ఉక్రెయిన్‌కు లాంగ్–రేంజ్ రాకెట్ సిస్టమ్స్, ఇతర ఆయుధాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. తీరు మార్చుకోవాలని, తమ మాట వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇప్పటిదాకా ఎన్నడూ దాడి చేయని లక్ష్యాలపై దాడులకు దిగుతామని తేల్చిచెప్పారు. అయితే, ఆ లక్ష్యాలు ఏమిటన్నది బయటపెట్టలేదు. ఆదివారం ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత ఎక్కువ కాలం పొడిగించేందుకు పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయని, అందులో భాగంగానే ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎన్ని ఆయుధాలు అందజేసిన ఉక్రెయిన్ ప్రభుత్వం ఇంకా నష్టపోవడం తప్ప సాధించేదేమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రత్యర్థిని ఎలా దెబ్బకొట్టాలో తెలుసని, తమవద్ద కూడా ఆయుధాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దని పుతిన్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment