Tactical
-
ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తాం
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యాకు పరాభవం తప్పదని తేలి్చచెప్పారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని, గగనతలంలో శత్రువును మట్టికరిపించే ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తామని ప్రకటించారు. తాజాగా ‘నాటో’ 75వ సదస్సులో బైడెన్ ప్రసంగించారు. అమెరికాతోపాటు జర్మనీ, నెదర్లాండ్స్, రొమేనియా, ఇటలీ దేశాలు ఉక్రెయిన్‌కు అదనంగా ఐదు వ్యూహాత్మక ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను అందజేయబోతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో పదుల సంఖ్యలో టాక్టికల్ ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను ఉక్రెయిన్‌కు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. తాము అందజేసే క్రిటికల్ ఎయిర్–డిఫెన్స్ ఇంటర్సెప్టర్లతో రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తుందని స్పష్టం చేశారు. రష్యా క్షిపణుల దాడులు, వైమానిక దాడుల నుంచి ఉక్రెయిన్ నగరాలతోపాటు ఉక్రెయిన్ సైన్యాన్ని కాపాడే ఇంటర్సెప్టర్లను వందల సంఖ్యలో అందిస్తామని పేర్కొన్నారు. యుద్ధంలో 3.50 లక్షల మందికిపైగా రష్యా సైనికులు మరణించడమో, గాయపడడమో జరిగిందని చెప్పారు. ఉక్రెయిన్ స్వేచ్ఛాయుతమైన, స్వతంత్రదేశంగా కొనసాగుతుందని ఉద్ఘాటించారు. ఎన్నికల దాకా ఎదురు చూడాలా?: జెలెన్స్కీ ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే రష్యా అధినేత పుతిన్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. నాటో సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల దాకా ప్రపంచం ఎదురు చూడొద్దని చెప్పారు. ఉక్రెయిన్‌కు ఎఫ్–16 ఫైటర్ జెట్లు ఇస్తాం: నార్వే ఉక్రెయిన్‌కు ఆరు ఎఫ్16 ఫైటర్ జెట్లు అందజేస్తామని నాటో సభ్యదేశమైన నార్వే ప్రధాని జోనాస్ ప్రకటించారు. అయితే, ఎప్పటి నుంచి ఈ యుద్ధ విమానాలు ఉక్రెయిన్‌కు అందజేస్తారన్నది ఆయన వెల్లడించలేదు. -
టి20లకు కొత్త ‘మెరుపు’
ముంబై: టి20లు ఎక్కడ జరిగినా దానికున్న క్రేజే వేరు. భారత్‌లో అయితే మరీనూ! అందుకే పొట్టి ఆటకు మరో ‘మెరుపు’ జత చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టి ప్రయత్నమే చేస్తోంది. విశేష ఆదరణ చూరగొన్న టి20 క్రికెట్ ప్రాచుర్యాన్ని మరింత పెంచాలని సరికొత్త ప్రయోగానికి బీసీసీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘టాక్టికల్ సబ్‌స్టిట్యూట్’ను ప్రవేశ పెట్టనుంది. ముందుగా దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో అమలు చేసి... అందులో విజయవంతమైతే వెంటనే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లోనూ కొత్త సొబగుతో సరికొత్త ‘షో’కు శ్రీకారం చుట్టాలని బీసీసీఐ భావిస్తోంది. అక్టోబర్ 11 నుంచి జరిగే ముస్తాక్ అలీ టోర్నీలో ‘టాక్టికల్ సబ్‌స్టిట్యూట్’ నిబంధన తీసుకొస్తున్నట్లు బోర్డు ఇది వరకే అనుబంధ రాష్ట్ర సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఏంటీ ఇంపాక్ట్ ప్లేయర్ కథ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ కొత్తేం కాదు. ఆటగాడు గాయపడితే సబ్‌స్టిట్యూట్‌ను ఎప్పటి నుంచో ఆడిస్తున్నారు. కానీ బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు వీల్లేదు. ఫీల్డింగ్‌కే పరిమితం! తలకు గాయమైన సందర్భంలో కన్కషన్ అయితే మాత్రం బ్యాటింగ్, లేదా బౌలింగ్ చేసే వెసులుబాటు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌కు ఉంది. అయితే ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ భిన్నమైంది. టాస్కు ముందు తుది జట్టుకు అదనంగా నలుగురు ఆటగాళ్ల జాబితా ఇస్తారు. ఇందులో ఒకరు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా పూర్తిస్థాయి ఆటగాడి హక్కులతో ఆడతాడు. 14వ ఓవర్ పూర్తయ్యేలోపు తుది 11 మందిలో ఒకరిస్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ను బరిలోకి దింపొచ్చు. ఇది గేమ్ చేంజర్ కాగలదని బీసీసీఐ భావిస్తోంది. ఈ తరహా నిబంధన బిగ్‌బాష్ లీగ్‌లో కొన్ని షరతులతో ఉంది. అప్పట్లో... వన్డేల్లో! క్రికెట్లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ప్రయోగం కొత్తేం కాదు. 17 ఏళ్ల క్రితం వన్డేల్లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని ఆడించారు. ఐసీసీ 2005లో ప్రవేశపెట్టిన నిబంధన ప్రకారం టాస్కు ముందు 12వ ఆటగాడిగా ఆ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ను జట్లు ప్రకటించేవి. తుది జట్లకు ఆడించేవి. కారణాలేవైనా 2006 ఏడాది తర్వాత ఈ నిబంధనను ఎత్తేశారు. -
అక్షరం అపహాస్యం
►మొక్కుబడిగా సాక్షర భారత్ పరీక్షలు ►అన్నీ కాకి లెక్కలే.. చీరాల టౌన్ : దేశంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ప్రవేశపెట్టిన వయోజన విద్యా విధానం అమలు అపహాస్యంగా మారింది. దేశవ్యాప్తంగా ఆదివారం ఎన్ఐఓఎస్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్స్ స్కూలింగ్) అక్షరాస్యతా పరీక్ష నిర్వహించారు. చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో 268 మంది పరీక్ష రాయవలసింది. అయితే ఈ పరీక్షలు మొక్కుబడిగా కొనసాగాయి. నియోజకవర్గంలోని 24 గ్రామ పంచాయతీల్లోని వయోజన విద్యాకేంద్రాల్లో 268 మందికిగాను 218 మంది మాత్రమే రాశారు. కొన్ని పంచాయతీల్లోని పరీక్షను మొక్కుబడిగా నిర్వహించగా మరికొన్ని చోట్ల అసలు వయోజన విద్యాకేంద్రాల్లో పరీక్షలే నిర్వహించలేదు. ఆయా గ్రామ పంచాయతీల సాక్షర భారత్ కోఆర్డినేటర్లు మొక్కుబడిగా జవాబు పత్రాలు నింపి, పరీక్షలు రాసినట్లు లెక్కలు చూపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల సాక్షర భారత్ పరీక్షను నిర్వహించకుండానే నిర్వహించినట్లు రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. వీటిని పర్యవేక్షించాల్సిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇన్విజిలేటర్లుగా వ్యవహరించాల్సిన అంగన్వాడీ టీచర్లు పత్తాలేకుండా పోయారు. గ్రామ కోఆర్డినేటర్లు రాసిన పేపర్లకు అంగన్వాడీ ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో ఆమోదం తెలిపి అన్నీ సక్రమమే అని తేల్చేశారు. నిరక్ష్యరాస్యులకు విద్యను బోధించాల్సిన కోఆర్డినేటర్లు.. చదువుకున్న వారితో పరీక్షలు రాయించి మమ అనిపిస్తున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన మండల, జిల్లా కోఆర్డినేటర్లు మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వయోజనా విద్యా కార్యక్రమ లక్ష్యం నీరుగారుతోంది. వయోజనులకు విద్య దూరమవుతోంది. ఎన్ఐఓఎస్ పరీక్షకు 218 మంది హాజరు చీరాల టౌన్ : వయోజన విద్యా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ ఓపెన్ స్కూల్ పరీక్షకు చీరాల నియోజకవర్గంలో 218 మంది హాజరయ్యారు. చీరాల మండలంలో 209 మందికిగాను 189 అభ్యాసకులు పరీక్ష రాసినట్లు సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్ జి.జగన్మోహన్రావు తెలిపారు. వేటపాలెం మండలంలోని 57 మందికిగాను 29 మంది అభ్యాసకులు పరీక్షకు హాజరయ్యారని మండల కోఆర్డినేటర్ టి.ఎఫ్రాయిం తెలిపారు.