పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం | US based TCS techie Bitan Adhikary Passed away Pahalgam tragedy | Sakshi
Sakshi News home page

పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం

Published Wed, Apr 23 2025 12:03 PM | Last Updated on Wed, Apr 23 2025 1:29 PM

 US based TCS techie  Bitan Adhikary Passed away Pahalgam tragedy

అవే చివరి మాటలనుకోలేదు : మృతుడికుటుంబం కన్నీరు మున్నీరు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి మారణకాండ సృష్టించారు. అనంతనాగ్‌ జిల్లా పహల్గాం (Pahalgam terror attack) పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా  చేసిన దాడిలో  అనేకమంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మినీ స్విట్జర్లాండ్‌గా  పేరొందిన  పహల్గాంలోని బైసరాన్‌కు విహార యాత్ర కోసం వచ్చి, ప్రకృతి అందాల మధ్య సేద తీరుతున్న  తరుణంలో ఉగ్రమూకలు వారిపై దాడికి తెగబడ్డారు.   ఆనందంగా గడుపుతూ తమతో మాట్లాడిన కొన్ని గంటల్లోనే తమ ఆప్తులు విగతజీవులుగా మారిన ఘటన పర్యాటకుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన హృదయ విదారక   సంగతులు వెలుగుచూస్తున్నాయి.   ఈ విషాదకర  దాడిలో కొంతమంది ఎన్‌ఆర్‌ఐలు కూడా ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో  మరణించిన 26 మందిలో అమెరికాలో ఉంటున్న 40 ఏళ్ల  టీసీఎస్‌కు చెందిన టెకీ బితాన్ అధికారి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాలోని బ్రాండన్‌లో నివసిస్తున్న బితాన్ ఈ నెల ప్రారంభంలో  భార్య సోహిని ,మూడేళ్ల కుమారుడితో కలిసి కోల్‌కతాకు వచ్చిన  టీసీఎస్ ‌ఉద్యోగి  విహార యాత్ర విషాదంగా ముగిసింది. మంగళవారం  నాడు ఆయన కూడా  ఉగ్రతూటాలకు బలైనారు.  

ఈ దాడిలో బితాన్ భార్య సోహిని ,కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది. లాన్‌మీద కూర్చని ఉన్నాం...అకస్మాత్తుగా సాయుధ వ్యక్తులు వచ్చి హిందువు,ముస్లిం ఎవరు అని అడిగారు.. ఎటూ కదలడానికి కూడా అవకాశమివ్వలేదు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.దీంతో నా భర్త అక్కడికక్కడే  కుప్పకూలిపోయారంటూ విలపించింది. ఈ గురువారం తిరిగి  వెళ్లిపోవాల్సి ఉంది..ఇంతలోనే ఇలా జరిగిందంటూ కన్నీటి పర్యంతమైంది. 

టీసీఎస్‌లో ఉద్యోగ రీత్యా 2019లో అమెరికాకు వెళ్లారు బితాన్ అధికారి. ఆయన పశ్చిమ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఏప్రిల్ 8న బెంగాలీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి కోల్‌కతాకు వచ్చారు.   తరువాతఏప్రిల్ 16న కాశ్మీర్‌కు  వెళ్లారు. 

‘‘సెలవుల్లో అక్కడివెళ్లారు. అందరమూ  వెళదామనుకున్నాం. కానీ కోడలితో వెళ్లమని నేనే చెప్పాను. ఈరోజు కూడా మధ్యాహ్నం కూడా అతనితో మాట్లాడాను.  ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు‘‘ అంటూ బితాన్‌ తండ్రి  ఆవేదన  వ్యక్తం చేశారు.  ‘‘మధ్యాహ్నం తనతో మాట్లాడాను. వాళ్లు కాశ్మీర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత,  దగ్గరిలోని ప్లేసెస్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాం.. కానీ అవే  చివరి మాటలవుతా =యని అస్సలు అనుకోలేదంటూ  మృతుడి  సోదరుడు వాపోయారు.

ఈ ఘటనపై కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సంతాపాన్ని తెలుపుతూ ట్వీట్‌ చేశారు. బాధితుల్లో ఒకరు, బెంగాల్‌కు బితాన్ అధికారి భార్యతో ఫోన్‌లో మాట్లాడానని, ఈ  దుఃఖ సమయంలో ఆమెను ఓదార్చడానికి మాటలు సరిపోవడం లేదని విచారం ప్రకటించరాఉ. తని మృతదేహాన్ని కోల్‌కతాలోని అతని ఇంటికి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చాను. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన  కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అటు బెంగాల్ మంత్రి అరూప్ బిశ్వాస్  కోల్‌కతాలోని  బాధిత కుటుంబాన్ని కలిశారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర హోం శాఖ,న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ,జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంతో సంప్రదిస్తున్నట్టు   వెల్లడించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement