగా కొనసాగుతోంది. ప్రత్యేకించి అలీన దేశాల్లో చాలావాటికి ప్రత్యక్ష మదుపులు, అభివృద్ధి, మానవతా సహాయాన్ని అందించడం అనే పాశ్చాత్య నిబంధనల వెలుగులో చూస్తే ఇది విరుద్ధ ప్రయోజనాల ఘర్షణకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో తటస్థత అనేది ఒక ‘గమ్మత్తయిన సంతులన చర్య’గా మారుతోంది. జోస్ కబల్లెరో వ్యాసకర్త సీనియర్ ఆర్థికవేత్త (‘ద కాన్వర్సేషన్’ సౌజన్యంతో) -
పాశ్చాత్య బాణీలకు నృత్యం చేయాలా?
యూఎన్ ఛార్టర్ ప్రకారం సార్వభౌమత్వం అన్ని దేశాలకు సమానంగా వర్తిస్తుంది. కానీ ఈ విషయాన్ని అంగీకరించేందుకు పాశ్చాత్య దేశాలు సిద్ధంగా లేవు. అందుకే ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తున్నాయి. నిజానికి ఉక్రెయిన్ వ్యవహారం ఐక్యరాజ్య సమితి పరిధి లోనిది. జీ20 అజెండాలో లేదు. కానీ పశ్చిమ దేశాలు దీన్ని చాలా దురుసుగా అజెండాలోకి చేర్చాయి. యూరప్ సమస్యలను ఉద్దేశపూర్వకంగానే ప్రపంచ సమస్యలుగా చూపెట్టే ప్రయత్నం జరుగుతోందని భారత్ స్పష్టం చేసింది. జీ20 అధ్యక్ష స్థానంలో భారత్ ప్రతిపాదించిన అజెండా అమలు చేయడం ద్వారా మాత్రమే భిన్నధ్రువ దౌత్యం విషయంలో నమ్మకం పెరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముక్కలు కాకుండా ఉంటుంది. అంతర్జాతీయ అధికార పీఠాలిప్పుడు కదు లుతున్నాయి. నిన్నమొన్నటివరకూ కొందరికి అనుకూలంగా ఉన్న ప్రపంచం కాస్తా భిన్న ధ్రువమవుతోంది. అధికార మిప్పుడు అన్ని దిక్కులా విస్తరిస్తోంది. మునుపటితో పోలిస్తే ప్రపంచ వ్యవహారాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల మాటలిప్పుడు ఎక్కువగా చెల్లుబాటు అవుతున్నాయి. అయితే ఈ మార్పులను జీర్ణించుకునే పరి స్థితుల్లో పశ్చిమ దేశాల్లేవు. దేశాల సర్వసమానత్వం ఆధారంగా ప్రస్తు తమున్న అధికార వ్యవస్థ వీరికిప్పుడు అకస్మాత్తుగా చేదవుతోంది. యూఎన్ ఛార్టర్ ప్రకారం సార్వభౌమత్వం అన్ని దేశాలకు సమానంగా వర్తిస్తుంది. కానీ ఈ విషయాన్ని అంగీకరించేందుకు అవి సిద్ధంగా లేవు. అందుకే ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తున్నాయి. ఇతర దేశాల వ్యవహారల్లో ప్రత్యక్షంగా కలుగచేసుకోవడం, పరోక్ష పద్ధతుల్లో యుద్ధం చేయడం... తమను ధిక్కరించే వారిపై పశ్చిమ దేశాలు చేసే ప్రయత్నాలన్నది తెలిసిన విషయమే. నిర్మాణాత్మక సహకారం కంటే పోటీతత్వానికి ఎక్కువ ఆదరణ ఉన్న సమయమిది. ఇంధన, ఆహార రంగాలు అస్థిరంగా ఉన్న పరిస్థితులను చూస్తున్నాం. వాతావరణ మార్పులు, అధిక ద్రవ్యోల్బణం లాంటి మానవీయ సంక్షోభాలిప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సంస్థలన్నీ అందరికీ ప్రయోజనకరమైన అంశాలపై, ఒప్పందాల అమలుపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఎనభై శాతం జీడీపీ జీ20 దేశాల్లోనే.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య అంశాల్లో సహకారం కోసం జీ20 ఏర్పాటైంది. ఈ ఇరవై దేశాల జాతీయ స్థూల ఉత్పత్తి ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాదాపుగా 80 శాతం వరకూ ఉండటం గమనార్హం. అంతర్జాతీయ వాణిజ్యం, కర్బన ఉద్గారాలూ ఎక్కువే. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల జనాభా ఈ జీ20 దేశాల్లోనే ఉంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాల పరిష్కారానికి తగిన సామర్థ్యమూ కలిగి ఉందీ వేదిక. ప్రపంచం మాంద్యం ముంగిట్లో నిలిచిన ఈ తరుణంలో జీ20 మరింత ఆలస్యం చేయడం ఏమాత్రం తగదు. జీ20 అధ్యక్ష స్థానంలో భారత్ ప్రతిపాదించిన అజెండా అమలు చేయడం ద్వారా మాత్రమే భిన్నధ్రువ దౌత్యం విషయంలో నమ్మకం పెరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముక్కలు కాకుండా ఉంటుంది. పారిశ్రామిక వృద్ధి మళ్లీ పట్టాలు ఎక్కుతుంది. అభివృద్ధి చెందిన దేశాలతోపాటు ఎదుగుతున్న మార్కెట్లతోనూ భారత్‌కు సత్సంబంధాలున్నాయి. కాబట్టి భారత్ ప్రతిపాదించిన అజెండాతో లక్ష్యాల సాధన కష్టమేమీ కాబోదు. భారత్ ప్రాథమ్యాలతో రష్యా పూర్తిగా ఏకీభవిస్తోంది. ఎంచుకున్న లక్ష్యాలను పూర్తి చేయడం వల్ల అనూహ్యమైన సాంఘిక, ఆర్థిక సమస్యలు, ప్రపంచస్థాయి సవాళ్లను సమర్థంగా ఎదుర్కో వచ్చునని రష్యా కూడా భావిస్తోంది. మార్చి 1, 2 తేదీల్లో జరిగిన జీ20 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల సమావేశాలు ఐక్యరాజ్యసమితి పాత్రతోపాటు బహుముఖ ప్రపంచ ప్రాముఖ్యతను మరోసారి స్పష్టం చేశాయి. అజెండాలో కీలకమైన అంశాలను జొప్పించేందుకు భారత్ అనుసరించిన నిర్మాణాత్మక విధానం, సమతౌల్యతలను ప్రశంసించి తీరాలి. ఐక్యరాజ్యసమితి అంశం జీ20లోనా? నిజానికి ఉక్రెయిన్ వ్యవహారం ఐక్యరాజ్య సమితి పరిధి లోనిది. జీ20 అజెండాలో లేదు. కానీ పశ్చిమ దేశాలు దీన్ని చాలా దురుసుగా అజెండాలోకి చేర్చాయి. రష్యాని తెగనాడటంపైనే ప్రపంచ భవిష్యత్తు ఆధారపడిందేమో అన్నంత హడావుడి చేశాయి. వ్యూహాత్మకంగా రష్యా ఓటమిని చూడాలని పాశ్చాత్య దేశాలు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. యూరప్ సమస్యలను ఉద్దేశపూర్వకంగానే ప్రపంచ సమస్యలుగా చూపెట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. రష్యాతో సహా యూరప్ దేశాలు ఇప్పటికే విదేశీ బాణీలకు నృత్యం చేస్తూ వస్తున్నాయి. అయితే ఇది భద్రతకు సంబంధించిన అంశం. ‘నాటు నాటు’ డ్యాన్స్ కాదు. ఈ విషయంలో ప్రధాన ముద్దాయి కచ్చితంగా అమెరికా. దీని లక్ష్యం ఒక్కటే. తనను ఎవరూ ప్రశ్నించరాదు! రష్యాను అణచివేసేందుకు ఉక్రెయిన్ను ఒక పనిముట్టుగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. తద్వారా ప్రపంచం మొత్తం పరోక్షంగా తన ఆధిపత్యాన్ని అంగీకరించాలన్నది అమెరికా లక్ష్యం. 2009 సెప్టెంబరులో జీ20 వేదిక లక్ష్యాల్లో అంతర్జాతీయ ఆర్థిక సహకారం ఒకటని తీర్మానించారు. ఇందుకు తగ్గట్టుగా జీ20 తన దృష్టిని ప్రపంచ ఆర్థిక, సామాజిక సమస్యలపై కేంద్రీకరించాలి. ఉక్రెయి¯Œ వంటి అంశాలను చేర్చడం వల్ల జీ20 లక్ష్యం విఫలమ వుతుంది. రష్యా దీన్ని కోరుకోవడం లేదు. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో ఈ అంశాలన్నింటిపై చర్చలు జరిపేందుకు రష్యా సిద్ధంగానే ఉంది. జీ20 అజెండా మాత్రం హైజాక్ కారాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. భారత్ లేవనెత్తిన ఉగ్రవాదం, మత్తుమందులు, ప్రకృతి వైపరీత్యాల విషయం మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఉగ్రవాదం పెరుగుదలకు సార్వభౌమ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కారణమని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అత్యధికులు అంగీకరిస్తారు. ఇందుకు ఒకప్పటి యుగోస్లేవియాతోపాటు లిబియా, ఇరాక్, సిరియా, అఫ్గాని స్తాన్లే ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ దేశాల్లో ‘నాటో’ వ్యవహారాలు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇప్పుడు అది అటు పసఫిక్లో, ఇటు ఆసియాలో తూర్పుదిక్కుగా మరింతగా విస్తరించాలని అనుకుంటోంది. ఈ పరిణామం మరిన్ని ఘర్షణలకు దారితీస్తుంది. యూరప్ దేశాల్లో మాదిరిగా విభజనకు దారితీస్తుంది. నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైపులైన్‌ను అనూహ్యంగా ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి అసలు దోషులెవరన్నది ఎప్పటికైనా కచ్చితంగా తేలుతుంది. ఇరాక్‌లో నాటో చేసిన ఇతర ‘మంచి పనుల’ విషయం కూడా! అన్యాయమైన ఆంక్షలు, దేశాల మధ్య సరుకుల రవాణాను కృత్రిమంగా పాడు చేయడం వంటివి ఉక్రెయి¯Œ సమస్యకు మూల కారణాలు... తనను తాను రక్షించుకోవాలనుకుంటున్న రష్యా కాదు. ఈ విషయంపై ప్రజల్లో అపోహలు ఉన్న నేపథ్యంలో ఒక్క విషయాన్ని స్పష్టం చేయాలి. ఉక్రెయి¯Œ పై సైనిక దాడి చేయాలన్నది రష్యా ముందున్న అవకాశాల్లో ఒకటి కానేకాదు. రష్యా సార్వభౌమత్వానికి నేరుగా ముప్పు ఏర్పడటం, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం వంటి చర్యలకు ప్రతిగా తీసుకున్న నిర్ణయం మాత్రమే. పాశ్చాత్య దేశాల చేతుల్లో ఆర్థిక సంబంధాలు ఆయుధాలుగా మారిపోయాయి. ఫలితంగా ఇప్పటికే అంతర్జాతీయ ఆహార రంగం గతి తప్పి ధరలు పెరిగాయి. రష్యాతోపాటు ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఆ భారాన్ని మోయాల్సిన పరిస్థితి వచ్చింది. నెపం మొత్తం రష్యాపై నెట్టాలన్నది నిలబడేది కాదు. జీ20 అజెండా అమలు కావాలనుకుంటే దాన్ని తిరస్కరించాలి కూడా. జీ20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌తో కలిసి పనిచేసేందుకు రష్యా కట్టుబడి ఉంది. మంత్రుల స్థాయి సమావేశాలన్నింటిలో చురుకుగా పాల్గొంటోంది. లక్ష్యాల సాధనలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు, తగిన ఫలితాలు రాబట్టేందుకు తగినంత వెసులుబాటుతో వ్యహరించేందుకు సిద్ధంగా ఉన్నాం. దక్షిణాది దేశాలు ఎదుర్కోగల సమస్యల పరిష్కారం కంటే తమ వ్యూహాత్మక అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వారు నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం కూడా ఇదే! డెన్నిస్ అలిపోవ్ వ్యాసకర్త భారత్‌లో రష్యా రాయబారి (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
Generation-Z: వీకెండ్ కాపురాలు..రెండు రోజులు మాత్రమే ఒకరికొకరు
పెళ్లంటే రెండు జీవితాల కలయిక. నిండు నూరేళ్ల సావాసం. ఎన్ని కష్టనష్టాలెదురైనా జీవితాంతం ఒకరి చేయి మరొకరు విడిచిపెట్టకూడదు. ఒకేచోట కలిసుంటేనే బంధం బలపడుతుంది... ఇన్నాళ్లూ పెళ్లికి మనకి ఈ అర్థాలే తెలుసు... కానీ... నేటి జనరేషన్ జెడ్ పెళ్లికి కొత్త భాష్యాలు చెబుతోంది. ‘ఎవరి జీవితం వారిది. ఎవరి ఆర్థిక స్వాతంత్య్రం వారిది. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఒకరి కోసం మరొకరు వాటిని వదులుకోనక్కర్లేదు. అందమైన జీవితాన్ని మూడు ముళ్లతో బంధించి జీవితాంతం రాజీ పడనక్కర్లేదు’ వంటి ఆలోచనల నుంచి వీకెండ్ మ్యారేజెస్ కాన్సెప్టు పుట్టుకొచ్చింది. జపాన్లోనైతే ఇవి ట్రెండుగా మారాయి. భారత్‌లోనూ మెల్లిగా తెరపైకి వస్తున్నాయి... వీకెండ్ మ్యారేజెస్ అంటే..? ఇవాళ రేపు ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని లేదు. భర్త బయట పని చేసి డబ్బు సంపాదిస్తే, భార్య ఇంటిని చక్కదిద్దుకుంటూ గృహిణి జీవితం గడిపే రోజులు పోయాయి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి, జీవితంలో సర్దుకుపోవడానికి ససేమిరా అంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని బిజీ లైఫ్‌లో గడిపేస్తున్నారు. అందుకే పెళ్లి చేసుకొని ఒకే చోట ఉండడం కంటే వీకెండ్స్‌లో కలిసి ఉండాలని ముందే ఒక అవగాహన కుదుర్చుకుంటున్నారు. వారంలో అయిదు రోజులు ఎవరి జీవితం వారిది, మిగిలిన రెండు రోజులు ఒకరికొకరుగా కలిసి జీవిస్తారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. గుండెల నిండా గూడు కట్టుకున్న ప్రేమని పంచుకుంటూ రెండు రోజులు రెండు క్షణాల్లా గడిపేస్తారు. వీకెండ్ కాపురాలకు కారణాలు ► ఆఫీసులో పని ఒత్తిడితో ఆడ, మగ లైఫ్‌స్టైల్ వేర్వేరుగా ఉంటున్నాయి. ఒకరికి ఉదయం షిఫ్ట్ అయితే మరొకరికి రాత్రి షిఫ్ట్ ఉంటుంది. ఒకరి ఆఫీసు ఊరికి ఒక మూల ఉంటే, మరొకరిది మరో మూల ఉంటుంది. దీంతో ఒకేచోట కలిసుండే పరిస్థితి ఉండడం లేదు ► పెళ్లి చేసుకున్నా ఇద్దరిలో ఎవరికి వారే తాము పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. ► ముఖపరిచయం కూడా లేకుండా పెళ్లి చూపుల్లోనే ఒకరినొకరు చూసుకునే జంటలు ఒకరితో ఒకరు ఎంతవరకు జెల్ అవగలరో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ముందుగా వీకెండ్స్‌లో కలిసుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ► భార్యాభర్తలకి ఒకరి నుంచి మరొకరికి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. ఆఫీసు నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చిన వారికి భాగస్వామి తమకి అనుకూలంగా లేకపోతే చిర్రెత్తుకొచ్చి దెబ్బలాటలకి దారి తీస్తాయి. అదే వీకెండ్స్‌లో మాత్రమే కలిస్తే, కలిసుండేది కాస్త సమయమైనా హాయిగా గడుపుదామని అనిపిస్తుంది. మళ్లీ వారం వరకు చూడలేమన్న ఫీల్‌తో ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగుకొస్తుంది. సర్ప్రైజ్లు, రొమాన్స్‌లు కొత్తగా వింతగా అనిపించి మానసికంగా ఎనలేని సంతృప్తి ఉంటుంది. ► ఆర్థికంగా ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. ఎవరికి వారు వాళ్ల ఇళ్లల్లో ఉంటారు కాబట్టి డబ్బుల్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ► అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఈ మధ్య అందరూ తమకి మాత్రమే సొంతమైన ఒక స్పేస్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. వీకెండ్ కాపురాల్లో ఎవరికి కావల్సినంత స్పేస్ వారికి దొరుకుతుంది. భారత్‌లో కుదిరే పనేనా..? వీకెండ్ పెళ్లి పేరుతో వారానికోసారి కలుస్తామంటే అంగీకరించే సామాజిక పరిస్థితులు భారత్‌లో లేవు. ముంబైలాంటి నగరాల్లో కొందరు ప్రయోగాత్మకంగా వీకెండ్ కాపురాలు మొదలు పెట్టారు. ఆఫీసులు చెరో మూల ఉన్నప్పుడు ఇలా వీకెండ్స్‌లో కలవడమే బెటర్ అని నిర్ణయించుకునే జంటలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజంతా ట్రాఫిక్ జామ్‌లో పడి ఏ రాత్రికో ఉసూరంటూ ఇంటికి చేరడానికి బదులుగా ఎవరిళ్లలో వారుంటూ వీకెండ్ వరకు ఎదురు చూడడమే మంచిదన్న అభిప్రాయానికి నేటితరం వస్తున్నా కుటుంబాలైతే అంగీకరించడం లేదు. మన దేశంలో పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. వడం. కనుక öన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు తప్పనిసరి. పెళ్లి చేసుకుంటే ఒక కమిట్మెంట్తో ఉండాలి. జపాన్, చైనా వంటి దేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి యువతరం విముఖంగా ఉంటోంది. ఏళ్ల తరబడి పిల్లల్ని కనొద్దని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలే శాపంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పసిపాపల బోసినవ్వులు కనిపించి ఏళ్లవుతున్నాయి. అందుకే పెళ్లి చేసుకొని వారంలో రెండు రోజులైనా కలిసుంటే చాలన్న స్థితి వచ్చింది. మన దగ్గర ఆలా కాదు. ముఖ్యంగా పిల్లలు పుడితే ఏం చేస్తారు ? తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ మధ్య పెరగాల్సిన పిల్లల్ని కూడా వారానికొకరని పంచుకోవడం అసాధ్యం. వ్యక్తిత్వం, ఆర్థిక స్వాతంత్య్రం పేరుతో వీకెండ్ కాపురాలు చేయాలని యువతరం భావించినా పెద్దలు వారిని అడ్డుకుంటున్నారు. అందుకే భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటోంది. ‘‘భారత్‌లో పెళ్లికి ఒక పవిత్రత ఉంది. దాన్నో ప్రయోగంగా మార్చాలని ఎవరూ అనుకోరు. ఇద్దరూ వారంలో రెండు రోజులు మాత్రమే కలిసుంటే వారిద్దరి మధ్య పరస్పర నమ్మకం, అవగాహన ఏర్పడడం కష్టం. భాగస్వామిలోనున్న లోపాలను కూడా ప్రేమించగలిగినప్పుడే ఆ వివాహం పదికాలాలు పచ్చగా ఉంటుంది. కానీ లోపాలను కప్పిపుచ్చుకుంటూ మనలో ఉన్న మంచిని మాత్రమే అవతలి వ్యక్తికి చూపించాలనుకున్నప్పుడు పెళ్లి అన్న పదానికే అర్థం లేకుండా పోతుంది’’ – శ్రేయా కౌలమ్, సైకాలజిస్ట్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తే ప్రపంచ వినాశనమే.. రష్యా హెచ్చరిక
కీవ్: ఉక్రెయిన్‌కు శక్తివంతమైన ఆయుధాలిచ్చి తమను తాము నాశనం చేసుకోవద్దని పశ్చిమదేశాలకు రష్యా పార్లమెంట్ స్పీకర్ వ్యాచెస్లావ్ వొలోదిన్ హెచ్చరించారు. ఎదురుదాడులకు ఉపయోగపడే ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందజేస్తే, తాము మరింత శక్తివంతమైన ఆయుధాలను వాడాల్సి వస్తుందని, అంతిమంగా ప్రపంచ వినాశనానికే దారి తీస్తుందన్నారు. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు మినహా గగనతల రక్షణ వ్యవస్థలు తదితరాలను అందజేస్తామంటూ నాటో, అమెరికా ఇస్తున్న హామీలపై ఆయన ఆదివారం ఈ మేరకు స్పందించారు. చదవండి: పెరూలో ఆందోళనలు హింసాత్మకం -
పుతిన్‌తో పెట్టుకుంటే అంతే!.. ఆ దేశాలకు చమురు ఎగుమతులు బంద్
మాస్కో: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తున్న రష్యాను కట్టడి చేసేందుకు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రష్యాకు ప్రధాన వనరుగా ఉన్న చమురు ఉత్పత్తులపై ప్రైస్క్యాప్ విధించి ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. అయితే, తాజాగా ఆయా దేశాలకు గట్టి షాక్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పశ్చిమ దేశాల ప్రైస్ క్యాప్‌కు కౌంటర్ ఇవ్వాలని సుదీర్ఘ కాలంగా భావిస్తున్న పుతిన్ తాజాగా ఆ దిశగా అడుగు వేశారు. ప్రైస్ క్యాప్ విధించిన దేశాలకు చమురు, చమురు ఉత్పత్తులను ఎగుమతి చేయకూడదనే ఆదేశాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయం వచ్చే ఏడాది జులై వరకు అమలులో ఉండనుంది. ఐరోపా సమాఖ్యలోని ఏడు పెద్ద దేశాలు, ఆస్ట్రేలియాలు రష్యా సముద్రం నుంచి ఉత్పత్తి చేస్తున్న ఆయిల్‌పై ప్రైస్ క్యాప్‌ను బ్యారెల్‌కు 60 డాలర్లుగా నిర్ణయించాయి. దానిని డిసెంబర్ 5 నుంచి అమలులోకి తీసుకొచ్చాయి. ఈ నిర్ణయానికి తాజాగా కౌంటర్ ఇచ్చింది క్రెమ్లిన్. చమురు ఎగుమతులను నిలిపివేస్తూ తీసుకొచ్చిన ఆదేశాలు 2023 ఫిబ్రవరి 1 నుంచి జులై 1 2023 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం ముడి చమురు ఎగుమతులపై నిషేదం ఫిబ్రవరి 1 నుంచే అమలులోకి వస్తుండగా.. చమురు ఉత్పత్తులపై బ్యాన్ ఎప్పటి నుంచి ఉంటుందనే విషయాన్ని రష్యా ప్రభుత్వం వెల్లడించలేదు. మరోవైపు.. ఈ ఆదేశాల్లో ప్రత్యేక క్లాజ్‌ను ఏర్పాటు చేసింది రష్యా ప్రభుత్వం. ప్రత్యేకమైన సందర్భంలో ఈ బ్యాన్‌ను అధ్యక్షుడు పుతిన్ ఎత్తివేసే అవకాశం కల్పించింది. ఇదీ చదవండి: అమెరికాలోని ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టిన పాకిస్థాన్ -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు 3 లక్షల రిజర్వు సేనలు
మాస్కో: ఉక్రెయిన్‌లో భారీ ఎదురుదెబ్బల నేపథ్యంలో ఏకంగా 3 లక్షల రిజర్వు దళాలను తక్షణం యుద్ధ రంగానికి తరలించాలని రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు ఆదేశించారు. బుధవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌తో పాటు మొత్తం పాశ్చాత్య దేశాల సంఘటిత యుద్ధ వ్యవస్థతో తాము పోరాడుతున్నామని ఈ సందర్భంగా వాపోయారు. ‘‘పోరు బాగా విస్తరించింది. సరిహద్దుల్లోనూ, విముక్త ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్ నిత్యం కాల్పులకు తెగబడుతోంది. దాంతో ఈ చర్య తీసుకుంటున్నాం’’ అని ప్రకటించారు. అమెరికా సారథ్యంలో పాశ్చాత్య దేశాలు అణు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ‘‘రష్యాను బలహీనపరిచి, విభజించి, అంతిమంగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 1991లో సోవియట్ యూనియన్ను ముక్కలు చేశామని ఇప్పుడు బాహాటంగా ప్రకటించుకుంటున్నాయి. రష్యాకూ అదే గతి పట్టించాల్సిన సమయం వచ్చిందంటున్నాయి’’ అంటూ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తమ భూభాగాలను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు అన్ని రకాల ఆయుధ వ్యవస్థలనూ వాడుకుంటామంటూ నర్మగర్భ హెచ్చరికలు చేశారు. ఇది అన్యాపదేశంగా అణు దాడి హెచ్చరికేనంటూ యూరప్ దేశాలు మండిపడుతున్నాయి. రష్యా అంతటి దుస్సాహసం చేయకపోవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. పుతిన్ ప్రకటనను రష్యా బలహీనతకు ఉదాహరణగా, దురాక్రమణ విఫలమవుతోందనేందుకు రుజువుగా అమెరికా, బ్రిటన్ అభివర్ణించాయి. ఉక్రెయిన్‌తో పోరులో ఇప్పటిదాకా 5,937 మంది రష్యా సైనికులు మరణించినట్టు వెల్లడించారు. అయితే ఉక్రెయిన్ అంతకు పదింతల మంది సైనికులను కోల్పోయిందని చెప్పుకొచ్చారు. రష్యాను వీడుతున్న యువత పుతిన్ తమనూ నిర్బంధంగా యుద్ధానికి పంపుతారేమోనని రష్యా యువకులు భయపడుతున్నారు. బుధవారం ఆయన ప్రకటన వెలువడగానే వారు భారీ సంఖ్యలో అందుబాటులో ఉన్న విమానాల్లో దేశం వీడారు. దాంతో టికెట్లకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మాస్కో–ఇస్తాంబుల్ టికెట్ ఏకంగా 9 వేల డాలర్లు దాటింది. అయినా కొనేందుకు ఎగబడటంతో టికెట్లన్నీ హట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. రానున్న కొద్ది రోజుల దాకా అన్ని విమానాల్లోనూ సీట్లన్నీ నిండిపోయాయి. దాంతో రైలు తదితర మార్గాల వెదుకులాట మొదలైంది. -
రూ.10 వేల కోట్ల ఆదాయంపై కన్నేసిన బ్లూస్టార్
న్యూఢిల్లీ: ఎయిర్ కండిషనింగ్, వాణిజ్యపర రిఫ్రిజిరేటర్ల తయారీ దిగ్గజం బ్లూ స్టార్.. మధ్య కాలంలో తన ఆదాయాన్ని రూ.10,000 కోట్లకు పెంచు కోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఉత్తర అమెరికా, ఐరోపా మార్కెట్లలోకి ప్రవేశించాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ‘తదుపరి దశ వృద్ధిలో భాగంగా అంతర్జాతీయంగా ప్రధాన కంపెనీగా బ్లూస్టార్ మారుతుంది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాలలో మరింత విస్తరణ, వినూత్న ఉత్పత్తులు, పరిష్కారాల పరిచయంతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటామని బ్లూస్టార్ వెల్లడించింది. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటాం. వ్యయ నియంత్రణ చేపడతాం. భారతదేశం మాతృ కేంద్రంగా కొనసాగుతుంది. ఏసీలు, రిఫ్రిజిరేషన్‌కు సంబంధించి అన్ని విభాగాల్లో బ్లూ స్టార్ ప్రధాన బ్రాండ్‌గా ఉండడానికి కృషి చేస్తుంది. ఏసీలు, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తుల తయారీలో ముఖ్య కేంద్రంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది’ అని సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ వీర్ ఎస్ అద్వానీ తెలిపారు. కాగా 2021-22లో బ్లూ స్టార్ రూ.6,081 కోట్ల టర్నోవర్ సాధించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో 20 ఎకరాల్లో రూమ్ ఏసీల తయారీ కేంద్రం స్థాపిస్తోంది. ఈ కేంద్రం కోసం బ్లూ స్టార్ రూ.550 కోట్లు ఖర్చు చేస్తోంది. పూర్తి వార్షిక తయారీ సామర్థ్యం 12 లక్షల యూనిట్లుగా ఉండనుంది. -
ఖబడ్దార్! ఆ సంగతి మర్చిపోవద్దు.. పుతిన్ తీవ్ర హెచ్చరికలు
ఉక్రెయిన్‌కు లాంగ్–రేంజ్ రాకెట్ సిస్టమ్స్, ఇతర ఆయుధాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. తీరు మార్చుకోవాలని, తమ మాట వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇప్పటిదాకా ఎన్నడూ దాడి చేయని లక్ష్యాలపై దాడులకు దిగుతామని తేల్చిచెప్పారు. అయితే, ఆ లక్ష్యాలు ఏమిటన్నది బయటపెట్టలేదు. ఆదివారం ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత ఎక్కువ కాలం పొడిగించేందుకు పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయని, అందులో భాగంగానే ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎన్ని ఆయుధాలు అందజేసిన ఉక్రెయిన్ ప్రభుత్వం ఇంకా నష్టపోవడం తప్ప సాధించేదేమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రత్యర్థిని ఎలా దెబ్బకొట్టాలో తెలుసని, తమవద్ద కూడా ఆయుధాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దని పుతిన్ హెచ్చరించారు. -
ఆహార, ఇంధన సంక్షోభం పశ్చిమ దేశాల పుణ్యమే: పుతిన్
మాస్కో: ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతున్న ఆహార, ఇంధన సంక్షోభానికి పశ్చమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. తప్పులన్నీ అవి చేసి, ఇప్పుడు నెపాన్ని రష్యాపై మోపుతున్నాయంటూ మండిపడ్డారు. రష్యాపై అవి విధించిన ఆంక్షలు ప్రపంచ మార్కెట్లను మరింతగా కుంగదీయడం ఖాయంమని జోస్యం చెప్పారు. యూరప్ దేశాల మతిలేని విధానాల వల్లే రెండేళ్లుగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోందన్నారు. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులను రష్యా అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘ఇదంతా పశ్చిమ దేశాల తప్పుడు ప్రచారమే. ఉక్రెయిన్ తన రేవు పట్టణాల్లోని తీర జలాల నుంచి మందుపాతరలను తొలగించే పక్షంలో అక్కడి నుంచి ఆహార ధాన్యాల రవాణాకు భరోసా కల్పిస్తాం’’ అని పునరుద్ఘాటించారు. -
ఉక్రెయిన్‌కు మరింత మద్దతు.. ‘రష్యా పని పట్టడానికి అత్యాధునిక ఆయుధాలిస్తాం’
కీవ్: రష్యా పోరులో ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. అత్యాధునిక మధ్యశ్రేణి ఎం270 లాంచర్ రాకెట్ సిస్టమ్స్ అందజేస్తామని ఇంగ్లండ్ గురువారం ప్రకటించింది. 80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే రాకెట్లను ఇవ్వనున్నట్లు తెలిపింది. రష్యా వైమానిక దాడులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్‌కు అయుధాలు ఇస్తామని అమెరికా, జర్మనీ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ ఆయుధాలు అందేలోపే డోన్బాస్ను రష్యా పూర్తిగా ఆక్రమించుకొనేలా కనిపిస్తోందని సైనిక నిపుణులటున్నారు. అమెరికా ఆయుధాలు, సైనిక శిక్షకులు రావడానికి మరో మూడు వారాల సమయం పడుతుంది. ఉక్రెయిన్‌కు మరింత ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తామని స్వీడన్ కూడా ప్రకటించింది. యాంటీ–షిప్ క్షిపణులు, రైఫిళ్లు, యాంటీ–ట్యాంకు ఆయుధాలు సరఫరా చేస్తామంది. అమెరికా రాయబారిగా బ్రింక్ ఉక్రెయిన్‌లో అమెరికా కొత్త రాయబారిగా బ్రిడ్జెట్ బ్రింక్ నియమితులయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యూహాత్మక వైఫల్యంగా నిరూపిస్తానని ఆమె ఇటీవలే చెప్పారు. మమ్మల్ని రెచ్చగొడుతున్నారు: రష్యా పశ్చిమ దేశాలను మరిన్ని ఆయుధాలు కోరుతూ ఉక్రెయిన్ తమను నేరుగా రెచ్చగొడుతోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ దుయ్యబట్టరాఉ. ఈ ఆయుధాలతో యుద్ధం మరింత ఉధృతమవుతుందే తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. డోన్బాస్లో రష్యా దాడులు ఉధృతం డోన్బాస్లో రష్యా దళాలు దూసుకెళ్తున్నాయి. సెవెరోడొట్స్క్లో 80 శాతానికి పైగా భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. లుహాన్స్క్పైనా పట్టు రష్యా బిగుస్తోంది. జాపొరిజాజియాలోని కోమిషువాఖా పట్టణాన్ని పుతిన్ సేనలు చుట్టుముట్టాయి. పశ్చిమ లెవివ్‌లో రష్యా క్షిపణి దాడుల్లో రైల్వే లైన్లు ధ్వంసమయ్యాయి. దీనివల్ల పశ్చిమ దేశాల నుంచి ఆయుధాల చేరవేతకు ఆటంకం కలుగనుంది. రష్యన్గా భావించి ఉక్రెయిన్ వాసి హత్య రష్యా పౌరుడిగా పొరపాటుపడి ఉక్రెయిన్ పౌరుడిని ఉక్రెయిన్ వాసి కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన అమెరికాలో జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లోని బ్రూక్లీన్ కరావోకే బార్లో ఒలెగ్ సులైమా(31) అనే వ్యక్తి మరో ఉక్రెయిన్ వలసదారుడిని ముఖం, మెడపై కత్తితో పొడిచి చంపేశాడు. బాధితుడు రష్యా భాషలో మాట్లాడడడంతో సులైమా పొరపాటుపడ్డాడని పోలీసులు చెప్పారు. 2 లక్షల చిన్నారులను అపహరించిన రష్యా: జెలెన్స్కీ తమ దేశం నుంచి లక్షలాది పౌరులను ప్రత్యర్థి దేశం రష్యా అపహరించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. వీరిలో 2 లక్షల మంది చిన్నారులున్నారని చెప్పారు. ఉక్రెయిన్ పౌరులు మాతృభూమిని మర్చిపోయేలా చేయాలన్నదే ఎత్తుగడ అన్నారు. తప్పు చేసిన వారిని తప్పనిసరిగా శిక్షించి తీరుతామన్నారు. రష్యాకు తమ సత్తా ఏమిటో యుద్ధ రంగంలోనే చూపిస్తామని జెలెన్స్కీ ప్రతినబూనారు. ఉక్రెయిన్ను ఎవరూ ఆక్రమించలేరని, తమ ప్రజలు ఎవరికీ లొంగిపోరని, తమ చిన్నారులను ఆక్రమణదారుల సొంత ఆస్తిగా మారనివ్వబోమని తేల్చిచెప్పారు. రష్యా దాడుల్లో తమ దేశంలో ఇప్పటిదాకా అధికారికంగానే 243 మంది బాలలు మృత్యువాతపడ్డారని, 446 మంది గాయపడ్డారని, 139 మంది అదృశ్యమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా దాడుల్లో చనిపోయిన 11 మంది చిన్నపిల్లల పేర్లను జెలెన్స్కీ ప్రస్తావించారు. -
క్రూడ్ మోత.. పెట్రో వాత..
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీని ప్రభావంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు రానున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక వచ్చే వారం నుంచి మళ్లీ రోజువారీ పెట్రో వాత మొదలు కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రేట్ల పెంపు రూ. 6–10 శ్రేణిలో ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌తో ఉద్రిక్తతల వల్ల కావచ్చు లేదా పాశ్చాత్య దేశాలు విధించే ఆంక్షల వల్ల కావచ్చు రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ సరఫరా దెబ్బతినే అవకాశం ఉందని అంతర్జాతీయంగా మార్కెట్లో ఆందోళన నెలకొంది. దీంతో క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కు ఏకంగా 110 డాలర్ల పైకి ఎగిసింది. 2014 తర్వాత ముడి చమురు ధర ఈ స్థాయికి ఎగియడం ఇదే ప్రథమం. ఇక భారత్ కొనుగోలు చేసే రకం క్రూడాయిల్ రేటు, ఎన్నికల హడావిడి ప్రారంభం కావడానికి ముందు .. అంటే.. గతేడాది నవంబర్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లను రోజువారీ సవరించడం నిలిపివేసే నాటికి, సగటున 81.5 డాలర్ల స్థాయిలో ఉండేది. తాజాగా చమురు శాఖ గణాంకాల ప్రకారం ఇండియన్ బాస్కెట్ క్రూడాయిల్ ధర మార్చి 1న బ్యారెల్‌కు 102 డాలర్ల పైకి చేరింది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు రానున్నాయని భావిస్తున్నారు. క్రూడాయిల్ 1 డాలర్ పెరిగితే.. సాధారణంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 1 డాలర్ మేర పెరిగితే .. లీటరు ఇంధనం రేటు 48–52 పైసల చొప్పున పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)లకు పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు సాధారణంగా లభించే రూ. 2.5 మార్జిన్ కాకుండా రూ. 5.7 మేర నష్టం వస్తోంది. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మార్కెటింగ్ మార్జిన్లు తిరిగి మామూలు స్థాయికి రావాలంటే ఇంధనాల రిటైల్ ధరలను లీటరుకు రూ. 9 (10 శాతం) మేర పెంచాల్సి రావచ్చని బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది. ‘ఈ పరిస్థితిని నెగ్గుకు రావాలంటే ఎక్సయిజ్ డ్యూటీ స్వల్పంగా (లీటరుకు రూ.1–3) తగ్గించి, రిటైల్ రేట్ల పెంచే వ్యూహం అనుసరించే అవకాశం ఉంది. రాష్ట్రాల ఎన్నికలు వచ్చే వారం ముగియనుండటంతో అప్పట్నుంచి రోజువారీగా రేట్ల పెంపు మళ్లీ మొదలు కావచ్చు‘ అని తెలిపింది. మరికొన్ని వర్గాలు రేట్ల పెంపు రూ. 6–10 స్థాయిలో ఉండొచ్చని అంచనా వేశాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో తుది విడత పోలింగ్ ఫిబ్రవరి 7న ముగియనుండగా, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది. సాధారణంగా ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్ రేట్లను రోజువారీ ప్రాతిపదికన మారుస్తుంటాయి. కానీ అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రికార్డు స్థాయిలో దాదాపు 118 రోజులుగా పెంచలేదు. ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ. 95.41, డీజిల్ రేటు రూ. 86.67గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్సయిజ్ డ్యూటీ, వ్యాట్ రేటును కొంత తగ్గించడంతో ఈ రేట్లు అమలవుతున్నాయి. లేకపోతే పెట్రోల్ ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 110.04, డీజిల్ రేటు రూ. 98.42గా ఉండేది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ రేటు గతేడాది అక్టోబర్ 26న 86.40 డాలర్ల గరిష్ట స్థాయికి చేరినప్పుడు దానికి అనుగుణంగా ఈ రేట్లను సవరించారు. రూపాయికి చమురు సెగలు అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర 110 డాలర్లకు చేరుకోవడం ఫలితంగా డాలర్ మారకంలో రూపాయి విలువ భారీగా క్షీణిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ అనిశ్చితుల నేపథ్యంలో భగ్గుమన్న చమురు ధరలతో భార త్ దిగుమతుల బిల్లు మరింత భారంగా మారుతోంది. తద్వారా కరెంట్ ఖాతా లోటు పెరుగుతుందనే భయాలతో రూపాయి ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రూపాయి బుధవారం 47 పైసలు పతనమై 75.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 53 పైసలు నష్టపోయి 75.86 కనిష్టాన్ని తాకింది. రష్యా ఎఫెక్ట్ .. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తిలో రష్యా వాటా 10 శాతం వరకూ ఉంటుంది. యూరప్‌లో సహజ వాయువు ఉత్పత్తిలో మూడో వంతు వాటా రష్యాదే. భారత్ దాదాపు 85 శాతం క్రూడాయిల్ అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్నప్పటికీ .. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో రష్యా నుంచి కేవలం 43,400 బ్యారెళ్లు (మొత్తం చమురు దిగుమతుల్లో సుమారు 1 శాతం) దిగుమతి చేసుకుంది. రష్యా నుంచి బొగ్గు దిగుమతులు 1.8 మిలియన్ టన్నులుగా (మొత్తం బొగ్గు దిగుమతుల్లో 1.3 శాతం) ఉంది. రష్యా నుంచి భారత్ 2.5 మిలియన్ టన్నుల ద్రవీకృత సహజ వాయువు కూడా దిగుమతి చేసుకుంది. భారత్ ఎక్కువగా సౌదీ అరేబియా, ఇరాక్, ఇతర మధ్య ప్రాచ్య, ఆఫ్రికా, ఉత్తర అమెరికా దేశాల నుంచి క్రూడాయిల్‌ను కొనుగోలు చేస్తోంది. కాబట్టి ప్రస్తుతం సరఫరాపరమైన సమస్యలేమీ భారత్‌కు లేవు. కానీ రష్యా నుంచి వచ్చే క్రూడాయిల్, గ్యాస్ తగ్గిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వీటికి డిమాండ్, దానికి అనుగుణంగా రేటూ పెరిగిపోతోంది. ఇదే ప్రస్తుతం భారత్‌ను కలవరపర్చే అంశం. సరఫరా ఉన్నా .. తగ్గని ఆందోళన.. రష్యా నుంచి సరఫరాకు అవాంతరాల వల్ల వినియోగదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అమెరికా సహా అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ)లోని 31 సభ్య దేశాలు తమ దగ్గరున్న నిల్వల్లో 60 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాయి. అయినా క్రూడ్ రేటు పరుగు ఆగలేదు. ఫ్యూచర్స్ మార్కెట్లో బ్రెంట్ ధర బుధవారం ఒక దశలో 6.50% ఎగిసి 111.7 డాలర్లకు చేరింది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలోను మార్చి డెలివరీ కాంట్రాక్టు రూ. 436 (5.5 శాతం) పెరిగి రూ. 8,341 వద్ద ట్రేడయ్యింది. ఐఈఏ అదనంగా అందించే క్రూడాయిల్ ఏ మూలకూ సరిపోదని, రష్యా ఆరు రోజుల్లో 60 మిలియన్ బ్యారెళ్లకు మించి ఉత్పత్తి చేస్తుందని అంచనా. 150 డాలర్లకూ పెరగొచ్చు.. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి ముడిచమురు రేటు 86 డాలర్లకు దిగి రావచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది. అయితే, రష్యా నుంచి ఇంధన ఎగుమతులు నిల్చిపోతే ధర 150 డాలర్లకు కూడా ఎగియవచ్చని పేర్కొంది. ‘స్థూలంగా చెప్పాలంటే రష్యా ఆయిల్ సరఫరా పూర్తిగా నిల్చిపోతే (ఇరాన్ ఎగుమతులు మళ్లీ పునరుద్ధరించి, వ్యూహాత్మక చమురు నిల్వలను వాడుకుంటే పాక్షికంగా తగ్గవచ్చు) ముడి చమురు రేటు బ్యారెల్‌కు 150 డాలర్లకు పెరగొచ్చు. అలా కాకుండా ఇంధన లావాదేవీలను వదిలేసి.. ఆంక్షలను మిగతా విభాగాలకే పరిమితం చేస్తే మాత్రం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రేటు సగటున 110 డాలర్ల స్థాయిలో తిరుగాడవచ్చు. అప్పుడప్పుడు 120 డాలర్ల స్థాయినీ తాకుతుండవచ్చు‘ అని జేపీ మోర్గాన్ పేర్కొంది. ఉత్పత్తి పెంపుపై ఒపెక్ మల్లగుల్లాలు.. ఇంధన కొరత పరిస్థితిని చక్కదిద్దేందుకు చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్ దృష్టి పెట్టింది. ఉత్పత్తిని ఎంత మేర పెంచాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. రేటు పెరగడమనేది ఉత్పత్తి దేశాలకు లాభదాయకమే అయినప్పటికీ దీనివల్ల వినియోగ దేశాలపై భారం పెరిగి అవి మాంద్యంలోకి జారుకుంటే, ఆయిల్‌కు డిమాండ్ పడిపోయే ప్రమాదం కూడా ఉందనే అభిప్రాయం నెలకొంది. ఒపెక్ దేశాలు చాలా ఆచి తూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని టఫ్ట్స్ యూనివర్సిటీలోనిక్లైమేట్ పాలసీ ల్యాబ్ ఎండీ అమీ మయర్స్ అభిప్రాయపడ్డారు. అటు ఉక్రెయిన్‌పై దాడుల కోసం రష్యాకు భారీగా ఇంధనం అవసరం అవుతుంది కాబట్టి అది ఎక్కువగా ఎగుమతులు కూడా చేయలేకపోవచ్చని ఆమె తెలిపారు. అలాంటప్పుడు ఆ కొరతను ఎవరు భర్తీ చేస్తారన్నది కూడా ఆలోచించాల్సిన అంశమన్నారు. ప్రస్తుతానికైతే సౌదీ అరేబియాకు భారీ ఉత్పత్తి సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. -
వెయ్యి కోట్ల డాలర్లను విడుదల చేయండి
ఓస్లో: అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు తొలిసారిగా పశ్చిమ దేశాల ప్రతినిధులతో అధికారికంగా సమావేశమై చర్చించారు. నార్వే రాజధాని ఓస్లోలో మూడు రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో పాల్గొన్న తాలిబన్ ప్రతినిధులు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు స్తంభింపజేసిన వెయ్యి కోట్ల అమెరికా డాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అఫ్గానిస్తాన్ మానవ సంక్షోభం అంచులో ఉందని అందుకే ఆ నిధులు విడుదల చేయాలని వారు ఒత్తిడి తీసుకువచ్చారు. తాలిబన్ల తరఫున హాజరైన షఫీవుల్లా అజామ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ అఫ్గానిస్తాన్‌కు చెందిన ఆస్తుల్ని విడుదల చేయాలని, రాజకీయపరమైన విభేదాలతో సాధారణ పౌరుల్ని శిక్షించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆకలి కేకలు, గడ్డ కట్టించే చలి పరిస్థితుల్లో స్తంభింపజేసిన ఆస్తుల్ని విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశానికి ముందు పశ్చిమ దేశాల ప్రతినిధులు అఫ్గాన్ మహిళా హక్కుల కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలతో మాట్లాడి అఫ్గాన్‌లో క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. -
డెల్టా + ఒమిక్రాన్ = డెల్మిక్రాన్!!
ముంబై: కరోనా కట్టడికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి మాత్రం సరికొత్త రూపాల్లో మానవాళిపై దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. తాజాగా బయటపడ్డ ఒమిక్రాన్ వల్ల పాశ్చాత్య దేశాలు విలవిల్లాడుతున్నాయని అందరూ భావిస్తున్నారు. ఇది ఒమిక్రాన్ ఒక్కదాని వల్ల జరగడం లేదని, డబుల్ వేరియంట్ వల్లనే ఈ కల్లోలం జరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు. యూరప్, యూఎస్ సహా పశ్చిమాదిన కలకలం సృష్టిస్తున్నది ‘డెల్మిక్రాన్’ అనే డబుల్ వేరియంట్ అని, దీనికి డెల్టా తీవ్రత, ఒమిక్రాన్ వేగం ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022లో కరోనా రహిత ప్రపంచాన్ని చూడొచ్చన్న ప్రజల ఆశలకు ఈ డెల్మిక్రాన్ వమ్ముచేసిందంటున్నారు. పశ్చిమ దేశాల్లో కేసుల సునామీకి ఇదే కారణమని కోవిడ్ పరిశోధకుడు డా. శశాంక్ జోషి అభిప్రాయపడ్డారు. ఆల్ఫా, బీటా లాగా డెల్మిక్రాన్ కరోనా కొత్త వేరియంట్ కాదని, ఇది ఇప్పటికే ఉన్న వేరియంట్ల కలయికతో ఏర్పడిందని వివరించారు. అంటే దీన్ని డబుల్ వేరియంట్‌గా చెప్పవచ్చు. ఇలాంటి డబుల్ వేరియంట్లు రూపొందడం చాలా అరుదుగా జరుగుతుంది. డెల్టా కేసులు భారత్‌లో ఈ ఏడాది సెకండ్ వేవ్‌కు కారణమయ్యాయి. తాజాగా ఒమిక్రాన్ భారత్‌లోకి ప్రవేశించింది. ఈ దశలో ఇండియాలో ఈ రెండు వేరియంట్ల కలయిక ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిఉందని జోషి చెప్పారు. డబుల్ ఇబ్బందులు వైరస్‌లో జరిగే మ్యుటేషన్లు(ఉత్పరివర్తనాలు) కొత్త వేరియంట్ ఏర్పడేందుకు కారణమవుతాయి. కానీ ఇలాంటి డబుల్ వేరియంట్లు ఇప్పటికే ఉన్న వేరియంట్ల కలయికతో రూపొందుతాయని సైంటిస్టులు వివరించారు. ఉదాహరణకు ఇప్పటికే డెల్టా వేరియంట్ సోకి కోలుకుంటున్న వ్యక్తికి ఒమిక్రాన్ సోకితే అతనిలో డెల్మిక్రాన్ రూపొందే అవకాశం ఉందన్నారు. డెల్మిక్రాన్లో అటు డెల్టా నుంచి తీవ్ర వ్యాధి కలిగించే లక్షణాలు, ఇటు ఒమిక్రాన్ నుంచి వేగంగా వ్యాపించే లక్షణం వచ్చాయి. అందుకే ఇది ప్రస్తుతం పాశ్చాత్య దేశాలను ముంచెత్తుతోంది. డెల్మిక్రాన్ సోకిన వారిలో అధిక జ్వరం, నిరంతర దగ్గు, వాసన లేదా రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కుదిబ్బడ, గొంతులో గరగరలాంటి లక్షణాలను నిపుణులు గమనించారు. భారత్‌లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇంతవరకు డెల్మిక్రాన్ వేరియంట్ జాడ మాత్రం భారత్‌లో లేదు. భారత వాతవరణానికి ఒమిక్రాన్ ఎలా స్పందిస్తుందోనని నిపుణులు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. కొందరు మాత్రం ఇండియాలో డెల్మిక్రాన్ ప్రమాదం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. డెల్టా, ఒమిక్రాన్, డెల్మిక్రాన్.. ఏదైనా సరే టీకాలు తీసుకోవడం, సరైన నిబంధనలు పాటించడంతో దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చని ఆరోగ్య నిపుణుల సూచన. -
పశ్చిమ దేశాల్లోనూ యోగాకు ఆదరణ
ప్రముఖ యోగా గురు రాందేవ్‌బాబా వాషింగ్టన్: పశ్చిమ దేశాల్లోనూ యోగాకు ఆదరణ పెరుగుతోందని ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా తెలిపారు. విభిన్న భావజాలాలు, సంస్కృతి, మతాల వల్ల ఎదురయ్యే సమస్యలకు యోగా పరిష్కారంగా మారుతోందన్నారు. యోగాతో ప్రజల దైనందిక జీవితం మారడంతో పాటు, అనేక సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సానుకూల వ్యాపారంగానూ ఉందన్నారు. ఉత్తర అమెరికా పర్యటనలో భాగంగా రాందేవ్ బుధవారం టొరెంటో చేరుకున్నారు. తమ సంస్థ పతంజలి ఆయుర్వేద రాబోయే మూడేళ్లలో పలు బహుళ జాతి సంస్థలను అధిగమిస్తుందని తెలిపారు. న్యూయార్క్‌లో జరిగిన ఇండియాడే పెరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రాందేవ్, ఈ వేడుకలను మరింత బాగా చేయాల్సిందని భావించారు. స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ బలూచిస్తాన్ ప్రస్తావన తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు సంస్కృతికి, నాగరికతకి మధ్య వైరం పెరిగిందనడానికి అసలుసిసలు సాక్ష్యమని వెల్లడించారు. -
చంపండి.. కానీ సింపుల్‌గా!
మోసుల్: ఒంటరి తోడేళ్ల(లోన్ ఊల్ఫ్స్)ను మరింత కర్కశంగా తయారుచేసే క్రమంలో ఐసిస్ కొత్త పంథాకు తెరతీసింది. ఇన్నాళ్లూ భారీ దాడులకు పాల్పడింది చాలని, ఇకపై అతిసాధారణ దాడులతో నరమేథం సృష్టించాలని పశ్చిమదేశాల్లోని తన జిహాదీలను ఆదేశించింది. 'విశ్వాసం లేని వాళ్లను చంపడంలో రాజీ పడొద్దు. కానీ ఆ పనిని హడావిడిగా కాకుండా సాధ్యమైనంత సింపుల్ గా, సమర్థవంతంగా చేయండి. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ కుదిరితే అక్కడే వీలైనంత మేర రక్తపాతం సృష్టించండి. ఒకవేళ మీరు బయట తిరగలేని పరిస్థితుల్లో ఇళ్లల్లోకి దూరిమరీ కాల్పులు జరపండి. అంతేగానీ, భారీ స్కెచ్‌లు, హంగామా అదీ చెయ్యకండి' అంటూ ఐసిస్ తన అధికారిక పత్రిక 'దబీఖ్' ద్వారా సందేశం ఇచ్చింది. ప్రస్తుతం సిరియాలో ఉన్న ఓ అమెరికన్ జిహాదీ రాసినట్లుగా భావిస్తోన్న ఈ సందేశంలో.. 'మన స్థావరానికి (ఇరాక్-సిరియాకు) బయలేదేరే క్రమంలో మీకు అడ్డువచ్చిన ఎవ్వర్నీ వదిలిపెట్టొద్దు. ఒకవేళ మీరు ఇక్కడికి(సిరియాకు) రాలేకపోతే అదృష్టవంతులుగా భావించండి. ఎందుకంటే అక్కడికక్కడే విద్రోహులను చంపే అవకాశం లభిస్తుందిమీకు!' అనే ఆదేశాలు కూడా ఉన్నాయి. పశ్చిమదేశాలైన ఫ్రాన్స్, బ్రెసెల్స్, టర్కీ, జర్మనీలతోపాటు అమెరికాలోని ఓర్లాండోలోనూ భారీ నరమేథానికి పాల్పడ్డవారు స్థానిక జిహాదీలేనన్న సంగతి తెలిసిందే. కాగా, ఐసిస్ తదుపరి టార్గెట్ లండన్ నగరమేనని కొద్ది రోజులుగా వార్తలు వినిపించడం, ఇప్పుడా ఉగ్రవాద సంస్థ తన జిహాదీలకు ఆదేశాలు జారీచేయడం బ్రిటన్ ను కలవరపాటుకు గురిచేస్తున్నది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం లండన్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో 600 మంది ప్రత్యేక సాయుధ బలగాలను మోహరించింది. -
అక్కడ.. ఈ దుస్తులు ధరించకండి
పాశ్చాత్య దేశాలకు వెళ్లినపుడు సంప్రదాయ అరబ్ దుస్తులను ధరించవద్దని యూఏఈ తమ దేశ పౌరులకు సూచించింది. విదేశాలకు ప్రయాణించినపుడు, ముఖ్యంగా విదేశాల్లో బహిరంగ ప్రదేశాలకు వెళ్లినపుడు సంప్రదాయ దుస్తులు ధరించవద్దని యూఏఈ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో హెచ్చరించింది. యూఏఈ పౌరుల భద్రత దృష్ట్యా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అమెరికాకు వెళ్లిన ఎమిరేట్స్ వ్యాపారవేత్తను జిహాదిగా భావించి యూఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో యూఏఈ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాకు వైద్య చికిత్స కోసం వెళ్లిన యూఏఈ వ్యాపారవేత్త అహ్మద్ అల్ మెన్హలి (41) క్లీవ్‌లాండ్‌లోని ఓ హోటల్లో బసచేశారు. తెల్లటి అరబ్ దుస్తుల్లో ఉన్న ఆయనను హోటల్ సిబ్బంది జిహాదిగా అనుమానించారు. అంతేగాక ఐఎస్ ఉగ్రవాదులతో ఫోన్లో మాట్లాడుతున్నారని సందేహించారు. హోటల్ సిబ్బంది ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి ఆయనను అరెస్ట్ చేశారు. సాయుధులైన పోలీసులు అహ్మద్ అల్ మెన్హలిని అదుపులోకి తీసుకుని కొట్టారు. దుస్తులు విప్పించి తనిఖీ చేశారు. అహ్మద్ అల్ మెన్హలికి ఐసిస్‌తో సంబంధాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు ఆయనను వదలిపెట్టారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, తాను తీవ్రంగా గాయపడ్డానని అహ్మద్ అల్ మెన్హలి చెప్పారు. -
ఐస్... వెంటనే ఐసైపోదు...
మందులో ఐసేసుకోవాలి. మనమైతే.. ఫ్రిజ్‌లోని ఐస్ ముక్కలు తీసుకుంటాం.. వేసుకుంటాం.. మనమైతే ఇలా చేస్తాం.. కానీ పాశ్చాత్య దేశాల్లో సెలబ్రిటీలు వంటివారు ఇలాంటి వాటిని ఇష్టపడటం లేదట.. ఐస్ ముక్కల్లోనూ లగ్జరీ చూస్తున్నారట.. ఇలాంటోళ్ల కోసమే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గ్లేస్ లగ్జరీ ఐస్ కంపెనీ ఈ ఐసు క్యూబ్స్‌ను తయారుచేసింది. వీటి గొప్పతనమేమిటంటే.. ఇవి కచ్చితంగా చతురస్రాకారంలో ఉంటాయి. షేప్‌లో ఇసుమంతైనా తేడా రాదు. ఐస్ ముక్క వేసిన వెంటనే.. అది డ్రింక్‌ను త్వరితగతిన చల్లగా చేయడంతోపాటు దాదాపు 40 నిమిషాలపాటు కరగకుండా ఉంటుంది. అంతేకాదు.. పారదర్శకంగా ఎటువంటి రుచి లేకుండా ఉంటాయి. అంటే.. మీ మందు తాలూకు టేస్ట్‌ను దెబ్బతీయవన్నమాట. అన్నీ బాగున్నాయి.. రేటెంత అని అడుగుతున్నారా? 50 ఐస్ ముక్కల బ్యాగు ధర రూ.20 వేలు! -
అమ్మ... ఎక్కడైనా అమ్మే
క్రిస్మస్, వాలెంటైన్స్ డే తర్వాత మాతృదినోత్సవం ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రతి సంవత్సరం మే నెలలో రెండో ఆదివారాన్ని మాతృదినోత్సవంగా ఎన్నో దేశాలు జరుపుకొంటున్నాయి. మాతృదినోత్సవాన్ని జరుపుకునే దేశాలు... వివరాలు... అమెరికా: అమెరికాలో ఆ రోజున అందరూ తమ తల్లిని గుర్తుచేసుకుంటూ ఉత్సవాలు జరుపుకొంటారు. అమ్మ ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఉపన్యాసాలు చేస్తారు. తల్లికి బహుమతులు ఇస్తారు. ప్రతి ఇంటిలోనూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇంటింటా పండగ వాతావరణం నిండిపోతుంది. ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలలో కూడా మాతృదినోత్సవం ఘనంగా జరుపుతారు. కెనడా: కెనడా దేశంలో మాతృదినోత్సవం నాడు గులాబీరంగు దుస్తులు ధరిస్తారు. తల్లికి బహుమతులు ఇస్తారు. న్యూజిలాండ్: న్యూజిలాండ్ దేశంలో మాతృదినోత్సవాన్ని ఒక పెద్ద వేడుకగా నిర్వహిస్తారు. బహుమతులతో తమ పిల్లలను గౌరవించుకుంటారు. అమ్మమ్మలు, నానమ్మలను కూడా ఆ రోజున గౌరవిస్తారు. కేక్‌లు కోస్తారు. ఆ రోజున తల్లులకు విశ్రాంతి ఇచ్చి, ఇంటి పనులన్నీ పిల్లలే చేస్తారు. ఐర్లాండు: ఐర్లాండులో మాతృదినోత్సవాన్ని మే నెలలో వచ్చే నాలుగో ఆదివారం, మెక్సికోలో మే నెల పదో తేదీన మాతృదినోత్సవం జరుపుకొంటారు. అన్ని పాఠశాలలలో ఈ వేడుకలను నిర్వహిస్తారు. భారతదేశం: మన భారతదేశం విషయానికి వస్తే, తల్లిని పూజించే సంప్రదాయం యుగయుగాలుగా ఉంది. రామాయణ, భారత, భాగవతాలలోనూ మనకు తల్లిని గౌరవించే తీరు కనబడుతుంది. ఈ యుగంలోనూ ఎందరో సామ్రాజ్య అధినేతలు తమ తల్లులను ప్రతి సందర్భంలోనూ పూజించేవారున్నారు. దండయాత్రకు వెళ్ళినా, విజయం సాధించి వచ్చినా ముందుగా తల్లినీ, ఆ తర్వాత దైవాన్నీ పూజించేవారు. ఇక ఆధునిక యుగంలో మాతృదినోత్సవం సంస్కృతి ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ ఆరంభమైందని చెప్పవచ్చు. ప్రతి పండగ సమయంలోనూ, ఇతర కార్యక్రమాలలోనూ తల్లికి పాదాభివందనం చేసే పద్ధతి, ఆచారం మనకు ఉంది. అవన్నీ ఉండగా, ప్రత్యేకించి ఈ మాతృదినోత్సవం చేసుకోవడాన్ని పాశ్చాత్య దేశాల సంస్కృతిగా చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు.ఏది ఏమైనా, ఏ దేశంలోనైనా భవిష్యత్తుకు బాటలు వేసే చిన్నారులను తన కడుపులో నవమాసాలు మోసి క్షేమంగా ఈ ప్రపంచానికి అందిస్తున్న అమ్మకు శతకోటి వందనాలు!