పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు | Pahalgam Attack April 23rd Latest updates | Sakshi
Sakshi News home page

పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు

Published Wed, Apr 23 2025 10:24 AM | Last Updated on Wed, Apr 23 2025 9:23 PM

Pahalgam Attack  April 23rd Latest updates

పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం సీరియస్‌.. అప్‌డేట్స్‌

భారత్‌లో ఉన్న పాక్‌ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి: విక్రమ్‌ మిస్రీ

  • విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియా సమావేశం

  • పాక్‌ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదు

  • పహల్గాం దాడివెనుక పాక్‌ హస్తం ఉంది

  • మా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి

  • ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం

  • ఇండస్‌ వాటర్‌ ఒప్పందాన్ని నిలిపేస్తున్నాం

  • అటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్టును మూసివేస్తున్నాం

పాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?

  • “పాక్ ఆక్రమిత్ కాశ్మీర్” (పిఓకే) లో పాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?
  • “పాక్ ఆక్రమిత కాశ్మీర్” లో 110 నుంచి 125 మంది క్రియాశీలకంగా ఉన్న తీవ్రవాదులు
  • సుమారు 42 “లాంచ్ పాడ్స్” (తీవ్రవాద స్థావరాలు) క్రియాశీలకంగా ఉన్నట్లు సమాచారం
  • ఉత్తర కాశ్మీర్ లో క్రియాశీలకంగా ఉన్న 35 మంది తీవ్రవాదులు
  • జమ్మూలో కూడా క్రియాశీలకంగా ఉన్న సుమారు 100 మంది తీవ్రవాదులు. 

పహల్గాం  ఉగ్రదాడిపై ప్రధాని సీరియస్‌

  • సౌదీ పర్యటన కుదించుకుని వచ్చేసిన ప్రధాని మోదీ

  • పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణం. 
  • ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌లో ఉన్న దృశ్యాలతో వెల్లడైన విషయం 
  • పాక్‌ నుంచి ముప్పు ఉండొచ్చనే అనుమానాల నడుమ దారి మళ్లింపు 
  • ఎయిర్‌ పోర్టులోనే కీలక సమావేశం నిర్వహణ
  • కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో భేటీ
  • ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ మరికాసేపట్లో

 

ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. కలచివేస్తోన్న నవవధువు కన్నీటి వీడ్కోలు 

  • పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్‌ 
  • వారం క్రితం వివాహం చేసుకుని భార్యతో కలిసి హనీమూన్‌కి వచ్చిన అధికారి 
  • ఉగ్రదాడిలో మృతి చెందిన ఆయనకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కలచి వేస్తోన్న నవ వధువు రోదన

 

జమ్ములో అత్యధికంగా ఎల్‌ఈటీ ఉగ్రవాదులు!

 

  • జమ్ము కశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు 
  • అత్యధికంగా లష్కరే తాయిబా(LeT) సభ్యులు ఉన్నారన్న నిఘా వర్షాలు 
  • పహల్గాం దాడులు తమ పనేనని ప్రకటించుకున్న ఎల్‌ఈటీ విభాగం 
  • అసిఫ్‌ ఫౌజీ, సులేమాన్‌ షా, అబు తల్హా గుర్తింపు 
  • ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్‌? 
  • ముజాహిదీలు కశ్మీర్‌లో దాడి చేస్తారని తరచూ ప్రకటించిన సాజిద్‌

 

 సాయంత్రం కేబినెట్‌ కీలక సమావేశం

  • పహల్గాం నుంచి ఢిల్లీకి బయల్దేరిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

  • సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం

  • కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం

 

పహల్గాం ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్‌ సింగ్‌ 

  • పహల్గాం ఉగ్రదాడి ఘటనపై మీడియాతో మాట్లాడిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 

  • పిరికిపంద చర్యగా అభివర్ణించిన రాజ్‌నాథ్‌ 

  • ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు : రాజ్‌నాథ్‌

  • ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలనేది భారత్‌ విధానం : రాజ్‌నాథ్‌

  • ఉగ్రదాడికి పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోం.: రాజ్‌నాథ్‌

  • పహల్గామ్‌ ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్‌

 

 

ఉగ్ర రక్కసిపై గళమెత్తిన కశ్మీర్‌.. ఆరేళ్లలో తొలిసారి బంద్‌! 

  • పహల్గాం దాడిని ఖండిస్తూ వీధుల్లోకి వచ్చిన జనం 
  • శ్రీనగర్‌ సహా కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్‌ 
  • గతంలో సర్వసాధారణంగా ఉండగా.. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో తొలిసారి బంద్‌ 

 

ఉగ్రదాడి.. పాకిస్థాన్‌ హైకమిషన్‌ వద్ద భద్రత కట్టుదిట్టం 

  • పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం 
  • పాకిస్థాన్‌ హైకమిషన్‌ వద్ద గట్టి సెక్యూరిటీ 

 

పక్షపాత రాజకీయాలకు ఇది సమయం కాదు: ఖర్గే 

  • పహల్గాం ఉగ్రదాడి మన దేశ ఐక్యత, సమగ్రతపై ప్రత్యక్ష దాడిగా పేర్కొన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 
  • ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు కేంద్రంతో సహకరించేందుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని ట్వీట్‌

 

జమ్మును వీడుతున్న పర్యాటకులు

  • పహల్గాం దాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ను వీడుతున్న పర్యాటకులు

  • ఉదయం నుంచి 20 విమానాల్లో పైగా తిరుగు ప్రయాణం  

  • కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లు

  • కాట్రా నుంచి ప్ర త్యేక రైళ్లు

  • ఆరు గంటల్లో కశ్మీర్‌ను వీడిన 3,300 మంది పర్యాటకులు

  • పర్యాటకులు వీడుతుండడంపై ఆవేదన వ్యక్తం చేసిన  ముఖ్యమంత్రి  ఒమర్‌ అబ్దుల్లా

 

 

భద్రతా బలగాల అదుపులో పలువురు అనుమానితులు

 

ఉగ్రవాదుల్లో ఇద్దరు కశ్మీరీలే!

  • పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గుర్తింపు
  • ఇద్దరు కశ్మీరీలేనని అనుమానిస్తున్న భద్రతా ఏజెన్సీలు
  • 2018లో కశ్మీర్‌ను వదిలి పాక్‌ వెళ్లిపోయిన అదిల్‌ గురి, అషన్‌
  • ఇటీవలే మరో నలుగురితో కలిసి కశ్మీర్‌లో చొరబడినట్లు అనుమానం
  • అదిల్‌, అషన్‌ గురించి సమాచారం సేకరిస్తున్న భద్రతా బలగాలు
  • పాక్‌ మద్దతుదారుల నుంచి వీళ్లకు మందు గుండు సామాగ్రి, ఏకే 47లు
  • నిల్వ ఆహారం, డ్రైఫూట్స్‌ ఉంచుకున్నట్లు అనుమానాలు
  • మతాలవారీగా టూరిస్టులను వేరు చేసిన ఉగ్రవాదులు
  • పాయింట్‌ బ్లాక్‌ రేంజ్‌లో టూరిస్టులను కాల్చేసిన టెర్రరిస్టులు
  • హెల్మెట్‌ మౌంటెడ్‌ బాడీ కేమ్‌లతో రికార్డు చేసి పాక్‌కు చేరవేసి ఉండొచ్చనే అనుమానాలు 


 

పాక్‌ కవ్వింపు చర్యలు

  • పాక్‌ దొంగ నాటకాలు

  • పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌ కవ్వింపు చర్యలు

  • సరిహద్దు వెంట భారీగా సైన్యం మోహరింపు

  • కశ్మీర్‌ సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపు

  • కరాచీ నుంచి లాహోర్‌, రాల్పిండికి యుద్ధ విమానాలు

  • పహల్గాం దాడితో తమకేం సంబంధం లేదని ప్రకటించిన పాక్‌ ప్రభుత్వం

  • దాడి ఘటనను ఖండిస్తూ.. మరణించినవారి కుటుంబాలకు సానుభూతి ప్రకటన

  • మమ్మల్ని నిందించొద్దు అంటూ పాక్‌ రక్షణ మంత్రి వ్యాఖ్యలు

  • భారత్‌లో పలు రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నాయని.. అంతర్గత తిరుగుబాటులే పహల్గాం దాడికి కారణమంటూ ప్రకటన

  • ఉగ్రవాదులకు సాయం చేసింది పాక్‌ ఐఎస్‌ఐనే

 

పరిహారం ప్రకటించిన జమ్ము ప్రభుత్వం

  • పహల్గాం ఉగ్రదాడి బాధితులకు పరిహారం ప్రకటించిన జమ్ము కశ్మీర్‌ ‍ప్రభుత్వం

  • మృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవాళ్లకు రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్లకు రూ.1 లక్ష

  • దాడికి నిరసనగా కశ్మీర్‌ బంద్‌కు పిలుపు ఇచ్చిన ప్రజా సంఘాలు 

 

పహల్గాం ఊచకోతను ఖండిస్తూ సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్మానం

  • పహల్గాం ఉగ్రఘటన.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నివాళి 
  • మతిలేని చర్యగా అభివర్ణించిన సర్వోన్నత న్యాయస్థానం
  • ఉగ్రదాడి మృతులకు సంతాపంగా మౌనం పాటించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది 
  • ఈ దారుణ ఘటనను ఖండించిన సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌

 

ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్‌?

  • కశ్మీర్‌, పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్‌?

  • ప్రధాని మోదీ, రక్షణ మంత్రి వరుస సమావేశాలు

  • హోం మంత్రి అమిత్‌ షా క్షేత్రస్థాయి పర్యటన

  • కశ్మీర్‌ పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌

  • రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో త్రివిధ దళాధిపతుల సమావేశం

  • కేంద్రం ఆదేశాల అమలుకు సిద్ధమంటున్న త్రివిధ దళాధిపతులు

  • పహల్గాం ఉగ్రదాడి ప్రధానాంశంగా.. సాయంత్రం కేంద్ర కేబినెట్‌ సమావేశం

  • సమావేశం అనంతరం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం
     

పహల్గాంలో కూంబింగ్‌

  • పహల్గాంలో కొనసాగుతున్న కూబింగ్‌

  • ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట

  • ఒకవైపు.. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న బలగాలు

  • మరోవైపు డ్రోన్‌ల సాయంతో కొనసాగుతున్న గాలింపు


ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల

  • పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల

  • ముగ్గురి చిత్రాలను విడుదల చేసిన కేంద్రం

  • అందులో అసిఫ్‌ అనే ఉగ్రవాది

  • బాడీ క్యామ్‌ ధరించి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు

  • మొత్తం ఏడుగురు దాడికి పాల్పడినట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులు

  • కానీ, దాడికి పాల్పడింది ముగ్గురి నుంచి నలుగురే?

  • దాడులకు పాల్పడింది తామేనంటూ ప్రకటించిన లష్కరే తోయిబా విభాగం ది రెసిస్టెంట్‌ ఫ్రంట్‌

 

పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్‌

  • రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం

  • ప్రస్తుత పరిస్థితిని వివరించిన త్రివిధ దళాధిపతులు

  • ప్రతిచర్యకు సిద్ధమని ప్రకటన

  • సాయంత్రం ఆరు గంటలకు కేబినెట్‌ కీలక సమావేశం

  • మరోవైపు భద్రతా ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ

 

పలు నగరాల్లో హైఅలర్ట్‌

  • దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైఅలర్ట్‌ 

  • క​శ్మీర్‌ పహల్గాం దాడితో అప్రమత్తమైన కేంద్రం

  • ఢిల్లీ, ముంబై సహా పలు నగరాలకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసిన హోం శాఖ

 

 

బైసరన్‌కు అమిత్‌ షా

  • పహల్గాం బైసరన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

  • కాల్పులు జరిపిన ప్రాంతంలో పర్యటించిన షా

  • ప్రతి చర్య తప్పదని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు ఉంటాయని బాధిత కుటుంబాలకు హోం మంత్రి హామీ 

 

నేటి ఐపీఎల్‌ మ్యాచ్‌లో సంఘీభావం

  • పహల్గాం ఉగ్రదాడికి సంఘీభావం తెలుపుతున్న ప్రముఖులు

  • ఐపీఎల్‌ క్రికెటర్ల సంఘీభావం

  • ఇవాళ హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌

  • దాడికి సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలు ధరించనున్న ప్లేయర్స్‌

  • ఒక నిమిషం మౌనం పాటించనున్న ఆటగాళ్లు

  • చీర్‌గర్ల్స్‌ ఉండబోరని ప్రకటించిన బీసీసీఐ

 

రంగంలోకి ఎన్‌ఐఏ

  • పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ బృందం

  • హోటల్స్‌, లాడ్జిలను జల్లెడ పడుతున్న అధికారులు

  • దాడి తర్వాత అడవుల్లోకి పరారైనట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులు

  • అయినప్పటికీ పహల్గాంను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపడుతున్న భద్రతా బలగాలు

  • ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్న ఎన్‌ఐఏ టీం

 

పలు  రాష్ట్రాల్లో పాక్‌ వ్యతిరేక నిరసనలు

  • పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలు 

  • రోడ్డెక్కిన ప్రజలు

  • పాక్‌, ఉగ్రవాద వ్యతిరేక నినాదాలతో ర్యాలీలు

  • ఉగ్రవాదం నశించాలంటూ ఫ్లకార్డులతో ప్రదర్శన

 

పహల్గాం ఉగ్రదాడిలో((Pahalgam Terror attack) మరణించిన మృతులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్‌ కంట్రోల్‌ రూంలో సైనిక గౌరవ వందనం నడుమ మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచారాయన. అనంతరం దాడిలో గాయపడి అనంత్‌నాగ్‌ ఆస్పత్రిలో  క్షతగాత్రులను ఆయన పరామర్శించారు.

 

మంగళవారం రాత్రే శ్రీనగర్‌కు చేరుకున్న హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah).. వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ ఉదయం మృతదేహాలకు ఆయన నివాళి అర్పించిన అనంతరం.. ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మరోవైపు.. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్‌లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న వారిపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement