US air crash: భారతీయ యువతి లాస్ట్‌ మెసేజ్‌ భర్త కన్నీరుమున్నీరు | US Air Crash Victims Daughter Of Indian Immigrants Tragic Story, Read Inside | Sakshi
Sakshi News home page

US air crash: భారతీయ యువతి లాస్ట్‌ మెసేజ్‌ భర్త కన్నీరుమున్నీరు

Published Sat, Feb 1 2025 12:12 PM | Last Updated on Sat, Feb 1 2025 12:24 PM

US air crash victims Daughter of Indian immigrants tragic story

అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రాంతీయ జెట్, యుఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వారిలో భారతీయు యువతి ఉండటం విషాదాన్ని నింపింది. 2001 తర్వాత అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంలో భావిస్తున్న ఈ ఉదంతంలో 67 మంది  ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

అమెరికా రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ ( Ronald Reagan Airport)వద్ద జరిగిన ఘోర విమాన26 ఏళ్ల  అష్రాహుస్సేన్ రజా (Ashra Hussain Raja) కూడా చనిపోయారు. దీంతో బాధితుడి  కుటుంబం విషాదంలో మునిగిపోయింది.  ఆమె భర్త,  హమాద్  స్నేహితుల మధ్య శోకసంద్రంలో మునిగిపోయారు. మరికొద్ది క్షణాల్లో  ల్యాండ్‌  విమానం అవుతుందనగా  ఈ ఘోరం జరిగింది.

భారతీయ వలసదారుల కుమార్తె అయిన హుస్సేన్ రజా 2020లో ఇండియానా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది .ఆగస్టు 2023లో స్నేహితుడు హమాద్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వాషింగ్టన్ డీసీలో కన్సల్టెంట్‌గా (consultant in Washington, DC)ఉద్యోగం చేస్తున్నారని ఆమె మరణం తమకు తీరని లోటని ఆమె మామ  డాక్టర్ హాషిమ్ రాజా(Dr.Hashim Raja) విషాద వదనంతో చెప్పారు. విద్యాపరంగా చాలా తెలివైనది. అద్భతుంగా వంట చేస్తుంది. నా కొడుకుకు ప్రాణ స్నేహితురాలు" అని అస్రా హుస్సేన్ మామ హషీమ్ రజా అన్నారు. వైద్యుడిగా చాలామందికి వైద్యం చేశాను, సలహాలిచ్చాను చాలా మరణాలను చూశాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

ఆమె అక్కడ ఒక ఆసుపత్రి కోసం టర్నరౌండ్ ప్రాజెక్ట్‌లో పని చేయడానికి నెలకు రెండుసార్లు విచితకు ప్రయాణించిందని  చెప్పారు.  తన కెరీర్‌లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు.  నైట్‌   షిప్ట్‌లలో మేల్కొని ఉండేందుకు తరచుగా  తనకి ఫోన్ చేసేదని, అందరి కోసం ఆలోచించేదని .ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించేది” అని  ఆయన తెలిపారు. 

మరోవైపు భార్య అష్రా తనకు పంపిన మెసేజ్‌ను తలుచుకుంటూ భర్త హమాద్ రాజా కన్నీరు మున్నీరవుతున్నారు. “మేం 20 నిమిషాల్లో ల్యాండ్ అవుతున్నాం” అని ఆమె మెసేజ్ చేసిందని, ఆమె కోసం ఎయిర్‌పోర్ట్‌లో ఎదురు చూస్తుండగానే అంతా జరిగిపోయిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

“ఇదంతా ఒక పీడకలలా ఉంది” అంటూ హమాద్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. నిజానికి   ఒక రోజు ఆమె రావాల్సి ఉంది.. కానీ ముందుగానే ప్లాన్‌ చేసుకుంది. ఇందుకేనేమో అంటూ కంటతడిపెట్టుకన్నారు. ఇలాంటి ప్రమాదాల గురించి వినడమేగానీ,తమ జీవితాల్లో ఇంత విషాదం ఉంటుందని కలలో కూడా ఊహించలేదంటూ విలపించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement