Terror attack
-
పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటన..
న్యూఢిల్లీ: 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిని ఎదుర్కొని ప్రాణ త్యాగం చేసిన భద్రతా సిబ్బందికి లోక్‌సభ శుక్రవారం ఘనంగా నివాళులర్పించింది. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే అమరుల గౌరవార్థం సభ్యులంతా లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం పాత పార్లమెంట్ సంవిధాన్ సదన్ వెలుపల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమరులకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు అమరులకు సెల్యూట్ చేశారు. అనంతరం మౌనం పాటించారు. బాధిత కుటుంబాల సభ్యులతో నేతలు మాట్లాడారు. కాగా, అప్పటి ఘటనలో పార్లమెంట్ భద్రతా విభాగం, ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్లకు చెందిన 8 మంది సిబ్బందితోపాటు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి నేలకొరిగారు. పార్లమెంట్‌లోకి ప్రవేశించి మారణ హోమం సృష్టించేందుకు తెగబడిన పాకిస్తాన్‌కు చెందిన మొత్తం ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.సర్వదా రుణపడి ఉంటాం: రాష్ట్రపతి ముర్ము 2001లో ఉగ్ర మూకల దాడి నుంచి పార్లమెంట్‌ను రక్షించే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. అమరులకు సర్వదా రుణపడి ఉంటామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఉగ్రమూకలను జాతి యావత్తూ కలిసి కట్టుగా ఎదుర్కొందని, ఉగ్రవాదంపై పోరుకు దేశం కట్టుబడి ఉంటుందని ఆమె ‘ఎక్స్’లో తెలిపారు. -
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలి: శరద్ పవార్
ముంబై: బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరపాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రిత్వశాఖ ప్రయత్నించాలని కోరారు. ఫరూక్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్‌లో అత్యున్నత వ్యక్తి అని,ఆయన తన జీవితాన్ని కశ్మీర్ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ఆయన నిజాయితీపై తనకు ఎలాంటి సందేహం లేదని, అలాంటి వ్యక్తి చేసిన ప్రకటనను కేంద్రం, ప్రత్యేకంగా హోంమంత్రిత్వశాఖ సీరియస్‌గా పరిగణించాలని సూచించారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు ముందడుగు వేయాలన్నారు.కాగా శనివారం ఉదయం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నవారే దీనికి పాల్పడి ఉంటారనే అనుమానం కలుగుతోందని తెలిపారు. అంతేగాక ఉగ్రవాదులను చంపకుండా, ప్రాణాలతో పట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను సజీవంగా బంధించి విచారిస్తే.. వారి వెనక ఉన్న వారు ఎవరో తెలుసుకోవచ్చని చెప్పారు. ఉగ్రమూకల వ్యూహాలు తెలుస్తాయని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బుద్గాం జిల్లాలోని మగామ్ ప్రాంతంలోని మజామాలో శుక్రవారం ఉగ్రవాదులు ఇద్దరు స్థానికేతరులపై కాల్పులు జరిపారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరోవైపు నేడు అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయని అధికారులు తెలిపారు. శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో ఇలాంటి ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగింది. -
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లతో సహా నలుగురి మృతి
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లాలో ఆర్మీ వాహనంపై గురువారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచినట్లు అధికారులు వెల్లడించారు. వీరితోపాటు ఇద్దరు కూలీలు మరణించగా, మరో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. మరణించారని వర్గాలు తెలిపాయి.బారాముల్లాలోని బుటాపత్రి నాగిన్ ప్రాంతంలో సామాగ్రి తీసుకెళ్తున్న మిలటరీ ట్రక్కుపై గురువారం సాయంత్రం ఉగ్రవాదులు తొలుత దాడులు జరిపినట్లు ఆర్మీ అధికారులు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుడిపై కాల్పులు జరపడంతో.. దీంతో ఉగ్రవాదులు, 18వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందినసైనికుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ప్రీతమ్ సింగ్‌గా గుర్తించారు. సంఘటనా ప్రాంతాన్ని భారత బలగాలు ఆధీనంలో తీసుకొని టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.కాగా గత 72 గంటల్లో కేంద్రపాలిత ప్రాంతంలో ఆర్మీ వాహనంపై దాడి జరగడం ఇది రెండోది. మూడు రోజుల క్రితం టన్నెల్ నిర్మిస్తున్న నిర్మాణ కార్మికుల హౌసింగ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు మరణించారు - మరణించిన వారిని కశ్మీర్‌లోని నయీద్గామ్లోని బుద్గామ్కు చెందిన డాక్టర్ షానవాజ్, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన గుర్మీత్ సింగ్, బీహార్‌కు చెందిన మహ్మద్ హనీఫ్, ఫహీమ్ నాసిర్, కలీమ్‌లుగా గుర్తించారు.ఈ దాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ‘ఉత్తర కాశ్మీర్‌లోని బూటా పత్రి ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై దాడి జరగడం, ప్రాణ నష్టం కలగడం దురదృష్టకరం.కశ్మీర్లో ఇటీవల జరుగుతున్న వరుస దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిని నేను ఖండిస్తున్నాను. ఈ దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని అబ్దుల్లా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. -
టర్కీలో ఉగ్రదాడి.. భారీగా మృతులు..!
అంకారా: టర్కీ రాజధాని అంకారా శివార్లలోని ఓ ఏరోస్పేస్ సంస్థపై ఉగ్రవాదులు బుధవారం(అక్టోబర్ 23) దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మృతి చెందడంతో పాటు కొందరు గాయపడ్డట్టు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక ట్వీట్ చేశారు. Türk Havacılık ve Uzay Sanayii AŞ. (TUSAŞ) Ankara Kahramankazan tesislerine yönelik terör saldırısı gerçekleştirilmiştir.Saldırı sonrası maalesef şehit ve yaralılarımız bulunmaktadır.Şehitlerimize Allah’tan rahmet; yaralılarımıza acil şifalar diliyorum.Gelişmelerden kamuoyu…— Ali Yerlikaya (@AliYerlikaya) October 23, 2024 రాజధాని అంకారా శివారులో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు తొలుత బాంబులతో దాడి చేసి తర్వాత కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఏరోస్పేస్ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది షిఫ్ట్ మారే సమయంలో దుండగులు ట్యాక్సీలో ప్రవేశించి తొలుత బాంబు వేసి తర్వాత తుపాకులతో కాల్చారు. దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: అగ్ర నేతలపై ఇజ్రాయెల్ టార్గెట్.. హమాస్ కీలక నిర్ణయం -
జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ కశ్మీర్లో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉదంపూర్, కథువా జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారానికి సంబంధించి సమాచారం అందుకున్నఆర్మీ ప్రత్యేక బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అక్కడికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.భారీ వర్షాలు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా ఉగ్రవాదులను ఏరివేయడంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి. కథువా జిల్లాల్లో చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు టెర్రరిస్టులను అంతమొందించారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఎం4 రైఫిల్, ఏకే రైఫిల్, పిస్టల్ సహా పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు. ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
పాక్‌లో బీఎల్ఏ స్వైరవిహారం
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మిలిటెంట్ గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) రెచ్చిపోయింది. ఆది, సోమ వారాల్లో బీఎల్ఏ సాయుధులు పోలీస్ స్టేషన్లు, రైలు మార్గాలు, వాహనాలపై దాడులు జరిపి 50 మందిని చంపేశారు. అనంతరం సైన్యం చేపట్టిన ఏరివేతలో 12 మంది మిలిటెంట్లు హతమయ్యారు. బీఎల్ఏ సభ్యులు ఆదివారం రాత్రి బలోచిస్తాన్‌లోని ముసాఖెల్ జిల్లాలోని హైవేను దిగ్బంధించారు. అటుగా వచ్చిన బస్సులు, ట్రక్కులను అడ్డగించి, ప్రయాణికులతోపాటు డ్రైవర్లను కిందికి దించివేశారు. ‘గుర్తింపు కార్డులు పరిశీలించాక పంజాబ్, ఖైబర్ పంఖ్తున్వా ప్రావిన్స్‌లకు చెందిన 23 మందిని తుపాకులతో కాల్చి చంపారు. అనంతరం సమీపంలోని కొండ ప్రాంతంలోకి వారంతా పరారయ్యారు. ఉగ్రవాదులు ప్రయాణికుల వాహనాలతో పాటు బొగ్గుతో వెళ్లే ట్రక్కులను కూడా అడ్డగించి డ్రైవర్లను చంపేశారు. పది ట్రక్కులకు నిప్పుపెట్టారు’అని అధికారులు తెలిపారు. ఇదే ప్రావిన్స్‌లోని మరికొన్ని చోట్ల ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్లు, భద్రతా బలగాల పోస్టులే లక్ష్యంగా దాడులకు దిగారు. ఈ ఘటనల్లో మరో 10 మంది చనిపోయారు. బలోచిస్తాన్‌లోని ఖలాట్ జిల్లాలో మరో ఘటనలో..ఆరుగురు పోలీసులు సహా మొత్తం 11 మందిని బీఎల్ఏ తీవ్రవాదులు చంపారు. మరో ఘటనలో బొలాన్ జిల్లా డొజాన్ ప్రాంతంలోని పాక్– ఇరాన్‌లను కలిపే రైల్వే మార్గంపై వంతెనను పేల్చివేసిన ఉగ్రవాదులు, ఆరుగురిని కాల్చి చంపారు. ఈ ఘటనలకు తమదే బాధ్యతంటూ అనంతరం బీఎల్ఏ మీడియాకు పంపిన ఈ మెయిల్లో ప్రకటించుకుంది. పారామిలటరీ బలగాల బేస్‌పైనా దాడి చేసినట్లు అందులో చెప్పుకుంది. అయితే, ప్రభుత్వం దీనిని ధ్రువీకరించాల్సి ఉంది. సహజవనరులు పుష్కలంగా ఉన్న బలూచిస్తాన్ పాక్‌లోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉండిపోయింది. -
ఉగ్రదాడులపై ప్రతీ దేశ భక్తుడి డిమాండ్: రాహుల్ గాంధీ
ఢిల్లీ: జమ్ము కశ్మీర్లో కొన్ని నెలల నుంచి భారత సైనికులే లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన తరచూ చోటుచేసుకోవటం చాలా విచారకమని ‘ఎక్స్’లో అన్నారు. సోమవారం జమ్ము కశ్మీర్‌లోని దోదా జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో నలుగురు భారత సైనికులు అమరులయ్యారు. సైనికుల మృతికి రాహుల్ సంతాపం వ్యక్తం చేశారు.‘జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాద దాడుల్లో అమరులైన సైనికులకు సంతాపం వ్యక్తం చేస్తున్నా. అమరులైన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’అని ‘ఎక్స్’లో తెలిపారు.మరోవైపు.. జమ్ము కశ్మీర్లో నెలకొన్న దారుణమైన పరిస్థితులపై రాహుల్ గాంధీ బీజేపీ పభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన తప్పుడు పాలసీలను భారత ఆర్మీ సైనికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ఉగ్రదాలకు కారణం బీజేపీ తీసుకున్న తప్పుడు పాలసీలే. అందులో ఒకటి జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయటం. దీంతో ఇటీవల జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగాయి. తరచూ జమ్ము కశ్మీర్లో చోటుచేసుకుంటున్న భద్రత లోపాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రతి దేశ భక్తుడు డిమాండ్ చేయాలి’అని రాహుల్ గాంధీ అన్నారు.आज जम्मू कश्मीर में फिर से एक आतंकी मुठभेड़ में हमारे जवान शहीद हो गए। शहीदों को विनम्र श्रद्धांजलि अर्पित करते हुए शोक संतप्त परिजनों को गहरी संवेदनाएं व्यक्त करता हूं।एक के बाद एक ऐसी भयानक घटनाएं बेहद दुखद और चिंताजनक है। लगातार हो रहे ये आतंकी हमले जम्मू कश्मीर की जर्जर…— Rahul Gandhi (@RahulGandhi) July 16, 2024 ఉగ్రవాద దాడులు పెరుగుతున్న ఈ సమయంలో రాజకీయం అందరూ ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఉగ్రవాద దాడులపై ప్రభుత్వం స్పందిస్తూ.. చర్యలు తీసుకుంటే ప్రతిపక్షం నుంచి పూర్తి సహకారం అందిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. -
జమ్ము కశ్మీర్ ఉగ్రదాడుల వెనుక లష్కరే తోయిబా టెర్రరిస్ట్ హస్తం!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఇటీవల వరుసగా చోటుచేసుకున్న ఉగ్రదాడుల వెనక లష్కర్-ఇ-తోయిబా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎజేన్సీ (ఎన్ఐఏ) వెల్లడించింది. పాకిస్తాన్‌లోని కసూర్ జిల్లాలోని శంగమంగ గ్రామానికి చెందిన సాజిద్.. లష్కర్-ఇ-తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది. అతని తలపై రు. 10 లక్షల రివార్డు ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది.సైఫుల్లా సాజిద్ జట్ పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో బేస్ క్యాంపు కార్యకలాపాలను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన భార్య తనతోపాటు ఉంటోంది. సాజిద్ గతంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో సాధారణ పనులు చేస్తూ ఉండేవాడు. అనంతరం అతను లష్కరే తొయిబాలో చేరి.. ప్రస్తుతం ఉగ్రవాదుల నియామకాలను నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా భారత దేశ వ్యాప్తంగా ఉగ్రవాదలుకు సాయం చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి.లష్కరే తొయిబాలో సాజిద్ ఆపరేషనల్ కమాండర్. దీంతో ఉగ్రవాదులు నిధులు సమకూర్చుతాడు. సాజిత్ ఎన్ఐఏ జాబితాలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. సాజిత్‌కు ఖాసిమ్అనే వ్యక్తి సాయం చేస్తున్నాడని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఖాసిమ్ కోసం వెతుకుతున్నారు. కొన్నేళ్ల నుంచి కశ్మీర్ వ్యాలీలో జరుగుతున్న ఉగ్రదాడుల వెనక సాజిద్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత జరిగిన మరో ఉగ్రదాడిలో ఇద్దరు ఉగ్రవాదులు, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచెందాడు. గడిచిన రెండు రోజుల్లో కుల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రదాడుల్లో ఐదుగురు టెర్రరిస్టులు మృతి చెందారు. -
Narendra Modi: ఉగ్రనిరోధక సామర్థ్యాలను పెంచండి
న్యూఢిల్లీ/జమ్మూ: ఉగ్రవాదం పీచమణిచేలా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రనిరోధక సామర్థ్యాలను మరింతగా పెంచాలని పాలనా యంత్రాంగానికి ప్రధాని మోదీ సూచించారు. యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి, చెక్‌పోస్ట్‌పై మెరుపుదాడి వంటి ఉదంతాలు మళ్లీ పెచ్చరిల్లిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితిపై ప్రధాని మోదీ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదనపు భద్రతా బలగాల మొహరింపుతోపాటు ఉగ్రనిరోధక వ్యవస్థలను క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజా పరిస్థితిపై వివరాలను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను మోదీ అడిగి తెల్సుకున్నారు. స్థానిక యంత్రాంగంతో ఏ విధంగా వ్యూహాలను అమలుచేస్తున్నారో సిన్హా మోదీకి వివరించారు. జీ7 సదస్సు కోసం ఇటలీకి మోదీఇటలీలో నేటి నుంచి జరగబోయే జీ7 శిఖరాగ్ర సదస్సులో కృత్రిమ మేథ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంత సమస్యలపైనే దృష్టిసారించే అవకాశం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సదస్సులో పాల్గొనేందుకు మోదీ గురువారం ఇటలీకి బయల్దేరి వెళ్లారు. ‘గ్లోబల్ సౌత్’ దేశాల సమస్యలపైనా ప్రధానంగా చర్చ జరగొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఇటలీలోని అపూలియో ప్రాంతంలోని విలాసవంత బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు నేటి నుంచి 15వ తేదీదాకా జరగనుంది. -
కశ్మీర్లో బస్సు దాడి మా పనే: టీఆర్ఎఫ్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని రియాస్ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. అంతేగాక భవిష్యత్తులో పర్యాటకులు లేదా స్థానికేతరులపై ఇలాంటి దాడులు మరిన్ని జరగవచ్చని హెచ్చరించింది. రియాస్ దాడి కేవలం ప్రారంభం మాత్రమేనని తెలిపింది. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో పది మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. రియాస్‌లోని శివ్ఖోరి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని కాత్రాలోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్తునన భక్తుల బస్సుపై ఈ దాడి జరిగింది. దీంతో అదుపుతప్పిన బస్సు లోయలో పడిపోయింది. బస్సుపై కాల్పులు జరిపిన దుండగులు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.సంఘటన ప్రాంతంలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్‌లో చేరింది.కాగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటతో 2023 జనవరి 6న ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా టీఆర్ఎఫ్ 2019లో ఉనికిలోకి వచ్చింది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆన్లైన్ సంస్థగా ఇది పుట్టుకొచ్చింది. పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్రంగా పనిచేస్తుంది. -
పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్, షోపియాన్లలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేత, మాజీ సర్పంచ్ అజాజ్ అహ్మద్ షేక్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఉదంతం షోపియాన్‌లోని హీర్పోరాలో చోటుచేసుకుంది. #WATCH | Anantnag, J&K: Terrorists fired upon and injured a lady Farha, resident of Jaipur and spouse of Tabrez at Yannar. Injured evacuated to hospital for treatment.(Video source: Local) https://t.co/7UUq9YXR8Y pic.twitter.com/im1NZ2hSEm— ANI (@ANI) May 18, 2024 జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజాజ్ అహ్మద్ షేక్ ఇటీవలే బీజేపీలో చేరారు. అతనిపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. మరో ఘటన అనంత్‌నాగ్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి యన్నార్ ప్రాంతంలో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఫర్హా అనే మహిళ, ఆమె భర్త తబ్రేజ్‌లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలు జరిగిన ప్రాంతంలో పోలీసులు మోహరించారు. ఈ రెండు ఉగ్రవాద దాడులపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ట్విట్టర్లో తన స్పందనను తెలిపారు. ‘ఈరోజు పహల్గామ్లో ఇద్దరు పర్యాటకులు గాయపడిన ఘటనను, షోపియాన్‌లోని హీర్పోరాలో సర్పంచ్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఇది ఆందోళన కలిగించే అంశం. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి’ అని పేర్కొన్నారు.Terrorist fired upon a person Aijaz Ahmad at Heerpora, Shopian. Injured evacuated. Area cordoned off. Further details to follow: Kashmir Zone Police pic.twitter.com/Y31BJouz0J— ANI (@ANI) May 18, 2024 -
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై శనివారం(మే4) ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల ఊహాజనిత చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ టెర్రరిస్టుల గురించి సమాచారమిచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో విక్కీ పహాడే అనే ఎయిర్‌ఫోర్స్ అధికారి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడి జరిగినప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం రక్షణదళాలు భారీ సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టాయి. -
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
చండీగఢ్: జమ్ము-కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో చోటు చేసుకున్న ఉగ్రదాడి.. లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ చేస్తున్న స్టంట్ అని పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జలంధర్‌లో నిర్వహించన ఎన్నికల ప్రచారంలో చన్నీ బీజేపీపై ఘాటుగా విమర్శలు చేశారు. ‘‘ఎన్నికల ముందు ఇవన్నీ బీజేపీ చేస్తున్న స్టంట్లు తప్ప ఉగ్రదాడులు కాదు. వాటిల్లో అసలు నిజమే లేదు. బీజేపీ ప్రజలు, శవాలతో ఆటలాడుతోంది. ఈ దాడులు నిజంగా జరిగినవి కావు. కేవలం బీజేపీకి ప్రయాజనం చేసేవి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. గతంలో లాగా బీజేపీ ఇలాంటి చిల్లర స్టంట్లు చేస్తుంది’’ అని చన్నీ దుయ్యబట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర మంత్రి స్పందించారు. ‘‘చన్నీ ఉగ్రదాడిపై సైతం చాలా దిగజారిన వ్యాఖ్యలు చేశారు. అది ఆయన మనస్తత్వానికి నిదర్శనం’’ అని మండిపడ్డారు. శనివారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహనంపై జరిగిన ఉగ్రదాడిలో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విక్కీ పహాడే సైనికుడు మరణించగా.. నాలుగురు సైనికులు గాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25న జరగనున్న అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పూంఛ్ ఉంది. -
బెంగళూరు కేఫ్ టెర్రరిస్టులు ఎలా దొరికారంటే?
బనశంకరి: సిలికాన్ సిటీ బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు గుర్తుంది కదా..! మార్చి 1, 2024న బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే ఉగ్రవాద ఘటనలకు చాలా రోజులుగా బ్రేక్ పడ్డ తర్వాత ఈ ఘటన జరగడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ కేసులో నిందితులు తాము చేసిన ఓ చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు. పక్కాగా ప్లాన్ చేసి తప్పించుకున్నారు ముసావీర్ హుసేన్ షాజీబ్, అబ్దుల్ మతీన్ తాహ.. ఇద్దరు ఉగ్రవాద శిక్షణలో ఆరితేరారు. పక్కాగా స్కెచ్ వేసి బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ను ఎంచుకున్నారు. ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాల్లో అలజడి సృష్టించాలన్నది వీళ్ల కుట్ర. రెక్కీల తర్వాత మార్చి 1, శుక్రవారం రోజున తమ ప్లాన్ అమలు చేశారు. రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలగానే జారుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించింది. అప్పటికే నిందితులు సరిహద్దులు దాటేశారు. సిసి టీవీ ఫుటేజ్ సేకరించిన NIA.. నిందితుల జాడ చెప్పిన వారికి పది లక్షల బహుమానం ప్రకటించింది. అబ్బో.. ఎన్ని జాగ్రత్తలో.? బెంగళూరు నుంచి బయటపడ్డ నిందితులిద్దరూ.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బాంబు అమర్చిన హుస్సేన్ షాజీబీ (30), తెర వెనక మాస్టర్‌మైండ్ మథీన్ థాహ (30) తమ ఆహార్యాన్ని మార్చేశారు. పశ్చిమబెంగాల్లోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 సిమ్ కార్డులు మార్చారు. ఏ ప్రాంతానికి వెళ్లినా.. కొత్త పేర్లు చెప్పి లాడ్జ్‌లు తీసుకున్నారు. వీలైనంత వరకు తక్కువ ఖరీదు ఉండే మాస్ ఏరియాల్లో.. పోలీసు గస్తీ ఎక్కడయితే తక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాలు మాత్రమే ఎంచుకున్నారు. స్కాన్ చేసి చెల్లించే UPI పేమెంట్ ఎక్కడా చేయలేదు, కేవలం నగదు మాత్రమే చెల్లించి భోజనం, కావాల్సిన వస్తువులు కొన్నారు. ఓ జిరాక్స్ సెంటర్లో ఆధార్ కార్డులను, డ్రైవింగ్ లైసెన్స్‌లను సేకరించిన వీరిద్దరు.. వాటితో ఫేక్ ఐడెంటిటీ కార్డులను తయారు చేసి వాడారు. వీరికి ఎప్పటికప్పుడు క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు సమకూరేవని దర్యాప్తులో తేలింది. చిక్కరు.. దొరకరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్‌కు వచ్చిన నిందితులు అక్కడ ఒక హోటల్లో పర్యాటకుల తరహాలో మకాం వేశారు. ఒకసారి ఒక పని మీద వాడిన సిమ్‌ను వెంటనే మార్చేవారు. అలా 35 సిమ్‌కార్డులను చేతిలో ఉంచుకున్నారు. ఒక్కో పనికి ఒక్కో సిమ్ చొప్పున వాడడం పక్కనబెట్టడం. పని పూర్తి కాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. పైగా ఈ సిమ్ కార్డులన్నీ నకిలీ అడ్రస్‌లు ఉపయోగించి సేకరించినవే. కొన్ని తమిళనాడు పేరుతో ఉన్నవయితే.. మరికొన్ని మహారాష్ట్ర, ఢిల్లీలోని ఫేక్ అడ్రస్‌లు, ఆధార్లతో సేకరించిన సిమ్ కార్డులు. ఈ సిమ్‌లను వినియోగించినా.. వీళ్ల ఆచూకీ NIA పసిగట్టలేకపోయింది. ఏ చిన్న ఆధారం దొరికినా.. తప్పుడు అడ్రస్‌ల కారణంగా దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. ఆడింది ఆట.. పాడింది పాట హోటల్లో రూం తీసుకునేటప్పుడు రిజిస్టర్లో తమ పేర్లు కాకుండా నకిలీ పేర్లు రాశారు. కొన్ని సార్లు పొరపాటున అసలు పేరు రాసి కొట్టివేసి నకిలీ పేర్లు రాశారు. పర్యాటకులమని, డార్జిలింగ్ నుంచి వస్తున్నామని, చెన్నెకు వెళుతున్నామని.. ఇలా తోచిన కారణాలను హోటల్ సిబ్బందికి చెప్పారు. నకిలీ ఆధార్ కార్డులు చూపారు. స్థానికంగా వివిధ పర్యాటక స్థలాలను సందర్శిస్తూ జల్సా చేశారు. కోల్‌కతాలో మూడు హోటల్స్‌లో ఎప్పటికప్పుడు మకాం మార్చారు. చిన్న కారణంతో చిక్కారు మకాం మార్చుతూ పశ్చిమబెంగాల్లోని చాంద్నీ అనే ప్రాంతానికి వచ్చిన వీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, వీళ్లిద్దరిలో ఒకరు వాడుతున్న మొబైల్ కింద పడడంతో ఫోన్లో స్పీకర్ పాడయింది. దీన్ని రిపేర్ చేయించేందుకు.. ఫోన్లోని సిమ్ కార్డు తీసేసి.. దగ్గరలోని రిపేర్ షాప్ మైక్రోమాజిక్ ఇన్ఫోటెక్ అనే చిన్న మొబైల్ షాప్‌కు తీసుకెళ్లారు. ఫోన్‌ను పరిశీలించిన మొబైల్ షాపు మెకానిక్.. స్పీకర్ పని చేస్తుందా లేదా అని తెలియడానికి షాప్ కీపర్ తన దగ్గరున్న సిమ్‌ను ఫోన్లో వేసి రిపేర్ చేశాడు. అప్పటికే IMEA నంబర్‌పై నిఘా పెట్టిన NIA అధికారులు.. సిమ్ వేయగానే దాని ఆధారంగా అడ్రస్ కనిపెట్టారు. ఈ సారి మాత్రం పక్కాగా ఒరిజినల్ అడ్రస్ దొరికింది. మొబైల్ లొకేషన్‌ను సంపాదించిన అధికారులు.. కొన్ని గంటల్లోనే చాంద్నీ ప్రాంతానికి చేరుకున్నారు. షాప్ కీపర్ ఇచ్చిన విలువైన సమాచారంతో నిందితుల జాడ పట్టేశారు. వేర్వేరు హోటళ్ల సిబ్బంది వాంగ్మూలం, ఎన్ఐఏ బృందాలు సేకరించారు, రిజిస్టర్లు, సీసీ కెమెరా ఫుటేజీలు, గుర్తింపు కార్డులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
మాస్కో మారణహోమం.. నేరం ఒప్పుకున్న ఉగ్రవాదులు
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో దాడులకు పాల్పడ్డ నలుగురిలో ముగ్గురు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. దాడులకు పాల్పడ్డ అనుమానితుల్ని అరెస్టు చేసిన అనంతరం ఆదివారం(మార్చి 24) వారిని మాస్కోలోని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు. సంగీత కచేరిలో కాల్పులు జరిపింది తామేనని ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు ఒప్పుకున్నారు. దీంతో.. మొత్తం నలుగురికీ మే 22 వరకు కోర్టు ప్రి ట్రయల్ కస్టడీ విధించింది. కాల్పులకు పాల్పడిన నలుగురు తజికిస్థాన్‌కు చెందినవారని తేల్చారు. కోర్టుకు తీసుకువచ్చినపుడు నలుగురి శరీరాలు గాయాలమయమై రక్తమోడుతున్నాయి. ముఖాలన్నీ ఉబ్బిపోయాయి. ఒక ఉగ్రవాదికి ఏకంగా ఒక చెవే లేకుండా పోయింది. విచారణ సమయంలో పోలీసులు వీరిని తీవ్రంగా హింసించారని మీడియా కథనాలు వెలువడ్డాయి. నలుగురితో పాటు దాడులతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 22 రాత్రి మాస్కో శివార్లలోని ఓ సంగీత కచేరి కార్యక్రమంలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులకు తామే కారణమని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే దాడులకు ఉక్రెయిన్‌కు లింకు ఉందని, దాడి తర్వాత ఉగ్రవాదులు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయత్నించారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. ఇదీ చదవండి.. ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్ల వర్షం -
Putin: ‘మాస్కోలో ఉగ్రదాడి.. ఉక్రెయిన్‌తో లింక్’
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారీ ఉగ్రదాడిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. మాస్కోలో చోటు చేసుకున్న నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదలకు ఉక్రెయిన్‌తో సంబంధాలు ఉన్నాయని అన్నారు. ‘మాస్కోలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉక్రెయిన్ వైపు పారిపోవడానికి యత్నించారు. తమకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఉక్రెయిన్-రష్యా సరిహద్దులను క్రాస్ చేసి ఉక్రెయిన్ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు’ పుతిన్ స్థానిక టెలివిజన్‌తో మాట్లాడుతూ ఆరోపించారు. ‘ఈ ఉగ్రదాడి వల్ల వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు దేశ వ్యాప్తంగా బాధకరమైన రోజు. ఈ దారుణమైన దాడికి పాల్పన వ్యక్తులు, ఉగ్రసంస్థలను శిక్షిస్తాం. వారు ఎవరైనా.. వారికి వెనక ఎవరున్నా కోరుకోం. ఉగ్రవాదుల వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని గుర్తిస్తాం. రష్యా ప్రజలకు వ్యతిరేకంగా దాడులకు ప్రణాళిక వేసిన వారిని గుర్తించి శిక్షిస్తాం’ అని పుతిన్ హెచ్చరించారు. మాస్కో దాడి వెనకాల ఉక్రెయిన్‌కు లింక్ ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ‘మాస్కో ఉగ్రదాడిలో ఉక్రెయిన్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఉగ్రదాడికి మాకు లింక్ ఉందన్న ఆరోపణలు నిరాధారమైనవి’ అన ఉక్రెయిన్ మిలిటరీ స్పై ఏజెన్సీ స్పష్టం చేసింది. రష్యాలోని మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లోకి చొచ్చుకుని వచ్చిన పలువురు సాయుధులు బాంబులు విసురుతూ.. తుపాకులతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 133 మంది మరణించారు. వంలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్విస్ వెల్లడించింది. మరోవైపు.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ మాస్కో దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివార్లలో.. మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతేకాదు మా బృందం సభ్యులు దాడి తర్వాత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రామ్ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరోవైపు రష్యా నేషనల్ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. -
Russia: మాస్కోలో ఐసిస్ భారీ ఉగ్రదాడి
మాస్కో: రష్యా రాజధానిలో ఉగ్రవాదులు(ISIS) నరమేధానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లోకి చొచ్చుకుని వచ్చిన పలువురు సాయుధులు బాంబులు విసురుతూ.. తుపాకులతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 60 మందికిపైగా మృతి చెందగా, వంలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్విస్ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు. మాస్కో శివారులోని క్రోకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ‘ఫిక్నిక్’ సంగీత కార్యక్రమం జరుగుతోంది. ఆ సమయంలో సైనిక దుస్తుల్లో కాన్సర్ట్హాల్లోకి వచ్చిన ఐదుగురు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. తుపాకుల మోత నడుమ.. ఏం జరుగుతుందో అర్థకాక తీవ్ర భయాందోళనలతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హాల్లో చిక్కకున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారి కోసం భారీగా అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి. అతి సమీపం నుంచి తుపాకులతో కాల్పులు జరిపిన దాడి వీడియోలు బయటికొచ్చాయి. Horrifying visuals of the terror attack coming out of Moscow. The carnage is unimaginable. Devastating to say the least. This world needs peace and sanity. pic.twitter.com/sWFc4mTjVK — Supriya Shrinate (@SupriyaShrinate) March 22, 2024 The scary footage where people are running during the attack.#Moscou #Moskou #CrocusCityHall #Moscow #Russia #terrorist pic.twitter.com/gJchCa8zrU — Reality Talks (@RealityTallk) March 23, 2024 Very sad to hear what happened in #Moscow Praying for them 💔 pic.twitter.com/UUMcl9RsmI — Follow Back (@FzlMah) March 22, 2024 దాడి సమాచారం అందుకున్న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారాయన. దాడి వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని పుతిన్ పేర్కొన్నట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది. పుతిన్ దేశాధ్యక్షుడిగా తిరిగి ఎన్నికై సంబరాలు జరుపుకుంటున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రష్యాలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే అని చెబుతున్నారు. దాడి మా పనే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ISIS-Islamic State of Iraq and Syria) మాస్కో దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివార్లలో.. మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతేకాదు మా బృందం సభ్యులు దాడి తర్వాత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రామ్ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరోవైపు రష్యా నేషనల్ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. -
భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌కు ఉగ్ర బెదిరింపులు
భారత్-ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్‌కు ఉగ్రవాద బెదింపులు వచ్చాయి. ఈ మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తానని నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ సోషల్‌మీడియాలో ఓ బెదిరింపు వీడియోను పోస్ట్ చేశాడు. మ్యాచ్‌కు అంతరాయం కలిగించాలని పన్నున్ సీపీఐ మావోయిస్ట్ పార్టీకి విజ్ఞప్తి చేశాడు. ఈ ఉదంతంతో అలర్ట్ అయిన రాంచీ పోలీసులు టెస్ట్ మ్యాచ్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనంగా వెయ్యి మంది పోలీసులను మొహరించినట్లు రాంచీ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పన్నున్‌పై బెదిరింపు కేసును నమోదు చేశారు. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఎవరీ పన్నున్.. భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌కు ఆటంకం కలిగిస్తానని బెదిరించిన పన్నున్.. కెనడా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు. ఇతను అమెరికా, కెనడా దేశాల్లో ఉంటూ పంజాబ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక ఖలిస్తాన్ పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటాడు. ఇతనిపై యాంటి టెర్రర్ ఫెడరల్ ఏజెన్సీ 2019లో కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి పన్నున్ ఎన్ఐఏ నిఘాలో ఉన్నాడు. ఫిబ్రవరి 3, 2021న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు పన్నున్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2023 నవంబర్ 29న పన్నున్‌ను ప్రత్యేక నేరస్థుడిగా ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్‌లు అయిపోయాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్, రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్ట్‌ల్లో టీమిండియా విజయాలు సాధించింది. ఈ సిరీస్‌లోని నాలుగో టెస్ట్ రాంచీలో, ఐదు టెస్ట్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఐదో టెస్ట్ మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది. -
జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం.. వెలుగులోకి కీలక విషయాలు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో సాయుధ ఉగ్రవాదులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. రెండు సైనిక వాహనాలపై మెరుపుదాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సురాన్‌కోట్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ దాడి జరిగింది. గాలింపు చర్యల కోసం వెళ్తున్న సైనిక వాహనాలపై దత్యార్మోర్హ్ వద్ద ముష్కరులు దాడి చేశారు. ఒక ట్రక్కు, మరో జిప్సీపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. కాగా ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూంచ్‌లో జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్ ఆధారిత తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ యాంటీ–ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. గతంలో కూడా ఈ సంస్థ దాడులకు పాల్పడింది. 2019లో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా(ఆర్టికల్ 370) రద్దు చేసిన తర్వాత తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు, పౌరులపై జరిగిన ఉగ్రదాడుల్లో చాలా వరకు పీఏఎఫ్ఎఫ్ చేసినవే. ఈ అటాక్‌లో ఉగ్రవాదులు అమెరికా తయారీ రైఫిళ్లు 4 కార్బైన్‌ను ఉపయోగించారు. దాడికి పాల్పడిన ఆయుధాలతో ఉగ్రవాదులు సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేశారు. M4 కార్బైన్ అనేది 1980లలో యూఎస్‌లో అభివృద్ధి చేశారు. గ్యాస్ ఆపరేటెడ్, తేలికపాటి మ్యాగజైన్ ఫెడ్ కార్బైన్. ఇది అమెరికా సాయుధ దళాల ఆయుధం. ప్రస్తుతం దీనిని 80కి పైగా దేశాల్లో వాడుతున్నారు. పలు తీవ్రవాద సంస్థలు ఈ ఆయుధాన్ని వాడుతున్నాయి. వారు దాడులను రికార్డు చేసేందుకు బాడీ కెమెరాలను ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాత ఈ వీడియోలను తమ సంస్థను ప్రచారం చేసేందుకు ఉపయోగించుకుంటాయి. ఈ విధంగానే ఈ ఏడాది ఏప్రిల్‌లో పూంచ్‌లో ఆర్మీ ట్రక్కుపై పీఏఎఫ్ఎఫ్ దాడి చేసి వీడియో తీసింది. దాడిలో మరణించిన సైనికుల ఆయుధాలతో ఉగ్రవాదులు ఆ ప్రాంతం నుంచి పారిపోతున్నట్లు చూపించిన వీడియోను తరువాత విడుదల చేసింది. -
ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల కాల్పులు.. ఐదుగురు జవాన్ల వీర మరణం
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఇవాళ ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. . పూంచ్‌లోని సురన్‌కోట్ ప్రాంతంలో ఆర్మీ ట్రక్‌పై మెరుపుదాడి జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారని అధికారులు తెలిపారు. ఆకస్మిక దాడి జరిగిన ప్రాంతానికి ఆర్మీ బలగాలను పంపినట్లు సమాచారం. కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురికి గాయాలుకాగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత నెలలో రాజౌరీలోని కలాకోట్‌లో సైన్యం ప్రత్యేక బలగాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు ఆర్మీ కెప్టెన్లతో సహా సైనికులు మరణించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారడంతో సైన్యంపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 10 మంది సైనికులు మరణించారు. గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో 35 మందికి పైగా సైనికులు మరణించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం -
ఇజ్రాయెల్-హమాస్ సంధిపై బైడెన్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్: హమాస్-ఇజ్రాయెల్ మధ్య సంధి కుదరడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంగీకరించిన కాల్పుల విరమణను పొడిగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హమాస్ చెరలో ఉన్న బందీలు విడదల కావడంపై స్పందిస్తూ.. ఇది ప్రారంభం మాత్రమే అని అన్నారు. తమ చెరలో ఉన్న 24 మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, 10 మంది థాయ్‌లాండ్ పౌరులు, ఒకరు ఫిలిప్పైన్స్ పౌరుడు ఉన్నారు. విడుదలైన బందీలంతా ఆరోగ్యంగానే కనిపిస్తున్నారని ఇజ్రాయెల్ వైద్య శాఖ తెలియజేసింది. కాగా.. నేడు మరో దఫా బందీలను హమాస్ విడుదల చేయనున్నట్లు సమాచారం. హమాస్ డిమాండ్‌ను నెరవేరుస్తూ ఇజ్రాయెల్ కూడా మొదటి దశలో 39 పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిందని సమాచారం. ఇజ్రాయెల్-హమాస్ మధ్య అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ గాజాపై దూకుడుగా ప్రవర్తించింది. గాజాను ఖాలీ చేయించింది. స్వతంత్ర్య పాలస్తీనాను నినదిస్తూ పశ్చిమాసియా దేశాలు ఏకమయ్యాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ రంగంలోకి దిగారు. ఇరుదేశాలు కాల్పుల విరమణ అంగీకారానికి రావాలని కోరారు. ఈ డిమాండ్ల తర్వాత నాలుగు రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇందుకు బదులుగా హమాస్ తమ చెరలో ఉన్న 50 మందిని విడుదల చేయడానికి ఒప్పుకుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో గాజా వైపు 15,000 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: Israel-Hamas war: 24 మంది బందీలకు స్వేచ్ఛ -
పాక్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్(టీటీపీ) సంస్థతో పాక్ ప్రభుత్వం చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం కిందటి ఏడాది ముగిసింది. అప్పటి నుంచి దేశంలో ఉగ్రవాదం మళ్లీ ఊపందుకుంది. తాజాగా శనివారం పంజాబ్ ప్రావిన్స్‌లోని మియన్వాలిలో గల వైమానిక స్థావరంపై శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే సైన్యం అప్రమత్తం కావడంతో పెను విధ్వంసం తప్పింది. శనివారం ఫైటర్ జెట్లు ఉన్న స్థావరంలోకి ఐదు నుంచి ఆరుగురు సాయుధ ఉగ్రవాదులు తెల్లవారుజామున చొరబాటుకు యత్నించారని పాక్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్) ధ్రువీకరించింది. తాము అప్రమత్తమై ఆ దాడిని భగ్నం చేశామని పేర్కొంది. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఒక పాక్ సైనికుడు వీరమరణం పొందారని.. పలువురికి గాయాలయ్యాయని ప్రకటించుకుంది. ఈ ఘటనలో ఎయిర్‌బేస్‌లోని మూడు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని వెల్లడించింది. దాడికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది. అయితే.. ఇది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) పనేనని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. బీఎల్ఏ.. పాక్ నుంచి స్వాతంత్రం కోరుతూ 2004 నుంచి పోరాడుతోంది. సాధారణ పౌరులనే కాకుండా.. ఈ ఏడాది జూన్‌లోనూ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని తొలిసారిగా దాడికి పాల్పడింది. ఇదిలా ఉంటే.. శుక్రవారం కూడా పాక్‌లో ఉగ్రదాడి జరిగింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో పోలీసు గస్తీ బృందాలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా వీరిలో ఇద్దరు పోలీసులు. మరో 24 మంది గాయాలపాలయ్యారని ఓ అధికారి తెలిపారు. ఇదిలాఉంటే.. గత ఆరునెలలుగా పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రాంతాలు తీవ్ర ఉగ్రవాద దాడులను చవిచూస్తున్నాయి. అయితే ఈ దాడులు పాక్ భద్రతకు ముప్పుగా మారడమే కాదు.. పొరుగు దేశాలతో సంబంధాలను దెబ్బ తీస్తున్నాయి. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లను ప్రోత్సహిస్తూ పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కానీ, ఆ విమర్శలను తోసిపుచ్చుతున్న పాక్.. తాము ఉగ్ర పీడిత దేశమేనని చెప్పుకుంటోంది. మరోవైపు అంతర్జాతీయ సమాజం, ఉగ్రవాదాన్ని అణచివేసే చర్యలు చేపట్టాలంటూ పాక్‌ను కోరుతున్నాయి. -
పుల్వామాలో మళ్లీ ఉగ్రదాడి.. వలసకూలీపై కాల్పులు
జమ్ము: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రతూటా పేలింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీపై దుండగులు కాల్పులు జరిపారు. పుల్వామాలో ఈ ఘటన జరగగా.. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్న ఎన్స్పెక్టర్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి మరుసటి రోజే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. "పుల్వామాలోని తుమ్చి నౌపోరా ప్రాంతంలో యూపీకి చెందిన వలస కూలీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మృతున్ని ముఖేష్‌గా గుర్తించాం. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాం." అని పోలీసులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో పుల్వామాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. ఆదివారం ఈద్గా ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న ఇన్స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇదీ చదవండి: శివసేన, ఎన్సీపీ అనర్హత పటిషన్లపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది గడువు -
హమాస్ దాడి.. పూర్తిగా ఇజ్రాయెల్ వైఫల్యమే’
ఇజ్రాయెల్-గాజా సంక్షోభం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అన్నీ దేశాల దృష్టి ప్రస్తుతం ఈ యుద్ధంపైనే ఉంది. నాలుగు రోజుల కిందట పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడికి దిగిన విషయం తెలిసిందే. గాజా స్ట్రిప్ ద్వారా దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డ హమాజ్ ఉగ్రవాదులు వేల రాకెట్లతో దాడులకు తెగబడ్డారు. ఇజ్రాయెల్ సైతం హమాస్ ఉగ్రవాదులపై దాడులను మరింత తీవ్రతరం చేసింది. హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో ఇరు వర్గాలకు చెందిన 1600 మంది ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధంపై ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మాజీ అధినేత మేజర్ జనరల్ యాడ్లిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూ, జల, వాయు మార్గాల ద్వారా చేపట్టిన హమాస్ దాడిని ఊహించలేనిదన్నారు. దాడికి సంబంధించి ఎలాంటి ముందస్తు హెచ్చరిక, సిగ్నల్ అందుకోలేకపోయినట్లు తెలిపారు. ఇది ఆశ్చర్యకరమైన దాడి అని పేర్కొన్నారు. హమాస్ చర్యను సెప్టెంబర్ 11, పెరల్ హార్బర్, యోమ్ కిప్పూర్ యుద్ధంతో పోల్చుతూ.. ఈ సంక్షోభం ముగిసిన వెంటనే దీనిపై దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. హమాస్ దాడిలో భారీగా ఇజ్రాయెల్ పౌరులు మరణించడానికి ఇంటెలిజెన్స్ వైఫల్యంతోపాటు వ్యూహత్మక వైఫల్యాల కారణమేనని మేజర్ జనరల్ యాడ్లిన్ వ్యాఖ్యానించారు. హమాస్ దాడిని ముందుగానే పసిగట్టడంలో శక్తివంతమైన ఇజ్రాయెల్ నిఘా సంస్థలు విఫలమైనట్లు తెలిపారు. దీనికితోడు ఉగ్రవాదులను చర్యపై వేగంగా స్పందించి ప్రతిదాడులు చేయడంలోనూ ఇజ్రాయెల్ సైన్యం వైఫల్యం కనిపిస్తోందన్నారు. చదవండి: హమాస్ దాడులపై ఇరాన్ సుప్రీం స్పందన ఉద్రిక్త పరిస్థితులు ఉండే ఇజ్రాయెల్, గాజా సరిహద్దు కంచె వెంట కెమెరాలు, గ్రౌండ్ మోషన్ సెన్సార్లు, సాధారణ సైన్యం పెట్రోలింగ్ కూడా ఉంటుందని అయితే శత్రువుల రాకను గుర్తించి సైనిక దళాలకు సమాచారం ఇవ్వడంలో ఇవన్నీ విఫలమయ్యాయని విమర్శించారు. ముందస్తు హెచ్చరికలు అందకపోయినా సరిహద్దు వెంబడి ఉన్న సెన్సార్లు కూడా ఈ పనిచేయలేకపోయాయని అన్నారు. ఇజ్రాయెల్ అంతర్గత నిఘా వ్యవస్థ షిన్ బెట్, గూఢచార సంస్థ మొసాద్, ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈ దాడులను అంచనా వేయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఒకవేళ వాళ్లకి ముందే తెలిసి ఉన్నట్టయితే, ఈ దాడులను తిప్పికొట్టడంలో వారు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ.. వీటన్నింటిపై తప్పక విచారణ చేయాలన్నారు. కాగా మేజర్ జనరల్ అమోస్ యాడ్లిన్.. ఇజ్రాయెల్ రక్షణ దళాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఫైటర్ జెట్ పైలట్‌గా 33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్‌కు డిప్యూటీ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తరువాత ఐడీఎఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌కు పనిచేశారు. 2011 నుంచి ఇజ్రాయెల్ వ్యూహాత్మక విభాగం ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. -
కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు భారత సైనికులు మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులకు భారత సైన్యానికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు భారత సైనికులు మరణించారని అధికారులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా హలాన్ అటవీ ప్రాంత పరిసరాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న కచ్చితమైన సమాచారం అందడంతో భారత మిలటరీ వర్గాలు ఆగస్టు 4న ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సైన్యం ఉగ్రవాదుల జాడను జల్లెడ పడుతుండగా ఒక్కసారిగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారిందన్నారు. ఉగ్రవాదులు చేసిన కాల్పులకు ప్రతిగా సైన్యం కూడా ఎదురుకాల్పులు జరిపిందని, ఈ కాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించామని అక్కడ వారు చికిత్స పొందుతూ వారు మృతి చెందినట్లు ఆ అధికారి తెలిపారు. హాలాన్ అడవుల్లో ఎత్తైన ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఉనికి ఇంకా ఉన్నట్టు మావద్ద పక్కా సమాచారముందని భారత భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయని అయన తెలిపారు. Operation Halan #Kulgam On specific inputs regarding presence of terrorists on higher reaches of Halan in Kulgam, operations launched by Security Forces on 04 Aug 23. In exchange of firing with terrorists, three personnel sustained injuries and later succumbed. Search operations… pic.twitter.com/NJ3DZa2OpK — Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 4, 2023 ఇది కూడా చదవండి: Defamation Case: రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించండి -
ఆరో ఉగ్రవాది దొరికాడు! జవహర్‌నగర్‌లో ఎస్కేప్.. రాజేంద్రనగర్‌లో అరెస్టు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, భోపాల్ సహా అనేక నగరాల్లో విధ్వంసానికి కుట్ర పన్నిన హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ) ఉగ్రవాద సంస్థకు చెందిన మరో ఉగ్రవాది సల్మాన్‌ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ మాడ్యుల్‌కు చెందిన ఐదుగురిని భోపాల్ ఏటీఎస్ పోలీసులు ఈ ఏడాది మే రెండో వారంలో పట్టుకుని తీసుకువెళ్లారు. ఆపై ఈ కేసు దర్యాప్తు నిమిత్తం ఎన్ఐఏకు బదిలీ అయింది. అప్పట్లో తప్పించుకున్న జవహర్‌నగర్ వాసి మహ్మద్ సల్మాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇతడి కోసం సుదీర్ఘ కాలం నిఘా ఉంచిన ఎన్ఐఏ ప్రత్యేక బృందం ఎట్టకేలకు రాజేంద్రనగర్ ప్రాంతంలో అరెస్టు చేసింది. దీంతో మధ్యప్రదేశ్, హైదరాబాద్‌లో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు పట్టుబడిన ఉగ్రవాదుల సంఖ్య 17కు చేరింది. టెర్రర్ మాడ్యుల్లో ఓ కళాశాలలో హెచ్ఓడీగా పని చేసిన ఫార్మాస్యూటికల్ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ మహ్మద్ సలీం కీలకమని నిర్ధారించిన విషయం విదితమే. గోల్కొండలోని ఓ ప్రార్థన స్థలంలో సలీంకు దినసరి కూలి మహ్మద్ హమీద్‌తో పరిచయమైంది. ఇతడిని ఉగ్రవాద బాట పట్టించిన సలీం మరికొందరిని తన మాడ్యుల్లో చేర్చుకోవాలని భావించాడు. ఈ విషయం హమీద్‌కు చెప్పగా... అతడు తన చిన్ననాటి స్నేహితుడైన జవహర్‌నగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌ను తీసుకువచ్చి పరిచయం చేశాడు. వీరితో పాటు మొత్తం ఐదుగురితో సలీం మాడ్యుల్ ఏర్పాటు చేశాడు. ఈ ముష్కరులను పట్టుకోవడానికి మధ్యప్రదేశ్ ఏటీఎస్, రాష్ట్ర నిఘా వర్గాలు నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు భోపాల్‌లోనూ ఏకకాల దాడులు చేశాయి. ఫలితంగా అక్కడ 11 మంది, నగరంలోని గోల్కొండ, హఫీజ్‌బాబానగర్, జగద్గిరిగుట్టల్లో సలీం, హమీద్ సహా ఐదుగురు చిక్కారు. జవహర్‌నగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్ పోలీసులు దాడి చేసే సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. పోలీసులు వచ్చిన విషయం తెలిసిన సల్మాన్ పక్కింటి వాళ్లు అతడికి ఫోన్ చేసి చెప్పడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సల్మాన్ కోసం ముమ్మరంగా గాలించిన ఎన్ఐఏ రాజేంద్రనగర్ ప్రాంతంలో పట్టుకుంది. ఇతడి నుంచి నిషేధిత సాహిత్యం సీజ్ చేసింది. కోర్టులో హాజరుపరిచిన అధికారులు భోపాల్ తరలించడానికి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. బుధవారం అక్కడకు తరలించిన తర్వాత న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. -
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు బాంబ్ స్క్వాడ్. శ్రీనగర్ బారాముల్లా హైవేపై ఐఈడీని అమర్చిన ఉగ్రవాదులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం నిముషాల వ్యవధిలో దాన్ని నిర్వీర్యం చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రదాడి జరిగిన గంటలు కాలేదు అప్పుడే భారత దేశంలో భారీ విధ్వంసానికి వ్యూహరచన చేశాయి ఉగ్రమూకలు. శ్రీనగర్ లోని బారాముల్లా హైవేపై సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ఐఈడీ ని అమర్చారు ఉగ్రవాదులు. సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ఒక బ్యాగ్ కనిపించడంతో స్థానికులు అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్ కు సమాచారమందించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఐఈడీని నిర్మానుష్య ప్రదేశంలో నిర్వీర్యం చేశాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.. ఒకవేళ ఈ పేలుడు గనుక యధాతధంగా జరిగి ఉంటే భారీగా నష్టం వాటిల్లేది. ఇది కూడా చదవండి: ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా -
ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి.. కట్‌చేస్తే సక్సెస్ఫుల్ అంపైర్‌గా
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తొలి టెస్టుకు పాకిస్తాన్ అంపైర్ అహ్సన్ రాజా ఫీల్డ్ అంపైర్‌గా పనిచేయడం ఆసక్తి కలిగించింది. ఎలైట్ ఐసీసీ అంపైర్‌గా అహ్సన్ రాజాకు తొలిసారి యాషెస్ టెస్టు సిరీస్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ విషయం పాక్ అభిమానులను సంతోషపరిచింది. మరి అభిమానుల సంతోషం వెనుక కారణం ఏంటని అనుకుంటున్నారా.. 2009లో శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. బస్సులో స్టేడియానికి వెళ్తున్న లంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగింది. అదే బస్సులో అహ్సన్ రాజా కూడా ఉన్నాడు. పలువురు లంక క్రికెటర్లతో పాటు అహ్సన్ రాజా కూడా ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరంలోకి బులెట్ దూసుకెళ్లడంతో బతకడం కష్టమన్నారు. కానీ అహ్సన్ రాజా బతకాలనే పట్టుదల అతన్ని కోలుకునేలా చేసింది. అంతేకాదు అంపైరింగ్ చేయాలన్న కోరికతో క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అహ్సన్ రాజా కోరిక మళ్లీ నెరవేరింది. అంపైరింగ్‌పై ఉన్న ఇష్టంతో అహ్సన్ రాజా క్రికెట్‌కు తొందరగానే రిటైర్మెంట్ ఇచ్చాడు. తన కెరీర్లో అహ్సన్రాజా 21 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, నాలుగు లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇక క్రికెట్లో తాను సక్సెస్ కాలేనని గ్రహించిన అహ్సన్ రాజా ఆటకు గుడ్‌బై చెప్పి అంపైరింగ్‌కు సంబంధించిన శిక్షణ తీసుకున్నాడు. అలా 2006లో అంపైర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టాడు. 2006లో ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ద్వారా అహ్సన్ రాజా అంపైరింగ్ చేవాడు. ఆ తర్వాత 2009లో పీసీబీ కాంట్రాక్ట్ దక్కించుకున్న అహ్సన్ రాజా అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 2018లో అండర్-19 వరల్డ్‌కప్, ఆ తర్వాత మహిళల టి20 వరల్డ్‌కప్, 2019 ఐసీసీ టి20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్, 2020 ఐసీసీ మహిళల టి20 వరల్డ్‌కప్‌లో అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. ఇక 2021లో పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా తొలిసారి టెస్టుల్లో అంపైరింగ్ నిర్వహించాడు. అలా కేవలం నాలుగేళ్లలోనే అత్యంత విజయవంతమైన అంపైర్‌గా పేరు తెచ్చుకున్న అహ్సన్ రాజా ఐసీసీ ఎలైట్ అంపైర్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. కట్‌చేస్తే.. ఇవాళ ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో అంపైర్‌గా విధులు నిర్వర్తిస్తూ టాప్ అంపైర్‌గా పేరు తెచ్చుకున్నాడు. What an inspiring journey from Ahsan Raza. Was one of the victims of SL team attack back in 2009 and there were even rumors that he had expired but he fought through it and made his way to the top from bottom. From umpiring in Bermuda vs Namibia to umpiring in Ashes. pic.twitter.com/WiNjv2slxW — yang goi (@GongR1ght) June 16, 2023 so good to see ahsan raza umpiring in an ashes opener. icc have had always respect for aleem dar & after his retirement, they have passed in it onto ahsan raza. pic.twitter.com/W7PfSR7ppu — Kamran (@kamran_069) June 16, 2023 చదవండి: రెండేళ్ల వ్యవధిలో తొమ్మిది శతకాలు.. కొత్తగా కనిపిస్తున్నాడు -
ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే.. రంగంలోకి ఎన్ఐఏ
కశ్మీర్: అయిదుగురు భారత జవాన్లను హతమార్చిన ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఎన్ఐఏ అధికారుల బృందం కాసేపట్లో జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు చేరుకోనున్నారు. ఢిల్లీకి చెందిన ఎనిమిది మంది ఫోరెన్సిక్ నిపుణులతోపాటు ఎన్ఐఏ బృందం మధ్యాహ్నం 12.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకోనుంది. General Manoj Pande #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of 05 #IndianArmy Bravehearts, Hav Mandeep Singh, L/Nk Debashish Baswal, L/Nk Kulwant Singh, Sep Harkrishan Singh & Sep Sewak Singh who laid down their lives in the line of duty at #Poonch Sector. https://t.co/7YSI1sEiEb — ADG PI - INDIAN ARMY (@adgpi) April 21, 2023 అమరులైన జవాన్లు వీరే ఉగ్రదాడిలో అమరులైన జవాన్లను హవల్దార్ మన్దీప్ సింగ్, లాన్స్‌నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్‌నాయక్ కుల్వంత్ సింగ్, హర్కిషన్ సింగ్, సేవక్ సింగ్‌గా గుర్తించారు. వీరులైన సైనికులకు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే నివాళులు అర్పించారు. అమరుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి: Char Dham Yatra: ‘ఛార్‌ధామ్’కు మంచు తిప్పలు అసలేం జరిగిందంటే.. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్‌పై గురువారం మధ్యాహ్నం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భింబెర్ గలి నుంచి సింగియోట్ వైపు వస్తుండగా గ్రనేడ్లు విసరడంతో వాహనానికి నిప్పంటుకుంది. ఈ ఘటనలో అయిదుగురు సైనికులు వీర మరణం పొందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షం, తక్కువ వెలుతురు మాటున ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను మట్టుబెట్టేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగినట్లుపేర్కొన్నారు. J&K | Visuals from Bhimber Gali in Poonch where five soldiers lost their lives in a terror attack yesterday. (Visuals deferred by unspecified time) pic.twitter.com/331XNOeQWj — ANI (@ANI) April 21, 2023 హై అలర్ట్ పిడుగుపాటు వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని తొలుత భావించినా, ఆ తర్వాత ఇది ఉగ్రవాదుల పనేనని సైన్యం నిర్ధారించింది. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ దాడి అనంతరం బటా-డోరియా ప్రాంతంలోని అడవులలో భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఘటనా ప్రాంతాన్ని చుట్టిముట్టిన భద్రతా దళాలు.. ఉగ్రవాదుల జాడ కోసం డ్రోన్లు, స్నిఫర్ డాగ్‌లను ఉపయోగిస్తున్నారు. దాడిని పరిశీలించేందుకు బాంబు డిస్పోసల్ స్క్వాడ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కూడా సంఘటనా ప్రాంతంలో ఉన్నాయి. మరోవైపు పూంచ్‌లో దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. 2021 అక్టోబర్‌లో ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు 9 మంది భారత సైనికులను కాల్చి చంపారు. చదవండి: Karnataka: ఈశ్వరప్ప కుమారుడికి మొండిచేయి -
ముంబైపై ఉగ్రదాడి చేస్తామని ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్
ముంబైలో ఉగ్రదాడి జరగుతుందంటూ జాతీయ దర్యాప్తు సంస్థకు బెదిరింపు మొయిల్ వచ్చింది. తాను తాలిబాస్ సభ్యుడనంటూ దర్యాప్తు సంస్థకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపాడు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థ మహారాష్ట్రలోని ముంబై పోలీసుల అప్రమత్తం చేసింది. దీంతో పోలీసులు ముంబైలోని వివిధ నగరాలకు హైఅలర్ట్ జారీ చేశారు. బెదిరింపు మెయిల్లో గర్తు తెలియని వ్యక్తి తనను తాను తాలిబానీ సభ్యుడిగా పేర్కొన్నాడు. ముంబైలో ఉగ్రదాడి జరుగుతుందంటూ బాంబు పేల్చాడని పోలీసుల వర్గాలు చెప్పాయి. ఈ మెయిల్ తదనంతరం దర్యాప్తు సంస్థ, ముంబై పోలీసులు సంయుక్తంగా ఇందులో నిజానిజాలను వెలికితీసే పని ప్రారంభించాయి. అంతేగాదు ఆ వ్యక్తి మెయిల్లో ముంబైలోని పలు కీలక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలిపినట్లు సమాచారం. అందులో భాగంగా నగరంలో ఇన్ఫినిటీ మాల్ అంధేరి, పీవీఆర్ మాల్ జుహు, సహారా హోటల్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు భద్రతను కట్టుదిటట్టం చేశారు. ఈ ఏడాది జనవరిలో ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూలకు ఇలానే ఓ బెదిరింపు కాల్ వచ్చింది. అలాగే గతేడాది అక్టోబర్‌లో కూడా ఇదే తరహాలో బెదిరింపు కాల్ వచ్చింది. (చదవండి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం..ఏకంగా 18 వందల మంది అరెస్టు!) -
యూదుల ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి..
జెరూసలెం: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంలోని యూదుల ప్రార్థనా మందిరంపై ఉగ్రవాది దాడికి తెగబడ్డాడు. కన్పించిన వారిపై బుల్లెట్లు వర్షం కురిపించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. తూటాలు తగిలి మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. నివె యాకోవ్ బోలెవార్డ్‌లో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తుపాకీతో ఉన్న ఉగ్రవాదిని కాల్చి చంపారు. అతను తీసుకొచ్చిన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇది అత్యంత తీవ్రమైన ఉగ్రచర్య అని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇలాంటి భయానక ఘటన జరగలేదన్నారు. నిందితుడ్ని పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంబరాలు.. మరోవైపు ఈ దాడిని పాలస్తీనా ఉగ్రసంస్థలు ప్రశంసించాయి. కానీ ఇది తమ పని కాదని పేర్కొన్నాయి. కొన్ని చోట్ల పాలస్తీనా ప్రజలు ఈ ఘటనను సంబరంగా జరుపుకొన్నారు. మిఠాయిలు పంచి, ర్యాలీలు చేశారు. చదవండి: నన్ను చంపించేందుకు జర్దారీ కుట్ర: ఇమ్రాన్ -
ఇళ్లల్లోకి చొరబడి ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు పౌరులు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలోని డాంగ్రి గ్రామంలో మైనారిటీ వర్గం లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆయుధాలతో గ్రామంలోకి చొరబడిన దుండగులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో 10 మంది స్థానికులు గాయపడ్డారు. తూటాలు తగిలిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రమూకల కోసం భద్రతా దాళం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇద్దరు దుండగులు గ్రామంలోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ‘మూడు ఇళ్లల్లో కాల్పులు జరిగాయి. ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుండగుల కోసం గాల్పింపు చర్యలు కొనసాగుతున్నాయి. ’అని తెలిపారు అదనపు డీజీపీ ముకేశ్ సింగ్. మరోవైపు.. కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని, మరో ఎనిమిది మంది గాయపడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో రాజౌరీ వైద్య కళాశాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన రెండు వారాళ్లో పౌరులే లక్ష్యంగా కాల్పులు జరగటం ఇదే రెండో సంఘటన. డిసెంబర్ 16న ఆర్మీ క్యాంప్ సమీపంలో ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇదీ చదవండి: చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి -
మీ త్యాగాన్ని జాతి మరువదు
న్యూఢిల్లీ: 2001లో పార్లమెంట్‌పై ఉగ్ర దాడి ఘటనలో నేలకొరిగిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా జాతి యావత్తూ మంగళవారం నివాళులర్పించింది. పార్లమెంట్ భవనం వెలుపల జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అన్ని పార్టీల ఎంపీలు ఘనంగా నివాళులర్పించారు. 2001 పార్లమెంట్ దాడి ఘటనలో వీరమరణం పొందిన వారికి జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి ముర్ము అనంతరం ట్వీట్ చేశారు. దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వారి త్యాగాన్ని, ధైర్యసాహసాలను ఎన్నడూ మరువబోమని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. ఘనంగా నివాళులర్పించిన రాజ్యసభ అంతకుముందు, పార్లమెంట్‌పై దాడి ఘటనలో ప్రాణాలర్పించిన వారికి రాజ్యసభ నివాళులర్పించింది. సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నిలబడి మౌనం పాటించారు. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాయ్ మాట్లాడారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో డిసెంబర్ 13వ తేదీ ఎప్పటికీ విషాదకరమైన రోజుగానే గుర్తుండిపోతుందన్నారు. 2001 డిసెంబర్ 13వ తేదీన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంట్ వద్ద కాల్పులకు తెగబడ్డారు. పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకుపోయేందుకు వారు చేసిన యత్నాన్ని బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ మహిళా జవాను ఒకరు, పార్లమెంట్ సిబ్బంది ఇద్దరు, జర్నలిస్ట్ ఒకరు ప్రాణాలు కోల్పోగా భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులందరూ హతమయ్యారు. -
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100కు చేరిన మృతుల సంఖ్య
సోమాలియా రాజధాని మొగదిషులో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని ఆ దేశ అధ్యక్షుడు హసన్ షేక్ ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించడంతో మరో 300 మంది గాయపడినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా మొగదిషులోని విద్యాశాఖ కార్యాలయం బయట రద్దీగా ఉండే జోబ్ కూడలి వద్ద శనివారం(ఆక్టోబర్ 29) రెండు కారు బాంబులు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. సోమాలియా అధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని, ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్‌ను ఎదుర్కోవడంపై చర్చిస్తుండగానే రాజధానిలో రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించింది. అంతేగాక గత ఐదేళ్లకాలంలో సోమాలియాలో జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. విద్యాశాఖ కార్యాలయం గోడ వద్ద తొలి పేలుడు జరగ్గా, రద్దీగా ఉన్న ఒక రెస్టారెంట్ ముందు మరో కారు బాంబు పేలింది. సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మొహమూద్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. పేలుడు ధాటికి వాహనాలు తుక్కుతుక్కైనట్లున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాయి. అల్ ఖైదా ప్రోద్భలంతో పనిచేసే అల్‌సబాబ్ ఉగ్ర సంస్థే ఈ పేలుళ్లు జరిపి ఉంటుందని అధ్యక్షుడు ఆరోపించారు. రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. గతంలో చాలా సార్లు మొగదిషులో అల్‌సబాబ్ సంస్థే పేలుళ్లకు తెగబడింది. అయితే అల్ షబాబ్ దీనిపై స్పందించలేదు. మరోవైపు సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన ఉగ్రదాడులను భారత్ ఖండించింది. ఉగ్రదాడి తర్వాత సోమాలియాలో మరణించిన వారి కుటుంబాలకు భారత్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఇదిలా ఉండగా పేలుళ్లపై తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఇదిలా ఉండగా ఇదే జంక్షన్లో ఐదేళ్ల క్రితం(2017) ట్రక్ బాంబ్ పేలిన ఘటనలో 500 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఉగ్ర సంస్థ అల్ షబాబ్ పనేనని తేలింది. చదవండి: హిజాబ్ ఆందోళనల వేళ పోలీసు కస్టడీలో సెలబ్రిటీ చెఫ్ మృతి.. అంత్యక్రియలకు వేలాది మంది హాజరు -
ఉగ్రదాడుల కుట్రను భగ్నం చేసిన హైదరాబాద్ పోలీసులు
-
నరమేధం.. చెల్లాచెదురుగా మృతదేహాలు
ఉగ్రవాదుల మారణహోమంతో ప్రపంచం మరోసారి ఉలిక్కి పడింది. అదను చూసి కాల్పులు, బాంబు దాడులతో మారణహోమం సృష్టించారు. ప్రాణాల కోసం బయటకు పరిగెత్తినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు.. చెల్లాచెదురైన మృతదేహాలే ఎటు చూసినా కనిపించాయి. నైజీరియాలో ఓ చర్చిలో జరిగిన ఉగ్రకాండలో యాభై మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య మరింతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన జరిగింది. ఆదివారం కావడంతో ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. దాడిని చాలా పక్కగా నిర్వహించారు ఉగ్రవాదులు. కొందరు చర్చిలోపల కాల్పులకు పాల్పడగా.. ప్రాణాల కోసం బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్లపై బయట ఉన్న మరో ఉగ్రవాది తూటాల వర్షం కురిపించాడు. మృతదేహాలు, చెల్లాచెదురుగా విడిభాగాలతో చర్చి భీతావహంగా ఉంది. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ.. 50 మందికిపైనే ప్రాణాలు కోల్పోయినట్టు నైజీరియా లోయర్ లెజిస్లేటివ్ చాంబర్ సభ్యుడు అడెలెగ్బె టిమిలెయిన్ తెలిపారు. ఘటన తర్వాత చర్చి ప్రధాన పాస్టర్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెదర్ ప్రాంతానికి చెందిన ఉగ్రవాదుల పనిగా భావిస్తున్నారు. కాగా, చర్చిపై దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. నైజీరియాలో అత్యంత శాంతియుత రాష్ట్రాలలో ఒకటిగా ఖ్యాతికెక్కిన ఓండోలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే.. పలు దేశాల అధినేతలు ఘటనను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చదవండి: బైడెన్ ఇంటి వద్ద విమాన కలకలం -
పాకిస్తాన్.. మీకు మళ్లీ చెబుతున్నాం: భారత్
సాక్షి, న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాదదాడి గాయాల నుంచి భారతదేశం ఇంకా కోలుకోలేదు. ఈ విషాద ఘటన చోటుచేసుకొని నేటికి 13ఏళ్లు గడుస్తోంది. అయితే ఈ సందర్భంగా భారత విదేశాంగశాఖ.. పాకిస్తాన్ హైకమిషన్ సీనియర్ దౌత్యవేత్తకు ఓ నోట్‌ను విడుదల చేసింది. తమ దేశ నియంత్రణలో ఉన్న భూభాగాల నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రదాడులకు అనుమంతించవద్దనే నిబద్దతకు పాక్ కట్టుబడి ఉండాలని తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌కు మరోసారి తెలుపుతున్నామంటూ భారత విదేశాంగ శాఖ వార్నింగ్ ఇచ్చింది. 13ఏళ్ల క్రితం జరిగిన పాశవిక ఘటనలో ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలకు సంబంధించిన 166 కుటుంబాలు బాధితులయ్యాయి. అయితే ఈ ఉగ్రదాడికి పాల్పడినవారిని కోర్టు ముందుకు తీసుకురావటంలో పాకిస్తాన్ ఇప్పటికీ తన చిత్తశుద్ధిని చూపించలేదని పేర్కొంది. మరోసారి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఈ ఘటనపై ద్వంద్వ వైఖరి కట్టిపెట్టి ఉగ్రదాడికి పాల్పడిన నేరస్తులను శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం జవాబుదారితనం కంటే టెర్రరిస్టుల చేతిలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు సంబంధించిన అంతర్జాతీయ బాధ్యతని గుర్తుచేసింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులు, ఇతర బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపింది. 26 నవంబర్, 2008లో పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదుల గ్రూప్ భారత్‌లోకి చొరబడి ముంబైలోని రైల్వేస్టేషన్, రెండు హోటల్స్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారకుడైన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను 21 నవంబర్, 2012లో ఉరితీశారు. -
13 ఏళ్ల నాటి విషాద ఛాయలు..రతన్ టాటా ఆవేదన
ముంబై: ముంబైలో 26/11 ఉగ్రదాడులు జరిగి నేటికి 13 ఏళ్లు అవుతున్నాయని, పైగా ఆనాటి విషాదాంతాన్ని అంత తేలికగా మర్చిపోలేమంటూ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నాటి ఉగ్రదాడుల్లో ధ్యంసం అయిన తాజ్ మహల్ ప్యాలెస్ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ నాటి దాడులకు సంబంధించిన విషాధ ఛాయలను నెటిజన్లుతో పంచుకున్నారు. (చదవండి: కొడుక్కి అరుదైన వ్యాధి.. తండ్రి హైస్కూల్ డ్రాపవుట్.. సొంతంగా మందు తయారీ) ఈ మేరకు రతన్ టాటా మాట్లాడుతూ.... 13 సంవత్సరాల క్రితం మేము అనుభవించిన బాధ, కోల్పోయినవారిని ఎప్పటికీ తిరిగి పొందలేం. అయితే మనం కోల్పోయిన వారిని గౌరవించడం ద్వారా మనల్ని విచ్ఛిన్నం చేయడానికి ఉద్దేశించి జరిపిన ఉగ్రదాడుల తాలుకా స్మృతులను మన బలానికి మూలంగా మార్చుకోవాలి" అని అన్నారు. అంతేకాదు ఆనాటి ఉగ్రదాడిలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిని అమరవీరులకు రతన్‌టాటా ఈ సందర్భంగా నివాళులర్పించారు. అయితే నవంబర్ 26, 2008న ముంబైలో నాలుగు రోజుల పాటు జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో సుమారు 166 మంది మృతి చెందడమే కాక దాదాపు 300 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రతన్ టాటా ఇన్‌స్టాగామ్‌లో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో) View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) -
కొడుకు బర్త్‌డేకి తప్పకుండా వస్తానన్నాడు.. ఇంతలోనే
ఇంపాల్: మణిపూర్‌లో తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా దళాల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ‘46 అస్సాం రైఫిల్స్’కు చెందిన ఖుగా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితోపాటు మరో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరణించిన భద్రతా సిబ్బందిలో అస్సాం రైఫిల్స్ జవాన్ సుమన్ స్వర్గిరీ ఒకరు. బక్సా జిల్లాలోని బరామా ప్రాంతానికి సమీపంలోని తేకెరకుచి కలిబారి గ్రామానికి చెందిన సుమన్ 2011లో భారత సైన్యంలో చేరాడు. అంతకుముందు 2007లో మిలిటెంట్లు అతని తండ్రి కనక్ స్వర్గిరీని హత్య చేశారు. సుమన్ చివరిసారిగా ఈ ఏడాది జూలైలో ఇంటికి వచ్చాడు. (చదవండి: మణిపూర్‌లో తీవ్రవాదుల ఘాతుకం) సుమన్‌కు వివాహం అయి ఓ కుమారుడు ఉన్నాడు. డిసెంబర్లో కుమారుడి మూడవ పుట్టిన రోజు. కొడుకు బర్త్‌డేకు తప్పకుండా వస్తానని భార్యకు మాటిచ్చాడు. మరి కొన్ని రోజుల్లో భార్యాబిడ్డలను కలవబోతున్నానని తెగ సంతోషించాడు సుమన్. కానీ అతడి ఆనందాన్ని తీవ్రవాదులు దూరం చేశారు. సుమన్ కుటుంబంలో జీవితాంతం తీరని దుఖాన్ని మిగిల్చారు. సుమన్ మరణ వార్త తెలిసి అతడి భార్య గుండలవిసేలా విలపిస్తోంది. ‘‘నా భర్త వచ్చే నెల కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వస్తానని మాటిచ్చాడు. పోయిన శుక్రవారం నాకు కాల్ చేశాడు. అప్పుడు తాను ఓ రిమోట్ ఏరియా ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలిపాడు.. అక్కడి నుంచి తిరిగి వచ్చాక కాల్ చేస్తానన్నాడు. మాకు కాల్ చేసే లోపే అతడికి తీవ్రవాదుల రూపంలో చివరి కాల్ వచ్చింది. నాకు, నా బిడ్డకు దిక్కెవరు’’ అంటూ ఏడుస్తున సుమన్ భార్యను చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు. (చదవండి: ఉగ్రదాడి.. బీజేపీ సర్పంచ్ దారుణ హత్య) ఈ దాడికి పాల్పడింది తామేనని పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్(ప్రెపాక్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) అనే తీవ్రవాద సంస్థలు ప్రకటించాయి. మణిపూర్ విముక్తి కోసం ఈ సంస్థలు పోరాడుతున్నాయి. చదవండి: ఆ విషాదంపై రతన్ టాటా భావోద్వేగం -
మణిపూర్ లో ఉగ్రవాదుల మెరుపుదాడి
-
మణిపూర్‌లో తీవ్రవాదుల ఘాతుకం
ఇంఫాల్/న్యూఢిల్లీ: సరిహద్దు రాష్ట్రం మణిపూర్‌లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా దళాల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ‘46 అస్సాం రైఫిల్స్’కు చెందిన ఖుగా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితోపాటు మరో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్(ప్రెపాక్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) అనే తీవ్రవాద సంస్థలు ప్రకటించాయి. మణిపూర్ విముక్తి కోసం ఈ సంస్థలు పోరాడుతున్నాయి. చురాచాంద్‌పూర్ జిల్లాలోని సెఖాన్ గ్రామం వద్ద విప్లవ్ త్రిపాఠి తన భార్య, ఆరేళ్ల కుమారుడితోపాటు కాన్వాయ్‌లో వస్తుండగా తీవ్రవాదులు పేలుడు పదార్థాలను(ఐఈడీ) పేల్చారు. కాల్పులు సైతం జరిపారు. దీంతో కాన్వాయ్‌లో ఉన్న అస్సాం రైఫిల్స్ జవాన్లు సైతం ఎదురు కాల్పులు ప్రారంభించారు. తీవ్రవాదుల దాడిలో కల్పల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడు, నలుగురు జవాన్లు మృతిచెందారు. గాయపడిన వారిని అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రవాదుల దాడిలో మరణించిన కల్నల్ విప్లవ్ త్రిపాఠి గతంలో మిజోరాంలో పనిచేశారు. 2021 జూలైలో బదిలీపై మణిపూర్‌కు వచ్చారు. మిజోరాంలో ఉన్నప్పుడు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విప్లవ్ త్రిపాఠి స్వస్థలం ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌గఢ్. (చదవండి: అద్భుతం: తల్లి దీవెనలు.. తమ్ముడూ నీ బుర్రకు హ్యాట్సాఫ్) ఏడుగురి ప్రాణ త్యాగాల్ని మర్చిపోలేం: మోదీ మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై తీవ్రవాదులు దాడి చేసి, ఏడుగురి ప్రాణాలను బలిగొనడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఏడుగురి ప్రాణ త్యాగాల్ని ఎప్పటికీ మర్చిపోలేమని శనివారం ట్వీట్ చేశారు. అది పిరికిపంద చర్య: రాజ్‌నాథ్ సింగ్ మణిపూర్‌లో తీవ్రవాదుల దాడిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. తీవ్రవాదులను కచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పారు. ఐదుగురు యోధులను దేశం కోల్పోయిందని అన్నారు. చదవండి: ‘‘ఇవాళ ఉన్నాం. రేపుంటామో లేదో!’’ ఏమిటీ పీఎల్ఏ? మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ జవాన్లపై తీవ్రవాదుల దాడి నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సంస్థను 1978 సెప్టెంబర్ 25న ఎన్.బిశ్వేశ్వర్ సింగ్ ప్రారంభించారు. మణిపూర్‌కు భారతదేశం నుంచి విముక్తి కలిగించి, స్వతంత్ర దేశంగా మార్చడమే తమ సంస్థ ధ్యేయమని ప్రకటించారు. మార్క్సిజం–లెనినిజం సిద్ధాంతాలు, మావో ఆలోచనా విధానంపై ఆధారపడి పీఎల్ఏ పనిచేస్తోంది. పీఎల్ఏకు చైనా ప్రభుత్వం నుంచి అండదండలు లభిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఇతర తీవ్రవాద, వేర్పాటువాద సంస్థలతో పీఎల్ఏ చేతులు కలిపింది. ఉమ్మడి శత్రువైన భారతదేశాన్ని ఓడించడానికి ఆయా సంస్థలు ఒక్క తాటిపైకి వచ్చాయి. పీఎల్ఏ 1989లో రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్(ఆర్పీఎఫ్) పేరిట ఒక రాజకీయ విభాగాన్ని ప్రారంభించింది. మణిపూర్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్‌లో పీఎల్ఏ భాగస్వామిగా చేరింది. -
బ్యాంక్‌పై కోపం.. ‘నగరంపై మరో ఉగ్ర దాడి’ అంటూ
సాక్షి, హైదరాబాద్: ఓ బ్యాంకు సేవలు నచ్చకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడమో, ఖాతాను మరో బ్యాంకులోకి మార్చుకోవడమో చేస్తాం. నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం సహనం కోల్పోయి బెదిరింపులకు దిగాడు. ముంబైలోని ఆ బ్యాంక్ కాల్ సెంటర్‌కు ‘నగరంపై మరో ఉగ్ర దాడి జరగనుంది’ అంటూ ఈ–మెయిల్ పంపాడు. ఫలితం సైబర్ టెర్రరిజం ఆరోపణలపై కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది. వివరాలిలా ఉన్నాయి... నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి ఓ జాతీయ బ్యాంకులో పెన్షన్ ఖాతా ఉంది. పెన్షన్ నిబంధనల ప్రకారం ఈ ఖాతా వివరాలను ఆన్లైన్లో పెట్టాల్సి ఉంది. జాప్యం కావడంతో కొన్నాళ్లుగా సదరు రిటైర్డ్ ఉద్యోగికి పెన్షన్ అందట్లేదు. దీంతో ఆయన దీనిపై ఆ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇది పెండింగ్‌లో ఉండిపోవడంతో పలుమార్లు ముంబైలోని బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లో (బీకేసీ) ఉన్న బ్యాంక్ కాల్ సెంటర్‌కు ఫోన్లు, ఈ–మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో సహనం కోల్పోయిన నగరవాసి ఆవేశపడ్డారు. బ్యాంకు కస్టమర్ కేర్ ఈ–మెయిల్ ఐడీకి మరో మెయిల్ పంపారు. ఈ కాల్ సెంటర్ ముంబైలోని బీకేసీ కాంప్లెక్స్‌లో ఉందని తెలిసిన ఆయన తన ఈ–మెయిల్లో అతి త్వరలోనే అక్కడ ఉగ్రదాడి జరుగనుందని, దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అదే మెయిల్లో తన బ్యాంకు ఖాతా నెంబర్, వివరాలను పొందుపరిచారు. దీన్ని చూసి కంగుతిన్న కాల్ సెంటర్ ఉద్యోగులు విషయాన్ని బ్యాంక్ జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బ్యాంకు అధికారులు దీనిపై ఎంఆర్ఏ మార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్వాపరాలు పరిశీలించిన పోలీసులు నగరవాసిపై ఐపీసీలోని 506, 507లతో పాటు ఐటీ యాక్ట్‌లో సైబర్ టెర్రరిజానికి సంబంధించిన 66 ఎఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్యాంకు ఖాతా వివరాలను బట్టి బాధ్యుడు హైదరాబాద్ వాసిగా తేల్చారు. బెదిరింపు ఈ–మెయిల్ వచి్చన ఐపీ అడ్రస్‌లో ఆధారాలు సేకరిస్తున్నారు. అతడి వివరాలు గోప్యంగా.. నిందితుడిని అరెస్టు చేయడానికి ఎంఆర్ఏ మార్గ్ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందం త్వరలో హైదరాబాద్‌కు రానుంది. ఈ విషయంపై సదరు ఠాణా అధికారిని సాక్షి బుధవారం ఫోన్ ద్వారా సంప్రదించగా ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అతడి పేరు, వివరాలతోపాటు బ్యాంక్ అధికారుల కోరిక మేరకు ఆ వివరాలు బయటకు చెప్పలేమని అన్నారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం, సేవల్లో లోపంపై స్పందించాల్సిన తీరు ఇది కాదని వ్యాఖ్యానించారు. -
‘బీజేపీ ప్రభుత్వానికి ఉగ్రవాదులు భయపడుతున్నారు’
గుజరాత్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఇప్పటి వరకు ఒక్క పెద్ద ఉగ్రవాద దాడి కూడా జరగలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన గుజరాత్‌లోని నర్మాద జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అప్పటి నుంచి దేశంలో ఒక్క పెద్ద ఉగ్రవాద దాడి కూడా జరగలేదని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఉగ్రవాదులు భయపడుతున్నారని పేర్కొన్నారు. అది బీజేపీ సాధించిన గొప్ప విజయమని తెలిపారు. చదవండి: West Bengal Post Poll Violance: సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ఇద్దరు నిందితుల పేర్లు ఉగ్రవాదులు తమకు బలమైన స్థావరాలు అనుకుంటున్న ప్రాంతాలు కూడా సురక్షితమైనవి కాదని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. పీఓకేలో సర్జికల్ స్ట్రైక్ ద్వారా భారత్దేశ శక్తిని ప్రపంచానికి తెలియజేశామని పేర్కొన్నారు. భారత సైన్యం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రశంసించే ఆలోచన కూడా లేదని మండిపడ్డారు. అదీకాక 40 ఏళ్లుగా వన్ ర్యాంక్-వన్ పెన్షన్ సమస్యను పరిష్కరించకుండా ఉంచారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దుయ్యబట్టారు. చదవండి: ‘అఫ్గాన్ నుంచి భారతీయుల తరలింపే మొదటి ప్రాధాన్యత’ -
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. దేశ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా బాంబు దాడులకు ప్లాన్ చేసిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. జైసే ఈ మహ్మద్ ఉగ్రవాద సంస్ధకు చెందిన వీరు శనివారం పట్టుబడ్డారు. ఈ నలుగురు డ్రోన్ల ద్వారా ఆయుధాలను సేకరించి మిగిలిన ఉగ్రవాదులకు సరఫరా చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు.. టూవీలర్‌కు ఐఈడీ అమర్చి పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు తేలింది. ఆదివారం స్వాంతంత్ర్య వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో బాంబు దాడులకు సిద్ధమైనట్లు గుర్తించారు. -
బస్సు బాంబు దాడిపై పాకిస్తాన్ పచ్చి అబద్ధాలు
న్యూఢిల్లీ: ఖైబర్ పక్తూంఖ్వా ప్రావిన్స్‌లో గత నెలలో జరిగిన బస్సు బాంబు పేలుడు వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శుక్రవారం ఖండించారు. ఆసియా ప్రాంతంలో స్థానికంగా అస్థిరతకు, ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్ బాహ్య ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు పచ్చి అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తూంఖ్వా ప్రావిన్స్‌లో అప్పర్ కోహిస్తాన్ జిల్లాలో జరిగిన బస్సు బాంబు పేలుడు ఘటనలో 9 మంది చైనా ఇంజనీర్లు సహా మొత్తం 13 మంది మరణించారు. ఈ దాడికి భారత నిఘా సంస్థ ‘రా’, అఫ్గానిస్తాన్‌కు చెందిన నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ(ఎన్డీఎస్) కారణమని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఆరోపించారు. ఈ ఆరోపణలను అరిందమ్ బాగ్చీ తిప్పికొట్టారు. భారత్‌ను అప్రతిష్ట పాలు చేయాలన్నదే పాక్ పన్నాగమని మండిపడ్డారు. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో భారత్ ముందు వరుసలో నిలుస్తోందని గుర్తుచేశారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేస్తోందని అన్నారు. ఉగ్రవాద విష భుజంగాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందన్న సంగతి అందరికీ తెలుసని చెప్పారు. -
ఉగ్రదాడి.. బీజేపీ సర్పంచ్ దారుణ హత్య
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నేత, అతడి భార్యపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. అనంతనాగ్‌లోని లాల్ చౌక్‌లో సోమవారం జరిగిన కాల్పుల్లో.. ఆ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన కిసాన్ మోర్చా అధ్యక్షుడు, సర్పంచ్ గులామ్ రసూల్ దార్‌తో పాటు ఆయన భార్య జవహీరా బానూ మృతిచెందారు. ఉగ్రవాదుల దాడుల్లో కిసాన్ మోర్చా అధ్యక్షుడు చనిపోయినట్లు మరో బీజేపీ నేత అల్తాఫ్ ఠాకూర్ తెలిపారు. అమాయకులును బలి తీసుకున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ దారుణాన్ని ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘కుల్గాంలో జరిగిన కాల్పుల్లో కిసాన్ మోర్చా అధ్యక్షుడు, సర్పంచ్ గులామ్ రసూల్ దార్‌తో పాటు ఆయన భార్య జవహీరా బానూ మృతిచెందారు. ఈ దారుణ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పిరికిపంద చర్య.. హింసకు పాల్పడిన వారిని అతి త్వరలో న్యాయస్థానం ముందు నిలబెడతాం. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అంటూ మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. Jammu & Kashmir | Terrorists fired bullets at a couple at Lal Chowk in Anantnag. Both husband & wife have been shifted to hospital. More details awaited. — ANI (@ANI) August 9, 2021 మరో వైపు పూంచ్ సెక్టార్లో బీఎస్ఎఫ్ దళాలు నిర్వహించిన తనిఖీల్లో భారీ స్థాయిలో ఆయుధాలు లభ్యమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. బీఎస్ఎఫ్ దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. విల్ సంగద్ అటవీ ప్రాంతంలో జరిగిన గాలింపులో ఆయుధాలు దొరికాయి. వాటిల్లో ఏకే 47 రైఫిళ్లు, పిస్తోళ్లు ఉన్నాయి. Jammu & Kashmir | Terrorists fired bullets at a couple at Lal Chowk in Anantnag. Both husband & wife have been shifted to hospital. More details awaited. — ANI (@ANI) August 9, 2021 -
Jammu Airport: జంట పేలుళ్ల కలకలం.. ఉగ్రకోణంలో దర్యాప్తు!
న్యూఢిల్లీ: జమ్ము విమానాశ్రయం వద్ద ఎయిర్‌ఫోర్స్ కార్యాకలాపాలు నిర్వహించే చోట జంట పేలుళ్ల కలకలం నెలకొంది. శనివారం అర్ధరాత్రి దాటాక హై సెక్యూరిటీ జోన్ పరిధిలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. అయితే పేలుళ్లు స్వల్ప తీవ్రతతో జరగడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. కాగా, రాత్రి 1గం.35ని. నుంచి 1.గం.42 ని.. ఈ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఒక దాడిలో పైకప్పు స్వల్పంగా దెబ్బతిందని, మరో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగిందని ప్రకటించింది. ఈ ఘటనలో రెండు బ్యారక్‌లు ధ్వంసం అయ్యాయని, ఇద్దరు గాయపడినట్లు తొలుత సమాచారం అందించింది. అయితే డిఫెన్స్ పీఆర్వో మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లదేని ప్రకటించడం విశేషం. Two low intensity explosions were reported early Sunday morning in the technical area of Jammu Air Force Station. One caused minor damage to the roof of a building while the other exploded in an open area. — Indian Air Force (@IAF_MCC) June 27, 2021 కాగా, టెక్నికల్ ఏరియాల్లో ఈ ఘటన జరగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన విషయం తెలిసి ఎన్ఐఏ, ఎన్ఎస్జీ టీంలు రంగంలోకి దిగాయి. ఫోరెన్సిక్ టీంలు క్లూస్ కోసం గాలిస్తున్నాయి. డ్రోన్లలో ఐఈడీ బాంబులు అమర్చిన ఉగ్రవాదులు.. ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారేమోనని అనుమానిస్తున్నారు. చదవండి: అలాగైతేనే పోటీ చేస్తా: మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు -
కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ముష్కరులు మళ్లీ రెచ్చిపోయారు. మున్సిపల్ కౌన్సిలర్‌ను, ఆయన వ్యక్తిగత అంగరక్షకుడిని కాల్చి చంపారు. బారాముల్లా జిల్లాలోని సోపోరు పట్టణంలో సోమవారం ఈ దారుణం జరిగింది. మధ్యాహ్నం సోపోరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా గుర్తుతెలియని సాయుధులు లోపలికి ప్రవేశించారు. మున్సిపల్ కౌన్సిలర్ రియాజ్ అహ్మద్, సెక్యూరిటీ గార్డు షఫ్‌ఖాత్ అహ్మద్‌పై తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శంషుద్దీన్ పీర్ అనే మరో కౌన్సిలర్ గాయపడ్డాడు. జమ్మూకశ్మీర్ డీజీపీ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. దుండగుల దుశ్చర్యపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన ముదాసిర్ పండిట్ అనే ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముష్కరులను పట్టుకొనేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కౌన్సిల్ సమావేశ మందిరంలోకి చొరబడి ఉగ్రవాదులు కాల్పులు జరపడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని విమర్శించింది. వారిని పట్టుకొని, కఠినంగా శిక్షించాలని బీజేపీ జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా డిమాండ్ చేశారు. మృతులకు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు. ముష్కరుల అకృత్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన రియాజ్ అహ్మద్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, గెలిచారు. -
‘‘ఇవాళ ఉన్నాం. రేపుంటామో లేదో!’’
శ్రీనగర్: ఎలా ఉన్నావన్న మిత్రుడితో ‘‘బాగానే ఉన్నా. కానీ మా (సైనికుల) గురించి ఎవరేం చెప్పగలరు? ఇవాళ ఉంటాం. రేపుండొచ్చు, ఉండకపోవచ్చు’’ అని సమాధానమిచ్చాడు ఒక ఇరవయ్యేళ్ల జవాను. ఆ మరునాడే ఒక ఉగ్రదాడిలో అమరుడయ్యాడు. సైనికుల ప్రాణాలకు ఉన్న భరోసా ఏ పాటిదో చెప్తూ, సొంతూర్లోని తన చిన్ననాటి స్నేహితుడితో అతను చేసిన వాట్సాప్ చాట్ వైరల్‌గా మారడమే కాకుండా నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. ఎవరతను? మహారాష్ట్ర, జల్గావ్ జిల్లా, చలిగావ్ తాలూకాకు చెందిన యశ్ దిగంబర్ దేశ్‌ముఖ్ గతేడాదే ఆర్మీలో చేరాడు. యశ్ తల్లిదండ్రులు వ్యవసాయదారులు. అతనికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. అక్కలిద్దరికీ పెళ్లవగా, తమ్ముడింకా స్కూలుకు వెళుతున్నాడు. కర్ణాటక, బెళగావ్‌లో నిర్వహించిన మిలటరీ ఎంపిక శిబిరానికి చేరుకున్న యశ్ ఎంతగానో శ్రమించి ఆర్మీలో చోటు సంపాదించి తన కల నెరవేర్చుకున్నాడు. అసలేమైంది? అక్రమంగా ఎల్వోసీ దాటిన ముగ్గురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు గురువారం శ్రీనగర్‌లోని ఓ రద్దీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పట్టపగలే జరిగిన ఈ మెరుపుదాడిలో యశ్‌తో పాటు మరో జవాను అమరుడయ్యాడు. పన్నెండేళ్ల క్రితం ఇదే రోజున (26/11) ముంబై ఉగ్రదాడి జరగడం గమనార్హం. మరో రెండు రోజుల్లో జమ్ము కశ్మీర్లో ‘జిల్లా అభివృద్ధి మండలి’ (డీడీసీ) ఎన్నికలు జరనున్న నేపథ్యంలోనే ముష్కరులు ఈ దాడి జరిపి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా ఈ నెల 19న జమ్ము-శ్రీ నగర్ జాతీయ రహదారిపై ట్రక్కులో ప్రయాణిస్తున్న నలుగురు జైషే మొహమ్మద్ మిలిటంట్లను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే! -
ఆ విషాదంపై రతన్ టాటా భావోద్వేగం
సాక్షి,ముంబై: టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా 12 ఏళ్ల నాటి ఉగ్రదాడిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ముంబై నగరంలో నవంబరు 26న చోటుచేసుకున్న మారణహోమంపై సోషల్ మీడియాలో గురువారం స్పందించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన అమరవీరులకు, ప్రజలకు రతన్ టాటా నివాళులర్పించారు. 12 సంవత్సరాల క్రితం జరిగిన అవాంఛనీయ విధ్వంసాన్ని ఎప్పటికీ మర్చిపోలేనంటూ తీవ్ర విషాదానికి చేదు జ్ఞాపకంగా నిలిచిన తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ పెయింటింగ్‌ను షేర్ చేశారు. అయితే అంతకన్నా గుర్తుండిపోయే విషయం ఏమిటంటే, విభిన్నజాతుల సమ్మేళనమైన ముంబై ప్రజలంతా అన్ని తేడాలను పక్కనపెట్టి, ఉగ్రవాదాన్ని, విధ్వంసాన్ని అధిగమించారంటూ ప్రశంసించారు. ఆప్తులను కోల్పోవడం దుఃఖభరితమే అయినా, శత్రువును జయించడంలో వారి, ధైర్యవంతుల త్యాగాన్ని గౌరవించి తీరాలి. వారి తెగువను, ఐక్యతను మెచ్చుకోవాలన్నారు. ఆ రోజు వారు ప్రదర్శించిన సాహసం, సున్నితత్వం భవిష్యత్తులోనూ కొనసాగాలని రతన్ టాటా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా 2008, నవంబర్ 26వ తేదీన ముంబై నగరంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. నాలుగు రోజుల పాటు జరిగినఈ దారుణ మారణహోమంలో 166 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ముఖ్యంగా తాజ్ హోటల్లోనే 31 మంది మరణించిన సంగతి తెలిసిందే. pic.twitter.com/3qnuvXfE6M — Ratan N. Tata (@RNTata2000) November 26, 2020 -
ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షలు
సాక్షి, అమరావతి: జమ్మూ కశ్మీర్ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట ఎదురు కాల్పులలో వీర మరణం పొందిన హవాల్దార్ సీహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్ రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్ రెజిమెంట్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లోని మాచిల్ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులకు తెగపడడంతో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వీర మరణం పొందారు. (చదవండి : ఉగ్రపోరులో చిత్తూరు జిల్లా కమాండో వీరమరణం) దేశం కోసం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొన్నారు. వీర జవాన్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, అందువల్ల ఆ కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎం సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య రజితకు ముఖ్యమంత్రి లేఖ రాశారు. మరోవైపు ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి వర్గం సందర్శించి పరామర్శించింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి రెడ్డెప్ప స్థానిక ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు లు రెడ్డివారిపల్లి కి వెళ్లి ప్రవీణ్ కుటుంబీకును పరామర్శించారు. ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి ప్రవీణ్ కుటుంబీకులకు 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. సీఎం ఆదేశాల మేరకు మేము వచ్చామన్నారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ బిశ్వ భూషణ్ చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, రెడ్డివారిపల్లెకు చెందిన సైనిక దళాల సిపాయి చీకాల ప్రవీణ్ కుమార్ రెడ్డి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ 18 సంవత్సరాల క్రితం మద్రాస్ రెజిమెంట్ -18లో భారత సైన్యంలో చేరిన ప్రవీణ్ కుమార్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ లో దేశ సరిహద్దులకు కాపలాగా ఉండి, బలిదానం పొందారన్నారు. కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలిపిన గవర్నర్ ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. -
చిత్తూరు: ఉగ్రవాదుల కాల్పుల్లో భారత్ జవాను మృతి
-
నిజామాబాద్: జవాన్ వీర మరణం
-
ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం
సాక్షి, నిజామాబాద్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇందూరు బిడ్డ వీరమరణం పొందాడు. దీంతో ఆయన స్వగ్రామం వేల్పూరు మండలం కోమన్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేష్ ప్రాథిమిక విద్యాభ్యాసం స్వగ్రామంలో జరిగింది. కుకునూర్‌లో పదో తరగతి వరకు చదువుకున్నాడు. నిజామాబాద్‌లోని ఓ ప్రేవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన అనంతరం కరీంనగర్ మిలిటరీ శిక్షణ సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. ఐదేళ్ల క్రితం ఆర్మీకి ఎంపికయ్యాడు. గతేడాది డిసెంబర్లో ఇంటికి వచ్చి ఈ ఏడాది జనవరిలో తిరిగి వెళ్లాడు. ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆయనకు ఇంకా సంతానం కాలేదు. అక్టోబర్ వరకు డెహ్రాడూన్‌లో విధులు నిర్వర్తించిన మహేష్ బదిలీపై జమ్మూకశ్మీర్‌కు వెళ్లాడు. ఆదివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడు. ఈ వార్త తెలియగానే అతడి తల్లిదండ్రులు చిన్నరాజు, గంగమల్లు కన్నీరుమున్నీరయ్యారు. అమర జవాన్‌కు నివాళి జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో వీరమరణం పొందిన ర్యాడా మహేష్‌కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నివాళి అర్పించారు. దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి భారతావని కోసం మహేష్ చేసిన త్యాగం మరువలేనిదని కొనియాడారు. ‘వీర సైనికుడు మహేష్‌కు యావత్తు తెలంగాణ నివాళి అర్పిస్తోంది. ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన మహేష్ తోటి సైనికులకు నా జోహార్లు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’అని పోచారం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఆర్మీ జవాన్ మహేష్ వీర మరణం పట్ల మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహేష్ త్యాగం మరువలేనిదని అన్నారు. మహేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మహేష్‌తో పాటు వీర మరణం పొందిన సైనికులకు జోహార్లు పలికారు. (చదవండి: కశ్మీర్లో కాల్పులు, ముగ్గురు జవాన్ల వీర మరణం) -
ఉగ్రపోరులో చిత్తూరు జిల్లా కమాండో వీరమరణం
ఆయన మారుమూల గ్రామంలో పుట్టి పెరిగాడు. దేశ భక్తి మెండుగా ఉండడంతో మాతృభూమి సేవలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం సైన్యంలో చేరాడు. విధుల్లో చురుగ్గా ఉంటూ ఉన్నతాధికారుల మన్నలు పొందాడు. జమ్మూ కాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్ నాలా పోస్టు వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమరుడయ్యాడు. సాక్షి, చిత్తూరు : ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకలప్రతాప్ రెడ్డి, సుగణమ్మ దంపతుల ఏకైక కుమారుడు చీకల ప్రవీణ్‌కుమార్ రెడ్డి (37) డిగ్రీ వరకు చదివాడు. గ్రామానికి చెందిన చాలామంది సైన్యంలో పనిచేస్తుండడం చూసి తాను దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం మద్రాసు రెజ్మెంట్–18లో చేరారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విధుల్లో చురుగ్గా ఉండేవాడు. ప్రస్తుతం ఆయన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమాండోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం జమ్మూకాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్ లోని మాచెల్ నాలా పోస్టు వద్ద దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించే ఆపరేషన్‌లో 15 మంది బృందంలో ఉన్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఆరుగురు ఉగ్రవా దులు జరిపిన దాడుల్లో ప్రవీణ్‌కుమార్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు భారత్ సైనికులు మృతిచెందారు. సంక్రాంతి పండుగకు వస్తానని చెప్పిన కొడుకు అనంతలోకాలకు చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రవీణ్ కుమార్‌రెడ్డికి భార్య, ఎనిమిదేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మృతి సమాచారం అందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి వచ్చినప్పుడల్లా అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాడని, సైన్యం వీరోచితగాథల గురించి తమకు స్ఫూర్తిదాయకంగా చెప్పేవాడని పలువురు యువకులు చెప్పారు. అలాంటి వ్యక్తి కాల్పుల్లో మృతిచెందడం బాధగా ఉందని యువత, స్నేహితులు, బంధువులు అతడి జ్ఞాపకాలతో విచలితులయ్యారు. దేశసేవ చేయాలని యువతకు చెప్పేవారు సెలవుల్లో గ్రామానికి వస్తే యువకులతో మాట్లాడేవారు. ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరి దేశసేవ చేయాలని చెప్పేవారు. గ్రామానికి పండుగకు వస్తే అందరితోనూ కలిసిపోయేవారు. హుషారుగా ఉండే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మృతిచెందడం గ్రామానికి తీరని లోటు. – రవి, గ్రామస్తుడు చాలా చురుకైన వ్యక్తి ప్రవీణ్ కుమార్ సైన్యంలో చురుకైన వ్యక్తి. జమ్మూకాశ్మీర్‌లో కుష్వారా సెక్టార్లో కమాండోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద నేను సీహెచ్ఎంగా ఉన్నాను. అలర్ట్‌గా ఉండేవారు. నేను సెలవుల్లో వచ్చాను. నా స్నేహితుడు వీరమరణం పొందాడని తెలియగానే షాక్ గురయ్యా. –హేమాద్రి, వెదుర్లవారిపల్లె చాలా మంచివాడు ప్రవీణ్ చాలా మంచివాడు, సైన్యం నుంచి ఇంటికి ఎప్పుడు వచ్చినా గ్రామం గురించి ఆలోచించేవాడు. అందరూ కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించేవాడు. అలాంటి వ్యక్తి చనిపోయాడనే విషయం తెలియగానే షాక్‌కు గురయ్యాం. –బాబురెడ్డి, మృతుడి బాబాయి, రెడ్డివారిపల్లె -
ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉగ్రదాడి
-
ఆస్ర్టియా రాజధాని వియన్నాలో ఉగ్రదాడి
వియన్నా :ఆస్ర్టియాలో రాజధాని వియన్నాలో సోమవారం జరిగిన ఉగ్రదాడి జరిగింది. హిల్టన్ హోటల్లోని పర్యాటకులను బందీలుగా చేసుకొని ముంబై తరహాలోనే ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. వియన్నాలోని దాదాపు ఆరు ప్రాంతాల్లో ముష్కరులు ఈ కాల్పులకు తెగబడ్డారు. వెంటనే ఆర్మీని రంగంలోకి దించిన ఆస్ట్రియా ప్రభుత్వం.. వియన్నా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. అటోమెటిక్ మొబైల్ సిస్టమ్ ద్వారా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. వియన్నా నగరవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావద్దని మంత్రి నెహమ్మర్ తెలిపారు. (కాబూల్ వర్సిటీలో కాల్పులు ) కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ర్టేలియాలో పాక్షిక లాక్డౌన్ అమలు చేయడానికి కొన్ని గంటల ముందే ఈ దాడి జరిగింది. అప్పటికే కొన్ని రెస్టెంట్లు, కేఫ్‌లు మూసిఉన్నాయని అధికారులు తెలిపారు. ఉగ్ర కదలికలపై నిఘా పెట్టామని, ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ ఆంటోనియో గుట్రెస్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్ర్టియా ప్రజలకు, ప్రభుత్వానికి సంఘీబావం తెలియజేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. I’m following with grave concern the violent attacks of terror in Vienna, one of our UN HQ. I condemn these attacks in the strongest possible terms and reaffirm the @UN's solidarity with the people & Government of Austria. https://t.co/WQfbKhsMg6 — António Guterres (@antonioguterres) November 3, 2020 -
వర్సిటీపై దాడి: 19 మంది విద్యార్థులు మృతి
ఆప్ఘనిస్తాన్: కాబూల్ యూనివర్సిటీపై ఉగ్రవాదులు సోమవారం దాడికి పాల్పడ్డారు. పేలుళ్లు, కాల్పుల శబ్ధాలతో కాబూల్ యూనివర్సిటీ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ దాడిలో 19 మంది విద్యార్థులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం. మరో 22మంది గాయపడినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో నిర్వహించబోయే ఇరానియన్ బుక్ ఫెయిర్‌ను ప్రారంభించడానికి వచ్చే అధికారులే లక్ష్యంగా ఈ ఉగ్రదాడి జరిగినట్లు భావిస్తున్నారు. ఈ దాడిని ఆప్ఘన్ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. అయితే ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అఫ్ఘనిస్తాన్ హోం శాఖ మంత్రి తారీఖ్ ఆరియన్ వెల్లడించారు. దాడికి పాల్పడిన ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులే. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. -
ఫ్రాన్స్‌లో ఉగ్ర దాడి : ముగ్గురు మృతి
పారిస్ : ఫ్రాన్స్ నగరం నీస్‌లో గురువారం జరిగిన ఉగ్ర దాడిలో మహిళ సహా ముగ్గురు మరణించారు. కత్తితో చర్చిలో ప్రవేశించిన ఆగంతకుడు మహిళపై దాడి చేసి ఆమె తలను నరికేశాడని మరో ఇద్దరు ఈ ఘటనలో మరణించారని అధికారులు తెలిపారు. ఇది ఉగ్రవాద చర్యేనని నీస్ మేయర్ క్రిస్టియన్ ఎస్త్రోసి వెల్లడించారు. నగరంలోని నాట్రేడేమ్ చర్చిలో ఈ ఘటన జరిగిందని, దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దాడికి తెగబడిన వ్యక్తి ఓ మతానికి సంబంధించి నినాదాలు చేశాడని చెప్పారు. మరణించిన వారిలో ఒకరిని చర్చి వార్డెన్‌గా భావిస్తున్నామని మేయర్ పేర్కొన్నారు. బాధితులను కిరాతకంగా చంపారని అన్నారు. నిందితుడు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారని ప్రస్తుతం నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. కాగా, ఈ దాడిలో ముగ్గురు మరణించారని, పలువురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ ఉగ్రవాద వ్యతిరేక ప్రాసిక్యూషన్ విభాగం దర్యాప్తు చేపట్టనుంది. ఫ్రాన్స్‌లో ఈ తరహా దాడి ఈ నెలలో ఇది రెండవది కావడం గమనార్హం. ఫ్రెంచ్ మిడిల్ స్కూల్ టీచర్‌ను ఇటీవల చెచెన్యా సంతతికి చెందిన ఓ వ్యక్తి తలనరికి చంపడం కలకలం రేపింది. చదవండి : ఫ్రాన్స్‌లో టీచర్ తలనరికిన యువకుడు -
సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా పాంపోర్‌లోని కందిజల్ బ్రిడ్జిపై జమ్ము కశ్మీర్ పోలీసులతో కలిసి విధులు నిర్వహిస్తున్న 110 బెటాలియన్ సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదులు సోమవారం కాల్పులతో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా విధినిర్వహణలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. ఉగ్రదాడిపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. చదవండి : ‘ఉగ్ర అడ్డాగా సోషల్ మీడియా’ -
ప్రముఖ వ్యక్తి హత్యకు కుట్ర, పోలీసుల చెక్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఉగ్ర కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అడ్డుకున్నారు. పక్కా సమాచారంతో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) టెర్రరిస్టును అరెస్టు చేశారు. అతన్ని ఐసిస్‌కు ఉగ్రవాద గ్రూపునకు చెందిన అబు యూసుఫ్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. టెర్రరిస్టు నుంచి ఒక గన్, రెండు ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నట్టు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ సింగ్ కుశ్వారా మీడియాతో చెప్పారు. అబు యూసుఫ్‌ను పట్టుకునే క్రమంలో గత అర్ధరాత్రి దౌలా కువా, కరోల్ బాగ్ వద్ద ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఢిల్లీలో ఓ ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు అబు యూసుఫ్ నగరానికి వచ్చినట్టు తెలుస్తోందని అన్నారు. తన కుట్రకు సంబంధించి ఉగ్రవాది రెక్కీ కూడా నిర్వహించినట్టు సమాచారం. ఇక అబు యూసుఫ్‌కు ఢిల్లీలోని కొందరు సహాయసహకారాలు అందిస్తున్నారని వారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నామని డిప్యూటీ కమిషన్ ప్రమోద్ సింగ్ కుశ్వారా వెల్లడించారు. కాగా, అబు యూసుఫ్ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌గా విచారణలో తేలిందని చెప్పారు. యూపీలోని అతని నివాసాలపై దాడులు చేపట్టినట్టు ప్రమోద్ సింగ్ పేర్కొన్నారు. (చదవండి: ఐసిస్ కొత్త లీడరే అమెరికా టార్గెట్: ట్రంప్) -
బారాముల్లా ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లు మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు సహా ఓ పోలీసు ఉన్నతాధికారి మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ వాహనం నుంచి బయటికి దిగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రదాడిలో గాయపడిన వారిని ఇప్పటికే ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాద కదలికలపై నిఘా పెట్టామని తెలిపారు. జమ్ము కశ్మీర్లో గత వారంలోనే భద్రతా దళాలపై ఉగ్రవాదులు జరిపిన మూడవ దాడి ఇది. ఆగస్టు 14న శ్రీనగర్ నగర శివార్లలోని నౌగాం వద్ద ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసులు అమరులైన సంగతి తెలిసిందే. దాడి అనంతరం ఉగ్రవాదులు పారిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. అంతకుముందు శ్రీనగర్- బారాముల్లా హైవేలోని హైగాం వద్ద సైనికుల బృందంపై ఉద్రవాదులు కాల్పులు జరపగా, ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. -
ఉగ్రదాడులపై హెచ్చరించిన యూఎన్
న్యూఢిల్లీ: కేరళ, కర్ణాటకల్లో ఐసిస్ ఉగ్రవాదులు గణనీయమైన సంఖ్యలో ఉన్నట్లు ఐరాస నివేదిక హెచ్చరించింది. భారత ఉపఖండ టెర్రర్ గ్రూపులోని అల్-ఖైదా.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్లకు చెందిన దాదాపు 150 నుంచి 200 మంది ఉగ్రవాదులను కలిగి ఉందని పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది. అల్‌ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్రస్తుత నాయకుడు ఒసామా మహమూద్ తమ మాజీ నాయకుడు అసీమ్ ఉమర్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ప్రాంతాల్లో ప్రతీకార చర్యలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు యూఎన్ నివేదికలో హెచ్చరించింది. -
కెనడా చరిత్రలోనే దారుణమైన ఘటన
ఓట్టావా : 35 ఏళ్ల క్రితం జూన్ 23న ఎయిర్ ఇండియా విమానం 182పై జరిగిన ఉగ్రదాడి కెనడా చరిత్రలోనే అత్యంత దారుణమైనదని, ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యకు ఆ ఘటన నిదర్శనమని ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. ఎయిర్ ఇండియా ఫ్లయిట్ 182 ఎంపరర్ కనిష్కలో ఉగ్రవాదులు బాంబు పెట్టిన ఘటన జరిగి 35 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా బాధిత కుటుంబాలు ఓ ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలతో నివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా ప్రధాని జస్టిన్ సైతం ఓ వీడియోలు విడుదల చేశారు. ఆ వీడియోలో.. దేశానికి అదో పెద్ద షాకని, అప్పటి సామూహిక భద్రతను ప్రమాదంలో పడేసిందని అన్నారు. కెనడా నుంచి యూకే వెళుతున్న విమానం పేలటంతో 329 మంది అమాయకులు మరణించారని, వారిలో 280 మంది కెనడియన్లు ఉన్నారని అన్నారు.('జగ్మీత్ సింగ్ అంశం నన్ను బాధించింది') కాగా, 1985 జూన్ 23న ఎయిర్ ఇండియా విమానం 182, ఎంపరర్ కనిష్కలో ఖాలిస్తాని ఉగ్రవాదులు బాంబు పెట్టారు. ఈ ఘటనలో 329 మంది మృత్యువాత పడ్డారు. దారుణ సంఘటనకు గుర్తుగా జూన్ 23వ తేదీని ‘‘ నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజమ్ ఇన్ కెనడా’’గా జరుపుకుంటున్నారు. ఆ రోజున బాధిత కుటుంబాలు అంతా ఒక చోట చేరి చనిపోయిన తమ వారికి నివాళులు అర్పిస్తుంటారు. అయితే ఈ సంవత్సరం కోవిడ్-19 పరిస్థితుల కారణంగా సామూహిక సమావేశాలపై ఆంక్షలు ఉండటంతో యూట్యూబ్ ఛానల్ ద్వారా నివాళులు అర్పించారు. కొంతమంది మాత్రమే అక్కడి స్మారక స్థలాల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. -
ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్!
న్యూఢిల్లీ: దేశ రాజధానికి ఉగ్ర ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అక్కడ హైలర్ట్ విధించినట్లు సమాచారం. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసు వర్గాలు మార్కెట్, ఆస్పత్రి ఏరియాల్లో భద్రత కట్టుదిట్టం చేశాయి. క్రైం ప్రత్యేక విభాగంతో పాటు అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.(కశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులు హతం) కాగా గల్వాన్ లోయ ప్రాంతంలో ఘర్షణ వాతావరణాన్ని ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని ఇంటలెజిన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు నలుగురు ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించే ఆస్కారం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్, కుల్గామ్ జిల్లాల్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. వీరంతా హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్‌లకు చెందిన వారు.(కరోనా పేరిట సైబర్ నేరాలకు ఆస్కారం) -
దావూద్ సాయంతో భారీ ఉగ్ర దాడికి పాక్ స్కెచ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతా కరోనా మహమ్మారిపై పోరులో నిమగ్నమగా ఇదే అదనుగా పాక్ భారీ కుట్రలకు తెరలేపుతోంది. సరిహద్దుల్లో ఉగ్ర పొగపెడుతూనే భారీ దాడులతో తీవ్ర అలజడి రేపేందుకు స్కెచ్ వేస్తోంది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సహకారంతో జమ్ము కశ్మీర్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కుట్ర పన్నింది. దావూద్‌తో లష్కరే ఉగ్రమూక చేతులు కలిపిందని ఓ వార్తాసంస్థ వెల్లడించింది. పాక్ ఐఎస్ఐ బృందంతో కలిసి లష్కరే నేతలతో సంప్రదింపులు జరిపేందుకు ఇస్లామాబాద్‌లోని తన ఫాంహౌస్ నుంచి దావూద్ ఆదివారం బయలుదేరి వెళ్లారని తెలిపింది. (కరోనా క్యాబ్‌లు వచ్చేశాయ్!) కోవిడ్-19 మహమ్మారితో భారత్ పోరాడుతున్న క్రమంలో దేశంలో దొంగదెబ్బ తీయాలని ఐఎస్ఐ ప్రణాళికలు రూపొందిస్తోందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పవిత్ర రంజాన్ మాసంలో సోమవారం పదకొండవ రోజున జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు భారీ దాడికి తెగబడవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో కశ్మీర్‌లోయలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గతంలో ఇదే రోజున పలుమార్లు ఉగ్రవాదులు భద్రతా దళాల కీలక స్ధావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయని అధికారులు వెల్లడించారు. కాగా హంద్వారాలో జవాన్లపై దాడికి తమదే బాధ్యతని ప్రకటించిన నూతన ఉగ్ర సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) సైతం మరిన్ని దాడులతో విరుచుకుపడవచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. చదవండి : కరోనా కాలంలో పాక్ కుట్రలు -
కాబూల్ కేంద్రంగా మరో కుట్రకు జైషే స్కెచ్
కాబూల్ : భారత్‌లో భారీ దాడులతో తీవ్ర అలజడి రేపేందుకు ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ యూనిట్లలో 400 మంది జైషే ఉగ్రవాదులను మోహరించింది. వారిని భారత్‌లో ఉగ్ర దాడులతో హోరెత్తించేందుకు కశ్మీర్ లోయకు పంపేందుకు సన్నాహాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఏప్రిల్ 12న చేపట్టిన ఆపరేషన్‌లో ఆప్ఘన్ దళాలు ఓ ఉగ్ర శిబిరంలో ఈ తరహా కార్యకలాపాలను గుర్తించారని సమాచారం. ఈ ఆపరేషన్‌లో అరెస్టయిన ఉగ్రవాదులను విచారించడంతో ఆప్ఘన్లో దాదాపు ఈ తరహా క్యాంపులు ఆరు వరకూ ఉండవచ్చని భారత భద్రతా, నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ శిబిరాల్లో జైషే మహ్మద్ 400 మంది ఉగ్రమూకను సంసిద్ధంగా ఉంచిందని ఢిల్లీ, కాబూల్‌లో ఉగ్రవాద కార్యకలాపాల వ్యతిరేక మిషన్ అధికారులు పేర్కొన్నారు. ఖోస్థ నుంచి జలాలాబాద్ వరకూ విస్తరించిన ప్రాంతాలతో పాటు కాందహార్ ప్రావిన్స్‌లోని పాక్ సరిహద్దుల్లోని తాలిబాన్ యూనిట్లలో జైషే క్యాడర్‌ను మోహరించారని కాబూల్‌లోని ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందిన అధికారి వెల్లడించారు. మరోవైపు ఐఎస్ఐ ప్రోత్సాహంతో జైషే మహ్మద్‌తో పాటు లష్కరే ఉగ్రవాదులను కూడా ఈ శిబిరాల్లోకి పంపారని అధికారులు చెబుతున్నారు. చదవండి : పుల్వామా ఉగ్రదాడి : తండ్రికూతుళ్ల అరెస్ట్ -
మహమ్మారి మాటున భారీ దాడికి పాక్ స్కెచ్..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సమయాన దొంగదెబ్బ తీసేందుకు భారత్‌లో భారీ దాడికి పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది. సముద్ర మార్గం ద్వారా పాక్‌కు చెందిన అండర్‌వరల్డ్, స్మగ్లింగ్ మాఫియా ముఠా సాయంతో భారత్‌లో ఉగ్ర దాడికి పాకిస్తాన్ ప్రేరేపిస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పశ్చిమ తీరాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఈ కుట్రకు తెరలేపినట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సింధ్ ప్రావిన్స్‌లోని ఓ పోర్టు ప్రాంతంలో పాక్ అండర్‌వరల్డ్, స్మగ్లింగ్ గ్రూప్‌ల కోసం ఐఎస్ఐ ఓ వ్యవస్థను ఏర్పాటు చేసిందని నిఘా వర్గాలు పసిగట్టాయి. వారికి వనరులు సమకూర్చడంతో పాటు ప్రతిఘటన ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో కూడా పాక్ ఏజెన్సీలు శిక్షణ ఇచ్చాయని తెలిపింది. పాకిస్తాన్‌కు చెందిన బోట్ల ద్వారా డ్రగ్స్ రవాణా సాగుతున్నదని, వీటిలో కొన్ని సందర్భాల్లో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తరలిస్తున్నారని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవరపరుస్తున్నా భారత్‌పై దాడులకు పాక్ తన వ్యూహాలకు పదునుపెడుతూనే ఉందని వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ యదేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. చదవండి : భారత్‌లోకి కరోనా ఉగ్రవాదులు -
భారీ ఉగ్రదాడి.. 24 మంది మృతి
వాగాడౌగా : ఆఫ్రికాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుర్కినా ఫాసోలో ఓ చర్చిపై దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న వారిని లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఫాస్టర్‌తో సహా.. 24 మంది అమాయకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికిపైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు మరికొంత మందిని దుండుగులు అపహరించుకుని పోయారని తెలుస్తోంది. బుర్కినా ఫాసోపై ఇటీవల కాలంలో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నారు. కాగా గడిచిన నాలుగేళ్లగా ఈ ప్రాంతంలో జరిగిన అనేక దాడుల్లో దాదాపు 600కుపైగా పౌరులు మృతి చెందారు. -
భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లోకి చొరబడేందుకు యత్నించి ఎన్కౌంటర్లో మృతిచెందిన ఉగ్రవాదులు భారత్‌లో భారీ దాడికి కుట్రపన్నారని పోలీసులు పేర్కొన్నారు. దాడుల కోసం పెద్దమొత్తంలో బాంబులు, మార్ఫిన్ ఇంజెక్షన్లు, ఎల్ఈడీలు, బుల్లెట్ జాకెట్లు పాకిస్తాన్ నుంచి తీసుకువచ్చారని చెప్పారు. రహదారి వెంబడి దాదాపు 300 కిలోమీటర్ల మేర ఉన్న భద్రతా దళాల శిబిరాలపై దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రణాళికలు వేశారని..వారి కుట్రను గట్టిగా తిప్పి కొట్టామని పేర్కొన్నారు. కశ్మీర్లోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు శుక్రవారం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై బన్నాటోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ముగ్గురు ఉగ్రవాదులు ఓ వ్యానులో వచ్చి కాల్పులు జరిపారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తోన్న పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ జవాన్లు తిరిగి ఎదురుకాల్పులకు దిగడంతో.. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వ్యాను డ్రైవర్ సమీన్ దార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి ఏకే 47రైఫిల్, గ్రెనెడ్లను, రూ.32,000లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురు ఉగ్రవాదులుద జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని, సముద్రంగా గుండా భారత్‌లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. ఆర్టికల్ 370రద్దు తర్వాత తొలిసారిగా ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామని పోలీసులు పేర్కొన్నారు. -
అలియా భట్ తల్లి వివాదాస్పద వ్యాఖ్యలు..
ముంబై : పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురూను ఉరితీయడంపై బాలీవుడ్ నటి అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్ గురూను బలిపశువును చేశారని ఆమె వ్యాఖ్యానించారు. న్యాయం ఎలా అపహాస్యమవుతుందనేందుకు ఇదే ఉదాహరణని అంటూ అఫ్జల్ గురూ అమాయాకుడైతే పోయిన అతడి ప్రాణాన్ని ఎవరు తీసుకురాగలరని ప్రశ్నించారు. అందుకే మరణ శిక్షను అంత తేలికగా విధించరాదని, ఈ కారణంచేతే అఫ్జల్ గురూను ఎందుకు బలిపశువును చేశారనే దానిపై విచారణ చేపట్టాలని ఆమె ట్వీట్ చేశారు. కశ్మీర్ నుంచి ఢిల్లీకి ఓ ఉగ్రవాదిని తీసుకురావాలని జమ్ము కశ్మీర్ డీజీపీ దేవీందర్ సింగ్ తనపై ఒత్తిడి తెచ్చారని అఫ్జల్ గురూ రాసిన లేఖలో పేర్కొన్నాడని, ఆ ఉగ్రవాదే తర్వాత పార్లమెంట్‌పై దాడికి తెగబడ్డాడని అదే లేఖలో పొందుపరిచాడని రజ్దాన్ పేర్కొన్నారు. ఈ లేఖ నేపథ్యంలో డీజీపీపై ఎందుకు దర్యాప్తు చేపట్టలేదనేది నిగ్గు తేల్చాలని కోరారు. అఫ్జల్ వంటి వారు ఎలాంటి వేధింపులకు గురయ్యారు..నేరస్తుల కోసం ఉగ్ర కార్యకలాపాలు చేపట్టవలసివచ్చిందో విచారణ చేపట్టిన అనంతరమే మరణ శిక్ష విధించాలని అన్నారు. కాగా ప్రస్తుతం జమ్ము కశ్మీర్ పోలీసుల కస్టడీలో ఉన్న దేవీందర్ సింగ్‌ను ఎన్ఐఏ త్వరలో విచారించనుందని భావిస్తున్నారు. చదవండి : ‘ఆమె నా మరదలైతే.. చాలా సంతోషిస్తాను’ -
బోర్డర్లో పాకిస్తాన్ కుయుక్తులు..
సాక్షి, న్యూఢిల్లీ : తన భూభాగంలో ఉగ్రవాదుల శిబిరాలను కాపాడేందుకు పాక్ సైన్యం, ఐఎస్ఐ సరిహద్దుల్లో హైటెక్ కెమరాలు, సిగ్నల్ టవర్స్‌ను ఏర్పాటు చేశాయని నిఘా వర్గాలకు సమాచారం అందింది. వాస్తవాధీన రేఖ వెంబడి గ్రామాల్లో పలు ఐఈడీ పేలుళ్లకు ఉగ్రవాదులు సన్నద్ధమయ్యారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తమ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు చేస్తే వాటిని కాపాడుకునే క్రమంలో పాక్ సైన్యం ఏర్పాట్లు చేస్తోందని సరిహద్దుల్లో కెమెరాలు, సిగ్నల్ టవర్స్‌తో పహారా కాస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఎల్ఓసీ వెంబడి పాక్ సైన్యం, ఐఎస్ఐ ఇప్పటికే 18 సిగ్నల్ టవర్లను ఏర్పాటు చేశాయి. కెమరాలు, సిగ్నల్ టవర్స్‌ను ఏర్పాటు చేసిన అనంతరం ఈనెల 8న పీఓకే బ్రిగేడియర్ అసీం ఖాన్ నేతృత్వంలో కోట్లీలో జరిగిన భేటీలో వాస్తవాధీన రేఖ వెంబడి జనవరి 26లోగా పలు ఐఈడీ పేలుళ్లకు పాల్పడాలనే నిర్ణయం తీసుకున్నారని భారత నిఘా వర్గాలకు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్లతో ఉగ్రదాడి
శ్రీనగర్ : శ్రీనగర్‌లోని కవ్‌దారా ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని వారు ప్రయాణిస్తున్న పెట్రోలింగ్ వాహనాలపై గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడగా వారు ప్రయాణిస్తున్న వాహనాలు పూర్తిగా ద్వంసమయ్యాయి. అయితే ఈ దాడులు సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని గ్రెనేడ్లతో దాడులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఘటన జరిగిన ప్రాంతాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని ఉగ్రవాదులు కదలికలను గుర్తించేందుకు పరిశోధన నిర్వహిస్తున్నారు. అయితే ఈ దాడిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పంజాబ్‌లో ఉగ్ర దాడికి భారీ స్కెచ్..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో భారీ ఉగ్రదాడులకు వ్యూహం రూపొందిస్తూ పాకిస్తాన్లో ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రమూకల భేటీ జరిగిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్‌లో ఉగ్ర దాడులు చేపట్టేందుకు పాకిస్తాన్ నుంచి ఆయుధాలను సమీకరిస్తున్నారని తెలిపాయి. పంజాబ్‌లోకి భారీగా ఆయుధాలను తరలించేందుకు ఉగ్ర సంస్థలు బబ్బర్ ఖల్సా, ఖలిస్తాన్ జిందాబాద్‌లు పాక్ ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఖలిస్తాన్‌ను కోరే ఉగ్ర మూకల కార్యకలాపాలు ఇటీవల రాజస్ధాన్, హరియాణాల్లోనూ వెలుగులోకి వచ్చాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఖలిస్తాన్‌కు మద్దతిచ్చే ఉగ్రవాదుల కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వం ఇప్పటికే సరిహద్దు భద్రతా దళం, ఎన్ఐఏ, రా, ఐబీ వర్గాలను ఆదేశించింది. మరోవైపు పంజాబ్‌లోకి ఆయుధాలు తరలిరాకుండా పంజాబ్ సరిహద్దుల వద్ద భద్రతా దళాలు నిఘాను ముమ్మరం చేశాయి. భారత్‌లో ఉగ్రదాడులు చేపట్టేందుకు ఖలిస్తాన్‌ను కాంక్షించే ఉగ్రవాదులు చేపడుతున్న శిక్షణా శిబిరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా రాబట్టేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు యూపీలోని అయోధ్యలో ఉగ్రదాడికి జైషే మహ్మద్ యోచిస్తోందని నిఘా వర్గాలు బుధవారం వెల్లడించాయి. అయోధ్యలో ఉగ్రదాడికి జైషే మహ్మద్ సన్నాహాలు చేస్తున్నట్టు ఉగ్రసంస్థ కమ్యూనికేషన్ కోసం వాడుతున్న చాటింగ్ యాప్ టెలిగ్రాం ద్వారా నిఘా వర్గాలు పసిగట్టాయి. -
వారి కుటుంబాల్లో వేదనే మిగిలింది
వరుస ప్రమాదాలు ఈ ఏడాది ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. గతేడాదితో పోల్చుకుంటే 2019లో ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగి దేశవ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా దాడి యావత్ భారతాన్ని శోక సంద్రంలో ముంచింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో పదుల సంఖ్యలో అభాగ్యులు ఆహూతయ్యారు. గోదావరి బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదన్ని మిగిల్చింది. ఇక రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలిచిన నల్గొండ రహదారి ప్రజల రక్తం తాగేసింది. ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ప్రమాదాలను ఓ సారి పరిశీలిద్దాం..! అయ్యప్ప దర్శనం కోసం వెళ్లి.. తమిళనాడులో జనవరి 6న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుదుకోట్టై జిల్లా తిరుమయం వద్ద అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న వ్యాన్, మరో కంటెయినర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. శబరిమలై అయ్యప్పను దర్శించి, రామేశ్వరంలో పవిత్ర స్నానాలు ముగించుకుని తిరుగు పయనంలో ఉన్న ఈ భక్తులు ప్రయాణిస్తున్న వ్యానును ఎదురుగా, అతివేగంగా దూసుకొచ్చిన ట్రాలీ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి మంటల్లో ఎగ్జిబిషన్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జనవరి 30 రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో రేగిన నిప్పురవ్వలు.. చూస్తుండగానే దావానలంలా మారి క్షణాల్లో అక్కడున్న400 స్టాళ్లను బూడిద చేశాయి.ఈ ఘటన జరిగిన సందర్భంలో సుమారు యాభైవేలకు పైగా సందర్శకులు ఎగ్జిబిషన్లో వివిధ స్టాళ్లలో ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం రూ. వందల కోట్లలో జరిగింది. పూర్తి వార్తకోసం క్లిక్ చేయండి పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు మృతి బీహార్‌లో ఫిబ్రవరి 3న ఘోర రైలు ప్రమాదం జరిగింది. వైశాలి జిల్లాలో సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఏడుగురు మృతి చెందారు. దాదాపుగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాట్నాకు 30కి.మీ దూరంలో ఫిబ్రవరి 3న ఈ ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రైల్వే శాఖ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేసింది. నకిలీ మద్యానికి 34 మంది బలి (ఫిబ్రవరి 8) : ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టాల్లోని ఇరుగుపొరుగు జిల్లాల పరిధిలో కల్తీ మద్యం తాగి 34 మంది మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లో 16 మంది, ఉత్తర్‌ప్రదేశ్‌లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా ఝాబ్రెరా ప్రాంతం బాలుపూర్ గ్రామస్తులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్ పూర్ జిల్లాలో మరణించిన ఒక వ్యక్తి అంత్యక్రియలకు ఫిబ్రవరి 7న వెళ్లారు. ఆతర్వాత కల్తీ మద్యం తాగారు. ఈ ఘటనలో 16మంది మృతి చెందారు. హోటల్లో మంటలు.. 17 మృతి రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్లో ఫిబ్రవరి 12న ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్న ఈ దుర్ఘటనలో 17 మంది చనిపోయారు. అందులో ఇద్దరు ప్రాణాలు కాపాడుకునేందుకు హోటల్ భవంతి నుంచి దూకి మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ఉద్యోగి కూడా ఉన్నారు. కరోల్‌బాగ్‌లోని హోటల్ అర్పిత్ ప్యాలెస్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఉలిక్కిపడ్డ భారతావని (ఫిబ్రవరి 14-26) : జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఫిబ్రవరి14న ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి దెబ్బకు దెబ్బ పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ను చావు దెబ్బతీసింది. . 2016 నాటి సర్జికల్ దాడుల్ని గుర్తుకు తెస్తూ, పాక్ భూభాగంలోని బాలాకోట్‌లో జైషే నిర్వహిస్తున్న అతిపెద్ద శిక్షణా శిబిరాన్ని భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. బాంబుల్ని జారవిడిచి సుమారు 350 మంది ఉగ్రవాదులు, సీనియర్ కమాండర్లు, వారి శిక్షకుల్ని మట్టుపెట్టింది. నెత్తురోడిన నల్లగొండ రహదారి నల్లగొండ జిల్లాలో రహదారి నెత్తురోడింది. మార్చి 6న హైదరాబాద్ నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న టాటా ఏసీ మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. బస్సు కూడా వేగంగా ఉండటంతో టాటాఏసీ వాహనాన్ని 20అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషాదం మిగిల్చిన విమానం ఇథియోపియాలో మార్చి10న జరిగిన ప్రమాదంలో విమానం కూలిపోయింది. ఆ దేశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం..బయలుదేరిన కాసేపటికే కుప్పకూలింది. 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది.. మొత్తం 157 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కెన్యా, ఇథియోపియా, కెనడా, చైనా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఈజిప్టు, నెదర్లాండ్, స్లొవేకియా, భారత్‌కు చెందినవారు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి పాదాచారులను మింగిన వంతెన ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) నుంచి అంజుమన్ కాలేజీ, టైమ్స్ ఆప్ ఇండియా భవనంవైపు వెళ్లే పాదచారుల వంతెనలో కొంతభాగం మార్చి 12న రాత్రి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలుసహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. కసబ్ బ్రిడ్జిగా పిలిచే ఈ వంతెనపై పాదచారులు వెళుతుండగా వంతెనలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పలువురు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డారు. 2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ వంతెనకి కసబ్ బ్రిడ్జి అనేపేరు స్థిరపడిపోయింది. ఛత్తీస్‌లో మావోల ఘాతుకం (ఏప్రిల్ 9) : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు రెచ్చి పోయారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవికి చెందిన కాన్వాయ్ లక్ష్యంగా ఐఈడీ పేల్చారు. వెంటనే చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ దుర్భటనలో ఎమ్మెల్యే మాండవి(40)తో పాటు నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి మట్టిదిబ్బ కూలి 10 మంది మృతి (ఏప్రిల్ 9) : నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేర్ శివార్లో మట్టిదిబ్బ కూలి 10 మంది మృతి చెందారు. వీరంతా ఉపాధి హామీ కూలీలు. ఎండ ఎక్కువ ఉండడంతో నీళ్లు తాగేందుకు గుట్ట నీడ కిందికి వెళ్లారు. అదే సమయంలో ఓ చిన్న మట్టిపెళ్ల బోయిని మణెమ్మ అనే కూలీ మీద పడింది. వెంటనే తేరుకున్న ఆమె గుట్ట కూలేటట్టు ఉందని మిగతా కూలీలను అప్రమత్తం చేస్తుండగానే.. ప్రమాదం ఉప్పెనలా వచ్చింది. ఒక్కసారిగా మట్టిదిబ్బ కూలడంతో పది మంది మట్టికింద సమాధి అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయడం రాములవారి కల్యాణానికి వెళ్లి.. (ఏప్రిల్ 14) : సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఆటో ఢికొట్టి ఏడుగురు దుర్మరణం చెందారు. కోదాడ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ్మర సీతారామ దేవాలయంలో ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అకాల వర్షాలకు 53 మంది బలి రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలనే భారీ అకాల వర్షాలు కుదిపేశాయి. ఏప్రిల్ 16న కురిసిన భారీ వర్షాలకు నాలుగు రాష్ట్రాలతో కలిపి 53 మంది మరణించారు. వర్షం కారణంగా అత్యధికంగా రాజస్తాన్‌లో 25 మంది, మధ్యప్రదేశ్‌లో 15 మంది, గుజజరాత్లో 10 మంది, మహారాష్ట్రలో ముగ్గురు చనిపోయారు. ఈస్టర్ ప్రార్థనలపై ఉగ్రదాడులు.. 215 మంది మృతి ఈస్టర్ పండుగరోజు(ఏప్రిల్ 21) శ్రీలంకలో ఉగ్రవాదులు దాడి చేశారు. రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. ఈ ప్రమాదంతో 215మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500మందికితీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు సహా 33మంది విదేశీయులు మృతి చెందారు. ఇదే నెల 27న మరోసారి ఉగ్రవాదు రెచ్చి పోయారు. శ్రీలంక భద్రతాబలగాలపై కాల్పులు జరిపి తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో ఆత్మహుతి బాంబర్లతో సహా 15మంది మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి రెచ్చిపోయిన మావోలు.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్తులు విసిరిన పంజాలో 15 మంది పోలీసులు మృతిచెందారు. కూబింగ్‌కు బయలుదేరిన పోలీసుల వాహనం లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ మందుపాతరను పేల్చారు. మే1న జరిగిన ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర పోలీసు విభాగం క్విక్‌రెస్పాన్స్ టీం యూనిట్‌కు చెందిన 15 మంది కమాండోలతో పాటు ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు ధాటికి పోలీసుల వాహనం తునాతునకలైంది. కాగా 2018 ఏప్రిల్‌లో క్యూఆర్టీ కమాండోలు ఓ ఆపరేషన్‌లో భాగంగా 40 మంది మావోయిస్టులను హతమార్చారు. ఇందుకు ప్రతిగానే మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. విషాదం మిగిల్చిన పెళ్లి చూపులు కర్నూల్ జిల్లా వెల్దుర్తి వద్ద మే11న జరిగిన ఘోర ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. వేగంగా వచ్చిన బస్సు ఎదురుగా వచ్చిన బైకును తప్పించబోయి అవతలివైపు వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులు. ఓ పెళ్లి సంబంధం కుదుర్చుకొని తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసకుంది. మృతులంతా 25-40 ఏళ్లలోపే వారే. 15 మంది దుర్మరణం మహారాష్ట్రలోని పుణెలో గోడకూలి 15 మంది దుర్మరణం పాలయ్యారు. కుంద్వా ప్రాంతంలోని బడాతలావ్ మసీదు సమీపంలో అపార్ట్మెంట్ నిర్మాణ పనులు జరుగుతుండగా.. ఎడతెరపి లేని కుండపోత వర్షాలకు నేల కుంగడంతో దాదాపు 22 అడుగుల రక్షణ గోడ కూలి షెడ్లపై పడింది. అక్కడే కార్లు పార్క్ చేయడంతో తీవ్రత మరింత పెరిగింది. అక్కడే నిద్రిస్తున్న 15 మంది కార్మికులు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. కార్మికుంతా బిహార్ నుంచి వలస వచ్చినవారే. జూన్ 31న ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన బస్సు.. జమ్మూకాశ్మీర్‌లో జులై1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. కేశవాన్ నుంచి కిష్టావర్ ప్రాంతానికి బయలుదేరిన మినీ బస్సు సిర్గ్వారి ప్రాంతంలో బస్సు మలుపు తీసుకుంటుండగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో పాటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి అగ్నికి ఆహుతి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 23 మంది మృతిచెందగా, మరో 27 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బటాలా ప్రాంతంలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో సెప్టెంబర్ 4న భారీ పేలుడు సంభవించింది. బటాలా-జలంధర్ రహదారిలోని హన్సాలీ పుల్ వద్ద ఉన్న రెండస్తుల ఫైర్‌క్రాకర్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీ భవంతి పేకమేడలా కూలిపోయింది. నానక్ దేవ్ పెండ్లి మహోత్సవంతో పాటు పలు పండుగల నేపథ్యంలో కర్మాగారంలో కొన్ని రోజులుగా టపాసులు నిల్వ చేశారు. భారీగా నిల్వచేసిన పటాసులు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల నివాసాలకు కూడా మంటలు వ్యాపించాయి. విషాదం మిగిల్చిన విహార యాత్ర తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద సెప్టెంబర్ 15న పెను విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో 77 మందితో ప్రయాణిస్తున్న బోటు నదిలో బోల్తా పడడంతో 51 మంది మరణించారు. మరో 26 మందిని స్థానికులు రక్షించారు. ధర్మాడి సత్యం బృందం రంగంలోకి దిగి 38 రోజుల తీవ్రంగా శ్రమించి బోటును, బోటులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి పుణ్యక్షేత్రాలకు వెళ్లి.. తూర్పుగోదావరి జిల్లా మన్యంలో అక్టోబర్15 న జరిగిన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మారేడుపల్లి- చింతూరు ఘాట్రోడ్లో వాల్మీకి కొండ వద్ద వీరు ప్రయాణిస్తున్న టెంపో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. రెండు ప్రైవేట్ టెంపో ట్రావెల్స్ వాహనాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన 24 మంది తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు బయలుదేరారు. భద్రాచలం నుంచి అన్నవరం దైవ దర్శనానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న టెంపో వాహనం ప్రమాదకర మలుపులో అదుపుతప్పి బోల్తాపడింది. 25 అడుగుల ఎత్తు నుంచి వ్యాన్ కిందపడడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. భారీ పేలుడు.. మృతదేహాలు ఛిద్రం మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో అక్టోబర్31 న భారీ పేలుడు సంభవించింది. శిరపూర్ సమీపంలోని వాఘూడీ గ్రామ సమీపంలో ఉన్న రుమిత్ కెమికల్ కంపెనీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 65 మంది గాయపడ్డారు. పేలుడు శబ్దాలు సుమారు 10 కిలోమీటర్ల దూరం వినిపించాయి. పేలుడు తీవ్రతకు కొన్ని మృతదేహాలు కూడా ఛిద్రం అయ్యాయి. భారీ అగ్ని ప్రమాదం దేశ రాజధాని ఢిల్లీలోని అనాజ్‌మండీలో ఉన్న ఫాక్టరీలో డిసెంబర్ 8న జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే జరగరాని నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భవనం రెండో అంతస్తు నుంచి మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకుంది. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వస్తువులు నిల్ల ఉండడంతో మంటలు వెనువెంటనే వ్యాపించాయి. - శెట్టె అంజి, సాక్షి వెబ్ డెస్క్ -
మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
-
శ్రీనగర్‌లో రెచ్చిపోయిన ఉగ్రమూక..
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల ఆగడాలు కొనసాగుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో రెండవ సారి ఉగ్రమూకలు గ్రనేడ్ దాడితో విరుచుకుపడ్డాయి. శ్రీనగర్‌లోని మౌలానా ఆజాద్ రోడ్‌లోని మార్కెట్లో సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. గ్రనేడ్ దాడిలో 15 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కాగా గతనెల 28న ఉత్తర కశ్మీర్‌లోని సొపోర్‌లో ఉగ్రవాదుల గ్రనేడ్ దాడిలో 19 మంది గాయపడిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో బ్రిటన్ ఎంపీల పర్యటనకు ఒకరోజు ముందు సొపోర్‌లోని హోటల్ ప్లాజాకు సమీపంలోని బస్టాండ్ వద్ద ఉగ్రమూకలు ఈ భీకర దాడికి పాల్పడ్డాయి. పీఓకేలోని ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేస్తుండటంతో దిక్కుతోచని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని సైన్యం పేర్కొంటోంది. -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం
శ్రీనగర్ : ఉగ్రవాదులు భారీ ఉగ్ర దాడికి రూపొందించిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. జమ్ము బస్టాండ్ సమీపంలో పార్క్ చేసిన బస్ నుంచి భద్రతా దళాలు మంగళవారం భారీ మొత్తంలో ఆర్డీఎక్స్ను స్వాధీనం చేసుకోవడంతో పెనుముప్పు తప్పింది.కథువా జిల్లా బిలావర్ నుంచి జమ్ముకు ఈ బస్సు చేరుకుందని అధికారులు తెలిపారు. బస్ డ్రైవర్, కండక్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్డీఎక్స్ లభ్యం కావడంపై ప్రశ్నిస్తున్నారు. ఆర్డీఎక్స్తో కూడని ప్యాకెట్‌ను బిలావర్లో తమకు ఓ జంట అప్పగించిందని బస్ డ్రైవర్ భద్రతా దళాలకు చెప్పినట్టు తెలిసింది. కాగా ఇటీవల బిలావల్‌లోని దేవల్ ప్రాంతంలో ఓ ఇంటి నుంచి 40 కిలోల గన్ పౌడర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో భారీ ఉగ్రదాడి కుట్రను భద్రతా దళాలు సోమవారం భగ్నం చేశాయి. కథువా ప్రాంతంలోని దెవాల్ గ్రామంలో 40 కిలోల భారీ పేలుడు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు భద్రతా దళాలు వెల్లడించాయి. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఆర్మీ ఇంటెలిజెన్స్ దళాలు, కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా అనుమానిత ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా దేశీయంగా తయారుచేసిన పేలుడు పదార్ధాలు లభించాయి. మరోవైపు బాలాకోట్‌లో ఉగ్ర శిబిరాలు తిరిగి చురుకుగా మారాయని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేర్కొన్నారు. సరిహద్దు ద్వారా 500 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్‌లో ఉగ్ర దాడులను ప్రేరేపించేందుకు పాకిస్తాన్ పలు ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోకి ఉగ్రవాదులను చొప్పించడంతో పాటు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాక్ తెగబడుతోంది. -
అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడులు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు బీభత్సం సృష్టించారు. గంట వ్యవధిలోనే రెండు చోట్ల ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన ఈ ఘటనలు ప్రజల్లో భయాందోళనను కలిగిస్తున్నాయి. మంగళవారం జరిగిన ఈ వరుస ఘటనల్లో 48 మంది మరణించగా, 80 మందికిపైగా గాయపడ్డారు. ఇందులో మొదటి ఆత్మాహుతి దాడి ఆ దేశ అధ్యక్షుడి ఎన్నికల ప్రచారంలో కాగా, రెండోది కాబూల్‌లో చోటు చేసుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు ఉంటాయని తాలిబన్ హెచ్చరించింది. ఈ ప్రమాదం నుంచి ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. గంట వ్యవధిలో.. మోటార్ బైక్‌పై వచ్చిన ఓ ఆగంతకుడు ర్యాలీ దగ్గరి చెక్‌పోస్టు వద్ద బాంబు పేల్చుకొని దాడికి పాల్పడినట్టు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి నస్రత్ రహిమీ తెలిపారు. పేలుడు ఘటనలో 26 మంది మరణించగా, 42 మంది గాయపడ్డారు. ఈ పేలుడు జరిగిన గంట వ్యవధిలోనే కాబుల్‌లోని అమెరికా ఎంబసీ సమీపంలో మరో ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుడులో 22 మంది మరణించగా, 38 మంది గాయపడ్డారు. పేలుడు అనంతరం కొన్ని మృతదేహాలను కూడా వీధిలో చూసినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పినట్లు వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై, ట్రంప్ సెప్టెంబర్ 10న తాలిబన్లతో చర్చలను అకస్మాత్తుగా ముగించిన తర్వాత ఈ పేలుళ్లు జరగడం గమనార్హం.