భారత సంతతి వ్యక్తికి సింగపూర్ హైకోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ప్రియురాలిని హతమార్చిన కేసులో కోర్టు ఈ శిక్ష విదించింది. తన ప్రియురాలు మలికా బేగం రహమాన్సా అబ్దుల్ రెహమాన్‌ని జనవరి 17, 2018 తీవ్రంగా గాయపరిచి హతమార్చాడు. ఈ నేరాన్ని కృష్ణ కోర్టు ఎదుట అంగీకరించాడు. అంతకుమునుపు 2015లో కృష్ణన్ గృహహింస కేసులో అరెస్టు అవ్వడం జరిగింది. తీరు మార్చుకుంటానని చెప్పి విడుదలయ్యాక కూడా అతడి నేర ప్రవృత్తి మానుకోలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇలా మహిళలపై పదేపద గృహహింసకు పాల్పడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కోర్టు స్ఫష్టం చేస్తూ..కృష్ణన్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
2015లో కృష్ణన్ భార్య తన భర్త కృష్ణన్ అతడి గర్లఫ్రెండ్ ఇద్దరు కలిసి మద్యం సేవించడాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వెంటనే ఆమె కృష్ణన్ నిలదీయడంతో విస్కీ బాటిల్‌తో కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె కృష్ణన్‌కి క్షమాపణలు చెప్పి ఏం చెయ్యొద్దని బతిమాలుకుంది. ఆ తర్వాత పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి తన గర్లఫ్రెండ్ మల్లికతోనే వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. అయితే 2018లో కృష్ణన్ భార్య పెట్టిన గృహహింస కేసులో అరెస్టయ్యి జైలులో ఉన్నాడు. ఆ టైంలోనే అతడి గర్ల్‌ఫ్రెండ్ పరాయి మగవాళ్లతో రిలేషన్ షిప్ పెట్టుకున్న విషయం తెలుసుకుని తీవ్రంగా కలత చెందాడు.
దీంతో ఫుల్‌గా మద్యం తాగి జనవరి 19 2015న మల్లికపై దారుణంగా దాడి చేసి హతమార్చాడు. ఆ రోజు సాయంత్రమే సింగపూర్ ఢిపెన్స్‌కి కాల్ చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడు తరఫు న్యాయవాది గర్లఫ్రెండ్ మోసాన్నీ జీర్ణించుకోలేక మద్యం మత్తులో చేసిన అఘాయిత్యమని వాదించారు. పైగా తన క్లయింట్ వీక్‌ఆఫ్‌ల్లోనే సరదాగా తాగుతుంటాడని చెప్పారు. అయితే కోర్టు మద్యం మత్తులో చేసిన పనే అయినా, ఆ హింస చాలా తీవ్రంగా ఉందని, మహిళల పట్ల ఇలాంటి వాటిని ఉపేక్షించమని పేర్కొంది.
అలాగే ఇక్కడ అతడి గర్ల్‌ఫ్రెండ్ జీవించి లేనందున ఆమె పరాయి వాళ్లతో సంబంధం పెట్టుకుందన్న కారణంగా చేసిన నేరంగా పరిగణలోని తీసుకోలేమని స్పష్టం చేసింది ధర్మాసనం. ఇక్కడ నిందితుడు బాధితురాలి పట్ల చాలా హింసాత్మకంగా ప్రవర్తించి హతమార్చాడు, పైగా పోస్ట్‌మార్టం రిపోర్టులో తీవ్ర గాయాలు కారణంగానే బాధితురాలు మరణించిందని వెల్లడయ్యిందని పేర్కొంది. స్త్రీల పట్ల ప్రవర్తించిన ఈ హింసాత్మక ప్రవర్తనకు గానూ నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించింది సింగపూర్ హైకోర్టు.
Comments
Please login to add a commentAdd a comment