పుతిన్‌ను ఎలాగైనా ఆపాల్సిందే: బైడెన్‌ | Russia-Ukraine War: Missile strikes in Ukraine show Putin must be stopped Says Joe Biden | Sakshi
Sakshi News home page

పుతిన్‌ను ఎలాగైనా ఆపాల్సిందే: బైడెన్‌

Published Sun, Dec 31 2023 6:06 AM | Last Updated on Sun, Dec 31 2023 6:06 AM

Russia-Ukraine War: Missile strikes in Ukraine show Putin must be stopped Says Joe Biden - Sakshi

వాషింగ్టన్‌:  ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేసేందుకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కంకణం కట్టుకున్నారంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దుయ్యబట్టారు. ‘‘ఆయన యుద్ధోన్మాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాల్సిందే. ఉక్రెయిన్‌పై రష్యా తాజాగా క్షిపణుల వర్షం కురిపించిన వైనం ఈ ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది’’ అన్నారు.

తమ దేశంపైకి రష్యా ఏకంగా 110 క్షిపణులను ప్రయోగించిందని, ఈ డాడిలో 31 మంది అమాయకులు బలవగా వందలాది మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురువారం ప్రకటించడం తెలిసిందే. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే అతి పెద్ద దాడి అని ఉక్రెయిన్‌ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్‌యంలో పుతిన్‌ను అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌కు మరింత సాయం అందిద్దామని అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు బైడెన్‌ పిలుపునిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement