యుద్ధంలో రష్యాకు ఓటమి తథ్యం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యాకు పరాభవం తప్పదని తేలి్చచెప్పారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని, గగనతలంలో శత్రువును మట్టికరిపించే ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తామని ప్రకటించారు. తాజాగా ‘నాటో’ 75వ సదస్సులో బైడెన్ ప్రసంగించారు. అమెరికాతోపాటు జర్మనీ, నెదర్లాండ్స్, రొమేనియా, ఇటలీ దేశాలు ఉక్రెయిన్‌కు అదనంగా ఐదు వ్యూహాత్మక ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను అందజేయబోతున్నాయని తెలిపారు.
రాబోయే రోజుల్లో పదుల సంఖ్యలో టాక్టికల్ ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను ఉక్రెయిన్‌కు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. తాము అందజేసే క్రిటికల్ ఎయిర్–డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్లతో రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తుందని స్పష్టం చేశారు. రష్యా క్షిపణుల దాడులు, వైమానిక దాడుల నుంచి ఉక్రెయిన్ నగరాలతోపాటు ఉక్రెయిన్ సైన్యాన్ని కాపాడే ఇంటర్‌సెప్టర్లను వందల సంఖ్యలో అందిస్తామని పేర్కొన్నారు. యుద్ధంలో 3.50 లక్షల మందికిపైగా రష్యా సైనికులు మరణించడమో, గాయపడడమో జరిగిందని చెప్పారు. ఉక్రెయిన్ స్వేచ్ఛాయుతమైన, స్వతంత్రదేశంగా కొనసాగుతుందని ఉద్ఘాటించారు.
ఎన్నికల దాకా ఎదురు చూడాలా?: జెలెన్‌స్కీ
ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే రష్యా అధినేత పుతిన్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. నాటో సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల దాకా ప్రపంచం ఎదురు చూడొద్దని చెప్పారు.
ఉక్రెయిన్‌కు ఎఫ్–16 ఫైటర్ జెట్లు ఇస్తాం: నార్వే
ఉక్రెయిన్‌కు ఆరు ఎఫ్16 ఫైటర్ జెట్లు అందజేస్తామని నాటో సభ్యదేశమైన నార్వే ప్రధాని జోనాస్ ప్రకటించారు. అయితే, ఎప్పటి నుంచి ఈ యుద్ధ విమానాలు ఉక్రెయిన్‌కు అందజేస్తారన్నది ఆయన వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment