Indian Orgin Man
-
రూ.8000 కోట్లు ఉన్నాయి.. ఏం చేయాలో తెలియట్లేదు!
ప్రతి మనిషి బాగా డబ్బు సంపాదించాలని, నచ్చినట్టు జీవించాలని కలలు కంటూ.. దీనికోసం ప్రయత్నిస్తుంటారు. కొంతమంది తమ లక్ష్యాన్ని తొందరగా చేరుకుంటే.. మరికొందరు ఈ లక్ష్య సాధనలోనే కన్ను మూసేస్తున్నారు. అయితే వేలకోట్లు సంపాదించిన లూమ్ కో-ఫౌండర్ 'వినయ్ హిరేమత్' మాత్రం, నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు.కేవలం 33 సంవత్సరాల వయసున్న భారతీయ సంతతికి చెందిన వినయ్ హిరేమత్ (Vinay Hiremath).. లూమ్ (Loom) కంపెనీ స్థాపించి, దానిని 2023లో అట్లాసియన్ (Atlassian)కు సుమారు 975 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 8092.5 కోట్లు)కు విక్రయించారు. ''నేను ధనవంతుడిని.. నా జీవితాన్ని ఏమి చేయాలో తెలియడం లేదు'' అనే శీర్షికతో తన భావాలను పంచుకున్నారు.కంపెనీ విక్రయించిన తరువాత.. వినయ్ హిరేమత్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి చాలా ప్రయాణాలు చేసి, ఎన్నో ప్రాంతాలను సందర్శించారు. ఆ తరువాత తనకున్న అభద్రతా భావం వల్ల ఆమెకు దూరంగా ఉండిపోయాడు. ఈ పోస్ట్ చదువుతున్నట్లయితే.. నేను ఆమెకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. నేను నీకు నచ్చిన విధంగా ఉండలేకేపోయాను. నీవు అందించిన అనుభూతులకు కృతజ్ఞతలు అని వెల్లడించారు.లూమ్ కంపెనీ విక్రయించిన తరువాత.. అట్లాసియన్ కంపెనీలోని ఉద్యోగం చేసే అవకాశం లభించింది. అక్కడ అతని ప్యాకేజీ 60 మిలియన్ డాలర్లు (రూ. 500 కోట్ల కంటే ఎక్కువ). అయినా వినయ్ హిరేమత్ ఈ ఆఫర్ వదులుకున్నారు. రోబోటిక్ కంపెనీ సహా ఇతర వెంచర్లను స్థాపించాలని అనుకున్నారు. కానీ అది తన నిజమైన అభిరుచి కాదని వెంటనే గ్రహించి వదులుకున్నారు.ఇదీ చదవండి: రూ.63 వేలకోట్లు ఆస్తి.. అద్దె ఇంట్లో నివాసం!: ఎవరో తెలుసా?ప్రస్తుతం హిరేమత్.. వాస్తవ ప్రపంచ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీని ప్రారంభించాలనే లక్ష్యంతో భౌతికశాస్త్రం నేర్చుకుంటున్నట్లు సమాచారం. నేను ప్రారంభించబోయే కొత్త వెంచర్ గొప్ప విజయాలను సాధించాలని, లాభాలను ఆర్జించాలని లేదు. నేను ప్రస్తుతం చాలా సంతృప్తిగా ఉన్నానని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.I am rich and have no idea what to do with my life.Where I talk about leaving Loom, giving up $60m, larping as Elon, breaking up with my girlfriend, insecurities, a brief stint at DOGE, and how I'm now in Hawaii self-studying physics.https://t.co/cMgAsXq3St— Vinay Hiremath (@vhmth) January 2, 2025లూమ్ కంపెనీలూమ్ అనేది 2015లో స్థాపించిన టెక్ కంపెనీ. ఇది వీడియో కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్ అందిస్తుంది. కెమెరా రికార్డింగ్, స్క్రీన్ రికార్డింగ్, ట్రాన్స్క్రిప్షన్, వీడియో ఎడిటింగ్, షేర్ చేయగల స్క్రీన్ రికార్డెడ్ వీడియో లింక్‌ని సృష్టించడం వంటి సాంకేతికతలను అందిస్తుంది. ఈ కంపెనీ విలువ 2022లో 1.5 బిలియన్ డాలర్లు. అయితే దీనిని 2023 నవంబర్ 30న ఆస్ట్రేలియన్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన అట్లాసియన్ కొనుగోలు చేసింది. -
Britain general elections: బ్రిటన్‌లో ప్రశాంతంగా ఎన్నికలు
లండన్: పధ్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు యూకే పౌరులు చరమగీతం పాడనున్నారన్న విశ్లేషణల నడుమ బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పర్వం గురువారం ప్రశాంతంగా పూర్తయింది. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు, వలసల కట్టడిలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్న భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెల్సిందే. ఉదయాన్నే భార్య అక్షతామూర్తితో కలిసి సునాక్ నార్త్ఆలెర్టన్ సిటీ దగ్గర్లోని కిర్బీ సిగ్స్టన్ గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ‘మార్పు’ నినాదంతో ఎన్నికల్లో ఫేవరెట్‌గా నిలిచిన విపక్ష లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ సైతం భార్య విక్టోరియాతో కలిసి ఉత్తర లండన్‌లోని క్యామ్‌డెన్ విల్లింగ్‌హామ్ హాల్ పోలింగ్‌కేంద్రంలో హుషారుగా ఓటేశారు. బ్రిటిష్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడుగంటలకే 40,000 పోలింగ్‌బూత్‌లలో పోలింగ్ మొదలైంది. బ్రిటన్‌లో 4.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 10 గంటలదాకా అంటే భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల దాకా పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ అయిన ‘హౌజ్ ఆఫ్ కామన్స్’లో ఉన్న మొత్తం 650 ఎంపీ స్థానాలకు పోలింగ్ చేపట్టారు. సాధారణ మెజారిటీ సాధించాలంటే 326 సీట్లు గెలవాలి. ప్రధానమైన కన్జర్వేటివ్, లేబర్ పార్టీలతోపాటు లిబరల్ డెమొక్రాట్స్, గ్రీన్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, ఎస్‌డీఎల్‌పీ, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ, సిన్ ఫియెన్, ప్లెయిడ్ సిమ్రూ, ది యాంటీ ఇమిగ్రేషన్ రిఫామ్ పార్టీలతోపాటు స్వతంత్రులు బరిలో దిగారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిశాక ఎగ్జిట్‌పోల్స్ వెలువడే అవకాశముంది. కన్జర్వటివ్ పార్టీ కేవలం 53–150 సీట్లు సాధిస్తుందని, లేబర్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఇప్పటికే ఓపీనియన్స్ పోల్స్ వెల్లడయ్యాయి. -
కెనడా చర్రితలోనే భారీ చోరీ : 400 కిలోల గోల్డ్, విదేశీ కరెన్సీ భారత సంతతికి చెందిన వ్యక్తి అరెస్ట్
టొరంటోలోని ప్రధాన విమానాశ్రయంలో 36 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి భారీచోరికి పాల్పడ్డాడు. భారత్ నుంచి ఇటీవల టొరొంటోకు వచ్చిన అర్చిత్ గ్రోవర్‌ను అధికారులు ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. కెనడా చరిత్రలోనే భారీ చోరీగా నమోదైంది. సుమారు 400 కిలోల బంగారం బిస్కెట్లు, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో చోరీ కేసులో మరో ఐదుగురిని అరెస్టు చేసిన తర్వాత మరో భారత సంతతి నిందితుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఇతగాడిపై ఇప్పటికే అరెస్టు వారెంట్ జారీ అయింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది (2023) ఏప్రిల్ 17 22 మిలియన్లకు పైగా కెనడియన్ డాలర్ల విలువైన 400 కేజీల బంగారు బిస్కెట్లు, విదేశీ కరెన్సీని ఉన్న ఎయిర్ కార్గో కంటైనర్‌ని నకిలీ పత్రాలను ఉపయోగించి తస్కరించినట్టు పీల్స్ ప్రాంతీయ పోలీసులు తెలిపారు. జ్యూరిచ్ నుండి టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ కెనడా విమానంలో బంగారం, కరెన్సీ తో కంటైనర్ వచ్చింది. దీన్ని చాకచక్యంగా ఓ ప్రత్యేక స్థలానికి తరలించారు. ఆ మరుసటి రోజే చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెనడా వ్యాప్తంగా వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు అర్చిత్ గ్రోవర్‌ను టొరంటోలోని విమానాశ్రయంలో అరెస్టు చేసి అభియోగాలు మోపారు. ముఖ్యంగా భారత సంతతికి చెందిన పరమ్‌పాల్ సిధూ (54), అమిత్ జలోతా (40), అమ్మద్ చౌదరి (43), అలీ రజా (37), ప్రసత్ పరమలింగం (35)ను పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ కెనడా సంస్థలో పనిచేసిన మరో భారత సంతతి వ్యక్తి సిమ్రన్ ప్రీత్ పనేసర్ (31), మిసిసాగా ప్రాంతానికి చెందిన అర్సలాన్ చౌదరి (42)లపై కూడా అరెస్టు వారెంట్ లు కూడా జారీ అయ్యాయి. ఈ చోరీలో ఎయిర్ కెనడాకు చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసులో నిందితులుగా ఉన్న సిధూ, పనేసర్లు తమ వద్ద పనిచేశారని ఎయిర్ కెనడా సంస్థ ప్రతినిధి వెల్లడించారు. -
భారత సంతతి వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష!
భారత సంతతి వ్యక్తికి సింగపూర్ హైకోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ప్రియురాలిని హతమార్చిన కేసులో కోర్టు ఈ శిక్ష విదించింది. తన ప్రియురాలు మలికా బేగం రహమాన్సా అబ్దుల్ రెహమాన్‌ని జనవరి 17, 2018 తీవ్రంగా గాయపరిచి హతమార్చాడు. ఈ నేరాన్ని కృష్ణ కోర్టు ఎదుట అంగీకరించాడు. అంతకుమునుపు 2015లో కృష్ణన్ గృహహింస కేసులో అరెస్టు అవ్వడం జరిగింది. తీరు మార్చుకుంటానని చెప్పి విడుదలయ్యాక కూడా అతడి నేర ప్రవృత్తి మానుకోలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇలా మహిళలపై పదేపద గృహహింసకు పాల్పడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కోర్టు స్ఫష్టం చేస్తూ..కృష్ణన్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2015లో కృష్ణన్ భార్య తన భర్త కృష్ణన్ అతడి గర్లఫ్రెండ్ ఇద్దరు కలిసి మద్యం సేవించడాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వెంటనే ఆమె కృష్ణన్ నిలదీయడంతో విస్కీ బాటిల్‌తో కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె కృష్ణన్‌కి క్షమాపణలు చెప్పి ఏం చెయ్యొద్దని బతిమాలుకుంది. ఆ తర్వాత పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి తన గర్లఫ్రెండ్ మల్లికతోనే వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. అయితే 2018లో కృష్ణన్ భార్య పెట్టిన గృహహింస కేసులో అరెస్టయ్యి జైలులో ఉన్నాడు. ఆ టైంలోనే అతడి గర్ల్‌ఫ్రెండ్ పరాయి మగవాళ్లతో రిలేషన్ షిప్ పెట్టుకున్న విషయం తెలుసుకుని తీవ్రంగా కలత చెందాడు. దీంతో ఫుల్‌గా మద్యం తాగి జనవరి 19 2015న మల్లికపై దారుణంగా దాడి చేసి హతమార్చాడు. ఆ రోజు సాయంత్రమే సింగపూర్ ఢిపెన్స్కి కాల్ చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడు తరఫు న్యాయవాది గర్లఫ్రెండ్ మోసాన్నీ జీర్ణించుకోలేక మద్యం మత్తులో చేసిన అఘాయిత్యమని వాదించారు. పైగా తన క్లయింట్ వీక్ఆఫ్ల్లోనే సరదాగా తాగుతుంటాడని చెప్పారు. అయితే కోర్టు మద్యం మత్తులో చేసిన పనే అయినా, ఆ హింస చాలా తీవ్రంగా ఉందని, మహిళల పట్ల ఇలాంటి వాటిని ఉపేక్షించమని పేర్కొంది. అలాగే ఇక్కడ అతడి గర్ల్‌ఫ్రెండ్ జీవించి లేనందున ఆమె పరాయి వాళ్లతో సంబంధం పెట్టుకుందన్న కారణంగా చేసిన నేరంగా పరిగణలోని తీసుకోలేమని స్పష్టం చేసింది ధర్మాసనం. ఇక్కడ నిందితుడు బాధితురాలి పట్ల చాలా హింసాత్మకంగా ప్రవర్తించి హతమార్చాడు, పైగా పోస్ట్‌మార్టం రిపోర్టులో తీవ్ర గాయాలు కారణంగానే బాధితురాలు మరణించిందని వెల్లడయ్యిందని పేర్కొంది. స్త్రీల పట్ల ప్రవర్తించిన ఈ హింసాత్మక ప్రవర్తనకు గానూ నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించింది సింగపూర్ హైకోర్టు. (చదవండి: US: ఐసీఈ కస్టడీలో ఉన్న భారత సంతతి వ్యక్తి మృతి!) -
కెనడాలో భారతీయ విద్యార్థి మృతి
అమెరికాలో జరిగిన వరస భారతీయ విద్యార్థుల మృతి ఘటనలు మరువక మునుపే మరో విషాదకర ఘటన కెనడాలో చోటు చేసుకుంది. కెనడాలోని సౌత్ వాంకోవర్‌కి చెందిన భారత విద్యార్థి తన ఆడి కారులోనే శవమై కనిపించాడు. గుర్తు తెలియని దుండగలు అతడిపై కాల్పులు జరిపినట్లు సౌత్ వాంకోవర్ పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 12 రాత్రి 11 గంటల ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దం వచ్చినట్లు ఈస్ట్ 55 అవెన్యూ నుంచి తమకు సమాచరం వచ్చిందని చెప్పారు. బాధితుడు చిరాగ్ ఆంటిల్(24)గా గుర్తించారు అధికారులు. వాంకోవర్ పోలీసులు ఇంకా అనుమానితులని ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. అగంతకుల ఆచూకీకై దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నట్లు తెలిపారు. బాధితుడి సోదరుడు రోనిత్ ఉదయం చిరాగ్ నుంచి ఫోన్ వచ్చిందని, తాను మాట్లాడానని చెప్పాడు. అయితే అతడు ఆడి కారు తీసుకుని ఎక్కడకో వెళ్లాడు. అప్పుడే ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదనగా చెప్పాడు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా చీఫ్ వరుణ్ చౌదరి సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ విద్యార్థి కుటుంబానికి సహాయం చేయాలని అభ్యర్థించారు. ఈ విషాదకర ఘటనపై తక్షణమే స్పందించి.. దర్యాప్తు వేగంవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అలాగే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చేయాలని ఎక్స్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు చౌదరి. కాగా, చిరాగ్ కుటుంబం అతడి మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు కౌండ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ గోఫండ్ ద్వారా డబ్బును సేకరిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక చిరాగ్ యాంటిల్ సెప్టెంబరు 2022లో వాంకోవర్‌కి వచ్చారు. అతను ఇటీవలే యూనివర్సిటీ కెనడా వెస్ట్‌లో ఎంబీఏ పూర్తి చేసి వర్క్ పర్మిట్ పొందాడని అన్నారు. (చదవండి: ఔరా నయాగారా.. చూడరా లిబర్టీ స్టాచ్యూ.!..!) -
భారత సంతతి వ్యక్తికి ఆరుసార్లు ఆగిన గుండె.. ఆ తర్వాత ఏమైందంటే?
లండన్: బ్రిటన్‌లో లండన్ నగరంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. లండన్ ఆసుపత్రి డాక్టర్లు ఎంతో శ్రమించి భారతీయ-అమెరికన్ విద్యార్థి ప్రాణాలు కాపాడారు. ఏకంగా ఆరుస్లార్లు ఆగిపోయిన గుండెకు ఆపరేషన్ చేసి అతడి ప్రాణాలు నిలబెట్టారు. ఈ ఘటన బ్రిటన్ సహా భారత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. అమెరికాలోని సీటెల్‌కు చెందిన అతుల్ రావ్, ఈ ఏడాది జూలై 27న లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో చదువుతున్నప్పుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అది వచ్చే వరకు సెక్యూరిటీ గార్డు సీపీఆర్ కొనసాగించాడు. వెంటనే అంబులెన్స్‌లో హామర్స్మిత్ హాస్పిటల్‌కు తరలించారు.కాగా, అతుల్ రావ్ ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె నుంచి రక్త ప్రవాహాన్ని అడ్డుకున్నట్లు వైద్య పరీక్షల్లో డాక్టర్లు నిర్దారించారు. పల్మనరీ ఎంబోలిజం అని పిలిచే ఈ పరిస్థితిలో అతడి గుండె ఆరు స్లార్లు ఆగినట్లు వైద్యులు తెలిపారు. #IndianAmerican student chooses career in medicine after #UK #NHS medics save his life after his heart stopped 6 times due to blood clots.#CardiacArrest #PulmonaryEmbolism #hearthealth https://t.co/R3NJZipmuQ — National Herald (@NH_India) October 5, 2023 ఈ నేపథ్యంలో ఆ ఆసుపత్రి డాక్టర్లు రాత్రంగా శ్రమించి అతడి ప్రాణాలు కాపాడారు. మరుసటి రోజున సెయింట్ థామస్ హాస్పిటల్‌కు తరలించి ఎక్మోపై చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత అతడు అమెరికా వెళ్లిపోయాడు. ప్రస్తుతం టెక్సాస్‌లోని బేలర్ యూనివర్సిటీలో ప్రీ మెడికల్ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నాడు. మరోవైపు, భారతీయ-అమెరికన్ విద్యార్థి అతుల్ రావ్ తాజాగా తన తల్లిదండ్రులతో కలిసి లండన్ వెళ్లాడు. ఈ సందర్భంగా తన ప్రాణాలు కాపాడిన వ్యక్తులు, ఆసుపత్రిని సందర్శించాడు. తల్లిదండ్రులతో కలిసి అక్కడి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. -
గర్లఫ్రెండ్ పై పైశాచిక దాడి... జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు
Indian-Origin Malaysian Jailed: పార్తిబన్ అనే భారతీయ సంతతికి చెందిన మలేషియన్‌కి సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించింది. పార్తిబిన్ తన గర్లఫ్రెండ్‌ని పదేపదే భయబ్రాంతులకు గురిచేసేలా బెదిరించి పైశాచికంగా దాడి చేయడంతో ఈ శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది. అంతేకాదు పార్తిబిన్ తన సహోద్యోగురాలితో గత రెండు, మూడు సంవత్సారాలుగా డేటింగ్లో ఉన్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జేమ్స్ ఎలిషా మాట్లాడుతూ...అతని ప్రవర్తన తీరు నచ్చాక అతనికి దూరంగా వచ్చేసి ఆమె తన మేనమామతో కలిసి ఉంటోంది. దీంతో అతను ఆమె పై పదే పదే భయబ్రాంతులకు గురిచేసేలా దాడి చేయడం ప్రారంభించాడు. ఆమెను అసభ్య పదజాలంతో దూషించి కొట్టడంతో ఆమె మేనమామ కలగజేసకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. అయిన అతను వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెయిల్ పై వచ్చి మళ్లీ ఆమె మేనమామ ప్లాట్ వద్దకు వచ్చాడు. ఐతే ఆమె నిరాకరిచడంతో గేట్ పగలుగొట్టి వచ్చి మరీ ఆమెను దారుణం హింసించి కారులో తీసుకుపోయేందకు యత్నించాడు. ఐతే ఆమె అక్కడ ఉండే స్థానికులను సాయంతో పోలీసులను రప్పించి అరెస్టు చేసింది. మళ్లీ బెయిల్ పై వచ్చి ఈ సారి ఏకంగా చంపేందకు పథకం వేశాడు. అందులో భాగంగా తన వస్తువులు తీసకునేందుకు వచ్చానంటూ ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చాడు. ఆ తర్వాత ఆమెను కత్తితో బెదిరించి హింసించడం మొదలు పెట్టాడు.ఇక తట్టుకోలేక ఆమె చచ్చిపోదాం అనుకుంటుండగా...ఇంతలో ఒక పోలీస్ కారు అటువైపుగా వెళ్తుండటంతో ఆమె వారి సాయం కోరింది. దీంతో పార్తిబన్ వెంటనే అప్రమత్తమైన తప్పించుకునేందకు యత్నించాడు. కానీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. అతను విచారణలో అతనిపై మోపబడిన ఆరోపణలన్నింటిని అంగీకరించాడని చెప్పారు. ఇలా అతను తన ప్రేయసిని పదేపదే పైశాచికంగా హింసించి హత్య చేసేందుకు యత్నించినందుకు గానూ ఏడు నెలల మూడు వారాల జైలు శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది. ఐతే బాధితురాలి తరుపు న్యాయవాది ఆమెను గాయపరిచి, తీవ్రంగా హింసించినందుకుగానూ పార్తిబన్‌కి ఏడు నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష విధించాలని కోరడంతో అతనికి రెండు నుంచి మూడేళ్లు జైలు శిక్షతో పాలు జరిమాన కూడా విధించే అవకాశ ఉందంటున్నారు అధికారులు. (చదవండి: అఫ్గనిస్తాన్‌లో మళ్లీ భూకంపం.. ఇంకా శవాల దిబ్బలుగానే..) -
నిజాయతీ: చేతికి దొరికిన రూ.7 కోట్లు తిరిగిచ్చేశారు
మసాచుసెట్స్: రూపాయి దొరికితేనే ఎవరి కంటబడకుండా జేబులో వేసుకుని.. అక్కడ నుంచి జారుకునే రోజులివి. అలాంటిది ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా కోట్ల రూపాయలు దొరికితే ఎవరైనా తిరిగిచ్చేస్తారా.. ఎక్కువ శాతం మంది చెప్పే సమాధానం లేదనే. కానీ అక్కడక్కడ కొందరు నిజాయతీపరులుంటారు. వారి దృష్టిలో పరుల సొమ్ము పాముతో సమానం. అందుకే ఎంత భారీ మొత్తం దొరికినా అందులో రూపాయి కూడా ముట్టరు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మసాచుసెట్స్‌లో చోటు చేసుకుంది. భారత సంతతి కుటుంబం తమకు దొరికిన 1 మిలియన్ డాలర్(7,27,80,500 రూపాయలు) ప్రైజ్‌మనీ గెలుచుకున్న లాటరీ టికెట్‌ను దాని యజమానిదారుకు అప్పగించారు. ప్రస్తుతం ఆ కుటుంబంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనలు. ఆ వివారలు.. మౌనిశ్ షా అనే భారత సంతతి వ్యక్తి మసాచుసెట్స్‌లో సొంతంగా ఓ స్టోర్ నడుపుతున్నాడు. లాటరీ టికెట్లను కూడా అమ్ముతుంటారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మౌనిశ్ షా భార్య 1 మిలియన్ డాలర్ విలువ చేసే లాటరీ టికెట్‌ని లీస్ రోజ్ ఫిగా అనే మహిళకు అమ్మింది. అదృష్టం కొద్ది ఆ టికెట్‌కే లాటరీ తగిలింది. అయితే లీస్ రోజ్ షిగా ఆ టికెట్‌ని సరిగా స్క్రాచ్ చేయకుండానే.. తనకు లాటరీ తగలలేదని భావించి స్టోర్‌లో ఉన్న చెత్త డబ్బాలో పడేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మౌనిశ్ షా కుమారుడు అభి షా సాయంత్ర డస్ట్‌బిన్‌లో ఉన్న టికెట్లను బయటకు తీసి చెక్ చేయగా.. లీస్ రోజ్ ఫిగా టికెట్‌ను సరిగా స్క్రాచ్ చేయకపోవడం చూసి.. దాన్ని పూర్తిగా గీకి చూడగా.. ఆ నంబర్‌కే లాటరీ తగిలిందని గమనించాడు. చేతిలో ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే టికెట్ చూసి అభి ఉద్వేగానికి లోనయ్యాడు. వెంటనే దీని గురించి తల్లిదండ్రులకు చెప్పాడు. ముందు అభి ఆ డబ్బుతో టెస్లా కారు కొనాలని భావించాడు. కానీ అతడి తల్లిదండ్రులు ఆ టికెట్‌ను దాన్ని కొన్న లీస్ రోజ్ ఫిగాకు అప్పగించాలని భావించారు. దీని గురించి అభి భారతదేశంలో నివసిస్తున్న తన తాతయ్య, నానమ్మలకు చెప్పగా వారు కూడా ఆ టికెట్ ఎవరిదో వారికి తిరిగి ఇచ్చేయమన్నారు. ‘‘దాన్ని మన దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదు. టికెట్ వారికి తిరిగి ఇచ్చేయండి.. ఒకవేళ మీ అదృష్టంలో రాసిపెట్టి ఉంటే మీకే సొంతమవుతుంది’’ అన్నారు. దాంతో ఆ టికెట్‌ను లీస్ రోజ్ ఫిగాకు తిరిగి ఇచ్చేయాలని భావించాను’’ అన్నాడు అభి షా. ఇక మరుసటి రోజు అభి తల్లిదండ్రులను తీసుకుని లీస్ రోజ్ ఫిగా పని చేస్తున్న చోటకు వెళ్లి.. ‘‘మా అమ్మనాన్న మీతో మాట్లాడాలనుకుంటున్నారు.. ఒక్క నిమిషం బయటకు రండి అని పిలిచాను. బయటకు వచ్చాక ఆమెకు తను కొన్న టికెట్ అప్పగించాం’’ అన్నాడు. ఈ సందర్భంగా లీస్ రోజ్ ఫిగా మాట్లాడుతూ.. ‘‘అక్కడి వెళ్లాక వారు నా చేతిలో నేను డస్ట్‌బిన్‌లో పడేసిన టికెట్ నా చేతిలో పెట్టారు. దానికే ప్రైజ్‌మనీ వచ్చిందని తెలిపారు. అది చూసి నా కళ్లని నేను నమ్మలేకపోయాను.. సంతోషంతో అక్కడే కూర్చుని గట్టిగా ఏడ్చాను. ఆ తర్వాత వారిని కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపాను. లోకంలో ఇంత నిజయాతీపరులు ఉంటారని కలలో కూడా ఊహించుకోలేదు. జీవితాంతం వారికి రుణపడి ఉంటాను. దేవుడు వారిని చల్లగా చూడాలి’’ అని తెలిపింది. చదవండి: నాన్న ఇచ్చిన నాణెం: కోట్లు కురిపించింది! -
ఇంట్లో వాకింగ్‌కు గిన్నిస్ రికార్డు!
లండన్: బరువు తగ్గడం కోసం ఇంట్లో వాకింగ్ చేస్తూవచ్చిన 70 ఏళ్ల పెద్దాయనకు తాను ప్రపంచ రికార్డు నెలకొల్పినట్లు డౌటు వచ్చింది. అనుమానం వచ్చిందే తడవు వెంటనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు లేఖ రాశాడు. ఆయన రికార్డును ప్రస్తుతం గిన్నిస్ బుక్ పరిశీలిస్తోంది. వింటుంటే వింతగా ఉందా! కానీ ఇదే నిజం. ఐర్లాండ్‌కు చెందిన భారతీయ సంతతి ఇంజనీర్ వినోద్ బజాజ్ తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు లేఖ రాశారు. తాను 1500 రోజుల్లో భూమి చుట్టుకొలతకు సమానమైన 40,075 కిలోమీటర్ల దూరం నడిచానని చెప్పుకొచ్చారు. తన నడకను లెక్కగట్టేందుకు ఎలక్ట్రానిక్ డివైజ్‌ను వాడానని సాక్ష్యం చూపుతున్నారు. 2016లో బరువు తగ్గే ఉద్దేశ్యంతో వాకింగ్ ఆరంభించినట్లు ఆయన చెప్పారు. క్రమంగా ఇది ఒక అలవాటుగా మారిందన్నారు. తొలి ఏడాది పూర్తయ్యేసరికి 7600 కిలోమీటర్ల దూరం పూర్తి చేసినట్లు పేసర్ ట్రాకర్ యాప్ చూపిందని చెప్పారు. రెండో ఏడాదికి తన నడక 15200 కిలోమీటర్లను దాటిందన్నారు. ఇది చంద్రుడి చుట్టుకొలత కన్నా ఎక్కువ. ఈ ఏడాది సెప్టెంబర్ 21కి భూ చుట్టుకొలతకు సమానమైన దూరం తాను నడిచినట్లు నమోదయిందని తెలిపారు. ఇందుకు మొత్తం 1496 రోజులు పట్టిందన్నారు. చెన్నై నుంచి వినోద్ 1975లో స్కాట్లాండ్ వచ్చారు. తర్వాత ఐర్లాండ్‌లో స్థిరపడ్డారు. -
ఆపిల్ సీఈవోకు వేధింపులు, ఫిర్యాదు
శాన్ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌పై భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. పాలో ఆల్టోలోని కుక్ అధికారిక నివాసంలోకి రెండు సార్లు అక్రమంగా చొరబడి అనుచితంగా ప్రవర్తించడంతో పాటు, ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై ఆపిల్ ఫిర్యాదు చేయడంతో కాలిఫోర్నియా కోర్టు అతనిపై తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. సిలికాన్ వ్యాలీలోని కుక్ నివాసం, ఆయన సెక్యూరిటీ గార్డులు ముగ్గురు, ఆపిల్ పార్క్ ప్రధాన కార్యాలయానికిదూరంగా ఉండాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 3వ తేదీ దాకా ఈ ఉత్తర్వులు అమల్లో వుంటాయని కోర్టు తెలిపింది. ఆపిల్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ విలియం బర్న్స్ ప్రకారం శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన రాకేశ్ శర్మ అలియాస్ "రాకీ" (41) రెండుసార్లు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు. 25 సెప్టెంబర్ 2019న వాయిస్ మెయిల్‌తో శర్మ వేధింపులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 4 న షాంపైన్ బాటిల్, పువ్వులు తీసుకొని అనుమతిలేకుండా నేరుగా కుక్ ఇంటికి వచ్చాడు. ఒక వారం తరువాత మరో అవాంఛనీయ కాల్ చేసిన బెదిరింపులకు పాల్పడ్డాడు. కొంతకాలం తర్వాత, శర్మ తన ట్విటర్ ఖాతాలో ఆపిల్ ఎగ్జిక్యూటివ్‌ను ట్యాగ్ చేస్తూ కొన్నిఅభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఫోటోలు షేర్ చేశాడు. అలాగే జనవరి 15 న మరోసారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుండగా భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని హెచ్చరిస్తూ ఆపిల్ న్యాయవాదులు రాకీకి ఒక లేఖ పంపారు. అయినా ఏ మాత్రం బెదరని రాకీ ఈసారి ఆపిల్ టెక్నికల్ టీంకు కాల్ చేశాడు. కంపెనీ తనను చంపడానికి చూస్తోందని ఆరోపించాడు. మళ్లీ ఒక నెల తరువాత తిరిగి వచ్చిన అతగాడు ఏకంగా టిమ్ కుక్ నివాసంలోని గేటులోకి ప్రవేశించి డోర్ బెల్ మోగించాడని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. మరోవైపు కుక్ నివాసం వద్ద పదపదే నిబంధనలను ఉల్లంఘించడం, తుపాకీ గురించి మాట్లాటడం చేశాడని, శారీరకంగా తనకు హాని చేస్తాడని గట్టిగా నమ్ముతున్నానని కుక్ సెక్యూరిటీ బృందంలోని ఒక సభ్యుడు ఆరోపించారు. -
అమెరికా ఎఫ్ఈఆర్సీ ఛైర్మన్‌గా భారతీయ సంతతి వ్యక్తి
అమెరికా ఫెడరల్ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్(ఎఫ్ఈఆర్సీ) ఛైర్మన్‌గా భారతీయ సంతతికి చెందిన నెయిల్ ఛటర్జీని అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ నియమించారు. అమెరికా పవర్ గ్రిడ్, వేలకోట్ల డాలర్ల విద్యుత్ ప్రాజెక్ట్‌లు ఎఫ్ఈఆర్సీ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఎఫ్ఈఆర్సీ ఛైర్మన్‌గా ఉన్న కెవిన్ మేక్ ఇంటైర్ స్థానంలో భారతీయసంతతికి చెందిన నైయిల్ ఛటర్జీ ని నియమించిన విషయాన్ని బుధవారం వైట్‌హౌస్ ప్రకటించింది. అనారోగ్య కారణాల రీత్యా మెక్ ఇంటైర్ ఈనెల 22వ తేదీన రాజీనామా చేయడంతో ఇప్పటికే ఎఫ్ఈఆర్సీ కమిషనర్‌గా కొనసాగుతోన్న ఛటర్జీని ట్రంప్ ఆ స్థానంలో భర్తీ చేస్తూ నిర్ణయం చేసారు. ఛటర్జీ ఎఫ్ఈఆర్సీ ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తించడం ఇది రెండోసారి. గతంలో మెక్ ఇంటైర్ ఎఫ్ఈఆర్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించకముందు 2017 ఆగస్టు 10 నుంచి డిసెంబర్ 7 వరకు ఛటర్జీ ఆ బాధ్యతలు నిర్వర్తించారు. అమెరికా సెనేట్ మెజారిటీ నాయకుడు మిచ్ మెక్ కన్నెల్కి ఛటర్జీ విద్యుత్ విధాన సలహాదారుగా పనిచేస్తున్న సందర్భంలో మేజర్ విద్యుత్ విధానాలూ, రహదారుల కు సంబంధించిన చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 50 ఏళ్ళ క్రితమే కలకత్తా నుంచి ఛటర్జీ కుటుంబం అమెరికాకు చేరింది. లగ్జింగ్టన్, కెంటక్కీలో నివసించే ఛటర్జీ సెయింట్ లారెన్స్ యూనివర్సిటీ నుంచీ యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి లా కాలేజ్ నుంచీ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసారు. మెక్ కన్నెల్కి సలహాదారుగా పనిచేయకముందు ఛటర్జీ ప్రభుత్వం తరఫున జాతీయ గ్రామీణ విద్యుత్ కోఆపరేటివ్ అసోసియేషన్ కి ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. ఓహియోలోని రిపబ్లికన్ కాన్ఫరెన్స్ ఛైర్‌వుమన్ దబోరా ప్రైస్ కి సహాయకుడిగా పనిచేసారు. ప్రాజెక్టుల నిర్మాణాలకి అనుమతులివ్వడం, విద్యుత్ ధరల నిర్ణయం, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ రంగాల్లో ఎఫ్ఈఆర్సీ ది కీలక పాత్ర. ఎఫ్ఈఆర్సీ ప్రభుత్వ విద్యుత్ విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. -
భారత సంతతి వ్యక్తికి ఐన్‌స్టీన్ ప్రైజ్
చికాగో: భౌతికశాస్త్రంలో అత్యున్నత సేవలందించిన వారికి ప్రోత్సాహకంగా అమెరికన్ ఫిజికల్ సొసైటీ (ఏపీఎస్) అందజేస్తున్న ప్రతిష్టాత్మక ‘ఐన్‌స్టీన్ ప్రైజ్’కు ఈ ఏడాది భారత సంతతి వ్యక్తి ప్రొఫెసర్ అభయ్ అష్టేకర్ ఎంపికయ్యారు. అక్టోబర్ 23న జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో అభయ్ ఐన్‌స్టీన్ ప్రైజ్–2018తోపాటు పదివేల డాలర్లను నగదు ప్రోత్సాహకాన్ని అందుకుంటారు. అభయ్ ప్రస్తుతం ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తుండడంతోపాటు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషన్ అండ్ ది కాస్మోస్‌కి డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా అభయ్ మాట్లాడుతూ... ‘ఈ అవార్డు గెలుచుకోవడం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఏపీఎస్ అందించే పురస్కారాల్లో ఇదే అత్యంత గౌరవమైంది. భారత్‌లో విద్యనభ్యసిస్తున్నప్పటి నుంచి నాకు భౌతికశాస్త్రంపై ఎంతో ఆసక్తి ఉండేది. మొదట్లో నాకు కేవలం ఒక మరాఠీ మాత్రమే తెలిసేది. పదకొండో తరగతి వరకు మరాఠీ మీడియంలో చదువుకున్నాను. హిందీ, ఇంగ్లిష్ భాషలపై పట్టుసాధించిన తర్వాత సంస్కృతిపై భాష ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని తెలుసుకున్నాను. కాలేజీ రోజుల్లో నేర్చుకున్న భౌతికశాస్త్రం ప్రకృతిని అర్థం చేసుకోడానికి ఎంతగానో ఉపయోగపడింద’న్నారు. 1974లో యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి పీహెచ్‌డీని పూర్తిచేసిన అభయ్... లూప్ క్వాంటమ్ గ్రావిటీ ప్రోగ్రామ్‌పై అనేక పరిశోధనలు చేశారు. -
సంక్లిష్టతా యుగ ప్రతినిధి
వలస ప్రజల వ్యథలను, వలసవాద రాజకీయాలను, మతఛాందసవాదపు దుష్టపోకడలను ఎలుగెత్తి చాటిన అపురూపమైన కలం కనుమరుగైపోయింది. సామాన్యుడినే కథా వస్తువుగా స్వీకరించి నోబెల్ కిరీ టాన్ని అందుకున్న ప్రముఖ రచయిత వీఎస్ నైపాల్ (85) శనివారం లండన్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్. వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో భారతీయ హిందూ కుటుంబంలో జన్మించినా, ఇంగ్లండ్‌లోనే ఎక్కువగా గడిపిన నయపాల్ జీవితం సంక్లిష్టమైన సాంస్కృతిక వైవిధ్యతల మధ్య కొట్టుమిట్టులాడింది. కొనార్డ్, చార్లెస్ డికెన్స్, టాల్‌స్టాయ్‌ల జీవితాలతో పోలిస్తే నైపాల్ సాహిత్య జీవితాన్ని వలసవాదానికి బలైన మూడో ప్రపంచ దేశాల అవ్యవస్థత పట్ల విమర్శకు ప్రతిబింబంగా చెప్పవచ్చు. పాశ్చాత్య నాగ రికతకు బలమైన మద్దతుదారుగా నిలబడినప్పటికీ విశ్వజనీనవాదమే ఆయన తాత్వికత. అందుకే ‘వెస్టిండియన్ నవలాకారుడి’గా తన పేరును కేటలాగ్‌లో చేర్చిన ఒక ప్రచురణకర్తతో తన సంబంధాలనే తెంచుకున్నాడు నైపాల్. భారతీయ మూలాలు : వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో 1932 ఆగస్టు 17న జన్మించిన విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ మూలాలు భారతదేశంలో ఉన్నాయి. ఆయన తాత 1880లో ఇండియా నుంచి వలస వచ్చి ట్రినిడాడ్‌లోని చెరకు తోటల్లో పనిచేశారు. తండ్రి శ్రీప్రసాద్ ట్రినిడాడ్‌లో గార్డియన్ పత్రికకు విలేకరిగా పనిచేశారు. బాల్యంలో పేదరికం అనుభవించిన నైపాల్ 18 ఏళ్ల వయస్సులో లండన్ లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపకార వేతనం అందుకున్న తర్వాత మిగిలిన జీవితంలో ఎక్కువకాలం అక్కడే గడిపారు. చదువుకునే రోజుల్లోనే నవల రాయగా ప్రచురణ కాలేదని కినిసి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు. కానీ 1955లో పాట్రీసియా ఆన్ హేల్‌ను పెళ్లాడిన తర్వాత ఆమె ప్రేరణతో సాహిత్య కృషిలో కుదురుకున్నారు. 1954లో ఆక్స్ఫర్డ్ విడిచిపెట్టి ఉద్యోగ రీత్యా లండన్ చేరిన నైపాల్ అక్కడే స్థిరపడ్డారు. అనంతరం కాల్పనిక, కాల్పనికేతర సాహిత్యంలో 30కి పైగా పుస్తకాలు రచించిన లబ్దప్రతిష్టుడయ్యారు. ద హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్, ఎ బెండ్ ఇన్ ది రివర్, ది ఎనిగ్మా ఆఫ్ ఎరైవల్ లాంటి ప్రఖ్యాత రచనలు ఆయన జీవి తాన్ని మలుపుతిప్పాయి. ‘‘ఇన్ ఏ ఫ్రీ స్టేట్’’ పుస్తకానికిగాను బుకర్ ప్రైజ్‌ను అందుకున్నారు. 2001లో ప్రఖ్యాత నోబెల్ సాహితీ పురస్కారం గెలిచారు. రాయడం అంటే జీవితంలో వెనక్కు వెళ్లి తరచి చూడటమే, స్వీయ జ్ఞానానికి అది ప్రారంభం అని చెప్పుకున్న నైపాల్ తొలి నవల ది మిస్టిక్ మసాయిర్ 1957లో వెలువడి బాగా ప్రజాదరణ పొందింది. తన జీవితనేపథ్యం ఆధారంగా రాసిన ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్ (1961), ఆర్థికంగా తన భార్యపై ఆధారపడవలసి వచ్చిన ఒక నడివయస్సులోని జర్నలిస్టు విముక్తి పయనం గురించి వర్ణిస్తుంది. అది తన జీవితమే. ఉద్యోగంలేని స్థితిలో భార్య నైపాల్‌ను కొంతకాలం పోషించింది. ఈ పరాధినతా భారాన్ని తప్పించుకునే ప్రయత్నంలో ఆయన రాసిన తన జీవిత చరిత్ర సమకాలీన తరంలో అత్యంత ప్రముఖ రచయితల్లో ఒకరిగా మార్చింది. 1960లనాటికి కాల్పనికేతర సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాడు. మనకు తెలియని కొత్త ప్రపంచానికి కాల్పనికేతర సాహిత్యమే తలుపులు తెరుస్తుందని పేర్కొన్నాడు. 1962లో వెస్టిండీస్‌కి తిరిగి వెళ్లినప్పుడు తాను రాసిన ది మిడిల్ ప్యాసేజ్ రచనలో ట్రినిడాడ్‌లోని జాతి వివక్షాపరమైన ఉద్రిక్తతలను చిత్రించాడు. వలసవాదం నుంచి విముక్తి పొందిన కరీబియన్ చిన్న దీవుల్లో పర్యాటకరంగం ముసుగులో కొత్త బానిసత్వానికి ప్రజలు అమ్ముడుపోవడం జరుగుతోందని పసిగట్టాడు. 1964లో రాసిన తొలి పర్యాటక నవల ‘యాన్ ఏరియా ఆఫ్ డార్క్నెస్’లో భారత్ గురించి రాశాడు. తన మూలాలు భారత్‌లో ఉన్నప్పటికీ తాను ఇప్పుడు భారత్‌కు చెందడం లేదని కనుగొన్నాడు. పైగా జాతీయవాదం పేరిట భారతీయులు బ్రిటిష్ వారినే అనుకరిస్తున్నారని విమర్శించాడు. తాను పుట్టిపురిగిన ప్రాంతాలకు కూడా దూర మైన నైపాల్‌ను ఆఫ్రికన్ రచయితలు చాలామంది వ్యతిరేకించారు. పాశ్చాత్య ప్రపంచం నల్లవారిపై మోపిన కాల్పనికతలవైపే నైపాల్ మొగ్గు చూపుతున్నాడని నైజీరియన్ రచయిత చినువా అచెబె పేర్కొన్నారు. అయితే విశ్వజనీన నాగరికత ఎప్పటిౖకైనా భూమిపై విల్లసిల్లుతుందన్న నమ్మకాన్ని చివరికంటా పాదుకున్న నైపాల్ మానవ సంక్లిష్టతా వైరుధ్యాల మధ్యే జీవితం గడిపాడు, ముగించాడు కూడా. -కె. రాజశేఖరరాజు -
సుత్తితో కొట్టి కొడుకును చంపిన ఎన్నారై
లండన్: బ్రిటన్‌లో ఓ భారత సంతతి వ్యక్తి తన కొడుకును సుత్తితో కొట్టి చంపడంతోపాటు కూతురిపైనా దాడి చేయడంతో ఆమె పూర్తిగా చూపును, పాక్షికంగా వినికిడి శక్తిని కోల్పోయింది. కవల పిల్లలైన వీరి వయసు ఏడాదే. బిద్యా సాగర్ దాస్(33) అనే వ్యక్తి లండన్‌లోని ఫిన్స్‌బరీ పార్క్ సమీపంలో ఓ ఇంట్లో తన భార్య క్రిస్టినెలా, కూతురు మారియా, కొడుకు గాబ్రియేల్‌లతో కలిసి ఉండేవాడు. దగ్గర్లోని ఓ హోటల్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే దాస్.. మార్చి 18న పిల్లలపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన జరిగిన 20 గంటల తర్వాత అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని థేమ్స్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును క్రౌన్ కోర్టుకు బదిలీ చేయాలని మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని స్థానికులను పోలీసులు కోరారు.